బెంగళూరులో క్రికెటర్‌ కోహ్లీ పబ్‌పై కేసు | Case against Virat Kohli pub in Bengaluru for lacking designated smoking zone | Sakshi
Sakshi News home page

బెంగళూరులో క్రికెటర్‌ కోహ్లీ పబ్‌పై కేసు

Jun 3 2025 6:18 AM | Updated on Jun 3 2025 10:03 AM

Case against Virat Kohli pub in Bengaluru for lacking designated smoking zone

సాక్షి బెంగళూరు: ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి చెందిన బెంగళూరులోని పబ్, రెస్టారెంట్‌ ‘ఒన్‌ 8 కమ్యూన్‌’ మరోసారి వార్తల్లోకెక్కింది. మే 29న సోదాలు చేపట్టిన పోలీసులు స్మోకింగ్‌ జోన్‌ లేని విషయాన్ని గుర్తించారు. ఇందుకు సంబంధించి మే 31న కేసు నమోదు చేశారు. 

స్థానిక మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న ఈ రెస్టారెంట్, పబ్‌కు సహయజమానిగా ఉన్న కోహ్లీకి, సిబ్బందికి నోటీసులు సైతం జారీ చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, విమానాశ్రయాలు తదితర ప్రాంతాల్లో తప్ప నిసరిగా స్మోకింగ్‌జోన్‌లను ఏర్పాటు చేయాలి. అయితే, ‘ఒన్‌ 8 కమ్యూన్‌’గతంలోనూ ఉల్లంఘనలకు పాల్పడిన సందర్భాలున్నాయి. 2024 జూలై 6న అర్ధరాత్రి దాటాక 1.20 గంటల వరకు పబ్‌ను తెరిచే ఉంచడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అగ్నిమాపక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదంటూ గతేడాది డిసెంబర్‌లో నగర పాలక సంస్థ నోటీసులు పంపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement