Jammu & Kashmir
-
నిన్నటిదాకా నవ్వుతూ, తుళ్లుతూ : మహిళా ఆర్జే ఆత్మహత్య? సీఎం దిగ్భ్రాంతి!
ఎపుడూ నవ్వుతూ తుళ్లుతూ ఉండే వ్యక్తి ఉన్నట్టుండి మాయమైపోయింది. తనను తాను జమ్మూ కీధడ్కన్ అని పిలుచుకునే పాపులర్ ఆర్జే సిమ్రాన్ సింగ్ తన అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. సోషల్ మీడియాలో స్టార్లుగా ఎదిగి, లక్షల అభిమానులను సంపాదించుకుని, ఒక వెలుగు వెలుగుతున్న తరుణంలో జీవితంలో మరో ఉదయం లేకుండా చేసుకోవడం విషాదం.గురుగ్రామ్ అద్దె అపార్ట్మెంట్లో సిమ్రాన్ సింగ్ ఆత్మహత్య చేసుకొంది. రాత్రి పదిన్నర గంటలకు ఆమె స్నేహితురాలు పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే సిమ్రాన్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా సిమ్రాన్ మనస్తాపంతో ఉందని ఆమె తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. కానీ ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదు. ఎలాంటి సూసైడ్ నోట్ కూడా లభించలేదు. మరోవైపు ఆర్జే సిమ్రాన్ చివరి పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ నెల (డిసెంబర్)13న తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో రీల్‌ను పోస్ట్ చేసింది. 'బీచ్ ఒడ్డున అంతులేని ముసిముసి నవ్వులతో ఉన్న అమ్మాయి' అంటూ చాలా సంతోషంగా కనిపించింది. చక్కటి ఫోటోలను పోస్ట్ చేసింది. మరి ఇంత ప్రశాంతంగా ఉన్న అమ్మాయి గుండెల్లో రగిలిన బడబానలం ఏంటి అనేది ఎవరికీ అంతుబట్టకుండా ఉంది.ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతాపంజమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆయన యంత్రి, డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులర్పించారు. సిమ్రాన్ కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు తమ హృదయపూర్వక సానుభూతిని తెలియజేశారు. View this post on Instagram A post shared by RJ SIMRAN (@rjsimransingh) సిమ్రాన్ ఆత్మహత్య వార్త దావానలంలా వ్యాపించడంతో ఆమె అభిమానులు షాకయ్యారు. ఏమైంది, ఎందుకు ఇంత పనిచేసింది, అంటూ కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో హ్యాపీగా ఉన్నంత మాత్రాన, వారి జీవితాల్లో ఆనందం ఉన్నట్టు కాదు.. వాస్తవం మరోలా ఉంటుందనే విషయాన్ని ఆమె నిష్క్రమణ రుజువు చేసిందంటూ మూడో యూజర్ కమెంట్ చేయడం గమనార్హం. -
ముచ్చటగా మూడోసారి మోదీ : నగల వ్యాపారి అరుదైన కానుక
భారత దేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ అరుదైన బహుమతిని అందుకోనున్నారు. జమ్మూ-కశ్మీర్‌కు చెందిన బీజేపీ కార్యకర్త, నగల వ్యాపారి రింకూ చౌహాన్ బీజేపీ చిహ్నమైన కమలం పువ్వును స్వచ్ఛమైన వెండితో రూపొందించి కానుకగా అందించనున్నారు.మూడు కిలోల స్వచ్ఛమైన వెండితో దీన్ని తయారు కమలం పువ్వును ప్రత్యేకంగా తయారు చేయించి మరీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీకి అద్వితీయమైన బహుమతి ఇవ్వాలనే ఆలోచన వచ్చిందట జమ్మూ-కశ్మీర్‌లోని ముత్తి గ్రామానికి చెందిన జనతా యువమోర్చా (బీజేవైఎం) అధికార ప్రతినిధి చౌహాన్ వెల్లడించారు.జమ్ము కశ్మీర్లో అధికరణం 370 రద్దు, అయోధ్యలో రామమందిరం నిర్మాణం వాగ్దానాలను మోదీ నెరవేర్చిన నేపథ్యంలో ఆయనకు వెండి కమలాన్ని బహూకరించాలని సంకల్పించినట్టు తెలిపారు. తానే స్వయంగా స్వచ్ఛమైన వెండితో దీన్ని తయారు చేశాననీ, దీని తయారీకి 15 నుండి 20 రోజులు పట్టిందని చౌహాన్ మీడియాతో చెప్పారు. “నా ఆత్మ దానిలో ఉంది. మోదీ నాకు దేవుడిలాంటి వారు. ఆయన ఈ బహుమతిని ఇష్టపడతారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు కాశ్మీర్లో శాంతిని పునరుద్ధరించడంలో సహాయపడిందని, అలాగే 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్న యూపీలోని అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిందంటూ కొనియాడారు. అలాగే ఈ బహుమతిని అందజేసేందుకు ప్రధానిని కలిసే అవకాశం కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఆయన భార్య అంజలి చౌహాన్ వెల్లడించారు. -
జమ్మూ కాశ్మీర్ కు మోడీ గుడ్ న్యూస్..!
-
ఎన్నికల షెడ్యూల్ అప్పుడే.. హింట్ ఇచ్చిన ఈసీ అధికారి!
Lok Sabha Elections 2024: దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. రాజకీయ పార్టీలతోపాటు దేశ ప్రజలంతా ఎన్నికల ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్, తేదీని ఈ నెలాఖరులో ప్రకటించే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. 15 నుంచి 20 రోజుల్లో లోక్‌సభ ఎన్నికల తేదీని ఈసీఐ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదిక ప్రకారం.. కేంద్ర ఎన్నికల సంఘం రాబోయే 15- 20 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తుందని జమ్మూకశ్మీర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పీకే పోల్ పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోపు ఏవైనా సంభావ్య సమస్యలను పరిష్కరించేందుకు సీనియర్ అధికారులు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేస్తున్నారని ఆయన తెలిపారు. జమ్మూకశ్మీర్ ఎలక్షన్ చీఫ్ చెప్పడమే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 13 తర్వాత ఎన్నికల తేదీలను ప్రకటిస్తుందని మరికొన్ని నివేదికలు కూడా పేర్కొన్నాయి. మార్చి 13 నాటికి భారత ఎన్నికల సంఘం రాష్ట్రాలలో తన అంచనాను పూర్తి చేస్తుందని భావిస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 97 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకూ సిద్ధమవుతున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఈసీఐ త్వరలో ప్రకటించనుంది. -
Jammu Kashmir: 2 రోజుల్లో జమ్మూ కశ్మీర్‌కు శుభవార్త, రాష్ట్ర హోదా..?
ఢిల్లీ:జమ్మూ కశ్మీర్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర హోదా కల్పించడంపై మరో రెండు రోజుల్లో ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించడానికి గడువును నిర్ణయించాలని కేంద్రాన్ని కోరింది. ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. సుప్రీంకోర్టులో కేంద్రం ఏం చెప్పిందంటే : "కేంద్ర పాలిత ప్రాంతం అనేది శాశ్వతం కాదు. ఎల్లుండి (సెప్టెంబర్ 1 2023న) కేంద్రం ఒక ప్రకటన చేయనుంది. ఇది జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి పూర్తిగా పాజిటివ్ గా ఉంటుంది. ఇక ముందు కూడా లఢక్ కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. లఢక్ లో రెండు యూనిట్లు ఉన్నాయి. ఒకటి లేహ్.. మరొకటి కార్గిల్. లేహ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. కార్గిల్ లో సెప్టెంబర్ లో ముగుస్తాయి" అని సొలిసిటర్ జనరల్ ధర్మాసనానికి తెలిపారు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలనే అంశం ప్రస్తుతం పార్లమెంట్లో ఉందని చెప్పారు. కశ్మీర్లో పరిస్థితులు చక్కబడ్డాక ఆ ప్రయత్నాలు మొదలవుతాయని ధర్మాసనానికి విన్నవించారు. #BREAKING Supreme Court asks when the Statehood of Jammu and Kashmir will be restored. Asks when elections will be allowed. Asks SG to get instructions on a definition timeline.#JammuKashmir #Article370 https://t.co/SK9wl5B5Ia — Live Law (@LiveLawIndia) August 29, 2023 జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నాయకులు విమర్శలను పక్కకు పెట్టి ఆ రాష్ట్రాన్ని లఢక్, జమ్మూ కశ్మీర్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. SG: I have taken instructions and the instructions are that the UT is not a permanent feature and I will make a positive statement day after tomorrow. Ladakh would remain a UT.. but here we are only on Jammu and Kashmir. AG and I will make the statement. In terms of local body… — Bar & Bench (@barandbench) August 29, 2023 ఇదీ చదవండి: ఆర్టికల్ 35ఏ వారి ప్రాథమిక హక్కులను లాగేసుకుంది: సీజేఐ చంద్రచూడ్ -
జమ్మూ కాశ్మీర్లో తీవ్ర భూకంపం.. రిక్టర్ స్కేలుపై..
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ఈరోజు తెల్లవారు జామున తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద దీని తీవ్రత 37 గా నమోదైంది. మంగళవారం తెల్లవారు జాము 12.04 గంటలకు ధోడా ప్రాంతానికి ఆగ్నేయంగా భూకంపం సంభవించినట్లు తెలిపింది నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ. భూమి ఉపరితలానికి 5 కి.మీ లోతున భూకంపం సంభవించిందని వారు తెలిపారు. అక్కడక్కడా చిన్నగా భూమి అదిరినట్టుగా అనిపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఒకవేళ భూకంపం తీవ్రత కొంచెం ఎక్కువైనా భదేర్వా, కిష్త్వార్, ఉధంపూర్, ధోడా పరిసరాల్లో తీవ్ర నష్టం వాటిల్లేదని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో భూకంపం సంభవించినప్పుడు 2-5 సెకన్ల వరకు భూమి కంపించినట్లు చెబుతున్నారు స్థానికులు. ఆ సమయానికి అందరూ గాఢనిద్రలో ఉంటారని అదృష్టవశాత్తు భూకంపం తీవ్రత పెద్దగా లేదని, ఎటువంటి నష్టం వాటిల్లలేదని వారు తెలిపారు. ఇది కూడా చదవండి: ఎంపీగా లోక్‌సభలోకి రాహుల్ -
కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. ముగ్గురు భారత సైనికులు మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులకు భారత సైన్యానికి మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు భారత సైనికులు మరణించారని అధికారులు తెలిపారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లా హలాన్ అటవీ ప్రాంత పరిసరాల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న కచ్చితమైన సమాచారం అందడంతో భారత మిలటరీ వర్గాలు ఆగస్టు 4న ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సైన్యం ఉగ్రవాదుల జాడను జల్లెడ పడుతుండగా ఒక్కసారిగా భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సెర్చ్ ఆపరేషన్ కాస్తా ఎన్‌కౌంటర్‌గా మారిందన్నారు. ఉగ్రవాదులు చేసిన కాల్పులకు ప్రతిగా సైన్యం కూడా ఎదురుకాల్పులు జరిపిందని, ఈ కాల్పుల్లో ముగ్గురు భద్రతా దళాల సిబ్బంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించామని అక్కడ వారు చికిత్స పొందుతూ వారు మృతి చెందినట్లు ఆ అధికారి తెలిపారు. హాలాన్ అడవుల్లో ఎత్తైన ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఉనికి ఇంకా ఉన్నట్టు మావద్ద పక్కా సమాచారముందని భారత భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయని అయన తెలిపారు. Operation Halan #Kulgam On specific inputs regarding presence of terrorists on higher reaches of Halan in Kulgam, operations launched by Security Forces on 04 Aug 23. In exchange of firing with terrorists, three personnel sustained injuries and later succumbed. Search operations… pic.twitter.com/NJ3DZa2OpK — Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) August 4, 2023 ఇది కూడా చదవండి: Defamation Case: రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించండి -
జమ్ము కశ్మీరులో విజయవంతంగా ముగిసిన G20 సదస్సు
-
Jammu Kashmir: క్రూజర్ వాహనం బోల్తా..ఆరుగురు మృతి
జమ్మూ కశ్మీర్‌లోని కిష్ట్వార్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులతో వెళ్తున్న క్రూజర్ వాహనం అదుపు తప్పి లోయలో బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చెప్పట్లినట్లు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) సమీపంలోని కేరి సెక్టార్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింగ తెగ వైరల్ అవుతోంది వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించనున్న విపక్షాలు!) -
రాహల్ జోడో యాత్రకు సడెన్ బ్రేక్! కేవలం కిలోమీటర్ తర్వాతే..
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టి భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం జమ్ముకాశ్మీర్‌లోని బనిహాల్‌లో సాగుతున్న రాహుల్ యాత్రలో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్పీ) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దల్లా పాల్గొన్నారు. ఈ మేరకు ఒమర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఈ భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ఇమేజ్ను పెంచడం కోసం కాదని, దేశంలోని పరిస్థితిని మార్చడం కోసమేనని చెప్పారు. అందువల్లే తాను ఈ యాత్రలో పాల్గొన్నట్లు వివరించారు. ఈ యాత్రను గాంధీ వ్యక్తిగత కారణాలతో ప్రారంభించలేదని, మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించి, మైనారిటీలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలపై జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో చేస్తున్న యాత్రగా అభివర్ణించారు. ఈ ప్రభుత్వం అరబ్ దేశాలతో స్నేహం చేస్తున్నప్పటికీ దేశంలోని అతిపెద్ద మైనారిటీ నుంచి ఒక్కరూ కూడా ప్రభుత్వంలో ప్రతినిధులుగా లేరని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు గురించి ప్రస్తావిస్తూ..దీని పునరుద్ధణ కోసం కోర్టులో పోరాడతాం అన్నారు. ఈ సందర్భంలో ఆ రాష్ట్రంలోని ఎన్నికలు జరిగి ఎనిమిదేళ్లు పూర్తయిందని, చివరి అసెంబ్లీ ఎన్నికలు 2014లో జరిగాయన్నారు. రెండు ఎన్నికల మధ్య ఈ గ్యాప్ చాలా ఎక్కువే అని చెప్పారు. తీవ్రవాదం ఉధృతంగా ఉన్నప్పుడూ కూడా జరగలేదన్నారు. ఈ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఎన్నికలు కోసం అడుక్కోవాలని కోరుకుంటోందని అన్నారు. అయినా తాము బిచ్చగాళ్లం కాదని దాని కోసం తాము అడుక్కోమని తేల్చి చెప్పారు. కాగా ఈ యాత్రలో ఇరు నాయకులు ఒకేలాంటి టీషర్ట్‌ల ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. యాత్రకు బ్రేక్ చక్కగా సాగిసోతున్న రాహుల్ జోడో యాత్రకు సడెన్ బ్రేక్ పడింది. ఆయన భద్రతా దృష్ట్యా అనుహ్యంగా రద్దైంది. ఈ రోజు రాహుల్ జోడో యాత్రలో 11 కిలోమీటర్లు నడవాల్సి ఉండగా ..కేవలం కిలోమీటర్ తర్వాత ఆగిపోవాల్సి వచ్చింది. ఐతే కాశ్మీర్లో ఆయన కోసం ఊహించని విధంగా ప్రజలు ఎదురు చూస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. భద్రతా సిబ్బందిని ఆకస్మికంగా ఉపసంహరించుకోవడంతో తీవ్రమైన భద్రతా ఉల్లంఘనకు కారణమైందని కాంగ్రెస్ వర్గాలు ఆరోపణలు చేశాయి. రాహుల్ శ్రీనగర్‌కు సమీపంలోని బనిహాల్ టన్నెల్ దాటిన తర్వాత పెద్ద ఎత్తున భారీ జన సముహం రావడంతో దాదాపు 30 నిమిషాల పాటు రాహుల్ కదలేకపోయినట్లు తెలిపాయి, అదీగాక అక్కడ తగిన విధంగా భద్రత లేకపోవడంతోనే యాత్ర ఆపేయవలసి వచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే గాంధీని భద్రతా వాహనంలో తీసుకెళ్లి యాత్రను విరమింపజేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి ఈ యాత్రలో రాహుల్ గాంధీ, ఒమర్ అబ్దుల్లాల భద్రతకు సంబంధించి తగిన సంఖ్యలో పోలీసుల లేరని, తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నట్లు సమాచారం. (చదవండి: ప్రధాని మోదీని ప్రశ్నించిన తెలంగాణ విద్యార్థిని) -
వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు.. ఇలాంటి బౌలర్ అత్యవసరం
టి20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియాకు కనిపించిన సమస్య.. ఫాస్ట్ బౌలర్ల కొరత. బుమ్రా లాంటి మరో బౌలర్ మనకు కనిపించడం లేదు. అర్ష్‌దీప్ సింగ్ కాస్త అలాగే కనిపించినప్పటికి కీలకమైన సెమీఫైనల్లో తేలిపోయాడు. భువనేశ్వర్, షమీల సంగతి సరేసరి. అయితే టీమిండియాలో గంటకు 150 కిమీ వేగంతో బంతులు విసిరే బౌలర్లు తక్కువే. ఉమ్రాన్ మాలిక్ వేసే ప్రతీ బంతి గంటకు 150 కిమీ వేగంతోనే ఉంటుంది. ఆస్ట్రేలియా లాంటి ఫాస్ట్ పిచ్‌లపై ఇలాంటి బౌలర్లు కచ్చితంగా కావాలి. ఇక యార్కర్ల స్పెషలిస్ట్ నటరాజన్ కూడా ఆస్ట్రేలియా పిచ్‌లకు సరిగ్గా అతుకుతాడు. కానీ టీమిండియా సెలెక్టర్లకు ఇలాంటి వాళ్లు కనిపించరు. అలాంటి ఉమ్రాన్ మాలిక్, నటరాజన్‌కు సరిసమానంగా గంటకు 150 కిమీ వేగంతో బంతులు విసురుతున్న మరో ఆణిముత్యం కంటపడ్డాడు. అతనే జమ్మూ కశ్మర్‌కు చెందిన వసీమ్ బషీర్. ఎంత లేదన్నా 145 కిమీ వేగంతో బంతులు విసురుతున్న బషీర్ ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. తన పదునైన పేస్ బౌలింగ్‌తో.. బౌన్సర్లతో ముప్పతిప్పలు పెడుతున్నాడు. 22 ఏళ్ల వయసు మాత్రమే ఉన్న బషీర్‌కు మంచి భవిష్యత్తు ఉన్నట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ అండర్ 25 టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బషీర్‌ను గుర్తించాలంటూ కొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు. త్వరలో ఐపీఎల్ మినీవేలం జరగనున్న నేపథ్యంలో బషీర్‌ను కొనుగోలు చేసే అవకాశముంది. అదే పనిలో టీమిండియాకు కూడా ఇలాంటి బౌలర్లు ఇప్పుడు అత్యవసరంగా మారిపోయారు. Next 150kmph from Kashmir! Are there more Umran Maliks in J&K? Yes, this is Waseem Bashir, a 22-year-old pacer from Kashmir, who probably bowls over 145kmph (could even be 150kmph+)! He is a part of the J&K U-25 team and has been scaring batters with pace! #IPL teams take note pic.twitter.com/0ijkDt21xh — Mohsin Kamal (@64MohsinKamal) November 17, 2022 చదవండి: ధోని కొత్త కారులో కేదార్ జాదవ్, రుతురాజ్‌ల షికారు. అందం చూపించొద్దన్నారు.. మందు కూడా పాయే; ఏమిటీ కర్మ? -
జమ్మూకాశ్మీర్ లో మళ్ళీ సినీ వినోదం
-
గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ
-
ఆకస్మిక వరదలు.. అమర్నాథ్ యాత్ర ఆగమాగం! (ఫోటోలు)
-
షాక్‌లో సోనియా.. కాంగ్రెస్‌పై ఆజాద్ సంచలన వ్యాఖ్యలు
శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ సీనియర్ నేత, జీ-23 గ్రూప్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కులం, మతం వంటి వివిధ అంశాల ఆధారంగా ప్రజలను విభజించటంలో అన్ని రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయని ఆరోపించారు. అందులో కాంగ్రెస్ పార్టీ సైతం ఉందని విమర్శలు గుప్పించారు. ఆదివారం జమ్మూలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆజాద్ మాట్లాడుతూ.. జమ్ముకాశ్మీర్‌లో 1990లో కాశ్మీర్ పండిట్లపై జరిగిన మారణహోమానికి పాకిస్థాన్, ఉగ్రవాదులే కారణమని అన్నారు. ఈ దాడుల కారణంగా హిందువులు, ముస్లింలు, డోగ్రాలు, కాశ్మీర్ పండిట్ వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని వెల్లడించారు. దీనికి దాయాది దేశమే ముఖ్య కారణమన్నారు. #WATCH ...Political parties may create a divide 24x7 on basis of religion, caste & other things; I'm not forgiving any party incl mine...Civil society should stay together. Justice must be given to everyone irrespective of caste, religion: Ghulam N Azad, Cong at an event in Jammu pic.twitter.com/2OCo76ny4x — ANI (@ANI) March 20, 2022 ఈ క్రమంలో కులం, మతం వంటి వివిధ అంశాల పరంగా 24x7 ప్రజలను విభజించి పాలించడంలో అన్ని రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయన్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ సైతం ఉందని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తాను వ్యక్తిగతంగా అన్ని పార్టీలను క్షమించనని కుండబద్దలు కొట్టారు. ప్రజలు ఎప్పుడూ ఐకమత్యంతో ఉండాలి. కుతం, మతంతో కాకుండా అందరికీ సమానంగా న్యాయం అందాలని అతిపెద్ద హిందువు, లౌకికవాది అయిన మహత్మా గాంధీ చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరోవైపు.. కాశ్మీర్ పండిట్లపై జరిగిన మారణకాండ ఆధారంగా ద కాశ్మీర్ ఫైల్స్ సినిమాను నిర్మించారు. ఈ సినిమా మార్చి 11న విడుదలైన పలు రికార్డులను బద్దలు కొడుతోంది. -
రానున్న 12-18 గంటల్లో తీవ్ర మంచు వర్షాలు! రహదారుల మూసివేత..
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్, లడఖ్ ఎగువ ప్రాంతాల్లో ఆదివారం (డిసెంబర్ 5) తీవ్రంగా మంచు కురువడంతో బందిపోరా-గురెజ్, సింథన్-కిష్త్వార్, మొఘల్ రహదారులతో సహా సరిహద్దు రహదారులను మూసివేశారు. రానున్న 12 నుంచి 18 గంటల్లో తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారి తెలిపారు. కాశ్మీర్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అంచనా వేసినట్లుగా, అనేక హిల్ స్టేషన్లతో సహా యూనియన్ టెరిటరీ ఎగువ ప్రాంతాల్లో ఉదయం నుండి మంచు వానలు కురుస్తున్నాయి. నిరంతరంగా కురుస్తున్న మంచు కారణంగా అధికారులు ముందు జాగ్రత్త చర్యగా కొన్ని రోడ్లను మూసివేయాల్సి వచ్చిందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల్లో 3 నుంచి 4 అంగుళాలమేర మంచు పేరుకుపోయింది. మరొపక్క ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. చదవండి: కేవలం మూడున్నర గంటల్లో మట్టి ఇళ్లను నిర్మిస్తున్న ఇటలీ.. కారణం తెలుసా.. -
ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) కమాండర్ అఫాక్ సికందర్ ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. కుల్గాం జిల్లా పాంబే, గోపాల్‌పొరాలో బుధవారం భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో మొత్తం ఐదుగురు ముష్కరులు మరణించారు. గోపాల్‌పొరాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా వారు భద్రతా అధికారులపై కాల్పులు జరిపారని, ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్ ఐజీ విజయ్ ట్వీట్ చేశారు. వారిలో ఒకరు నిషేధిత టీఆర్ఎఫ్కు చెందిన కమాండర్ సికందర్‌గా గుర్తించినట్టు పేర్కొన్నారు. ఇక పాంబే ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. చదవండి: CJ Sanjib Banerjee: నన్ను క్షమించండి..! -
మ్యాగజైన్ స్టోరీ 26 October 2021
-
కశ్మీర్లో ఇద్దరే ఆస్తులు కొన్నారు? ఎందుకలా?
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు ఏమీ మారలేదని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్ని బట్టి తెలుస్తోంది. ఎందుకంటే ఆ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఉన్న అధికరణాలను రద్దు చేసిన అనంతరం ఆస్తుల కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. కేవలం ఇద్దరంటే ఇద్దరు ఆస్తులు కొనుగోలు చేసినట్లు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్‌సభలో మంగళవారం ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌కు 370 అధికరణను రద్దు చేసి జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా 5 ఆగస్టు 2019లో ఏర్పాటుచేశారు. రద్దుకు ముందు కశ్మీర్ ప్రాంతంలో ఇతర ప్రాంతీయులు ఆస్తుల కొనుగోళ్లపై నిషేధం అమల్లో ఉండేది. అధికరణాల రద్దు అనంతరం ఇతర ప్రాంతాలవారు పెద్ద ఎత్తున వచ్చి ఆస్తులు కొనుగోలు చేస్తారని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రభుత్వం ఆశించిన మేర జమ్మూకశ్మీర్ ప్రాంతంలో ఆస్తులు కొనుగోలు చేయలేదు. ఆస్తుల కొనుగోళ్ల చట్టాలలో మార్పులు చేయడంతో కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటైన జమ్మూ కశ్మీర్, లడ్డాఖ్లో దేశంలోని ఇతర పారిశ్రామికవేత్తలు, ఇతర వ్యాపారులు పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసి కశ్మీర్ అభివృద్ధి బాట పడుతుందని పేర్కొన్నారు. కానీ వాస్తవంగా ఆ ప్రాంతంలో ఎలాంటి మార్పులు రాలేదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే.. అధికరణ 370 రద్దును కశ్మీర్ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీకి చెందిన పార్టీ నాయకులు కూడా తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం భావించినట్టు జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు మారలేదు. సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో ఎవరూ ఆస్తుల కొనుగోలుకు ముందుకు రావడం లేదు. పారిశ్రామికవేత్తలు కశ్మీర్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపడం లేదు. ఉగ్రవాదుల దాడుల భయం ఇంకా కొనసాగుతోంది. ఇక కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వంటివి ఉండడంతో ప్రస్తుతం కశ్మీర్‌పై ఎవరూ దృష్టి సారించలేదు. -
జమ్ము కశ్మీర్లో తీవ్రవాదుల కుట్ర భగ్నం
-
జమ్మూ కశ్మీర్లో కాల్పుల కలకలం..!
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది హతమార్చింది. భద్రతా సిబ్బందికి వచ్చిన సమాచారం మేరకు దక్షిణా కశ్మీర్ జిల్లాలోని క్వారిగం, రాణిపోరా ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్‌ను నిర్వహించారు. భద్రతా సిబ్బంది తనీఖీలు చేస్తోన్న సందర్భంలో ఒక్కసారిగా ఇద్దరు ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులతో విరుచుకుపడ్డారు. వెంటనే భద్రతా సిబ్బంది ఉగ్రవాదులపై ఎదురుకాల్పులును జరిపింది. కాల్పుల్లో ఉగ్రవాదులను హతమార్చినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల వివరాలను సేకరిస్తున్నట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. -
జవాన్ జశ్వంత్‌రెడ్డి అంతిమయాత్ర ప్రారంభం
-
గుంటూరు: నేడు వీరజవాన్ జశ్వంత్కుమార్రెడ్డి అంత్యక్రియలు
-
ముగిసిన వీర జవాన్ జశ్వంత్ అంత్యక్రియలు
సాక్షి, గుంటూరు: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ జశ్వంత్‌రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. సైనికులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. జశ్వంత్‌రెడ్డిని కడసారి చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అశ్రునయనాల మధ్య జశ్వంత్‌కు వీడ్కోలు పలికారు. నేడు ఆయన భౌతికకాయం సొంత గ్రామానికి చేరుకుంది. జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు దరివాడ కొత్తపాలెంలో అధికారిక సైనిక లాంఛనాలతో నిర్వహించారు. గుంటూరు జిల్లా బాపట్లలోని కొత్తపాలెం స్మశానవాటికలో అంత్యక్రియలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జశ్వంత్‌రెడ్డి భౌతికకాయం వద్ద ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, హోంమంత్రి మేకతోటి సుచరిత, కలెక్టర్ వివేక్ యాదవ్ నివాళులు అర్పించారు. కాగా జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సుందర్‌బాని సెక్టార్లో గురువారం సాయంత్రం జరిగిన ఉగ్రపోరులో గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాద కొత్తపాలెంకు చెందిన జవాన్ జశ్వంత్‌రెడ్డి (23) అమరుడైన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో మొత్తం ఇద్దరు సైనికులు మృతి చెందగా వారిలో జశ్వంత్‌రెడ్డి ఒకరు. ఆయనకు తండ్రి శ్రీనివాసరెడ్డి, తల్లి వెంకటేశ్వరమ్మతోపాటు యశ్వంత్‌రెడ్డి, విశ్వంత్‌రెడ్డి అనే ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. అమర జవాన్ జశ్వంత్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండంగా నిలించింది. వీరజవాన్ మృతి పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అమరుడి కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. 2015లో ఆర్మీలో ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఆయన జమ్మూకశ్మీర్‌లో ఇన్‌ఫ్రాంటీ విభాగంలో జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నాలుగు నెలల క్రితం సెలవులకు ఇంటికి వచ్చి వెళ్లారు. మరో నెల రోజుల్లో అతనికి వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో ఉగ్రవాదుల కాల్పుల్లో కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు వెంకటేశ్వరమ్మ శ్రీనివాసరెడ్డి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొత్తపాలెం గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
ఉగ్రపోరులో జవాన్ వీర మరణం
సాక్షి, బాపట్ల టౌన్/సాక్షి, అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సుందర్‌బాని సెక్టార్లో గురువారం సాయంత్రం జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాద కొత్తపాలెంకు చెందిన జవాన్ జశ్వంత్‌రెడ్డి (23) అమరుడయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మొత్తం ఇద్దరు సైనికులు మృతి చెందగా వారిలో జశ్వంత్‌రెడ్డి ఒకరు. ఆయనకు తండ్రి శ్రీనివాసరెడ్డి, తల్లి వెంకటేశ్వరమ్మతోపాటు యశ్వంత్‌రెడ్డి, విశ్వంత్‌రెడ్డి అనే ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. వీరజవాన్ మృతి పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అమరుడి కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. తన తండ్రి ఆశయానికి అనుగుణంగా.. కౌలు రైతుగా జీవనం సాగిస్తున్న తన తండ్రి ఆశయానికి అనుగుణంగా ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన జశ్వంత్‌రెడ్డి 2015లో ఆర్మీలో ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఆయన జమ్మూకశ్మీర్‌లో ఇన్‌ఫ్రాంటీ విభాగంలో జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగం చేస్తూ తన కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. తన చిన్న తమ్ముడు విశ్వంత్‌రెడ్డిని ఐఏఎస్ అధికారిని చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లో ఒక కోచింగ్ అకాడమీలో చేర్పించి శిక్షణ ఇప్పిస్తున్నారు. బుధవారం సాయంత్రం చివరిసారిగా తమతో మాట్లాడుతూ.. ‘నేను అడవుల్లో ఉన్నాను.. నా ఫోన్ మా సార్ దగ్గర ఉంది.. వేరే సార్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నా.. నాన్నా మీరంతా బాగున్నారా.. పూలతోటలు ఎలా ఉన్నాయి.. ఒక్కసారి ఫోన్ అమ్మకివ్వు... అమ్మా నేను ఈరోజు కూడా అడవుల్లోనే ఉన్నాను. రేపు, ఎల్లుండి కూడా ఇక్కడే ఉండాలి.. రూమ్‌కు వెళ్లాక ఫోన్ చేస్తాను.. మీరంతా బాగున్నారా’ అని అన్నాడని, ఇంతలోనే తమ బిడ్డ మరణవార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. నేడు అంత్యక్రియలు వీర జవాన్ జశ్వంత్‌రెడ్డి భౌతికకాయాన్ని ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి శుక్రవారం రాత్రి ప్రత్యేక విమానంలో తరలించారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో ఆయన స్వగ్రామం దరివాద కొత్తపాలెం తీసుకొస్తారు. శనివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. గవర్నర్ ప్రగాఢ సానుభూతి వీర జవాన్ జశ్వంత్‌రెడ్డి మృతిపట్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ, తదితరులు కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు జశ్వంత్‌రెడ్డి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. జవాన్ చిరస్మరణీయుడు: సీఎం జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన పోరులో మృతి చెందిన వీర జవాన్ జశ్వంత్‌రెడ్డి చిరస్మరణీయుడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. దేశ రక్షణకు తన ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేశారని, ఆయన త్యాగం నిరుపమానమైనది అని కొనియాడారు. మన జవాన్ చూపిన అసమాన ధైర్యసాహసాలకు ప్రజలంతా గర్విస్తున్నారన్నారు. ఈ కష్టకాలంలో జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి అండగా నిలవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. వీర జవాన్ సేవలు వెలకట్టలేనివని, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ఈ మేరకు వైఎస్సార్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్ వీర జవాన్ మరణ వార్త తెలియగానే వెంటనే స్పందించారు. జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు. -
డ్రోన్ దాడి పాక్ పనే: జమ్ము కశ్మీర్ డీజిపీ
జమ్మూ: జమ్మూలోని భారత వైమానిక దళం స్థావరంపై సంచలనాత్మక డ్రోన్ దాడి వెనుక నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఈ దాడికి కారణమని అనుమానిస్తున్నట్లు జమ్ము కాశ్మీర్ డిజిపి దిల్బాగ్ సింగ్ తెలిపారు. పాక్ సరిహద్దు ఆవల నుంచే ఆ డ్రోన్లు వచ్చాయని భావిస్తున్నట్లు వెల్లడించారు. వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు ఆదివారం డ్రోన్లతో దాడులు జరపగా ఇద్దరు జవాన్లు గాయపడిన సంగతి తెలిసిందే. డ్రోన్ కాక్టైల్ భాగంలో ఆర్డీఎక్స్ను పేలుడుకు ఉపయోగించినట్లు అధికారులు అంచనాకొచ్చారు. భారత వైమానిక దళం స్థావరం వద్ద ప్రస్తుత పరిస్థితిని ఐపిఎస్ అధికారి సింగ్ పర్యవేక్షిస్తున్నాడని ఆయన అన్నారు. జమ్మూలో అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసులు వరుసగా సోదాలు జరుపుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో అనధికారికంగా డ్రోన్లను ఉపయోగించవద్దని ప్రజలకు హెచ్చరిక కూడా జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఇక ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ మంగళవారం నిర్ణయం తీసుకుంది. మరో ఉగ్రకుట్ర భగ్నం జమ్మూకశ్మీర్‌లో డ్రోన్ల సాయంతో ప్రయత్నించిన మరో ఉగ్రకుట్రను భద్రతా సిబ్బంది భగ్నం చేశారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) స్థావరంపై డ్రోన్ల దాడి జరిగిన కొన్ని గంటల్లోనే అదే తరహా ఘటన పునరావృతమవడం సంచలనం రేపింది. ఈసారి సైనిక స్థావరాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నారు. డ్రోన్లతో దాడికి ప్రయత్నించారు. ఆర్మీ జవాన్లు అప్రమత్తమై ఎదురుదాడికి దిగడంతో డ్రోన్లు తోకముడిచాయి. జమ్మూకశ్మీర్‌లోని రత్నుచక్–కలుచక్ సైనిక స్థావరం వద్ద ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. ఆదివారం అర్ధరాత్రి 11.45 గంటలకు ఒక డ్రోన్, సోమవారం తెల్లవారుజామున 2.40 గంటలకు మరో డ్రోన్ సైనిక స్థావరం వైపు దూసుకొచ్చాయని తెలిపారు. వాటిని నేలకూల్చడానికి విధుల్లో ఉన్న సెంట్రీలు దాదాపు రెండు డజన్ల రౌండ్లు కాల్పులు జరపడంతో డ్రోన్లు వెనక్కి వెళ్లిపోయాయని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఆర్మీ పీఆర్ఓ లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ వివరించారు. చదవండి: మొబైల్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన పిల్లలు.. అంతలోనే ఒక్కసారిగా -
అమర్నాథ్ యాత్ర రద్దు..!
న్యూఢిల్లీ: కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది కూడా అమర్నాథ్ యాత్రను రద్దు చేస్తూ జమ్మూకశ్మీర్ యంత్రాంగం సోమవారం ప్రకటించింది. కరోనా కారణంగా అమర్నాథ్ యాత్ర రద్దు కావడం ఇది రెండోసారి. కరోనా విజృంభిస్తోన్న సమయంలో అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. యాత్రికుల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఈ విషయాన్ని ట్విటర్లో తెలిపింది. వర్చ్యువల్‌లో పూజా కార్యక్రమాలను చూడొచ్చని అమర్నాథ్ బోర్డు తెలిపింది. 56 రోజులపాటు జరిగే అమర్నాథ్ యాత్ర జూన్ 28న ప్రారంభమై ఆగష్టు 22న ముగుస్తుంది. Shri Amarnathji Yatra cancelled in wake of Covid-19 Pandemic. Decision after threadbare discussion with Shri Amarnathji Shrine Board members. Yatra to be symbolic only. However, all the traditional religious rituals shall be performed at the Holy Cave Shrine as per past practice. — Office of LG J&K (@OfficeOfLGJandK) June 21, 2021 చదవండి: గడ్డకట్టే చలిలో.. 18 వేల అడుగుల ఎత్తున యోగాసనాలు -
వామ్మో..! యాసిడ్ తాగేసిన తహసీల్దార్
జమ్మూ: విధుల్లో భాగంగా తహసీల్దార్ ఓ గ్రామానికి వెళ్లగా అక్కడ పని ముగిసిన తర్వాత దుకాణంలో నీళ్ల బాటిల్‌గా భావించి యాసిడ్ బాటిల్ తీసుకుని తాగేశాడు. వెంటనే అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది. అయితే దుకాణదారుడు నీళ్ల బాటిల్ అనుకుని పొరపాటున యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. దీంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన జమ్మూకశ్మీర్‌లో బుధవారం జరిగింది. కుల్గాం జిల్లాలోని దమాల్ హంజిపూర ప్రాంత తహసీల్దార్ నియాజ్ అహ్మద్ ఓ గ్రామంలో సాగు చేస్తున్న గసగసాల పంట పొలాలను పరిశీలించారు. అనంతరం వాటిని ధ్వంసం చేసి ఉదయం 11 గంటల సమయంలో అక్కడే ఉన్న ఓ దుకాణానికి వెళ్లారు. నీళ్ల బాటిల్ అడగ్గా దుకాణదారుడు పొరపాటున యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. ఇది గమనించకుండా తహసీల్దార్ నియాజ్ అహ్మద్ తాగేశాడు. తాగిన వెంటనే ఆయన అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తోటి ఉద్యోగులు స్థానికులతో కలిసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన దమాల్ హంజిపురలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు దుకాణదారుడిని అరెస్ట్ చేసి అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చదవండి: అయ్యో పాపం.. అదా రాణి! -
వైరల్ వీడియో: వైద్య సిబ్బంది సాహసం
-
వైద్య సిబ్బంది సాహసం: వ్యాక్సిన్ కోసం నది దాటి
కశ్మీర్: హిమాలయ రాష్ట్రం జమ్మూకశ్మీర్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. కొండలు.. లోయలు.. నదులు దాటుకుంటూ వెళ్లేందుకు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. మారుమూల గ్రామాల్లో టీకాలు వేసేందుకు వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతూ వెళ్తున్నారు. నది దాటుతూ ఆరోగ్య సిబ్బంది వెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. వారి పనితీరుకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ ఘటన రాజౌరి జిల్లాలో జరిగింది. రాజౌరి జిల్లాలోని కంది బ్లాక్ ప్రాంతంలోని మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్ వేసేందుకు ఆరోగ్య సిబ్బంది నలుగురు బయల్దేరారు. అయితే మార్గమధ్యలో తావి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినా కూడా ఆ సిబ్బంది నదిలో నడుస్తూ వెళ్లారు. మోకాలి లోతు నీరు చేరగా ఓ వ్యక్తి సహాయంతో వ్యాక్సిన్ డబ్బాలు పట్టుకుని అతి జాగ్రత్తగా నది దాటారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఓ వ్యక్తి సహాయంతో మహిళలు అతి కష్టంగా నది దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే లక్ష్యంగా వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేసినట్లు కంది ప్రాంత బ్లాక్ వైద్యాధికారి డాక్టర్ ఇక్బాల్ మాలిక్ తెలిపారు. తమ పరిధిలోని ప్రాంతాలు వెనకబడి ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో కరోనా నివారణకు వ్యాక్సిన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆ వైద్య సిబ్బందిని అభినందించారు. జమ్మూకశ్మీర్‌వ్యాప్తంగా 33,98,095 డోసుల వ్యాక్సిన్ వేశారు. -
నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళ.. కారణం అదేనా..
శ్రీనగర్: గుర్తుతెలియని ఒక మహిళ జీలం నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలను కుంది. అయితే, పోలీసులు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమె ప్రాణాలను కాపాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. ఈ సంఘటన శ్రీనగర్‌లోని జీలం నది వద్ద సోమవారం చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఒక మహిళ జీలంనది ఉన్న బుద్షా వంతెన వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి నదిలో దూకడానికి ప్రయత్నించింది. అయితే, అక్కడ గస్తీలో ఉన్న జమ్ముకశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) పోలీసులు ఆమెను పక్కకు లాగి, ఆమె ప్రాణాలను కాపాడారు. అయితే, కరోనా, లాక్డౌన్ కారణంగా పనిదొరక్క కుటుంబ సమస్యలు మొదలయ్యాయి. ఈ క్రమంలో, ఆర్థికంగా కూడా ఎంతో కృంగిపోయిన ఆమె చివరకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెకు నిపుణులతో సరైన కౌన్సిలింగ్ ఇప్పిస్తామని కశ్మీర్ పోలీసు అధికారులు పేర్కొన్నారు. అయితే, సదరు మహిళ ప్రాణాలను కాపాడిన వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు పోలీసు అధికారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు. ‘ మీరు చేసిన గొప్ప పనికి హ్యట్సాఫ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
కశ్మీర్లో కాల్పుల కలకలం..! భద్రత సిబ్బంది ఎదురుదాడి..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో గురువారం బీజేపీ నేత ఇంటిపై దాడికి యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులు సహా ముగ్గురు ముష్కరులు భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. శుక్రవారం వేకువజామున భద్రతా బలగాలు కాకపొరా ప్రాంతంలోని ఘాట్‌మొహల్లాలో కార్డన్ సెర్చ్ చేపట్టాయి. అదే సమయంలో వారికి తారసపడిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. వారికి బలగాలు ధీటుగా బదులిచ్చాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఈ ముగ్గురిలో ఇద్దరు నౌగామ్‌లో బీజేపీ నేత అన్వర్ అహ్మద్ నివాసంపై గురువారం దాడికి యత్నించిన వారేనని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. దాడి ఘటనలో లష్కరే తోయిబా, అల్ బద్ర్ సంస్థలకు చెందిన నలుగురితో కూడిన బృందం పాల్గొందని ఆయన వివరించారు. బీజేపీ నేత ఇంటి వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో రమీజ్ రజా అనే కానిస్టేబుల్ మృతి చెందిన విషయం తెలిసిందే. రమీజ్ నుంచి వారు తీసుకెళ్లిన ఎస్ఎల్ఆర్తోపాటు ఏకే–47 రైఫిల్, పిస్టల్ వారి వద్ద లభ్యమయ్యాయని ఐజీపీ విజయ్ తెలిపారు. ‘ఘాట్ మొహల్లాలో సోదాలు చేపట్టాం. లొంగిపోవాలని కోరినా ఉగ్రవాదులు లెక్కచేయకుండా ఐదుగురు పౌరులను బందీలుగా ఉంచుకున్నారు. దీంతో, బలగాలు ముందుగా పౌరులను బయటకు తీసుకువచ్చాయి. అనంతరం ఎదురుకాల్పులు మొదలయ్యాయి. అందుకే, ఈ ఆపరేషన్ పూర్తయ్యేందుకు ఎక్కువ సమయం పట్టింది’అని ఆయన వివరించారు. చదవండి: కొడుకు శవం కోసం 8 నెలలుగా తవ్వకాలు.. -
మెహబూబా ముఫ్తీకి సమన్లు జారీ చేసిన ఈడీ
కశ్మీర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు కోసం ఈ నెల 15న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులు పంపింది. దీనిపై ముఫ్తీ స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘భారత ప్రభుత్వం తన చర్యల ద్వారా ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తోంది. విపక్షాలు.. కేంద్రం పాలసీలను, విధానాలను ప్రశ్నించడం ప్రభుత్వానికి నచ్చడం లేదు. ఇలాంటి చర్యలతో భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తోంది. కానీ ఇవేం పని చేయవు’’ అంటూ ముఫ్తీ ట్వీట్ చేశారు. జమ్ముకశ్మీర్ పునర్విభజన నేపథ్యంలో ఏడాదికిపైగా గృహ నిర్బంధంలో ఉన్న మెహబూబా ముఫ్తీని గత ఏడాది విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు జమ్ముకశ్మీర్ ఏకీకరణ కోసం స్థానిక పార్టీలన్నీ కలిసి గుప్కార్ డిక్లరేషన్ కింద ప్రజల కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి అధ్యక్షుడు, కశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లాకు చెందిన రూ.12 కోట్ల ఆస్తులను మనీ లాండరింగ్ కేసు నేపథ్యంలో గత ఏడాది ఈడీ జప్తు చేసింది. ఈ ఆరోపణలపై తాజాగా మెహబూబా ముఫ్తీకి ఈడీ సమన్లు జారీ చేసింది. -
పాక్ పన్నాగం: బయటపడ్డ రహస్య సొరంగం
సాక్షి, న్యూఢిల్లీ : పొరుగుదేశం పాకిస్తాన్ కుయుక్తి మరోసారి బయటపడింది. కతువా జిల్లాలోని పన్సార్ వద్ద ఒక సీక్రెట్ సొరంగాన్ని బీఎస్ఎఫ్ దళాలు గుర్తించాయి. బీఎస్ఎప్ ఔట్‌పోస్ట్ సమీపంలో బోర్డర్ పోస్ట్ వద్ద 30 అడుగుల లోతైన రహస్య టన్నెల్‌ను గుర్తించామని బీఎస్ఎఫ్ అధికారులు శనివారం ప్రకటించారు. పాకిస్తాన్ మిలిటరీ, దాని ఉగ్రవాదుల సొరంగాలను గుర్తించడం చాలా ముఖ్యమనీ అక్రమ చొరబాట్లకు ఉగ్రవాదులు ఈ సొరంగాలను ఉపయోగిస్తారని, తీవ్రవాద నిరోధక అధికారి ఢిల్లీలో చెప్పారు. గత పదిరోజుల్లో రెండు భారీ సొరంగాలను బీఎస్ఎఫ్ గుర్తించిన కావడం గమనార్హం. భారత్‌లోకి ఉగ్రవాదులను పంపేందుకు జమ్ము కశ్మీర్లో పాకిస్తాన్ ఐఎస్ఐ ఉపయోగించిన 150 మీటర్ల పొడవైన భారీ రహస్య సొరంగాన్ని వినియోగించిందని బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గత ఏడాదిగా బీఎస్ఎఫ్ పలు సొరంగాలను పసిగట్టి ధ్వంసం చేస్తూ, పాక్ కుయుక్తులను నిర్వీర్యం చేస్తున్నామన్నారు. దీని ద్వారా గత ఎనిమిదేళ్ల నుంచి భారత్‌లోకి పాకిస్తాన్ ఉగ్రవాదులను దేశంలోకి పంపిస్తోందని అధికారులు చెప్పారు. నియంత్రణ రేఖను దాటడం చాలా కష్టమైనప్పుడు, పాక్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు ఎంచుకుంటారని తెలిపారు.2012 నుంచి పాకిస్తాన్ భారత శిబిరాలపై కాల్పులకు తెగ బడుతోందని, ఈ ప్రాంతానికి సమీపంలోనే కొత్త బంకర్‌ను గుర్తించినట్టు బీఎస్ఎఫ్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు పూంచ్ జిల్లాలో ఇంటెలిజెన్స్ సమాచారంపై బీఎస్ఎఫ్ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఉగ్రవాద దాక్కున్న స్థావరంతోపాటు కొన్ని ఆయుధాలు, మందుగుండు సామగ్రిని గుర్తించింది. ముఖ్యంగా ఏకే-47 రైఫిల్, మూడు చైనా తయారు చేసిన పిస్టల్స్, అండర్ బారెల్ గ్రెనేడ్ లాండర్‌తో ఒక రేడియో సెట్‌ను స్వాధీనం చేసుకుంది. -
ప్రముఖ నగల వ్యాపారి కాల్చివేత
శ్రీనగర్: నూతన సంవత్సరం తొలి రోజే శ్రీనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. స్థానిక బిజీ మార్కెట్లో వ్యాపారి సత్పాల్ సింగ్ (62) పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. సారాయ్ బాలా వద్ద గురువారం ఈ సంఘటన జరిగిందని పోలీసు అధికారి వెల్లడించారు. ఎందుకు కాల్పులకు తెగబడ్డారనే దానిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టతలేదు. సింగ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
మంచు కొండల్లో పెరిగిన పొలిటికల్ హీట్..
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండో దశ పోలింగ్‌లో 48.62 శాతం ఓటింగ్ నమోదైంది. జమ్మూ ప్రాంతంలో 65.54 శాతం, కశ్మీర్ లోయలో సగటున 33.34 శాతం ఓటింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కెకె శర్మ మీడియాతో తెలిపారు. 43 స్థానాలకు రెండో దశలో ఎన్నికలు జరిగాయి. అందులో కశ్మీర్లో 25, జమ్మూ డివిజన్లో 18 ఉన్నాయి. బందిపురా జిల్లాలో అత్యధికంగా 69.66 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఓటింగ్‌తో కేంద్రపాలిత ప్రాంతాలలో మూడవ స్థానంలో ఉంది. నవంబర్ 28న జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 51.76 శాతం ఓట్లు నమోదయ్యాయి. ప్రత్యేక హోదా, ఆర్టికల్ 370 రద్దు తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఆగస్టులో రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత ఇది మొదటి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ. పూంచ్‌లో అత్యధికంగా 75 శాతం పోలింగ్ నమోదవ్వగా, పుల్వామా మొదటి దశలో మాదిరిగానే 8.67 శాతం ఓటింగ్‌తో చివర స్థానాన్ని నిలుపుకుంది. మొదటి దశలో కశ్మీర్లో 25, జమ్మూ ప్రాంతంలో 18 సహా 43 స్థానిక సంస్థ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. కేంద్రపాలిత ప్రాంతంలో ఎక్కడా సమస్యలు రాకుండా శాంతియుతంగా ఎన్నికలు ముగిశాయి. లోయలో పోల్ శాతం తగ్గినప్పటికీ కొంతమేరకు ప్రజలు ఓట్లు వేశారని శర్మ పేర్కొన్నారు. 'జిల్లా స్థాయిలో అభివృద్ధికి అభ్యర్థులను ఎన్నుకోవడంలో ఇవి చాలా ముఖ్యమైనవి. కాబట్టి స్థానిక ఎన్నికలలో ఓటు వేయమని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో మేము అవగాహన కార్యక్రమాలను నిర్వహించాం. కానీ చివరికి ప్రజలు చేయవలసినది ఓటు వేయడం' అని ఆయన తెలిపారు. చదవండి: (పార్కింగ్ స్థలం ఉంటేనే ఇక కొత్త వాహనం) -
‘‘ఇవాళ ఉన్నాం. రేపుంటామో లేదో!’’
శ్రీనగర్: ఎలా ఉన్నావన్న మిత్రుడితో ‘‘బాగానే ఉన్నా. కానీ మా (సైనికుల) గురించి ఎవరేం చెప్పగలరు? ఇవాళ ఉంటాం. రేపుండొచ్చు, ఉండకపోవచ్చు’’ అని సమాధానమిచ్చాడు ఒక ఇరవయ్యేళ్ల జవాను. ఆ మరునాడే ఒక ఉగ్రదాడిలో అమరుడయ్యాడు. సైనికుల ప్రాణాలకు ఉన్న భరోసా ఏ పాటిదో చెప్తూ, సొంతూర్లోని తన చిన్ననాటి స్నేహితుడితో అతను చేసిన వాట్సాప్ చాట్ వైరల్‌గా మారడమే కాకుండా నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. ఎవరతను? మహారాష్ట్ర, జల్గావ్ జిల్లా, చలిగావ్ తాలూకాకు చెందిన యశ్ దిగంబర్ దేశ్‌ముఖ్ గతేడాదే ఆర్మీలో చేరాడు. యశ్ తల్లిదండ్రులు వ్యవసాయదారులు. అతనికి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. అక్కలిద్దరికీ పెళ్లవగా, తమ్ముడింకా స్కూలుకు వెళుతున్నాడు. కర్ణాటక, బెళగావ్‌లో నిర్వహించిన మిలటరీ ఎంపిక శిబిరానికి చేరుకున్న యశ్ ఎంతగానో శ్రమించి ఆర్మీలో చోటు సంపాదించి తన కల నెరవేర్చుకున్నాడు. అసలేమైంది? అక్రమంగా ఎల్వోసీ దాటిన ముగ్గురు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు గురువారం శ్రీనగర్‌లోని ఓ రద్దీ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న సైనికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పట్టపగలే జరిగిన ఈ మెరుపుదాడిలో యశ్‌తో పాటు మరో జవాను అమరుడయ్యాడు. పన్నెండేళ్ల క్రితం ఇదే రోజున (26/11) ముంబై ఉగ్రదాడి జరగడం గమనార్హం. మరో రెండు రోజుల్లో జమ్ము కశ్మీర్లో ‘జిల్లా అభివృద్ధి మండలి’ (డీడీసీ) ఎన్నికలు జరనున్న నేపథ్యంలోనే ముష్కరులు ఈ దాడి జరిపి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా ఈ నెల 19న జమ్ము-శ్రీ నగర్ జాతీయ రహదారిపై ట్రక్కులో ప్రయాణిస్తున్న నలుగురు జైషే మొహమ్మద్ మిలిటంట్లను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే! -
పాక్ వక్రబుద్ధి: ఇద్దరు భారత జవాన్లు వీర మరణం
న్యూ ఢిల్లీ : పాకిస్తాన్ సైన్యం మరోమారు ఏకపక్ష కాల్పులకు తెగబడింది. జమ్మూకశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో సుందర్బనీ సెక్టార్లో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి కాల్పులకు తెగబడి.. పాక్ తన వక్రబుద్ధిని బయటపెట్టింది. శుక్రవారం జరిగిన ఈ దాడిలో ఇద్దరు భారత జవానులు రైఫిల్మన్ సుఖ్బీర్ సింగ్, నాయక్ ప్రేమ్ బహదూర్ ఖాత్రి అమరులయ్యారని రక్షణ శాఖ తెలిపింది. పాకిస్తాన్ చేసిన ఈ దాడిని భారత సైన్యం దీటుగా ఎదుర్కొందని రక్షణ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.ఇటీవల జమ్మూలోని నగ్రోటా వద్ద జరిగిన ఎన్కౌంటర్ ప్రదేశంలో దొరికిన కీలక సమాచారం ఆధారంగా సరిహద్దు భద్రతా బలగాలు భారత్- పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గల సుమారు 200 మీటర్ల పొడవు గల సొరంగాన్ని కనుగొన్నాయి. కొద్దిరోజుల క్రితం నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వారు భారత్‌లోకి ప్రవేశించేందుకు స్వరంగా మార్గాన్ని ఎంచుకున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. పక్కా పథకం ప్రకారం కశ్మీర్లో ఉగ్రదాడికి పాల్పడేందుకు సిద్ధమైన ముష్కరులు, ఈ క్రమంలో 8 మీటర్ల లోతు, 200- మీటర్ల పొడవు గల సొరంగాన్ని తవ్వినట్లు గుర్తించినట్లు పేర్కొంది.. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 160 మీటర్ల దూరంలో గల ఈ సొరంగం కొత్తగా తవ్విందని, దీని గుండా కశ్మీర్లోకి చొరబడి ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు ఉగ్రవాదులు పథకం రచించారని భద్రతా అధికారులు అభిప్రాయపడ్డారు. జమ్మూ కశ్మీర్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు అవరోధం కలిగించడమే వీరి లక్ష్యంగా భావిస్తున్నట్లు తెలిపారు. చదవండి : కంటతడి పెట్టిస్తున్న జవాను వాట్సాప్ చాట్ -
గృహ నిర్బంధంలోకి ముఫ్తీ
శ్రీనగర్: ఉగ్రవాద కేసులో అరెస్టయిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ యూత్ వింగ్ అధ్యక్షుడు వహీద్ పర్రా కుటుంబాన్ని పరామర్శించడానికి అనుమతినివ్వడం లేదని పీడీపీ నాయకురాలు, జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. "చట్టవిరుద్ధంగా నన్ను మరోసారి అదుపులోకి తీసుకున్నారు. నా కుమార్తె ఇల్టిజాను గృహ నిర్బంధంలో ఉంచారు" అని తెలిపారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ నవీద్ బాబుతో సంబంధం ఉన్న వహీద్ పర్రాను బుధవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. వహీద్ పర్రా ముఫ్తీకి అత్యంత సన్నిహితుడు. ఈ సందర్బంగా ముఫ్తీ పుల్వామాలోని వాహిద్ కుటుంబాన్ని సందర్శించడానికి రెండు రోజుల నుంచి ప్రయత్నిస్తుండగా అధికారులు అనుమతిని నిరాకరిస్తున్నారని తెలిపారు. కాగా.. బీజేపీ మంత్రులు వారి సహాచరులు రాష్ట్రంలోని ప్రతి మూలకు తిరగడానికి అనుమతి ఉంది కానీ మేము వెళ్లాలంటే భద్రత సమస్య ఉందంటూ సాకులు చెప్తున్నారని ముఫ్తీ శుక్రవారం ట్వీట్టర్లో పేర్కొన్నారు. తన ఇంటి ముందు ఉన్న పోలీసు వాహనం ఫోటోను కూడా జత పోస్ట్ చేశారు. దక్షిణ కశ్మీర్లో ముఖ్యంగా ఉగ్రవాద బారినపడిన పుల్వామాలో పీడీపీ పునరుద్ధరణలో వహీద్ పర్రా కీలక పాత్ర పోషించారు. అక్కడి జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికలకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మొదటి దశ ఎన్నికలు నవంబర్ 28న జరుగనున్నాయి. అయితే ఈ ఏడాది ప్రారంభంలో శ్రీనగర్-జమ్మూ హైవేపై ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను వాహనంలో తీసుకెళ్తుండగా అరెస్టయిన డీఎస్పీ డేవిందర్ సింగ్ కేసు దర్యాప్తులో వహీద్ పర్రా పేరు బయటపడింది. నిరాధార ఆరోపణలపై వహీద్ పర్రాను అరెస్టు చేశారన్నారు. ముఫ్తీ ఈ మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించాల్సి ఉంది. గత ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీర్ ప్రత్యేక హోదా ఆర్టికల్ 370 తొలగించినప్పుడు ఆమెను అదుపులోకి తీసుకుని అక్టోబర్‌లో విడుదల చేశారు. -
చిత్తూరు: ఉగ్రవాదుల కాల్పుల్లో భారత్ జవాను మృతి
-
ఉగ్రపోరులో చిత్తూరు జిల్లా కమాండో వీరమరణం
ఆయన మారుమూల గ్రామంలో పుట్టి పెరిగాడు. దేశ భక్తి మెండుగా ఉండడంతో మాతృభూమి సేవలో పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. 18 ఏళ్ల క్రితం సైన్యంలో చేరాడు. విధుల్లో చురుగ్గా ఉంటూ ఉన్నతాధికారుల మన్నలు పొందాడు. జమ్మూ కాశ్మీర్‌లోని కుష్వారా సెక్టార్‌లోని మాచెల్ నాలా పోస్టు వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అమరుడయ్యాడు. సాక్షి, చిత్తూరు : ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన చీకలప్రతాప్ రెడ్డి, సుగణమ్మ దంపతుల ఏకైక కుమారుడు చీకల ప్రవీణ్‌కుమార్ రెడ్డి (37) డిగ్రీ వరకు చదివాడు. గ్రామానికి చెందిన చాలామంది సైన్యంలో పనిచేస్తుండడం చూసి తాను దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. 18 ఏళ్ల క్రితం మద్రాసు రెజ్మెంట్–18లో చేరారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విధుల్లో చురుగ్గా ఉండేవాడు. ప్రస్తుతం ఆయన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమాండోగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం జమ్మూకాశ్మీర్‌లోని కుష్వారా సెక్టార్ లోని మాచెల్ నాలా పోస్టు వద్ద దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను నిలువరించే ఆపరేషన్‌లో 15 మంది బృందంలో ఉన్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఆరుగురు ఉగ్రవా దులు జరిపిన దాడుల్లో ప్రవీణ్‌కుమార్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు భారత్ సైనికులు మృతిచెందారు. సంక్రాంతి పండుగకు వస్తానని చెప్పిన కొడుకు అనంతలోకాలకు చేరుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రవీణ్ కుమార్‌రెడ్డికి భార్య, ఎనిమిదేళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మృతి సమాచారం అందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి వచ్చినప్పుడల్లా అందరితో ఎంతో కలివిడిగా ఉండేవాడని, సైన్యం వీరోచితగాథల గురించి తమకు స్ఫూర్తిదాయకంగా చెప్పేవాడని పలువురు యువకులు చెప్పారు. అలాంటి వ్యక్తి కాల్పుల్లో మృతిచెందడం బాధగా ఉందని యువత, స్నేహితులు, బంధువులు అతడి జ్ఞాపకాలతో విచలితులయ్యారు. దేశసేవ చేయాలని యువతకు చెప్పేవారు సెలవుల్లో గ్రామానికి వస్తే యువకులతో మాట్లాడేవారు. ప్రతి ఒక్కరూ సైన్యంలో చేరి దేశసేవ చేయాలని చెప్పేవారు. గ్రామానికి పండుగకు వస్తే అందరితోనూ కలిసిపోయేవారు. హుషారుగా ఉండే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మృతిచెందడం గ్రామానికి తీరని లోటు. – రవి, గ్రామస్తుడు చాలా చురుకైన వ్యక్తి ప్రవీణ్ కుమార్ సైన్యంలో చురుకైన వ్యక్తి. జమ్మూకాశ్మీర్‌లో కుష్వారా సెక్టార్లో కమాండోగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన వద్ద నేను సీహెచ్ఎంగా ఉన్నాను. అలర్ట్‌గా ఉండేవారు. నేను సెలవుల్లో వచ్చాను. నా స్నేహితుడు వీరమరణం పొందాడని తెలియగానే షాక్ గురయ్యా. –హేమాద్రి, వెదుర్లవారిపల్లె చాలా మంచివాడు ప్రవీణ్ చాలా మంచివాడు, సైన్యం నుంచి ఇంటికి ఎప్పుడు వచ్చినా గ్రామం గురించి ఆలోచించేవాడు. అందరూ కలిసిమెలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించేవాడు. అలాంటి వ్యక్తి చనిపోయాడనే విషయం తెలియగానే షాక్‌కు గురయ్యాం. –బాబురెడ్డి, మృతుడి బాబాయి, రెడ్డివారిపల్లె -
దాయాది ఆగడాలు, మరోసారి కాల్పులు
జమ్మూ కాశ్మీర్: పాకిస్తాన్ దళాలు శనివారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్, కథువా జిల్లాల్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి), అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గ్రామాలు, పలు సెక్టార్ పరిధిలో పాకిస్తాన్ దళాలు కాల్పులకు దిగాయని భద్రతా అధికారులు తెలిపారు. పాకిస్తాన్ ఆగడాలతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారని వెల్లడించారు. ఆయా గ్రామాల ప్రజలు రాత్రంతా భూగర్భ రక్షణ వసతుల్లో బిక్కు బిక్కుమంటూ గడపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనల్లో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని అన్నారు. పూంచ్‌లోని నియంత్రణ రేఖ వెంబడి, మాన్‌కోట్ సెక్టార్ పరిధిలో తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 4 గంటల వరకు దాడులు చేశారని, హిరానగర్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి రాత్రంతా కాల్పులు కొనసాగాయని అధికారులు తెలిపారు. ఆటోమాటిక్స్, మోర్టార్స్‌తో దాయాది బలగాలు దాడులకు తెగబడ్డారని రక్షణశాఖ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అంతకు ముందు శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో కూడా పాక్ దళాలు కరోల్ కృష్ణ, సత్పాల్, గుర్నామ్‌లో సరిహద్దు వెంట కాల్పులకు దిగారు. భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పాక్ చర్యలను దీటుగా తిప్పికొట్టిందని అధికారులు తెలిపారు. -
ఇకపై కశ్మీర్లో భూములు కొనొచ్చు..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఇకపై ఎవరైనా భూములను కొనొచ్చు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేసింది. జమ్మూకశ్మీర్‌లోని పలు చట్టాలకు చేసిన సవరణల్లో ఈ మార్పులను తీసుకొచ్చారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందు కేవలం ఆ రాష్ట్రంలోని శాశ్వత నివాసితులు మాత్రమే భూములు కొనే హక్కును కలిగి ఉండేవారు. సెక్షన్ 17లోని ఆ హక్కును కేంద్రం తొలగించడంతో, ఇప్పుడు ఎవరైనా జమ్మూకశ్మీర్‌లో భూములను కొనొచ్చు. అయితే వ్యవసాయ భూములను, వ్యవసాయేతరులకు అమ్మేందుకు ఈ సవరణ అంగీకరించలేదని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చెప్పారు. అయితే వ్యవసాయ భూములను విద్య, వైద్యానికి సంబంధించిన లక్ష్యాలకు వినియోగించుకోవచ్చు. ఈ చర్యను పీపుల్స్ అలియన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ (పీఏజీడీ) వ్యతిరేకించింది. ఈ సవరణలు ఆమోదనీయం కాదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌ను అమ్మకానికి పెట్టారని అన్నారు. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యతిరేకంగా ఆర్టికల్ 370ని రద్దు చేశాక, ఇప్పుడు జమ్మూకశ్మీర్‌ను అమ్మకానికి పెట్టారని, తమ సహజవనరులను దోచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని వ్యాఖ్యానించారు. -
మెహబూబా ముఫ్తీకి గట్టి ఎదురుదెబ్బ
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ పీపుల్స్ డెమోక్రటక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.త్రివర్ణ పతాకంపై ఆమె చేసిన వ్యాఖ్యలు దేశభక్తి మనోభావాలను దెబ్బతీయంటూ సొంత పార్టీ నేతలే విమర్శించారు. ముఫ్తీ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పార్టీని వీడుతున్నట్లు పీడీపీ నేతలు త్రిలోక్ సింగ్ బజ్వా, పుర్బ లెసిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్యే వేద్ మహాజన్, గుజ్జర్ నేత చౌదరి మహమ్మద్ హుస్సేన్ రాజీనామా చేశారు. ముఫ్తీ వ్యాఖ్యలు క్షమించరానివని వ్యాఖ్యానిస్తూ ఇలాంటి చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని లేఖలో పేర్కొన్నారు. ఇక గతేడాది ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో మెహబూబా ముఫ్తీ సహా పలువురు రాజకీయ నాయకులను ప్రభుత్వం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. (గుప్కార్ అధ్యక్షుడిగా ఫరూక్ అబ్దుల్లా ఎన్నిక ) కాగా 14 నెలల నిర్బంధం తర్వాత శుక్రవారం జైలు నుంచి విడుదలైన ఆమె తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ..జమ్మూకశ్మీర్‌లో ప్రత్యేక జెండాను ఎగురవేసేందుకు అనుమతించినప్పుడే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులను దొంగలు అని అభివర్ణిస్తూ జమ్మూకశ్మీర్‌లో ప్రత్యేక జెండాను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ముఫ్తీ వ్యాఖ్యలపై బీజేపీ సహా పలు పార్టీల నేతల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఫ్తీపై దేశద్రోహం కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కోరారు. ముఫ్తీ వ్యాఖ్యలు ఆమోదనీయం కాదని.. త్రివర్ణ పతాకం భారతీయుల ఐక్యత, సమగ్రత, త్యాగాలను చాటుతుందని, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేయొద్దని కాంగ్రెస్ హితవు పలికింది. (తీవ్ర దుమారం రేపుతున్న ముఫ్తీ వ్యాఖ్యలు ) -
ఈడీ ఉచ్చు
-
బారాముల్లా ఉగ్రదాడిలో ఇద్దరు జవాన్లు మృతి
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సోమవారం ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు సహా ఓ పోలీసు ఉన్నతాధికారి మరణించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు తమ వాహనం నుంచి బయటికి దిగుతున్న సమయంలో ఈ దాడి జరిగిందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. ఉగ్రదాడిలో గాయపడిన వారిని ఇప్పటికే ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాద కదలికలపై నిఘా పెట్టామని తెలిపారు. జమ్ము కశ్మీర్లో గత వారంలోనే భద్రతా దళాలపై ఉగ్రవాదులు జరిపిన మూడవ దాడి ఇది. ఆగస్టు 14న శ్రీనగర్ నగర శివార్లలోని నౌగాం వద్ద ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు పోలీసులు అమరులైన సంగతి తెలిసిందే. దాడి అనంతరం ఉగ్రవాదులు పారిపోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. అంతకుముందు శ్రీనగర్- బారాముల్లా హైవేలోని హైగాం వద్ద సైనికుల బృందంపై ఉద్రవాదులు కాల్పులు జరపగా, ఓ జవాను తీవ్రంగా గాయపడ్డారు. -
కుల్గాంలో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
కశ్మీర్: కుల్గాంలోని నాగ్నధ్-చిమ్మర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం కాగా, ఇద్దరు జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్ పోలీసులతో పాటు, 9 మంది పీఆర్, సీఆర్పీఎఫ్ జవాన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నాగ్నద్-చిమ్మర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు ఆయన వెల్లడించారు. భద్రతా బలగాలు అక్కడకు చేరుకోగానే నక్కి ఉన్న ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. దీంతో పోలీసులు, జవాన్లు ఎదురు కాల్పులకు దిగడంతో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. చదవండి: కశ్మీర్లో కలకలం.. బీజేపీ కార్యకర్త కిడ్నాప్ #KulgamEncounterUpdate: Another #unidentified #terrorist killed (total 03). #Incriminating materials including #arms & #ammunition recovered. Search going on. Further details shall follow. @JmuKmrPolice https://t.co/L74a825FBw — Kashmir Zone Police (@KashmirPolice) July 17, 2020 -
ఎన్కౌంటర్లో ఓక ఉగ్రవాది హతం
-
పుల్వామాలో ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పుల్వామాలోని గుసూ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో పోలీసు, ఓ ఆర్మీ సైనికుడు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, ఆర్మీ సంయుక్త బృందంతో గుస్సా ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. అయితే అప్పటికే అక్కడ మాటువేసిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. ఇరు పక్షాలకు జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఓ పోలీసు, ఆర్మీ సైనికుడు గాయపడినట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి ధ్రువీకరించారు. ఈ ఘటనలో ఇద్దరు నుంచి ముగ్గురు ఉగ్రవాదులకు తీవ్ర గాయాలైనట్లు అధికారులు ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు. (తెలంగాణ సైనికుడి వీరమరణం ) -
కరోనాతో సీఎర్పీఎఫ్ జవాను మృతి
శ్రీనగర్ : కరోనా కారణంగా 40 ఏళ్ల సీఆర్పీఎఫ్ జవాను మరణించారు. జమ్ముకాశ్మీర్‌లో వైరస్ కారణంగా చనిపోయిన మొదటి జవాను ఇతడేనని అధికారులు పేర్కొన్నారు. దీంతో జమ్మూ కశ్మీర్లో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 42కు చేరుకుంది. జలుబు, దగ్గు వంటి కరోనా లక్షణాలతో జూన్ 5న ఆస్పత్రిలో చేర్పించగా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అప్పటికే శ్వాసకోశ సమస్యలు తేలడంతో పరిస్థితి విషమించి కన్ను మూసినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో మిగతా సీఆర్పీఎఫ్ సిబ్బందిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక మృతుడు ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారని అధికారులు పేర్కొన్నారు. లాక్డౌన్ 4.0లో భాగంగా కేంద్రం భారీ సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా ఉదృతమవుతుంది. గత 24 గంటల్లోనే 9,983 కొత్త కేసులు వెలుగుచడటంతో మున్ముందు మరిన్ని గడ్డు పరిస్థితులు తలెత్తె అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
పర్యాటకుల వల్లే కశ్మీర్లో కరోనా!
శ్రీనగర్ : గడిచిన 24 గంటల్లో జమ్ముకశ్మీర్‌లో అత్యధికంగా 106 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 55 మంది పోలీసు సిబ్బంది, ఐదుగురు వైద్యులు కూడా ఉన్నారు. అయితే సోమవారం ఒక్కరోజే కరోనా కారణంగా ముగ్గురు చనిపోవడం ఇదే తొలిసారి. వీరిలో 75 ఏళ్ల వృద్ధుడు కూడా ఉండగా, ఆయనకు రెండుసార్లు నిర్వహించిన పరీక్షలో నెగిటివ్ అనే వచ్చింది. దీంతో అతనికి వైరస్ ఎలా సోకిందనే విషయాన్ని అధికారులు చేధించే పనిలో ఉన్నారు. జమ్మాకాశ్మీర్లో కరోనా కాస్త తగ్గుముఖం పడుతుందనుకున్న సమయంలో ఒక్కరోజులోనే 106 కొత్త కేసులు ప్రబలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో గరిష్టంగా 59 మంది పోలీసులకు కోవిడ్ నిర్ధారణ అయ్యింది. మొత్తం 77 మంది సాయుధ పోలీసు బలగాలకు నిర్వహించిన పరీక్షల్లో ఏకంగా 59 మందికి వైరస్ సోకింది. వీరిలో ఒక డిప్యూటీ కమాండెంట్ కూడా ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,289కి పెరగగా ప్రస్తుతం 665 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు వెల్లడించారు. పర్యటాక కేంద్రం కావడంతో వివిధ రాష్ర్టాల నుంచి పర్యాటకులు రావడంతోనే వైరస్ వ్యాపించిందని పేర్కొన్నారు. (మహా నగరాలే కరోనా కేంద్రాలు ) -
జమ్ముకశ్మీర్ : కేంద్రం మరో సంచలన నిర్ణయం
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌కు సంబంధించి కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్‌లో నివాసితుల ఉద్యోగ అర్హతకు సంబంధించి సరికొత్త నిబంధనలతో కూడిన మార్గదర్శకాలు జారీచేసింది. దీని ప్రకారం జమ్ముకశ్మీర్‌లో 15 ఏళ్లుగా నివసిస్తన్నవారు లేదా ఒకటి నుంచి ఏడవ తరగతి చదివి, పది లేదా పన్నెండో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్‌కి హాజరైన వారిని మాత్రమే అక్కడి స్థిర నివాసులుగా గుర్తించనున్నారు. తాజా చట్టం ప్రకారం గ్రేడ్-4 వరకు ఉన్న ఉద్యోగాలు జమ్ముకాశ్మీర్ స్థిరనివాసితులకే వర్తించున్నాయి. కేంద్రం విడుదల చేసిన ఈ మార్గదర్శకాలపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దల్లా ఘాటుగా స్పందించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి దేశం మొత్తం లాక్డౌన్లో ఉన్న సమయంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్లయాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇది తమ భద్రతకు భంగం కలిగించేలా ఉందని అన్నారు. ఇప్పటికే ఆర్టికల్ 370 రద్దు చేసిన గాయం మానకముందే.. మరో గాయం చేస్తున్నారంటూ విమర్శించారు. -
‘అంతర్గత హక్కును ఎవరు ప్రశ్నించలేరు’
న్యూఢిల్లీ: భారత్ అంతర్గత చట్టాలను ఇష్టారీతిన మారుస్తుందన్న చైనా వాదనపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా సార్వభౌమత్వానికి ఇబ్బంది కలిగేంచే చట్టాలను భారత్ రూపొందిస్తుందంటూ చైనా విదేశాంగ ప్రతినిధి జెంగ్ షువాంగ్ ఆరోపించారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ దీనిపై స్పందించారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం భారత్ అంతర్గత విషయమని స్పష్టం చేశారు. ఈ అంశంలో చైనా అనవసరంగా జోక్యం చేసుకుంటుందంటూ విమర్శించారు. కాగా 1963లో చైనా-పాకిస్తాన్ చేసుకున్న సరిహద్దు ఒప్పందంలో భాగంగా చైనా భారత భూభాగాలను చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకుంటోందని అన్నారు. అయితే జమ్మూకశ్మీర్, లడఖ్లలో చైనా ఆక్రమణలు నిరంతరం కొనసాగుతున్నాయని ఆయన మండిపడ్డారు. జమ్మూకశ్మీర్, లడఖ్‌లు భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేశారు. భారత్ అన్ని దేశాలను గౌరవిస్తుందని, అదే విధంగా ఇతర దేశాలు తమను గౌరవించాలని భారత్ కోరుకుంటుందని పేర్కొన్నారు. -
కశ్మీర్లో.. మహాపాపం చేశారు!!
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో పర్యటించేందుకు యూరోపియన్ యూనియన్ ఎంపీల బృందానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఈ చర్య ద్వారా కేంద్రం మహాపాపం చేసిందని, చాలాకాలంగా కశ్మీర్ అంతర్గత అంశమన్న భారత్ విధానాన్ని ఈ చర్య ద్వారా కేంద్రం ఉల్లంఘించిందని మండిపడింది. ‘ఎన్నో పరీక్షలకు నిలబడి కశ్మీర్ అంతర్గత అంశమన్న విధానానికి గత 72 ఏళ్లుగా భారత్ కట్టుబడి ఉంది. ఇప్పుడు కానీ, ఇకముందు కానీ ఈ విషయంలో థర్డ్‌పార్టీ జోక్యం సహించబోమని, ఏ ప్రభుత్వం, సంస్థ లేదా వ్యక్తి మధ్యవర్తిత్వం అంగీకరించబోమని చెప్తూ వస్తోంది. ఈ విధానాన్ని తలకిందులుగా చేయడం ద్వారా మోదీ సర్కార్ మహాపాపానికి ఒడిగట్టింది’ అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా మండిపడ్డారు. కశ్మీర్ అంతర్గత అంశమన్న భారత విధానాన్ని ఉల్లంఘించడం ద్వారా మోదీ సర్కార్ కశ్మీర్‌ను అంతర్జాతీయ అంశంగా మార్చివేసిందని విరుచుకుపడ్డారు. కశ్మీర్లోకి మూడో వ్యక్తి జోక్యాన్ని అనుమతించడం ద్వారా దేశ సార్వభౌమత్వాన్ని, జాతీయభద్రతను మోదీ సర్కార్ సవాలు చేస్తోందని, అంతేకాకుండా దేశ పార్లమెంటును కూడా అవమానిస్తోందని సుర్జేవాలా విమర్శించారు. యూరోపియన్ యూనియన్ పార్లమెంటు సభ్యుల బృందం రెండురోజులపాటు జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఓ విదేశీ ప్రతినిధుల బృందం కశ్మీర్లో పర్యటించడం ఇదే తొలిసారి. దేశ రాజకీయ నాయకులే కశ్మీర్ వెళ్లేందుకు అనుమతించని పరిస్థితుల నేపథ్యంలో ఈయూ బృందాన్ని ఎలా పంపారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
కశ్మీర్ మరో సిరియా కాకూడదు!
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్న యూరోపియన్ యూనియన్ పార్లమెంటు సభ్యులు భారత రాజకీయాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. రేపటి (అక్టోబర్ 31)తో జమ్మూకశ్మీర్ విభజన అధికారికంగా అమల్లోకి రానుంది. జమ్మూకశ్మీర్, లడఖ్ అనే కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఆ రాష్ట్రం విడిపోనుంది. ఈ నేపథ్యంలో విదేశీ ప్రతినిధుల బృందం కశ్మీర్లో పర్యటించేందుకు అనుమతించడం పలు విమర్శలకు కారణమవుతోంది. దేశ రాజకీయ నాయకులే కశ్మీర్ వెళ్లేందుకు అనుమతించడం లేదు. మరి ఈయూ బృందాన్ని ఎలా పంపారని పలువురు రాజకీయ పరిశీకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈయూ ప్రతినిధుల బృందం బుధవారం మీడియాతో మాట్లాడింది. ప్రపంచమంతాటా నెలకొన్న ఉగ్రవాదంపై ఈయూ ఆందోళనతో ఉందని, కశ్మీర్ సమస్యను అర్థంచేసుకోవడానికే తాము వచ్చామని ఈయూ సభ్యులు తెలిపారు. ‘కశ్మీర్లో శాంతిస్థాపన, ఉగ్రవాద నిర్మూలన కోసం భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలకు అంతర్జాతీయ ప్రతినిధులుగా మేం పూర్తి మద్దతు తెలుపుతున్నాం. చక్కని ఆతిథ్యం ఇచ్చినందుకు భారత్ ప్రభుత్వానికి, స్థానిక ప్రభుత్వానికి కృతజ్ఞతలు’ అని ఓ ఈయూ ఎంపీ అభిప్రాయపడగా.. మరో ఎంపీ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదం ఒక ప్రాంతాన్ని, దేశాన్ని ఎలా నాశనం చేస్తుందో నేను ప్రత్యక్షంగా చూశాను. గతంలో నేను సిరియాలో పర్యటించాను. ఉగ్రవాదం కారణంగా చోటుచేసుకున్న విధ్వంసాన్ని చూశాను. అలాంటి పరిస్థితి కశ్మీర్లో రాకూడదని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. ఈయూ ఎంపీ నికోలస్ ఫెస్ట్ మాత్రం తమను కశ్మీర్లోకి అనుమతించి.. భారత రాజకీయ నాయకులను అనుమతించకపోవడం మంచిది కాదని, వారిని కూడా అనుమతించి.. ఈ అసమతుల్య వాతావరణాన్ని సరిచేయాలని కోరారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దుచేసి.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం విభజించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆందోళనలు, అల్లర్లు చెలరేగకుండా కశ్మీర్లో పెద్ద ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు క్రమంగా ఎత్తివేసిన నేపథ్యంలో తాజాగా తొలిసారి ఈయూ పార్లమెంటు సభ్యుల విదేశీ బృందం కశ్మీర్లో పర్యటించేందుకు కేంద్రం అనుమతించింది. -
క్షేత్రస్థాయిలో కశ్మీర్ ఎలా ఉందో తెలుసుకుంటాం!
శ్రీనగర్: ఐరోపా సమాఖ్యకు చెందిన 27 మంది పార్లమెంట్సభ్యుల బృందం మంగళవారం కశ్మీర్లో పర్యటిస్తోంది. గట్టి భద్రత మధ్య ఢిల్లీ నుంచి ప్రత్యేక వాహనంలో ఈ బృందం శ్రీనగర్‌కు చేరుకుంది. కశీర్‌లో క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఐరోపా ఎంపీల బృందం అధ్యయనం చేపట్టనుంది. స్థానికులతోపాటు దాల్ లేక్‌లో పడవ నడిపేవారితోనూ మాట్లాడి వాస్తవిక పరిస్థితులను తెలుసుకోనుంది. ‘విదేశీ ప్రతినిధుల బృందంగా మేం కశ్మీర్లో పర్యటిస్తుండటం మంచి అవకాశంగా భావిస్తున్నాం. అక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో నేరుగా తెలుసుకునేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది’ అని యూరోపియన్ యూనియన్ పార్లమెంటు సభ్యుడు నాథన్ గిల్ మంగళవారం ఏఎన్ఐ వార్తాసంస్థతో పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన అనంతరం విదేశీ ప్రతినిధులు కశ్మీర్లో పర్యటించటం ఇదే తొలిసారి. ఇది పూర్తిగా అనధికారిక పర్యటన అని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. అంతకుముందు భారత్‌లో పర్యటిస్తున్న ఈయూ ఎంపీలు.. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో భేటీ అయ్యారు. -
ప్రధాని మోదీతో ఈయూపీ బృందం భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: యూరోపియన్ యూనియన్ పార్లమెంటరీ ప్యానెల్ (ఈయూపీపీ) అక్టోబర్ 29న జమ్మూకశ్మీర్‌లో పర్యటించనుంది. ఈ సందర్బంగా 28 మంది సభ్యులతో ఈయూపీ ప్యానెల్ ప్రధాని నరేంద్రమోదీతో పాటు, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్‌ను సోమవారం కలిసింది. ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్లో నెలకొన్న పరిస్థితుల గురించి ప్రధాని మోదీ ప్యానెల్ సభ్యులకు వివరించారు. ఈ భేటీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈయూపీ ప్యానెల్ సభ్యులు కశ్మీర్లో ఉన్న ప్రజలు, స్థానిక మీడియా, డాక్టర్లతో మాట్లాడితే బాగుంటుందని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ తన తల్లి ట్వీటర్ అకౌంట్ ద్వారా పేర్కొన్నారు. ప్రపంచానికి జమ్మూకశ్మీర్‌కు మధ్య ఉన్న లోహపుతెర ఎత్తాల్సిన అవసరం ఉందని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో ఏర్పడిన పరిస్థితులకు ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. మెహబూబా ముఫ్తీ ట్విటర్ అకౌంట్‌ను ఇల్తిజా హాండిల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం కశ్మీర్ విషయంలో అబద్ధాలు చెబుతోందని ఇల్తీజా ఆరోపించారు. రెండు నెలలకు పైగా కశ్మీరీ పౌరులు నిర్భంధంలో ఉన్నారని పేర్కొన్న ఆమె చాలా ప్రాంతాలలో 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. వాస్తవాలు బయటకు రాకుండా ప్రభుత్వం స్థానిక మీడియాను బెదిరింపులకు గురిచేస్తోందని ఆమె ఆరోపించారు. -
కశ్మీర్ : ఆపిల్ రైతులపై దాడులు; సంబంధాలే ముఖ్యం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో నిత్యం జరిగే ఉగ్రదాడులతో ప్రజలు భయంభయంగా బతుకున్నారు. ఇక రైతుల కష్టాలు సరేసరి. తాము పండించిన పంటను మార్కెట్‌కు తరలించి అమ్మకునేందుకు ఆపిల్ రైతులు, సరఫరాదారులు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఇటీవల దక్షిణ కశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆపిల్ పంట ట్రాన్స్‌పోర్టు చేస్తున్న ఓ ట్రక్కుపై ఉగ్రవాదులు దాడిచేసి ఇద్దరు కాశ్మీరీయేతర ట్రక్కు డ్రైవర్లను కాల్చి చంపారు. మరో రెండు ట్రక్కులను ఉగ్రవాదులు తగులబెట్టారు. అక్టోబర్ 14న రాజస్తాన్‌కు చెందిన ట్రక్కు డ్రైవర్లను కాల్చి చంపారు. దీంతో కశ్మీర్‌కు వాహనాల్ని పంపేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. బయటి రాష్ట్రాలకు ఆపిల్ పంటను రవాణా చేసే క్రమంలో దాడులు జరుగుతున్న నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ పరిపాలన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్) ఆపిల్ రైతుల నుంచి గిట్టుబాటు ధరకు పంటను కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. బయటి రాష్ట్రాల్లో అమ్ముకుంటే వచ్చేదానికన్నా ఎక్కువ ధర చెల్లించిమరీ కొనుగోలు చేస్తామని అన్నారు. అయితే, ఈ విధానంపై రైతులు, వ్యాపారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర రాష్ట్రాల వ్యక్తులతో సంవత్సరాల నుంచి ఉన్న తమ వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయని అంటున్నారు. ఎంఐఎస్ స్కీమ్‌పైగులాంనబీ అనే రైతు మాట్లాడుతూ.. ‘సంప్రదాయ మార్కెటింగ్ విధానంలోనే ఇటీవల 15 కిలోల ఆపిల్ పెట్టెను కశ్మీర్ నుంచి ఢిల్లీకి సరఫరా చేశాను. దాదాపు రూ.700 నుంచి రూ. 800 వరకు లాభం వచ్చింది. కానీ ఎంఐఎస్ స్కీమ్ ద్వారా సరఫరా చేస్తే రూ.1000 వచ్చేవి. అయితే, నాకది ఇష్టం లేదు. బయటి రాష్ట్రాల ప్రజలు, వ్యాపారులతో చాలా ఏళ్లుగా ఉన్న సంబంధాలే మాకు ముఖ్యం. డబ్బులు ప్రధానం కాదు. పంజాబ్ లేదా దక్షిణ భారతదేశంలోని వ్యాపారులతో కశ్మీర్ వ్యాపారుల సంబంధాలను విచ్ఛిన్నం చేయడం మాకు ఇష్టం లేదు’అన్నాడు. -
‘అదృశ్యాల’పై అలుపెరగని పోరు..
న్యూఢిల్లీ : పర్వీనా అహంగర్.. జమ్మూ కశ్మీర్లో ఈ పేరు తెలియని వారుండరు.1990లో భారత సైన్యం తన కుమారుడిని అదృశ్యం చేసిందన్న ఆరోపణలపై 29 ఏళ్లుగా పోరాటం చేస్తూ 'ఐరన్ లేడీ ఆఫ్ కాశ్మీర్'గా ప్రసిద్ది చెందిన మహిళ ఆమె. అలుపెరగని పోరాటంతో బీబీసీ స్పూర్తిదాయక మహిళల జాబితా టాప్ 100 జాబితాలో ఈ ధీర వనిత చోటు సంపాదించారు. పర్వీనా అహంగర్ 1994లో అసోసియేషన్ ఆఫ్ పేరెంట్స్ ఆఫ్ డిసప్పియర్డ్ పేరెంట్స్ (ఏపీడీపీ)ని ఏర్పాటు చేసి కశ్మీర్ లోయలో ‘అదృశ్యాల’పై గళమెత్తారు. 50 ఏళ్ల పర్వీనా 25 ఏళ్లుగా పోరాడుతూ ఏపీడీపీని ముందుండి నడిపిస్తున్నారు. ఆమె పోరాటానికి ఐక్యరాజ్యసమితి కూడా అండగా నిలిచింది. పర్వీనా ఉద్యమ స్ఫూర్తికి ఎన్నో పురస్కారాలు వరించాయి. 2015లో నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. మానవ హక్కుల పరిరక్షణకు చేస్తున్న కృషికి గానూ పర్వీనాను 2017లో నార్వే దేశం ప్రఖ్యాత రాఫ్టో ప్రైజ్‌తో సత్కరించింది. తాను పోరాటానికి దారి తీసిన పరిస్థితుల గురించి గతంలో యూకే వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో పర్వీనా అహంగర్ వివరించారు. 'నా కుమారుడు 11వ తరగతి చదివేటప్పుడు అదృశ్యమయ్యాడు. వాడు కనిపించకుండా పోయాడని తెలుసుకొన్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా కుమారుడిని జాగ్రత్తగా తీసుకొస్తామని వారు హామీ ఇచ్చారు. తొమ్మిది రోజులు వారిచుట్టూ తిరిగినా ఏ సమాచారం అందించలేదు. ఇక లాభం లేదనుకొని పోరాటం మొదలు పెట్టాను. కనిపించకుండాపోయిన కొడుకు కోసం 27 సంవత్సరాలుగా ఆశగా ఎదురుచూస్తున్నట్లు' కన్నీటి పర్యంతమయ్యారు. 1991లో తన కొడుకు జాడను తెలపాలంటూ జమ్మూకశ్మీర్ హైకోర్టులో సైన్యానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశానని తెలిపారు. తాను వేసిన కేసులో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇదే సమయంలోనే నా కుమారుడి ఆచూకీ కోసం పలుమార్లు ఆర్మీ శిబిరాలను సందర్శించాను. తన లాంటి పరిస్థితే అక్కడ చాలా కుటుంబాలు ఎదుర్కొంటున్నాయని తెలుసుకున్నాను. అప్పుడే నాకు ఒక ఆలోచన తట్టింది. నాలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న కుటుంబాలను కలిసి వారు మద్దతు కూడగట్టాలని నిర్ణయించుకున్నాను. మొత్తం 50 కుటుంబాలు నాకు మద్దతుగా నిలవడంతో 1994లో ఏపీడీపీని స్థాపించి దాని ద్వారా ఆర్మీకి వ్యతిరేకంగా జమ్మూ కశ్మీర్ హైకోర్టులో సిట్ దాఖలు చేశాన’ని వివరించారు. అప్పటి నుంచి పర్వీనా ఆమె అనుచరులతో కలిసి చేస్తున్న పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. పాలకులు ఎన్నిసార్లు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆమె వెనుకడుగు వేయలేదు. -
కశ్మీర్ అభివృద్ధే ప్రథమ ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: జమ్మూ,కశ్మీర్ అభివృద్ధే తమ ప్రథమ ప్రాధాన్యం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు.త్వరలోనే కశ్మీర్ ప్రజలకు అన్ని రాజకీయహక్కులు కల్పిస్తామని, అక్కడి అసెంబ్లీలో ఎస్టీలకు సీట్లు రిజర్వ్ చేస్తామని చెప్పారు. అలాగే ఎస్టీ, మహిళా, మైనారిటీ కమిషన్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసునని పేర్కొన్నారు. శుక్రవారం బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ‘ఆర్టికల్ 370 రద్దు’పై ఏర్పాటు చేసిన జనజాగరణసభకు రాంమాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌తో చర్చలు జరిపే అవకాశమే లేదని, చర్చించాల్సి వస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించే ఉంటుందని స్పష్టంచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ దృష్టంతా పీఓకేను ఎలా సంపాదించాలన్నదానిమీదే ఉందన్నారు. ఉగ్రవాదులకు మద్దతుపలుకుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఆర్టికల్ 370 రద్దు చేశాక 200 మందివరకు మాత్రమే ముందస్తుగా అధికారులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. 370 రద్దు ధైర్యంతో తీసుకున్న నిర్ణయమని, ఈ ఆర్టికల్ ద్వారానే వేర్పాటువాదానికి ఊతం ఏర్పడిందని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య అన్నారు. ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌లోని ముస్లింలను రెచ్చగొట్టే ప్రయ త్నం చేయడాన్ని తప్పుబట్టారు. జమ్మూ, కశ్మీర్లో ఆర్మీ కోర్ కమాండర్‌గా, ఆ తర్వాత అక్కడి ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నపుడు తన అనుభవాలను లెఫ్టినెంట్ మహ్మద్‌జకీ పంచుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు సాహసోపేతమైన చర్యఅని సీఆర్పీఎఫ్ మాజీ డీజీ ఎంవీ కృష్ణారావు అన్నారు. -
జమ్మూకశ్మీర్ లో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
-
శాంతి దూతగా పంపండి : మొఘలాయి వారసుడు
హైదరాబాద్: మొఘల్ సామ్రాజ్యానికి చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడిగా ప్రకటించుకున్న ప్రిన్స్ యాకుబ్ హబీబుద్దీన్ టుసీ శనివారం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను కలిశారు. ఈ సందర్భంగా తనను జమ్మూకశ్మీర్‌కు ‘శాంతి దూత’గా నియమించాలని రాష్ట్రపతిని ఓ లేఖ సమర్పించారు. ‘జమ్ము కశ్మీర్ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య శాంతిని నెలకొల్పడానికి పనిచేస్తాను. మొఘలాయి వంశ వారసత్వానికి ఉన్న ప్రజాదారణతో ప్రత్యక్షంగా అక్కడి ప్రజలతో మమేకవుతాను. దేశద్రోహ సమూహాలతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో నేను కశ్మీర్‌ను సందర్శించాలి. ఒక భారతీయుడిగా, మొగల్ వంశ వారసుడిగా నాపై ఆ బాధ్యతలు ఉన్నాయి. జమ్మూ, లఢఖ్‌లో నివసిస్తున్న మా వంశస్తులకు శాంతి, సౌఖ్యాలను పెంచడానికి నన్ను శాంతి దూతగా పంపాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ను మొఘలాయి రాజులు శక్తిమంతమైందిగా నిలిపారు. నన్ను కశ్మీర్‌కు శాంతి దూతగా పంపిస్తే గౌరవ సూచకంగా ఉంటుంది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు కశ్మీర్లో స్వార్థమయమడంతో వల్లే ప్రజలు తప్పుదారి పట్టారు. కానీ, ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వ సహకారంతో కశ్మీర్లో శాంతి స్థాపనకు కీలక పాత్ర పోషిస్తాను’అని లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ మొఘలాయి వారసుడి లేఖపట్ల రాష్ట్రపతి ఎలా స్పందిస్తారో చూడాలి. -
సత్వర ఆచరణే కీలకం
జమ్మూ–కశ్మీర్‌కి ఉన్న ప్రత్యేక హక్కులు, అధికారాలను రద్దు చేయాలని, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలని నిర్ణయించిన మూడురోజుల తర్వాత ఆ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దాదాపు 40 నిమిషాలు సాగిన ఆ ప్రసంగంలో సాధ్యమైనంత త్వరగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ రాష్ట్ర ప్రతిపత్తి, స్థానిక యువతకు విద్య, ఉద్యోగావకాశాలు వగైరాలు ప్రస్తావనకొచ్చాయి. ప్రభుత్వాలు ప్రకటించే ఏ విధాన నిర్ణయంపైన అయినా అనుకూల, ప్రతికూతలు వ్యక్తం కావడం సర్వసాధా రణం. ప్రస్తుత నిర్ణయం కశ్మీర్‌కి సంబంధించింది కనుక వాటి తీవ్రత అధికంగానే ఉంది. అయితే జమ్మూ–కశ్మీర్లో వర్తమాన స్థితిగతులెలా ఉన్నాయో, కేంద్రం తీసుకున్న చర్యలపై అక్కడి పౌరుల మనోభావాలెలా ఉన్నాయో, వారి స్పందనేమిటో తెలియడానికి మరికొంతకాలం పడుతుంది. పరి స్థితులన్నీ కుదుటపడి, ఇప్పుడు విధించిన ఆంక్షలన్నీ రద్దయ్యాక మాత్రమే అవి తెలిసే అవకాశం ఉంది. జనం కదలికలపై ఆంక్షలు విధించాక గత అయిదురోజులుగా సాధారణ ప్రజానీకం అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చానెళ్లలో వస్తున్న కథనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆంక్షల్ని క్రమేపీ సడలిస్తామని ఈ ప్రసంగంలో మోదీ హామీ ఇచ్చారు గనుక పరిస్థితులు త్వరలోనే కుదుటపడతాయని ఆశించాలి. వచ్చే సోమవారం బక్రీద్ పర్వదినం. ఈలోగానే అంతా చక్కబడితే సాధారణ ప్రజానీకం ఉత్సాహంగా పండుగ చేసుకోగలుగుతారు. దేశ విభజన నాటినుంచీ కశ్మీర్‌పై కన్నేసిన పాకిస్తాన్ అక్కడ ఏదో విధంగా చిచ్చు రేపాలని ప్రయత్నిస్తూనే ఉంది. 35 ఏళ్లక్రితం కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరించిన అపసవ్య విధానాలు ఉగ్రవాదం వేళ్లూనుకోవడానికి తోడ్పడ్డాయి. ఇదే అదునుగా పాకిస్తాన్ తన కోరలు చాచడం మొదలుపెట్టింది. తదనంతరకాలంలో వచ్చిన ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు కూడా ఫలించకపోగా పరిస్థితులు మరింత వికటించడానికి కారణమయ్యాయి. భద్రతాబలగాలపై దాడులు, నిరవధిక ఉద్యమాలు, ఆందోళనలు యధావిధిగా సాగుతూనే వచ్చాయి. అంతర్గతంగా కశ్మీర్లో అధికారం చలాయించడానికి సంబంధించి ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉన్నా అంతర్జాతీయంగా కశ్మీర్ సమస్యలో మూడో పక్షం జోక్యాన్ని అవి గట్టిగా వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రద్దు చేసిన రాజ్యాంగ అధికరణలు 370, 35ఏ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగకపోగా అవి ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని విస్తరింపజేసేందుకు పాకిస్తాన్‌కు తోడ్పడ్డాయ న్నది మోదీ అభియోగం. కనుక కేంద్రం ఈ సమస్య మూలాల్ని కొత్త కోణం నుంచి చూస్తున్నదని అర్ధమవుతుంది. ఈ రెండు అధికరణల తొలగింపుతో పరిస్థితులు చక్కబడి, అభివృద్ధికి బాటలు పడతాయని ఆయన ఆశిస్తున్నారు. అక్కడ నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, రోడ్డు రవాణా తదితర మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యమిస్తామని ఆయన ఇచ్చిన హామీ అయినా... ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటు చేస్తామని, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చేసిన వాగ్దానమైనా ఆచరణలోకొస్తే యువతకు ఎంతో మేలు కలుగుతుంది. ఇటీవలికాలంలో సివిల్ సర్వీసులకు జమ్మూ–కశ్మీర్ నుంచి ఎంపికవుతున్న యువత సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే అక్కడివారికి దేశంలోని ఇతర ప్రాంతాల్లో చదువుకునేందుకు ఇప్పుడు కల్పిస్తున్న అవకా శాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ఉపాధి కల్పించడంలోనూ ఆ దృక్పథమే ఉండాలి. అలాంటి చర్యలు ఈ దేశంలో తామూ భాగమేనన్న విశ్వాసాన్ని వారికి కలిగిస్తాయి. కశ్మీర్ లోయలో ఇటీవలికాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అందరికీ ఆందోళన కలిగి స్తూనే ఉన్నాయి. ప్రధాన స్రవంతి పార్టీల నేతలంతా ఈపాటికే ఈ సంగతి గ్రహించారు. మధ్యేవాద హుర్రియత్ కాన్ఫరెన్స్ వంటి సంస్థలకే దిక్కుతోచని స్థితి ఏర్పడితే నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీడీపీ వంటి పార్టీల గురించి చెప్పనవసరం లేదు. ఎన్సీ, పీడీపీలది స్వయంకృతం. అవి రెండూ గతంలో కేంద్రంతో తాము పోరాడుతున్నామని, రాష్ట్రానికి అవసరమైనవి సాధిస్తున్నామని చెప్పేం దుకు ప్రయత్నించేవి. కానీ ఇటీవలి కాలంలో ఆ పార్టీలు కేంద్రంలో ఎవరుంటే వారితో పొత్తు కుదుర్చుకోవడానికి, రాజీ పడేందుకు సిద్ధపడ్డాయి. ఎన్నికల్లో ప్రత్యర్థులుగా హోరాహోరీ సంఘర్షించిన పీడీపీ, బీజేపీలు ఎన్నికలయ్యాక కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పర్చటం వీటన్నిటికీ పరాకాష్ట. ఇదే సమయంలో ఐఎస్ వంటి ఉగ్ర సంస్థల జాడలు నేరుగా కనబడకపోయినా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభావితులైనవారు అనేకులు ఈమధ్యకాలంలో సాయుధ బాట పట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రం కఠిన చర్యలు తీసుకోవడం అవసరమని భావించింది. ఒక రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీయడమన్నది స్వాతంత్య్రం వచ్చాక మొట్టమొదటిసారి జమ్మూ–కశ్మీర్ విషయంలోనే జరిగింది. సాధారణంగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటపుడు ప్రభుత్వాలు ఆ దిశగా ప్రజాభిప్రాయాన్ని మలిచేందుకు అవసరమైన రాజకీయ ప్రచారాన్ని ముమ్మరం చేస్తాయి. కానీ జమ్మూ–కశ్మీర్ రక్షణపరంగా సున్నితమైన ప్రాంతం. దాని సరిహద్దుల్లో పాకిస్తాన్, చైనా ఉన్నాయి. కనుకనే ఆ తరహా చర్య సమస్యాత్మకంగా మారే అవకాశం ఉందన్న సందేహం కేంద్రా నికి కలిగి ఉండొచ్చు. అయితే తీసుకునే చర్య ఎలాంటిదైనా స్థానికులను విశ్వాసంలోకి తీసుకోవాలి. అప్పుడే దానికి సార్థకత చేకూరుతుంది. మెరుగైన ఫలితాలు వస్తాయి. ఏదేమైనా జనానికి మేలు కలిగించే భిన్న చట్టాల అమలు, భారీ యెత్తున ఉద్యోగాల భర్తీ, మౌలికసదుపాయాల కల్పన, ఉన్నత శ్రేణి విద్యాసంస్థలు, క్రీడల కోసం శిక్షణ కేంద్రాలు వంటివి ఏర్పాటు చేస్తామన్న మోదీ వాగ్దానాలు సాధ్యమైనంత త్వరగా ఆచరణరూపం దాలిస్తే నిజంగానే నయా కశ్మీర్‌కు ఆ చర్యలు దోహదపడతాయి. -
ఈద్ సందర్భంగా కశ్మీర్లో ఆంక్షల సడలింపు
శ్రీనగర్ : ఈద్ పండుగ సందర్భంగా శుక్రవారం ప్రార్థనలకు, వ్యాపారానికి కశ్మీర్లో విధించిన ఆంక్షలను సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐదు రోజులుగా జమ్మూ కశ్మీర్లో కర్ఫ్యూ ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రత్యేక ప్రసంగంలో మాట్లాడుతూ ఈద్ జరుపుకునే ప్రజలు ‘ఇబ్బందులు ఎదుర్కోరు’ అని, త్వరలోనే పరిస్థితి సాధారణమవుతుందని కశ్మీరీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ దిశగా ప్రభుత్వం కశ్మీర్లో సాధారణ పరిస్థితి ఏర్పడటానికి వేగంగా కృషి చేస్తోంది. శ్రీనగర్‌లోని చరిత్రాత్మక జామామసీదులో కూడా ప్రార్థనలకు అనుమతించారు. బ్యాంకు లావాదేవీలు పరిమిత స్థాయిలో జరుగుతున్నాయి. కూరగాయల దుకాణాలు, మెడికల్ షాపులను వ్యాపారులు తెరుస్తున్నారు. కశ్మీర్ లోయలో ఎవరినీ వేధించకుండా చూసుకోవాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ అధికారులను ఆదేశించిన తరువాత ఈ ప్రాంతంలో ఆంక్షలు సడలింపు మరింత వేగమైంది. పండుగ వస్తువులు కోసం దుకాణాల దగ్గరకి ప్రజలు రావాల్సిన అవసరం లేదని, ఇళ్ల దగ్గరకే వివిద వస్తువులు సరఫరా చేయబడతాయని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. అలాగే మార్కెట్లు కూడా ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటాయని తెలిపారు. కశ్మీర్ అంతటా సెక్షన్ 144 అమలులో ఉన్నా కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే మినహాయింపులు ఇచ్చామని పేర్కొన్నారు. -
శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో ఏచూరి నిర్భందం
శ్రీనగర్ : సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరిని శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అడ్డుకున్నారు. కశ్మీర్లో ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే మొహమ్మద్ యూసిఫ్ తరిగామితో పాటు ఇతర కార్యకర్తలను ఆయన కలుసుకునేందుకు వెళ్లారు. కానీ పోలీసులు ఏచూరిని ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డుకున్నారు. ఏచూరితో పాటు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాను కూడా నిర్భందించారు. ఈ ఘటనపై సీపీఎం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనారోగ్యంతో ఉన్న మా పార్టీనాయకులను కలవకుండా ఇలా ఏచూరిని విమానాశ్రయంలోనే నిర్భందించడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని ఒక ప్రకటనలో తెలిపింది. విమానం ఎక్కే ముందే నేను జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్‌మాలిక్‌ను పర్యటనకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరానని ఏచూరి ట్వీట్ చేశారు. ‘మమ్మల్ని ఏయిర్పోర్ట్ దాటి బయటకు వెళ్లనివ్వలేదని, భద్రతాకారణాల రిత్యా అనుమతి ఇవ్వడం కుదరదంటూ పోలీసులు అడ్డుకున్నారని’ తెలిపారు. కాగా కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభలో ప్రతిపక్షనాయకుడు గులాం నబీ ఆజాద్‌ను కూడా శ్రీనగర్ విమానాశ్రయంలో పోలీసులు ఆపి వెనక్కి తిప్పి పంపిన విషయం తెలిసిందే. -
కశ్మీర్‌పై స్పందించిన బ్రిటన్ ప్రధాని
లండన్ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ జమ్మూకశ్మీర్ పరిణామాలపై స్పందించారు. జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితి తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రధానిగా కొత్తగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలపడానికి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఫోన్‌చేశారని బ్రిటన్ విదేశాంగ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య జమ్ముకశ్మీర్ అంశం చర్చకు వచ్చిందని స్థానిక వార్తపత్రిక వెల్లడించింది. భారత ప్రభుత్వం జమ్ముకశ్మీర్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోందని, బ్రిటన్ జోక్యం చేసుకోవాలని ఇమ్రాన్ కోరాడని తెలిపింది. పాక్, బ్రిటన్ల ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగవ్వాలని ఇరువురు నేతలు ఆశాభావం వ్యక్తం చేశారని పేర్కొంది. బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ కూడా జమ్మూకశ్మీర్ అంశంపై విలేకరులతో మాట్లాడారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో ఇదే విషయమై చర్చించానని, భారత్, పాక్‌లు సమన్వయం పాటించాలని కోరారు. ప్రస్తుత పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. కాగా జమ్మూకశ్మీర్‌పై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా లండన్‌లో భారత వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి. అలాగే జమ్మూ, కశ్మీర్ తదితర ప్రాంతాల పర్యటనకు వెళ్లవద్దని తన దేశ ప్రజలకు బ్రిటన్ సూచించింది. -
కామెంట్లు ఆపండి.. కశ్మీరీ మహిళలు బొమ్మలేం కాదు
నూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేశాక సోషల్ మీడియాలో కశ్మీరీ మహిళలపై వస్తున్న పోస్టులపై మహిళా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై భారత యువకులు జమ్మూకశ్మీర్ యువతులను వివాహం చేసుకోవచ్చంటూ వస్తున్న కామెంట్లపై తీవ్రంగా స్పందించారు. కామెంట్లు చేసేవారిని ఉద్దేశిస్తూ ‘జమ్మూ కశ్మీర్ మహిళలను వివాహం చేసుకోవడానికి తెగ ఉత్సాహం చూపిస్తున్నారు, వారేం యుద్ధంలో దొరికే బొమ్మల్లాగా భావిస్తున్నారా’ అని మండిపడుతున్నారు. ఇలాంటి కామెంట్లు ఎంత నీచంగా ఉంటాయో ఒకసారి ఆలోచించండని కోరుతున్నారు. భారతదేశంలో మీటూ ఉద్యమంపై పుస్తకం రాస్తున్న సామాజిక కార్యకర్త రితుపర్ణ ఛటర్జీ ఈ పోస్టులపై స్పందిస్తూ‘ ఇది తీవ్రమైన లైంగిక కోరికని, మహిళల శరీరాలు శతాబ్దాలుగా పురుషులకు యుద్ధభూమిగా మారాయని, కశ్మీరీ మహిళలపై తాజా వ్యాఖ్యలు దీనికి ఒక నిదర్శనం మాత్రమే’ అని వాపోయారు. టిక్‌టాక్, ట్విట్టర్ లాంటి వాటి ద్వారా మహిళలపై అసభ్యంగా కామెంట్లు ఏంటని లింగ సమానత్వం కోసం పోరాడుతున్న సుప్రీంకోర్టు న్యాయవాది మిహిరా సూద్ ప్రశ్నించారు. ఆమె పలు పోస్టులను ప్రస్తావించారు. ‘అభినందనలు. భారతదేశంలో ఇప్పుడు పెళ్లికాని అబ్బాయిలు ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత కశ్మీర్‌లోని అందమైన అమ్మాయిలను వివాహం చేసుకోవచ్చు. మరొక పోస్టులో ‘ప్రస్తుతం ప్రతి భారతీయ అబ్బాయి కల. 1. కశ్మీర్లో ప్లాట్ 2. కశ్మీర్లో ఉద్యోగం 3. కశ్మీరీ అమ్మాయితో వివాహం.’ ఇలాంటి కామెంట్లను మహిళలపై తీవ్రచర్యగా భావించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ‘కశ్మీరీ మహిళలు యుద్ధంలో దొరికే బొమ్మలు కాదు. వారు మనుషులేనని గుర్తించాలని, వారికి సమ్మతి లేదా అసమ్మతి తెలిపే హక్కు ఉందని’ తెలిపారు. కాగా, జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చే రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ 370ని సోమవారం కొట్టివేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆ రాష్ట్రంలో ఆస్తులను కొనుగోలు చేయకుండా అడ్డుగా ఉన్న ఆర్టికల్ 35ఏ కూడా రద్దయింది. దీంతో ఇప్పటినుంచి ఇతర రాష్ట్రాలవారికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందడమేకాక, అక్కడి ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. ఇంతకు ముందు కశ్మీరీ మహిళ ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ రాష్ట్రంలో ఆస్తిహక్కును కోల్పోయేవారు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో కామెంట్లకు వేదికైంది. -
నా తల్లిని కూడా కలవనివ్వరా?
శ్రీనగర్ : తనని గృహనిర్భందం చేయడం పెద్దగా ఆశ్చర్యానికి గురిచేయలేదని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూతురు సనా ఇల్తిజా జావెద్ వ్యాఖ్యానించారు. తనకు బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధాలు లేకపోయినా అక్రమంగా నిర్భందించారని వాపోయారు. ‘నన్ను మా అమ్మ నుంచి దూరం చేశారు. ఆమె దగ్గరకు వెళ్లనివ్వండని నేను చాలా సార్లు పోలీసులను అభ్యర్థించాను. మా అమ్మను కలవాలనుకున్నా.. వారు అభద్రతకు గురువుతున్నారాంటే ఆశ్చర్యం వేస్తోంది. ఒక తల్లిని కూతురు కలుసుకునే హక్కు కూడా లేదా? వీరు ఇంతలా భయపడుతున్నారంటే దానర్థం ఆర్టికల్ 370ని తొలగించడం రాజ్యాంగ విరుద్దమని భావించారు కనుకనే ఇలా చేస్తున్నారు’ అని వెల్లడించారు. ‘నన్ను కలవడానికి కూడా ఎవ్వరికీ అనుమతి ఇవ్వట్లేదు. నేను ఒక కశ్మీరీని, భారతీయ పౌరురాలుని, అసలు రాజకీయాలే తెలియని ఒక సాధారణ మహిళని, అయినా నన్ను చూసి ఇంతలా ఎందుకు భయపడుతున్నారు. ఏం స్వేచ్ఛగా, స్వతంత్రంగా తిరిగే హక్కులు మాకు లేవా’ అని ప్రశ్నించారు. కశ్మీరీల హక్కులను, గౌరవాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి మేం చేస్తున్న ప్రయత్నాన్ని దేశం లేదా అంతర్జాతీయ సమాజం చూడాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నా తల్లి స్ఫూర్తిని దెబ్బతీయాలని చూస్తోంది. తను వారి మాయలో పడదని, తను చాలా బలమైన మహిళని పేర్కొన్నారు. కాగా ఆగస్టు 4 నుంచి జమ్మూకశ్మీర్‌లో కర్ఫ్యూ విధించి రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలని గృహ నిర్భందంలో ఉంచిన సంగతి తెలిసిందే. -
నిన్న కశ్మీర్.. రేపు మన రాష్ట్రాలకు
సాక్షి ప్రతినిధి, చెన్నై: జమ్మూకశ్మీర్‌పై రెండురోజుల క్రితం కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రేపు తమిళనాడు, పశ్చిమబెంగాల్లో సైతం అమలు చేసినా ఆశ్చర్యం లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. చెన్నై రాయపేట వైఎంసీఏ మైదానంలో బుధవారం రాత్రి జరిగిన డీఎంకే మాజీ అధ్యక్షులు కరుణానిధి తొలి వర్ధంతి సభలో ఆమె తన ప్రసంగాన్ని తమిళంలో ప్రారంభించారు. ఆ తరువాత ఇంగ్లిషులో కొనసాగించారు. కరుణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు ఏడాది క్రితం చెన్నైకి వచ్చాను. కరుణానిధి తమిళ మాతృమూర్తికి పెద్దకుమారుని వంటి వారు. తమిళ రాజకీయాల్లో అగ్రజుడైన కరుణానిధిని ఎవరూ మరువజాలరు. ముఖ్యమంత్రిగా కరుణానిధి సేవలు రాష్ట్రమంతా మార్మోగుతూనే ఉంటాయి. కరుణానిధి ఇంకా మనమధ్యనే ఉన్నారు, ఆయన ఎప్పుడు చెబుతున్నట్లుగా ప్రజల కోసం మనం పాటుపడుతూనే ఉండాలి. స్టాలిన్ అనేది విప్లవాత్మకమైన నామధేయం. పేరుకు తగినట్లుగానే డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మాతృభాష కోసం పోరాటాలకు దిగిన మహామనిషి కరుణానిధి జీవితం ఒక చరిత్ర. తమిళం, బెంగాలీని మనం ఎంతమాత్రం విడిచిపెట్టరాదు. ఎలాంటి పోరాటంలోనైనా విజయాన్ని సాధిద్దాం. ఈ సభలో పాల్గొనాల్సిన కశ్మీర్ రాజకీయ నేతలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. ఇదే పరిస్థితి పశ్చిమబెంగాల్‌కు, తమిళనాడుకు కూడా రావచ్చు. తమిళ ప్రజల ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా బీజేపీ నిరంకుశ ధోరణిలో వ్యహరించినా ఆశ్చర్యం లేదు. అయితే అటువంటి పరిస్థితులే ఎదురైతే ధైర్యంగా ఎదుర్కొందాం. మనం ఏకమై పోరాడి సాధించిన విజయాన్ని ప్రజలకు బహుమతిగా ఇద్దాం. జై పొంగల్, జై తమిళనాడు, జై ద్రావిడం అంటూ ప్రసంగాన్ని ముగించారు. డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ మాట్లాడుతూ, భారతదేశంలోనే కరుణానిధి వంటి నేత లేరని కొనియాడారు. ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే)ను ఐదు దశాబ్దాల పాటు అప్రతిహతంగా నడిపించిన ధీశాలి అని అభివర్ణించారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన కరుణానిధి సేవలు ఈ రాష్ట్రానికి ఇంకా అవసరం ఉందని అన్నారు. సామాజిక న్యాయాన్ని గోతిలో పాతిపెట్టే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అగ్రవర్ణాలకు పదిశాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ స్వేచ్ఛాస్వాతంత్య్రాలను హరించేలా బీజేపీ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. అందుకే పార్లమెంటులో డీఎంకే ఎంపీలు కేంద్రాన్ని వణికిస్తున్నారు, కరుణ ఏమి కోరుకుంటారో అదేవిధంగా వ్యవహరిస్తున్నారని మెచ్చుకున్నారు. సభలో మాట్లాడుతున్న స్టాలిన్ మమత చేతుల మీదుగా కరుణ విగ్రహావిష్కరణ: డీఎంకే మాజీ అధ్యక్షులు దివంగత కరుణానిధి తొలివర్ధంతిని ఆపార్టీ బుధవారం ఘనంగా నిర్వహించింది. డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ నేతృత్వంలో నగరంలో ర్యాలీ, కరుణ విగ్రహావిష్కరణ, బహిరంగసభ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో డీఎంకే నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. బుధవారం ఉదయం స్టాలిన్, లోక్‌సభ సభ్యులు కనిమొళి, దయానిధి మారన్, ఏ రాజా ముందు నడువగా చెన్నై ఆన్నాశాలైలోని అన్నాదురై విగ్రహం నుంచి చెన్నై మెరినాబీచ్ లోని కరుణానిధి సమాధి వరకు ర్యాలీగా సాగారు. అనంతరం కరుణ సమాధికి స్టాలిన్ నివాళులర్పించారు. బుధవారం సాయంత్రం చెన్నైకి చేరుకున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందుగా చెన్నై కోడంబాక్కంలోని మురసొలి పత్రికా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరంపశ్చిమబెంగాల్, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నారాయణస్వామి సైతం స్టాలిన్ వెంటరాగా బుధవారం సాయంత్రం కరుణ సమాధి వద్దకు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడి నుంచి రాయపేటలోకి వైఎంసీఏ మైదానంలో కరుణ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్నారు. డీఎంకే మిత్రపక్ష పార్టీల నేతలు సైతం ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కశ్మీర్ వ్యవహారంలో జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా గృహనిర్బంధంలో ఉన్న కారణంగా కరుణ వర్ధంతి సభకు హాజరుకాలేదు. 10న అఖిలపక్ష సమావేశం: జమ్మూ కశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఈనెల 10న డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ నేతృత్వంలో అఖిలపక్షం సమావేశం కానుంది. ఆరోజు ఉదయం 10 గంటలకు చెన్నైలోని అన్నా అరివాలయంలో సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ కార్యాలయం ప్రకటించింది. -
ఏపీ విభజన ఏకపక్షమే
సాక్షి, న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను ఏకపక్షంగా విభజించిందని, ఏపీ చట్టసభల అభిప్రాయాన్ని పరిగణనలోకితీసుకోలేదని వైఎస్సార్సీపీ ఎంపీలు మండిపడ్డారు. జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ చేసిన ప్రసంగాన్ని వైఎస్సార్సీపీ ఎంపీలు తిప్పికొట్టారు. మనీష్ తివారీ ప్రసంగిస్తూ ఆర్టికల్ 3 అంటే మీకు మీరే చర్చించుకుని వచ్చి ఒక రాష్ట్ర సరిహద్దులు మార్చడమో, రెండుగా విభజించడమో కాదని, శాసనసభ, శాసనమండలిలో చర్చించి వాటి అభిప్రాయం తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంలో వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ లేచి ఆంధ్రప్రదేశ్ చట్టసభల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా యూపీఏ ఏపీని ఏకపక్షంగా విభజించిందని మండిపడ్డారు. దీనిపై మనీష్ తివారీ స్పందిస్తూ ‘విభజన బిల్లు తెచ్చే ముందు అనేక చర్చలు జరిగాయి. ఏపీ చట్టసభల్లోనూ చర్చ జరిగిన తరువాతే తెలంగాణ ఏర్పాటు చేశాం’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీలు అందరూ లేచి ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ చట్టసభల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేశారని గుర్తుచేశారు. అసెంబ్లీ ఆమోదించిందనడం వాస్తవ విరుద్ధం ఆంధ్రప్రదేశ్ విభజనను ఏపీ అసెంబ్లీ సమర్థించిందంటూ ఓ సభ్యుడు మాట్లాడారని, ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ విభజనను ఉమ్మడి శాసనసభ మూడింట రెండొంతుల మెజారిటీతో తిరస్కరించిందని గుర్తుచేశారు. విభజనపై సంప్రదింపులకు జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్‌ను ఏర్పాటుచేసినప్పటికీ నివేదికను తప్పుగా అన్వయించి, రాష్ట్రాన్ని విభజించారని అన్నారు. ఈ విషయంపై తనకు సాధికారత ఉందని, తానే విభజనపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేసినట్టు తెలిపారు. ఇప్పటికీ ఆ కేసు పెండింగ్‌లో ఉందని వివరించారు. -
వీరి భవితవ్యం ఏంటి?
