చిన్నారి ప్రాణాలు కాపాడిన వీధి కుక్కలు | Stray Dogs Saved 10 Year old Girl Being Kidnapped | Sakshi
Sakshi News home page

చిన్నారి ప్రాణాలు కాపాడిన వీధి కుక్కలు

Published Thu, Nov 7 2024 1:30 PM | Last Updated on Thu, Nov 7 2024 1:30 PM

Stray Dogs Saved 10 Year old Girl Being Kidnapped

భోపాల్‌: వీధి కుక్కలు చిన్నారుల ‍ప్రాణాలను తీస్తున్నాయనే వార్తల మధ్య వీటికి భిన్నమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బెత్మాలో జరిగింది.

కిడ్నాప్‌కు గురైన పదేళ్ల బాలికను వీధికుక్కలు కాపాడాయి.  ఒక చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ఇద్దరు వ్యక్తులు బెత్మాలోని కాళీ బిలౌడ్ గ్రామానికి వచ్చారు. అయితే వీధి కుక్కలు ఆ చిన్నారిని రక్షించి, కిడ్నాపర్లు అక్కడి నుంచి పారిపోయేలా చేశాయి. ఘటన గురించి బాధిత బాలిక మేనమామ మాట్లాడుతూ తమ పదేళ్ల మేనకోడలు ఇంటిలో ఒంటరిగా ఉండగా, ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆ చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారన్నారు.

అయితే దీనిని గమనించిన తమ వీధిలోని కుక్కలు ఆ ఇద్దరు వ్యక్తులపై దాడికి దిగాయన్నారు. దీంతో ఆ ఇద్దరు ఆగంతకులు అక్కడి నుంచి పారిపోయారన్నారు. అప్పడు ఆ చిన్నారి సమీపంలోని ఆలయంలోకి వెళ్లి దాక్కున్నదన్నారు. ఈ విషయమై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: బతికుంటే కోర్టుకెళతా: సాధ్వి ప్రజ్ఞ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement