Live Updates:
► పద్మావతి గెస్ట్ హౌస్‌కు చేరుకున్న సీఎం జగన్. రాత్రికి అక్కడే బస.
► పెద్ద శేషవాహనంపై ఊరేగుతున్న శ్రీవారు. కాగా, శ్రీవారి వాహన సేవలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు.
► 2023 టీటీడీ క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన సీఎం జగన్.
► శ్రీవారి దర్శన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.
►సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇది నాలుగోసారి.
► శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్. సాంప్రదాయ పంచె కట్టులో శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి.
►శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్. పట్టు వస్త్రంతో సీఎం జగన్ తలకు పరివట్టం కట్టిన అర్చకులు.
► ఎలక్ట్రిక్ బస్సులను సీఎం జగన్ ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలతో శ్రీవారి భక్తులకు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.
► సీఎం వైఎస్ జగన్.. గంగమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, సీఎం జగన్‌కు అర్చకులు వేదాశీర్వచనం అందించారు.
18:10
► గంగమ్మ ఆలయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్.
► సీఎం జగన్‌కు మంత్రి పెద్దిరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పలువురు ఘన స్వాగతం పలికారు.
17:48 PM
► శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది.
► సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమం కొనసాగుతోంది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
17:10 PM
► రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్
15:02 PM
► తిరుమల పర్యటనకు బయల్దేరిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజులపాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇక, పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్.. తిరుపతి గ్రామదేవత, శ్రీవారి సోదరి శ్రీతాతయ్యగుంట గంగమ్మను దర్శించుకోనున్నారు. అనంతరం, శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకోన్నారు. పెద్దశేష వాహన సేవలో పాల్గొని తరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment