
మృతిచెందిన అంపిల్లి రాముడమ్మ, (ఇన్‌సెట్)లో ఫైల్ ఫోటో
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వృద్దురాలిని వీధికుక్కలు సజీవంగా పీక్కుతిన్న ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని వంగర మండలం శ్రీహరిపురం గ్రామంలో జరిగింది. వివరాల మేరకు.. శ్రీహరిపురానికి చెందిన అంపిల్లి రాముడమ్మ(65) అనే వృద్దురాలు రాత్రి ఇంటి గడపలో నిద్రించింది.
అదే సమయానికి అటువైపు వచ్చిన వీధికుక్కల గుంపు ఇంటి గడపలో నిద్రిస్తున్న రాముడమ్మను బయటకు ఈడ్చుకుపోయాయి. అనంతరం విచక్షణా రహితంగా ఆమెపై దాడి చేసి పీక్కుతిన్నాయి. తీవ్రగాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment