
‘శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం. హైటెక్ టెక్నాలజీతో దొంగలను నియంత్రించేందుకు ప్రత్యేక టెక్నాలజీని వినియోగిస్తున్నాం. అందరి సహకారంతో ఉత్సవాలను విజయవం తం చేసేందుకు కృషి చేస్తాం’ అని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అభిషేక్ మొహంతి అన్నారు. బ్రహ్మోత్సవాలకు భద్రతపరంగా తీసుకుంటున్న చర్యలపై ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. – తిరుపతి క్రైం
సాక్షి : బ్రహ్మోత్సవాలకు భద్రతపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తారా?
ఎస్పీ : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఫేజ్–1 కింద 3వేల మందితో గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నాం. గరుడ సేవ రోజున ఫేజ్–2 కింద అదనంగా మరో 1000 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నాం. తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డులో స్పెషల్ టీమ్‌లు తిరుమలకు వెళ్లే రహదారులను తని ఖీలు చేస్తాయి. భద్రత కో సం 8 చెక్‌పాయింట్‌లను ఏర్పాటు చేశాం. 25 మంది సిబ్బంది బాడీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని తిరుమల మొత్తం తిరుగుతుంటారు. పెరటాశి నెల, దసరా సెలవులను దృష్టిలో ఉంచుకుని ఈసారి గరుడసేవకు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు జనసందోహం ఉంటుందని అంచనా వేశాం. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. నగరంపై ఒక డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేస్తాం. కెమెరాల ద్వారా కమాండెంట్ కంట్రోల్‌లో క్షుణ్ణంగా పరిశీలిస్తాం.
సాక్షి : పార్కింగ్ ఏర్పాట్ల గురించి?
ఎస్పీ : తిరుమలలో పార్కింగ్ కోసం ప్రత్యేక యాప్‌ను ఏర్పాటు చేశాం (బ్రహ్మోత్సవ పార్కింగ్ ట్రాకర్ అనే యా ప్). వాహనదారులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తద్వారా తిరుమలలో ఏయే ప్రాంతాల్లో పార్కింగ్‌ఏర్పాటు చేశాం. వాహనాలు రద్దీగా ఉన్నాయా లేదా తెలియజేస్తుంది. మా సిబ్బంది ఎప్పటికప్పుడు వాహనాల పార్కింగ్ వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు.
సాక్షి : భక్తుల సమాచారానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెబుతారా?
ఎస్పీ : తిరుపతిలో రైల్వేస్టేషన్, బస్టాండ్, అలిపిరి చెక్‌పాయింట్, అలిపిరి లింక్ బస్టాండ్ వద్ద హెల్ప్ సెంటర్లను ఏర్పాటు చేశాం. ఇక్కడ ప్రజలకు కావాల్సిన సమాచారం ఇస్తారు. ఇందులో ఓ ఎస్సై స్థాయి అధికారి ఉంటారు. ఏదైనా సమస్య వస్తే అక్కడికక్కడే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. 14 మొబైల్ క్లినిక్స్‌ను ఏర్పాటు చేశాం. ఆరు మొబైల్ క్లినిక్స్ ఘాట్ రోడ్డులో తిరుగుతూ ఉంటాయి. అక్కడ నిలిచిపోయిన వాహనాలను మరమ్మతులు చేసి పంపుతుంటాయి. మిగతావన్నీ తిరుమల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి. భక్తులు గాయపడితే వెంటనే వైద్యం అందిస్తాయి.
సాక్షి : చిన్నపిల్లల భద్రత గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఎస్పీ : 5 సంవత్సరాల లోపు చిన్నారులకు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద, తిరుమలకు వెళ్లే రెండు వైపులా ఉన్న నడకదారుల భక్తులకు ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కంకణం కడుతాం. దానిపై వారి కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్ రాస్తాం. వారు ఫోటో తీసుకుని చిరునామాను సేకరిస్తాం. దీన్ని పేస్ బయోమెట్రిక్ చైల్డ్‌ట్రాకింగ్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తాం. తద్వారా ఎవరైనా తప్పిపోయినా సకాలంలో కుటుంబ సభ్యులకు చేర్చే అవకాశం ఉంది. ఇది వృద్ధులకు కూడా వర్తిస్తుంది.
సాక్షి : దొంగల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి చెప్పగలరా?
ఎస్పీ : దొంగలను నియంత్రించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. క్రైం ఏఎస్పీ ఆధ్వర్యంలో ఆ సిబ్బంది మొత్తం పనిచేస్తారు. వీరి వద్ద 50 ఎఫ్‌ఐఎన్‌ఎస్ (ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అండ్ సర్చ్) మిషన్లు ఉంటాయి. ఇది అంతా హైటెక్ టెక్నాలజీ దొంగ దొరికిన వెంటనే ఫింగర్ ప్రింట్ తీసుకుంటాం. అందులో 6 లక్షల వేలిముద్రలు ఉన్నాయి. పాతనేరస్థుడైతే స్పాట్‌లోనే చిట్టా బయటకు వస్తుంది