
సాక్షి, వైఎస్సార్ కడప : తిరుపతి మీదుగా విశాఖపట్నంకు కొత్తగా ప్రకటించిన తిరమల ఎక్స్‌ప్రెస్‌ను కడప వరకు పొడిగించారు. ఈ మేరకు రైల్వే బోర్డు చైర్మన్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ నెల 31నుంచి ప్రతిరోజు తిరుపతి నుంచి విశాఖ పట్నానికి తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలును వేశారు. అయితే దీనికి రేణిగుంట, కోడూరు, రాజంపేట మీదుగా కడప వరకు పొడిగించారు. తిరుపతి నుంచి 5,20కి బయల్దేరి.. రేణిగుంట, కోడూరు, రాజంపేట మీదుగా కడపకు 8.20కి రానున్న రైలు.. తిరిగి సాయంత్రం 5.05కు బయల్దేరి 8గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అక్కడి నుంచి యథావిధిగా విశాఖపట్నం వెళ్తుందని తెలిపారు. కడప మీదుగా రాజధాని విజయవాడకు అక్కడి నుంచి విశాఖకు రైలు సౌకర్యం కల్పించడంపై అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment