Kidnapped
-
మడకశిర మండలం బేగార్లపల్లిలో బాలిక కిడ్నాప్
-
చీమకుర్తిలో కిడ్నాప్ కలకలం
చీమకుర్తి: గంజాయి రవాణా విషయంలో పదో తరగతి విద్యార్థి కిడ్నాప్ వ్యవహారం ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వినుకొండకు చెందిన యాసిన్, నరసరావుపేటకు చెందిన సంతోష్, చిలకలూరిపేటకు చెందిన అమీర్లు గంజాయి వ్యాపారంలో ఆరితేరారు. ఇందు కోసం వారు తరచూ అరకు ప్రాంతానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో వారికి అల్లూరి జిల్లా అరకు మండలం మాడగడ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి పరిచయం అయ్యాడు. ఈ విద్యార్థి చదువుకుంటూనే ఓ గంజాయి ఏజెంట్ వద్ద పని చేస్తున్నాడు.ఈ విషయం తెలుసుకున్న వారు ఆ విద్యార్థితో పరిచయం పెంచుకుని గంజాయి కావాలని అడిగారు. ఆ విద్యార్థి తన బంధువుకు తొలి విడతగా రూ.50 వేలు ఫోన్ పే చేయించుకున్నాడు. అనంతరం వారికి గంజాయి పంపలేదు. డబ్బులు పోగా, గంజాయి కూడా రాకపోవడంతో వారు నేరుగా అరకు ప్రాంతానికి వెళ్లి ఆ విద్యార్థిని కిడ్నాప్ చేశారు. తమకు రూ.లక్ష ఇస్తే విడిచి పెడతామని చెప్పారు. ఇందుకు ఆ విద్యార్థి సమ్మతించక పోవడంతో శుక్రవారం చీమకుర్తి మీదుగా కారులో వినుకొండ తీసుకెళ్లారు. రాత్రి అక్కడి గాంధీనగర్‌లోని శ్రీనాథ్ అనే స్నేహితుడి ఇంటికి వెళ్లారు.బాడుగ కోసం కారు డ్రైవర్ గొడవ చేయడంతో అతన్ని పంపించేశారు. అనంతరం కిడ్నాపర్లు మద్యం తాగి, మత్తులో ఉండటాన్ని గమనించిన ఈ విద్యార్థి తప్పించుకున్నాడు. రాత్రి 9 గంటలకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విద్యార్థి చెప్పిన వివరాల మేరకు పోలీసులు కిడ్నాపర్లు ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు. అంతలో వారు ఆటోలో పరారయ్యారు. పోలీసులు వెంట పడిన క్రమంలో ఆటో ఒక చోట బోల్తా పడింది. యాసిన్ పోలీసులకు పట్టుబడగా, మిగతా ఇద్దరు పారిపోయారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అరకు పోలీసులు శనివారం చీమకుర్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చి విద్యార్థిని, కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకుని అరకు తీసుకెళ్లారు. కాగా, ముగ్గురు కిడ్నాపర్లపై ఇప్పటికే ఒక్కొక్కరిపై 15–20 కేసులు ఉన్నాయి. వీరిలో ఇద్దరు ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు. -
బాలుడిని కిడ్నాప్ చేసి.. ఆస్తి కోసం మేనమామ దారుణం
-
పాక్‌లో పదేళ్ల చిన్నారి అపహరణ.. మతమార్పిడి.. 50 ఏళ్ల వ్యక్తితో బలవంతపు పెళ్లి
కరాచీ: పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. మత ఛాందసవాదులు ఒక చిన్నారిని కిడ్నాప్ చేసి, బలవంతంగా మతమార్పిడి చేయించి, పెళ్లి జరిపించిన ఉదంతం చోటుచేసుకుంది. ఇలాంటి అనేక కేసులు అనేకం వెలుగుచూస్తున్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్రలో కనిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో పదేళ్ల హిందూ బాలికను కిడ్నాప్ చేసి, బలవంతంగా ముస్లిం వ్యక్తితో వివాహం జరిపించిన ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.పాకిస్తాన్ దారావర్ ఇత్తెహాద్ (మైనారిటీల హక్కుల కోసం ఏర్పాటైన స్వచ్ఛంద సంస్థ) అధ్యక్షుడు శివకట్చి తెలిపిన వివరాల ప్రకారం సంఘర్ ప్రాంతానికి చెందిన 10 ఏళ్ల హిందూ బాలికను 50 ఏళ్ల ముస్లిం వ్యక్తి బలవంతంగా వివాహం చేసుకున్నాడు. అవినీతికి అలవాటు పడిన పోలీసు సిబ్బంది సహకారంతో ఈ వివాహం జరిగిదనే ఆరోపణలున్నాయి. బాధితురాలి తల్లిదండ్రులు న్యాయవాది సహకారంతో కోర్టులో కేసు వేయడంతో ఈ ఉదంతం వెలుగు చూసిందని శివకట్చి తెలిపారు.గ్రామంలోని తమ ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను మిర్పుర్ఖాస్కు చెందిన గులామ్ ముహమ్మద్ అపహరించి, సిర్హండి ఎయిర్ సమరో మదర్సాకు తీసుకెళ్లారని శివకచ్చి చెప్పారు. తరువాత ఆ బాలికకు బలవంతంగా మత మార్పిడి చేయించి షాహిద్ తల్పూర్ అనే వ్యక్తితో వివాహం జరిపించారని తెలిపారు. అయితే ఆ ప్రాంత న్యాయ అధికారుల చొరవతో పోలీసులు జోక్యం చేసుకుని ఆ బాలికను సురక్షితంగా ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారని శివకచ్చి తెలిపారు.ఇది కూడా చదవండి: సగం మంది ఇంటి నుంచే పనిచేయండి -
చిన్నారి ప్రాణాలు కాపాడిన వీధి కుక్కలు
భోపాల్: వీధి కుక్కలు చిన్నారుల ప్రాణాలను తీస్తున్నాయనే వార్తల మధ్య వీటికి భిన్నమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బెత్మాలో జరిగింది.కిడ్నాప్‌కు గురైన పదేళ్ల బాలికను వీధికుక్కలు కాపాడాయి. ఒక చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ఇద్దరు వ్యక్తులు బెత్మాలోని కాళీ బిలౌడ్ గ్రామానికి వచ్చారు. అయితే వీధి కుక్కలు ఆ చిన్నారిని రక్షించి, కిడ్నాపర్లు అక్కడి నుంచి పారిపోయేలా చేశాయి. ఘటన గురించి బాధిత బాలిక మేనమామ మాట్లాడుతూ తమ పదేళ్ల మేనకోడలు ఇంటిలో ఒంటరిగా ఉండగా, ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆ చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారన్నారు.అయితే దీనిని గమనించిన తమ వీధిలోని కుక్కలు ఆ ఇద్దరు వ్యక్తులపై దాడికి దిగాయన్నారు. దీంతో ఆ ఇద్దరు ఆగంతకులు అక్కడి నుంచి పారిపోయారన్నారు. అప్పడు ఆ చిన్నారి సమీపంలోని ఆలయంలోకి వెళ్లి దాక్కున్నదన్నారు. ఈ విషయమై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: బతికుంటే కోర్టుకెళతా: సాధ్వి ప్రజ్ఞ -
స్కూటర్‌పై వచ్చి కిడ్నాప్.. అదానీ జీవితంలో భయంకర ఘటన
ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతదేశంలో రెండవ అత్యంత సంపన్నుడైన 'గౌతమ్ అదానీ' గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అదానీ గ్రూప్ అధినేతగా తెలిసిన చాలా మందికి.. ఆయన మరణపు అంచులదాకా వెళ్లి వచ్చిన విషయం బహుశా తెలిసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.1962లో అహ్మదాబాద్‌లోని గుజరాతీ జైన కుటుంబంలో జన్మించిన గౌతమ్ అదానీ ప్రారంభ జీవితం నిరాడంబరంగా సాగింది. చదువుకునే రోజుల్లోనే ఏదైనా సొంత వ్యాపారం ప్రారభించాలనుకునేవారు. ఇందులో భాగంగానే గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి తప్పకున్న తరువాత అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రారంభించారు. అదే ఈ రోజు వేలకోట్ల సామ్రాజ్యంగా అవతరించింది.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం గౌతమ్ అదానీ 93.5 బిలియన్ డాలర్ల నికర విలువతో భారతదేశంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. 1988లో ప్రారంభమైన అదానీ ఎంటర్ప్రైజెస్.. నేడు ఇంధనం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రక్షణ రంగాల్లో ప్రధాన శక్తిగా నిలిచింది.ధనవంతుడిగా ఎదిగిన గౌతమ్ అదానీ జీవితంలో భయంకరమైన దురదృష్టకర సంఘటనలు కూడా జరిగాయి. ఈ విషయాలను అదానీ ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.1998లో కిడ్నాప్గౌతమ్ ఆదానీని, అతని సహచరుడు శాంతిలాల్ పటేల్‌ను 1998లో అహ్మదాబాద్‌లో ఫజ్ల్ ఉర్ రెహ్మాన్ (ఫజ్లు), భోగిలాల్ దర్జీ (మామా) స్కూటర్లపై వచ్చి కిడ్నాప్ చేసారు. కిడ్నాపర్లు వారిని విడుదల చేయాలంటే రూ.15 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదృష్టవశాత్తు అదానీ, పటేల్ ఇద్దరూ ఒకే రోజు విడుదలయ్యారు. కిడ్నాప్ జరిగిందని చెప్పడానికి సరైన ఆధారాలు లేకపోవడంతో.. కేసును రుజువు చేయలేకపోయారు.ఉగ్రవాదుల దాడి1998లో కిడ్నాపర్ల నుంచి బయటపడిన అదానీ 2008 నవంబర్ 26న తాజ్ హోటల్లో జరిగిన ఉగ్రవాదుల దాడి సమయంలో కూడా అక్కడ బందీగా ఉన్నాడు. దుబాయ్ పోర్ట్ సీఈఓ మహ్మద్ షరాఫ్‌తో సమావేశం ముగిసిన తర్వాత, దాడి ప్రారంభమైనప్పుడు అదానీ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. కానీ అప్పుడే ఉగ్రవాదుల దాడి మొదలైంది. ఆ సమయంలో నేను మరణాన్ని 15 అడుగుల దూరం నుంచి చూశానని అదానీ తన అనుభవాన్ని వెల్లడించారు.ఇదీ చదవండి: గూగుల్‌కు రూ. 26వేల కోట్ల ఫైన్.. ఎందుకంటే?జీవితంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్న గౌతమ్ అదానీ.. నేడు తిరుగులేని వ్యాపారవేత్తగా ఎదిగారు. ప్రాణాంతక సవాళ్లను సైతం ఎదుర్కొని గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి భారతీయ వ్యాపార రంగంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా అదానీ.. ఎంతోమంది యువ వ్యాపారవేత్తలకు రోల్ మోడల్. -
పచ్చబ్యాచ్ ఆగడాలు.. లిక్కర్ షాపు దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: పచ్చబ్యాచ్ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. సత్యసాయి జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. హిందూపురం నియోజకవర్గంలో దౌర్జన్యానికి దిగారు. మద్యం షాపును దక్కించుకున్న వ్యక్తిని కిడ్నాప్ చేశారు. లేపాక్షి మద్యం షాపును లాటరీలో దక్కించుకున్న రంగనాథ్‌ను.. లాటరీ ఫలితం వచ్చిన వెంటనే టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. రంగనాథ్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కాగా, జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు టెండర్ వేసే ప్రక్రియ మొత్తం ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు.. వారి పీఏలు, అనుచరుల కనుసన్నల్లోనే జరిగింది. ప్రతి దుకాణం తమకు, తమ అనుచరులు చెప్పిన వారికే దక్కే విధంగా టీడీపీ నేతలు ముందస్తు ప్లాన్ చేశారు. దీంతో ఆరంభం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగింది. చాలా చోట్ల సింగిల్ డిజిట్లో దరఖాస్తులు ఉండటం గమనార్హం.జిల్లా వ్యాప్తంగా 87 షాపులకు 1,460 దరఖాస్తులు అందాయి. మద్యం దుకాణాలకు వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 80 శాతం టీడీపీ వర్గీయులకు సంబంధించినవే. మిగతా 20 శాతం మంది రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా బరిలో దిగారు. అయితే వారందరికీ ఇప్పటికే వార్నింగ్‌లు వెళ్లినట్లు తెలిసింది. ఒకవేళ లాటరీలో దుకాణం దక్కించుకున్నా వదిలి వెళ్లాల్సిందేనంటూ బెదిరించినట్లు సమాచారం. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి టీడీపీ నేతలు బెదిరింపులు మొదలుపెట్టారు. ఎవరు దరఖాస్తు చేసిన ఖబడ్దార్ అంటూ ఫోన్లలో వార్నింగ్ ఇచ్చారు. దీంతో చాలామంది ఔత్సాహికులు వెనక్కి తగ్గారు. కాగా ఆన్లైన్ విధానం అందుబాటులో ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి దరఖాస్తులు చేశారు.ఇదీ చదవండి: అవినీతి కోసం వేసిన స్కెచ్ కాదా బాబూ?: వైఎస్ జగన్ -
కిడ్నాపైన బాలుడు శవమై తేలాడు
చిల్లకూరు: తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం వరగలిలో సోమవారం కిడ్నాపైన బాలుడు లాసిక్ (12)... మంగళవారం సాయంత్రం గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఉప్పుటేరులో శవమై కనిపించడం కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. వరగలిలోని కాతారి రమేష్, సంధ్య దంపతుల కుమారుడు లాసిక్ వాకాడులోని గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చాడు. సోమవారం తల్లిదండ్రులు నిర్వహించే దుకాణంలో ఉండగా, అక్కడకు వచ్చిన చిత్తు కాగితాలు ఏరుకునే ముగ్గురు గిరిజన వ్యక్తులు బాలుడికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తల్లిదండ్రులు, బంధువులు బాలుడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలోని ఉప్పుటేరు (కండలేరు క్రీక్)కు ఆవలి వైపున ఉన్న సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచల మండలం తిరుమలమ్మ పాళెం సమీపంలో బాలుడి మృతదేహం ఉన్నట్లు మంగళవారం సాయంత్రం అక్కడి వారు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు బోట్లపై అక్కడికి వెళ్లి మృతదేహాన్ని గుర్తించి తీసుకుని వచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామని, ఘటనకు గల కారణాలు ఇంకా తెలియలేదని, అదుపులో ఉన్న గిరిజనుడిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాలుడి మృతితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా, మత్తు మందు ఇచ్చి బాలుడిని కిడ్నాప్ చేసి ఉంటారని.. బాలుడు స్పృహలోకి వచ్చి గొడవ చేయడంతో ఉప్పు నీటిలో పడేసి ఉంటారని తెలుస్తోంది. -
పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కిడ్నాప్
సాక్షి, పల్నాడు జిల్లా: బొల్లాపల్లి మండలం వెంకుపాలెంలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజును కిడ్నాప్ చేశారు. ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్న నాగరాజును బొలెరో వాహనంతో అడ్డుకుని.. బలవంతంగా తీసుకెళ్లిన ప్రత్యర్థులు.. నాగరాజు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దుర్గి మండలం జంగమహేశ్వరపాడు వదిలేసి వెల్లటూరులో నాగరాజు కుటుంబం ఉంటుంది.కాగా, టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అడ్డూ అదుపు లేకుండా దాడులు కొనసాగుతున్నాయి. టీడీపీ రౌడీమూకలు దండెత్తుతుండటంతో సామాన్యులు ప్రాణభయంతో కన్నతల్లి వంటి సొంత ఊరును వదిలి వలసవెళ్లిపోతున్నారు. పొరుగు రాష్ట్రంతోపాటు అటవీ ప్రాంతాల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఒక్క పల్నాడు జిల్లాలోనే 1,500 కుటుంబాలు తెలంగాణకు వెళ్లి తలదాచుకోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.చిత్తూరు జిల్లాలో దాదాపు 500 కుటుంబాలు, అనంతపురం జిల్లాలో 350 కుటుంబాలు, శ్రీసత్యసాయి జిల్లాల్లో 100, అన్నమయ్య జిల్లాలో 120 కుటుంబాలు, కర్నూలు జిల్లాలో 135 కుటుంబాలు తమ గ్రామాలను వదిలి వలసవెళ్లాయి. వలస వెళ్లిన కుటుంబాల పంటలను, ఆస్తులను సైతం టీడీపీ మూకలు ధ్వంసం చేస్తూ పైశాచికంగా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు దాదాపు 2,700 కుటుంబాలు ప్రాణభయంతో వలస వెళ్లాయి. -
అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి కిడ్నాప్.. విషాదం
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన మరో భారతీయ విద్యార్థి జీవితం అర్థాంతరంగా ముగిసింది. కనిపించకుండా పోయిన హైదరాబాద్ విద్యార్థి అబ్దుల్ మహ్మద్ అరాఫత్.. విగత జీవిగా పోలీసులకు కనిపించాడు. తమ కుమారుడ్ని డ్రగ్స్ మాఫియా కిడ్నాప్ చేసిందని, కాపాడాలంటూ అతని తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు అరాఫత్‌ను రక్షించేందుకు భారత విదేశాంగ శాఖ, అమెరికా పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హైదరాబాదీ విద్యార్థి మృతిని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ ఖాతా ద్వారా ధృవీకరించింది. అతని ఆచూకీ కనిపెట్టేందుకు అధికారులు సెర్చ్ ఆపరేషన్ ద్వారా తీవ్రంగా యత్నించారని.. కనిపించకుండా పోయిన మూడు వారాల తర్వాత అతని మృతదేహాన్ని స్థానిక పోలీసులు కనుగొన్నారని, ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, అబ్దుల్ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తూ ఎంబసీ ఒక సందేశం ఉంచింది. Anguished to learn that Mr. Mohammed Abdul Arfath, for whom search operation was underway, was found dead in Cleveland, Ohio. Our deepest condolences to Mr Mohammed Arfath’s family. @IndiainNewYork is in touch with local agencies to ensure thorough investigation into Mr… https://t.co/FRRrR8ZXZ8 — India in New York (@IndiainNewYork) April 9, 2024 ఈ కేసు దర్యాప్తు జరుగుతోందని, విద్యార్థి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వస్థలానికి