extramarital affair
-
నల్గొండ డీఈవో లీలలు.. భార్య ఉండగానే మరో మహిళతో..
సాక్షి, నల్గొండ జిల్లా: నల్గొండ డీఈవో భిక్షపతి లీలలు వెలుగులోకి వచ్చాయి. భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆ మహిళ ద్వారా ముగ్గురు పిల్లలకు భిక్షపతి తండ్రి అయినట్లు మొదటి భార్య ఆరోపిస్తోంది. ప్రియురాలితో ఉండగా డీఈవో భిక్షపతిని భార్య రెడ్ హ్యాండెడ్ పట్టుకుంది. పెళ్లైన నెలకే వదిలేశాడంటూ డీఈవో ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. గతంతోనూ డీఈవోపై అనేక ఆరోపణలు రాగా, గత కొన్నేళ్లుగా నల్లగొండ డీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. తనను మోసం చేసి వేరే కాపురం పెట్టాడంటూ డీఈవో భిక్షపతి భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకో మహిళతో ఉంటూ తనకు విడాకుల నోటీసులు పంపించారని.. ఈ వ్యవహారం ఏంటని ప్రశ్నిస్తే చంపుతానంటూ బెదిస్తున్నారని ఆమె తెలిపారు. -
చికెన్ బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తను హత్య చేసిన భార్య
మడకశిర: నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన గుర్తు తెలియని శవం కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మడకశిర రూరల్ సీఐ రాజ్‌కుమార్ వివరాలను తెలియజేశారు. 2023 జనవరి 12న మడకశిర మండలం కోడిగానిపల్లి సమీపంలోని హంద్రీనీవా కాలువకు ఏర్పాటు చేసిన బ్రిడ్జి కింద గుర్తు తెలియని శవాన్ని గుర్తించారు. వీఆర్ఓ హారతి స్థానిక పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.మిస్సింగ్ కేసుల ఆధారంగా ..మడకశిర పోలీసులు వివిధ ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసుల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి మడకశిర సీఐ సురేష్‌బాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆయన బదిలీపై వెళ్లిపోవడంతో ప్రస్తుత మడకశిర రూరల్ సీఐ రాజ్‌కుమార్, గుడిబండ ఎస్ఐ మునిప్రతాప్ కేసు దర్యాప్తు కొనసాగించారు. ఇందులో భాగంగా కర్ణాటకలోని తుమకూరు జయనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఓ మిస్సింగ్ కేసు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. తుమకూరుకు చెందిన నాగరత్నమ్మ అనే మహిళ తన పెద్ద కుమారుడు మోహన్‌కుమార్ (52) తప్పిపోయినట్లు 2023 జనవరి 21న జయనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వివరాలను మడకశిర పోలీసులు సేకరించారు. ఆ తర్వాత శవం ఫొటోను నాగరత్నమ్మకు చూపించగా మృతుడు తన పెద్ద కుమారుడేనని గుర్తు పట్టింది. మృతుడి సోదరులైన అరుణ్‌కుమార్, కిరణ్‌కుమార్‌లను కూడా మడకశిర పోలీసులు విచారించారు. తప్పిపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు.విచారణలో పోలీసులకు దొరికిన క్లూమృతుడి తల్లి, సోదరుల విచారణలో ఈ కేసుకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడికి, అతని భార్య కవితకు మనస్పర్థలు ఉన్నాయి. దీంతో మృతుడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయి తుమకూరులోనే శిరా గేట్లో వేరుగా తన కుమారుడు కౌశిక్, కుమార్తె దీక్షితతో కలిసి ఉంటోందని వారు పోలీసులకు వివరాలు అందించారు. ఈవివరాల మేరకు మడకశిర పోలీసులు మృతుడి భార్య కవితను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు.భార్య విచారణతో వీడిన మిస్టరీమృతుడి భార్య కవితను పోలీసులు విచారణ చేయడంతో మోహన్‌కుమార్‌ను హత్య చేసినట్లు తేలింది. కవితకు తుమకూరు జిల్లా గుబ్బిలో పనిచేసే విద్యుత్‌శాఖ జేఈగా పని చేసే అక్తర్‌పాషాతో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అతనితో సహ జీవనం కూడా చేసేది. అక్తర్‌పాషాతో కవిత డబ్బులు ఇప్పించుకుని తుమకూరులోనే ఓ హోటల్ పెట్టింది. ఈ క్రమంలో మృతుడు మోహన్‌కుమార్ పలుసార్లు హోటల్ వద్దకు వెళ్లి భార్య కవిత, ప్రియుడు అక్తర్‌పాషా, హోటల్లో పని చేసే వంట మనిషి మోహన్‌ప్రసాద్, కుమారుడు కౌశిక్‌ను దూషించేవాడు. తన ఆస్తిని మీకు ఇవ్వనని, తన సోదరులకు ఇస్తానని భార్య, కుమారుడితో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో భార్య కవిత, కుమారుడు కౌశిక్, ప్రియుడు అక్తర్‌పాషాలు మోహన్‌కుమార్‌ను చంపడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనికి హోటల్ వంట మనిషి మోహన్‌ప్రసాద్‌తో సుపారీ మాట్లాడారు. రూ.లక్షకు ఒప్పందం చేసుకొని రూ.50 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చారు.చికెన్ బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి హత్యపథకం ప్రకారం కుమార్తె దీక్షతకు ఆరోగ్యం బాగా లేదని మోహన్‌కుమార్‌ను భార్య కవిత 2023 జనవరి 11న రాత్రి 9 గంటల సమయంలో ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది. చికెన్ బిర్యానీలో నిద్రమాత్రలు వేసి మోహన్‌కుమార్‌కు పెట్టారు. భోజనం చేసిన తర్వాత మృతుడు మత్తులోకి పోయాడు. ఈక్రమంలో భార్య కవిత, కుమారుడు కౌశిక్, వంట మనిషి మోహన్‌ప్రసాద్... మోహన్‌కుమార్ తలపై రోకలిబండతో కొట్టారు. మృతుడి భార్య ప్రియుడు అక్తర్‌పాషా కత్తితో గొంతుకోశారు. మోహన్‌కుమార్ మృతి చెందగా శవాన్ని ఓ ప్లాస్టిక్ సంచిలో కట్టి వంట మనిషి ఓ కారులో వేసుకుని మడకశిర మండలంలోని కోడిగానిపల్లి హంద్రీనీవా కాలువ బ్రిడ్జి కింది భాగాన పడేసి వెళ్లారు.నలుగురు నిందితుల అరెస్ట్పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మడకశిర రూరల్ సీఐ రాజ్‌కుమార్, గుడిబండ ఎస్ఐ మునిప్రతాప్ సిబ్బంది ఆదివారం నిందితులను తుమకూరులో అరెస్ట్ చేశారు. శవాన్ని తరలించడానికి ఉపయోగించిన కారు, మరణాయుధాలు కూడా సీజ్ చేశారు. నిందితులైన కవిత, అక్తర్‌పాషా, కౌశిక్, మోహన్‌ప్రసాద్‌లను కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ రాజ్‌కుమార్, ఎస్ఐ మునిప్రతాప్ తదితర పోలీసులను ఎస్పీ రత్న అభినందించినట్లు పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. -
దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం
శ్రీనివాసపురం: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన సోమవారం రాత్రి తాలూకాలోని పాళ్య గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీరామరెడ్డి భార్య రూప (38) హత్యకు గురైంది. పాళ్య గ్రామానికి చెందిన శ్రీరామరెడ్డి భార్య రూప సోమవారం మధ్యాహ్నం పశువులు మేపడానికి ఇంటి నుంటి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ సమయంలో సంబందీకులకు గ్రామ సమీపంలోని చురువునహళ్లి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న కాలువ వద్ద రూప రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శ్రీనివాసపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపారు. హత్య జరిగిన రోజునే నిందితుడిని అరెస్టు చేశారు. ఇదే గ్రామానికి చెందిన ఆనందప్ప నాయక్‌ను హంతకుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆనందప్ప నాయక్‌కు హతురాలు రూపతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. హతురాలు రూప, ఆనందప్ప నాయక్‌ల మధ్య ఈ మధ్య వైషమ్యాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆనందప్ప నాయక్ రూపను గొంతుకోసి హత్య చేసినట్టు తెలిసింది. హత్యపై స్పందించిన భర్త శ్రీరామరెడ్డి తాను సాయంత్రం భార్య రూపకు ఫోన్ చేసిన సమయంలో మొబైల్ స్విఛాఫ్ వచ్చింది. తన భార్య రూప ఆనందప్ప నాయక్‌ల మధ్య డబ్బు లావాదేవీలు ఉండేవని హత్య ఎందుకు జరిగిందనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉందన్నారు. కోలారు ఎస్పీ బి నిఖిల్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. డీఎస్పీ నందకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని రచించి విచారణ చేస్తున్నారు. శ్రీనివాసపురం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
భార్య మీద అనుమానంతో దుబాయ్ నుంచి వచ్చి...
కరీంనగర్ (మల్లాపూర్): అనుమానం పెనుభూతమై భార్యను గొంతు నొక్కి అతికిరాతకంగా చంపేశాడోభర్త. ఈ దారుణం మండలంలోని వెంకట్రావ్‌పేటలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వేంపల్లి గ్రామానికి చెందిన వెల్మల రమేశ్‌కు రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన సునీతతో 2015లో వివాహం జరిపించారు. వీరికి కూతురు ఆద్య (8), కుమారుడు జయసూర్య(6) సంతానం. కొంతకాలంగా వెంకట్రావ్‌పేటలో ఉంటున్నారు. రమేశ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి వస్తున్నాడు. నెలక్రితం దుబాయ్ నుంచి వచ్చిన రమేశ్‌కు సునీత వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం కలిగింది. ఇదే విషయమై బుధవారం ఉదయం భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో రమేశ్ క్షణికావేశంలో సునీత ముఖంపై బలంగా కొట్టాడు. గొంతు నులిమి హతమార్చి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న సునీత కుటుంబసభ్యులు ఘటనాస్థలికి వెళ్లి బోరున విలపించారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఎస్సై కిరణ్‌కుమార్ విచారణ చేపట్టారు. మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వర్రావు, కోరుట్ల సీఐ సురేష్‌బాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలు తండ్రి మందల గంగరాజం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అమేథీ హత్యలు.. ఆమె వివాహేతర సంబంధమే కొంప ముంచింది!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అమేథీలో కుటుంబమంతా తుపాకీ కాల్పుల్లో మరణించడం తీవ్ర కలకలం రేపింది. ఒకే కుటుంబంలో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలను ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. మృతులను టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సునీల్ కుమార్, ఆయన భార్య పూనమ్ భారతి, ఆరేళ్లు-ఏడాది వయసున్న ఇద్దరు కూతుర్లుగా గుర్తించారు. ఈ ఘటన గురువారం వెలుగుచూడగా.. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు నిందితుడు చందన్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడి విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.నిందితుడు విచారణలో చేసిన నేరాన్ని అంగీకరించినట్లు అమేథీ ఎస్పీ అనూప్ సింగ్ వెల్లడించారు. ఈ హత్యల వెనక వివాహేతర సంబంధమే కారణమని తేలిందన్నారు. నిందితుడికి, మహిళకు గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు తెలిపారు. ఒకటిన్నర సంవత్సరంగా పూనమ్‌తో అక్రమంగా సంబంధం కలిగి ఉన్నాడని అయితే ఇటీవల ఇద్దరి మధ్య రిలేషన్షిప్ దెబ్బతినడంతో అతడు ఒత్తిడికి గురైనట్లు తెలిపారు. ఆ కారణంగానే ఆవేశంలో.. ఇంట్లోకి చొరబడి నలుగురిని కాల్చిచంపినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. అతడు ఒక్కడే ఈ ఘోరాలకు పాల్పడ్డాడని, ఘటనాస్థలంలో లభించిన బుల్లెట్లన్నీ ఒకే పిస్టల్ నుంచి రావడం వల్లే తాము ఆ అంచనాకు వచ్చినట్లు తెలిపారు. కాగా సునీల్ కుమార్, అతని భార్య పూనమ్, వారి ఇద్దరు కుమార్తెలు గురువారం అమేథీలోని భవానీ నగర్‌లోని వారి ఇంటిలో కాల్పుల్లో హత్యకు గురయ్యారు. నిందితుడు చందన్ వర్మ తుపాకీతో 10 రౌండ్ల కాల్పులు జరిపాడు. కుటుంబంలోని అందరినీ చంపిన తర్వాత తనను తాను కాల్చుకోవాలని ప్రయత్నించాడు. కానీ బుల్లెట్ మిస్ అయింది. మళ్లీ కాల్చుకునే ధైర్యం చేయలేక అక్కడి నుంచి పారిపోయాడు. ఇక తీవ్రగాయాలైన బాధితులను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.ఈ ఘటన జరిగిన మరుసటి రోజు ఢిల్లీకి పారిపోతున్న నిందితుడిని నోయిడాలోని టోల్ ప్లాజా వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ పోలీస్ అధికారి తుపాకీని లాక్కొని తప్పించుకునే ప్రయత్నంలో అతను కాల్పుల్లో గాయపడ్డాడు. తాజాగా ఆ ఘటన సమయంలో వాడిన ద్విచక్ర వాహనం, పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు.అయితే ఈ హత్యల నేపథ్యంలో కొన్ని నెలల క్రితం పూనమ్ పెట్టిన పోలీసు కేసు విషయం వెలుగులోకి వచ్చింది. వర్మ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆమె అందులో ఫిర్యాదు చేశారు. దీని గురించి ఫిర్యాదు చేస్తే.. చంపేస్తానని బెదిరించాడని, తమ కుటుంబానికి ఏదైనా హాని తలపెడితే అందుకు అతడే కారణమని పేర్కొంది. అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. -
ప్రియుడితో కలిసి మరో ప్రియుడి హత్య
ధారూరు: ఓ వివాహిత ఇద్దరు ప్రియులతో నెరపిన వివాహేతర సంబంధం ఒకరి ప్రాణం తీసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా చించోలీ తాలూకా కుంచావరం పీఎస్ పరిధిలోని జడి మల్కాపూర్ జలపాతం వద్ద చోటు చేసుకుంది. ధారూరు సీఐ భీంకుమార్, కోట్‌పల్లి ఎస్ స్రవంతి శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. చేవెళ్ల మండలం కౌంకుట్ల గ్రామానికి చెందిన అనితకు 15 ఏళ్ల క్రితం కోట్‌పల్లి మండలం అన్నాసాగర్‌కు చెందిన వ్యక్తితో వివాహమైంది. ఈమె వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్న భర్త ఏడాది క్రితమే బలవన్మరణానికి పాల్పడ్డాడు. అన్నాసాగర్‌కు చెందిన శ్రీకాంత్(27), చౌట మల్లేశంతో ఒకరికి తెలియకుండా మరొకరితో అనిత వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇటీవల విషయం తెలుసుకున్న శ్రీకాంత్ ఇద్దరినీ చంపేస్తానంటూ ఆమెను బెదిరించాడు. వివాహితుడైన శ్రీకాంత్‌ను వదిలించుకోవాలని భావించిన అనిత మనల్ని చంపేస్తానంటున్నాడని మల్లేశంకు చెప్పింది. దీంతో మల్లేశం తన మిత్రులైన జిన్నారం గ్రామానికి చెందిన మొల్ల బందెళ్లి, బంటూ బందెళ్లి, కోట్‌పల్లికి చెందిన అంజప్పతో కలిసి శ్రీకాంత్ హత్యకు పథకం వేశారు. సెప్టెంబర్ 25న శ్రీకాంత్‌ను అనిత, మల్లేశం అతని మిత్రులు లింగంపల్లి చౌరస్తాకు రప్పించారు.తమ కారులో అందరూ కలిసి జడి మల్కాపూర్ జలపాతానికి చేరుకున్నారు. శ్రీకాంత్‌కు ఫుల్‌గా మద్యం తాగించి మెడకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం శవాన్ని జలపాతంలో పడేసి వెళ్లిపోయారు. మృతుడి తండ్రి నర్సింహులు ఫిర్యాదు మేరకు ఎస్ స్రవంతి దర్యాప్తు చేపట్టారు. కోట్‌పల్లి బందయ్య సమాచారం మేరకు అనుమానితులైన మల్లేశం అతని మిత్రులు మొల్ల బందెళ్లి, బంటూ బందెళ్లి, అంజప్పలను విచారించగా నేరం అంగీకరించారు. నిందితులను జలపాతం వద్దకు తీసుకెళ్లి శవం వెతికించినా వరద ప్రవహానికి లభ్యమవ్వలేదు. అనిత పరారీలో ఉండగా మిగిలిన నలుగురిని శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
సూర్యాపేట : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను హత్య చేసింది ఓ భార్య. ఈ కేసులో నిందితురాలుని స్థానిక పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం సూర్యాపేటరూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి కేసు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సూర్యాపేట మండలంలోని హనుమానాయక్తండాకు చెందిన ధరావత్ కౌసల్య అదే తండాకు చెందిన మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ సంబంధానికి తన భర్త ధరావత్ సైదా అడ్డొస్తున్నాడని, అతడిని ఎలాగైనా తొలగించుకోవాలనే ఆలోచనతో ఆగస్టు 17న రాత్రి భర్త సైదాను కౌసల్య గొడ్డలితో కణతపై నరికి హత్య చేసింది. అనంతరం ఏమి తెలియనట్లు తన భర్త మద్యం సేవించి తూలి చెక్కబల్లపై పడి మృతి చెందినట్లు అందరిని నమ్మించింది. ఈ హత్యను కౌసల్య చిన్న కుమారుడు వినోద్ చూడడంతో అతడిని బతిమిలాడి హత్య విషయాన్ని బయట తెలిస్తే నేను జైలుకు వెళ్తానని, అప్పుడు మీరు బతకడం కష్టమవుతుందని, ఎవరికి ఈ విషయాన్ని చెప్పనివ్వలేదు. ఈనెల 22న కౌసల్య తన చిన్న కుమారుడు వినోద్‌తో గొడవ పెట్టుకోగా వినోద్ తన తండ్రిని తన తల్లి కౌసల్యే హత్య చేసిన విషయం అన్న సాయికుమార్‌కు చెప్పాడు. దీంతో సాయికుమార్ ఈనెల 23న రూరల్‌పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అదే విధంగా నిందితురాలు హత్యకు ఉపయోగించిన గొడ్డలిని సీజ్ చేసినట్టు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో సిబ్బంది పాల్గొన్నారు. -
దారుణం.. అనుమానంతో భార్యను చంపిన భర్త
సైదాపురం: క్షణికావేశంలో తాలికట్టిన భార్యపై అనుమానంతో కత్తితో దారుణంగా నరికి చంపేశాడు ఓ భర్త. అనంతరం బిడ్డలతో కలిసి పోలీసు స్టేషన్లో లొంగిపోయిన ఘటన సైదాపురం మండలంలో చోటు చేసుకుంది. రాపూరు సీఐ విజయకృష్ణ అందించిన వివరాల మేరకు.. మండలంలోని గంగదేవిపల్లికి చెందిన చింతలపూడి మహేంద్ర(33)కు అదే గ్రామానికి చెందిన లావణ్యకు 11 ఏళ్ల కిందట పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి వరుణ్(10), జయవర్ధన్(8) ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్ల కిందట నెల్లూరుకు కాపురం మార్చారు. అయితే వీరి మధ్య ఏడాది నుంచి వివాదం జరుగుతుండేది. ఈ క్రమంలో ఇటీవలే స్వగ్రామానికి వెళ్లారు. మహేంద్రకు తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సోమవారం భార్యభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. దుస్తులు సర్దుకుని తన అమ్మవారి పుట్టినిల్లు అయిన చిట్వేల్‌కు చేరుకునేందుకు లావణ్య సిద్ధమైంది. ఇరుగు పొరుగు వారు సర్దిచెప్పారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మళ్లీ ఇంటి నుంచి వెళ్లేందుకు లావణ్య ప్రయత్నించడంతో మహేంద్ర క్షణికావేశంలో అక్కడే ఉన్న కత్తి తీసుకుని తలపై కొట్టి గొంతు కోశాడు. దీంతో లావణ్య చనిపోవడంతో ఇద్దరు బిడ్డలను తీసుకుని మహేంద్ర సైదాపురం పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన భార్యను చంపేసినట్లు లొంగిపోయాడు. ఎస్ఐ క్రాంతికుమార్, సీఐ విజయకృష్ణ ఘటనా స్థలికి చేరుకుని హత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టారు. కేసును నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. వారి రోదన చూసి స్థానికులు చలించిపోయారు. -
స్నేహితుడితో భార్య సంబంధం.. మోసం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, విశాపట్నం: విశాఖలో ఓ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, తన స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని తట్టులేక హరి ప్రకాష్ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆతహత్యకు ముందు ఆరు పేజీల సూసైడ్ లేఖ రాశాడు. అలాగే ఆత్మహత్యకు గల కారణాలపై సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.కాగా హరి ప్రకాశ్‌కు భవనేశ్వరితో వి2019లో వివాహమైంది. వీరిద్దరికి ఇది రెండో వివాహమే. ఈ జంటకు నాలుగేళ్ల పాప కూడా ఉంది. అయితే భువనేశ్వరికి, హరి ప్రకాశ్‌కు గత మూడేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. తన భార్యకు ఇతరులతో సంబంధం పెట్టుకుందన్న ఈ క్రమంలోనే తన స్నేహితుడు రాజేష్‌కు మధ్య కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం నడుస్తున్నట్లు హరి ప్రకాశ్ ఆరోపించాడు. వారిద్దరికి ఓ పాప కూడా ఉన్నట్లు తెలిపారు. భార్య వేధింపులు, ఇతరులతో ఆమె సంబంధాల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో చెప్పాడు.కుమారుడి ఆత్మహత్యపై పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ద్వారకా జోన్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం హరి ప్రకాష్ మృతదేహన్ని పోలీసులు మార్చరీకి తరలించారు. హరి ప్రకాష్ భార్యభువనేశ్వరిని అదుపులోకి తీసుకున్నారు. స్నేహితుడు రాజేష్ పరారీలో ఉండగా.. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
భర్త ఇంట్లో ఉండగానే ప్రియుడ్ని పిలిచి మరీ..
తాడిపత్రి రూరల్: వివాహేతర సంబంధం మంచిది కాదన్నందుకు ఏకంగా ప్రియుడితో కలసి భర్తను ఓ భార్య చితకబాదింది. పోలీసులు తెలిపిన మేరకు... తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామానికి చెందిన శ్రీరంగడు పుట్టుకతోనే మూగ. ఆయన భార్య రేవతి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. బండల పాలీస్ యూనిట్లో పనిచేస్తూ కుటుంబాన్ని శ్రీరంగడు పోషించుకుంటున్నాడు. అదే యూనిట్లో పనిచేస్తున్న చిన్నపొలమడకు చెందిన ధర్మ తరచూ శ్రీరంగడు కోసం ఇంటికి వెళుతూ రేవతితో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న శ్రీరంగడు పలుమార్లు తన భార్యను మందలించాడు. అయినా ఆమె వినలేదు. సోమవారం రాత్రి భార్యాభర్తలు మరోసారి ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో ధర్మకు రేవతి ఫోన్ చేసి రప్పించుకుంది. అనంతరం ఇద్దరూ కలసి శ్రీరంగడుపై విచక్షణారహితంగా దాడి చేసి చితకబాది అక్కడి నుంచి ఉడాయించారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న కుమారుడిని చుట్టుపక్కల వారి సాయంతో తల్లి రంగమ్మ ఆస్పత్రికి తీసుకెళ్లింది. రంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. -
ప్రియుడి కోసం భర్తను అతి దారుణంగా..
ఇటీవల ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ ఖలీల్ తనకు భార్య ఉన్నప్పటికీ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఇద్దరికి ఇది వరకే పెళ్లి జరిగినా ప్రేమించి రెండో వివాహం చేసుకున్నారు. పదేళ్లలోనే వారి కాపురం కుప్పకూలింది. భార్యపై అనుమానంతో కర్రలతో దాడి చేసి హత్య చేశాడు. ఆమె మరణించగా, భర్త కటకటాల పాలయ్యాడు. మృతురాలి పిల్లలతో పాటు మొదటి భార్య, ఆమె పిల్లలు రోడ్డున పడ్డారు.ఈ నెల 12న నార్నూర్ మండలం నాగలకొండకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజానంద్ హత్యకు గురయ్యాడు. రెండు రోజుల్లో ఆయన పదోన్నతి పొందనుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని హత్యకు పన్నాగం పన్నారు. నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. ఈక్రమంలో భార్య జైలు పాలు కాగా, కుమారుడు అనాథగా మిగిలాడు. జిల్లా వ్యాప్తంగా ఈ హత్య కలకలం రేపింది.గతేడాది ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్యనగర్ కాలనీకి చెందిన ఓ వివాహిత భుక్తాపూర్‌కు చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకుంది. విషయం తెలిసిన భర్త పలుసార్లు మందలించాడు. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత ఆ యువకుడితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన భర్త గుడిహత్నూర్ మండలం సీతాగోంది సమీపంలోని గర్కంపేట వద్ద తన బంధువులతో కలిసి హతమార్చాడు. భార్యతో పాటు యువకుడిని సైతం కర్రతో బాది హత్య చేశారు.ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఆయన ప్రేమ వివాహం చేసుకొని సంతోషంగా ఉంటున్న సమయంలో వరుసకు బంధువు అయిన ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కుటుంబీకులకు తెలియకుండా జిల్లా కేంద్రంలోని ఓ ఆలయంలో ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. దీంతో అమ్మాయి తరఫున వారు కోపోద్రిక్తులై గుడిహత్నూర్ మండలంలోని డంపింగ్ యార్డు సమీపంలోని అటవీ ప్రాంతంలో గతేడాది హతమార్చారు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆమెను కాదని మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోనే హత్యకు దారి తీసింది. భార్యతో పాటు ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారు.జిల్లాలో గతేడాది జరిగిన హత్యలు: 18ఈఏడాది (ఇప్పటివరకు) జరిగిన హత్యలు:06ఆదిలాబాద్‌టౌన్: వివాహేతర సంబంధాలతో బంధాలు తెగిపోతున్నాయి. భార్యపై అనుమానంతో భర్త హత్యకు పాల్పడుతుండగా, మరికొంత మంది మహిళలు ఇతర వ్యక్తులతో సంబంధాలు ఏర్పర్చుకొని విలువైన జీవితాలను బలిగొంటున్నారు. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కాటికి పంపుతున్న ఘటనలు జిల్లాలో అనేకం చోటుచేసుకుంటున్నాయి. జీవితాంతం తోడుగా ఉంటానని బాస చేసిన దంపతులు ఈ సంబంధాల కారణంగా లోకానికే దూరమవుతున్నారు. కుటుంబంతో సంతోషంగా ఉంటూ సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టాల్సిన కొంతమంది భార్యభర్తలు వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. తమ జీవిత భాగస్వామిని మోసం చేస్తూ వివాహేతర సంబంధాలకు ఆకర్షితులవుతున్నారు. ఇందులో పురుషులతో పాటు మహిళలు ఉంటున్నారు. వీరి తప్పిదానికి కుటుంబ పరువు వీధిపాలు కావడంతో పాటు పిల్లల భవిత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ క్రమంలోనే కొన్ని బంధాలు విడిపోతుండగా, మరికొందరు తప్పు చేసిన వారిని అంతమొందిస్తున్నారు. దారుణ హత్యలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఇరువురి కుటుంబాల్లో విషాదం నెలకొంటుంది. వీరే కాకుండా ప్రేమలో పడిన జంటలు సైతం ఆఘాయిత్యాలకు పాల్పడుతుండం గమనార్హం.హత్యలకు ఒడిగడుతున్నారు..వివాహేతర సంబంధాలతో జిల్లాలో హత్యలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఆరు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఇటీవల చోటు చేసుకున్న రెండు ఘటనలు జిల్లాలో సంచలనం రేపాయి. బాధిత కుటుంబాల్లో తీరని విషాదం నింపాయి. ఒకరు రెండో భార్యపై అనుమానంతో హత్య చేయగా.. ఓ ఉపాధ్యాయుడి భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకొని భర్తనే కడతేర్చింది. ఇంకొంత మంది ప్రేమికులు, కొంతమంది వివాహేతర సంబంధాల కారణంగా వారి కుటుంబీకులు, బంధువులు హత్యలకు పాల్పడుతుండగా, దంపతుల్లో ఎవరో ఒకరు అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు ఒడిగడుతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా చెడుదారులకు ఆకర్షితులై ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నాయి. తరచూ ఫోన్లో మాట్లాడడాన్ని గ్రహించడంతో భార్య భర్తల మధ్య గొడవలు చోటుచేసుకొని కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఇదిలా ఉండగా మద్యం, గంజాయి మత్తులో సైతం కొంత మంది హత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంతో విలువైన జీవితాలను గాలిలో కలుపుతున్నారు. దంపతుల్లో ఒకరు తప్పు చేస్తే వారిని హతమార్చడానికి పన్నాగం పన్నుతుండగా, ప్రేయసి ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చేందుకు సైతం వెనుకాడటం లేదు.ఇష్టం లేకుంటే విడిపోవాలిదంపతుల్లో చాలా వరకు అనుమానాలతోనే హత్యలు జరుగుతున్నాయి. ఇష్టం లేనప్పుడు విడిపోవడం మంచిది. పోలీస్స్టేషన్లలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. స్టేషన్‌కు వచ్చి కౌన్సెలింగ్ తీసుకోవాలి. అవసరమైతే ఫిర్యాదు చేయాలి. చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయి. కోర్టును ఆశ్రయించాలి. అంతే తప్పా విలువైన ప్రాణాలను తీయడం సరికాదు. రెండు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకుంటాయి. పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయంతో జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.– ఎల్.జీవన్‌రెడ్డి, డీఎస్పీ, ఆదిలాబాద్ -
జిమ్ ట్రైనర్‌తో ప్రేమ.. భర్త అడ్డుగా ఉన్నాడని.. మూడేళ్ల తర్వాత!
చండీగఢ్: ప్రియుడి మోజులో పడి ఓ మహిళ కట్టుకున్న భర్తను కడతేర్చేందుకు సిద్దమైంది. ఒకటి కాదు రెండు ప్లాన్లు వేసి అతడిని వదిలించుకోవాలనుకుంది. మొదటి ప్రయత్నంలో అతడు ప్రాణాలతో బయటపడగా.. రెండో సారి పక్కా ప్లాన్ ప్రకారం హత్య జరిపించింది. చివరికి అనుమానాస్పద ప్రవర్తనే ఆమె నేరాన్ని పోలీసులకు పట్టించింది. ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు మూడేళ్ల తర్వాత ఆ మహిళను అరెస్ట్ చేశారు. హర్యానాలోని పానిపట్‌లో ఈ సంఘటన వెలుగుచూసింది.వివరాలు.. కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన వినోద్ బరారాకు నిధితో వివాహమైంది. ఆ దంపతులకు ఒక కుమార్తె ఉంది. వీరు పానిపట్‌లో నివాసం ఉంటున్నారు. నిధికి కొన్నేళ్ల క్రితం సుమిత్ అనే జిమ్ ట్రెయినర్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇది ప్రేమగా మారింది. ఈ విషయం వినోద్‌కు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో వినోద్‌ను ఎలాగైనా అడ్డుతొలగించుకొని సుమిత్తో జీవించాలని నిధి నిర్ణయించుకొంది.పంజాబ్‌కు చెందిన దేవ్ సునార్ అనే లారీ డ్రైవర్‌కు రూ. 10 లక్షలు సుపారీ ఇచ్చి.. తన భర్తను వాహనంతో ఢీకొట్టి చంపాలని సూచించింది. 2021 అక్టోబర్ 5న వినోద్‌ను ఇంటి సమీపంలోనే దేవ్ లారీతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కానీ, ప్రాణాలతో బయటపడ్డాడు. నిందితుడైన లారీ డ్రైవర్ దేవ్ సునర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును వెనక్కి తీసుకోవాలని వినోద్‌ను సునర్ బెదిరించాడు. కానీ అతడు నిరాకరించాడు. దీంతో భర్తను ఎలాగైన సరే అడ్డు తొలగించుకోవాలన్న మహిళ మరో ప్లాన్ వేసింది. అదే ఏడాది డిసెంబర్ 15న దేవ్.. నిధి ఇంటికి వెళ్లి మంచానపడి ఉన్న వినోద్‌ను పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చి చంపాడు. పోలీసులు దేవ్‌ను హంతకుడిగా గుర్తించి అరెస్టు చేశారు. కోర్టులో కేసు వెనక్కి తీసుకోనందుకే వినోద్‌ను చంపినట్లు పోలీసులకు చెప్పాడు.ఈ ఘటన తర్వాత దేవ్ కుటుంబ అవసరాలను నిధి, జిమ్ ట్రైనర్ సుమిత్‌లే చూసుకొంటున్నారు. వినోద్ హత్య తర్వాత నిధి సైతం విలాసవంతంగా జీవించింది. కుమార్తెను ఆస్ట్రేలియాలోని బంధువు వద్దకు పంపింది. ఆమె విలాసవంతమైన జీవనశైలి వినోద్ కుటుంబీకుల్లో అనుమానాలను పెంచింది. దీంతో అతడి సోదరుడు ప్రమోద్ మూడేళ్ల తర్వాత పానిపట్ ఎస్పీ అజీత్ సింగ్‌కు విషయం చెప్పాడు.తన సోదరుడి భార్యపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసుల ప్రత్యేక బృందం నిందితుడు దేవ్ కాల్ డేటాను వెలికి తీసింది. తరచూ జిమ్ ట్రెయినర్ సుమిత్తో మాట్లాడుతున్నట్లు దానిలో గుర్తించారు. దీంతో పోలీసులు అతడి కాల్ డేటాను వెలికి తీయగా నిధితో సంబంధం బయటపడింది. దీంతో సుమిత్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు కుట్ర వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. -
వివాహేతర సంబంధం: 22 నెలల చిన్నారిని కొరికి.. నేలకేసికొట్టి!
చివ్వెంల(సూర్యాపేట): వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని చిన్నారిని నేలకేసి కొట్టి హత్యచేసిన సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామానికి చెందిన కటకట లక్ష్మణ్‌తో అదే జిల్లా రంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన రమ్య అలియాస్ నవ్యశ్రీ వివాహం ఆరేళ్లక్రితం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు అరుణ్య (04), మహన్వి (22 నెలలు). కాగా ఏడు నెలలుగా రమ్యశ్రీ అదే గ్రామానికి చెందిన బొల్లెం అరవిందరెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 20 రోజుల క్రితం ఇద్దరు పిల్లలను తీసుకుని ప్రియుడితో కలిసి సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం గ్రామానికి వచ్చి అక్కడే నివాసం ఉంటున్నారు. అరవిందరెడ్డి ఇటుకబట్టీల వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చిన్నారి మహన్వి తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించి మంగళవారం రాత్రి అరవిందరెడ్డి ఆమెను కొరికి, కొట్టి హింసించి నేలకేసి కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు రమ్య అత్త కటికట గంగమణి ఫిర్యాదు మేరకు సూర్యాపేట రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి ఆదేశాలతో ఎస్ఐ వెంకట్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా చిన్నారికి చెండు చెంపలు, భుజాలు, రెండు చేతులు, పిరుదులపై, తలకు తీవ్ర గాయాలై ఉన్నాయని ఎస్ఐ తెలిపారు. -
అల్లుడు హైడ్రామా..!
రఘునాథపాలెం: మండలంలోని హరియాతండా సమీపంలో మంచుకొండ – పంగడి ప్రధాన రహదారి పక్కన చెట్టును ఢీకొన్న కారు ప్రమాదంలో తల్లీ, ఇద్దరు కుమార్తెలు మృతిచెందిన విషయం విదితమే. కానీ, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పథకం ప్రచారం జరిగిన హత్యా? లేక నిజంగానే ప్రమాదం జరిగిందా? అనే అంశంపై పలువురు పలు రకాల వాదనలు వినిపిస్తున్నారు. మంగళవారం రాత్రి కారు ప్రమాదంలో దుర్మరణం చెందిన తల్లీకూతుర్ల అంత్యక్రియలు బుధవారం మండలంలోని బావోజీతండాలో పోలీసుల సమక్షంలో నిర్వహించారు. ఆది నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్న మృతురాలి తండ్రి, హరిసింగ్, తల్లి పద్మ, సోదరుడు, సోదరితో పాటు కుటంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రి వద్ద బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేశారు. మృతురాలి భర్త, ఫిజియోథెరపిస్ట్ అయిన బోడా ప్రవీణ్ కారణమని, ఆయన్ను తీసుకొచ్చిన తర్వాతనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాలని భీష్మించారు. మరో యువతితో వివాహేతర సంబంధం నెరుపుతున్న ప్రవీణ్‌ను భార్య కుమారి ప్రశి్నస్తున్న నేపథ్యంలోనే తల్లీ కూతుర్లను హతమార్చి యాక్సిడెంట్‌గా చిత్రీకరిస్తున్నాడని వందలాది మంది ఆస్పత్రికి చేరుకుని నిరసన తెలిపారు. ప్రవీణ్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రఘునాథపాలెం సీఐ శ్రీహరి, ఎస్ఐలు, పోలీసులు జోక్యం చేసుకొని పోస్టుమార్టం నివేదిక అనంతరం విచారణ చేపట్టి చర్యలు చేపడుతామని మృతుల కుంటుంబ సభ్యులకు నచ్చజెప్పి పోస్టుమార్టం పూర్తి చేయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రవీణ్ తరఫు బంధువులు సైతం అక్కడికి వచ్చేందుకు భయపడ్డారు. సాయంత్రం 4 గంటల తర్వాత మూడు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, బావోజీతండాకు తరలించేందుకు వాహ నం ఎక్కించారు. కాగా, పోస్టుమార్టంలో ఏం తేలిందనే విషయం డాక్టర్లు చెప్పకుండానే ఎలా వెళ్లారని, ఈ విషయం తేలేవరకు మృతదేహాలను తీసుకెళ్లమంటూ మళ్లీ అందోళన చేశారు. మృతదేహాలను దించి శవాల గదిలోకి తరలించారు. మళ్లీ పోలీసులు కలగజేసుకుని, సర్దిచెప్పి మృతదేహాలను పోలీసు బందోబస్తు నడుమ బావోజీతండాకు తరలించి ఇద్దరు చిన్నారులను పూడ్చిపెట్టారు. కుమారి మృతదేహాన్ని దహనం చేశారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు విలపించిన తీరు చూసి అక్కడివారంతా కన్నీటిపర్యంతమయ్యారు. ముఖ్యంగా చిన్నారుల మృతదేహాలను చూసిన గ్రామస్తులంతా గుండెలవిసేలా రోదించారు. ఏం జరిగి ఉంటుంది? కారు ప్రమాదంలో డాక్టర్ ప్రవీణ్ గాయాలతో బయటపడటం, భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి చెందడంపై కుమారి తల్లితండ్రులు అనుమానిస్తున్నారు. కొన్నేళ్లుగా అల్లుడు తమ కుమార్తెను సరిగా చూసుకోవడం లేదని, వివాహేతర సంబంధం పెట్టుకుని వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. కారుకు ప్రమాదం జరిగినప్పుడు తల్లీకూతుర్లు వెనుక సీట్లో చనిపోయి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత సమీపంలోని హరియాతండావాసులు అక్కడికి చేరుకునే సరికి ప్రవీణ్ ముందు సీట్లో, కుమారి, ఇద్దరు చిన్నారులు వెనుక సీట్లు మృతి చెంది ఉన్నారని గుర్తించారు. కారు ముందు భాగం చెట్టును ఢీకొడితే వెనుక ఉన్న వాళ్లు ఎలా మృతిచెందారనే చర్చ సాగుతోంది. పోస్టుమార్టం నివేదిక వస్తేనే అసలు విషయం తెలుస్తుందని, కారులో ఎవరు ఎక్కడ కూర్చున్నారో ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. కాగా, కారు ప్రమాదంలో గాయపడిన బోడా ప్రవీణ్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
దారుణం: ప్రియుడిపై మోజు.. భర్తను అంతమొందించిన భార్య!
సబ్బవరం: సాలాపువానిపాలెంలో ఓ యువకుడు శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ప్రియుడిపై మోజులో మరో ఇద్దరితో కలిసి కోడలే కడతేర్చిందని మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఘటన మండలంలోని గోటివాడ శివారు సాలాపువానిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. సీఐ పిన్నింటి రమణ శనివారం సాయంత్రం వెల్లడించిన వివరాల ప్రకారం... సాలాపు శ్రీనివాసరావు (32) దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం దువ్వాడ సమీపంలోని మంగళపాలెంకు చెందిన భాగ్యలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మికి అదే గ్రామానికి చెందిన గళ్ల రవి (26)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతోపాటు పెద్దలు వద్ద పంచాయతీ నిర్వహించడం... అనంతరం కలిసి జీవించడం జరిగేది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో సాలాపు శ్రీనివాసరావు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి ఇంటికి వస్తుండగా... అదే గ్రామానికి చెందిన గళ్ల రవి (26), గరికిపాటి శ్రీహరి (22) కలిసి శ్రీనివాసరావును అడ్డుకుని మంచం కోడితో తలపై దాడి చేశారు. దీంతో పెద్దగా కేకలు వేయడంతో శ్రీనివాసరావు తండ్రి అప్పారావుతోపాటు గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకుని చూడగా... శ్రీనివాసరావు తీవ్ర గాయాలతో పడి వున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు సబ్బవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.అయితే అప్పటికే మృతి చెందినట్ల వైద్యులు నిర్ధారించారు. కోడలు భాగ్యలక్ష్మితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి తమ కుమారుడు శ్రీనివాసరావును హత్య చేశారని మృతుని తండ్రి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. శ్రీనివాసరావు తలపై మంచం కోడితో దాడి చేసిన తర్వాత... సుమారు 150 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హత్యకు పాల్పడిన గళ్ల రవి (26), గరికిపాటి శ్రీహరిని(22) అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భార్య భాగ్యలక్ష్మిపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమణ తెలిపారు. -
హత్య చేసింది ‘తమ్ముడే’
సాక్షి, పుట్టపర్తి: ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ నేతలు శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. వ్యక్తిగత కక్షలతో హత్య జరిగినా.. రాజకీయ రంగు పూసి సానుభూతి కోసం వెంపర్లాడుతున్నారు. టీడీపీ కార్యకర్తలే హత్య చేసినా.. బురద మాత్రం అధికారపార్టీపై వేసి లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. చివరకు అసలు విషయం తెలియడంతో ప్రజల్లో అభాసుపాలు అవుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం కుటాలపల్లిలో జరిగిన హత్య విషయంలోనూ టీడీపీ నేతల దుష్ప్రచారం బట్టబయలైంది. కుటాలపల్లిలో ఈ నెల 24వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో దుద్దుకుంట అమరనాథ్‌రెడ్డి (40) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగినట్లు అదే రోజున పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అదేమీ పట్టించుకోకుండా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి శవ రాజకీయానికి తెర లేపారు. దానిని రాజకీయ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పల్లె రఘునాథరెడ్డితో పాటు చంద్రబాబు, అచ్చెన్నాయుడు సైతం అసత్య ప్రచారం చేశారు. ఈ హత్య ఘటనపై శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి.. నిందితులను అరెస్టు చేశాయి. వివాహేతర సంబంధం కారణంగానే దుద్దుకుంట అమరనాథ్‌రెడ్డి హత్య జరిగిందని, ఇందులో ఎలాంటి రాజకీయమూ లేదని ఎస్పీ మాధవరెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు. అమరనాథ్‌రెడ్డి సమీప బంధువైన దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి ఈ హత్య చేశారని వెల్లడించారు. అతనితో పాటు నిందితులుగా ఉన్న గుండ్రా వీరారెడ్డి, మల్లెల వినోద్‌కుమార్, రమావత్ తిప్పేబాయిలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామని తెలిపారు. నిందితుడు టీడీపీ కార్యకర్త దుద్దుకుంట అమరనాథ్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు అయిన దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి కొన్నేళ్లుగా టీడీపీలో కొనసాగుతున్నాడు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. గతంలో కూడా కుటాలపల్లిలో చిన్న చిన్న ఘర్షణల్లో అతడు నిందితుడిగా ఉన్నాడు. ఇవన్నీ తెలిసినా కూడా పల్లె రఘునాథరెడ్డి అధికార పార్టీ వైపు కేసును తోసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు రంగంలోకి దిగడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి పొందాలని టీడీపీ పెద్దలు చేసిన కుట్రలను చూసి స్థానికులు మండిపడుతున్నారు. హత్యకు కారణాలివీ.. కుటాలపల్లికి చెందిన తిప్పేబాయితో కొన్నేళ్లుగా దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవలి కాలంలో అమరనాథ్‌రెడ్డితో ఆమె సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని శ్రీనివాసరెడ్డి ఆమెను ప్రశ్నించాడు. తనకు ఆర్థిక సాయం చేశాడు కాబట్టి అతన్ని వదలలేనని తేల్చి చెప్పింది. దీంతో అమరనాథ్‌రెడ్డిని చంపేయడానికి శ్రీనివాసరెడ్డి పథకం రచించాడు. తనకు సన్నిహితంగా ఉండే వీరారెడ్డితో పాటు చైన్ స్నాచింగ్ కేసుల్లో జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చిన మల్లెల వినోద్‌కుమార్ సాయం కోరాడు. గత ఆదివారం రాత్రి అమరనాథ్‌రెడ్డి పొలం వద్దకు వెళ్లగా.. మల్బరీ ఆకులు కోసే కత్తితో మెడ, ముఖం, తలపై నరికి చంపేశారు. మరుసటి రోజు ఉదయమే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా.. వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసినట్లు ప్రాథమికంగా తేలింది. -
భర్త వివాహేతర సంబంధం.. అది తెలుసుకున్న భార్య..
కోవూరు: భర్తను భార్య రోకలి బండతో కొట్టి చంపిన ఘటన కోవూరులోని బండారుమాన్యంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పి.అయ్యప్ప (42) అనే వ్యక్తి ఫ్లెక్సీలు కడుతుంటాడు. చిన్నచిన్న పనులు చేస్తుంటాడు. అతడికి దుర్గ అనే మహిళతో వివాహమైంది. వారికి పదేళ్ల వయసున్న బాలుడు, ఐదేళ్ల వయసున్న కుమార్తె ఉన్నారు. అయ్యప్ప రాజేశ్వరి అనే మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. సోమవారం రాత్రి ఆమె, అతను కలిసి మద్యం తాగారు. తర్వాత అయ్యప్ప ఇంటికి రాగా భార్యాభర్తలిద్దరూ తాగారు. అయ్యప్పకు రాజేశ్వరితో వివాహేతర సంబంధం ఉందని దుర్గకు అనుమానం ఉంది. ఈ నేపథ్యంలో వారి మధ్య గొడవ జరిగింది. రాజేశ్వరిని ఇంటికి తీసుకురావాలని అయ్యప్ప అరిచి చెప్పడంతో దుర్గ వెళ్లి ఆమెను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా వారి మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. కాసేపటికి రాజేశ్వరి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అయ్యప్ప భార్యపై రోకలి బండతో దాడి చేయబోయాడు. ఆమె దానిని లాక్కొని భర్తను కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న అయ్యప్ప సోదరుడు కోవూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి, స్థానిక సీఐ శ్రీనివాసరావు, ఎస్సై రంగనాథ్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డీఎస్పీ చుట్టుపక్కల వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
భార్యతో సన్నిహితంగా ఉన్నందుకే హత్య
రాయికల్: తన భార్యతో సన్నిహితంగా ఉన్నందుకే నాగెల్లి భూమేశ్.. సురేశ్ అనే యువకుడిని హత్య చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. శుక్రవారం జరిగిన హత్య నేరానికి సంబంధించిన వివరాలను సోమవారం రాయికల్ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. రాయికల్ మండలం తాట్లవాయికి చెందిన నాగెల్లి సురేశ్, నాగెల్లి భూమేశ్ వరుసకు అన్నదమ్ముల్లు. భూమేశ్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో సురేశ్ భూమేశ్ భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు. ప్రవర్తన మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా సురేశ్ పట్టించుకోలేదు. 2023 అక్టోబర్‌లో దుబాయ్ నుంచి ఇంటికి వసూ్తనే సురేశ్‌ను చంపాలనే ఉద్దేశంతో వెంట కత్తి తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా భార్యతో సన్నిహితంగా మెలగడాన్ని గమనించాడు. దీంతో సురేశ్‌పై పగ పెంచుకుని, ఎలాగైనా చంపాలని అనుకుని ఈనెల 7న ఉదయం పొలం వద్దకు నీరు పెట్టడం కోసం సురేశ్ వెళ్లడాన్ని గమనించాడు. ప్లాన్ ప్రకారం కత్తిని తీసుకుని తన ద్విచక్రవాహనంపై పొలం వద్దకు వెళ్లాడు. పొలానికి కొద్దిదూరంలో ఉన్న చెరువు కట్టపై ద్విచక్ర వాహనాన్ని పెట్టాడు. తన పొలానికి నీరు పెట్టేందుకు ద్విచక్రవాహనంపై వస్తున్న సురేశ్‌ను ఆపి తాను పొలానికి వస్తున్నానని చెప్పాడు. పొలం గట్టుదగ్గర ద్విచక్ర వాహనాన్ని ఆపగానే భూమేశ్ వెంట తెచ్చుకుని కత్తితో సురేశ్ తల, మెడపై విచక్షణరహితంగా నరికాడు. కిందపడిన సురేశ్ ప్రాణభయంతో బావి వైపు పరుగెత్తుతుండగా మరోసారి నుదుటిపై, తలపై కత్తితో నరికాడు. దీంతో తీవ్రంగా గాయాలైన సురేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సురేశ్ మృతదేహాన్ని అదేబావిలోకి తోసేశాడు. కత్తిని కూడా అదే బావిలో పడేశాడు. రక్తం మరకలు శుభ్రం చేసుకుని తన ద్విచక్ర వాహనంపై ఇంటికొచ్చి స్నానం చేసి అనంతరం వేములవాడ రాజన్న (శివరాత్రి జాతర) దర్శనానికి వెళ్లాడు. సురేశ్ ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లారు. అప్పటికే సురేశ్ బావిలో శవమై కనిపించాడు. హత్య విషయాన్ని తెలుసుకున్న రూరల్ సీఐ ఆరీఫ్ అలీఖాన్, ఎస్సై అజయ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సురేశ్ తల్లి నాగేల్లి లక్ష్మి భూమేశ్‌పై అనుమానం ఉందని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భూమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడిచ్చిన సమాచారం మేరకు బావిలో పడేసిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే హత్య సమయంలో వినియోగించి రెండు మొబైల్స్, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 48 గంటల్లో నిందితుడిని పట్టుకున్న సీఐ, రాయికల్ ఎస్సైలను డీఎస్పీ అభినందించారు. -
సురభి ఉసురు తీసిన భర్త వివాహేతర సంబంధం..
యశవంతపుర: వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన హాసన జిల్లా చెన్నరాయపట్టణ తాలూకా నాగయ్యనకొప్పలు గ్రామంలో జరిగింది. అయితే ఆమెను భర్త హత్య చేసినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు అరోపిస్తున్నారు. హుణసూరుకు చెందిన సురభి(24)కి నాగయ్యనకొప్పలు గ్రామానికి చెందిన దర్శన్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఏడాది చిన్నారి ఉంది. దర్శన్ మరో మహిళతో ఆక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న విషయంపై దంపతుల మధ్య అప్పుడప్పడు గొడవ జరిగేది. ఈక్రమంలో లోబీపీతో సురభి చెందినట్లు ఆమె తల్లిదండ్రులకు దర్శన్ సమాచారం ఇచ్చాడు. గ్రామానికి చేరుకున్న తల్లిదండ్రులు వచ్చి కుమార్తె మృతదేహాన్ని పరిశీలించారు. గొంతువద్ద బలమైన గాయాలు ఉన్నాయని గుర్తించారు. దర్శన్ మరో మహిళతో ఆక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకే సురభికి ఉరివేసి హత్య చేశాడని ఆరోపిస్తూ శ్రావణబెళగోళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
వివాహేతర సంబంధం ఓ పసికందు ప్రాణం తీసింది...
వివాహేతర సంబంధం ఓ పసికందు ప్రాణం తీసింది. పైశాచికంగా ఒకడు పిడిగుద్దులు కురిపిస్తే అల్లాడిన మూడేళ్ల చిన్నారి తనువు చాలించాడు. నవ మాసాలు మోసి పెంచిన తల్లి మానవత్వం మరచి ప్రియుడిపై మోజుతో తప్పుడు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకొంది. నీటి తొట్టెలో పడి చనిపోయాడని ఫిర్యాదు చేయగా... విచారించిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. మదనపల్లె : నీటి తొట్టెలో పడి బాలుడు మృతి చెందిన కేసును పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. తాలూకా సీఐ ఎన్.శేఖర్ వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం చెరుకువారిపల్లెకు చెందిన చిచ్చిలి శివశంకర్ రెడ్డి(33) స్థానిక బ్రాందీ షాపులో పనిచేస్తుండేవాడు. అదే గ్రామానికి చెందిన నాగరాజుతో స్నేహం ఏర్పడింది. తరచూ ఇంటికి వచ్చిన శివశంకర్‌రెడ్డి... కొద్ది రోజుల తర్వాత నాగరాజు భార్య మల్లకుంట్ల మయూరి(25)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. రెండేళ్ల తర్వాత తన ప్రియురాలు మయూరిని, ఆమె కుమారుడు హరన్సాకేత్(3)ను తీసుకుని గ్రామం వదలి ఉపాధి కోసం శివశంకర్‌రెడ్డి మదనపల్లెకు వచ్చారు. అక్కడే ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఇద్దరికీ ఉద్యోగాలు దొరకడంతో చిప్పిలిలో ఉంటూ పని చేసేవారు. వారు ఉద్యోగానికి వెళ్లేటప్పుడు మూడేళ్ల చిన్నారిని ఇంట్లో ఉంచి సెల్‌ఫోన్ చేతికిచ్చి వెళ్లేవారు. సాయంత్రం వచ్చేటప్పటికి కుమారుడు మలమూత్రాలతో గలీజుగా ఉండడంతో ఇల్లును శుభ్రం చేసుకోవడం దినచర్యగా ఉండేది. పిడి గుద్దులు కురిపించి.... ఈ ఏడాది ఫిబ్రవరి 13న శివశంకర్ రెడ్డి ఇంటి వద్ద ఉండగా, మయూరి ఉద్యోగానికి వెళ్లింది. చిన్నారి సాకేత్‌ను ఇంట్లో ఉంచారు. ఇంటి నుంచి బయటికి వెళ్లి శివశంకర్‌రెడ్డి రాగానే సాకేత్ మలమూత్రాలతో గలీజు చేయడంతో, పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతూ కనికరం లేకుండా పైశాచయికంగా పిడిగుద్దులు గుద్దాడు. బాలుడు అపస్మారక స్థితికి చేరుకోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతిచెందాడని చెప్పడంతో... తనను కాపాడాలని ప్రియురాలు మయూరిని వేడుకున్నాడు. దీంతో ప్రియుడిపై ఉన్న మోజుతో, తల్లి ప్రేమను మరిచి బాలుడు ప్రమాదవశాత్తూ బకెట్లో పడి మృతిచెందినట్లు మయూరి తాలూకా పోలీసులో ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు అనుమానంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో బాలుడిని ఆవేశంలో చంపినట్లు శివశంకర్‌రెడ్డి నేరం అంగీకరించడంతో హత్య కేసుగా మార్పుచేసినేట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం, హెడ్‌కానిస్టేబుల్ ప్రభాకర్, కానిస్టేబుళ్లు రాఘవ, శశికళ, తదితరులు పాల్గొన్నారు. -
తాగుబోతు భార్యను హత్య చేసిన భర్త
కర్ణాటక: సిలికాన్ సిటీలో ఘోరం చోటుచేసుకుంది. భర్త, కొడుకు కలిసి మహిళను మట్టుబెట్టారు. మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ సంఘటన కేఆర్‌పుర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు విచారణ చేపట్టగా భర్త, ఆమె కొడుకే సూత్రధారులని తెలిసి అందరూ నిర్ఘాంతపోయారు. కడ్డీపై వేలి ముద్రలు వివరాలు.. ఈ నెల 2న కేఆర్‌పుర పోలీసుస్టేషన్ పరిధిలో నేత్రావతి (40) అనే మహిళను ఎవరో ఇనుప రాడ్‌తో బాది హత్య చేశారు. మా అమ్మను చంపేశారంటూ ఆమె మైనర్ కొడుకు (17) కేఆర్ పుర పోలీసులకు ఫోన్ చేశాడు. ఇతడు డిప్లొమా విద్యార్థి అని తెలిసింది. పోలీసులు వచ్చి అనుమానంతో కుర్రవాన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ పడి ఉన్న రాడ్‌పై ఉన్న రెండు వేలి ముద్రలను పరిశీలించారు. మరిన్ని ఆధారాల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. దానిపై ఉన్న వేలిముద్రలు ఎవరివో కాదని, నేత్రావతి భర్త చంద్రప్ప, కొడుకువని నిర్ధారణ అయ్యింది. భర్త ఏమన్నాడంటే పోలీసుల విచారణలో చంద్రప్ప నోరు విప్పాడు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని, మద్యానికి కూడా అలవాటైందని, బయటకు వెళ్తే రెండు రోజులైనా ఇంటికి వచ్చేది కాదని చెప్పాడు. దీంతో తాను, కొడుకు అన్నం వండుకోలేక, హోటళ్లకు వెళ్లలేక ఉపవాసం ఉండేవాళ్లం. ప్రశ్నిస్తే తమతో పోట్లాడి రభస చేసేది, గత్యంతరం లేక ఆమెను కొడుకుతో కలిసి హత్య చేసినట్లు వివరించాడు. వీరికొక కూతురు ఉండగా, ఆమె జార్జియాలో వైద్య విద్య చదువుతోంది. తండ్రిని కాపాడాలని బాలుని తపన హత్య చేసిన తరువాత తానే ఇదంతా చేశానని, తండ్రికి ఏమీ తెలియదని బాలుడు తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించాడు. తల్లి తనను పట్టించుకోవడం లేదనే బాధతో చంపానని పోలీసులకు చెప్పాడు. జైలుకెళ్లిన తరువాతైనా మంచి చదువు దొరుకుతుందని, మైనర్ కావడం వల్ల శిక్ష తక్కువగా ఉంటుందని, తండ్రికి జైలు వాసం తప్పుతుందని అనుకున్నట్లు చెప్పాడు. చివరకు రాడ్ మీద వేలిముద్రలు నిజం చెప్పడంతో తండ్రీ కొడుకులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. -
సైకో గ్యాంగ్.. లవర్స్, వివాహేతర సంబంధ జంటే టార్గెట్
నల్లగొండ క్రైం: ప్రేమజంటలు సన్నిహితంగా ఉన్న సమయంలో ఓ సైకో గ్యాంగ్ సెల్ఫోన్లో రహస్యంగా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీడియోలు చూపించి వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు దోచుకుంటున్నారు. అంతేకాకుండా మహిళలు, యువతులపై లైంగికదాడికి పాల్పడుతున్నారు. నల్లగొండ పట్టణంలోని నార్కట్‌పల్లి – అద్దంకి ప్రధాన రహదారి పానగల్ బైపాస్ సమీపంలోని నంద్యాల నరసింహారెడ్డి కాలనీ వద్ద ఈ గ్యాంగ్ వ్యవహారం బయటపడింది. వీరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. నల్లగొండ పట్టణంలోని రాంనగర్‌కు చెందిన ఆరుగురు యువకులు ఒక గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. నల్లగొండ పట్ట ణానికి చెందిన కొందరు ప్రేమ జంటలు, వివాహేతర సంబంధం ఉన్న వారు చెట్లపొదల మధ్య సన్ని హితంగా ఉండడాన్ని పసిగట్టి సెల్ఫోన్లో రహస్యంగా వీడియో తీసి ఆయా జంటలను బ్లాక్ మెయిల్ చేసి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదు దోచుకుంటున్నారు. ఎవరికై నా చెప్తే మీ ఇంట్లో వాళ్లకు ఈ వీడియోలు పంపుతామని, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇస్తేనే వీడియోలను డిలీట్ చేస్తామని వారికి ఫోన్ కాల్స్ చేస్తున్నారు. దీంతో పరువు పోతుందని, వివాహేతర సంబంధం బయట పడుతుందనే ఉద్దేశంతో ఈ విషయాలను బాధితులు ఎవరికీ చెప్పడం లేదు. గత మూడేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెలుగులోకి ఇలా.. ఓ యువకుడు తన ప్రియురాలిని తీసుకొని నంధ్యాల నరసింహారెడ్డి కాలనీ సమీపంలోని నిర్మానుశ్య ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. వారు సన్నిహితంగా ఉన్న సమయంలో గ్యాంగ్‌లోని యువకులు యువతిని బలవంతంగా కొట్టి లైంగిక దాడికి పాల్పడి వీడియో తీశారు. వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు లాక్కున్నారు. అదే సమయంలో వివాహేతర సంబంధం కలిగిన మరో జంట పై ఇదే తరహాలో దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి పోలీసుల దృష్టికి తీసుకురావడంతో ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో విచారిస్తున్నట్లు తెలిసింది. దోపిడీ చేసిన నగదు, బంగారు ఆభరణాలు రికవరీ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే.. అనేక మంది మహిళలు బాధితులుగా ఉన్నట్లు ఫోన్ కాల్‌డేటా ఆధారంగా తెలుస్తోంది. ఈ విషయంపై నల్లగొండ టూటౌన్ ఎస్సై నాగరాజును వివరణ కోరగా.. ఆ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసుల బృందం గాలిస్తున్నట్లు తెలిపారు. -
భర్తపై భార్య రాసిన క్రైం కథా చిత్రంలో మరో మహిళ బలి!
పెనమలూరు: భర్తపై భార్య రాసిన క్రైం కథా చిత్రంలో ఓ మహిళ బలైంది. ప్రియుడితో కలిసి భర్తను జైలుకు పంపుదామని స్కెచ్ వేసి.. అందుకు పరిచయం ఉన్న ఓ మహిళను సాయం కోరి.. చివరకు ఆ మహిళనే చంపేసి.. నేరం భర్తపై తోసేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్ అయ్యింది. సినిమా కథకు ఏ మాత్రం తీసిపోని రీతిలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం సర్కిల్ డీఎస్పీ జయసూర్య మంగళవారం పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.. అసలు ఏమైంది? విజయవాడ కృష్ణలంక బాలాజీనగర్‌కు చెందిన గరిగల నాగమణి (30) కానూరు 100 అడుగుల రోడ్డులో ఈ నెల 14వ తేదీన శవమై కనిపించింది. సమాచారం తెలుసుకున్న సీఐ రామారావు ఘటనా స్థలం వద్దకు వెళ్లారు. మృతురాలు నాగమణి ఫొటోను సోషల్‌మీడియాలో పెట్టగా నాగమణి ఫొటోను గుర్తించిన ఆమె భర్త కిరణ్‌గోపాల్ పోలీసుల వద్దకు వచ్చి ఫిర్యాదు చేశాడు. ఈ కేసును విచారించేందుకు సీఐ రామారావుతో పాటు నాలుగు బృందాలు ఏర్పాటు చేశారు. సీన్ కట్ చేస్తే.. లవ్ స్టోరీ ఇలా.. ప్రసాదంపాడుకు చెందిన రిషేంద్ర, ఐతాబత్తుల మృధులాదేవి(40) 2007లో ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. భర్త ప్రైవేటు కంపెనీలో డెప్యూటీ మేనేజర్‌గా పని చేస్తుండగా, మృధులాదేవి బాడీకేర్ సెంటర్లో పని చేస్తుంది. మృధులాదేవి కృష్ణలంకు చెందిన పోలాసి సాయిప్రవీణ్ (30) అనే వ్యక్తి 2021లో కస్టమర్‌గా వచ్చి పరిచయం అవ్వటంతో అది కాస్త పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత మృధులాదేవీ భర్తను పిల్లలను విడిచిపెట్టి ప్రియుడు సాయిప్రవీణ్‌తో 2022లో వెళ్లిపోయింది. పోలీసుల సాయంతో తిరిగొచ్చినా.. మరలా వెళ్లిపోయింది. ఆ తర్వాత తానే మళ్లీ 2023 ఫిబ్రవరిలో భర్త రిషేంద్ర వద్దకు తిరిగి వచ్చి, తాను మారిపోయానని నమ్మించి, అతని పంచన చేరింది. అసలు కథ ఇక్కడే.. సాయిప్రవీణ్‌కు మృధులాదేవికి ఆమె భర్త రిషేంద్ర అడ్డుగా ఉండటంతో ఇద్దరూ కలిసి పథకం రచించారు. మృధులాదేవి తన భర్త రిషేంద్రను శాశ్వతంగా జైలుకు పంపితే అడ్డు తొలిగి పోతుందని ఆలోచన చేసింది. దీనిలో భాగంగా కృష్ణలంకలో గతంలో సాయిప్రవీణ్ ఇంట్లో అద్దెకు ఉన్న నాగమణిని పావుగా వాడారు. నాగమణికి ఆర్థికసాయం చేస్తానని సాయిప్రవీణ్ ఎరవేశాడు. నాగమణి భర్త 13వ తేదీ ఏలూరుకు వెళ్లిన తరువాత ఆమెను ఎనికేపాడుకు రప్పించాడు. ఆమెను ఆటోలో కానూరు 100 అడుగుల రోడ్డులోకి తీసుకు వచ్చాడు. నాగమణి ఫోన్లోనే ఆమె వాయిస్‌ను సాయిప్రవీణ్ రికార్డు చేశాడు. మృధులాదేవి భర్త రిషేంద్ర తనను శారీరకంగా వాడుకున్నాడని, బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడని, నాకు ఏదైనా జరిగితే రిషేంద్రే కారణమని నాగమణి వాయిస్ రికార్డు చేశాడు. ఆ తర్వాత నాగమణిపై దాడి చేసి చున్నీతో మెడకు బిగించి హత్య చేశాడు. మృతదేహాన్ని అక్కడే వదిలేసి, ఆమె ఫోన్ మాత్రం తీసుకొని అక్కడి నుంచి కంకిపాడు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన తన మిత్రుడు ఎస్. మూర్తిబాబు(28) సహకారంతో వచ్చేశారు. రాత్రి 9.45 గంటలు దాటిన తరువాత నాగమణి వాయిస్ మెసేజ్‌తో పాటు కొన్ని టైప్ చేసిన మెసేజ్‌లు నాగమణి ఫోన్ నుంచే ఆమె భర్త కిరణ్‌గోపాల్‌కు అలాగే మృధులాదేవికి సాయిప్రవీణ్ పంపాడు. దీంతో ఈ హత్య మృధులాదేవి భర్త రిషేంద్ర చేశాడని పోలీసులు అతనిని అరెస్టు చేస్తారని, ఇక తమకు అడ్డుండదని సాయిప్రవీణ్, మృధులాదేవి భావించారు. ఎవిడెన్స్ సేకరణ.. ఈ హత్యకు సంబంధించిన పూర్తి టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ ఫుటేజీలు సేకరించామని డీఎస్పీ జయసూర్య చెప్పారు. నిందితులైన మృధులాదేవి, సాయిప్రవీణ్‌తో పాటు వీరికి సహకరించిన మూర్తిబాబును కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. విలేకరుల సమావేశంలో సీఐ టీవీవీ రామారావు, ఎస్ఐలు ఏసేబు, రమేష్, ఫిరోజ్, ఉషారాణి, సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ దొరికింది క్లూ.. నాగమణి భర్త కిరణ్‌గోపాల్‌కు వచ్చిన మెసేజ్‌లు పోలీసులు పరిశీలించారు. అస్సలు చదువుకోని నాగమణి ఇంగ్లిష్‌లో మెసేజ్ పంపడం, వాయిస్ మెసేజ్‌లో నాగరాణి చాలా కూల్‌గా మాట్లాడటంపై పోలీసులు అనుమానించి లోతుగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో మృధులాదేవి భర్త రిషేంద్రను కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. తన భార్య మృధులాదేవికి కూడా ఈ విధంగానే మెసేజ్‌లు వచ్చాయని రిషేంద్ర పోలీసుల దృష్టికి తీసుకువచ్చాడు. దీంతో అనుమానంతో పోలీసులు మృధులాదేవి గురించి విచారణ చేయగా సాయిప్రవీణ్‌తో ఉన్న వివాహేతర సంబంధం వెలుగు చూ సింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి తమ దైన శైలిలో విచారించగా హత్య కేసు వెలుగు చూసింది. వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తులకు సాయం చేసేందుకు వెళ్లిన నాగమణి హత్యకు గురైంది. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
త్రిపురారం: మండలంలోని బాబుసాయిపేటలో వివాహిత హత్య కేసులో ఆమె ప్రియుడే నిందితుడని పోలీసులు నిర్ధారించారు. వివాహేతర సంబంధం కారణంగానే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం త్రిపురారం పోలీస్ స్టేషన్లో మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. బాబుసాయిపేట గ్రామానికి చెందిన కొండమీది సైదులు కుమార్తె స్వాతికి ఏడేళ్ల క్రితం నిడమనూరు మండలంలోని ఇండ్లకోటయ్యగూడేనికి చెందిన ఉదయగిరి నారాయణతో వివాహం జరిగింది. స్వాతికి ఇండ్లకోటయ్యగూడేనికి చెందిన దోరెపల్లి శ్రీరాములుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం స్వాతి భర్తకు తెలియడంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఈ క్రమంలో స్వాతి బాబుసాయిపేటలో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి అక్కడే ఉంటూ కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తుంది. శ్రీరాములు స్వాతిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలుకుతూ తరచూ బాబుసాయిపేటకు వచ్చి వెళ్తుండేవాడు. అయితే స్వాతికి తెలియకుండా శ్రీరాములు గత సంవత్సరం మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయినప్పటికీ శ్రీరాములు తరచూ స్వాతితో ఫోన్లో మాట్లాడుతుండగా శ్రీరాములు భార్యకు అనుమానం వచ్చి అతడిని నిలదీసింది. తాను స్వాతికి డబ్బులు ఇవ్వాలని అందుకే తరచూ ఆమె ఫోన్ చేస్తుందని శ్రీరాములు తన భార్యకు చెప్పాడు. ఇదే విషయమై శ్రీరాములు అత్తమామలకు అనుమానం కలిగి గ్రామ పెద్దలను ఆశ్రయించారు. దీంతో గ్రామ పెద్దలకు తెలిస్తే తనకు భార్య, కుమారుడు దూరమవుతారని, అదేవిధంగా స్వాతి కూడా తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తుండడంతో ఎలాగైనా ఆమెను అంతమొందిచాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం శ్రీరాములు డిసెంబర్ 28వ తేదీ రాత్రి స్వాతికి ఫోన్ చేసి తన పల్సర్ బైక్‌పై బాబుసాయిపేటకు వచ్చాడు. అప్పటికే మేకల కొట్టంలో నిద్రిస్తున్న స్వాతితో మాట్లాడుతూ ఆమెను చంపాలని అనుకోగా ఏదో అలజడి రావడంతో స్వాతి తల్లిదండ్రులు ఎవరూ అని అడగడంతో స్వాతి తన భర్తే వచ్చాడని తల్లిదండ్రులకు చెప్పింది. తర్వాత శ్రీరాములు స్వాతిని పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి వెనుక నుంచి ఆమె గొంతును కుడి మోచేతితో గట్టిగా అదిమిపట్టి ఎడమ చేతితో ముక్క మూసి ఆమెకు ఊపిరి ఆడకుండా చేశాడు. దీంతో ఆమె మృతిచెందింది. అనంతరం స్వాతి మృతదేహాన్ని మేకల కొట్టంలోకి తీసుకొచ్చి ఎవరికి అనుమానం రాకుండా యథావిధిగా మంచంలో పడుకోబెట్టి ఆమె సెల్‌ఫోన్ తీసుకొని దుగ్గెపల్లి శివారులోని తన మామ సైదులు ఉంటున్న నంద్యాల సతీష్ తోట వద్దకు వెళ్లి అక్కడే ఉన్నాడు. డిసెంబర్ 29న త్రిపురారం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు. విచారణలో భాగంగా మంగళవారం పోలీసులు శ్రీరాములు వద్దకు వెళ్లి ప్రశ్నించగా అతడు నేరాన్ని ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటగిరి తెలిపారు. ఈ హత్య కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన హాలియా సీఐ గాంధీనాయక్, త్రిపురారం ఎస్ఐ వీరశేఖర్, ఏఎస్ఐ రామయ్య, స్టేషన్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. వివాహేతర సంబంధాలతోనే.. ఎక్కువగా వివాహితల హత్యల వెనుక వివాహేతర సంబంధాలే ప్రధాన కారణంగా ఉంటున్నాయని, వివాహేతర సంబంధాలతో కుటుంబాలను రోడ్డుపాలు చేసుకోవద్దని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి సూచించారు. మహిళలకు ఎలాంటి ఆపద ఉన్నా పోలీసులను ఆశ్రయించవచ్చన్నారు. -
ప్రకాశంలో సుపారీ హత్య: ప్రియుడి మోజులో భర్తను కిరాతకంగా..
ప్రకాశం: ప్రియుడి కోసం కట్టుకున్న వాడినే కడతేర్చేంది ఓ మహిళ. గుంటూరు నగరంపాలెం సీఐ కె.మల్లికార్జున కథనం మేరకు.. కురిచేడు మండలంలోని అలవలపాడు గ్రామానికి చెందిన చిన్నకత్తి రామచంద్రయ్య(40) గుంటూరులోని లక్ష్మీనగర్‌లో భార్యాబిడ్డలతో నివాసముంటూ కూలీనాలి చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రామచంద్రయ్య భార్య వెంకటరమణ గుంటూరుకు చెందిన చిన్నా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే తమ సంబంధానికి భర్త రామచంద్రయ్య అడ్డుగా ఉన్నాడని అంతమొందించాలని పథకం పన్నారు. ఇందుకు చిన్నా.. ఇద్దరు కిరాయి హంతకులతో రూ.లక్షకు సుపారీ కుదర్చుకున్నాడు. గత నెల 27వ తేదీ రాత్రి రామచంద్రయ్య పనులకు వెళ్లి నిద్రిస్తున్న సమయంలో వెంకటరమణ, చిన్నా, కిరాయి గూండాలు శ్యామ్, చిన్ను కలిసి కండువాను రామచంద్రయ్య గొంతుకు బిగించి హత్య చేశారు. రామచంద్రయ్య మెడలో ఉన్న బంగారు చైన్‌ను తాకట్టు పెట్టి సుపారీ కింద రూ.60 వేలు ఇచ్చారు. ఆ తరువాత మృతదేహాన్ని అలవలపాడు తీసుకొచ్చి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించి అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే సుపారీ ఒప్పందం ప్రకారం మిగిలిన నగదు ఇవ్వాలని శ్యామ్, చిన్నూ అడగడంతో వారి మధ్య వివాదం మొదలైంది. హత్య విషయం బయటకు పొక్కటంతో గుంటూరు నగరంపాలెం సీఐ కె. మల్లికార్జున సుమోటోగా కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించడంతో రామచంద్రయ్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. గుంటూరు నగరంపాలెం ఎస్సై బి.రవీంద్రనాయక్, గుంటూరు గవర్నమెంట్ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రమోద్‌కుమార్, రుద్ర చారిటబుల్ ట్రస్టు సభ్యులు బుధవారం అలవలపాడు చేరుకున్నారు. తహసీల్దార్ ఎం.జ్వాలానరసింహం, వీఆర్వో కాశయ్య, గ్రామ పెద్దల సమక్షంలో రామచంద్రయ్య మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.