smoking
-
తలనే లాక్ చేశాడు..! తాళం మాత్రం భార్య చేతిలో..
ధూమపానం సేవించడం అనేది ఓ ఫ్యాషన్‌లా మారింది యువతకు. ఏదో సరదాగా ట్రై చేసి.. చివరికి దానికి అడిక్ట్ అయిపోతున్నారు. కొందరూ మాత్రం పొగరాయుళ్లుగా మారిపోవడం లేదు. మరికొందరికి మాత్రం అదొక బలహీనతలా మారిపోతోంది ఈ వ్యసనం. అయితే ఇలాంటి బలహీనతతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఈ ధూమపాన అడిక్షన్ నుంచి బయటపడేందుకు ఎంతటి భయనాక నిర్ణయం తీసుకున్నాడో తెలిస్తే కంగుతింటారు. అయితే అతడు ఈ వ్యసనాన్ని జయించేందుకు ఇలాంటి నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడం అనేది ప్రశంసించదగ్గ విషయం. ఆ నేపథ్యంలోనే ఆ వ్యక్తి సెన్సేషన్‌గా మారి వార్తల్లో నిలిచాడు కూడా. అతడెవరంటే..టర్కిష్కి చెందిన ఇబ్రహీం యుసెల్(Ibrahim Yucel) పొగ తాగడం మానేయాలని(Quit Smoking) గట్టిగా బీష్మించుకున్నాడు. కానీ ఎంతలా ఆ అలవాటుని వదులుకుందామన్నా..సాధ్యం కాలేదు. తన పిల్లల పుట్టిన రోజులప్పుడు, తమ పెళ్లిరోజు అప్పుడు.. ఇక ఈ రోజు నుంచి సిగెట్ మానేస్తానని ఒట్టు పెట్టుకోవడం..మళ్లీ ఏదో ఒక బలహీన క్షణంలో తెలియకుండానే తాగడం. ప్రతిసారి తన నిర్ణయాన్ని బ్రేక్ చేసేయ్యడం ఓ భయానక బలహీనతగా మారింది. ఇక లాభం లేదనుకుని ఏకంగా బోను(Cage) మాదిరిగా హెల్మెట్‌ని తయారు చేయించుకుని దాన్ని తలకు తగిలించుకుని లాక్ చేసేసుకున్నాడు. బయటకు కూడా మనోడు అలానే వెళ్తాడట. ఎందుకంటే ఎవర్ని చూసినా.. మళ్లీ నాలిక ఓ దమ్ము కొట్టు బ్రదర్.. అంటాదేమోనన్న భయంతో తలకు ఇలా ఇనుప ఊచల బోను మాదిరి హెల్మట్ ధరించుకుని వెళ్తున్నాడు. ఇలా వెళ్లడంతోనే యూసెల్ ఓ సెన్సేషన్ వ్యక్తిగా మారిపోయాడు. ఆ విషయం కాస్త దావనంలా వ్యాపించి మీడియా వరకు చేరడంతో వింత వ్యక్తిగా వార్తల్లో నిలిచాడు. పదకొండేళ్ల క్రితం మీడియాలో బోనులో తలను లాక్ చేసుకున్ని వ్యక్తి అంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి. అయితే కేవలం భోజనం చేసేటప్పడూ లేదా ఏదైనా తినాలనుకున్నప్పుడూ మాత్రమే భార్య లాక్‌ని ఓపెన్ చేస్తుందట. ఆయన ఒకప్పుడు రోజుకి రెండు సిగరెట్ ప్యాకెట్లు హాంఫట్ చేసేవాడట. దీనివల్ల కలిగే అనారోగ్య ప్రమాదాల రీత్యా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నాడు యూసెల్. ఈ వ్యసనం నుంచి బయటపడాని ప్రయత్నించిన ప్రతిసారి ఓడిపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు యూసెల్. మరీ యూసెల్ ఈ వ్యసనం నుంచి పూర్తిగా బయటపడ్డాడా..? లేదా అన్నది తెలియాల్సి ఉంది.కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ(world Health Organisation) కూడా ప్రతి ఏడాది ఈ పొగాకు కారణం దాదాపు ఎనిమిది మిలియన్ల మంది మరణిస్తున్నట్లు చెబుతోంది. మధ్య తరగతి కుటుంబాల్లోనే ఈ వ్యసనానికి సంబంధించిన మరణాలు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. He quit because his father died of lung cancer. pic.twitter.com/RAWSVJvCXY— Clover Lavender (@AyoolaMatthee) November 7, 2024 (చదవండి: కామ్య... అఖండ ఖ్యాతి..! 17 ఏళ్లకే ఏడు పర్వతాలను అధిరోహించింది..!) -
సిగరెట్ కాల్చిన మలేసియా మంత్రికి రూ.95 వేల జరిమానా
కౌలాలంపూర్: కేంద్ర మంత్రి. అందులోనూ కీలకమైన విదేశాంగ శాఖ మంత్రి. బహిరంగంగా సిగరెట్ తాగి ప్రజలకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారని నెటిజన్లు మంత్రి మొహమ్మద్ హసన్‌పై ఆన్లైన్లో విమర్శల వరద పారించారు. ఇంతకీ ఆ మంత్రి చేసిన ఘోర నేరం ఏంటంటే బహిరంగంగా సిగరెట్ కాల్చడం. భారత్‌లోలాగే మలేసియాలోనూ బహిరంగంగా ధూమపానంపై నిషేధం అమల్లో ఉంది. బహిరంగంగా సిగరెట్ కాల్చే పొగరాయుళ్లపై జరిమానాల విధించడం, శిక్షించడం భారత్‌లో ఏ స్థాయిలో అమలవుతోందో భారతీయ పౌరులందరికీ బాగా తెలుసు. ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంట్ ప్రాంగణంలో గతంలో పార్లమెంట్ సభ్యులు ఒకరిద్దరు బహిరంగంగా సిగరెట్ గుప్పుగుప్పుమని కాల్చినా జరిమానా వేసిన పాపానపోలేదు. కానీ మలేసియా ప్రభుత్వం మాత్రం సదరు మంత్రికి జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అక్కడి చట్టాల ప్రకారం బహిరంగ ధూమపాన నేరానికి కనీసం 5,000 రింగెట్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.95,000 జరిమానా విధిస్తారు. తప్పుకు శిక్షగా జరిమానా కట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి హసన్ చెప్పారు. హోటల్ వంటి జనసమ్మర్థ ప్రాంతాల్లో సిగరెట్ కాల్చడం నేరం. అందుకు బేషరతు క్షమాపణ చెబుతున్నట్లు ఆయన చెప్పారు. నెగేరీ సెంబిలాన్ రాష్ట్రంలోని ఒక హోటల్లో ఆరుబయట కూర్చొని స్నేహితులతో సరదాగా మాట్లాడుతూ సిగరెట్ కాల్చుతున్న ఫొటో ఒకటి వైరల్‌గా మారడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే తప్పును తెల్సుకున్న మంత్రి స్వయంగా ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని సంప్రతించి తనకు జరిమానా విధించాలని కోరినట్లు తెలుస్తోంది. తానేం చట్టానికి అతీతుడిని కాదని, మంత్రి స్వయంగా జరిమానా విధించాలని వేడుకున్నారని ఆరోగ్య మంత్రి జుల్కెఫీ అహ్మద్ వెల్లడించారు. వంటశాలలు, రెస్టారెంట్లలో ధూమపానంపై నిషేధం 2019 ఏడాది నుంచి అమల్లో ఉంది. 2024 అక్టోబర్ నుంచి మరింత కఠినమైన నియమనిబంధనలను అమలుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా మంత్రిపైనే విమర్శలు రావడం గమనార్హం. సెరెంబన్ జిల్లా ఆరోగ్య కార్యాలయం నుంచి సదరు నోటీస్‌ను బుధవారం అందుకున్నానని మంత్రి అహ్మద్ వెల్లడించారు. ‘‘ఈ అంశం నిజంగా చర్చనీయాంశమై ఆందోళన కల్గించి ఉంటే సారీ చెప్పేందుకు నేను సిద్ధం. ఆరోగ్య శాఖ ఎంత జరిమానా విధించినా నేను కట్టేస్తా. నాపై మరీ పెద్దమొత్తాలను జరిమానాగా మోపబోరని భావిస్తున్నా’’అని బుధవారం ఒక పత్రికా సమావేశంలో వ్యాఖ్యానించారు. -
కంటికి ‘మంట’ పెట్టేస్తది.. సిగరెట్ అంటించకండి!
కొంతమంది అదేపనిగా, చాలాకాలంగా సిగరెట్స్ తాగుతూనే ఉంటారు. పొగతాగడమన్నది కొద్దిగానైనా లేదా చాలా ఎక్కువగానైనా అది దేహం మీద దుష్ప్రభావం చూపుతూనే ఉంటుంది. స్మోకింగ్ దుష్ప్రభావం ఊపిరితిత్తుల మీద ఎక్కువని చాలామంది అనుకుంటుంటారు గానీ... ఈ అందమైన లోకాన్ని మనకు చూపించే కళ్ల మీద కూడా ఉంటుందని అనుకోరు. స్మోకింగ్ వల్ల కళ్ల మీద పడే దుష్ప్రభావాలు అన్నీ ఇన్నీ కావు. వాటి గురించి తెలుసుకొని, ఆ తర్వాత నుంచైనా పొగ తాగే అలవాటుకు దూరంగా ఉండడం కోసమే ఈ కథనం.కొంతమంది చాలా కాలం నుంచి పొగతాగే అలవాటు కలిగి ఉంటారు. వీళ్లనే ‘క్రానిక్ స్మోకర్స్’ అంటారు. దీర్ఘకాలంగా పొగతాగడం వల్ల కంటికి వచ్చే సమస్యలు ఒకటి రెండూ కాదు సరికదా ఈ జాబితా చాలా పెద్దది.కారణం: పొగాకులో దాదాపు 6,000కు పైగా హానికరమైన విషపదార్థాలు ఉంటాయి. సిగరెట్ కాల్చినప్పుడు వాటిల్లోని అత్యంత హానికరమైనవీ, క్యాన్సర్‌ను కలగజేసేవీ దాదాపు 69 విషపదార్థాల పొగ నేరుగా కంటికీ, ఒంటికీ తాకడం వల్ల అనేకానేక సమస్యలు వచ్చే అవకాశముంది. ఇందులో ఈ కింద ఉన్నవి ముఖ్యమైనవీ, కేవలం కొన్ని మాత్రమే. అర్లీ క్యాటరాక్ట్ : కొందరిలో వయసు పెరుగుతున్న కొద్దీ కంట్లో ఉండే లెన్స్... తమ పారదర్శకతను కోల్పోవడంతో క్యాటరాక్ట్ అనే సమస్య రావడం తెలిసిందే. పొగతాగేవారిలో ఇది చాలా త్వరగా వచ్చేస్తుంది.టొబాకో ఆంబ్లోపియా : పొగాకులోని ‘నికోటిన్’ ప్రభావంవల్ల ‘టుబాకో ఆంబ్లోపియా’ అనే సమస్య వస్తుంది. ఇలా ఆంబ్లోపియా సమస్య వచ్చినవాళ్లలో కంటి నరం (ఆప్టిక్ నర్వ్) దెబ్బతిని ఎదుటనున్న వారి క్లియర్ ఇమేజ్ స్పష్టంగా కనిపించకపోవచ్చు. ఒక్కోసారి అది కేవలం ఓ స్కెచ్లాగానో లేదా నెగెటివ్ లాగానో కనిపించవచ్చు. ఎదుటి దృశ్యం నెగెటివ్‌లా కనిపించడాన్ని ఘోస్ట్ ఇమేజ్ అంటారు.ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీ–జనరేషన్ ఈ సమస్యలో రెటీనా పొరలోని కీలక భాగమైన ‘మాక్యులా’ దెబ్బతింటుంది. దృష్టిజ్ఞానాన్ని ఇవ్వడంలో ఈ మాక్యులాది కీలక పాత్ర. పొగతాగడం వల్ల ఇది చాలా త్వరగా వస్తుంది.ఆప్టిక్ న్యూరోపతి : మనందరి దృష్టిజ్ఞానానికి కారణమయ్యే అత్యంత సంక్లిష్టమైన నరం ‘ఆప్టిక్ నర్వ్’ అనే ఈ నరం దెబ్బతినడంతో వచ్చే సమస్యే ‘ఆప్టిక్ న్యూరోపతి’. విచక్షణ లేకుండా యాంటీబయాటిక్ మందులు, డ్రగ్స్, విషపదార్థాలు వాడటం దీనికి కారణం. సిగరెట్ పొగలోనూ ఉండేవి చాలా హానికారకవిషపదార్థాలతో ‘ఆప్టిక్ న్యూరోపతి’ వచ్చే అవకాశాలెక్కువ.రెటినల్ ఇస్కీమియా : రెటీనాకు తగినంత రక్తసరఫరా జరగకపోవడం వల్ల వచ్చే వ్యాధి ఇది. పొగతాగేవారిలో... పొగలోని విషపదార్థాలు, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైయాక్సైడ్ కారణంగా రక్తకణాలకు ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యం దెబ్బతింటుంది. ఫలితంగా అన్ని కణాల్లో లాగే కంటి కణాలకూ పోషకాలూ, ఆక్సిజన్ అందక΄ోవడంతో ‘రెటినల్ ఇస్కీమియా’ వ్యాధి వచ్చి... అది అంధత్వానికి దారితీసే ప్రమాదం చాలా ఎక్కువ.థైరాయిడ్ ఆఫ్తాల్మోపతి : థైరాయిడ్ ఐ డిసీజ్ అంటూ పిలిచే ఈ వ్యాధిని గ్రేవ్స్ ఆఫ్తాల్మోపతి అని కూడా అంటారు. సొంత వ్యాధి నిరోధక శక్తి తమ సొంత కణాలను దెబ్బతీసే ఆటో ఇమ్యూన్ సమస్య అయిన ఇది... పొగతాగేవారిలో చాలా ఎక్కువ. కార్నియల్ ఎపిథీలియల్ సమస్యలు : కంట్లో ఉండే నల్ల గుడ్డును కార్నియా అంటారు. చూపుజ్ఞానం కలిగించడంలో ఈ నల్లగుడ్డు భూమిక చాలా కీలకం. ఈ నల్లగుడ్డు మీద పారదర్శకమైన ఒక పైపొర ఉంటుంది. దాన్ని ‘ఎపిథీలియమ్’ అంటారు.సిగరెట్ అంటించడం కోసం తరచూ అగ్గిపుల్ల లేదా లైటర్ వెలిగించినప్పుడు, ఆ మంట ప్రభావం కంటికీ ఎంతో కొంత తాకే అవకాశం ఉంటుంది. ఆ మంట మాటిమాటికీ అలా తగులుతుండటం లేదా వేడి సెగగానీ, సిగరెట్ పొగగానీ తరచూ తగులుతుండటంతో ఈ ‘ఎపిథీలియమ్’పొర దెబ్బతినడానికి అవకాశాలెక్కువ. ఎపిథీలియమ్ దెబ్బతింటే కంట్లోంచి నీరు కారడం, కన్ను ఎరుపెక్కడం, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.΄పొగతాగడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు కేవలం ఊపిరితిత్తుల మీదనో లేదా క్యాన్సర్ల రూపంలోనో మాత్రమే కాకుండా ఇలా కంటి మీద కూడా పడటమే కాదు... ఏకంగా చూపును దూరం చేసే అవకాశమూ ఉన్నందువల్ల ఆ దురలవాటును తక్షణం మానేయాలి. ఇవే కాకుండా గర్భవతుల్లో ఒకవేళ పోగతాగే అలవాటు ఉంటే కడుపులో ఉన్న చిన్నారికీ అనేక కంటి సమస్యలు రావచ్చు. ఉదాహరణకు కనుగుడ్లు నమ్మలేనంత చిన్నవిగా మారిపోయే ‘మైక్రో ఆఫ్తాల్మోస్’ అనే వ్యాధి, కళ్లు బాగా ఎర్రబారిపోవడమే కాకుండా కొందరిలో కనురెప్పలు బూడిద రంగులో కనిపించడం (గ్రేయిష్ అప్పియరెన్స్ ఆఫ్ ఐలిడ్స్) వంటి సమస్యలూ రావచ్చు. లక్షణాలు: కంటి సమస్య వచ్చినవారిలో కళ్లు ఎర్రబారడం, కళ్లవాపు, మంటలు, కనుగుడ్లు చిన్నగా మారడం, చూపు సరిగా కనిపించక΄ోవడంతో ΄పాటు నెగెటివ్‌ను చూస్తున్నట్లుగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఏజింగ్ ప్రక్రియతో కంటి చుట్టూ ముడతలు : ΄పొగతాగడం వల్ల కంటి చుట్టూ నల్లగా మారడం, వయసుతోపాటు వచ్చే ముడతల్లాగా (ఏజింక్ స్కిన్ ఫోల్డ్స్) రావడం కూడా ఎక్కువ. క్రానిక్ స్మోకర్స్లో పెదవులు కూడా నల్లగా, బండగా మారిపోతాయి.చికిత్స : పొగతాగడం వల్ల వచ్చిన ఏ కంటి సమస్య అయినప్పటికీ, చూపులో ఏదైనా తేడా కనిపించిన వెంటనే కంటి వైద్యనిపుణులకు చూపించడం అవసరం. లేకపోతే అది అంధత్వానికి దారితీసే ప్రమాదమూ లేక΄ోలేదు. అందుకే డాక్టర్‌కు చూపిస్తే... వచ్చిన సమస్యను బట్టి కంటికి అవసరమైన వైద్యచికిత్స అందిస్తారు. కొందరికి అవసరాన్ని బట్టి కొన్ని విటమిన్ సప్లిమెంట్స్ (అందునా మరీ ముఖ్యంగా బి1, బి2, బి12, బి6 వంటి విటమిన్లు) ఇస్తూ సమస్యను చక్కబరిచేందుకు ప్రయత్నిస్తారు.డాక్టర్ రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్యులు (చదవండి: కంటికి ‘మంట’ పెట్టేస్తది.. సిగరెట్ అంటించకండి!) -
స్మోకింగ్స్ .. ఆ గర్భ శత్రువులే..!
చివరకు సిగరెట్ తాగే అలవాటు ఉంటే ప్యాసివ్ స్మోకింగ్ దుష్ప్రభావాలతో ఆ పొగ తాలూకు దుష్ప్రభావాలు దంపతులిద్దరిపైనా ఉంటాయన్న విషయం అనేక పరిశోధనల్లో తేలిందే. అయితే భర్త ఇంటి బయటెక్కడో సిగరెట్ తాగి ఇంటికి వచ్చినా ఆ పొగ దుష్ప్రభావం దంపతులిద్దరితోపాటు భార్య తాలూకు గర్భధారణపై కూడా పడుతుందంటున్నారు పరిశోధకులు. భర్తకి స్మోకింగ్ అలవాటు ఉన్నప్పుడు అతడి పార్ట్నరైన భార్యకు గర్భధారణ బాగా ఆలస్యం కావచ్చు. దీనికి అనేక కారణాలున్నప్పటికీ... ముఖ్యంగా అతడి స్మోకింగ్ వల్ల భార్యలోని హార్మోన్ సైకిళ్లలోని జీవరసాయనాల్లో మార్పు రావచ్చు. ఫలితంగా ఆమెలో అండాల సంఖ్య బాగా తగ్గవచ్చు. ఒకసారి అండాల సంఖ్య తగ్గితే వాటిని తిరిగి పొందడం సాధ్యంకాదు.మామూలు ఆరోగ్యవంతులైన దంపతులతో పోలిస్తే భర్తకు పొగతాగే అలవాటు ఉంటే... అతడి భార్యకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. అంతేకాదు... గర్భస్రావమయ్యే అవకాశాలూ పెరుగుతాయి. ఒకవేళ గర్భధారణ జరిగాక కూడా బిడ్డ నెలలు నిండకముందే పుట్టే (ప్రీమెచ్యుర్ డెలివరీకి) అవకాశాలూ పెరుగుతాయి. అలా పుట్టే పిల్లల బరువు కూడా చాలా తక్కువగా ఉండే అవకాశముంది. భవిష్యత్తులో వాళ్లకు డయాబెటిస్, గుండెజబ్బులు, స్థూలకాయం వచ్చే అవకాశాలూ ఎక్కువే. ఇక నేరుగా పొగతాగే పురుషుల విషయానికే వస్తే... ఆ దురలవాటు వల్ల వాళ్ల వీర్యంలోని శుక్రకణాల సంఖ్య, నాణ్యత, కదలిక, చురుకుదనం, వాటి ఆరోగ్యం తగ్గుతాయి. అది నేరుగా వారి సంతాన సాఫల్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే సమయానికి గర్భధారణ, మంచి ఆరోగ్యకరమైన శిశువును కోరుకునేవారు ఈ దురలవాటుకు దూరంగా ఉండటమే మంచిది. పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటమన్నది కేవలం సంతాన సాఫల్యం అనే ఒక్క విషయంలోనే కాకుండా పురుషుల సంపూర్ణ ఆరోగ్యంతో ΄ాటు, భవిష్యత్తులో వారి పిల్లల పూర్తి ఆరోగ్యానికీ అది మేలు చేస్తుంది. (చదవండి: పొడవాటి రోడ్డు సొరంగంగా రికార్డు..!) -
వాపింగ్ ఇంత ప్రమాకరమైనదా..? ఆ మహిళ ఊపిరితిత్తుల్లో ఏకంగా..!
ధూమపానం అలవాటు ఎంత ప్రమాదకరమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ చెడు అలవాటుకు బలైన ఎందరో జీవితాలు గురించి విన్నాం. అయినా ఫ్యాషన్ కోసం లేదా ట్రెండ్ అనో చదువుకున్న యువతే పొగకు బానిస్వవ్వుతున్నారు. మూడుపదుల వయసు దాటక మునుపే కాటికి వెళ్లిపోతున్నారు. పొగతో జీవితాలనే చేజేతులారా మసిచేసుకుని విలవిలలాడుతున్నారు. మసిబారిపోతామని తెలిసి ఆస్వాదిస్తున్నారంటే..జీవితమంటే నిర్లక్ష్యమా లేక అహంకారమా అనేది ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం. ఇదంతా ఎందుకంటే ఇక్కడొక మహిళ కూడా ఇలానే పొగకు బానిసై ఊపిరే భారమయ్యే సంకట స్థితిని ఎదుర్కొంది. చెప్పాలంటే చావుకి బతుకు మధ్య క్షణమో యుగంలా బతికింది. ఒక్కసారిగా జీవితం విలువ తెలసుకుని కన్నీళ్లు పెట్టింది. పొగబారిపోయిన జీవితాన్ని నయం చేసుకుని బతికిబట్టగలిగేందుకు మృత్యువుతో భయంకరంగా పోరాడింది. చివరికీ..అసలేం జరిగిందంటే..అమెరికాకు చెందిన జోర్డాన్ బ్రియెల్ అనే 32 ఏళ్ల మహిళకు యుక్త వయసు నుంచి ధూమపానం అలవాటు ఉంది. అయితే అది రాను రాను అలవాటుగా మారి ఎలక్ట్రానిక్ సిగరెట్లు(వాపింగ్) తాగేంత వరకు వచ్చింది. వాటికోసం ప్రతి వారం రూ. 40 వేల వరకు ఖర్చుపెట్టేది. జేబు చిల్లుపడేలా సిగరెట్లకే ఖర్చేపెట్టేసిది మొత్తం డబ్బంతా. దీంతో ఒక్కసారిగా ఆమె ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కి గురై ఆమె ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారిపోయింది. ఊపిరి సలపని దగ్గుతో నరకయాతన అనుభవించింది. ముక్కు నుంచి నోటి నుంచి ఒకవిధమైన నలుపు రంగు శ్లేష్మంతో ఉలుకు పలుకు లేని జీవచ్ఛవంలా అయిపోయింది. ఇక బ్రియెల్ బతకనేమో అనే స్థితికి వచ్చేసింది. ఊపరి పీల్చుకోవడమే అత్యంత భారంగ మనుగడ కష్టం అనేలా అయిపోయింది పరిస్థితి. అయితే వైద్యులు ఆమె ఊపిరితిత్తుల్లో ఉన్న రెండు లీటర్ల విషపూరిత ద్రవాన్ని తొలగించి నయమయ్యేలా చేశారు. నెమ్మది నెమ్మదిగా కోలుకున్న బ్రియెల్ తాను మళ్లీ ఇలా బతికి బట్టకట్టగులుగుతానని అనుకోలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. పొగ అంటేనే భయపడిపోయే స్థితికి వచ్చేసింది. అది తన జీవితాన్ని ఎంత నరకపాయంగా మార్చింది గుర్తుతెచ్చుకుని కన్నీటిపర్యంతమయ్యింది. వాపింగ్ అనే ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్లు ఎంత హానికరం అని చెప్పేందుకు బ్రియెల్ ఉదంతమే ఓ ఉదహరణ.వాపింగ్ అంటే..ఇక్కడ వాపింగ్ అంటే ద్రవ రుచిని అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేసినప్పుడు, పీల్చే ఏరోసోల్ ఏర్పడుతుంది. దీన్ని పీల్చుతూ అనందంపొందుతుంటారు పొగరాయళ్ళు. సిగరెట్లకు మంచి ప్రత్యామ్నాయంగా భావించి దీనికి అలవాటు పడుతున్నారు. వాస్తవానికి అనేక రసాయనాలను వాపింగ్‌లో ఉపయోగిస్తారు. వాటిని వేడి చేసినప్పుడు అవి చాలా విషపూరితంగా మారి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. ఈ వేప్‌లను వేడి చేసినప్పుడు, విషపూరిత రసాయనాలు వేగంగా లీక్ అవుతాయని, ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని ఒక పరిశోధన వెల్లడించింది. అంతేగాదు దీనికి అలవాటు పడితే మాత్రం ఊపిరితిత్తులు దారుణంగా దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. (చదవండి: 50 ఏళ్ల మిస్టరీకి చెక్..కొత్త బ్లడ్ గ్రూప్‌ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు..!) -
అంత ఈజీగా స్మోకింగ్ అలవాటును వదిలేయొచ్చా..! ఏకంగా 24 ఏళ్లుగా..
కొన్ని చెడు అలవాట్లను విడిచిపెట్టడం అంత ఈజీ కాదు. అలవాటు కాకుండానే ఉండాలి. మంచిది కాదు అని తెలిసి విడిచిపెట్టడం ఓ పట్టాన సాధ్యం కాదు. అందుకు ఎంతో బలమైన సంకల్పం ఉంటే గానీ సాధ్యంకాదు. ముఖ్యంగా సిగరెట్టు లాంటి అలవాట్లను దూరం చేసుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఈ వ్యక్తి ఏకంగా 24 ఏళ్లుగా ఉన్న అలవాటును సులభంగా స్వస్తి చెప్పి స్ఫూర్తిగా నిలిచాడు. అంతేగాదు సిగరెట్ట అలవాటు మానాలి అనుకునే వాళ్లు వెంటనే ఇది చదివేయండి.రిటైల్ అండ్ ఛానెల్ సేల్స్ ప్రొఫెషనల్ కులకర్ణి అనే వ్యక్తి 24 ఏళ్లుగా రోజుకు పది సిగరెట్లకు పైగా తాగేవాడు. అయితే ఏమైందో ఏమో గానీ ఉన్నట్లుండి ఈ ఏడాది శ్రీ కృష్ణజన్మాష్టమి రోజు నుంచి సిగరెట్టు ముట్టకూడదని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే అలా దాదాపు 17 రోజుల వరకు ఆ వ్యక్తి సిగరెట్టు జోలికే వెళ్లలేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకోవడంతో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు అతడి సంకల్ప బలాన్ని మెచ్చుకుంటూ తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. అంతేగాదు కొందరూ ఈ చిట్కాలు పాటిస్తే సులభంగా స్మోకింగ్ స్వస్తి చెప్పొచ్చు అంటూ సలహాలు ఇస్తు పోస్టులు పెట్టడం విశేషం. I have been smoking 10 cigarettes a day for the last 24 years daily.Don't want to do the math and arrive at a total, it's scary !On the day of Janmashtami this year, I decided to quit and it's been 17 days since I touched a cigarette.So happy for myself !!!— Rohit Kulkarni (@RohitKoolkarni) September 10, 2024 (చదవండి: "నెయ్యి టీ"నా..! ఎన్ని లాభాలో తెలుసా?) -
‘పొగ’బెడుతున్నా...పొమ్మనలేమా?
నగరానికి చెందిన ఒక బహుళజాతి సంస్థలో ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ తన యుక్తవయస్సు నుంచి ధూమపానం చేస్తున్నాడంటే... అతని ఆదాయంలో గణనీయమైన భాగాన్ని పొగాకుపై ఖర్చు చేస్తున్నట్లే అర్థం. ఉత్సుకత, తోటివారి ఒత్తిడితో, కుటుంబ సభ్యుడు ఒకరు పొగతాగుతున్నట్లు చూసిన తర్వాతే అతనికి ధూమపానం అలవాటు ప్రారంభమైంది. సామాజిక అలవాటుగా మొదలై, ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఒక విధానంగా పరిణామం చెందింది. ఆరోగ్య ప్రమాదాలు తెలిసినప్పటికీ, దాన్ని విడిచిపెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, కష్టపడినా దాన్ని అతను ఆపలేకపోయాడు. ఇది ఒకరికే ప్రత్యేకమైనది కాదు; ఇది దేశంలోని లక్షలాది మందికి సంబంధించింది.నియంత్రణలో సవాళ్లెన్నో...భారతదేశంలో, ప్రత్యేకించి ఆర్థికంగా వెనుకబడిన జనాభా కారణంగా పొగాకు నియంత్రణ సంక్లిష్టమైన సవాలును విసురుతుంది. పొగాకు ఉత్పత్తులపై అధిక పన్నుల వల్ల వ్యక్తులు ఈ ఉత్పత్తులపై ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది. ఇది వారి ఆర్థిక ఇబ్బందులను మరింత తీవ్రం చేస్తుంది. అలాగే అధిక పన్నులు అక్రమ పొగాకు వ్యాపారానికి కూడా ఆజ్యం పోస్తున్నాయి. మూడవదిగా చెపపుకోవాల్సింది పొగాకు వినియోగదారులు పొగాకు సంబంధిత వ్యాధుల కారణంగా ఆరోగ్య సంరక్షణ ఖర్చులను అధికం అవుతున్నాయి. ఇది వారి ఆర్థిక పరిస్థితిని మరింత భారంగా మారుస్తుంది.పొగాకు వాడకంలో... రెండో స్థానం...ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగం అత్యధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి.. 2018 నాటికి 16 నుంచి 64 ఏళ్ల వయస్సు ఉన్న 250 మిలియన్ల మంది ధూమపానం చేస్తున్నారు. 2020 నాటికి 15 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలో 27% మంది పొగాకుకు బానిసలని తేలింది.. పొగాకు వినియోగదారులతో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. ముఖ్యంగా, చట్టబద్ధంగా ఉత్పత్తి చేస్తున్న సిగరెట్లు మొత్తం పొగాకు వినియోగంలో 8% మాత్రమే ఉండగా, మిగిలిన 92% బీడీలు పొగాకు నమలడం వంటి చౌకైన ఉత్పత్తులను వినియోగానిదే కావడం గమనార్హం.ఆడవారిలోనూ పెరుగుతున్న వినియోగం...జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019–21 ప్రకారం... పురుషులు స్త్రీల మధ్య పొగాకు వినియోగంలో గణనీయమైన వ్యత్యాసం ఉన్నప్పటికీ... మరోవైపు ఆడవారిలో సైతం పొగాకు వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఒత్తిడి మారుతున్న సామాజిక ఆర్ధిక పరిస్థితుల కారణంగా మగవారిలో ఇప్పటికీ పొగాకు వినియోగం గణనీయంగా ఉంది. పొగాకు వినియోగం ఆర్థికంగా బలహీన వర్గాల్లో ఎక్కువగా ఉంది, వీరికి పొగాకు సంబంధిత హాని ఎక్కువగా ఉంటుంది. విషపూరిత పదార్థాలతో నిండి, ఫిల్టర్లు లేకపోవడం వల్ల బీడీలు సిగరెట్ కంటే ఎక్కువ హానికరమైనవి అయినప్పటికీ, బాగా వినియోగిస్తారు. . బీడీ ఉత్పత్తి మార్కెటింగ్ లపై పెద్దగా తనిఖీలకు అవకాశం లేదు. వీలు కల్పిస్తుంది. చౌకైన పొగాకు ఉత్పత్తుల విక్రయం పేదరికపు ఉచ్చును శాశ్వతం చేస్తుంది.ప్రత్యామ్నాయాలు లేక...మానలేక...యువకులలో (20–44 ఏళ్ల వయస్సులో) ధూమపానం ప్రాబల్యం ఆందోళనకరంగా ఉంది, ఇది శ్రామికశక్తిలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉందనేది మరవకూడదు. నికోటిన్ గమ్‌లు, ప్యాచ్‌లు, లాజెంజ్‌లు, హీట్–నాట్–బర్న్ వంటి ఇతర సాంకేతిక ప్రత్యామ్నాయాలు లేకపోవడం వల్ల 45% మంది యువకులు ధూమపానం లేదా పొగాకు నమలడం మానుకోలేకపోతున్నారని గత ఏడాది ఒక సర్వే తేటతెల్లం చేసింది. ‘హ్యూమన్–సెంట్రిక్ అప్రోచ్ టు టుబాకో కంట్రోల్’ నివేదికలోని సమీక్షకు స్పందించిన వారిలో 66% మంది 20–25 సంవత్సరాల మధ్య పొగాకును ఉపయోగించడం ప్రారంభించారని, వారి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుకున్నామని గుర్తించారు.ఇది చదవండి: దున్నపోతు మాట దేవుడెరుగు.. పోతావుపైకి!సమగ్రవిధానంతోనే పరిష్కారం...పొగాకు నివారణలో పొగాకు వినియోగానికి దోహదపడే సామాజిక సాంస్కృతిక కారకాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పొగాకుపై పూర్తి నిషేధం ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే ఇది పొగాకు సాగులో నిమగ్నమైన రైతులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. పన్ను ఆదాయాన్ని తగ్గిస్తుంది అక్రమ వ్యాపారాన్ని పెంచుతుంది. బదులుగా, విరమణ విద్య రెండింటిపై దృష్టి పెట్టి మరింత సమగ్ర విధానానికి మారాలి.అలాగే, 74% మంది ధూమపానం చేసేవారు, పొగాకు నమిలే వినియోగదారుల కుటుంబంలో పెద్దలు సైతం ధూమపానం అలవాటును కలిగి ఉన్నట్టు తెలుస్తోంది, ఈ పరిస్థితుల్లో వారికి సుదీర్ఘమైన మద్దతు అవసరం. సైన్స్ ఆధారిత పరిష్కారాలు, ప్రగతిశీల విధానాలు, ప్రభుత్వ సంస్థలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, విద్యావేత్తలు కమ్యూనిటీ వాటాదారుల మధ్య సహకారాన్ని పెంపొందించడం ద్వారా, భారతదేశం పొగాకు వినియోగాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు దానితో సంబంధం ఉన్న పేదరికం వ్యాధుల చక్రాన్ని అడ్డుకోవచ్చు. -
ఓ వ్యక్తి గొంతులో అసాధారణ పరిస్థితి..కంగుతిన్న వైద్యులు
పలువురు వింతగొలిపే సమస్యలతో బాధపడుతుంటారు. ఒక్కోసారి అవి వైద్య పరిజ్ఞానానికే అందని విధంగా ఉంటాయి కూడా. అలాంటి వింతైన సమస్యతో బాధపడుతున్నాడు 52 ఏళ్ల వ్యక్తి. అయితే అనుహ్యంగా ఓ దురలవాటుకి దూరంగా ఉండటంతో అతని సమస్యను పరిష్కరించడాని వైద్యులకు మార్గం సుగమమయ్యింది. ఇంతకీ అతను ఎలాంటి అరుదైన పరిస్థితిని ఎదుర్కొన్నాడంటే..52 ఏళ్ల ఆస్ట్రియన్ అనే వ్యక్తి చాలా అరుదైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అతను కొన్ని రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎడతెరగని దగ్గు, తదితర సమస్యలతో బాధపడుతూ ఆస్ప్రతిలో చేరాడు. అక్కడ వైద్యులు బ్రోంక్స్కోప్తో జరిపిన వైద్య పరీక్షల్లో..ఆ వ్యక్తి గొంతులోని పరిస్థితిని చూసి విస్తుపోయారు. ఊహించని రీతిలో అక్కడ జుట్టు పెరగడం చూసి గందరగోళానికి గురయ్యారు. నిజానికి ఆ వ్యక్తికి పదేళ్ల వయసులో ట్రాకియోటోమీ చేయించుకున్నాడు. ట్రాకియోటోమీ అంటే.. మెడ వెలుపలి నుంచి శ్వాసనాళంలోకి (విండ్‌పైప్) ఓపెనింగ్ సృష్టించడం ద్వారా ఊపిరితిత్తులకు గాలి, ఆక్సిజన్ చేరుకోవడంలో సహాయపడే ప్రక్రియ.ట్రాకియోటోమీ ఉన్న వ్యక్తి ఓపెనింగ్‌లో చొప్పించిన ట్రాకియోటోమీ ట్యూబ్ ద్వారా శ్వాస తీసుకుంటాడు. దీని కారణంగా అతని శ్వాసనాళంలో ఓపెనింగ్ ఉంటుంది. అక్కడ అతని చెవి నుంచి తీసిన చర్మం, మృదులాస్థితో అంటుకట్టుట పద్ధతిలో ఆ ఓపెనింగ్‌ని స్థిరీకరించేలా చేశారు వైద్యులు. సరిగ్గా ఆ ప్రాంతంలో అసాధారణ రీతిలో వెంట్రుకలు పెరగడం మొదలయ్యింది. అవి ఏకంగా ఆరు నుంచి తొమ్మిది వరకు.. సుమారు రెండు అండుళాల మేరు పొడవుగా ఉన్నాయి. అందువల్ల అతని గొంతు బొంగరుపోయి, దగ్గు వంటి సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో వైద్యులు ఆ వెంట్రుకలను తొలగంచే ప్రక్రియ చేపట్టారు. ఇలా సదురు వ్యక్తి 14 ఏళ్ల పాటు ఆస్పత్రిని సందర్శించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అతడే తనకున్న ధూమపానం దురలవాటుకి దూరంగ ఉంటూ ఉండటంతో అనూహ్యంగా వాటి పెరుగుదల తగ్గింది. వైద్యులు కూడా అతడిలో వచ్చిన సానుకూల మార్పుకి అనుగుణంగా ఎండోస్కోపిక్ ఆర్గాన్ ప్లాస్మా కోగ్యులేషన్ అనే కొత్త విధానానంతో జుట్టు పెరుగుదల శాశ్వతంగా చెక్కుపెట్టారు. ఇక్కడ ఈ వ్యక్తిని చూస్తుంటే.. మనకున్న దురలవాట్లే మనలను అనారోగ్యం పాలు జేస్తుందనడానికి ఈ ఘటనే ఉదాహరణ . (చదవండి: ఇలాంటి జిమ్ సెంటర్లకి వెళ్లకపోవడమే మేలు...!) -
Anti tobacco day: దున్నపోతు మాట దేవుడెరుగు.. పోతావుపైకి!
‘పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్’ అని అప్పుడెప్పుడో గిరీశం సెలవిచ్చాడు కానీ... అదెంత అబద్ధమో... పొగ ఆరోగ్యానికి ఎంత హానికరమో ఇప్పుడు ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒకవైపు పొగాకు వినియోగంపై అవగాహన పెరుగుతున్నా... ఇంకా అజ్ఞానంలో ఉన్నవారూ కొనసాగుతున్నారు. ఒకరకంగా చూస్తే పెరిగిపోతున్నారు. ఇలాంటి వారిలోనూ ధూమపానం వ్యతిరేక ప్రభావాలపై అవగాహన పెంచేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగమే ఈ నాటి పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఈ లక్ష్యాన్ని సాధించామనుకోండి... ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రస్తుతం 80 లక్షలుగా ఉన్న పొగాకు సంబంధిత మరణాలను గణనీయంగా తగ్గించవచ్చున్నమాట!ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారంటే..1987లో, డబ్యూహెచ్ఓలోని సభ్య దేశాలు ఏప్రిల్ 7ని ప్రపంచ ధూమపాన నిరోధక దినోత్సవంగా గుర్తించాయి. అయితే పొగాకు సంబంధిత సమస్యలన్నింటిపై అవగాహన పెంపొందించే ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పాటించాలని 1988లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అప్పటి నుంచి డబ్యూహెచ్ఓ దాని సభ్య దేశాలు ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.పొగాకు వినియోగ గణాంకాలు:వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం ఏటా పొగాకు సంబంధిత వ్యాధుల కారణంగా దాదాపు 8 మిలియన్లకు పైగా ప్రజలు మరణిస్తున్నట్లు పేర్కొంది. అలాగే దాదాపు 1.3 మిలియన్ల మంది ధూమపానం చేయనివారు సెకండ్‌హ్యాండ్ స్మోక్‌కి గురయ్యి, అనారోగ్యాల బారిన పడుతున్నట్లు తెలిపింది. అంతేగాదు ప్రపంచంలోని దాదాపు 1.3 మిలియన్ల పోగాకు వినియోగదారుల్లో సుమారు 80% మంది మధ్య ఆదాయ దేశాల్లో నివశిస్తున్నారు. కేవలం 2020లో ప్రపంచ జనాభాలో 22.3% మంది పొగాకును ఉపయోగించినట్లు అంచనా. వారిలో 36.7% మంది పురుషులు, 7.8% మంది మహిళా వినియోగదారులు ఉన్నాట్లు వెల్లడయ్యింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా 37 మిలియన్ల మంది యువకులు ధూమాపానాన్ని సేవిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది థీమ్:ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం 2024 థీమ్ “పొగాకు పరిశ్రమ జోక్యం నుంచి పిల్లలను రక్షించడం”. ఈ థీమ్‌ని ఇతివృత్తంగా చేసుకుని పొగాకు వాడకం వల్ల కలిగే హానికరమైన ఆరోగ్య ప్రభావాల గురించి అవగాహన పెంచడం, ధూమపానం దూరంగా ఉండేలా ప్రజలను ప్రోత్సహించేలా చేయడం వంటివి చేస్తారు అధికారులు. అంతేగాదు ఈ పొగాకు అడిక్షన్ నుంచి ఎలా బయటపడాలి వంటి అవగాహన కార్యక్రమాలను కూడా చేపడతారు. ఈ పొగాకులో దాదాపు ఐదు వేల నుంచి ఏడు వేల రసాయనాలు ఉంటాయి. అవి సుమారు 50 నుంచి 60 రకాల కేన్సర్ కారకాలని నిపుణులు చెబుతున్నారు. పొగాకులో ఉండే నికోటిన్ అనే రసాయనం డోపమైన్, అసిటైల్కోలిన్, నోర్పైన్ఫ్రైన్, సెరోటోనిన్ వంటి ఆనందకరమైన హార్మోన్లను విడుదల చేసి వ్యసపరుడిగా మారుస్తుంది. ఇది క్రమేణ అధిక రక్తపోటు, పక్షవాతం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, జీర్ణ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొగాకు అడిక్షన్ నుంచి బయటపడాలంటే..మన వంటింటిలో ఉపయోగించే వాటితోనే పొగాకు అడిక్షన్‌కు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..ధూమపానం సేవించాలనే కోరిక గలిగనప్పుడూ ప్రత్నామ్నాయ మార్గాలను ఎంచుకోండి. ఆ కోరికను అదుపులో పెట్టుకోలేనట్లు అనిపించనప్పుడూ ఈ క్రింది ఆహార పదార్థాలను పత్యామ్నాయంగా ఉపయోగించండని చెబుతున్నారు నిపుణులు.పుదీనా ఆకులు నమలడం, లేదా పుదీనా నీళ్లు తాగడం. పండ్లు, పచ్చి కూరగాయలు తినడంనీళ్లు ఎక్కువగా తాగడందాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు వంటివి నమలడంగోరు వెచ్చని పాలు తాగడంనిమ్మకాయ నీళ్లు వంటివి తాగాలిపైవాటిలో మీకు నచ్చినవి తాగేందుకు ప్రయత్నిస్తూ ఆ కోరికను నియంత్రించడం వంటివి చేస్తే సులభంగా పొగాకు అడిక్షన్ నుంచి బయటపడతారు. మొదట్లో ఇబ్బందిగా అనిపించినా.. రాను మీకు తెలియకుండానే మంచి ఆహారపు అలవాట్లకు అలవాటు పడతారు. దీంతో పాటు చక్కటి వ్యాయమం లేదా ఏదైనా వర్కౌట్లతో మైండ్‌ని డైవర్ట్ చేస్తూ.. ఉంటే శారీకంగానూ, మానిసకంగానూ స్ట్రాంగ్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.(చదవండి: అంతరిక్ష వ్యర్థాలకు చెక్ పెట్టేలా 'చెక్క ఉపగ్రహం'..ప్రపంచంలోనే..!) -
ఆ సినిమా తర్వాత సిగరెట్‌కు బానిసయ్యా.. : విద్యాబాలన్
సినిమా వాళ్ల రూటే సెపరేటు.. వారికి పొగ తాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు ఉన్నా, లేకున్నా సరే.. కథ డిమాండ్ చేస్తే కళ్లు మూసుకుని ఫాలో అయిపోతారు. ఇష్టం లేకపోయినా ముక్కు మూసుకుని మందు తాగేస్తారు. కష్టంగా ఉన్నా దమ్ము కొడతారు. సినిమా అయిపోయాక మాత్రం వాటిని అంత ఈజీగా వదిలేయలేరు. తనకూ అలాంటి పరిస్థితే ఎదురైందంటోంది హీరోయిన్ విద్యాబాలన్.రోజూ సిగరెట్లు..తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సిగరెట్ ఎలా తాగుతారో తెలుసు కానీ నేనెన్నడూ ట్రై చేయలేదు. డర్టీ పిక్చర్లో నేను స్మోక్ చేయాలి. ఊరికే తాగుతున్నట్లుగా నటిస్తే ఆ పాత్ర పండదు. అందుకే సిగరెట్ తాగడం నేర్చుకున్నాను. ఆ సినిమా తర్వాత దానికి ఎంత అడిక్ట్ అయిపోయానంటే రోజుకు రెండు, మూడు సిగరెట్లు కాలిస్తే కానీ మనసు శాంతించేది కాదు. కానీ అప్పట్లో ఆడవాళ్లు ధూమపానం చేస్తే ఎంతో పెద్ద నేరంగా చూసేవారు. ఇప్పుడు ఆ ధోరణి కాస్త తగ్గిందనుకోండి.ఆ స్మెల్ ఇష్టంధూమపానం ఆరోగ్యానికి హానికరమేమీ కాదని ఎవరైనా చెప్పుంటే ఇప్పటికీ ఆ అలవాటుకు బానిసగానే ఉండేదాన్ని. ప్రస్తుతమైతే సిగరెట్లు తాగడం లేదు. అయితే కాలేజీ చదివే రోజుల్లో బస్ స్టాప్‌లో పొగతాగేవారి పక్కన కూర్చున్నప్పుడు ఆ పొగ ఆస్వాదించేదాన్ని. ఆ వాసన నాకు నచ్చేది' అని విద్యాబాలన్ చెప్పుకొచ్చింది. కాగా ఈమె నటించిన దో ఔర్ దో ప్యార్ సినిమా ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోంది. మిక్స్డ్ రివ్యూస్ అందుకున్న ఈ చిత్రం వారం రోజుల నుంచి కేవలం రూ.3.32 కోట్లు మాత్రమే వసూలు చేసింది.చదవండి: మరో హీరోయిన్ పెళ్లి పీటలెక్కబోతోందా? -
స్మోకింగ్ బ్యాన్..! రిషి సునాక్‌పై వ్యతిరేకత
లండన్: బ్రిటన్‌లో స్మోకింగ్ బ్యాన్ చట్టంపై ప్రధాని రిషి సునాక్ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. 2009 తర్వాత పుట్టిన వారికి అంటే.. 15, 15 ఏళ్లలోపు వయసు ఉన్న వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మడాన్ని నిషేధించే చట్టాన్ని సునాక్ గతేడాదే ప్రతిపాదించారు. మంగళవారం (ఏప్రిల్16) ఈ చట్టాన్ని బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రవేశపెట్టారు. సునాక్ సొంత పార్టీ కన్జర్వేటివ్స్ ఎంపీల్లో కొందరు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. మాజీ ప్రధానులు లిజ్ ట్రుస్, బొరిస్ జాన్సన్‌లు కూడా ఈ చట్టంపై వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చట్టం అమలు చేయడమంటే ప్రజల ఇష్టాఇష్టాలను నియంత్రించడమేననేది వారి వాదన. వేల కొద్ది ప్రజల ప్రాణాలు కాపాడేందుకు, ఒక జనరేషన్‌ను స్మోకింగ్ నుంచి దూరంగా ఉంచేందుకు ఈ చట్టాన్ని తీసుకువస్తున్నామని యూకే హెల్త్ సెక్రటరీ విక్టోరియా అట్కిన్స్ తెలిపారు. ఈ చట్టం దేశంలో ప్రొడక్టివిటీని పెంచడమే కాకుండా నేషనల్ హెల్త్ సర్వీస్‌పై భారాన్ని తగ్గిస్తుందన్నారు. ఇదీ చదవండి.. మే 15న పదవి నుంచి తప్పుకుంటా: లూంగ్ -
మాష్టారు..పొగమానేయండి! లేదంటే మీరు డైమండ్ డక్కే!
ధూమపానం అనేది శతాబ్దాలుగా సమాజాన్ని పీడిస్తున్న పెద్ద దురలవాటు. పొగరాయుళ్లు పొగ తాగవద్దని ఎంత చెప్పినా వినరు. ఆ అలవాటు, ఒక ఎడిక్షన్‌లా మారిపోయి, ప్రాణం మీదికి వచ్చేదాకా తెచ్చుకుంటారు. గుండెజబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, వంధ్యత్వం ఆఖరికి కేన్సర్ లాంటి ప్రాణాంతక జబ్బులొస్తాయని తెలిసి కూడా ఈ దురలవాటును మానుకునేందుకు చాలామంది ఇష్టపడరు. పరిస్థితి చేయి దాటిన తరువాత ఏం చేసినా ఫలితం ఉండదనే సత్యాన్ని గమనించరు. అంతేకాదు ధూమపానం చేయకపోయినా పాగతాగేవారి ద్వారా ఆ పొగను పీల్చడం వల్ల సన్నిహిత కుటుంబ సభ్యులు, చుట్టూ ఉన్నవారు కూడా అనారోగ్యం బారిన పడతారు. వీరినే ప్యాసివ్ స్మోకర్లు అంటారు. ఈ సెకండ్‌హ్యాండ్ స్మోకింగ్ కారణంగా ఉబ్బసం, బ్రోన్కైటిస్ , న్యుమోనియా వంటి శ్వాసకోశ వ్యాధుల బారిన పడతారు. లైంగిక సామర్థ్యంపై దెబ్బ ధూమపానం కారణంగా పురుషుల పునరుత్పత్తి, లైంగిక ఆరోగ్యం దెబ్బతింటుంది. శుక్రకణాల సంఖ్య, వాటి చురుకుదనం తగ్గి పోతుంది. చివరికి వంధ్యత్వానికి దారితీస్తుంది. ధూమపానం పురుషాంగానికి రక్త ప్రవాహం నిలిచిపోతుంది. స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. స్త్రీలలో అయితే సంతానోత్పత్తి తగ్గిపోవడం, గర్భస్రావం, నెలలు నిండకుండానే ప్రసవం ,శిశువుల్లో తక్కువ బరువు పుట్టడం లాంటి ప్రమాదాలుంటాయి. అంతేకాకుండా, గర్భధారణ సమయంలో ధూమపానం పిల్లలలో పుట్టుకతో వచ్చే లోపాలు , అభివృద్ధి లోపాల ప్రమాదాన్ని పెంచుతుంది. తాజాగా డా. శ్రీకాంత్ మిరియాల ఇదే విషయాన్ని తనదైన స్టయిల్లో పొగబాబులకు అర్థమయ్యేలా ట్విటర్లో షేర్ చేశారు. ఆ వివరాలు... డాక్టర్ గారూ కష్టంగా ఉందండి. ఎంత కష్టం? చాలా? ఏం చేసినా? లేదు సార్, అస్సలు నిలబడట్లేదా? కొంచెమే, కానీ అది సరిపోవట్లేదు. అయ్యో? మీరే ఏదో ఒకటి చెయ్యాలి, నా కాపురం నిలబెట్టాలి. సరే, డాప్లర్ పరీక్ష అని ఉంటది, అది చేసుకుని రా! ఇదిగో సార్ రిపోర్టు. అక్కడికి రక్తం… pic.twitter.com/Sfgd2ss0Ba — Srikanth Miryala (@miryalasrikanth) March 4, 2024 (క్రికెట్లో డైమండ్ డక్ అంటే ఒక ఆటగాడు ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండా, ఒక్కపరుగూ చేయకుండా, ఔట్ కావడం) -
ఇవి మార్చితే.. చావును ఏమార్చినట్టే!
మన నిత్య జీవన విధానం, అలవాట్లు వంటివి మన జీవితకాలంపై ప్రభావం చూపుతాయన్నది తెలిసిందే. మరి ఏయే అలవాట్లు, పద్ధతులు మార్చుకుంటే.. 'మరణం' మనకు ఎంతెంత దూరం జరుగుతుందో తెలుసా.. దానిపై ఓ విస్తృత అధ్యయనం జరిగింది. 2011-2013 మధ్య 40 నుం 90 ఏళ్ల మధ్య వయసున్న ఏడు లక్షల మందిపై జరిపిన పరిశోధనలో ఆరు కీలక అంశాలను గుర్తించారు. వీటిని పాటించని వారితో పోలిస్తే.. పాటిందే వారిలో మరణ ప్రమాదం ఎంతవరకు తగ్గుతుందన్నది తేల్చారు. ముఖ్యంగా వ్యాయామం చేయనివారితో పోలిస్తే.. వారంలో కనీసం 150 నిమిషాల సాధారణ వ్యాయామం లేదా 75 నిమిషాల కఠిన వ్యాయామం చేసేవారు. మరణానికి దూరంగా ఉంటారని గుర్తించారు. మానసిక ఒత్తిడి, ఆందో నియంత్రించుకోగలిగితే 29 శాతం, డ్రగ్స్‌కు దూరంగా ఉంటే 380 మరణం రిస్క్ ను తప్పించుకున్నట్టేనని తేల్చారు. చదవండి: Alexi Navalni: కుటుంబ సభ్యులనూ వదలని పుతిన్ దేనిని పాటిస్తే మరణ ప్రమాదం ఎంత శాతం తగ్గుతుంది? -
హుక్కాపై నిషేధం!
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా ఆరోగ్యాన్ని రక్షించే లక్ష్యంతో హుక్కా ధూమపానంపై నిషేధం విధించింది. రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు గురువారం ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. "ప్రజా ఆరోగ్యం, యువతను రక్షించే ఉద్దేశంతో హుక్కాపై రాష్ట్రవ్యాప్త నిషేధం విధించాం. హుక్కా ధూమపానంతో తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయి. అందుకే సిగరెట్లు,ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం (COTPA)ను సవరించాం. హుక్కా ధూమపానాన్ని నిషేధించాలని నిర్ణయించాం." అని ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. ప్రభుత్వం హుక్కా బార్లపై నిషేధాన్ని యోచిస్తోందని, పొగాకు వినియోగానికి చట్టపరమైన వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఆరోగ్య మంత్రి దినేష్ సెప్టెంబరు 2023లోనే ప్రకటించారు. హుక్కాలో ఉపయోగించే పదార్థాలు వ్యసనానికి దారితీస్తాయని అన్నారు. గతేడాది ఇదే తరహాలో హర్యానా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, వాణిజ్య సంస్థల్లో వినియోగదారులకు హుక్కా సేవించడంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇదీ చదవండి: కాశీ, అయోధ్య.. ఇక మథుర: యోగి -
బహిరంగ ప్రదేశాల్లో దూమపానం నిషేధం : ఎస్పీ
పుట్టపర్తి టౌన్: బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ మాధవరెడ్డి హెచ్చరించారు. పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై వైద్య ఆరోగ్య శాఖ ముద్రించిన పోస్టర్లను మంగళవారం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో ఆయన విడుదల చేసి మాట్లాడారు. బహిరంగ ప్రదేశాలతో పాటు విద్యాసంస్థలు వద్ద ధూమపానాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. 18 సంవత్సరాలలోపు వారికి పొగాకు ఉత్పత్తులు విక్రయించడమూ చట్టరీత్యా నేరమన్నారు. జిల్లాలో పొగాకు నిషేధిత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బందితో పాటు అడిషనల్ ఎస్పీ విష్ణు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. -
ఫస్టు నుంచి చూద్దాం!
అందరి షూ ర్యాక్‌లో దుమ్ము పట్టిన వాకింగ్ షూస్ ఉంటాయి. అవి గత సంవత్సరం జనవరి నెలలో కొన్నవి. కొత్త సంవత్సరంలో తీసుకున్న నిర్ణయాలలో భాగంగా, వాకింగ్ చేయాలనుకుని కొన్నవి అవి. ఆ వాకింగ్ ఎన్ని రోజులు సాగిందో. ప్రస్తుతం అవి దుమ్ముకొట్టుకుని, పట్టించుకునే యజమాని కోసం ఎదురు చూస్తూ అలా పడి ఉంటాయి. ఆ దారిన వెళుతున్నప్పుడల్లా ఆ జిమ్ కనిపిస్తూనే ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి రెండు నెలలు వెళ్లి మూడో నెల నుంచి మానేసిన జిమ్. ట్రైనర్ ఇప్పటికీ ఫోన్ చేస్తుంటాడు. జిమ్ నుంచి అలెర్ట్ మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. గత సంవత్సరం కంటిన్యూ చేయలేదు కాని ఈ సంవత్సరం మళ్లీ చేరి కంటిన్యూ చేయాలి అనుకుంటూ ఉంటారు కొందరు. ఉదయం వాకింగ్ ఫ్రెండ్స్ వాకింగ్ చేస్తూనే ఉంటారు. మనం వారు కనిపిస్తే ముఖం తిప్పుకుని వెళ్లిపోతూ ఉంటాం. నాలుగు రోజుల సింగారంగా మన వాకింగ్ ముగిసిపోయి ఉంటుంది. ‘న్యూ ఇయర్ రానివ్వండి. జాయిన్ అవుతాను’ అని వాళ్లు కనిపించినప్పుడల్లా అంటూనే ఉంటారు. తక్షణం అవశ్యం ఆరోగ్యం ‘ఆలస్యం అమృతం విషం’ అన్నారు పెద్దలు. ‘తక్షణం అవశ్యం ఆరోగ్యం’ అనుకోవాలి విజ్ఞులు. ఇవాళ రేపట్లో మనం ఏం తింటున్నామో అందరికీ తెలుసు. విషం. మందులు విషం. కల్తీ గాలి. అయితే పరిగెత్తి చేసే ఉద్యోగాలు లేదా తిష్ట వేసినట్టుగా కదలక కూచుని చేసే కొలువులు... ఆరోగ్యం ఎలా? వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలు నెరవేరాలంటే ఆరోగ్యం ముఖ్యం. అందుకు ప్రయత్నం ముఖ్యం. అక్కడే వస్తుంది చిక్కు. ‘ఆరంభించరు నీచ మానవులు’ అని భర్తృహరి అన్నాడుకాని ‘ఆరంభించడానికి వేచి చూస్తారు సోమరి పోతులు’ అనాలి నిజానికైతే. ‘జనవరి 1 వస్తేనే ఆరంభిస్తా’ అనుకుంటే జనవరి 1 వస్తేనే భోం చేస్తా అనుకోరు ఎందుకో. ఫ్రెష్ స్టార్ట్ ఎఫెక్ట్ జనవరి 1 అంటే కొత్త సంవత్సరం వస్తుంది. క్యాలెండర్ మారుతుంది. అన్నిచోట్ల ఒక కొత్త ఉత్సాహం ఉంటుంది. కనుక కొత్తగా నిర్ణయాలను అమలు చేద్దాం అని చాలామంది అనుకుంటారు. దీనిని ఫ్రెష్ స్టార్ట్ ఎఫెక్ట్ అంటారు. అయితే డాక్టర్ జాన్ నార్క్రాస్ అనే సైకాలజీ ప్రొఫెసర్ ఇలా న్యూ ఇయర్ నిర్ణయాలు తీసుకుంటున్నవారిని గత 40 ఏళ్లుగా పరిశీలిస్తూ ఏమని తేల్చాడంటే– సాధారణంగా న్యూ ఇయర్ నిర్ణయాలలో ముఖ్యమైనవి 2. మొదటిది ఫిట్నెస్ సాధించడం, రెండోది బరువు తగ్గడం. ఫిట్నెస్ సాధించాలనుకునేవారు, బరువు తగ్గాలనుకునేవారు ఒక నెల రోజుల్లో సగానికి సగం మంది వ్యాయామం ఆపేస్తున్నారు. ఆరు నెలల్లో తొంభై శాతం మంది. పది శాతం మందే న్యూ ఇయర్ నిర్ణయాలను కొనసాగిస్తున్నారు. నిర్ణయం తీసుకోవడం ఎందుకు నీరుగారి పోవడం ఎందుకు? మంచి సీజన్ అమెరికా, బ్రిటన్లలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో జిమ్‌లు కిటకిటలాడతాయి. నవంబర్, డిసెంబర్ వచ్చేసరికి ఖాళీ అయిపోతాయి. కొత్త సంవత్సరం ఉత్సాహం, నిర్ణయం నిలబడకపోవడమే కారణం. నిపుణులు ఏమంటున్నారంటే మీరు, మీ చుట్టూ ఉండే వాతావరణం ఎప్పుడు ఉత్సాహం గా ఉంటే అప్పుడు నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి అని. ఉదాహరణకు మనకు వేసవి కాలం ఉత్సాహంగా అనిపిస్తే అప్పుడు మొదలెట్టి కొనసాగించాలి. లేదా నవంబర్ మంచి సీజన్ అనుకుంటే మొదలెట్టాలి. అమెరికాలో జనవరి నెల చలిలో మొదలెట్టే వ్యాయామాలు కొనసాగించడం సాధ్యం కావడం లేదని తేల్చారు. మన దగ్గర కూడా జనవరి చలి. ఆ చలిలో ఉదయాన్నే లేవలేక న్యూ ఇయర్ రెజల్యూషన్ పాటించడం లేదని బాధపడి... ఇదంతా ఎందుకు? ఈ రోజు నుంచే మొదలెట్టొచ్చు కదా. ముఖ్యం... చాలా ముఖ్యం ఆరోగ్యం కోసం కష్టపడటం ముఖ్యం. చాలా ముఖ్యం. ఏదో ఒక మంచి సందర్భంలో వజ్ర సంకల్పం తీసుకోవాలి. ఆల్కహాల్ తగ్గిస్తాను, స్మోకింగ్ మానేస్తాను, ఫేస్బుక్ కట్టేస్తాను, పిల్లలతో గడుపుతాను, యోగా చేస్తాను, నాన్‌వెజ్ వారంలో ఒక్కరోజే... ఇలా ఏ మంచి నిర్ణయమైనా మీకు మేలు చేస్తుంది. నేటి మీ నిర్ణయం రేపు మీ యోగం. -
ధూమపానంతో క్యాన్సర్ గాక ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా!
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని మనకు తెలుసు. కానీ ధూమపానంతో క్యాన్సర్ తో పాటూ ఎన్నో ఆరోగ్య సమస్యలు లింక్ అయ్యి ఉన్నాయో తెలుసా. ఒకరకరంగా చెప్పాలంటే సిగరెట్ కాల్చడం లేదు మన ఆరోగ్యానన్ని మనమే చేజేతులారా తగలెట్టుసుకుంటున్నాం అన్నాలి అంటున్నారు ఆయుర్వేద వైద్యులు నవీన్ నడిమింటి. దీని వల్ల వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలేంటో ఆయన మాటల్లో చూద్దామా! ఊపిరితిత్తుల వ్యాధులు ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్, క్షయ, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి (COPD), బ్రోన్కైటిస్ తోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ఊపిరితిత్తుల వ్యాధులకు ప్రధాన కారణం. 1. ఊపిరితిత్తుల క్యాన్సర్: ఇది ఊపిరితిత్తుల కణజాలంలో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణం. ధూమపానం చేసేవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ధూమపానం చేయనివారి కంటే 20-30 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 2. క్షయ: ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి. ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది, కానీ ఇది శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేయవచ్చు. ధూమపానం చేసేవారిలో క్షయ వచ్చే ప్రమాదం ధూమపానం చేయనివారి కంటే 20-30 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 3.-COPD అనేది ఊపిరితిత్తుల యొక్క పరిమిత గాలి ప్రవాహం వల్ల వచ్చే ఒక సమూహం. ఇందులో బ్రోన్కైటిస్ మరియు ఎంఫిసెమా ఉన్నాయి. ధూమపానం COPDకి ప్రధాన కారణం. ధూమపానం చేసేవారిలో COPD వచ్చే ప్రమాదం ధూమపానం చేయనివారి కంటే 20-30 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 3. బ్రోన్కైటిస్: బ్రోన్కైటిస్ అనేది ఊపిరితిత్తుల శ్వాస గొట్టాల వాపు. ఇది తీవ్రమైన లేదా దీర్ఘకాలికంగా ఉండవచ్చు. తీవ్రమైన బ్రోన్కైటిస్ సాధారణంగా వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీర్ఘకాలిక బ్రోన్కైటిస్ COPD యొక్క ఒక రకం. ధూమపానం తీవ్రమైన మరియు దీర్ఘకాలిక బ్రోన్కైటిస్‌కు ప్రధాన కారణం. గుండె జబ్బులు ధూమపానం గుండెపోటు, స్ట్రోక్ తోపాటు ఇతర గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. 1.-గుండెపోటు: ఇది గుండెకు రక్త సరఫరా తగ్గినప్పుడు వచ్చే అత్యవసర పరిస్థితి. ధూమపానం గుండెపోటు ప్రమాదాన్ని 3 రెట్లు పెంచుతుంది. 2. స్ట్రోక్ ఇది మెదడుకు రక్త సరఫరా తగ్గినప్పుడు వచ్చే అత్యవసర పరిస్థితి. ధూమపానం స్ట్రోక్ ప్రమాదాన్ని 2 రెట్లు పెంచుతుంది. 3. ధూమపానం కొరోనరీ ఆర్టరీ వ్యాధి గుండె వైఫల్యం, గుండె సంబంధిత క్యాన్సర్ వంటి ఇతర గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇతర క్యాన్సర్లు ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు మూత్రపిండ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ మరియు ప్యాంక్రియాస్ క్యాన్సర్ వంటి ఇతర క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది. 1. మూత్రపిండాల క్యాన్సర్ ఇది మూత్రపిండాలలో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం మూత్రపిండ క్యాన్సర్ ప్రమాదాన్ని 2-3 రెట్లు పెంచుతుంది. 2. నోటి క్యాన్సర్ నోటిలో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని 2-3 రెట్లు పెంచుతుంది. 3. గొంతు క్యాన్సర్: గొంతు క్యాన్సర్ అనేది గొంతులో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం గొంతు క్యాన్సర్ ప్రమాదాన్ని 2-3 రెట్లు పెంచుతుంది. 4. గ్యాస్ట్రిక్ క్యాన్సర్: గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అనేది జీర్ణశయాంతరంలో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రమాదాన్ని 1.5-2 రెట్లు పెంచుతుంది. 5. 5. 5. ప్యాంక్రియాస్ క్యాన్సర్: ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనేది ప్యాంక్రియాస్‌లో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం ప్యాంక్రియాస్ క్యాన్సర్ ప్రమాదాన్ని 1.5-2 రెట్లు పెంచుతుంది. ధూమపానం దంతాల ఆరోగ్యానికి హానికరం ధూమపానం దంతాల క్షయం, పళ్ళ మధ్య రంధ్రాలు, దంతాల పసుపు వంటి దంత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది నోటిలో ఆమ్లాల స్థాయిలను పెంచుతుంది అలాగే దంతాల క్షయానికి దారితీస్తుంది. దంతాల ఎనామెల్‌ను దెబ్బతీస్తుంది, ఇది పళ్ళ మధ్య రంధ్రాలకు దారితీస్తుంది. దంతాలపై పసుపు మచ్చలను ఏర్పరుస్తుంది. నోటిలో రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది, ఇది నోటి పుండ్లకు దారితీస్తుంది. దంతాలను బలహీనపరుస్తుంది, ఇది దంతాల నష్టానికి దారితీస్తుంది. ఇలా క్యాన్సర్ మాత్రమె కాకుండా ధూమపానం ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారి తీయగలదు.అందుకని వీలైనంత తొందరగా మానేయటం ఉత్తమం. -ఆయుర్వేద వైద్యులు, నవీన్ నడిమింటి (చదవండి: మీ ఆహారంలో ఇవి చేర్చితే మధుమేహం దరిదాపుల్లోకి రాదు!) -
'ఒంటరితనం' రోజుకు 15 సిగరెట్లు తాగినంత ప్రాణాంతకమా?
ఒంటరితనం అదొక రకమైన వ్యాధి అని ఎందరో వైద్యులు చెబుతున్నారు. మానసిక వ్యాధిలా మొదలై దీర్థకాలికి వ్యాధులు చుట్టుముట్టేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు. పరిశోధకులు జరిపిన అధ్యయనంలో సిగరెట్లు తాగితే ఎంత ప్రమాదమో! అంత ప్రాణాంతకం అని హెచ్చరిస్తున్నారు. నిజానికి ఒంటరితనం అంత ప్రాణాంతకమా? ఏకంగా ధూమపానం తాగడంతో పోల్చడానికి కారణం ఏంటీ?.. తదితరాల గురించే ఈ కథనం!. ఒంటరితనం ఒంటరిగా ఉండటం అంటే.. ఒంటరితనం, ఒంటిరిగా అనే పదాలు ఒకేలా ఉన్నా రెండింటికి చాలా తేడా ఉంది. మనకు మనంగా కోరుకుని ఒంటరిగా ఉండటాన్ని ఏకాంతంగా గడపటంగా భావించొచ్చు. ఇష్టపూర్వకంగా నీతో నీవు గడపటం లాంటిది. ఇది ఆరోగ్యానికి ఒకరకంగా మంచిదే. మిమ్మల్ని మీరు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఒకరకంగా మీ భావోద్వేగాలను నియంత్రించుకునే ఓ గొప్ప అవకాశం. అదే ఒంటరితనం అంటే.. మన చుట్టూ ఎంతమంది ఉన్నా ఏదో లేదనే భావన ఉండటం. తనకంటూ ఎవ్వరూ లేరని ఫీలవుతుండటం ఒంటిరితనం కిందకు వస్తుంది. ఇది మనిషిని కుంగదీస్తుంది. చూడటానికి సాధారణంగా అనిపించినా.. ఓ భయానక వ్యాధి. చివరికి మనిషిని చనిపోయేలా కూడా ప్రేరేపిస్తుంది. అందుకనే వైద్యలు, ఆరోగ్య నిపుణులు ఒంటరితనం ప్రాణాంతకమైనదని పదేపదే ప్రజలను హెచ్చరిస్తున్నారు. పరిశోధనలే ఏం చెబుతున్నాయంటే శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన అధ్యయనంలో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసిన వాళ్ల కంటే ఒంటరితనంతో బాధపడే వ్యక్తులు అకాల మరణానికి 50% ఎక్కువ ఉందని వెల్లడైంది. ఈ ఒంటరితనం ధూమపానం తాగినంత ప్రమాదకరమైనదని పేర్కొంది. రోజుకి 15 సిగరెట్లు తాగితే ఎంత ప్రాణాంతకం అంత ప్రమాదకరమైనది ఒంటిరితనం అని వెల్లడించింది. దీనివల్ల రోజువారి జీవనంపై ప్రభావం ఏర్పడి దీర్ఘకాలిక గుండె జబ్లులు వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ డిప్రెషన్ కారణంగా చాలామంది ఒబెసిటీ సమస్యను ఎదర్కొంటున్నట్లు అధ్యయనంలో తేలింది. అందుకోసం అని ఓ మెడిల్ ఆస్పత్రిలోని దీర్ఘకాలిక సమస్యలతో ఒంటరితనంతో బాధపడుతున్న కొంతమంది రోగులపై అధ్యయనం చేయగా..వారు కొంత సేపు తమతో ఆరోగ్యం గురించి మాట్లాడారు. ఆ తర్వాత వారి వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఎప్పటికప్పుడూ వారిని పర్యవేక్షిస్తూ వారితో స్నేహంగా మెలిగారు. వారు కూడా తెలియకుండానే వారితో కనెక్ట్ అయ్యి తమ భావోద్వేగాలన్నింటిని షేర్ చేసుకున్నారు. వాళ్లికి ఎవ్వరితోనైనా కాసేపు మాట్లాడితే తెలియని ఆనందం ఉంటుందనేలా ఆ రోగులకు అవగాహన కల్పించారు. ఆ తర్వాత ఆ రోగులు డిశ్చార్జ్ అయ్యాక కూడా వారి పరిస్థితి గురించి ఎప్పటికప్పుడూ ట్రాక్ చేస్తూనే ఉన్నారు పరిశోధకులు. ఐతే వారిలో మార్పు వచ్చి మనుషులతో కనెక్ట్ అవ్వడం ప్రారంభించారు. అలాగే ఆ రోగులు ఆస్పత్రిని సందర్శించడం కూడా తగ్గింది. ఎందుకు హానికరం అంటే.. తనకంటూ ఎవ్వరూ లేరనే వ్యథ ఆవరించి మనిషిని ఒక విధమైన సోమరి లేదా చేతకాని వాడిగా మార్చేస్తుంది. తెలియని నిరుత్సాహం వచ్చేస్తుంది. చిన్న పనులు కూడా భారంగా ఉంటాయి. అది క్రమేణ ఆ వ్యక్తిని మంచానికే పరిమితమై ఓ భయానక వ్యాధిలా మారిపోతుంది. ఏం లేకుండానే ఏదో మహమ్మారి బారినపడ్డవాడిలా త్వరతగతిన మృత్యు ఒడిలోకి వెళ్లిపోతాడు. ఇలాంటి వాళ్లు తాను నిర్లక్ష్యానికి గురవ్వుతున్నా అనే భావం నుంచి మొదలై ఎవ్వరితోనూ సంబంధాలు నెరుపుకోలేక ఇబ్బంది పడతారు. మొదట ఆ భావన తొలగించి తనకు నచ్చినా లేదా తనంటే ఇష్టపడే వ్యక్తులతో గడుపూతూ మంచి సంబంధాలను నెరుపుకుంటూ పోతే మనల్ని వద్దనుకున్నవాళ్లు సైతం మనతో చేయి కలిపేందుకు ముందుకు వస్తారు. చిత్త వైకల్యం అన్నింటికంటే ప్రమాదకరమైంది. అది బాగుంటే అన్ని బాగున్నట్లే. అలాగే రిలేషన్స్‌లో క్యాలిటీ ముఖ్యం వందల సంఖ్యలో రిలేషన్స్ ఏర్పర్చుకోనవసరం లేదు. మనం అంటే ఇష్టపడే వ్యక్తి ఒక్కరైనా చాలు. మనకు వారి వద్ద స్వాంతన దొరికితే చాలు. నచ్చిన స్నేహితుడు లేదా మీ శ్రేయోభిలాషి/మన అనుకునులే మనం మంచి కోరే వ్యక్తి ఉంటే చాలు. అందుకే ఇక్కడ మీరు ఎవరితో సన్నిహితంగా ఉంటారో వారితో మంచి నాణ్యతతో కూడిన బాండింగ్ ఏర్పర్చుకుంటే చాలు. తెలియకుండానే అన్ని రుగ్మతల నుంచి బయటపడతారు. ఆ తర్వాత మీకు మీరుగా ఏదోక వ్యాపకం ఏర్పరుచుకుని ధైర్యంగా జీవితాన్ని గడపగలిగే మనోధైర్యం వచ్చేస్తుంది. చింతకు చోటు ఇవ్వదు అది మీ చిత్తాన్ని చెదిరిపోయేలా చేసి కుంగదీస్తుంది. మీకు కాస్త ఒంటరితనంగా ఫీలయితే వెంటనే సోషల్ మీడియాలో లేదా దేవాలయానికో లేదా నచ్చిన ప్రదేశానికి వెళ్లండి కొత్త మనుషులు పరిచయలు ఏర్పడి మీకో కొత్త ఉత్తేజాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ఇటీవల ఈ కరోనా మహమ్మారి తర్వాత నుంచే ఈ ఒంటరితనం సమస్య ఎక్కువైంది. ముఖ్యంగా అమెరికా వంటి దేశాల ఈ సమస్య మరింత ఎక్కువ ఉంది. (చదవండి: కోవిడ్‌కి గురైతే గుండె సమస్య తప్పదా? ఆరోగ్య మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు) -
బ్రిటన్ ధూమపాన రహితదేశం కానుందా? ప్రధాని రిషి సునాక్ ప్లాన్ ఏమిటి?
బ్రిటన్ కొత్త ప్రతిపాదిత చట్టం ప్రకారం రాబోయే కొద్ది సంవత్సరాలలో బ్రిటన్‌లో ధూమపానం సమర్థవంతంగా నిర్మూలనకానుంది. 2040 నాటికి బ్రిటన్ ‘పొగ రహిత’ దేశంగా మారుతుందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ తర్వాత రాబోయే తరం ధూమపానం చేయకుండా నిరోధించడానికి చట్టం చేసిన రెండవ దేశం బ్రిటన్. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ధూమపానం ఒక సామాజిక దురాచారంగా మారింది. ధూమపానం కారణంగా లెక్కలేనంతమంది క్యాన్సర్‌తోపాటు అనేక వ్యాధులతో బాధపడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ 2040 నాటికి దేశాన్ని ధూమపాన రహితంగా మార్చాలని నిర్ణయించారు. ఇందుకోసం బ్రిటన్‌లో కొత్త చట్టాలను రూపొందించడంపై చర్చ జరుగుతోంది. బ్రిటీష్ వయోజనులలో 12.9 శాతం మంది ధూమపానం చేస్తున్నారు. 8.7 శాతం మంది ప్రతిరోజూ ఇ-సిగరెట్లను ఉపయోగిస్తున్నారు. నూతన చట్టాలను అమలు చేయడం ద్వారా 2075 నాటికి 1.7 మిలియన్ల మంది ధూమపానం చేయడాన్ని తగ్గించవచ్చని బ్రిటీష్ ప్రభుత్వం భావిస్తోంది. యూకేలో అమలుకానున్న కొత్త చట్టం జనవరి 1, 2009న లేదా ఆ తర్వాత జన్మించిన ఎవరికైనా పొగాకు ఉత్పత్తులను విక్రయించడాన్ని చట్టవిరుద్ధం చేశారు. ప్రస్తుతం ధూమపానం చేసే వయస్సు 18 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం చట్టబద్ధంగా ధూమపానం చేసే వయస్సును పెంచడం అనేది సమీక్ష ముఖ్య సిఫార్సులలో ఒకటి. ధూమపానం అనేది గుండెపోటు, స్ట్రోక్, క్యాన్సర్, అంగస్తంభన, గర్భస్రావం వంటి 50 అనారోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుంది. ధూమపానం సంవత్సరానికి 76,000 మందిని పొట్టనపెట్టుకుంటోంది. కేఫ్‌లు, పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లలో ధూమపానాన్ని నిషేధించిన ఏకైక దేశం న్యూజిలాండ్. ఇప్పుడు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా న్యూజిలాండ్ తరహాలో దేశంలో ధూమపానాన్ని నిషేధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది కూడా చదవండి: ఇందిర సభలోకి సింహం ఎందుకు వదిలారు? -
కెమికల్ కిల్లింగ్స్!
వివిధ రసాయనాలు, పురుగుమందులు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని... ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది రసాయనాల కారణంగా మృతిచెందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ మేరకు ప్రజారోగ్యంపై రసాయనాల ప్రభావం పేరుతో తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. అంతర్జాతీయంగా జరిగే అన్ని రకాల మరణాల్లో 3.6 శాతం కెమికల్స్ ద్వారానే జరుగుతున్నాయని నివేదిక వివరించింది. ముఖ్యంగా భారత్‌లో పురుగుమందుల వల్లే ఏడాదికి 70 వేల ఆత్మహత్యలు జరుగుతుండటం ఆందోళనకరమని పేర్కొంది. – సాక్షి, హైదరాబాద్హృద్రోగాలే అధికం హృద్రోగాలే అధికం డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రకారం... కెమికల్స్ వల్ల వచ్చే జబ్బుల్లో అత్యధికంగా 40% గుండె జబ్బులే ఉంటున్నాయి. అలాగే 20% దీర్ఘకాలిక ఊపిరితిత్తుల జబ్బులు, 15% కేన్సర్లు ఉంటున్నాయి. ఏటా లక్ష మంది పురుషుల్లో కెమికల్స్ వల్ల 35 మరణాలు సంభవిస్తుండగా అందులో 32 జబ్బులు దీర్ఘకాలిక జబ్బుల వల్లే జరుగుతున్నాయి. మహిళల్లో లక్షకు 17మంది కెమికల్స్ కారణంగా చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల్లో 20% కెమికల్స్ ద్వారా, రైతు ఆత్మహత్యల్లో 30% కెమికల్స్ ద్వారా, 1.4% నిద్రమాత్రల వంటి మందులు వేసుకోవడమే కారణం. ఏయే రసాయనాల వల్ల ఎటువంటి జబ్బులు..? ఆర్సెనిక్, ఆస్బెస్టాస్, బెంజిన్, బెరీలియం, క్యాడ్మియం తదితర రసాయనాలు 2.9 శాతం కేన్సర్లకు కారణమవుతున్నాయి. ఆర్సెనిక్ భూగర్భ జలాల నుంచి వస్తుండగా బొగ్గు గనుల్లో పనిచేసే వారిలో ఆస్బెస్టాస్ చేరుతోంది. ధూమపానం, వాహన కాలుష్యం ద్వారా బెంజిన్ శరీరంలోకి ప్రవేశిస్తోంది. మురికినీరు లేదా కలుషిత జలాల్లో ఉండే చేపలు తినడం, అలాంటి నీటితో సాగు చేసే ఆలుగడ్డ, వరి, పొగాకు ద్వారా క్యాడ్మియం ఒంట్లోకి చేరుతోంది. సీసం వాడకాన్ని తగ్గించాలి... ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా 41 శాతం దేశాలు సీసంపై చాలావరకు నియంత్రణ విధించాయి. అయినా పెయింటింగ్స్, వాహన ఇంధనాలు, నీరు, ఫుడ్ ప్యాకేజీలు, చిన్నారుల ఆట బొమ్మల్లో దాని వాడకం ఇంకా కొనసాగుతోంది. ఇది తీవ్ర అనారోగ్యానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా వస్తువుల్లో సీసం వాడకాన్ని నివారించాలి. అన్ని రకాల రసాయనాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది చనిపోతున్నారంటే 16 సెకన్లకు ఒకరు మరణిస్తున్నారన్నమాట. – డాక్టర్ కిరణ్ మాదల,సైంటిఫిక్ కమిటీ కన్వీనర్, ఐఎంఏ, తెలంగాణ సీసంతో ఆరోగ్యానికి హాని.. కెమికల్స్ వల్ల హానిలో సగ భాగం సీసం అనే లోహం ద్వారానే జరుగుతోంది. సీసాన్ని పెయింటింగ్స్, ప్లంబింగ్ పనులతోపాటు స్మోకింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మైనింగ్, ఐరన్, ఉక్కు తయారీ, ఆయిల్ రిఫైనింగ్‌లో, పెట్రోల్, విమాన ఇంధనాలు, కాస్మెటిక్స్, సంప్రదాయ మందులు, నగల తయారీ, సిరామిక్స్, ఎల్రక్టానిక్ వస్తువులు, వాటర్ పైప్‌లలో సీసం ఉంటోంది. కలర్ కోటింగ్‌తో కూడిన ఆహారాలు తినడం వల్ల గుండె జబ్బుల్లో 4.6 శాతం, కిడ్నీ జబ్బుల్లో 3 శాతం సీసం ద్వారా వస్తున్నాయి. చిన్నారుల్లో మూడో వంతు బుద్ధిమాంద్యం సీసం ద్వారా ఏర్పడుతోంది. పిల్లల్లో ఎక్కువగా పెయింటింగ్స్ ద్వారా సీసం వారిలో చేరుతుండగా ఐదేళ్లలోపు పిల్లల్లో సీసం కలిగించే దుష్ప్రభావం ఐదు రెట్లు ఎక్కువగా ఉంటోంది. సీసం కలిసిన వస్తువుల వాడకం వల్ల గర్భిణుల్లో ముందస్తు ప్రసవాలు లేదా అబార్షన్లు జరుగుతున్నాయి. -
ఒక్క యాడ్‌తో ఫేమస్.. ఇప్పుడు హీరోయిన్గా ఎంట్రీ
ఎంతటి భారీ హీరో సినిమా అయినా సరే ముందుగా స్క్రీన్ మీద ఈ పాప కనిపించాల్సిందే. థియేటర్లో లైట్స్ ఆఫ్ కాగానే.. ‘ఈ నగరానికి ఏమైంది... ఓ వైపు పొగ... మరోవైపు నుసి... ఎవ్వరూ నోరుమెదపరేంటి...’ అంటూ ఒక యాడ్ వస్తుంది. ఇది సినిమా ప్రారంభానికి ముందు ఆ తర్వాత ఇంటర్వెల్ సమయంలో మరోసారి వచ్చే ఈ యాడ్ అందరికీ గుర్తే. (ఇదీ చదవండి: చిరంజీవి కుమారుడిగా 'రామ్ చరణ్' క్లోజ్ ఫ్రెండ్) అందులో నటించిన ఓ చిన్నపాపను ఎవరూ మర్చిపోలేరు. తండ్రి సిగరెట్ తాగుతుంటే... ఆ చిన్నారి అమాయికంగా చూసే చూపుల వల్ల సిగరెట్ పడేసి వస్తాడు అతను. ఈ యాడ్ చూసి ఎంత మంది సిగరెట్ తాగడం మానేశారో తెలీదు కానీ.. ఆ పాపకి మాత్రం చాలా పాపులారిటీ వచ్చేసింది. ఆ అమ్మాయి పేరు సిమ్రాన్ నటేకర్. 1997లో ముంబైలో జన్మించింది. ఇండస్ట్రీలో టీనేజ్‌లోని అడుగుపెట్టిన ఈ చిన్నది. ఆ యాడ్ తర్వాత సుమారు 150కి పైగా పలు ప్రకటనలలో మెప్పించింది. తర్వాత చిన్నారి పెళ్లికూతురు సీరియల్లలో పూజ పాత్రతో అందరినీ మెప్పించింది. (ఇదీ చదవండి: ఓటీటీలో 'బేబి' ప్రయోగం.. ఆ సీన్లను కలిపేందుకు ప్లాన్) ఆపై క్రిష్ 3 మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ చేసింది. 2010లో రితీష్ దేశ్ ముఖ్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ కలిసి నటించిన జానే కహాన్ సే ఆయీ హై చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ ఇప్పటికీ తన నటనా ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాకపోవడంతో సిమ్రాన్ నటేకర్ చిన్న చిన్న పాత్రలలో నటిస్తోంది ఈ ముంబై చిన్నది. దీంతో మంచి అవకాశాల కోసం తెలుగు సినిమాపై కన్నేసిందట. అందుకోసం టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లతో పలు ఆడిషన్స్ కూడా ప్లాన్ చేసిందట. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు చాలా క్రేజ్ ఉంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియా జనాల మతులు పొగొట్టడం మొదలుపెట్టేసింది. View this post on Instagram A post shared by Simran Natekar (@simran.natekar) -
సిగరెట్ తాగొద్దన్నందుకు దాడి!
ఖమ్మం: సిగరెట్ తాగుతున్న యువకులను దూరంగా పోయి తాగాలని చెప్పినందుకు వారు దాడి చేశారు. ఈ ఘటనపై ఆదివారం ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శనివారం సాయంత్రం ధంసలాపురానికి చెందిన ఎన్.వెంకటమ్మ ఇంటి ఎదురుగా నలుగురు యువకులు సిగరెట్ తాగుతూ వదులుతున్న పొగ ఇంట్లోకి వస్తోంది. గమనించిన వెంకటమ్మ, కుమారుడు నాగరాజు.. దూరంగా వెళ్లి తాగండని చెప్పారు. దీంతో చంటి అనే యువకుడితో పాటు మిత్రులు మరో ముగ్గురు కలిసి వారిని అసభ్యకరంగా దూషిస్తూ రాళ్లతో దాడి చేశారని, పోలీసులకు చెపితే చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
విమానంలో ధూమపానం!
సాక్షి, చైన్నె: కువైట్ నుంచి చైన్నెకు వచ్చిన విమానంలో ఓ యువకుడు పొగతాగి అడ్డంగా బుక్కయ్యాడు. అతడిని చైన్నెలో పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కువైట్ నుంచి ఆదివారం రాత్రి ఓ విమానం చైన్నెకు బయలు దేరింది. 184మంది ప్రయాణికులు ఇందులో ఉన్నారు. 38 వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుండగా, ఇందులో ప్రయాణించిన ఓ యువకుడు సిగిరెట్ వెలిగించాడు.. దీనిని పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు వ్యతిరేకించాడు. అతడు పట్టించుకోక పోవడంతో విమాన సిబ్బందికి తెలియజేశాడు. విమాన సిబ్బంది, ఫైలట్, ఇతర ప్రయాణికులు వారించినా అతడు ఖాతరు చేయలేదు. దీంతో అతడి చర్యలపై చైన్నె విమానాశ్రయ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. అర్ధరాత్రి వేళ విమానం చైన్నెలో ల్యాండ్ కాగానే భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విమానంలో తనకు సిగరేట్ తాగాలనిపించింది తాగాను..అంటూ అతడు ఇచ్చిన సమాచారం భద్రతా సిబ్బందిని విస్మయానికి గురి చేసింది. దీంతో ఆయువకుడ్ని చైన్నె విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. విచారణలో ఆ యువకుడు మహారాష్ట్ర రాజధాని నగరం ముంబై లోని థానే ప్రాంతానికి చెందిన మహ్మద్ సదాం(32)గా గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
అత్త నిర్వాకానికి బిత్తరపోయిన అల్లుడు.. పెళ్లి కాన్సిల్
లక్నో: కాసేపట్లో పెళ్లి జరగబోతోందనగా కాస్త ముందుగానే కళ్యాణ మండపానికి వచ్చిన వరుడికి సూపర్ షాకిచ్చింది వధువు తల్లి. కళ్యాణ మండపానికి వధువుని వెంటబెట్టుకుని వచ్చే క్రమంలో డాన్సులు చేస్తూ ఒక చేత్తో సిగరెట్ కాలుస్తూ కనిపించిన అత్తగారిని చూసి కాబోయే అల్లుడు హతాశుడయ్యాడు. అత్తగారి విచిత్ర ధోరణికి మండిపడి పెళ్లి పెటాకులు చేసుకుని మరీ వెళ్ళిపోయాడు. ఉత్తరాదిలో పెళ్లిళ్లంటే ఆ ధూమ్ ధామ్ సందడే వేరు. పెళ్ళికి ముందు నుంచే ప్రతిరోజూ పెళ్లే అన్నంత కోలాహలంగా ఉంటుంది వాతావారణం. హల్దీ, మెహందీ, సంగీత్, షాదీ ఇలా పెళ్ళి పేరుతో పెద్ద తంతే నడుస్తుంది. ఇక అక్కడి పెళ్లిళ్లలో లింగ భేదం లేకుండా విందు చేయడం చిందులేయడం సర్వసాధారణం. కానీ ఎందుకో ఈ పధ్ధతి రుచించక వరుడు పెళ్లి వద్దనుకుని వెళ్ళిపోయాడు. తర్వాత ఇరుపక్షాల పెద్దలు కూర్చుని పంచాయతీ జరిపిన తర్వాత పెళ్ళికి అంగీకరించడంతో కథ సుఖాంతమైంది. వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని సంభాల్ జిల్లాకు చెందిన వరుడికి, రాజ్ పురకు చెందిన వధువుకి జూన్ 27న వివాహం జరగాల్సి ఉంది. వివాహ వేదిక వద్ద ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు. పెళ్లిలో సందడి చేయడానికి డీజే కూడా ఏర్పాటు చేశారు. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోందనగా వరుడు బంధువర్గ సపరివారసమేతంగా ముందే కళ్యాణ మండపానికి ఊరేగింపుగా వచ్చి వధువు కోసం ఎదురు చూస్తున్నాడు. అంతలోనే వధువు తరపు బృందం ఊరేగింపుగా వచ్చారు. కానీ వధువు పల్లకికి ముందు వధువు తల్లి సిగరెట్ కాలుస్తూ తన్మయత్వంతో చిందులేస్తూ కనిపించింది. వధువు కోసం వేచి ఉన్న వరుడు అత్తని అలా చూసి షాక్ కి గురయ్యాడు. కోపోద్రిక్తుడై పెళ్లి వద్దనుకుని పెళ్లి మటపం నుంచి వెళ్ళిపోయాడు. అనంతరం రెండువర్గాల పెళ్లి పెద్దలు జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో వరుడు పెళ్ళికి అంగీకరించాడు. తర్వాత పెళ్లి కార్యక్రమం యధాతధంగా కొనసాగింది. ఇది కూడా చదవండి: ఇప్పుడు మాది డబుల్ ఇంజిన్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్.. షిండే -
వ్యసనంపై పోరాడటానికి మనం మాట్లాడుకోవాల్సిందే
ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్‌లాంటి దురలవాట్లకు బానిసలై చీకటి నింపుకుంటున్న కుటుంబాలు ఎన్నో. వీటినుంచి బయట పడాలంటే ఏం చేయాలి?! ఈ వ్యసనం కుటుంబాలలో రేపుతున్న చిచ్చును ఆర్పేదెలా?!పరువు పోతుందనే భయంతో సమాజంలో దాక్కుంటున్న మనుషుల్లో ధైర్యం నింపేదెలా?!సమస్యను దాచిపెడితే పెంచి ‘పోషించినట్టే. అందుకే, మనం మాట్లాడుకోవాల్సిందే వ్యసనంపై పోరాడటానికి..! సమస్యను ఎదుర్కొంటున్న ఒక కుటుంబ కథనం,,, ‘బాబూ.. ఏమీ అనుకోకుండా ఈ బ్రాండ్ లిక్కర్ తెచ్చిపెట్టగలవా?!’ అ΄ార్ట్‌మెంట్ పైఫ్లోర్ నుంచి దిగుతున్న ఓ అపరిచిత అబ్బాయిని పిలిచి అడిగింది శారద (పేరుమార్చడమైనది). ఆ అబ్బాయి ఆమెను ఎగాదిగా చూశాడు. పక్క΄ోర్షన్ వాళ్లు చూస్తే ఏమనుకుంటారో అనే భయంతో.. ‘మా వారికి డ్రింక్ చేసే అలవాటుంది. ఎంతకీ మార్చుకోవడం లేదు. ఆయన్ని బయటకు వెళ్లనివ్వడం లేదు. నేనుగా ఆ వైన్ షాప్‌కి వెళ్లలేను. అందుకే అడుగుతున్నాను’ అంది బతిమాలుతున్నట్టుగా. ‘ఓ.. అలాగే తెచ్చిస్తాను’ అని డబ్బులు తీసుకొని వెళ్లి΄ోయాడు. అతను తెచ్చిన బాటిల్‌ను ఎవరూ గమనించట్లేదని నిర్ధారించుకుని, థాంక్స్ చెప్పి లోపలికి తీసుకెళ్లింది. కొన్నాళ్లుగా ఈ సమస్య కారణంగా నరకం చూస్తోంది శారద. ∙∙ శారద ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్. భర్తది కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం. ఇద్దరు పిల్లలు. చుట్టుపక్కల వారిలో గౌరవ మర్యాదలకు లోటు లేని కుటుంబం. ‘వాళ్లకేం.. ఇద్దరూ సం΄ాదిస్తున్నారు. చిన్న కుటుంబం చింతల్లేవు’ అంటుంటారు. నలుగురిలో ఎంతో గొప్పగా ఉండే తమ కుటుంబం నేడు దిగజారి΄ోయిన పరిస్థితి చూస్తూ కొన్నాళ్లుగా కంటిమీద కునుకు లేకుండా గడిపేస్తోంది. మొదట్లో పార్టీలకు వెళ్లినప్పుడు కొద్దికొద్దిగా డ్రింక్ చేసేవాడు శారద భర్త. వద్దని వారిస్తే ‘డ్రింక్ అనేది ఒక ΄ార్టీ కల్చర్, నలుగురిలో కలుపుగోలుగా ఉండాలంటే ఇలాంటివి పట్టించుకోవద్ద’ని చెప్పేవాడు. ‘నిజమే, కదా! దాదాపుగా చుట్టూ అందరూ అలాగే ఉన్నారు’ అనుకుంది శారద. పిల్లల చిన్నప్పుడు తక్కువగానే ఉన్న ఈ డ్రింక్ అలవాటు, ఇప్పుడు వారికీ అన్నీ తెలిసే వయసు వచ్చేసరికి పెరిగింది. ΄ార్టీల నుంచి అలవాటు రోజూ రాత్రిపూట తీసుకోవడం, ఆ తర్వాత పగటికి కూడా మారింది. అదేమంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఆ మాత్రం తప్పదని కొన్నాళ్లు, బాధగా ఉందని, ఆనందంగా ఉందని, ఈ మాత్రమైనా ఉంటున్నాను కదా!’ అంటూ ఏదో ఒక వంకన తాగడం పెరిగింది. పగటిపూట తాగి కాలేజీకి వెళితే, యాజమాన్యం డిస్మిస్ చేసింది. దీంతో జాబ్ ΄ోయిందనే ఆలోచన, డిప్రెషన్‌తో ఇంకా తాగడం పెరిగింది. తాగి బయటకు వెళ్లినా, ఆ మత్తులో ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నా నలుగురిలో పరువు ΄ోతుందని, తనే మందుబాటిళ్లు ఇంటికి తెచ్చిస్తాను, ఎక్కడకూ వెళ్లద్దు అని బతిమాలడం మొదలుపెట్టింది. ∙∙ ఇద్దరిలో ఒకరి స్పందన ఎలాగూ పోయింది. తన ఒక్కదాని సం΄ాదనతో ఇల్లు, పిల్లల ఫీజులు నెట్టుకొస్తోంది. దానికితోడు మందుకు కూడా డబ్బులు ఖర్చు పెట్టాలంటే కష్టంగా ఉంటుంది. కానీ, తప్పడం లేదు. పైగా, రోజు రోజూ భర్త ఆరోగ్య పరిస్థితి ఏమౌతుందో అని ఆందోళన పెరుగుతోంది. ∙∙ కొన్నాళ్లుగా బంధుమిత్రుల వేడుకలు, ΄ార్టీలకు వెళ్లడం బాగా తగ్గించేసింది. అదేమని అడిగితే ముఖ్యమైన పని ఉందని తప్పించుకుని తిరుగుతుంది. ఒక విధంగా స్వీయ సామాజిక బహిష్కరణకు గురైంది. ∙∙ ΄పార్టీ ఉందని చెప్పి వెళ్లిన పెద్దబ్బాయి ఇంకా ఇంటికి రాక΄ోవడంతో ఆందోళన పడి΄ోయింది శారద. వచ్చాక వాడిని గమనిస్తే మందు వాసన వస్తోంది. అదేమని నిలదీస్తే.. ‘డాడీని ఏమీ అనవు. పైగా నువ్వే మందు తెప్పించి ఇస్తావు. నన్ను మాత్రం ఎందుకు తిడుతున్నావు!’ అని ఎదురు తిరిగాడు. ఆ మాటలతో తల తిరిగి΄ోయింది శారదకు. ఇంట్లో అందరివైపు బిక్కుబిక్కుమని చిన్నకొడుకు చూసే చూపులు ఆమెను పూర్తి అగాథంలోకి తోసేసినట్టుగా అనిపించాయి. ఇలాంటి బయటికి చెప్పుకోలేని గాధలు మన చుట్టూ ఉన్నవారిలో ఎన్నో ఉన్నాయి. – నిర్మలారెడ్డి కుటుంబమంతా కలిసి... బయట మద్యం అందుబాటులో ఉంటుంది కాబట్టి, వీళ్లు తాగుతున్నారు అని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి మన చుట్టూ మంచీ–చెడు అంశాలు ప్రతి దానిలోనూ చూస్తుంటాం. దేనిని మనం ఏ విధంగా తీసుకోవాలో మన మెదడు చేసే పనితీరును బట్టి ఉంటుంది. లోపం ఎక్కడ ఉందో గుర్తించి, దానికి విరుగుడు ఏంటా.. అని ఆలోచించడం మన ముందున్న అసలు కర్తవ్యం. ∙కుటుంబం అంతా వ్యసనంపై ΄ోరాటానికి సిద్ధం అన్నట్టుగా ఉండాలి. ∙చుట్టుపక్కల వాళ్లు ఏమనుకుంటారో, బంధుమిత్రుల్లో పరువు ΄ోతుందేమో అనే ఆలోచనకు తావివ్వకుండా ఈ సమస్య గురించి నలుగురితో చర్చించాలి. ∙అపార్ట్మెంట్, కాలనీ, సొసైటీ మీటింగ్స్ సమయాల్లో ‘మద్యం అలవాటు’ తప్పనిసరి టాపిక్ అయి ఉండాలి. సమస్య పరిష్కారానికి ఏం చేయాలి అనే ఆలోచనలు పంచుకోవాలి. ∙మద్యం తాగినప్పుడు బాగుంటుందనే ఆలోచన రావడమే సరైనది కాదు. ఇలాంటప్పుడు తమ ఆలోచనల్లోనే తేడాలు వస్తున్నట్టు గుర్తించి, ఇంట్లో వారికి చెప్పి, నిపుణుల సలహా తీసుకోవడం, కంట్రోలింగ్ పవర్‌ని పెంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ∙‘కుటుంబంలో ఉన్న అందరూ (పిల్లలు – పెద్దలు) క్రమశిక్షణ ΄ాటించాలి..’ అనే కఠిన నిర్ణయాన్ని అమలు చేయాల్సిందే. ∙ఇంట్లో ఎవరైనా మద్యం తాగుతున్నారు అంటే మొదట్లోనే అలెర్ట్ చేయాలి. కొన్నిసార్లు మాత్రమే కదా, వాళ్లే మారుతారులే అనే ఆలోచనా ధోరణిని దరి చేరనీయకూడదు. సమస్య పెరిగాక తగ్గిద్దామనుకుంటే ‘అలవాటు’ కుటుంబంలోని మిగతా వ్యక్తులపై దాడి చేయడానికి వెనకాడనీయదు. మద్యం తెచ్చుకోవడానికి డబ్బు లేక΄ోతే ఇంట్లో దొంగతనాలు చేయడం, వస్తువులను అమ్మడం, చావడం, చంపడం .. వంటి నేరాలకు దారులు తెరుస్తుంది. అందుకే, సమస్యను పెంచనీయకూడదు. ∙సమస్య గుర్తించిన వెంటనే ఫ్యామిలీ కౌన్సెలింగ్ తీసుకోవడం, నిపుణుల సలహాలు ΄ాటించడం అత్యవసరం. ఇది ఒక జబ్బు అని గుర్తించాలి నియంత్రణ కోల్పోవడం వ్యసనం ప్రధాన లక్షణం. నూటికి నూరు΄ాళ్లు నయం అవడం ఉండదు కానీ, నియంత్రణ కోల్పోకుండా చికిత్స చేయవచ్చు. మన మెదడు గుర్తించడం, గుర్తుపెట్టుకోవడం, గుర్తుచేయడం అనే మూడు విధాలుగా పనిచేస్తుంది. బ్రెయిన్లో డోపమైన్ కెమికల్ ఉంటుంది. మిగతా సమయాల్లో కంటే తాగినప్పుడు డోపమైన్ రసాయనాలు ఎక్కువ రిలీజ్ అవడంతో ఆనందం అధికంగా ఉంటుంది అనుకుంటారు. మత్తు దిగాక మళ్లీ మామూలే అవుతుంది. అందుకే, ఆ మందు మళ్లీ మళ్లీ తీసుకోవాలని, మోతాదు ఇంకా పెంచమనే బ్రెయిన్ సూచనల ప్రకారం మనిషి నడుచుకుంటాడు. అందుకే, మొదట్లో తక్కువ తాగే వారు కొన్నాళ్లకు డోసు పెంచుతూ ఉంటారు. తాగడానికి ఏవో కారణాలు చెబుతున్నారంటే సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. నిపుణుల సూచనలు తీసుకోవాలి. – డాక్టర్ గిడియన్, డి–అడిక్షన్ థెరపిస్ట్, లివింగ్ సోబర్, హైదరాబాద్ పార్టీ ఉందని చెప్పి వెళ్లిన పెద్దబ్బాయి ఇంకా ఇంటికి రాక΄ోవడంతో ఆందోళన పడి΄ోయింది శారద. వచ్చాక వాడిని గమనిస్తే మందు వాసన వస్తోంది. అదేమని నిలదీస్తే.. ‘డాడీని ఏమీ అనవు. పైగా నువ్వే మందు తెప్పించి ఇస్తావు. నన్ను మాత్రం ఎందుకు తిడుతున్నావు!’ అని ఎదురు తిరిగాడు. ఆ మాటలతో తల తిరిగిపోయింది శారదకు. ఇంట్లో అందరివైపు బిక్కుబిక్కుమని చిన్నకొడుకు చూసే చూపులు ఆమెను పూర్తి అగాథంలోకి తోసేసినట్టుగా అనిపించాయి. ఇలాంటి బయటికి చెప్పుకోలేని గాధలు మన చుట్టూ ఉన్నవారిలో ఎన్నో ఉన్నాయి. – నిర్మలారెడ్డి ఆశలు పెంచుతోంది.. చదువు ఉండి, నలుగురిలో ఎలా మెలగాలో తెలిసిన మేమే ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే దీని తీవ్రత సమాజంలో ఎంత ఉందో అర్థమవుతుంది. ఒక తల్లిగా నా పిల్లలకు చెప్పలేక, టీచర్‌గా స్కూల్లో పిల్లలకు ఏ మంచీ బోధించలేక జీవితం శూన్యంగా అనిపించేది. ఓ రోజు నా ఫ్రెండ్‌తో చె΄్పాక సమస్యకు పరిష్కారం దొరికింది. థెరపిస్ట్‌లను కలిసి, అడిక్షన్ నుంచి నా కుటుంబాన్ని కా΄ాడుకోవాలని కృషి చేస్తున్నాను. ఇప్పుడు నా కుటుంబంలో వచ్చిన మార్పు భవిష్యత్తుపైన ఆశలు పెంచుతోంది. – శారద, బాధితురాలు -
ఈ సింపుల్ చిట్కాతో సిగరెట్ మానేయండి
-
జనం పాలిట ‘పగాకు’
సాక్షి, అమరావతి: పొగాకు మనుషుల పాలిట పగాకులా మారింది. విచ్చలవిడి ధూమపానం అనారోగ్య చీకట్లలోకి నెట్టేస్తుంటే.. పొగాకు గుట్కా, ఖైనీ మనుషుల ప్రాణాలను చిదిమేస్తున్నాయి. దేశంలో ప్రతి ఆరు కుటుంబాలకు ఒక కుటుంబంలోని ఒకరు అంతకంటే ఎక్కువ మంది పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నట్టు కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సంస్థ లోకల్ సర్కిల్ సర్వేలో వెల్లడైంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ధూమపానం, పొగాకు ఉత్పత్తులు విస్తృత స్థాయిలో అందుబాటులో ఉన్నట్టు గుర్తించింది. దశాబ్దం క్రితం దేశంలో గుట్కాను నిషేధించినప్పటికీ పాన్‌మసాలా ముసుగులో అనేక కంపెనీలు ఇప్పటికీ వాటిని తయారు చేస్తున్నట్టు పేర్కొంది. ఈ క్రమంలోనే సర్వేలో పాల్గొన్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు తమ ప్రాంతంలో విరివిగా పొగాకు ఉత్పత్తులు లభిస్తున్నాయని.. దీనిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షల మంది మృత్యువాత పొగాకు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను.. మరీముఖ్యంగా నోటి క్యాన్సర్‌ను కలిగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 80 లక్షల కంటే ఎక్కువ మంది పొగాకు ఉత్పత్తుల వినియోగంతో మృత్యువాత పడుతున్నారు. భారత్‌లో అయితే ఏటా మరణాల సంఖ్య 14 లక్షలుగా ఉంటోంది. వారణాసిలో ఇటీవల క్యాన్సర్ బాధితుల డేటా సేకరించగా.. 55 శాతం క్యాన్సర్లు పొగాకు వాడకంతో ముడిపడి ఉన్నాయని లాన్సెట్ నివేదిక పేర్కొంది. పర్యావరణానికి హానికరంగా.. పొగాకు మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా పర్యావరణంపై కూడా ప్రతికూలత చూపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం ఏటా పొగాకు పరిశ్రమ వల్ల 600 మిలియన్ల చెట్లు, 2 లక్షల హెక్టార్ల అటవీ నిర్మూలన, 22 బిలియన్ టన్నుల నీటిని, 84 మిలియన్ టన్నుల కార్బన్‌ను కోల్పోవాల్సి వస్తోంది. విమానయాన పరిశ్రమ విడుదల చేసే హానికర వాయువుల్లో ఐదవ వంతు పొగాకు పరిశ్రమ నుంచి విడుదలవుతున్నాయి. పొగాకు సాగులో పెద్ద మొత్తంలో పురుగు మందులు, ఎరువులు వాడకం నేల నాణ్యతను దెబ్బతీస్తూ.. జీవవైవిధ్యానికి ముప్పును తీసుకొస్తోంది. కాలి్చపడేసిన సిగరెట్ పీకలు భూమిలో విచ్ఛిన్నం కావడానికి ఏళ్లు సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సిగరెట్ ఖాళీ ప్యాకెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల ప్యాకింగ్లతో ప్లాస్టిక్ కాలుష్యం పెరిగిపోతోంది. ఏటా చైనా 2.6 బిలియన్లు, భారత్ 766 మిలియన్లు, బ్రెజిల్, జర్మనీలు 200 మిలియన్ల డాలర్లకుపైగా పొగాకు ఉత్పత్తుల చెత్తను శుభ్రం చేయడానికి ఖర్చు చేస్తున్నాయి. పొగాకు ఉత్పత్తిలో మూడో స్థానం భారతదేశం పొగాకు ఉత్పత్తుల్లో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఉత్పత్తిదారు, ఎగుమతిదారుగా ఉంది. ఇతర దేశాల మాదిరిగా కాకుండా భారత్‌లో సిగరెట్, చుట్ట(స్మోక్డ్ టుబాకో) కంటే గుట్కా, ఖైనీ (స్మోక్లెస్ టుబాకో) వినియోగం అధికంగా ఉంటోంది. దేశ జనాభాలో దాదాపు 21 శాతం (199.4 మిలియన్) ప్రజలు స్మోక్లెస్ టుబాకోను, 10.7 శాతం మంది (99.5 మిలియన్లు) పొగాకు ఉత్పత్తులను (స్మోక్డ్ టుబాకో) వినియోగిస్తున్నారు. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్, స్ట్రోక్, గుండె జబ్బులు, మధుమేహం వంటి అనారోగ్య ప్రమాదాలకు దారి తీస్తోంది. యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం క్యాన్సర్ నిర్ధారణ తర్వాత కూడా ధూమపానం చేసిన రోగుల్లో గుండె జబ్బులు రెట్టింపు అవుతున్నాయని, ధూమపానం మానేసిన వారిలో స్ట్రోక్ ప్రమాదం చాలా తక్కువని పేర్కొంది. -
ట్రెండ్, స్టైల్ కోసమే స్మో‘కింగ్’.. దేశంలోనే 5 స్థానంలో రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో పొగాకు వాడకం ప్రధానమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పలుమార్లు తెలిపినప్పటికీ ఈ సంస్కృతిని నివారించడంలో వెనుకబడుతూన్నామని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేఖ దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థలు, సామాజిక సంఘాలు పొగాకుకు వ్యతిరేఖంగా పోరాడాలని, దీని పైన మరింత ప్రచారం అవసరమని నినదిస్తున్నాయి. దేశంలో ప్రతి రోజూ 3669 మంది పొగాకుతో మరణిస్తున్నారు. పొగతాగడంలో దేశంతో పాటు రాష్ట్రం కూడా ముందంజలో ఉంది. గత సంవత్సరం తెలంగాణాలో బహిరంగ ప్రదేశాల్లో పొగతాగిన వారిపైన నమోదైన 28 వేల కేసులతో దేశంలోనే ఐదవ స్థానంలో ఉంది. ఆధునిక జీవన విధానం పెరిగిన హైదరాబాద్ నగరంలో ఈ ధూమపానం మరింత ఎక్కువగా ఉంది. కేరళ, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ కేసులు తగ్గే ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రంలో మాత్రం ప్రతీ ఏటా పెరుతుండటం ఆందోళనపరుస్తుంది. గతంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన విషయం ఏంటంటే.. అధిక ధూమపానం జన సంచారం ఉన్న ప్రాంతాల్లో కాకుండా స్కూల్, కాలేజ్, పబ్స్ ఇతర రహాస్య ప్రదేశాల్లో జరుగుతుందని, 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో 38 శాతం, మహిళల్లో 9 శాతం పొగాకును వాడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక తెలుపుతుంది. పొగాకుకు టీనేజ్ పిల్లలు ఎక్కువగా అలవాటు పడుతుండగా, ఈ అలవాటే డగ్స్ వ్యసనానికి పునాదిగా మారుతందని మానసిక-ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ట్రెండ్, స్టైల్ కోసమే యువత ఈ స్మోకింగ్‌కు అలవాటు పడటం విశేషం. ఈ పొగాకు పదార్థాలైన బీడి, చుట్టా, సిగరెట్స్, ఖైనీ, జర్దా తదితారలాను వాడటంతో కేన్సర్, హార్ట్ఎటాక్ వంటి ప్రాణాంతక వ్యాధులకు చేరువైతున్నారు, అంతేకాకుండా ఈ వ్యసనాలే అసాంఘీక కార్యకలాపాలకు వేదికలుగా మారుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ మహమ్మారిని నివారిస్తూనే, వ్యసనానికి బానిసలైన వారిని సాధారణ స్థితికి తీసుకువచ్చే మార్గాలపైన దృష్టి సారించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. న్యూరో మాడ్యులేషన్ ఉత్తమ పరిష్కారం.. స్మోకింగ్‌కు వ్యతిరేకంగా అవగాహాన కల్పిస్తూనే ఇప్పటికే బానిసైన వారిని మామూలు స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికోసం సైక్రియాటిస్టులను, నికోటిన్ ఉండే మెడిసిన్‌ను వాడుతున్నారు. అయితే ప్రస్తుతం న్యూరో మాడ్యులేషన్ అనే అధునాతన సాంకేతిక చికిత్సా విధానం అందుబాటులో ఉంది. ఈ న్యూరో మాడ్యులేషన్ విధానంలో కేవలం స్మోకింగ్ డిజార్డర్లను తగ్గించడానికి మాత్రమే రెండేళ్ల క్రితం ఎఫ్‌డీఐ అనుమతి లభించింది. ఈ స్టిమ్యులేషన్ విధానంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పొగాకు వ్యసనం నాడీ వ్యవస్థ, మొదడు పనితీరు పైన ప్రభావం చూపిస్తుంది. న్యూరో మాడ్యులేషన్లో భాగంగా డీప్ టీఎమ్మెస్ సాంకేతికత మొదడులోని ఇస్సులా పైన మ్యాగ్నెటిక్ వేవ్స్‌ను పంపించి దాని పనితీరును సవరిస్తుంది. దీని వలన వ్యసనానికి మెల్లిమెల్లిగా దూరమవుతారు. డిప్రెషన్, ఓసీడి సమస్యలకు ఈ ప్రక్రియ పరిష్కారంగా మారింది. దక్షిణాదిన ఈ న్యూరో మాడ్యులేషన్ థెరపీని మేము మాత్రమే అందిస్తున్నాం. -ప్రముఖ వైద్యులు ఎమ్మెస్ రెడ్డి, ఆశా న్యూరో మాడ్యులేషన్ క్లినిక్, గచ్చిబౌలి. -
ఫ్లైట్‌లో బీడీ పొగ..
Smoking Beedi inside Flight: విమానంలో బీడీ తాగిన ఓ వ్యక్తిని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఫ్లైట్‌లో బీడీ ఎందుకు తాగావని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు ఆ వ్యక్తి. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. 56 ఏళ్ల ఎం.ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అహ్మదాబాద్ నుంచి ఆకాశ ఎయిర్ విమానంలో బెంగళూరు నగరానికి వస్తున్నాడు. వాష్‌రూమ్‌లో బీడీ తాగుతుండగా విమాన సిబ్బంది పట్టుకున్నారు. బెంగళూరులో దిగగానే ఎయిర్ ప్లేన్ డ్యూటీ మేనేజర్ విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి బెంగళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ‘రైలులో తాగినట్లే విమానంలోనూ తాగాను’ తాను ఎక్కువగా రైలులో ప్రయాణిస్తానని, విమానంలో ప్రయాణించడం తనకు తొలిసారి అని పోలీసులకు నిందితుడు తెలిపాడు. రైలు టాయిలెట్ లో బీడీ తాగినట్లే విమానంలోనూ తాగానని అమాయకంగా చెప్పాడు. మార్వార్‌లో కార్మికుడిగా పనిచేస్తున్న కుమార్ మరో వ్యక్తితో కలిసి బెంగళూరులో బంధువు మరణానంతర కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాడని పోలీసు అధికారులు తెలిపారు. ఇలా బీడీ తాగిన వ్యక్తిని అరెస్టు చేయడం బెంగుళూరు విమానాశ్రయంలో ఇదే తొలిసారి. గతంలో విమానంలో సిగరెట్ తాగిన ఇద్దరు వ్యక్తులపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: బంఫరాఫర్: వైజాగ్ నుంచి సింగపూర్ విమాన టికెట్ ఎంతో తెలుసా? -
4 రోజుల్లో 500 సిగరెట్లు తాగిన అల్లరి నరేష్.. క్షీణించిన ఆరోగ్యం
-
చిక్కుల్లో సివిల్ సర్వెంట్.. ఆఫీస్‌లో స్మోక్ చేసినందుకు రూ.8 లక్షల ఫైన్!
మీరు ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నారా? స్మోకింగ్ చేసే అలవాటు ఉందా? అయితే తస్మాత్ జాగ్రత్త అంటోంది జపాన్ దేశం. ఆఫీస్ ఆవర్స్‌లో వర్క్ పక్కన పెట్టి స్మోక్ చేసేవారికి కఠిన శిక్షలు విధిస్తోంది. 14 ఏళ్ల సర్వీసులో 4,500 కంటే ఎక్కువ సార్లు ధూమపానం చేసినందుకు జపాన్ సివిల్ సర్వెంట్ ఇబ్బందుల్లో పడ్డాడు. పనివేళల్లో సిగరెట్లు కాల్చినందుకు అతడికి 11వేల డాలర్లు ( రూ. 894915) ఫైన్ విధించింది అక్కడి స్థానిక ప్రభుత్వం. ఒసాకాలో ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ధూమపాన చట్టాలు ఉన్నాయి. 2008లో బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సిగరెట్ తాగడాన్ని నిషేధించింది. 2019లో ప్రభుత్వ ఉద్యోగులు పని వేళల్లో ధూమపానం చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదిక ప్రకారం..ఒసాకా నగరంలో 61 ఏళ్ల సివిల్ సర్వెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు చెందిన ఇద్దరు సహోద్యోగులు పదేపదే ధూమపానం చేసినట్లు తేలింది. దీంతో వారి ఆరు నెలల పాటు జీతంలో 10 శాతం కోత విధించారు. 2022 సెప్టెంబర్ నెలలో ఈ ముగ్గురూ రహస్యంగా సిగరెట్లు దాచిపెడుతున్నారంటూ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు మళ్లీ ధూమపానం చేస్తూ పట్టుబడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని ఆ ముగ్గురికి హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ, ముగ్గురు మళ్లీ ధూమపానం చేయడం ప్రారంభించారు. ఇదే అంశంపై ఉన్నతాధికారులు జరిపిన విచారణలో స్మోకింగ్ గురించి అబద్ధం చెప్పారు. స్థానిక పబ్లిక్ సర్వీస్ చట్టం ప్రకారం 61 ఏళ్ల సివిల్ సర్వెంట్ విధులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ వేతన తగ్గింపుతో పాటు, అతని జీతంలో 1.44 మిలియన్ యెన్లను తిరిగి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ వ్యక్తి డ్యూటీలో 355 గంటల 19 నిమిషాల పాటు పొగ తాగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఈ అంశం చర్చాంశనీయంగా మారింది. -
విమానంలో స్మోకింగ్ చేసి రచ్చ.. ప్యాసింజర్‌ను కట్టేసిన సిబ్బంది..
ముంబై: లండన్ నుంచి ముంబై వస్తున్న విమానంలో భారత సంతతికి చెందిన అమెరికన్ రచ్చ రచ్చ చేశాడు. వాష్రూంకెళ్లి సిగరెట్ కాల్చాడు. దీంతో అలరాం మోగగా సిబ్బంది వెళ్లి అతడి వద్ద నుంచి సిగరెట్ లాక్కుని పడేశారు. విమానంలో స్మోకింగ్ చేయొద్దని నిబంధనలు ఉన్నా.. ఎందుకు ఇలా చేశావని ప్రశ్నించారు. అయితే అతడు మాత్రం చేసినపనికి సిగ్గుపడకుండా సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. వారితో దురుసుగా ప్రవర్తించాడు. అయితే ఎలాగోలా అతడ్ని తీసుకెళ్లి సీటులో కూర్చోబెట్టారు. కానీ అతను మాత్రం ఊరుకోకుండా విమానం డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించినా అతడు ఊరుకోలేదు. దీంతో అతడి కాళ్లు చేతులు, కట్టేసి సీటులో కూర్చొబెట్టారు. విమానంలో రచ్చ రచ్చ చేసిన ఇతని పేరు రమాకాంత్. వయసు 37 ఏళ్లు. ముంబై చేరుకున్నాక విమానాశ్రయంలో పోలీసులకు ఇతడ్ని అప్పగించారు. ఈ ఘటనపై వారు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: జానపద గాయకుడిపై కరెన్సీ నోట్ల వర్షం.. వీడియో వైరల్.. -
విమానంలో స్మోకింగ్.. పట్టుబడ్డాక యాక్టింగ్‌తో పిచ్చెక్కించిన ప్రయాణికుడు?
విమానంలో అభ్యంతరకరంగా ప్రవర్తించడం, ఇతర ప్రయాణికులపై మూత్రవిసర్జన చేయడం, అడ్డుకున్న సిబ్బందిపై దాడికి పాల్పడుతున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అమెరికాలో నివసించే రమాకాంత్ అనే ప్రయాణికుడు ఎయిరిండియా విమానంలో వీరంగం సృష్టించాడు. ఎయిరిండియాకు చెందిన ఓ విమానం లండన్ నుంచి ముంబైకి బయల్దేరింది. విమానం గాల్లో ఉండగా రమాకాంత్ బాత్రూంలో స్మోక్ చేశాడు. వద్దని వారించినా క్రూ సిబ్బంది, ఇతర ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల మేరకు..విమానంలో స్మోకింగ్ చేయడం చట్టరిత్యా నేరం. అయినా నిబంధనల్ని ఉల్లంఘించిన రమాకాంత్.. ఎయిరిండియా విమానం టాయిలెట్లో ధూమపానం చేశాడు. అలారం మోగడంతో అప్రమత్తమైన సిబ్బంది సదరు ప్రయాణికుడి చేతిలో సిగరెట్ ఉండటాన్ని గమనించారు. విమానంలో స్మాకింగ్ చేయకూడదని వారించడంతో చేతిలో ఉన్న సిగరెట్‌ను పక్కకు విసిరేశాడు. విమానంలో జిమ్మిక్కులు అనంతరం క్రూ సిబ్బందిపై గట్టిగా కేకలు వేస్తూ నానా హంగామా చేశాడు. అతన్ని నచ్చజెప్పిన సిబ్బంది తన సీట్లో కూర్చోబెట్టారు. కొద్ది సేపటికి విమానం గాల్లో ఉండగా అత్యవసర ద్వారాన్ని (emergency door) తెరిచేందుకు యత్నించాడు. దీంతో ప్రయాణికులు ప్రాణ భయంతో కేకలు వేయడంతో.. జిమ్మిక్కులతో వింతగా ప్రవర్తించాడు. మళ్లీ అరవడం మొదలు పెట్టాడు. తలను అటూ ఇటూ ఊపుతూ విమాన సిబ్బందిని, ప్రయాణికుల్ని భయాందోళనకు గురి చేశారు. ప్రయాణికుల్లో ఉన్న ఓ డాక్టర్ అతని ఆరోగ్యంపై ఆరా తీశాడు. అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా’ అని పరీక్షించాడు. అతని వద్ద ఎలాంటి మెడిసిన్ లభ్యం కాలేదు. ఈ - సిగరెట్ మాత్రమే ఉన్నట్లు ఎయిరిండియా క్రూ సిబ్బంది సహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు ఎయిరిండియా సిబ్బంది ఫిర్యాదుతో 37ఏళ్ల రమాకాంత్‌పై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 336 (ఇతరుల వ్యక్తిగత భద్రతకు హాని కలిగించేలా నిర్లక్ష్యంగా ప్రవర్తించడం), ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1937,22 (పైలట్-ఇన్-కమాండ్ ఇచ్చిన చట్టబద్ధమైన సూచనలను నిరాకరిండం), 23 (దాడి, ఇతరుల భద్రతకు హాని,విధులకు భంగం కలిగించడం), 25 (ధూమపానం చేయడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనారోగ్య సమస్యలపై ఆరా నిందితుడు భారతీయ సంతతికి చెందినవాడని, అయితే అమెరికా పౌరుడని గుర్తించేలా అమెరికా పాస్ పోర్ట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడా? లేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అని నిర్ధారించేందుకు వైద్య పరీక్షల కోసం నిందితుడి బ్లడ్ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. -
బీ, సీ వైరస్లు ప్రమాదకరమైనవి.. హెపటైటిస్-బీకి వ్యాక్సిన్ ఉంది.. కానీ,
హెపాటో లేదా హెపాటిక్ అని పిలిచే ఈ గ్రీకు పదానికి కాలేయం అని అర్థం. జీవక్రియల్లో కీలకపాత్ర పోషించే మన కాలేయం దాదాపు 500 రకాలకు పైగా క్రియలను నిర్వర్తిస్తుంది. కాస్త తొలగించినా... తిరిగి పెరిగేలా... పూర్తిగా పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన ఏకైక అవయవం. మన శరీరం లోపలి అవయవాల్లో అతి పెద్దదైన కాలేయాన్ని అతి పెద్ద గ్రంథిగా పేర్కొనవచ్చు. నాలుగు భాగాలుగా విభజితమై ఉండే కాలేయం దాదాపు కిలోన్నర వరకు బరువుంటుంది. దానికి వచ్చే క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. విష పదార్థాలు, కలుషిత ఆహారం, నీరు, మద్యం, ధూమపానం వల్ల కాలేయం మీద ప్రభావం పడి వాపునకు గురవుతుంది. దాన్ని ‘హెపటైటిస్’ అంటారు. హెపటైటిస్‌కు గురిచేసే వైరస్లు... ఏ, బి, సి, డి, ఇ అని ఐదు రకాలుగా ఉంటాయి. వీటిల్లో బీ, సీ వైరస్లు ప్రమాదకరమైనవి. రక్తమార్పిడి, అరక్షిత శృంగారం వల్ల, అలాగే తల్లి నుంచి బిడ్డకు...ఇవి సోకే ప్రమాదం ఎక్కువ. హెపటైటిస్–బి వైరస్ సోకకుండా వ్యాక్సిన్ ఉంది. కానీ... హెపటైటిస్–సి కు వ్యాక్సిన్ లేదు. అప్పటికే హెపటైటిస్–బి ఉన్నవారు వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఈ వ్యాక్సిన్ వేయించుకునే ముందర పరీక్ష చేయించుకుని నెగెటివ్ ఉంటే ఏ వయసువారైనా వేయించుకోవచ్చు. ఆకలి తగ్గడం, వికారం, కామెర్లు, జ్వరం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు ఉన్నప్పుడు చెట్ల వైద్యం, నాటువైద్యం వంటి సొంతవైద్యాలు చేసుకోకుండా... కారణం తెలుసుకుని అవసరమైన చికిత్స తీసుకోవడం ఉత్తమం. లివర్ ఇన్ఫెక్షన్స్, ఫ్యాటీ లివర్, లివర్ యాబ్సెస్, విల్సన్ డిసీజ్, గిల్బర్ట్ సిండ్రోమ్ వంటి కాలేయ వ్యాధులున్నప్పుడు... హెపటైటిస్ బి, సి వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకితే... వాటి ప్రభావంతో కొన్నేళ్ల తర్వాత కాలేయం గాయపడినట్లుగా లేదా గట్టిగా మారడం (సిర్రోసిస్), అటు తర్వాత కాలేయ క్యాన్సర్‌కు దారితీయడం ఎక్కువమందిలో జరుగు తుంది. కాలేయంలోనే మొదలయ్యే హెపాటో సెల్యులార్ కార్సినోమా అనే క్యాన్సర్... దేహంలో ఇతర ్రపాంతాల్లో క్యాన్సర్ వచ్చి అది కాలేయానికి పాకే మెటాస్టాటిక్ లివర్ క్యాన్సర్ అనే రెండు రకాలు ఉంటాయి. జీర్ణవ్యవస్థలోని క్యాన్సర్స్, బ్రెస్ట్‌క్యాన్సర్, లంగ్ క్యాన్సర్... ఇలాంటి ఏ క్యాన్సర్ అయినా కాలేయానికి పాకే ప్రమాదం ఎక్కువ. ఆలస్యంగా బయటపడే లివర్ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనదిగా పేర్కొనవచ్చు. కాలేయ క్యాన్సర్ తొలిదశలో లక్షణాలు అంత తీవ్రంగా కనిపించకపోవడం వల్ల ఇతర సమస్యలుగా ΄÷రబడే అవకాశం ఎక్కువ. కడుపునొప్పి, బరువుతగ్గడం, కామెర్లు, ΄÷ట్టలో నీరు చేరడం, వాంతులు, వికారం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు లివర్ క్యాన్సర్ ముదిరిన దశలో తీవ్రంగా ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించినా... హెపటైటిస్ బి, సి వైరస్లు పాజిటివ్ ఉన్నా, మద్యం వంటి అలవాట్లు ఉన్నా... రక్తంలో ఎర్రరక్తకణాల సంఖ్యను, షుగర్, క్యాల్షియం, కొలెస్ట్రాల్, ఆల్ఫా ఫీటో ప్రోటీన్ (ఏఎఫ్‌పీ)ను రక్తపరీక్షలతో పాటు అల్ట్రాసౌండ్, డాక్టర్ సలహా మేరకు ట్రిపుల్ ఫేజ్ సీటీ, ఎమ్మారై, పీఈటీ స్కాన్లు చేయించాలి. లివర్ బయాప్సీ చేయించడం వల్ల క్యాన్సర్, దాని స్టేజ్ వంటి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ క్యాన్సర్ పెరిగే గుణం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో నెలలోపే గడ్డ (కణితి) సైజు రెట్టింపు అయితే... మరికొందరిలో ఏడాది పైగా తీసుకోవచ్చు. కణితిని చిన్న సైజులో ఉన్నప్పుడే గుర్తించినా... లివర్ సిర్రోసిస్‌కు గురికావడం వల్ల చాలామందిలో సర్జరీ కుదరకపోవచ్చు. ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ, ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబోలైటేషన్ (టీఏసీఈ), రేడియో అబ్లేషన్,ప్రోటాన్ బీమ్ థెరపీ, క్రయో అబ్లేషన్, స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ వంటి అనేక పద్ధతుల్లో కణితిని తొలగించే లేదా తగ్గించే ప్రయత్నాలు చేస్తారు. గడ్డ చిన్నగా ఉండి, మిగతా కాలేయం బాగానే ఉండి ఫెయిల్యూర్‌కు గురికాకుండా ఉంటే సర్జరీయే సరైన మార్గం. కణితి పరిమాణం పెద్దగా ఉన్నా, అనేక కణుతులు ఉన్నా, లివర్ ఫెయిల్యూర్‌కు గురవుతూ ఉంటే... కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్) వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించడంతో పాటు, గతంలో ఎప్పుడైనా ఇతర క్యాన్సర్స్‌కు గురయి, చికిత్స తీసకున్నా ఎప్పటికప్పుడు కాలేయానికి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండటం చాలా మంచిది. చాలామందిలో హెపటైటిస్–బి పాజిటివ్ ఉన్నా, ఏళ్లతరబడి ఎలాంటి లక్షణాలూ కనిపించకుండా ఆరోగ్యకరంగానే ఉండవచ్చు. కానీ వారి నుంచి ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే పరీక్షలు చేయించుకోవడం, ఒకవేళ ప్రెగ్నెన్సీలో ఈ వైరస్ ఉన్నట్లు గుర్తించినట్లయితే పుట్టిన బిడ్డకు వెంటనే 12 గంటలలోపు హెపటైటిస్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ (హెచ్‌బీఐజీ) ఇప్పించడం మంచిది. ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తితో కలిసి ఉన్నట్లు అనుమానం ఉన్నా, వాళ్ల రక్తం... శరీరంలో ప్రవేశించినట్లు అనుమానం ఉన్నా ముందుజాగ్రత్త చర్యగా ఆ సంఘటన జరిగిన 14 గంటలలోపే హెచ్‌బీఐజీ ఇంజెక్షన్ తీసుకుంటే హెపటైటిస్–బి పాజిటివ్ కాకుండా కాపాడుకోవచ్చు. - Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421 -
డ్రెసింగ్ రూంలో సిగరెట్ తాగిన కోచ్..ఇది నిజంగా సిగ్గు చేటు! వీడియో వైరల్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2023 ఆది నుంచే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్‌గా నిలుస్తోంది. తాజాగా మరో వివాదంతో ఈ లీగ్ వార్తల్లోకెక్కింది. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, ఖుల్నా టైగర్స్ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ ఖలీద్ మహమూద్.. మ్యాచ్ జరగుతుండగా డ్రెసింగ్ రూంలో సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. అసలేం జరిగిందంటే? ఈ టోర్నీ లీగ్ మ్యాచ్‌లో భాగంగా శుక్రవారం(ఫిబ్రవరి10) ఖుల్నా టైగర్స్, ఫార్చ్యూన్ బరిషల్ ఢాకా వేదికగా తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ జరగుతుండగా ఖలీద్ మహమూద్ సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఇదింతా కెమెరాలో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే బాధ్యయుత కోచ్ స్థానంలో ఉండి ఇలా ప్రవర్తించిన ఖలీద్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "యూరప్‌లో ఆటగాళ్లు ఇలా చేసినందుకు ఆటగాళ్లను సస్పెండ్ చేసారు. అటువంటిది కోచ్ స్థానంలో ఉన్న ఖలీద్ మహ్మద్ డ్రెస్సింగ్ రూమ్‌లో సిగరెట్ ఎలా తాగాడో నాకు అర్థం కావడం లేదు. ఇది నిజంగా సిగ్గు చేటు అంటూ ట్వీట్ చేశాడు. చదవండి: IND vs AUS: నా ముఖం కాదురా అయ్యా.. ముందు రిప్లేలు చూపించు! రోహిత్ సీరియస్ @BCBtigers In Europe players are getting suspended for vaping. I don’t understand how Khaled Mahmud Sujon smoked in the dressing room. It was absolutely disgusting to watch. — Azharul (@Azharulislam07) February 11, 2023 -
మద్యానికి, సిగరెట్లకు బానిసైన నన్ను ఆమె మార్చేసింది: రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు భార్య లత అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. చాలా సందర్భాల్లో ఆమె గురించి గొప్పగా చెప్పారు రజినీ. ఆమె వచ్చాక తన జీవితమే మారిందని పలు మార్లు చెప్పిన సూపర్‌స్టార్.. తాజాగా మరోసారి భార్య లతకు, ఆమెను పరిచయం చేసిన స్నేహితుడు మహేంద్రన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. జీవితాంతం వీరిద్దరికి రుణపడి ఉంటానన్నారు. ‘లత నా జీవితంలోకి వచ్చాక చాలా మార్పులు వచ్చాయి. ఆమెను చూసే క్రమశిక్షణ నేర్చుకున్నాను. బస్సు కండక్టర్‌గా ఉన్నప్పుడు రోజు మద్యం సేవించేవాడిని. సిగరెట్లు తాగేవాడిని. ఎక్కువగా మంసాహారం తినేవాడిని. ఈ మూడు అలవాట్లు ఆరోగ్యానికి మంచిది కాదు. నా భార్య లత తన ప్రేమతో నన్ను ఆ చెడు అలవాట్లకు దూరం చేసింది. ఆమె వల్లే నేను ఇప్పుడు ఆరోగ్యంగా, క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతున్నాను’ అని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. రజనీ ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమాలో నటిస్తున్నారు. -
వింత స్టంట్: 50 ఏళ్ల వ్యక్తి స్మోకింగ్ చేస్తూ మారథాన్
మారథాన్ చేయడం అంత ఈజీ కాదు. అందుకు ప్రత్యేక శిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి, నిబద్ధత అవసరం. ఆరోగ్య స్పృహతో ఉన్న క్రీడాకారులు మాత్రమే ఇలాంటివి చేస్తారని అందరికీ తెలుసు. కానీ ఇక్కడొక మనిషి అందుకు విరుద్ధం. పొగ తాగుతూ... మారథాన్ చేసి అందర్నీ ఆకర్షించాడు. వివరాల్లోకెళ్తూ.....చైనాకు చెందిన అంకుల్ చెన్ అనే వ్యక్తి మారథాన్ పోటీల్లో స్మోక్ చేస్తూ మారథాన్ చేశాడు. అలా చేయడంతో అతని ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాడు. వాస్తవానికి ధూమపానం చేస్తే గుండె, ఊపితిత్తులు, కండరాలకు ఆక్సిజన్ తక్కువగా అందడంతో పరుగు పెట్టడం కష్టమవుతుంది. కానీ ఈ 50 ఏళ్ల చెన్ మాత్రం చైనాలోని జియాండేలో జరిగిన 42 కి.మీ మారథాన్‌ని ధూమపానం చేస్తూ పూర్తి చేశాడు. పైగా ఈ మారథాన్ మూడు గంటల 28 నిమిషాల్లో పూర్తి చేశాడు. అంతేగాదు పోటీలో ఉన్న 1500 మందిలో 574వ రన్నర్‌గా నిలిచాడు. చెన్ ఇలాంటి వింత స్టంట్లు చేయడం ఇది తొలిసారి కాదు. 2018 గ్వాంగ్జౌ మారథాన్, 2019 జియామెన్ మారథాన్‌లో ధూమపానం చేస్తూ పాల్గొన్నాడు. దీంతో అతని ఫోటోలు చైనా సోషల్ మాధ్యమం విబోలో తెగ వైరల్ అయ్యాయి. ఈ మేరకు నెటిజన్లు పొగ తాగకపోతే ఇంకా మెరుగైనా ప్రతిభ కనబర్చేవాడని ఒకరు, అక్షరాల అతని ఊపిరిత్తితులు బాగా పనిస్తున్నాయి అని మరోకరు కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. ఐతే ప్రస్తుతం మారథాన్ పోటీల్లో ధూమపానం చేయకూడదనే నిబంధనలు లేవు. (చదవండి: ఐదేళ్ల తర్వాత.. ఈ చిట్టిబాబుకు చెవులొచ్చాయ్! ఎలాగో తెలుసా?..) -
మెదడులో కల్లోలం.. ఆ నాలుగు గంటలు ఎంతో కీలకం
లబ్బీపేట(విజయవాడ తూర్పు): శరీర అవయవాల పనితీరును నియంత్రించే మెదడు దెబ్బతినడం వల్ల కలిగే వ్యాధి బ్రెయిన్ స్ట్రోక్. మెదడులో రక్తం సరఫరా సరిగ్గా జరగక పోవటం, రక్తనాళాలు చిట్లటం వంటి కారణాలతో బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురై పక్షవాతం బారిన పడతారు. ఈ వ్యాధి ఒకప్పుడు వృద్ధాప్యంలో ఉన్న వారికే వచ్చేది. కానీ ప్రస్తుతం 30 నుంచి 45 ఏళ్ల లోపు యువత కూడా దీని బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జీవన విధానంలో మార్పులు, తీవ్రమైన ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవటం వంటి కారణాల వల్ల అనేక మంది పక్షవాతానికి గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 30 శాతం మంది యువతే.. ఒకప్పుడు వయస్సు 55, 60 ఏళ్ల వారిలో ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యేవారు. కానీ ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే వారిలో 25 నుంచి 30 శాతం మంది 45 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రతిరోజూ ఇద్దరు, ముగ్గురు బ్రెయిన్ స్ట్రోక్‌తో వస్తుంటారు. వారి స్ట్రోక్ తీవ్రతను బట్టి జనరల్ మెడిసిన్, ఏఎంసీ, న్యూరాలజీ విభాగాల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో వస్తున్న వారిలో రక్తంలో గడ్డలు ఏర్పడి మెదడుకు సరిగా రక్తప్రసరణ జరగక పోవడం వలన వచ్చే స్ట్రోక్(ఇస్కిమిక్) 80 శాతం మంది, రక్తనాళాలు చిట్లి (హెమరైజ్డ్) 20 శాతం మంది ఉంటున్నారు. ప్రధాన కారణాలివే.. - పెద్ద వయస్సు వారిలో రక్తపోటు, మధుమేహం స్ట్రోక్‌కు కారణంగా చెబుతున్నారు. - 45 ఏళ్లలోపు వారిలో హోమోసిస్టీన్, సిక్కుసెల్ అనే రక్తంలో జెనిటిక్ లోపాలు, వంశపారంపర్యంగా, హెరాయిన్ వంటి డ్రగ్స్, మద్యపానం, ధూమపానం, ప్రమాదాల్లో తలకు గాయాలైన వారిలో ఎక్కువగా స్ట్రోక్ వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. - వీరితో పాటు కదలిక లేని జీవన విధానం కారణంగా కొలె్రస్టాల్ స్థాయిలు పెరిగి స్ట్రోక్‌కు గురవుతున్నట్లు వెల్లడిస్తున్నారు. - ఆడవారిలో హార్మోనల్ ఇబ్బందులు, రక్తనాళాల్లో లోపాల కారణంగా కూడా స్ట్రోక్ రావచ్చంటున్నారు. గుండెలోపాలు ఉన్న వారిలోనూ బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువని వివరిస్తున్నారు. ఆ నాలుగు గంటలే కీలకం.. ఇప్పుడు బ్రెయిన్‌స్ట్రోక్‌కు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. లక్షణాలను గుర్తించి, నాలుగు గంటల్లోపు ఆస్పత్రికి చేరుకుంటే స్ట్రోక్‌తో వైకల్యం రాకుండా వైద్యులు కాపాడగలుగుతున్నారు. ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చిన వారికి త్రోంబలైసిస్ ఇంజెక్షన్‌ను ఇవ్వడం ద్వారా రక్తంలోని పూడికలు కరిగేలా చేస్తున్నారు. ముఖం, చేయి, కాలు ముఖ్యంగా శరీరం ఒకవైపున ఆకస్మిక తిమ్మిరి, బలహీనత ఏర్పడటం, ఆకస్మికంగా గందరగోళం ఏర్పడటం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, కంటి చూపు మందగించడం, తలతిరగడం, బ్యాలెన్స్ తప్పడం, ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి వంటికి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు. -
స్పైస్‌జెట్ విమానంలో సిగరెట్ తాగిన పోకిరి.. సెల్ఫీ వీడియో వైరల్!
న్యూఢిల్లీ: విమానంలో ఏ చిన్న పొరపాటు జరిగినా వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందువల్ల ప్రతి అంశాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తారు. అయితే, ఓ వ్యక్తి స్పైస్‌జెట్ విమానంలో దర్జాగా సిగరెట్ తాగాడు. లైటర్‌తో సిగరేట్ వెలిగించుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. దానిని సోషల్ మీడియాలో విడుదల చేయటంతో సంచలనంగా మారింది. అసలు విమానంలోకి లైటర్ ఎలా వెళ్లిందనే అంశం కీలకంగా మారింది. వందల మంది ప్రాణాలను ప్రమాదంలో పడేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. అందులో గుర్గావ్కు చెందిన బాబీ కటారియా అనే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ విమానం సీట్లో పడుకుని సిగరెట్ అంటించాడు. పొగతాగుతున్న సంఘటనను సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో 6.30 లక్షల మంది అనుచరులు ఉన్నారు. ఈ వీడియోను పలువురు ట్విట్టర్లో షేర్ చేస్తూ విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియాకు జత చేశారు. ‘దర్యాప్తు చేపట్టాం. అలా ప్రమాదకరంగా ప్రవర్తించే వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలేసేది లేదు.’ అని ట్వీట్ చేశారు సింధియా. ‘బల్విందర్ కటారియా అనే వ్యక్తి స్పైస్‌జెట్ విమానంలో దుబాయ్ నుంచి న్యూఢిల్లీకి వచ్చాడు. జనవరి 23న ఢిల్లీలో ల్యాండయ్యాడు. ప్రస్తుతం వీడియో అతడి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజీల్లో లేదు. గతంలోనే విమానయాన భద్రతా విభాగం చర్యలు తీసుకుంది. ’అని పేర్కొన్నారు పౌర విమానయాన భద్రతా విభాగం అధికారులు. మరోవైపు.. ఈ సంఘటనపై మీడియాలో వార్తలు రావటాన్ని తీవ్రంగా ఖండించాడు కటారియా. కేవలం టీఆర్పీ రేటింగ్‌ల కోసమే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. New rule for Bobby kataria ? @JM_Scindia @DGCAIndia @CISFHQrs pic.twitter.com/OQn5WturKb — Nitish Bhardwaj (@Nitish_nicks) August 11, 2022 ఇదీ చదవండి: Allu Arjun: నోట్లో సిగరెట్, చెవికి పోగు.. అల్లు అర్జున్ న్యూ లుక్ వైరల్ -
సిగరెట్ ప్యాక్ కాదు.. ప్రతి సిగరెట్ పైనా హెచ్చరిక!
సిగరెట్ బాక్సుల మీద ఆరోగ్యానికి హానికరం హెచ్చరికలు ఫొటోలతో సహా ఉండేవి. కానీ, ఆ సందేశాలు ప్రజల్లో అంతగా చైతన్యం తీసుకురాలేకపోయాయి. పోగరాయళ్లు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. అందుకే సిగరెట్ ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక సందేశం చేరువయ్యేలా కెనడా ఒక సరికొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ప్రపంచంలోనే ఈ తరహా ప్రయత్నం మొదటిది కావడం విశేషం. ఇంతవరకు పొగాకు లేదా సిగరెట్ ఉత్పత్తుల పై గ్రాఫిక్ ఫోటోతో కూడిన వార్నింగ్ సందేశాలు ఉండేవి. సిగరెట్ కంపెనీలు వాటిని అనుసరిస్తూ.. ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశాయి. అయితే పోను పోను ప్రజల్లో అంత ప్రభావాన్ని చూపించలేకపోయాయి. కెనడా దేశం ఈ సమస్యకు ఒక చక్కని పరిష్కారాన్ని కనిపెట్టింది. ఇంతవరకు ప్యాకెట్లపైనే హెచ్చరికలు ఇస్తున్నాం. అలా కాకుండా ప్రతి సిగరెట్ట్ పైన ఈ సందేశం ఉంటే...గుప్పు గుప్పు మని పీల్చే ప్రతి సిగరెట్ ఎంత విషమో అర్థమవుతుందని అంటోంది కెనడా ఆరోగ్య మంత్రిత్వశాఖ. ఈ విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు కెనడా మానసిక ఆరోగ్య మంత్రి కరోలిన్ బెన్నెట్ తెలిపారు. అంతేకాదు ఇలాంటి కొత్త విధానాన్ని తీసుకువచ్చిన తొలిదేశం కెనడానే అని చెప్పారు. దీనివల్ల ప్రజల్లో చైతన్యం రావడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఈ సందేశాలు చేరువవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2023 నాటికల్లా ఈ ప్రతిపాదన అమలులోకి తెచ్చేందుకు కెనడా ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తోందన్నారు. ఈ మేరకు కెనడియన్ క్యాన్సర్ సొసైటీకి చెందిన సీనియర్ పాలసీ విశ్లేషకుడు రాబ్ కన్నింగ్‌హామ్ మాట్లాడుతూ...ప్రతి సిగరెట్లపై ముంద్రించే హెచ్చరిక ప్రతి వ్యక్తికి చేరువయ్యేలా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుంది. ఇంతవరకు మరే ఏ ఇతర దేశం దేశం ఇలాంటి నిబంధనలను అమలు చేయలేదు. ఇది విస్మరించలేని హెచ్చరిక అని అన్నారు. ఈ సరికొత్త విధానాన్ని ఇంటర్నేషనల్ టుబాకో కంట్రోల్ పాలసీ ఎవాల్యుయేషన్ ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ జియోఫ్రీ ఫాంగ్ ప్రశంసించారు. తాజా గణాంకాల ప్రకారం కెనడాలో 10 శాతం మంది ధూమపానం చేస్తున్నారని, 2035 కల్లా ఆ సంఖ్యను తగ్గించేందుకే కెనడా ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. (చదవండి: కొత్త చరిత్ర సృష్టించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్–2) -
తెర పై స్మొ ‘కింగ్స్’
రాజేంద్రనగర్‌కు చెందిన ఓ టీనేజర్ ఒకటి తర్వాత ఒకటిగా ప్యాకెట్ సిగిరెట్లు హాంఫట్ చేశాడు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. కేజీఎఫ్ సినిమాలో హీరోను చూసి ఆ కుర్రాడు ఫాలో అయ్యాడనేది తర్వాత తెలిసిన సంగతి. అయితే ఈ తరహాలో టీనేజర్లపై సినిమాలు, వెబ్ సిరీస్ ప్రభావం తీవ్రమవుతోందని, మరింత తీవ్రంగా మారనుందని గతంలోనే నగరం వేదికగా నిర్వహించిన ఓ అధ్యయనం తేల్చింది. ఈ నేపధ్యంలో టీనేజర్ల భవిష్యత్తు ‘పొగ’చూరిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సాక్షి , హైదరాబాద్: మాస్ మీడియా మరియు ఇంటర్నెట్లోని సెలబ్రిటీల విజువల్స్‌కు ప్రభావితమైన యువకులు మద్యపానంతో పాటు ధూమపానానికి అలవాటు పడుతున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సీనియర్ సోషల్ సైంటిస్ట్ (డిప్యూటీ డైరెక్టర్) మేకం మహేశ్వర్ గతంలో నిర్వహించిన అధ్యయనం దీన్ని నిర్ధారించింది. ‘టీనేజర్స్ డైట్ మరియు హెల్త్–రిలేటెడ్ బిహేవియర్‌పై మాస్ మీడియా ప్రభావం’ అనే అంశంపై చేసిన సర్వేలో 15 శాతం మంది అబ్బాయిలు సెలబ్రిటీలను అనుకరించడానికే తాము సిగరెట్ తాగామని స్పష్టం చేశారు. సినిమాతో పాటు వెబ్‌సిరీస్ తదితర సోషల్ మీడియా సెలబ్రిటీలు సైతం వీరిని ప్రభావితం చేశారని తేలింది. మిగతా వయసుల వారితో పోలిస్తే టీనేజర్లపై స్మోకింగ్ సీన్స్ ప్రభావం ఎక్కువగా ఉంటోందని పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి అధ్యయనాలు సైతం వెల్లడించాయి. ఆన్లైన్ లోకం..అవగాహనే శరణ్యం.. ప్రపంచం అంతా ఆన్లైన్ మీదే నడిచే రోజులు వచ్చేస్తున్న పరిస్థితుల్లో పిల్లల్ని స్మోకింగ్ సీన్స్‌కి దూరంగా ఉంచడం అంత సులభ సాధ్యం కాదు. అయినా ఆ ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు ధూమపానం వల్ల కలిగే అనర్ధాలను తరచుగా వారికి వివరించి చెబుతూ ఉండాలని వైద్యులు, మానసిక చికిత్స నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు ఇచ్చే పాకెట్ మనీని నియంత్రించడం, వారి అలవాట్లపై ఓ కన్నేసి ఉంచాలని అంటున్నారు. టీనేజీకి...చాలా ప్రమాదకరం గతంలో టీనేజర్స్ స్మోకింగ్‌కు ఇంట్లో తండ్రో, తాతో, అన్నో.. ప్రభావం కారణమయ్యేది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ప్రభావం సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూపిస్తున్నాయి. సిగరెట్లలలో వందల కొద్దీ హానికారక పదార్ధాలు ఉంటాయి. చిన్నవయసులో అలవాటు పడితే అది ఎదుగుదల హార్మోన్లపైనా చెడు ప్రభావం చూపిస్తుంది. మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. ఆస్తమా, టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మా పిల్లలకు ఆ అలవాటు కాదులే అనే ధీమాకి పోకుండా...స్మోకింగ్‌ను పిల్లలకు దూరంగా ఉంచడానికి వారిలో ముందస్తుగానే అవగాహన పెంచడం అవసరం. –డా.రమణప్రసాద్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, కిమ్స్ ఆసుపత్రి (చదవండి: తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40 మంది అభ్యర్థులకు ఉత్తమ ర్యాంకులు) -
ఏపీలో తగ్గుతున్న పొగరాయుళ్లు
సాక్షి, అమరావతి: పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్.. అని అన్నాడొకరు. సరదా.. సరదా.. సిగరెట్టు అంటూ ఓ సినిమాలో కేరక్టర్ చిందులేసింది. ఈ మాటలన్నీ వద్దులే.. ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటున్నారు. పొగ తాగితే వచ్చే రోగాల గురించి ఆలోచన పెరిగింది. దీంతో పొగ తాగే వారి సంఖ్య రాష్ట్రంలో క్రమంగా తగ్గిపోతోంది. 2019–21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. చదవండి: (గంజి ప్రసాద్ హత్య కేసులో కీలక పరిణామం) రాష్ట్రం మొత్తం మీద 2016–17తో పోల్చితే 2019–21లో పొగ తాగేవారి సంఖ్య 4.2 శాతం తగ్గినట్లు సర్వే తెలిపింది. పట్టణాల్లో 3.9 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 4.9 శాతం పొగరాయుళ్ల సంఖ్య తగ్గినట్లు పేర్కొంది. ఇక రోజూ ఇంటి దగ్గర పొగతాగే వారు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 2016–17లో 28.5 శాతం ఉండగా 2019–21లో 22.1 శాతానికి తగ్గారు. అసలు పొగతాగని వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2016–17లో అసలు పొగతాగని వారు 65.4 శాతం ఉండగా 2019–21లో 71.9 శాతానికి పెరిగింది. పొగతాగే వారిలో 15 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల వయసు వారు ఎక్కువగా ఉన్నారు. పొగాకు వినియోగమూ తగ్గుతోంది. పొగతాగే వారిలో ఎక్కువ మంది 24 గంటల్లో ఐదు సిగరెట్లు కాల్చుతున్నట్లు సర్వేలో తేలింది. బీడీ తాగే వారిలో 24 గంటల్లో 10 నుంచి 14 బీడీలు తాగుతున్నట్లు వెల్లడైంది. రాష్ట్రం మొత్తం మీద పొగతాగే వారి సంఖ్య క్రమంగా తగ్గడానికి ఆరోగ్యం పట్ల అవగాహనతో పాటు పెళ్లి అయిన తరువాత పిల్లలు పుట్టాక స్మోకింగ్‌కు దూరం అవుతున్నట్లు తేలింది. ఇటీవలి కాలంలో యువత కూడా పొగాకు వినియోగానికి దూరంగా ఉంటోందని అధికారవర్గాలు తెలిపాయి. -
ఏపీ: మత్తు వదలాలి.. స్క్రీనింగ్ చేస్తున్న ఏఎన్ఎంలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నియంత్రించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. నాన్ కమ్యూనికబుల్ డిసీజస్(ఎన్సీడీ) 2.0 సర్వే ద్వారా పొగాకు వ్యసనపరులను గుర్తిస్తోంది. ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను స్క్రీనింగ్ చేస్తున్నారు. బీడీ, చుట్టా, సిగరెట్‌తో పాటు, గుట్కా, ఖైనీ తదితర పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్న వారి వివరాలను తెలుసుకుంటున్నారు. ఇప్పటికే 2,13,12,792 మందిని స్క్రీనింగ్ చేసి.. 2,96,226 మంది పొగాకు వ్యసనపరులను గుర్తించారు. వీరిని పొగాకు వినియోగం నుంచి దూరం చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి వైద్య నిపుణులు ఫోన్ చేసి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 1,86,303 మందికి ఫోన్ చేశారు. తొలుత కాల్‌సెంటర్ ఎగ్జిక్యూటివ్ పొగాకు వినియోగించే వ్యక్తికి ఫోన్ చేసి ఆ వ్యక్తి ఏం పనిచేస్తుంటారు? ఎన్నేళ్ల నుంచి పొగాకు వినియోగిస్తున్నారు? తదితర వివరాలను తెలుసుకుంటున్నారు. పొగాకు వినియోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరిస్తున్నారు. వ్యసనాన్ని వీడటానికి మొగ్గు చూపిన వారిని కాల్ సెంటర్లోని కౌన్సెలర్‌కు ట్యాగ్ చేస్తున్నారు. వారు పొగాకు వినియోగాన్ని వీడేలా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అనంతరం జిల్లాల్లోని డీ–అడిక్షన్ సెంటర్లకు సంబంధిత వ్యక్తులను ట్యాగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 1,86,303 మందికి గాను 10,066 మంది పొగాకు వినియోగాన్ని వదలిపెట్టేందుకు ముందుకు వచ్చారు. డీ–అడిక్షన్ సెంటర్లలోని వైద్యులు వీరికి ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. మరోవైపు డీ–అడిక్షన్ సెంటర్‌కు మ్యాపింగ్ అయిన వ్యక్తులకు అక్కడ చికిత్స ఏ విధంగా అందుతోంది? వారిలో మార్పు వచ్చిందా? అనే అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా వెబ్ అప్లికేషన్ రూపొందిస్తున్నారు. త్వరలో ఈ అప్లికేషన్ అందుబాటులోకి రానుంది. -
గ్రౌండ్‌లోనే సిగరెట్ కాల్చిన అఫ్గన్ క్రికెటర్.. ఫ్యాన్స్ ఆగ్రహం
అఫ్గనిస్తాన్ క్రికెటర్ మహ్మద్ షెహజాద్ గ్రౌండ్లో సిగరెట్ కాలుస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో అతని ప్రవర్తనపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్ 2022)లో భాగంగా ఫిబ్రవరి 4న మినిస్టర్ గ్రూఫ్ ఢాకా, కొమిల్లా విక్టోరియన్స్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇది చోటుచేసుకుంది. మ్యాచ్ కొద్దినిమిషాల్లో ప్రారంభం అవుతుందనగా.. మైదానంలోకి వచ్చిన మహ్మద్ షెహజాద్ సిగరెట్ కాల్చాడు. అతని నోటి నుంచి సిగరెట్ పొగను వదలడం కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. ఇది చూసిన షెహజాద్ జట్టు కోయ్ మిజానుర్ రెహ్మన్, తమీమ్ ఇక్బాల్‌లు వెంటనే గ్రౌండ్‌కు వచ్చి షెహజాద్‌ను డ్రెస్సింగ్‌రూమ్‌కు తరలించారు. చదవండి: PSL 2022: ఇంత దరిద్రమైన ఎంట్రీ ఎప్పుడు చూడలేదు.. అఫ్రిదిపై ట్రోల్స్ వర్షం కాగా షెహజాద్ చర్యపై బీసీబీ చీఫ్ మ్యాచ్ రిఫరీ తీవ్రంగా మండిపడ్డారు. నిబంధనల ప్రకారం గ్రౌండ్లో స్మోక్ చేయడం నిషేధం. ఆ రూల్ మరిచి షెహజాద్ గ్రౌండ్‌లోనే సిగరెట్ కాల్చడం తప్పు. ఒకవేళ షెహజాద్‌కు ఈ విషయం తెలియకపోతే.. మ్యాచ్ అఫీషియల్స్ అతనికి సమాచారం అందించాల్సింది. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీబీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆర్టికల్ 2.20 కింద నిబంధనలు ఉల్లఘించిన కారణంగా షెహజాద్‌కు పెనాల్టీతో పాటు డీమెరిట్ పాయింట్స్ ఇచ్చారు. దీనిపై స్పందించిన మహ్మద్ షెహజాద్ తన ప్రవర్తనపై క్షమాపణ కోరాడు. తాను చేసింది తప్పేనని.. ఫైన్ కట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. ఫ్యాన్స్ నాపై కోపం వ్యక్తం చేయడంలో అర్థం ఉందని పేర్కొన్నాడు. If Shah Rukh Khan could be banned for 5 years due to smoking in the gallery, Or Lankan players could be banned for smoking, not even in the stadium. Then surely this rubbish cricketer from Afghanistan (Mohammad Shahzad) should be banned for a lifetime in the BPL! @BCBtigers @ICC pic.twitter.com/R5jGtCutlY — Foysal Sawon (@foysal_sawon) February 4, 2022 -
మాంసాహారం డీప్ ఫ్రై లేదా రోస్ట్ చేస్తే.. ‘హెటెరోసైక్లిక్ అరోమాటిక్ అమైన్స్’ వల్ల
చెడు వినకు, చూడకు, మాట్లాడకు అని నీతి చెప్పే మూడు కోతి బొమ్మలు అందరికీ తెలిసినవే. అలాంటి ముఖ్యమైన మూడు నీతి వాక్యాలే... క్యాన్సర్‌ను ‘‘వండుకోకండి, నిల్వ చేసుకోకండి, తినకండి’’ అనే మాటలు! ఇలా క్యాన్సర్‌ను వండటం, నిల్వచేయడం, తినడం ఎలా జరుగుతుందో చూద్దాం, దానికి దూరంగా ఉందాం. ప్రతి వ్యక్తీ బతికి ఉండటానికి ఆహారం తీసుకుంటాడు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఆహారపదార్థాలను తినడం, వాటిని వండుకోవడం, నిల్వ చేసుకోవడం చేస్తుంటారు. అప్పుడు సరిగా వండుకోకపోయినా, నిల్వ చేసుకోకపోయినా, తినకపోయినా క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. వాటిని నివారించడానికి అనుసరించాల్సిన మార్గాలివే... ‘క్యాన్సర్ వంట పద్ధతులు’ వద్దు... ఓ పదార్థాన్ని వండుతున్నామంటే... దాన్ని క్యాన్సర్‌ను రాని రీతిలో వండటం ముఖ్యం. వంటలో మనం ఉడికించడం, వేయించడం, డీప్ ఫ్రై లేదా రోస్ట్ చేయడం లాంటి ప్రక్రియలను అనుసరిస్తుంటాం. వీటన్నింటిలోనూ ఉడికించడం అనేది క్యాన్సర్‌ను దూరంగా ఉంచే ఆరోగ్యకరమైన ప్రక్రియ. వేపుళ్లు, రోస్ట్ చేయడం అనారోగ్యకరమైన పద్ధతులు. ఉదాహరణకు మాంసాహారం లేదా కొన్ని శాకాహారాల్లో డీప్ ఫ్రైలు, రోస్ట్‌లు చేయడం క్యాన్సర్‌కు కారణం కావచ్చు. ఎందుకంటే... ఇలా డీప్ ఫ్రై లేదా రోస్ట్ చేసే సమయంలో ఆహార పదార్థాల్లోంచి ముఖ్యంగా మాంసాహారం నుంచి ‘హెటెరోసైక్లిక్ అరోమాటిక్ అమైన్స్’ (హెచ్ఏఏ) అనే క్యాన్సర్ కలిగించే హానికరమైన రసాయనాలు వెలువడవచ్చు. అందుకే ఎప్పుడో ఓసారి చాలా కొద్దిమోతాలో జిహ్వను సంతృప్తిపరచేందుకు తప్ప... అతిగా వేయించే వేపుళ్లు, రోస్ట్లకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. క్యాన్సర్ల ‘నిల్వ’ వద్దు ... తినే పదార్థాలను నిల్వ చేసుకుని, అవసరం ఉన్నప్పుడల్లా వినియోగించుకోవడం అనాదిగా మనమంతా పాటిస్తున్న పద్ధతే. ఉదాహరణకు పచ్చళ్లు, బేకరీ పదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్‌ను ఎక్కువగా నిల్వ చేస్తుంటారు. చాలాకాలం పాటు తినేపదార్థాలు నిల్వ ఉంచడం కోసం కొన్ని రసాయనాలు వాడుతుంటారు. వెన్న, నెయ్యి చాలాకాలం పాటు ఉంటే చెడిపోతాయి. అలాగే వాటితో చేసిన పదార్థాలూ చాలాకాలం నిల్వ ఉంటే పాడైపోతాయి. అందుకే ‘మార్జరిన్’ అనే పదార్థాన్ని నూనె, వెన్న, నెయ్యికి ప్రత్యామ్నాయం గా వాడుతుంటారు. కానీ మార్జరిన్ చెడు కొవ్వులను పెంచి మంచికొవ్వులను బాగా తగ్గిస్తుంది. అలాగే నిల్వ ఉంచేందుకు తోడ్పడే అనేక రసాయనాల్లో దేహానికి హానిచేసే పదార్థాలు ఉంటాయి. దాదాపు ఇవన్నీ క్యాన్సర్ ముప్పును పెంచుతాయి. ఇక మాంసాహారాన్ని చాలాకాలంపాటు నిల్వ ఉంచేందుకు ‘స్మోకింగ్’ అనే ప్రక్రియను అనుసరిస్తారు. ఇలా చేసేప్పుడు ‘పాలీ సైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్’ (పీఏహెచ్‌స్) అనే రసాయనాలు ఏర్పడతాయి. ఇవి కూడా క్యాన్సర్ కారకాలే. మనం పెట్టుకునే ఊరగాయల్ని ఏడాదంతా నిల్వ ఉంచడానికి ఎక్కువ మోతాదులో ఉప్పు వాడతారు. దాంతో కడుపు లోపలి పొరలు ఒరుసుకుపోవడం, అలాగే ఆ భాగాల్లో నైట్రేట్ల దుష్ప్రభావంతో క్యాన్సర్‌కు అవకాశాలెక్కువ. కడుపులోని యాసిడ్ అన్నింటినీ చంపేసినా ‘హెలికోబ్యాక్టర్ పైలోరీ’ అనే సూక్ష్మక్రిమిని మాత్రం చంపలేదు. ‘హెచ్. పైలోరీ’ వల్ల పొట్టక్యాన్సర్లు వచ్చే ముప్పు ఎక్కువ. అందుకే వంటచేయడం, నిల్వచేయడం, తినడం... ఈ మూడు పద్ధతుల్లోని ఆరోగ్యకరమైన మార్గాలు క్యాన్సర్ నివారణకు చాలా ముఖ్యమని తెలుసుకోవడం అందరికీ అవసరం. -డాక్టర్ సీహెచ్. మోహన వంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్ Ph: 98480 11421, Kurnool 08518273001 చదవండి: Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? వేటమాంసం తిన్న తర్వాత వీటిని తిన్నారంటే.. Jeedipappu Health Benefits: జీడిపప్పును పచ్చిగా తింటున్నారా..! సంతానలేమితో బాధపడే వారు పిస్తాతో పాటు వీటిని తింటే.. -
'ఈ నగరానికి ఏమైంది...?. ఎవరూ నోరు మెదపరేం’
ఈ నగరానికి ఏమైంది...?. ఒకవైపు పొగ... మరోవైపు ధూళి. ఎవరూ నోరు మెదపరేం’ అంటూ అటు టీవీల్లో, ఇటు సినిమా హాళ్లల్లోనూ ప్రకటనలు హోరెత్తుతున్నాయి. ప్రకటనల మాటేమో గానీ బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగరాదన్న చట్టం చేసి పదేళ్లైనా అమలుకు నోచుకోవడం లేదు. పొగ రాయుళ్లు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తూ చుట్టుపక్కల వారిని అనారోగ్యం బారిన పడేస్తున్నారు. ఈ విషయమై ఏ ఒక్క అధికారీ నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. – కర్నూలు(హాస్పిటల్) కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2008 అక్టోబర్ 2న సిగరెట్స్ అండ్ టుబాకో ప్రొడక్ట్స్ యాక్ట్(సీఓటీపీఏ–2008)ను రూపొందించింది. ఈ చట్టం ప్రకారం బస్టాండ్, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, మార్కెట్లు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, జనసంచారం ఉండే ప్రదేశాల్లో ధూమపాన నిషేధం. దీనిని అతిక్రమిస్తే రూ.200 జరిమానాతో పాటు జైలు శిక్ష విధించాలని చట్టం చెబుతోంది. పొగాకు ఉత్పత్తులను 18 ఏళ్లలోపు ఉన్న వారికి అమ్మినా జరిమానా విధించాలి. పొగాకు నియంత్రణ, బహిరంగ ధూమపానాన్ని అరికట్టేందుకు చట్టం అమలు బాధ్యతను పోలీసు శాఖకు అప్పగించింది. చాలా ప్రాంతాల్లో పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో పొగతాగే వారిపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. కొందరు పోలీసులకు ఈ చట్టం ఒకటి ఉందనే విషయం కూడా తెలియదు. కొందరు పోలీసు అధికారులకు చట్టం గురించి అవగాహన ఉన్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ సంకల్పం బాగున్నా ఆచరణలో చిత్తశుద్ధ లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. చదవండి: (Uday Kumar Reddy: ఎస్సైగా ఇక్కడే.. ఎస్పీగా ఇక్కడికే!) ప్రతి నెలా రూ.5 కోట్ల వ్యాపారం జిల్లాలో బీడీ, సిగరెట్, చుట్ట విక్రయాలు తగ్గడం లేదు. ధర ఎంతైనా వాటిని కొనుగోలు చేసి వాడుతున్నారు. ముఖ్యంగా వీటి టోకు వర్తక వ్యాపారులు కర్నూలు నగరంలోని పాతబస్తీలో అధికంగా ఉన్నారు. ఇక్కడి నుంచే నంద్యాల, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, బనగానపల్లి, ఆళ్లగడ్డ, శ్రీశైలం వంటి ప్రాంతాలకు పలువురు చిన్న తరహా డీలర్లు తీసుకెళ్లి అక్కడి రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి నెలా జిల్లాలో రూ.5 కోట్లకు పైగానే వ్యాపారం జరుగుతోందని అంచనా. పొగాకు ఉత్పత్తులతో వ్యాధులు.. పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల ఎక్కువగా ఊపిరితిత్తుల వ్యాధులైన బ్రాంకైటిస్, ఆయాసం, సీఓపీడీ, గుండెజబ్బులు, రక్తనాళాలు మూసుకుపోవడంతో పాటు నోటి క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, రక్త క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉంది. బీడీ, సిగరెట్, చుట్టలను ప్రత్యక్షంగా తీసుకోకపోయినా వాటిని వాడిన వారు వదిలే పొగను పీల్చినా పైన చెప్పిన వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా ధూమపానం.. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయకూడదని చట్టం చెబుతున్నా పొగరాయుళ్లు పట్టించుకోవడం లేదు. బస్టాండ్, టీ కొట్లు, రైల్వేస్టేషన్లు, రైళ్లు, బస్సులలో ధూమపానం చేస్తున్నారు. 18 ఏళ్లలోపు బాలురు సైతం ఈ దురలవాటుకు బానిసలు కావడం బాధాకరం. ధనార్జనే ధ్యేయంగా వ్యాపారులు వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికీ వీటిని విక్రయిస్తూ పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చట్టం ఏమి చెబుతుందంటే.. ►బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయకుండా బోర్డులు ఏర్పాటు చేయాలి ►పాఠశాలలు, కళాశాలల వద్ద పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదు ►ధూమపానం అలవాటు ఉన్న వారి కోసం ప్రత్యేకంగా స్మోకింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. ►రైతులు, వ్యాపారులు, రెస్టారెంట్ యజమానులు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ►రెవెన్యూ, పోలీస్, వైద్యులు కలిసి అప్పుడప్పుడూ బహిరంగ ప్రదేశాల్లో దాడులు నిర్వహించి పొగతాగే వారికి జరిమానాలు విధించాలి. పొగ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరం బీడీ, సిగరెట్, చుట్ట తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదకరం. వీటి వల్ల ఏటా ప్రపంచ వ్యాప్తంగా 64 లక్షల మంది మరణిస్తున్నారు. పొగతాగడం వల్ల సీఓపీడీ(క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్), క్యాన్సర్ వస్తుంది. 84 శాతం పొగతాగేవారు సీఓపీడీ వల్ల, 83 శాతం క్యాన్సర్ భారిన పడుతున్నా రు.దీంతో పాటు హార్ట్ ఎటాక్, కడుపు, నోటి క్యా న్సర్ వస్తాయి. పొగతాగడం వల్ల ఆస్టియోపోరోసిస్(ఎముకలు బలహీనపడటం) వస్తుంది. – డాక్టర్ వరప్రసాద్, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, కర్నూలు -
సంచలన నిర్ణయం.. సిగరెట్లపై జీవితకాల నిషేధం!
For Future Generations New Zealand To Ban Cigarettes: రాబోయే తరాల ఆయుష్షు పెంచేందుకు, ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టీనేజర్లు సిగరెట్లు కొనడానికి, టీనేజర్లకు సిగరెట్లు అమ్మడాన్ని నిషేధిస్తూ చట్టం చేయనుంది అక్కడి ప్రభుత్వం. వచ్చే ఏడాది నుంచి అమలు కానున్న ఈ చట్టంలోని ‘మెలిక’ ద్వారా అక్కడ యువత జీవితాంతం పొగతాగడానికి దూరం కావడం ఖాయం!. న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకురాబోయే యాంటీ స్మోకింగ్ బిల్లు వచ్చే ఏడాది చట్టం కానుంది. 14 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసు వాళ్లకు సిగరెట్లు అమ్మడాన్ని అక్రమ కార్యకలాపంగా భావిస్తుంది అక్కడి ప్రభుత్వం. అంటే 2008 తర్వాత పుట్టిన వాళ్లెవరూ సిగరెట్లు కొని తాగడానికి, వాళ్లకు ఎవరూ సిగరెట్లు అమ్మడానికి వీల్లేదు. ఈ మేరకు 2027 నుంచి ఈ చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయాలనే ప్రతిపాదన చేసింది. అంతేకాదు వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఏడాది సిగరెట్ కొని తాగేందుకు నిర్ధారించిన కనీస వయసును పెంచుకుంటూ పోవాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఆ వ్యక్తి జీవిత కాలం సిగరెట్ కొని తాగడానికి.. దుకాణదారులు ఆ వ్యక్తిని సిగరెట్ అమ్మడానికి వీల్లేకుండా పోతుంది. టార్గెట్ విఫలం కావడంతోనే.. యువత ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు తమ జీవిత కాలంలో సిగరెట్ కాల్చకుండా.. వాళ్లకు ఎవరూ అమ్మకుండా ఇలా కఠిన చట్టం తీసుకురాబోతోందన్నమాట. గురువారం ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది న్యూజిలాండ్ ప్రభుత్వం. నిజానికి స్మోకింగ్ అలవాటును తగ్గించే ప్రయత్నాల్లో న్యూజిలాండ్ సర్కార్ ఎప్పటి నుంచో గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ప్లేయిన్ సిగరెట్ ప్యాకింగ్ తప్పనిసరి చేసిన 17 దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. అలాగే పద్దెనిమిదేళ్ల లోపు వాళ్లకు సిగరెట్లు అమ్మడం నిషేధం అక్కడ. అయినప్పటికీ 2025 నాటికి అడల్ట్ స్మోకింగ్ రేటు కనీసం 5 శాతం తగ్గించాలన్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ ఇలా కఠిన చట్టం ఆలోచన చేసింది. స్మోకింగ్ అలవాటుతో న్యూలాండ్‌లో సాలీనా ఐదు వేల మంది చనిపోతున్నారు. అంతేకాదు నికోటిన్‌కు అలవాటు పడ్డ పేషెంట్ల కోసం భారీగానే ఖర్చు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. అందుకే యుక్తవయసులోనే అలవాటుకు అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని జెసిండా ఆర్డెర్న్ నేతృత్వంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది చివరికల్లా కొత్త చట్టం సిద్ధం అవుతుంది. ఆ తర్వాత దశలవారీగా అమలు చేస్తారు. 2024 నాటికల్లా.. సిగరెట్ స్టోర్ల సంఖ్యను తగ్గించి(8 వేల నుంచి 500కి తగ్గించాలనే ఆలోచనలో ఉంది).. అమ్మకాల్ని తగ్గుముఖం పట్టేలా చేస్తారు. 2025 నుంచి నికోటిన్ లెవల్ తక్కువ ఉండే సిగరెట్లను మాత్రమే అమ్మాలనే కఠిన నిబంధన అమలు చేయనుంది. ఇక 2027 నుంచి స్మోక్ ఫ్రీ జనరేషన్ నినాదంతో కఠిన చట్టం అమలు చేస్తారు. నిషేధాన్ని ఎలా అమలు చేస్తారు? ఏయే రిటైలర్స్‌ను అమ్మకాలకు దూరంగా ఉంచుతారు? ఎవరికి అనుమతులు ఉంటాయి?.. అనే ప్రణాళిక ప్రత్యేకంగా సిద్ధం చేయనున్నారు. మిగతా వివరాలపై బిల్లు తీసుకొచ్చే టైంలోనే స్పష్టత ఇవ్వనున్నారు. న్యూజిలాండ్ ఇంత టఫా? అఫ్కోర్స్. కానీ, న్యూజిలాండ్ కంటే భూటాన్ సిగరెట్ నిషేధాన్ని కఠినాతికఠినంగా అమలు చేస్తోందని తెలుస్తోంది. అయితే భారత్ నుంచి బ్లాక్ మార్కెట్ ఉత్పత్తులకు అడ్డుకట్ట వేసేందుకు ఆ నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తేసినట్లు కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. పక్కాగా అమలు యువతలో పెరిగిపోతున్న పొగతాగే అలవాటు-మరణాలపై మవోరి తెగ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య నిపుణులతో పాటు మవోరి టాస్క్‌ఫోర్స్ ‘లైఫ్‌టైం స్మోకింగ్ బ్యాన్’ను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఇక ఆర్థికంగా నష్టం వాటిల్లకుండా, రిటైలర్స్‌కు నష్టం వాటిల్లకుండా దశల వారీగా చర్యలతో నష్టనివారణ చేపట్టే దిశగా ప్రయత్నాలు చేయనున్నారు. ఉపాధి కోల్పోకుండా ఆ 1500 స్టోర్లను ప్రత్యామ్నాయ స్టోర్లుగా ప్రభుత్వమే నడిపించనుంది. మరీ ముఖ్యంగా స్మోక్ ఫ్రీ జనరేషన్ చట్టం ద్వారా ప్రజా ఆరోగ్య, మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం ఖర్చు చేస్తున్న 3.6 బిలియన్ అమెరికన్ డాలర్లను ఆదా చేయాలని భావిస్తోంది. -
బీడీ ముట్టించుకుంటుండగా మంటలు
సాక్షి, జవహర్‌నగర్(హైదరాబాద్): బీడీ ముట్టించుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని వృద్ధుడు సజీవ దహనమైన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం... కార్పొరేషన్‌లోని ఆనంద్‌నగర్ కాలనీలో శ్రావణ్‌కుమార్ (79) కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. బీడీ తాగే అలవాటు ఉన్న శ్రావణ్‌కుమార్ బీడీ అంటించుకునే సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని సజీవదహనమయ్యాడు. కుటుంబ సభ్యులు చూసి తేరుకునే లోపే అతడు పూర్తిగా కాలిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గుర్...ర్...ర్.... గురకకు చెక్ పెట్టండిలా
సాధారణంగా గాఢనిద్రలో ఉన్నప్పుడు ఒక గంట లేదా రెండు గంటల సేపు తేలికపాటి గురక అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ నిద్ర పట్టీ పట్టగానే పెద్ద శబ్దంతో గురక వస్తుంటే మాత్రం డాక్టర్ సలహా తీసుకోవాల్సిందే. సాధారణ గురక వల్ల ఇంట్లో వాళ్లకు అసౌకర్యం మినహా మరే ప్రమాదమూ ఉండదు. ఇన్ఫెక్షన్ల కారణంగా వచ్చిన గురక అయితే ఇన్ఫెక్షన్కు చికిత్స చేయించుకుంటే సరిపోతుంది. లైఫ్‌స్టైల్ మార్పుతో ఈ గురకను దూరం చేసుకోవచ్చు. సాధారణ గురక (స్నోరింగ్) ప్రమాదకరం కాదు, కానీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అయితే తేలిగ్గా తీసుకోకూడదు. ఈ కండిషన్లో గురక మధ్యలో గాలి పీల్చుకోవడం ఆగుతుంటుంది. ఇది ప్రమాదకరమైన స్థితి. దీనికి డాక్టర్‌ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. అసలు గురక ఎందుకు వస్తుంది? గురకకు దారి తీసే కారణాలివి: ►ముక్కు మూసుకుపోయి గాలి సరఫరాకు అంతరాయం కలుగుతున్నప్పుడు గురక వస్తుంది. అయితే ఇది చాలామందిలో సీజనల్‌గానే ఉండవచ్చు. సైనస్ ఇన్ఫెక్షన్లున్నప్పుడు కూడా నాసికామార్గం నుంచి గాలి సులువుగా ఊపిరితిత్తులను చేరలేదు. అటువంటప్పుడు కూడా గాలి పీల్చుకునేటప్పుడు శబ్దం వస్తుంది. నాసల్ పాలిప్స్ కూడా గురకకు కారణం కావచ్చు. పాలిప్స్ అంటే ముక్కులోపలి గోడలకు కానీ ముక్కుదూలం వెంబడి కానీ కండరం పెరగడం. ►రోజంతా శారీరకంగా ఎక్కువగా శ్రమించి దేహం ఎక్కువ అలసటకు లోనయినప్పుడు నిద్రలోకి జారుకోగానే గొంతు, నాలుక శ్వాసకోశ వ్యవస్థతో కలిసే ప్రదేశంలో కండరాలు పూర్తిగా విశ్రాంతిదశలోకి వెళ్లిపోతుంటాయి. దాంతో గాలి ప్రయాణించాల్సిన మార్గం కుంచించుకున్నట్లు అవుతుంది. ఆల్కహాల్ ఇతర మత్తు పదార్థాలు సేవించేవారిలో కూడా ఇదే కండిషన్ ఏర్పడుతుంది. ►అధికబరువు ఉన్న వాళ్లలో బల్కీ థ్రోట్ టిష్యూస్ కండిషన్ కనిపిస్తుంది. గురకకు ఇదీ ఓ కారణమే. ►దిండు మరీ మెత్తగా ఉండి భుజాల కంటే తల దిగువగా ఉన్నప్పుడు, దిండు మరీ గట్టిగా ఎత్తుగా ఉన్నప్పుడు కూడా గాలిపీల్చుకునేటప్పుడు శబ్దం వస్తుంది. ►పిల్లల్లో కొందరికి టాన్సిల్స్, అడినాయిడ్స్ పెద్దవిగా ఉంటాయి. పిల్లల్లో గురకకు ప్రధాన కారణం ఇదే అయి ఉంటుంది. గురకను తగ్గించుకునే మార్గాల.... ►అధికబరువును తగ్గించుకోవాలి. ►దూమపానం, మద్యపానం మానేయాలి. ►వెల్లకిలా పడుకోకుండా పక్కకు ఒత్తిగిలి పడుకోవాలి. ►దిండు ఎత్తు పట్ల జాగ్రత్త (మెడ మరీ కిందకు ఉండకూడదు, మరీ ఎత్తుగానూ ఉండకూడదు, భుజాలకు సమాంతరంగా ఉండాలి) ►గురకను అరికట్టే ప్లాస్టిక్ డివైజ్ ఉంటుంది. దానిని నోట్లో పెట్టుకుంటే ఫలితం ఉంటుంది. దీనిని డాక్టర్ సలహా మేరకు ఉపయోగించాలి. పాలిప్, బల్కీ టిష్యూ వంటి సమస్యలైతే చిన్నపాటి శస్త్ర చికిత్సతో నయం చేసుకోవచ్చు. -
దాని ముందు తలవంచా.. స్మోకింగ్‌పై గతంలో సిరివెన్నెల కీలక వ్యాఖ్యలు
ప్రఖ్యాత గేయ రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రి(66) కన్నుమూసిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారని కిమ్స్ వైద్యులు వెల్లడించారు.ఆరేళ్ల క్రితం ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడడంతో సగం ఊపిరితిత్తిని తొలగించారని.. అయినప్పటికి మరోసారి క్యాన్సర్ బారిన పడడంతో ఆపరేషన్ చేసి మరో ఊపిరితిత్తిలో సగభాగం తీసేసినట్లులు తెలిపారు. ఆ తర్వాత రెండు రోజులు బాగున్నారని , మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు’అని వెల్లడించారు. అయితే సిరివెన్నెలకు సిగరేట్ అలవాటు ఉండడం వల్లే క్యాన్సర్ బారిన పడినట్లు తెలుస్తోంది. సిరివెన్నెల గతంలో ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మోకింగ్ అలవాటుపై కీలక విషయాలు చెప్పారు. చిన్నప్పటి నుంచే స్మోకింగ్ అలవాటు ఉన్నట్లు వెల్లడించారు. సరదాగా మొదలుపెట్టిన స్మోకింగ్.. వ్యసనంగా మారిందని చెప్పారు. నాకు అసలే అహంకారం ఎక్కువ.. అయినా సిగరెట్ ముందు ప్రతిసారి తలవంచుతున్నానని చెప్పారు. తన పిల్లలకు కూడా అదే విషయాన్ని చెపినట్లు తెలిపారు. పబ్లిక్ తిరిగే ప్రాంతంలో కానీ, చిన్న పిల్లల ముందు కాని సిగరేట్ కాల్చొద్దని తనకు తానే ఓ రూల్‌ని పెట్టుకున్నట్లు తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్యర్‌తో మరణించిన నేపథ్యంలో గతంలో స్మోకింగ్‌పై సిరివెన్నెల చేసిన కామెంట్ చర్చనీయాంశంగా మారింది. -
ఆ సమయంలో ఈ నాలుగూ మరింత ప్రమాదంలోకి నెట్టేస్తాయి.. జాగ్రత్త!!
4 Daily Habits People With Depression May Avoid: ప్రస్తుత జీవన శైలి కారణంగా ప్రతి ఒక్కరూ డిప్రెషన్‌కు గురౌతున్నారు. వీటి నుంచి బయటపడేందుకు భిన్న కొత్త అలవాట్లకు బానిసవుతున్నారు. ఫలితంగా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టవుతుంది పరిస్థితి. ముఖ్యంగా ఆ టైంలో ఈ నాలుగింటికి మాత్రం చాలా దూరంగా ఉండాలి. కొంతమంది అధిక ఒత్తిడిని తట్టుకోవడానికి వైన్, బీర్, రైస్ వైన్ లాంటి ఆల్కహాల్‌కు అడిక్ట్ అవుతారు. ఇలా చేయడం వల్ల సమస్య మరింత జఠిలమౌతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిలోని కారకాలు ఒత్తిడిని మరింత పెంచుతాయట. చదవండి: Job Alert: 14 రోజులు వర్క్ చేస్తే ఏకంగా 9 లక్షల రూపాయల జీతం..! చివరితేదీ ఇదే.. డిప్రెషన్‌కు గురైనవారు సిగరేట్స్ కూడా అధికంగా కాల్చుతారు. ఈ సమయంలో ధూమపానం మాత్రమేకాదు, పొగాకు తాలూకు వేటిని కూడా తీసుకోకపోవడం మంచిది, మరికొంత మంది ఒత్తిడిలో అధికంగా ఫుడ్ తినేస్తుంటారు. అందులో ప్రాసెస్డ్ ఫుడ్ అంటే పిజ్జా, బర్గర్, కూల్‌డ్రింక్స్.. వంటివి కూడా ఆరోగ్యానికి మరింత హాని కలుగజేస్తాయి. కెఫీన్ అధికంగా ఉండే ఆహారాలకు కూడా సాధ్యమైనంత దూరంగా ఉండాలి. సాధారణంగా కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్, ఇతర సప్లిమెంట్లలో కెఫీన్ అధికంగా ఉంటుంది. వీటిని సేవిస్తే రాత్రుల్లు నిద్రపట్టక డిప్రెషన్ తాలూకు ఆలోచనలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరేం చెయ్యాలి.. ప్రతి ఉదయం 5 గంటలకు నిద్రలేచి ధ్యానం చేయడం, చిన్న పాటి యోగాసనాలు వేయటం, బుక్స్ చదవడం, చిన్న పిల్లలతో ఎక్కువ సమయం గడపటం, డ్రాయింగ్, పెయింటింగ్ లేదా కొత్ర ప్రదేశాలకు వెళ్లటం.. వంటి పనుల ద్వారా మనసును వేరే వాటిపైకి మళ్లించి జీవితాన్ని మరింత ఆనందంగా గడపాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: అచ్చం భేతాళ కథల్లో మాదిరి.. ఈ నీటిలో పడితే వెంటనే రాయిలా అయిపోతారు..! -
నిమోనియా వ్యాధితో జరభద్రం..
నిమోనియాతో జరభద్రం నిమోనియా అన్నది ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్ అనే విషయం తెలిసిందే. గతంలో వచ్చిన నిమోనియాలతో పోలిస్తే 2020, 2021ల్లో వచ్చిన నిమో నియాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. గతేడాదీ, ఈ ఏడాదీ కోవిడ్ విజృంభించి చాలామంది ప్రాణాలు తీసింది. నిజానికి కరోనా ఆ ప్రాణాలను బలిగొనలేదనీ, కోవిడ్ కారణంగా సెకండరీ ఇన్ఫెక్షన్గా వచ్చిన నిమోనియా అనేక మంది ఉసురు తీసిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈ నెల (నవంబరు) 12న ‘ప్రపంచ నిమోనియా డే’ సందర్భంగా ఆ ఆరోగ్య సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం. ఇన్ఫెక్షన్ల విషయంలో అన్నింటికంటే ఎక్కువ ప్రాణాలు తీసేది ‘నిమోనియా’. 2019లో అది 25 లక్షల మంది ప్రాణాలను బలిగొంది. అందులో 6.72 లక్షలు చిన్నారులు కావడం విషాదం. పైగా ఇందులోనూ చాలా ఎక్కువ మంది ఐదేళ్ల వయసు కంటే తక్కువ చిన్నారులే. అగ్నికి ఆజ్యంలా... కోవిడ్ తోడుకావడంతో ఒక్క గతేడాది లెక్కలే చూస్తే... ఎప్పుడూ నమోదయ్యే నిమోనియా మృతులకు అదనంగా 19 లక్షల మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని ఓ అంచనా. నిమోనియాని పూర్తిగా నయం చేసేలా ఖచ్చితమైన చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ ఇన్ని మరణాలు నమోదవుతున్నాయంటే పైన పేర్కొన్న గణాంకాలతో దాని తీవ్రత తేటతెల్లమవుతోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యూనిసెఫ్ తమదైన ఓ లక్ష్యంతో ఒక కార్యచరణ ప్రణాళిక రూపొందించాయి. ప్రతి దేశంలోనూ 2025 నాటికి నిమోనియా మరణాల సంఖ్యను ప్రతి వెయ్యి మంది చిన్నారుల్లో కేవలం ముగ్గురికి తగ్గించాలన్నదే ఆ గ్లోబల్ యాక్షన్ ప్లాన్ లక్ష్యం. వ్యాధి నిర్ధారణ ►రోగిలో కనిపించే లక్షణాలతో ►సీబీపీ, సీఎక్స్ఆర్ వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. ►ఒక్కోసారి వ్యాధి తీవ్రతను బట్టి, అవసరాన్ని బట్టి ఛాతీ సీటీ స్కాన్, కళ్లె/గల్ల/తెమడ పరీక్ష వంటి పరీక్షలూ అవసరం కావచ్చు. నివారణ... ►పిల్లలకు చిన్నతనంలో ఇచ్చే బీసీజీ, పెర్టుసస్‌లతో పాటు నిమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల చిన్నారుల్లో దీన్ని నివారించవచ్చు. ►పొగతాగే అలవాటును తక్షణం మానేయాలి. ఆల్కహాల్ కూడా. ►పొగ వాతావరణానికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. ►ఆస్తమా రోగులు, బ్రాంకైటిస్ ఉన్నవారు వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. ►క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్లు అంత త్వరగా రావు. ►పోషకాలన్నీ ఉండేలా సమతులాహారం తీసుకోవాలి. దాంతో రోగనిరోధకశక్తి పెరుగుతంది. అది నిమోనియాతో పాటు అనేక రకాల ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షిస్తుంది. నిమోనియాకు తక్షణం చికిత్స అవసరం... లేదంటే... పైన పేర్కొన్న అనేక కారణాల్లో దేని వల్ల నిమోనియా వచ్చినప్పటికీ చికిత్స తీసుకోకపోతే బాధితుడి పరిస్థితి సంక్లిష్టంగా మారుతుంది. ఫలితంగా ఇతర కాంప్లికేషన్లు వస్తాయి. ఉదాహరణకు... మూత్రపిండాలు దెబ్బతినడం, పక్షవాతం, సెప్టిసీమియా (అంటే రక్తానికి ఇన్ఫెక్షన్ సోకి, అది విషపూరితంగా మారడం), రక్తపోటు పడిపోవడం, మెదడుపై దుష్ప్రభావం వంటి కాంప్లికేషన్లు రావచ్చు. ఒక్కోసారి మరణం సంభవించడం కూడా నిమోనియా కేసుల్లో తరచూ కనిపిస్తుంటుంది. అన్ని వయసుల వారిలోనూ... చిన్న పిల్లలు మొదలుకొని, వృద్ధుల వరకు నిమోనియా ఏ వయసు వారిలోనైనా రావచ్చు. చిన్నారులూ, వృద్ధుల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువ కాబట్టి వారిలో ఇది కనిపించడం చాలా సాధారణం. ఈ సమస్యలుంటే మరింత అప్రమత్తత తప్పదు ►ఝఝసీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ – బ్రాంకైటిస్, ఎంఫసీమా) ఉన్నవారు గుండె సమస్యలు ఉన్నవారు ►స్పీన్ తొలగించిన వాళ్లు ►పొగతాగేవారు ►ఇక క్యాన్సర్ కారణంగా కీమోథెరపీ తీసుకుంటున్నావారు, ఎయిడ్స్ రోగులు, ఆస్తమా ఉన్నవారిలో నిమోనియా రావడం మిగతావాళ్ల కంటే కాస్తంత ఎక్కువే. అలాగే సాధారణంగా గర్భవతుల్లో నిమోనియాను గుర్తించాక, సరిగా వైద్య చికిత్స అందివ్వకపోతే, వారిలో అది మరెన్నో సమస్యలకు దారితీసే ముప్పు పొంచి ఉంటుంది. చికిత్స నిమోనియాకు తగిన యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. దాని మోతాదును జాగ్రత్తగా నిర్ణయించి డాక్టర్ల పర్యవేక్షణలో ఇవ్వాలి. ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల్లో... మూడు రోజులకు పైబడి జ్వరం, ఛాతీనొప్పి, ఊపిరి సరిగా తీసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే. వారు వీలైనంత త్వరగా ఫిజీషియన్/మెడికల్ స్పెషలిస్ట్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు అవసరమైన అన్ని పరీక్షలూ చేయించుకోవాలి. ఇవీ కారణాలు ఇటీవల విస్తరించిన, ఈ ఏడాది కూడా రెండోవేవ్‌తో స్వైరవిహారం చేసిన కరోనా వైరస్ ఓ ప్రధానమైన కారణమే అయినప్పటికీ... ఇది మాత్రమేగాక నిమోనియాకు ఎన్నో కారణాలుంటాయి. వాటిలో ప్రధానమైన కొన్ని ఇవే... ►బాక్టీరియా వల్ల – స్టెఫలోకాకస్ బ్యాక్టీరియా, హీమోఫీలస్ (మొదటిది పెద్దల్లో, రెండోది పిల్లల్లో నిమోనియాకు కారణమవుతుంది). అవే కాకుండా... గ్రామ్‌నెగెటివ్, అనరోబిక్, టీబీ బ్యాక్టీరియా మొదలైన బ్యాక్టీరియాల వల్ల. ►ఫంగస్ వల్ల ►కొద్ది ప్రదేశంలోనే ఎక్కువమంది ఉండటం (ఓవర్ క్రౌడింగ్). ఇప్పుడు వ్యాప్తి చెందే కరోనా, ఇంకా అన్ని వైరస్‌లతో పాటు, నిమోనియాకి కూడా ఓవర్ క్రౌడింగ్ ఓ ప్రదాన కారణం. అందుకే గుంపుల్లోకి వెళ్లడం నివారించాలి. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సివస్తే మాస్క్ తప్పదు. ►మైక్రో యాస్పిరేషన్ – ఒక్కోసారి తినే, తాగే సమయాల్లో మనకు తెలియకుడానే కొన్ని పదార్థాలూ, ద్రవాలు గొంతునుంచి శ్వాసనాళంలోకి జారిపోతుంటాయి. ఆ ప్రక్రియనే మైక్రోయాస్పిరేషన్ అంటారు. ►ప్రతివ్యక్తి గొంతులో బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే ఓరోఫ్యారింజియల్ ఫ్లోరా అంటారు. ఆ బ్యాక్టీరియా గొంతు నుంచి శ్వాసనాళాల ద్వారా గాలిగదుల వరకు పోవడం వల్ల కూడా నిమోనియా రావచ్చు. ►ఆల్కహాల్ – దీనితో మనుషుల్లో రోగనిరోధక శక్తి (డిఫెన్స్ మెకానిజం) తగ్గుతుంది. ఉదాహరణకు మత్తులో దగ్గడం కూడా తక్కువే. దాంతో ఊపిరితిత్తుల్లో ఉన్న మనకు సరిపడని పదార్థాలు అక్కడే ఉండిపోవడం వల్ల కూడా నిమోనియా రావచ్చు. నిమోనియా లక్షణాలివే... ►దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు, చలిగా అనిపించటం, కొందరిలో ఆకలి లేకపోవడం ►కఫం పడవచ్చు లేదా పడకపోవచ్చు. పడితే అది... తెల్లగా, పసుపురంగులో ఒక్కోసారి రక్తపు చారికతోనూ కనిపించవచ్చు. ►నిమోనియా తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే ఆయాసం రావచ్చు. ►నిమోనియా ఊపిరితిత్తి పొర (ప్లూరా)కు చేరినప్పుడు ఛాతినొప్పి కూడా రావచ్చు. ఇంటస్టిషియల్ నిమోనియాలో అనే తరహా రకంలో దగ్గు ఉండదు. కాని ఆయాసం మాత్రం ఉంటుంది. దాంతోఒక్కోసారి శ్వాసప్రక్రియ పూర్తిగా ఆగిపోవచ్చు కూడా. ►ఆస్తమాలో పిల్లికూతలు ఉంటాయి. నిమోనియాలో ఉండవు. గాలి పీలుస్తున్నా అది లోపలికి వెళ్లదు. కారణం... గాలి చేరాల్సిన ప్రదేశమైన గాలిసంచిలోని ‘ఎగ్జుడస్’ అనే వ్యర్థాల అడ్డంకి ఉంటుంది. కాబట్టి అక్కడికి ఆక్సిజన్ చేరదు. దాంతో దేహానికి అవసరమైనంత ఆక్సిజన్ అందదు. దాంతో ఊపిరితిత్తులు పని చేయలేని పరిస్థితికి వస్తాయి. దీన్నే ‘హైపాక్సిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్’ అంటారు. ►ఊపిరి అందకపోవడంతో చెమటలు పట్టడం, కంగారుగా ఉండటం, గుండె వేగం పెరగడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని ‘సివియర్ నిమోనియా’ అంటారు. డాక్టర్ తపస్వి కె. సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ -
ఆకతాయిల వేధింపులు.. సిగరెట్ తాగమని చెట్టుకు కట్టేసి..
బెంగళూరు(కర్ణాటక): చిన్న పిల్లలపై కొందరు అల్లరి మూకలు అమానుషంగా ప్రవర్తించారు. సిగరెట్ తాగాలని బలవంతం చేశారు. అంతటితో ఆగకుండా.. పాఠశాల ఆవరణలోనే చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) ఆధ్వర్యంలో నడుపుతున్న పాఠశాలలో 10-13 సంవత్సరాల మధ్య వయస్సు గల కొంతమంది విద్యార్థులను క్యాంపస్‌లో ప్రవేశించిన ఆరుగురు సభ్యుల ముఠా తరచుగా బెదిరింపులకు గురిచేస్తోంది. ఈ క్రమంలో గత శనివారం కూడా.. చిన్న పిల్లలను పట్టుకుని సిగరెట్ తాగాలని వేధింపులకు గురిచేశారు. అంతటితో ఆగకుండా పాఠశాల సమీపంలో ఉన్న దుకాణానికి వెళ్లి సిగరెట్లు తేవాలని చిన్న పిల్లలను బెదిరించారు. కాగా, నిందితులు... సమీపంలోని ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు.. పాఠశాలకు సమీపంలోని గ్రామానికి చెందిన వారు కావడంతో యాజమాన్యం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిందితులు పలుమార్లు ఉపాధ్యాయులను కూడా బెదిరించారని స్థానికులు తెలిపారు. కాగా, ఈ క్రమంలో కొంత మంది స్థానికులు.. పిల్లలను చెట్టుకు కట్టేసి కొడుతున్న క్లిప్పింగ్‌లను స్థానిక కార్పోరేటర్‌కు పంపించారు. కార్పోరేటర్.. పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానిక పోలీసులు ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. వారిలో ఐదుగురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని జువైనల్ హోమ్‌కు తరలించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్న పిల్లల తల్లిదండ్రులు పోలీసులను కోరారు. కాగా, దీనిపై స్పందించిన డీసీపీ దేవరాజ్ మాట్లాడుతూ.. గ్రామంలో, పాఠశాల పరిసరాలలో అసాంఘిక చర్యలు జరగకుండా పెట్రోలింగ్ గస్తీని పెంచుతామన్నారు. చదవండి: భర్త పోస్టులకు మరో మహిళ లైక్‌లు .. చిర్రెత్తుకొచ్చిన ఆ భార్య.. -
పొగకు దూరంగా.. చదువులమ్మ ఒడిలో హాయిగా!
అభంశుభం ఎరుగని వయసులో చిన్నారులు ‘పొగ’బారిన పడి జీవితాలు పెడదారి పట్టకుండా ఏపీ సర్కార్ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే చిన్నారుల మేనమామగా మారి విద్యాభ్యాసం కోసం జగనన్న అమ్మఒడి, నాడు–నేడు కింద పాఠశాలల్లో సకల వసతుల కల్పన, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, ఫీజురీయింబర్స్‌మెంట్.. ఇలా వారి కోసం చేయగలిగినంతా చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆ దిశగానే చిన్నారులకు మరింత మేలు చేకూరేలా ఆలోచన చేసి పాఠశాలల పరిసరాల్లో పొగాకు, సంబంధిత ఉత్పత్తుల విక్రయాలు నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఓ సర్వేలో స్కూలుకెళ్లే చిన్నారుల్లో ఏ రాష్ట్రంలో ఎంత శాతం మంది పిల్లలు పొగ తాగుతున్నారనే విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో ఏపీ స్థానం ఎక్కడుందో వివరాలు ఈ కథనంలో చదవండి. సాక్షి, అమరావతి: జాతీయస్థాయిలో పొగాకు, సిగరెట్, బీడీలు వంటివి స్కూలుకు వెళ్లే చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా 13–15 ఏళ్లలోపు చిన్నారులపై ఇవి అత్యంత ప్రభావితం చూపడమే కాకుండా యుక్తవయసులోనే క్యాన్సర్ జబ్బులకు గురి చేస్తున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాప్యులేషన్ స్టడీస్ సంస్థతో గ్లోబల్ యూత్ టొబాకో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో స్కూలుకెళ్లే చిన్నారుల్లో అత్యధికంగా మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో 57.9 శాతం మంది పొగ తాగుతున్నట్టు తేలింది. తక్కువ మంది చిన్నారులు పొగతాగకుండా ఉండే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో నిలిచింది. మన రాష్ట్రంలో 2.6 శాతం మంది స్కూలుకెళ్లే 13–15 ఏళ్లలోపు పిల్లలు రకరకాల పొగాకు వాడుతున్నట్టు తేలింది. ఇప్పటికే దీనిపై అవగాహన కల్పించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. స్కూళ్లకు 100 అడుగుల దూరంలో ఎలాంటి పొగాకు దుకాణం ఉండకూడదని, 18 ఏళ్ల లోపు వారికి అమ్మడం, కొనడం చేయకూడదని ఆదేశించారు. ప్రతి ఏఎన్ఎంకు కొన్ని స్కూళ్లు, కాలేజీలు అప్పజెప్పి ప్రతిరోజూ పర్యవేక్షణ చేస్తున్నట్టు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. స్కూళ్ల దగ్గర గుట్కాలు, పొగాకు, సిగరెట్లు బీడీలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
ధూమపానం.. లంగ్ క్యాన్సర్ లింక్‌కు ఆధారాల్లేవు!
అహ్మదాబాద్: ఒక పేషెంటు అతిగా పొగతాగడం వల్ల మరణించాడని పేర్కొంటూ క్లెయిమ్ చెల్లించేందుకు నిరాకరించిన బీమా కంపెనీకి వినియోగదారుల కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సదరు పేషెంటుకు వైద్య బీమా వ్యయ మొత్తాన్ని ఇవ్వాలని కంపెనీని ఆదేశించింది. పొగతాగడం వల్లనే సదరు పేషెంటుకు లంగ్‌క్యాన్సర్ వచి్చందనేందుకు సరైన ఆధారాల్లేవని కోర్టు అభిప్రాయపడింది. కేవలం చికిత్స రిపోర్టులో పొగతాగడం అలవాటైంది(అడిక్షన్ స్మోకింగ్) అని రాయడాన్ని తిరస్కరణకు కారణంగా పేర్కొనలేమంది. పొగతాగని వాళ్లకు కూడా లంగ్‌క్యాన్సర్ వస్తుందని గుర్తు చేసింది. అలోక్ కుమార్ బెనర్జీ అనే వ్యక్తి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించారు. అతని వైద్య చికిత్సకు అయిన రూ. 93,927 చెల్లించేందుకు బీమా కంపెనీ తిరస్కరించింది. దీంతో బెనర్జీ భార్య స్మిత కన్జూమర్ కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం సదరు మొత్తాన్ని 7 శాతం వడ్డీతో కలిపి 2016 ఆగస్టు నుంచి లెక్కించి ఇవ్వాలని పేర్కొంది. -
మీకు స్మోకింగ్ అలవాటుందా?.. అయితే, ఈ సమస్యలు ఎక్కువే..
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ లేకుండా రోజు గడవటం కష్టమంటే అతిశయోక్తి కాదేమో! మన జీవన విధానంలో అవి అంతగా కలిసిపోయాయి మరి! అయితే దాని వెన్నంటే కంటి సమస్యలు కూడా మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. కళ్లు పొడిబారడం, శుక్లాలు, దృష్టిలోపం తలెత్తడం వంటి సమస్యలెన్నో మనలో చాలామంది ఎదుర్కొంటున్నారు. యేటా దాదాపుగా 1 బిలియన్ మంది తాత్కాలిక లేదా దీర్ఘకాలిక కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజా నివేధికలో వెల్లడించింది. అయితే పోషకాహారం ద్వారా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు నూట్రీషనిస్ట్ రూపాలి దత్త సూచించిన కొన్ని చిట్కాలు మీకోసం.. విటమిన్లు అధికంగా ఉండే అహారాన్ని తినాలి శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమన్లు అందించే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని మీకు తెలుసా? అమెరికన్ ఆప్టోమెట్రిక్ అసోసియేషన్ ప్రకారం ‘ఎ, సి, ఇ’ విటమిన్లు శుక్లాలు, మాక్యులర్ డీజెనరేషన్ సహా కొన్ని కంటిసంబంధింత సమస్యలు నివారించడంలో కీలకంగా వ్యవహరిస్తాయని పేర్కొంది. అందువల్లనే నిపుణులు ఈ విటమిన్లు అధికంగ ఉండే సిట్రిక్ ఫలాలు, డ్రై నట్స్, విత్తనాలు, చేపలు.. వంటి పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోమని సూచిస్తున్నారు. ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు ఆకుకూరల్లో, కూరగాయల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు నిండుగా ఉంటాయి. అకాడమీ ఆఫ్ నూట్రీషన్ అండ్ డైటిటిక్స్ అధ్యయనాల ప్రకారం మన ఆహారంలో భాగంగా ఆకుకూరలు తీసుకున్నట్లయితే యూవీ రేస్, రేడియేషన్ నుంచి కంటిచూపును కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తుందని తేలింది. మరింత నీరు తాగాలి నీటి ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా గుర్తుచేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే శరీరానికి సరిపడినంత నీరు తాగడం వల్ల కలిగే లాభాలు మనందరికీ తెలుసు. డీహైడ్రేషన్ నుంచి కాపాడటమేకాకుండా, కంటికి హానిచేసే ఇతర కారకాల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. నియంత్రణలో శరీర బరువు యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ చెందిన ఆప్తాల్మాలజీ విభాగంలో జరిపిన బీవర్ డ్యామ్ ఐ అధ్యయనాల ప్రకారం కంటి ఆరోగ్యంపై మాడిసన్, స్థూలకాయం ప్రభావం కూడా ఉంటుందని వెల్లడించింది. అధిక బరువు కారణంగా కంటిలోపలి భాగం నుంచి ఒత్తిడి పెరుగుతుందని తెల్పింది. కాబట్టి శరీర బరువును అదుపులో ఉంచే ఆహారపు అలవాట్లవల్ల ఆరోగ్యంగా జీవించవచ్చు. ధూమపానానికి దూరంగా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్యయనాల ప్రకారం స్మోకింగ్ అలవాటు కంటి చూపులో మార్పులకు కారణం అవుతుందని వెల్లడించింది. పొగతాగని వారితో పోల్చితే స్మోకింగ్ చేసేవారిలో కాంటరాక్ట్ వంటి కంటి సమస్యలు రెండు, మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ సూచలను పాటిస్తే మీ కంటి చూపు జీవితకాలంపాటు పదిలంగా ఉంచుకోవచ్చని ప్రముఖ నూట్రీషనిస్ట్ రూపాలి దత్త సూచిస్తున్నారు. చదవండి: Dry Throat: నోటి దుర్వాసన, దగ్గు, పుండ్ల సమస్యా.. ఇలా చేస్తే.. -
వర్క్ ఫ్రమ్ హోమ్.. అయినా స్మోక్ చేయకూడదు!
టోక్యో: పని చేస్తున్న సమయంలో రిలీఫ్ కోసమో లేక పని ఒత్తిడి కారణంగానో కొంతమంది ఉద్యోగులు సిగరెట్లని పదే పదే తాగుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలో కొందరికి అది అతి పెద్ద వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. దీని వల్ల ఆ ఉద్యోగి ఆరోగ్యానికే కాకుండా సంస్ధకు కూడా నష్టం వాటిల్లుతుంది. ఆఫీస్‌లో పని చేసే ఉద్యోగ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనే ఏ కంపెనీ అయినా భావిస్తుంది. అందుకే జపాన్‌లోని అతిపెద్ద బ్రోకరేజ్ సంస్థ నోమురా హోల్డింగ్స్ .. తన ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ చేస్తున్నా సరే పని చేస్తున్న సమయంలో స్మోకింగ్ చేయకూడదని స్పష్టం చేసింది. ఈ కొత్త రూల్ అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్నట్లు ఉద్యోగులకు తెలిపింది. త్వరలోనే ఆ సంస్థ నిర్వహిస్తున్న అన్ని స్మోకింగ్ రూమ్‌లను కూడా మూసివేయాలని కూడా నిర్ణయించింది. మరి ఇంట్లో ఉద్యోగి స్మోక్ చేస్తే వారికి ఏమైనా శిక్షలు విధించే అవకాశాలు ఉన్నాయా అనే సందేహం కలగడం సహజం. ఇందుకు నోమురా ప్రతినిధి యోషితకా ఓట్సు మాట్లాడుతూ.. దీనికోసం ప్రత్యేకంగా తామేమీ ఉద్యోగిపై నిఘా ఉంచబోమని, వాళ్లపై తమకు నమ్మకం ఉందని తెలిపారు. పని వాతావరణాన్ని మెరుగుపరచి, స్మోక్ చేస్తున్న వాళ్ల వల్ల మిగతా వాళ్లపై ఆరోగ్యాలపై ప్రభావం పడకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పూర్తి ఆరోగ్యంతో ఓ ఉద్యోగి తన పూర్తి సామర్థ్యం మేరకు సేవలందించాలని సంస్థ భావిస్తున్నట్లు ఒక ప్రకటనలో చెప్పింది. తమ ఉద్యోగుల్లో 2020 మార్చి నాటికి 20 శాతం మంది స్మోకర్లు ఉండగా.. 2025 నాటికి దానిని 12 శాతానికి తగ్గించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. చదవండి: World Skyscraper Day 2021: మొట్టమొదటి ఆకాశ హార్మ్యం ఏది? ఎవరు కట్టారో తెలుసా? -
విమానంలో సిగరెట్ తాగిన యువతి
-
విమానంలో సిగరెట్ తాగిన యువతి.. ప్రయాణికులు షాక్
సాక్షి, తల్లహస్సీ: బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయడాన్ని నిషేధిస్తూ ఇప్పటికే అనేక దేశాలు కఠిన చట్టాలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకొవడంతో పాటు జరిమానా కూడా విధిస్తారు. అయితే, కొంత మంది వ్యక్తులు అప్పుడప్పుడు బస్సుల్లో లేదా రైళ్లల్లో సిగరెట్ తాగిన సంఘటనలు తరచుగా వార్తలలో వస్తుంటాయి. సిగరెట్ తాగటం వలన.. వారికే కాకుండా తోటి ప్రయాణికుల ప్రాణాలకు కూడా పెద్ద ముప్పు సంభవించే అవకాశం ఉంటుంది. కాగా, ఒక యువతి ఏకంగా విమానంలోనే సిగరెట్ తాగి తోటి ప్రయాణికులను షాకింగ్‌కు గురిచేసింది. ఈ సంఘటన ఫ్లోరిడాలోని స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో గత మంగళవారం చోటుచేసుకుంది. ఒక తోటి ప్రయాణికుడు దీన్ని వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేయగా ఇది వైరల్‌గా మారింది. ఫోర్ట్లాడర్డేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్పిరిట్ ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానం టేక్ఆఫ్ అయ్యింది. రన్‌వే మీద వెళ్లడానికి మరికొంత సమయం ఉంది. ఈ క్రమంలో ఒక యువతి సిగరెట్‌ను తీసి తాగడం ప్రారంభించింది. దీంతో తోటి ప్రయాణికులు తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యారు. అయితే, ఆమెతో పాటు ప్రయాణిస్తున్న.. మజ్దలావి అనే వ్యక్తి దీన్ని రికార్డు చేశాడు. అంతటితో ఆగకుండా విమాన సెక్యురిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే యువతి దగ్గరకు చేరుకుని ఆమెను కిందికి దిగిపోవాల్సిందిగా సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. కాగా, యూఎస్‌లో 1988లోనే బహిరంగ ప్రదేశాలలో సిగరెట్ తాగడాన్ని నిషేదించారు. చదవండి: Anaconda: రోడ్డు దాటుతున్న భారీ అనకొండ.. షాకింగ్ వీడియో.. -
రఘునందన్ ఓ వన్ మ్యాన్ మిషన్
హైదరాబాద్: ఉద్యోగం చేస్తూనే.. పొగాకు నియంత్రణకు విశేష కృషి చేస్తున్న మాచన రఘునందన్‌ను ఒక వన్ మ్యాన్ మిషన్‌గా అభివర్ణించవచ్చు అని చండీగఢ్‌కు చెందిన రిసోర్స్ సెంటర్ ఫర్ టుబాకో కంట్రోల్ డైరెక్టర్ డాక్టర్ సోనూ గోయల్ అన్నారు. బీబీనగర్ ఏయిమ్స్ సందర్శనకు వచ్చిన అయనను రఘునందన్ హైదరాబాద్ మారియట్ హోటల్లో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆచార్య సోనూ గోయల్ మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా సమాజ హితం కోసం మాచన రఘునందన్ చేస్తున్న పొగాకు నియంత్రణ కృషి ఒక అసాధారణమైన యజ్ఞం వంటిది అని ఉదహరించారు. తమ స్వార్థం తాము చూసుకునే నేటి తరంలో కూడా ఒక వ్యక్తి తన శక్తికి మించి సమాజానికి తన వంతు సాయం చెయ్యడం ఆదర్శప్రాయం అని అభినందించారు. యువత ముఖ్యంగా పొగాకు, ధూమపానం అలవాట్లకు దూరంగా ఉండేందుకు ఐదు "డీ" ల సూత్రం అమలు చేయాలని సూచించారు. డీలే , డైవర్ట్, డూ యోగా, డ్రింక్ వాటర్, డూ ఎనీ థింగ్ అన్న పంచ సూత్రాలు ఆచరించాలన్నారు. దీంతో యువత పొగాకు, ధూమపానం అలవాటుకు దూరంగా ఉండే ప్రత్యామ్నాయ ఆలోచన మార్గాలు ఉత్తమంగా పని చేస్తాయని చెప్పారు. పొగాకును నిషేధించే కంటే దాని ప్రభావాలను ప్రజలకు వివరించి మానేయడానికి కృషి చెయ్యటమే గొప్ప ఫలితం ఇస్తుందని వివరించారు. -
ఇష్టం లేకపోయినా చేశా.. నటిగా అన్నీ చెయ్యాల్సిందే : శ్రద్దా దాస్
హీరోయిన్ శ్రద్దా దాస్ రీసెంట్గా ఏక్ మిని కథ సక్సెస్‌తో జోరు మీదుంది. ఇప్పటివరకు శ్రద్దా పలు హిట్ సినిమాల్లో నటించినా ఆమెకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. గ్లామర్ డోస్ పెంచినా ఆమెకు అదృష్టం కలిసి రాకపోవడంతో సరైన గుర్తింపు రాలేదు. కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తుంది ఈ బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ షేర్ చేస్తూ గ్లామరస్ ఫోటోలతో నెట్టింట హల్చల్ చేస్తుంది ఈ భామ. తాజాగా సిగరెట్ కాలుస్తున్న ఓ ఫోటోను షేర్ చేస్తూ..నాకు సిగరెట్ తాగడం నచ్చదు. కానీ నటిగా మారినప్పుడు అన్నీ చేయాల్సిందే నచ్చకపోయినా సరే అంటూ సినిమా సెట్లోని ఈ ఫోటోను షేర్ చేసింది. కాగా ఇది నిజం సిగరెట్ యేనా లేదా డమ్మీదా అని నెటిజన్లు ప్రశ్నించగా..లేదు లేదు. ఇది నిజం సిగరెటే అని సమాధానమిచ్చింది. ఇక పొగతాడం ఆరోగ్యానికి హానికారం అంటూ ఓ క్యాప్షన్‌ను కూడా జోడించింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో అర్ధం, నిరీక్షణ ,కన్నడలో కోటిగొబ్బ వంటి సినిమాలు చేస్తోంది. View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) చదవండి : గుర్తుపట్టరాని విధంగా మారిపోయిన హీరోయిన్ మీనాక్షి గుండెపోటుతో నటి సురేఖ మృతి -
WHO: పొగ తాగేవారు కరోనాతో మరణించే అవకాశాలు ఎక్కువ
జెనివా: ధూమపానం(పొగ త్రాగేవారు) చేసేవారిలో వివిధ ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు కరోనాతో మరణించే అవకాశాలు 50 శాతం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్వో) స్పష్టం చేసింది. స్మోకింగ్‌ను వదిలేయాలని.. దీంతో కరోనా రిస్క్ తగ్గుతుందని, క్యాన్సర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని డబ్ల్యుహెచ్వో డైరెక్టర్ టెడ్రోస్ గెబ్రెయెసన్ పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్‌వో చేపట్టిన ''క్విట్ టొబాకో క్యాంపెయిన్'' కార్యక్రమంలో టెడ్రోస్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము చేపట్టిన క్విట్ టొబాకో క్యాంపెయిన్‌కు మంచి స్పందన వచ్చిందని ఆయన తెలిపారు. ఈ క్యాంపెయిన్‌లో అన్ని దేశాలు చేతులు కలపాలని కోరారు. దీనిపై ప్రజలకు అవసరమైన సమాచారం, సపోర్ట్, టూల్స్ అందుబాటులోకి తేవాలన్నారు. ప్రస్తుతం 29 దేశాల్లో నేరుగా పనిచేస్తున్నట్లు టెడ్రోస్ పేర్కొన్నారు. చదవండి: చైనాలో దడపుట్టిస్తున్న కొత్తరకం స్రెయిన్ మరోముప్పు.. కరోనా హైబ్రిడ్ -
సిగరెట్ తాగుతూ శానిటైజర్ రాసుకున్నాడు.. ఆ తర్వాత
వాషింగ్టన్: కరోనా వ్యాప్తి మూలంగా చేతలను తరచుగా శుభ్రం చేసుకోవడం మన జీవితంలో ఓ భాగమయ్యింది. సబ్బు, నీరు ఎప్పుడు అందుబాటులో ఉండదు కనుక.. శానిటైజర్ వినియోగం బాగా పెరిగింది. అయితే కొన్ని శానిటైజర్లలో మంటను ఆకర్షించే పదార్థాలు ఉంటాయి. అలాంటి వాటిని వాడినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిప్పుకు దూరంగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యహరించినా.. ఇదిగో ఇలాంటి భయంకర పరిస్థితులు ఎదురవుతాయి. ఓ వ్యక్తి కారులో కూర్చుని సిగరెట్ వెలిగించుకున్నాడు.. ఆ తర్వాత శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నాడు. దాంతో కారులో మంటలు చెలరేగాయి.. చూస్తుండగానే కారు దగ్ధమయ్యింది. అదృష్టం కొద్ది డ్రైవర్‌కు పెద్దగా గాయాలు కాలేదు. ఈ సంఘటన అమెరికాలోని రాక్‌విల్లే షాపింగ్ సెంటర్ వద్ద గత గురువారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం సదరు కారు డ్రైవర్ తొలుత సిగరెట్ వెలిగించి నోట్లో పెట్టుకున్నాడు.. ఆ తర్వాత చేతులకు శానిటైజర్ రాసుకున్నాడు. ఈ క్రమంలో అది కొంత అతడి బట్టల మీద పడింది. ఇదే సమయంలో సిగరెట్ నుంచి నిప్పు రవ్వలు బట్టల మీద పడటంతో వెంటనే మంటలు అంటుకున్నాయి. ప్రమాదం గమనించిన డ్రైవర్ వెంటనే కారు నుంచి బయటకు దూకాడు. ఈ ప్రమాదంలో అతడికి పెద్దగా గాయాలు కాలేదు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక చూస్తుండగానే కారు తగలబడిపోయింది. అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకునే లోపు కారు పూర్తిగా తగలబడింది. ఇక కారులో కూర్చుని సిగరెట్, శానిటైజర్ వాడటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. చదవండి: విలేకరులపై శానిటైజర్ స్ప్రే చేసిన ప్రధాని -
వైరల్ వీడియో: సిగరెట్ తాగుతూ శానిటైజర్ రాసుకున్నాడు..
-
వైరల్: ఓ పక్క ఆక్సిజన్ పీలుస్తూ, మరోపక్క గుప్పుమంటూ సిగరెట్
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను కట్టడి చేసేందుకు కర్ఫ్యూ, లాక్డౌన్ విధిస్తున్నాయి. బతికుంటే బలుసాకైనా తిని బ్రతకొచ్చని ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. కానీ ఏ వీధి మలుపు తిరిగినా.. ఏ సందు చివర చూసినా పొగరాయుళ్లే దర్శనమిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో విధించిన లాక్డౌన్లతో గుప్పుగుప్పు మంటూ పెట్టెలు కొద్దీ సిగరెట్లు కాల్చే పొగరాయుళ్లు.. ఇళ్లలో ఉండలేక ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా సిగరెట్లు కాల్చేందుకు బయటకొస్తున్నారు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. స్మోకింగ్ చేసేవారు యుక్తవయస్సు వారైనా, పెద్దలైనా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇటీవల ‘జో కోవిడ్ సింప్టమ్స్ స్టడీ యాప్’ డేటా ఆధారంగా స్మోక్ చేయని వారికంటే స్మోక్ చేసే వారిలో కరోనా ప్రభావం 14 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. దగ్గు, ఛాతి నొప్పి, ఛాతి వెనుక భాగంలో వేడి, వాసన, రుచి కోల్పోతున్నట్లు తేలింది. కండరాల నొప్పి, గందరగోళం, విరేచనాలు, అలసటతో 50 శాతం మందికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్లు నిర్ధారించారు. స్మోకింగ్ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తగ్గిస్తుందని.. ఇమ్యూనిటీ పవర్ ను తగ్గించి కరోనా పై పోరాడే శక్తిని కోల్పోతారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం తెలిపింది. అయితే స్మోకర్స్ లో ఏమాత్రం మార్పు రాకపోవడంతో నెటిజన్ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాత్కాలిక ఆనందం కోసం విలువైన జీవితాన్ని పణంగా పెడుతున్నారు, వారి వ్యసనం ఏ స్థాయిలో ఉందో ఈ వీడియో చూస్తే తెలిసి పోతుందంటూ నెటిజన్లు ఆ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ పెద్దాయన ఆక్సిజన్ సిలిండర్ తో ఊపిరి పీల్చుకుంటూ అవసరమైనప్పుడు ఆక్సిజన్ పైప్ తీసేసి స్మోక్ చేయడం అందరిని విస్మయానికి గురిచేస్తుంది. ఆ వీడియోను మీరూ చూసేయండి. -
హైబీపీ నియంత్రణకి.. హెల్తీ లైఫ్‌స్టైల్ ‘కీ’..
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటికే కష్టనష్టాలు ఎదుర్కుంటున్నాం. మళ్లీ ఆర్ధిక సమస్యలు చుట్టుముడతాయా? నష్టాలు, ఆదాయాల్లేని ఖర్చులు కొనసాగుతాయా? ఆరోగ్యం ఏమవుతుంది? రకరకాల పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి ఆలోచనలు నగరవాసుల్లో రక్తపోటు సమస్యను తీవ్రతరం చేస్తున్నట్టు ఆసుపత్రుల్లో నమోదవుతున్న హైబీపీ కేసులు వెల్లడిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వంటివి తెచ్చిపెడుతున్న అధిక బరువు సమస్య తద్వారా హైబీపీ పేషెంట్స్ పెరుగుతున్నారని వైద్యులు అంటున్నారు. ఈ నేపధ్యంలో అపోలో స్పెక్ట్రా కన్సల్టెంట్ యూరాలజిస్ట్, అండ్రాలజిస్ట్ డా.ప్రియాంక్ సలేచా రక్తపోటు సమస్య దాని నివారణ గురించి సూచనలు అందిస్తున్నారు. పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతున్న నగర జీవనశైలి అధిక రక్తపోటుకు కూడా కారణంగా మారుతోంది. ఎడాపెడా మారుతున్న ఆహార విహారాలు, పనివేళలు, అలవాట్లు, రక్తపోటు సమస్యకు ప్రధాన కారణాలు. నిద్రలేమి... వ్యసనాల హాని... ధూమపానం, ఆల్కహాల్, కెఫైన్ సేవనం వంటి అలవాట్లు ఆరోగ్యాన్ని దూరం చేస్తాయనేది తెలిసిందే. మరీ ముఖ్యంగా అప్పటికే హై బీపీ ఉన్న వారికి ఇవి మరింత ప్రమాదకరం. ధూమపానం వల్ల హృదయ సంబంధ వ్యాధులకు దారి తీస్తుంది అదే స్మోకింగ్కి కెఫైన్ వినియోగం జత కలిస్తే రక్తపోటు సమస్య వస్తుంది.. అలాగే ఆరోగ్యాన్ని హరించే అనేక కారణాల్లో శరీరానికి అవసరమైన నిద్ర లేకపోవడం ఒకటి. ప్రతి ఒక్కరికీ రోజూ 6గంటల గాఢ నిద్ర తప్పనిసరి. లేని పక్షంలో అది మొత్తంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తరచుగా తక్కువ నిద్రతో సరిపెట్టే పెద్దల్లో మాత్రమే కాదు చిన్నారుల్లో కూడా హై బీపీ సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది. నిర్ణీత వేళల్లో నిద్రపోవడం ద్వారా హైబీపీని చాలా వరకూ నియంత్రించవచ్చు. హై బీపీ..వ్యాధులకు ఎంట్రీ.. సాధారణంగా అధిక రక్తపోటుతో అనుసంధానంగా వచ్చే సమస్య హృద్రోగం. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. అయితే చాలా తక్కువ మందికి తెలిసిన వాస్తవం ఏమిటంటే... కిడ్నీ సమస్యలకు సైతం ప్రధాన కారణాలలో ఒకటి రక్తపోటు. దీని వల్ల కిడ్నీలు పూర్తిగా పనిచేయని పరిస్థితి దాకా రావచ్చు. కిడ్నీతో పాటు దయాబెటిస్కి, బ్రెయిన్, కళ్లు పై కూడా హైబీపీ దుష్ప్రభావం చూపిస్తుంది. నియంత్రణ ఇలా.. కిడ్నీలతో పాటు శరీరంపై ఎటువంటి దీర్ఘకాల ప్రభావాలూ లేకుండా ఉండాలంటే రక్తపోటు స్థాయిల్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అధిక రక్తపోటుకు చికిత్స, నివారించే దిశగా కొద్ది కొద్దిగా బరువు కోల్పోవడం ఉపకరిస్తుంది. తక్కువ కార్బెహైడ్రేట్స్, అధికంగా ఫైబర్ ఉన్న రోజువారీ ఆహారం, అలాగే క్రమబద్ధమైన వ్యాయామం... వంటివి ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండడంలో కీలకపాత్ర పోషించి హై బిపీ రిస్క్ తగ్గిస్తాయి. నిద్రవేళలు సవరించుకోవడం వంటి జీవనశైలి మార్పులతో పాటుగా ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన రీతిలో రక్తపోటు సమస్యను తగ్గింవవచ్చు. ఆహారంలో ఉప్పవాడకం తగ్గించాలి. లో సోడియం డైట్‌ను ఎంచుకోవాలి. పండ్లు, కూరగాయలు... వంటివి బాగా వినియోగించాలి. తక్కువ పరిమాణాల్లో ఎక్కువ మార్లు ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. కనీసం 30 నిమిషాల పాటు రోజూ వ్యాయామం చేయాలి. ఇది మన మెటబాలిజమ్‌ని క్రమబద్ధీకరిస్తుంది. బరువు పెరగడాన్ని తద్వారా హైబీపీ ప్రమాదాన్ని నివారిస్తుంది. చదవండి: ఒబెసిటీ.. అధిక బరువే కాదు అంతకు మించి -
రైళ్లలో సిగరెట్ తాగితే భారీ జరిమానా
-
పొగతాగే తండ్రుల వల్ల పిల్లల్లో క్యాన్సర్ రిస్క్
తండ్రుల్లో ఉండే పొగతాగే అలవాటు పిల్లల పాలిట శాపంలా పరిణమిస్తోంది. బ్రాడ్‌ఫోర్ట్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం తల్లిదండ్రుల్లో పొగతాగే అలవాటు ఉంటే పిల్లలకు క్యాన్సర్లు... అందునా ప్రధానంగా ల్యుకేమియా వచ్చే అవకాశం ఎక్కువని తేలింది. దీనికి కారణాన్ని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తమ జన్యువులను పిల్లలకు అందించే వీర్యకణాల్లోని డీఎన్ఏ... పొగవల్ల దెబ్బతింటుంది. దాంతో లోపభూయిష్టమైన డీఎన్ఏ వల్ల పిల్లల్లో క్యాన్సర్ అవకాశాలు ఎక్కువ. అయితే ఈ రిస్క్‌ను తప్పించుకునేందుకు ఒక ఉపాయం కూడా ఉంది. దంపతులు గర్భధారణకు ప్లాన్ చేసుకున్న సమయం కంటే... కనీసం మూడు నెలల ముందే పొగతాగే అలవాటు మానేస్తే ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ పరిశోధనల్లో పాల్గొన్న డాక్టర్ డయానా యాండర్సన్. ఒక వీర్యకణం ఉద్భవించాక అది పూర్తిస్థాయిలో పరిణతి చెందేందుకు కనీసం మూడు నెలల సమయం అవసరం. అందుకే కనీసం మూణ్ణెల్ల పాటు పొగతాగే అలవాటుకు దూరంగా ఉంటే డీఎన్ఏ దెబ్బతిన్న వీర్యకణాల స్థానంలో ఆరోగ్యకణాలు వస్తాయి కాబట్టి పిల్లల్లో క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయంటున్నారామె. తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికైనా పొగతాగకుండా ఉండాలని ఈ అధ్యయనం చెబుతోంది. -
ఆ ఒక్కటీ.. ఒక్కటంటే కూడా ప్రమాదకరమే!
చాలా మంది సిగరెట్ మానేసే ప్రక్రియలో రోజుకు ఒక్కటే తాగుతుంటామని, అలా క్రమంగా తగ్గిస్తామని అనుకుంటుంటారు. అయితే రోజుకు ఒక్క సిగరెట్ మాత్రమే కాదు... సగం సిగరెట్ అయినా అది ప్రమాదకరమే అంటున్నారు యూఎస్‌లోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు చెందిన నిపుణులు. ఆ సంస్థలోని క్యాన్సర్ ఎపిడెమియాలజీ అండ్ జెనెటిక్స్ విభాగానికి చెందిన మాకీ ఇన్యోయ్ చోయ్ అనే శాస్త్రవేత్త చెబుతున్న దాని ప్రకారం సగం సిగరెట్ కూడా చాలా ప్రమాదకారి అంటున్నారామె. ఆ అధ్యయనవేత్త ఆధ్వర్యంలో 59 నుంచి 82 ఏళ్ల వయసులో ఉన్న దాదాపు మూడు లక్షల మందిపై ఒక అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాల గురించి ఆమె మాట్లాడుతూ ‘‘కొంతమంది తమ అలవాటు మానలేక సిగరెట్ వెలిగించి, సగం సిగరెట్ అంటూ ఒకటి రెండు పఫ్స్ తీసుకుంటారు. అయితే అసలు సిగరెట్ తాగని వాళ్లతో పోల్చినప్పుడు ఇలా ఒకటి, రెండు పఫ్స్ తీసుకునే 64 శాతం మందికి పొగాకుతో కలిగే ముప్పులన్నీ వస్తుంటాయని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే రిస్కు సాధారణ ప్రజల్లో కంటే 12 రెట్లు ఎక్కువని వివరించారు. అలాగే పొగాకు అలవాటు లేని సాధారణ వ్యక్తితో పోలిస్తే సిగరెట్ తాగేవాళ్లలో ఎంఫసిమా వంటి శ్వాసకోశ వ్యాధులు వచ్చే రిస్క్ సైతం రెండున్నర రెట్లు ఎక్కువని చెబుతున్నారు. -
గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు
-
భారీగా పొగమంచు.. గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు
కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో బుధవారం ఉదయం పొగమంచు కప్పేసింది. దట్టమైన పొగమంచు కారణంగా ల్యాండ్ అయ్యేందుకు వీలులేక బెంగుళూరు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన స్పైస్ జెట్ విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. బెంగుళూరు నుంచి సుమారు 50మంది ప్రయాణికులతో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన స్పైస్ జెట్ విమానం సుమారు అరగంట పాటు 8 సార్లు చక్కర్లు కొట్టింది. అనంతరం ల్యాండ్ అయ్యేందుకు వీలు లేకపోవడంతో తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయింది. హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన ఇండిగో విమానం, ఢిల్లీ నుంచి వచ్చిన మరో ఇండిగో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు వీలులేక గాల్లో చక్కర్లు కొట్టాయి. దాదాపు 10 గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు వీలు లేకపోవడంతో పాట్నాకి దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం కలిగిందని ఎయిర్‌పోర్టు అధికారలు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. పొగ మంచు పరిస్థితులు చక్కబడ్డాక విమానాల ల్యాండింగ్‌కు తిరిగి అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు. చదవండి: 7 చిరునామాలతో 72 పాస్‌పోర్టులు! -
సిగరెట్ సూసైడ్లను ప్రేరేపిస్తుందా?
సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారిలో ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక (సూయిసైడల్ టెండెన్సీస్) చాలా ఎక్కువగా పెరిగే అవకాశాలున్నాయంటూ హెచ్చరిస్తున్నారు అమెరికాకు చెందిన పరిశోధకులు. మోకాలికీ, బోడిగుండుకీ ముడివేస్తున్నట్లు అనిపిస్తున్నా ఇది ప్రత్యక్ష అధ్యయనంలో పరోక్షంగా తేలిన వాస్తవమంటున్నారు. యూఎస్‌లో ఆత్మహత్యలపై పరిశోధన చేస్తున్న కొందరు నిపుణులు చెబుతున్న ఫలితాల ప్రకారం... సిగరెట్ అలవాటును తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యల తర్వాత పొగతాగే అలవాటు గణనీయంగా తగ్గడంతోపాటు దాంతో విచిత్రంగా ఆత్మహత్యలు కూడా 15 శాతం తగ్గాయని వివరించారు. అయితే దీనికి ఆత్మహత్యలకూ సిగరెట్ అలవాటుకూ ఎలా ముడిపెడతారన్న అడిగినప్పుడు వారు మరో దృష్టాంతం చూపారు. సిగరెట్లపై టాక్సులు తగ్గించిన అక్కడి కొన్ని రాష్ట్రాలలో ఆత్మహత్యల శాతం 6 శాతం పెరిగాయని గణాంకాలు చూపారు. డ్రగ్స్ అలవాటు ఉన్నవారిలో సూసైడల్ టెండెన్సీస్ పెరిగినట్లే... నికోటిక్‌కు బానిసలైన వారిలోనూ యాంగై్జటీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పెరుగుతాయనీ, డిప్రెషన్ ఉన్నవారికి ఆత్మహత్యావాంఛ ఒక లక్షణమని చెబుతూ ఈ పరిశోధన ఫలితాలను ‘నికోటిక్ అండ్ టొబాకో రీసెర్చ్’ అనే జర్నల్‌లో ప్రచురించారు. -
షాకింగ్: పసుపు రంగులోకి మారిన శరీరం!
బీజింగ్ : దీర్ఘకాలంగా పొగ తాగుతున్న ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడు. స్మోకింగ్ వల్ల ఏర్పడిన ట్యూమర్ కారణంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. పాంక్రియాస్లో ఏర్పడిన కణతి దుష్ప్రభావం కారణంగా కామెర్లు వచ్చి శరీరం మొత్తం ముదురు పసుపు పచ్చ రంగులోకి మారిపోయింది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో చక్కర్లు కొడుతున్నాయి. (నకిలీ వ్యాక్సిన్లు అమ్ముతున్న చైనా ముఠా) వివరాలు... డూ అనే ఇంటిపేరు గల 60 ఏళ్ల వ్యక్తి స్మోకింగ్‌కు బానిసగా మారాడు. గత ముప్పై సంవత్సరాలుగా ప్రతిరోజూ సిగరెట్లు కాలుస్తున్న అతడికి ఇటీవల ఆరోగ్యం పాడైంది. దీంతో జనవరి 27న ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అతడికి కామెర్లు సోకినట్లు వైద్యులు గుర్తించారు. పొగతాగడం వల్ల ఏర్పడిన కారణంగా కణితి కారణంగా చిన్నపేగు, కాలేయం గుండా వెళ్లే నాళాలు మూసుకుపోయినట్లు పరీక్షల్లో తేలింది. ఈ క్రమంలో రక్తంలో బిలిరూబిన్(పసుపు రంగులో ఉండే పైత్యరసం) స్థాయి పెరిగి కామెర్లు వచ్చాయి. ఈ విషయం గురించి వైద్యులు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా పొగ తాగడం, మద్యం సేవించడం వల్ల ట్యూమర్ ఏర్పడిందని, దాని ప్రభావం అనారోగ్యానికి దారి తీసిందని తెలిపారు. అతడి శరీరంలో ఉన్న కాన్సన్ కణితిని తొలగించామని, ఈ క్రమంలో చర్మం రంగు తిరిగి సాధారణ రంగులోకి మారిందని తెలిపారు. దురలవాట్లు మానుకోకపోతే డూ ఆరోగ్యం క్షీణించే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఈసారి ఆయనను కాపాడటం కష్టమేనని పేర్కొన్నారు. -
పొగతాగితే.. పిల్లల్లో క్యాన్సర్ రిస్క్
పొగతాగే అలవాటు ఉన్న తండ్రులు తమ పిల్లలకు పొగ వల్ల దెబ్బతిన్న డీఎన్ఏను సంక్రమింపజేస్తున్నారని, దాంతో తండ్రి తప్పిదం వల్ల పిల్లలు మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఒక అధ్యయనం చెబుతోంది. బ్రాడ్‌ఫోర్ట్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం తల్లిదండ్రుల్లో పొగతాగే అలవాటు ఉంటే పిల్లలకు క్యాన్సర్లు... అందునా ప్రధానంగా ల్యుకేమియా వచ్చే అవకాశం ఎక్కువని తేలింది. దీనికి కారణాన్ని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తమ జన్యువులను పిల్లలకు అందించే వీర్యకణాల్లోని డీఎన్ఏ... పొగవల్ల దెబ్బతింటుంది. దాంతో లోపభూయిష్టమైన డీఎన్ఏ వల్ల పిల్లల్లో క్యాన్సర్ అవకాశాలు ఎక్కువ. అయితే ఈ రిస్క్‌ను తప్పించుకునేందుకు ఒక ఉపాయం కూడా ఉంది. దంపతులు గర్భధారణకు ప్లాన్ చేసుకున్న సమయం కంటే... కనీసం మూడు నెలల ముందే పొగతాగే అలవాటు మానేస్తే ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న డాక్టర్ డయానా యాండర్సన్. ఒక వీర్యకణం ఉద్భవించాక అది పూర్తిస్థాయిలో పరిణతి చెందేందుకు కనీసం మూడు నెలల సమయం అవసరం. అందుకే కనీసం మూణ్ణెల్ల పాటు పొగతాగే అలవాటు కు దూరంగా ఉంటే డీఎన్ఏ దెబ్బతిన్న వీర్యకణాల స్థానంలో ఆరోగ్యకణాలు వస్తాయి కాబట్టి పిల్లల్లో క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయంటున్నారామె. తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికైనా పొగతాగకుండా ఉండాలని ఒకవేళ పొగతాగే అలవాటు ఉంటే పిల్లల ఆరోగ్యం కోసమైనా వెంటనే మానేయాలని ఈ అధ్యయనం చెబుతోంది. -
పబ్లిక్‌గా దమ్ము లాగించిన పోలీసులు
లక్నో: బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం నేరం. ఈ నిబంధనను ఆచరించకపోతే పోలీసులు ఫైన్ వేస్తారు. లేదంటే పబ్లిక్‌గా పొగ తాగినందుకు ఏకంగా పోలీస్ స్టేషన్‌కే లాక్కెళ్లిపోతారు. మరి శిక్షించాల్సిన పోలీసులే రూల్స్ బ్రేక్ చేస్తే..! వారి పరువు గంగలో కలవడమే కాదు, ఉద్యోగం కూడా చిక్కుల్లో పడుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఎస్సై రాజ్ బహదూర్, హెడ్ కానిస్టేబుల్ జితేంద్ర సింగ్.. పహసు పోలీస్ స్టేషన్ పరిధిలోని బనేల్ గ్రామంలో పార్టీకి వెళ్లారు. అక్కడ తీరికగా కూర్చుని ఎదురుగా టేబుల్ మీద మందు బాటిళ్లు పెట్టుకుని పబ్లిక్‌గా దర్జాగా దమ్ము లాగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగా అది కాస్తా వైరల్‌గా మారింది. అలా ఈ వీడియో పై అధికారుల కంట పడింది. దీంతో ఆ ఇద్దరినీ బులంద్‌షహర్‌కు బదిలీ చేసినట్లు సీనియర్ సూపరింటెండెంట్ పోలీసు సంతోష్ కుమార్ వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. (చదవండి: సిస్టర్ అభయ కేసు: దోషులకు జీవిత ఖైదు) చదవండి: కాబోయే భార్య ఆస్పత్రి బెడ్ మీద ఉండగానే.. -
ధూమపానంతో నలుగురు పిల్లల ఆహుతి!
సాక్షి, న్యూఢిల్లీ : రిలే హోల్ట్‌కు 8 ఏళ్లు, కీగన్ యునిట్‌కు ఆరేళ్లు, టిల్లీ రోజ్ యునిట్‌కు నాలుగేళ్లు, ఒల్లి యునిట్‌కు మూడేళ్లు. వారి తల్లి నటాలియా యునిట్, తండ్రి క్రిస్టఫర్ మౌల్టెన్ నిర్లక్ష్యం కారణంగా నలుగురు పిల్లలు అగ్నికి ఆహుతై మరణించారు. ఇంగ్లండ్‌లోని స్టఫోర్డ్ పట్టణంలో వారు ఉంటున్న ఇంట్లో ఈ ఘోరం జరిగింది. వారి మాస్టర్ బెడ్ రూమ్‌లో తలెత్తిన మంటలు, ఇంటి మొత్తాన్ని ఆవరించి కబళించాయి. నలుగురు పిల్లలు పొగకు ఊపిరాడక ముందే చనిపోగా, భార్యా భర్తలు ఎలాగోఅలాగా ఇంటి నుంచి బయట పడి ప్రాణాలు రక్షించుకున్నారు. అగ్ని మాపక దళం ఆ ఇంటికెళ్లి మంటలను ఆర్పేసేటప్పటికీ ఆ ఇంటి మాస్టర్ బెడ్ రూమ్ ప్రాంతంలో ఎక్కడపడితే అక్కడే తాగేసిన సిగరెట్ పీకలు కనిపించాయి. ఓ యాష్ మంటలకు పూర్తిగా దగ్ధం కాగా, మరో యాష్ ట్రే సిగరేట్ పీకలతో అలాగే నిండుగా ఉంది. ఆ ఇంటికి వంట గదికి ఆవల కొన్ని వందల సిగరెట్ పీకలున్నాయి. భార్యాభర్తలిద్దరికి సిగరెట్లు తాగే అలవాటు ఉండడంతో వారి నిర్లక్ష్యం కారణంగానే ఇంతటి ఘోరం జరిగి ఉంటుందని కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు భావించారు. గత ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన ఈ దారుణంపై గురువారం సౌత్ స్టఫోర్డ్‌షైర్ కొరోనర్స్ కోర్టులో పూర్తి స్థాయి విచారణ జరిగింది. ఫైర్ ఇనివెస్టిగేటర్ లీగ్ రిచర్డ్స్‌తోపాటు ఐదుగురు సాక్షులను కోర్టు విచారించగా, ఎవరు కూడా అసలు కారణం ఏమిటో స్పష్టంగా చెప్పలేక పోయారు. మాస్టర్ బెడ్ రూమ్‌లో తల్లి దండ్రులు సిగరెట్లు తాగడం వల్ల బెడ్ అంటుకొని, మంటలు వ్యాపించి ఉండవచ్చని, అయితే ఇంటి మొత్తాన్ని దగ్ధం చేసే పరిస్థితి లేదని, సిగరెట్ పీకలతో ఉన్న మరో యాష్ ట్రే అలాగే ఉండడం, మాస్టర్ బెడ్ రూమ్‌కున్న ఓ కిటికీ అద్దం చెక్కు చెదరకుండా ఉండడం చూస్తుంటే ఇంకేవో మంటలను ప్రేరేపించి ఉంటాయని లీగ్ రిచర్డ్స్ అభిప్రాయపడ్డారు. ఇంటి పెరట్లో ఉన్న బాయ్లర్ కారణంగా మంటలు ప్రకోపించి ఉంటాయని దర్యాప్తు అధికారులు అనుమానం వ్యక్తం చేయగా, దాన్ని రిచర్డ్స్‌తో పాటు ఆ పిల్లల తల్లిదండ్రులు ఖండించారు. పిల్లల్లో ఒక్కరు కూడా బతికి లేకపోవడం, తాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు మంటలు అంటుకున్నాయంటూ తల్లిదండ్రులు వాదిస్తూ రావడంతో వారి నిర్లక్ష్యమా, లేక పిల్లల తెలియని తనం వల్లనా, మరే ఇతర కారణాలతో అగ్ని ప్రమాదం సంభించిందా అన్న విషయాన్ని కోర్టు ఈసారి కూడా తేల్చలేక పోయింది. గతంలో లాగా తల్లిదండ్రులను ఈసారి కూడా బెయిల్‌పై విడుదల చేశారు. -
‘వైట్‌హౌజ్‌లో సిగరెట్లు తాగేవాడిని’
సాక్షి, న్యూఢిల్లీ : ‘నేను వైట్‌హౌజ్‌లో ఉన్నప్పుడు పని ఒత్తిడి తట్టుకోలేక రోజుకు ఎనిమిది లేదా తొమ్మిది సిగరెట్లు తాగే వాడిని. ఒక రోజు సిగరెట్ తాగుతూ మాలియాకు పట్టుబడ్డాను. అంతే సిగరెట్ తాగడం మానేయాలని నిర్ణయానికి వచ్చాను’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన వైట్‌హౌజ్ జీవితానికి సంబంధించిన గత స్మృతుల్లో వెల్లడించారు. అలా సిగరెట్ మానేయడానికి ఆయన ఎంత కష్టపడాల్సి వచ్చిందో కూడా అందులో ఆయన వివరించారు. ఒబామా అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు ‘మీరు సిగరెట్ తాగుతారా?’ అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు ఆయనెప్పుడూ సూటిగా సమాధానం ఇవ్వలేదు. (చదవండి : రాహుల్ గాంధీకి ఆ పట్టుదల లేదు : ఒబామా) సిగరెట్ తాగుతూ తన పెద్ద కూతురు మాలియాకు పట్టుబడ్డానని గత స్మృతుల్లో వెల్లడించిన ఒబామా.. మీడియాకు మాత్రం ఎప్పుడు పట్టుబడలేదు. అదే మాలియా స్నేహితులతో కలిసి సిగరెట్ తాగుతూ రెండు, మూడు సార్లు మీడియాకు దొరికి పోయారు. ఒబామా ఆఫ్రికా దేశమైన కెన్యాలో ఉన్నప్పుడు తన తండ్రి కుటుంబ సభ్యుల ముందు తాగేవారు. 1987లో ఆయన తన కుటుంబ సభ్యుల ఇంటి ముందు కూర్చొని సిగరెట్ తాగుతున్న ఫొటోలు నేటికి అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ అలవాటుకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందే ఒబామా స్వస్తి చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా శ్వేత భవనంలోకి అడుగు పెట్టాక పని ఒత్తిడి తట్టుకోలేక సిగరెట్ స్మోకింగ్ మళ్లీ మొదలు పెట్టానని, రోజుకు 8,9 సిగరెట్లు తాగే వాడినని ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పేరిట ఆయన రాసిన స్మృతుల్లో చెప్పారు. రోజుకు 8,9 కాదు, పది సిగరెట్లు కూడా తాగే వారని ఆయన భార్య మిషెల్లీ ఒబామా తెలిపారు. ఆయన రాసిన పుస్తకం నవంబర్ 17వ తేదీన మార్కెట్లోకి వస్తోంది. ఒబామా తాను వైట్‌హౌజ్‌లో గడిపిన రోజుల నాటి స్మృతులతోపాటు తన కుటుంబంలో ఎదురైన ఒడుదుడుకుల గురించి కూడా ఆ పుస్తకంలో ఆయన వెల్లడించారట. -
స్మోకింగ్ మానేయడానికి ఇదే సమయం..
సాక్షి, న్యూఢిల్లీ: ధూమపానానికి దూరం కావాలనుకునే వారు ఎప్పుడూ ఉంటారు. అయితే వారిలో కొద్ది మందే అందులో విజయం సాధిస్తారు. ప్రపంచ ప్రజలకు వణికిస్తోన్న కోవిడ్ మహమ్మారి బారిన పడిన వారిలో తీవ్ర అస్వస్థతకు గురవుతోన్నది, బాధ పడుతోన్నది ధూమపాన ప్రియులని తేలడంతో ఇప్పుడు వారిలో ఎక్కువ మంది ధూమపానానికి స్వస్తి చెప్పాలనుకుంటున్నారు. అలాంటి వారు విజయం సాధించాలంటే ఇంతకంటే మంచి తరుణం మరోటి ఉండదని వైద్య నిపుణులే చెబుతున్నారు. కోవిడ్ దండయాత్రకు ముందు ధూమపానానికి దూరం కావాలనుకున్న వారి సంఖ్య అమెరికా, ఆస్ట్రేలియా స్మోకర్లలో పది శాతం మందికాగా, ఇప్పుడు వారి సంఖ్య 19 నుంచి 29 శాతానికి చేరుకున్నట్లు ‘అడిక్షన్ మెడిసిన్’ జర్నల్ తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ధూమపానానికి స్వస్తి చెప్పడం ద్వారా కోవిడ్ ముప్పుకు దూరం కావాలనుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉందని, ధూమపానం వల్ల కలిగే నష్టాల గురించి ఎప్పటికప్పుడు తెలసుకోవాలనుకుంటున్నవారు కూడా తాము అభిప్రాయలు కోరిన స్మోకర్లలో 45 శాతం మంది ఉన్నారని ఆ సర్వే తెలిపింది. ఇలాంటి సమాచారం తెలసుకోవాలనుకుంటోన్న వారిలో ఎక్కువ మంది, అంటే 61 శాతం మంది టీవీ మీడియంనే కోరుకుంటున్నారు. ఇక ఆన్లైన్ మీడియా ద్వారా 36 శాతం మంది, సోషల్ మీడియా ద్వారా 31 శాతం, ఈ మెయిల్ ద్వారా 31 శాతం మంది కోరుకుంటున్నారు. ధూమపానానికి స్వస్తి చెప్పేందుకు తమకు సహకరించాలని, ఈ విషయంలో నికోటిన్ ప్రత్యామ్నాయ థెరపిని సూచించాలని 61 శాతం స్మోకర్లు కోరుతున్నారని సర్వేలో తేలింది. ధూమపాన వ్యతిరేక ప్రచారం, పొగాకు ఉత్పత్తులపై అధిక పన్నుల విధింపు, పరిమిత ప్రాంతాలకే ధూమపానాన్ని కట్టడి చేసే చట్టాల వల్ల ఆస్ట్రేలియాలో ధూమపాన ప్రియుల సంఖ్య 11 శాతానికి పడిపోంది. ఈ దురలవాటు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 80 లక్షల మంది మత్యువాత పడుతున్నారు. -
పొగాకు అలవాటుకు కరోనా చెక్
సాక్షి, అమరావతి: పొగతాగే వ్యసనం ఉన్నవారి నోటికి కోవిడ్–19 వైరస్ తాళం వేసింది. ఈ అలవాటు ఉన్న వారికి ఊపిరితిత్తులు దెబ్బతింటాయని, ఇటువంటి వారికి కరోనా వైరస్ సోకితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తోన్న నేపథ్యంలో.. ఆరోగ్య భద్రత కోసం అనేక మంది పొగతాగే అలవాటును బలవంతంగా విరమించుకుంటున్నారు. మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు కరోనా కాలంలో చాలా మంది మానుకున్నట్టు సర్వే సంస్థలు నిర్ధారిస్తున్నాయి. ‘ఫౌండేషన్ ఫర్ స్మోక్–ఫ్రీ వరల్డ్’ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో అనేక మంది పొగ తాగడానికి దూరంగా ఉన్నట్టు తేలింది. ఈ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ► భారత్‌లో లాక్డౌన్ సమయంలో 72% మంది పొగ తాగడం మానేయాలని నిర్ణయం తీసుకున్నారు. చివరకు వీరిలో 66% మంది అలవాటును మానేశారు. పొగతాగడం వల్ల కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వీరిలో 48% మంది భావించారు. ► 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వినియోగదారుల్లో.. 72% మంది ధూమపానాన్ని మానేయడానికి ప్రయత్నించారు. ► 25 నుంచి 39 ఏళ్ల వయస్సున్న వారిలో 69% మంది పొగతాగడానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. కరోనా బాధితుల్లో పొగరాయుళ్లే ఎక్కువ.. ► ధూమపానం అలవాటు ఎక్కువగా ఉన్న వారికి వైరస్ సోకే ప్రమాదం ఉందని మరొక సర్వేలో తేలింది. ప్రపంచంలో కోవిడ్–19 వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) శ్వాసకోశ వైద్య నిపుణుడు జానీస్లీంగ్ ఇటీవల అధ్యయనం నిర్వహించారు. కరోనా బాధితుల్లో ఎక్కువ మంది పొగతాగే వారేనని తేలింది. ► పొగ పీల్చినప్పుడు ఎస్–2 ఎంజైమ్‌ను ముక్కు అధికంగా స్రవిస్తుందని, కరోనా వైరస్ నేరుగా, వేగంగా ఊపిరితిత్తుల్లోకి చేరుకునేందుకు ఇది బాటలు వేస్తోందని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. చైనా, ఇటలీలలో అత్యధిక శాతం కరోనా రోగులు పొగతాగేవారేనని వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌వో అధ్యయనంలో వెలుగుచూసిన నిజాలు ► చైనాలో కరోన బారిన పడిన 82,052 మందిలో 95% మంది పొగతాగే అలవాటు ఉన్నవారే. ► ఇటలీలోనూ సింహభాగం కరోనా రోగులు పొగరాయుళ్లే ఉన్నారు. ► కరోనా బారిన పడిన వారిలో పొగతాగేవారి తర్వాతి స్థానం తీవ్ర శ్వాసకోశ, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారిదేనని వెల్లడైంది. -
‘వారికి కోవిడ్-19 ముప్పు అధికం’
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల్లో పొగతాగే అలవాటున్న వారు తీవ్ర అనారోగ్యానికి గురవడం, మరణించే అవకాశం అధికంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. అయితే పొగతాగేవారికి కోవిడ్-19తో నిర్ధిష్టంగా ఎంతటి ముప్పు ఉంటుందనేది డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేయలేదు. ఇక ప్రపంచవ్యాప్తంగా 1.7 కోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 5.1 లక్షలకు చేరింది. కోవిడ్-19 నుంచి కోలుకుని డిశ్చార్జి అయినవారి సంఖ్య 54 లక్షలకు పెరిగింది.మరోవైపు భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6 లక్షలు దాటగా మరణాల సంఖ్య 17,834కు ఎగబాకింది. చదవండి : ఆ ఔషధ ఉత్పత్తిని పెంచండి: డబ్ల్యూహెచ్ఓ -
యువతకు గాలమేస్తున్నారు..
న్యూఢిల్లీ: పొగాకు లాబీ కన్ను ఇప్పుడు యువతపై పడింది. వారిని ఎలాగైనా పొగాకుకు బానిసలుగా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ సిగరెట్లలో యువతకు నచ్చే రుచి, వాసనలు చేర్చడం ఈ ప్రయత్నాల్లో భాగమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం గుర్తించింది. పీచు మిఠాయి, బబుల్గమ్, చెర్రీ పండ్ల రుచి వాసనలతో పొగాకు ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా ఆరోగ్యానికి చేసే హానిని కాదని.. యువత పొగాకును ఎక్కువగా వినియోగిస్తుందని పరిశ్రమ వర్గాల అంచనా. అంతేకాదు.... యూఎస్బీ డ్రైవ్, ఐస్‌క్యాండీ వంటి ఆకారాల్లో పొగాకు ఉత్పత్తులను సిద్ధం చేసి మరీ యువతకు గాలమేస్తున్నారు. (కరోనాకు ధూమపానం మంచిదేనట!) శుద్ధమైనవి, తక్కువ హాని చేసేవన్న లేబుళ్లు తగిలించడం వెనుక కూడా పరిశ్రమ హస్తం ఉందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. చాలా దేశాల్లో టెలివిజన్, ప్రింట్, సామాజిక మాధ్యమాల్లో పొగాకు ప్రకటనలివ్వడంపై నిషేధం ఉన్న నేపథ్యంలో కంపెనీలు యూటూబర్లు, ఇతర సామాజిక మాధ్యమ ఇన్‌ఫ్లుయెన్షర్లు (ప్రభావం చూపగలవారు)తో పరోక్షంగా తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్నట్లు, తద్వారా 18 ఏళ్ల లోపు వయసు వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. (ఊపిరాడటం లేదు..!!) యువత ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల అమ్మకం చేపట్టడం, తినుబండారాలు, కూల్‌డ్రింక్స్ అమ్మే చోట పొగాకు ఉత్పత్తుల ప్రచారం, సిగరెట్లు విడిగా అమ్మడం, పొగాకు ఉత్పత్తుల నియంత్రణకు ప్రభుత్వాలు చేసే అన్ని రకాల ప్రయత్నాలపై కొర్రీలు వేస్తూ వాటి అమలును జాప్యం చేయడం వంటివి ఈ ప్రయత్నాల్లో భాగంగానే చూడాలి. ఈ ఎత్తుగడలన్నింటినీ చిత్తు చేసే లక్ష్యంతోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది ‘నో టొబాకో డే’ ఇతివృత్తంగా కార్యక్రమాలను అమలు చేస్తోంది. కంపెనీల కుటిలయత్నాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ‘రహస్యం బట్టబయలు’ అన్న శీర్షికతో ప్రచార సామగ్రిని సిద్ధం చేసింది. ఆదాయానికి.. అలవాట్లకు లింకు ధూమపానం అలవాటయ్యేందుకు వ్యక్తులు, దేశాల ఆదాయానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ధనిక దేశాల్లో పొగతాగే వాళ్లు ఎక్కువగా ఉండటం దీనికి నిదర్శనం. అయితే అలవాట్లు మారేందుకు ఎక్కువ సమయం ఏమీ పట్టడం లేదు. 2000 సంవత్సరంలో యునైటెడ్ కింగ్డమ్లో దాదాపు 38 శాతం మంది పొగరాయుళ్లు ఉండగా... తాజా లెక్కల ప్రకారం ఇప్పుడు ఇది 22 శాతానికి తగ్గిపోయింది. ఇలాంటి హెచ్చుతగ్గులు చాలాదేశాల్లో కనిపిస్తాయి. ధూమపానం మానేస్తే... పొగ తాగడం వల్ల రకరకాల రసాయనాలు శరీరంలోకి చేరతాయి. వీటిల్లో చాలావరకూ రక్తంలోని ఆక్సిజన్‌ను హరించేవే. పొగతాగడం మానేసిన తరువాత కొంత కాలానికే రక్తంలో ఆక్సిజన్ మోతాదు పెరిగిపోతుంది. ఫలితంగా మరింత శక్తి, ఉత్సాహం లభిస్తాయి. అలాగే ఆహారపు రుచి తెలిసేలా చేసే టేస్ట్ బడ్స్ మళ్లీ చురుకుగా పనిచేయడం మొదలవుతుంది. దీంతో తినే తిండి రుచి, వాసనలు స్పష్టంగా తెలుస్తాయి. పొగాకు కారణంగా ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన గార, రసాయనాలు క్రమేపీ తగ్గిపోయి ఊపిరి పీల్చుకోవడం భారంగా అనిపించదు. అంతేకాదు.. పోషకాలు అందడం ఎక్కువ కావడం వల్ల చర్మంపైని ముడుతలు తగ్గుతాయి. -
కరోనాకు ధూమపానం మంచిదేనట!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్ మహమ్మారికి సంబంధించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వైరస్ బారిన పడిన మహిళలకంటే మగవారు చనిపోయే అవకాశం రెండింతలు ఎక్కువట. వృద్ధులు, స్థూలకాయం కలిగిన వారితోపాటు భిన్న సంస్కృతిగల మైనారిటీలు కూడా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట. ఇంగ్లండ్‌కు చెందిన ఎన్హెచ్ఎస్ అధికారులు 1.74 కోట్ల రోగుల రికార్డులను పరిశీలించి ఈ అభిప్రాయానికి వచ్చింది. అలాగే కరోనా బారిన పడిన శ్వేతజాతీయులకన్నా నల్లజాతీయులు 1.7 రెట్లు, ఆసియన్లు 1.6 రెట్లు ఎక్కువగా మరణించే అవకాశం ఉందని కూడా వారి ఎన్హెచ్ఎస్ అధికారుల విశ్లేషణలో తేలింది. అన్నింటికన్నా మరో విశేషమేమిటంటే సిగరెట్టు తాగేవారికంటే తాగని వారిలోనే మరణాల సంఖ్య రెట్టింపు ఉందని ‘ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్’కు చెందిన పరిశోధకులు తెలిపారు. వారు 1.74 కోట్ల మంది ఆరోగ్య రికార్డులను పరిశీలించగా, వారిలో ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీ మధ్య కరోనా బారిన పడి మరణించిన 5,707 మంది కూడా ఉన్నారు. (చదవండి : కరోనా: ఇటలీలో ఇంత తక్కువ.. ఫస్ట్‌టైమ్!) పొగతాగడం వల్ల ఊపిరితిత్తులు బలహీనంగా ఉంటాయికనుక సిగరెట్లు తాగేవారు ఎక్కువగా చనిపోయే అవకాశం ఉందని వైద్యులు తొలుత భావించారు. సిగరెట్లు తాగే వారందరిలో ఊపిరితిత్తుల సమస్యలు ఉండక పోవచ్చు. కరోనా నేరుగా ఊపిరితిత్తుల్తోకి వెళుతుందికనుక సిగరెట్ పొగ వేడి వల్ల కరోనా వైరస్ మరణించే అవకాశాలు ఉన్నాయి. ధూమపానం మానేసిన వారు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వైరస్‌ను చంపే గుణం పొగాకులోనే ఉందని, ఆ విషయాన్ని తాము ల్యాబ్ పరీక్షల ద్వారా గుర్తించామని, బ్రిటీష్ అమెరికన్ టొబాకో (బీఏటీ) కంపెనీ ఇటీవల ప్రకటించడం కూడా ఇక్కడ గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతిస్తే తాము కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నామని బయోలాజికల్ ల్యాబ్‌ను కలిగిన బీఏటీ యాజమాన్యం ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి విషయాల్లో సిగరెట్ కంపెనీల సహాయం తీసుకోకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఈ కారణంగానే లండన్ కేంద్రంగా పలు దేశాల్లో కంపెనీ బ్రాంచీలు కలిగిన ఏబీటీకి అనుమతిచ్చేందుకు ఏ ప్రభుత్వం ముందుకు రాలేదు. ఊపిరి తిత్తుల జబ్బులు, గుండె జబ్బులు, మధుమేహం అదుపులో లేకపోవడం తదితర సమస్యలు కలిగిన వారు, 80 ఏళ్ల పైబడిన వారు కరోనా వల్ల ఎక్కువగా చనిపోయే అవకాశం ఉందని ఈ అధ్యయనం తేల్చింది. -
అక్కా మీరు నిజంగానే సిగరెట్ తాగారా?
లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. షూటింగ్‌లు నిలిచిపోవడంతో బుల్లితెరకు విరామమిచ్చిన టీవీ సెలబ్రిటీలు.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. తాజాగా నటి, యాంకర్ హరితేజ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ అక్క హిట్ మూవీలో మీరు నిజంగానే సిగరెట్ తాగారా అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన హరితేజ నిజమేనని చెప్పారు. పాత్ర డిమాండ్ చేసిందని..అందువల్ల తప్పలేదని వెల్లడించారు. అలాగే మరికొందరు అడిగిన ప్రశ్నలకు కూడా ఆమె తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు. ఆమె వయసు గురించి ప్రశ్నించగా.. ‘చెప్పిన ఎవరూ నమ్మరు. నమ్మన వినరు. విన్నా అర్థం చేసుకోరు. నిజాలు నిష్టూరమే ఎప్పుడూ.. అయినా చెప్తా.. 24/02/1992’ అని హరితేజ తన పుట్టిన తేదీని వెల్లడించారు. అలాగే అభిమానుల కోరిక మేరకు ఒకట్రెండు పాటలు కూడా పాడారు. కాగా, ఓ వైపు యాంకర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించినప్పటికీ.. బిగ్‌బాస్‌లో పాల్గొన్న తర్వాత ఆమె క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. చదవండి : అవ్రమ్‌కు హెయిర్ కట్ చేసిన విరానిక -
మీకు అర్థమవుతోందా...!
సాక్షి, కోల్‌సిటీ(రామగుండం) : మీకు..అర్థమవుతోందా..పొగతాగడం ఆరోగ్యానికి హానికరం.. నో స్మోకింగ్ ప్లీజ్ అని సినిమాహాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రచారం నిర్వహిస్తున్నా ధూమపానం మానడం లేదు జనం. తెరపై చూసిన పొగ రాయుళ్లు సినిమా మధ్యలోనే సిగరేట్ పొగను పీల్చేస్తున్నారు. తెరపై మీరేసుకున్నది మీరేసుకుంటే.. మేం తాగాలనుకున్నది తాగేస్తామంటూ గుప్పు గుప్పుమంటూ పొగలాగేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి యువత ధూమపానాన్ని ఓ ఫ్యాషన్‌గా భావిస్తోంది. ప్రాణాలు తీసే పొగ... ఫ్రెండ్స్‌తో..కాలేజీ రోజుల్లో ప్రారంభమయ్యే సిగరేట్ తాగే అలవాటుకి బీజం పడుతోంది. ఇలా సరదాగా మొదలై..హృదయానికి “పొగ’బెడుతోంది. మొదట్లో సరదాగానే ఉన్నా తర్వాత పొగకు అడిక్ట్ అయిపోతున్నారు. ఒక్కరోజు సిగరేట్ తాగకుంటే ఆ రోజంతా పిచ్చెక్కినట్టుగా, చిరాగ్గా ఉంటోందని చెబుతున్నారు. కొందరైతే రోజుకు ఒక సిగరేట్‌తో మొదలు పెట్టి..క్రమంగా రోజుకో పెట్టె వరకూ పీల్చేస్తుంటారు. ప్రకటనలు ఇస్తున్నా.. అంతే ప్రభుత్వాలు ఎన్ని రకాల ప్రకటనలు ఇస్తున్నా..ఇదొక వినోదంలా మారిపోయింది. ధూమపానం లేని లోకాన్ని చూడగలమా..? అనే సందేహం కలుగుతోంది. బహిరంగ ప్రదేశాల్లో ఎంత నిషేధం విధించినప్పటికీ పొగరాయుళ్లు దర్జాగా సిగరేట్ కాల్చుతూనే ఉన్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా మిలియన్ల కొద్దీ ప్రజలు పొగతాగడం ద్వారా మృత్యువాతకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఏటా పది లక్షల మంది మృత్యువాత... పొగాకు మనుషులకు హాని తలపెట్టే అత్యంత ప్రమాదకరమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పొగ తాగడం ద్వారా ఏటా 10 లక్షల మంది బాధితులు మృత్యువాతకు గురవుతున్నారని అంచనా. పొగాకు నివారణ చర్యలు పాటించకపోతే 2030 నాటికి 10 మిలియన్ వరకు మృతుల సంఖ్య చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. బహిరంగంగానే... యువతలో సిగరేట్ ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. పాశ్చాత్య సంస్తృతికి ఆకర్షితులై “పొగ’కు బానిసవుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగరాదని ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తెచ్చినా ఫలితం లేకుండా పోతోంది. ఆస్పత్రులు, హోటళ్లు, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, క్రీడా మైదానాలతోపాటు బహిరంగ స్థలాల్లో పొగ తాగడం మాత్రం మానడం లేదు. ప్రభుత్వ హెచ్చరికలు ఎంతమాత్రం ఫలితం ఇవ్వలేకపోతున్నాయి. సిగరేట్లు, బీడీలు, అంబార్ తదితర పొగాకుతో కూడిన వస్తువులు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మైనర్లకు కూడా విక్రయించరాదని చట్టంలో ఉంది. కానీ ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. క్యాన్సర్‌కు కారణం పొగ సిగరేట్, బీడీలు, గుట్కా తదితర పొగాకు ఉపయోగించడం గొంతు, ఊపిరిత్తులు, పేగు క్యాన్సర్లు, కిడ్నీ, గుండె జబ్బులు, నోటి దుర్వాసన, పెదవులపై తెల్లపూత, పళ్లు రంగు మారడం తదితర జబ్బులకు గురవుతారని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పుట్టబోయే బిడ్డకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అంగవైకల్యం కలిగే అవకాశం ఉంది. ధూమ ప్రియుల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోవడం, జ్ఞాపకశక్తి మందగించడం సమస్యలు వస్తాయి. గుట్కాలు తీసుకోవడం ద్వారా గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో 20 నుంచి 60 సంవత్సరాలు వయసు మధ్య ఉన్నవారు ఎక్కువగా పొగాకు వాడుతున్నారని అంచనా. జరుగుతున్న మరణాల్లోనూ 90శాతం వరకు పొగాకు వాడిన వారే ఉండడం బాధాకరం. ఆరోగ్యానికి మంచిదికాదు సిగరేట్, బీడీలు, గుట్కా తదితర పొగాకు ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిదికాదు. వీటితో గొంతు, ఊపిరిత్తులు, పేగు, కడుపులో క్యాన్సర్లు, కిడ్నీ, గుండె జబ్బులు, నోటి దుర్వాసన, పెదవులపై తెల్లపూత, పళ్లు రంగు మారడం, నరాల వ్యాధులు, గ్యాస్ట్రబుల్లాంటి జబ్బులకు గురవుతారు. పుట్టబోయే బిడ్డకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అంగవైకల్యం కలిగే అవకాశం కూడా ఉంది. ధూమ ప్రియుల్లో జ్ఞాపకశక్తి మందగించే సమస్యలు వస్తాయి. వీటికి దూరంగా ఉండడం మంచిది. – డాక్టర్ అహ్మద్, గయాసౌదీన్, జనరల్ ఫిజీషియన్, గోదావరిఖని చుక్కేస్తే.. చిక్కులే కరీంనగర్‌క్రైం : మద్యం తాగి వాహనాలతో రోడ్డెక్కితే పోలీసులు చుక్కలుచూపడం ఖాయం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించడమే ఈ సంవత్సరం ప్రధాన లక్ష్యంగా పోలీసులు గట్టిగా కృషి చేస్తున్నారు. ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్న పోలీసుల యంత్రాంగం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఒకవైపు ట్రాఫిక్ వినియోగంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తూ పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. 2018 నుంచి 2020 వరకు 19631 కేసులు నమోదు కాగా 2020 సంవత్సరం జనవరి నుంచి 2354 కేసుల నమోదయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడపొద్దని పోలీసులు సూచించినా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. 23 మంది లైసెన్స్‌లు రద్దు తరచూ మద్యం తాగి పట్టుబడిన వ్యక్తుల లైసెన్స్‌ల రద్దుకు రవాణాశాఖ అధికారులకు పోలీసులు ప్రతిపాదన పంపుతున్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 23 మంది వాహనదారులకు సంబంధించిన లైసెన్స్‌లు 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకూ రద్దు చేశారు. పోలీసులు అన్నివేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతుండడంతో మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా తమ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. క్యూఆర్ కోడ్ విధానం అమలు కూడా ప్రైవేటు వాహనాల డ్రైవర్ల దురుసు ప్రవర్తన, ఇతరత్రా విషయాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి దోహదపడుతోంది. దడపుట్టిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పోలీసులు చేపడుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మందుబాబుల్లో దడపుట్టిస్తున్నాయి. మద్యం తాగి పట్టుబడిన వారందరికీ శిక్షలు పడుతున్నాయి. ఒక రోజు నుంచి మొదలుకొని మోతాదును మించి తాగిన వాహనాలు నడిపిన వారికి మూడునెలల వరకు జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తున్నారు. మద్యంతాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురవడంతోపాటు ఎలాంటి సంబంధం లేని పాదాచారులు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. రెండేళ్లుగా జనవరి 2018 నుంచి డిసెంబర్ 2019 వరకు కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 17,277 మంది మద్యం తాగి వాహనాల తనిఖీల్లో పట్టుబడగా ఇందులో 4483 మందికి జైలుశిక్షలు, 8362 జరిమానా విధించారు. జరిమానా రూపంలో రూ.1,78,36,825లు వచ్చింది. జనవరి 2020 నుంచి మార్చి 6 వ తేదీ వరకు 2354 మంది పట్టుబడగా 464 మందికి జైలుశిక్ష, 1132 మందికి జరిమానా విధించారు. రూ.33,67,100లు జరిమానా రూపంలో వచ్చింది. అవగాహన...కౌన్సెలింగ్‌లు.. మద్యంతాగి వాహనాలు నడిపే వారిని నియంత్రించడానికి పోలీసులు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వారికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తూ కోర్టులో హాజరుపరుస్తున్నారు. పోలీసులు రోడ్డు ప్రమాదాలు నివారించాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొంతమంది వాహనదారులు మాత్రం మారడం లేదు. ఆన్లైన్ ద్వారా కేసు నమోదు వాహనాల తనిఖీల సమయంలో బ్రీత్ అనలైజర్ ద్వారా డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో పట్టుబడిన వారు గతంలో డిపార్ట్మెంట్లో తెలిసిన వారితో ఫోన్ చేయిస్తున్నారు. ప్రస్తుతం వాహనదారులకు అలాంటి అవకాశం లేకుండా పరీక్షల్లో పట్టుబడిన వెంటనే వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, బ్రీత్ అనలైజర్ చూపించిన అల్కాహల్శాతం రిపోర్టు తదితర వివరాలు ఆన్Œలైన్లో నమోదు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. బీఏసీ (బ్లడ్ అల్కాహాల్ కన్సంట్రేషన్) ప్రమాణాల మేరకు ప్రతీ వంద మీటర్ల రక్తంలో 30 మిల్లీ గ్రాములకు మించి మద్యం మోతాదు దాటకూడదు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడిన వాహనం వెంటనే స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించి, తర్వాత చార్జీషీట్ నమోదు చేసి కేసును కోర్టుకు పంపిస్తారు. కేసు తీవ్రతను బట్టి జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. వాహనదారుల భద్రతలో భాగంగా.. వాహనదారుల భద్రత కోసమే డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నాం. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తప్పనిసరి. ప్రమాదాలు సంభవించకముందే వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యంతాగి వాహనాలు నడపడం ద్వారా చాలామంది ప్రమాదాలబారినపడ్డారు. ట్రాఫిక్ రూల్స్‌ను వాహనదారులు బాధ్యతగా పాటించాలి. డ్రంక్ అండ్ డ్రైవ్‌ల నిర్వహణను అన్నివర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు. – విబి.కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ పోలీసు కమిషనర్ -
కడుపులో అల్సర్స్
ఈరోజుల్లో మన జీవనశైలి చాలా ఒడిదొడుకులతో ఉంటోంది. టైమ్‌కు భోజనం తినకపోవడం, మసాలాలతో కూడిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం, తీవ్రమైన ఒత్తిడితో కూడిన జీవనం గడపడంతో పాటు చాలామంది రాత్రి కాగానే ఆల్కహాల్స్, పగటిపూట సాఫ్ట్డ్రింక్స్తో అస్తవ్యస్తమైన జీవితం గడుపుతున్నారు. ఈ జీవనశైలి కారణంగా మనలో అల్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువ. అలాంటి అల్సర్ల గురించి అవగాహన కల్పించేందుకే ఈ కథనం. మనం ఆహారం తీసుకున్న తర్వాత అది ప్రయాణించే మార్గమంతా మంచి లైనింగ్‌తో ఉంటుంది. ఈ లైనింగ్ మీద ఆహారం తేలిగ్గా ముందుకెళ్లడానికి జిగురు లాంటి పదార్థం (మ్యూకస్) తోడ్పడుతుంది. ఇక పేగుల దగ్గర మైక్రో విల్లై పేరిట... జీర్ణమైన ఆహారాన్ని ఒంటి లోపలికి ఇంకేలా పీల్చుకోడానికి అంతే సంక్లిష్టమైన నిర్మాణాలుంటాయి. అటు ఆహారం సజావుగా వెళ్లడానికీ, అలాగే దాని లోపలి పోషకాలు లోపలికి ఇంకడానికీ ఉన్న ఆ దారిలో ఎక్కడైనా ఒరుసుకుపోయినట్లుగా ఉంటే... వాటిని ఎరోజన్స్ అంటారు. అలాంటి ఎరోజన్స్ గాట్లు మరింత లోతుగా ఉంటే... వాటినే అల్సర్స్‌గా పిలుస్తారు. ఒకసారి అల్సర్ వస్తే అది మళ్లీ మళ్లీ వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి అల్సర్ వచ్చినవాళ్లు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అల్సర్స్ ఎందుకొస్తాయో, అలా ఒకసారి అల్సర్స్ వచ్చి తగ్గినవారితో పాటు... రానివాళ్లు భవిష్యత్తులో అలాంటి సమస్యే ఉత్పన్నం కాకుండా చూసుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం. ఎలా ఏర్పడతాయి ఈ అల్సర్స్? మన నోటిలో ఉండే మృదువైన పొరను మ్యూకోజా అంటారు. ఆ పొరలాంటి లైనింగ్లాంటిదే దాదాపు ఆహారం ప్రయాణించే మార్గమంతా ఉంటుంది. ఈ మొత్తం దారిలో అల్సర్స్ ఎక్కడైనా రావచ్చు. అవి వచ్చేందుకు కారణాలెన్నో. అవి వచ్చిన ప్రదేశాన్ని బట్టి... నోట్లో అయితే నోటి అల్సర్ అనీ, కడుపులో స్టమక్ అల్సర్ అనీ, పేగులోని వాటికి ఇంటస్టైనల్ అల్సర్ అని పేరు పెడతారు. కారణాలివి కడుపులో స్రవించే యాసిడ్ లోపలి లైనింగ్‌ను తినేయడం, సమయానికి తినకపోవడం, సిగరెట్స్ / పొగతాగడం, ఆల్కహాల్ వల్ల మ్యూకోజా దెబ్బతినవచ్చు. ఆ గాయం మరింత తీవ్రమైతే దాన్నే అల్సర్ అని చెప్పవచ్చు. కడపులో ఉండే యాసిడ్స్ మాత్రమేగాక... ఒక్కోసారి కూల్‌డ్రింక్స్ రూపంలో మనం తాగే కార్బొనేటెడ్ డ్రింక్స్ వల్ల కూడా ఈ మ్యూకోజా గాయపడవచ్చు. కొన్నిసార్లు యాస్పిరిన్, కొన్ని నొప్పినివారణ మందులు వల్లకూడా అల్సర్స్ రావచ్చు. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్లకు మరో ప్రధాన కారణం. కొన్నిసార్లు మానసిక ఒత్తిడి వల్ల కూడా ఈ అల్సర్స్ రావచ్చు. మామూలుగానైతే మ్యూకోజాలో గాయం అయినప్పుడు మనలోని డిఫెన్సివ్ ఫ్యాక్టర్ వల్ల అది దానంతట అదే తగ్గిపోతుంది. కాని గాయపరిచే శక్తుల ప్రభావం ఎక్కువై, ఆ గాయం మరింత లోతుగా అయినప్పుడు అల్సర్స్ ఏర్పడతాయి. అల్సర్ ఉంటే... కడుపులో అల్సర్స్ ఉన్నప్పుడు సాధారణంగా కడుపునొప్పి వస్తుంది. కడుపునొప్పితోపాటు కనిపించే ఇతర లక్షణాలివి... ►అకస్మాత్తుగా అర్ధరాత్రి కడుపు పైభాగంలో నొప్పి, మంటతో నిద్రాభంగం కావడం. ►ఏమీ తినకపోతే కడుపునొప్పి రావడం, ►ఏదైనా తినగానే వాంతులు కావడం, నొప్పి రావడం. ►భోజనం మొత్తం తినలేకపోవడం, అంటే... కాస్తంత తినగానే కడుపునిండిపోయినట్లు అనిపించడం. ►కడుపు ఉబ్బరం, తేన్పులు. ►కొందరిలో రక్తహీనత, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. నిర్ధారణ పరీక్షలు ఇవి రోగి లక్షణాలను బట్టి అల్సర్స్ ఉన్నట్లు అంచనా వేసినా... దాన్ని కచ్చితంగా కనుక్కునేందుకు ఎండోస్కోపీ ఉపయోగపడుతుంది. దీని సహాయంతో కేవలం అల్సర్స్ నిర్ధారణ మాత్రమేగాక... కొన్నిసందర్భాల్లో క్యాన్సర్‌గా అనుమానించే అల్సర్‌ను బయాప్సీ ద్వారా కనుగొనవచ్చు. ఎండోస్కోపీ కేవలం నిర్ధారణ కోసం మాత్రమేగాక... కొన్ని సందర్భాల్లో అల్సర్ ఉన్నచోట రక్తస్రావం జరుగుతుంటే ఆపడం వంటి చికిత్స ప్రక్రియలు చేయడానికి కూడా వీలవుతుంది. అల్సర్స్‌తో దుష్ప్రభావాలివి అల్సర్స్ నుంచి రక్తస్రావం (బ్లీడింగ్) కావడం ఒక కాంప్లికేషన్ కాగా... పేగుకు రంధ్రం పడటం (పెర్ఫొరేషన్) అన్నది మరో కాంప్లికేషన్. పేగు సన్నబడటం (స్టెనోసిస్) అన్నది ఇంకో కాంప్లికేషన్. ఈ రోగుల్లో ఒక్కోసారి రక్తపు వాంతులు కావడం, మలవిసర్జన నల్లగా కావడం, తీవ్రమైన కడుపునొప్పితో వాంతులు కావడం వంటివి జరుగుతాయి. ఆకలి మందగించి కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడా అల్సర్స్ లక్షణాలే... తేడా గుర్తించాలిలా పిత్తాశయం (గాల్‌బ్లాడర్)లో రాళ్లు, పాంక్రియాటైటిస్, పాంక్రియాటిక్ క్యాన్సర్లలోనూ అల్సర్స్ ఉన్నప్పటి లక్షణాలే కనిపిస్తాయి. కాబట్టి కడుపునొప్పి, మంట వంటివి కనిపిస్తే కచ్చితమైన వ్యాధి నిర్ధారణ కోసం అల్ట్రాసౌండ్ లేదా అబ్డామినల్ సీటీ స్కాన్ పరీక్షలు చేయించాలి. అలా చేయించడం వల్ల పరిస్థితి ముదరకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇక అల్సర్ లక్షణాలు కనిపిస్తుంటే ఆ రోగులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. యాంటాసిడ్స్ తీసుకుంటున్నా కడుపులో విపరీతంగా మంట, నొప్పి తగ్గకుండటం, వాంతులు, కొంచెం తినగానే కడుపునిండిపోయినట్లు అనిపించడం, రక్తహీనత, బరువు తగ్గడం, రక్తపు వాంతులు కావడం, మలం నల్లగా ఉండడం వంటివి చోటుచేసుకుంటే తక్షణం అప్పర్ గ్యాస్ట్రో ఇంటస్టినల్ ఎండోస్కోపీ చేయించాలి. ఎండోస్కోపీ నార్మల్‌గా ఉంటే అప్పుడు అల్ట్రాసౌండ్ లేదా అబ్డామిన్ సీటీస్కాన్ చేయించాలి. పైన పేర్కొన్న అంశాలపై అవగాహన పెంచుకుంటే అల్సర్ వచ్చిన వారూ సురక్షితంగా ఉండవచ్చు. అల్సర్ లేనివారు దాన్ని నివారించుకోవచ్చు. చికిత్స ఇలా... అల్సర్ కోసం కేవలం చికిత్స మాత్రమే సరిపోదు. మందులు వాడటంతో పాటు చాలా నివారణ జాగ్రత్తలనూ పాటించాలి. పొగతాగడం, ఆల్కహాల్ మానేయడం, ఒత్తిడి నివారించుకోవడం, వేళకు తినడం, నొప్పినివారణ మందులు తీసుకోకపోవడం అవసరం. వీటితోపాటు కడుపులో యాసిడ్‌ను తగ్గించే మందులు వాడాలి. ఈ చర్యలతో అల్సర్స్ దాదాపుగా తగ్గిపోతాయి. ఒకసారి అల్సర్ గనక వచ్చిందంటే ఎప్పుడూ వస్తూనే ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. హెలికోబ్యాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా ఉంటే దాన్ని నివారించడానికి మందులు వాడాలి. ఇందుకోసం ప్రొటాన్ పంప్ ఇన్హిబిటర్స్‌తో పాటు టెట్రాసైక్లిన్, మెట్రోనిడజాల్, క్లారిథ్రోమైసిన్, అమాక్సిలిన్, బిస్మత్ సాల్ట్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. ఈ మందులతో దాదాపు 80–90 శాతం అల్సర్ తగ్గుతుంది. అయితే మందులతో తగ్గకపోతే వాళ్లలో ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా రక్తస్రావం ఆపడం లేదా స్టెనోసిస్ (పేగు సన్నబడటం) జరిగితే దాన్ని సర్జరీ ద్వారా చక్కదిద్దాల్సి ఉంటుంది. డాక్టర్ భవాని రాజు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
నైట్ డ్యూటీలు చేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం !
చాలా మంది చిన్నపిల్లలు అలా టెన్త్ లేదా ఇంటర్ పూర్తి కాగానే పై చదవులకని పక్క ఊళ్లకు వెళ్లడం మామూలే. ఒక్కసారిగా దొరికిన ఆ స్వేచ్ఛతో సిగరెట్లకు అలవాటు కావడం కూడా చాలా సాధారణమే. అలాగే బాగా ఒత్తిడితో ఉండే ఉద్యోగాలూ, కాన్ఫరెన్సులు, మీటింగుల తర్వాత రిలాక్స్ కావడం కోసం పొగతాగడం చాలా మందిలో అలా మెల్లగా అలవాటవుతుంది. ఇలాంటి వ్యవహారాలు అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకు కాస్తంత ఎక్కువ. ఇలా మొదట సరదాగా, టైమ్‌పాస్ కోసం మొదలయ్యే స్మోకింగ్, గుట్కా, ఆల్కహాల్ వంటి దురలవాట్లతోపాటు బయటి తిండి ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ బయటి ఆహారం రుచికరంగా, ఆకర్షణీయంగా కనిపించడం కోసం నూనెలు, ఉప్పుకారాలూ ఎక్కువగా వాడటంతోపాటు దేహానికి, ఆరోగ్యానికి హాని చేసే కొన్ని కృత్రిమరంగులు, రసాయనాలు వాడతారు. వాడిన నూనెలే మళ్లీ మళ్లీ వాడటమూ జరుగుతుంది. ఇవన్నీ క్యాన్సర్‌కు కారణాలయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. దురలవాట్లు, బయటితిండి ఎక్కువగా తీసుకోవడం, వృత్తిపరమైన కారణాలు, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం, వాతావరణ కాలుష్యం, నైట్‌డ్యూటీలు, రాత్రంతా నిద్ర లేకుండా పనిచేయడం, శారీరక శ్రమ చాలా తక్కువగా ఉండటం... ఈ అన్నిరకాల కారణాలతో మహిళలతో పోలిస్తే పురుషులు మరింత ఎక్కువగా క్యాన్సర్‌కు గురవుతున్నారు. పునరుత్పత్తి అవయవాలకు సంబంధించిన క్యాన్సర్లు తప్పితే... మరే క్యాన్సర్లు తీసుకున్నా అవి మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కువ. ఇటీవల పురుషులు కూడా రొమ్ముక్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం పెరిగిపోయింది. ప్రపంచంవ్యాప్తంగా క్యాన్సర్‌కు గురయ్యే వారి సంఖ్య పెరుగుతున్న ధోరణులను చూస్తే 2007 నుంచి 2030 నాటికి ఈ సంఖ్య ఇప్పటికంటే 45% ఎక్కువయ్యే అవకాశం ఉంది. అవగాహన పెంచే కార్యక్రమాలు, జాగ్రత్తలు, ముందుగానే పసిగట్టే స్క్రీనింగ్ పరీక్షలు ఎన్ని వచ్చినా క్యాన్సర్ రాకుండా నివారించగలగడం ఎవరి చేతుల్లోనూ లేదనేది సత్యం. ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధ్యయనాల ప్రకారం 2030 నాటికి ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాల సంఖ్య... అన్ని మరణాల సంఖ్య కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా. సిగరెట్, బీడీలు, పాన్, గుట్కా, ఆల్కహాల్, పొగాకు నమలడం మొదలైనవి నోటి క్యాన్సర్‌కు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే నోటి క్యాన్సర్స్ విషయంలో మన దేశమే మొదటి స్థానంలో ఉంది. ప్రతి ఏడాదీ దాదాపు 80,000 మంది వరకు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఉప్పు, కారాలు, పచ్చళ్లు, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం ఇంకా దురలవాట్లు కూడా చాలా ఎక్కువగా ఉండటం పొట్టకు సంబంధించిన క్యాన్సర్‌కు గురిచేస్తాయి. అందుకే భారతదేశంలోని పురుషులు ఈ క్యాన్సర్‌బారిన ఎక్కువగా పడుతున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. మన దేశంలోని పురుషులు నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్ క్యాన్సర్లకు గురవ్వడం చాలా ఎక్కువగానే గమనిస్తున్నాం. అలవాట్లు, జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం వంటివి క్యాన్సర్‌కు ముఖ్య కారణాలవడటంతోపాటు కొన్ని వృత్తిపరమైన కారణాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఆస్బెస్టాస్, అల్యూమినియం ఉత్పాదన కంపెనీల్లో, ఆల్కహాలిక్ బెవరేజెస్, పొగాకు ఉత్పత్తుల కంపెనీలు, రేడియమ్ ఉత్పత్తులు, రేడియో న్యూక్లియిడ్స్, చెక్కపొడి, గామా రేడియేష్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనిచేసేవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు తల, మెడ భాగాల్లో (హెడ్ అండ్ నెక్) క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అస్సలు ఎండ తగలకుండా ఏసీ రూముల్లో అలా గంటల తరబడి పనిచేయడంతోపాటు నైట్‌డ్యూటీలు, పెస్టిసైడ్స్, కెమికల్స్ వంటి వాటికి పురుషులే ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంటారు. ఇక వారు పనుల కోసం బయటికి వెళ్లినప్పుడు తేలిగ్గా దొరికే జంక్‌ఫుడ్‌ను ఎక్కుగా తీసుకుంటూ ఉంటారు. దాంతో ఊబకాయం, క్యాన్సర్ ముప్పులు పొంచి ఉంటాయి. యాభైఏళ్లు పైబడ్డాక కనిపించే ప్రోస్టేట్క్యాన్సర్ను తెలుసుకునేందుకు పీఎస్ఏ (ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజన్) అనే రక్తపరీక్ష చేయించుకోవడం మంచిది. ఎందుకంటే వీర్యంలో, మూత్రంలో రక్తం కనిపించడం, నడుము, తుంటి, పక్కటెముకల నొప్పులు, మూత్ర సంబంధమైన సమస్యల వంటి ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు కనిపించేసరికి అది ముదిరిపోయి పక్కన ఉండే ఎముకలకూ పాకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పీఎస్ఏ పరీక్షలో యాంటిజన్ పెరగడాన్ని గమనిస్తే ఇతర పరీలైన డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ (డీఆర్ఈ), ప్రోస్టేట్ బయాప్సీతో పాటు అవసరమైతే అల్ట్రాసౌండ్, బోన్‌స్కాన్, సీటీ స్కాన్, ఎమ్మారై, బయాప్సీ వంటి పరీక్షలు చేస్తారు. యాభై ఏళ్లు పైబడిన పురుషుల్లో లక్షణాలు ఉన్నా లేకున్నా పీఎస్ఏ, డీఆర్ఈ పరీక్షలు చేయించుకుని డాక్టర్ సలహా మేరకు మళ్లీ ఎంతకాలం తర్వాత చేయించుకుంటే మంచిది అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అలాగే పీఎస్ఏ పరీక్షలో మార్పులు ఎలా ఉన్నాయి, ఇంకా ఎతర పరీక్షలను ఎలాంటి లక్షణాలు కనిపించనప్పుడు చేయించుకోవాలి వంటి విషయాలపై అవగాహన పెంచుకోవడం తప్పనిసరి. ఈ కింద లక్షణాలు కనిపిస్తే పురుషులు నిర్లక్ష్యం చేయడం తగదు. అవి... తగ్గని దగ్గు, దగ్గుతో పాటు రక్తం ఆకలి, బరువు తగ్గడం నొప్పితో పాటు జ్వరం, మూత్రం ఆగి ఆగి రావడం, రక్తం కనిపించడం మలవిసర్జనలో రక్తస్రావం ,తీవ్రమైన అజీర్తి, గొంతునొప్పి, ఘనపదార్థాలు తీసుకోలేకపోవడం నోటిలో మానని పుండ్లు, ఎముకల్లో నొప్పులు పై లక్షణాలు కనిపించినప్పుడు ఏదో ఇన్ఫెక్షన్ అనో, పైల్స్ అనో, రోగనిరోధక శక్తి తగ్గిందనో, స్మోకింగ్ వల్ల కొద్దిగా దగ్గు వస్తుందనో నిర్లక్ష్యం చేయడం తగదు. ఇక వయసు పైబడ్డ తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. పురుషుల్లో ఎక్కువగా కనిపించే నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్, ప్రోస్టేట్ క్యాన్సర్లకు సంబంధించిన హెచ్చరికలు కావచ్చు. కాబట్టి మంచి జీవనశైలిపై అవగాహన పెంపొందించుకొని, ఆరోగ్యంగా జీవించడం చాలా ముఖ్యం. -
ఊపిరాడటం లేదు..!!
ఓ వైపు ధూమపానం.. మరో వైపు దుమ్ము, ధూళి, పొగతో ఊపిరితిత్తులు దెబ్బతిని శ్వాసనాళాలు మూసుకుపోయి ప్రాణాలు పోతున్నాయి. ఆయాసంతో మొదలై క్రమంగా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(సీఓపీడీ) మారి ప్రాణం తీస్తుంది. ఊపిరి తీసుకోవడానికి వారు పడే యాతన అంతా ఇంతా కాదు. మనిషి ఒక్క నిమిషం ముక్కుమూసుకుంటే తీవ్రంగా ఇబ్బంది పడతాడు. అలాంటిది సీఓపీడీతో బాధపడే వ్యక్తి శ్వాసనాళాలు మూసుకుపోయి నరకం చూస్తాడు. దీనికి అవగాహన ఒక్కటే మార్గం. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కంటే రాకుండా చూసుకోవడమే మేలని పేర్కొంటున్నారు. ఏటా నవంబర్ మూడవ బుధవారం వరల్డ్ సీఓపీడీ డేగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. – సాక్షి, కర్నూలు జిల్లాలో సీఓపీడీ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సరదాగా మొదలయ్యే సిగరెట్ కాల్చడం అలవాటుగా మారి మనిషి ప్రాణాలు తీస్తోంది. పదేళ్ల క్రితం ఈ వ్యాధి బాధితుల సంఖ్య జనాభాలో మూడు శాతంగా ఉండేది. ఇప్పుడది 6 శాతానికి పైగా పెరిగినట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఈ మేరకు జిల్లాలో దాదాపు 3 లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. 65 శాతం పొగతాగే వారిలో మిగిలిన వారు దుమ్ము, ధూళిలో పనిచేయడం, పొగ, కాలుష్యం, రసాయనాల మధ్య విధులు నిర్వహించడంతో వస్తోందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో కర్నూలు నగరంతో పాటు నంద్యాల, ఆదోని పట్టణ ప్రాంతాలు, డోన్, బేతంచర్ల వంటి పారిశ్రామిక ప్రాంతాలలో సీఓపీడీ బాధితులు అధికంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ వ్యాధి కారక లక్షణాలు, కలిగే ఇబ్బందులతో ప్రతి సంవత్సరం 2,500 మంది మరణిస్తున్నట్లు అంచనా. ప్రతి ముగ్గురు పొగతాగే వారిలో ఒకరికి భవిష్యత్‌లో తప్పకుండా ఈ వ్యాధి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి మూడు రకాలు 1. క్రానిక్ బ్రాంఖైటిస్, 2. ఎంఫీసీమా, 3. క్రానిక్ ఆస్తమా సీఓపీడీ వ్యాధి అంటే... వైద్యపరిభాషలో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీస్(సీఓపీడీ)గా ఈ వ్యాధిని పిలుస్తారు. ఇది ఊపిరితిత్తులకు వచ్చే దీర్ఘకాలిక జబ్బు. బీడి/సిగరెట్ తాగడం వల్ల 65 శాతం మేరకు వస్తుంది. ఈ జబ్బులో శ్వాసనాళాలు, లంగ్ టిష్యూ యాల్వియోలై బాగా దెబ్బతింటాయి. ఈ కారణంగా కావాల్సినంత ఆక్సీజన్ ఊపిరితిత్తులకు అందదు. దీంతో రోగి శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందిపడతాడు. వ్యాధిలక్షణాలు ఆయాస పడటం, దగ్గు, రొప్పుట, ఛాతి బిగుసుకుపోవడం, దీర్ఘకాలంగా గళ్లపడటం, శ్వాసలో పిల్లికూతలు, శ్వాసలో గురగుర శబ్దాలు, తమ పనులను తామే చేసుకోలేక పోవడం. సీఓపీడీ బాధితులు ఎవరంటే ►40 ఏళ్లు వయస్సు పైబడిన వారు ►ధూమపానం (బీడీ, సిగరెట్, చుట్టకాల్చేవారు) చేసే వారికి వస్తుంది. ప్రతి ముగ్గురు స్మోకర్లలో ఒకరికి ఈ వ్యాధి వస్తుంది. ప్యాసివ్ స్మోకింగ్ (పొగతాగే వారి పక్కనుండే వారికి) వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. ►ఈ వ్యాధి వచ్చిన తర్వాత కేవలం 5 ఏళ్లు మాత్రమే జీవిస్తారు. ►ఈ జబ్బు దీర్ఘకాలంగా బీడి/సిగరెట్ తాగే వారిలో 90 శాతం వస్తుంది. వాతావరణ కాలుష్యం వల్ల, పరిశ్రమలు, గనుల్లో పనిచేసేవారికి, దుమ్ముధూళికి గురయ్యే వారికి వస్తుంది. ►చిన్న వయస్సులోనే జన్యు సంబంధ వ్యాధుల వల్ల కూడా వస్తుంది. అల్ఫా 1 యాంటిట్రిప్సిన్ తక్కువ ఉండటం వల్ల రావచ్చు. ► ఈ జబ్బు మన దేశంలో స్త్రీల కంటే పురుషుల్లోనే అధికం 8సీఓపీడీతో కలిగే నష్టాలు ►అన్ని రంగాల్లో మనిషి పనితనం తగ్గిపోతుంది ►గుండె పెద్దదిగా మారి హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు ►పల్మనరీ హైపర్ టెన్షన్ న్యూమోథోరాక్స్ రావచ్చు ►ఆస్టియోపోరోసిస్(ఎముకలు మెత్తపడటం) రావచ్చు ►కండరాలు కరిగిపోయి సన్నబడతారు = మానసికంగా కృంగిపోవడం సీఓపీడీకి చికిత్స–నివారణ చర్యలు • పొగతాగడం మానేయాలి. • బ్రాంకోడైలేటార్స్, ఇన్హేలర్స్, స్టెరాయిడ్స్, ఛాతి వైద్యుని పర్యవేక్షణలో వాడాలి. • ఆక్సిజన్ థెరపీని దీర్ఘకాలంగా రోజుకు కనీసం 15 గంటలు తీసుకోవాలి. • ఊపిరితిత్తుల వ్యాయామం, ప్రాణాయామం చేయాలి. • ఊపిరితిత్తుల మారి్పడి శస్త్రచికిత్స, లంగ్ వాల్యూమ్ రిడక్షన్ సర్జరీలు చేయాల్సి ఉంటుంది. • వ్యాక్సిన్స్ (ఇన్‌ఫ్లూయోంజా వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్) ఇప్పించాలి. ఇన్హేలర్ల వాడకంతోనే ఉపశమనం సీఓపీడీ వ్యాధిని నివారించలేము. ఇన్హేలర్ల వాడకంతో ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు వ్యా«ధి ముదరకుండా చూసుకోవచ్చు. ఊపిరితిత్తుల సామర్ధ్యం తెలిపే పరీక్షలు ‘స్పైరోమెట్రీ’ పరీక్షలు నిర్వహించి, వ్యాధినిర్ధారణ అయితే మందులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ జబ్బు వచ్చిన తర్వాత ఎంత ఖర్చు చేసినా పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. కావున ఈ వ్యాధి లక్షణాలపై అవగాహన ఉంచుకుంటే మేలు. తద్వారా వ్యాధికి గురిగాకుండా ఉండవచ్చు. ముఖ్యంగా స్మోకర్లు ఈ వ్యాధిపట్ల జాగ్రత్తగా ఉండాలి. – డాక్టర్ నెమలి రవికుమార్‌రెడ్డి, శ్వాసకోశ వ్యాధి నిపుణులు, కర్నూలు పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది మన దేశంలో ఈ వ్యాధితో ఏటా 2,300 మంది చనిపోతున్నారు. ప్రపంచంలో మన దేశం సీఓపీడీలో రెండవ స్థానంలో ఉంది. ఈ వ్యాధిపై అవగాహన పెంచుకుంటే దీర్ఘకాలిక వ్యాధిగా వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చు. ఆయాసం మొదలైనప్పుడే జాగ్రత్త పడాలి. స్పైరోమెట్రీ పరీక్షలు చేయించుకుని మందులు వాడాలి. లేకపోతే సీఓపీడీ వ్యాధి ముదిరి రోగి పనిచేసే సామర్ధ్యం తగ్గిపోతుంది. – డాక్టర్ కె.శివకృష్ణ, శ్వాసకోశ వ్యాధి నిపుణులు, కర్నూలు -
కీళ్లెంచి మేలెంచు
ఆర్థరైటిస్ అంటే కీళ్ల దగ్గర వచ్చే రుగ్మత. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఏదో కీళ్లలో నొప్పి వచ్చింది కదా అని నిర్లక్ష్యం చేసి పెయిన్‌కిల్లర్ వేసుకుంటే సరిపోదు. చికిత్స తీసుకోకపోతే రోగి ఆయుర్దాయం 10 నుంచి 15 ఏళ్లు తగ్గిపోయే అవకాశాలూ లేకపోలేదు. ఎందుకంటే... చాలా రకాల కీళ్లవాతాల్లో ఆర్థరైటిస్ అనేది చాలా సాధారణంగా చూసే మొదటి లక్షణం. అవి ఆర్థరైటిస్ లక్షణంతో మొదలై కాలక్రమేణా శరీరంలోని ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. దాంతో కీళ్లవాతాలు పూర్తిగా ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే వీటిని తేలిగ్గా తీసుకోకూడదు. చికిత్స విషయంలో నిర్లక్ష్యం కూడదు. పైగా వీటి నిర్ధారణ కూడా అంత తేలిక కాకపోవడంతో వీలైనంత త్వరగానూ, జాగ్రత్తగానూ గుర్తించడం కూడా ఎంతో అవసరం. ఈ నెల 12న ‘వరల్డ్ ఆర్థరైటిస్ డే’ సందర్భంగా ఆ రుగ్మతపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. కీళ్ల దగ్గర తీవ్రమైన నొప్పి, విపరీతమైన వాపు, బాగా బిగుసుకుపోయినట్లుగా కావడాన్ని ఆర్థరైటిస్‌గా వ్యవహరిస్తారు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. అంటే... ఎన్నో రకాల కీళ్లవాతాలను కలుపుకొని ఆర్థరైటిస్ రుగ్మతలుగా వ్యవహరిస్తారు. వీటిల్లో కొన్ని ఎముకల సమస్యలు వయసు పెరుగుతూ పోతున్నకొద్దీ ఏర్పడే అరుగుదల కారణంగా వస్తాయి. ఇక మరికొన్ని మాత్రం మన సొంత వ్యాధి నిరోధక శక్తి మన కణాలనే పరాయివిగా పరిగణించి దాడి చేయడం వల్ల మన దేహంలోని ఎన్నో కీలకమైన కణజాలాలు, వ్యవస్థలు దెబ్బతింటాయి. దాంతో చాలా తీవ్రమైన పరిణామాలు ఏర్పడే అవకాశముంది. మనం మన రోజువారీ పనుల్లో ఏది చేయడానికైనా కీళ్లు సరిగా పనిచేయడం అవసరం. అయితే కీళ్లల్లో ఏర్పడే ఈ వ్యాధుల కారణంగా అంగవైకల్యం కూడా రావచ్చు. ఫలితంగా వృత్తులు, ఉపాధులు కోల్పోవడం వంటి సామాజిక పరిణామాలు కూడా చోటుచేసుకుంటాయి. ఈ సమస్య కారణంగా మానసికంగా, ఆర్థికంగా కూడా నష్టపోతారు. అంతేకాదు... కొన్ని రకాల కీళ్లవాతాల కారణంగా అంటువ్యాధులు, క్యాన్సర్ వంటి జబ్బులొచ్చే అవకాశాలు బాగా పెరిగిపోతాయి. ఆర్థరైటిస్‌కు కారణాలు... ముందుగా చెప్పినట్లుగా వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే ఆర్థరైటిస్ అన్న ఓ సమస్య ఒక వయసు దాటాక అనివార్యంగా అందరిలోనూ కనిపించేందుకు అవకాశం ఉంది. ఎముకల్లో అరుగుదల కారణంగా కనిపించే ఇలాంటి సమస్యను ఆస్టియో ఆర్థరైటిస్‌గా చెబుతారు. ఇది చాలా సాధారణమైన, సాహసమైన సమస్య.అయితే కొందరిలో జన్యులోపాల కారణంగా మన రోగనిరోధక వ్యవస్థ తప్పుదారి పడుతుంది. ముందుగానే చెప్పినట్లుగా ఆరోగ్యకరమైన తమ సొంతకణాలనే హాని చేయడానికి వచ్చిన పరాయి కణాలుగా పరిగణించి వాటిని తుదముట్టించడానికి మన రోగనిరోధక వ్యవస్థ... శత్రుసంహారం కోసం యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేస్తుంది. తత్ఫలితంగా... ఆ యాంటీబాడీస్ దాడి కారణంగా... ఆ వ్యక్తి తాలూకు ఎముకలు, కీళ్లు, కండరాలు, ఇక కొన్ని సందర్భాల్లో వివిధ కీలకమైన అవయవాలు సైతం దెబ్బతింటాయి. ఇదే సమయంలో పర్యావరణంలోని హాని చేసే క్రిములు, రసాయనపదార్థాలు, కాలుష్యాలు అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా అప్పటికే ఉన్న వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తాయి. దీనికి తోడు ఒకవేళ ఆ వ్యక్తికి పొగతాగడం, మద్యం అలవాటు ఉంటే... అవి వ్యాధి తాలూకు దుష్ప్రభావాలను మరింతగా పెంచుతాయి. ఇక కొన్ని రకాల ఆర్థరైటిస్లు వంశపారంపర్యంగా కొనసాగుతుంటాయి. ఆర్థరైటిస్‌లలో ప్రధాన రకాలైన ఆటోఇమ్యూన్ వ్యాధులివి... రకరకాల ఆర్థరైటిస్‌ల కారణంగా రకరకాల కీళ్ల సమస్యలు వస్తాయి. ఇలాంటి కీళ్లవాతాల్లో లూపస్ (సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్–ఎస్‌ఎల్‌ఈ), రుమటాయిడ్ ఆర్థరైటిస్ (ఆర్ఏ), గౌట్, షోగ్రన్స్ డిసీజ్, స్కీ›్లరోడర్మా వంటివి ప్రధానమైనవి. అలాగే మయోసైటిస్, వాస్కులైటిస్, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్, సోరియాసిస్, సార్కాయిడ్ వంటివి తీవ్రత చాలా ఎక్కువగా ఉండే కీళ్లవాతాలు. ఇవి కూడా ఆర్థరైటిస్లాగే మొదలవుతాయి. ఎవరిలో ఎక్కువగా కనిపిస్తాయంటే... ఇలాంటి ఆటోఇమ్యూన్ కీళ్లవాతాలు ప్రధానంగా మహిళల్లో ఎక్కువగా వస్తుంటాయి. వారి జీవితంలోని అన్ని దశల్లోనూ తీవ్రమైన ప్రభావం చూపెడతాయి. ఇక యాంకైలోజింగ్ స్పాండలైటిస్, కొన్ని రకాలైన వాస్కులైటిస్ వంటివి పురుషుల్లో ఎక్కువగా వస్తుంటాయి. సాధారణంగా... వయసు పెరగడం వల్ల వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ మినహా మిగతా రకాల కీళ్లవాతాలు ఏ వయసు వారిలోనైనా కనిపించడానికి అవకాశం ఉంది. వ్యాధి లక్షణాలు ఒక్కో రకమైన కీళ్లవాతానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అలాగే ఈ లక్షణాలన్నీ అందరిలోనూ ఒకేలా వ్యక్తం కాకపోవచ్చు కూడా. వ్యాధి తీరు, తీవ్రత, రోగి వయసు, రోగికి ఉన్న ఇతర వ్యాధులపై ఆధారపడి వ్యాధి లక్షణాలు వ్యక్తమయ్యే తీరు మారుతూ ఉంటుంది. తొలిదశలో ఏ రకమైన కీళ్లవాతంలోనైనా లక్షణాలన్నీ సాధారణమైన ఇతర వ్యాధుల్లో ఉన్నట్లుగానే ఉంటాయి. ఉదాహరణకు సాయంత్రమయ్యేసరికి జ్వరం రావడం, అలసట, నెమ్మదిగా బరువు తగ్గిపోవడం, ఆకలి మందగించడం లాంటి లక్షణాలు ప్రారంభదశలో కనిపిస్తాయి. ఈ సాధారణ లక్షణాలు ఇతర వ్యాధుల్లో సైతం కనిపిస్తుండటం వల్ల వీటిని ఆర్థరైటిస్‌గా గుర్తించడం కొంచెం కష్టమైన పని. కీళ్ల దగ్గర విపరీతమైన నొప్పి, వాపు వచ్చి... అక్కడ ఎర్రగా కందిపోయినట్లుగా అవుతుంది. ఈ లక్షణాలు కనిపించేసరికి రోగి పరిస్థితి దిగజారిపోయి సొంతపనులను కూడా చేసుకోలేని స్థితి వస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య ముఖ్యంగా చిన్న కీళ్ల మీద తన ప్రభావం చూపిస్తే... యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనేది వెన్నుపూసలు, పెద్దకీళ్లపై ప్రభావం చూపిస్తుంది. కీళ్లవాతం కారణంగా వచ్చే సంక్లిష్ట సమస్యలు ►ఆర్థరైటిస్ కాలక్రమేణా ఎన్నో రకాలైన సంక్లిష్టమైన సమస్యలకు దారితీస్తుంది. ఎముకలను బాగా పెళుసుగా తయారు చేస్తుంది. దాంతో చిన్నపాటి దెబ్బకు సైతం, ఒక్కోసారి ఎలాంటి గాయాలు లేకపోయినా ఎముక విరిగిపోతుంది. ►నరాల మీద ఒత్తిడి కలిగించి, స్పర్శలో మార్పు రావడం, కాళ్లూ–చేతులు పట్టుకోల్పోవడం జరుగుతుంది. ►ఈ సమస్య వచ్చిన కొందరిలో నోరు, కళ్లు విపరీతంగా పొడిబారిపోతాయి. ►గుండెజబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యలూ తలెత్తుతాయి. వ్యాధి నిర్ధారణ... తొలిదశలో వ్యాధి నిర్ధారణ ఒకింత కష్టమైన పనే. అయినప్పటికీ రుమటాలజిస్ట్లు ఈ వ్యాధికి సంబంధించిన నిపుణులు కావడం వల్ల రోగి లక్షణాలనూ, కొన్ని వైద్యపరీక్షల తర్వాత అవసరమైన రక్తపరీక్షలు చేయించి, వ్యాధిని ప్రారంభదశలోనే గుర్తిస్తారు. అయితే ఒక్కోసారి ఈ పరీక్షలలో సానుకూల ఫలితాలు ఉన్నంత మాత్రన కూడా వ్యాధి ఉన్నట్లు కాదు. ఈ పరీక్షలలో ఎన్నో ‘నాన్–రుమటలాజికల్’ జబ్బులు కూడా ‘ఫాల్స్ పాజిటివ్’ ఫలితాలను ఇవ్వవచ్చు. అంటే వ్యాధి లేకపోయినా ఉన్నట్లుగా తప్పుడు రిపోర్టులు రావచ్చు. అలాగే ఒకే జబ్బులో ఎన్నో యాంటీబాడీస్ పాజిటివ్‌గా ఉండవచ్చు. అందువల్లనే రుమటాలజిస్టులు తమ అనుభవంతో అసలైన వ్యాధినీ... వ్యాధిలేకపోయినా ఉన్నట్లుగా కనిపించే ఫాల్స్పాజిటివ్ అంశాలను గుర్తించి, తగిన మందులను సూచిస్తారు. అయితే ఒక్కోసారి ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోకపోవడం వల్ల వ్యాధి లేనివారికి కూడా ఉన్నట్లు పరిగణించి మందులు వాడితే అనర్థాలు కలిగే అవకాశం ఉంది. అందుకే ఈ విషయంలో రుమటాలజిస్టులను సంప్రదిస్తే వారు చాలా నిశితంగా (మెటిక్యులస్‌గా) రోగిని పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేస్తారు. చికిత్స ఆర్థరైటిస్‌కి కారణమైన కీళ్లవాతాన్ని బట్టి చికిత్స విధానాలు ఉంటాయి. చాలావాటికి కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులతోపాటు, చిన్న మోతాదుల్లో స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. జబ్బు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పెద్దమోతాదులో స్టెరాయిడ్స్ వాడటంతో పాటు ‘డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్’ అనేవి మొదలుపెట్టాలి. దాదాపు 10 – 20 శాతం మందిలో ఎన్ని రకాల మందులు వాడుతున్నప్పటికీ ఒక్కోసారి జబ్బుతీవ్రతను అదుపు చేయడం చాలా కష్టమవుతుంది. అలాంటివారిలో బయలాజిక్స్ అనే మందులను రుమటాలజిస్టులు సూచిస్తారు. అయితే అన్ని రకాల కీళ్లవాతాలకూ ఒకేరకం బయలాజిక్స్ పనిచేయవు. బయాలజిక్స్ను సూచించే సమయంలో... వ్యాధి తీవ్రత, దాని కారణంగా ప్రభావితమైన అవయవాలతో పాటు రోగి బరువు, స్త్రీ/పురుషుడు అన్న అంశం, మహిళలైతే గర్భవతా అనే అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చికిత్సతో పాటు తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలు ►లక్షణాలు కనిపించడం మొదలైన కొన్ని వారాల నుంచి నెలల వ్యవధిని ‘విండో ఆఫ్ ఆపర్చునిటీ’ అంటారు. ఈ సమయంలో రుమటాలజిస్ట్లను సంప్రదించి, తగిన చికిత్స పొందే వ్యక్తులలో రుమాటిక్ ప్రభావాల కారణంగా కలిగే దీర్ఘకాలిక సమస్యలను అరికట్టవచ్చు. ►క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా చికిత్సలో ఒక భాగం. దీనివల్ల కీళ్లు వంకర్లు పోవు. ►ఉండాల్సినదాని కన్నా ఎక్కువగా ఉన్న బరువును తగ్గించుకోవాలి. ఒంటి బరువును అదుపులో పెట్టుకోవడం వల్ల మందులు సమర్థంగా పనిచేయడమే కాకుండా గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. ► పొగతాగడం, మద్యపానం అలవాటును పూర్తిగా మానేయాలి. ►క్యాల్షియమ్ సమృద్ధిగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవాలి. ►కీళ్లవాతానికి సంబంధించిన అపోహలను పక్కన పెట్టాలి. ►కీళ్లలో నొప్పి వంటివి కనిపిస్తే... దాన్ని తేలిగ్గా తీసుకోకుండా, అది ఆర్థరైటిస్‌కు సంబంధించిన వ్యాధేమోనని అనుమానించి రుమటాలజిస్టులను సంప్రదించి, వ్యాధిని తొలిదశలోనే తుంచేస్తే... ఎన్నో అనర్థాలు తప్పుతాయనీ, జీవనశైలి, జీవననాణ్యత మెరుగుపడతాయని గుర్తుంచుకోవడం మంచిది. గుర్తించడం ఎలా... ►ఇంగ్లిష్ అక్షరం ‘ఎస్’తో మూడు ‘ఎస్’ల సహాయంతో ఆర్థరైటిస్‌ను తేలిగ్గా గుర్తించవచ్చు. అదెలాగంటే... ►స్వెల్లింగ్ (వాపు) – చిన్న కీళ్లదగ్గర వాపు రావడం. ►స్టిఫ్నెస్ (బిగదీసుకుపోవడం) – ఉదయాన్నే30 నిమిషాలకు పైనే కీళ్లు బిర్రుగా పట్టుకుపోవడం/బిగుసుకుపోవడం. స్క్వీజ్: చేతిని చిన్నగా నొక్కినా (స్క్వీజ్ చేసినా) విపరీతమైన నొప్పి రావడం. పైన పేర్కొన్న మూడు ‘ఎస్’లతో కూడిన లక్షణాలు కనిపిస్తే అప్పుడు ఆర్థరైటిస్ సమస్య ఉండే అవకాశాలు ఎక్కువ. అప్పుడు దాన్ని ఆర్థరైటిస్ సమస్య కావచ్చేమోనని అనుమానించాలి. ►చర్మంపై ఎర్రని మచ్చలు, దద్దుర్లు, మాననిపుండ్లు, చర్మం కుళ్లిపోవడం అనేవి లూపస్‌తో పాటు వాస్కులైటిస్ వంటి కీళ్లవాతాలలో ఎక్కువగా జరుగుతుంటుంది. లూపస్ వ్యాధిగ్రస్తుల్లో ముక్కుకు ఇరువైపులా బుగ్గల మీద సీతాకోకచిలుక ఆకృతితో ‘బటర్‌ఫ్లై రాష్’ అనే కండిషన్ వచ్చి అక్కడ కందిపోయినట్లుగా కనిపిస్తుంది. ►వైద్యచికిత్స తీసుకోని రుమటాయిడ్ వ్యాధిగ్రస్తుల్లో చర్మం కింద బొడిపెలు ఏర్పడతాయి. ►మరికొందరిలో చలికాలంలో చల్లటినీళ్లు తగిలినప్పుడు వేళ్లు నీలంగా, ఎర్రగా, తెలుపురంగులోకి మారిపోతాయి. ఇలా కావడాన్ని ‘రెనాడ్స్ ఫినామినా’ అంటారు. ఇది అనేక రకాల కీళ్లవాతాల్లో కనిపిస్తుంది. ►లూపస్ అనే సమస్యలో... నోటిలో కురుపులు, పూత రావడం, జుట్టు రాలిపోవడం, మహిళల్లోనైతే తరచూ గర్భస్రావాలు కావడం వంటివి కనిపిస్తాయి. ఈ వ్యాధి ముదిరినప్పుడు ఊపిరితిత్తులపైన, గుండెపైన ఒక పొర ఏర్పడి, వాటి చుట్టూ నీరు చేరుతుంది. దాంతో ఊపిరితీసుకునే సమయంలో నొప్పి రావడంతో పాటు దగ్గు, ఆయాసం కనిపిస్తాయి. ఇవే లక్షణాలు టీబీలోనూ కనిపించడం వల్ల ఒక్కోసారి రోగి తాలూకు వ్యాధి నిర్ధారణ తప్పుగా జరిగి... టీబీ మందులు వాడటం కూడా సంభవించవచ్చు. టీబీ మందులు ఎంత వాడినా మెరుగుదల కనిపించకపోవడం, రోగి తాలూకు ఇతర లక్షణాలు బయటపడటం జరిగినప్పుడు మాత్రమే కీళ్లవాతం అనే అనుమానం వచ్చి అప్పుడు రుమటాలజిస్ట్ను సంప్రదిస్తారు. అయితే అప్పటికే వ్యాధి తీవ్రరూపం దాల్చి అనేక సమస్యలకు కారణమవుతుంది. ►మరికొందరిలో రక్తకణాలు తగ్గిపోవడం, తరచూ రక్తహీనత కలగడం, కామెర్లు రావడం కూడా జరుగుతాయి. ►చిన్న వయసులోనే కిడ్నీ సమస్య రావడం, అధిక రక్తపోటు వంటివి కూడా కీళ్లవాతం తాలూకు సంకేతాలే. ►కీళ్లవాతం కారణంగా మెదడు, నరాలు ప్రభావితమైనప్పుడు... తరచూ ఫిట్స్ రావడం, అకస్మాత్తుగా చూపుపోవడం, పక్షవాతం రావడం వంటి విపరీత పరిణామాలు చోటుచేసుకుంటాయి. ►సాధారణంగా నడుమునొప్పి అనేది వయసు మీద పడ్డాక కనిపించే సమస్య. అలా కాకుండా యుక్తవయసులోనే విపరీతమైన నడుమునొప్పి. మెడ, మడమల నొప్పులతో పాటు నిద్ర లేవగానే నడుము దగ్గర బిర్రుగా పట్టేసినట్లు ఉండటం, తరచూ విరేచనాలు లాంటి లక్షణాలు స్పాండైలోఆర్థరైటిస్లో కనిపిస్తాయి. ►జ్ఞాపకశక్తి మందగించడం, రోజువారీ జీవన కార్యకలాపాలపై ఆ ప్రభావం కనపడటం అన్నది రుమాటిక్ వ్యాధుల్లో కనిపించే ప్రధాన లక్షణం. ►రోగులకు ఇటు శారీరకంగా, అటు మానసికంగా బలహీనపరిచే వ్యాధుల్లో కీళ్లవాతాలు చాలా ముఖ్యమైనవి. చికిత్స కూడా ఒకింత సంక్లిష్టంగానే ఉంటుంది. దాంతో ఈ రోగుల్లో ఆందోళన, నిరాశ, కుంగుబాటు (డిప్రెషన్) కారణంగా ఆత్మహత్యాధోరణులు ఎక్కువగా కనిపిస్తాయి. అపోహలూ – వాస్తవాలు ►విశ్రాంతి వల్ల కీళ్లవాకీళ్ల వాతాన్ని నివారించవచ్చునని కొందరు అపోహపడతారు. ఇది పూర్తిగా అవాస్తవం. కీళ్లవాతం వచ్చినవారిలో ఒంటి కదలికలు ఉండేలా నడక వంటి వ్యాయామాలు చేయాలి. ►ఆర్థరైటిస్ ఒక వయసు దాటాకే కనిపిస్తుందని కొందరి అపోహ. అది పూర్తిగా వాస్తవం కాదు. ఆస్టియో ఆర్థరైటిస్ మాత్రమే వయసు పెరిగాక కనిపిస్తుంది. మిగతావి ఏ వయసువారిలోనైనా కనిపించవచ్చు. ►పిల్లలకు ఆర్థరైటిస్ రాదని కొందరు అపోహపడుతుంటారు. కానీ కొన్ని ఆర్థరైటిస్ సమస్యలు పిల్లల్లోనూ కనిపించవచ్చు. ►ఆర్థరైటిస్ వచ్చినవారు దుంపకూరలూ, మాంసాహారం తినకూడదని కొందరు భావిస్తారు. అయితే అది వాస్తవం కాదు. పోషకాహారలోపం ఏర్పడకుండా ఉండేందుకు వాటిని తీసుకోవచ్చు. ►దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలన్నది మరో అపోహ. కాని ఇది వాస్తవం కాదు. డాక్టర్ విజయ ప్రసన్న పరిమి సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్. -
తీవ్రమైన దగ్గు... ఆయాసం... పరిష్కారం చెప్పండి.
నా వయసు 42 ఏళ్లు. నేను చేసే పనిలో టార్గెట్లతో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. చిన్నప్పట్నుంచీ సిగరెట్లు కాల్చే అలవాటు ఉంది. ఇప్పుడు నా వృత్తిలో బాగా ఒత్తిడి ఉండటం వల్ల సిగరెట్లు కాల్చడం కూడా ఎక్కువైంది. ఇటీవల నాకు తీవ్రంగా ఆయాసం, దగ్గు వస్తోంది. దాంతో సరిగా నిద్రపట్టడం లేదు. సాధారణ సమస్యే కదా, అదే తగ్గిపోతుందిలే అని పట్టించుకోలేదు. ఇప్పుడు ఉపశమనం కోసం ఎన్ని మందులు వాడిన ఫలితం కనిపించడం లేదు. దగ్గు, ఆయాసం తగ్గకపోగా రోజురోజుకూ మరింత పెరుగుతోంది. నాకు తగిన పరిష్కారం సూచించండి. సిగరెట్లు కాల్చడం ఒత్తిడిని తగ్గించకపోగా అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలగజేస్తుంది. మొదట్లో సరదాగా ప్రారంభమయ్యే అలవాటు వదులుకోలేని వ్యసనంగా మారి మీ ఆరోగ్యాన్నీ పూర్తిగా దెబ్బతీస్తుంది. మీరు రోజుకు మూడు పాకెట్ల వరకూ సిగరెట్లు కాలుస్తున్నట్లు చెప్పారు. అంత ఎక్కువ సంఖ్యలో సిగరెట్లు కాల్చడం మీ ఆరోగ్యంపై చాలా తీవ్రమైన దుష్ప్రభావం తప్పక చూపుతుంది. ఊపిరితిత్తులు పాడైపోయి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఊపిరితిత్తుల క్యాన్సర్, గొంతుక్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. పొగతాగడం వల్ల శరీరంలోని రక్తనాళాలు పూడుకుపోయి గుండె సంబంధిత సమస్యలు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ), నిద్రలేమి వంటి సమస్యలూ వచ్చే అవకాశం ఉటుంది. కాబట్టి మీరు వెంటనే సిగరెట్లు కాల్చడం మానేసి వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకోండి. పొగతాగడం వల్ల ఎలాంటి ప్రయజనమూ ఉండదు. సిగరెట్ ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తుందనేది కేవలం ఒక అపోహ మాత్రమే. మీరు ఎంత త్వరగా పొగతాగడం మానేస్తే అది మీ ఆరోగ్యానికి అంత మంచిది. టీబీ పూర్తిగా తగ్గుతుందా? మా అమ్మ వయసు 58 ఏళ్లు. ఆమె గత ఆరేళ్లుగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ రక్తహీతన (అనీమియా)కు గురైంది. ఇటీవలే పరీక్షలు చేయిస్తే ఆమెకు టీబీ ఉన్నట్లు తెలిసింది. టీబీ పూర్తిగా నయమవుతుందా? మాకు తగిన సలహా ఇవ్వండి. సరైన రీతిలో చికిత్స తీసుకుంటే టీబీ వ్యాధి పూర్తిగా, శాశ్వతంగా నయమవుతుంది. ఇది మైకోబ్యాక్టీరియమ్ ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా సూక్ష్మజీవి వల్ల సంక్రమించే వ్యాధి. జ్వరం, దగ్గు వస్తూ తెమడపడుతుండటం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. టీబీకి ఐసోనియాజిడ్, రిఫామ్పిసిన్, పైరజినమైడ్, ఎథాంబుటాల్ అనే నాలుగు రకాల మందులను కాంబినేషన్స్‌లో ఉపయోగించి చికిత్స చేస్తారు. ఈ మందుల మోతాదును రోగి బరువును పరిగణనలోకి తీసుకొని నిర్ణయిస్తారు. పూర్తి చికిత్స కోసం కనీసం ఆర్నెల్లు మందులు వాడాల్సి ఉంటుంది. మొదటి రెండు నెలలను ఇంటెన్సివ్ ఫేజ్ అంటారు. ఇందులో నాలుగు రకాల మందులనూ ఉపయోగిస్తారు. చివరి నాలుగు నెలలనూ కంటిన్యూయేషన్ ఫేజ్ అంటారు. ఇందులో మూడు మందులు వాడతారు. అవి... ఐసోనియజిడ్, రిఫామ్పిసిన్, ఎథాంబుటాల్ అనే మందులు. టీబీ చికిత్సలో రోగి ఓపికగా పూర్తికాలం పాటు మందులు వాడి తీరాలి. కొన్నాళ్ల తర్వాత లక్షణాలు తగ్గినట్లు కనపడగానే, తనకు వ్యాధి నయమైనట్లుగా భావించి, మందులను వదిలేస్తే వ్యాధి మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఉంది. అందుకే రోగి మందులు వాడుతూ క్రమం తప్పకుండా డాక్టర్ ఫాలో అప్‌లో ఉండాలి. చికిత్స సమయంలో రోగి మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. చాలామందిలో ఆకలి తగ్గడం, తగిన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోకపోవడం వల్ల రోగులు బరువు తగ్గుతారు. అయితే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే గుడ్ల వంటివి తీసుకోవడం వల్ల రోగులు మెరుగ్గా కోలుకుంటారు. డయబెటిస్ వ్యాధి కూడా టీబీతో బాధపడే రోగులను ప్రభావితం చేసే అంశమవుతుంది. ఎందుకంటే చక్కెరను సక్రమంగా అదుపులో పెట్టుకోని రోగుల్లో వ్యాధి నయం కావడం అంత తేలిక కాదు. ఇక చివరగా టీబీ వచ్చిన రోగులకు తప్పనిసరిగా హెచ్ఐబీ స్క్రీనింగ్ పరీ చేయించాలి. ఎందుకంటే వ్యాధి నిరోధకత తగ్గడం వల్ల చాలామందిలో టీబీ బయటపడుతుంది. వ్యాధి నిరోధకత తగ్గిందంటే అది హెచ్ఐవీ వల్లనా అనేది తెలుసుకొని, ఒకవేళ హెచ్ఐవీని కనుగొంటే దానికి కూడా చికిత్స చేయించాల్సి ఉంటుంది. ఇక మీ అమ్మగారి రక్తహీనత సమస్యకు వస్తే అది క్రమంగా ట్యాబ్లెట్లతో పరిష్కరించవచ్చు. ఒకవేళ ఆమెకు రక్తహీనత చాలా తీవ్రంగా ఉంటే రక్తం ఎక్కించడం అవసరం కావచ్చు. డాక్టర్ జి. హరికిషన్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ చెస్ట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
హార్ట్ జబ్బులకు హాల్ట్ చెబుదాం
ప్రపంచంలో 1900 కి ముందు గుండెజబ్బులు అంటే పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. గుండెజబ్బులతో చనిపోవడం అన్నది కనిపించేదే కాదు. అయితే 1900 నుంచి 1960 వరకు ప్రపంచంలోని అన్ని దేశాలలో గుండెజబ్బులు విపరీతంగా పెరిగిపోయాయి. మిగతా అన్ని రకాల కారణాలతో వచ్చే మరణాలతో పోలిస్తే గుండెజబ్బు మరణాల సంఖ్య చాలా విపరీతంగా పెరిగిపోయింది. అయితే 1960ల తర్వాత అభివృద్ధి చెందిన దేశాల్లో గుండెజబ్బు మరణాలు బాగా తగ్గుముఖం పట్టాయి. గుండెజబ్బుకు గల కారణాలూ, దాని లక్షణాలు తెలియడంతో పాటు దాన్ని నివారణ గురించి అభివృద్ధి చెందిన దేశాల వారికి బాగా అవగాహన పెరగడం వల్ల అక్కడ గుండెజబ్బుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే భారతదేశంలో ఆ పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. ఈ నెల 29న ప్రపంచ గుండె దినోత్సవం (వరల్డ్ హార్ట్ డే) సందర్భంగా మన దేశంలో గుండెజబ్బుల పరిస్థితి గురించి, వాటిని నివారించే విషయంలో మనం తీసుకోగల జాగ్రత్తలు/నివారణ చర్యల గురించి కాస్తంత విపులంగా పరిశీలిద్దాం. అన్ని విషయాల్లోనూ ఉన్నట్లే... జబ్బులు వాటి నివారణ విషయాల్లోనూ ఒక పరిణామక్రమం ఉంటుంది. ఈ పరిణామక్రమంలోని దశలో అన్ని దేశాల్లోనూ ఒకేలా ఉండకపోవచ్చు. కానీ దాదాపుగా అన్నిదేశాల్లోనూ మొదటో... తర్వాతో ఇవే దశలు కొనసాగుతాయి. మొదటి దశలో వచ్చే జబ్బులు ఉదాహరణకు ప్రతిదేశంలోనూ మొదట అంటురోగాలు (కమ్యూనికబుల్ డిసీజెస్), పౌష్టికాహార లోపాలతో వచ్చే జబ్బులు బాగా ఎక్కువగా ఉంటాయి. మన అవగాహనతోనూ... మందులను కనుగొనడంతోనూ, మన ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడం ద్వారా జీవన నాణ్యతను మరింతగా పెంచుకోవడం వల్ల ఈ జబ్బులు క్రమంగా తగ్గిపోతాయి. కమ్యూనికబుల్ డిసీజెస్‌కు కలరా, ప్లేగు వంటి వాటిని ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఇక పోషకాహార లోపాల వల్ల వచ్చే వాటికి బెరీబెరీ వంటి జబ్బులు ఉదాహరణగా నిలుస్తాయి. మానవాళి యాంటీబ్యాక్టీరియా మందులు కనుకున్న తర్వాత కమ్యూనికబుల్ డిసీజెస్ వంటి కలరా, ప్లేగు వంటివి దాదాపుగా కనుమరుగయ్యాయి. దాదాపు అన్ని అభివృద్ధి చెందిన దేశల్లోనూ నాణ్యమైన నీటి సరఫరాతో నీరు కలుషితం కావడం వల్ల వచ్చే జబ్బులు తగ్గాయి. అలాగే మెరుగైన ఆహార పంపిణీ వల్ల పోషకాహార లోపంతో వచ్చే జబ్బులన్నీ బాగా అభివృద్ధి చెందిన పాశ్చాత్యదేశాల్లో పూర్తిగా మటుమాయమయ్యాయనే చెప్పవచ్చు. అయితే భారతదేశం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశం కావడంతో అంటురోగాలు ఇప్పటికీ అడపాదడపా ప్రబలుతూనే ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లాగా మనం వాటిని ఇంకా పూర్తిగా అరికట్టలేకపోయాం. రెండో దశలో వచ్చే జబ్బులు ఆ తర్వాతి వంతు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ది. అంటే ఇవి అంటురోగాలు కాని జబ్బులన్నమాట. ఈ తరహా జబ్బులకు ప్రధానమైన ఉదాహరణగా గుండెజబ్బులను చెప్పవచ్చు. హైబీపీ, డయాబెటిస్ వంటి జీవనశైలికి సంబంధించిన జబ్బులూ ఈ కోవకే చెందుతాయి. అవి మళ్లీ గుండెజబ్బులు మరింత పెరిగేందుకు దోహదం చేస్తాయి. వ్యాధులలో రెండో దశ అయిన ఈ గుండెజబ్బుల నివారణ విషయానికి వచ్చే సరికి... తమ దేశాల్లో మొదటిదశ జబ్బులు లేకపోవడం వల్ల ఆయాదేశాలు గుండెజబ్బుల వంటి రెండోదశ జబ్బులపై పూర్తిగా దృష్టిపెట్టగలిగాయి. కానీ మనం ఇంకా అంటురోగులతో పోరాడుతూనే ఉన్నాం. స్వచ్ఛమైన నీటి సరఫరా, దోమల నివారణ, మురుగునీటి పారుదల వంటి మౌలిక సదుపాయాల కల్పన్న అన్నది భారతదేశంలోని ఇంకా అన్ని ప్రాంతాల్లోనూ పూర్తిగా జరగనందువల్ల ఒకవైపు మొదటిదశ జబ్బులైన అంటువ్యాధులతో పోరాడుతూనే ఇంకా గుండెజబ్బుల వంటి రెండోదశ జబ్బులతోనూ పోరు చేయాల్సివస్తోంది. పైగా భారతదేశంలో పౌష్టికాహారం ఇంకా పూర్తిగా అందరికీ అందుబాటులోకి రాకపోవడంతో మొదటిదశలో వచ్చే పౌష్టికాహార లోపాల కారణంగా వచ్చే జబ్బులూ మనదేశంలో కనిపిస్తూనే ఉన్నాయి. దాంతో పాశ్చాత్యదేశాల కంటే ఈ విషయంలోనూ కాస్తంత వెనకబడే ఉన్నాం. ఫలితంగా మనదేశంలో మొదటి దశ వ్యాధులు పూర్తిగా తగ్గకముందే రెండోదశ వ్యాధులతోనూ ద్విముఖ పోరాటం చేయాల్సి వస్తోంది. ఒకేసారి ఇద్దరు శత్రువులతో పోరాడుతున్నందున మన అడుగులు తడబడుతూనే సాగుతున్నాయని చెప్పవచ్చు. జన్యుపరమైన అంశాలూ కారణాలేనా? ఇవన్నీ బయటి పరిస్థితుల కారణంగా గుండెజబ్బులకు దోహదపడే అంశాలైతే మరికొన్ని జన్యుపరమైన కారణాలూ ఉన్నాయి. ఉదాహరణకు అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న మిగతా జాతీయులతో పోలిస్తే... భారత జాతీయులకు అధికంగా గుండెజబ్బులు వస్తున్నాయని అధ్యయనాల్లో తేలింది. అలాగే ఇంగ్లాండ్ వంటి యూరోపియన్ దేశాల్లో స్థిరపడ్డ భారతీయుల్లోనే గుండెజబ్బులు ఎక్కువ. పాశ్చాత్యదేశాల్లో స్థిరపడ్డ భారతీయులలో అక్కడి జీవనశైలికి అలవాటు పడ్డవారిలో కూడా భారతీయుల్లో జబ్బులు మరింతగా ప్రబలాయి. ఈ అన్ని పరిశోధనలూ, పరిశీలనల కారణంగా భారతీయుల్లో జన్యుపరంగా గుండెజబ్బులు ఎక్కువగానే వస్తాయని, కాబట్టి భారతీయుల్లో వీటిని నివారణ అంతగా సాధ్యం కాకపోవచ్చని తొలుత అధ్యయనవేత్తలు భావించారు. ఇదీ ఒక ప్రధానమైన ఆశారేఖ కానీ గుండెజబ్బుల విషయంలో మనదేశంలో నిశితంగా పరిశీలిస్తే... పట్టణప్రాంతాల్లో ఉన్న భారతీయులకూ, పల్లెల్లో ఉన్నవారికీ మధ్య చాలా స్పష్టమైన వ్యత్యాసం కనబడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వ్యాయామం ఉండటంతో పాటు ఒత్తిడి తక్కువగా ఉండే జీవనశైలి, ప్రాసెస్డ్ ఆహారం పట్టణాల్లో ఎక్కువగా అందుబాటులో ఉండి, పల్లెల్లో లేకపోవడం వంటి కారణాలతో పట్టణవాసుల్లో గుండెజబ్బులు ఎక్కువగానూ, పల్లెల్లో అంతగా లేకపోవడం నిపుణల దృష్టికి వచ్చింది. ఇది ఒక ఆశారేఖ. దీనితో తేలుతున్న విషయం ఏమిటంటే... మన జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా మనం మనకున్న జన్యులోపాలను అధిగమించి గుండెజబ్బులను తగ్గించుకోవచ్చు! ముందుంది ఒక పెనుసవాలు అయితే ఇక్కడ మన ముందు ఒక పెనుసవాలు కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పొగతాగే అలవాటు ఎక్కువగానే ఉంది. ఒకప్పుడు పట్టణాల్లో కనిపించే ప్రాసెస్డ్ ఆహారాలు, కూల్డ్రింకులు, జంక్ఫుడ్స్ వంటివి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ చేరుతున్నాయి. ఈ విషయంలో పట్టణప్రాంతాలకూ, పల్లెలకు ఉన్న తేడా చెరిగిపోవడానికి ఎక్కువ కాలం పట్టదు. అలాగే ఒకసారి శారీరక శ్రమ తగ్గించే వస్తువులు (గాడ్జెట్స్ ఉదాహరణకు మిక్సీ, గ్రైండర్, వాషింగ్ మెషిన్ వంటివి), యాంత్రీకరణ వల్ల పల్లెల్లోనూ ఇప్పుడు వ్యాయామం తగ్గిపోతోంది. అలాగే వినియోగదారులు పెరగడం, రవాణా సదుపాయాలు మెరుగుకావడం వంటి అంశాలతో ఇప్పుడు కన్సూ్యమరిజమ్ కారణంగా ప్రాసెస్డ్ ఆహారం లభ్యత కూడా ఇప్పుడు పల్లెల్లో బాగా పెరుగుతోంది. ఇది వేగంగా జరుగుతున్నందున గుండెజబ్బుల విషయంలో పట్టణాలకూ, పల్లెలకూ ఉన్న తేడా వేగంగా చెరిగిపోవడానికి చాలాకాలం పట్టదు. ఇప్పటికీ మనం మొదటిదశ జబ్బులతోనూ, రెండోదశ వ్యాధులతోనూ ఒకేసారి పోరాడుతున్న ప్రస్తుత నేపథ్యంలో పట్టణాలకూ, పల్లెలకూ ఉన్న వ్యత్యాసం తగ్గిపోతే మనకిప్పుడు ఉన్న ఆర్థిక వనరులతోగానీ, లేదా వైద్య సదుపాయాల వంటి వనరులుగానీ ఈ తేడా చెరిగిపోవడంతో పెరిగిపోయే వ్యాధిగ్రస్తుల చికిత్సను మనం ఒకేసారి ఎదుర్కోవడానికి మనకున్న సామర్థ్యం పూర్తిగా సరిపోకపోవచ్చు. మన ఆశారేఖను వినియోగించుకోవాలిలా... పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని గుండెజబ్బుల విస్తృతిలో ఉన్న తేడాలను బట్టి మనం ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా గుండెజబ్బులను అరికట్టుకోవచ్చని తేలింది. కాబట్టి... మనమీ ఆశారేఖను సమర్థంగా వినియోగించుకోవాలి. అందుకు ఈ కింది నివారణ చర్యలు/జాగ్రత్తలు తీసుకోండి. నివారణ పొగ తాగడం మానండి: పొగ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. మీ ఇంట్లో ఎవరికైనా ఆ అలవాటు ఉన్నా, మాన్పించండి. ఒకసారి హార్ట్ ఎటాక్ కానీ, గుండె జబ్బు కానీ వస్తే, దీర్ఘకాలం ఇబ్బంది పెట్టే దానితో బాధపడడం కన్నా, పొగ తాగే అలవాటు మానేయడమే సుఖం. పౌష్టికాహారం తీసుకోండి: గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే, పౌష్టికాహారం తీసుకోవాలి. మీరు తినే ఆహారాన్ని బట్టే – ఒంట్లో కొలెస్ట్రాల్ పెరగడం, రక్తపోటు రావడం, షుగర్, అధిక బరువు రావడం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కానీ, విటమిన్లు, మినరల్స్, పీచు పదార్థం, ఇతర పోషకాలు ఉంటూనే, క్యాలరీలు మాత్రం తక్కువుగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు, చేపలు, కాయధాన్యాలు తినాలి. స్వీట్లు, కూల్‌డ్రింక్‌లు, వేటమాంసం (రెడ్ మీట్) తక్కువ తినాలి. కొలెస్ట్రాల్ తగ్గించుకోండి: గుండెకు రక్తం తీసుకువెళ్లే రక్తనాళాల్లో కొవ్వు చేరితే, గుండె జబ్బులు వస్తాయి. కాబట్టి, వీలైనంత వరకు శ్యాచురేటెడ్ కొవ్వు పదార్థాల లాంటివి తినకూడదు. ఒంట్లో చెడ్డ (ఎల్.డి.ఎల్) కొలెస్ట్రాల్, మంచి (హెచ్.డి.ఎల్) కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్ ఎంతెంత స్థాయిలో ఉన్నాయో, ఎప్పటికప్పుడు చెక్ చేయించుకొని, జాగ్రత్తపడాలి. రోజూ శారీరక శ్రమ చేయండి : రోజూ సగటున 45 నిమిషాల చొప్పున, వారానికి కనీసం అయిదారు రోజులు వ్యాయామం చేయాలి. దీని వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. బరువు చూసుకోండి : స్థూలకాయం, అధిక బరువు వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. స్థూలకాయం అంటే హై కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, టైప్–2 డయాబెటిస్‌కు ముందు సూచన అయిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటివి వస్తాయి. ఇవన్నీ గుండె జబ్బులకు దారితీసేవే. కాబట్టి, సరైన ‘బాడీ మాస్ ఇండెక్స్’ (బీఎమ్ఐ) ఉండేలా చూసుకోవాలి. మానసిక ఒత్తిడి (స్ట్రెస్) తగ్గించుకోండి: గుండె జబ్బులు రావడానికీ, ఆ వ్యక్తి మానసిక ఒత్తిడికీ స్పష్టమైన సంబంధం ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. స్ట్రెస్‌లో ఉన్నవాళ్లు అతిగా తినడం, ఎక్కువగా పొగ తాగడం లాంటివి చేసే అవకాశం ఉంది. అలాగే, స్ట్రెస్ వల్ల యువతీ యువకుల్లో మధ్యవయసులోనే అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. మద్యపానం మానేయండి : అతిగా మద్యం తాగడం కూడా రిస్కే. దాని వల్ల రక్తపోటు పెరుగుతుంది. కార్డియోమయోపతీ, గుండెనొప్పి, క్యాన్సర్, ఇతర వ్యాధులు వస్తాయి. గుండెజబ్బుల విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఒక్కటే. మనం నివారణకు పెట్టే ఖర్చుతో పోషకాహారాలు, వ్యాయామంతో పోలిస్తే... అది వచ్చాక చికిత్సకు అయ్యే ఖర్చు వందల రెట్లు ఎక్కువ. పైగా నివారణ చర్యలతో గుండెజబ్బులు రాకపోవడంతో పాటు మిగతా జబ్బులూ నివారితమవుతాయి. ఫిట్నెస్ బాగుంటుంది.గతేడాది, ఈ ఏడాది వరల్డ్ హార్ట్ డే థీమ్స్... ‘మై హార్ట్– యువర్ హార్ట్’తో పాటు ‘‘క్రియేట్ ఎ గ్లోబల్ కమ్యూనిటీ ఆఫ్ హార్ట్ హీరోస్’’. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే... నా గుండెను రక్షించుకోవడం ఎలా... ఎదుటివాళ్ల గుండె ఆరోగ్యానికీ మనం చేయగలిగేదేమిటి?’ అనే చర్యలతో పాటు గుండెను రక్షించే నాయకుల తయారీలో మన కుటుంబాలను భాగస్వామ్యం చేయడానికి... ఇంటిలో వండిన ఆరోగ్యకరమైన వంటలే తినేందుకూ (ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్స్ కారణంగా జంక్‌ఫుడ్ మన గుమ్మం ముందుకే వస్తున్నాయి. మన పిల్లలూ వాటికి దూరంగా ఉండేలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది).మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఆరోగ్యంగా ఉండేందుకు తప్పక వ్యాయామం చేయడంతో పాటు పొగతాగడం వంటి అనారోగ్యకరమైన అలవాట్లు మానేసేందుకు; పిల్లలను సైతం చిన్నవయసు నుంచే వ్యాయామం వైపుకు మళ్లించేందుకు; ఇక ఆరోగ్యరంగంలో కృషి చేసేవారు తమ పేషెంట్స్ పొగతాగడం వంటి అలవాట్లు మానుకునేలాగా, కొలెస్ట్రాల్ తక్కువ ఉండే ఆహారం తీసుకునేలా అవగాహన తేవడం; మన విధాన రూపకర్తలు ఆరోగ్యకరమైన వ్యవస్థలను రూపొందించేలా విధానాలు రూపొందించడం; ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యం కోసం కృష్టి చేయడంతో పాటు... పైన పేర్కొన్న నివారణ చర్యలను అందరూ పాటించేలా చేయగలిగితే ఈ వరల్డ్ హార్ట్ డే థీమ్స్‌కు న్యాయం జరిగినట్లే. ఆహారపరమైన జాగ్రత్తలివి ►సాల్మన్ ఫిష్ లాంటి చేపలు గుండెకు ఆరోగ్యకరం. వీటిలో గుండె కొట్టుకోవడంలో తేడానీ, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్నీ, ట్రై గ్లిజరైడ్స్‌నూ తగ్గించే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో ఎక్కువుంటాయి. వారానికి కనీసం రెండు సార్లయినా ఈ చేపలు తింటే మంచిదంటూ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేసింది. ►ఓట్ మీల్ ఒంట్లో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జీర్ణకోశ మార్గంలో ఇది ఒక స్పాంజ్‌లా పనిచేస్తూ... కొలెస్ట్రాల్‌ను నానిపోయేలా చేసి, రక్తంలో ఇంకిపోకుండా ఒంట్లో నుంచి తొలగిస్తుంది. హోల్ వీట్ బ్రెడ్ లాంటి తృణధాన్యాలతో చేసినవి తిన్నా మంచిదే. ►స్ట్రా బెర్రీలు, బ్లూ బెర్రీల లాంటివి తింటే, అవి రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయని ఒక పరిశోధనలో వెల్లడైంది. ►డార్క్ చాక్లెట్లు, అంటే కనీసం 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు తింటే, అధిక రక్తపోటు, తగ్గుతాయి. అయితే, మామూలు మిల్క్ చాక్లెట్లు, క్యాండీ బార్ల వల్ల ఉపయోగం ఉండదు. పైగా అవి కీడు చేస్తాయి కూడా. ►విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉండే బత్తాయిలు, కమలా పండ్లు లాంటి నిమ్మజాతి పండ్లు తినాలి. జామపండ్ల వంటి విటమిన్ సి ఎక్కువగా ఉండే వాటినీ తినాలి. అయితే వీటిని కొరికి తినాలి తప్ప జ్యూస్‌లుగా చేసుకొని తాగకూడదు. ఏవైనా కారణాలతో కొరికితినలేని వారు జ్యూస్‌లుగా చేసుకొని తాగాల్సివస్తే అందులో పంచదార కలుపుకోకుండా, తాజా జ్యూస్‌లు తాగాలి. ►టొమాటోలలకూ కూడా గుండెకు ఆరోగ్యమిచ్చే పొటాషియం ఉంటుంది. వీటిల్లో ఉండే లైకోపిన్ అనే పోషకం గుండెజబ్బులను నివారిస్తుంది. ►బాదంపప్పు, అక్రోటు కాయలు (వాల్నట్స్), వేరుసెనగ లాంటివి తగు మోతాదులో తినాలి. వాటిలో చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించే విటమిన్ ‘ఇ’ ఉంటుంది. ►బీన్స్, బఠానీల లాంటి కాయధాన్యాల్లో కూడా కొవ్వు చేరనివ్వని బోలెడంత ప్రొటీన్ ఉంటుంది. ►పాలకూర, బచ్చలి కూర లాంటి ఆకుకూరలు గుండెకు అదనపు బలం ఇస్తాయి. ►అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్)లో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. పీచు పదార్థం కూడా ఎక్కువే. కాబట్టి, అవి గుండెకు మంచిది. ►రోజూ నాలుగు కప్పుల గ్రీన్ టీ తాగడం కూడా గుండెజబ్బుల నివారణకు గణనీయంగా తోడ్పడుతుంది. గుండెజబ్బులు రావడానికి కారణాలు ఇప్పుడు గుండెజబ్బులు వచ్చేందుకు గల కారణాలను చూద్దాం. ఆహారంలో కొవ్వుపదార్థాలూ, పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడంతో పాటు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, హైబీపీ, షుగర్ వంటివి కొన్ని ప్రధాన కారణాలైతే... మనకు మనమే జబ్బులకు చేరువయ్యేలా చేసే మన చెడు అలవాట్లైన పొగతాగడం వంటివి ఇంకా గుండెజబ్బుల విషయంలో మనకు చేటు చేసే అంశాలు. ఇక వీటితో పాటు మారిన వృత్తుల నేపథ్యంలో మానసిక ఒత్తిడి బాగా పెరగడం, నిద్రలేమి వంటివి కూడా వచ్చి చేరాయి. డాక్టర్ ఎమ్.ఎస్.ఎస్. ముఖర్జీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్, హైదరాబాద్ -
భాయ్ ఇలా చేయడం సిగ్గుచేటు!
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు భారీగా అభిమానగణం ఉంది. వరుసగా సూపర్‌హిట్స్ ఇస్తున్న ఈ కండలవీరుడికి వివాదాలు కూడా కొత్త కాదు. ఏదైనా వివాదంలో సల్మాన్ చిక్కుకుంటే.. ఆయనను సమర్థించడానికి ఫ్యాన్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కానీ, తాజాగా వినాయక చవితి వేడుకల సందర్భంగా సల్మాన్ ఖాన్ సిగరెట్ తాగుతూ కనిపించడం ఆయన ఫ్యాన్స్‌కే నచ్చలేదు. ఈ విషయంలో సల్మాన్ తీరును తప్పుబడుతూ పలువురు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. సల్మాన్ స్మోకింగ్ చేస్తున్న వీడియో ఇటీవల వైరల్ అయింది. తన సోదరి అర్పితా ఇటీవల వినాయక చవితి వేడుకలు నిర్వహించిన సందర్భంగా సల్మాన్ ఇలా సిగరేట్ తాగుతూ కనిపించారని పలు వెబ్సైట్లు ప్రచురించాయి. ఈ వీడియోపై సల్మాన్ ఫ్యాన్స్ స్పందిస్తూ.. ‘భాయ్ ఇలా చేయడం సిగ్గుచేటు’ అని కామెంట్ చేస్తున్నారు. గణేష్ చతుర్థి వేడుకల్లో భాగంగా సల్మాన్, ఆయన సోదరుడు అర్భాజ్ ఖాన్ వినాయకుడికి హారతి ఇచ్చిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ముస్లిం అయి ఉండి గణేషుడికి హారతి ఇస్తావా? అని కొందరు తప్పుబట్టగా.. మరికొందరు సల్మాన్ తీరును ప్రశంసించారు. -
భాయ్ ఇలా చేయడం సిగ్గుచేటు!
-
ఈ–సిగరెట్ సహాయంతో పొగతాగడం మానేయడం మంచిదేనా?
నా వయసు 48 ఏళ్లు. విపరీతంగా సిగరెట్లు తాగుతాను. ఎంత ప్రయత్నించినా చైన్స్మోకింగ్ మానడం సాధ్యం కావడం లేదు. స్నేహితులు ఈ–సిగరెట్‌ను ప్రయత్నించమని చెబుతున్నారు. ఈ–సిగరెట్ (ఎలక్ట్రానిక్ సిగరెట్) ఉపయోగించడం ద్వారా సిగరెట్ మానేయవచ్చా? ఇది సురక్షితమేనా?– ఆర్. మోహన్, విశాఖపట్నం ఎలక్ట్రానిక్ సిగరెట్లు (ఈ–సిగరెట్స్) అన్నీ ఒకేలా పని చేస్తాయి. అందులో ఒక బ్యాటరీ ఉంటుంది. దాని కాటరిడ్జ్ (మందు నింపే బోలు ప్రదేశం)లో నికోటిన్ ఉంటుంది. మామూలు సిగరెట్‌కూ, ఈ–సిగరెట్‌కూ తేడా ఒక్కటే. ఈ–సిగరెట్లో పొగాకు ఉండదు. అంతే. అయితే కేవలం పొగాకు మాత్రమే గాక... సాధారణ సిగరెట్లో ప్రమాదకరమైన రసాయనాలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండి, అవన్నీ ఆరోగ్యానికి చేటు చేస్తాయని నిరూపితమైంది. అదే పరిణామంలో కాకపోయినా ఈ–సిగరెట్‌లోనూ దాదాపు సాధారణ సిగరెట్లో ఉండే ప్రమాదకరమైన రసాయనాల్లో కొన్నైనా ఉంటాయి. నికోటిన్ అనే పదార్థం మామూలు సిగరెట్లు, ఈ–సిగరెట్లు... ఈ రెండింటిలోనూ ఉంటుంది. తనకు బానిస అయ్యేలా చేసుకోవడానికి నికోటిన్ ప్రతీతి. మందుల భద్రత విషయంలో ప్రామాణికమైన అమెరికాలోని అత్యున్నత సంస్థ ఎఫ్‌డీఏ విశ్లేషణల ప్రకారం... ఈ–సిగరెట్‌లోనూ గుర్తించగల స్థాయిలో క్యాన్సర్ కారకాలూ, విషపూరిత రసాయనాలూ ఉన్నాయి. ఈ–సిగరెట్లో కాటరిడ్జ్లో డీ–ఇథైల్ గ్లైకాల్ అనే విషపూరిత పదార్థం, నైట్రోజమైన్స్ అనే క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. పైగా ఎన్నో రకాల కాలుష్యాలు సైతం ఈ–సిగరెట్ ద్వారా శరీరంలోకి వెళ్తుంటాయి. ఈ పొగను లోపలికి పీల్చినప్పుడు అది మామూలు సిగరెట్లలాగే గొంతు, ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలిక మంట, ఇన్ఫెక్షన్లను (క్రానిక్ ఇన్ఫ్లమేషన్ను) కలిగిస్తుంది. ఇలా పొగ పీల్చడం దీర్ఘకాలం పాటు కొనసాగితే అది ఈ–సిగరెట్ పొగ అయినా సరే... కొన్నాళ్ల తర్వాత బ్రాంకైటిస్, ఎంఫసిమా, గుండెజబ్బుల వంటి వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి ఈ–సిగరెట్ మామూలు సిగరెట్ కంటే చాలా సురక్షితౖమేమీ కాదు. పైగా ఏ సిగరెట్ అయినప్పటికీ అందులోని పొగ వల్ల సిరలు, ధమనులు చాలా ఎక్కువగా ధ్వంసమవుతాయి. ఈ పరిణామమే ఆ తర్వాత గుండెజబ్బులకు దారితీస్తుంది. ఇక ఈ–సిగరెట్‌లోని పొగలో మామూలు సిగరెట్లో పోలిస్తే రసాయనాల సంఖ్య కొంచెం తగ్గితే తగ్గుతుండవచ్చు. అంతమాత్రాన అది మామూలు సిగరెట్ కంటే సురక్షితం అని కచ్చితంగా చెప్పడానికి ఆస్కారం లేదు. దీర్ఘకాలంలో మామూలు సిగరెట్‌తో వచ్చే దాదాపు అన్ని రకాల దుష్పరిణామాలూ ఈ–సిగరెట్‌తోనూ వస్తాయి. ఈ–సిగరెట్‌లోనూ ఉండేది నికోటినే కాబట్టి దానికి బానిసై మళ్లీ మీరు ఈ–సిగరెట్‌కు అలవాటు పడతారు. మీరు సిగరెట్ వదిలేయదలిస్తే... ఒక్కసారిగా వదిలేయడం. మానేయగానే కాస్త చిరాకు, కోపం, నిస్పృహ, అస్థిమితంగా ఉండటం వంటి కొన్ని తాత్కాలిక లక్షణాలు కనిపించినా, దీర్ఘకాలంలో సిగరెట్ మానేయడం వల్ల కలిగే ప్రయోజనాల సంఖ్య చాలా ఎక్కువ. కాబట్టి ఈ–సిగరెట్ సహాయంతో కాకుండా వెంటనే మీరు పొగతాగడం మానేయడం చాలా మంచిది.డాక్టర్ రమణ ప్రసాద్కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్, స్లీప్ స్పెషలిస్ట్,కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?
‘‘సినిమాలో పాత్ర ఏ విధంగా ఉంటే అలా మేం నటిస్తాం. అంతే కానీ సినిమాలో మేం పోషించే పాత్ర ఏదైనా చెడు చేస్తే దాన్ని మేం ప్రమోట్ చేసినట్టు కాదు. నిజ జీవితంలో మేం వాటిని అనుసరిస్తున్నట్టూ కాదు. ఆ సన్నివేశాలను చూసి నన్ను విమర్శించేవాళ్లను పట్టించుకోను కూడా’’ అన్నారు రకుల్ ప్రీత్ సింగ్. తన లేటెస్ట్ చిత్రం ‘మన్మథుడు 2’ టీజర్లో రకుల్ పొగ తాగుతూ కనిపించారు. ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. పలువురు రకుల్‌ని విమర్శించారు. ఈ విషయానికి రకుల్ స్పందించారు. ‘‘నిజజీవితంలో నేను పొగ తాగను. అంతెందుకు నాకు చీట్ డే (వారంలో నచ్చినవన్నీ తినడానికి ప్రత్యేకంగా పెట్టుకునే రోజు) కూడా ఉండదు. నా చుట్టూ ఉండేవాళ్లకు తెలుసు.. నేను ఫిట్నెస్కి ఎంత ప్రాముఖ్యత ఇస్తానో. ‘కబీర్ సింగ్’లోనూ షాహిద్ సిగిరెట్ తాగాడు. అతను పొగతాగడాన్ని ప్రోత్సహిస్తున్నట్టా? కానే కాదు. సినిమాలో స్మోక్ చేసినంత మాత్రాన అవి మా నిజజీవితంలో చేస్తామని కాదు. సినిమాకు, నిజజీవితానికి తేడాను అర్థం చేసుకోవాలి. విమర్శలకు రియాక్ట్ అయితే ప్రతీది పట్టించుకోవాలి. నాకంత ఆసక్తి లేదు. నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోవడం ముఖ్యం’’ అన్నారు రకుల్. నాగార్జున, రకుల్ జంటగా నటించిన ‘మన్మథుడు 2’ ఆగస్ట్ 9న రిలీజ్ కానుంది. -
ధూమపానం, కాయిల్స్‌తో క్యాన్సర్ రాదట!
సాక్షి, న్యూఢిల్లీ : ధూమపానం వల్ల, దోమలను పారదోలేందుకు కాయిల్స్ కాల్చడం వల్ల క్యాన్సర్ వస్తుందని ఇంతకాలం నమ్ముతూ వస్తున్నాం. అది పొరపాటు అభిప్రాయమని, వాటిల్లో క్యాన్సర్ కారకాలు అంతగా లేవని తాజా పరిశోధనలో వెల్లడయింది. కాకపోతే వీటి వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తేలింది. తలుపులు భిగించిన గదుల్లో సిగరెట్లను, దోమల కాయిల్స్‌ను విడివిడిగా వెలిగించినప్పుడు, అవి కాలుతున్నప్పుడు, కాల్చిన తర్వాత ఆయా గదుల వాతావరణంలోకి ఎలాంటి ఖనిజాలు వెలువడ్డాయో పరిశోధకులు అధ్యయనం జరిపారు. అల్యూమినియం, కాపర్, జింక్, కాడిమియం, క్రోమియం, మాంగనీసు, నికిల్, లెడ్, వనడియం, సెలినియం, స్కాండియం తదితర ఖనిజాలు ఉన్నట్లు కనుగొన్నారు. రెండు రకాల శాంపుల్స్ తీసుకొని వాటిలో ఈ ఖనిజాలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా పరిశీలించారు. రెండింట్లోనూ అల్యూమినియం, కాపర్, జింక్, మాంగనీస్ ఖనిజాలు ఎక్కువగా ఉన్నట్లు, కాడిమియం, వాలియం, సెలెనియం తక్కువగా ఉన్నట్లు తేలింది. క్రోమియం, లెడ్, నికిల్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎంతుందన్న విషయంపై కూడా తాము అధ్యయనం జరిపామని, క్యాన్సర్ వచ్చే అవకాశం కన్నా అవి తక్కువ స్థాయిలోనే ఉన్నట్లు తేలిందని అధ్యయనానికి అక్షరరూపం ఇచ్చిన ఆగ్రాలోని బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ రసాయన శాస్త్ర విభాగం అధిపతి అజయ్ తనేజా తెలిపారు. ఆయన అధ్యయన వ్యాసాన్ని ‘ఎస్ఎన్ అప్లైడ్ సైన్సెస్’ జర్నల్ ప్రచురించింది. తాము ప్రస్తుతానికి సిగరెట్, వివిధ రకాల మస్కిటో కాయల్స్ నుంచి వెలువడుతున్న ఖనిజాలపైనే అధ్యయనం జరిపామని, వీటి నుంచి దాదపు నాలుగువేల రసాయనాలు కూడా వెలువడుతాయని, వాటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? అన్న కోణంలో ఇంకా అధ్యయనం జరపాల్సి ఉందని తనేజా పేర్కొన్నారు. దోమల కాయల్స్లో కన్నా సెగరెట్లలోనే కాపర్, జింక్, మాంగనీస్, నికిల్, లెడ్ ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే క్యాన్సర్ వచ్చే స్థాయిల్లో మాత్రం లేదని, ధూమపాన ప్రియలు ఇళ్లలో, గాలి బయటకు పోని గదుల్లో పొగ తాగకపోవడమే మంచిదని ఆయన సూచించారు. ముఖ్యంగా ఇంట్లో దోమలను చంపేందుకు లేదా పారదోలేందుకు కాయిల్స్‌ను కాల్చడం వల్ల ఎక్కువ మందిలో శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తనేజా చెప్పారు. ఎక్కువ కాలం వీటికి ఎక్స్పోజ్ అయితేనే వ్యాధులు వస్తాయని అన్నారు. ఎవరికి, ఎంతకాలంలో వస్తుందన్నది అంచనా వేయలేమని, వారి వారి శరీర తత్వం, ఆరోగ్య పరిస్థితి బట్టి ఈ శ్వాసకోశ వ్యాధులు సంక్రమిస్తాయని ఆయన వివరించారు. కొందరికి శరీరంపై దద్దులు, ఇతర ఎలర్జీలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. దోమలను పారదోలే ‘ఆల్ అవుట్’ లాంటి ద్రవరూపక ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా ప్రత్యామ్నాయం కాదని, వాటి ద్వారా కూడా సేంద్రియ రసాయనాలు వెలువడతాయని ఆయన హెచ్చరించారు. శ్వాసకోస వ్యాధులు కూడా దీర్ఘకాలంలో మరణానికి దారితీస్తాయని, ఈ మరణాలను కూడా వాయు కాలుష్య మరణాల కింద లెక్కించాల్సి ఉంటుందని తనేజా తెలిపారు. వాయు కాలుష్యం కారణంగా ఒక్క 2017లోనే భారత్‌లో 12 లక్షల మంది మరణించినట్లు ‘ది లాన్సెట్’ జర్నల్ 2018, డిసెంబర్లో ప్రచురించిన ఓ అధ్యయనం తెలియజేస్తోంది. ఇటీవల భారత్‌లోని పలు నగరాల్లో వాయు కాలుష్యం పెద్ద సమస్యగా మారిన విషయం తెల్సిందే. బయటి కాలుష్యం ఎంత ప్రమాదకరమో ఇళ్లలోని వాయు కాలుష్యం కూడా అంతే ప్రమాదకరమని తనేజా హెచ్చరిస్తున్నారు. -
‘ఇస్మార్ట్ శంకర్’కు చార్మినార్ ఎస్సై ఫైన్
సాక్షి, హైదరాబాద్ : ‘ధూమపానం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం’ ఈ ప్రకటన ప్రతి సినిమా ప్రారంభ సమయంలో చూస్తూనే ఉంటాం. బహిరంగ ప్రదేశాలలో సిగరేట్ తాగితే జరిమాన విధిస్తారని అందరికి తెలుసు కానీ, చాలా మంది బహిరంగంగానే సిగరేట్లు తాగుతారు. దీనికి హీరో రామ్ కూడా అతీతుడిని కాదనిపించుకున్నాడు. బహిరంగంగా సిగరేట్ తాగుతూ.. రూ. 200 జరిమానా చెల్లించాడు. ఇస్మార్ట్ శంకర్ షూటింగ్లో భాగంగా చార్మినార్ వెళ్లిన రామ్.. షూటింగ్ తర్వాత బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగాడు. ఇది గమనించిన చార్మినార్ ఎస్సై పండరీ రామ్‌కు రూ.200 జరిమానా విధించారు. -
ఊదితే ఊర్కోరు!
సాక్షి, సిటీబ్యూరో: ఒకరు వాహనంపై దూసుకుపోతూ సిగరెట్ కాలిస్తే... మరొకరు రోడ్డు పక్కనే ధూమపానం చేస్తారు... కేఫ్‌లో తాపీగా కూర్చొని పొగ తాగుతారు ఇంకొకరు... ఇకపై ఇలా చేస్తూ పోలీసుల కంటపడితే జరిమానా తప్పదు. ‘స్మోక్ ఫ్రీ హైదరాబాద్’ దిశగా అడుగులు వేస్తున్న నగర పోలీసులు సోమవారం నుంచి స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. ఈ దిశగా మరిన్ని చర్యలు తీసుకునేందుకు శాంతి భద్రతలు, ట్రాఫిక్ విభాగాల్లోని కానిస్టేబుల్ నుంచి ఎస్సై స్థాయి అధికారుల వరకు అవగాహన కల్పిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని నగర కొత్వాల్ అంజనీకుమార్ సోమవారం బషీర్‌బాగ్ కమిషనరేట్‌లో ప్రారంభించారు. ఇప్పుడు విరివిగా వినియోగిస్తున్న సిగరెట్, బీడీ, చుట్ట, ఖైనీ తదితరాల్లోని పొగాకు అంటే ఒకప్పుడు భారతీయులకు తెలియదు. అయితే 400 ఏళ్ల క్రితం మొఘలుల పరిపాలనలో దీన్ని పోర్చుగల్ నుంచి తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలో పొగాకు వినియోగం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ది రెండో స్థానం. గ్రామీణ ప్రాంతాల్లో 38శాతం, పట్టణాల్లో 25శాతం దీనికి బానిసయ్యారు. ఈ ప్రభావంతో ఏటా 8–9లక్షల మంది మరణిస్తున్నారు. 30శాతం కేన్సర్ కేసులు, 40శాతం టీబీ కేసులకు ఇదే కారణమవుతుండగా... నోటి కేన్సర్ బారినపడిన వాళ్లల్లో 80శాతం మంది పొగాకు వాడుతున్న వాళ్లేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న చండీగఢ్ నగరం 2007లో, సిక్కిం రాష్ట్రం 2010లో స్మోక్ ఫ్రీగా మారాయి. హైదరాబాద్‌ను కూడా స్మోక్ ఫ్రీగా మార్చాలని నిర్ణయించుకున్న నగర పోలీసులు స్వచ్ఛంద సంస్థ ‘ది యూనియన్’తో కలిసి ముందుకెళ్తున్నారు. లక్ష్యం.. అక్టోబర్ 2 ‘స్మోక్ ఫ్రీ హైదరాబాద్’ లక్ష్యాన్ని గాం«ధీ జయంతి (అక్టోబర్ 2) నాటికి సాధించాలని నగర పోలీసులు నిర్ణయించారు. ఆ నెల 30 నుంచి నగరంలో ‘50వ ప్రపంచ ఊపిరితిత్తుల ఆరోగ్య సదస్సు’ జరగనుంది. అది ప్రారంభమయ్యే లోపే లక్ష్యాన్ని చేరుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా మొదలైన స్పెషల్ డ్రైవ్స్ ఈ నెల 31న జరగనున్న ‘ప్రపంచ నో టొబాకో డే’తో వేగం పుంజుకోనున్నాయి. ఈ క్రతువులో శాంతిభద్రతల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు పాలుపంచుకుంటారు. అనునిత్యం రహదారులపై విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసులు, గస్తీ తదితర విధుల్లో ఉండే శాంతి భద్రతల విభాగం అధికారులు సైతం బహిరంగ ప్రదేశాల్లోని పొగరాయుళ్లపై కొరడాఝుళిపిస్తారు. తమ వద్ద ఉండే ట్యాబ్స్‌ను వినియోగించి వారికి జరిమానా విధిస్తారు. దీంతో పాటు సిగిరెట్–పొగాకు ఉత్పత్తుల నియంత్రణకు సంబంధించిన ‘కోట్పా’ చట్టాన్ని పక్కాగా అమలు చేయనున్నారు. దీనిపైనే సిబ్బందికి రెండు రోజుల పాటు శిక్షణనిస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పొగతాగే వారితో పాటు నిబంధనలకు విరుద్ధంగా అమ్మేవాళ్లు, ప్రచారం చేసే వారిపైనా చర్యలు తీసుకోనున్నారు. జరిమానాలు ఇలా... ♦ బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగితే రూ.200. ♦ హోటల్, కేఫ్ లాంటి ప్రదేశాల్లో ధూమపానం చేస్తే అక్కడ ఎంతమంది పొగరాయుళ్లు చిక్కుతారో అంత మొత్తం జరిమానా సంబంధిత యజమాని/నిర్వాహకుడికి విధిస్తారు. ♦ పొగాకు ఉత్పత్తులపై ప్రచారం చేస్తే తొలిసారి రూ.1,000 జరిమానా లేదా రెండేళ్ల జైలు. రెండోసారైతే రూ.5,000 జరిమానా లేదా ఐదేళ్ల జైలు. ♦ మైనర్లకు లేదా విద్యాసంస్థల వద్ద పొగాకు ఉత్పత్తులు అమ్మితే రూ.200. ♦ సర్టిఫైడ్ హెల్త్ వార్నింగ్ లేని ఉత్పత్తులు తయారు చేస్తే తొలిసారి రూ.5,000 జరిమానా లేదా ఏడాది జైలు. రెండోసారి రూ.10,000 జరిమానా లేదా ఐదేళ్ల జైలు. ♦ ఇలాంటి ఉత్పత్తులు విక్రయిస్తే తొలిసారి రూ.1,000 జరిమానా లేదా ఏడాది జైలు. రెండోసారి రూ.3,000 జరిమానా లేదా రెండేళ్ల జైలు. ముందు మనం మారాలి.. స్పెషల్ డ్రైవ్స్ చేపట్టడంతో పాటు పోలీస్ విభాగాన్ని స్మోక్ ఫ్రీగా మార్చాలని నిర్ణయించాం. ఏళ్లుగా నేను, నా కుటుంబీకులు ఈ దురలవాట్లకు దూరంగా ఉన్నామని గర్వంగా చెబుతున్నాను. ప్రతి ఒక్క పోలీస్ అధికారి ఇలానే మారాలి. సమాజ, నగర అభివృద్ధి సూచికల్లో ఆరోగ్యం కూడా ఒకటి. ఒకప్పుడు పంజాబ్‌లో అత్యధికంగా ఉన్న డ్రగ్ కల్చర్‌ను సామాన్యుల్లో అవగాహన పెంచడం ద్వారానే తగ్గించగలుగుతున్నారు. నగర పోలీస్ విభాగంలో ఉన్న ప్రతి అధికారి ప్రాథమికంగా తన చుట్టూ ఉన్న 100 మీటర్లతో ప్రారంభించి 500 మీటర్ల వరకు స్మోక్ ఫ్రీగా మార్చాలి. ప్రతి అంశంలోనూ పోలీసుల పాత్ర ఉన్నట్లే వారు ఆదర్శంగానూ మారాలి. – అంజనీకుమార్, కొత్వాల్ అదో సోషల్ స్టేటస్.. సిగరెట్ కాల్చడమనేది ఒకప్పుడు దుర్వ్యసనంగా ఉండేది. ఇప్పుడది ఓ సోషల్ స్టేటస్‌గా మారింది. ఈ కారణంగానే పాఠశాల, కళాశాల విద్యార్థులూ దీనికి అలవాటు పడుతున్నారు. ముందు సదరాగా మొదలెట్టి ఆపై బానిసలుగా మారుతున్నారు. సెలబ్రిటీలు ఎవరైనా సిగరెట్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తే వారిని అరెస్టు చేసే ఆస్కారం ఉంది. నగరంలో ఎవరైన అలా పట్టుబడాలన్నది నా కోరిక. – ఎం.శివప్రసాద్, అనదపు సీపీ -
విమానంలో భయంకర చర్య, వైరల్ వీడియో
అమెరికాలోని మిన్నెపోలీస్కు చెందిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఒక పబుద్ధుడు కలకలం రేపాడు. విమానంలో ఉన్నట్టుండి ఒక ప్రయాణికుడు లైటర్ సహాయంతో దర్జాగా సిగరెట్ ముట్టించాడు. దీంతో పక్క వరుసలో కూర్చున్న మహిళా ప్రయాణికురాలు బిత్తరపోయింది. మిగిలిన ప్రయాణికులు కూడా భయాందోళనకు లోనయ్యారు. చివరకు ఫ్లైట్ అడెంటెండ్కు ఫిర్యాదు చేశారు. విమానం ఎక్కిన దగ్గరనుంచి అతను వింతగా ప్రవర్తిస్తున్నాడని సహ ప్రయాణికురాలు ఆరోపించారు. అందుకే సిగరెట్ ముట్టించగానే వీడియో తీసానని పేర్కొన్నారు. ఈ భయంకరమైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చట్ట విరుద్ధంగా లైటర్‌ను విమానంలోకి ఎలా తీసుకొచ్చాడు.. ధూమపానం ఎలా చేశాడు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. -
ఈ నగరానికి ఏమైంది..?
ఈ నగరానికి ఏమైంది.. ఓ వైపు మసి.. మరో వైపు పొగ.. ఎవరూ మాట్లాడరేం.. కాలే బీడీ సిగరెట్ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి.. ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు తప్పకుండా వచ్చే ప్రకటన. ప్రకటన చూడడమే తప్ప పొగరాయుళ్లలో ఎటువంటి చలనం కలగడం లేదు. కాల్చే సిగరెట్లో నికోటిన్ విషతుల్యమైన మత్తు పదార్ధం ఉంటుంది. సిగరెట్, బీడీ తాగే వారిలో ఈ విషం శరీరాన్ని పీల్చిపిప్పి చేస్తుంది. నేటి యువత ధూమపానాన్ని క్రేజీగా భావిస్తూ అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటోంది. పొగతాగడం వ్యసనంగా మారితే ప్రాణాన్నే హరిస్తుందన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. నేడు నో స్మోకింగ్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.. సాక్షి, తిరుపతి (అలిపిరి): పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ ప్రసార మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తుతోంది. సిగరెట్ ప్యాకెట్‌పైనే ప్రాణాంతకం అంటూ రాసుంటుంది. అయినా పొగతాగేవారు వాటిని అసలు పట్టించుకోవడం లేదు. ఆరోగ్యం విషవాయువుల నడుమ హరిస్తున్నా.. పొగతాగే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. నేటి యువత ధూమపానాన్ని క్రేజ్‌గా భావి స్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై నిషేధం విధించినా చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. ఊపిరితిత్తులకు ముప్పు పొగ పీల్చగానే నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది. మనం పీల్చే గాలిలో స్వచ్ఛమైన ఆక్సిజన్ శరీరానికి అందుతుంది. హానికర కార్బ న్ డైయాక్సైడ్ ఇతరత్రా వాయువులు విడిపోతాయి. ఆక్సిజన్‌ను హిమోగ్లోబిన్ పీల్చుకుని మిగిలిన వాయువులను బయటకు పంపుతుంది. పొగ తాగడం వల్ల శరీరంలోని కార్బన్ మోనాక్సైడ్, సైనైడ్ వంటి విష పదార్థాలు గాలి గదిలో చేరి హిమోగ్లోబిన్‌తో గాఢమైన బంధాన్ని ఏర్పరుచుకుంటాయి. దీంతో హిమోగ్లోబిన్‌కు ఆక్సిజన్ మోసుకుపోయే సామర్ధ్యం తగ్గి కార్బన్ మోనాక్సైడ్‌తో కణాలు విషపూరితమవుతాయి. ఫలితంగా పలు వ్యాధులు సోకుతాయి. పీల్చేవారికీ ప్రమాదమే పొగ తాగేవారి కంటే పీల్చే వారు తీవ్ర అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పొగతాగేవారిని యాక్టివ్ స్మోకర్గా, పీల్చేవారిని పాసివ్ స్మోకర్గా పిలుస్తారు. పొగ తాగేవారితో పాటు పీల్చేవారు కూడా పలు రకాల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పొగ పీల్చడం వల్ల మహిళల్లో పునరుత్పత్తి శక్తి తగ్గుతుంది. ఎక్కువ పీల్చడం వల్ల అబార్షన్లు జరగడం, ఒక వేళ పిండం ఎదిగినా చివర్లో మృత శిశువులు జన్మించడం వంటి సమస్యలు మహిళలను వేధించే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 2.5 కోట్ల మంది పొగతాగే వారున్నట్లు అంచనా. ఒక సిగరెట్ తాగితే 43 రకాల విష వాయువులు వెలువడుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్ అలవాటు ఉన్న వారు మానేస్తే, 20 ఏళ్ల తరువాత లంగ్స్ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గొంతు క్యాన్సర్ పొగ తాగేవారిలో నోటి, గొంతు సమస్యలు ఉత్పన్నమవుతాయి. గొంతులో ఉండే ప్రతి అవయవమూ పొగబారినపడి క్యాన్సర్‌కు లోనయ్యే ప్రమాదం వుంది. గొంతులో ఉండే స్వరపేటిక, థైరాయిడ్, గొంతు నుంచి ఊపిరితిత్తుల్లోకి వెల్లే బ్రాంకియా.. ఇలా ప్రతి భాగమూ దెబ్బతిని అవయవాలన్నింటికీ కేన్సర్ వచ్చే అవకాశం ఉంది. పొగతాగే వారిలో గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువ. నష్టం ఎంతంటే.. ♦ ఒక సిగరెట్ తాగితే 43 రకాల విషవాయువులు వెలువడుతాయి. ఎంఫసియా,క్రానిక్ అబ్స్ట్రిక్టవ్ పల్మ్నరీ డిసీజ్ లాంటి ప్రమాదకర మైన వ్యాధులు సోకుతాయి. ♦ బ్రెయిన్ స్ట్రోక్‌కు అవకాశం ఎక్కువ. ♦ దుర్వాసనతో నోరు,పెదాలు, నాలుక క్యాన్సర్లు వస్తాయి. ♦ ముఖంపై మచ్చలు ఏర్పడుతాయి. ♦ పళ్లు రంగు మారుతాయి. ♦ కనుగుడ్డు మీదా ప్రభావం ఉంటుంది. ♦ ఊపిరితిత్తులు క్యాన్సర్ వస్తుంది. ♦ గుండెపోటుకు అవకాశం ఎక్కువ. ♦ రక్త ప్రసరణ ప్రక్రియ మందగిస్తుంది. ♦ కడుపులో ప్రమాదకర యాసిడ్లు ఉత్పత్తి అవుతాయి. ♦ మూత్రాశయం..మూత్రపిండాలు దెబ్బతింటాయి. ♦ శరీరంలో అన్ని భాగాలు దెబ్బతింటాయి. ♦ పొగపీల్చే మహిళల్లో పునరుత్పత్తి శక్తి తగ్గుతుంది. అమలుకు నోచుకోని చట్టాలు బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడంపై చట్టాలు ఉన్నా అవి పూర్తిగా అమలుకు నోచుకోవడం లేదు. బహిరంగంగా పొగ తాగుతూ అధికారులకు పట్టుబడితే తొలిసారి రెండేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా.. రెండో సారి పట్టుబడితే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.500 జరిమానా.. ఒక్కో సందర్భంలో రెండు శిక్షలు అమలు చేయవచ్చు. ఈ చట్టం ఆచరణలో విఫలమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ 2014లో చట్టంలో నిబంధనలు మార్చాలని భావించి మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. దీని ప్రకారం ధూమపాన సేవనానికి ఉన్న వయోపరిమితిని 18 నుంచి 25 ఏళ్లుగా చేసింది. నిబంధన అమలుకు నోచుకోలేదు. 2003లో పొగాకు నిషేధ చట్టం ప్రకారం విశ్వ విద్యాలయాల్లో వంద గజాల దూరంలో ఎలాంటి పొగాకు విక్రయ కేంద్రాలు ఉండకూడదు. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం ఒక సిగరెట్ తాగితే ఏమౌతుందులో అనే అలోచను విడనాడాలి. పొగ, గుట్కాలు వంటివి తీసుకోవడం వల్ల శరీరం అనేక వ్యాధుల బారినపడుతుంది. దీంతో శరీరాన్ని విష వాయువు పీల్చిపిప్పి చేసే ప్రమాదం ఉంది. యువత స్టైల్ కోసం స్మోకింగ్‌కు అలవాటు పడుతున్నారు. కొన్ని రోజుల పాటు అలవాటుపడి వారు చాల ఏళ్లు పాటు ఇబ్బందులు పడితేగాని మానలేకపోతున్నారు. స్మోకింగ్‌కు దూరంగా వుండడం ఉత్తమం. – డాక్టర్ ఎస్.సుబ్బారావు, అసోసియేట్ ప్రొఫెసర్, పల్మొనరీ మెడిసిన్, రుయా ఆస్పత్రి సున్నిత పొరలకు ప్రమాదం ధూమపానంతో కళ్లు, ముక్కు, గొంతులో సున్నిత పొరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. గుండె పోటు వచ్చే శాతం అధికంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు పొగతాగడానికి యువత దూరంగా వుండాలి. – డాక్టర్ సూర్యప్రకాష్, సీనియర్ పాల్మనాలజిస్ట్, తిరుపతి -
జీవితాలకు పొ(సె)గ
సాక్షి, ఆలేరు : ‘పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్’ అని కన్యాశుల్కంలో గిరీశం అన్న మాటలను వల్లె వేస్తూ పొగబాబులు ఈ వ్యసనాన్ని వదల్లేక పోతున్నారు. సరదాగా మొదలయ్యే ధూమపానం జేబుతోపాటు ఊపిరితిత్తులకు చిల్లు వేస్తుంది. ఈ విషయం తెలిసే ధూమపానాన్ని అనేకమంది వదలడం లేదు. పొగాకు, ధూమపానం కారణంగా ప్రపంచంలో ప్రతి 6.5 సెకండ్లకు ఒకరు మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. అయితే చిన్నవయస్సులోనే సిగరేట్ తాగటం మొదలుపెట్టినవారు సాధారణ ఆరోగ్యవంతుల కన్నా వీరు 20–25 సంవత్సరాల ముందే చనిపోతున్నారని వెల్లడైంది. పొగాకులో నికోటిన్ అనే మత్తు పదార్థం ఉంటుంది. బహిరంగ ధూమపానం ఇతరులకు కూడా హాని కలిగిస్తుంది. వచ్చే జబ్బులు ధూమపానం ప్రమాదకరమైంది. ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ఆయు ప్రమాణాలను తగ్గిస్తుంది. కళ్లు, ముక్కు, గొంతు మీద ప్రభావం కలిగిస్తుంది. ఊపిరితిత్తులకు సహజసిద్ధంగా శుభ్రపరిచే సామర్ధ్యం ఉంటుంది. పొగతాగడంతో శ్వాస స్థాయి పెరిగి ఊపిరితిత్తుల కణాలకు రసాయన హనీ కలుగుతుంది. దగ్గు, కఫం సమస్యలు మొదలవుతాయి. శ్వాసకోస వ్యాధులు వస్తాయి. శ్వాసనాళం మందంగా మారి క్యాన్సర్‌కు దారి తీస్తుంది. సోరియాసిస్ వ్యాధి కూడా వస్తుంది. శుక్లాలు కూడా వచ్చే అవకాశం ఉంది. దంతాలు రంగు మారడమే కాదు దెబ్బతింటాయి. చిగుళ్ల వ్యాధులు కూడా వస్తాయి. గుండె జబ్బులు, పక్షవాతం, పొట్టలో అల్సర్లు వస్తాయి. సంతాన, అంగస్తంభన సమస్యలు, వీర్యంలోని శుక్రకణాల స్వరూపం మారిపోతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు తక్కువవుతాయి. అలాగే పొగతాగే స్త్రీలలో గర్భధారణ సమస్యలు, గర్భస్రావాల సమస్యలు తలెత్తుతాయి. రక్తపోటు మీద ప్రభావం. సిగరెట్ కాల్చే ప్రతిసారి 15శాతం రక్తపోటు అమాంతం పెరుగుతుంది. చర్మంలో రక్తకణాలు బిగుసుకుపోతాయి. పొగతాగితే నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఫ్యాషన్‌గా భావిస్తున్న యువత సిగరెట్ తాగడాన్ని యువత ఫ్యాషన్‌గా భావిస్తుంది. ఇంటర్ నుంచే అబ్బాయిలు సిగరెట్ అలవాటు చేసుకుంటున్నారు. అలవాటు లేకపోయిన తోటి స్నేహితుల ప్రోత్సాహంతో సిగరెట్లు తాగుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో నిషేధం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని ప్రభుత్వం నిషేధించింది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే రూ. 1000వరకు జరిమానా విధించవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ క్యార్యాలయాలు, బీజినెస్ సెంటర్లు, హోటళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సినిమా థియేటర్లలో పొగతాగడాన్ని కేంద్ర ప్రభుత్వం 2008 సంవత్సరం అక్టోబర్ 8న నిషేధించింది. ధూమపానం చేస్తే జరిమానా విధించేందుకు పలువురు అధికారులకు అధికారం కల్పించారు. పొగ నిషేధ చిహ్నం ఉమ్మడి జిల్లాలో 1300 కిల్లీ షాపులు ఉమ్మడి జిల్లాలో 1300పైగా కిల్లీ షాపులు నడుస్తున్నాయి. నిత్యం ఈ షాపుల్లో రూ. 5.50లక్షల బీడీలు, సిగరెట్లు అ మ్ముడుపోతున్నాయని తెలిసిం ది. అలాగే జిల్లాలో హుక్కా పీల్చేవారి సంఖ్య కూడా లక్షకుపైగా ఉన్నట్టు తెలుస్తుంది. పేరుకే కమిటీలు బహిరంగ ప్రదేశాల్లో «ధూమపాన నిషేధాన్ని అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో కమిటీ ఉంది. ప్రతి నెలలో కమిటీ సమావేశమై చట్టం అమలును సమీక్షించాలి. జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా, డీఎంహెచ్ఓ కన్వీనర్‌గా, అగ్నిమాపక అధికారి, పోలీస్, రవాణా, పురపాలక సంఘం, ఉన్నత పాఠశాల, రెవెన్యూ, విద్య, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ ఇన్స్పెక్టర్, డీసీహెచ్ఎస్ కోఆర్డినేటర్లు సభ్యులుగా ఉం టారు. మొత్తం 12మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఉందని చాలా మందికి తెలియదు. దాంతో కమిటీ నామమాత్రంగా మారింది. కుటుంబ సభ్యులకు హానికరమే.. సిగరెట్ తాగేవారితో పాటు కుటుంబ సభ్యులకు కూడా హానికరమే. పిల్లల వద్ద తాగితే సున్నితంగా ఉండే వారి ఊపిరితిత్తులకు మరింత ప్రమాదకరం. పొగతాగితే అనారోగ్యానికి గురవుతారు. 40 రకాల క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. ధూమపానం చేస్తే ఆయు ప్రమాణం తగ్గుతుంది. – డా. కె ప్రభాకర్, ఆలేరు -
సిగరెట్ తాగొద్దన్నందుకు కంట్లో పొడిచాడు
కర్ణాటక, కృష్ణరాజపురం: సిగరెట్ తాగొద్దన్నందుకు ఓ వ్యక్తి తన భార్య కంట్లో కత్తితో పొడిచిన ఘటన గురువారం రాత్రి బాణసవాడిలో చోటు చేసుకుంది. లింగరాజపురంలో నివసిస్తున్న ధర్మ అనే వ్యక్తి చాలా కాలంగా దురలవాట్లకు బానిసయ్యాడు. ఈ క్రమంలో కొద్ది కాలం క్రితం ధర్మకు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో వైద్యపరీక్షలు చేసిన వైద్యులు ఇకపై సిగరెట్లు తాగొద్దంటూ సూచించారు. అయినా వినని ధర్మ సిగరెట్లు తాగేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా సిగరెట్ తాగుతుండగా గమనించిన భార్య గాయత్రి సిగరెట్ తాగొద్దంటూ సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన ధర్మ కత్తితో గాయత్రి కంట్లో పొడిచాడు. గాయత్రి కేకలు వేస్తూ బయటకు రావడంతో గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాణసవాడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ఒక ప్రేమకథ
కిటికీలోంచి ముఖం పెట్టి ప్రభాతబాబు అన్నాడు: ‘‘వ్రాసుకుంటున్నారా? సరే వ్రాసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను’’నేను కాగితం కలం క్రిందకి పెట్టి ‘‘రండి, దయచేయండి’’ అన్నాను.ప్రభాతబాబు కొంచెం సంకోచిస్తూ అన్నాడు: ‘‘కానీ మీరు వ్రాసుకుంటున్నారు కదా!’’‘‘పెద్ద వ్రాయవలసిందేమీ లేదు. ఒకటి రెండు ఉత్తరాలకి సమాధానం రాశాను. దయచేయండి’’ అన్నాను.ఆయన లోపలికి రాగానే నా ఎత్తు కుర్చీ నుంచి దిగి, ఆయన ముందు ఒక పల్లంగా ఉన్న సోఫాలో కూర్చున్నాను.ఆయన నా వైపు చూసి చిరునవ్వుతో అన్నాడు: ‘‘ఉత్తరాలు బాగా రాస్తారనుకుంటాను.ఒకప్పుడు నాకు కూడా ఉత్తరాలు రాసే చాదస్తం ఉండేది. రాత్రాంతా మేలుకుని స్నేహితులకు లేఖలు రాస్తూ ఉండేవాడిని. అందుమూలన నన్ను ‘ఏ మాన్ ఆఫ్ లెటర్స్’ అనవచ్చు’’‘‘టీ పుచ్చుకుంటారా?’’ అని అడిగాను.టీ మాట వినేసరికి ప్రభాతబాబు సంతోషించి అన్నాడు: ‘‘అయితే ఈ మిట్టమధ్యాహ్నంవేళ మీకేమీ ‘ఆశ్రమపీడ’ కలగదు కదా? గృహస్థాశ్రమం కదా! నేనైతే గృహస్థుణ్ణి కాను,అంచేతనే భయపడుతూ వచ్చాను. మీ శ్రీమతికేమైనా శాంతిభంగం కలిగిస్తానేమోనని’’ప్రభాత వయసు 74 సంవత్సరాలు ఉంటుంది. శరీరం జీర్ణించింది కాని మనస్సు కాదు. బస్సులూ ట్రాములూ స్వేచ్ఛగా ఎక్కి తిరగగలడు. చాలా సంఘప్రేమ ఉన్న మనిషి. ప్రతి మీటింగుకి హాజరవుతూ ఉంటాడు. బంధువులు, స్నేహితుల యోగక్షేమం తెలుసుకుంటూ ఉంటాడు. కొత్తస్నేహాలు చేయడం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కొడుకు వయసు వాళ్లయినా సరే, మనువడు వయస్సు వాళ్లయినాసరే అందరూ ఆయన సమ వయస్కులే. తనకి మట్టుకు కొడుకూ లేడు. మనవడూ లేడు. ప్రభాత అవివాహితుడు. ఆయన మాటలు విన్నాక అన్నాను: ‘‘మొన్న రాత్రి మీకోసం ఎదురుచూశాం. ఒక్కళ్లిద్దరు నా స్నేహితులను నాతో పాటు అట్టే పెట్టాను. వాళ్లు మీతో మాట్లాడుదామని వచ్చారు. మేము చాలాసేపే ఎదురుచూశాం మీకోసం!’ప్రభాత కొంచెం నాలుక కరుచుకొని సిగ్గుతో అన్నాడు: ‘‘మరచిపోయాను కళ్యాణబాబూ, పూర్తిగా మరచిపోయాను. మొన్న రాత్రి నేను ఆలిపూల్లో మా స్నేహితుడి ఇంట్లో ఉన్నాను. అక్కడ నేనొక యానివర్సరీ సందర్భాన్ని నిర్వర్తించాను’’‘‘మీ స్నేహితుని పుట్టిన రోజా?’’ అని అడిగాను.ఆయన తల ఆడిస్తూ అన్నాడు: ‘‘అదేం కాదు. అతను జన్మదినం, గిన్మదినం ఏం జరుపుకోడు. ఆయనెప్పుడూ పూజ చేయడం కానీ ఏ అనుష్ఠానాలు నిర్వర్తించడం కానీ నేనెప్పుడూ చూడలేదు. అందుకే మధ్య మధ్య అతనితో అంటూ ఉంటాను. సైతానుకైనా అనుష్ఠానాలేవో ఉంటాయి. నువ్వేమైనా సైతాను కంటే గొప్నవాడివా? అటు తర్వాత కొంతకాలం చూశాను ఆయన ఒక అనుష్ఠానాన్ని దృఢమైన నిష్ఠతో పరిపాలించడం. ఏడాదికి ఒక్కసారి మాత్రమే. ఆ సందర్భంలో ఒకే ఒక వ్యక్తిని ఆహ్వానిస్తాడు’’ ‘‘ ఆ వ్యక్తి మీరే కదా?’’ అన్నాను.చిరునవ్వు ముఖంతో నా మాట ఒప్పుకున్నారు ఆయన. ఇంతలో టీ వచ్చింది. ప్రభాత మెల్లిగా తాగుతూ, జేబులో నుంచి సిగరెట్టు పాకెట్టు తీసి ఒక సిగరెట్టు అంటించాడు.ఆయన చవక సిగరెట్టు కాలుస్తాడు. నేను కాల్చనని తెలిసి కూడా, చమత్కారానికి ఒకటి ఇస్తూ అడిగాడు: ఏం కాల్చవా?’’నేను తల ఆడించడం చూసి అన్నాడు: ‘‘బాగుంది, నేనెప్పుడు సిగరెట్టు కాల్చడం మొదలు పెట్టానో తెలియదు. స్తన్యపానం వదలగానే ధూమపానం మొదలుపెట్టానేమో మరి!‘‘ఏం అనుష్ఠానం గురింంచి చెబుతున్నారు?’’ అడిగాను.ప్రభాత అన్నాడు: ‘‘కథ రాయకపోయినా, వాటి రీతి, నీతి కొద్దిగా తెలుసు నాకు. పెళ్లి చేసుకోకపోయినా పెళ్లివారితో వెయ్యిసార్లు వెళ్లాను. కథ సస్పెన్స్ పాడు చేసే అంతటి మూర్ఖుడిని అనుకుంటున్నారా? కథసారాంశం ముందే చెబితే మీరు నా కథ వింటారా?’’ ‘‘కథ అంటే నిక్కచ్చిగా నాకు సంబంధించింది కాదు. అది నా మిత్రుడిది. మీకు చెప్పడంలో ఏమీ ఇబ్బంది లేదు. మన పొట్టలో పెట్టుకుని ఉంచనక్కర్లేదు. కాని ఈ కథ రాయడంలో మీకు సులువు ఉండదు.చాలా పూర్వకాలపు చరిత్రకు చెందిన కథ ఇది. పూర్తిగా పురాతనకాలానిదీ కాదు. పూర్తిగా ఆధునిక పరిస్థితీ కాదు. రోజులైతే పాతవే. అయినా అవి నాలో ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి.నాదప్పుడుయవ్వనదశ. బహుశా ఒక అర్ధశతాబ్దం పూర్వం. అయినా అప్పుడప్పుడు బాగా జ్ఞాపకం వస్తూంటుంది ఆనాటికథ. ఆ కాలం ఓ పడమటి సరిహద్దున ఉన్న ఒక పట్టణానికి కలకత్తా నుంచి బదిలీ అయింది నాకు. నేను ఇంటిపట్టుండేవాడిని. అంచేత వెళ్లడానికి నా మనస్సు ఒప్పలేదు. కలకత్తా నిండా బంధుమిత్రులు. ఆఫీసు సమయం తప్పిస్తే, ఇటూ అటూ తిరుగుతుంటే రోజు గడిచిపోతుంది. ఆ తిరగడంలోనే ఉన్నాయి సాహిత్యం, సంగీతం, నాటకం. నేను వెళ్లే కొత్తచోటు ఉద్యోగం తప్ప మరేం కాలక్షేపం ఉంటుంది? ఆ ఉద్యోగమే ఎలా నిర్వర్తించానో వినండి. సశస్త్ర సైన్యాలకు అయ్యే ఆహారవిహారాల లక్షల రూపాయల ఖర్చుని ప్రతి పైసా ఎలా వ్యయమైందో జాబితా రాయడం నా పని. నాకా పని రుచికరమైనది కాదు. కాని చాకిరీ అంటే చాకిరీ చేయక తప్పదు. ఎలాగంటే భర్త మీద అనురాగం లేకపోయినా, పెళ్లి చేసుకున్న ఆడది ఆయనకి సేవచేయడం తప్ప గత్యంతరం లేనట్లు.ఆ పట్టణంలో నేను ఒక మధ్యతరగతి మెస్ ఆహారం, వసతిగల స్థానంలో మకాం చేశాను. అక్కడైతే బంధురహితంగా ఉంటుందనుకున్నాను, చూసేసరికి అలా లేదు. మా మెస్ ఒక చిన్నతరహా వినోద గృహంగా ఉండేది. పాటలు, మాటలు, నవ్వులు, వేళాకోళాలు, పేకాట, జూదం అన్నీ అక్కడ జరగుతుండేవి. ఎవరికి ఏయే విషయాలలో అభిరుచి ఉంటుందో వాళ్లకు అక్కడ ఆ ఏర్పాటు చేయబడుతుంది. ఆ వినోదగృహంలోకి నా మిత్రుడు శైలేన్సేన్ రావడం మొదలుపెట్టాడు. మా సెక్షన్లోనే అతడు పనిచేసేవాడు. నాలాంటి వాడు కాదు. మనస్ఫూర్తిగా పనిచేసేవాడు. చాలా బుద్ధిమంతుడు. ఆయన గుణాల కంటే రూపం కూడా చాలా ఆకర్షణీయమైనది. అతని పౌరుషం, గాంభీర్యం, ధైర్యం, స్థిరచిత్తం ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాయి. అతని వ్యక్తిత్వంలో ఉన్న విశిష్టత నాలో లేదు. అయితే నాలో ఏయే గుణాలు ఉన్నవో, ఆయనలో వాటి అభావం అతనికి అనుభూతమవుతూనే ఉండేది. మా మొదటి పరస్పరాకర్షణ ఈ అసమాన ధర్మాల వల్లనే అనవచ్చు.శైలెన్ మా మెస్‌లో మాట్లాడకుండా కూర్చునేవాడు. లైబ్రరీ అరలోంచి ఒక పుస్తకం బయటికి తీసి చదువుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు మిగతావాళ్లతో కాలక్షేపాలు చేస్తూ కూర్చునేవాడు. చాలా బిడయపడే స్వభావం కలవాడు. ఇప్పుడైతే అలా కాదు.అందరూ వెళ్లిపోయాక వీలుంటే నా దగ్గరకు వచ్చి కూర్చునేవాడు. ఒకరోజు ఎవరూ లేని స్థలం, సమయం చూసి నాతో అన్నాడు: ‘‘నీతో ఒక మాట చెప్పాలి’’‘‘సరే చెప్పు’’ అన్నాను.‘‘ఆగిపోయావెందుకు? నువ్వేదైతే చెప్పలేకపోతున్నావో, అది నేనే చెపుతాను.(అటుపైన శైలేన్ గొంతుకను అనుకరిస్తూ ప్రభాత్ అన్నాడు: ‘ప్రభాత్ భాయి నేను ప్రేమలో పడ్డాను. పూర్తిగా మునిగిపోయాననుకో. ఈ అగాథం నుంచి నువ్వు నన్ను పైకి ఎత్తాలి)‘‘నా కథ మీకెలా తెలిసింది?’’ అన్నాడు శైలేన్.‘‘ఎప్పుడైతే మీ ఇంట్లో నిన్ను చూశానో అప్పుడే నాకన్నీ తెలిసిపోయాయి’’శైలేన్ మాట్లాడక ఊరుకున్నాడు. ఆ పట్టణంలో నేను ‘మెస్’లో మకాం చేశాను. శైలేన్ అక్కడ ఉండేవాడు కాదు. అక్కడ అతని తండ్రి ఒక ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఉండేవాడు. తండ్రీ, తల్లీ, సోదరీ సోదరులూమొత్తం పెద్దకుటుంబం వాళ్లది. వాళ్లతో ఉండేవాడు శైలేన్. ఆఫీసుకు సెలవు వచ్చినప్పుడు నన్ను వాళ్లింటికితీసుకువెళుతూ ఉండేవాడు. వాళ్ల అమ్మ నన్ను కూడా తన బిడ్డలాగ చూసుకునేది. శైలేన్ సోదరీ సోదరులు నన్ను అనురాగంతో చూస్తూ ఉండేవారు. శైలేన్ ఇల్లు నాకన్నిటిలోకి ఎక్కువ ప్రీతికరంగా ఉండేది. శైలేన్ ఇంట్లో నేను మాధురిని చూశాను. ఆమె సౌందర్యం చూసి శైలేన్ సోదరేమో అనుకున్నాను. మాధురి శైలేన్ చెల్లెలు కాదు సరికదా, ఆమె అతని తల్లిని ‘పిన్ని’ అని పిలిచినా ఆమె అతని పిన్ని కూతురు కూడా కాదని కొంతకాలం తరువాత తెలుసుకోగలిగాను. శైలేన్ ఇల్లూ ఆమె ఇల్లూ కొన్ని గజాల దూరంలో ఒకే వీధిలో ఉన్నాయి. రెండు కుటుంబాల మధ్య గాఢమైన స్నేహం, నిత్యమూ రాకపోకలూ, అన్నపానాలు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం. ఒక ఇంటి తల్లి ఇంకొక ఇంటి ఆడపిల్లకీ మగపిల్లలకీ గౌరవనీయమైన పిన్ని అన్నమాట.‘‘నీకెలా తెలిసింది’’ అడిగాడు శైలేన్.‘‘నీ దాగుడుమూతలు వ్యవహారం అంతా చూస్తుంటే, నీ టేబుల్ మీద మాధురి పేరుతో ఉన్న పుస్తకాలు, ఆమె పాటల పుస్తకంలో నీ అక్షరాలు అన్నీ చూస్తే తెలుస్తుంది’’ అన్నాను.శైలేన్ పట్టుబడిపోయి, నవ్వడం మొదలుపెట్టాడు. ‘‘ఈ కాసేపటిలో నువ్వు కనిపెట్టేశావు. నిన్ను సి.ఐ.డి విభాగంలో నియమిస్తే బాగుంటుంది, ప్రభూ’’ అన్నాడు.శైలేన్ నన్ను ‘ప్రభూ’ అని గౌరవంగా పిలిచేవాడు. శైలేన్ తన కథంతా నాకు చెప్పాడు. నిజానికిఅతను చెప్పడానికే వచ్చాడు. అదే అతని యవ్వనపు రోజుల ప్రణయగా«థ. ఆ ప్రేమ అంతా ఒకప్పుడు చాటుగానే వ్యవహరించబడింది. ఇంట్లో వాళ్ల దగ్గర ఎంత దాచాడో తనలో కూడా తాను దాచుకున్నాడు.ఇప్పుడు అతను కోరేది రెండు కుటుంబాల వాళ్లూ వాళ్ల ప్రేమను అంగీకరించడం. ఏ మాధురి అయితే ఇదివరలో వాళ్లింటికి కూతురిలా వచ్చేదో, ఇప్పుడు కోడలులా రావాలని అతని వాంఛ.‘‘ఆటంకం ఏమిటి?’’ అడిగాను.‘‘కులం అన్నాడు.‘‘మీ కులాల మాట మండ! ఒక పనిచెయ్. మాధురి తండ్రి తనంత తాను కన్యా ప్రదానం చేయకపోతే, నువ్వు ‘సుభద్రాహరణం’ చేయి నేను మిమ్మల్ని కాపాడుతాను’’ అన్నాను.శైలేన్: లేదు భాయి, అలాగ జరగదు.నేను: ఏం మాధురి భయపడుతోందా?శైలేన్: భయపడుతోంది, జంకుతోంది. తన దుర్మార్గపు తండ్రి అంటే ఆమెకి చాలా ప్రేమ. అతనికి విరుద్ధంగా ప్రవర్తించడానికి సాహసించడం లేదు.నేను: అయితే నడు, ఆ ఇంజనీర్ పెద్దమనిషికి నేను అంతా నచ్చజెప్పుతాను. నేను నీ వకీలునై మీ ఇద్దరి మధ్య రాజీ చేస్తాను’’శైలేన్: అరే బాబా! అలా నువ్వు చేస్తే వాళ్ళింటి తలుపు మా ముఖం మీద కొట్టి మూసేస్తారు. మా నాన్న ఆ అవమానాన్ని సహించగలడా? ఒక్క కిటికీ అయినా వాళ్లింటి వైపు తెరచి ఉంచడు. అయినా ఈ సంగతి ఎవ్వరికీ తెలియనీయకు. అలా అయితే చిరకాలపు స్నేహం మా రెండు ఇళ్ల మధ్యా నశించిపోతుంది. ఇలాంటి ప్రేమవివాహాలంటే మా అమ్మానాన్నలకి భయం. గాంధర్వ వివాహం చేసుకుంటే మేము దూరమైపోయి ఎక్కడో ఉండిపోతామని, జననీ జనకులనూ, సోదరీ సోదరులని చూడడానికి రామని.నేను నవ్వుతూ అన్నాను: ‘‘శైలేన్, అయితే నవ్వు ఆ మాట మీద ఉండు. ఇంకేమీ పెద్ద ఆశ పెట్టుకోకు.తరువాత రెండు కుటుంబాలలో గుప్తంగా పెళ్లిళ్ల పేరయ్యలు రాకపోకలు మొదలుపెట్టారు. కొన్నాళ్ల తరువాత నాకు సిమ్లాకు బదిలీ అయింది. నేను సెలవు తీసుకునే రోజున మాధురి వాళ్ల తోటలో నుంచి తెచ్చి ఒక ఎర్రగులాబి గుత్తిని నాకు బహుకరించింది. ఆమె వైపు చూస్తూ అన్నాను:‘‘మాధురీ,నువ్వేమిటి ఇలా చేస్తున్నావు?’’‘‘ప్రభాత్ అన్నయా! నాకు నీ కంటే వేరే నిస్వార్థపరుడైన స్నేహితుడు లేడు. నువ్వు నన్ను మరిచిపోకు’’ అన్నది.నాకు సిమ్లాకు బదిలీ అయిన కొన్నాళ్లకు శైలేన్ పట్నా వెళ్లాడు. మా వయస్సుతో పాటు మా ముఖాలు కూడా మారాయి. బాహ్యంగా ఎన్ని పరివర్తనలు వచ్చినప్పటికీ, మా ఇద్దరి మైత్రీక్షేత్రంలో మటుకు ఏ విధమైన బదిలీ ఎప్పుడూ రాలేదు. దూరంగా ఉన్నా, ఒకళ్ల కబురు మరొకళ్లం లేఖల ద్వారా తెలుసుకుంటూ ఉండేవాళ్లం. అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉండేవాళ్లం. మాధురి తల్లి చనిపోయింది. ఇద్దరు సోదరులు పెద్దవాళ్లయ్యారు. తండ్రి పూర్తిగా ముసలివాడయ్యాడు. ఆ మొండి తండ్రి ఇప్పుడు అసహాయుడై పూర్తిగా తన కూతురిపై తన దినచర్య గడిచేందుకు ఆధారపడి ఉన్నాడు. మాధురి ఒక్కసారిగా అతనికి తల్లిగా, కుమార్తెగా వ్యవహరించవలసి వస్తోంది.శైలేన్ తల్లిదండ్రులిద్దరూ మరణించారు. అతని సోదరులు అతనిపై ఆధారపడ్డారు. వాళ్ల పెళ్లి చేసి అన్ని పూచీలు తీర్చాడు. వాళ్లందరూ అతను ఉద్యోగం చేసే చోట ఒక కుటుంబం క్రింద చేరేవారు. అయితే పెళ్లికాని పెద్దన్నయ్య కుటుంబానికి వటవృక్షంలాంటివాడు. ఆపైన నేనూ శైలేన్ ఇంచుమించు ఒకే సమయంలో రిటైర్ అయ్యాము. అయితే శైలేన్కి ఎక్సెటెన్షన్తో పాటు ప్రమోషన్ కూడా వచ్చింది. నాకేమీ రాలేదు. ఇప్పుడు నేనూ, శైలేన్ పెన్షన్ తెచ్చుకునేందుకే వెళ్లినప్పుడు కలుసుకుంటూ ఉంటాము. మేము రిటైర్ అయ్యాక కలకత్తా వచ్చాము. అతను ఉత్తరభారతంలో, నేను దక్షిణ భాగంలోనూ ఉన్నాము. తరచు ఒకరినొకరు చూసుకోవడం తగ్గింది. ఉత్తరప్రత్యుత్తరాలు ఆగిపోయాయి. శైలేన్ ఒకసారి రాశాడు: ‘‘నీ చేతిరాత ఏ మాత్రం చదవడానికి తెలియడం లేదు’’నాకు కోపం వచ్చి అప్పటి నుంచి అతనికి ఉత్తరాలు రాయడం మానేశాను. ఇప్పుడు కేవలం ఫోను చేసుకుంటాము. అతను అలీపూర్‌లో ఒక అందమైన రెండస్తుల మేడ కట్టుకున్నాడు. ఇంతకు పూర్వం తమ్ముడి బిడ్డలు ఉండేవారు, ఇప్పుడు వరుసకు మనుమలు, మనుమరాళ్లు అతనితో మకాం చేస్తున్నారు. నాకు ఇల్లూ వాకిలీ ఏమీలేవు. ఏదో మా పిత్రార్జితమైన ఒక పూర్వకాలపు ఇల్లు ఉంది. అన్నగారితో పాటు నేనూ దానికి భాగస్వామిని. అయితే పేరుకి మటుకే. ఇంటిలో కొంచెంసేపే ఉంటాను. ఇది 12 సంవత్సరాల క్రితం మాట. పెన్షన్ తీసుకొని తిరిగి వస్తుంటే నా వెనకాల నుంచి హఠాత్తుగా ఒకడు వచ్చి నా చెయ్యిపట్టుకుని అరిచాడు‘‘డబ్బుపై ఎందుకండీ ఇంత మక్కువ?’’చూస్తే అతను శైలేన్. నవ్వుతూ అన్నాను: ‘‘ముసలితనంలో కాంత వదులుతుంది కాని, కనకం కాదు. పళ్ళూ పాలూ కొనుక్కోవాలంటే డబ్బుండాలి కదా’’శైలేన్ నన్ను ఒక టీ దుకాణానికి తీసుకువెళ్లాడు. ‘‘నీతో ఒక మాట చెప్పాలి’’ అన్నాడు. ఒకళ్లకెదురుగా మరొకళ్లం ఒక ఖాళీ టేబుల్ దగ్గర కూర్చున్నాం. ముసలితనం ఒకడి జుట్టు లాగేసింది. మరొకడి పళ్లు ఊడ పీకింది. శైలేన్ ఏమీ ఎక్కువగా మాట్లాడక, కాగితం సంచిలో నుంచి ఒక కవరు బైటకు తీసి నాకు చూపించి చదవమన్నాడు.బాగా పరిచితమైన చేతివ్రాలు. ‘‘ఇది ఆమె రాసిన ఉత్తరం’ అన్నాను.కవర్లో నుంచి ఉత్తరం బయటికి తీసి చదివాను. కాని అందులో రెండే లైనులు: ‘‘నీతో ఒక ముఖ్యమైన మాట చెప్పాలి. తప్పకుండా రా. ఇట్లు నీ మాధురి’’‘‘ముసలితనంలో కూడా కొంతమందికి కాంత వదలదు. ఎక్కడుంది ఆమె?’’నవ్వుతూ అన్నాను.శైలేన్: ‘‘బారక్పూర్లో, సోదరులతో ఉంటోంది’’తండ్రి చనిపోయాక మాధురీ వాళ్లూ లక్నోలో ఇల్లు విడిచి కలకత్తా వైపు వచ్చేశారు. కాని ఎక్కడో స్పష్టంగా తెలియదు. సోదరులు ఉద్యోగాలు చేస్తున్నారు. మాధురి పంతులమ్మ పనిచేస్తోంది. ఆరోగ్యంచెడిపోయాక ఉద్యోగం విరమించుకుంది. తండ్రి పెద్ద ఆస్తి ఏమీ విడిచి పెట్టలేదు. 30 వేల రూపాయలు డిపాజిట్ చేసి కూతురి ఇచ్చాడు.కొడుకులకి కొద్దికొద్దిగా పంచి పెట్టాడు.శైలేన్: ‘‘చాలా కాలం నుంచి ఒంట్లో బాగుండటం లేదు, నడు, ఒక మారు చూసివద్దాం ముఖ్యమైన మాటేమిటో’’ నేను: నువ్వొక్కడివే వెళ్లు. నేను కూడా వస్తే ఆ మాట బయట పడదు’’శైలేన్: ‘కాదు నువ్వు కూడా రా. ఈ వేళే వెళదాం.మరో రోజున వెళ్దాం అన్నాను నేను. కాని ఆలస్యానికి ఒప్పుకోలేదు శైలేన్. మళ్లీ ఎప్పుడు ఎవరు చెప్పగలరు? ఒకళ్లకొకళ్లు ఫోను చేసుకున్నాక వెళ్లాను. బారక్పూర్. శైలేన్ టాక్సీలో వెళ్దామన్నాడు.‘‘పెన్షన్ డబ్బులు చాలామట్టుకు ఖర్చు అయిపోయాయి. నడు, బస్సులో వెళ్దాం’’ అన్నాను.వెళ్లేటప్పుడు కాలేజీ స్ట్రీటు మార్కెటు నుంచి ఒక డజను అప్పుడే కోసిన పెద్ద పుష్పాలు కొని పట్టుకెళ్లాను.శైలేన్ వేళాకోళం చేస్తూ అన్నా ్నడు:‘‘నిన్ను చూస్తే, నీ నాటకాల హాబీ నీలో బాగా స్థిరపడినట్లే ఉంది?’’స్టేషన్‌కి దగ్గరే ఇల్లు. రెండంతస్తుల మేడలో ఒక ఫ్లాట్‌లో ఉంటోది ఆమె. గొళ్లెం కొట్టాక, ఒక ఆవిడ వచ్చి తలుపు తెరిచింది. మమ్మల్ని మేముపరిచయం చేసుకున్నాక, ఆవిడమమ్మల్నిమాధురి వద్దకు తీసుకువెళ్లింది.ఒక చిన్న మంచం మీద మాధురి పడుకుని ఉంది. శుభ్రంగా ఉన్న తెల్లని పరుపు ప్రక్క. ఇల్లు కూడా శుభ్రంగా ఉంది. కాని ఈ మాధురి ముఖం ఏం ఇలా ?ప్రక్కకు అంటి పెట్టుకున్నట్లు అయిపోయింది ఆమె శరీరం. లేచి కూర్చునే శక్తి లేదు ఆమెకు.అయినప్పటికీ మమ్మల్ని చూసేసరికి ఆమెకు లేని శక్తి ఒకటి కలిగింది, ఉత్సాహంతో కూర్చుంది. నాకేసి చూసి నవ్వుతూ అంది: ‘‘నాకు తెలుసు, నువ్వు కూడా వస్తావని’’ఆపైన ఏం వ్యవహారం నడిపించిందో మాధురి, వినండి. తన సోదరుల భార్యలనిద్దరినీ పిలిచి చెప్పింది:‘‘లక్ష్మీదేవి విగ్రహం ముందు కుంకుమభరిణె ఉంది. దాంట్లో కుంకుమ పొడి పెట్టాను. అది తీసుకురండి’’చిన్న మరదలు పట్టుకొచ్చింది ఆ కుంకుమభరిణె. ఆమె చేతులోంచి భరిణె తీసుకుని శైలేన్ చేతిలో పెట్టింది మాధురి:‘ఈ కుంకుమ నా పాపిటిలో అలంకరించు. నేను అవివాహితగా మరణించడానికి ఇష్టపడను’’నేనింకా ఏం పరిశీలించానంటే, మాధురి కేశసంపద పూర్వపు మేఘవర్ణాన్ని పోగొట్టుకుందని, వయస్సు అంత పెద్దగా ముదిరిపోకపోయినాఆమెజట్టు బాగా పలచబడిపోయింది. అక్కడక్కడా నెరిపినట్లుగా కంటికి స్పష్టంగా కనిపిస్తోంది.శలేన్ ఆమె కోరినట్లుగా పాపిటి మధ్య సింధూరాన్ని అలంకరించాడు. ఆమె మరదళ్లు శంఖంఊదదలుచుకున్నారు. (వంగ దేశపు ఆచారాన్ని అనుసరించి), కాని చేత్తో సంజ్ఞ చేసి ఆపు జేసింది మాధురి.‘‘మాధురీ, నీ ముదిరిపోయిన జుట్టులో సింధూరపు రేఖను దాల్చేందుకు ఇన్నాళ్లుఎదురుచూశావా?’పాడ్యమి నాటి చంద్రుని వంటి చిరునవ్వు రేఖ మాధురి ముఖంపై తాండవించింది. ‘‘అవును ప్రభాత్ దా, ఇప్పుడింక మిగతా పెళ్లి మంత్రాలు చదువు’’నేనేమైనా బ్రాహ్మణుడినా మంత్రాలు పఠిచేందుకు? నేను నిజంగా మంత్ర ముగ్ధుడినై పోయాను. అందుచేత మెల్లిగా రెండు వాక్యాలు పలికాను.‘‘యదిదం హృదయం తవ! తదిదం హృదయం మమ’’( ఈ నా హృదయం నీది. ఆ నీ హృదయం నాది)వాళ్లిద్దరూ చదవలేదు. కాని చెవి ఒగ్గి విన్నారు. జీవింతలో ఎంతమంది పెళ్లివారితో ప్రయాణం చేయలేదు! ఎంతో దూరదూరాలు దుర్గమసీమలు తరలి వెళ్లాను. కాని ఇటువంటి పెళ్లిప్రయాణంఎప్పుడూచేయలేదు. కల్యాణ్‌బాబు! ఇటువంటి పౌరోహిత్యం ఎక్కడా నిర్వరించలేదు’’నేను కొన్న పుష్పగుచ్ఛం సఫలంగా ఉపయోగించింది. ఆ పువ్వులని మాధురి పక్కపై ఒక మూల ఉంచాను. కొన్నిక్షణాలకిఆమె రోగశయ్య పూలపాన్పుగా మారింది.కాని మాధురి అటు తర్వాత ఎక్కువరోజులు బతకలేదు. ఆమె తమ్ముళ్లు అనేక విధాలుగా ఖర్చు పెట్టి చికిత్స చేయించారు. శైలేన్ కూడా ప్రయత్నదోషం చేయలేదు. కలకత్తా తీసుకువచ్చి ఒక నర్సింగ్‌హోంలో ప్రవేశపెట్టాడు. ఆమె కడుపులో వ్రణం మట్టుకు ఏమాత్రం తొలగలేదు. ఆమె ఆపరేషన్ బల్లపై మరణించింది. మరొక డజను రజనీగంధపుష్పాలనుతీసుకువెళ్లానుఆమెను చూడటానికిశైలేన్ స్వయంగా ఆమె శవాన్ని దహనపరచాడు. 5000 రూపాయలను తన జేబులోంచి తీసి ఆమె శ్రాద్ధకర్మ కొరకు వెచ్చించాడు. అన్నదానం చేశాడు. భజనగాళ్లచే భజనలు చేయించాడు. అంతకుపూర్వంఇటువంటి విషయాలలో అతనికి నమ్మకం ఉండేది కాదు. ఇదంతా మాధురి ఇచ్ఛానుసారం చేశాడని గ్రహించుకున్నాను. ఆ మధుర హృదయపుమరొక తుది కోరికకు చెందిన నిదర్శనాన్ని శైలేన్ నాకు చూపించాడు. ఇంతక్రితం తీసిన కాగితపు సంచి నుంచి మరొక పెద్ద కవరు బైటకు తీశాడు. మాధురి కోరిక ఆ కవరు తెరిచి ఆమె మరణానికి పూర్వం చదవకూడదని. తెరిచాక చూస్తే అది లేక కాదు. ఒక ఆకుపచ్చరంగు చిన్న కవరులో 30 వేల రూపాయలకు శైలేన్ పేరిట చెక్క రాయబడి ఉంది.శైలేన్ అన్నాడు: ‘‘నేనీ డబ్బు ఎందుకుతీసుకోవాలి?’’‘‘తీసుకోవయ్యా, పెళ్లి చేసుకున్నందుకు నీకేం కట్నం దొరకలేదు. అలాంటి సొమ్ము ఎవరు వదులుకుంటారు?’’మాధురి సోదరులకు కొంచెం సొమ్ము సమర్పించాడు శైలేన్. ఆ సందర్భంలో నేనొక్కడినే అతిథిని. అతని ఇంటిగోడపై మాధురి పెద్ద ఫోటో ఒకటి వ్రేల్లాడుతూంది. అది ఆమె ప్రథమ యవ్వనపు రోజులనాటి ఛాయా చిత్రం. ఆ తరుణి ఛాయాచిత్రం ముందు మేమిద్దరం ముసలివాళ్లం కుర్చీలు వేసుకొనికూర్చున్నాము. టీ త్రాగాము, కబుర్లు చెప్పుకున్నాము. ఒక్కొక్కప్పుడు ఏమీ మాట్లాడకుండా ఊరికే కూర్చుని ఉన్నాము.శైలేన్ మృత్యువు బారి నుంచి ఒక ప్రేమవస్తువుని రక్షించాడు. నా మట్టుకు నేను వార్ధక్యపు బారి నుంచి ఒక స్నేహాన్ని కాపాడాను.... ప్రభాతబాబు లేచి నిలబడ్డాడు. ఈవేళ ఎదురుగుండా పెట్టిన గొడుగు మాట మరిచిపోయాడు ఆయన. నేను అది తీసి ఆయన చేతికి అందించాను. ఆయన మెల్లిగా నవ్వి, ‘‘థ్యాంక్స్’’ అన్నాడు. బెంగాలీ మూలం : నరేంద్రనాథ్ మిత్రా తెలుగు: రాధాకృష్ణమూర్తి చల్లా -
బ్రెస్ట్ కేన్సర్‌తో హార్ట్ ఫెయిల్యూర్
సాక్షి, సిటీబ్యూరో: మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ఎంతో మంది చిన్నతనంలోనే పలు రకాల కేన్సర్ల బారిన పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు గర్భాశయ ముఖద్వార కేన్సర్లతోను, పట్టణ మహిళలు రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్నారు. మద్యపానం, ధూమపానం, గుట్కా, పాన్ మసాలాలు అధికంగా వాడడంతో పురుషులు స్టమక్, నెక్ అండ్ మౌత్ కేన్సర్ల బారిన పడుతున్నట్టు ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో నమోదైన కేసులను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. నేడు ‘ప్రపంచ కేన్సర్ డే’ సందర్భంగా ప్రత్యేక కథనం. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు తదితర కారణాలతో ఎంతో మంది చిన్నతనంలోనే పలు రకాల కేన్సర్ల బారిన పడుతున్నారు. అతిగా మద్యం తాగడం, ధూమపానం, గుట్కా, పాన్ మసాలాలు అధికంగా వాడటంతో పురుషులు స్టమక్, నెక్ అండ్ మౌత్ కేన్సర్ల బారిన పడుతుండగా, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన లేక గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు గర్భాశయముఖ ద్వార కేన్సర్ల బారిన పడుతున్నారు. ఎక్కువగా రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నగరంలోని ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో 2017లో కొత్తగా నమోదైన కేన్సర్ కేసులను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతోంది. ఆ ఏడాది మొత్తం 1,1000 కేన్సర్ కేసులు నమోదు కాగా, వీటిలో 2200 లుకేమియా, 1800 స్టమక్, 1600 హెడ్ అండ్ నెక్, 1500 గర్భాశయ ముఖ ద్వారం, 1000 రొమ్ము, 800 ఎముక సంబంధ, 500 కాలేయం, 220 బ్రెయిన్, 100 కిడ్నీ సంబంధ కేన్సర్లు నమోదయ్యాయి. ఆరోగ్యశ్రీ లెక్కల ప్రకారం.. గత నాలుగేళ్లలో ఆరోగ్యశ్రీ పథకం కింద కేన్సర్ చికిత్సల సమాచారాన్ని పరిశీలిస్తే 49 శాతం మహిళలు దీని బారిన పడగా, ఇందులో రొమ్ము కేన్సర్ చికిత్సలు 18.70 శాతం. గర్భాశయ ముఖద్వార చికిత్సలు 30.25 శాతం ఉండడం గమనార్హం. రొమ్ము కేన్సర్‌లో హైదరాబాద్ 7,528 కేసులతో తొలిస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. అదే విధంగా గర్భాశయముఖ ద్వార కేన్సర్‌లో వరంగల్ జిల్లాలో అత్యధికంగా 10064 చికిత్సలు జరగ్గా, ఆ తర్వాతి స్థానాల్లో కరీంనగర్, నల్లగొండ జిల్లాలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో చికిత్స పొందుతున్నది నిరుపేదలే. ‘లక్షణం’గా గుర్తించుదాం..నివారించుదాం కేన్సర్‌పై పోరాటంలో తొలి అడుగు దానిని గుర్తించడం. అలా జరగాలంటే దాని లక్షణాలపై మనకు సరైన అవగాహన అత్యవసరం. ముందస్తుగా దీనిపై అవగాహన పెంచుకోవాలి అంటున్నారు అపోలో క్లినిక్స్‌కు చెందిన రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి.విజయ్ కరణ్‌రెడ్డి. ♦ అప్పుడప్పుడూ దగ్గు వచ్చి తగ్గడం సహజమే. 3 వారాలు అంతకు మించి ఏకధాటిగా దగ్గు ఊపిరితిత్తుల కేన్సర్‌కి సంబంధించి ఓ ప్రధాన లక్షణం. అన్ని దగ్గులూ కేన్సర్‌కి దారి తీస్తాయని చెప్పలేం గానీ, ఛాతీ ఎక్స్‌రే లేదా సీటీ స్కాన్ ద్వారా పరీక్షలు చేయించుకోవడం మంచిది. ♦ పేగుల కదలికలు సులభంగా ఉండకపోవడం, తరచూ డయేరియా, మలబద్ధకం వంటివి జీర్ణాశయ కేన్సర్ లక్షణాలుగా సందేహించవచ్చు. చాలా రోజుల పాటు ఆకలి వేయకపోవడం, లేదా కడుపు నిండుగా ఉన్నట్టు ఉండడం వంటి లక్షణాలు కూడా జీర్ణకోశ అన్నవాహిక సమస్యలకు కారణం కావచ్చు. ఇలాంటి లక్షణాలు గమనిస్తే తప్పనిసరిగా ఎండోస్కొపీ/కొలనోస్కోపీ పరీక్షలు చేయించుకోవాలి. ♦ మూత్రవిసర్జన సమయంలో ఇబ్బందులు, తరచూ రక్తం పడడం, నొప్పి వంటివి /కిడ్నీ/బ్లాడర్/ప్రొస్టేట్ కేన్సర్ లక్షణాలు కావచ్చు. కాబట్టి తప్పనిసరిగా పరీక్ష చేయించి నిర్ధారించుకోవాలి. ♦ కొత్తగా పుట్టు మచ్చల వంటివి కనపించడం, లేదా అప్పటికే మనకి ఉన్న పుట్టుమచ్చలు పెద్దవిగా లేదా మరే రకంగానైనా రూపు మారడం వంటివి స్కిన్ కేన్సర్ లక్షణాలు. ఇవి గమనిస్తే డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించాలి. అన్నీ మెలనోమాకు సూచనలు కాకపోవచ్చు. ♦ ఏదైనా గాయం తర్వాత పుండ్లు ఏర్పడి, 3 వారాలు దాటినా మానకపోవడం నయం కాకపోవడం జరిగితే.. ఈ పుండ్లు కేన్సర్‌గా పరిణామం చెందే అవకాశాలు న్నాయి. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. ♦ మహిళల్లో సాధారణ రుతుచక్ర సమయానికి అనుకోని ప్రదేశం నుంచి రక్తస్రావం కావడం అనేది గర్భాశయ ముఖద్వార/గర్భాశయ కేన్సర్‌కు లక్షణాలు. పురుష నాళం నుంచి రక్తస్రావమైతే అది పెద్ద ప్రేవు కేన్సర్ లక్షణం. అలాగే దగ్గుతో పాటు రక్తం, వాంతిలో, ఉమ్మిలో రక్తపు మరకలు కూడా సందేహాస్పదమే. ♦ అకస్మాత్తుగా, మన ప్రమేయం లేకుండా బరువు తగ్గిపోతే అది కణితి లేదా కేన్సర్ వల్ల కావచ్చు. ఏదైనా సమయంలో కణితి ఏర్పడి అది రూపుమారుతూ ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించాలి. అలాగే రొమ్ములలో గడ్డలు రొమ్ము కేన్సర్ లక్షణాలు. తరచూ అజీర్ణం, మింగడంలో ఇబ్బంది, మింగుతున్నప్పుడు నొప్పి కలగ డం అనేవి మెడ అన్నవాహిక కేన్సర్ లక్షణాలు కావచ్చు. ♦ కొంత వయసు మీద పడిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అతిగా శ్రమించినప్పుడు కూడా ఇది జరుగుతుంటుంది. కానీ అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఊపిరితిత్తుల కేన్సర్లక్షణాలుగా అనుమానించాలి. ఏడాదికి 50 వేల కేసులు ఖైరతాబాద్: కేన్సర్ పట్ల ప్రతి ఒక్కరిలో అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ డి.మధు తెలిపారు. కేన్సర్ సంబంధిత సమస్యలతో దేశంలో ఏటా 7లక్షల మంది మరణిస్తున్నట్లు తెలుస్తోందని, 2035 నాటికి 17లక్షల కేసులు నిర్ధారణ అవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏటా 50వేల కేన్సర్ కేసులు నమోదవుతున్నాయన్నారు. డాక్టర్ డి.మధు బ్రెస్ట్ కేన్సర్‌తో హార్ట్ ఫెయిల్యూర్ విభిన్న రకాల కేన్సర్లలో ప్రస్తుతం నగర మహిళలకు అత్యధికంగా బాధిస్తున్న బ్రెస్ట్ కేన్సర్ నివారణకు తరచు వైద్య పరీక్షలు తప్పనిసరని జూబ్లీహిల్స్‌లోని అపోలో క్రెడిల్కు చెందిన గైనకాలజీ/ఆబస్టెట్రిక్స్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ లక్ష్మీరత్న అభిప్రాయపడ్డారు. బ్రెస్ట్ కేన్సర్ తర్వాత హార్ట్ ఫెయిల్యూర్‌కు కూడా దారి తీయవచ్చునని డానిష్ పరిశోధన తేల్చిందన్నారు. బ్రెస్ట్ కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న మహిళలు ఆట్రియల్ ఫైబ్రిల్లేషన్ అనే గుండె సంబంధ వ్యాధికి గురై తద్వారా స్ట్రోక్, రక్తం గడ్డకట్టడం నుంచి హార్ట్ ఫెయిల్యూర్ దాకా తెచ్చిపెట్టే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయని ఆమె వెల్లడించారు. బ్రెస్ట్ కేన్సర్ బాధిత మహిళలు అట్రియల్ ఫైబ్రిల్లేషన్ పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరించడం అత్యంత ప్రధానమైన విషయమని, హై కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని రిస్క్‌ని మరింత పెంచుతుంది కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ రోజువారీగా వ్యాయామం చేయాలని, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచించారు. మహిళల్లో గైనిక్, రొమ్ము కేన్సర్లు.. జననాంగాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, పదే పదే సుఖవ్యాధులు సోకడం, పౌష్టికాహారం లోపించడం, 18 ఏళ్ల లోపే పెళ్లి కావడం, పిల్లలు పుట్టడం వల్ల మహిళలు గర్భాశయ ముఖద్వార కేన్సర్ల బారినపడుతున్నారు. పుట్టిన పిల్లలకు పాలివ్వక పోవడం వల్ల అనేక మంది రొమ్ము కేన్సర్ల బారినపడుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని కేన్సర్‌పై విస్తృతంగా అవగాహన కల్పించడం, 9 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు బాలికలకు హెచ్‌పీవీ టీకాను ఇప్పించడం, రొ మ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్లను గుర్తించడానికి నర్సులు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇవ్వడం ద్వారా కేన్సర్‌ను గుర్తించవచ్చు. – డాక్టర్ సాయిరామ్, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి పురుషుల్లో దంత, నోటి కేన్సర్లు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ గుట్కా, జర్దా, పాన్‌మసాలా, బీడీ, సిగరెట్ వినియోగం ఎక్కువగా ఉంది. చిన్న వయసులోనే అనేక మంది వీటికి అలవాటు పడుతున్నారు. చదువుకున్న వారితో పోలిస్తే చదువుకోని యువకులు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఎక్కువగా వీటికి అలవాటుపడుతున్నారు. పొగాకు ఉత్పత్తులను నోటిలో నమలడం వల్ల దంత, నోటి కేన్సర్లకు కారణమవుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నగరంలో ఈ బాధితుల సంఖ్య అధికంగా ఉంది. సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండటం వల్ల కేన్సర్ బారిన పడకుండా ఉండొచ్చు. – చంద్రకాంత్, దంతవైద్య నిపుణుడు, మహావీర్ ఆస్పత్రి -
స్మోకింగ్ మానేశా : అఖిల్ అక్కినేని
మిస్టర్ మజ్ను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్, సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. థియేటర్లకు వెళ్లి అభిమానులను స్వయంగా కలవటంతో పాటు ఛానల్లకు ఇంటర్య్వూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిల్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తనకు స్మోకింగ్ అలవాటు ఉండేదని ఇటీవల దాన్ని వదిలేసినట్టుగా చెప్పాడు అఖిల్. అంతేకాదు అందరూ స్మోకింగ్ మానేయాలని సూచించాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కిన మిస్టర్ మజ్ను ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు డివైడ్ టాక్ రావటంతో అఖిల్ సినిమా ప్రమోషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతమందించగా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. -
సన్యాసులకు రాందేవ్ బాబా సూటిప్రశ్న
ప్రయాగరాజ్ : కుంభమేళా వేదికగా పొగతాగడం మానుకోవాలని యోగా గురు రాందేవ్ బాబా సాధుసంతులను కోరారు. ‘మనం ఎన్నడూ పొగతాగని రాముడు, కృష్ణుడు వంటి దేవతలను ఆరాధిస్తాం..మరి మనం వాటికి ఎందుకు దూరంగా ఉండకూడ’దని సన్యాసులను ప్రశ్నించారు. స్మోకింగ్‌ను విడిచిపెడతామని మన మంతా ప్రతినబూనాలని పిలుపుఇచ్చారు. ‘సమున్నత లక్ష్యం కోసం మనం తల్లితండ్రులను, ఇంటిని విడిచిపెడతాం..అలాంటిది మనం పొగతాగడాన్ని ఎందుకు మానుకోలే’మని అన్నారు. ఇక పలువురు సన్యాసుల నుంచి ఆయన పొగగొట్టాలను సేకరించి, పొగతాగడం మానివేస్తామని వారితో ప్రతిజ్ఞ చేయించారు. తాను నిర్మించి మ్యూజియంలో ఈ పొగగొట్టాలను ప్రదర్శిస్తానని చెప్పుకొచ్చారు. తాను యువతను పొగాకు, స్మోకింగ్‌ను వదిలివేసేలా చేశానని, మహాత్ములచే ఆ పని ఎందుకు చేయించలేనన్నారు. కాగా 55 రోజుల పాటు సాగే కుంభమేళా మార్చి 4న ముగుస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక వేడుకగా పేరొందిన కుంభమేళాలో పలు దేశాల నుంచి 13 కోట్ల మంది పాల్గొని పవిత్ర గంగా జలాల్లో పుణ్యస్నానం ఆచరిస్తారని అధికారులు చెబుతున్నారు. -
'పొగ’చూరుతున్న ఆరోగ్యం
సాక్షి సిటీబ్యూరో: నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో నడుస్తున్న పొగగొట్టాలు పెరిగిపోతున్నాయి. గుప్పుగుప్పు మంటూ ఒకరు.. రింగురింగులు వదులుతూ ఇంకొకరు ఎక్కడపడితే అక్కడ.. తమ ఇష్టం వచ్చినట్లు ఊదేస్తున్నారు. పక్కనున్నవారు ఎంత ఇబ్బందిపడ్డా.. వద్దని వారించినా పట్టించుకోకుండా పొగరాయుళ్లు తమ ప్రతాపం చూపుతున్నారు. ఎక్కడ చూసినా వారే.. బహిరంగ ప్రదేశాలు, బస్టాప్‌లు, రైల్వేస్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు హోటళ్లు, సిని యా థియేటర్లతో పాటు టిఫిన్ సెంటర్లు, జ్యాస్షాప్లు, టీ స్టాల్స్ వద్ద ఎప్పుడు పడితే అప్పుడు పొగరాయుళ్లు నిర్భయంగా ధూమపానం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వ ప్రకటనలు, అటు వైద్యుల హెచ్చరికలను వీరు పట్టించుకోవడంలేదు. వీరి అలవాటుతో తమ ఆరోగ్యంతో పాటు పక్కనున్న వారి ఆరోగ్యానికి చేటు చేస్తోంది. ధూమపానంతో ఇతరులకు తీవ్ర నష్టం జరుగుతోందని 2008లో కేంద్ర ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో ధూమాపానం చేయడాన్ని నిషేధిస్తూ చట్టం చేసి కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ చట్టం ఎక్కడా అమలు చేయకపోవడం విచారకరం. జరిమానాల జాడేలేదు.. బహిరంగంగా ధూమపానం చేసేవారిపై జరిమానాలు విధించడంతో పాటు పదేపదే పట్టుబడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే అందుకు అవసరమైన కార్యచరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై నియంత్రణ లేకపోవడంతో పొగరాయుళ్లు రెచ్చిపోతున్నారు. మరోపక్క యువత కూడా ఇటువైపు ఆకర్షితులై పెడదోవ పడుతున్నారు. చట్టం అమల్లోకి వచ్చి పదేళ్లవుతు న్నా నగరంలో ఒక్క జరిమానా విధించకపోవడం గమనార్హం. ఇక ఆటోవాలాలు, బైకులపై తిరిగేవారు ఇష్టానుసారంగా పొగతాగుతున్నారు. ఆటో లో పాసింజర్లు ఉన్నా వారి విజ్ఞప్తిని పట్టించుకోకుండా పొగతాగే డ్రైవర్లు నగరంలో కోకొల్లలు. ప్రధాన రహదారుల్లో ద్విచక్ర వాహనాలను, కార్ల ను నడుపుతూ ఓ చేత్తో హాండిల్, మరో చేతిలో సిగరెట్ కాలుస్తూ ప్రయాణాలు చేస్తున్నారు. హోటల్స్, పార్కుల్లో కూడా.. నగరంలోని దాదాపు అన్ని హోటళ్ల వద్దా సిగరెట్ షాప్‌లు ఉన్నాయి. అక్కడే చాయ్ తాగి దమ్ము లాగుతున్నారు. పక్కనున్న వారికి ఇబ్బంది కలుగుతుందని వారిస్తే గొడవకు దిగుతున్నారు. ఇక పార్కుల్లో సైతం ధూమపానం చేస్తున్నారు. సందర్శకులకు ఇబ్బందికరంగా ఉందని చెప్పినా వెనక్కి తగ్గడం లేదు. బయట ‘పొగ తాగరాదు’ అన్న బోర్డులు దర్శనమిస్తున్నా వాటిని పొగరాయుళ్లు ఎవరూ లెక్కచేయడం లేదు. కఠిన చర్యలు తీసుకోవాలి... బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రధానంగా రద్దీగా ఉండే ప్రాంతాలు, పార్కులు, డ్రైవింగ్ చేస్తూ, కార్యాలయా పరిసరాల్లో సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసేవారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని, అప్పుడే వారి ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని చెబుతున్నారు. -
ఒక్క సిగరెట్.. 51 మందిని బలి తీసుకుంది
కఠ్మాండు : గతేడాది మార్చిలో నేపాల్ రాజధాని కఠ్మాండూ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ప్రమాదంలో 51 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఏడాది తర్వాత ఈ ప్రమాదానికి గల కారణాలు వెలుగులోకి వచ్చాయి. విమానం నడుపుతున్న పైలెట్ కాక్‌పిట్‌లో సిగరెట్ తాగడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు విచారణలో తేల్చారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. దీంతో అధికారులు దర్యాప్తు కోసం ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా ప్యానెల్.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను పరిశీలించింది. విమానం నడుపుతున్న సమయంలో పైలట్ నిబంధనలకు విరుద్ధంగా కాక్‌పిట్‌లోనే పొగ తాగినట్లు అధికారులు గుర్తించారు. కాక్‌పిట్‌లోని సిబ్బంది నిర్లక్ష్యం, ల్యాండింగ్ సమయంలో పరిస్థితిపై అవగాహన కోల్పోవడం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. గతేడాది మార్చిలో యూఎస్–బంగ్లా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బాంబార్డియర్ డాష్ 8 క్యూ 400 విమానం 67 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి కఠ్మాండుకు బయల్దేరింది. నేపాల్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.20 గంటల సమయంలో కఠ్మాండు ఎయిర్‌పోర్టులో దిగుతుండగా ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది సహా 51 మంది చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 67మంది ఉన్నారు. -
‘పొగ’ మానేయండి..మందూ మానేస్తారు!
