tiruapthi
-
తిరుమల లడ్డూ ప్రసాదంలో పొగాకు ప్యాకెట్
ఖమ్మంరూరల్: దేవదేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం తీసుకొచ్చిన లడ్డూలో పొగాకుతో కూడిన ప్యాకెట్ రావడంతో భక్తులు నివ్వెరపోయిన ఘటన ఇది. ఖమ్మం రూరల్ మండలంలోని గొల్లగూడెం గ్రామపంచాయతీ శివారు కార్తికేయ టౌన్‌షిప్‌కు చెందిన దొంతు పద్మావతి బంధువులతో కలిసి ఈనెల 19న తిరుమల వెళ్లారు. అక్కడ 20వ తేదీన సర్వదర్శనం ద్వారా స్వామిని దర్శించుకున్నాక లడ్డూలు కొనుగోలు చేయగా ఆదివారం తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నారు. కాగా, ఉదయం లడ్డూ ప్రసాదాన్ని ఇంట్లో దేవుడి వద్ద ఉంచి బంధువులకు ఇచ్చేందుకు ముందు కొద్దిగా నోట్లో వేసుకోగా పొగాకు వాసన వచ్చింది. దీంతో పద్మావతి లడ్డూ మొత్తం చూడగా అందులో పొగాకుతో కూడిన ప్యాకెట్ కనిపించింది. కాస్త నమిలిన పొగాకును కాగితంలో చుట్టగా అది లడ్డూలో కలిసిపోయి ఉంది. దీంతో ఆమె పలువురికి చూపించగా పద్మావతితో పాటు వెళ్లిన మిగతా వారు తీసుకొచ్చిన వారు తెచ్చిన లడ్డూలు బాగానే ఉన్నాయి. కాగా, పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో ఇలా రావడంపై పద్మావతి సహా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
చంద్రబాబు ఆరోపణల్లో గుట్టు బట్టబయలు
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ అయిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేసిన నిరాధార ఆరోపణల్లోని గుట్టును వైఎస్ జగన్ పూర్తిగా బట్టబయలు చేశారని వైఎస్సార్సీపీ పేర్కొంది. లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి సేకరించడంలో ఉండే కఠిన, పారదర్శక విధానాలను విస్పష్టంగా వివరించారని తెలిపింది. నెయ్యి ఉపయోగం కోసం అంగీకరించే ముందు సమగ్ర నాణ్యత తనిఖీలు ఏ విధంగా చేస్తారో విపులంగా చెప్పారని, ఈ దృష్ట్యా పవిత్ర ప్రసాదం కోసం ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగే అవకాశం లేదని స్పష్టంగా తెలియజెప్పారని వివరించింది.తనిఖీ రిపోర్టులో పేర్కొన్న తేదీల్లోని కీలకమైన అసమానతలను ఎత్తిచూపుతూ.. ఎల్లో మీడియా ప్రసారం చేసిన తప్పుడు నివేదికలను ఎత్తిచూపారని చెప్పింది. ఈ మేరకు శనివారం ఆ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సమగ్ర అభివృద్ధికి, అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడానికి గత ప్రభుత్వంలో తీసుకున్న చర్యల గురించి కూడా వైఎస్ జగన్ చక్కగా వివరించారని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమాలు నిరంతరం మౌలిక సదుపాయాలు, సేవలను మెరుగు పరుస్తాయని చెప్పింది.చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితమని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీస్తాయని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులలో వైఫల్యాల నుండి దృష్టిని మరల్చడానికే బాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు మతపరమైన, భావోద్వేగపరమైన సున్నితత్వాన్ని పణంగా పెట్టి రాజకీయ లబ్ధి పొందడం తప్ప మరే ఇతర ప్రయోజనానికి ఉపయోగపడవని జగన్ స్పష్టం చేశారంది. చంద్రబాబు బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలపై న్యాయ వ్యవస్థ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తికి అధికారికంగా లేఖ రాస్తానని కూడా వైఎస్ జగన్ ప్రకటించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. -
కళ్ళు చెదిరే రీతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
జియో ట్రూ 5జీ : అతి త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో సేవలు
విజయవాడ: రాష్ట్రంలో 5జీ సేవలను అతి త్వరలో ప్రారంభించేందుకు జియో సమాయత్తమవుతోంది. రాష్ట్ర ప్రజలకు 5జీ సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జియో తన నెట్వర్క్ పై దృష్టి పెట్టింది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లతో సహా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రధాన పట్టణాల్లో జియో తన 4జీ నెట్వర్క్ ను 5జీ నెట్వర్క్ గా అప్డేట్ చేసి సేవలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా మిగతా పట్టణాలకు కూడా 5జీ సేవలను విస్తరించేందుకు కంపెనీ ప్రణాళికలను రూపొందించింది. దసరా రోజున ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, వారణాసి పట్టణాల్లో జియో 5జీ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. 'జియో వెల్కమ్ ఆఫర్' పేరుతో ప్రారంభించిన ఈ ప్రత్యేక ఆఫర్ కింద వినియోగదారులకు 1జీబీపీఎస్ స్పీడుతో అన్ లిమిటెడ్ డాటా అందించనున్నట్లు జియో ప్రకటించింది. ‘జియో ట్రూ 5జీ’ సేవలు పొందేందుకు కస్టమర్లు సిమ్ కార్డు, 5జీ మొబైల్ మార్చాల్సిన అవసరం లేదని, కస్టమర్లకు ఆటోమేటిగ్గా సర్వీస్ అప్‌గ్రేడ్ అవుతుందని జియో చెప్పింది. 5జీ సేవలు అందరికీ అందుబాటులో ఉంటాయని, ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, అన్ని రకాల వారికి అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం జియోకు 42.5 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. తాము ప్రారంభించనున్న 5జీ సేవల ద్వారా దేశంలో హెల్త్ కేర్, స్కిల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ వంటి అనేక రంగాలు మరింత ప్రగతి సాధిస్తాయని జియో విశ్వసిస్తోంది. 5జీ వేగంలోనూ జియో టాప్! 4జీ సేవలను అందించటంలో తన ఆధిపత్యాన్ని చాటుకున్న జియో 5జీ వేగంలోనూ అగ్రస్థానంలో నిలిచింది. 5జీ డేటా వేగం గణాంకాలను ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ ఊక్లా విడుదల చేసింది. దీని ప్రకారం రిలయన్స్ జియో 598.58 ఎంబీపీఎస్ డౌన్ లోడింగ్ వేగాన్ని నమోదు చేసింది. ఢిల్లీ, కోల్ కతా, ముంబై, వారణాసి ప్రాంతాల్లో జూన్ నుంచి ఈ పరీక్ష నిర్వహించారు. -
టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ జాబ్.. ఏమైందో తెలియదు
చంద్రగిరి: రైలు కింద పడి యువతి ఆత్మాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని నరసింగాపురం రైల్వేగేటు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు... తిరుపతి అక్కారంపల్లె సమీపంలోని ఉపాధ్యా య నగర్‌కు చెందిన రాధమ్మ, వాసు దంపతుల కుమార్తె శ్రీలక్ష్మి బీకాం(కంప్యూటర్స్) పూర్తి చే సింది. ఇటీవల ఆమెకు టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. కరోనా నేపథ్యంలో హోమ్ టు వర్క్‌లో భాగంగా ఇంట్లో నుంచే ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం శ్రీలక్ష్మి తన స్కూటర్లో నరసింగాపురం రైల్వే పట్టాల వద్దకు చేరుకుని రైలు కింద పడింది. అయితే రైలు వెళ్లే క్రమంలో ఆమె తలకు గాయమై స్పృహ తప్పి పట్టాల మధ్యన పడింది. అనంతరం మరో రెండు రైళ్లు ఆమెపై నుంచి వెళ్లినప్పటికీ ఎటువంటి గాయాలు కాలేదు. స్థానికులు గుర్తించి, తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. తలకు గాయం కావడంతో ఆమె పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను స్విమ్స్‌కు తరలించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చే స్తున్నారు. అయితే శ్రీలక్ష్మి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదని, యువతి స్పృహలోకి వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. (చదవండి:కరోనా వేళ జోరుగా బాల్య వివాహాలు) -
నేటినుంచి ప్రచారభేరి మోగించిన YSRCP
-
విద్యార్థినిలకు బ్లాక్మెయిల్..స్పందించిన సీఎం
‘సరస్వతీ నిలయాన్ని జైలుగా మార్చారు. అక్కడ చదువు చెప్పకపోగా.. విద్యార్థినులు చేసే చిన్న తప్పులతో బ్లాక్మెయిల్ చేస్తారు. వారిని తమ కళాశాల అనుమతుల కోసం, అధికారుల అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఇంటి నుంచి వంట పనివరకు అన్నీ చేయిస్తారు. అర్ధరాత్రుల్లో హాస్టల్‌కు వచ్చే ప్రైవేటు వ్యక్తులకు సైతం అన్ని రకాల సేవలు చేయాలి. లేకుంటే వేధింపులు తప్పవు. ‘మాకు న్యాయం చేయండి’ అంటూ శ్రీ వెంకట విజయ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ–మెయిల్ ద్వారా ఆధారాలు అందజేశారు. దీనిపై ఆయన స్పందించారు. ఆ కళాశాలపై చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు. అదే కళాశాలకు చెందిన మరికొందరు విద్యార్థులు తిరుపతి సబ్‌కలెక్టర్ ముందు కన్నీరు మున్నీరయ్యారు. తిరుపతి అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సాక్షి, తిరుపతి : పవిత్రమైన వృత్తి కోసం నర్సింగ్ కోర్సులో చేరిన విద్యార్థినుల జీవితాలతో ఆ కళాశాల యాజమాన్యం ఆడుకుంటోంది. చదువుల నిలయాన్ని నరకకూపంగా మార్చింది. ఈ దారుణాల వేదిక ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు. తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల పంచాయతీ పరిధిలోని శ్రీవెంకట విజయ నర్సింగ్ కళాశాల. విద్యార్థులు సోమవారం తిరుపతి సబ్‌కలెక్టర్, తిరుపతి అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివరాలు.. ‘వందలాదిమంది ఉన్న శ్రీవెంకట విజయ నర్సింగ్ కళాశాల నాలుగేళ్ల కోర్సుకు ఇద్దరు అధ్యాపకులు బోధన చేస్తారు. కోర్సు పూర్తి కాకుండానే సర్టిఫికెట్ ఇప్పిస్తారు. ఇలాంటి సర్టిఫికెట్లతోనే ప్రైవేటు ఆస్పత్రుల్లో విధులకు పంపుతారు. వచ్చే జీతం సైతం కళాశాల యాజమాన్యమే బలవంతంగా లాక్కుంటుంది. కళాశాలతో పాటు హాస్టల్ భవనాలకు సైతం అనుమతులు ఉండవు. కళాశాల నిర్వాహకురాలు విజయ పెడుతున్న బాధలను భరించలేకపోతున్నాం. వంటతో పాటు పొలంలో పనులు సైతం విద్యార్థినులతో చేయిస్తున్నారు. కళాశాల నిర్వాహకురాలు నుంచి మాకు ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించండి’ అని విద్యార్థినులు వేడుకున్నారు. ముఖ్యమంత్రికి ఫిర్యాదు ఎస్వీవీ నర్సింగ్ కళాశాల నిర్వాహకురాలు విజయ పెడుతున్న వేధింపులు, గృహహింసపై విద్యార్థినులు కలెక్టర్, అర్బన్ ఎస్పీ, సబ్‌కలెక్టర్, తహసీల్దార్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అధికారులు, పోలీసులు సైతం కళాశాలకు వచ్చి విద్యార్థినులను విచారించకుండానే యాజమాన్యంతో చర్చలు జరుపుకుని, కాసుల మోజులో అన్యాయం చేశారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించుకున్నా న్యాయం జరగకపోవడంతో ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. గృహహింస, వేధింపులు, కళాశాల అక్రమాలకు సంబంధించి ఆధారాలతో వీడియోలను, ఫిర్యాదును పంపించారు. స్పందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో విద్యార్థినుల ఆవేదనను, వారి బాధలతో కూడిన లేఖను చూపించారు. అలాంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. విద్య, విద్యార్థుల సౌకర్యాలు, భద్రత పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దని స్పష్టం చేశారు. కళాశాల మూసివేస్తున్నట్లు ప్రకటన విద్యార్థినుల ఫిర్యాదుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేగంగా స్పందించారని తెలుసుకున్న ఎస్వీవీ నర్సింగ్ కళాశాల యాజమాన్యం తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలను మొదలుపెట్టింది. అధికారులు ఎక్కడ దాడులు చేస్తారోనని అప్రమత్తం అయ్యింది. కళాశాల సూచిక బోర్డును తీసివేసింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల కళాశాలను మూసివేసినట్లు నిర్వాహకురాలు విజయ ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కావాలనే కొందరు తమ కళాశాలపై అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని, కళాశాలకు అన్ని రకాల అనుమతులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి తిరుపతి మంగళం: శ్రీవేంకటేశ్వర నర్సింగ్ కళాశాల గుర్తింపును రద్దుచేసి, కరస్పాం డెంట్ బండి విజయపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని తిరుపతి సబ్ కలెక్టర్‌కు సోమవారం పలువురు విద్యార్థినులు విజ్ఞప్తి చేశారు. స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బాధిత నర్సింగ్ విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. కళాశాల కరస్పాండెంట్ అన్ని పనులు చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వమంటూ, ప్రాక్టికల్స్‌లో మార్కులు తగ్గిస్తామంటూ తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. 150 మంది విద్యార్థినులకు కనీస విద్యార్హత లేని ఒకే ఉపాధ్యాయుడు బోధించడం ఏంటని ప్రశ్నించారు. విజయ వేధింపులు తాళలేక పది మంది హాస్టల్ నుంచి బయటకు వచ్చి హ్యూమన్ రైట్స్ ప్రతినిధుల సంరక్షణలో ఉన్నట్లు పేర్కొన్నారు. తాము అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నట్లు విజయ తల్లిదండ్రులకు ఫోన్‌చేసి అసత్య ప్రచారాలు చేస్తున్నట్టు వాపోయారు. ఆమెపై పోలీసు ఉన్నతాధికారులు లోతైన విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కళాశాలపై ప్రభుత్వ విచారణ తిరుపతిక్రైం: తిరుపతి రూరల్ పరిధిలోని పుదిపట్ల గ్రామంలోని శ్రీ వెంకట విజయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరస్పాండెంట్ బండి విజయపై కళాశాల విద్యార్థినులు చేస్తున్న ఆరోపణలు ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. ఈ కళాశాలలో జరిగే అవినీతి, అక్రమాలు, సౌకర్యాలు లేమిపై పలు వివాదాలు రావడంతో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి స్పందించారు. దీనిపై విచారించాల్సిందిగా కలెక్టర్ భరత్‌నారాయణ గుప్తను ఆదేశించడంతో శ్రీపద్మావతమ్మ గవర్నమెంట్ నర్సింగ్ కళాశాలలోని ఇద్దరు అధ్యాపకులతో ఈ విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీతో పాటు ముత్యాలరెడ్డి పల్లె పోలీసుల పర్యవేక్షణలో బాధితుల నుంచి ఫిర్యాదులను వీడియో ద్వారా చిత్రీకరించారు. సోమవారం తిరుపతి అర్బన్ జిల్లా కార్యాలయంలో అదనపు ఎస్పీ కలిసిన ఆ కళాశాల నర్సింగ్ విద్యార్థుల నుంచి పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు. వారితో పాటు విచారణ బృందం విద్యార్థులు సమావేశమైంది. వారి సమస్యలను అడిగి తెలుసుకుంది. దీనిపై దర్యాప్తును కౌనసాగిస్తున్నామని ఎమ్మార్‌పల్లి సీఐ మసూరుద్దీన్ వెల్లడించారు. -
తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి నియామకం
సాక్షి, తిరుపతి తుడా: తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) చైర్మన్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమిస్తూ ఈనెల 8న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శ్యామలారావు ఉత్తర్వులు జారీచేశారు. జీవో నంబర్ 198 ద్వారా ఈ ఉత్తర్వులు బుధవారం వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మంచిరోజు చూసుకుని తుడా చైర్మన్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. చెవిరెడ్డిని ఇప్పటికే ప్రభుత్వ విప్‌గా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో తొలి నామినేటెడ్ పదవిని ఆయనకే కట్టబెట్టారు. మూడేళ్ల కాల వ్యవధితో నియమితులైన ఆయన 2022 మే వరకు తుడా చైర్మన్‌గా కొనసాగనున్నారు. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో చెవిరెడ్డి మార్కు తుడా చైర్మన్‌గా అభివృద్ధిని ఇలా కూడా చేయించవచ్చని ఇద్దరంటే ఇద్దరే నిరూపించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రాజకీయ గురువైన భూమన కరుణాకర్‌రెడ్డి తుడాను అభివృద్ధి బాట పట్టిం చారు. అనంతరం ఆ పదవిని చేపట్టిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభివృద్ధిలో తన మార్కు పాలన చేశారు. పట్టణం నుంచి పల్లె వరకు సీసీ రోడ్లు వేయించిన ఘనత ఆయనకే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ముఖ్యంగా కనీస అవసరాలకు నోచుకోని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి రికార్డు సృష్టించారు. సీసీ రోడ్లు, కాలువలు, పచ్చదనంతో పల్లెల రూపు రేఖలు మార్చేశారు. 2007లోనే 2020 విజన్ పేరుతో అభివృద్ధికి ప్రణాళికలు రచించారు. ప్రతి మండలానికీ సుమారు 100 సీసీ రోడ్లు వేయించారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు జన్మనిచ్చిన నారావారిపల్లి సొంత గ్రామాన్ని పట్టించుకోకపోవడంతో స్థానికుల అభ్యర్థన మేరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ గ్రామానికి సీసీ రోడ్లు వేయిం చారు. ఇలా కుల, మత, ప్రాంత తారతమ్యాలు లేకుండా ఆయన తుడా పరిధిలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి చేపట్టారు. పలు చెరువుల అభివృద్ధి, పచ్చదనం పెంపునకు ప్రాధాన్యత ఇచ్చారు. ఐదు మండలాల్లోని ప్రతి గ్రామంలో మహిళా భవనాలను నిర్మించి మహిళా సాధికారితకు కృషి చేశారు. ఎమ్మార్‌పల్లి–మహిళా వర్సిటీ, ఉప్పరపల్లి, రేణిగుంట జంక్షన్, కరకంబాడి వంటి అనేక ప్రధాన రోడ్ల విస్తరణ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హయాంలో చేపట్టినవే. తుడా కార్యాలయాన్ని కార్పొరేట్ హంగులతో ఆధునికీకరించారు. తుడా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తుడా విస్తరణ తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట నాలుగు మండలాల పరిధికే పరిమితం అయిన తుడాను 9 మండలాలకు విస్తరించిన ఘనత చెవిరెడ్డికే దక్కుతుంది. ఆ నాలుగు మండలాలతో పాటు రామచంద్రాపురం, శ్రీకాళహస్తి, ఏర్పేడు, వడమాలపేట, పుత్తూ రు మండలాలను తుడాకు విలీనం చేసి విస్తరించారు. విస్తరించిన మండలాల్లోని గ్రామాలను సైతం అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు పనిచేసిన తుడా చైర్మన్లు వి.వెంకటమునిరెడ్డి 1982–83 ఎం.వెంకట్రామానాయుడు 1984–85 ఎం.మోహన్ 1986–87 ఎస్.మునిరామయ్య 1988–89 కోలా రాము 1989–90 డాక్టర్ ఆర్.రాజశేఖర్‌రెడ్డి 1992–94 ఎల్బీ ప్రభాకర్ 1995–95 కందాటి శంకర్‌రెడ్డి 1998–99 ఎన్వీ ప్రసాద్ 2003–04 భూమన కరుణాకరరెడ్డి 2004–06 డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 2007–10 ఎం.వెంకటరమణ 2013–15 ఎన్.నరసింహయాదవ్ 2017–19 -
మంత్రి హోదాలో అసెంబ్లీకి
సాక్షి, తిరుపతి: ఐదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు టీడీపీ ఘోర పరాజయంతో ప్రతిపక్ష నేత హోదాలో బుధవారం అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రి హోదాలో హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఏడుగురు కొత్త వారు ఎమ్మెల్యేలుగా గెలుపొంది మొదటిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. టీడీపీ ప్రభుత్వంలో అన్యాయంగా ఏడాదిపాటు సస్పెన్షన్‌కు గురై రెండోసారి తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆర్కే రోజా బుధవారం అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. టీడీపీ ప్రభుత్వంలో రాజ్యాంగానికి విరుద్ధంగా 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. వారికి మంత్రి పదవులు కట్టబెట్టి అసెంబ్లీలో కూర్చొబెట్టుకోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆర్కే రోజా, నారాయణస్వామి, చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, ఆదిమూలం, వెంకటేగౌడ్, నవాజ్ బాషా, ఎంఎస్ బాబు ఘన విజయం సాధించారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ సునామీలో టీడీపీ నేతల అడ్రస్‌లు గల్లంతయ్యాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామికి చోటు కల్పించారు. ఇద్దరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో నారాయణస్వామి ఉప ముఖ్యమంత్రిని చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. వీరంతా అమరావతిలో బుధవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు. కొత్త కొత్తగా.. నిండుగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మినహా.. మిగిలిన వారిలో పెద్దిరెడ్డి, నారాయణస్వామి, చింతల రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి అసెంబ్లీ సమావేశాల బహిష్కరణలో భాగంగా సుమారు ఏడాదికిపైగా శాసనసభ సమావేశాలకు దూరంగా ఉన్నారు. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా టీడీపీ ప్రభుత్వం అన్యాయంగా ఏడాదిపాటు సస్పెండ్ చెయ్యడంతో ఆమె అసెంబ్లీలోకి అడుగుపెట్టలేదు. జిల్లా నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వారితో పాటు సీనియర్ ఎమ్మెల్యేలు బుధవారం జరిగిన సమావేశానికి హాజరయ్యారు. గతంలో వైఎస్సార్సీపీ గుర్తుతో గెలిచి చంద్రబాబు ప్రలోభాలకు లొంగి పచ్చకండువా కప్పుకున్న అమర్నాథ్రెడ్డి ఏకంగా మంత్రి అయ్యారని, ఆయనకు పలమనేరు ఓటర్లు గుణపాఠం చెప్పారని జిల్లా వాసులు గుర్తుచేస్తున్నారు. ఐదేళ్ల పాటు ఏకపక్షంగా వ్యవహరించి.. సంక్షేమాన్ని పక్కనపెట్టి ధనార్జనే ధ్యేయంగా అవినీతి అక్రమాలకు తెరలేపిన టీడీపీ నేతలకు ఎన్నికల ఫలితాలతో గుణపాఠం చెప్పారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఎన్నికల తాయిలాలు షురూ..
సాక్షి,తిరుపతి తుడా: తిరుపతి నగరంలో ఎన్నికల తాయిలాలు అప్పుడే మొదలయ్యాయి. ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే విషయంపై టీడీపీ అధిష్టానం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. అయినా ఎమ్మెల్యే సుగుణమ్మ మరోసారి తాను అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వస్తుందనే నమ్మకంతో ప్రలోభాలకు తెరతీశారు. డ్వాక్రా సంఘాల రిసోర్స్ పర్సన్లు, ఆయా గ్రూపుల్లో కీలకంగా వ్యవహరించే లీడర్లను మచ్చికవేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. తమ మాట వినే ఒక్కో ఆర్పీకి, గ్రూప్ లీడర్లకు చీర, రవిక, స్వీట్ బాక్స్‌లను అందించారు. అలానే పార్టీ సానుభూతిపరులై ఆయా ప్రాంతాల్లో కీలకంగా ఉన్న మహిళలను గుర్తిం చారు. అలాంటి వారిని పార్టీ కార్యాలయానికి పిలిపించి గిఫ్ట్‌బాక్స్‌లను అందిస్తున్నారు. సీఎం సభకు రావాలని ఒత్తిడి.. రాష్ట్ర ప్రభుత్వం, పాలకులు డ్వాక్రా మహిళలను బానిసల్లా చూస్తున్నారు. టీడీపీ కార్యక్రమం జరిగినా, ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నా సభలకు, సమావేశాలకు రావాలని డ్వాక్రా మహిళలపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తీసుకోవడంలేదా?, సభకు రాకుంటే పేరును బ్లాక్ సిస్ట్‌లో పెడతాం అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. మెప్మా సిబ్బందితోపాటు అధికార పార్టీ నాయకులు గ్రూపులు వారీగా ఫోన్ నెంబర్లను సేకరించి ఫోన్ చేస్తూ సోమవారం నిర్వహించే సీఎం సభకు రావాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. శివరాత్రి, సెలవు కావడంతో పిల్లలు ఇంట్లో ఉంటారు వచ్చేందుకు కుదరదని మహిళలు వేడుకుంటున్నా మెప్మా సిబ్బంది వేధిపులకు గురి చేస్తున్నారు. ‘మీ పేరు బ్లాక్ íలిస్ట్‌లో పెడతాం. చెక్ రాకుండా చేస్తాం’ అంటూ మహిళలకు వ్యక్తిగతంగా వేదిస్తున్నారు. గ్రూపుల వారీగా సీఎం సభకు వచ్చి ప్రాంగణంలో గ్రూప్ ఫొటోలు తీసుయించుకుని మెప్మా గ్రూప్‌లో పోస్టు చేయాలని హుకుం జారీ చేశారని కొంత మంది మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను కడప వరకు పొడిగింపు!
సాక్షి, వైఎస్సార్ కడప : తిరుపతి మీదుగా విశాఖపట్నంకు కొత్తగా ప్రకటించిన తిరమల ఎక్స్‌ప్రెస్‌ను కడప వరకు పొడిగించారు. ఈ మేరకు రైల్వే బోర్డు చైర్మన్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ నెల 31నుంచి ప్రతిరోజు తిరుపతి నుంచి విశాఖ పట్నానికి తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలును వేశారు. అయితే దీనికి రేణిగుంట, కోడూరు, రాజంపేట మీదుగా కడప వరకు పొడిగించారు. తిరుపతి నుంచి 5,20కి బయల్దేరి.. రేణిగుంట, కోడూరు, రాజంపేట మీదుగా కడపకు 8.20కి రానున్న రైలు.. తిరిగి సాయంత్రం 5.05కు బయల్దేరి 8గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అక్కడి నుంచి యథావిధిగా విశాఖపట్నం వెళ్తుందని తెలిపారు. కడప మీదుగా రాజధాని విజయవాడకు అక్కడి నుంచి విశాఖకు రైలు సౌకర్యం కల్పించడంపై అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
భారతీయ విద్యాభవన్ వార్షికోత్సవంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి
సాక్షి, తిరుపతి : భారతీయ విద్యాభవన్ 29వ వార్షికోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కలిగించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ... నేటి విద్యార్థులు రేపటి తరానికి భవిష్యత్తని అన్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేసే భారతీయ విద్యాభవన్ ఎంతో గొప్పదని కీర్తించారు. ఉన్నతమైన సంకల్పంతో కె.ఎన్. మున్షీ భారతీయ విద్యాభవన్‌ను స్థాపించారని తెలిపారు. భారతీయ విద్యాభవన్‌కు టీటీడీ సహకారం అందించడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రమశిక్షణ, విలువలు నేర్చుకోవాలని సూచించారు. స్వశక్తితో సొంతకాళ్లపై ప్రతి ఒక్కరూ నిలబడాలంటే విద్య ఎంతో అవసరమని అన్నారు. విద్యావిధానంలో మార్పుకోసం విద్యావేత్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. -
భూ మాయగాళ్లు
తిరుపతి చుట్టూ అక్రమార్కులు బరితెగిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు టీడీపీ నేతలు అధికారుల సహకారంతో అనాధీనం.. కాలువ, కుంట, చెరువు, స్వర్ణముఖి నదీ పోరంబోకు భూములను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటున్నారు. ఈ మూడేళ్లలో కోట్ల రూపాయల విలువజేసే సుమారు 259 ఎకరాలకుపైగా స్వాధీనం చేసుకున్నారు. ఆ భూములను ప్లాట్లుగా వేసి అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకున్నారు. ప్రభుత్వ భూములని తెలియక కొనుగోలు చేసిన అనేకమంది బాధితులు పట్టాల కోసం నాయకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. తిరుపతి రూరల్ పరిధిలో భూమాయగాళ్లపై ‘సాక్షి’ టాస్క్‌ఫోర్స్ స్పెషల్ ఫోకస్.. సాక్షి, తిరుపతి టాస్క్‌ఫోర్స్: విభజన తర్వాత తిరుపతికి అత్యంత ప్రాధాన్యత పెరిగింది. ఏడుకొండల వాడి చెంత ఇంత చోటుంటే చాలనుకునేవారు నానాటికీ పెరుగుతున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాలకు చెందిన అనేక మంది వ్యాపారులు తిరుపతిలో నివాసాల ఏర్పాటుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. వీరి అవసరాలు.. భూములకు పెరుగుతున్న డిమాండ్‌ను అధికార పార్టీ నేతలు క్యాష్ చేసుకుంటున్నారు. మాజీ మంత్రి, మరో మాజీ ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక టీడీపీ నేతలు వారి అనుచరుల ద్వారా ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుని స్వాధీనం చేసుకుంటున్నారు. అక్రమాల అడ్డా అవిలాల తిరుపతి సమీపంలోని అవిలాల రెవెన్యూ పరిధిలోని వేదాంతపురం పంచాయతీ సర్వే నం.360లో 178 ఎకరాలు వంక, కాలువ పోరంబోకు భూములతో పాటు ప్రభుత్వ భూమి ఉంది. కాలువ, స్వర్ణముఖి నదికి మధ్యలో ఉన్న ఈ భూమిని అధికార పార్టీకి చెందిన నాయకులు ఇద్దరు ప్లాట్లు వేసి విక్రయించారు. అందుకోసం ముగ్గురు బ్రోకర్లను ఏర్పాటు చేసుకున్నారు. ప్లాటు కొనుగోలు చేసిన వారికి దగ్గరుండి తాత్కాలిక షెడ్లు వేయిస్తుంటారు. ప్లాటు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో వందకుపైగా నివాసాలున్నాయి. మరికొన్ని నిర్మాణాలు సాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే నిర్వాకం.. శ్రీకాళహస్తికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత సుమారు రూ.15 కోట్లు విలువచేసే చెరువును ఆక్రమించుకున్నారు. అవిలాల రెవెన్యూలోని సర్వే నం.377లో 12 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న విలువైన ఓటేరు చెరువును ఆ ఎమ్మెల్యే దర్జాగా కబ్జా చేశారు. చెరువు ఆక్రమణ విషయం అధికారులకు తెలిసినా ఎవ్వరూ నోరెత్తలేదు. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో చెరువును పూడ్చేందుకు ప్రయత్నించారు. టిప్పర్లతో మట్టి తెచ్చి జేసీబీలతో పూడ్చివేస్తున్నా అడ్డుకునేందుకు ఎవ్వరూ సాహసించలేకపోయారు. చివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో స్థానికులు కోర్టును ఆశ్రయించారు. బండ పోరంబోకుపై భూరాబందులు సర్వే నం.250లో 6.3 ఎకరాల బండ పోరంబోకు స్థలం ఉంది. ఇందులో 26 మంది గంగిరెద్దుల కుటుంబాల వారికి పట్టాలిచ్చారు. ఈ పట్టాలను సాకుగా చూపించి మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు ఒకరు పెద్ద ఎత్తున విక్రయాలకు తెరదీశారు. పక్కనే శ్మశానం ఉన్నా దాన్ని కూడా ఆక్రమించి రెండు సెంట్ల స్థలాన్ని రూ.5 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రామ..రామా! రామచంద్రయ్య కాలనీలో సర్వే నం.222, 223/2, 224, 225లో సుమారు 5 ఎకరాల కాలువ పోరంబోకు భూమి ఉంది. ఇందులో 62 మందికి పట్టాలు మంజూరు చేశారు. వారి పేర్లు చెప్పుకుని మాజీ మంత్రి అనుచరుడు 2 సెంట్ల స్థలాన్ని రూ.5 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. భూమంత్రకాళి.. రామదాసు కాలనీలో సర్వే నం.230/1, 230/2, 231/3లలో మరో 4.5 ఎకరం బండ పోరంబోకు భూమి ఉంది. ఇందులో కొంతమందికి పట్టాలు ఇచ్చినట్లు ఇచ్చి మిగిలిన భూమిని అమ్ముకున్నారు. మరికొంత భూమిలో హౌసింగ్ స్కీంలో పక్కాగహాలు నిర్మించి అమ్ముకున్నారు. తిరుమలలోని పాపవినాశనంలో దుకాణాల తొలగింపుతో నష్టపోయిన వారికి వేదాంతపురం పంచాయతీ పరిధిలో సర్వే నం.233/2, 232లో 1.5 ఎకరాల్లో 43 మందికి పట్టాలు ఇచ్చారు. మిగిలిన స్థలాన్ని అమ్మి సొమ్ము చేసుకున్నారు. తిరుచానూరు సమీపంలో సర్వే నం.479లో 36 ఎకరాల స్వర్ణముఖి నది పోరంబోకు భూమి ఆక్రమణకు గురైంది. రెండేళ్ల క్రితం లోతట్టు ప్రాంతంలో జేసీబీలు పెట్టి చదును చేయించుకున్నారు. ఆక్రమించుకున్న ప్రాంతంలో ప్రహరీ గోడ కూడా నిర్మించుకోవడం గమనార్హం. ఆక్రమణల గురించి తమకు ఎటువంటి ఫిర్యాదులూ అందలేదని రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోతున్నారు. బరితెగిస్తున్న మాజీ మంత్రి అనుచరులు.. తిరుపతి రూరల్ మండల పరిధిలో మాజీ మంత్రి అనుచరులు ఇద్దరు అక్రమాలకు పాల్పడుతున్నారు. వేదాంతపురం పంచాయతీ పరిధిలో సర్వే నం.203/2, 204/1లో సుమారు 5 ఎకరాల కాలువ పోరంబోకు ఉంది. రూ.5 కోట్లు విలువచేసే ఈ స్థలాన్ని ప్లాట్లు వేసి విక్రయించుకున్నారు. మరికొన్ని ప్లాట్లలో వారే నివాసాలు నిర్మించి అమ్ముకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 162 నివాసాలున్నాయి. దీనికి విజయనగర కాలనీగా నామకరణం చేశారు. ఇవి మొత్తం అక్రమమేనని అధికారులు స్పష్టం చేశారు. ఇదే కాలనీలో సర్వే నం.208లో ఉన్న మరో 2.5 ఎకరాల కాలువ పోరంబోకును కూడా ఆక్రమించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సర్వే నం.246, 247లో మరో 5 ఎకరాల కాలువ పోరంబోకు భూమిని ఆక్రమించేందుకు రంగం సిద్ధమైంది. -
బ్రహ్మోత్సవాలకు హైటెక్ భద్రత
‘శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం. హైటెక్ టెక్నాలజీతో దొంగలను నియంత్రించేందుకు ప్రత్యేక టెక్నాలజీని వినియోగిస్తున్నాం. అందరి సహకారంతో ఉత్సవాలను విజయవం తం చేసేందుకు కృషి చేస్తాం’ అని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అభిషేక్ మొహంతి అన్నారు. బ్రహ్మోత్సవాలకు భద్రతపరంగా తీసుకుంటున్న చర్యలపై ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. – తిరుపతి క్రైం సాక్షి : బ్రహ్మోత్సవాలకు భద్రతపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తారా? ఎస్పీ : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఫేజ్–1 కింద 3వేల మందితో గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నాం. గరుడ సేవ రోజున ఫేజ్–2 కింద అదనంగా మరో 1000 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నాం. తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డులో స్పెషల్ టీమ్‌లు తిరుమలకు వెళ్లే రహదారులను తని ఖీలు చేస్తాయి. భద్రత కో సం 8 చెక్పాయింట్లను ఏర్పాటు చేశాం. 25 మంది సిబ్బంది బాడీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని తిరుమల మొత్తం తిరుగుతుంటారు. పెరటాశి నెల, దసరా సెలవులను దృష్టిలో ఉంచుకుని ఈసారి గరుడసేవకు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు జనసందోహం ఉంటుందని అంచనా వేశాం. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. నగరంపై ఒక డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేస్తాం. కెమెరాల ద్వారా కమాండెంట్ కంట్రోల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తాం. సాక్షి : పార్కింగ్ ఏర్పాట్ల గురించి? ఎస్పీ : తిరుమలలో పార్కింగ్ కోసం ప్రత్యేక యాప్‌ను ఏర్పాటు చేశాం (బ్రహ్మోత్సవ పార్కింగ్ ట్రాకర్ అనే యా ప్). వాహనదారులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తద్వారా తిరుమలలో ఏయే ప్రాంతాల్లో పార్కింగ్ఏర్పాటు చేశాం. వాహనాలు రద్దీగా ఉన్నాయా లేదా తెలియజేస్తుంది. మా సిబ్బంది ఎప్పటికప్పుడు వాహనాల పార్కింగ్ వివరాలను యాప్‌లో అప్లోడ్ చేస్తుంటారు. సాక్షి : భక్తుల సమాచారానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెబుతారా? ఎస్పీ : తిరుపతిలో రైల్వేస్టేషన్, బస్టాండ్, అలిపిరి చెక్‌పాయింట్, అలిపిరి లింక్ బస్టాండ్ వద్ద హెల్ప్ సెంటర్లను ఏర్పాటు చేశాం. ఇక్కడ ప్రజలకు కావాల్సిన సమాచారం ఇస్తారు. ఇందులో ఓ ఎస్సై స్థాయి అధికారి ఉంటారు. ఏదైనా సమస్య వస్తే అక్కడికక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. 14 మొబైల్ క్లినిక్స్‌ను ఏర్పాటు చేశాం. ఆరు మొబైల్ క్లినిక్స్ ఘాట్ రోడ్డులో తిరుగుతూ ఉంటాయి. అక్కడ నిలిచిపోయిన వాహనాలను మరమ్మతులు చేసి పంపుతుంటాయి. మిగతావన్నీ తిరుమల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి. భక్తులు గాయపడితే వెంటనే వైద్యం అందిస్తాయి. సాక్షి : చిన్నపిల్లల భద్రత గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్పీ : 5 సంవత్సరాల లోపు చిన్నారులకు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద, తిరుమలకు వెళ్లే రెండు వైపులా ఉన్న నడకదారుల భక్తులకు ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కంకణం కడుతాం. దానిపై వారి కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్ రాస్తాం. వారు ఫోటో తీసుకుని చిరునామాను సేకరిస్తాం. దీన్ని పేస్ బయోమెట్రిక్ చైల్డ్‌ట్రాకింగ్ యాప్‌లో అప్లోడ్ చేస్తాం. తద్వారా ఎవరైనా తప్పిపోయినా సకాలంలో కుటుంబ సభ్యులకు చేర్చే అవకాశం ఉంది. ఇది వృద్ధులకు కూడా వర్తిస్తుంది. సాక్షి : దొంగల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి చెప్పగలరా? ఎస్పీ : దొంగలను నియంత్రించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. క్రైం ఏఎస్పీ ఆధ్వర్యంలో ఆ సిబ్బంది మొత్తం పనిచేస్తారు. వీరి వద్ద 50 ఎఫ్‌ఐఎన్‌ఎస్ (ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అండ్ సర్చ్) మిషన్లు ఉంటాయి. ఇది అంతా హైటెక్ టెక్నాలజీ దొంగ దొరికిన వెంటనే ఫింగర్ ప్రింట్ తీసుకుంటాం. అందులో 6 లక్షల వేలిముద్రలు ఉన్నాయి. పాతనేరస్థుడైతే స్పాట్లోనే చిట్టా బయటకు వస్తుంది -
ఇస్కా పేరిట మస్కా..!
-
తిరుమలలో అక్రమ లడ్డూల బాగోతం బట్ట బయలు
-
బలవంతంగా భూమన అరెస్ట్
-
తిరుపతి వెటర్నరీ వర్సిటీలో అస్తవ్యస్త పాలన
-
అభిమాని కుటుంబానికి పవన్ పరామర్శ