sucide attempt
-
బిల్లులు చెల్లిస్తారాలేక.. వాట్సప్ గ్రూపుల్లో వాయిస్‌మెసేజ్
కామారెడ్డి: సీఎం కేసీఆర్ సార్ గ్రామంలో అభివృద్ధి పనులు చేసి అప్పుల పాలయ్యాను.. బిల్లులు చెల్లి స్తారా లేదా ఆత్మహత్య చేసుకొని చావమంటారా అంటూ బీఆర్ఎస్కు చెందిన ఉపసర్పంచ్ చేసిన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మండలంలోని బీబీపేటకు చెందిన సాయినాథ్ గత ఎన్నికల్లో 13వ వార్డు మెంబర్‌గా గెలిచి ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. నాటి నుంచి ఉమ్మడి మండలంలో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టాడు. సుమారు రూ. 1.50 లక్షల వరకు నిధులు ప్రభు త్వం నుంచి రావాల్సి ఉందన్నారు. దీంతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిన సాయినాథ్ వాట్సప్‌లో తన వాయిస్ ద్వారా 15వ ఆర్థిక సంఘం నిధు లు రావడం లేదని, ఎన్నికల కోడ్ వస్తే నిధులు వి డుదల కావని పేర్కొన్నారు. తన చావుతో అయినా జీపీ వ్యవస్థను ఆదుకోవాలంటు ఆదుకోవాలంటు వాట్సప్ గ్రూపుల్లో వాయిస్‌మెసేజ్ చేశాడు. దీంతో పోలీసులు సాయినాథ్ నంబర్ ట్రేస్చేసి హైదరాబా ద్లో పట్టుకొన్నారు. అతని మిత్రులకు గ్రామానికి తీసుకురావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
అస్తమాను ఫోన్ తోనే.. తండ్రి తిట్టారని 90 అడుగుల ఎత్తు నుండి
రాంచీ: భారత నయాగరాగా పిలవబడే చిత్రకూట్ జలపాతంలోకి దూకి ఒక యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు సమాయానికి స్పందించబట్టి ఆ యువతి 90 అడుగుల ఎత్తు నుండి దూకినా కాపాడగలిగారు. ఎటొచ్చి ఆమే ఎందుకు చనిపోవాలనుకుందో కారణం తెలిసిన తర్వాత ఎవ్వరికీ నోట మాట రాలేదు. తన కోపమే తనకి శత్రువు అంటారు. అలాంటి కోపమే ఓ యువతి ప్రాణాలను యమలోకం అంచు వరకు తీసుకెళ్ళింది. పిల్లలు తప్పు చేస్తే తల్లదండ్రులు మందలించడం సర్వసాధారణమే. పిల్లలు అందుకు బదులుగా కోపగించడం కూడా సహజమే. రెండు మూడు రోజులు ఈ పరిస్థితి ఉంటుంది. తర్వాత అంతా మామూలే.. ఎక్కడో కొంతమంది మాత్రమే తల్లదండ్రులు తిట్టారని అజ్ఞానంతో వ్యవహరిస్తూ ఉంటారు. అచ్చంగా అలాంటి పిచ్చి పనే చేసింది చిత్రకూట్ కు చెందిన సరస్వతి మౌర్య(21). నిత్యం సెల్ ఫోన్లో ఎదో ఒకటి చూసుకుంటూ కాలక్షేపం చేస్తోందన్న కారణంతో ఆమె తండ్రి శాంటో మౌర్య ఆమెను పరుషమైన మాటాలతో దూషించారట. తప్పు చేస్తున్నానని గ్రహించకపోగా అంత మాత్రానికే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని చెబుతున్నారు పోలీసులు. కోపంతో సరస్వతి చిత్రకూట్ జలపాతాల వద్దకు వెళ్లి చుట్టుపక్కల వారు వారిస్తున్నా వినకుండా 90 అడుగుల ఎత్తు నుండి అందులోకి దూకేసింది. క్షణాల్లో ఆమె నదీప్రవాహంలో కిందకు వెళ్ళిపోయింది. అక్కడి గ్రామస్థులు అప్రమత్తమై బోటు మీద వెళ్లి సరస్వతిని రక్షించారు. అక్కడున్న సందర్శకుల్లో ఒకరు ఈ దృశ్యాన్ని ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇది కూడా చదవండి: కుటుంబాన్ని చంపి తగులబెట్టి.. మృతుల్లో ఆరు నెలల పసికందు.. -
తల్లి మందలించిందని..ఆ చిన్నారి..
సాక్షి,రసూల్‌పురా: చెల్లితో గొడవ పడినందుకు తల్లి మందలించడంతో మనస్తాపానికిలోనైన ఓ బాలుడు(11) ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కార్ఖాన పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. డీఎస్ఐ అవినాష్ బాబు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కార్ఖాన బస్తీలో నివాసం ఉంటున్న శివనాథ్ రామ్, సంగీత దేవి దంపతులకు కుమారుడు (11), కుమార్తె (4) ఉన్నారు. గురువారం రాత్రి ధరమ్వీర్ కుమార్ తన చెల్లితో గొడవ పడ్డాడు. ఈ విషయమై తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికిలోనైన అతను గదిలోకి వెళ్లి ఇనుపరాడ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ‘పచ్చని తెలంగాణను పిచ్చోళ్ల చేతుల్లో పెట్టొద్దు’) -
‘హే రాజన్.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నా!’
సాక్షి, బంజారాహిల్స్: తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని భర్తకు సెల్ఫీ తీసుకుని ఫొటో పెట్టిన స్పందించలేదని మనస్తాపానికి గురైన ఓ యువతి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నేపాల్‌కు చెందిన రాజన్ పర్వార్, పూజ(19) దంపతులు ఏడాదిన్నర క్రితం నేపాల్ నుంచి నగరానికి వలసవచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10 లోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీలోని ఓ ఇంట్లో పని చేస్తున్నారు. రాజన్ కాపలాదారుగా పని చేస్తుండగా, పూజ వంట పని చేసేది. టిక్‌టాక్‌లు చేస్తున్న పూజను రాజన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా గత కొంత కాలంగా భర్త తనను పట్టించుకోవడం లేదని పూజ ఆరోపిస్తూ ఉండేది. అతను మరొకరితో ఫోన్లో మాట్లాడుతున్నాడని సన్నిహితుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో తనకు బతకాలని లేదంటూ ఇంటి యజమాని వద్ద కూడా వాపోయింది. ఆదివారం సాయంత్రం రాజన్ గేటు వద్ద విధుల్లో ఉండగా బాత్రూమ్లోకి వెళ్లిన పూజ మెడకు చున్నీ చుట్టుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సెల్పీ తీసి భర్తకు పంపింది. అయితే రాజన్ ఆ ఫొటో చూసుకోలేదు. రెండు గంటలు గడిచినా భర్త స్పందించకపోవడంతో మనస్తాపానికి లోనైన ఆమె బెడ్రూమ్లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. భార్య ఎంతకూ బయటికి రాకపోయేసరికి అనుమానం వచ్చిన రాజన్ కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఇంటి యజమాని సహాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. జూబ్లీహిల్స్ పోలీసులు రాజన్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: తెలంగాణ: హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఐటీ సోదాలు) -
భార్యకు సెల్ఫీ వీడియో పంపి..ఆ తర్వాత..
సాక్షి, కణేకల్లు: తన చావుకు ఎవరూ కారణం కాదంటూ భార్యకు వీడియో సందేశాన్ని పంపి భర్త కనిపించకుండా పోయాడు. వివరాలు.. కణేకల్లు మండలం యర్రగుంట గ్రామానికి చెందిన మల్లికార్జున, జయలక్ష్మి దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. యర్రగుంట బస్టాండ్ ప్రాంతంలో సెల్ఫోన్ల మరమ్మతు దుకాణాన్ని మల్లికార్జున నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడిన అతను ఈ విషయాన్ని భార్యకు కూడా తెలపలేదు. డాక్టర్ వద్దకు ఒక్కడే వెళ్లి చికిత్స చేయించుకుని వచ్చేవాడు. మంగళవారం ఉదయం తాను దుకాణానికి వెళుతున్నట్లు ఇంట్లో తెలిపి బయటకు వచ్చిన అతను.. ద్విచక్ర వాహనంపై మాల్యం – నాగేపల్లి గ్రామాల మధ్య ఉన్న హెచ్చెల్సీ గట్టుకు చేరుకున్నాడు. అనంతరం కాలువ గట్టుపై నిల్చోని తన చావుకు ఎవరూ కారణం కాదని, ఆరోగ్యం బాగాలేకపోవడంతో జీవితంపై విరక్తితో కాలువలో దూకి చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి భార్యకు పంపాడు. ఆలస్యంగా ఈ సందేశాన్ని గమనించిన భార్య జయలక్ష్మి తీవ్ర ఆందోళనకు గురైంది. విషయాన్ని వెంటనే కుటుంబసభ్యులకు, బంధువులకు, పోలీసులకు చేరవేయడవంతో అందరూ ఆగమేఘాలపై కాలువ గట్టుకు చేరుకున్నారు. అక్కడ మల్లికార్జున ద్విచక్ర వాహనంతో పాటు సెల్‌ఫోన్, షర్ట్ లభ్యమయ్యాయి. కుటుంబసభ్యులు కాలువ వెంబడి గాలింపు చేపట్టారు. ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. (చదవండి: అంతా క్షణాల్లోనే.. రెండు కుటుంబాల్లో అంతులేని శోకం) -
భార్య ఆత్మహత్య కేసులో భర్త అరెస్ట్
సాక్షి, బంజారాహిల్స్: అదనపు కట్నం కోసం వేధించి భార్య ఆత్మహత్యకు కారకుడైన నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఖమ్మం జిల్లా మధిర మండలం మల్లవరం గ్రామానికి చెందిన భవానీ వివాహం నెల్లారి సురేష్‌తో 2019లో జరిగింది. పెళ్ళి జరిగిన కొద్ది రోజుల నుంచే సురేష్ భార్యను అదనపు కట్నం కోసం వేధించసాగాడు. వీరికి మూడేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు. వీరు వెంకటగిరి సమీపంలోని భగవతి నగర్లో అద్దెకుంటున్నారు. వివాహ సమయంలో మూడు లక్షల కట్నం, రూ.5 లక్షలు విలువ చేసే బంగారం, రెండెకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు. అయితే ఉద్యోగం పోగొట్టుకొని పలు వ్యాపారాలు పెట్టి తీవ్రంగా నష్టపోయిన సురేష్ కట్నం కింద ఇచి్చన రెండెకరాల స్థలం అమ్మి డబ్బులు తీసుకురావాలంటూ కొంత కాలంగా వేధించసాగాడు. అప్పటికే బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టారు. రూ. 8 లక్షల వరకు అప్పు చేసి ఇచ్చారు. అయినాసరే నిందితుడి వేధింపులు రోజురోజుకు శృతి మించడంతో గత నెల 30వ తేదీన భవానీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఏలూరి ఝాన్సీ అల్లుడితో పాటు అత్తమామలపై చర్యలు తీసుకోవాలంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు సురేష్‌పై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: నిజామాబాద్‌లో కేటుగాడు!.. 250 మందిని షార్జాకి తీసుకెళ్లి.. పత్తా లేకుండా పోయి..) -
భార్య మోసం చేసిందని భర్త ఆత్మహత్య
-
ప్రేమ పేరుతో నిలువునా మోసం
శ్రీనివాసపురం: ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకుంటాననడంతో అతని వెంట వెళ్లింది. తీరా పెళ్లిక నిరాకరించడంతో మానసిక వ్యథకు గురైన యువతి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముళబాగిలు తాలూకా ఎన్ కురుబరహళ్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన పాపలమ్మ కుమార్తె వెన్నెల (22) అనే యువతి ఎన్ జంగాలపల్లి గ్రామానికి చెందిన అంజప్ప కుమారుడు చంద్రశేఖర్ ప్రేమలో పడ్డారు. కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ ఇల్లు విడిచి వెళ్లారు. తల్లిదండ్రులు పోలీసుల సహకారంతో వారిని మళ్లీ తీసుకొచ్చారు. పోలీసుల సమక్షంలో పంచాయతీ చేయగా, వెన్నెలను పెళ్లి చేసుకోనని ప్రియుడు చెప్పాడు. మోసపోయానన్న ఆవేదనతో వెన్నెల ఇల్లు విడిచి వెళ్లిపోయింది. చివరికి గ్రామ సమీపంలోని ఓ బావిలో ఆమె శవమై తేలింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా చంద్రశేఖర్, అతని తల్లిదండ్రులు పరారయ్యారు. నంగలి పోలీస్ స్టేషన్లో వీరిపై కేసు నమోదైంది. (చదవండి: కర్ణాటకలో దళితులపై అరాచకం..15 రోజుల పాటు చిత్రహింసలు) -
భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య
గార్లదిన్నె: భార్య పుట్టింటికి పోవడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన షాహినాకు గుంతకల్లు నివాసి జిలాన్ (38)తో వివాహమైంది. అదే గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో సొంత ఇల్లు నిర్మించుకుని బేల్దారి పనులతో జీవనం సాగించేవారు. పిల్లలు పుట్టకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకునేవి. శనివారం భర్త గొడవ పడడంతో షాహిన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన జిలాన్ అదే రోజు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఇంటి నుంచి దుర్వాసన వెలువడుతుండడంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న జిలాన్ మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జమేదార్ దేవకుమార్ తెలిపారు. (చదవండి: వింత మనుషులు..చీకటి గదిలో నుంచి వెలుగులోకి) -
ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య
రాయదుర్గం రూరల్: సెల్‌ఫోన్ కొనివ్వకపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. రాయదుర్గం మండలం వేపరాలకు చెందిన హరిజన రమేష్ కుమారుడు యశ్వంత్ (18) ఇంటర్ వరకు చదువుకుని కూలి పనులతో తండ్రికి చేదోడుగా ఉంటున్నాడు. కొన్ని రోజులుగా తనకు సెల్‌ఫోన్ కొనివ్వాలంటూ తండ్రిని అడుగుతున్నాడు. అయితే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో తండ్రి కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన యశ్వంత్ శనివారం ఉదయం శ్మశాన వాటిక సమీపంలో క్రిమి సంహారక మందు సేవించాడు. గమనించిన స్థానికులు వెంటనే సమాచారం అందించడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తండ్రి రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ భాస్కర్ తెలిపారు. యువకుడి దారుణ హత్య గార్లదిన్నె: విధులు ముగించుకుని ఇంటికి బయల్దేరిన యువకుడు అదృశ్యమయ్యాడు. రెండు రోజుల తర్వాత విగతజీవిగా కనిపించాడు. ఎవరో హత్య చేసి.. గుర్తుపట్టకుండా శరీరంపై పెట్రోలు పోసి తగులబెట్టారు. ఈ ఘటన రామదాస్‌పేట సమీపంలో శనివారం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. కేశవాపురానికి చెందిన రాజేష్ (23) గార్లదిన్నె భారత్ గ్యాస్ కంపెనీలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరాడు. అయితే రాత్రి అయినా ఇంటికి చేరుకోలేదు. మొబైల్‌కు ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వస్తుండటంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు తమ కుమారుడు కనిపించకుండా పోయాడని శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో రామదాస్‌పేట అటవీ ప్రాంతంలో ఓ యువకుడికి నిప్పంటించి చంపేసినట్లు సమాచారం అందింది. హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు రోజుల కిందటే శరీరంపై పెట్రోలు పోసి తగులబెట్టి ఉంటారని భావిస్తున్నారు. ఆనవాళ్లను బట్టి చనిపోయింది రాజేష్ అని తల్లిదండ్రులు తెలిపారు. సీఐ అస్రార్‌బాషా అటవీప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలనున్నాయి. (చదవండి: మొబైల్ చార్జర్ మాదిరిగా ఉండే స్పై కెమెరాను అమర్చి..) -
బతుకుబండి ట్రాక్ తప్పుతోంది!
బనశంకరి: రాష్ట్రంలో రైలు పట్టాలు రక్తసిక్తమవుతున్నాయి. అందమైన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతోంది. గత మూడేళ్లలో రైలు కిందపడి 1,455 మంది ఆత్మహత్య చేసుకోగా, 7 ఏళ్లలో రైల్వే ప్రమాదాల వల్ల 5,210 మందికి పైగా మృత్యువాత పడ్డారు. 2020లో 413 మంది రైలు కిందపడి ప్రాణాలు తీసుకోగా, 2021లో ఈ సంఖ్య 668 మందికి పెరిగింది. గత 6 నెలల్లో 374 మంది ఇలా తనువు చాలించారు. రెండేళ్ల కాలంలో చూస్తే ఇందులో పురుషులు 1,305 మంది, మహిళలు 150 ఉన్నారని రైల్వేపోలీసులు తెలిపారు. ఆత్మహత్యలకు కారణాలేమిటి? రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం వెనుక కుటుంబ సమస్యలు, ప్రేమ వైఫల్యం, ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, పరీక్షల్లో ఫెయిల్ కావడం, వరకట్న వేధింపులు బలమైన కారణాలుగా ఉంటున్నాయి. ఇందులో యువకుల సంఖ్య ఎక్కువగా ఉంది. పట్టాల మీద తలపెట్టి ప్రాణాలు తీసుకోవడం ఇటీవల ఎక్కువగా నమోదవుతోందని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ విధంగా చేస్తే కచ్చితంగా చనిపోతామనే భావనతో ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారని మానసిక నిపుణులు పేర్కొన్నారు. కొన్నిచోట్ల హత్య చేసి ఆత్మహత్య అనిపించడానికి రైలు పట్టాలపై మృతదేహాలను పడేస్తున్న ఉదంతాలు చాలా ఉన్నాయని రైల్వే పోలీసులు చెప్పారు. ఈ విషయమై రైల్వే పోలీస్ ఎస్పీ డీఆర్ సిరిగౌరి మాట్లాడుతూ జీవితంలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవాలి. ఆత్మహత్యకు పాల్పడటం సరికాదు. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునే కేసుల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. రైలు ప్రమాదాలూ తక్కువ కాదు ప్రతినెలా సరాసరి 55– 60 మంది రైల్వే ప్రమాదాలకు బలి కావడం గమనార్హం. రైలు వస్తోందా లేదా అని చూడకుండా పట్టాలు దాటడం, ఇయర్ ఫోన్లలో సంగీతం వింటూ, మొబైల్లో మాట్లాడుతూ దాటడం, ఖాళీగా ఉన్న ట్రాక్‌పై వాకింగ్ చేయడం, నిద్రించడం, సెలీ్ఫలు తీసుకోవడం రైలు ప్రమాదాలకు కారణాలు. ఇలా 2017లో 654 మంది, 2018లో 487, 2019లో 614 మంది, 2020 నుంచి 2022 జూన్ వరకు 826 మందికి పైగా బలయ్యారు. (చదవండి: పక్కా ప్లాన్‌తో అంగన్వాడీ సెంటర్ పక్కనే ఇల్లు అద్దెకు.. జెండా వందనం చేశాక...) -
ప్రగతిభవన్ ఎదుట తెలంగాణ ఉద్యమకారుడు ఆత్మహత్యాయత్నం
పంజగుట్ట: తెలంగాణ ఉద్యమకారుడు గురువారం ప్రగతిభవన్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ముఖ్యమంత్రి రక్షణ సిబ్బంది అడ్డుకుని అతన్ని పంజగుట్ట పోలీస్‌స్టేషన్ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం, రాయనిగూడెం గ్రామానికి చెందిన పిడమరితి నాగరాజు (27) తెలంగాణ ఉద్యమకారుడు. ఉద్యమ సమయంలో రైల్‌రోకోలో భాగంగా రైలు కింద పడి రెండు కాళ్లు, ఒక చెయ్యి పోగొట్టుకున్నాడు. ఇంత త్యాగం చేసినప్పటికీ తెలంగాణ వచ్చాక ఒక్క నాయకుడు కూడా పరామర్శించలేదని, ఏ ఆసరా చూపించలేదని ఆయన మనస్తాపానికి గురయ్యాడు. గురువారం సాయంత్రం 4:15 గంటల ప్రాంతంలో ప్రగతిభవన్ వద్దకు వచ్చాడు. ముఖ్యమంత్రిని కలవాలని కోరగా.. అప్పటికే మంత్రివర్గ సమావేశం జరుగుతుండడంతో అపాయింట్మెంట్ లేనందున ప్రవేశం లేదని సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో నాగరాజు వెంటతెచ్చుకున్న పెట్రోల్ పైన పోసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన రక్షణ సిబ్బంది అతన్ని స్టేషన్‌కు తరలించారు. తనకు ప్రభుత్వోద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని నాగరాజు డిమాండ్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అరెస్ట్ భయంతో ఆత్మహత్యాయత్నం
మైసూరు: హత్య కేసులో అరెస్ట్ భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా హుల్లమళ్లి పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు...ఈ నెల 14న హుళ్లహళ్లి సమీపంలోని ఓ బార్ వద్ద తీవ్ర గాయాలైన వనరనాయక్ అనే వ్యక్తిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతను కేఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 20న మృతి చెందాడు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులకు మహాదేవనాయక్పై అనుమానం ఏర్పడింది. తనను అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో మహాదేవనాయక్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి ఆస్పత్రికి తరలించారు. ప్రేమికుడి ఆత్మహత్య యశవంతపుర: తాను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందంటూ యువకుడు వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్న ఘటన హాసన్‌లో జరిగింది. దిలీప్ కుటుంబం బెంగళూరులో నివాసం ఉంటోంది. అక్కడే ఓ గార్మెంట్స్‌లో పనిచేస్తున్న శివమొగ్గ జిల్లా సొరబ తాలూకాకు చెందిన అమ్మాయిని ప్రేమించాడు. అయితే ఇటీవల అమ్మాయి అతనికి దూరంగా ఉంది. దీంతో జీవితంపై విరక్తి కలిగిన దిలీప్, సదరు ప్రేమికురాలి గ్రామానికి సమీపంలోని కొండపైకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. అంతకు ముందు నాలుగేళ్ల పాటు తనను ప్రేమించి మోసం చేసిందని చెబుతూ వీడియో తీశాడు. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: యువతి మాయలో బ్యాంక్ మేనేజర్.. రూ. 5.70 కోట్లు బదిలీ!) -
కంతేరు ఘటనలో సునీత ఆత్మహత్యాయత్నం
తాడికొండ/మంగళగిరి: గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామంలో జరిగిన ఘటనలో టీడీపీ శ్రేణుల వికృత చేష్టలకు విసిగిపోయిన బాధితురాలు నల్లపు సునీత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎల్లో మీడియాలో మంగళవారం ఉదయం వచ్చిన కథనాలు చూసి గుట్టుగా సంసారం చేసుకుంటున్న తనపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించింది. మంచి చెడులు ఆలోచించకుండా మీడియా కూడా తనకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయడంతో ఎవరూలేని సమయంలో ఉ.8 గంటలకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుమార్తె కేకలు వేయడంతో స్థానికులు, పోలీసుల సాయంతో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అంతకుముందు.. తన కుమార్తెతో వెంకాయమ్మ కుమారుడు అసభ్యంగా ప్రవర్తించడంతో వచ్చిన వివాదాన్ని టీడీపీ నేతలు పెద్దదిగా చేసి తమ కుటుంబ పరువు బజారున పడేశారని మీడియా ఎదుట సునీత ఆవేదన వ్యక్తంచేసింది. ఆడపిల్లల జీవితాలతో ఇలా ఆడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. అయినా టీడీపీ నాయకులు తమ దుష్ప్రచారాలు ఆపకపోవడంతో విరక్తి చెందిన సునీత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సునీత ఆత్మహత్యాయత్నానికి బాబే కారణం చంద్రబాబు నీచ రాజకీయాల కారణంగానే సునీత ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. ఆస్పత్రిలో సునీతను పరామర్శించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, ఎల్లో మీడియా తమ స్వార్థ రాజకీయాల కోసం రెండు కుటుంబాల మధ్య గొడవను రాష్ట్ర వివాదంగా మార్చడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. సునీత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆడపిల్లపట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుంటే దానిని రాజకీయం చేసేందుకు ఎక్కడెక్కడ నుంచో టీడీపీ నాయకులు రావడమేమిటని ఆమె ప్రశ్నించారు. మరోవైపు.. స్థానిక టీడీపీ నేత వాసిరెడ్డి జయరామయ్య కారణంగానే వివాదం పెరిగి తన సోదరి సునీత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని సునీత సోదరి పక్కర కుమారి వెల్లడించింది. వెంకాయమ్మకు డబ్బులిచ్చి నాటకాలు ఆడిస్తున్నారని, మంగళగిరి రూరల్ సీఐ తమను బూతులు తిడుతూ వెంటపడి కొడుతున్నారని ఆమె వాపోయింది. -
పంజాగుట్టలో టీవీ నటి ఆత్మహత్యాయత్నం, నిమ్స్‌కు తరలింపు
ప్రముఖ టీవీ నటి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. సదరు నటిని మైథిలిగా పోలీసులు గుర్తించారు. సోమవారం సాయంత్రం ఆమె పంజాగుట్ట పోలీసులకు ఫోన్ చేసి తన భర్తపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. అంతేకాదు తన భర్త బండి సీజ్ చేయాలని లేదంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని మైథిలి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. చదవండి: తెలుగు చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ లేదు: సుమన్ సంచలన వ్యాఖ్యలు అప్పటికే మైథిలి 8 బ్రీజర్లు, స్లీపింగ్ ట్యాబ్లెటను మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇక ఫోన్ సిగ్నల్స్ ఆధారం పోలీసులు నటి ఇంటికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న మైథిలిని సమీపంలోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతున్నట్లు సమాచారం. కాగా గతంలో కూడా మైథిలి మోతె పీఎస్‌లో తన భర్తపై కేసు పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
భూ వివాదం: కలెక్టరేట్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి,నాగర్‌కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు ఓ మహిళ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వివరాలు..బిజినేపల్లి మండలం సల్కరిపేటకు చెందిన జ్యోతి అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. తన భర్త మృతి చెందడంతో భూమికోసం రెండేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతుంది. వారసత్వంగా రావలసిన భూమి తనకు ఇవ్వకుండా తన బావ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అధికారులకు మొరపెట్టుకుంది. భూమి దగ్గరికి వస్తే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని విన్నవించుకుంది. ఎవరూ పట్టించుకోకపోవడంతో విసిగి పోయిన మహిళ కిరోసిన్ డబ్బాతో ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకునే ప్రయత్నం చేసింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కురుమయ్య కిరోసిన్ బాటిల్ లాక్కున్నాడు. అప్పటికే కిరోసిన్ కొంత ఆమెపై పడింది. తర్వాత జాయింట్ కలెక్టర్ దగ్గరికి ఆమెను తీసుకెళ్లాడు. ఆమెకు జరిగిన అన్యాయాన్ని జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలియజేసింది. సమస్యను పరిష్కరిస్తానని ఇలాంటి కార్యకాలపాలకు పాల్పడవద్దని అన్నారు. -
ఆత్మహత్యాయత్నం: కాళ్లు పోయాయి.. ప్రాణాలు మిగిలాయి
సాక్షి, గుంటూరు (తాడేపల్లి రూరల్): నిండా ఇరవై ఏళ్లు కూడా పూర్తికాని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు. పట్టాలపై ఉన్న యువకుడిని గుర్తించిన లోకో పైలట్లు షడన్ బ్రేక్ వేసి రైలు ఆపారు. అయినప్పటికీ యువకుడి రెండు కాళ్లూ తెగిపోయాయి. గాయపడిన యువకుడిని లోకోపైలట్లు అదే ట్రైన్లో విజయవాడ స్టేషన్‌కు తీసుకువచ్చారు. వివరాల్లోకి వెళితే.... ట్రైన్ నెం. 7222 (లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్) సోమవారం గుంటూరు వైపు నుంచి కృష్ణాకెనాల్ జంక్షన్‌కు వస్తున్న సమయంలో కృష్ణాకెనాల్ జంక్షన్‌కు అరకిలోమీటరు దూరంలో ఓ యువకుడు రైలు పట్టాలమీద పడుకున్నాడు. దూరం నుంచి గమనించిన లోకోపైలట్లు హనుమంతరావు, రఘురామరాజు ట్రైన్ షడన్ బ్రేక్ అప్లయ్ చేశారు. సైరన్ కొడుతున్నప్పటికీ అతను ట్రాక్ పైనుంచి లేవలేదు. ట్రైన్ ముందు భాగంలోని సేఫ్టీ గ్రిల్ యువకుడ్ని పక్కకు నెట్టేసింది. యువకుడు పట్టాల పక్కకు రాగా, రెండుకాళ్లూ చక్రాల కిందపడి తెగిపోయాయి. వెంటనే లోకో పైలట్లు ట్రైన్ ఆపి యువకుడ్ని ఇంజన్ వెనుక పెట్టెలో ఎక్కించుకుని విజయవాడ తీసుకువెళ్లారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో విజయవాడ స్టేషన్లో 108 వాహనాన్ని సిద్ధంగా ఉంచారు. చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తెగిపోయిన కాళ్లను కలిపేందుకు వైద్యులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో రెండు కాళ్లూ తొలగించారు. ఆత్మహత్యకు యత్నించిన యువకుడు నులకపేటకు చెందిన పృధ్విగా తెలిసింది. -
టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ జాబ్.. ఏమైందో తెలియదు
చంద్రగిరి: రైలు కింద పడి యువతి ఆత్మాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని నరసింగాపురం రైల్వేగేటు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు... తిరుపతి అక్కారంపల్లె సమీపంలోని ఉపాధ్యా య నగర్‌కు చెందిన రాధమ్మ, వాసు దంపతుల కుమార్తె శ్రీలక్ష్మి బీకాం(కంప్యూటర్స్) పూర్తి చే సింది. ఇటీవల ఆమెకు టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. కరోనా నేపథ్యంలో హోమ్ టు వర్క్‌లో భాగంగా ఇంట్లో నుంచే ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం శ్రీలక్ష్మి తన స్కూటర్లో నరసింగాపురం రైల్వే పట్టాల వద్దకు చేరుకుని రైలు కింద పడింది. అయితే రైలు వెళ్లే క్రమంలో ఆమె తలకు గాయమై స్పృహ తప్పి పట్టాల మధ్యన పడింది. అనంతరం మరో రెండు రైళ్లు ఆమెపై నుంచి వెళ్లినప్పటికీ ఎటువంటి గాయాలు కాలేదు. స్థానికులు గుర్తించి, తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. తలకు గాయం కావడంతో ఆమె పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను స్విమ్స్‌కు తరలించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చే స్తున్నారు. అయితే శ్రీలక్ష్మి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదని, యువతి స్పృహలోకి వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. (చదవండి:కరోనా వేళ జోరుగా బాల్య వివాహాలు) -
నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళ.. కారణం అదేనా..
శ్రీనగర్: గుర్తుతెలియని ఒక మహిళ జీలం నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలను కుంది. అయితే, పోలీసులు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమె ప్రాణాలను కాపాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. ఈ సంఘటన శ్రీనగర్‌లోని జీలం నది వద్ద సోమవారం చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఒక మహిళ జీలంనది ఉన్న బుద్షా వంతెన వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి నదిలో దూకడానికి ప్రయత్నించింది. అయితే, అక్కడ గస్తీలో ఉన్న జమ్ముకశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) పోలీసులు ఆమెను పక్కకు లాగి, ఆమె ప్రాణాలను కాపాడారు. అయితే, కరోనా, లాక్డౌన్ కారణంగా పనిదొరక్క కుటుంబ సమస్యలు మొదలయ్యాయి. ఈ క్రమంలో, ఆర్థికంగా కూడా ఎంతో కృంగిపోయిన ఆమె చివరకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెకు నిపుణులతో సరైన కౌన్సిలింగ్ ఇప్పిస్తామని కశ్మీర్ పోలీసు అధికారులు పేర్కొన్నారు. అయితే, సదరు మహిళ ప్రాణాలను కాపాడిన వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు పోలీసు అధికారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు. ‘ మీరు చేసిన గొప్ప పనికి హ్యట్సాఫ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
యూనివర్సీటీ లైబ్రరీలో చదువుతూ..ఉద్యోగం రాలేదని..
గూడూరు: ఓ నిరుద్యోగ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లాలోని కేయూ గ్రౌండ్ వద్ద చోటుచేసుకుంది. ఆ యువకుడు తీసిన వీడియో, బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని తేజావత్ రాంసింగ్‌తండాకు చెందిన బోడ సునీల్ నాయక్ 2016లో డిగ్రీ పూర్తి చేశాడు. అప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే తపన తో కాకతీయ యూనివర్సీటీ సమీపంలో స్నేహితులతో కల సి ఉంటున్నాడు. తరచూ యూనివర్సిటీ లైబ్రరీకి వచ్చి పోటీ పరీక్షలకోసం చదువుకునేవాడు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో సునీల్ తన సోదరుడికి ‘ఐ మిస్ యూ’ అంటూ ఫోన్లో మెస్సెజ్ పంపించగా.. అతను తిరిగి ఫోన్ చేయడంతో తాను పురుగు మందు తాగినట్లు చెప్పాడు. దీంతో అతని సోదరుడు 108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా.. సిబ్బంది మద్యాహ్నం 12 గంటల సమయంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా సునీల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 48 గంటలు దాటితే కాని ఏ విషయం చెప్పలేమని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేస్తున్నారు. -
తమిళ నటి ఆత్మహత్యాయత్నం
-
వేరే వార్డుకు తరలించకపోతే...
-
భార్యతో గొడవ.. ఆత్మహత్యాయత్నం
సాక్షి, న్యూఢిల్లీ: భార్యతో గొడవ అనంతరం ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన ఘటన గురువారం రాత్రి జరిగింది. బ్రిడ్జ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా అతడిని పోలీసులు రక్షించిన ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. కాగా దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉంటున్న క్రమంలో సదరు వ్యక్తి భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం మనస్తాపం చెందిన ఆ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరిపారు. (లాక్డౌన్ వేళ తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు) Delhi man attempts suicide by jumping from overbridge in Outer Ring Road pic.twitter.com/jWPSkQzyQw — Zee News English (@ZeeNewsEnglish) April 17, 2020 పోలీసుల సమాచారం మేరకు.. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి పేరు హర్జీత్ సింగ్ . అతను వెస్ట్ ఎన్క్లేవ్ సమీపంలోని తిలక్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతని భార్య ఇళ్లల్లో పని చేస్తూ ఉంటుంది. కాగా లాక్డౌన్లో కారణంగా ఇంట్లోనే ఉంటున్న సదరు వ్యక్తి, తన భార్యతో గొడవ పడ్డాడు. ఇక వారి మధ్య గొడవ పెరగడంతో ఆత్మహత్యకు యత్నించాడు. ఈ క్రమంలో వెస్ట్ ఎన్క్లేవ్ సమీపంలోని బ్రిడ్జ్‌పై నుంచి దూకుతుండగా విధుల్లో ఉన్న పోలీసుల అతడిని గమనించారు. ఇక వెంటనే ఘటన స్థలానికి చేరుకుని అతడిని రక్షించారు. కాగా ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నట్లు పోలీసుల తెలిపారు. (కోవిడ్–19పై ఆన్లైన్ టాలెంట్ కాంపిటీషన్) -
మేడ్చల్ ఆదిత్య హాస్పిటల్ ఎండీ రవీంద్రకుమార్ ఆత్మహత్య
-
కూతుళ్లతో బావిలో దూకి తండ్రి ఆత్మహత్య
-
డబ్బు ఎగ్గొట్టేందుకే ఆత్మహత్య నాటకం
టీ.నగర్ : తిరునెల్వేలి కలెక్టర్ కార్యాలయంలో ఆత్మాహుతికి ప్రయత్నించిన ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా రుణంగా తీసుకున్న నగలు, నగదు ఎగ్గొట్టేందుకు ఈ నాటకం ఆడినట్లు తెలిసింది. నెల్లై జిల్లా, కలక్కాడు సమీపంలోని చిదంబరపురం మేలరథవీథికి చెందిన కృష్ణవేణి (25), భామామీనా (26). వీరి భర్తలయిన మురుగన్,పుగళ్ సేట్టు సోదరులు. గత నెల 27వ తేదీన నెల్లై కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్‌డే జరుగుతుండగా కృష్ణవేణి, భామామీనా కిరోసిన్ క్యాన్‌తో అత్మాహుతికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారు కలెక్టర్ శిల్పా ప్రభాకర్ సతీష్‌కు ఇచ్చిన ఫిర్యాదులో చిదంబరపురానికి చెందిన నలుగురి వద్ద కంతు వడ్డీకి నగదు తీసుకున్నట్లు, నగదు చెల్లించిన తర్వాత కూడా వారు వడ్డీ కోరుతూ బెదిరిస్తున్నట్లు తెలిపారు. దీని గురించి కలక్కాడు పోలీసులకు తెలిపినా విచారణ జరపలేదని ఆరోపించారు. ఇలా వుండగా సేతురాయపురానికి చెందిన వసంతా (80) కలక్కాడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కృష్ణవేణి, భామామీనా తన బంధువులని, వారు 2018లో నగదు సాయం కోరగా నిరాకరించానని, రెండు రోజుల తర్వాత వారు తమ భర్తలతో వచ్చి నగదు కోరారని, ఆ సమయంలో తాను నగదు లేదని చెప్పి 15 సవర్ల బంగారు చెయిన్, ఐదు సవర్ల నెక్లెస్, గాజులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ నగలను ఐదు నెలల తర్వాత ఇస్తానని చెప్పిన వారు తిరిగి ఇవ్వలేదన్నారు. నగలు అడిగితే హత్య చేస్తామని బెదిరించినట్లు తెలిపారు. ప్రస్తుతం వీటిని ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు కృష్ణవేణి, మరుగన్, భామామీనా, పుగల్‌సేట్, మురుగన్ తల్లి మయిల్పై కేసు నమోదు చేశారు. కృష్ణవేణి, భామామీనాలను అరెస్టు చేసిన పోలీసులు మురుగన్, పుగల్‌సేట్, మయిల్ కోసం గాలిస్తున్నారు. -
టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
-
సింహాచలంలో తెలంగాణవాసి ఆత్మహత్య
సాక్షి, సింహాచలం(పెందుర్తి): తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి సింహాచలంలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం వెలుగుచూసింది. గోపాలపట్నం పోలీసులు అందించిన వివరాల ప్రకారం... సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఎగువ వైపు ఉన్న దేవస్థానం తోటల్లో దుర్వాసన వస్తుండడంతో స్థానికులు కొంతమంది వెళ్లి చూశారు. చెట్టుకు వేలాడుతూ ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో వెంటనే గోపాలపట్నం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ రమణయ్య, ఎస్ఐ సత్యనారాయణ వివరాలు సేకరించారు. మృతుడి వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కొడిమెల మండలం పూడూరుకి చెందిన పున్నం ఆదయ్య(35) అలియాస్ అరుణ్గా గుర్తించి కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. రజక వృత్తి చేసుకుని జీవిస్తున్న ఆదయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, మానసిక స్థితి సరిగా లేకపోవడంతో 15 రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారని పోలీసులు వెల్లడించారు. అనంతరం వారణాసి, విజయవాడలో తిరిగినట్లు జేబులో టిక్కెట్లు ఉన్నాయని, ఈ నెల 6న సింహాచలం వచ్చినట్లు సిటీ బస్సు టికెట్ ఉందని తెలిపారు. రెండు రోజుల కిందటే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేశారు. -
తహసీల్దార్ న్యాయం చేయడం లేదు..ఉరేసుకుంటున్నా!
ఇందూరు (నిజామాబాద్ అర్బన్): ‘తహసీల్దార్ నాకు న్యాయం చేయడం లేదు.. అందుకే ఉరివేసుకుంటున్నా..’ అని ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. కలెక్టరేట్ ఆవరణలో ఉన్న చెట్టెక్కి ఉరేసుకునేందుకు యత్నించడం కలకలం సృష్టించింది. ధర్పల్లి మం డలం దుబ్బాక గ్రామానికి చెందిన అక్కం గంగాధర్‌కు రేకులపల్లిలో వ్యవసాయ భూమి ఉంది. గంగాధర్ తమ్ముడు సంతోష్ పొలం కూడా పక్కనే ఉంది. సంతోష్ తన పొలంలో బోరు వేసినప్పటి నుంచి గంగాధర్ బోరులో నీళ్లు రావడంలేదు. దీనిపై తహసీల్దార్‌కు ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదులు చేశానా న్యాయం జరగడం లేదనే ఆవేదనతో గంగాధర్ సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తాడుతో ఉరి వేసు కునేందుకు యత్నించాడు. ప్రజావాణికి వచ్చిన వారంతా చెట్టె క్కిన గంగాధర్‌ను ఎంత సముదాయించినా కిందికి దిగలేదు. గంగాధర్‌కు తెలియకుండా చెట్టు ఎక్కిన ఓ వ్యక్తి గంగాధర్‌ను పట్టుకుని తాడును విప్పాడు. గంగాధర్‌ను కిందికి దింపి నిజామాబాద్ ఆర్డీఓ వద్దకు తీసుకెళ్లి సమస్య ఏంటో తెలుసుకున్నారు. ధర్పల్లి తహసీల్దార్‌తో మాట్లాడిన ఆర్డీఓ బుధవారం విచారణకు వస్తున్నానని, అందుబాటులో ఉండాలని ఆదేశించారు. -
కలెక్టరేట్ ఎదుట రైతుల ఆత్మహత్య యత్నం
సాక్షి, నిజామాబాద్: తన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలేదనే కోపంతో అబ్దుల్లాపూర్మేట్ ఎమ్మార్వో విజయారెడ్డిని హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో పలు జిల్లాలోని రైతులు భూ సమస్యలను తీర్చాలంటూ కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ముందు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళితే....నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన అంకం గంగాధర్ అనే రైతు చెట్టెక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ సోమవారం కలెక్టరెట్ ముందు బెదిరింపులకు దిగాడు. దీంతో ఓ పోలీసు అధికారి చెట్టెక్కి తాడు లాగి రైతును కిందకు దించారు. కాగా అన్నదమ్ముల మధ్య జరుగుతున్న బోరు సమస్యను దర్పల్లి మండలం ఎమ్మార్వోకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు రైతు తెలిపాడు. ఇప్పటికైనా బోరు సమస్యను తక్షణమే పరిష్కారించాలని రైతు కోరాడు. బోధన్: ఆర్డీవో కార్యాలయంలో ఓ మహిళా రైతు ఆత్మహత్యా యత్నం చేసింది. తగ్గెళ్ళి గ్రామానికి చెందిన అబ్బవ్వ అనే మహిళా రైతు తన డిజిటల్ పట్టా పాస్‌బుక్ కోసం ఏడాదిగా బోధన్ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతోంది. అయినా వారు పట్టించుకోవడం లేదంటూ ఇవాళ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. దీంతో పోలీసులు ఆమెను అడ్డుకుని విచారించగా తన భూమిని ఇతరుల పేరు మీదకు మార్చారని ఆవేదన వ్యక్తం చేసింది. జనగామ జిల్లా: అలాగే జనగామ జిల్లాలోని లింగాల గణపురం మండలం గమ్మడవెల్లి గ్రామానికి చెందిన చెంగిర్ల వెంకటేష్ అనే రైతు ఎకరం భూమిని తన పేరు మీదకు పట్టా చేయడం లేదంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో స్థానికులు అతనిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రైతును స్టేషన్‌కు తరలించారు. ఈ మూడు సంఘటనలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. -
నా భార్య వద్దకే వెళ్లిపోతున్నాం..
మండపేట: అన్యోన్యంగా సాగుతున్న వారి కుటుంబాన్ని డెంగీ జ్వరం ఛిన్నాభిన్నం చేసింది. ఆ జ్వరంతో భార్య లోకాన్ని విడిచి వెళ్లిపోవడాన్ని తట్టుకోలేకపోయిన భర్త తన ముద్దుల కుమార్తెను కడతేర్చి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం తూర్పుగోదావరి జిల్లా మండపేటలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే.. బాదం చందనకుమార్ (చందు)కు 2015లో కంచర్ల శ్రీనవ్యతో వివాహమైంది. ఫ్లెక్సీ ప్రింటింగ్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న వీరికి శ్రీయోషిత అనే మూడేళ్ల కుమార్తె ఉంది. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వీరి కుటుంబాన్ని డెంగీ జ్వరం అతలాకుతలం చేసింది. తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఈ నెల 5న శ్రీనవ్య ఆస్పత్రిలో కన్నుమూసింది. భార్య మరణంతో చందు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఆమె ఆశయం మేరకు ఆమె కళ్లను దానం చేశాడు. నాటి నుంచి తీవ్ర మానసిక వేదనకు గురవుతున్న చందు భార్య లేనిదే జీవితం లేదని భావించాడు. మరో వివాహం చేసుకున్నా తన కుమార్తెకు తల్లి ప్రేమ దక్కదని భావించాడు. ‘నా భార్య వద్దకే మేమిద్దరం వెళ్లిపోతున్నాం’ అంటూ లేఖ రాసి తన కుమార్తెను కడతేర్చి, తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చందు, శ్రీయోషితల మృతితో వారి కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. -
పద్మ ఆత్మహత్యాయత్నం
సాక్షి,హైదరాబాద్:రాష్ట్రంలో సంచలనం కలిగించిన ఈఎస్ఐ ఆస్పత్రి ఔషధాల కుంభకోణం నిందితురాలు పద్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈఎస్ఐ సంయుక్త సంచాలకురాలుగా విధులు నిర్వర్తిస్తోన్న పద్మను ఔషధాల కుంభకోణం కేసులో ఇటీవల ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పద్మ శనివారం సాయంత్రం చికిత్స కోసం ఇచ్చిన మాత్రలను పెద్ద మోతాదులో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. దీన్ని గమనించిన జైలు సిబ్బంది వెంటనే ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించిన వైద్యులు ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పారు. -
ఆత్మహత్య చేసుకునే వారిలో ఆ వయస్సు వారే ఎక్కువ!
ప్రపంచ వ్యాప్తంగా సగటున ప్రతి సంవత్సరం 10 లక్షల మందికి పైగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వారిలో 15 నుంచి 30 ఏళ్ల వయస్సువారు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోన్న విషయం. అయితే వారు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి? వాటి గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోవాలంటే వీడియో ఓసారి చూడండి. -
అతిగా వాడి.. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు!
సాక్షి, భువనగిరి: నేటి యువత స్మార్ట్‌ఫోన్‌లో మునిగితేలుతోంది. ఎంతలా అంటే తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేనంతలా అందులో లీనం అవుతున్నారు. నిత్యం ఫేస్బుక్, వాట్సాప్ తదితర వాటిల్లో మునిగి తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేసి మోసపోతున్నారు. కొంత మంది దుండగులు అమాయక యువతులనే ఆసరా చేసుకొని వలలో వేసుకుంటున్నారు. ఇటీవలే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఓ బాలిక ఫేస్బుక్లో ఓ యువకుడితో పరిచయం పెంచుకొని, చివరికి తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలు ఫోన్లలో ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెట్టాల్సి న అవసరం ఉంది. పిల్ల్లలు ఫోన్లను మితిమీరిగా వినియోగించకుండా తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు ఫేస్బుక్, వాట్సాప్, షేర్‌చాట్, ఇన్‌స్ట్రాగామ్, టిక్‌టాక్, తదితర వాటిపై మునిగిపోతుంది నేటి యువత. సమయం తెలియకుండానే కాలాన్ని గడుపుతున్నారు. తాము చేసే పని వల్ల ఇతరులకి ఇబ్బందులు పెట్టడంతోపాటు, పరువు పోగొట్టుకోవడంతో చివరికి చావుకు దారితీసే పరిస్థితి వరకు వెళ్తున్నాయి. ఇంటర్నెట్ అపరిమితంగా అందుబాటులోకి రావడంతో జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. టిక్‌టాక్ మోజులో పడి ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. ఒకరకంగా ప్రస్తుతం నేరాల సంఖ్య పెరగడానికి సోషల్ మీడియానే కారణంగా చెప్పవచ్చు. ఫేస్బుక్లో నకిలీ అకౌంట్లను ఓపెన్ చేసి అమ్మాయిలను స్నేహం, ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి వారి జీవితాలతో ఆడుకోవడంతోపాటు ప్రాణాలు సైతం హరింపజేస్తున్నారు. ఫేస్బుక్లో పెట్టే ఫొటోలను నిజమా, అబద్దమా గుర్తించకుండా అపరిచితులను పరిచయాలను చేసుకుంటూ అనర్థాలకు దారి తీసుకుంటున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఫేస్బుక్లో పుట్టినతేదీ, తదితర తమ పర్సనల్ వివరాలు పెట్టకూడదు. ఒకవేళ పెట్టినా తనకు దగ్గర ఫ్రెండ్స్ ఉన్నవారికి మాత్రమే వివరాలు కనిపించే విధంగా జాగ్రత్త పడాలి. లోకేషన్ హాలీడే ఫొటోలు ఫేస్బుక్లో పెట్టకూడదు. ఇలాంటి ఫొటోలు పెట్టడం వల్ల తాము ఎక్కడ ఉన్నదనేది గమనించి వారి ఇళ్లల్లో చోరీకి పాల్ప డే అవకాశం ఉంటుంది. ఆఫీస్ కార్యాలయాల్లో పనిచేసే వ్యక్తులు వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఫొటోలను ఫేస్‌బుక్‌లలో పోస్టు చేయకూడదు. ఇలాంటి ఫొటోలు పోస్టు చేయడం వల్ల కార్యాలయ వాసులు తెలుసుకుని వారిని చులకనగా చూడడంతోపాటు అవమానపర్చే విధంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఫోన్ నంబర్లను ఎట్టి పరిస్థితుల్లో ఫేస్బు క్లో పెట్టకూడదు. ఫోన్ నంబర్లు ప్రైవసీ సిట్టింగ్‌లలో మాత్రమే పెట్టాలి. మద్యం తాగే ఫొటోలు పెట్టడం వల్ల యువత ఉద్యోగాలను పొందే సమయంలోగాని, వివాహం చేసుకునే సమయంలోగాని వారి జీవితాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఫేస్‌బుక్‌లలో మాజీ ప్రియుడు, ప్రియురాళ్లతో ఫొటోలు అప్లోడ్ చేయకూడదు. ఇలాంటి ఫొటోలు పెట్టడం వల్ల వివాహ జీవితం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. ఫేస్‘బుక్’ నల్లగొండ: సామాజిక మాధ్యమాల ద్వారా మంచిని తెలుసుకోవాల్సిన యువత పెడదోవపడుతూ ఫేస్‘బుక్’ అవుతుతోంది. నకిలీ ఫేస్బుక్ అకౌంట్లను తెరిచి ఫేస్బుక్ డీపీగా అమ్మాయిల ఫొటోలు పెట్టి ఇతర అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి పరిచయం చేసుకొని ఆతర్వాత ఫోటోలు షేర్ చేసుకొని ఇద్దరి మధ్య స్నేహ సంబంధం బలంగా ఏర్పడిన తర్వాత తాను అమ్మాయిని కాదని, అబ్బాయిని అని చెప్పి స్నేహాన్ని కొనసాగించి ప్రేమ పేరుతో వంచనకు గురి చేస్తున్నారు. మరికొందరు ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి చివరికి ముఖం చాటేస్తున్నారు. పొరపాటున వచ్చిన ఫోన్‌కాల్‌తో మరికొందరు మోసగాళ్ల చేతిలో పడి విలువైన జీవితాన్ని కోల్పోతున్న సంఘటనలు అనేకం. అమ్మాయి పేరిట.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి నాగరాజు అమ్మాయి పేరిట ఫేస్బుక్ అకౌంట్‌ను ప్రారంభించి నల్లగొండకు చెందిన డిగ్రీ విద్యార్థితో పరిచయం ఏర్పర్చుకున్నాడు. డిగ్రీ విద్యార్థిని వివరాలను సేకరించి నేను కూడా మీ పాఠశాల, మీ కళాశాలలోనే చదివానని, అమ్మాయి ఫొటోతో వివరాలు ఫేస్బుక్లో పెట్టాడు. దీంతో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. చూడాలనిపిస్తుందని, నిన్ను చూసి చాలా ఏళ్లు గడిచాయని మధురమైన మాటలు చెప్పాడు. ఫుల్ ఫొటో పంపించాలని కోరడంతో మోపోయిన ఆ అమ్మాయి ఫొటోలను పంపించింది. ఆ తర్వాత నాగరాజు తాను అమ్మాయిని కాదని, పెళ్లి చేసుకుందామని చెప్పడంతో అందుకు నిరాకరించిన ఆమెను బెదిరింపులకు గురి చేశాడు. ఇద్దరు కలిసి ఉన్నట్లుగా, ముద్దు పెట్టుకుంటున్నట్లుగా ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫోటోలు పంపించాడు. డబ్బులు ఇవ్వకపోతే ఫేస్బుక్లో పెడతానని, పరువు పోతుందని బెదిరించడంతో పరువుపోతుందని రూ.3వేలు నాగరాజు ఖాతాలో వేసింది. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో గత ఏడాది సెప్టెంబర్‌లో పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. పూల వ్యాపారి వలలో... వరంగల్‌కు చెందిన ఒక ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థిని నల్లగొండలోని పూలు అమ్ముకునే ఒక వ్యాపారికి పొరపాటున ఫోన్ టచ్ అయి వచ్చింది. ఫోన్ మిస్డ్ కాల్స్ ఉన్నాయంటూ, మీ ఫ్రెండ్‌ను అంటూ మాటల్లో పెట్టి స్నేహం పెంచుకున్నాడు. 10వ తరగతి కూడా చదవని పూల వ్యాపారి వరంగల్‌కు చెందిన ఆ విద్యార్థినిని వలలో వేసుకున్నాడు. ఆ విద్యార్థిని పెళ్లి చేసుకుందామని నల్లగొండకు రావడంతో పూల వ్యాపారి భయపడి మైనార్టీ తీరలేదని, పెళ్లి చేసుకుంటామని పోలీసులను ఆశ్రయించాడు. 2ఏళ్ల క్రితం పోలీసులు విద్యార్థిని తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి నేటి యువత స్మార్ట్‌ఫోన్ దొరికితే చాలు సమయం తెలియకుండా గడుపుతున్నారు. ఫేస్‌బుక్‌లలో వ్యక్తుల గురించి తెలుసుకోకుండా పరిచయం చేసుకుని చాటింగ్‌లు చేస్తున్నారు. ఫేస్బుక్లో పెట్టే ఫొటోలకు, కామెంట్లకు ఆకర్షితులవుతున్నారు. దీంతో వ్యక్తుల మధ్య ఎలాంటి విషయాలు తెలుసుకోకుండా పరిచయం పెంచుకుని అనర్థాలకు దారితీసుకుంటున్నారు. కొన్ని పరిచయాలు మరణాలకు సైతం దారితీస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలని గాని పరిమితికి మించి వాడకూడదు. వ్యక్తిగత సమాచారాలను ఫేస్బుక్లో పెట్టకూడదు. ఫేస్బుక్ పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలి. – భుజంగరావు, ఏసీపీ భువనగిరి నిబంధనలు అమలు చేయాలి ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిబంధనలు లేకపోవడం వల్ల స్మార్ట్ఫోన్లను విరివిగా వాడుతున్నారు. చాటింగ్, వాట్సాప్, ఫేస్‌బుక్‌లతో కాలం గడుపుతున్నారు. ఫేస్బుక్ పరిచయాల వల్ల అనర్థాలకు దారితీస్తోంది. యువతీ యువకుల మధ్య ఫేస్బుక్ ద్వారా ఏర్పడ్డ పరిచయాలతో ప్రాణాలు సైతం పొగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి సమయంలో నూతన చట్టాలను తీసుకువచ్చి మూడు నెలల్లో శిక్ష అమయ్యేలా చూడాల్సిన అవసరం ఉంది. – గొట్టిపాముల బాబురావు, అడ్వకేట్ యువత సోషల్ మీడియాతో చిత్తవుతోంది నేటి యువత సోషల్ మీడియా మత్తులో చిత్తయిపోతుంది. సోషల్ మీడియా ప్రభావం మత్తు పదార్థాల కన్నా ఎక్కువగా ఉంటుంది. టిక్‌టాక్ మోజులో పడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోవడం మనం చూశాం. నేరాలకు ఒకరకంగా సోషల్ మీడియానే కారణం అవుతోంది. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో కనిపించని మనుషులతో కబుర్లు ఆడుతూ విలువైన కాలాన్ని హరింపజేసుకుంటున్నారు. కొంతమంది ఫేస్బుక్లో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేసి అమ్మాయిలను స్నేహం, ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. స్నేహం చేసేటప్పుడు అవతలి వ్యక్తి నిజమా, అబద్దమా తెలియకుండా గుడ్డిగా ఆడపిల్లలు ప్రేమ పేరుతో మోసపోవడం అనేది పరిపాటిగా మారింది. వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోవడం, ఫొటోలను షేర్ చేయడం ద్వారా కూడా ఎదుటి వారి ఉచ్చులోకి పడిపోతున్నారు. ముఖ్యంగా యువతనే కాకుండా ఎవరైనా సరే అప్రమత్తంగా ఉండాలి. జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకొని లక్ష్య సాధనలో ప్రతి క్షణం కష్టపడాలి. – గంజి భాగ్యలక్ష్మి, మోటివేషనల్ స్పీకర్, నల్లగొండ -
ఠాణా ఎదుట ఆత్మహత్యాయత్నం
సాక్షి, కొత్తూరు: భూమి విషయంలో పోలీసులు తమను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ తండాకు చెందిన పలువురు రైతులు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ధర్నా చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న ఓ గిరిజన యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎస్ఐ కృష్ణతో పాటు షాద్‌నగర్‌కు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి భూమికి సంబంధించిన గొడవలో జోక్యం చేసుకుంటూ తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని, వ్యాపారులతో కుమ్మక్కై తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. ఈ క్రమంలో తండాకు చెందిన యువకుడు రాజేందర్ స్టేషన్ ఆవరణలో సీఐ, ఎస్ఐ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. వెంటనే తండావాసులు అప్రమత్తమై అతడి నుంచి డబ్బాను లాక్కొని నీళ్లు చల్లారు. అనంతరం మండల కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. సివిల్ విషయంతో పోలీసులు తలదూర్చమని హమీ ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తామని భీష్మించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఇముల్‌నర్వ గ్రామ శివారులో సర్వే నంబర్ 293, 295, 296, 307, 309, 325లోని సుమారు 64 ఎకరాల భూమిని కొన్నేళ్లుగా తాము కాస్తులో ఉండి సాగు చేసుకుంటున్నామని, అయితే ఇటీవల తమ తండావాసులు కొందరు భూమిని విక్రయించారని తెలిపారు. ఆ భూములను కొనుగోలు చేసిన వ్యాపారులు మధ్యలో ఉన్న పొలాలకు దారి ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని, వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. మాజీ సర్పంచ్ అరెస్టుతో.. ఇన్ముల్‌నర్వ తండాకు చెందిన మాజీ సర్పంచ్ మిట్టునాయక్ గురువారం ఉదయం జేపీ దర్గా ఆవరణలో ఉండగా కొత్తూరు ఎస్ఐ కృష్ణ, సీఐ చంద్రబాబు అతడిని తమ కారులో ఎక్కించుకొని స్టేషన్‌కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న బాధిత రైతులు, తండావాసులు దాదాపు 100 మంది ఠాణాకు చేరుకున్నారు. పోలీసులు వ్యాపారులతో కుమ్మక్కై తమపై దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. వివాదం ఉన్న పొలానికి మిట్టునాయక్‌కు సంబంధం లేకున్నా అకారణంగా ఆయనను ఎందుకు ఠాణాకు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయమై ఎస్ఐ కృష్ణ మాట్లాడుతూ.. తాము వ్యాపారులతో కుమ్మక్కు కాలేదని స్పష్టం చేశారు. వ్యాపారులు కట్టిన గోడను తండావాసులు కూలగొట్టడంతో వ్యాపారుల ఫిర్యాదు మేరకు తండావాసులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చట్ట ప్రకారమే తాము వ్యవహరించామన్నారు. -
చంద్రశేఖర్‌ది ఆత్మహత్య
సాక్షి, చెన్నై: భారత మాజీ క్రికెటర్ వీబీ చంద్రశేఖర్ (58) గుండెపోటుతో మరణించలేదని, ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు ధ్రువీకరించారు. ఆయన బలవన్మరణానికి అప్పులే కారణమని తేల్చారు. ఆర్థిక సమస్యల వల్లే చెన్నైలోని తన నివాసంలో చంద్రశేఖర్ గురువారం ఉరేసుకొని మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఆయన మరణవార్తతో తమిళనాడు క్రికెట్ సంఘం వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కాంచీ వీరన్స్ జట్టును ఆయన కొనుగోలు చేశారు. దీని నిర్వహణతో పాటు తన అకాడమీ కోసం బ్యాంకులు, సన్నిహితుల వద్ద రూ. 3 కోట్ల మేర అప్పు చేశారు. చివరకు చెల్లించలేని పరిస్థితి తలెత్తడంతో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చెన్నై రాయపేట ఆసుపత్రిలో శుక్రవారం చంద్రశేఖర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, క్రికెటర్లు దినేష్ కార్తీక్, మురళీ విజయ్, విజయ్ శంకర్‌లతో పాటు తమిళనాడు క్రికెట్ సంఘం సభ్యులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. -
హెయిర్‌డై వేసుకోవద్దన్నందుకు..
చిలకలగూడ : హెయిర్ డై వేసుకోవద్దన్నందుకు మనస్తాపానికి లోనైన ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హన్మకొండ ఖాజీపేటకు చెందిన ఎస్కే సమీన (28) ఒమర్ భార్యభర్తలు. వీరికి నలుగురు కుమారులు. ఏడాదిన్నర క్రితం నగరానికి వలస వచ్చి చిలకలగూడ చింతబావిలో ఉంటున్నారు. జుత్తులో తెల్లవెంట్రుకలు కనిపించడంతో సమీర ఈనెల 8న హెయిర్‌డై వేసుకుంది. దీనిని గుర్తించిన ఒమర్ అమెను నిలదీయడంతో పాటు అనుమానం వ్యక్తం చేయడంతో మనస్తాపానికి గురైన సమీన ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె కేకలు విన్న స్థానికులు అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. 90 శాతం కాలిన గాయాలతో సమీన గాంధీ ఆస్పత్రి బరŠన్స్వార్డులో చికిత్స పొందుతోంది. బాధితురాలలి నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..
సాక్షి, యాదాద్రి : ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రామన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వీరమల్ల ప్రసన్న-రేపాక గణేష్‌లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే గణేష్ వివాహానికి నిరాకరించడంతో.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనను పోలీసులు అడ్డుకోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. -
హెరిటేజ్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ఆత్మహత్య
సాక్షి, దర్శిటౌన్: హెరిటేజ్ కంపెనీలో పనిచేస్తున్న ఓ డిస్ట్రిబ్యూటర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కంపెనీ తనను అకారణంగా తొలగించడంతోనే అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరానికి చెందిన గంగినేని హరిబాబు(48) 2012లో హెరిటేజ్‌కు చెందిన పాలు, సంబంధిత పదార్థాల సీ అండ్ ఎఫ్ (కారీయింగ్ అండ్ ఫార్వార్డింగ్) డిస్ట్రిబ్యూటర్‌గా చేరాడు. రూ.2.8 లక్షలు కూడా డిపాజిట్ చేశాడు. ఒంగోలు నగరంలో ఉంటున్న ఆయన.. కంపెనీ తనకు సరఫరా చేస్తున్న పాలు ఇతర పదార్థాలను ఏజెంట్లకు సరఫరా చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదనంగా డిపాజిట్ చెల్లించకపోవడం తదితర కారణాలతో పాల పదార్థాల సరఫరా నిలిపివేస్తున్నట్టు హరిబాబుకు జనవరి 5న కంపెనీ నుంచి మెయిల్ అందింది. కంపెనీ పెద్దలను బతిమాలుకున్నా ఫలితం లేకపోవడంతో మర్నాడే నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలకు లేఖ రాశాడు. తనను ఆపేస్తే ఆర్థికంగా ఇబ్బందిపడతానని లెటర్లో వేడుకున్నాడు. ఇతర కంపెనీలతో పోల్చితే హెరిటేజ్‌లో తక్కువప్రోత్సాహకం ఇస్తున్నా టీడీపీపై అభిమానంతోనే పనిచేస్తున్నట్టు పేర్కొన్నాడు. ఆ ఉత్తరానికి కంపెనీ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. బకాయిలు ఆగిపోవటం, డిపాజిట్ వెనక్కు ఇవ్వకపోవడంతో బయట ముఖం చూపించలేకపోతున్నానని, ఆత్మహత్యే శరణ్యమని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. కంపెనీ తనను తీసేయడంతో అప్పుల పాలై చివరికి తన 3.5 ఎకరాల పొలం అమ్మి కొంతమేర బాకీలు తీర్చాడు. ఈ నేపథ్యంలో శనివారం స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆదివారం ఉదయం ఇంటి ముందు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. బంధువులు అద్దంకిలోని ఆస్పత్రికి తరలించగా> అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. ఘటనాస్థలంలో లభించిన ఆనవాళ్లను బట్టి మద్యంలో పురుగు మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. దీనిపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. -
ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్యాయత్నం
-
లైవ్‌లో ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న పోలీసులు
దుబాయ్: యూఏఈలోని షార్జాలో సోషల్ మీడియా లైవ్‌లో ఆత్మహత్యకు యత్నించి న భారత యువతిని ఆ దేశ పోలీసులు సకాలంలో అడ్డుకుని ప్రాణాల ను కాపాడారు. సోషల్ మీడియాలో స్వయంగా పోస్టు చేసిన తన చిత్రానికి ఎక్కువగా వ్యతిరేక స్పందనలు రావడంతో మనస్తాపం చెందిన యువతి బలవ న్మరణానికి యత్నించిందని పోలీసులు తెలిపారు. షార్జాలోని ఏ1 నహదా ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి దాటాక రెండు గంటల సమయంలో సోషల్ మీడియాలో వీడియో లైవ్ పెట్టి ఆత్మహత్యకు సిద్ధం కాగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఆమె ఉంటున్న ఇంటి వద్దకు చేరుకుని తలుపు తట్టగా...ఆ యువతి తండ్రి తలుపు తీశాడు. పోలీసులు కన్పించేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. వెంటనే లోపలికి వెళ్లి ఆ యువతిని ఆత్మహత్యాయత్నం నుంచి కాపాడారు. ఆమెకు వైద్యులతో కౌన్సిలింగ్ ఇప్పించారు. -
హాస్టల్ భవనం పైనుంచి దూకిన విద్యార్థిని
కృష్ణా : హాస్టల్భవనం పైనుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. నూజివీడులోని ట్రిపుల్ ఐటీకి చెందిన విద్యార్థిని బోడు సుష్మా పావని గురువారం ఉదయం హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పరిస్థితి విషమించడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న సుష్మా.. వరంగల్‌జిల్లాలోని గుండెగ గ్రామానికి చెందినట్లు సమాచారం. -
పిల్లలతో కలసి తల్లి ఆత్మహత్యాయత్నం
త్రిపురారం : ఆర్థిక ఇబ్బందులు, భర్త వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలసి సాగర్ ఎడమకాల్వలో దూకింది. ఈ సంఘటనలో ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో బాబు గల్లంతయ్యాడు. కాల్వలో కొట్టుకుపోతున్న తల్లిని స్థానికులు గమనించి ఒడ్డుకు చేర్చారు. శుక్రవారం నల్లగొండ జిల్లా హాలియా మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దామరచర్ల మండలం గోన్యాతండాకు చెందిన ధనావత్ హరి, బుజ్జి దంపతుల పెద్ద కుమార్తె స్వాతిని తిరుమలగిరి మండలం రంగుండ్ల గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ఆంగోతు మోహన్‌కి ఇచ్చి 8 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి సాత్వీక(7), కవల పిల్లలైన మధునశ్రీ (5), మమంత్‌కుమార్ (5) ఉన్నారు. ఏడాదిన్నరనుంచి హాలియాలోని వీరయ్యనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. మోహన్ పెద్దవూర పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, మోహన్, స్వాతిల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మోహన్ మద్యం మత్తులో రోజూ స్వాతిని హింసించేవాడు. అదనపు కట్నం తేవాలని ఇబ్బందులకు గురిచేస్తుండేవాడు. గొడవలు జరిగినప్పుడల్లా స్వాతి తన తల్లిదండ్రుల చెప్పడంతో వారు తమ బిడ్డకు నచ్చజెప్పి పంపేవారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇరువురి మధ్య గొడవ జరిగింది. మరుసటి రోజు ఉదయం మోహన్ విధులకు వెళ్లాడు. భర్తలో మార్పు రావడం లేదని కుమిలిపోయిన స్వాతి తనువు చాలించాలని భావించింది. తాను చనిపోతే పిల్లలు అనాథలవుతారని భావించి స్కూల్ వెళ్లి తన ముగ్గురు పిల్లలను ఇంటికి తీసుకువచ్చింది. స్కూల్‌డ్రెస్ తీయకుండానే హాలియాలోని మసీదు వద్ద ఉన్న ఎడమ కాల్వ వద్దకు వెళ్లి తన ముగ్గురు పిల్లలతో కలసి దూకింది. స్వాతిని కాపాడిన ఎంపీటీసీ, పోలీసులు తల్లి, ముగ్గురు చిన్నారులు కాల్వలో కొట్టుకుపోతున్న విషయాన్ని గమనించిన స్థానిక ఎంపీటీసీ సభ్యుడు చెరుపల్లి ముత్యాలు, పోలీస్ సిబ్బంది నసీరోద్దీన్, మునినాయక్‌తోపాటు మరో ఐదుగురు యువకులు కాల్వలోకి దూకి స్వాతితోపాటు సాత్వీక, మధునశ్రీలను ఒడ్డుకు చేర్చారు. మరో బాలుడు మమంత్‌కుమార్ గల్లంతయ్యాడు. అప్పటికే ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. స్వాతికి ప్రథమ చికిత్స చేసి స్థానిక యశోద ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన చిన్నారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. -
మమ్మల్ని పట్టించుకోకుండా ‘ముందస్తు’కా?
సాక్షి, హైదరాబాద్: ‘మా సమస్యల్ని పట్టించుకోకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అమరుల వివరాలపై ఇంకా స్పష్టత లేదు’ అంటూ రాజ్‌భవన్ ముందు ఓ యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కాసేపట్లో సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దు తీర్మానంతో రాజ్‌భవన్‌కు వస్తారనగా.. ఈ పరిణామంతో కలకలం రేగింది. మీడియా ప్రతినిధుల మధ్య నుంచి ముందుకొచ్చిన బొప్పాని ఈశ్వర్ అనే వ్యక్తి జైతెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన మీడియా ప్రతినిధులు, పోలీసులు అతడిని నిలువరిస్తున్నా.. నినాదాలు చేస్తూ.. తానెందుకు ఆత్మహత్యాయత్నం చేసుకోవాల్సి వచ్చిందో వివరించాడు. ఉద్యమకారులకు ఏం దక్కలేదు..: ‘నా పేరు బొప్పాని ఈశ్వర్ (27). ఓయూ(నిజాం కాలేజీ) పూర్వ విద్యార్థిని. మాది ఉమ్మడి నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి అవురవాణి గ్రామం. ‘తెలంగాణ సామా జిక విద్యార్థి వేదిక’ తరఫున నా నిరసనను తెలుపుతున్నాను. నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు నేటికీ న్యాయం జరగలేదు. ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరుల వివరాలపై నేటికీ స్పష్టత లేదు. తెలంగాణ కోసం ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాడినా విద్యార్థులైన మాకు ఏం దక్కలేదు. మేం చదువును పక్కనబెట్టి, లాఠీ దెబ్బలు తిని మిమ్మల్ని (కేసీఆర్) సీఎం చేస్తే మీరు మాకు ఏం చేయలేదు. మీ ఇంట్లో అందరికీ పదవులు వచ్చాయి. మేం మాత్రం చదువులు, ఉద్యోగాలకు దూరమయ్యాం. ఇవన్నీ పరిష్కరించకుండానే పదవీకాలం ముగియకముందే ముందస్తు ఎన్ని కలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది..’అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈలోగా పోలీసులు వచ్చి అతనిని పంజగుట్ట పోలీసుస్టేషన్‌కు తరలించారు. -
నాకే ఎందుకిలా..!
మూడు నెలల కింద ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ వ్యక్తి హుస్సేన్‌సాగర్‌లో దూకాడు. లేక్‌పోలీసులు గమనించి అతన్ని కాపాడారు. తాను చాలా కష్టాల్లో ఉన్నానని, తనను ఆదుకొనేందుకు ఎవరూ లేరని గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ నెల 10వ తేదీన ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా డిప్రెషన్‌పై ప్రత్యేక కథనం.. నెల రోజుల కింద 18 ఏళ్ల వయసు కూడా లేని ఓ యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉండగానే తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకునేందుకు యత్నించాడు. అదే సమయంలో ఓ స్వచ్ఛంద సంస్థకు కాల్ చేసి తాను చనిపోబోతున్నానని చెప్పాడు. ప్రేమ విషయంలో మోసపోయిన తనకు ఆత్మహత్యే శరణ్యం అంటూ ఆవేదన చెందాడు. చివరకు స్వచ్ఛంద సంస్థ కౌన్సెలింగ్ సాయంతో ఆత్మహత్యాయత్నాన్ని విరమించుకున్నాడు. వైమీ సిండ్రోమ్ అనే కుంగుబాటుతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కుటుంబసభ్యులు, స్నేహితులు, ఎందరున్నా డిప్రెషన్‌తో కుంగిపోతున్నారు. ప్రపంచంలో ఎవరికీ లేని బాధలు, కష్టాలు తమకే ఉన్నాయని, తామే ఎందుకిలాంటి దుర్భరమైన స్థితిలో బతకాల్సి వస్తోందనే డిప్రెషన్‌తో ఆత్మహత్యకు పాల్పడుతున్న వారు ఏటికేటికీ పెరుగుతున్నారు. ఏటా వారి సంఖ్య 250 నుంచి 300 వరకు నమోదవుతున్నట్లు ఆత్మహత్యల నివారణ సంస్థ రోష్ని అధ్యయనంలో వెల్లడైంది. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు యువత 50 శాతం వరకు ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఆ తర్వాత మహిళలు, వయోధికులు, తదితర కేటగిరీలకు చెందిన వారున్నారు. అన్ని వర్గాల్లోనూ ఎక్కువ శాతం డిప్రెషన్ కారణంగా ఒంటరితనానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారానికి సుమారు ఐదుగురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తేలింది. సగటున నెలకు 30 మందికి పైగా బాధితులు తమకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో గత్యంతరం కనిపించడం లేదంటూ ఫోన్ ద్వారా ‘రోష్ని’ని సంప్రదిస్తున్నారు. బంధాలు తెగిపోతున్నాయి.. కుటుంబాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఇంట్లో అందరూ ఉన్నా ఎవరికీ ఎవరూ ఏమీ కాని ఓ చిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరి ప్రపంచంలోకి మరొకరు తొంగి చూడట్లేదు. ఎవరికి వారు ఒంటరిగానే బతికేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ తరహా జీవన శైలి బాగా వేళ్లూనుకుపోతోంది. ఒకరి సమస్యలను ఒకరికి చెప్పుకొని పరిష్కరించుకొనే స్నేహపూరితమైన వాతావరణం లోపిస్తోంది. ఇంటా బయటా తీవ్ర ఒత్తిడికి గురవుతున్న వారు చివరకు డిప్రెషన్‌తో ఆత్మహత్యకు ఒడిగడుతున్నారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, కెరీర్, ర్యాంకులు వంటి అంశాల్లో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న వారు ‘వైమీ సిండ్రోమ్’తో బాధపడుతున్నారు. చివరకు చావును పరిష్కారంగా భావిస్తున్నారు. కుటుంబ హింస, అనారోగ్యం.. మోసపోయిన వారు, కుటుంబ హింస ఎదుర్కొంటున్న మహిళలు కూడా తీవ్రమైన కుంగుబాటుకు లోనవుతున్నారు. అనారోగ్యంతో బాధపడే వృద్ధులు పరిష్కారంగా చావును వెతుక్కుంటున్నారు. చివరకు ఖరీదైన మొబైల్ ఫోన్ లేదనే కారణంతో డిప్రెషన్‌కు గురై ‘వైమీ సిండ్రోమ్’బారిన పడుతున్నట్లు అంచనా. నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం.. కుంగుబాటు మనిషిలో అనూహ్యమైన మార్పులు తీసుకొస్తుంది. నిద్రలేమి.. విపరీతమైన కోపం, తీవ్రమైన బాధ, అకారణమైన దుఃఖం, ఎవరికీ భారం కావొద్దనే భావన వెంటాడుతాయి. తరచుగా జీవితంపై విరక్తి ప్రకటిస్తారు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు కుటుంబసభ్యులు, స్నేహితులు గుర్తించి భరోసా ఇవ్వాలి. డిప్రెషన్ బాధితుల బాధను ఓపిగ్గా వినాలి. గ్రేటర్లో ఇలా.. ► రోష్ని స్వచ్ఛంద సంస్థ అధ్యయనం ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు 250 మంది డిప్రెషన్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ► ఏటా 350 నుంచి 400 వరకు ఈ తరహా కేసులు నమోదువుతున్నాయి. ► తాము ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు ప్రతి నెలా 30 మందికి పైగా ‘రోష్ని’ని సంప్రదిస్తున్నారు. గతేడాది ఆత్మహత్యల్లో 20 ఏళ్లలోపు వారు: 62 21 నుంచి 30 ఏళ్ల వయసు వారు: 140 31 నుంచి 40 ఏళ్ల వయసు వారు: 91 41 నుంచి 60 ఏళ్ల వయసు వారు: 38 60 ఏళ్లు దాటినవారు: 31 మీ కోసం మేమున్నాం జీవితంలో సమస్యలు రావడం సహజం. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ప్రపంచంలో ఎవ్వరికీ లేని బాధలు తమకు మాత్రమే ఉన్నాయనుకోవడం సరికాదు. డిప్రెషన్‌తో బాధపడుతున్నవాళ్లు నేరుగా సికింద్రాబాద్, సింధ్ కాలనీలోని రోష్ని సంస్థను సంప్రదించొచ్చు. లేదా 040–6620 2000, 040–6620 2001 నంబర్లకు ఫోన్ చేసి పరిష్కారం పొందొచ్చు. మీ కోసం మేమున్నామనే విషయాన్ని మరిచిపోవద్దు. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు రోష్ని పని చేస్తుంది. - మాలతీరాజి, డైరెక్టర్, రోష్ని ఓదార్పు ఎంతో ముఖ్యం సంతోషాన్ని పంచుకుంటే రెట్టింపవుతుంది. బాధను పంచుకుంటే సగమవుతుంది. బాధలో ఉన్నవారు చెప్పేది ఓపిగ్గా వింటే చాలు వారికి ఎంతో ఊరట లభిస్తుంది. భరోసాను, మానసిక ధైర్యాన్ని అందజేస్తే డిప్రెషన్ నుంచి బయటపడతారు. - ఆనంద దివాకర్, రోష్ని ప్రతినిధి – సాక్షి, హైదరాబాద్ -
నేను క్షేమంగానే ఉన్నా: దర్శకుడు
రుద్రమదేవి రైటర్ రాజసింహా తాను క్షేమంగా ఉన్నట్లు ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆయన కొంతకాలంగా సినిమాల్లో అవకాశాలు లేక డిప్రెషన్లో ఉన్నట్టు, ముంబైలోని తన రూంలో ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు నిన్న వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమీ లేదంటూ సోషల్‌మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ‘నేను రాజసింహా. నేను క్షేమంగా ఉన్నాను. నాకు డయాబెటిక్ ఉంది. షుగర్ లెవల్ డౌన్ అవ్వడం, రాత్రి పక్కన ఎవరూ లేకపోవడంతో కాస్త సీరియస్ అయింది. నేను ప్రస్తుతం బాగానే ఉన్నాను. నా గురించి కంగారు పడ్డ వాళ్లందరికి ధన్యవాదాలు. ఇంకో 2, 3 రోజుల్లో హైదరాబాద్ వస్తాను’ అంటూ వీడియోలో తెలిపారు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఒక అమ్మాయి తప్ప సినిమాతో రాజసింహా దర్శకుడిగా పరిచయం అయ్యారు. శంకర్‌దాదా ఎంబీబీయస్, బొమ్మరిల్లు, ఝుమ్మందినాధం, అనగనగా ఓ ధీరుడు, రుద్రమదేవి సినిమాలకు రాజసింహా రచయితగా పనిచేశారు. సంబరం, నీ స్నేహం, టక్కరిదొంగ లాంటి సినిమాల్లో నటుడిగానూ కనిపించారు. జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన పలు చిత్రాలకు సెకండ్‌యూనిట్ దర్శకుడిగా పనిచేశారు. -
నేను ప్రస్తుతం బాగానే ఉన్నాను
-
కస్టడీలో ఎమ్మెల్యే బాధిత యువతి తండ్రి మృతి
లక్నో: తన కుమార్తెపై ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసిన వ్యక్తి సోమవారం పోలీసు కస్టడీలో ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆ వ్యక్తిని ఎమ్మెల్యేపై కుట్ర పన్నుతున్నాడనే అభియోగంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై యూపీ సీఎం ఆదిత్యనాథ్ దర్యాప్తునకు ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారులు ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్, ఆయన సోదరులు ఏడాది క్రితం తనను రేప్ చేశారని ఉన్నవోకు చెందిన 18ఏళ్ల అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఎమ్మెల్యేపై కేసు పెట్టని పోలీసులు.. కుట్రకు పాల్పడుతున్నాడంటూ ఆమె తండ్రిని ఈ నెల 5న అరెస్టు చేశారు. దీంతో ఆదివారం ఆ యువతి తన కుటుంబంతో సహా సీఎం ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా జైలులో ఉన్న బాధితురాలి తండ్రిని పోలీసులు అదేరోజు రాత్రి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులే తన తండ్రిని లాఠీలతో బాది చంపేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. -
కర్నూలులో హోంగార్డు ఆత్మహత్యాయత్నం
-
ఇరిగేషన్ శాఖ ఉద్యోగి ఆత్మహత్య
-
పబ్ ఎదుట మందుబాబు హల్చల్
-
పబ్ నుంచి బయటకు వెళ్లమన్నందుకు..
హైదరాబాద్: అర్ధరాత్రి తర్వాత పబ్‌కు వెళ్లి మద్యం కావాలంటూ హంగామా చేయడంతోపాటు బౌన్సర్లు అడ్డుకోవడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసు కుంది. నిజామాబాద్‌కు చెందిన సందీప్ వర్మ(35) అదే ప్రాంతానికి చెందిన రాజేందర్, శాలిబండలో నివాసముండే జావెద్, కైసర్ స్నేహితులు. వీరంతా సందీప్ వర్మ కారులో శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో సోమాజిగూడ పార్క్ హోటల్లోని అక్వాపబ్‌కు వెళ్లి మద్యం ఆర్డర్ ఇచ్చారు. సమయం మించిపోయిందని వెయిటర్ చెప్పడంతో గొడవకు దిగారు. దీంతో బౌన్సర్లు వీరిని పబ్ బయటకు లాక్కొచ్చారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సందీప్‌వర్మ తన కారులో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్దనున్న పెట్రోల్‌బంక్‌కు వెళ్లాడు. 4 లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేసి పబ్‌కు వచ్చాడు. గేటు వద్దే బౌన్సర్లు అడ్డుకోవడంతో పెట్రోల్‌ను తనతోపాటు బౌన్సర్ మన్సూర్‌పై పోశాడు. ఆ వెంటనే నిప్పంటించుకోవడంతో హోటల్ సిబ్బంది అప్రమత్తమై సందీప్‌ను యశోద హాస్పిటల్‌కు, బౌన్సర్‌ను దక్కన్ హాస్పిటల్‌కు తరలించారు. సందీప్ వర్మ 60 శాతం కాలిన గాయాలతో, బౌన్సర్ స్వల్పగాయాలతో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. సందీప్ స్నేహితులు రాజేందర్, జావెద్‌ను పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కైసర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు పబ్‌లను తెరిచి ఉండటం, గొడవ జరుగుతున్న సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున 3 గంటల వరకు జరిగిన సంఘటనను వెలుగులోకి రాకుండా ఉండేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. -
సెలక్ట్ చేయకపోతే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా!
సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా యువబౌలర్ చైనామన్ కుల్దీప్ యాదవ్ ఒకప్పుడు ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. ఇక జన్మలో క్రికెట్ ఆడకూడదని కూడా నిర్ణయించుకున్నాడు. కానీ ఇప్పుడతను టీమిండియాలో కీలక బౌలర్. విచిత్రమైన బౌలింగ్ యాక్షన్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసే కుల్దీప్ ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాపై టెస్ట్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. రెండు టెస్టుల్లో 9 వికెట్లతో టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే 13 ఏళ్ల వయసులో ఉన్నపుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు కుల్దీప్ శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపాడు. ‘ఉత్తర్ ప్రదేశ్ అండర్ 15 టీమ్ జట్టులో చోటు కోసం చాలా కష్టపడ్డాను. కానీ తనను ఎంపిక చేయకపోవడంతో నిరాశ చెందా. దీంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. జన్మలో ఇక క్రికెట్ జోలికి వెళ్లొద్దని కూడా నిర్ణయించుకున్నా. అసలు స్కూల్లో తనకు క్రికెట్ అంటే ఓ టైంపాస్ గేమ్‌లాగే ఉండేది. కానీ తన తండ్రి ఒత్తిడి మేరకే శిక్షణ తీసుకొని ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారాను. మొదట్లో పేస్ బౌలర్ కావాలని అనుకున్నా. కోచ్ సూచన మేరకు స్పిన్నర్‌గా మారిన’ అని కుల్దీప్ యాదవ్ తెలిపాడు. అప్పట్లో పాక్ పేసర్ వసీమ్ అక్రమ్, ఆసీస్ బౌలర్ షేన్ వార్న్ అభిమానని అతను చెప్పాడు. ముఖ్యంగా వార్న్ బౌలింగ్ ఫుటేజ్ చూసి తాను మెళకువలు నేర్చుకున్నట్లు కుల్దీప్ యాదవ్ అన్నాడు. కెప్టెన్ కోహ్లి, ధోనీ తనకెంతగానో మద్దతిస్తున్నారని తెలిపాడు. ప్లేస్టేషన్ 4 తన ఫేవరెట్ వీడియో గేమ్ అని, ఈ గేమ్ ఆడటం ద్వారా తాను నిజ జీవితంలో సమస్యల పరిష్కారాన్ని కూడా సులువుగా చేయగలుగుతున్నానని కుల్దీప్ పేర్కొన్నాడు. -
ఎస్పీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం
ఒంగోలు సెంట్రల్ : అట్రాసిటీ కేసు విచారణలో తనకు న్యాయం జరగలేదని మనస్తాపం చెందిన ఓ దళిత మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. తన వెంట తెచ్చుకున్న నిద్రమాత్రలు మింగి, ఆస్పత్రి పాలైంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం చోటుచేసుకుంది. బాధిత మహిళ కథనం ప్రకారం... దొనకొండలోని వీర వెంకటాపురం ఎస్సీ కాలనీకి చెందిన గొట్టెముక్కల సుజాతకు నరసరావుపేట మున్సిపాలిటీ వల్లూరివారి పాలెంలో తన తాత నుంచి ఎకరం పొలం వచ్చింది. 1974 నుంచి ఆమె తండ్రి దీనిని సాగు చేస్తున్నాడు. 2014కు ముందు మూడేళ్లుగా పొలాన్ని సాగు చేయడం లేదు. 2014 జూలై 17న బాధిత మహిళ పొలానికి వెళ్లగా, పక్క పొలంలోని బోడేపాటి హనుమంతురావు, అంజమ్మ, సత్యనారాయణ, పిన్నెల్లి హనుమంతురావు అనే వారు బాధితురాలిని పొలం నుంచి Ðð ళ్లిపోవాలని కొట్టారు. దీంతో బాధితురాలు నరసరావుపేట రూరల్ పొలీసుస్టేషన్‌లో 253, 2014 క్రై ం నంబర్‌తో ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో 2015 నవంబర్ 23వ తేదీన గతంలో నరసరావుపేటలో దాడి చేసిన నిందితులే తిరిగి మరోసారి దాడి చేశారని దొనకొండ పొలీసుస్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు 81/2015 నంబరుతో పోలీసుస్టేషన్లో రిజిస్టర్ అయింది. కే సును నమోదు చేసుకున్న ఎసై ్స కె.అజయ్‌కుమార్, అది అట్రాసిటీ కేసు కావడంతో దర్శి డీఎస్పీ వి.ఎస్.రాంబులకు రిఫర్‌చేశారు. అనంతర కాలంలో డీఎస్పీ బాధితురాలి ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. ఆ తర్వాత బాధితురాలు గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసింది. ఈ కేసులో న్యాయం జరగడం లేదని గతవారం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. దీనిపై సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మరోసారి ఎస్పీని కలవడానికి వచ్చిన ఆమెను సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఇక తనకు న్యాయం జరగదని భావించిన సుజాత తన వెంట తెచ్చుకున్న నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. కొద్దిసేపటికే స్ఫహæకోల్పోవడంతో పొలీసులు గమనించి, అంబులెన్సులో రిమ్స్‌కు తరలించారు. మాత్రలను కక్కించిన రిమ్స్ వైద్యులు బాధితురాలికి ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు. తాలుకా సీఐ ఆంటోని రాజ్ చికిత్స పొందుతున్న బాధితురాలి నుంచి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. తాను స్ఫహæ కోల్పోయిన సమయంలో తన వద్ద ఉన్న పత్రాలను పోలీసులు తీసుకున్నారని బాధితురాలు చెప్పింది. తనకు న్యాయం చేయాలని హైదరాబాద్ వెళ్లి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను కూడా కలిశానని తెలిపింది. -
యువకుడి ఆత్మహత్యాయత్నం
జఫర్‌గఢ్ : ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం కొందరు తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవడంతోపాటు వారు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక మనోవేదనకు గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని ఓబులాపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఓబులాపూర్‌కు చెందిన వంగాల నరేష్ కొన్నేళ్ల క్రితం గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు తీగల కరుణాకర్‌రావు.. స్థానిక రైతు గార్లపాటి నీరజారెడ్డి భూమిని జేసీబీతో చదును చేయించాడు. అయితే జేసీబీ ద్వారా చేసిన పనిని ఉపాధిహామీ ద్వారా కూలీ లతో చేయించినట్లుగా రికార్డు చేయాలని కరుణాకర్‌రావు, నీరజారెడ్డిలు ఫీల్డ్ అసిస్టెంట్ నరేష్‌పై ఒత్తిyì చేయగా ఆయన నిరాకరిం చాడు. దీంతో ఉపాధిహామీలో అవకతవకలు జరిగాయని, ఇందుకు బాధ్యుడైన ఫీల్డ్ అసిస్టెంట్ నరేష్‌పై చర్యలు తీసుకోవాలని నీరజారెడ్డి, కరుణాకర్‌రావులు ఉపాధి హామీ పీడీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రాజకీయ ఒత్తిడితో విచారణ చేపట్టిన అధికారులు నరేష్‌ను విధుల నుంచి తొలగించారు. అయితే కొన్ని రోజుల తర్వాత తిరిగి అదే ఉద్యోగాన్ని మళ్లీ ఇప్పిస్తామంటూ సదరు ఫిర్యాదుదారులు నరేష్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు నరేష్ వారికి కొన్ని నెలల క్రితం రూ. 1.50 లక్షలు ముట్టజెప్పాడు. అయినప్పటికీ వారు ఉద్యోగం ఇప్పించకపోవడంతో పాటు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన నరేష్ బుధవారం ఉదయం నీరజారెడ్డి, కరుణాకర్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనిం చిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలిచ్చారు. విష యం తెలుసుకున్న నరేష్ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు కారకులైన వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కరుణాకర్‌రావు, నీరజారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. బాధితుడి భార్య వంగాల సుమలత ఫిర్యాదు మేరకు కరుణాకర్‌రావు, నీరజారెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు చీటింగ్ కేసు నమోదు చేసినట్లు హెడ్ కాని స్టేబుల్ శ్యాంసుందర్ తెలిపారు. -
ఎస్పీ ఆఫీసు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సంగారెడ్డి: తనకు న్యాయం జరగడంలేదంటూ ఓ వ్యక్తి జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు. పటాన్చెరువు మండలం పెద్దకంజర్ల గ్రామానికి చెందిన జొన్నాడ కృష్ణ(35).. సోమవారం మద్యాహ్నం సంగారెడ్డిలోని మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు అతణ్ని అడ్డుకుని టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాధితుడు కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. తనకు 4.15 ఎకరాల భూమి ఉంది. దానిని ఓ లాయర్ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి వేరొకరికి విక్రయించాడు. ఈ విషయమై గతంలో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, కొనుగోలుదారు సదరు భూమిని ఇటీవల ఆధీనంలోకి తీసుకున్నాడు. ఈ వ్యవహారంపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకుగానూ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌డేకు హజరయ్యాడు. అధికారులు సరిగా స్పందిచకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.