వాషింగ్టన్: న్యూ ఇయర్ సందర్భంగా పొగతాగడం మానేయాలని నిశ్చయించుకున్నారా.. అయితే మీరు మద్యం తాగడం కూడా మానేస్తారని అంటున్నారు శాస్త్రవేత్తలు. అదేలా అనుకుంటున్నారా.. నికోటిన్ అండ్ టొబాకో రీసర్చ్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం పొగతాగడం మానేయడానికి ప్రయత్నించే మందుబాబులు మెల్లగా ఆల్కహాల్నూ తీసుకోవడం తగ్గిస్తారు. అంతేకాదు రోజూ పొగతాగే అలవాటు దూరమవుతుంది. అమెరికాలోని ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సారా డెర్మోడి మందుబాబులపై చేపట్టిన పరిశోధన వివరాలు వెల్లడించారు. సిగరెట్ వినియోగం ముఖ్యంగా మద్యం సేవించే వారిలో ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య సంబంధాలను కనుగొనడానికి 22 మందిపై కొన్నివారాల పాటు పరిశోధన చేశారు. మద్యం మానేయడానికి చికిత్స పొందుతున్న (ఎవరైతే రోజూ పొగతాగే అలవాటు ఉందో) వారి నికోటిన్ మెటబోలైట్ నిష్పత్తి, నికోటిన్ మెటబాలిజం ఇండెక్స్‌ను అధ్యయనం చేశారు. వారంలో సగటున 29 నుంచి 7 కు వీరి నికోటిన్ మెటబోలైట్ రేటు తగ్గేలా చేశారు. దీంతో మద్యపానం సేవించడం తగ్గిపోయింది. నికోటిన్ మెటబోలిజం రేషియో అధికంగా ఉన్న మందుబాబులు ఎక్కువ పొగతాగుతారని, ఎక్కువ సమయం పొగతాగడానికే కేటాయిస్తారని రీసెర్చ్‌లో తేలింది. నికోటిన్ మెటబోలిజం రేషియో తగ్గించడం ద్వారా పొగతాగే అలవాటును మాన్పించవచ్చని సారా పేర్కొన్నారు. నికోటిన్ మెటబోలైట్ రేషియోలో సూచించినట్లు నికోటిన్ జీవక్రియను మారుస్తుందని ధూమపానం, మద్యపానం మానేయడానికి తోడ్పడుతుందన్నారు. అధిక నికోటిన్ మెటబోలైట్ నిష్పత్తి గల వ్యక్తులు ధూమపానం విడిచిపెట్టడం కష్టం కానీ, నికోటిన్ ప్రత్యామ్నాయ చికిత్స ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా వారు ధూమపానం వదిలేయడంలో సహాయపడుతాయి అని సారా డెర్మోడి చెప్పారు. -
నిన్న హన్సిక.. నేడు అమలాపాల్
సినిమా: ఎదుటి వారికి చెప్పడానికే నీతులు అన్నారో రచయిత. అది అక్షరాలా సత్యం. నిషిద్ధం కాకపోయినా, ఆరోగ్యానికి హానికరమైన మద్యం సేవించడం, పొగ తాగడం వంటి చర్యలు మంచి అలవాట్లు కాదని సెలబ్రిటీలు చెబుతుంటారు. ముఖ్యంగా సినీ తారలు అలా నటించి మరీ చూపిస్తుంటారు.అందుకు భారీ మొత్తంలో పారితోషికాలు పుచ్చుకుంటారు అది వేరే సంగతి. వారితో చెప్పిస్తే మంచి ఫలితం ఉంటుందనే అలా చెప్పిస్తుంటారు. అయితే అదే పారితోషికం కోసం కొందరు భామలు పొగ తాగడం, మద్యం సేవించడం లాంటి సన్నివేశాల్లో నటించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఇటీవల నటి హన్సిక మహా చిత్రంలో కాషాయ వస్త్రాలు ధరించి చేతిలో సిగరెట్ పట్టుకుని నోటి నుంచి పొగను సుడులు సుడులుగా వదులుతన్న దృశ్యంతో కూడిన ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలై వివాదానికి దారి తీసింది. ఆ పోస్టర్ విషయంలో హన్సికపై కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఆ వివాదం సమసిపోకముందే ఇప్పుడు నటి అమలాపాల్ మరో వివాదానికి తెర లేపింది. ఇలాంటి వివాదాలు, విమర్శలు ఆ కేరళా కుట్టికి కొత్తేమీ కాదు. ఇటీవలే లుంగీ ఎగ్గటి చేతిలో సారా సీసా పట్టుకుని అడవిలోని మందు బాబుల స్పాట్కెళ్లిన దృశ్యాన్ని అమలాపాల్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసి నెటిజన్లకు మస్త్ పని చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఆమె అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేశారు. అయితే అమలాపాల్ ఆ ఫోజ్‌ను ఎంజాయ్ చేసిన వారూ చాలా మందే ఉన్నారనుకొండీ. తాజాగా ఆ అమ్మడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మొన్న మద్యం సీసాతో కనిపిస్తే, ఈ సారి దమ్మారో దమ్ అంటూ పొగ తాగుతున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. పైగా తాను కావాలని అలా సిగరెట్ తాగలేదని, ఒక హాలీవుడ్ అభిమాని కోరికను నెరవేర్చడానికి అలా చేశానని సమర్ధించుకుంటోంది. సర్కార్ చిత్ర విషయంలో విజయ్ను, మహా చిత్ర విషయంలో నటి హన్సికను విమర్శలతో ఉతికి ఆరేసిన రాజకీయ పా´ర్టీ నాయకులు, ఇతర సంఘాల ప్రతినిధులు ఇప్పుడు అమలాపాల్‌ను మాత్రం వదులుతారా? అయినా ఇలాంటి సంఘటనలతోనే ఉచిత ప్రచారం పొందాలనుకునే అమలాపాల్ వంటి తారలు విమర్శలను పట్టించుకుంటారా? -
‘ధూమపానం’పై బడి పిల్లల ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: ధూమపానం నిర్మూలనపై పాఠశాల విద్యా శాఖ సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. భావి పౌరులతోనే ధూమపాన వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి పాఠశాలను స్మోక్ ఫ్రీ, టొబాకో ఫ్రీ స్కూల్‌గా ప్రకటించాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా పాఠశాలల ఆవరణలో పొగ తాగడాన్ని పూర్తిగా నిషేధించాలనేదే విద్యా శాఖ లక్ష్యం. ఈ నిబంధనను పక్కాగా అమలు చేయాలని, ప్రతి నెలా క్రమం తప్పకుండా పర్యవేక్షించి నివేదికను ఉన్నతాధికారులకు పంపాలని పేర్కొంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్‌కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్టు–2003 ప్రకారం ప్రతి విద్యా సంస్థ తప్పకుండా నిబంధనలు పాటించాలని అందులో పేర్కొన్నారు. ఏం చేయాలి.. ముందుగా ప్రతి పాఠశాలలో ‘నో స్మోకింగ్/స్మోక్లెస్ టొబాకో’బోర్డులు ఏర్పాటు చేయాలి. టొబాకొ ఫ్రీ కేంద్రంగా విద్యా సంస్థలు స్వీయ ప్రకటన చేయాలి. జిల్లా విద్యాశాఖ అధికారి తన జిల్లా పరిధిలోని అన్ని విద్యా సంస్థలను టొబాకో ఫ్రీ ఇన్‌స్టిట్యూట్స్‌గా సర్టిఫై చేయాలి. క్షేత్రస్థాయిలో ధూమపాన నిషేధం అమలు తీరును ఎప్పటికప్పుడు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాలి. నెలవారీ నివేదికలను జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాల విద్యాశాఖకు సమర్పించాలి. పొగాకు నియంత్రణ అత్యంత ఆవశ్యకం.. గ్లోబల్ అడల్ట్ టొబాకొ సర్వే ఆఫ్ ఇండియా 2016–17 నివేదిక ప్రకారం తెలంగాణలో 17.8 శాతం మంది పెద్దలు (15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ) పొగాకు లేదా పొగాకు ఉత్పత్తుల్ని ఉపయోగిస్తున్నారు. పొగాకు వాడకం వల్ల ఆరోగ్యం క్షీణించడం, వ్యాధులు రావడం, వైకల్యం, చివరికి మరణం సంభవించడం వంటి వైపరత్యాలు చోటుచేసుకునే ప్రమాదముంది. రాష్ట్రంలో పొగాకు నియంత్రణ అత్యంత ఆవశ్యక అంశంగా పరిగణించాలని ఆ నివేదిక సూచించింది. చట్టం ఏం చెబుతోంది.. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు (ప్రొహిబిషన్ ఆఫ్ అడ్వర్టయిజ్మెంట్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్, ప్రొడక్షన్, సప్లయి అండ్ డిస్ట్రిబ్యూషన్) 2003 చట్టం (కోప్టా) సెక్షన్ 6 ప్రకారం మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం నిషేధం. విద్యా సంస్థలకు 100 గజాల కంటే తక్కువ దూరంలో పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. కోప్టా చట్టం సెక్షన్ 6 (బి) ప్రకారం విద్యా సంస్థలకు 100 గజాలలోపు పొగాకు ఉత్పత్తులు అమ్మడం నేరమంటూ సూచిక బోర్డుల్ని ఏర్పాటు చేయాలి. -
రైల్లో పొగతాగొద్దన్నందుకు గర్భిణీని చంపేశాడు!
షాజహాన్‌పూర్: రైలులో తోటి ప్రయాణికుడు పొగతాగడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఓ గర్భిణీ ప్రాణాలు పోగొట్టుకుంది. పంజాబ్– బిహార్ జలియన్ వాలా ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం రాత్రి ఈ దారుణం జరిగింది. బిహార్‌కు చెందిన చినత్ దేవి(45) అనే గర్భిణీ తన కుటుంబంతో కలిసి ఛత్ పూజల్లో పాల్గొనేందుకు సొంతూరుకు వెళ్తున్నారు. వారితోపాటు జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న సోనూ యాదవ్ పొగతాగుతుండటంతో చినత్ దేవి అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఉన్న సోనూ చినత్ దేవి గొంతు నులిమాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను షాజహాన్పూర్లో రైలు ఆపి ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయింది. నిందితుడిని అరెస్టు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
రైల్లో సిగరెట్ తాగొద్దన్నందుకు గర్భవతిని..
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. రైలులో సిగరెట్ తాగొద్దనందుకు గర్భవతిని హత్యచేశాడు ఓ కిరాతకుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్-బీహార్ జలియన్ వాలా ఎక్స్ ప్రెస్ జనరల్ బోగీలో చినత్ దేవి (45) అనే గర్భవతి తన కుటుంబసభ్యులతో కలసి ప్రయాణిస్తున్నారు. అదే బోగిలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అక్కడే సిగరేట్ తాగుతున్నాడు. సిగరెట్ పొగ వల్ల తాము చాలా ఇబ్బంది పడుతున్నామని... ఆపేయాలని చినత్ దేవి ఆ వ్యక్తిని కోరారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో సదరు వ్యక్తి ఆ మహిళపై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. షాజహాన్ పూర్ రైల్వే స్టేషన్ లో రైలును ఆపి, ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చినత్ దేవిని పరీక్షించిన డాక్టర్లు... అప్పటికే ఆమె మృతి చెందిందని తెలిపారు. నిందితుడిని సోనూ యాదవ్ గా గుర్తించామని పోలీసులు చెప్పారు. చనిపోయిన మహిళ తన కుటుంబంతో కలసి చాత్ పూజ కోసం బీహార్ వెళుతోందని తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, విచారిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
‘నేను స్మోక్ చేస్తాను.. డ్రింక్ చేస్తాను అంతమాత్రానా’
‘నేను సిగరెట్ తాగుతాను.. డ్రింక్ చేస్తాను. అంత మాత్రానా నేను చెడ్డ తల్లిని ఎలా అవుతాను?’ అంటూ నెటిజన్లను ప్రశ్నిస్తున్నారు బాలీవుడ్ నటి శ్వేతా సాల్వే. విషయమేంటంటే కొన్ని రోజుల క్రితం శ్వేతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో సిగరెట్ తాగుతూ ఉన్న పోస్ట్ చేశారు. ఈ ఫోటో కాస్తా నెటిజన్లకు కోపం తెప్పించింది. దాంతో వారు ‘ఇలా చేయడానికి మీకు సిగ్గుగా లేదా? మీరు మంచి తల్లి కాదు. మీ పిల్లలకు కూడా ఈ అలవాట్లు వస్తాయి’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ కామెంట్లపై శ్వేత స్పందించారు. ‘అవును. నేను తాగుతాను, ధూమపానం కూడా చేస్తాను. కానీ నేను నిజాయతీగా ఉంటాను. కేవలం డ్రింక్ చేయడం, సిగరెట్ తాగడం వంటి వాటి వల్ల నేను మంచి తల్లిని కాకుండా పోతానా? అయిన నా జీవితాన్ని వృథా చేసుకోవడం మీరు చూశారా? పని పాటా లేకుండా ఖాళీగా గడపడం చూశారా? ఎప్పుడైనా నా పిల్లల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూశారా? నిత్యం నేను ఎన్నో పనులతో బిజీగా ఉంటాను. నేను నటిని, డ్యాన్సర్‌ను, పారిశ్రామికవేత్తని. ఇతరుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి నేను ఎలాంటి ప్రశ్నలు వేయను. కాబట్టి నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి మీరూ ఇలాంటి ప్రశ్నలు వేయకండి’ అంటూ నెటిజన్లపై మండిపడ్డారు. అంతేకాక ‘నా తల్లిదండ్రులు నన్ను పద్ధతిగానే పెంచారు. సమాజంలోని మంచి, చెడు తెలియజేశారు. నా ఫాలోవర్ల గురించి.. నా పోస్ట్‌లకు చేసే లైక్‌ల గురించి నేను పట్టించుకోను. మీరే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారు. నా పద్ధతి నచ్చకపోతే అన్‌ఫాలో అవ్వచ్చు’ అంటూ డ్రింక్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. View this post on Instagram A Day off Looks something like this .. . Yes I Drink and Smoke ... I am real , honest and basic like that. It has to be of no reason that anyone ever judge me for the person I am or the Mommy I am .. I don’t propagate it and neither do I question anyone else who does , so I would respect the same back . Today I got a few random DM’s by totally random people about my actions , and I usually let such things go pass me but for some reason today I felt like addressing it . How does this make me a bad person or a bad mom ?? Do you see me wasting my Life ? Do you see me sitting unemployed n jobless ? Do you see me neglecting my child ? I work , I work multiple jobs , I’m an actor , dancer , an entrepreneur . I successfully live in two major cities of our glorious country . I have beautiful friends whom I love and I know who love me back for the person I am . Risking the fact that I might sound aggressive , don’t ever question my abilities of being a bad example to my child !! So tell me does an honest sex worker who sells her body to feed her family , to maybe get an education or to provide a life for her children is a Bad Person ? A Bad Mother ? A stigma to society ? Who are you and I to Judge ?? My parents taught me well and exposed me to the good and evil of everything . They smoked and drank too but they did a mighty fine job of raising my brother and I . As children we knew that this was not something we could practice until a certain age . And that too if we ever wanted to.. a choice that we were allowed to take as adults ... Today I share a drink with them , and celebrate the fact that they gave me a fabulous childhood n Life and I aspire to do the same with my Baby . . . I don’t pay for likes and followers , you choose to follow me for who I am . And hence what you see is me being me and you always have the option to unfollow me :) . Live and Let Live ✌🏼.. this rant has gotten me all irked so I’m gonna go pour myself a red and light up .. #micdrop 👊🏼 . #bekindtooneanother #peaceout A post shared by ⓢⓗⓥⓔⓣⓐ ⓢⓐⓛⓥⓔ (@shveshve) on Oct 28, 2018 at 5:51am PDT -
పొగాకు మానే క్విట్‌లైన్ ఇదిగో
సాక్షి,హైదరాబాద్: ధూమపానం, పొగాకు నమలడం వంటి దుర్వ్యసనాల నుంచి బయటపడాలనుకునే వ్యక్తుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా కౌన్సెలింగ్ మార్గాన్ని ఎంచుకుంది. ఇందుకోసం పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ‘క్విట్‌లైన్ ఫోన్ నంబర్’ను ప్రచురించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 1 నుంచి తయారవుతున్న అన్ని పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ‘1800–11–2356’అనే క్విట్‌లైన్ నంబర్‌ను ప్రచురిస్తున్నా రు. ఈమేరకు పొగాకు నియంత్రణ కోసం పని చేస్తోన్న వలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ధూమపానం, పొగాకు నమలడం వంటి వ్యసనాలను మా నుకోవాలనుకునే వాళ్లు ఈ నంబర్‌కి ఫోన్ చేస్తే వారికి తగిన సాయం అందుతుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో 46 దేశాలు పొగాకు ఉత్పత్తులపై ఇటువంటి క్విట్‌లైన్ నంబర్లను ప్రచురిస్తుండగా, ఆసియాలో థాయ్‌లాండ్, మలేసియా, సింగపూర్ మాత్రమే ఈ చర్యకు పూనుకున్నాయి. ఇప్పుడు ఆ దేశాల సరసన భారత్ చేరనున్నట్లు సంస్థ తెలిపింది. ఏటా పది లక్షల మంది.. సిగరెట్లు, బీడీలు, చుట్టలు ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగంతో దేశంలో ఏటా దాదాపు 10 లక్షల మంది చనిపోతున్నారు. ఆ దురలవాటు నుంచి బయట పడాలన్నా చాలామంది మానుకోలేని పరిస్థితి. అన్ని పొగాకు ఉత్పత్తులపై ‘పొగాకు కేన్సర్ కారకం’, ‘పొగాకు వల్ల బాధాకరమైన మరణం సంభవిస్తుంది’వంటి హెచ్చరికలు వ్యాధుల ఫొటోలతో సహా ప్రచురిస్తున్నారు. ఈ ప్రకటనలు ప్యాకెట్లపై 85% స్థలాన్ని ఆక్రమిస్తాయి. రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టుల నిర్ణయంతో 2016 ఏప్రిల్ నుంచి ఫొటోలతో ఈ హెచ్చరికలను ప్రచురిస్తున్నారు. పొగాకు ఉత్పత్తులపై అనారోగ్య సంబంధిత హెచ్చరికలను ప్రచురించడంలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు కెనడా కేన్సర్ సొసైటీ విడుదల చేసిన ఒక నివేదిక పేర్కొంది. ఈ విషయంలో మొత్తం 205 దేశాల్లో మన దేశానికి మూడో స్థానం రావడం విశేషం. హెచ్చరికలతో మంచి ఫలితాలు.. పొగాకు ఉత్పత్తులపై ఫొటోలతో కూడిన హెచ్చరికలను ప్రచురించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జరిపిన ఒక సర్వే వెల్లడించింది. ఆ శాఖ ఇటీవల జరిపిన గ్లోబల్ అడల్ట్ టుబాకో సర్వేలో పొగాకు ఉత్పత్తులపై కనిపిస్తున్న ఆ హెచ్చరికలను చూశాక తమ అలవాటు మానుకోవాలని లేదా తగ్గించుకోవాలని సిగరెట్ తాగేవాళ్లలో 62%, బీడీ తాగేవాళ్లలో 54% మంది భావించారని ఆ సర్వే వెల్లడించింది. మొత్తంగా పొగాకు వాడకం ప్రమాదకరమని పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడ్డవాళ్లలో 96% మంది అంగీకరించారని ఆ సర్వే తెలిపింది. ధూమపానం చేసేవాళ్లలో 55% మంది, పొగాకు నేరుగా నమిలే వాళ్లలో 50% మంది తమ అలవాటును మానుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆ సర్వేలో వెల్లడయ్యింది. అందువల్ల ప్రస్తుతం పొగాకు వ్యసనాన్ని తగ్గించే చికిత్సా కేంద్రాలకు డిమాండ్ పెరుగుతున్నట్లు ఆ సర్వే పేర్కొంది. ‘పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై వ్యాధుల ఫొటోలతో సహా హెచ్చరికలు ప్రచురించడం చెప్పుకోదగ్గ ఫలితాన్నిచ్చింది. అనేక భాషలతో దేశంలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా పొగాకు దుష్ఫలితాలను అర్థమయ్యేట్లు చేయడంలో ఈ హెచ్చరికలు సఫలీకృతమయ్యాయి. అందువల్లే చాలామంది పొగాకు వాడకం ప్రమాదమన్న భావనకు రాగలిగారని’ వలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ అభిప్రాయపడింది. -
గుట్కా.. ఉండరిక!
రాజంపేట రూరల్: ‘ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం’అనే ప్రకటనలను సినిమా థియేటర్లలో, టీవీల్లో నిత్యం చూస్తేనే ఉన్నా యువత వాటికి బానిసలవుతూనే ఉన్నారనేది జగమెరిగిన సత్యం. పొగాకు ఉత్పత్తులను ప్రభుత్వం నిషేధించినా అధిక మొత్తంలో బహిరంగంగానే వాటి విక్రయాలు సాగుతున్నాయని తల్లదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిషేధించాల్సిన అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడంతో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో వ్యాపారులు అధిక లాభాలు గడిస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఇతర రాష్ట్రాల నుంచి రవాణా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 2006 సంవత్సరంలో ఆహార భద్రత చట్టాన్ని తీసుకు వచ్చింది. దాని ప్రకారం పొగాకు ఉత్పత్తుల, విక్రయాలపై నిషేధం విధించారు. అయినప్పటికీ జిల్లాలో వ్యాపారులు, విక్రయదారులు యథేచ్చగా పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తూ యువత ప్రాణాలతో చెలగాడం ఆడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో నిషేధం ఉన్నప్పటికీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నిషేధం లేకపోవడంతో చిత్తూరు, అనంతపురం జిల్లాల మీదుగా మన జిల్లాకు గుట్టు చప్పుడు కాకుండా గుట్కా, ఖైనీలు వచ్చి పడుతున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటి, పట్టణం, మండల హెడ్ క్వార్టర్స్‌తో పాటు ప్రతి గ్రామంలో వీటి విక్రయాలు జోరుగాసాగుతున్నాయి. నిండు జీవితం బలి విచ్చలవిడిగా గుట్కా, చైనీఖైనీ, వంటి పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తుండడంతో యువత వాటికి బానిసలవుతున్నారు. చిన్న వయసులోనే ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. క్యాన్సర్, గుండె, కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురవుతూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. పొగాకు ఉత్పత్తులను, మత్తు మందులను వినియోగించే వారు 17 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సున్న యువకులే అధికంగా ఉన్నారు. తాము వద్దని వారించినా అలవాటు పడిన వారు పెడచెవిన పెట్టి యథేచ్చగా వాటిని వినియోగిస్తూ రోగాల బారిన పడుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. రకరకాల పేరులతో, అధిక రేట్లతో... పొగాకు ఉత్పత్తులను రకరకాల పేర్లతో ఎంఆర్పీ ధర లేకుండా అధికరేట్లకు విక్రయిస్తున్నారు. వీటిలో ఎంజీఎం, హాన్స్, చైనీఖైనీ, మిరాజ్, విమల్ వంటివాటికి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా బారీ గిరాకీ ఉంది. వీటిని విక్రయించే స్థలం, సమయం, పరిస్థితిని బట్టి 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అధిక ధర అయినప్పటికీ దొరకడమే భాగ్యం అన్నట్టుగా వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. నిషేధం ఏదీ? నిషేధిత పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదని నిబంధనలు ఉన్నా కొందరు వ్యాపారులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వాటిని యథేచ్చగా విక్రయిస్తున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు తప్ప దాడులు చేసిన దాఖలాలు లేవు. జిల్లా వ్యాప్తంగా దాడులు చేసినా అవి కొంత మేరకే పరిమితమవుతున్నాయి. అదుపులోకి తీసుకున్నా వారికి పెద్దగా శిక్షలు లేకపోవడంతో తిరిగి విక్రయిస్తున్నారు. పూర్తి స్థాయిలో నిషేధం విధించేలా చర్యలు తీసుకోవడంలో జిల్లా స్థాయిలో పోలీసులు విఫలమవుతూ ఉన్నారని బాధితుల తల్లిదండ్రులు మివర్శిస్తున్నారు. లాభసాటి వ్యాపారాన్ని జిల్లాలో మూడు పువ్వులు, ఆరు కాయలుగా వ్యాపారులు, విక్రయదారులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు వీటి విక్రయాలపై నిఘా పెట్టాలని పలువురు కోరుతున్నారు. అధికారుల కళ్లుగప్పి అధిక శాతం రైల్వేశాఖ ద్వారా రవాణా చేస్తున్నప్పటికి అక్కడ నిఘా కొరవడిందని జిల్లా ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. -
సిగరెట్ కోసం తమ్ముడిని కడతేర్చాడు
న్యూఢిల్లీ : తన మంచి కోరిన తమ్ముడిని కడతేర్చాడు ఓ అన్న. అంతేకాకుండా దాన్ని సహజ మరణంగా చిత్రీకరించడానికి కూడా ప్రయత్నించాడు. కానీ చివరకు పోలీసులు విచారణలో నిజం ఒప్పుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. సెంట్రల్ ఢిల్లీలో నివాసం ఉంటున్న శిశుపాల్ కుమార్‌కి విపరీతంగా సిగరెట్లు తాగే అలవాటు ఉంది. ఈ అలవాటు వల్ల అతనితో పాటు ఇంట్లో వాళ్లకు కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోంది. దీంతో అతని తమ్ముడు సత్యపాల్, ఆ అలవాటు మానుకోవాలంటూ శిశుపాల్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేశాడు. అయిన శిశుపాల్ పట్టించుకోలేదు. గత కొన్ని నెలల నుంచి అన్నదమ్ముల మధ్య ఈ విషయంలో ఘర్షణ జరుగుతూనే ఉంది. కానీ బుధవారం వారిద్దరి మధ్య వాగ్యూద్ధం తార స్థాయికి చేరింది. సత్యపాల్ తన అన్న చేత ధూమపానాన్ని విరమింపచేయాలని భావించాడు. తన తమ్ముడు తరచు తనకు అలా చెప్పడం నచ్చని శిశుపాల్ అతనిపై దాడికి ప్రయత్నించాడు. తన షూ లేస్‌ని సత్యపాల్ మెడకి గట్టిగా బిగించడంతో అతడు ప్రాణాలు కొల్పోయాడు. అయితే శిశుపాల్ దీన్ని సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేశాడు. సత్యపాల్ని ఆస్పత్రికి తరలించాడు. తన తండ్రికి తమ్ముడు అపస్మారక స్థితిలో ఉన్నాడనే సమాచారం ఇచ్చాడు. కానీ ఆస్పత్రి సిబ్బంది మాత్రం సత్యపాల్ మరణాన్ని అనుమానస్పద మృతిగా భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. పోస్ట్‌మార్టమ్ నివేదికలో అతను గొంతు నులిమి చంపబడ్డాడని తెలడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. శిశుపాల్పై అనుమానంతో గురువారం అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చివరకు పోలీసుల విచారణలో శిశుపాల్ శనివారం తన నేరాన్ని అంగీకరించాడు. శిశుపాల్తోపాటు నలుగురు సోదరులు ఒకే ఇంట్లో ఉండేవాళ్లని అతని బార్య పోలీసులకు తెలిపారు. సత్యదేవ్‌కు మాత్రమే ఉద్యోగం లేదని.. అన్నదమ్ములు మధ్య చాలా రోజులుగా గొడవలు జరిగేవని.. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదని అన్నారు. -
ధూమపానానికి దూరం కాకుంటే..
లండన్ : ధూమపానంతో గుండె కొట్టుకునే వేగం లయతప్పే ఊప్రమాదం 45 శాతం అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. రోజుకు తాగే ప్రతి పది సిగరెట్లతో ఆర్టియల్ ఫిబ్రిలేషన్గా పిలువబడే అసంబద్ధ హార్ట్‌బీట్ ముప్పు 14 శాతం పెరుగుతుందని అథ్యయనం పేర్కొంది. పొగతాగడంతో వచ్చే పెనుముప్పు కారణంగా మీరు ఇప్పటికే పొగతాగుతుంటే తక్షణమే దాన్ని మానివేయాలని, పొగతాగకుంటే అసలు దాని జోలికెళ్లొద్దని అథ్యయన రచయిత, ఇంపీరియల్ కాలేజ్‌కు చెందిన డాక్టర్ డాగ్ఫిన్ అనే స్పష్టం చేశారు. స్మోకింగ్‌తో ఆర్టియల్ ఫిబ్రిలేషన్ రిస్క్ అధికమని, అయితే పొగతాగడానికి తక్షణమే స్వస్తిపలకడం ద్వారా దీన్ని నివారించవచ్చని అన్నారు. ప్రపంచంలోని ప్రాణాంతక స్ర్టోక్ట్స్లో 30 శాతం ఆర్టిఫిషియల్ ఫిబ్రిలేషన్ వల్లనే ముంచుకొస్తున్నాయని చెప్పారు. అథ్యయన వివరాలు యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురితమయ్యాయి. -
పొగ బారిన ప్రతి ఐదు సెకన్లకు ఒకరు..
లండన్ : పొగతాగడం ద్వారా ప్రతి ఐదు సెకన్లకు ఓ వ్యక్తి మరణిస్తున్నాడని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. పొగతాగడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలతో 2016 నుంచి ఇప్పటివరకూ 30 లక్షల మంది మరణించారని ఇటీవల వెల్లడైన గణాంకాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న మరణాల్లో ఇవి ఆరు శాతం కావడం గమనార్హం.2022 నాటికి గుండె జబ్బులు, క్యాన్సర్ల తర్వాత శ్వాసకోశ ఇబ్బందులతో అత్యధిక మరణాలు సంభవిస్తాయని అంచనా వేస్తున్నారు. శ్వాసకోశ వ్యాధుల నిపుణులు, ప్రఖ్యాత పల్మనాలజిస్ట్ సయ్యద్ జఫర్యాబ్ హుస్సేన్ నిర్వహించిన ఓ సెమినార్లో ఈ దిగ్భ్రాంతికర గణాంకాలు వెలుగుచూశాయి. ఉగ్రవాద ముప్పుతో పోలిస్తే పొగతాగడం వల్లే అత్యధిక జనాభా మృత్యువాతన పడుతున్నదని, రోగులకు పొగతాగడం ఎంత ప్రమాదకరమో వైద్యులు విస్పష్టంగా తెలియచేయాలని కోరారు. యువత, మహిళలు సైతం పొగతాగడం అలవాటుచేసుకోవడం ఆందోళనకరమన్నారు. ఈ సిగరెట్స్ కూడా శ్వాసకోశ సమస్యలకు దారితీస్తాయని హెచ్చరించారు. ప్రపంచ జనాభాలో ఐదో వంతు మంది దాదాపు వంద కోట్ల ప్రజలు సిగరెట్లు తాగుతూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. -
సిగిరేట్ తాగితే పళ్లు రాలిపోతాయ్..
బర్మింగ్‌హామ్ : సరదా సరదా సిగరెట్టు.. దొరల్ తాగు బలె సిగరెట్టు... పట్టు బట్టి ఒక దమ్ము లాగితే స్వర్గానికి అది తొలిమెట్టు. ఇది ఓ సినిమాలో పాట.. పొగరాయుళ్లు తమకు అన్వయించుకునే మాట. ఓ పూట తిండి లేకపోయినా ఉంటారేమో గానీ పొగతాగంది ఉండలేరు. నష్టం తప్పదు నాయనా అని ఎంత నచ్చజెప్పినా నచ్చిందే చేస్తామంటారు. కొత్త సిగిరేట్లు ఎలా అందుబాటులోకి వస్తున్నాయో అలానే రోగాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సిగిరేట్ తాగటం వల్ల పళ్లు త్వరగా రాలిపోతాయని పరిశోధనల్లో తేలింది. ఇంగ్లాండుకు చెందిన ‘‘యూనివర్శిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్’’ శాస్త్రవేత్తల బృందం జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పొగ తాగని వారికంటే తాగే వారిలో రెండు రెట్లు ఎక్కువగా పళ్లు రాలిపోయే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. పొగతాగే వారికి ఎక్కువగా చిగుళ్ల సమస్యలు వస్తాయని, వీరిలో ఎక్కువమంది చిగుళ్ల సమస్యలతో బాధ పుడతున్నారని తెలిపారు. సంవత్సరానికి రెండుసార్లైనా ‘రూట్ కెనాల్ ట్రీట్మెంట్’ చేయించుకోవాలని హెచ్చరిస్తున్నారు. పొగతాగే వారికి నోటి నొప్పి, చిగుళ్ల, పంటి సమస్యలు ఎక్కువంటున్నారు. ఆల్కాహాల్, సిగిరేట్ ఈ రెండిటిని ఎక్కువగా తీసుకోవటం కారణంగా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. సిగరేట్ తాగటం వల్ల నోటిలోని వ్యాధి నిరోధక వ్యవస్ధ దెబ్బ తింటుందని తెలిపారు. నోటికి సంబంధించిన అన్ని రోగాలకు పొగాకే కారణమని తేల్చి చెప్పేస్తున్నారు. చైన్ స్మోకర్లలాగా దమ్ము మీద దమ్ము కొడుతూ పోతే నోటితో పట్టుకోవడానికి చివరకు పళ్లే లేకుండా పోతాయని హెచ్చరిస్తున్నారు. -
బహిరంగ ప్రదేశంలో ధూమపానం..
మెదక్ మున్సిపాలిటీ: బహిరంగ ప్రదేశంలో సిగరేట్ తాగిన ఇద్దరికి న్యాయమూర్తి జరిమానా విధించిన సంఘటన గురువారం మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ శ్రీరాం విజయ్‌కుమార్ కథనం ప్రకారం సంగారెడ్డికి చెందిన అబేద్ హుస్సేన్, కొల్చారం మండలం వరిగుంతంకు చెందిన శ్రీనివాస్‌లు బస్టాండ్‌లో బుధవారం సిగరేట్ తాగుతూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడంతో వారిపై కోక్టా యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ తెలిపారు. ఈ మేరకు గురువారం మొబైల్ మేజిస్ట్రేట్ లావణ్య ఒక్కొక్కరికి రూ.200ల చొప్పున జరిమానా విధించారు. -
పొగతాగితే కాళ్లకూ కష్టమే
న్యూయార్క్: ధూమపానం ఊపిరితిత్తులపై మాత్రమే ప్రభావం చూపుతుందనేది అందరి నమ్మకం. కానీ, అది తప్పని తేలింది. పొగతాగే అలవాటు కాలి కండరాలపైనా దుష్ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో రుజువయింది. ధూమపానం అలవాటు కాలి కండరాల్లో రక్తనాళాల సంఖ్యను తగ్గిస్తుందనీ తద్వారా కండరాలకు ఆక్సిజన్‌తోపాటు పోషకాల లభ్యత తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. ‘పొగాకుతో కూడిన సిగరెట్లు తాగే వారిలో పెద్ద కండరాలతోపాటు శరీరం అంతటా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ హానిని నివారించేందుకు అవసరమైన విధానాలను రూపొందించాల్సి ఉంది’అని కాలిఫోర్నియా–శాన్‌డియాగో యూనివర్సిటీకి చెందిన ఎలెన్బ్రీన్ అంటున్నారు. ఈ పరిశోధనకు గాను కాలిఫోర్నియా, బ్రెజిల్, జపాన్‌లకు చెందిన నిపుణులు..ఒక ఎలుకను ఎనిమిది వారాలపాటు పొగాకు పొగ ప్రభావం పడేలా చేశారు. ఫలితాలను పరిశీలించగా.. ఆ ఎలుకలోని రక్తనాళాల సంఖ్య తగ్గాయి. ఫలితంగా శరీరంలోని జీవక్రియలు, చురుకుదనం మందగించాయి. వీటివల్ల డయాబెటిస్, ఊపిరితిత్తుల సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని తేల్చారు. అయితే, సిగరెట్లలో ఉండే దాదాపు నాలుగు వేల రకాలైన రసాయనాలు కండరాల క్షీణతపై ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయనే అంశం మాత్రం ఈ అధ్యయనంలో వెల్లడికాలేదు. -
ఆ రెండు అలవాట్లతో పెనుముప్పు
లండన్ : పొగాకు, మద్యం ఆరోగ్యానికి పెను ముప్పు కారకాలని తాజా అథ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా లక్ష మరణాల్లో పొగాకు కారణంగా 110 మరణాలు సంభవిస్తుండగా, మద్యం 33 మందిని బలితీసుకుంటోందని యూనివర్సిటీ కాలేజ్ లండన్ చేపట్టిన అథ్యయనం పేర్కొంది. ఇక ప్రతి లక్ష మరణాల్లో కొకైన్ కారణంగా ఏడుగురు మృత్యువాతన పడుతున్నారని తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురిలో ఒకరు కనీసం నెలపాటు విపరీతంగా తాగుతున్నారని, జనాభాలో 15 శాతం మంది రోజూ పొగతాగుతున్నారని పేర్కొంది. గత ఏడాది కొకైన్‌ను ప్రపంచ జనాభాలో కేవలం 0.35 శాతం మందే తీసుకున్నారని వెల్లడించింది. మత్తుపదార్థాల బారినపడుతున్న వారు ప్రతి లక్షమందిలో 500 మంది ఉండగా, 843 మంది మద్యానికి బానిసలయ్యారు. పొగతాగడం, మద్యం సేవించడం ద్వారా లక్షల మంది ఆరోగ్యకర జీవనాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రమాదకర అలవాట్లతో ఏ ప్రాంతంలో నష్టం ఎలా ఉందన్న అంచనాలకు మరింత విస్తృత సమాచార విశ్లేషణ అవసరమవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐరాస ఏజెన్సీ తదితర సంస్థల సమాచారం ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్టు వారు తెలిపారు. అథ్యయన వివరాలు జర్నల్ అడిక్షన్లో ప్రచురితమయ్యాయి. -
ఈ వీడియో చూసిన తర్వాతైనా..
పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని ఎన్నో ప్రకటనల్లో చూస్తుంటాం. పొగ తాగితే మనకే కాదు.. మన చుట్టూ ఉన్నవారికి కూడా ప్రమాదమని తెలిసినా చాలా మంది ఆ వ్యసనాన్ని మానుకోలేకపోతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక ప్రకారం.. పొగ తాగడం వల్ల ఏడాదికి సుమారు 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో సుమారు 60 లక్షల మంది ప్రత్యక్షంగా పొగతాగడం వల్ల, మరో 9 లక్షల మంది పొగతాగే వారి పక్కనుండటం వల్ల (సెకండ్ స్మోకర్స్‌గా) మరణిస్తున్నారని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఈ నేపథ్యంలో నార్త్ కరోలినాకు చెందిన నర్స్ అమాండ ఎల్లర్.. తాను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియో చూస్తే పొగరాయుళ్లు ఇక స్మోకింగ్ మానేయడం ఖాయం అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొగ తాగేవారి, తాగనివారి ఊపిరితిత్తుల పనితీరును వివరించే వీడియో పోస్ట్ చేసిన అమాండ.. ‘క్యాన్సర్ పేషెంట్, 20 ఏళ్ల పాటు రోజూ ఒక ప్యాకెట్ సిగరెట్ తాగిన వారి ఊపిరితిత్తులు. ఆరోగ్యకరమైన వ్యక్తి ఊపిరితిత్తులు ఇవి. వీడియో చూశాక కూడా స్మోకింగ్ చేయాలనుకుంటున్నారా?’ అని ఆమె ప్రశ్నించారు. ఆమె చేసిన పోస్ట్ 5 లక్షల షేర్లతో దూసుకుపోతోంది. వీడియోలోని నల్లగా మారిన ఆ ఊపిరితిత్తులను చూస్తే.. పొగ తాగడం మానేయాలకున్న వారు.. ఒక్కసారిగా మానేయడం వీలుకాకపోయినా.. క్రమ క్రమంగా మానేయడానికి ప్రయత్నిస్తే ఆమె పోస్ట్‌కి ఫలితం దక్కడంతో పాటు.. మీ ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం..
-
సిగరెట్ ప్యాకెట్లపై భయానక చిత్రాలు
న్యూఢిల్లీ : సిగరెట్లు, గుట్కా, ఖైనీలు వంటి పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని ప్రజల్లో ఎలాగైనా మాన్పించాలనే ఉద్దేశ్యంతో, ఆ ఉత్పత్తులపై ముద్రించే చిత్రాలను కేంద్రం మరింత భయానకంగా రూపొందించింది. పొగాకు ఉత్పత్తుల ప్యాకేజింగ్ నిబంధనలను మారుస్తూ, భయానకమైన ఆరోగ్య హెచ్చరికల చిత్రాలను విడుదల చేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు రెండు సెట్ల ఇమేజ్‌లను విడుదల చేసింది. తొలి సెట్ 12 నెలల పాటు అన్ని పొగాకు ఉత్పత్తులపై ముద్రించాలని, ఆపై రెండో సెట్ బొమ్మలను ముద్రించాలని తేల్చిచెప్పింది. ఇదే సమయంలో పొగాకు వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించే టోల్ ఫ్రీ నంబర్ '1800-11-2356'ను విధిగా ప్రతి ప్యాక్‌పై ముద్రించాలని కూడా ఆదేశించింది. ఈ హెల్ప్ లైన్నెంబర్ పొగాకు వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తోంది. పొగాకు ఉత్పత్తులను మానడానికి వారికి కౌన్సిలింగ్ సర్వీసులను కూడా అందించనుంది. కాగా, ప్రస్తుతం సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లపై ఉన్న హెచ్చరికల చిత్రాలతో పోలిస్తే ఇవి మరింత భయానకంగా ఉండటం గమనార్హం. గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే వెల్లడించిన నివేదిక ప్రకారం, ప్రస్తుతం సిగరెట్లు తాగుతున్న వారిలో 15 ఏళ్లలోపు వారు కూడా ఉన్నారని వెల్లడైన సంగతి తెలిసిందే. బీడీ స్పోకర్లు 53.8 శాతం, స్మోక్ చేయని పొగాకు వినియోగదారులు 46.2 శాతం మంది ఉన్నట్టు సర్వే తెలిపింది. కొత్త హెచ్చరికల చిత్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్ సైట్(www.mohfw.gov.in) నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ కొత్త హెచ్చరికల చిత్రాలను అన్ని స్థానిక భాషల్లో త్వరలోనే మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1 2018 నుంచి ఈ కొత్త హెచ్చరికల చిత్రాలను ముద్రించాల్సి ఉంది. -
వైరల్‌గా మారిన నటి స్మోకింగ్ వీడియో
-
నటి స్మోకింగ్ వీడియో వైరల్
పాకిస్తానీ నటి మహీరా ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. షారుఖ్ ఖాన్ ‘రయిస్’ సినిమాతో ఆమె బాలీవుడ్‌కు పరిచయమైన విషయం తెలిసిందే. మహీరా ఒక పార్టీలో దమ్ముకొడుతున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే ఈ ఘటనపై కొందరు ఆమె పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుంటే, మరి కొందరు మాత్రం మహీరాకు మద్దతుగా నిలిచారు. మగవారు తాగితే తప్పులేదు కానీ, మేం తాగితే తప్పేంటి?, మేం తాగడం తప్పైతే మీరు తాగడమూ తప్పే, తన వ్యక్తిగత జీవితం గురించి మీకెందుకు? తన ఇష్టం తనది అంటూ పలువురు మహిళలు ఆమెకు బాసటగా నిలిచారు. గతంలో కూడా మహిరా ఖాన్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. లండన్‌లో హీరో రణవీర్ కపూర్‌తో కలిసి మహీరా స్మోక్ చేయటంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఓ వైపు ఆమె స్మోక్ చేయడాన్ని పలువురు తప్పుబడితే... పాకిస్తానీలు మాత్రం రణబీర్‌తో కలిసి స్మోక్ చేస్తూ దిగిన ఫోటోలను షేర్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
ఈ పిల్లలకి ఏమైంది ?
మన దేశంలో పొగాకు వినియోగం తగ్గిందని ఈ మధ్య వచ్చిన సర్వేలతో సంబరపడ్డాం కానీ అదెంతో సేపు నిలవలేదు. సిగరెట్ తాగడానికి ఇప్పుడు వయసుతో పనిలేదు.. చిన్నపిల్లలు కూడా పెట్టెలు పెట్టెలు ఉఫ్ మని ఊదేస్తున్నారు. భారత్‌లో పొగతాగే అలవాటుపై గ్లోబల్ టొబాకో అట్లాస్ తాజా నివేదిక ప్రజారోగ్యం ఎలా గుల్లవుతోందా అన్న ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో పదేళ్లకే పొగతాగే అలవాటు మొదలవుతోందని ఆ నివేదిక వెల్లడించింది. అమెరికన్ కేన్సర్ సొసైటీæ, వైటల్ స్ట్రాటజీ అనే సంస్థ సంయుక్తంగా రూపొందించిన నివేదిక ప్రకారం మన దేశంలో 10 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లో 6.25 లక్షల మంది ప్రతీ రోజూ పొగతాగుతున్నారు. వారిలో 4,29,500 మందికి పైగా అబ్బాయిలు ఉంటే, లక్షా 90 వేల మంది అమ్మాయిలు ఉన్నారు. 15 ఏళ్లకు పైబడిన వారిలో ప్రతీ రోజూ 10 కోట్ల 30 లక్షల మంది పొగాకు పీలుస్తూ దానికి బానిసలుగా మారారు. వీరిలో పురుషులు 9 కోట్లు, మహిళల సంఖ్య కోటి 30 లక్షలుగా ఉంది. పొగాకు వినియోగంతో కాలిబూడిదైపోతున్న కుటుంబాలకు లెక్కే లేదు. ఈ అలవాటు వల్ల సంక్రమించిన వ్యాధులతో ప్రతీ ఏడాది 9 లక్షల 32 వేల 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం ఒక వారంలోనే దేశవ్యాప్తంగా 17,887 మృతుల సంఖ్య నమోదవుతోంది. ఇక పొగాకు ఉత్పత్తుల వినియోగం ద్వారా మనకు జరిగే ఆర్థిక నష్టం ఊహించలేనిది. పొగాకు ఉత్పత్తులపై పెడుతున్న ఖర్చుతో పాటు, దానివల్ల తలెత్తే కొన్ని రకాల కేన్సర్లు, ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన వ్యాధుల నివారణ కోసం భారత్ ఇంచుమించుగా 2 లక్షల కోట్లు ఖర్చు భారాన్ని మోయాల్సి వస్తోంది. మన దేశంలో 2016 సంవత్సరంలో 8 వేల 200 కోట్లకు పైగా సిగరెట్లు ఉత్పత్తి అయ్యాయి. పొగాకు వినియోగంపై కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే జాతీయ స్థూల ఆదాయంలో 15 శాతం పొగాకు ఉత్పత్తుల ద్వారా లభిస్తుండడంతో ప్రభుత్వాలు చూసీ చూడనట్టు ఊరుకుంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఒక్కో మరణంపై రూ .6 లక్షలు..
వాషింగ్టన్ : ప్రపంచంలో అతిపెద్ద టొబాకో కంపెనీలు ఒక్కో స్మోకర్ మరణంపై 9730 డాలర్లు ( రూ 6లక్షలకు పైగా) లాభం పిండేస్తున్నాయని ఓ నివేదిక పేర్కొంది. ఆఫ్రికా, ఆసియా, మధ్యప్రాచ్య దేశాల్లోని పొగరాయుళ్లను ఈ కంపెనీలు పీల్చిపిప్పిచేస్తున్నాయని వెల్లడించింది. ప్రపంచాన్ని వణికిస్తున్న పొగాకు పర్యవసానాలపై అమెరికన్ క్యాన్సర్ సొసైటీ, వైటల్ స్ట్రేటజీస్ సంస్ధలు టొబాకో అట్లాస్ నివేదికను రూపొందించాయి. పొగాకు పరిశ్రమ తమ లాభాలు పెంచుకునేందుకు అనుసరిస్తున్న తాజా ఉత్పత్తులు, ఎత్తుగడలతో పాటు పొగాకు నియంత్రణ చర్యలను ఇవి ఎలా నీరుగారుస్తున్నాయో నివేదిక వెల్లడించింది. కేవలం 2016లోనే ప్రపంచవ్యాప్తంగా పొగాకు సేవనంతో 71 లక్షల మంది మృత్యువాత పడ్డారని, వీటిలో అత్యధిక మరణాలు సిగరెట్ స్మోకింగ్ వల్ల కాగా, 8,84,000 మరణాలు సెకండ్‌హ్యాండ్ స్మోక్ కారణంగా సంభవించాయి. అదే సమయంలో పొగాకు కంపెనీల లాభాలు 6200 కోట్ల డాలర్లు పెరిగాయని నివేదిక పేర్కొంది. ఇది పొగతాగడం వల్ల చోటుచేసుకున్న ఒక్కో మరణానికి 9730 డాలర్లతో సమానమని గతంలో ఇది 7000 డాలర్లుగా ఉందని ఈ నివేదిక లెక్కగట్టింది. -
ఇలా దమ్ము కొట్టగలరా?.. వైరల్ వీడియో
బాండుంగ్ (ఇండోనేషియా) : అది ఇండోనేషియాలోని ఓ జూపార్క్. వివిధ రకాల జంతువులను చూసేందుకు వచ్చిన ఔత్సాహికుల్లో ఒకరు సిగరెట్ తాగుతూ ఒరాంగ్టాంగ్ ఉన్న ప్రదేశానికి వెళ్లాడు. కొద్దిసేపు ఒరాంగ్టాంగ్ను తదేకంగా చూసిన ఆ వ్యక్తి తాను తాగుతున్న సిగరెట్‌ను దాని ఎదురుగా విసిరేశాడు. అది వెంటనే దాన్ని తీసుకొని మగరాయుళ్లెవరూ కూడా తాగలేనంత స్టైల్‌గా సిగరెట్ తాగింది. గుప్పుగుప్పుమంటూ పొగను ముక్కల్లో నుంచి కూడా బయటకు తీసింది. ఓ కెమెరా కంటికి చిక్కిన ఆ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో పెద్ద వైరల్‌గా మారింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరీ.. -
స్టైల్‌గా సిగరెట్ తాగింది..!
-
స్లీపింగ్ బ్యూటీ
ఆ అద్భుత సౌందర్యానికి కళ్లు తిప్పుకోలేకపోయాను. సన్నగా పొడుగ్గా ఉంది. బ్రెడ్డు రంగులో నున్నటి చర్మం. ఆకుపచ్చ బాదంకాయల్లాంటి కళ్లు, భుజాల మీదికి జుట్టు. కాలంతో కొలవలేని అందం అది. ఇండోనీషియన్ లేదా ఆండియన్ (దక్షణ మధ్య అమెరికా ప్రాంతం) కావచ్చు. ఆమె డ్రెస్ సెన్సు గొప్పది. లింక్స్ (అడవి పిల్లి) జాకెట్, ముతక ఖద్దరు బ్లౌజు, కాటన్ ప్యాంటు, బోగెన్‌విల్లా రంగుల్లో బూట్లు. ‘ఇంతటి లావణ్యరాశిని ఒక్కసారైనా చూసినందుకు జీవితం ధన్యమైంది’ అనుకున్నాను. పారిస్‌లోని చార్ల్స్ డిగాల్ ఎయిర్‌పోర్టులో చెక్–ఇన్ లైన్లో నిల్చున్న నా పక్కనుంచి ఆడసింహంలా నడిచివెళ్లిందా సుందరి. నేను న్యూయార్క్ వెళ్లాలి. ఆమె నిజంగా నాకు కనిపించిందా? లేక భ్రమా? ఒక లిప్తపాటు దర్శనమిచ్చి టెర్మినస్‌లోని ఒక సందోహంలో అదృశ్యమైంది. ఉదయం, రాత్రంతా మంచు కురిసింది. వీధుల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది. హైవేల మీద కూడా ట్రాఫిక్ వేగంగా కదలడం లేదు. రోడ్ల పక్కన కార్లు, ట్రక్కులు వరుసగా పార్క్ చేసి ఉన్నాయి. బైట వాతావరణం ఎలా ఉంటేనేం, ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లో సుఖంగానే ఉంది. లైన్లో ఒక డచ్ స్త్రీ వెనకాల నిల్చున్నాను. ఆమె తన పదకొండు సూటుకేసుల బరువు గురించి కౌంటర్లో ఉన్న వాళ్లతో ఎడతెగని వాదన చేస్తున్నది. విసుగ్గా ఉంది. ఆ అలౌకిక సుందరి దర్శనంతో ముగ్ధుణ్ణయిన నేను వాదులాట ఎలా ముగిసిందో గమనించలేదు. నా పరధ్యానానికి కౌంటర్ క్లర్కు నావైపు కోపంగా చూసింది. ఏదోరకంగా మాటలు కలపాలని ‘‘లవ్ ఎట్ ఫస్ట్ నమ్ముతావా?’’ అని అడిగాను. ‘‘అఫ్కోర్స్, మరే పద్ధతిలోనూ ప్రేమలో పడటం అసాధ్యం’’ అంటూ ‘‘సీటు స్మోకింగ్ సెక్షన్లో కావాలా? నాన్ స్మోకింగ్ సెక్షన్లో కావాలా?’’ అని అడిగింది.‘‘ఎక్కడైనా ఫర్వాలేదు. డచ్ లగేజి పక్కన మాత్రం వద్దు’’ అన్నాను వ్యంగ్యంగా.‘‘ఏ నంబర్ కావాలి? 3, 4, 7?’’‘‘నాలుగు’’‘‘పదిహేనేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాను. ఏడో నంబర్ ఎంచుకోని మొదటి పాసెంజర్ మీరే’’ అంటూ బోర్డింగ్ పాస్ మీద నంబర్ రాసిచ్చింది. వెనక్కి తిరిగానో లేదో నా దేవత మళ్లీ కనిపించింది. ఎయిర్‌పోర్టును మూసేశారని, అన్ని ఫ్లైట్స్ ఆలస్యంగా బయల్దేరతాయని ప్రకటించింది క్లర్కు. ‘‘ఆలస్యమంటే ఎన్ని గంటలు?’’‘‘తెలియదు. ఈ సంవత్సరం వచ్చిన అతి పెద్ద మంచు తుఫాను’’ అని ప్రకటించారు రేడియోలో. అది శుద్ధ తప్పు. ఈ సంవత్సరం కాదు. ఈ శతాబ్దంలోనే ఇంత పెద్ద తుఫాను రాలేదు. అయినా ఫస్ట్‌క్లాస్ వెయిటింగ్ రూంలో సదుపాయాలకేం కొదవ. మనోహరమైన సంగీతం వినిపిస్తుంది. నగరంలో తుఫాను వచ్చినా మాకు మాత్రం వసంతమే. అప్పుడు తట్టింది. నా వూర్వశి ఇక్కడ ఉండే అవకాశం లేకపోలేదు. వెయిటింగ్ హాలంతా గాలించాను. నా తెగువకు నాకే ఆశ్చర్యం వేసింది. ప్రయాణికులందరూ అక్కడికే చేరుకుంటున్నారు. సీట్లు దొరికిన పురుషులు ఇంగ్లిష్ వార్తపత్రికలు చదువుతున్నారు. వాళ్ల భార్యలు తమ తమ కలల రాకుమారుల కోసం కిటికీల్లోంచి కనిపించే మంచులో వెదుకుతున్నారు. మధ్యాహ్నం వరకు సీట్లన్నీ నిండిపోయాయి. అందరూ పోగవడంతో వేడి ఎంత పెరిగిందంటే ఆ ఉక్కను భరించలేక హాలు దాటి రాక తప్పలేదు. అక్కడా అదే దృశ్యం. ఇతర వెయిటింగ్ రూములు, కారిడార్స్ జనంతో కిక్కిరిసిపోయాయి. పెంపుడు జంతువులు, పిల్లలు, లగేజీతో ప్రయాణీకులు.. నగరంతో సంబంధాలు తెగిపోయాయి. నా నమ్మకం బలపడింది. ‘ఆవిడ’ ఇక్కడే ఎక్కడో ఉండక తప్పదు. మంచు తుఫానులో చిక్కుకున్న ప్లాస్టిక్ కాప్సూల్లాగుంది ఎయిర్‌పోర్టు.లంచ్‌టైం వరకు అర్థమైంది. మేం చిక్కుకుపోయాం. రెస్టారెంట్లు, కెఫెటేరియాలు, బార్ల వద్ద పొడుగాటి క్యూలు. తినడానికీ, తాగడానికీ ఏమీ మిగలకపోవడంతో మూడు గంటల తర్వాత అన్నీ మూసేశారు. చంటిపిల్లలు ఏడుపు లంకించుకున్నారు. జనమంతా ఎడం లేకుండా నిలబడటంతో ఓ రకమైన వాసన వ్యాపించింది. తినడానికేమీ లేదనుకుంటున్నప్పుడు పిల్లల దుకాణంలో రెండు కప్పుల వెనిల్లా ఐస్‌క్రీం దొరికింది. హోటళ్లు ఖాళీ కావడంతో టేబుళ్ల మీద కుర్చీలు పేర్చుతున్నారు. దూరంగా నిల్చుని ఐస్‌క్రీం తింటున్నాను గానీ నా కళ్లు ఆమె కోసమే వెదికాయి. ఉదయం పడకొండు గంటలకు న్యూయార్క్‌కు బయల్దేరాల్సిన విమానం.. రాత్రి ఎనిమిదింటికి బయల్దేరింది. నేను లోపలికి వెళ్లేసరికే సీట్లలో జనం కూర్చున్నారు. ఫ్లైట్ అటెండెంట్ నన్ను నా సీటు వద్దకు తీసుకెళ్లింది. అంతే, ఒక్కసారి గుండాగినంత పనైంది. నా పక్కన విండో సీటు ఆమెదే. ‘ఇలా జరిగింది’ అని రాస్తే ఎవరూ నమ్మరు కదా అనిపించింది. తడబడుతూ విష్ చేశాను కానీ ఆమె వినిపించుకున్నట్లు లేదు. జీవితమంతా అక్కడే గడపబోతున్నట్లుగా సుఖంగా సీట్లో సెటిలయ్యాను. ఇంట్లో సర్దుకున్నట్లుగానే తన వస్తువులన్నీ జాగ్రత్తగా సర్దుకుంది. న్యూయార్క్ దాకా అదే ఆమె స్థిరనివాసం. ‘వెల్కం షాంపేన్’ తీసుకొచ్చాడు స్టువార్డ్. నేను గ్లాస్ అందుకుని ఆమెకు ఆఫర్ చేయబోయాను. కానీ, అర్థంకాని ఫ్రెంచ్‌లో వచ్చీరాని ఇంగ్లిష్‌లో నీళ్లు మాత్రమే కావాలంది స్టువార్డుతో. అంతేకాదు ఫ్లైట్‌లో తనను లేపకూడదని కూడా సూచించింది. గొంతు గంభీరంగా ఉంది. ఆ స్వర్ణంలో తూర్పు దేశాల విషాదం దాగి ఉందనిపించింది. స్టువార్డు నీళ్లు తేగానే ఆమె తన కాస్మెటిక్స్ బాక్స్ తెరిచి, అందులో ఉన్న రంగురంగుల బిళ్లలోంచి రెండు బంగారు బిళ్లలు చేతిలోకి తీసుకుంది. ఆమె ప్రతి కదలికా, ఎంతో నెమ్మదిగా, జాగ్రత్తగా ఉంది. జీవితంలో ఎప్పుడూ ఏ అనుకోని సంఘటనా జరగలేదేమోనన్నంత ధీమాగా ఉందామె ప్రవర్తన. చివరికి, విండోషేడ్ కిందికి దించి, సీట్ బ్యాక్ వీలైనంత వెనక్కి వంచి, నడుం దాకా బ్లాంకెట్ కప్పుకుని, కళ్లమీద స్లీపింగ్ మాస్క్ పెట్టుకుని, అటు తిరిగి పడుకుంది. అంతే, న్యూయార్క్ చేరిన ఎనిమిది (ఎంతకూ గడవని) గంటల, అదనపు పన్నెండు నిమిషాలు ఆమె మరి కదలలేదు. ప్రయాణికుల సహనాన్ని పరీక్షించిన ఫ్లైట్ అది. ఈ సృష్టిలో అందమైన పడతి కన్నా అందమైనదేమీ లేదని నా గట్టి నమ్మకం. కాని నా పక్కనున్న సుందరి నిద్రాలోకంలో విహరించింది. టేకాఫ్ తర్వాత, స్టువార్డుకు బదులు మరో అటెండెంట్ వచ్చి ఆమెకు టాయ్లెట్రీ కేస్, సంగీతం వినడానికి ఇయర్ ఫోన్స్ ఇవ్వడానికి ప్రయత్నించింది కానీ, ఆమె డిస్టర్బ్ చెయ్యవద్దని కోరిందని చెప్పాను. కాని ఆ మాట ఆమె స్వయంగా చెప్పాలన్నాడు. భోజనం కూడా వద్దా, ఆమె తన సీట్లో ‘డునాట్ డిస్టర్బ్’ ట్యాగ్ పెట్టుకోనందుకు నావైపు అసహనంగా చూశాడు.కంపెనీలేక ఒంటరిగా భోజనం ముగించాను. మెలకువగా ఉంటే ఆమెతో చెప్పాల్సిన కబుర్లన్నీ నాలో నేనే చెప్పుకున్నాను. ఆమె ఎంత గాఢ నిద్రలోకి జారుకుందంటే ఆమె తీసుకున్నవి నిద్రమాత్రలా లేక విషం గుళికలా అన్న సందేహం వచ్చింది. డ్రింక్ తీసుకున్న ప్రతిసారీ, ‘టు యువర్ హెల్త్, బ్యూటీ’ అంటూ టోస్ట్ చేశాను.భోజనం తర్వాత లైటాఫ్ చేశారు. ఆ చీకట్లో ఏదో సినిమా చూపించారు కానీ, ప్రపంచమంతా నిండిన అంధకారంలో మేమిద్దరమే ఒంటరిగా మిగిలాం. ఈ శతాబ్దపు అతి పెద్ద తుఫాను తీవ్రత తగ్గింది. అట్లాంటిక్ మహాసముద్రం మీద ప్రశాంతంగా అంధకారం పరుచుకుంది. నక్షత్రాల కింద విమానం నిశ్చలంగా ఉన్నట్లనిపించింది. గంటల తరబడి, అంగుళం అంగుళం ఆమె గురించి ఆలోచించాను. ధ్యానించాను. చలనం లేదు కలల నీడలు కదలాడుతున్నట్లుగా నుదిటిమీద ఏర్పడిన సన్నని రేఖలు తప్ప. ప్రశాంతమైన నీటి మీద తేలియాడుతున్న మేఘాల్లా ఉన్నాయవి. మెళ్లో సన్నని గొలుసుంది కానీ, ఆమె బంగారు రంగు చర్మం మీద అది కనిపించడమే లేదు. చెవులకు రంధ్రాలు లేవు. గోళ్లు గులాబీ రంగులో ఉన్నాయి. ఎడమ చేతికో ఉంగరముంది. ఆమెకు ఇంకా ఇరవై ఏళ్లు కూడా దాటినట్లు లేవు కనుక ఇది పెళ్లి ఉంగరం కాదు. ఎంగేజ్మెంట్ రింగ్ అయివుంటుందని సమాధానం చెప్పుకున్నాను. షాంపేన్ నురగను చూస్తుంటే ‘రెండు చేతులకూ సంకెళ్లున్న నాకు నువ్వు సర్వసంగ పరిత్యాగిలా కనిపిస్తున్నావు’ అన్న జెరార్డో డియేగో కవిత స్ఫురించింది. నేను కూడా సీటు పుష్ చేసి వెనక్కు వాలాను – పక్కపక్కనే. పందిరి మంచంలో నవ దంపతులు కూడా అంత దగ్గరగా పడుకుని ఉండరు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా ఆమె గొంతులాగే గంభీరంగా ఉన్నాయి. చర్మం కూడా ఊపిరి పీల్చుకుంటున్నట్లే పరిమళం విరజిమ్ముతోంది. ఇదో వింత అనుభవం. షాంపేను, మ్యూట్‌లో పెట్టిన సినిమా దృశ్యాలూ నిద్రకు సహకరించాయి. చాలా సేపు నిద్రపోయాను. తలనొప్పి పెరిగి మెలకువ వచ్చింది. బాత్రూంకి వెళ్లి వచ్చాను. రెండు సీట్ల వెనకాల పదకొండు సూటుకేసులావిడ. యుద్ధరంగంలో వదిలేసిన మృతదేవతలా వికృతంగా కాళ్లు చాపుకుని పడుకుంది. గొలుసుకు కట్టిన కళ్లద్దాలు సీట్ల మధ్య పడి ఉన్నాయి. ఎవరైనా తొక్కితే విరిగిపోక తప్పదు. అయినా వాటిని తీసి ఆమెకు అందించాలనే కోరికను అణచుకుని చిలిపి ఆనందం అనుభవించాను.షాంపేను మత్తు దిగింతర్వాత అద్దంలో మొహం చూసుకున్నాను. అసహ్యంగా ఉంది. ప్రేమ పర్యవసానం ఇంత దారణంగా ఉంటుందా? విమానం ఆల్టిట్యూడ్ తగ్గి, మళ్లీ పైకి లేచి ముందుకు దూసుకెళ్లింది.‘రిటర్న్ టు యువర్ సీట్’ సైన్ వెలిగింది. విమానం కుదుపుకైనా ఆమె కళ్లు తెరిచి భయంతో నా చేతుల్లో వాలకపోతుందా అనుకున్నాను. ఆ తొందరలో డచ్ ఆవిడ కళ్లద్దాల మీద కాలు పడేదే కానీ తమాయించుకున్నాను (తొక్కనందుకు నన్ను నేను తిట్టుకున్నాను. అయినా సీటు నంబరు నాలుగు ఆమె ఎంచుకోనందుకు కృతజ్ఞతగా కళ్లద్దాలు తీసి ఆమె ఒళ్లో వేశాను.)నా సుందరికి నిద్రాభంగం చేయడం అసాధ్యం. ఆమె భుజాలు విదిలించి లేపాలనే కోరికను అతి ప్రయత్నం మీద అణచుకున్నాను. తనకు కోపమొచ్చినా సరే. ప్రయాణంలోని ఈ చివరి గంటలోనైనా ఆమె కళ్లు తెరిస్తే బాగుండును. ఆమె లేస్తే తప్ప నాకు విముక్తి దొరకదు. ఆమె లేస్తేనే నా యవ్వనానికి సార్థకత. చివరికి నిస్సహాయంగా వృషభరాశిలో పుట్టినందుకు నన్ను నేను తిట్టుకున్నాను.ల్యాండింగ్ లైట్స్ వెలగగానే ఆమె తనకుతానే దిగ్గున లేచింది. గులాబీ తోటలో పడుకుని లేచినట్టు ఇనుమడించిన అందంతో ఫ్రెష్‌గా కనిపించింది. అప్పుడు తెలిసింది. రాత్రంతా పక్కపక్కనే పడుకున్న దంపతులు తెల్లవారి గుడ్‌మార్నింగ్ చెప్పుకున్నట్లుగా, పక్క సీట్లలో ఉన్న విమాన ప్రయాణికులు ఏ అభివాదమూ చేసుకోరని. నాకేసైనా చూడలేదామె. స్లీపింగ్ మాస్క్ తొలగించగానే ఆమె కళ్లు మిలమిలా మెరిశాయి. సీటు ముందుకు లాక్కుంది. బ్లాంకెట్ తొలగించింది. జుత్తు వదులు చేసుకోగానే మళ్లీ భుజాల మీదకి జారింది. కాస్మెటిక్స్ బాక్స్ ఒళ్లో పెట్టుకుని అవసరం లేని మేకప్ చేసుకుంది. విమానం డోర్ తెరిచిందాకా ఒక్కసారంటే ఒక్కసారైనా నా వైపు చూడలేదు. మళ్లీ లింక్స్ జాకెట్ వేసుకుని, నా కాళ్లు తొక్కుకుంటూ మొక్కుబడిగా లాటిన్ అమెరికన్ స్పానిష్‌లో ‘ఎక్స్‌క్యూజ్‌మీ’ అంటూ ముందుకెళ్లింది. ఆమె సుఖ ప్రయాణానికి, సుఖనిద్రకు నేను చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పలేదు. గుడ్‌బై కూడా చెప్పలేదు. అంతే మరి కాసేపటికి న్యూయార్క్ అనబడే అమెజాన్ మహారణ్యంలో అదృశ్యమైపోయింది. స్పానిష్ మూలం : గేబ్రియల్ గార్సియా మార్కెజ్ అనువాదం: ముక్తవరం పార్థసారథి -
‘స్మోకింగ్ జోన్ల’పై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: తమ రెస్టారెంట్లలోని స్మోకింగ్ జోన్లలో మాత్రమే హుక్కా సేవలను అందిస్తుంటే పోలీసులు జోక్యం చేసుకుంటున్నారంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు పోలీసుల వివరణను కోరింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైదరాబాద్ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ రెస్టారెం ట్లలోని స్మోకింగ్ జోన్లో మాత్రమే హుక్కా సేవలను అందిస్తున్నామని.. అయినా పోలీసులు దీనిపై జోక్యం చేసుకుంటున్నారంటూ హైదరాబాద్‌కు చెందిన అర్బన్ గ్రిల్ డైన్ అండ్ కాఫీ షాప్, మరో సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. స్మోకింగ్ జోన్లలో హుక్కా సేవలపై ఎటువంటి నిషేధం లేదని విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది వేదుల వెంకటరమణ వాదించారు. -
సిగరెట్‌తో ఎముకలకు హాని ఇలా...
నా వయసు 45 ఏళ్లు. రోజుకు ఇరవై సిగరెట్ల వరకు తాగుతాను. ఇటీవల నా బరువు తగ్గింది. విటమిన్ డి పాళ్లు కూడా తగ్గాయి. సిగరెట్ దుష్ప్రభావం ఎముకలపైన కూడా ఉంటుందా? – సుకుమార్, చెన్నై పొగతాగే అలవాటు అన్ని అవయవాల మాదిరిగానే ఎముకలపైనా దుష్ప్రభావం చూపుతుంది. సిగరెట్ల కారణంగా అనారోగ్యకరంగా బరువు తగ్గడం, విటమిన్ డి పాళ్లు తగ్గడం, ఎముకల్లోకి క్యాల్షియమ్ ఇంకడం కూడా తగ్గడం జరుగుతుంది. పైగా మామూలు వ్యక్తులతో పోలిస్తే స్మోకర్లలో ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు 25 శాతం ఎక్కువ. అలాగే తుంటిఎముక ఫ్రాక్చర్లు అయ్యే అవకాశాలు పొగతాగే వారిలో ఎక్కువ. స్మోకింగ్ వల్ల అనేక దుష్ప్రభావాలు కనిపించి ఎముక సాంద్రత తగ్గుతుంది. అందుకు దారితీసే అంశాలివి... ∙పొగతాగే అలవాటు వల్ల హార్మోనల్ ఆమర్పులు వచ్చి క్యాల్షియమ్‌ను ఎముకల్లోకి వెళ్లేలా చేసే పారాథైరాయిడ్ హార్మోన్ పాళ్లు, మహిళల్లో ఈస్ట్రోజెన్ పాళ్లు తగ్గుతాయి. ∙పొగతాగే అలవాటు వల్ల విటమిన్ డి పాళ్లు తగ్గడంతో, శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గుతుంది. ∙శరీరానికి హానిచేసే ఫ్రీరాడికల్స్ పెరగడం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ∙రక్తనాళాల్లో రక్తప్రవాహానికి అడ్డంకులు ఏర్పడటం వల్ల ‘పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్’ వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల ఎముకకూ రక్తప్రసరణ తగ్గుతుంది. ∙పొగతాగే అలవాటు వల్ల నరాలు స్పందించే వేగం తగ్గుతుంది. దాంతో వాళ్లు పడిపోయే అవకాశాలు ఎక్కువ. ∙పొగలోని విషపదార్థాలు ఎముక కణాలపైనా నేరుగా తమ దుష్ప్రభావం చూపుతాయి. ∙ఎముకలలోని బంతిగిన్నె కీలుతో పాటు అన్ని కీళ్లు పొగ వల్ల వేగంగా గాయపడే అవకాశాలుంటాయి. గాయాలు చాలా ఆలస్యంగా తగ్గుతాయి. ∙భర్తకు పొగతాగే అలవాటు ఉన్నప్పుడు వారి భాగస్వామికి ప్యాసివ్స్మోకింగ్ బారినపడటం వల్ల వాళ్లకు పుట్టబోయే బిడ్డల ఎముకల బరువూ చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ∙పొగతాగే అలవాటు ఉన్నవారిలో ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే మీ డాక్టర్ చెప్పినట్లుగా మీరు వెంటనే పొగతాగే అలవాటు మానేయండి. జంక్‌ఫుడ్ అలవాటును తప్పించడం ఎలా? మా బాబు వయసు పదమూడేళ్లు. ఇటీవల వాడు పిజ్జా, బర్గర్లను మాత్రమే ఇష్టపడుతున్నాడు. వాడి బరువు క్రమంగా పెరుగుతోంది. ఈమధ్య వాడు ఊబకాయంతో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మావాడి విషయంలో తగిన సలహా ఇవ్వండి. – నర్మద, హైదరాబాద్ మాస్‌మీడియా ద్వారా ఈమధ్య ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి డాక్టర్ల నుంచి ప్రజలకు ఎన్నో సూచనలు అందుతున్నాయి. కానీ ఇంకా చాలా మంది అంతగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం లేదు. ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం, వ్యాయామాలు చేయడం వంటి ఆరోగ్య నియమాలను పాటించడం లేదు. దాంతో పిల్లల మీద, వాళ్ల భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పిల్లలు టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం గడుపుతున్నారు. వ్యాయామాలు, ఆటల వంటి కార్యకలాపాలపై ఎక్కువ సమయం వెచ్చించడం లేదు. కౌమార బాలబాలికలు ఆహార నియమాలు సరిగా పాటించకపోగా... అనారోగ్యకరమైనవీ, పోషకాలు సరిగా లేనివి అయిన ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. దాంతో ఒబేసిటీ, ఆస్తమా వంటి శారీరక రుగ్మతలతో పాటు వాళ్ల వికాసం, మానసిక ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం పడుతోంది. గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపుకంటే ఎక్కువగా పిల్లలు దీర్ఘకాలికమైన వ్యాధుల బారిన పడుతున్నట్లు ఓ అధ్యయనంలో తెలింది. పోషకాహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం వల్ల పిల్లలు భవిష్యత్తులో స్థూలకాయం, హైబీపీ, హైకొలెస్ట్రాల్, టైప్–2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. మంచి ఆహారం తీసుకోవడంతో పాటు వాళ్లు చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండే పానీయాలు తీసుకోకపోవడం వల్ల పిల్లలను పైన పేర్కొన్న లైఫ్‌స్టైల్ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. మీరు మీ పిల్లలకు ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు ఎక్కువగా తినేలా చూడండి. తాజా పండ్లు ఎక్కువగా అందేలా జాగ్రత్తలు తీసుకోండి. బయటకు వెళ్లి ఆటలు ఎక్కువ ఆడేలా ప్రోత్సహించండి. టెలివిజన్, కంప్యూటర్, మొబైల్, ఐపాడ్ వంటి వాటితో ఎక్కువగా ఆడనివ్వకండి. రోజూ ఉదయం మంచి బ్రేక్‌ఫాస్ట్ తీసుకునేలా చూడండి. బేకరీ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండే పానీయాలను చాలా పరిమితంగా అందేలా చూడండి. ఇవి మీ బాబు విషయంలో తప్పక అనుసరించాల్సిన జాగ్రత్తలు. ఓల్డేజ్‌లో మునుపటి ఫిట్నెస్ ఎలా? లైఫ్‌స్టయిల్ కౌన్సెలింగ్ నా వయసు 55 ఏళ్లు. మొదట్నుంచీ హెల్దీపర్సన్ను. ఈమధ్యకాలం వరకు చాలా ఆరోగ్యంగా ఉండేవాడిని. అయితే ఇటీవల నా ఫిట్నెస్ తగ్గినట్లు అనిపిస్తోంది. మెట్లు ఎక్కే సమయంలో, బైక్ వరకు వెళ్లే టైమ్‌లో మునుపటిలా చురుగ్గా ఉండలేకపోతున్నాను. దాంతో నాకు ఈ ఫీలింగ్ వస్తోంది. నేను ఇదివరకటి ఫిట్నెస్ పొందడానికి ఏం చేయాలి? – పి. శ్రీనివాస్, విశాఖపట్నం మీ వయసు వారంతా కీలకమైన ఇలాంటి సమయంలో మునుపటి ఫిట్నెస్ను కాపాడుకోవడం ఎలాగో తెలుసుకోవడం చాలా ప్రధానమైన అంశం. సాధారణంగా మీ వయసు వారిలో చాలామందికి డయాబెటిస్ లేదా హైబీపీ లాంటి వ్యాధులు ఉండటం మామూలే. అలాంటి లక్షణాలు ఏవైనా కనిపిస్తే, వెంటనే తగిన పరీక్షలు చేయించుకొని, వాటికి తగిన చికిత్స పొందడం, మంచి ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి అంశాలు ఫిట్నెస్ను నిలుపుకోడానికి ఎంతగానో దోహదపడతాయి. వీటన్నింటిలోనూ వ్యాయామం చాలా ముఖ్యం. మీరు ఏ వయసువారైనప్పటికీ వ్యాయామంతో తగిన ప్రయోజనం పొందవచ్చు. దీనివల్ల గుండెజబ్బులు, మతిమరపు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు, అధికరక్తపోటు, స్థూలకాయం వంటి సమస్యలను నివారించుకోవచ్చు. ఎముకల సాంద్రత తగ్గడం కూడ నివారితమవుతుంది. దాని వల్ల వయసుపైబడ్డవారు పడిపోయే అవకాశాలు తగ్గుతాయి. ఒకవేళ పడిపోయినా... ఎముకల విరిగే అవకాశమూ తగ్గుతుంది. పైగా వ్యాయామం చేసేవారిలో ఎండార్ఫిన్ వంటి జీవరసాయనాలు ఎక్కువగా స్రవించి ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాదు... అవి దిగులుగా ఉండటం, యాంగై్జటీ, డిప్రెషన్‌ను కూడా రాకుండా నివారిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. అయితే కాస్త వయసుపైబడ్డవారు వ్యాయామాన్ని ప్రారంభించే ముందుగా డాక్టర్ నుంచి తగిన సలహా పొందాలి. వారి వ్యక్తిగత రుగ్మతలకూ, జీవనశైలికి తగిన వ్యాయామ విధానాల గురించి డాక్టర్ నుంచి సూచనలు పొందాలి. ఉదాహరణకు డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవారు తాము తీసుకుంటున్న మందులు, ఆహారానికి తగినట్లుగా తమ వ్యాయామ పద్ధతులు, వేళల గురించి డాక్టర్ నుంచి సలహా పొందడం అవసరం. పైగా వ్యాయామాన్ని కొత్తగా మొదలుపెట్టేవారు భారమైన పెద్దపెద్ద వ్యాయామాలను ఒకేసారి ప్రారంభించకూడదు. వ్యవధినీ, శరీరం మీద పడే భారాన్ని మెల్లమెల్లగా పెంచాలి. రోజులో రెండుసార్లు వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం వల్ల అయ్యే గాయాలను నివారించడానికి ఎక్సర్సైజ్కు ముందుగా వార్మింగ్ అప్, తర్వాత కూలింగ్ డౌన్ వ్యాయామాలు చేయడం మేలు. వ్యాయామం మనల్ని మరింత చురుగ్గా ఉండేలా చేయాలి. అంతేతప్ప నిస్సత్తువను పెంచకూడదు. వ్యాయామం చేస్తున్నప్పుడు నొప్పులు పెరిగినా, ఒంట్లో ఎక్కడైనా ఎర్రబారినా, శ్వాస అందకపోయినా, చెమటలు ఎక్కువగా పట్టినా, ఇతరత్రా ఇబ్బందులు ఎదురైనా వెంటనే వ్యాయామం ఆపేయాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి తగిన చికిత్సనూ, సలహాలు, సూచనలను పొందాలి. - డాక్టర్ సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
చైనాలో వ్యాన్ బీభత్సం
-
గొంతు దోచిన భర్త
భర్త దుర్మార్గుడైతే భార్య గొంతు కోశాడని అంటుంటారు. భర్త మంచివాడైనా భార్య గొంతు కోస్తే? భార్య గొంతు దోచుకెళ్తే? భార్యను కష్టాలపాలు చేస్తే? పొగతాగటం భర్తకు మాత్రమే ప్రమాదం కాదు. భార్యకు కూడా. నళిని కథ వింటే.. స్మోకింగ్ చేస్తున్న మీ భర్తను ‘స్టాప్ స్మోకింగ్’ అని అనక మానరు. ఫేస్బుక్లో వేలాదిగా షేర్ అవుతున్న ఈ కథనాన్ని చదవండి. హడావుడిగా నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. నా స్వరపేటికలో అల్సర్ వచ్చిందని చెప్పారు పిల్లలు. వాళ్లు ఏదో దాస్తున్నారనిపించింది నాకు. ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. నేను ఒక్కనాడు కూడా సిగరెట్లు కాల్చలేదు, ఎవ్వరినీ నొప్పించలేదు. అయినా నాకు ఇలా జరిగిందేమిటి అని... నా పేరు నళిని. నా జీవితంలో నేను ఒక్క సిగరెట్ కూడా కాల్చలేదు. కాని దురదృష్టం నన్ను వెంటాడింది. గొంతు క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు నాకు స్వరపేటిక లేదు. 1972లో మా బావతో నాకు వివాహం అయ్యింది. చాలా నిక్కచ్చి మనిషి. ఆయన ఇంజనీర్. దేశమంతా ఉద్యోగరీత్యా తిరుగుతుండేవారు. కాని ఆయనకు సిగరెట్లు కాల్చడమనే ఒక బలహీనత ఉంది. నేను ఏం చెప్పినా ఆయన మాత్రం ధూమపానం మానలేదు. ఆయనకు 45 సంవత్సరాల వయసులో 1991లో మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. సిగరెట్ల సంఖ్య తగ్గించారే కాని పూర్తిగా మానలేకపోయారు. అయిదేళ్ల తరవాత మళ్లీ గుండె పోటు వచ్చింది. అప్పుడు ఇంక సిగరెట్లు పూర్తిగా మానేయమని డాక్టర్లు హెచ్చరించడంతో మానేశారు. 2005లో నిద్రలోనే కన్నుమూశారు. ఆయన మరణించిన నాలుగు సంవత్సరాలకి అంటే 2009లో నాకు గొంతు నొప్పి వచ్చింది. స్వరంలో శబ్దం తగ్గిపోయింది. డాక్టరు దగ్గరకు వెళితే మందులు రాశారు. వాడుతూనే ఉన్నా గుణం మాత్రం కనిపించలేదు. ఒక సంవత్సరం పాటు వాడుతూనే ఉన్నాను. తగ్గకపోగా, ఊపిరి సమస్య మొదలైంది. ఒకరోజు ఇంక ఊపిరి ఆగిపోతుందేమో అనిపించింది. నా బాధ చెబుదామంటే నోట్లో నుంచి మాట రాలేదు. మా పిల్లలు కంగారు పడ్డారు. హడావుడిగా నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. నా స్వరపేటికలో అల్సర్ వచ్చిందని చెప్పారు పిల్లలు. వాళ్లు ఏదో దాస్తున్నారనిపించింది నాకు. గట్టిగా అడగడంతో నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. నేను ఒక్కనాడు కూడా సిగరెట్లు కాల్చలేదు, ఎవ్వరినీ నొప్పించలేదు. అయినా నాకు ఇలా జరిగిందేమిటి అని చాలా బాధపడ్డాను.పాసివ్ స్మోకింగ్ కారణంగా నాకు క్యాన్సర్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. నా భర్త పక్కనే కూర్చోవడం వల్ల ఆయన వదిలిన సిగరెట్ పొగ నేను నాకు తెలియకుండానే పీల్చడం వల్లే ఇలా జరిగిందని అర్థం చేసుకున్నాను. జరిగిన దాని గురించి కాదు, జరగవలసిన దాని గురించి ఆలోచించాలి అనుకున్నాను. డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలనడంతో మారు మాట్లాడకుండా అంగీకరించాను. 2010, ఏప్రిల్ 19న, నన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. నా కంఠానికి గాటు పెట్టి, స్వరపేటిక, థైరాయిడ్ గ్లాండ్ తీసేశారు. మెడలో ఒక రంధ్రం (స్టోమా) పెట్టారు. వాయిస్ ప్రాస్థసిస్ అమర్చారు. దాని ద్వారానే నేను చెప్పదలచుకున్నది చెప్పడం నేర్చుకోవడం ప్రారంభించాను. ఉదర భాగానికి ఒక గొట్టం అమర్చి దాని ద్వారా నాకు ఆహారం ఇవ్వడం ప్రారంభించారు. మొదట్లో నేను బాగా కుంగిపోయాను. నా పిల్లలు ఇచ్చే మనోధైర్యంతో, క్రమంగా మానసికంగా కోలుకున్నాను. వచ్చిన అనారోగ్యం గురించి ఆలోచించడం మానేశాను. నవ్వడం అలవాటు చేసుకున్నాను. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే అనవసరమైన ఆలోచనలు వస్తాయి. అందుకే ఏదో ఒకటి చేయాలనుకున్నాను. నా 64వ ఏట నేను కంప్యూటర్ నేర్చుకోవడం ప్రారంభించాను. చాలా తొందరగా ఫేస్బుక్ వాడటం అలవాటు చేసుకున్నాను. నా మెడలో రంధ్రం ద్వారా అమర్చిన గాలి గొట్టం ద్వారా కష్టపడి మాట్లాడటానికి ప్రయత్నించాను. అయినా నాలో ఏదో అసంతృప్తి వెంటాడుతూనే ఉంది. ఆ రంధ్రం నుంచే వేణువు వాయించడం సాధన చేస్తున్నాను. పెద్దగా వాయించలేకపోయినా, నా ఆత్మానందానికి తగినట్లుగా వేణువు వాయించగలిగితే చాలు. అందుకే ప్రతిరోజూ కొంతసేపు వేణువు సాధన చేస్తున్నాను. నా చీరకు మ్యాచ్ అయ్యేలా నా మెడకి ఉన్న రంధ్రం మూసుకునేలా రకరకాల దుస్తులు కుట్టడం ప్రారంభించాను. పగలంతా పొగాకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాను. ఎంతోమంది క్యాన్సర్ రోగులకు మానసిక ధైర్యం ఇస్తున్నాను. ఒక మాటలు రాని వ్యక్తిగా, నేను ఈరోజు చాలా మాట్లాడుతున్నాను. డాక్టర్లు కూడా నా కోసం ఒక మాట్లాడే సాధనం ఇస్తామన్నారు. ఆ సాధనం వల్ల నేను నా స్టోమాని పట్టుకోవలసిన అవసరం ఉండదు. నేను నా తరఫు నుంచి ఒక సందేశం ఇస్తాను. ఇది చాలా సింపుల్. పాసివ్ స్మోకింగ్‌ను నిర్లక్ష్యం చేయకండి. మీకు ప్రియమైనవారు మీ దగ్గర సిగరెట్ కాలుస్తుంటే, నిర్మొహమాటంగా వద్దని చెప్పేయండి. వారి కోసమే కాదు, మీ కోసం కూడా. పాసివ్ స్మోకింగ్ కారణంగా నాకు క్యాన్సర్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. నా భర్త పక్కనే కూర్చోవడం వల్ల ఆయన వదిలిన సిగరెట్ పొగ నేను నాకు తెలియకుండానే పీల్చడం వల్లే ఇలా జరిగిందని అర్థం చేసుకున్నాను. మనవరాలు, మనవడితో నళిని (71) -
రోజుకి ఒక సిగరెట్ తాగినా..
లండన్ : రోజుకు కేవలం ఒక సిగరెట్ తాగినా గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ 50 శాతం పెరుగుతుందని, రోజుకు 20 సిగరెట్లు తాగే వారికి గుండె పోటు వచ్చే అవకాశాలు రెండితలవుతాయని, స్ట్రోక్ రిస్క్ నూరు శాతం పెరుగుతుందని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఇక మహిళలు రోజుకు ఒక సిగరెట్ తాగినా వారికి గుండె జబ్బుల రిస్క్ రెండు రెట్లు అధికమని తేల్చింది. దాదాపు 140 శాస్ర్తీయ అథ్యయనాలను విశ్లేషించిన అనంతరం గుండె జబ్బులకు స్మోకింగ్ ఎంతమాత్రం క్షేమకరం కాదని పరిశోధనకు నేతృత్వం వహించిన లండన్‌కు చెందిన యూసీఎల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ అల్లన్ హక్షా పేర్కొన్నారు. కార్డియోవాస్కులర్ జబ్బుల రిస్క్‌ను తప్పించుకునేందుకు సిగరెట్ల సంఖ్యను కుదించడం కాకుండా మొత్తంగా స్మోకింగ్‌కు దూరంగా ఉండటమే మేలని సూచించారు. రోజుకు ఒక సిగరెట్ తాగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కొందరు భావిస్తారని అయితే అలాంటి వారికి లంగ్ క్యాన్సర్ ముప్పు ఎదురవుతుందని చెప్పారు. కొత్త సంవత్సరంలో చాలా మంది స్మోకింగ్‌కు గుడ్‌బై చెప్పే ఆలోచనల్లో ఉండే క్రమంలో తాజా అథ్యయనంతో స్మోకర్లు వెంటనే తమ అలవాటును మార్చుకుంటే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. -
ఆపిల్స్, టమాటాలతోఊపిరితిత్తులకు మేలు!
ధూమపానం మానేసిన వారికి ఎప్పుడూ ఓ సందేహం ఉంటుంది. కొద్దోగొప్పో పాడైన తమ ఉపిరితిత్తులను ఆరోగ్యవంతంగా చేయవచ్చా? అని. ఈ సందేహంపై జాన్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ ప్యారిస్ శాస్త్రవేత్తలు ఒక స్పష్టత ఇచ్చారు. తినే ఆహారంలో టమాటాలతోపాటు అధిక స్థాయిలో పండ్లు ముఖ్యంగా ఆపిల్స్ తింటే ఊపిరితిత్తులకు జరిగిన నష్టాన్ని తగ్గిస్తుందని వారు అంటున్నారు. దాదాపు పదేళ్లపాటు తాము పరిశీలన జరిపామని.. ఈ కాలంలో ఆపిల్స్, టమాటాలు ఎక్కువగా తిన్న మాజీ ధూమపాన ప్రియుల్లో ఊపిరితిత్తుల పనితీరు ఇతరులతో పోలిస్తే మెరుగ్గా ఉందని వెనెస్సా గార్షియా లార్సెన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. జర్మనీ, నార్వే, యునైటెడ్ కింగ్‌డమ్‌లకు చెందిన కొంతమందిపై ఈ పరిశోధన జరిగింది. వారు తీసుకునే ఆహారం, ఊపిరితిత్తుల పనితీరును పదేళ్ల అంతరంలో రెండు సార్లు పరిశీలించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని చెప్పారు. సగటున రోజుకు రెండు టమాటాలు లేదంటే మూడుకంటే ఎక్కువసార్లు పండ్లు తినేవారి ఊపిరితిత్తులు... ఒకటి కంటే తక్కువ టమాటాలు, పండ్లు తినే వారికంటే నెమ్మదిగా సమస్యలకు గురవుతున్నట్లు తెలిసిందన్నారు. టమాటాలు, పండ్లు ఊపిరితిత్తులకు మేలుస్తాయని, అలాగే ధూమపానం వల్ల ఊపిరితిత్తులకు జరిగిన నష్టాన్ని సరిచేసేందుకు ఇవి ఉపయోగపడతాయని తమ పరిశోధన చెబుతోందన్నారు. -
స్మోకింగ్ మానేయాలనుకుంటున్నారా..!
లండన్: పొగతాగడం (స్మోకింగ్) పలు వ్యాధులకు దారితీస్తుందని అందరికీ తెలిసిందే. జీర్ణాశయం వాపు లాంటి పలు సమస్యలు స్మోకింగ్ వల్ల ఎదురవుతాయి. పొగతాగడం బాగా అలవాటున్న వారికి ఈ వ్యసనాన్ని మానుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అయితే స్మోకింగ్ చేసేవాళ్లు ప్రతిరోజు కొద్దిసేపు రన్నింగ్ చేస్తే ఆ అలవాటు నుంచి బయడపడే అవకాశం ఉందంటున్నారు లండన్ నిపుణులు. సెయింట్ జార్జ్ యూనివర్శిటీ ఆఫ్ లండన్‌కు చెందిన కొందరు రీసెర్చర్లు ఈ విషయాన్ని వెల్లడించారు. డాక్టర్ అలెక్సిస్ బెయిలీ అనే రీసెర్చర్ తన బృందంతో స్మోకింగ్ పై చేసిన పరిశోధన ఫలితాలను బ్రిటీష్ జర్నల్ ఆఫ్ ఫార్మకాలజీలో ప్రచురించారు. ప్రతిరోజు కొద్దిదూరం పరుగెడితే పొగతాగాలన్న ఆలోచన వారిలో తగ్గిపోతుందన్నారు. రీసెర్చర్ల బృందం కొన్ని ఎలుకలపై నికోటిన్ ను ప్రయోగించి చూశారు. ఆ ఎలుకలలో కొన్నింటిని పరుగెత్తించడం, వ్యాయామం చేయించడం లాంటి పనులు చేయించి చూడగా వాటిలో నికోటిన్ ప్రభావం చాలా మేరకు తగ్గినట్లు గుర్తించారు. మనుషుల్లో అయితే ఎక్కువ సమయం వ్యాయామం చేయడం లాంటి శారీరక శ్రమ కలిగించే పనుల కంటే కాసేపు పరుగెత్తే వారిలో నికోటిన్ ప్రభావం తగ్గి, ధూమపానానికి దూరంగా ఉండాలని స్మోకర్స్ భావిస్తారని లండన్ నిపుణుల బృందం వెల్లడించింది. -
అప్పుడప్పుడు ఆ అలవాటు ఉంది...
నాకు అప్పుడప్పుడూ స్మోకింగ్ చేసే అలవాటు ఉంది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు స్మోకింగ్ చేయడం మంచిది కాదనే విషయం నాకు తెలిసినా, ఈ అలవాటును మార్చుకోవడం కష్టంగా అనిపిస్తుంది. ‘నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ’తో ఉపయోగం ఉంటుందని ఒకరు సలహా ఇచ్చారు. మరొకరేమో... ఈ థెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటున్నారు. నిజానిజాలేమిటో తెలియజేయగలరు. – ఎస్ఎన్, హైదరాబాద్ స్మోకింగ్వల్ల సిగరెట్స్‌లో ఉండే నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్, టార్.. ఇంకా ఇతర కెమికల్స్ వల్ల గర్భిణీలకు, అలాగే కడుపులోని శిశువులకు హాని జరుగుతుంది. గర్భిణీలలో స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులలో సమస్యలు, ఆయాసం, బీపీ పెరగడం, అబార్షన్లు, అవయవ లోపాలు, బిడ్డ బరువు పెరగకపోవడం, కడుపులో చనిపోవడం, నెలలు నిండకుండానే కాన్పులు వంటి అనేక సమస్యలు ఏర్పడవచ్చు. ముందు నుంచి ఎక్కువగా సిగరెట్లు కాలుస్తూ ఉండి, ఉన్నట్టుండి మానలేరు. అలా మానేసినా.. వారిలో తలనొప్పి, వికారం, తెలియని బాధ, డిప్రెషన్ వంటి లక్షణాలు ఏర్పడవచ్చు. అలాంటప్పుడు ‘నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ (ఎన్ఆర్టీ)’ని డాక్టర్ సలహా మేరకు వాడొచ్చు. కానీ దీని ప్రభావం బిడ్డపైన ఎంతవరకు ఉంటుందని చెప్పడం కష్టం. ఎన్ఆర్టీ వాడేకంటే ముందు స్మోకింగ్ అలవాటు ఉండి గర్భిణీౖయెన స్త్రీలకు సపోర్టివ్ కౌన్సెలింగ్, బిహేవియర్ థెరపీ, మానసిక ధైర్యం, కుటుంబ సభ్యుల అండతో వారిని స్మోకింగ్ నుంచి మెల్లిగా మరల్చవచ్చు. అలాకాని పక్షంలో ఎన్ఆర్టీ ప్రయత్నించవచ్చు. ఎన్ఆర్టీ అంటే నికోటిన్ ఉండే చూయింగ్ గమ్స్, చప్పరించే మిఠాయిలు ( ్డౌ్ఛnజ్ఛ), ఇన్హేలర్స్, ప్యాచెస్లో ఏదో ఒకటి వాడటం. వీటిలోని నికోటిన్.. స్మోకింగ్ వల్ల వచ్చే నికోటిన్ శాతం కన్నా చాలా తక్కువ. కొంత మోతాదు వరకే రక్తంలోకి మెల్లిగా చేరుతుంది. కాబట్టి స్మోకింగ్ ఉన్నట్టుండి ఆపడం వల్ల వచ్చే విత్‌డ్రాయల్ లక్షణాలను మెల్లిగా అధిగమించవచ్చు. నా వయసు 34. ఒక బాబు ఉన్నాడు. ఒక అమ్మాయి కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. అయితే రెండోసారి ప్రెగ్నెన్సీ రావడం లేదు. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. ‘సెకండరీ ఇన్ఫెర్టిలిటీ’ సమస్య వల్ల ఇలా జరుగుతుంది అని ఒకరు చెప్పారు. ఇది ఎంత వరకు నిజం? రెండోసారి గర్భం రాకపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటి? – పి.నళిని, రాజమండ్రి ఒక ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సాధారణంగా ప్రయత్నించినా, గర్భం రాకపోవడాన్ని ‘సెకండరీ ఇన్ఫర్టిలిటీ’ అంటారు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. మీరు మీ బాబు వయసు రాయలేదు. సాధారణ కాన్పు లేక సిజేరియన్ ద్వారా డెలివరీ అయ్యారా అనేది కూడా రాయలేదు. ఇప్పుడు∙మీ బరువు ఎంత? పీరియడ్స్ ఎలా ఉన్నాయి? ఇంకా ఇతర సమస్యలేమైనా ఉన్నాయా? లాంటివి కూడా రాయలేదు. మీవారి వయసు ఎంత, వారికేమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే అనేక అంశాలనుబట్టి మీకు రెండోసారి ప్రెగ్నెన్సీ ఎందుకు రావడం లేదనేది అంచనా వేయడం జరుగుతుంది. దాన్నిబట్టి అవసరమైన రక్త పరీక్షలు, హార్మోన్ పరీక్షలు, స్కానింగ్, ట్యూబ్టెస్ట్ వంటివి చెయ్యడం జరుగుతుంది. సమస్యను బట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. మొదటిసారి గర్భం దాల్చడానికి ఇబ్బంది లేకపోయినా, కొంతమందిలో మరలా గర్భం దాల్చడానికి భార్యలో కానీ, భర్తలో కానీ కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. మగవారిలో వీర్యకణాల సంఖ్య, వాటి కదలిక, నాణ్యత తగ్గవచ్చు. అలాగే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడవచ్చు. అలాగే ఆడవారిలో ఒక గర్భం తర్వాత ఇన్ఫెక్షన్స్ వల్ల లేక ఇంకా వేరే కారణాల వల్ల ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోయే అవకాశాలు ఉంటాయి. దానివల్ల గర్భం రాకపోవచ్చు. థైరాయిడ్, ప్రొలాక్టిన్ వంటి ఇంకా ఇతర హార్మోన్ల అసమతుల్యత వల్ల అండం పెరగకపోవడం, విడుదల కాకపోవడం, అండం నాణ్యత సరిగా లేకపోవడం, గర్భాశయంలో ఇన్ఫెక్షన్లు, అండాశయంలో నీటిగడ్డలు.. వంటి అనేక కారణాల వల్ల మరలా గర్భం దాల్చలేకపోవచ్చు. నేను లావుగా ఉంటాను. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని. ఈ సమయంలో బరువు తగ్గడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదు. అలాగని బరువు కూడా ఏమీ పెరగడంలేదు. అయితే, లావుగా ఉన్న స్త్రీలకు పుట్టే పిల్లలకు ఆటిజం రిస్క్ ఉంటుందనే వార్త చదివాను. ఇది ఎంత వరకు నిజం?– కళ్యాణి, అనంతపురం జన్యుపరమైన సమస్యలు, ఆహారంలో పెస్టిసైడ్స్, కెమికల్స్, తల్లిలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వంటి అనేక కారణాల వల్ల బిడ్డలో మెదడులోని కణజాలంలో, నిర్మాణంలో, పనితీరులో సమస్యలు ఏర్పడి ఆటిజమ్ రావడం జరుగుతుంది. లావుగా ఉండటం వల్లే .. పుట్టే పిల్లలకు ఆటిజం రావాలని ఏమీ లేదు. కాకపోతే లావుగా ఉండి, వారిలో మధుమేహ వ్యాధి రావడం, అలాగే వారి జన్యువుల్లో ఏదైనా సమస్య ఉన్నప్పుడు, మామూలు వారికంటే వీరికి పుట్టే పిల్లల్లో ఆటిజమ్ ఉండే అవకాశాలు కొద్దిగా ఎక్కువ. అంతేకానీ కేవలం బరువు ఎక్కువగా ఉన్నందువల్ల పిల్లలకు ఆటిజమ్ వచ్చే రిస్క్ పెరగదు. డా‘‘ వేనాటి శోభ రెయిన్బో హాస్పిటల్స్ హైదర్‌నగర్,హైదరాబాద్ -
ఆపే "దమ్ము" లేదా..?
సినిమా హాళ్లలో హెచ్చరికలు, టీవీ సీరియళ్లలో స్క్రోలింగ్‌లు, హోర్డింగుల్లో సూచనలు తప్పితే ధూమపాన నిషేధ చట్టం వాస్తవంలో అమలు కావడం లేదు. బహిరంగ ప్రదేశాల్లోనే గుప్పుగుప్పుమంటూ పొగ వదులుతున్నా చర్యలు తీసుకునే నాథుడు కానరావడం లేదు. యువకుల నుంచి వృద్ధుల వరకు ఎక్కడపడితే అక్కడ ఇష్టానుసారం పొగరాయుళ్లు ‘టొబాకోపనిషత్తు’ను వల్లె వేస్తున్నా పల్లెత్తు మాటనే వాడు కనిపించడం లేదు. ఫలితంగా ఇప్పటికే కాలుష్యంతో పొగ బారిన పరిసరాలు ఇంకాస్త కలుషితమవుతున్నాయి. మరీ ముఖ్యంగా నిషేధ చట్టం ఉందనే విషయమే మర్చిపోయే ప్రమాదం కలుగుతోంది. శ్రీకాకుళం: ప్యాషన్ అంటూ కొందరు, అలవాటంటూ ఇంకొందరు పొగాకును కాల్చి పారేస్తున్నారు. ఇందులో విద్యార్థులు, యువకులు అధికంగా ఉన్నారు. అడిగేవారు లేరని ఇష్టానుసారంగా బహిరంగ ధూమపానం చేస్తున్నారు. బస్టాండు, సినిమా హాళ్లు, టీ దుకాణాల వద్ద విచ్చలవిడిగా పొగ తాగుతున్నారు. ధూమపాన నిషేధ చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడంతో వీరి అలవాటుకు అడ్డుకట్ట పడడం లేదు. పొగ తాగేవారితోపాటు ఆ పొగ పీల్చే వారిలో 30 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్లు వస్తున్నా యి. పొగాకు, సిగరెట్టు ఉత్పత్తులతో తలెత్తుతున్న అనర్థాలను దృష్టిలో ఉంచుకొని బహిరంగ ప్రదేశాలలో ధూమపానాన్ని నిషేధిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుం బ సంక్షేమ మంత్రిత్వశాఖ 2008, అక్టోబర్ 2న బహిరంగ ధూమపాన నిషేధ చట్టం (సీఓటీపీ–2008) రూపొందించింది. చట్టం ఏమి చెబుతోంది..? సీఓటీపీ చట్టం ప్రకారం బస్టాండు, రైల్వే స్టేషన్, సినిమా హాళ్లు, మార్కెట్, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, జనసంచారం ఉండే ప్రదేశాల్లో ధూమపాన నిషేధం అమలులో ఉంది. దీన్ని అతిక్రమిస్తే రూ. 200 జరిమానాతోపాటు జైలు శిక్ష విధించాలని చట్టం చెబుతోంది. పొగాకు ఉత్పత్తులను 18 ఏళ్లలోపు ఉన్న వారికి అమ్మినా జరిమానా విధించాలి. పొగాకు నియంత్రణ, బహిరంగ ధూమపానాన్ని అరికట్టేందుకు, చట్టం అమలు బాధ్యతను పోలీసు శాఖకు అప్పగించింది. చాలా ప్రాంతాల్లో పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో పొగతాగే వారిపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. పోలీసు అధికారులకు చట్టం గురించి అవగాహన ఉన్నా తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నష్టాలే నష్టాలు పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల ఎక్కువగా క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతోపాటుపాటు ఇతర ప్రాణాంతక జబ్బులు వచ్చే అవకాశం ఉంది. వీటిని ప్రత్యక్షంగా తీసుకోకున్నా ఇతరులు వదిలే పొగ పీల్చినా వ్యాధుల బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు. పోలీసు అధికారులు ఇప్పటికైనా స్పందించి బహిరంగ ప్రదేశాల్లో ధూమపాన నిషేధ చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలి. సిగరెట్ల రేట్లు పదిశాతం పెంచితే వాటి వాడకం నాలుగైదు శాతం తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు పేర్కొన్న విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. శ్వాసకోస వ్యాధులు వస్తాయి పొగరాయుళ్లు వదిలే పొగను పక్కన ఉన్న వ్యక్తులు పీల్చుకోవడం వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. పొగ తాగడం వల్ల ఊపిరితిత్తులు చెడిపోతాయి. బహిరంగ ధూమపానం మంచిది కాదు. – డాక్టర్ సునీల్‌నాయక్, రిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ -
స్మోకింగ్‌తో ఇవి బోనస్..
లండన్: పొగతాగడం పలు వ్యాధులకు దారితీస్తుందని ఇప్పటికే నిర్ధారణ కాగా, తాజా పరిశోధన స్మోకింగ్ ఆరోగ్యానికి ఎంతటి చేటో వెల్లడించింది. సిగరెట్ తాగడం వల్ల జీర్ణాశయం వాపు సంభవించి తీవ్ర అనారోగ్యానికి కారణమవుతుందని తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు హెచ్చరించారు. కార్డియోవాస్కులర్ వ్యాధితో పాటు లంగ్ క్యాన్సర్‌కూ స్మోకింగ్ ప్రధాన కారణమని తక్షణమే దీన్ని వదిలివేయాలని స్మోకర్లకు సూచించారు. తాజా పరిశోధన జీర్ణకోశ వ్యాధుల చికిత్సలో నూతన మార్పులకు నాందిపలుకుతుందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణాశయం వాపుతో తీవ్ర పరిస్థితి తలెత్తుతుందని ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. స్మోకింగ్ వల్ల ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎన్నో రెట్లు అధికమని శాస్ర్తవేత్తలు వెల్లడించారు. కడుపు నొప్పి, డయేరియా, బరువు తగ్గడం వీటి లక్షణాలని చెప్పారు. పొగతాగేవారు ముఖ్యంగా అజీర్ణంతో బాధపడేవారు తక్షణమే స్మోకింగ్‌కు స్వస్తిపలకాలని సూచిస్తున్నారు. -
బంపర్ ఆఫర్: స్మోకింగ్ మానేస్తే..
టోక్యో: ఆఫీసు పనివేళల్లో గుప్పు గుప్పుమంటూ పాకెట్ల కొద్దీ సిగరెట్లను ఊదిపారేసే పొగరాయుళ్లు పని ఎగ్గొడుతున్నట్టు లెక్కా? జపాన్ కంపెనీలు దీన్నే నమ్ముతున్నాయి. అందుకే పొగరాయుళ్ల చేత ధూమపానాన్ని మాన్పించేందుకు అక్కడి కంపెనీలు వినూత్నంగా బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ కొత్త ఎత్తుగడతో అటు పుణ్యాన్ని, ఇటు పురుషార్ధాన్ని మూటగట్టుకుంటున్నాయి. ఎవరైతే పొగతాగడం మానేస్తారో వారికి అదనంగా జీతంతో సెలవులను ప్రకటిస్తున్నాయి. టోక్యో ఆధారిత మార్కెటింగ్ కంపెనీ పియాలా ఈ ఎత్తుగడ వేసింది. ఆఫీస్ పనిగంటల్లో సిగరెట్ తాగటం మానేస్తే.. ఏడాదిలో ఆరు రోజులు అదనంగా సెలవు మంజూరు చేయనున్నట్టు ప్రకటించింది. సంస్థలోని ఒక ఉద్యోగి సలహా మేరకు కంపెనీ సెప్టెంబర్‌లో ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. కంపెనీ నిబంధనల ప్రకారం బయటకు వెళ్లే వరకు సిగరెట్ కోసం బ్రేక్ తీసుకోకూడదు. సిగరెట్ తాగకూడదు. అంతేకాదు... ఈ నిబంధనలకు ఒకే అంటే చాలు అడ్వాన్స్ కూడా ఇస్తానని ప్రకటించింది. రోజు రోజుకు ఉద్యోగుల్లో పెరుగుతున్న స్మోకింగ్ కల్చర్ ను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెలలో ఈ స్కీమ్ అమలు చేసిన తర్వాత నలుగురు ఉద్యోగులు పొగతాగడం మానేశారని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అసుక వెల్లడించారు. తమ కంపెనీలో మొత్త 120 మంది ఉద్యోగులు పని చేస్తోంటే వారిలో 30 మంది స్మోకర్స్ అని చెప్పారు. అలాగే తాము ఆఫర్ ప్రకటించిన నెల రోజుల్లోనే నలుగురు సిగరెట్ తాగడం మానేశారన్నారు. ఇది తమకు చాలా సంతోషాన్నిచ్చిందనీ, ఇది మంచి పరిణామమని పేర్కొన్నారు. అయితే ఈ కోవలో పియాలానే మొదటి కంపెనీకాదు. పియాల కంపెనీ కంటే ముందు జూన్ నెలలో.. లాసన్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ కూడా ఆఫీస్ పని వేళల్లో స్మోకింగ్ ను పూర్తిగా నిషేధించింది. దీని వల్ల ఆ కంపెనీలో స్మోకింగ్ చేసే వారిలో 10శాతం మంది పూర్తిగా మానేశారట. దీంతో వారికి కూడా అదనపు సెలవులు, నగదు బోనస్ ఇచ్చింది ఆ కంపెనీ. అది మంచి ఫలితాలను ఇవ్వటంతో.. పియాల కూడా అదే పద్ధతిని ఫాలో అయిపోయిందన్నమాట . ఇలా జపాన్ కంపెనీలు ఉద్యోగుల్లో స్మోకింగ్ ను కంట్రోల్ చేసేందుకు.. ఇలాంటి బోలెడు ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం జపాన్ దేశంలో 21.7శాతం మంది పెద్దలు ధూమపానం చేస్తున్నట్టు తేలింది. మరోవైపు జపాన్ రాజధాని నగరం టోక్యోలో 2020సమ్మర్ ఒలంపిక్స్ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడాన్ని నిషేధించాలని యోచిస్తున్నట్టు టోక్యో గవర్నర్ యూరికో కోయికో ఇటీవల ప్రకటించారు. దీంతో అక్కడ పెద్ద దుమారం రేగింది. ముఖ్యంగా ప్రభుత్వానికి ఏటా 700 మిలియన్ డాలర్ల డివిడెండ్ చెల్లిస్తున్న అక్కడి సిగరెట్ మేజర్ కంపెనీ జపాన్ టుబాకో, ఇతర హోటళ్లు, ధూమపాన అనుకూల రాజకీయవేత్తల నుంచి ప్రతిఘటనను ఎదుర్కొనడం గమనార్హం. -
నిర్వీర్యులవుతున్న తెలుగు రాష్ట్రాల యువకులు
తెలుగు రాష్ట్రాల్లోని యువకులు నిర్వీర్యులవుతున్నారు.. ఆధునికి జీవన శైలి వారిలో వీర్యకణాల సంఖ్యను క్రమేణా తగ్గించేస్తోంది. ఫలితంగా వారు సంతాన భాగ్యానికి దూరమవుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ తాజా గణాంకాల ప్రకారం 2010లో 15శాతం మందిలో వీర్య కణాల తగ్గుదల కనిపించగా.. 2014లో అది 25 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 40 శాతానికి చేరుకుంది. ఈ లెక్కన 2020 నాటికి యాబైశాతం మంది యువకుల్లో వీర్యకణాలు తగ్గే ప్రమాదం పొంచి ఉంది. విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్న మురళీధర్కి పెళ్లై ఐదేళ్లు గడిచినా పిల్లల్లేరు. భార్యాభర్తలిద్దరూ డాక్టర్ని కలిశారు. వీర్య కణాల సంఖ్య బాగా తగ్గిపోవడమే దీనికి కారణమని డాక్టర్లు తేల్చారు. హైదరాబాద్‌లో ఉండే వెంకటేశ్‌కి, విజయవాడలో ఉన్నవిజయ్కూ ఇదే సమస్య.. ఏళ్లు గడుస్తున్నా సంతాన భాగ్యం కలగడం లేదు. ఈ సమస్య వీళ్ల ముగ్గురిదే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది యువకులు ఇదే సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. క్రమక్రమంగా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతున్నారు. ఫలితంగా సంతాన సాఫల్య కేంద్రాలు పెరుగుతున్నాయి. అన్ని ప్రధాన పట్టణాల్లోనూ టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్లు వెలుస్తున్నాయి. మారుతున్న ఆహార పద్ధతులు, ధరించే దుస్తులు, వాడే వాహనం, సెల్‌ఫోన్, కంప్యూటర్లు యువకుల్లో సంతాన సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. 15 మిలియన్ల కంటే తగ్గకూడదు ఆరోగ్యవంతమైన 70 కిలోల యువకుడి వీర్యంలో ప్రతి మిల్లీలీటర్కీ 39 మిలియన్ల శుక్రకణాలుంటాయి. ఈ సంఖ్య 15 మిలియన్ల కంటే తగ్గకూడదు. ఒక వేళ తగ్గితే ‘లో స్పెర్మ్ కౌంట్’ అంటారు. ఈ లక్షణాలున్న యువకుడికి త్వరగా పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. స్పెర్మ్ ఎనాలసిస్, స్కోట్రల్ అల్ట్రా సౌండ్ పరీక్షలతో ఈ సమస్యను వైద్యులు గుర్తిస్తారు. ఈ మధ్యకాలంలో ఖాసా పరీక్ష ద్వారా కూడా స్పెర్మ్ కౌంట్‌ను గుర్తిస్తున్నారు. సాధారణంగా మనిషి శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. వృషణాల (బీజాలు)కు ఇంతకన్నా ఒకట్రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ ఉండాలి. ఒకవేళ ఏదేని కారణంతో బీజాల దగ్గర వేడి పెరిగితే అందులో ఉండే శుక్రకణాల సంఖ్య తగ్గడం ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీర్య కణాలు ఎవరికి తగ్గుతాయంటే.. స్థూలకాయులు.. ఆల్కహాల్ తీసుకునే వారు పొగ తాగడంతోపాటు, పొగాకు ఉత్పత్తులు తీసుకునేవారు ఆవేశపూరిత ఒత్తిడి ఉన్నవారు మందులు ఎక్కువగా తీసుకునేవారు పోషక విలువలు సమపాళ్లలో లేనటువంటి పిజ్జాలు, బర్గర్లు తినేవారు.. మాంసాహార పదార్థాలతో తయారైన జంక్ ఫుడ్ తీసుకునే వారు. హార్మోన్లలోపం, జెనెటిక్ సమస్యలున్నవారు ల్యాప్‌టాప్, కంప్యూటర్ల దగ్గర గంటలకొద్దీ పనిచేసేవారి బీజాలు రేడియేషన్‌కు గురై వీర్య కణాలను కోల్పోతున్నాయి. స్కిన్‌టైట్ జీన్స్, నైలాన్ అండర్‌వేర్స్ వాడే యువకుల్లోనూ గాలి చొరబడక శుక్రకణాలు తగ్గుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. గాయాలు తగిలినప్పుడు సరైన వైద్యం అందించకపోవడంతో రక్తం గడ్డకట్టడం వల్ల వీర్యకణాలు తగ్గిపోతాయి బీజం వాపు, ఇన్ఫెక్షన్, బీజకోశాలు లేకపోవడం, ఉన్నా అవి కడుపులోపలికి వెళ్లిపోవడం కొన్ని రకాల బీపీ, యాంటీ బయాటిక్స్ డ్రగ్స్, సైకియాట్రిక్ డ్రగ్స్‌తో పాటు.. రాన్టాక్, జిన్‌టాక్ వంటి మాత్రల వాడకం రైలు, బస్సు, ఇతర వాహనాల డ్రైవర్లు ఇంజిన్ దగ్గర కూర్చోవడం వల్ల బీజాలు వేడికి గురవుతున్నాయి. బీజాల వద్ద నరాల వాపుకారణంగా కణాలు తగ్గిపోతుంటాయి. యువకులు బిడియాన్ని వీడాలి యువకులు ఆహారం, దుస్తుల విషయంలోనే కాకుండా అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్మోకింగ్, ఆల్కాహాల్ వాడకం పెరిగిపోయింది. చిన్న వయస్సులోనే స్థూలకాయం వస్తోంది. దీనివల్ల రక్తప్రసరణ సరిగా లేక వీర్యకణాల సంఖ్య పడిపోతోంది. వైద్యుల సలహాలు తీసుకుని జాగత్తలు పాటిస్తే సమస్య నుంచి బయటపడొచ్చు. కానీ చాలామంది బిడియంతో వైద్యుల్ని కలవడం లేదు. – డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, ప్రముఖ యూరాలజిస్ట్, రష్ ఆస్పత్రి, తిరుపతి. -
'బిగ్ బాస్'లో నటుడు సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ షోలో నటుడు శివబాలాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు ఏం గతిలేక ఇక్కడికి వచ్చాం అనుకుంటున్నారా, అసలు బిగ్ బాస్ ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారంటూ శివబాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. షోలో పాల్గొన్న ఇతర సభ్యులు ధన్‌రాజ్, సమీర్లు శివబాలాజీకి మద్ధతు తెలిపారు. అసలేమైందంటే.. బిగ్ బాస్ షో రూల్స్ ప్రకారం స్మోక్ రూమ్‌లోకి ఒకసారి ఒకరు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. తొలిరోజే ఒకేసారి ఐదుగురు స్మోక్ రూమ్‌లో ఉండటంతో బిగ్‌బాస్ వారిని హెచ్చరించారు. ప్రతిరోజు వారు ఈ రూల్ బ్రేక్ చేయడంతో బిగ్‌బాస్ వారికి పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నారు. రోజువారీగా ఇచ్చే సిగరెట్లను ఇవ్వడం తాత్కాలికంగా ఆపివేస్తున్నామని, తదుపరి నిర్ణయం వెల్లడయ్యేవరకు ఈ శిక్ష తప్పదని ఆదేశాలు రావడంతో స్మోకింగ్ అలవాటున్న కొందరు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లు ఎలా ఉన్నా వందశాతం మనసుపెట్టి చేస్తున్నామని, అప్పుడప్పుడు తమ ఉల్లంఘనలకు ఇచ్చే శిక్షలను స్వీకరిస్తున్నా ఇంత కఠినంగా వ్యవహరించడం తమకు నచ్చలేదని శివబాలాజీ అన్నారు. తమకు ఏం లేక ఇక్కడికి వచ్చామనుకుంటున్నారా.. అందరూ సెలబ్రిటీలే వారికి ఎలా నడుచుకోవాలో తెలుసునని, అయితే బిగ్‌బాస్ ఇంత స్టుపిడ్ నిర్ణయం తీసుకుంటారనుకోలేదని అభిప్రాయపడ్డారు. ధన్‌రాజ్, సమీర్, ముమైత్ ఖాన్ లు శివబాలాజీకి మద్దతు తెలిపారు. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని బిగ్‌బాస్ సిగరెట్లు అందించినా.. ఒక్కరు స్మోక్ చేస్తున్నప్పుడు ఇతర 13 మంది సభ్యులు బాత్రూమ్లో ఉండాలని కండీషన్ పెట్టారు. కొందరు సభ్యులు ఒక్కొక్కరుగా స్మోక్ రూమ్‌కు వెళ్లి వచ్చిన తర్వాత బిగ్‌బాస్‌కు క్షమాపణ చెప్పారు. ఒక్క వ్యక్తి స్మోక్ చేస్తుంటే మిగిలిన 13 మంది బాత్రూమ్లో ఉండాలన్న కండీషన్‌ను రద్దు చేయాలని, మరోసారి స్మోక్ జోన్ రూల్ బ్రేక్ చేయకుండా జాగ్రత్తగా ఉంటామని.. ధన్‌రాజ్ సహా స్మోకింగ్ చేసే ఇతర సెలబ్రిటీలు బిగ్‌బాస్‌కు విజ్ఞప్తి చేశారు. బిగ్ బాస్ షోలో కంటతడి పెట్టిన నటుడు బిగ్ బాస్ షోలో సంపూర్ణేష్‌కు షాక్..! -
పొగ తాగేస్తున్నారు..
► నిబంధనలు ఉల్లంఘిస్తున్న ధూమపానప్రియులు ► పట్టించుకోని అధికారులు విజయనగరం ఫోర్ట్: బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగరాదనే నిబంధన ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ధూమపానప్రియులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నా పట్టించుకున్న వారే కరువయ్యారు. ప్రస్తుతం యువత ఎక్కువగా ధూమపానం వైపు మొగ్గు కనబరుస్తున్నారు. కళాశాల స్థాయి విద్యార్థులు కూడా ధూమపానానికి అలవాటు పడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం పాఠశాల, బస్టాండ్, రైల్వేస్టేషన్, ఆలయాలు, ఆస్పత్రులుండే ప్రాంతాల్లో పొగ తాగరాదు. కాని ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో దర్జాగా పొగరాయళ్లు తమ పని కానిచ్చేస్తున్నారు. ఇటువంటి వారిపై ఎవ్వరూ చర్యలు తీసుకోకపోవడంతో మరింతగా రెచ్చిపోతున్నారు. నిబంధనలు.. సెక్షన్–4 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో పొగత్రాగరాదు. నిబంధనను అతిక్రమించే వ్యక్తులకు రూ.200 ఫైన్ విధిస్తారు. సెక్షన్–6(ఎ) ప్రకారం విద్యాలయానికి 100 గజాల దూరంలో పొగ తాగడం, పొగాకు ఉత్పత్తులు విక్రయించడం నేరం. ఈ నిబంధనను అతిక్రమిస్తే రూ. 200 అపరాధ రుసుం విధిస్తారు. అలాగే సెక్షన్–6(బి) ప్రకారం 18 ఏళ్ల లోపు వారికి పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదు. నిబంధన అతిక్రమిస్తే రూ.200 అపరాధ రుసుం విధిస్తారు. అనర్థాలు .. బహిరంగ ప్రదేశాల్లో పొగతాడం వల్ల పొగ తాగే వారికన్నా పక్కనున్న వారికి ఎక్కువ నష్టం జరుగుతుంది. క్యాన్సర్, బ్రాంకలైటీస్, శ్వాసకోస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చర్యలు శూన్యం బహిరంగ ప్రదేశాల్లో పొగతాగే వారిపై చర్యలు తీసుకోవాలి. కాని జిల్లా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి అపరాధ రుసుం విధించడానికి అవసరమయ్యే చలానా పుస్తకాలు రెండేళ్ల కిందట జిల్లాకు మంజూరయ్యాయి. అయితే ఆ పుస్తకాలు ఎక్కడున్నాయో అధికారులకు కూడా తెలియదంటే ఆశ్చర్యపడనక్కర్లేదు. -
ఇంటెక్స్ ఎలైట్ ఈ7..ధర?
ఇంటెక్స్ టెక్నాలజీస్‌కు చెందిన తాజా మొబైల్ ఎలైట్ ఈ7 అమెజాన్‌లో ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చింది. ఇటీవల మార్కెట్ లో ప్రవేశపెట్టిన ఇంటెక్స్ ఈ కొత్త ఆండ్రాయిడ్ 4జీ ఫోన్ ధరను రూ.7,999కు అందుబాటులోకి తెచ్చింది ఈ విషయాన్ని ఇంటెక్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇంటేక్స్ ఎల్ట్-ఏ 7 స్మార్ట్‌ఫోన్ మీ జీవితాన్ని సున్నితంగా తయారుచేసే అంశాల కలయిక. స్టైలిష్, స్మూత్, స్ట్రాంగ్ అంటూ ట్వీట్ చేసింది. ఎలైట్ ఈ7 ఫీచర్లు 5.2 ఇంచ్ హెచ్డీ 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఐపీఎస్ డిస్ప్లే 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 3 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్ 4020 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం Intex Elyt-e7 is a combination of everything that will make your life smoother. Buy Now @amazonIN : https://t.co/v3QliS0nTq#SimplyDebonair pic.twitter.com/S6hbfOMGSc — Intex Technologies (@IntexBrand) June 28, 2017 -
దీపం వెలిగేనా?
►పొగలేని పొయ్యిలే లక్ష్యం ►ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలంటూ ఒత్తిళ్లు ►సమస్యల మధ్య చేతులెత్తేస్తున్న డీలర్లు ►నెల రోజుల్లో 92 వేల కనెక్షన్లు మాత్రమే పంపిణీ ►మరో వారం రోజుల్లో 94 వేల కనెక్షన్లు ఎలా ఇస్తారో? ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ అందిస్తాం.. పొగరహిత జిల్లాగా తీర్చి దిద్దుతాం.. అధికారులకు సహకరించండి.. గ్యాస్ కనెక్షన్ పట్టుకెళ్లండి’ అంటూ ఊదరగొడుతున్న పాలకుల మాటలకు.. క్షేత్ర స్థాయిలో అమలవుతున్న తీరుకు పొంతన లేకుండా పోతోంది. నెల రోజుల్లో 1.86 లక్షల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పటివరకు అందులో సగం కూడా పూర్తిచేయలేకపోయారు. మిగిలింది వారం రోజులు మాత్రమే. ఇంత తక్కువ సమయంలో అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్లు ఎలా మంజూరు చేస్తారో.. సీఎం ఇలాకాను పొగరహిత జిల్లాగా ఎలా తీర్చిదిద్దుతారో ఆ చంద్రన్నకే తెలియాలి? చిత్తూరు (కలెక్టరేట్): జిల్లాలో ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రహసనంగా మారింది. అనేక సమస్యల మధ్య డీలర్లు చేతులెత్తేస్తున్నారు. ఎలాగైనా లక్ష్యాన్ని అధిగమించాల్సిందేనని పాలకులు హుకుం జారీ చేయడంతో.. ఏం చేయాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. భారీ లక్ష్యం జిల్లాలో తెలుపు రేషన్ కార్డులు కలిగివున్న కుటుంబాలు 10.84 లక్షలు. ఇందులో గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్న కుటుంబాలు 7.93 లక్షల వరకు ఉన్నాయి. మరో 2.85 లక్షల తెలుపు రేషన్ కార్డుదారులకు గ్యాస్ కనెక్షన్లు లేవ ని ఇటీవల నిర్వహించిన సర్వేలో తెలింది. ఇందులో 1.86 లక్షల కుటుంబాలకు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించా యి. ఆ మేరకు అధికారులు జాబితా సిద్ధం చేశారు. ఈ నెల 7వ తేదీలోపు అందరికీ గ్యాస్ కనెక్షన్లు అందజేసి జిల్లాను పొగరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పాలకులు హుకుం జారీ చేశారు. ఇప్పటివరకు పంపిణీ చేసింది 92 వేల గ్యాస్ కనెక్షన్లే దీపం పథకం కింద ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. నెల రోజుల నుంచి పౌరసరఫరాల శాఖ అధికారులకు, గ్యాస్ ఎజెన్సీల డీలర్లకు, సేల్స్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. నెల రోజులకుగాను జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 92 వేల కనెక్షన్లు మాత్రమే పంపిణీ చేయగలిగారు. లక్ష్యానికి మరో వారం రోజుల్లో 94 వేల గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయాల్సి ఉంది. అధికారులు నిత్యం సమావేశాలు నిర్వహించి ఆదేశాలు జారీచేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. సమస్యలు అనేకం గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి గ్యాస్ కనెక్షన్ లేనివారు తీసుకోవాలని అధికారులు ఒత్తిడి తేవాల్సి వస్తోంది. కనెక్షన్లు తీసుకునేందుకు లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒకే కుటుంబంలో రెండు రేషన్ కార్డులు ఉన్న వారు దీపం కనెక్షన్లకు ముందుకు రావడం లేదు. వేలాదిగా గ్యాస్ కనెక్షన్లు అందించేందు అవసరమైన మేరకు ఆయా గ్యాస్ కంపెనీల నుంచి స్టాక్ రావడం లేదు. దీపం పథకం ద్వారా అందించే అదనపు సిలిండర్ల నిల్వకు తగ్గట్టుగా గోడౌన్లు లేవు. -
రోజూ ప్యాకెట్ సిగరెట్ల కన్నా అది డేంజర్..!
లండన్: మారుతున్న జీవనశైలి ప్రజలకు నిద్రలేకుండా చేస్తోంది. బ్రిటన్‌లో ప్రతి 10 మందిలో ఒకరు ఈ నిద్రలేమి(ఇన్సోమ్నియా) మూలంగా నిద్రమాత్రల(స్లీపింగ్ పిల్స్)ను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇది ఎంతమాత్రం సరైన విధానం కాదని, రోజుకు ఒక ప్యాకెట్ సిగరెట్లు కాల్చడం కన్నా నిద్రమాత్రలు ప్రమాదకరమని పరిశోధకులు తేల్చారు. అరిజోనా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు నిద్రమాత్రలు కలగజేసే దుష్ఫలితాలపై నిర్వహించిన పరిశోధనలో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. నిద్రమాత్రలతో క్యాన్సర్‌తో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశం గణనీయంగా పెరుగుతుందని పరిశోధకుడు షాన్ యంగ్‌స్టెడ్ వెల్లడించారు. ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడంతో ఇటీవల డైజిఫామ్ లాంటి నిద్రమాత్రల వాడకం కొంత తగ్గినప్పటికీ.. కొత్తగా వచ్చిన 'జెడ్-డ్రగ్స్' వాడకం పెరిగిందని వెల్లడించారు. అయితే.. ఇవి కూడా హార్ట్ ఎటాక్ అవకాశాన్ని 50 శాతం పెంచుతున్నాయని తెలిపారు. నిద్రమాత్రలను ఆశ్రయించడం కంటే వ్యాయామం చేయడం ద్వారా సహజనిద్ర లభిస్తుందని షాన్ వెల్లడించారు. -
ఆ దేశంలో 20 కోట్ల మంది ప్రాణాలకు ముప్పు!
పొగ తాగడం హనికరం అని ఎంత మొత్తుకున్నా.. ఎన్నిచోట్ల ప్రచారం చేసినా.. ఆ అలవాటు ఉన్న వారు మాననే మానరు. ఇప్పుడు అదే అలవాటు చైనాలో 20 కోట్లమందిని ఈ శతాబ్దంలో బలిగొనపోతున్నదని తాజాగా అధ్యయనం స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఐరాస మానవ అభివృద్ధి సంస్థ తరఫున నిర్వహించిన ఈ అధ్యయనంలో చైనాలో పొగ తాగే అలవాటు గురించి పలు ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. చైనాలోని నిరుపేద ప్రాంతాల్లోనే పొగతాగడం వల్ల ఎక్కువ మరణాలు సంభవించనున్నాయని, పొగాకు మీద ఆధారపడటాన్ని చైనా గణనీయంగా తగ్గిస్తే తప్ప దీనిని అడ్డుకోవడం సాధ్యం కాదని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. ప్రపంచంలోని సిగరెట్లలో 46శాతం తాగేది చైనాలోనే. అంతేకాదు సిగరెట్ల మీద గణనీయంగా లాభాలు ఆర్జించే దేశం కూడా అదే. 2015లో చైనా పొగాకు పరిశ్రమ 160 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. స్మోకింగ్ ముప్పు దేశాన్ని ముంచెత్తుతున్న నేపథ్యంలో చైనాలో పొగాకు రహిత విధానాలు మరింత ముమ్మరంగా చేపట్టాల్సిన అవసరముందని డబ్ల్హెచ్వో సూచిస్తున్నది.