స్విట్జర్లాండ్‌ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్‌ | Pahalgam Navy Officer Vinay NarwalLast Video With His Wife video goes viral | Sakshi
Sakshi News home page

స్విట్జర్లాండ్‌ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్‌

Published Thu, Apr 24 2025 10:48 AM | Last Updated on Thu, Apr 24 2025 3:55 PM

Pahalgam Navy Officer Vinay NarwalLast Video With His Wife video goes viral

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రమూకల పైశాచికత్వం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. 26 మంది అమాయకులు అసువులు బాసారు.   పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో భారత నావికాదళ అధికారి, సెలవులో ఉన్న లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26) ఒకరు. హర్యానాకు చెందిన వినయ్‌ వివాహం ఏప్రిల్ 16న హిమాన్షితో జరిగింది.  హనీమూన్‌   కోసమని  'మినీ స్విట్జర్లాండ్'  వచ్చారు. ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోయింది.   వినయ్ ఉగ్రవాదుల చేతిలో మరణించాడు.

లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ , అతని భార్య హనీమూన్ కోసం ముందు స్విట్జర్లాండ్ వెళ్లాలని అనుకున్నారట. కానీ వీసా రిజెక్ట్‌ కావడంతో మినీ స్విట్జర్లాండ్‌  ,సుందరమైన బైసరన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రిసెప్షన్ పార్టీ తర్వాత రెండు రోజుల తర్వాత    పెళ్లైన ఆరు రోజులకు   పహల్గాం వెళ్లారని అదే  తన మనవడి జీవితానికి శాపంలా తగిలిందని వినయ్ తాత ,  హర్యానా రిటైర్డ్ పోలీసు అధికారి హవా సింగ్  తెలిపారు. , తన మనవడికి స్విస్ వీసా మంజూరు అయి ఉండే తన  మనవడు ప్రాణాలతో ఉండావాడని కన్నీటి పర్యంతమయ్యారు.

చదవండి: పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం


 

 ;

 

మరోవైపు వినయ్ నర్వాల్ భార్యతో కలిసి ఆనందంగా  గడుపుడుతున్న క్షణాలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. భర్తతో హిమాన్షి  రీల్ వీడియోను షూట్ చేస్తూ సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ దృశ్యాలు  చూసి నెటిజన్లు తీవ్ర సంతాపం వ్యక్తం  చేశారు. అలాగే తన భర్తను ఉగ్రవాదులు కాల్చి చంపిన తరువాత, ఆయన శవపేటికను కౌగిలించుకుని గుండెలవిసేలా రోదించిన దృశ్యాలు కలచివేశాయి.  "జై హింద్"  అంటే తన భర్తకు  కన్నీటి నివాళులర్పించింది.  

చదవండి: Pahalgam : ఈ దుఃఖాన్ని ఆపడం ఎవ్వరి తరము? గుండెల్నిపిండేసే వీడియోలు
 

 

సోదరి చేతుల మీదుగా అంత్యక్రియలు

వినయ్ అంత్యక్రియలు బుధవారం సాయంత్రం కర్నాల్‌లోని అతని స్వగ్రామంలో  అన్ని గౌరవ లాంఛనాలతో  జరిగాయి.  నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ సోదరి కర్నాల్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. హర్యానా ఎమ్మెల్యే జగ్మోహన్ ఆనంద్ సహా, పలువురు ఆర్మీ , నేవీ అధికారులు కూడా అంతిమ నివాళులు అర్పించారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement