24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
కర్ణాటక: వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి హతయ్యాడు. నిందితులు శవాన్ని జాతీయ రహదారిపై పడేసి ప్రమాదంలో మరణించినట్లుగా చిత్రీకరించాలని చూశారు. ముళబాగిలు పోలీసులు కేసు నమోదు చేసుకుని నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటన ముళబాగిలు పట్టణ సమీపంలోని దొడ్డగుర్కి రహదారిలో చోటు చేసుకుంది.
బీహార్‌కు చెందిన ఉమేష్‌కుమార్ సింగ్ (39) పట్టణ సమీపంలోని జల్లి క్రషర్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అదే క్రషర్లో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన శివాని అనే మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని శివాని భర్త కౌశల్ పసిగట్టాడు. ఉమేష్‌కుమార్ సింగ్‌ను హత్య చేయాలని కల్బుర్గికి చెందిన రమేష్, సోమశేఖర్‌తో కలిసి పథకం రచించాడు. ఉమేష్‌కుమార్‌ను శుక్రవారం రాత్రి 7 గంటలకు శివాని సహాయంతో బయటకు రప్పించారు. కౌశిల్, రమేష్, సోమశేఖర్‌లు ఇనుప రాడ్లతో ఉమేష్‌కుమార్ తలపై బాదారు.
దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇతను ప్రమాదంలో మరణించినట్లుగా చిత్రీకరించడం కోసం శవాన్ని జాతీయ రహదారిపై పడేసి వెళ్లారు. ముళబాగిలు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టి కౌశిల్, రమేష్, సోమశేఖర్, శివానిని అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధంతోనే హత్య జరిగినట్లు తేలింది. దీంతో ఆ నలుగురినీ అరెస్ట్ చేశారు. నిందితులను బంధించిన పోలీసులను ఎస్పీ నిఖిల్, అడిషనల్ ఎస్పీ రశిశంకర్‌లు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment