
ప్రతీకాత్మక చిత్రం
అమెరికాలోని మిన్నెపోలీస్‌కు చెందిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఒక పబుద్ధుడు కలకలం రేపాడు. విమానంలో ఉన్నట్టుండి ఒక ప్రయాణికుడు లైటర్ సహాయంతో దర్జాగా సిగరెట్ ముట్టించాడు. దీంతో పక్క వరుసలో కూర్చున్న మహిళా ప్రయాణికురాలు బిత్తరపోయింది. మిగిలిన ప్రయాణికులు కూడా భయాందోళనకు లోనయ్యారు. చివరకు ఫ్లైట్ అడెంటెండ్‌కు ఫిర్యాదు చేశారు. విమానం ఎక్కిన దగ్గరనుంచి అతను వింతగా ప్రవర్తిస్తున్నాడని సహ ప్రయాణికురాలు ఆరోపించారు. అందుకే సిగరెట్ ముట్టించగానే వీడియో తీసానని పేర్కొన్నారు. ఈ భయంకరమైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చట్ట విరుద్ధంగా లైటర్‌ను విమానంలోకి ఎలా తీసుకొచ్చాడు.. ధూమపానం ఎలా చేశాడు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.