ముద్దాడ సంతోష్, వెలమల ఎర్రమ్మ,నిందితుడు రామారావు (ఫైల్)
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని సారవకోట కోదడ్డపనసలో జంట హత్యల కేసు నిందితుడు ముద్దాడ రామారావు ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో వెలమల ఎర్రమ్మ అనే మహిళ, ముద్దాడ సంతోష్‌లను మంగళవారం కత్తితో నరికి చంపిన విషయం తెలిసిందే. హత్యా స్థలం నుంచి పరారైన రామారావు.. గ్రామ సమీపంలో అదే కత్తితో గొంతు కోసుకొని పాల్పడ్డాడు. విగతజీవిగా పడిఉన్న రామారావును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
కాగా వరుసకు వదినయ్యే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న రామారావు.. ఆ మహిళ మరో యువకుడితో సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఆమెతోపాటు యువకుణ్ణి కూడా దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం కోదడ్డపనస గ్రామ సమీపంలో ఉన్న వంశధార ఎడమ కాలువలో స్నానం చేస్తున్న సంతోష్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం అదే కత్తి తీసుకుని సమీపంలోని పొలంలో పనిచేస్తున్న ఎర్రమ్మపైనా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్త: యువకుడితో వివాహేతర సంబంధం.. మరొకరితో చనువుగా ఉంటోందని..
Comments
Please login to add a commentAdd a comment