
సాక్షి,రసూల్‌పురా: చెల్లితో గొడవ పడినందుకు తల్లి మందలించడంతో మనస్తాపానికిలోనైన ఓ బాలుడు(11) ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కార్ఖాన పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. డీఎస్‌ఐ అవినాష్ బాబు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కార్ఖాన బస్తీలో నివాసం ఉంటున్న శివనాథ్ రామ్, సంగీత దేవి దంపతులకు కుమారుడు (11), కుమార్తె (4) ఉన్నారు. గురువారం రాత్రి ధరమ్‌వీర్ కుమార్ తన చెల్లితో గొడవ పడ్డాడు.
ఈ విషయమై తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికిలోనైన అతను గదిలోకి వెళ్లి ఇనుపరాడ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.