
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి మంగళవారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఆయన మంగళవారం మధ్యాహ్నం 3.35 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. అలిపిరి వద్ద తిరుమలకు విద్యుత్ బస్సును ప్రారంభిస్తారు.
రాత్రి 8.20 గంటలకు శ్రీవారికి పట్టువ్రస్తాలు సమర్పించి, స్వామిని దర్శించుకుం టారు. రాత్రికి తిరుమలలోనే బసచేసి బుధవారం ఉదయం మరోసారి శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమలలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నిర్మించిన పరకామణి భవనాన్ని, తర్వాత లక్ష్మీ వీపీఆర్ రెస్ట్‌హౌస్‌ను ప్రారంభిస్తారు. అనంతరం రేణిగుం ట విమానాశ్రయం చేరుకుంటారు.
నంద్యాల జిల్లాలో పర్యటన
సీఎం వైఎస్ జగన్ బుధవారం ఉదయం రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలి కాప్టర్‌లో నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలోని రాంకో సిమెంట్ ఫ్యాక్టరీకి వెళతారు.
కంపెనీ ప్రాంగణంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.55గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 2.20గంటలకు తాడేపల్లి వెళతారు.
Comments
Please login to add a commentAdd a comment