Srivari Brahmotsavalu
-
ముత్యపు పందిరిలో ముగ్ధమనోహరుడిగా...!
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఆదివారం రాత్రి మలయప్పస్వామి ముత్యపు పందిరి వాహనంపై దర్శనమిచ్చారు. ఉదయం సింహ వాహనాన్ని అధిష్టించి యోగ నరసింహుడు రూపంలో ఊరేగిన స్వామి రాత్రి ముగ్ధమనోహర స్వరూపుడై ఉభయ దేవేరులు శ్రీదేవి, భూదేవిలతో కలిసి ముత్యపు పందిరిలో భక్తులను సాక్షాత్కరించారు.సాయంత్రం ఉత్సవరులకు రంగనాయకుల మండపంలో విశేష సమర్పణ అనంతరం ఆలయం వెలుపల వేయి నేతి దీపాల వెలుగులో సహస్రదీపాలంకార సేవలో ఊయలూగుతూ స్వామి దర్శనమిచ్చారు. తర్వాత వాహన మండపంలో వేంచేపు చేసి సర్వాలంకార భూషితుడై అశేష భక్తజన గోవింద నామాల నడుమ పురవీధుల్లో రాత్రి 7–9 గంటల వరకు స్వామివారు వైభవంగా ఊరేగారు. ఉత్సవ శోభల్లో కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి. ఈ వాహన సేవలో కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. గరుడ సేవకు విస్తృత ఏర్పాట్లు బ్రహ్మోత్సవాల్లో ఐదోరోజు రాత్రి 6.30 నుంచి 12 గంటల వరకు గరుడవాహన సేవ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తిరుమల ఘాట్‌రోడ్లలో నేటి ఉదయం నుంచి ద్విచక్రవాహనాలు అనుమతి రద్దు చేసింది. పార్కింగ్ సరిపోయేలాగా వాహనాలను తిరుమలకు అనుమతించనుంది. తిరుమల వెళ్లే ప్రతి వాహనం కూడా ముందస్తు పాసును తీసుకొని వెళ్లాల్సి ఉంది. తర్వాత వచ్చే వాహనాలన్నీ తిరుపతిలోనే కట్టడి చేయనుంది. ఇందుకోసం అలిపిరి వద్ద పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలు షురూ..
-
సేనాపతి ఉత్సవం.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. అంకురార్పణ కార్యక్రమంలో శ్రీవారి తరపున ఆయన సేనాధిపతి అయిన విశ్వక్సేనుడిని మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. రేపు సాయంత్రం ధ్వజారోహణంతో శ్రీవారి ఉత్సవాలు.. 12వ తేదీ రాత్రి ధ్వజావరోహణంతో ముగుస్తాయి.శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఈ క్రమంలో ఆలయానికి నైరుతి దిశలో భూదేవిని పూజించి, మృత్తికను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. దీన్నే ‘మృత్సంగ్రహణ యాత్ర’ (పుట్టమన్ను సేకరణ) అంటారు. ఈ మట్టిలో నవ ధాన్యాలను ఆరోహింపజేసే కార్యక్రమాన్ని అంకురార్పణగా పేర్కొంటారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. 05వ తేదీన ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం, 06వ తేదీ ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం, 07వ తేదీ సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రికి సర్వభూపాల వాహనం, ఎనిమిదో తేదీ ఉదయం మోహిని అవతారం, రాత్రి గరుడ వాహనంపై స్వామివారు ఉరేగుతారు. గరుడ సేవకు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.09వ తేదీ ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనం, 10వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 11వ తేదీ ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 12వ తేదీ శనివారం ఉదయం చక్రవాహనం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో.. అక్టోబరు 7న రాత్రి 11 గంటల నుంచి అక్టోబరు 8 అర్ధరాత్రి వరకు ద్విచక్రవాహనాల రాకపోకలపై నిషేధం అమలు కానుంది. అలాగే.. వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయోవృద్ధులు, వికలాంగులు, ఎన్ఆర్ఐలు, చిన్న పిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. -
Tirumala: చంద్రప్రభ వాహనంపై ఉరేగిన స్వామివారు
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఏడో రోజు సాయంత్రం చంద్రప్రభ వాహనంపై కొలువుదీరి శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. చంద్రప్రభ వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వాహన సేవలో కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనం ఇచ్చారు. పరిమళ భరిత పూలమాలలు, విశేష ఆభరణాలతో అలంకృతులైన స్వామి వారు నాలుగు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, కోలాటాలు, డప్పు నృత్యాలు, సంప్రదాయ వేష ధారణలతో వాహన సేవ ముందు ఆకట్టుకున్నాయి. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలు: తిరుమలలో పెరిగిన రద్దీ..
సాక్షి, తిరుమల: తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. కాగా, హనుమంత వాహనంపై శ్రీవారు దర్శనం ఇచ్చారు. ఈ క్రమంలో శ్రీవారి భక్తులు కర్పూర నీరాజనాలు అందిస్తున్నారు. మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. ఇక, సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న గరుడోత్సవం రోజు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,650గా ఉంది. గరుడోత్సవం నాడు శ్రీవారి హుండీ ఆదాయం 3.33 కోట్లు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 27,410గా ఉంది. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి గరుడ సేవను చూడటానికి తిరుమల నాలుగుమాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించడం జరిగింది. భక్తుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను అడిగి తెలుసుకోగా.. టీటీడీ చేసిన ఏర్పాట్లపై వారు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. pic.twitter.com/FI3MFrUFrD — Bhumana Karunakara Reddy (@bhumanatirupati) September 22, 2023 ఇదిలా ఉండగా.. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు శుక్రవారం రాత్రి గరుడ వాహనాన్ని అధిరోహించారు. రాత్రి 7 గంటలకు ఆరంభమైన ఈ వాహన సేవ అర్ధరాత్రి వరకు సాగింది. గరుడ వాహనం ముందు భక్త బృందాలు, భజనలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వాయు గమనంతో పోటీపడే గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని విశ్వాన్ని పాలించే జగత్కల్యాణ చక్రవర్తి మలయప్ప దేదీప్యమాన కాంతులతో ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు. On the evening of the fifth day of the ongoing Brahmotsavams in Tirumala, the processional deity of Lord Malayappa Swamy was carried in a procession on the Garuda Vahanam.#TTD#TTDevasthanams#Brahmotsavam2023#SalakatlaBrahmotsavam2023#GarudaVahanam pic.twitter.com/riS8YuR4kh — Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) September 22, 2023 విశిష్టమైన గరుడ వాహన సేవలో గర్భాలయ మూలమూర్తికి వాడుతున్న మకరకంఠి, లక్ష్మిహారం, సహస్ర నామ కాసులమాల, సుదర్శన చక్రమాల, మూలవిరాట్‌కు అలంకరించే పురాతనమైన విశేష ఆభరణాలు, శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్ తులసి, పుష్పమాల, చెన్నై నూతన ఛత్రాలను(గొడుగులు) అలంకరించారు. తన నిత్య సేవకుడు గరుత్మంతుడిపై దేవదేవుడు వైభవంగా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు శుక్రవారం ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు సాక్షాత్కరించారు. శ్రీవారు మోహినీ రూపంలో దంత పల్లకిపై, పక్కనే వెన్న ముద్ద చేతబట్టిన చిన్నికృష్ణుడితో కలిసి భక్తకోటిని అనుగ్రహించారు. కాగా, తిరుమలలో శనివారం శ్రీవారు స్వర్ణరథంపై సాయంత్రం 4 గంటల నుంచి ఆలయ పురవీధుల్లో ఊరేగనున్నారు. కాగా, శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకుని వాహన సేవలో పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాల ధరించి భక్తులకు అభయమిచ్చారు.#GarudaSeva pic.twitter.com/6JwhWGT694 — Roja Selvamani (@RojaSelvamaniRK) September 23, 2023 -
హంసవాహనంపై సరస్వతీ రూపంలో మలయప్ప స్వామి
-
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
-
తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
తిరుమలలో నేడు ధ్వజారోహణం.. సీఎం జగన్ పట్టువస్త్రాల సమర్పణ
సాక్షి, తిరుమల: నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి 7–8 గంటల మధ్యలో వైదికంగా అంకురార్పణ చేశారు. వైఖానస ఆగమశాస్త్ర బద్ధంగా ఈ వేడుకను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజైన ఆదివారం సాయంసంధ్యా సమయంలో శ్రీవారి సర్వ సేనాధిపతి అయిన విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల నడుమ మాడవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహించారు. నేడు ధ్వజారోహణం, పెద్ద శేషవాహనం సోమవారం సాయంత్రం 6.15–6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తం గా ధ్వజారోహణం నిర్వహించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చారు. సీఎం జగన్ పట్టు వస్త్రాల సమర్పణ.. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమలలో పర్యటించనున్నారు. తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం జగన్ పర్యటన ఇలా.. ►నేడు మధ్యాహ్నం 3.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. ►మధ్యాహ్నం 3.50 గంటలకు స్థానిక మ్యాంగో మార్కెట్ వద్ద శ్రీనివాస సేతు, ఎస్.వి.ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనాల శిలాఫలకాల ఆవిష్కరణ చేసి ప్రారంభం. ►టీటీడీ ఉద్యోగులకు ఇంటిపట్టాల పంపిణీ. ►సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకుని తిరుమల బయలుదేరుతారు. ►సాయంత్రం 5.40 గంటలకు వకులమాత రెస్ట్ హౌస్ ప్రారంభిస్తారు. ►సాయంత్రం 5.55 గంటలకు రచన రెస్ట్ హౌస్ ప్రారంభించి, శ్రీ పద్మావతి అతిధి గృహం చేరుకుంటారు. ►రాత్రి 7.45 గంటలకు బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకు వెళ్లి సమర్పిస్తారు. ►పెద్ద శేష వాహన సేవలో పాల్గొని శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకొని రాత్రి బస చేస్తారు. రేపటి షెడ్యూల్ ఇదే.. ►మంగళవారం ఉదయం 6.20 గంటలకు సీఎం జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ►ఉదయం 8.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని ఓర్వకల్ విమానాశ్రయానికి బయలుదేరుతారు. -
బ్రహ్మోత్సవ సంబరం ప్రారంభం
తిరుమల/తిరుపతి క్రైం: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి 7–8 గంటల మధ్యలో వైదికంగా అంకురార్పణ చేశారు. వైఖానస ఆగమశాస్త్ర బద్ధంగా ఈ వేడుకను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజైన ఆదివారం సాయంసంధ్యా సమయంలో శ్రీవారి సర్వ సేనాధిపతి అయిన విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల నడుమ మాడవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహించారు. నేడు ధ్వజారోహణం, పెద్ద శేషవాహనం సోమవారం సాయంత్రం 6.15–6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తం గా ధ్వజారోహణం నిర్వహించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చారు. వాహనాలకు పాసులు ఉంటేనే అనుమతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 22న గరుడ సేవ సందర్భంగా తిరుమలకు వచ్చే వాహనాలకు (ఫోర్వీలర్లకు) పాసులను టీటీడీ తప్పనిసరి చేసింది. దీంతో తిరుమల వెళ్లే ప్రతి వాహనదారుడు పాసులు పొందాల్సి ఉంటుంది. కాగా, గరుడ సేవ రోజు ద్విచక్రవాహనాలను తిరుమలకు అనుమతించేది లేదని టీటీడీ స్పష్టం చేసింది. పాసులు అందించే ప్రదేశాలు ♦ బెంగళూరు, చిత్తూరు నుంచి వచ్చే వాహనాలకు చంద్రగిరి నియోజకవర్గంలోని ఐతేపల్లి దగ్గర ♦ మదనపల్లి నుంచి వచ్చే వాహనాలకు రంగంపేట కేఎంఎం కళాశాల వద్ద ♦ చెన్నై, నగరి, పుత్తూరు వైపు నుంచి వచ్చే వాహనాలకు వడమాలపేట టోల్ ప్లాజా సమీపంలోని అగస్త్య ఎన్క్లేవ్ వద్ద ♦ కడప వైపు నుంచి వచ్చే వాహనదారులకు కుక్కల దొడ్డి వద్ద ఉన్న కేశవరెడ్డి హైసూ్కల్లో ♦ నెల్లూరు, శ్రీకాళహస్తి వైపు నుంచి వచ్చే వాహనాలకు ఆర్ మల్లవరం పెట్రోల్ బంక్ వద్ద ♦ తిరుపతి పట్టణ ప్రజలకు, చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చేవారికి కరకంబాడి రోడ్డులోని ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద. -
తిరుమల బ్రహ్మోత్సవాలు.. వాహనసేవ వీక్షణకు టీటీడీ చర్యలు
సాక్షి, తిరుమల: తిరుమలలో బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. భక్తులు వాహనసేవ వీక్షించడానికి మాడవీధులను పరిశీలించినట్టు చెప్పారు. కాగా, ఈవో ధర్మారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 18వ తేదీన రాష్ట్రప్రభుత్వం తరఫున శ్రీవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. గరుడోత్సవం రోజు దగ్గరంగా వాహనసేవను వీక్షించడానికి మాడవీధులను పరిశీలించామన్నారు. గ్యాలరీలలో 2 లక్షల మంది భక్తులు వాహనసేవలు వీక్షిస్తారు. అందరూ వాహనసేవలు వీక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు. మరోవైపు.. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల నిమిత్తం అదనంగా మరో 100 ఎకరాల భూమి కేటాయింపుపై మంత్రి రోజాతో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చర్చించారు. పాధిరేడు అరణ్యం వద్ద గతంలో 300 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఈ క్రమంలో నగరిలోని తన నివాసం వద్ద భూమనను మంత్రి రోజా సత్కరించారు. ఇది కూడా చదవండి: ఏపీకి వర్షసూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ -
తిరుమల ఉద్యానవనాల నుంచి శ్రీవారి కైంకర్య పుష్పాలు
-
తిరుమల బ్రహ్మోత్సవాలు.. వచ్చే నెల 22న గరుడవాహనం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఉంటాయని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. కాగా, టీటీడీ ఈవో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రివ్యూ చేశాం. ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. సెప్టెంబర్, అక్టోబర్‌లో బ్రహ్మోత్సవాలు ఉంటాయి. సెప్టెంబర్ 18న శ్రీవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సెప్టెంబర్ 22న గరుడవాహనం, 23న స్వర్థరథంపై శ్రీవారి ఊరేగింపు ఉంటుంది’ అని తెలిపారు. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయంలో జరుగుతన్న మండపం పునఃనిర్మాణ పనులను ఆలయ కమిటీ చైర్మన్ కట్టా గోపి యాదవ్ గారితో కలిసి పరిశీలించడం జరిగింది. ఆలయ అధికారులు, పార్టీ నాయకులు తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు.#Tirupati #tirumalatirupati #tirumala #ttd #ttdchairman pic.twitter.com/9wEDI8BiSs — Bhumana Karunakara Reddy (@bhumanatirupati) August 31, 2023 ఇదిలా ఉండగా.. రాఖీ పండుగ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు 18 కంపార్ట్మెంట్లలో నిండిపోయి ఉన్నారు. టికెట్లు లేని సర్వదర్శనానికి(ఉచిత దర్శనం) ఏడు గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆగష్టు 30, 2023) స్వామివారిని 71,132 భక్తులు దర్శించుకున్నారు. 26,963 తలనీలాలు సమర్పించుకున్నారు. రూ. 4.06 కోట్ల హుండీ ఆదాయం లెక్కగా తేలింది. ఇది కూడా చదవండి: సెప్టెంబర్ 18 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు: టీటీడీ ఛైర్మన్ భూమన -
తిరుమలలో భక్తుల రద్దీ
-
తిరుమలలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
-
స్వర్ణ రథంపై సప్తగిరీశుడు..!
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో ఆదివారం స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు స్వర్ణ రథోత్సవం ఊరేగింపు అశేష భక్తజన గోవింద నామస్మరణల మధ్య సాగింది. ఈ స్వర్ణ రథం 32 అడుగుల ఎత్తు, 30 టన్నుల బరువు ఉంటుంది. ఈ తరహాలో రథం మన దేశంలో మరెక్కడా లేకపోవడం విశేషం. ఈ రథాన్ని 74 కిలోల మేలిమి బంగారంతో 18 ఇంచుల మందంతో కూడిన 2,900 కిలోల రాగి పై 9 సార్లు తాపడం చేశారు. వెండి రథం కొయ్యకు సరికొత్త హంగులతోనే ఈ స్వర్ణ రథాన్ని తయారు చేశారు. రథం తయారికీ టీటీడీ రూ.30 కోట్లు ఖర్చు చేసింది. 2013లో తొలిసారిగా ఊరేగించారు. ఉదయం భక్తశిఖామణిపై శ్రీరామచంద్రుడు రాత్రి గజరాజుపై రారాజు దర్శనం ఇవ్వగా ఉదయం శ్రీరామచంద్రుని రూపంలో మలయప్పస్వామి తన భక్తశిఖామణి హనుమంతుని వాహనంగా మలుచుకుని ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్భాణాలు చేతపట్టిన శ్రీరామచంద్రుడిని ఆంజనేయుడు తన భుజంపై ఉంచుకుని ఆలయ పురవీధుల్లో అశేష భక్త జనులకు కనువిందు చేశారు. రాత్రి గజ వాహనంపై శ్రీనివాసుడు ఊరేగారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముగ్ధమనోహరుడైన శ్రీనివాసుడు గజ వాహనంపై ఆశీనుడై రాజసంగా మాడ వీధులలో భక్తులను కనువిందు చేశారు. వాహన సేవల్లో పెద్దజీయంగార్, చిన్నజీయంగార్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు.లలిత్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు. శ్రీవారి గరుడ వాహన సేవ భక్తుల సహకారంతో విజయవంతమైందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సర్వ దర్శనానికి 12 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయి లైన్ ఆల్వార్ ట్యాంక్ వద్దకు చేరుకుంది. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు 81,318 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 38,464 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.2.94 కోట్లు వేశారు. టీటీడీలో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన అనంతరం స్వామి వారిని సామాన్య భక్తులు ఈ సంఖ్యలో దర్శించుకోవడం ఇదే ప్రథమం. -
ఆనంద నిలయం అంటే... ఆ దేవదేవుడి నిలయం
-
తిరుమల శ్రీవారుని దర్శించుకున్న సీజేఐ లలిత్
-
స్వర్ణరథం పై భక్తులకు దర్శనమిస్తున్న స్వామి వారు
-
గరుడోత్సవానికి భారీగా తరలివస్తున్న భక్తులు
-
భక్తుల సర్వదర్శనాలకు అన్ని ఏర్పాట్లు చేశాం : టీటీడీ చైర్మన్
-
తిరుమలలో గరుడ సేవకు విస్తృత ఏర్పాట్లు
-
తిరుమల బ్రహ్మోత్సవాలు: శ్రీవారి సేవలో సీఎం జగన్ (ఫొటోలు)
-
2023 టీటీడీ క్యాలెండర్ ,డైరీ ఆవిష్కరించిన సీఎం జగన్
-
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్