పంపేందుకు అవసరమైన సాయం అందిస్తామని తెలిపింది. అదే చివరిసారి.. నాచారంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన మహ్మద్ సలీమ్ కుమారుడు అబ్దుల్ మహ్మద్ అరాఫత్(25) 2023 మేలో ఉన్నత విద్యకు అమెరికా వెళ్లాడు. ఓహియో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. నిత్యం ఫోన్లో మాట్లాడే అతను చివరిసారి మార్చి నెల 7న తండ్రితో చివరిసారిగా ఫోన్లో మాట్లాడాడు. ఆ తర్వాత నుంచి స్పందనలేదు. ఆ మరుసటిరోజునే అబ్దుల్ అదృశ్యమయ్యాడని అమెరికాలో చదివే అతడి స్నేహితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. దీనిని అబ్దుల్ సోదరి చూసి తల్లిదండ్రులకు చెప్పింది. అబ్దుల్‌కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మార్చి 9వ తేదీన ఎంబీటీ నేత అమ్జద్ ఉల్లా ఖాన్ సాయంతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌కు లేఖ రాశారు. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిచ్చి తమ కుమారుడి ఆచూకీ కనిపెట్టాలని కోరారు. అమెరికాలోని సలీమ్ బంధువులు క్లీవ్‌లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. అబ్దుల్ అరాఫత్ చివరిసారి మార్చి 8వ తేదీన క్లీవ్‌లాండ్‌లోని వాల్‌మార్ట్ స్టోర్‌లో కనిపించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు అక్కడి పోలీసులు సమాచారమిచ్చారు. ఇంకోవైపు రోజులు గడుస్తున్నా ఆచూకీ లేకపోవడంతో అబ్దుల్ తండ్రి మరోసారి కేంద్ర విదేశాంగ శాఖను, అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. చివరకు.. మార్చి 18న చికాగోలోని ఇండియన్ కౌన్సిల్ సహాయం కోరిన బాధిత కుటుంబం తండ్రికి వాట్సాప్ కాల్ ఆ వెంటనే.. మార్చి 19వ తేదీన అబ్దుల్ తండ్రికి కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. అబ్దుల్‌ను తాము కిడ్నాప్ చేశామని.. 1200 అమెరికా డాలర్లు వెంటనే పంపించాలని డిమాండ్ చేశారు. డబ్బు పంపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే డబ్బులిచ్చేందుకు అంగీకరించిన సలీం.. అబ్దుల్ వాళ్ల అధీనంలోనే ఉన్నట్లు ఆధారాలు చూపాలని అడిగారు. దీనికి ఆగ్రహించిన కిడ్నాపర్లు ఫోన్ పెట్టేడయంతో సలీం ఆందోళన చెందారు. వెంటనే ఆయన ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలోనూ తమ కుమారుడిని రక్షించాలంటూ మీడియా సాక్షిగా అధికారులు కోరారాయన. అయితే.. చివరకు ఆ తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిలాయి. Telangana | A resident of Hyderabad's Nacharam Mohammed Abdul Arfath, who went to the United States to pursue his master's degree has gone missing from his residence in the USA after March 7. Abdul's father, Mohammed Saleem said "My son went to USA on May 23 to pursue a… pic.twitter.com/1iSxywKgyv — ANI (@ANI) March 21, 2024 ఇదిలా ఉంటే.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భారతీయ విద్యార్థులు, భారత సంతతికి చెందిన విద్యార్థులే లక్ష్యంగా వరుస దాడులు జరుగుతున్నాయి. 2024 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 11 మంది భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. -
ఇంటర్వ్యూ కోసం వెళ్తే.. కిడ్నాప్ చేశారు
ఈరోజుల్లో యూట్యూబర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. కొందరు జెన్యూన్‌గా సబ్ స్క్రైబర్లను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. మరికొందరు మాత్రం రకరకాల ఫీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో.. కాస్త ఫేమ్ సంపాదించుకున్న ఓ యూట్యూబర్ సాహసం ప్రదర్శించబోయి చిక్కుల్లో పడ్డాడు. జార్జియాకు చెందిన యూట్యూబర్ అడిసన్ పీయెర్రె మాలౌఫ్(యూట్యూబ్‌లో YourFellowArab/Arab). ప్రపంచంలో ప్రమాదకరమైన ప్రాంతాలుగా పేరున్న చోట్లకు వెళ్తూ.. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తుల్ని ఇంటర్వ్యూలు చేస్తూ ఆ వీడియోలతో 1.4 మిలియన్ సబ్స్కయిబర్లను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో.. కరేబియన్ దేశం హైతీలో ఓ ముఠా నాయకుడ్ని ఇంటర్వ్యూ చేయాలని డిసైడ్ అయ్యాడు. మావోజో అనే ముఠా నాయకుడు జిమ్మీ ‘బార్బీక్యూ’ చెరిజైర్కు హైతీలోనే కరడుగట్టిన గ్యాంగ్ లీడర్‌గా పేరుంది. అలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి అడిసన్ వెళ్లాడు. ఇందుకోసం హైతీలో ఓ స్థానిక టూరిస్ట్ సాయం తీసుకున్నాడు. అయితే.. ఆ గ్యాంగ్ ఉండే ప్రాంతానికి వెళ్లగానే వాళ్లిద్దరినీ తుపాకులతో 400 మంది చుట్టుముట్టారు. వదిలిపెట్టాలంటే 6 లక్షల డాలర్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. this is the last footage arab uploaded for me before he got kidnapped pic.twitter.com/vRbYdarPn1 — masih (@VFXmasih) March 29, 2024 తన దగ్గరున్న 40 వేల డాలర్లను వాళ్లకు ఇచ్చేసి విడిచిపెట్టమని అడిసన్ బతిమాలాడట. అయితే ఆ ముఠా అవి లాగసుకుని.. మిగతాది ఇస్తేనే రిలీజ్ చేస్తామని షాకిచ్చింది ఆ గ్యాంగ్. దీంతో తన స్నేహితుల కాంటాక్ట్ కోసం అడిసన్ ప్రయత్నిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో.. మార్చి 14వ తేదీన అడిసన్ను మావోజో ముఠా కిడ్నాప్ చేయగా, రెండు వారాలు ఆలస్యంగా ఆ విషయం బయటి ప్రపంచానికి తెలిసిందే. తోటి యూట్యూబర్ ఒకరు ఈ సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అతన్ని విడిపించేందుకు అవసరమైన డబ్బును సమీకరించేందుకు కొందరు యూట్యూబర్లు ముందుకు వచ్చారు. -
HYD: టీవీ ఛానల్ యాంకర్‌ను కిడ్నాప్ చేసిన యువతి
సాక్షి, హైదరాబాద్: ఓ టీవీ ఛానల్ యాంకర్‌ను యువతి కిడ్నాప్ చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. యాంకర్‌ను పెళ్లి చేసుకోవాలంటూ బెదిరింపులకు దిగిన త్రిష్ణ అనే యువతి కిడ్నాప్‌కు పాల్పడింది. తనను వివాహం చేసుకోవాలని రూమ్‌లో బంధించింది. త్రిష్ణ చెర నుంచి తప్పించుకున్న ప్రణవ్ పోలీసులను ఆశ్రయించాడు. డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్‌ను నడుపుతున్న త్రిష్ణ.. భారత్ మాట్రిమోన్లో ప్రణవ్ ఫోటోలు చూసి ఇష్టపడింది. ప్రణవ్ పేరుతో నకిలీ ఐడిని సైబర్ కేటుగాళ్లు క్రియేట్ చేయగా, నిజంగానే ప్రణవ్ ఐడి అనుకున్న త్రిష్ణ ఇష్టపడింది. ప్రణవ్‌పై మనసు పడ్డ ఆమె కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని భావించింది. చివరికి కథ అడ్డం తిరిగింది. త్రిష్ణను అరెస్ట్ చేసిన ఉప్పల్ పోలీసులు రిమాండ్‌కు పంపించారు. ఐదు స్టార్టప్ కంపెనీలకు త్రిష్ణ ఎండిగా ఉంది. ఇదీ చదవండి: నిన్ను లవ్ చేస్తున్నా.. ఫ్యాకల్టీ నో చెప్పాడని.. ఎంత పనిచేసిందంటే.. -
'ప్లీజ్ నన్ను చంపకండి..' హమాస్ దళాల బందీలో యువతి
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో హమాస్ మిలిటెంట్ల అమానయ చేష్టలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇజ్రాయెల్‌లో నిర్వహిస్తున్న పీస్ఫెస్టివల్పై హమాస్ ఉగ్రవాదులు.. అరమణి(25) అనే యువతిని ఎత్తుకెళ్లారు. ఆమెను మిలిటెంట్లు బైక్‌పై బలవంతంగా ఎక్కించుకుని వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బైక్‌పై తీసుకెళ్తున్న క్రమంలో మిలిటెంట్లను వేడుకుంటోంది అరమణి. ప్లీజ్ నన్ను చంపకండి.. దయచేసి వదలిపెట్టండి అంటూ ఏడుస్తోంది. ఆమె బాయ్‌ఫ్రెండ్ నాథన్‌ను కూడా హమాస్ దళాలు బంధించి తీసుకెళ్లారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Noa was partying in the south of Israel in a peace music festival when Hams terrorists kidnapped her and dragged her from Israel into Gaza. Noa is held hostage by Hamas. She could be your daughter, sister, friend.#BringBackOurFamily pic.twitter.com/gi2AStVdTQ — Hen Mazzig (@HenMazzig) October 7, 2023 ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో ఇప్పటికే ఓ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ వీధుల్లో హమాస్ మిలిటెంట్లు ఓ మహిళా మృతదేహాన్ని నగ్నంగా ఊరేగిస్తున్న ఆందోళనకరమైన దృశ్యాలు బయటకొచ్చాయి. అయితే.. ఈ వీడియోలో కనిపిస్తున్నది జర్మనీ పౌరురాలైన తన సోదరి అని ఓ మహిళ ధృవీకరించింది. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు. ఇదీ చదవండి: హమాస్ ఉగ్రవాదుల ఆకృత్యాలు.. మహిళను నగ్నంగా ఊరేగించి.. -
సికింద్రాబాద్ లో బాలుడి కిడ్నాప్ కలకలం
-
కాళ్లు చేతులు కట్టేసి.. ప్రేమిస్తే.. అగ్గి పెట్టేస్తారు
యశవంతపుర: తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే కోపంతో ఆమె తరఫు వ్యక్తులు ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ చేసి నిప్పుపెట్టారు. ఈ సంఘటన సిలికాన్ సిటీలోనే చోటుచేసుకుంది. వివరాలు.. బెంగళూరు ఆర్ఆర్ నగరకు చెందిన రంగనాథ, సత్యప్రేమ దంపతుల కుమారుడు శశాంక్ (18) బాధితుడు. అతడు నగరంలోని ఒక కాలేజీలో ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. సమీప బంధువు కూతురిని ప్రేమిస్తున్నాడు. యువతి తల్లిదండ్రులు ఈ ప్రేమను వ్యతిరేకిస్తున్నారు. ఇన్నోవాలో వచ్చి, కాళ్లు చేతులు కట్టేసి శనివారం ఉదయం ఏసీఎస్ కాలేజీకి వచ్చాడు, తరగతులు లేవని చెప్పడంతో బయట నడిచి వెళుతుండగా శశాంక్‌ను ఇన్నోవా కారులో వచ్చిన దుండగులు కిడ్నాప్ చేశారు. ఆరుమంది దుండగులు అతనిని నోరు, కాళ్లు చేతులను బట్టతో కట్టేశారు. బెంగళూరు– మైసూరు రహదారిలో కణమిణికె టోల్ గేట్ సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. అతికష్టంపై అగ్గిని ఆర్పుకొని శశాంక్ స్నేహితులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు వచ్చి అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఇటీవలే గొడవ యువతిది చామరాజనగర జిల్లా హరదనహళ్లి. యువతి బెంగళూరుకు రాగా శశాంక్ ఇంటికి తీసుకెళ్లి మర్యాదలు చేశాడు. ఇది తెలిసి యువతి తల్లిదండ్రులు శశాంక్ ఇంటికి వచ్చి గలాటా చేయగా, మీ అమ్మాయికి దూరంగా ఉంటానని శశాంక్ హామీనిచ్చాడు. ఇంతలోనే కిడ్నాప్ చేసి హత్యాయత్నం జరిగింది. కుంబళగోడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హరదనహళ్లిలో యువతి కుటుంబం తాళం వేసుకొని పరారైనట్లు పోలీసులు తెలిపారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి పరమేశ్వర్ ఆదేశించారు. -
బీజేపీ నేత కిడ్నాప్?
అల్వాల్ (హైదరాబాద్): అనుమానాస్పద స్థితిలో ఓ రియల్టర్, బీజేపీ నేత అదృశ్యమయ్యారు. అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించడంతో పాటు చర్చనీయాంశమయ్యింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామకు చెందిన ముక్కెర తిరుపతిరెడ్డి కుషాయిగూడ చర్లపల్లిలో నివసిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడిగా కూడా కొనసాగుతున్నారు. తిరుపతిరెడ్డికి అల్వాల్ పరిధిలోని పాకాలకుంటలో ఓ వివాదాస్పద స్థలం ఉంది. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్న ఓ వ్యక్తితో కొన్ని నెలలుగా వివాదం కొనసాగుతుండటంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే గురువారం తిరుపతిరెడ్డి తన స్థలానికి సంబంధించి అల్వాల్ తహసీల్దార్ కార్యాలయానికి కారులో వెళ్లారు. డ్రైవర్ వేరే పనిమీద వెళ్లిపోగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే తిరుపతిరెడ్డి కన్పించకుండా పోయారని పోలీసులతో పాటు కుటుంబసభ్యులు వెల్లడించారు. అప్పటి నుంచి తిరుపతిరెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని భార్యతో పాటు అతని సోదరుడు కరుణాకర్‌రెడ్డి తెలిపారు. స్థల వివాదం నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు సన్నిహితుడైన మామిడి జనార్ధన్‌రెడ్డి తన భర్తను కిడ్నాప్ చేశారని, ఆయనకు ఏదైనా జరిగితే వారిదే బాధ్యతని తిరుపతిరెడ్డి భార్య సుజాత పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆటోలో వెళ్లి..అదృశ్యమై.. మండల కార్యాలయం నుంచి తిరుపతిరెడ్డి ఒక్కడే ఆటోలో వెళ్లినట్లు సీసీ కెమెరాల ఫుటేజీల పరిశీలన అనంతరం పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటకేసర్ వద్ద ఆటో దిగి సమీపంలోని దుకాణ సముదాయంలోకి వెళ్లాడని, ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఇన్స్పెక్టర్ ఉపేందర్‌రావు వెల్లడించారు. తిరుపతిరెడ్డి ఆచూకీని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు చెప్పారు. కుటుంబసభ్యుల ఆందోళన.. కిడ్నాప్‌కు గురైన తిరుపతిరెడ్డి ఆచూకీని తెలుసుకోవడంంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన భార్య, సోదరుడు ఆరోపించారు. ఆయన అదృశ్యమై దాదాపు రెండురోజులు గడుస్తున్నా పోలీసులు ఎందుకు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తొలుత పోలీస్‌స్టేషన్ వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదని చెప్పిన పోలీసులు, ఇప్పుడు మాటమార్చి ఫుటేజీలు ఉన్నాయంటున్నారని చెప్పారు. తన భర్తకు ఎలాంటి హాని జరిగినా పోలీసులే బాధ్యత వహించాలని సుజాత పేర్కొన్నారు. పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయింపు తిరుపతిరెడ్డి కిడ్నాప్‌కు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు, బీజేపీ నాయకులు, పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించారు. జనగామ, ఇతర ప్రాంతాల నుంచి తిరుపతిరెడ్డి శ్రేయోభిలాషులు కూడా పెద్దసంఖ్యలో అల్వాల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అధికార పార్టీ నాయకులే తిరుపతిరెడ్డిని కిడ్నాప్ చేసి ఉంటారని స్థానిక బీజేపీ నాయకులు ఆరోపించారు. అదుపులో తిరుపతిరెడ్డి స్నేహితుడు దర్యాప్తులో భాగంగా పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించినట్లు సమాచారం. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా ఘట్కేసర్ ప్రాంతంలో తిరుపతిరెడ్డిని వదిలిపెట్టినట్లు పోలీసులకు చెప్పాడని తెలిసింది. అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్లి ఉంటారనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. తిరుపతిరెడ్డి కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు.. ఆయన గత కొన్ని రోజులుగా తరచూ స్నేహితుడితో మాట్లాడుతున్నట్లుగా గుర్తించినట్లు తెలిసింది. శుక్రవారం కూడా వేరే ఫోన్ ద్వారా మాట్లాడని తెలియడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
అల్వాల్‌లో రియల్టర్ తిరుపతిరెడ్డి కిడ్నాప్.. రూ.700కు ఆటో మాట్లాడుకుని..
హైదరాబాద్: అల్వాల్ రియల్టర్ తిరుపతిరెడ్డి కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట భూ వివాదాలే కిడ్నాప్‌కు కారణమని భావించిన పోలీసులు.. తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఎమ్మార్వో ఆఫీస్ వద్ద దిగిన తిరుపతి రెడ్డి ఐదు నిమిషాల్లోనే ఒక ఆటోలో సొంతంగా ఎక్కి వెళ్లినట్లు గుర్తించారు. రూ.700కు ఆటో మాట్లాడుకుని ఘట్కేసర్ వైపు వెళ్లినట్లు సీసీటీవీ ఆధారంగా గుర్తించారు. అక్కడి నుంచి ఎక్కడకు వెళ్లారనే దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. నాలుగు టీంలుగా ఏర్పడి ఎస్వోటి, అల్వాల్ పోలీసులు తిరుపతిరెడ్డి కోసం వెతుకుతున్నారు. తిరుపతి రెడ్డికి చెందిన 3 ఎకరాల భూమిని మామిడి జనార్దన్ రెడ్డి కబ్జాకు ప్రయత్నిస్తున్నాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మామిడి జనార్దన్ రెడ్డిపై మూడు కమిషనరేట్ల పరిధిలో 15 కుపైగా భూకబ్జా కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. తిరుపతి రెడ్డి కిడ్నాప్ పై ఇంకా ఆచూకి లభించలేదని తెలిపారు. నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అండతోనే మామిడి జనార్థన్ రెడ్డి అల్వాల్ లో పలు భూ కబ్జాలు చేస్తున్నట్లు బాధితులు ఆరోపించారు. తిరుపతి రెడ్డి కి ఏదైనా జరిగితే ఎమ్మెల్యే మైనంపల్లి, జనార్దన్ రెడ్డి బాధ్యులు అంటూ బాధితుని భార్య ఆవేదన వ్యక్తం చేశారు. కుషాయిగూడలోని నివసించే తిరుపతిరెడ్డికి పాకాల కుంటలోని స్థలంపై కొన్ని నెలల క్రితం వివాదం జరిగింది. ఈ వ్యవహారంలోనే దుండగులు అతన్ని కిడ్నాప్ చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇదీ చదవండి: షిర్డీ రైలులో చోరి.. లేడీ దొంగలను వదిలేసిన పోలీసులు.. అసలేం జరిగింది! -
చిన్న పిల్లలను ఇలా ఎత్తుకుపోతున్నారు
-
కిడ్నాప్ కథా చిత్రమ్ : ఆదిభట్ల కిడ్నాప్ కేసులో ముమ్మర దర్యాప్తు
-
బాలికపై సామూహిక అత్యాచారం
మీర్‌పేట: జిరాక్స్ కోసం బయటకు వెళ్లిన ఓ బాలికను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. మీర్‌పేట లెనిన్‌నగర్ ప్రశాంత్‌నగర్ ఫేజ్–2కు చెందిన ఓ బాలిక 9వ తరగతి చదువుతోంది. ఈ నెల 5న రాత్రి 7.30 గంటలకు స్థానికంగా ఉండే జిరాక్స్ షాప్‌నకు వెళ్లి తిరిగి వస్తుండగా.. అదే ప్రాంతానికి చెందిన రతన్ (22) కలిశాడు. నేనూ మీ ఇంటి వైపే వెళ్తున్నాను.. డ్రాప్ చేస్తానంటూ బాలికను బైక్‌పై ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లాక మరో బాలుడు (17) కూడా బైక్‌పై ఎక్కాడు. బాలికను ఇంటి వద్ద దించకుండా రైతుబజార్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం బాలికను ఎక్కించుకున్న చోటే వదిలేశారు. కాగా, జిరాక్స్ కోసమని బయటకు వెళ్లిన కూతురు ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసేందుకు మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా.. బాలిక ఇంటికి వచ్చిందని చెప్పడంతో వెనక్కి వచ్చారు. మరుసటి రోజు బాలికను ఈ విషయమై అడగగా.. రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి బైకుపై తిప్పి తిరిగి వదిలేశారని మొదట చెప్పింది. అనుమానం కలిగిన తల్లిదండ్రులు మరోసారి గట్టిగా నిలదీయడంతో వారిద్దరూ అత్యాచారానికి పాల్పడినట్టు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులు రతన్, బాలుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, రతన్ పాత నేరస్తుడని అతనిపై నాలుగు దొంగతనం కేసులు నమోదైనట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. వారిపై పోక్సో, అత్యాచారం, కిడ్నాప్ కేసులు నమోదు చేశామని చెప్పారు. -
ఎన్నారై ఫ్యామిలీ కిడ్నాప్.. విషాద ముగింపు
కాలిఫోర్నియా: యూఎస్‌లో ఎన్నారై ఫ్యామిలీ కిడ్నాప్ ఉదంతం.. విషాదంగా ముగిసింది. ఎనిమిది నెలల పసికందుతో సహా అంతా మృతదేహాలుగా కనిపించారని కాలిఫోర్నియా అధికారులు ప్రకటించారు. ఓ పండ్ల తోట నుంచి వీళ్ల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్ని జస్లీన్ కౌర్(27), జస్దీప్ సింగ్(36).. వీళ్ల ఎనిమిది నెలల పాప అరూహీ ధేరి, బంధువు అమన్‌దీప్ సింగ్(39)గా గుర్తించారు. సోమవారం నార్త్ కాలిఫోర్నియాలోని మెర్స్‌డ్ కౌంటీ నుంచి వీళ్లు అపహరణకు గురైనట్లు అధికారులు వెల్లడించారు. వీళ్ల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. ఇంతలో.. బుధవారం సాయంత్రం ఇండియానా రోడ్& హచిన్సన్ రోడ్‌లోని ఓ పండ్ల తోటలో పని చేసే వ్యక్తి.. వీళ్ల మృతదేహాలను గుర్తించి తమకు సమాచారం అందించాడని మెర్స్‌డ్ కౌంటీ పోలీస్ అధికారి వెర్న్ వార్న్కె తెలిపారు. ఆ సమయంలో ఆ అధికారి భావోద్వేగానికి లోనయ్యారు. నిందితుడికి నరకమే సరైన శిక్ష అని అభిప్రాయపడ్డారాయన. ఇదిలా ఉంటే.. జస్దీప్ తన కుటుంబంతో సెంట్రల్ వ్యాలీలో నివాసం ఉంటున్నారు. అక్టోబర్ 3వ తేదీన సౌత్‌హైవే 59లోని 800 బ్లాక్ వద్ద కొందరు దుండగులు ఆయుధాలతో బెదిరించి వీళ్లను అపహరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కుటుంబం కిడ్నాప్‌కు గురైన మరుసటి రోజే.. అనుమానితుడు మాన్యుయెల్ సల్గాడోను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జస్దీప్ తల్లిదండ్రులు డాక్టర్ రణ్‌దీర్ సింగ్, కృపాల్ కౌర్‌ల స్వస్థలం పంజాబ్. కిడ్నాప్ ఉద్దేశం కచ్చితంగా తెలియదని, కిడ్నాపర్ తాను దొరకకుండా సాక్ష్యాలు, ఆధారాలను నాశనం చేశాడని పోలీస్ అధికారులు తెలిపారు. నిందితుడి విచారణలో కారణాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: పిల్లల దగ్గు, జలుబు సిరప్‌లో కలుషితాలు! -
కిడ్నాపర్ల చెరలో నందగిరి వాసి
పెగడపల్లి(ధర్మపురి): జగిత్యాల జిల్లాలో కిడ్నాప్‌కు గురైన మత్తమల్ల శంకరయ్య (50)ను తాళ్లతో కట్టేసి బంధించిన ఫొటోను కిడ్నాపర్లు గురువారం అతడి కుమారుడు హరీశ్‌కు పంపించారు. దీంతో శంకరయ్య కిడ్నాపర్ల చేతిలో బందీగా ఉన్నట్లు తేలిపోయింది. వివరాల్లోకి వెళ్తే... పెగడపల్లి మండలం నందగిరి గ్రామానికి చెందిన శంకరయ్య ఈ నెల 22న దుబాయి నుంచి ముంబైకి వచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చి ట్యాక్సీ ఎక్కే క్రమంలో అతను కిడ్నాప్‌కు గురయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. కిడ్నాపర్లు శంకరయ్య ఫొటోను ఇంటర్నెట్ ద్వారా అతడి కుమారుడు హరీశ్ వాట్సాప్‌కు గురువారం పంపించారు. ఇంటర్ నెట్ ద్వారా ఫోన్ చేసిన కిడ్నాపర్లు తమిళ, మళయాల భాషల్లో మాట్లా డారు. రూ.15 లక్షలు ఇస్తేనే శంకర య్యను వదిలిపెడతామని తేల్చి చెప్పారు. మధ్య తరగతి కుటుంబా నికి చెందిన తాము రూ.15 లక్షలు ఎక్కడి నుంచి తేవాలని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. అతని భార్య అంజవ్వ, కుమారుడు హరీశ్, కూతురు గౌతమి వారం రోజులుగా క్షణక్షణం భయంగా గడుపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక చొరవ చూపి శంకరయ్య క్షేమంగా ఇంటికి చేరేలా తగిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. -
అనంతపురంలో యువతి కిడ్నాప్.. గంటలోనే ఛేదించిన పోలీసులు
-
2 వేల మంది చిన్నారులను కిడ్నాప్ చేసిన రష్యా: ఉక్రెయిన్
ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు దాడులను రోజురోజుకు పెంచుకుంటూ వెళ్లుతున్నాయి. ఉక్రెయిన్‌లో విధ్వంసమే లక్ష్యంగా పెట్టుకున్న రష్యా.. బాంబలు వర్షం కురిపిస్తోంది. కొన్ని చోట్ల ఉక్రెయిన్ సామాన్య ప్రజలు రష్యా సైన్యానికి ఎదురునిలిచి దాడులు ఆపాలని నిరసనలు తెలుపుతున్నా తగ్గడం లేదు. తాజాగా ఉక్రెయిన్ విదేశాంగ శాఖ సంచలన వ్యాఖ్యలు చేసింది. సుమారు 2,389 మంది ఉక్రెయిన్ దేశ చిన్నారులను రష్యా కిడ్నాప్ చేసినట్లు పేర్కొంది. చట్టవిరుద్ధంగా తమ దేశ చిన్నారులను అపహరించినట్లు వెల్లడించింది. రష్యా ఆక్రమించిన డాన్బాస్ ప్రాంతంతో సుమారు 2వేల మంది చిన్న పిల్లలు కనిపంచడం లేదని.. వారిని రష్యానే కిడ్నాప్ చేసిందని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ పేర్కొంది. మరోవైపు ఓడరేవు నగరమైన మారియుపోల్‌ను చుట్టుముట్టామని, అక్కడ ఉన్న ఉక్రెయిన్ బలగాలు లొంగిపోవాలన్న రష్యా డిమాండ్‌ను ఉక్రెయిన్ అధికారులు తిరస్కరించారు. మారియుపోల్‌లో ఆదివారం సుమారు 400 మంది తలదాచుకుంటున్న ఓ ఆర్ట్ స్కూల్‌పై రష్యా బలగాలు దారుణంగా బాంబలు కురిపించిన విషయం తెలిసిందే. అందులోంచి 150 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ⚡️ Ukraine accuses Russia of kidnapping children from occupied Donbas. According to the Foreign Ministry, 2,389 children from Russian-controlled Donbas were “illegally deported” to Russia. — The Kyiv Independent (@KyivIndependent) March 21, 2022 -
అన్యాయమని ప్రశ్నిస్తే కేసులు పెడతారా?
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాకేంద్రంలో ఇటీవల కిడ్నాప్‌కు గురైన బాధిత కుటుంబాలు మంగళవారం తెలంగాణ చౌరస్తాలో ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు ఎన్పీ వెంకటేశ్ మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌ను మరో రాయలసీమ ప్రాంతంగా మార్చడానికి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఈ నెల 23న నాగరాజు, 24న విశ్వనాథ్, యాదయ్య కిడ్నాప్ కాగా, ఈ నెల 25న హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ పోలీసులు రిమాండ్ చేశారన్నారు. గులాం హైదర్ అనే వ్యక్తిపై కత్తులతో దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే హైదరాబాద్‌లో ఎస్వీఎస్ లాడ్జి సమీపంలో అరెస్టు చేసినట్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు. మహబూబ్‌నగర్‌లో ఓ వీఐపీకి గులాం హైదర్ సన్నిహితుడని.. రాఘవేందర్‌రాజు చేసే అక్రమాలను హైదర్ ఎత్తి చూపుతున్నందుకు ఆయనను హత్య చేసేందుకు వచ్చినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో ఇచ్చారని, ఇది సరికాదన్నారు. గులాం హైదర్‌కు, యాదయ్య, విశ్వనాథ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. 23న టీఆర్ఎస్ పార్టీకి చెందిన అమర్ కొడుకును పోలీసులు తీసుకెళ్లారని.. 24న అమర్ తండ్రి దొరికాడని కొడుకును విడిచిపెట్టారని ఆరోపించారు. అన్వర్ అనే వ్యక్తి ఈనెల 24న కిడ్నాప్ అయ్యారని తెలిపారు. వీళ్లు దేశ ద్రోహులా, లేక టెర్రరిస్టులా..ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలన్నారు. ఈనెల 23న తన భర్త కిడ్నాప్ అయ్యాడని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళితే.. సదరు సీఐ ‘‘నీ భర్త రెండు రోజుల్లో వస్తాడని, పెద్దపెద్ద రాజకీయ నేతలతో మీకు ఎందుకు’’అని ప్రశ్నించినట్లు నాగరాజు భార్య గీత చెప్పారు. మళ్లీ తర్వాత రోజు స్టేషన్‌కు వెళితే మీ భర్తను చర్లపల్లి జైలుకు పంపించారని చెబితే, జైలు దగ్గరికి నేను వెళ్లి కలిసేందుకు ప్రయత్నిస్తే అవకాశం ఇవ్వలేదని, రాత్రి 9 గంటలకు భర్తతో మాట్లాడించారని చెప్పింది.