యువీ ప్రదర్శనపై ఇప్పుడేమంటారు | Virat Kohli Slams Critics Who Wrote Yuvraj Singh Off | Sakshi
Sakshi News home page

యువీ ప్రదర్శనపై ఇప్పుడేమంటారు

Published Thu, May 15 2014 1:11 AM | Last Updated on Mon, May 28 2018 2:10 PM

యువీ ప్రదర్శనపై ఇప్పుడేమంటారు - Sakshi

యువీ ప్రదర్శనపై ఇప్పుడేమంటారు

విమర్శకులకు కోహ్లి ప్రశ్న
 బెంగళూరు: యువరాజ్ సింగ్ ఫామ్‌లో లేని సమయంలో తీవ్రంగా విమర్శలు గుప్పించిన వారు ఇప్పుడు యువీ ఆటను చూసి ఏమంటారో చెప్పాలని బెంగళూరు కెప్టెన్ కోహ్లి అన్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో యువీ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ‘యువరాజ్ రాణించినందుకు సంతోషంగా ఉంది. ఫామ్‌లో లేని సమయంలో అతడిని అంతా విమర్శించారు.

మరి వాళ్లు ఇప్పుడేమంటారు? అలా మాట్లాడాల్సింది కాదు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా ఫామ్‌లోకి వస్తారో ఎవరికీ తెలియదు. యువీ అద్భుతమైన ఆటగాడు. భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. రాయల్ చాలెంజర్స్ జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుతంగా ఆడాడు. జట్టులో మిగిలిన వాళ్లు కూడా పుంజుకుంటారు’ అని కోహ్లి చెప్పాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement