చంద్రగిరి: రైలు కింద పడి యువతి ఆత్మాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని నరసింగాపురం రైల్వేగేటు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు... తిరుపతి అక్కారంపల్లె సమీపంలోని ఉపాధ్యా య నగర్‌కు చెందిన రాధమ్మ, వాసు దంపతుల కుమార్తె శ్రీలక్ష్మి బీకాం(కంప్యూటర్స్) పూర్తి చే సింది. ఇటీవల ఆమెకు టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చింది. కరోనా నేపథ్యంలో హోమ్ టు వర్క్‌లో భాగంగా ఇంట్లో నుంచే ఉద్యోగం చేస్తోంది.
ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం శ్రీలక్ష్మి తన స్కూటర్‌లో నరసింగాపురం రైల్వే పట్టాల వద్దకు చేరుకుని రైలు కింద పడింది. అయితే రైలు వెళ్లే క్రమంలో ఆమె తలకు గాయమై స్పృహ తప్పి పట్టాల మధ్యన పడింది. అనంతరం మరో రెండు రైళ్లు ఆమెపై నుంచి వెళ్లినప్పటికీ ఎటువంటి గాయాలు కాలేదు. స్థానికులు గుర్తించి, తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. తలకు గాయం కావడంతో ఆమె పరిస్థితి విషమించింది.
దీంతో ఆమెను స్విమ్స్‌కు తరలించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చే స్తున్నారు. అయితే శ్రీలక్ష్మి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదని, యువతి స్పృహలోకి వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
(చదవండి:కరోనా వేళ జోరుగా బాల్య వివాహాలు)
Comments
Please login to add a commentAdd a comment