![Viral Video: Woman Attempts Suicide By Jumping Into Jhelum River, Gets Saved By Police - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/1/women.gif.webp?itok=1NFWKL9l)
శ్రీనగర్: గుర్తుతెలియని ఒక మహిళ జీలం నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలను కుంది. అయితే, పోలీసులు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమె ప్రాణాలను కాపాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. ఈ సంఘటన శ్రీనగర్‌లోని జీలం నది వద్ద సోమవారం చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఒక మహిళ జీలంనది ఉన్న బుద్షా వంతెన వద్దకు చేరుకుంది.
ఈ క్రమంలో వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి నదిలో దూకడానికి ప్రయత్నించింది. అయితే, అక్కడ గస్తీలో ఉన్న జమ్ముకశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) పోలీసులు ఆమెను పక్కకు లాగి, ఆమె ప్రాణాలను కాపాడారు. అయితే, కరోనా, లాక్డౌన్ కారణంగా పనిదొరక్క కుటుంబ సమస్యలు మొదలయ్యాయి. ఈ క్రమంలో, ఆర్థికంగా కూడా ఎంతో కృంగిపోయిన ఆమె చివరకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆమెకు నిపుణులతో సరైన కౌన్సిలింగ్ ఇప్పిస్తామని కశ్మీర్ పోలీసు అధికారులు పేర్కొన్నారు. అయితే, సదరు మహిళ ప్రాణాలను కాపాడిన వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు పోలీసు అధికారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు. ‘ మీరు చేసిన గొప్ప పనికి హ్యట్సాఫ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment