Stray dogs
-
చిన్నారి ప్రాణాలు కాపాడిన వీధి కుక్కలు
భోపాల్: వీధి కుక్కలు చిన్నారుల ప్రాణాలను తీస్తున్నాయనే వార్తల మధ్య వీటికి భిన్నమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బెత్మాలో జరిగింది.కిడ్నాప్‌కు గురైన పదేళ్ల బాలికను వీధికుక్కలు కాపాడాయి. ఒక చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ఇద్దరు వ్యక్తులు బెత్మాలోని కాళీ బిలౌడ్ గ్రామానికి వచ్చారు. అయితే వీధి కుక్కలు ఆ చిన్నారిని రక్షించి, కిడ్నాపర్లు అక్కడి నుంచి పారిపోయేలా చేశాయి. ఘటన గురించి బాధిత బాలిక మేనమామ మాట్లాడుతూ తమ పదేళ్ల మేనకోడలు ఇంటిలో ఒంటరిగా ఉండగా, ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆ చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారన్నారు.అయితే దీనిని గమనించిన తమ వీధిలోని కుక్కలు ఆ ఇద్దరు వ్యక్తులపై దాడికి దిగాయన్నారు. దీంతో ఆ ఇద్దరు ఆగంతకులు అక్కడి నుంచి పారిపోయారన్నారు. అప్పడు ఆ చిన్నారి సమీపంలోని ఆలయంలోకి వెళ్లి దాక్కున్నదన్నారు. ఈ విషయమై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: బతికుంటే కోర్టుకెళతా: సాధ్వి ప్రజ్ఞ -
పిరమిడ్‌పై పక్షుల వేట
వీధి శునకాలు ఆహారం కోసం ఊరంతా తిరుగుతాయి. కానీ ఒక వీధికుక్క ఏకంగా ఈజిప్ట్ పిరమిడ్నే ఎక్కేసింది. మార్షల్ మోషెర్ అనే అమెరికా పారా గ్లైడర్ ఈ ఉదంతాన్ని తన మొబైల్ కెమెరాలో బంధించాడు. ఆయన ఇటీవల తోటి పారాగ్లైడర్లతో కలిసి ప్రపంచ ప్రఖ్యాత గిజా పిరమిడ్ల మీదుగా సూర్యోదయ అందాలను చూసేందుకు బయల్దేరాడు. వినీలాకాశంలో చక్కర్లు కొడుతుండగా ఖఫ్రే పిరమిడ్ శిఖరంపై ఒక జీవి కనిపించింది. తొలుత దాన్ని పర్వత ప్రాంతాల్లో తిరిగే బుల్లి సింహంగా భావించారు. కానీ మొబైల్ కెమెరాను జూమ్ చేసి చూస్తే సాధారణ వీధి కుక్క అని అర్థమైంది. ప్రపంచంలోనే రెండో అత్యంత ఎత్తయిన పిరమిడ్‌పై అదేం చేస్తోందబ్బా అని పరిశీలిసతఏ, పిరమిడ్ శిఖరాగ్రంపై వాలే పిట్టలను పట్టుకునేందుకు పరుగులు పెడుతూ కని్పంచింది. వీధి కుక్కులు ఇలా 130 మీటర్లకు పై చిలుకు ఎత్తుకు ఎక్కిరావడం అరుదు. దారి తప్పి వచి్చందేమో, కిందకు ఎలా వెళ్లాలో తెలీక పైనే తచ్చాడుతోందేమో అని వారు భావించారు. మర్నాడు దాన్ని కిందకు దించాలని నిర్ణయించుకున్నారు. అది పిరమిడ్‌పై తిరుగుతున్న వీడియోను మోషెర్ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తే రాత్రికి రాత్రే కోట్ల మంది చూశారు. తీరా మర్నాడు వెళ్లి చూస్తే కుక్క పిరమిడ్‌పై లేదు! ఒక శునకం పిరమిడ్ పై నుంచి తాపీగా కిందకు దిగొస్తున్న వీడియోను మరో సాహస యాత్రికుడు తర్వాతి రోజే నెట్లో షేర్చేశాడు. దాంతో అదే ఇదని నిర్ధారణకు వచ్చారు. ఈ వీడియో చూసిన కొందరు ఈజిప్షియన్లు మాత్రం శునకాన్ని ఏదో అతీంద్రీయ శక్తి పైకి తీసుకెళ్లిందని కామెంట్లు చేశారు. ఈజిప్ట్ పురాణాల ప్రకారం ఆ ప్రాంతంలో అనూబిస్ అనే దైవం ఉండేది. మనిషి శరీరం, నక్క ముఖంతో ఉండే ఆ దేవున్ని శుభాలకు ప్రతిరూపంగా భావిస్తారు. – కైరో -
గాజాలో మృతదేహాలను పిక్కుతింటున్న వీధికుక్కలు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న పోరు రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతుంది. హమాస్‌ను అంతమొందించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ యుద్ధంతో ఏడాదికాలంగా నలుగుతున్న గాజాలో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నాయి. ఇజ్రాయెల్ బలగాలు వైమానిక దాడులతో విరుచుకుపడుతుండటంతో పాలస్తీనియన్లు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. అయితే తాజాగా గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన మృతదేహాలను వీధికుక్కలు పిక్కుతుంటున్నట్లు అక్కడి మీడియా నివేదించింది. ఆకలితో ఉన్న వీధికుక్కలు ఈ మృతదేహాలను తింటున్నాయని, దీని ద్వారా మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారుతోందని గాజాలోని ఉత్తర భాగంలో అత్యవసర సేవల అధిపతి ఫేర్స్ అఫానా వెల్లడించారు. ఉత్తర గాజా, జబాలియా ప్రాంతంలో హమాస్ సభ్యులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ జరుగుపతున్న వైమానిక, భూతల దాడులను ప్రస్తావిస్తూ. ఇజ్రాయెల్ దళాలు పాలస్తీనియన్ల జీవితాలను సూచించే ప్రతిదాన్ని నాశనం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పరిస్థితి మరింత దిగజారుతోందని, తమ పనులు సవ్యంగా చేయలేకపోతున్నామని తెలిపారు. ఉత్తర గాజాలో జరుగుతున్నది నిజమైన మారణహోమమని ఆయన అన్నారు.కాగా గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్ పట్టణాలపై హమాస్ మెరుపు దాడి చేసి దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. Oఇజ్రాయెల్‌లోకి చొచ్చుకుపోయిన హమాస్ ఉగ్రవాదులు అక్కడ 1200 మందిని బలితీసుకున్నారు. ఈ ఘటన తర్వాత గాజాలో ఇజ్రాయెల్ సైనిక ప్రచారాన్ని ప్రారంభించింది. ఇజ్రాయెల్ వరుస దాడులతో గాజా స్ట్రిప్‌లో ఇప్పటి వరకు 42,409 మంది మరణించారు. వీరిలో అత్యధికంగా పౌరులే ఉన్నారు. మరో 99,153 మంది గాయపడ్డారు.గత 24 గంటల్లో ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో 65 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. పాలస్తీనా శరణార్థుల కోసం యూఎన్ ఏజెన్సీ నిర్వహిస్తున్న గిడ్డంగి సహాయ కేంద్రంలో ఆహారం కోసం వెతుకుతున్న ఆకలితో ఉన్న నివాసితులపై సోమవారం ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరిపాయని తెలిపింది. -
కిల్లర్ డాగ్స్!
..: ఇది జర్నలిజంలో ఓ పాత పాఠం :..జర్నలిస్టుల సంగతి ఎలా ఉన్నా.. ప్రభుత్వాలు మాత్రం దీన్ని సీరియస్‌గానే తీసుకున్నట్లు ఉన్నాయి. అందుకే మనిషిని కుక్క కరవడం కాదు.. చంపేస్తున్నా.. పెద్దగా పట్టనట్లే ఉంటున్నాయి.ఫలితం..ఓ విహాన్.. ఓ పూలమ్మ,.. ఓ రామలక్ష్మి.. పేరేదైతేనేం.. ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తరచూ పదుల సంఖ్యలో ప్రజలు కుక్కకాట్ల బారిన పడుతూనే ఉన్నారు. ఏళ్లుగా ఉన్న సమస్య ఇది.. ఎవరూ సీరియస్‌గా తీసుకోని విషయమిది. మరేం చేద్దాం?ఇప్పటికైనా పట్టించుకుందామా? పట్టనట్లే ఉందామా?⇒ హైదరాబాద్‌లోని మియాపూర్ మక్తాకు చెందిన ఆరేళ్ల బాలుడు సాత్విక్‌పై రెండు నెలల క్రితం వీధికుక్కలు దాడి చేసి చంపేశాయి. నెల రోజుల క్రితం ఇబ్రహీంపట్నం రాయపోల్‌లో నాలుగేళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేసింది. నిలోఫర్‌లో చికిత్స పొందుతూ ఇటీవల చనిపోయాడు. గత పదిహేను రోజుల్లో నాలుగు కుక్కకాటు ఘటనల్లో పదుల సంఖ్యలో చిన్నారులు, పెద్దవాళ్లు గాయపడ్డారు. ⇒ రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బట్టోనితాళ్లలో 20 రోజుల కింద పిట్ల రామలక్ష్మి (80) అనే వృద్ధురాలిపై వీధికుక్కలు దాడి చేసి పీక్కుతిన్నాయి.⇒ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన భరత్, వెంకటలక్ష్మి దంపతులు హైదరాబాద్ జవహర్‌నగర్ పరిధిలోని ఆదర్శనగర్‌కు మూడు నెలల క్రితం వలస వచ్చారు. వారి 18 నెలల కుమారుడు విహాన్‌ను ఇటీవల కుక్కలు దాడి చేసి చంపేశాయి.⇒ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎడ్జెర్లకు చెందిన జంగం నర్సయ్య బర్ల కాపరిగా, ఆయన భార్య పూలమ్మ (50) గ్రామ పంచాయతీ నర్సరీలో కూలీ పని చేసేవారు. వారి ఏకైక కుమార్తె వివాహం కావడంతో.. భార్యాభర్త ఇద్దరే ఉండేవారు. జూలై 5న పూలమ్మ నర్సరీలో పని ముగించుకుని తిరిగొస్తుండగా కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. దీనితో తాను ఒంటరిని అయిపోయానంటూ నర్సయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు... ఈ ఘటనలే కాదు.. చెప్పుకుంటూపోతే మరెన్నో.. వీధి వీధినా, గ్రామం, పట్టణం తేడా లేకుండా ఎన్నో వందల కుటుంబాల్లో విషాదం నింపుతున్న కుక్కల దాడి ఘటనలెన్నో. అవి మనుషులకు మంచి స్నేహితులంటూ మనం చెప్పుకొనే శునకాలే.. ఇంటి ముందో, వీధిలోనో కలియదిరుగుతూ కనిపించేవే. కానీ కొన్నేళ్లుగా కుక్కల దాడి ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్నారులను, వయసు మళ్లినవారిపై దాడిచేసి పొట్టనపెట్టుకుంటూ కన్నీళ్లు నింపుతున్నాయి. - సాక్షి, హైదరాబాద్ఆహార కొరత.. విపరీతంగా సంతానోత్పత్తివీధికుక్కలు రెచ్చిపోవడానికి ప్రధాన కారణం ఆహార కొరత అని వెటర్నరీ వైద్యులు చెప్తున్నారు. ఖాళీ ప్రదేశాలు తగ్గిపోవడం, వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపిస్తున్నాయని అంటున్నారు. కుక్కలు పెద్ద శబ్దాలు, ఎక్కువ వెలుగు ఉండే లైట్ల వల్ల ఆవేశపడతాయని.. ఇలాంటి సమయాల్లోనే అవి అతిగా దాడులు చేస్తుంటాయని వివరిస్తున్నారు. సాధారణంగా కుక్కలు మాంసాహారాన్ని ఇష్టపడతాయి. కానీ ఇప్పుడు వాటికి శాఖాహారం కూడా దొరకని పరిస్థితి రావడంతో రెచ్చిపోతున్నాయి.అందువల్ల కుక్కలకు షెల్డర్ హోమ్‌లు, ప్రత్యేకంగా పార్కులు ఏర్పాటు చేసి, వాటికి సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొంత ప్రయత్నం జరిగినా ఫలితం మాత్రం శూన్యం. జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు లక్షలకుపైగా వీధి కుక్కలు ఉన్నాయని కార్పొరేషన్ వెటర్నరీ విభాగం చెబుతోంది. కానీ వాస్తవంగా 10 లక్షలకుపైగానే వీధి కుక్కలు ఉన్నట్టు అంచనా. వీటిలో మూడో వంతు కుక్కలకు కూడా స్టెరిలైజేషన్, వాక్సినేషన్ జరగలేదని సమాచారం.నామ్ కే వాస్తేగా కార్యాచరణకుక్కకాట్లతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంపై ఇటీవల హైకోర్టు తీవ్రస్థాయిలో స్పందించడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. కానీ ఆ హడావుడి నాలుగైదు రోజుల్లోనే ముగిసిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పశు జనన నియంత్రణ కేంద్రాలు ఉండగా.. మిగతా జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ అడుగు ముందుకు పడలేదు.2030 నాటికి రేబిస్ నిర్మూలన సాధ్యమెట్లా?దేశంలో 2030 నాటికి రేబిస్‌ను నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకొంది. ఆ లక్ష్యం నెరవేరాలంటే శునకాల నియంత్రణ చర్యలు వేగవంతం చేయాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో యాంటీ రేబిస్ టీకాలను విరివిగా అందుబాటులో ఉంచాలి. కానీ కేంద్రం సరిగా నిధులు కేటాయించడం లేదు. రాష్ట్రాలూ పట్టించుకోవడం లేదు. కుక్కకాట్లతో రేబిస్ సోకడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 59 వేల మంది చనిపోతుంటే.. అందులో 20 వేలకుపైగా (36 శాతం) మరణాలు మనదేశంలోనే నమోదవుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఒక్క జంట నుంచి ఏడేళ్లలో 4 వేల కుక్కలు⇒ కుక్కల జీవిత కాలం 8 నుంచి 12 ఏళ్లు⇒ 8 నెలల వయసు నుంచే వాటికి సంతానోత్పత్తి సామర్థ్యం ఉంటుంది⇒ వీటి గర్భధారణ సమయం 60–62 రోజులే ఏటా రెండు సార్లు పిల్లలను కంటాయి. ప్రతిసారి 4 నుంచి 8 పిల్లలను పెడతాయి⇒ ఒక శునకాల జంట, వాటి పిల్లలు, వీటన్నింటికీ పుట్టే పిల్లలు ఇలా.. ఏడాదిలోనే 40 వరకు అవుతాయి. మొత్తంగా ఒక్క జంట నుంచి ఏడేళ్లలో సుమారు 4 వేల వరకు అయ్యే అవకాశం ఉంటుందికాకి లెక్కలేనా..?జీహెచ్ఎంసీలో ఏటా 50, 60 వేల వీధికుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్స (స్టెరిలైజేషన్) జరుగుతున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. ఈ శస్త్రచికిత్సలు, రేబిస్ వ్యాధి సోకకుండా వ్యాక్సినేషన్, సిబ్బంది జీతభత్యాలు, ఇతర ఖర్చుల కోసం ఏటా రూ.12 కోట్లకుపైగానే వ్యయం చేస్తున్నారు. కానీ వీధికుక్కల సంఖ్య ఏమాత్రం తగ్గకపోగా.. అంతకంతకూ పెరిగిపోతోంది. నిధులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయన్న ప్రశ్న తలెత్తుతోంది. మున్సిపల్ కార్పొరేషన్లు ఒక్కో కుక్క స్టెరిలైజేషన్ కోసం రూ.1,700 చొప్పున ఖర్చు చేస్తున్నా.. చేసే ఆపరేషన్లకు, చూపే లెక్కలకు తేడా ఉంటోందన్న ఆరోపణలు ఉన్నాయి.గోవా ఎలా కంట్రోల్ చేయగలిగింది?కుక్కకాట్ల విషయంలో గోవా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఆ రాష్ట్రంలో గత మూడేళ్లలో ఒక్క కుక్కకాటు మరణం కూడా నమోదు కాలేదు. నిర్ణీత కాలవ్యవధిలో కుక్కలకు శస్త్రచికిత్సలు చేస్తున్నారు. శునకాల దాడినుంచి స్వీయరక్షణ విధివిధానాలను విద్యార్థులకు, మహిళలకు తెలియజెప్పడం వంటి అంశాలు గోవాలో సత్ఫలితాలిస్తున్నాయి. బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లోనూ కుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు ప్రశంసలు పొందాయి.ఆ రాష్ట్రాల్లో బాధితులకు పరిహారంకుక్కకాటు ఘటనలకు రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని గత సంవత్సరం హరియాణా– పంజాబ్ హైకోర్టు తీర్పునిచ్చింది. కుక్క కాటు కేసుల్లో ఒక్కో పంటి గాటుకు 10వేల రూపాయల చొప్పున బాధి తులకు నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కుక్కకాటు ఘటనలో 0.2 సెంటీమీటర్లు, ఆపైన కోత పడితే బాధితులకు రూ.20 వేలు చెల్లించా లని.. ప్రాణనష్టం జరిగితే రూ.5 లక్షలు పరిహారంగా ఇవ్వాలని స్పష్టం చేసింది. కర్ణాటకలో కుక్కకాటు కేసులను సమీక్షించడానికి, కుక్కకాటుకు గురైన వ్యక్తులకు పరిహారం అందించడానికి అక్కడి పట్టణాభివృద్ధి శాఖ పట్టణ, స్థానిక సంస్థలతో కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ కమిటీల ద్వారా 48 గంటల్లో బాధితులకు పరిహారాన్ని అందిస్తున్నారు. రాష్ట్రంలో ఎలాంటి పరిహారం లేదు.పిల్లలు పలవుతున్నా ప్రభుత్వం స్పందించల్లేదుమాది సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గోవిందాపూర్. ఇటీవల రెండు పిచ్చి కుక్కలు ముగ్గురు చిన్నారులపై దాడి చేశాయి. నా బిడ్డ ప్రావీణ్య కూడా తీవ్రంగా గాయపడింది. కుక్కల దాడిలో పిల్లలు బలవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలి. – సాగర్‌రెడ్డి, ప్రావీణ్య తండ్రికొత్త ప్రదేశాల్లో వదిలేయడంతో సమస్యలువీధికుక్కల స్టెరిలైజేషన్ విషయంలో మున్సిపల్ అధికారులు పొరపాట్లు చేస్తున్నారు. స్టెరిలైజేషన్ కోసం తీసుకువెళ్లిన కుక్కలను తిరిగి అదే ప్రాంతంలో వదలకుండా కొత్త ప్రదేశాల్లో విడిచిపెడుతున్నారు. అక్కడి కుక్కలు కొత్తవాటిని రానీయకపోవడం, మనుషులూ కొత్తవారు కావడంతో అభద్రతకు లోనవుతాయి. దీనికితోడు కుక్కలు అతి చల్లదనం, వర్షాలు, వేడిని తట్టుకోలేవు. చిత్రంగా ప్రవర్తిస్తూ దారినపోయే వారిపై దాడులకు దిగుతాయి. కుక్కలకు సకాలంలో స్టెరిలైజేషన్ చేయాలి. షెల్టర్లు ఏర్పాటు చేసి తరలించాలి. – అసోసియేట్ ప్రొఫెసర్ రాంసింగ్ లఖావత్, వెటర్నరీ యూనివర్సిటీరేబిస్ సోకే ప్రమాదం.. జాగ్రత్త.కుక్కకాటుతో రేబిస్ సోకే ప్రమాదం ఉంటుంది. కుక్క కరిస్తే వెంటనే గాయాన్ని పది, పదిహేను నిమిషాల పాటు నీటితో శుభ్రం చేయాలి. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. రేబిస్ సోకితే తొలిదశలో జ్వరం, తలనొప్పి, వాంతులు వస్తాయి. తర్వాత పిచ్చిగా ప్రవర్తించడం, మనుషులను గుర్తించèలేక పోవడం, నోట్లోంచి నురగ, గొంతు పట్టేయడం, ఊపిరి ఆడకపోవడం వంటివి కనిపి స్తాయి. చివరిగా కోమాలోకి వెళ్లి ప్రాణాలు పోయే ప్రమాదమూ ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. – డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్ఓ, రంగారెడ్డిరెచి్చపోయిన పిచ్చి కుక్కలు29 మందికి గాయాలు బాధితుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు నందిపేట్ /మాచారెడ్డి/ మంగపేట: నిజామాబాద్, కామారెడ్డి, ములుగు జిల్లా మంగపేటలో సోమవా రం పిచ్చి కుక్కలు స్వైర విహారం చేసి సుమారు 29 మందిని గాయపర్చాయి. బాధితులు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నందిపేట మండల కేంద్రంలోని బంగారు సాయిరెడ్డి ఫ్యాక్టరీ దగ్గర గల రామ్‌రెడ్డి వెల్డింగ్ షాప్ నుంచి మెయిన్ రోడ్డు వెంబడి లిటిల్ ఫ్లవర్ స్కూల్, చాకలి ఐలమ్మ, ఆనంది హాస్పిటల్, వ్యాన్ల అడ్డ, నట్రాజ్ టాకీస్ కాంప్లెక్స్ ప్రాంతాల వరకు ఓ పిచి్చకుక్క పదిమందిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. లిటిల్ ఫ్లవర్ స్కూలు విద్యారి్థ, ఆనంద్ హాస్పిటల్ ఆయమ్మ లసుంబాయిపై కూడా కుక్క దాడి చేసి తొడ, చేతి కండరాలను పీకేసింది.మాచారెడ్డి మండలంలోని ఘన్పూర్ (ఎం)లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పిచ్చి కుక్క పది మందిని గాయ పర్చింది. అక్షిత అనే బాలికపై, ఆరుబయట నిద్రిస్తున్న వృద్ధుడు పోచయ్యతో పాటు యాకూబ్, చైతన్య, హార్యన్, రంజిత్ తదితరులపై కుక్క దాడి చేసి గాయపర్చింది. ఆగ్రహించిన గ్రామస్తులు కుక్కను చంపేశారు. అలాగే ములుగు జిల్లా మంగపేటలోనూ ఓ పిచ్చి కుక్క పలువురిపై దాడిచేసింది. గంపోనిగూడెం, పొదుమూరు, మంగపేటలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న వృద్ధురాలిని, రోడ్డుపై నున్న ఎర్రావుల సమ్మయ్య, కొప్పుల లాలయ్య, దాదాని, ఎండి సైదా, మైతున్బి, ఎండి గోరెతోపాటు మరో ముగ్గురిపై పిచ్చి కుక్క దాడిచేసింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో ఆరుగురికి స్పల్ప గాయాలయ్యాయి. -
ఇళ్లలోకి చొరబడి మనుషులను చంపడమా!
సాక్షి, హైదరాబాద్: వీధి కుక్కలు ఇంట్లోకి వెళ్లి మహిళను చంపి.. అవయవాలు తినడం అత్యంత దారుణమైన ఘటన అని హైకోర్టు పేర్కొంది. ఇలా మహిళలు, చిన్నారులను కుక్కలు చంపుతున్నా పరిష్కార మార్గం కనుగొనకుంటే ఎలా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ‘స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కాదు.. దాడుల నియంత్రణకు ఏం చర్యలు చేపట్టారో చెప్పాలి’అని ఆదేశించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యంలో వాదనలు కాదని, పరిష్కారం కావాలని న్యాయవాదులకు సూచించింది.ఆ దిశగా అందరి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని సర్కారుకు స్పష్టం చేసింది. వీధి కుక్కలకు పునరావాస కేంద్రాలు, ప్రజల కోసం హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని చెప్పింది. జూన్ 28న పటాన్చెరు ఇస్నాపూర్‌లో వీధి కుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడు విశాల్ మృతి చెందాడు. ఈ దారుణంపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. గతంలో ఇదే అంశంపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్లకు దీనిని జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.ఈ పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావు ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వృద్ధురాలిని కుక్కలు పీక్కుతిన్న వైనం, చిన్నారులపై కుక్కల దాడిపై పత్రికల్లో వచ్చిన కథనాలు కోర్టులో ప్రస్తావనకు వచ్చాయి. పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేశాం..రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎ.సుదర్శన్‌రెడ్డి హాజరయ్యారు. యానిమల్ బర్త్ కంట్రోల్, యాంటీ రేబీస్ ప్రోగ్రామ్‌ను సమర్థవంతంగా అమలు చేయడం కోసం కమిటీ ఏర్పాటు చేశామని, ఈ కమిటీ పలు నిర్ణయాలు తీసుకుందని వివరించారు. యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) సెంటర్ పనిచేస్తోందన్నారు. జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా నిర్వహిస్తోందన్నారు. కాగా, గత విచారణ సందర్భంగా ధర్మాసనం ఆదేశాల అమలుపై జీహెచ్ఎంసీ నివేదిక అందజేసింది.పెంపుడు కుక్కలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వాటి యజమానులకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించింది. కాగా, వీధి కుక్కలను షెల్టర్లకు తరలించి వాటికి అక్కడే అన్ని సదుపాయాలు కల్పించాలని న్యాయవాది వేణుమాధవ్ కోరారు. జీహెచ్ఎంసీ నివేదికను పరిశీలించిన సీజే పలు సూచనలు చేశారు. జంతు సంక్షేమ బోర్డు తరఫున న్యాయవాదిగా డీఎస్జీ గాడి ప్రవీణ్‌కుమార్‌ను చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించారు.ధర్మాసనం సూచనలు..⇒ వీధి కుక్కలపై ఫిర్యాదులకు నగరవాసుల కోసం ప్రత్యేకంగా ఓ హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేయాలి.⇒ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ, రాష్ట్రంలోని వివిధ జంతు సంక్షేమ సంస్థలను సంప్రదించి దాడుల నియంత్రణకు సూచనలు స్వీకరించాలి.⇒ ఏబీసీ నిబంధనల ప్రకారం జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థలు తగినన్ని షెల్టర్లు, పశు వైద్యశాలలు, కుక్కల తరలింపు వ్యాన్లు, మొబైల్ వ్యాన్లు, సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఏబీసీ కేంద్రాలు నెలకొల్పి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.⇒ ఏబీసీ కేంద్రాల్లో కుక్కలకు వ్యాక్సినేషన్ చేయించాలి. వ్యాక్సినేషన్ నిర్వహించేందుకు జంతు సంక్షేమ సంస్థలు ముందుకొస్తే ఆ ఖర్చులు ప్రభుత్వం భరించాలి. ⇒ ఏబీసీ కమిటీ నెలకోసారి భేటీ కావాలి. నిబంధనలు పాటించకుంటే కమిటీలను రద్దు చేయాలి.⇒ ఐదేళ్ల పాటు 10 కుక్కలను దత్తత తీసుకునేలా జంతు ప్రేమికులను ప్రోత్సహించాలి. ⇒ కుక్కలు కరిస్తే ఏం చేయాలో ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.⇒ హైదరాబాద్ సిటీకి దూరంగా వీధి కుక్కలకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలి. -
రేవంత్ అంకుల్.. మా ప్రాణాలకు రక్షణ ఏదీ?
కుత్బుల్లాపూర్: వీధి కుక్కల బెడదపై ఆదివారం కొంపల్లి ఎన్సీఎల్ కాలనీకి చెందిన చిన్నారులు వినూత్న తరహాలో నిరసన తెలిపారు. ‘రేవంత్ అంకుల్..మా ప్రాణాలకు రక్షణ ఏదీ?’ అంటూ ఆదివారం ప్లకార్డులు చేతబూని పెద్ద సంఖ్యలో చిన్నారులు పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వద్దకు చేరుకున్నారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఎన్సీఎస్ నార్త్ కాలనీలో వీధి కుక్కల దాడుల్లో గత ఆరు నెలల వ్యవధిలో సుమారు 70 మంది చిన్నారులు గాయపడ్డారు. ఈ విషయమై పలుమార్లు కొంపల్లి మున్సిపల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేసినా సరిగ్గా స్పందించలేదు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ కాలనీకి చెందిన చిన్నారులు ప్లకార్డులతో నిరసన చెప్పారు. కొంపల్లి మున్సిపల్ కమిషనర్ హరికృష్ణపై సీఐ విజయవర్దన్కు ఫిర్యాదు చేశారు. చిన్నారుల ఫిర్యాదు మేరకు జీడీ నమోదు చేశామని, డీసీపీ దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు చేపడతామన్నారు. -
వీధి కుక్కల బెడదపై నేడు సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు కాటు వేయడంపై హైకోర్టు సుమోటోగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, జీహెచ్ఎంసీకి పలు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో కుక్కల సమస్యపై హైకోర్టు సూచనల మేరకు సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.వివిధ జంతు పరిరక్షణ సంఘాలతో సమావేశమై, వీధి కుక్కల బెడద తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని యానిమల్ బర్త్ కంట్రోల్ ఇంప్లిమెంటేషన్, మానిటరింగ్ కమిటీని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కె.సతీశ్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లగాన్ మోహన్‌రెడ్డి, యానిమల్ వెల్ఫేర్ సంస్థల తరఫున అమల అక్కినేని, వాసంతి వడి, న్యాయవాదులు శ్రేయ పరోపకారి, వేణు మాధవ్, ఐపీఎం రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ సంపత్, ఆరోగ్య శాఖ అధికారులు హాజరు కానున్నారని జీహెచ్ఎంసీ కమిషనర్ పేర్కొన్నారు. -
విధి కుక్కల దాడిలో..
-
వీధి కుక్కలను చంపడం తప్పుకాదని గాంధీ ఎందుకన్నారు? మహాత్ముని అంతరంగ రహస్యం ఏమిటి?
ఇటీవలి కాలంలో వీధి కుక్కల ఆగడాలకు సంబంధించి తరచూ వార్తలు వస్తున్నాయి. వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. వీధికుక్కలకు సంబంధించి నాటి రోజుల్లో మహాత్మాగాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది 1942వ సంవత్సరం. ప్రతి సోమవారం మౌనవ్రతం పాటించాలని గాంధీజీ నిర్ణయించుకున్నారు. గాంధీ మౌన దీక్ష చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ రోజు కూడా గాంధీ సందర్శకులను కలుసుకునేవారు. ఎదుటివారి మాటలు విని, రాతపూర్వకంగా సమాధానం ఇచ్చేవారు. ఇదే సమయంలో గాంధీ ఒక అనూహ్యమైన వివాదంలో చిక్కుకున్నారు. సుప్రసిద్ధ అమెరికన్ జర్నలిస్ట్ లూయిస్ ఫిషర్ రాసిన ‘ది లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ’ పుస్తకం గాంధీజీ జీవితానికి సంబంధించిన అత్యంత విశ్వసనీయ పుస్తకంగా పరిగణిస్తుంటారు. ఈ పుస్తకంలోని 10వ అధ్యాయంలో ఒక ఉదంతం ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. అహ్మదాబాద్ టెక్స్టైల్ మిల్లు యజమాని అంబాలాల్ సారాభాయ్ తన మిల్లు ఆవరణలో తిరుగుతున్న 60 వీధికుక్కలను పట్టుకుని చంపాడు. అనంతరం గాంధీజీ దగ్గరకు పరుగున వచ్చి, తన భయాన్ని, బాధను వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణ అహ్మదాబాద్‌లోని జీవ్ దయా సమితికి ఆగ్రహం తెప్పించింది. ఈ సందర్భంగా వారు గాంధీజీకి రాసిన లేఖలో ‘హిందూ మతంలో ఏదైనా ప్రాణిని చంపడాన్ని పాపంగా భావించినప్పుడు, పిచ్చి కుక్కలను చంపడం సరైనదని మీరు ఎలా అనుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. దీనికి గాంధీ ఇచ్చిన సమాధానాన్ని ‘యంగ్ ఇండియా’లో ప్రచురించారు. ‘మనలాంటి అసంపూర్ణులు, మందబుద్ధిగలవారికి కుక్కలను చంపడం తప్ప మరో మార్గం లేదు. కొన్నిసార్లు మనని హత్య చేసేందుకు ప్రయత్నించే వ్యక్తిని చంపడమనే అనివార్యమైన విధిని మనం ఎదుర్కొంటాం’ అని గాంధీ పేర్కొన్నారు. ఈ కథనంపై ఆగ్రహంతో పలువురి నుంచి గాంధీకి లేఖలు వెల్లువెత్తాయి. చాలామంది గాంధీని తిట్టడం మొదలుపెట్టారు. అయితే గాంధీ తన అభిప్రాయానికి కట్టుబడి ఉన్నారు. ‘యంగ్ ఇండియా’ రెండవ, మూడవ సంచికల్లోనూ గాంధీ తన అభిప్రాయాన్ని ఇదే రీతిలో తెలిపారు. కొందరు విమర్శకులు గాంధీ హద్దులు దాటిపోయారని ఆరోపించారు. ‘ఒకరి ప్రాణం తీయడం కూడా ఒక్కోసారి మన విధిగా మారుతుందని’ గాంధీ ‘యంగ్ ఇండియా’లో రాశారు. ఒక వ్యక్తి చేతిలో కత్తి పట్టుకుని పరుగెడుతూ, ఎదురుగా వచ్చిన వారిని చంపుతున్నాడనుకోండి. అప్పుడు అతన్ని సజీవంగా పట్టుకునే ధైర్యం ఎవరికీ లేనప్పుడు, ఆ పిచ్చివాడిని యమపురికి పంపించిన వ్యక్తి.. సమాజం అందించే కృతజ్ఞతకు పాత్రుడని గాంధీ పేర్కొన్నారు. కాగా ఈ కుక్కల వివాదం గాంధీని ఏడాదిపాటు చుట్టుముట్టింది. ఇది కూడా చదవండి: ఏ జంతువులు అంతరిక్షాన్ని చూశాయి? తాబేళ్లు, ఈగలు ఏం చేశాయి? -
ఇకపై కుక్కలకు కూడా ఆధార్ కార్డు
ముంబై: ముంబైలోని వీధి కుక్కలకు క్యూఆర్ కోడ్ ఉన్న ఆధార్ కార్డులు జారీ చేసింది ఓ స్వచ్చంద సంస్థ. ఇప్పటికే ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో 20 కుక్కలకు ఆధార్ కార్డులు కూడా జారీ చేసి వాటి మెడలో ట్యాగ్స్ వేశామని తెలిపింది సదరు సంస్థ. ఎందుకంటే.. మనుషులకు ఆధార్ కార్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని పనులు తేలికైపోయాయి. ఎక్కడ ఏ పని కావాలన్నా ఆధార్ కార్డు చూపిస్తే చాలు మొత్తం బయోడేటా కళ్ళముందు ప్రత్యక్షమవుతుంది. మనుషుల్లాగే కుక్కలకు కూడా ఒక గుర్తింపు ఉండాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు ముంబైకి చెందిన ఒక ఇంజినీరు. ఈ కార్డును స్కాన్ చేయగానే కుక్క వయసు, ఎక్కువగా సంచరించే ప్రాంతం, సంతానానికి సంబంధించిన వివారాలు, స్టెరిలైజేషన్ సమాచారం తోపాటు కాంటాక్ట్ చేయవలసిన ఫోన్ నెంబర్లు తదితర వివరాలన్నింటినీ తెలుసుకోవచ్చు. ముంబైకి చెందిన ఇంజనీర్ అక్షయ్ రిడ్లాన్ కుక్కలకు ఆధార్ కార్డులు జారీ చేయాలన్న ఈ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చాడు. అనుకుందే తడవు "pawfriend.in" అనే స్వచ్చంద సంస్థ సాయంతో వీధి కుక్కల్లో కొన్నిటికి ఆధార్ కార్డులను రూపొందించి వాటి మెడలో ట్యాగ్ కట్టారు. ఈ కార్డు మీద ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. క్యుఆర్ స్కానర్ ద్వారా ఆ కోడ్ ను స్కాన్ చేస్తే చాలు ఆ కుక్క వివరాలన్నీ వచ్చేస్తాయి. తద్వారా వీధి కుక్కలు ఎప్పుడైనా తప్పిపోతే దాన్ని తిరిగి సొంతగూటికి చేర్చడం చాలా సులభమవుతుందని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వారు ఎయిర్‌పోర్టు సమీపంలోని వీధి కుక్కలను వల వేసి పట్టుకుని వాటికి వ్యాక్సినేషన్ కూడా చేస్తున్నట్లు స్థానికుల్లో ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా ముంబైలోని అన్ని ప్రాంతాల కుక్కలకు ఈ తరహా కార్డులు జారీ చేయాలన్నది మా సంకల్పమని తెలిపింది ఆ సంస్థ. ఇది కూడా చదవండి: పెళ్ళిలో ఏనుగులు హల్ చల్.. బైక్ మీద పారిపోయిన కొత్త జంట.. -
వీధి కుక్కల్లో వ్యాధి కారక మొండి శిలీంద్రం.. మందులకు కూడా లొంగదు..
ఢిల్లీ: ఢిల్లీలో వీధి కుక్కల్లో అరుదైన వ్యాధి కారక మొండి శిలీంద్రాన్ని గుర్తించారు. మందులకు కూడా లొంగని కాండిడా అరిస్గా పిలిచే ఈ వ్యాధి కారకానికి వీధి కుక్కలు ఆవాసంగా ఉంటాయి. ఈ మేరకు ఢిల్లీ యూనివర్శిటీ, కెనడాకు చెందిన ఎంసీ మాస్టర్ విశ్వవిద్యాలయ నిపుణులు సంయుక్తంగా జరిపిన పరిశోధనలో తెలింది. ఈ శిలీంద్రంతో ఆస్పత్రుల్లో భారీగా వ్యాధి భారిన పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓ నిర్దారించిన దృష్టిసారించాల్సిన ఫంగస్‌లలో ఒకటి ఇది కావడం గమనార్హం. చర్మవ్యాధి సోకిన కుక్కల చెవులు, చర్మం నుంచి షాంపిల్స్ తీసుకుని పరీక్షలు నిర్వహించగా.. ఈ మేరకు హానికారక కాండిడా అరిస్ను గుర్తించినట్లు చెప్పారు. దీనికి పోలిన వేరియంట్లను కుక్కలు, మానవుల్లోనూ ఉన్నట్లు తెల్చిన శాస్త్రవేత్తలు.. దీని కారణంగా మనుషులు, జంతువుల్లో వీటి భారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. 'కుక్కలు పెంపుడు జంతువులు. కాండిడా అరిస్ కేవలం వీధి కుక్కల్లో మాత్రమే కనుగొన్నాం. ఇలాంటి కుక్కలు ప్రపంచంలో చాలా ప్రదేశాల్లో ఉండొచ్చు. జంతువుల నుంచి మనుషులకు కాండిడా అరిస్ వ్యాప్తి చెందడానికి ఇవి కారకాలుగా మారుతున్నాయి.' అని యూనివర్శిటీకి చెందిన జర్నల్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీధి కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇదీ చదవండి: CM Siddaramaiah: సిద్దరామయ్యకు జలుబు, దగ్గు.. సీఎం కార్యక్రమాలన్నీ రద్దు -
వెంటపడిన కుక్కలు.. ట్రాక్టర్ కిందపడి విద్యార్థి దుర్మరణం
కమలాపూర్: వీధి కుక్కలు వెంటపడటంతో తప్పించుకునే ప్రయత్నంలో ఓ బాలుడు ట్రాక్టర్ కిందపడి దుర్మరణం పాలైన విషాదకర ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మర్రిపల్లిగూడేనికి చెందిన ఇనుగాల జయపాల్–స్వప్న దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ధనుష్ (10) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతిలో చదువుతున్నాడు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ధనుష్ ఈ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో వీధి కుక్కలు వెంట పడ్డాయి. వాటినుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా అదే గ్రామంలోని రిక్కల నారాయణరెడ్డికి చెందిన ట్రాక్టర్‌ను డ్రైవర్ తోట విజయేందర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి బాలుడుని ఢీకొట్టాడు. ప్రమాదంలో ధనుష్ ట్రాక్టర్ కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే కమలాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలే తమ కుమారుడిని బలి తీసుకున్నాయని, ఈ ఉత్సవాలు లేకుంటే తమ కుమారుడు బతికేవాడని ధనుష్ తల్లిదండ్రులు విలపించారు. ధనుష్ తండ్రి జయపాల్ ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ యజమాని నారాయణరెడ్డి, డ్రైవర్ తోట విజయేందర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి: ఈటల హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విద్యార్థి ధనుష్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ధనుష్ కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి కమలాపూర్ ప్రభుత్వాస్పత్రికి చేరుకుని విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబీకులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
హైదరాబాద్‌లో రోజుకు ఇన్ని వీధి కుక్కలు చనిపోతున్నాయా?
సాక్షి, హైదరాబాద్: సిటీలోని యానిమల్ కేర్ సెంటర్లలో వీధి కుక్కల మృత్యువాత కలకలం రేపుతోంది. జీహెచ్ఎంసీ కుటుంబ నియంత్రణ వికటించి కుక్కలు మరణిస్తున్నాయి. వెటర్నరీ వైద్యులకు బదులు ఔట్సోర్సింగ్ కార్మికులతో సర్జరీలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజుల తరబడి ఆహారం పెట్టకపోవడంతో మరికొన్ని శునకాలు మృత్యువాత పడుతున్నాయి. గత వారం రోజులుగా ఎల్బీ నగర్ జోన్‌లోని నాగోల్ యానిమల్ కేర్‌లోనే రోజుకు 30కి పైగా కుక్కలు మరణిస్తున్నట్లు సమాచారం. నిర్వాకం బయటికి పొక్కకుండా వెటర్నరీ అధికారులు జాగ్రత్త పడుతున్నారు. బల్దియా వెటర్నరీ అధికారుల తీరుపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చదవండి: మ్యాట్రిమోనీలో పరిచయం.. యువతి నుంచి రూ.6 లక్షలు తీసుకొని -
రెండు సెకన్లకో దాడి.. అరగంటకో మరణం
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతి రెండు సెకన్లకు ఒక కుక్కకాటు నమోదవుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫలితంగా అరగంటకో మరణం సంభివిస్తున్నట్లు తేలింది. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), ఢిల్లీ ఎయిమ్స్ సంయుక్తంగా పరిశోధన నిర్వహించాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐజేఎంఆర్) ఈ అధ్యయన ఫలితాలను ప్రచురించింది. 100 కోట్లు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుక్కల సంఖ్య. 70 కోట్లు: వివిధ దేశాల్లో వీధికుక్కల సంఖ్య. ప్రపంచంలో వీధికుక్కలు లేని మొదటి దేశం నెదర్లాండ్స్ 2030: రేబిస్ మరణాలను పూర్తిగా నియంత్రించేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలు నిర్దేశించుకున్న గడువు. ఏటా సుమారు 20 వేల మంది మృతి ♦ ఐసీఎంఆర్–ఎయిమ్స్ అధ్యయనం ప్రకారం దేశంలో కుక్కకాట్లు, ఇతరత్రా జంతువుల కాటు కారణంగా సంభవించే రేబిస్‌తో ఏటా 18 వేల నుంచి 20 వేల మంది వరకు మృత్యువాతపడుతున్నారు. దేశంలో నమో దవుతున్న రేబిస్ మరణాల్లో 93% కుక్కకాటు ద్వారానే సంభవిస్తున్నా యి. అందులో 63% వీధికుక్కల ద్వారానే చోటుచేసుకుంటున్నాయి. పట్టణాల్లో 60%, గ్రామాల్లో 64% వీధికుక్కల ద్వారా రేబిస్ వ్యాప్తి చెందుతోంది. దేశంలో కోటిన్నర వీధికుక్కలు... ♦ భారత్‌లో 2 కోట్ల కుక్కలు ఉండగా అందులో వీధికుక్కల సంఖ్య 1.53 కోట్లుగా ఉంది. వీధికుక్కలు పెరగడానికి ప్రధాన కారణం... వ్యర్థాలను తీసుకెళ్లే పద్ధతి సక్రమంగా లేకపోవడమేనని ఐసీఎంఆర్ అధ్యయనం పేర్కొంది. అందువల్లే వ్యర్థాలు ఉన్న దగ్గర వీధికుక్కల సంతతి పెరుగుతోందని విశ్లేషించింది. ఆస్పత్రుల ప్రాంగణాల్లో తిష్ట... దేశంలో ఎన్నో ఆసుపత్రులు కుక్కలకు ఆవాస కేంద్రాలుగా ఉంటున్నాయి. రోగులు పడేసే ఆహార వ్యర్థాలను తింటూ అక్కడే తిష్ట వేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. తిండి దొరకనప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్వహణ సరిగ్గాలేని శవాగారాల్లోకి చొరబడి శవాలను సైతం పీక్కుతింటున్నాయి. 3 రకాల శునకాలు.. ♦ మనుషుల మీద ఆధారపడే దాన్ని బట్టి కుక్కలను ఇంట్లో పెంచుకొనేవి, సామాజిక అవసరాలకు ఉపయోగించేవి, వీధికుక్కలుగా విభజించారు. అయితే ప్రధానంగా వీధికుక్కలతోనే సమస్యలు వస్తున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కుక్కల సంతతి నియంత్రణకు సరైన ప్రణాళికలు రచించకపోవడం, జంతు హక్కుల కార్యకర్తల కార్యకలాపాల వల్ల కుక్కకాట్లు అధికమవుతున్నాయి. కుక్కల నియంత్రణ ఇలా... ♦ దేశవ్యాప్తంగా ఏకకాలంలో కుక్కలకు కుటుంబ నియంత్రణ కష్టసాధ్యమైనందున నోటి ద్వారా వేసే టీకాలను అభివృద్ధి చేసి కుక్కలకు ఆహారంలో కలిపి అందించాలి. దీనివల్ల వాటి జాతిని వీలైనంత మేర కట్టడి చేయవచ్చు. ♦ వీధికుక్కల కట్టడికి మున్సిపాలిటీ, వెటర్నరీ, ఎన్జీవోలు, కుక్కల సంరక్షణ కేంద్రాలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలి. ♦ వీధికుక్కల వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలను చైతన్యపరచాలి. -
కుక్కల స్వైర విహారం.. 21 మందికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: ఇంద్రవెల్లి మండల కేంద్రంలో శనివారం ఏఎస్సై లక్ష్మణ్‌తోపాటు సుమారు 20 మందిని పిచ్చికుక్కలు కరిచి గాయపరిచాయి. మండలకేంద్రానికి చెందిన గాయక్వాడ్ నిర్గుణ, గౌతమి, లక్ష్మి, విక్రమ్, రాంజన్‌షేక్‌తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన హాథ్ సే హాథ్ జోడోయాత్రలో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి మండలకేంద్రానికి వచ్చిన వీరారెడ్డి, వినోద్, రామేశ్వర్, పరశురాంతోపాటు 20 మందిపైగా పిచ్చి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి కి తరలించి వైద్యం అందించారు. పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
‘సాక్షి’ వరుస కథనాలతో కదలిక.. జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కుక్కల బెడదపై సాక్షి వరుస కథనాలతో జీహెచ్ఎంసీ కదిలింది. మేయర్ అధ్యక్షతన అన్ని పార్టీల కార్పొరేటర్లు, అధికారులతో హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీని కోసం మూడు రోజుల క్రితమే ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన హై లెవెల్ కమిటీలో బీఆర్ఎస్ నుంచి రహమత్ నగర్ కార్పొరేటర్ సీ.ఎన్.రెడ్డి, చిలుకానగర్ కార్పొరేటర్ శ్రీమతి బన్నాల గీతా ప్రవీణ్, బీజేపీ నుంచి బాగ్ అంబర్ పేట్ కార్పొరేటర్ పద్మ వెంకట్‌రెడ్డి, మల్కాజ్ గిరి కార్పొరేటర్ వీ శ్రావణ్, కాంగ్రెస్ నుంచి లింగోజిగూడ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ ఎం రజిత, ఎంఐఎం నుండి పత్తర్ గట్టి కార్పొరేటర్ సయ్యద్ సోహెల్ ఖాద్రీ, రియాసత్ నగర్ కార్పొరేటర్ మిర్జా ముస్తఫా బేగ్‌లు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి కో-ఆర్డినేట్ ఆఫీసర్‌గా డాక్టర్ జేడీ విల్సన్ (డిప్యూటీ డైరెక్టర్ వెటర్నరి) వ్యవహరించనున్నారు. ఈ హై లెవల్ కమిటీ జీహెచ్ఎంసీ పరిధిలోని యానిమల్ కేర్ సెంటర్లను పరిశీలించి అవసరమైన అభివృద్ధికి సూచనలు, సలహాలతో నివేదిక అందజేయనుంది. చదవండి: సడన్ హార్ట్ ఎటాక్.. కాలేజీలోనే కుప్పకూలిన ఇంజనీరింగ్ విద్యార్థి.. -
షాకింగ్.. తల్లితో నిద్రిస్తున్న పసికందును ఈడ్చుకెళ్లిన వీధి కుక్క..
జైపూర్: హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటన మరువకముందే అలాంటి దారుణం మరొకటి వెలుగుచూసింది. రాజస్థాన్ సిరోహి జిల్లాలోని ఓ ఆస్పత్రిలో అమ్మపక్కన నిద్రిస్తున్న నెల రోజుల పసికందును వీధికుక్క ఈడ్చుకెళ్లింది. అనంతరం అతనిపై దాడి చేసింది. దీంతో తీవ్రగాయాలపాలై శిశువు చనిపోయాడు. హాస్పిటల్ వార్డు బయట మృతదేహం లభించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ రికార్డులను పరిశీలించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వత రెండు వీధి కుక్కలు ఆస్పత్రిలోని టీబీ వార్డులోకి ప్రవేశించాయి. అనంతరం వీటిలో ఓ శునకం పసికందును బయటకు ఈడ్చుకెళ్లినట్లు అందులో రికార్డయింది. ఈ శిశువు తండ్రి టీబీ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అతనితో పాటు భార్య, పిల్లలు కూడా ఇదే వార్డులో ఉన్నారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత అందరూ నిద్రపోయారు. అదే సమయంలో వీధికుక్క వార్డులోకి వచ్చి చిన్నారిని ఎత్తుకెళ్లింది. ఈ సమయంలో వార్డు సెక్యూరిటీ గార్డు కూడా అక్కడ లేరని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, శిశువు మృతదేహానికి పోస్టుమార్టం కూడా నిర్వహించామని పేర్కొన్నారు. మరోవైపు ఆస్పత్రి నిర్వాహకులు కూడా ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. రోగితో పాటు ఉన్న కుటంబసభ్యులు అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని, ఆ సమయంలో వార్డు గార్డు వేరే వార్డుకు వెళ్లాడని పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కాగా.. ఇటీవల హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో వీధికుక్కల దాడిలో ప్రదీప్ అనే బాలుడు మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో కక్కుల బెడద నివారణకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. చదవండి: ముంబైలోకి ప్రవేశించిన 'డేంజర్ మ్యాన్'.. చైనా, పాకిస్తాన్, హాంకాంగ్‌లో శిక్షణ.. పోలీసుల హై అలర్ట్.. -
ప్రజల విమర్శలతో కుక్కల బెడద నివారణకు చర్యలు..
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పుడైనా సరే.. ప్రజల ప్రాణాలు పోయాక సదరు ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామనే జీహెచ్ఎంసీ.. కుక్కకాట్ల విషయంలోనూ అలాగే సిద్ధమైంది. ప్రజలకు కుక్కకాట్ల బెడద తగ్గించేందుకు ప్రభుత్వం ఆదేశించిన కార్యక్రమాల అమలుకు సిద్ధమైంది. యాక్షన్ స్టార్ట్ చేయడంతో పాటు పబ్లిసిటీపైనా శ్రద్ధ చూపుతోంది. కుక్కలు మనుషుల జోలికి రాకుండా ఉండేందుకు ఎలా వ్యవహరించాలి? అనే అంశంపై పాఠశాలల్లోని విద్యార్థులకు వివరించడంతో పాటు కుక్కల విషయంలో చేయాల్సినవి, చేయకూడనివి (డూస్ అండ్ డోంట్స్) పనులను వివరిస్తూ పాఠశాలల్లో పోస్టర్లును ప్రదర్శిస్తోంది. కరపత్రాల పంపిణీ ప్రారంభించింది. వీటితోపాటు కుక్కల సంతతి నిరోధానికి ఆపరేషన్లు, రేబిస్ సోకకుండా వ్యాక్సిన్లు వేసే చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. ప్రతియేటా కుక్కల గణన వీటితోపాటు ప్రతియేటా కుక్కల గణన చేపట్టాలని నిర్ణయించింది. వీధికుక్కలకు సంబంధించిన ఫిర్యాదులందగానే తక్షణ చర్యలు చేపట్టాలని, కుక్కల సంరక్షణ కేంద్రాలకు తరలించే కుక్కలకు వ్యాధులుంటే చికిత్సలు చేయడంతోపాటు ఆహార సమస్యలు తలెత్తకుండా చూడాలని నిర్ణయించింది.విద్యార్థులతో పాటు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్వయం సహాయక సంఘాలు, స్లమ్ ఫెడరేషన్ సభ్యులకు సైతం కుక్కలకు సంబంధించి తగిన అవగాహన కలి్పంచ నున్నారు. కుక్కలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. మాంసం, ఇతరత్రా ఆహార వ్యర్థాలు బహిరంగ ప్రదేశాల్లో వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మూసీ ప్రాంతాల్లో నూరుశాతం వీధికుక్కలను పట్టుకునేందుకు స్పెషల్‌డ్రైవ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. కుక్క కాటు నివారణకు స్వచ్ఛంద సంస్థలు , జంతు ప్రేమికులు, ప్రజాప్రతినిధులు తగిన సహకారం అందించాల్సిందిగా కోరింది. సామర్థ్యం లేని బల్దియా.. వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నా.. వాటిని పరిష్కరించేందుకు తగిన యంత్రాంగం బల్దియాలో లేదు. వచి్చన ఫిర్యాదులకు అనుగుణంగా వీధి కుక్కలను పట్టుకునేందుకు తగిన వాహనాలు, నిపుణులైన సిబ్బంది గానీ లేరు. ఫిర్యాదుల్లో ఒకే ప్రాంతం సమస్యను ఎక్కువ సార్లు ఫోన్ చేసి చెప్పడంతో అధిక సంఖ్యలో ఫిర్యాదులు కనిపిస్తున్నాయని జీహెచ్ఎంసీ చెబుతోంది. ఫిర్యాదుల వరద.. అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడు కుక్కలదాడిలో మృతి చెందడంతో నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో, టీవీల్లో దాడి దృశ్యాలు చూసిన వారు బయటకు వెళ్లే తమ పిల్లల గురించి ఆందోళన చెందుతున్నారు. జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్‌కు నాలుగు రోజులుగా నిత్యం రెండు వేలకు పైగా ఫిర్యాదులు అందాయి. నాలుగు రోజుల్లో పదివేలకు పైగా ఫిర్యాదు వచ్చాయి. వివరాలిలా ఉన్నాయి. జీహెచ్ఎంసీ ముద్రించిన పోస్టర్లలో దిగువ అంశాలు పేర్కొన్నారు చేయాల్సినవి.. ♦ కుక్క మీ దగ్గరకు వస్తుంటే.. కదలకుండా అక్కడే నిలబడాలి. ♦ వీధి కుక్కలకు దూరంగా ఉండాలి. ♦ నిశ్శబ్దంగా ఉండాలి. ♦ పిల్లలతో ఉన్న కుక్కల దగ్గరకు వెళ్లొద్దు. ♦ కుక్కలతో స్నేహపూర్వకంగా ఉండాలి.. కానీ వాటిని ముట్టుకోవద్దు. ♦ కుక్కల గుంపు కనిపిస్తే వాటికి దూరంగా ఉండాలి. చేయకూడనివి.. ♦ కుక్కలు అరుస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు వాటికి భంగం కలిగించొద్దు. ♦ వీధికుక్కలపై రాళ్లు విసరడం వంటివి చేయొద్దు. ♦ తల్లి, పిల్లలు ఉన్నప్పుడు కుక్కల వద్దకు వెళ్లొద్దు. ♦ కుక్కల వెంటపడి తరమడం చేయవద్దు. ♦ కుక్కల తోక, చెవులు లాగడం వంటి పనులు చేయవద్దు. ♦ రోడ్లపై మాంసాహారం వేయవద్దు. ► ఎప్పుడైనా కుక్క కరిస్తే కరిచిన ప్రాంతంలో సబ్బుతో శుభ్రం చేసి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ► జీహెచ్ఎంసీని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 040 21111111 చదవండి: స్నేహితుడిని కత్తితో పొడిచి.. తల, గుండె వేరు చేసి.. -
వీధి కుక్కలన్నింటికీ ‘స్టెరిలైజేషన్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో వీధికుక్కల నియంత్రణ కోసం పకడ్బందీ కార్యాచరణ చేపట్టాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రాణం కోల్పోయిన ఘటన కలకలం రేపడం, దీనితోపాటు రాష్ట్రవ్యాప్తంగా కుక్కకాటు ఘటనలు జరుగుతుండటంతో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన ఆదేశాల మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్రవ్యాప్తంగా 129 మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ సహా 13 కార్పొరేషన్లలో చేపట్టాల్సిన చర్యలపై యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది. ఈ కార్యాచరణకు తగినట్టుగా చర్యలు చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని పురపాలికల కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. మార్గదర్శకాలు ఇవీ.. ► అన్ని పట్టణాలు, నగరాల్లో 100 శాతం వీధి కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు (స్టెరిలైజేషన్) చేయాలి. ► వీధికుక్కలకు సంబంధించిన ఫిర్యాదులకు అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా స్పందించాలి. ► కుక్కలను పట్టుకునే బృందాలను, వాహనాల సంఖ్యను పెంచాలి. ► వీధికుక్కలు అధికంగా ఉన్న ప్రాంతాలు, కుక్కకాటు ఘటనలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి స్థానిక కాలనీలు, బస్తీ సంఘాల సహకారంతో చర్యలు చేపట్టాలి. ► మాంసాహార దుకాణాలు, ఫంక్షన్‌హాల్స్, హాస్టళ్లు ఉన్న చోట మాంసపు వ్యర్థాలను, మిగిలిన ఆహారాన్ని వీధికుక్కలు తిరిగే చోట్ల పడేయకుండా చర్యలు చేపట్టాలి. ► వీధికుక్కల నియంత్రణకు స్వయం సహాయక బృందాలు, పారిశుధ్య సిబ్బంది, మెప్మా సిబ్బంది సేవలను వినియోగించుకోవాలి. ► వీధికుక్కల విషయంలో ఎలా ప్రవర్తించాలనే దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. దీనిపై ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కరపత్రాలను పంపిణీ చేయాలి. ► అన్ని పట్టణాలు, నగరాల్లో ప్రజలను చైతన్యపరచాలి. ► వేసవి కాలంలో వీధికుక్కల ఆగడాలను తగ్గించేందుకు తగిన సంఖ్యలో నీటి తొట్లను ఏర్పాటు చేయాలి. -
GHMC నిర్లక్ష్యంతో పసి బాలుడు చనిపోయాడు: హైకోర్టు
-
వీధి కుక్కల దాడి ఘటనపై స్పందించిన యాంకర్ రష్మీ
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కుల దాడిలో మరణించిన చిన్నారి ఘటన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆదివారం అంబర్ పేట్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనలో అయిదేళ్ల బాలుడు ప్రదీప్ ప్రాణాలు కొల్పోవడం విషాదకరం. ఈ ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది. అంతేకాదు రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఇది అత్యంత బాధాకరమన్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా యాంకర్ రష్మీ గౌతమ్ కూడా ఈ వీధి కుక్కల దాడిపై స్పందించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. చదవండి: నటుడు ప్రభుకి తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక ‘అవును.. తన తప్పు లేకుండానే వీధి కుక్కల దాడిలో ఆ చిన్నారి చనిపోయాడు. ఇది అత్యంత బాధాకర విషయం. కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుక్కల బర్త్ కంట్రోల్‌కు వ్యాక్సినేషన్‌ను తప్పనిసరిగా అమలు చేయాలి. దానితో పాటు వాటికి సపరేటుగా వసతి కల్పించాలి. ఎందుకంటే అవి కూడా మనలాగే ప్రాణులు’ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చింది. అయితే రష్మీ జంతు ప్రేమికురాలనే విషయం తెలిసిందే. జంతువులపై ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగిన వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలనుషేర్ చేస్తూ తన ఆవేదనను వ్యక్తం చేస్తుంటుంది. ఇక లాక్డౌన్లో ఆమె వీధి కుక్కలకు ఆహారం పెట్టి మంచి మనసు చాటుకుంది. చదవండి: సినిమాలపై ఆసక్తి లేదు.. కానీ విధే ఇక్కడ నిలబెట్టింది: హీరోయిన్ సంయుక్త Unfortunately yes the little boy did die for no fault of his and a long term solution of birth control,vaccination and shelter shud be implemented Animals are territorial just like us they need there own space https://t.co/GTZ1UhRlCN — rashmi gautam (@rashmigautam27) February 21, 2023 -
కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై విచారణకు ఆదేశం
-
భాగ్యనగరంలో భయపెడుతున్న కుక్కలు
-
వీధి కుక్కల వీరంగం.. బయటకు వెళ్లాలంటే వణికిపోతున్న జనాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఇటీవల కాలంలో కుక్కుకాటు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో కుక్కలు చెలరేగిపోతున్నాయి. చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా వారిపై విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. రోడ్డు మీద వెళ్లే వారిని భయంకరంగా కరుస్తున్నాయి. కుక్కల దాడిలో పలువురు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. తరచుగా కుక్కలు దాడి చేస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే వణికిపోతున్నారు. ముఖ్యంగా పిల్లల్ని ఆడుకోడానికి పంపించాలన్నా వెనకడుగు వేస్తున్నారు. భాగ్యనగరంలో భయపెడుతున్న వీధికుక్కలు తాజాగా అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. తండ్రితో కలిసి సరాదాగా బయటకు వెళ్లిన ప్రదీప్ అనే చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. కుక్కలను చూసి భయపడిన పరుగెత్తిన బాలుడిని వెంటపడీ మరి ఒళ్లంతా తీవ్రంగా గాయపరిచాయి. ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. అంతకుముందు నగరంలోని పలుచోట్లు ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. చిన్నారులపై వీధికుక్కలు మూకుమ్మడి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. 2016 ఫిబ్రవరి 12న కుషాయిగూడలో ఎనిమిదేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాలైన బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. 2020 ఆగష్టు 25న లంగర్‌హౌజ్‌లో నలుగురు చిన్నారులను కుక్కలు విచక్షణరహితంగా కరిచాయి. 2021 జనవరి 30న పాతబస్తీ బహదూర్‌పురాలో బాలుడిపై దాడిచేసిన శనకాలు అతడు ప్రాణాలు విడిచే వరకు వదిలిపెట్టలేదు. 2022 డిసెంబర్ 12న ఫిర్జాదిగూడలో కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే వీధి కుక్కల దాడి ఘటనలు పెరిగిపోతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కుక్కల బెడదను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవని మండిపడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల కాకి లెక్కలు! గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో ఒక కోటి 30 లక్షల మంది జనాభా ఉండగా.. మొత్తం కుక్కలు 13 లక్షలు ఉన్నాయి. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశామని లెక్కల్లో చూపుతూ 50 కోట్ల రూపాయలను జీహెచ్ఎంసీ , శివారు మున్సిపాల్టీల అధికారులు మింగేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఒక్కో శునకం కుటుంబ నియంత్రణ కోసం రూ. 1,500 ఖర్చు చేసినట్లు అధికారులు లెక్కలో చూపుతున్నారు. ప్రతి రోజు 200 కుక్కలకు ఆపరేషన్ చేస్తున్నామంటున్నారు. అయితే కాకి లెక్కలు చెబుతూ అధికారులు డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తున్నాయి. మరోవైపు అధికారుల లెక్కలు మాత్రం ఇందుకు విరుద్దంగా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 4 లక్షల 61 వేల కుక్కలు ఉన్నాయని, వాటిలో 75 శాతం కుక్కలు అంటే 3 లక్షల 20 వేల కుక్కలకు స్టేరలైజేషన్ పూర్తి చేశామని బల్దియా వెటర్నరీ అధికారులు చెబుతున్నారు. బల్దియాతో పాటు 5 ప్రైవేట్ ఏజన్సీలతో కుక్కల ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. ఒక్కో కుక్కకు రూ. 1, 500 ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 5 యానిమల్ కేర్ సెంటర్లు ఉన్నాయని ప్రతి రోజు 200 కుక్కలకు ఆపరేషన్ చేస్తున్నామని తెలిపారు. కంప్లయింట్ వచ్చిన చోటుకు వెళ్లి కుక్కను తీసుకువచ్చి ఆపరేషన్ చేస్తున్నామని చెబుతున్నారు. -
వీధి కుక్క పిల్లలపై అమానుషం.. మంటల్లో కాల్చి చంపిన వ్యక్తి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: వీధి కుక్కలను మంటల్లో కాల్చి చంపిన వ్యక్తిపై కూకట్పల్లి పోలీల్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్న రవీంద్ర అనే వ్యక్తి రోజు మాదిరిగానే సోమవారం రాత్రి వీధి కుక్కలకు అన్నం పెట్టేందుకు తన ఇంటి నుంచి కారులో బయల్దేరి ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. అన్నం పెట్టేందుకు వీధి కుక్కలను పిలవగా ఎంతకీ కనిపించలేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కుక్కల గురించి ఆరా తీయగా అదే ప్రాంతంలోని మ్యాన్‌హోల్ నుంచి పొగలు రావడంతో దగ్గరికి వెళ్లి చూడగా మూడు కుక్క పిల్లలు మంటల్లో కాలిపోయి ఉండటాన్ని గమనించాడు. కుక్క పిల్లల చావుకు ఎవరు కారణమై ఉంటారని ఆరా తీయగా బాలాజీనగర్‌కు చెందిన సునీల్‌గా గుర్తించారు. సునీల్‌పై చర్యలు తీసుకోవాలని రవీంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: చతికిల‘బడి’.. కూలిపోయే పైకప్పులు.. వేలాడే విద్యుత్ తీగలు!