ఒకే దేశం, ఒకే రాజ్యాంగం అన్న సంఘ్‌పరివార్ కల నెరవేరి జమ్ము కశ్మీర్లో సరికొత్త అధ్యాయానికి తెరలేవబోతోంది. రాష్ట్రపతి ఉత్తర్వులతో 370 ఆర్టికల్ రద్దవడంతో పాటు మంచుఖండాన్ని రెండుభాగాలుగా విభజించే బిల్లుకు పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. ఇక జమ్ము కశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు కానుండడంతో అక్కడ రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో అన్న చర్చ మొదలైంది. ప్రధానంగా ఇన్నాళ్లూ కశ్మీర్ లోయను తమ గుప్పిట్లో పెట్టుకొని రాజకీయాలు చేసిన అబ్దుల్లా, ముఫ్తీ వంశాల భవిష్యత్ ఏమిటన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) నాయకురాలు మెహబూబా ముఫ్తీలు ‘ప్రజాస్వామ్యానికే ఇది చీకటి రోజని, రాజ్యాంగానికి తూట్లు పొడిచారు’ అని ఆర్టికల్ 370 రద్దుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నా భవిష్యత్‌లో రాజకీయంగా వారికి ఎలాంటి ఉపయోగం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ రెండు పార్టీలు కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించాయనే విమర్శల్ని ఎదుర్కొంటున్నాయి. గత ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీపైనే పీడీపీ ఆధారపడాల్సి వచ్చింది. జమ్ము, లదాఖ్‌లో ప్రజలు దశాబ్దాల తరబడి హింసాకాండతో విసిగివేసారిపోయారు. శాంతి స్థాపన, అభివృద్ధిని వారు ఆకాంక్షిస్తున్నారు. దీంతో ఎన్సీ, పీడీపీలు రాజకీయాలు కేవలం కశ్మీర్ లోయకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్మూలో సీట్లు పెరిగితే.. కశ్మీర్ లోయతో పోల్చి చూస్తే జమ్మూ అతి పెద్ద ప్రాంతం. జనాభా పరంగా కూడా పెద్దది. కేంద్రం ఇప్పుడు ఈ ప్రాంతాన్ని ఢిల్లీ తరహాలో కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడంతో అసెంబ్లీ సీట్లు కూడా పెరుగుతాయి. జమ్మూ ప్రాంతంలోనే 10–15 సీట్లు పెరిగితే రాజకీయా లు బీజేపీకి అనుకూలంగా మారిపోతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జమ్ము ప్రాంతాన్ని క్లీన్ స్వీప్ చేయాలని వ్యూహాలు పన్నుతున్న కమలనాథులు కశ్మీరీయేతర హిందూ ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని కూడా యోచిస్తున్నారు. పీడీపీ, ఎన్సీ చేతులు కలిపితే... అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాలు తమ ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఆ రెండు పార్టీలు చేతులు కలుపుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోయలో వేర్పాటు వాదులతో చేతులు కలిపి విధ్వంసం సృష్టించడం, బీజేపీని ఎదుర్కోవడానికి కలసికట్టుగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడం వంటి చర్యలు తీసుకోవచ్చు. అయినప్పటికీ ఈ రెండు పార్టీల పాత్ర నామమాత్రంగానే ఉంటుందనే భావన ఉంది. ఎందుకంటే కేంద్రపాలితం కావడంవల్ల శాంతి భద్రతలన్నీ కేంద్రం గుప్పిట్లోనే ఉంటాయి. పాలనలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ జోక్యం ఉంటుంది. దీంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తరహాలో పోరాటం చేయడం మినహా వారికి వేరే మార్గం ఉండదు. -
అధీర్ వ్యాఖ్యలతో ఇరకాటంలో కాంగ్రెస్
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ సభ్యుడు అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలు పెను వివాదానికి దారి తీశాయి. జమ్మూ కశ్మీర్ అంశం అంతర్గత వ్యవహారామా..? లేక ద్వైపాక్షిక అంశమా స్పష్టతివ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘ఇది అంతర్గత వ్యవహారమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 1948 నుంచి కశ్మీర్ పరిణామాలను ఐక్యరాజ్యసమితి పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలో సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్లపై సంతకాలు చేసిన నేపథ్యంలో అది అంతర్గత వ్యవహారం ఎలా అవుతుంది. జమ్మూ కశ్మీర్ ఇప్పటికీ అంతర్గత వ్యవహారమనే మీరు(బీజేపీ) చెబుతారా..? అన్నది మా పార్టీ తెలుసుకోవాలనుకుంటోంది’అని రంజన్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నియమ, నిబంధనలను పక్కనపడేసి జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాలని నిర్ణయం తీసుకుందని రంజన్ మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్ అంతర్గత వ్యవహారం కాదనేలా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టాయి. ఈ వ్యాఖ్యలపై అధికారపక్షం తీవ్రస్థాయిలో కాంగ్రెస్‌పై విరుచుకుపడింది. కశ్మీర్ అంశంలో కాంగ్రెస్ వైఖరిని స్పష్టం చేయాలంటూ హోంమంత్రి అమిత్ షా నిలదీశారు. జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా భారత్‌లో భాగమేనని అమిత్ షా బదులిచ్చారు. కశ్మీర్ లోయలో ఐరాస జోక్యాన్ని కాంగ్రెస్ ఆశిస్తోందా అని నిలదీశారు. కశ్మీర్‌పై కాంగ్రెస్ వైఖరి స్పష్టం చేయాలన్నారు. సోనియా, రాహుల్ ఆగ్రహం.. కశ్మీర్‌పై కాంగ్రెస్ సభ్యుడు అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై ఆపార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్ అంతర్గత వ్యవహారామా..? కాదా..? అన్నది స్పష్టతివ్వాలని రంజన్ ప్రశ్నించిన సమయంలో సోనియా గాంధీ ఆయనకు కుడి వైపున కూర్చొని ఉన్నారు. ఈ వ్యాఖ్యలతో షాక్ తిన్న ఆమె.. ఒక్కసారిగా రాహుల్ గాంధీ వైపు చూశారు. రంజన్ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ సైతం చేసేదేమీ లేక తల అడ్డంగా ఊపుతూ కూర్చున్నారు. ఈ వ్యాఖ్యలను సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా రంజన్ మరోసారి మాట్లాడుతూ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ఇది అందరికీ ప్రాథమికంగా వచ్చే ప్రశ్నే అని, తనను తప్పుగా అనుకోవద్దని తెలిపారు. అయితే ఈ సమయంలో సోనియా గాంధీ అసహనంగా కనిపించారు. -
ఇది గొప్ప సందర్భం: మోదీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లులను పార్లమెంట్ ఆమోదించడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో గొప్ప సందర్భమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కొందరి స్వార్థపూరిత సంకెళ్లలో నలిగిన అక్కడి ప్రజలకు స్వేచ్ఛ లభించిందని, వారు గొప్ప శుభోదయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. జమ్మూకశ్మీర్, లదాఖ్‌లకు సంబంధించిన బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించడం ద్వారా సర్దార్ పటేల్‌కు నివాళులర్పించినట్లయిందన్నారు. ఆయనతోపాటు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, డాక్టర్ఎస్పీ ముఖర్జీ లాంటి వారు అఖండ భారతం కోసం తపించారని తెలిపారు. ‘మనమంతా ఎప్పటికీ కలిసికట్టుగా ఉండి 130 కోట్ల మంది భారతీయుల కలలను సాకారం చేద్దాం. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి మూడు బిల్లులను ఆమోదించిన ఈ రోజు మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చరిత్రాత్మకమైన రోజు’అని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఏనాడూ పనిచేయని కొందరు స్వార్థ పూరిత శక్తుల భావోద్వేగ బ్లాక్ మెయిల్ నుంచి కశ్మీర్ ప్రజలకు విముక్తి లభించిన రోజు. కొత్త శుభోదయం, మరింత మెరుగైన రేపటి కోసం ఎదురుచూస్తోంది’అని పేర్కొన్నారు. ‘ధైర్యం, సహనం ప్రదర్శించిన జమ్మూకశ్మీర్, లదాఖ్ ప్రాంతాల సోదరి సోదరీమణులు నా సెల్యూట్’అని తెలిపారు. పార్లమెంట్ ఆమోదించిన మూడు బిల్లులు ఈ ప్రాంతాల ప్రజల అభివృద్ధికి ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న చిరకాల కోరిక నెరవేరిన లదాఖ్ ప్రజలకు నా ప్రత్యేక అభినందనలు అని తెలిపారు. విభేదాలను మరిచి అన్ని ప్రాంతాల అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని జమ్మూకశ్మీర్ లదాఖ్ ప్రాంతాల ఎంపీలను కోరారు. హోం మంత్రి అమిత్ షా చేసిన కృషిని, చూపిన చిత్తశుద్ధిని మోదీ ప్రశంసించారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభలను నడిపించిన తీరును మోదీ కొనియాడారు. లదాఖ్ ఎంపీకి ప్రధాని ప్రత్యేక ప్రశంస బీజేపీకి చెందిన లడాఖ్ ఎంపీ జమ్యంగ్ త్సెరింగ్ నమగ్యాన్ను ప్రధాని మోదీ అభినందించారు. జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతి పత్తి రద్దుతోపాటు లదాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చ సందర్భంగా ఎంపీ త్సెరింగ్ ప్రసంగించారు. ‘లదాఖ్ ప్రాంతం వెనుకబడి ఉందంటే అందుకు కారణం ఆర్టికల్ 370, కాంగ్రెస్ పార్టీయే కారణం. ఆర్టికల్–370 రద్దు ద్వారా భారత ప్రథమ ప్రధాని నెహ్రూ పాల్పడిన తప్పిదాలను ప్రభుత్వం సరిచేసింది’అని పేర్కొన్నారు. ‘లదాఖ్‌ను కశ్మీర్లో విలీనం చేయాలంటూ 1948లో లదాఖ్ బుద్ధిస్ట్ అసోసియేషన్ నెహ్రూకు లేఖ రాసింది. కానీ, నెహ్రూ మా వినతిని అంగీకరించలేదు. తాజా నిర్ణయంతో కశ్మీర్ భవిష్యత్ ఉజ్వలంగా ఉండబోతోంది. జమ్మూకశ్మీర్ మొత్తం తమ ఆస్తిగానే భావించిన రెండు ప్రముఖ రాజకీయ కుటుంబాలకు మాత్రం పనిలేకుండా పోతుంది’అని అన్నా రు. అయితే, జమ్మూ కశ్మీర్ ప్రాంతాలకు కేంద్రం నుంచి నేరుగా నిధులు అందుతాయి కానీ, లదాఖ్‌కు అటువంటి అవకాశం లేదన్నారు. లదాఖ్ ప్రజలు ఇకపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేస్తారన్నారు. -
పీవోకే మనదే..!
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), చైనా ఆక్రమణలో ఉన్న ఆక్సాయ్‌చిన్‌లు కూడా భారత్‌లో అంతర్భాగమేనని హోం మంత్రి అమిత్ షా మంగళవారం లోక్‌సభలో చెప్పారు. కశ్మీర్లో శాంతి కోసం తమ ప్రభుత్వం ప్రజలతో చర్చిస్తుందనీ, అంతేకానీ వేర్పాటువాద సంస్థ అయిన హురియత్ కాన్ఫరెన్స్‌తో చర్చలేమీ ఉండవని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్‌ను పాకిస్తాన్ ఆక్రమించినప్పుడు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోకుండా, నాడే భారత సైనికులకు స్వేచ్ఛ ఇచ్చి ఉంటే ఈరోజు పీవోకే కూడా సంపూర్ణంగా భారత్‌లో అంతర్భాగంగా ఉండేదని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించేందుకు రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేసే తీర్మానాన్ని, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టే బిల్లును ఆయన మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టగా, సభ ఆమోదం తెలిపింది. బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు, ఆ తర్వాత చర్చ సమయంలోనూ అమిత్ షా ఎంతో ఆవేశంగా, ఉద్వేగంతో సుదీర్ఘ సమయంపాటు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతుండగా, ప్రతిపక్షాలు వాగ్వాదానికి దిగగా, గట్టిగా బదులిచ్చారు. కాగా, తీర్మానం, బిల్లు రాజ్యసభలో సోమవారమే పాస్ అవ్వడంతో వీటికి సోమవారం పార్లమెంటు ఆమోదం లభించనట్లైంది. చర్చ అనంతరం తీర్మానం ఆమోదంపై ఓటింగ్ నిర్వహించగా, అనుకూలంగా 351 ఓట్లు, వ్యతిరేకంగా 72 ఓట్లు పడ్డాయి. ఒక సభ్యుడు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అలాగే జమ్మూ కశ్మీర్‌ను విడగొట్టి, లదాఖ్‌ను అసెంబ్లీ రహిత కేంద్ర పాలిత ప్రాంతంగా, జమ్మూ కశ్మీర్‌ను అసెంబ్లీ సహిత కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు తీసుకొచ్చిన ‘జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2019’పై కూడా ఓటింగ్ నిర్వహించగా, 370 ఓట్లు అనుకూలంగా, 70 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల బిల్లును మాత్రం లోక్‌సభ నుంచి అమిత్ షా వెనక్కు తీసుకుంటూ, ఈ రిజర్వేషన్లు కేంద్రపాలిత ప్రాంతాల్లో వాటంతట అవే అమలవుతాయని అన్నారు. రాజ్యసభ నుంచి కూడా బిల్లును వెనక్కు తీసుకుంటామన్నారు. తీర్మానం, బిల్లును లోక్‌సభ ఆమోదించిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా సభలోనే ఉన్నారు. బిల్లుపై ఓటింగ్ జరపడానికి కొద్దిసేపటి ముందు.. ములాయం సింగ్ యాదవ్ మినహా మిగిలిన ఎస్పీ సభ్యులు, ఎన్సీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్‌తోపాటు ఎన్డీయేలో భాగమైన జేడీ(యూ)కూడా సభ నుంచి బయటకు వెళ్లిపోయింది. కొందరు కాంగ్రెస్ సభ్యులతోపాటు మజ్లిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఓటింగ్‌కు పట్టుబట్టారు. దీంతో సభలో ఓటింగ్ నిర్వహించగా, వైఎస్సార్ కాంగ్రెస్, బీజేడీ, టీఆర్ఎస్, బీఎస్పీ, అన్నా డీఎంకే తదితర పార్టీలు అనుకూలంగా ఓటు వేశాయి. తీర్మానం, బిల్లు ఆమోదం పొందిన అనంతరం లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అమిత్ షా ప్రసంగం వివరాలు.. పీవోకే, ఆక్సాయ్‌చిన్‌లు భారత్‌లో భాగమే.. ‘పీవోకే, ఆక్సాయ్‌చిన్‌లు భారత్‌లో అంతర్భాగమే. అందులో ఏ సందేహమూ లేదు. నేను జమ్మూ కశ్మీర్ అని పలుకుతున్నానంటే అందులో పాక్ ఆక్రమిత కశ్మీర్, చైనా ఆక్రమిత ఆక్సాయ్‌చిన్‌లు కూడా కలిసి ఉన్నట్లే లెక్క. ఆ భూభాగాల కోసం తమ ప్రాణాలైనా అర్పించేందుకైనా మేం సిద్ధంగా ఉన్నాం. ఆక్సాయ్చిన్తో కూడిన లదాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. అలాగే అక్కడి రెండు స్వతంత్ర పాలక మండళ్లు కూడా కొనసాగుతాయి.’ పాక్ నిబంధనలు ఉల్లంఘించడంతో భారత్‌కు పూర్తి హక్కులు ఐక్యరాజ్య సమితి (ఐరాస) నియమాలను పాక్ ఉల్లంఘించినందున జమ్మూ కశ్మీర్‌పై ఏ నిర్ణయమైనా తీసుకునే పూర్తి హక్కులు భారత్‌కు ఉన్నాయి. ఐరాస నియమాలను 1965లోనే పాకిస్తాన్ ఉల్లంఘించి దురాక్రమణకు పాల్పడింది. దీంతో ప్రజాభిప్రాయ సేకరణ అంశం ముగిసింది. ఐరాస నిబంధనల ప్రకారం ఒక దేశ బలగాలు మరో దేశ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసేలా ప్రవర్తించకూడదు. 1965లో పాకిస్తాన్ ఎప్పుడైతే నిబంధనలను ఉల్లంఘించి, దురాక్రమణకు పాల్పడిందో అప్పుడే అక్కడ ప్రజాభిప్రాయమన్న అంశం ముగిసింది. కాబట్టి ప్రాదేశిక సమగ్రతపై ఏ నిర్ణయమైనా తీసుకునే పూర్తి హక్కులు భారత్‌కు ఉన్నాయి. ఈ విషయాన్ని ఐరాస కూడా ఒప్పుకుంది. నాడు సైనికులకు స్వేచ్ఛ ఉంటే ఇప్పుడు పీవోకే మనదే కశ్మీర్ అంశాన్ని ఐరాస వరకు తీసుకెళ్లింది ఎవరు? ఏకపక్షంగా 1948లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని తెచ్చింది ఎవరు? ఇదంతా తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూయే చేశారు. సైనికులకు ఆనాడే స్వేచ్ఛ ఇచ్చి ఉంటే ఇప్పుడు పీవోకే భారత్‌లో అంతర్భాగంగా ఉండేది. మేం చేస్తున్నది చారిత్రక తప్పిదం కాదు. చారిత్రక తప్పిదాన్నే మేం సరిచేస్తున్నాం. 1989 నుంచి జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం కారణంగా 41,500 మంది మరణించారు. దీనికి కారణం ఆర్టికల్ 370, 35–ఏలే. ప్రజలతో చర్చిస్తాం.. వేర్పాటువాదులతో కాదు కశ్మీర్లో వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్‌తో చర్చలేమీ ఉండవు. కానీ కశ్మీర్ ప్రజలతో మాట్లాడేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. జమ్మూ కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత మళ్లీ పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం ఏ మాత్రం సంకోచించదు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను కూడా భారత్‌లో అంతర్భాగంగానే భావిస్తాం. పార్లమెంటు అధికారాన్నే కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది బిల్లులకు అసలు న్యాయబద్ధత ఎక్కడుందని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధురీ ప్రశ్నించారు. ‘ఇది దేశ అంతర్గత అంశమని మీరు చెబుతారు. కానీ 1948 నుంచి కశ్మీర్లో పరిస్థితిని ఐక్యరాజ్యసమితి పరిశీలిస్తోంది. సిమ్లా ఒప్పందం, లాహోర్ ఒప్పందాలూ ఉన్నాయి. అప్పుడు ఇది ద్వైపాక్షిక అంశమో లేక అంతర్గత అంశమో స్పష్టత ఇవ్వాలని నేను కోరుతున్నాను’ అని చౌధురీ అన్నారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ ‘కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంలో పార్లమెంటుకు అధికారాన్నే ఆయన ప్రశ్నిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన దేశభక్తులు ఈ ప్రశ్న వింటే తీవ్రంగా కలత చెందేవారు. హోం మంత్రి ఎందుకంత కోపంగా ఉన్నారని విపక్ష సభ్యులు ప్రశ్నిస్తున్నారు. పీవోకే భారత్‌లో భాగం కాదని మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను కోపంగా ఉన్నాను’ అని బదులిచ్చారు. 370 రద్దుపై భాగస్వామ్య పక్షాలను కేంద్రం సంప్రదించలేదని ప్రతిపక్ష పార్టీలు నిందించాయి. ఏకపక్షంగా తీసుకున్నారని మండిపడ్డాయి. తృణమూల్ కాంగ్రెస్ వాకౌట్ చేసింది. నినాదాల హోరు జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందగానే లోక్‌సభలో బీజేపీ సభ్యులు ఆనందోత్సాహాలతో పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. ‘భారత్ మాతా కీ జై, ‘వందేమాతరం’, ‘జహాః హుయే బలిదాన్ ముఖర్జీ కా, వో కశ్మీర్ హమారా హై’.. అనే నినాదాలతో హోరెత్తించారు. చర్చకు అమిత్ షా సమాధానమిస్తున్నప్పుడు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. వారితో ప్రధాని మోదీ కూడా జతకలిశారు. షా సమాధానమివ్వడానికి కొద్ది సేపు ముందే సభలోకి మోదీ వచ్చారు. ఆ సమయంలో బీజేపీ సభ్యులు గట్టిగా హర్షధ్వానాలు చేస్తూ ఆయనను స్వాగతించారు. లోక్‌సభ వాయిదా అనంతరం ప్రధాని మోదీ విపక్ష సభ్యుల స్థానాల వద్దకు వెళ్లారు. బ్లాక్‌డే.. ఆనాడే: అమిత్ మనీష్ తివారీ వ్యాఖ్యలకు అమిత్ షా సమాధానమిస్తూ, ఆంధ్రప్రదేశ్ విషయంలో చాలా చర్చ చేశామని ఆయన చెప్పారు. అయితే ఏం చర్చ చేశారో చెప్పాలి. రాష్ట్ర విభజనకు ఒక తీర్మానం పంపితే ఆంధ్రప్రదేశ్ శాసనసభ మూడింట రెండొంతుల మెజారిటీతో తిరస్కరించింది. శాసన మండలి కూడా తిరస్కరించింది. ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేశారు. అయినా వారు ఆంధ్రప్రదేశ్‌ను విభజించారు. ఇంక చర్చ ఏం చేశారు? మా పార్టీ విభజనకు మద్దతు ఇచ్చిందా లేదా అన్నది ఇక్కడ విషయం కాదు. నేను విభజన గురించి మాట్లాడడం లేదు. అది మంచిదా కాదా అనే విషయంపై నేను చర్చించడం లేదు. విభజన ప్రక్రియ తీరును మీరు ఇప్పుడు ప్రస్తావించడంతో నేను దానిపై మాట్లాడుతున్నా. అసెంబ్లీ, శాసనమండలితో చర్చించాలని అంటున్నారు. ఏపీ అసెంబ్లీ, మండలి విభజన వద్దన్నాయి. మీరెందుకు ఏపీని విభజించారు? మీరు చేసి మమ్మల్ని ఎందుకు వద్దంటున్నారో చెప్పండి. మేం ఇంత ప్రశాంతంగా చర్చిస్తున్నాం. కానీ మీరు చేసిన ప్రక్రియ బాగుందని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారా? వ్యతిరేకంగా ఉన్న సభ్యులను మార్షల్స్‌తో బయటకు లాగేశారు. పార్లమెంటు తలుపులు మూశారు. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి ఏపీని విభజించారు. బ్లాక్ డే ఈరోజు కాదు.. ఆనాడే. నేను ఇక్కడ ఒక్కటి స్పష్టం చేయదలుచుకున్నా. నేను విభజన గురించి మాట్లాడడం లేదు. విభజన ప్రక్రియకు మీరు అనుసరించిన తీరుపై మాట్లాడుతున్నా. విభజన తీరును మనీష్ తివారీ ప్రస్తావించడంతో నేను ఏపీ విషయాన్ని లేవనెత్తాను. -
కాంగ్రెస్‌లో కల్లోలం
న్యూఢిల్లీ: కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో కల్లోలం రేపుతోంది. దేశవ్యాప్తంగా అనేక మంది కాంగ్రెస్ నేతలు ఆర్టికల్ 370 రద్దుతోపాటు కశ్మీర్ పునర్విభజన నిర్ణయాలను స్వాగతిస్తున్నారు. అయితే ఈ నిర్ణయాలను రాజ్యసభ, లోక్‌సభల్లో కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ చాలామంది కాంగ్రెస్ నేతలు సమర్థిస్తుండటంతో ఆ పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారైంది. చారిత్రాత్మక తప్పిదాన్ని సరిచేశారు.. కొంత ఆలస్యమైనప్పటికీ చారిత్రాత్మక తప్పిదం ఎట్టకేలకు సరిచేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జనార్దన్ ద్వివేది అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల్లో ఎక్కువ మంది ఆర్టికల్ 370 ఉండాలని కోరుకోలేదని, తన రాజకీయ గురువైన రామ్ మనోహర్ లోహియా 370కి వ్యతిరేకంగా ఉండటమే దీనికి నిదర్శనమని ద్వివేది వ్యాఖ్యానించారు. దేశ సమగ్రత కోసం తీసుకున్న నిర్ణయమే ఆర్టికల్ 370 రద్దు అని కాంగ్రెస్ మాజీ ఎంపీ దిపేందర్ హుడా అభివర్ణించారు. 21వ శతాబ్దంలో ఆర్టికల్ 370 వంటి వాటికి చోటు లేదని, దీన్ని ఎప్పటికైనా రద్దు చేయాలని తాను భావిస్తూ ఉండేవాడని హుడా అన్నారు. శాంతియుతంగా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. నా వల్ల కాదు.. కశ్మీర్ పట్ల కాంగ్రెస్ పార్టీ తీసుకున్న వైఖరిని విభేదిస్తూ రాజ్యసభలో ఆ పార్టీ చీఫ్ విప్‌గా ఉన్న భువనేశ్వర్ కలితా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు బిల్లుని వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు వ్యవహరించేలా విప్ జారీ చేయాలని ఆ పార్టీ ఆయనను కోరగా.. దేశ ప్రజల మనోగతానికి భిన్నంగా తాను వ్యవహరించలేనంటూ పార్టీని వీడారు. సింధియా కూడా సపోర్ట్.. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్న కాంగ్రెస్ నేతల జాబితాలో ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా చేరారు. జమ్మూ కశ్మీర్‌పై ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని ఆయన అన్నారు. అలాంటివారు పార్టీలో ఉండొద్దు.. ఆర్టికల్ 370 రద్దుకు కాంగ్రెస్ నేతల నుంచి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్పందించారు. జమ్మూ కశ్మీర్ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలియకుండా వాళ్లంతా మాట్లాడుతున్నారని, అలాంటి వారు పార్టీలో ఉండొద్దని స్పష్టం చేశారు. భద్రతాపరమైన సమస్య లొస్తాయి: రాహుల్ న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌ను రెండు ముక్కలుగా చీల్చేందుకు కేంద్ర ప్రభుత్వం తనకున్న కార్యనిర్వహణాధికారాలను దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ ఆరోపించారు. ‘కేంద్రం నిర్ణయంతో దేశ భద్రత విషయంలో క్లిష్టమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. కశ్మీర్లో రాజకీయ పార్టీల నేతలను రహస్య ప్రదేశాల్లో నిర్బంధించారు’అని ట్వీట్‌చేశారు. ‘ఇప్పుడు కశ్మీర్లో నాయకత్వ శూన్యత వల్ల ఉగ్రవాదులే నాయకులవుతారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, నాయకులను జైళ్లలో పెట్టి, ఏకపక్షంగా జమ్మూ కశ్మీర్‌ను చీలిస్తే దేశ సమగ్రత మరింత బలపడదు. భారత దేశం అంటే పౌరులే తప్ప భూభాగాలు కాదు’అని రాహుల్ వ్యాఖ్యానించారు. -
‘పుల్వామా’తరహా దాడి జరగొచ్చు
ఇస్లామాబాద్: కశ్మీర్‌కు స్వతంత్రప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో పుల్వామా తరహా దాడి జరగొచ్చంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యానించారు. కశ్మీర్ పరిణామాలపై చర్చించేందుకు మంగళవారం సమావేశమైన పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘పుల్వామా తరహా దాడి జరిగేందుకు అవకాశం ఉంది. వాళ్లు(భారత్) నింద మనపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్లు మళ్లీ మనపై దాడి చేయవచ్చు. అయితే, మనం తిప్పి కొడతాం. అప్పుడు ఏం జరుగుతుంది? ఎవరు గెలుస్తారు? ఎవరూ గెలవలేరు. ఆ తీవ్ర ప్రభావం మాత్రం అంతర్జాతీయంగా ఉంటుంది. ఇది అణ్వస్త్ర దేశం బెదిరింపు కాదు’అని ఇమ్రాన్ అన్నారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. కశ్మీరీలు నిరసనలు తెలిపితే భారత్ వారిని అణచివేయవచ్చు. కశ్మీర్ పరిస్థితులను గమనిస్తూ ఉండాలి’అని ఆయన అంతర్జాలతీయ సమాజాన్ని కోరారు. కశ్మీరీలకు అవసరమైన ఎలాంటి సాయం చేసేందుకయినా తమ సైన్యం సిద్ధంగా ఉందని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వా తెలిపారు. ఈ బాధ్యతను నెరవేర్చేందుకు ఎంతదాకైనా వెళ్లేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’అని జనరల్ బజ్వా పేర్కొన్నారు. కశ్మీర్ ప్రత్యేకప్రతిపత్తిని రద్దు చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోందని హెచ్చరిస్తూ పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి గత వారమే ఐరాసకు లేఖ రాశారు. -
మేం పోరాడతాం కోర్టుకు వెళ్తాం
శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌ను విభజించడం అంటే శరీరాన్ని ముక్కలుగా కోసేసినట్లుగా తనకు అనిపిస్తోందని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫారూఖ్ అబ్దుల్లా తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై తాము పోరాడతామనీ, కోర్టుకు వెళ్తామని ఆయన చెప్పారు. జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం అయిన ఫారూఖ్.. 370వ అధికరణం రద్దయిన తర్వాత తొలిసారిగా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికిలోనై కన్నీరు పెట్టుకున్నారు. కేంద్రం ప్రజాస్వామిక అధికారాలతో కాకుండా నియంతృత్వ అధికారంతో జమ్మూ కశ్మీర్‌ను రెండు ముక్కలు చేసిందనీ, పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను తొలగించిందని ఫారూఖ్ మండిపడ్డారు. ‘ద్వారాలు తెరుచుకున్న వెంటనే మా ప్రజలు బయటకు వస్తారు. మేం పోరాడుతాం. కోర్టుకు వెళ్తాం. మేం తుపాకులు పట్టుకుని తిరగలేదు. గ్రెనేడ్లు, రాళ్లు విసరలేదు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడాన్ని మేం నమ్ముతాం. వాళ్లు మమ్మల్ని హత్య చేయాలనుకుంటున్నారు. మేం సిద్ధం. నా ఛాతీ సిద్ధంగా ఉంది. ఛాతీపై కాల్చండి. వెనుక కాదు’అంటూ ఫారూఖ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌ను విభజించిందనీ, ఇక ఇప్పుడు ప్రజల మనసులను కూడా విడగొడతారా అని ఉద్వేగంతో ప్రశ్నించారు. సభలోనే అబద్ధం చెప్పడం విచారకరం.. ‘నన్ను గృహనిర్బంధంలో ఉంచలేదని హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులోనే అబద్ధం చెబుతున్నారు. నా ఇష్టంతోనే నేను ఇంట్లో నుంచి బయటకు రాలేదని ఆయన అంటున్నారు. కానీ మా ఇంటి ముందు ఓ డీఎస్పీని మోహరించారు. నన్ను బయటకు వెళ్లనివ్వలేదు. ఎవ్వరినీ లోపలకు రానివ్వలేదు. ఇప్పుడు మీడియాతో మాట్లాడటానికి బయటకు వచ్చేందుకు కూడా నేను చాలా కష్టపడ్డాను. సభలోనే హోం మంత్రి ఇలా అబద్ధాలు చెప్పడం విచారకరం’అని ఫారూఖ్ వివరించారు. శ్రీనగర్ ఎంపీ అయిన ఫారూఖ్ మంగళవారం లోక్‌సభలో లేకపోవడంతో ఆయనను అరెస్ట్ చేశారా లేక గృహనిర్బంధంలో ఉంచారా? అని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ప్రశ్నించగా, అమిత్ షా సమాధానమిస్తూ ‘ఆయనను అరెస్టు చేయలేదు. గృహ నిర్బంధంలో ఉంచలేదు. ఆయన తన ఇష్టం మేరకు ఇంట్లోనే ఉన్నారు’అని బదులిచ్చారు. మరి ఫారూఖ్‌కు ఆరోగ్యమేమైనా బాగాలేదా అని సుప్రియ ప్రశ్నించగా, ‘అది వైద్యులే చెప్పాలి. నేను వైద్యం చేయలేను’అని వ్యంగ్యంగా సమాధానం చెప్పారు. కాగా, ఫారూఖ్ మాట్లాడుతూ ‘వాళ్లు (ప్రభుత్వం) ప్రాంతాలను విడదీశారు. ఇప్పుడు ప్రజల మనసులను కూడా విడగొడతారా? హిందూ, ముస్లింలను విడదీస్తారా? నా భారతదేశం లౌకికవాదాన్ని, ఐక్యతను నమ్మే ప్రతీ ఒక్కరిదీ అని నేను భావించాను.70 ఏళ్లుగా మేం యుద్ధంలో పోరాడాం. కానీ ఇప్పుడు దోషులమవుతున్నాం’అని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆర్టికల్ 370 రద్దు : సుప్రీంకోర్టులో పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ, ఆర్టికల్ 370 రద్దుపై రాష్ట్రపతి ఉత్తర్వులను సవాలు చేస్తూ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయవాది ఎంఎల్ శర్మ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆర్టికల్ 370 రద్దు అంశంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం జారీచేసిన ఉత్తర్వులను ఎంఎల్శర్మ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా ఈ ఉత్తర్వులు ఉన్నాయని పిటిషన్లో ఆయన ఆరోపించారు. రాష్ట్ర అసెంబ్లీ సమ్మతిని తీసుకోకుండా రాష్ట్రపతి ఆమోదించడం చట్టవిరుద్ధమని ఎం ఎల్ శర్మ వాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆర్టికల్ 370రద్దుపై మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత ఫరూఖ్ అబ్దుల్లా మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్య అప్రజాస్వామికమని మండిపడ్డారు. తనును గృహనిర్బంధంలో ఉంచి, లోక్‌సభలో హోంమంత్రి అమిత్‌షా అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. తన పరిస్థితే ఇలా వుంటే.. ఇక సామాన్యుడి పరిస్థితిని ఏమిటని ప్రశ్నించారు. తాన నమ్మిన భారత దేశం ఇది కాదంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి కష్ట కాలంలో దేశ ప్రజలు కశ్మీర్ ప్రజలకు అండగా నిలవాలంటూ కంటతడి పెట్టారు. -
సంచలన నిర్ణయం..ఆర్టికల్ 370 రద్దు
-
కల నెరవేరింది!
జమ్మూకశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు ద్వారా పార్టీ సిద్ధాంతకర్త శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాన్ని బీజేపీ నెరవేర్చింది. ‘ఒకే దేశానికి రెండు రాజ్యాంగాలు ఉండవు. ఇద్దరు ప్రధానులు ఉండరు. రెండు జాతీయ చిహ్నాలు ఉండవు’అంటూ ఆయన 1950లలోనే నెహ్రూ ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కశ్మీర్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో ఆయన్ను 1953 మే 11వ తేదీన అరెస్టు చేశారు. అప్పట్లో ఆ కశ్మీర్లోకి ప్రవేశించాలంటే భారతీయులు గుర్తింపుకార్డు చూపించాల్సి ఉండేది. శ్రీనగర్‌లో జైల్లోనే ఆయన అదే ఏడాది జూన్ 23వ తేదీన అనుమానాస్పద రీతితో కన్నుమూశారు. కలకత్తా వర్సిటీకి పిన్నవయస్సులోనే వీసీ అయిన డాక్టర్ ముఖర్జీ 1929లో భారత జాతీయ కాంగ్రెస్ తరఫున బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. నెహ్రూ తొలి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ఆయన కాంగ్రెస్‌ను వదిలి, భారతీయ జన్‌సంఘ్‌ను 1951లో స్థాపించారు. ఇదే బీజేపీకి మాతృసంస్థ. 1952 జూన్ 26వ తేదీన పార్లమెంట్లో ప్రసంగించిన ముఖర్జీ.. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడంపై నెహ్రూను గట్టిగా నిలదీశారు. ఇలాంటి విధానాలు దేశాన్ని ముక్కలుగా చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖర్జీ మరణాన్ని బీజేపీ మరి చిపోలేకపోయింది. 2004లో మాజీ ప్రధాని వాజ్‌పేయి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. శ్యామా ప్రసాద్ ముఖర్జీ కశ్మీర్లోకి ప్రవేశించటానికి ముందుగా పంజాబ్‌లోనే పోలీసులు అరెస్టు చేశారని భావించాం. కానీ, అలా జరగలేదు. కశ్మీర్ ప్రభుత్వం, నెహ్రూ కుట్రపన్ని కశ్మీర్లోకి అనుమతించిన ముఖర్జీని, తిరిగి వెళ్లకుండా చేశారు. జమ్మూకశ్మీర్‌లోని షేక్ అబ్దుల్లా ప్రభుత్వం ఈ కుట్రను అమలు చేసింది’అని పేర్కొనడం గమనార్హం.