Pattu Vastram
-
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
-
నేడు శ్రీనివాస సేతు ప్రారంభం
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమ, మంగళవారాల్లో తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి తిరుపతి చేరుకుంటారు. తిరుపతిలోని నాలుగు దిక్కులను కలుపుతూ యాత్రికులు నేరుగా తిరుమల వెళ్లేందుకు అత్యాధునిక రీతిలో నిర్మిం చిన శ్రీనివాస సేతు (ఫ్లైఓవర్) ప్రారంబోత్సవం, ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ వర్చువల్ ప్రారంభోత్సవం, టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ (తిరుపతి–చెన్నై జాతీయ రహదారిలోని వడమాలపేట వద్ద 307 ఎకరాల్లో 3,518 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు) కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సీఎం జగన్ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత తిరుమల చేరుకుని వకుళమాత రెస్ట్ హౌస్, రచన రెస్ట్ హౌస్‌లు ప్రారంభిస్తారు. బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని శ్రీవారికి పట్టువ్రస్తాలు సమర్పిస్తారు. అనంతరం పెద్ద శేష వాహనం సేవలో పాల్గొని, రాత్రికి పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. నీటి పథకాలకు ప్రారంబో త్సవం మంగళవారం ఉదయం 6.20 గంటలకు శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్న అనంతరం కర్నూలు జిల్లా ఓర్వకల్లు చేరుకుంటారు. అక్కడి నుంచి కృష్ణగిరి మండలం లక్కసాగరం చేరుకుంటారు. అక్కడ డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలకు తాగు, సాగు నీరందించే లక్ష్యంతో చేపట్టిన 68 చెరువులను కృష్ణా జలాలతో నింపే పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నంద్యాల జిల్లా డోన్‌కు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు. -
తిరుమల బ్రహ్మోత్సవాలు.. వచ్చే నెల 22న గరుడవాహనం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఉంటాయని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. కాగా, టీటీడీ ఈవో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రివ్యూ చేశాం. ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. సెప్టెంబర్, అక్టోబర్‌లో బ్రహ్మోత్సవాలు ఉంటాయి. సెప్టెంబర్ 18న శ్రీవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సెప్టెంబర్ 22న గరుడవాహనం, 23న స్వర్థరథంపై శ్రీవారి ఊరేగింపు ఉంటుంది’ అని తెలిపారు. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయంలో జరుగుతన్న మండపం పునఃనిర్మాణ పనులను ఆలయ కమిటీ చైర్మన్ కట్టా గోపి యాదవ్ గారితో కలిసి పరిశీలించడం జరిగింది. ఆలయ అధికారులు, పార్టీ నాయకులు తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు.#Tirupati #tirumalatirupati #tirumala #ttd #ttdchairman pic.twitter.com/9wEDI8BiSs — Bhumana Karunakara Reddy (@bhumanatirupati) August 31, 2023 ఇదిలా ఉండగా.. రాఖీ పండుగ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు 18 కంపార్ట్మెంట్లలో నిండిపోయి ఉన్నారు. టికెట్లు లేని సర్వదర్శనానికి(ఉచిత దర్శనం) ఏడు గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆగష్టు 30, 2023) స్వామివారిని 71,132 భక్తులు దర్శించుకున్నారు. 26,963 తలనీలాలు సమర్పించుకున్నారు. రూ. 4.06 కోట్ల హుండీ ఆదాయం లెక్కగా తేలింది. ఇది కూడా చదవండి: సెప్టెంబర్ 18 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు: టీటీడీ ఛైర్మన్ భూమన -
కళల కల‘నేత’
సాక్షి, అమరావతి: ‘‘పట్టు వస్త్రంపై ప్రధాని మోదీ ధ్యానముద్ర.. వాల్ హ్యాంగింగ్ వస్త్రంపై సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న నిలువెత్తు చిత్రం.. పట్టు చీరపై శ్రీరామకోటి, రామాయణ పాత్రలు.. ఇదంతా ఓ చేనేత కార్మికుడి కళల కలబోత’’. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన జూటూరి నాగరాజు.. చేనేతలో నైపుణ్యానికి సాంకేతికతను జోడించి అద్భుతాలు సాధిస్తున్నాడు. చేనేతలో ఆకట్టుకునేలా నాగరాజు ఆవిష్కరించిన వాటిల్లో కొన్ని.. ► ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ అందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రాన్ని పట్టు వస్త్రంపై ఎంతో ఆకర్షణీయంగా రూపొందించి.. ఆ వస్త్రాన్ని ‘నేతన్న నేస్తం’ పథకం ప్రారంభ సభలో సీఎం వైఎస్ జగన్‌కు, చేనేత, జౌళి శాఖ కమిషనర్‌కు అందజేశాడు. ► బాపట్ల వైఎస్సార్సీపీ నేతల కోరిక మేరకు నవరత్న పథకాల పేర్లు, చిత్రాలతో కూడిన రెండు మీటర్ల పొడవైన పట్టు శాలువాను నాలుగు రోజుల స్వల్ప వ్యవధిలోనే నేసి ఇచ్చాడు. పాదయాత్రలో వైఎస్ జగన్ నడిచి వస్తున్న చిత్రాన్ని సైతం అద్భుతంగా నేశాడు. ► జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించిన పోటీల్లో అవార్డును సాధించాడు. ► ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ (తెలంగాణ) ఫొటోతో పాటు ఆయన కుటుంబ సభ్యుల చిత్రాలను కూడా పట్టు వస్త్రంపై నేసి ఇచ్చాడు. ► లేపాక్షి మందిరములో చెక్కిన వందలాది శిల్పాలను అచ్చుగుద్దినట్టు చేనేత మగ్గం ద్వారా పట్టు చీరలో నేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. థాయ్‌లాండ్ సంస్కృతికి చెందిన చిహ్నాలు, చార్మినార్, తాజ్‌మహాల్‌ను సైతం పట్టు చీరలపై నేసి ప్రతిభకు పట్టం కట్టాడు. ► 2017 ఫిబ్రవరిలో ఇస్రో 104 రాకెట్లను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించడాన్ని ఆదర్శంగా తీసుకొని ఇస్రో శాటిలైట్ శారీని చేనేత మగ్గంపై తయారు చేశాడు. విజయవాడలో జరిగిన ఎగ్జిబిషన్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆ శాటిలైట్ శారీని చూసి నాగరాజును అభినందించారు. ► గుంటూరు జిల్లా మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి చిత్రం, గాలిగోపురం, తెలుగు అక్షరాలు వచ్చే విధంగా చేనేత మగ్గంపై తయారు చేసి ఔరా అన్పించాడు. ఆధునికత జోడించాను మా తాత, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన చేనేతకు ఆదరణ తగ్గిన తరుణంలో దానికి ఆధునికత జోడించి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకున్నాను. డిగ్రీ చదివాను. 25 ఏళ్లుగా చేనేతపైనే ఆధారపడ్డాను. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని చేనేతలో కొత్త డిజైన్లు ఆవిష్కరిస్తున్నాను. నా ఉత్పత్తులు పలు దేశాలకు, దేశంలోని ప్రముఖ నగరాలకు ఎగుమతి చేస్తున్నాను. కంప్యూటర్ ద్వారా ఆధునిక డిజైన్లను ముద్రించి మగ్గంలోని జకార్డ్, తదితర ఆధునిక పరికరాల సాయంతో వస్త్రాలను నేస్తున్నాను. అనేక పోటీల్లో బహుమతులు సాధించాను. –జూటూరి నాగరాజు, ధర్మవరం చేనేత కార్మికుడు -
కనుల పండువగా పైడితల్లి సిరిమానోత్సవం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం కనుల పండువగా సాగింది. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ ఉత్సవం జరిగింది. ఈ ఏడాది ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో భక్తులు పోటెత్తారు. విజయనగరం వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలివచ్చారు. రికార్డు స్థాయిలో దాదాపు 4.5 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి , దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సంప్రదాయం ప్రకారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు, అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు దంపతులు అమ్మవారికి వస్త్రాలను తీసుకొచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం 5.22 గంటలకు సిరిమాను కదిలింది. పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానుపై ఆశీనులై భక్తులకు దర్శనం ఇచ్చారు. చదురుగుడి నుంచి కోట వరకు మూడు పర్యాయాలు సిరిమానును తిప్పారు. సాయంత్రం 6.42 గంటలకు సిరిమాను జాతర పూర్తయింది. డీసీసీబీ బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సిరిమాను ఉత్సవాన్ని వీక్షించారు. కోటపై నుంచి ఆలయ అనువంశిక ధర్మకర్తలు పూసపాటి అశోక్ గజపతిరాజు, సునీలా గజపతిరాజు, సుధా గజపతిరాజు, ఊర్మిళా గజపతిరాజు తదితరులు ఉత్సవాన్ని తిలకించారు. -
దుర్గమ్మ సేవలో సీఎం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి, అమరావతి: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. అత్యంత ప్రాశస్త్యమైన మూలా నక్షత్రం రోజున శ్రీసరస్వతీదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మ అమ్మ వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలు సమర్పించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సంప్రదాయ పట్టు పంచె, తెల్ల చొక్కా ధరించి ఆలయ దర్శనానికి వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డికి వేద పండితులు, ఆలయ పూజార్లు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ స్థానాచార్యులు విష్ణు బట్ల శివప్రసాద్ శర్మ సీఎం తలకు పరివట్టం (పట్టువస్త్రంతో తలపాగా) చుట్టారు. దుర్గమ్మకు తెచ్చిన పట్టువస్త్రాలను ఆలయ ఈవో భ్రమరాంబకు అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ అనంతరం అమ్మ వారికి సమర్పించే పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను వైఎస్ జగన్ తన తలపై పెట్టుకుని మంగళవాయిద్యాలు, వేద మంత్రాల మధ్య ఆలయంలోకి ప్రవేశించారు. అమ్మవారి అంతరాలయంలోకి వెళ్లి శ్రీసరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో వేద పండితులు సీఎం జగన్‌కు వేద ఆశీర్వచనం.. ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, ఆలయ ఈవో భ్రమరాంబలు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, ఎంపీలు నందిగం సురేష్, వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్, కల్పలతారెడ్డి, ఎండీ రుహుల్లా, ఎమ్మెల్యేలు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, కె.అనిల్‌కుమార్, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
నేడు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్న సీఎం జగన్
-
తిరుమలకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి మంగళవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఆయన మంగళవారం మధ్యాహ్నం 3.35 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. అలిపిరి వద్ద తిరుమలకు విద్యుత్ బస్సును ప్రారంభిస్తారు. రాత్రి 8.20 గంటలకు శ్రీవారికి పట్టువ్రస్తాలు సమర్పించి, స్వామిని దర్శించుకుం టారు. రాత్రికి తిరుమలలోనే బసచేసి బుధవారం ఉదయం మరోసారి శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమలలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నిర్మించిన పరకామణి భవనాన్ని, తర్వాత లక్ష్మీ వీపీఆర్ రెస్ట్‌హౌస్‌ను ప్రారంభిస్తారు. అనంతరం రేణిగుం ట విమానాశ్రయం చేరుకుంటారు. నంద్యాల జిల్లాలో పర్యటన సీఎం వైఎస్ జగన్ బుధవారం ఉదయం రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలి కాప్టర్లో నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలోని రాంకో సిమెంట్ ఫ్యాక్టరీకి వెళతారు. కంపెనీ ప్రాంగణంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.55గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 2.20గంటలకు తాడేపల్లి వెళతారు. -
గోదావరి జలాలతో దుర్గమ్మ కాళ్లు కడుగుతాం
పాపన్నపేట(మెదక్): గోదావరి జలాలతో ఏడుపాయల దుర్గమ్మ కాళ్లు కడుగుతామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వన దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించి మెదక్ జిల్లా పాపన్నపేటలో ఏడుపాయల జాతరను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ మదిలో ఊపిరి పోసుకున్న అద్భుతమైన ఆలోచన కాళేశ్వరం ప్రాజెక్టు అని నేడు అది శివుడి జడల నుంచి గంగమ్మ పొంగి పొర్లినట్లు, 618 మీటర్ల ఎత్తుకు నీటిని పంపిణీ చేస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్, కొండపోచమ్మల నుంచి సింగూరు ప్రాజెక్టుకు నీరు వస్తుందని, దీంతో మంజీర పాయల్లో గోదావరి జలాలు పరుగులు తీసి దుర్గమ్మ ఆలయాన్ని తాకుతూ ముందుకు పరుగులు పెడతాయన్నారు. మెతుకుసీమలో నీటి కరువు ఉండదని 10 జిల్లాలు లబ్ధి పొందుతాయన్నారు. రాష్ట్రంలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి కోసం రూ.1,500 కోట్లు కేటాయించారని అందులో నుంచి ఏడుపాయల, ఘనపురం ప్రాజెక్టు అభివృద్ధికి రూ.100 కోట్లు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారని తెలిపారు. ప్రతీ జాతరకు రూ. కోటి: తలసాని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ హేమలత, కలెక్టర్ హరీశ్ జాతర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతీ ఏడుపాయల జాతరకు ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేస్తుందన్నారు. ఏడుపాయల ఆదాయం కూడా పెరిగిందని, మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చొరవతో ఏడుపాయల పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు. -
రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి
చౌడేపల్లె(చిత్తూరు జిల్లా): రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు ఆదివారం బోయకొండ గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. దసరా మహోత్సవాలను పురస్కరించుకొని తొలిసారిగా అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి దంపతులు, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, చిత్తూరు ఎంపీ ఎన్.రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, వెంకటేగౌడ, ఆరణి శ్రీనివాసులు, ఆదిమూలం, ఎంఎస్ బాబు, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తదితరులు పట్టువస్త్రాలు సమర్పించారు. వీరికి ఆలయ కమిటీ చైర్మన్ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈవో చంద్రమౌళి ఆలయ సంప్రదాయల ప్రకారం స్వాగతం పలికారు. తొలుత అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవమూర్తులకు పూజలు చేసి హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో వర్షాలు బాగా పడుతున్నాయన్నారు. పంటలు బాగా పండి అందరూ అభివృద్ధి చెందాలని.. కోవిడ్ నుంచి ప్రజలను రక్షించాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. -
నేడు తిరుమలకు సీఎం జగన్
సాక్షి, అమరావతి/సాక్షి, తిరుపతి/ సాక్షి ప్రతినిధి, విజయవాడ: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమ, మంగళవారాల్లో తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం సీఎం జగన్.. ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలివి.. ► మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుమలకు పయనం ► 3 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరిక ► అక్కడి నుంచి తిరుపతి బర్డ్ ఆస్పత్రికి చేరుకుని.. అక్కడ నిర్మించిన శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. ► అనంతరం అలిపిరి వద్దకు చేరుకుని శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభిస్తారు.. సాయంత్రం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుని, రాత్రికి అక్కడే బస చేస్తారు. ► మంగళవారం ఉదయం 5.30 గంటలకు శ్రీవారి దర్శనం చేసుకుని గొల్ల మండపాన్ని సందర్శిస్తారు. ► అక్కడ శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌కు సంబంధించి.. కన్నడ, హిందీ చానళ్లను ప్రారంభిస్తారు. అనంతరం కొత్తగా నిర్మించిన బూందీ పోటును ప్రారంభించి.. అన్నమయ్య భవన్‌కు చేరుకుంటారు. అక్కడ రైతు సాధికార సంస్థ, టీటీడీ మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొంటారు. ► అనంతరం పద్మావతి అతిథి గృహానికి చేరుకుని, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు తిరుగుపయనమవుతారు. ఉదయం 11.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. రేపు దుర్గమ్మకు పట్టు వస్త్రాల సమర్పణ విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 12న మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చే దుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఏర్పాట్లపై దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.వాణీమోహన్ ఆదివారంఈవో కార్యాలయంలో దేవదాయ, పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ.. మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో సీఎం.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఆలయానికి వస్తారని తెలిపారు. ఏర్పాట్లను సమీక్షిస్తున్న దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అంతరాలయంలోకి తీసుకెళ్తామని, అక్కడ అమ్మవారికి సీఎం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం వేద ఆశీర్వచనంతో పాటు, తీర్థప్రసాదాలు అందజేస్తామని వివరించారు. అమ్మవారి ప్రాశస్త్యాన్ని తెలిపే ఆగమెంటెడ్ రియాల్టీ షోను కూడా సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. సమావేశంలో ఆలయ ఈవో భ్రమరాంబ, ఏసీపీ హనుమంతరావు, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రకుమార్, రీజనల్ జాయింట్ కమిషనర్ సాగర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
గణపయ్యకు తిరుమల వెంకన్న పట్టు వస్త్రాలు
కాణిపాకం/యాదమరి(చిత్తూరు)/వేలూరు(తమిళనాడు): చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామికి తిరుమల వెంకన్న పట్టు వస్త్రాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు శనివారం సమర్పించారు. ఉదయం తిరుమల నుంచి స్వామివారి పట్టువస్త్రాలను వైవీ సుబ్బారెడ్డి తీసుకురాగా ఆయనకు ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, కాణిపాక ఆలయ ఈవో వెంకటేశు స్వాగతం పలికారు. స్వామివారి పట్టు వస్త్రాలను గణపయ్య చెంత ఉంచి పూజలు చేశారు. వైవీ దంపతులకు స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించి ఆశీర్వాద మండపంలో తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందించారు. అనంతరం గణపయ్యకు టీటీడీ ఆధ్వర్యంలో తయారు చేస్తోన్న స్వర్ణ రథాన్ని వైవీ సుబ్బారెడ్డి, నారాయణ స్వామి, ఎంఎస్ బాబు పరిశీలించారు. త్వరలో శ్రీకాళహస్తి, కాణిపాకం ట్రస్ట్ బోర్డుల నియామకం చేపడతామని వీరు కాణిపాకంలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. బంగారు గుడిని సందర్శించిన వైవీ తమిళనాడులోని వేలూరు జిల్లా శ్రీపురంలోని బంగారు గుడిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు శనివారం సందర్శించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయాధికారులు ఘన స్వాగతం పలికారు. పీఠంలోని స్వర్ణలక్ష్మి అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం పీఠాధిపతి శక్తి అమ్మ ఆశీస్సులు అందుకున్నారు. టీటీడీ నవనీత పథకానికి పీఠాధిపతి శక్తి అమ్మ గిర్ ఆవుదూడను కానుకగా సమర్పించారు. -
వినాయకుడికి పట్టు వస్త్రాలు
కాణిపాకం (యాదమరి) (చిత్తూరు జిల్లా): కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామికి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది మంత్రి పెద్దిరెడ్డి, ఆయనతో పాటు ఎంపీ రెడ్డెప్ప, పూతలపట్టు, చిత్తూరు ఎమ్మెల్యేలు ఎంఎస్ బాబు, జంగాలపల్లె శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో కలసి ఊరేగింపుగా పట్టువస్త్రాలు తీసుకెళ్లారు. వారికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం అలంకార మండపంలో వేదపండితులచే ఆశీర్వాదాలు చేయించి, తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందించారు. అంతకుముందు ఆలయంలో కొత్త హుండీని మంత్రి ప్రారంభించారు. -
వెంకన్న చెంత..జననేత
-
శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించిన సీఎం వైఎస్ జగన్
తిరుమల : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీవారికి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలను సమర్పించారు. ప్రతిఏటా బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సోమవారం సా.6.32గంటలకు తిరుమల పద్మావతి అతిథి గృహానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, సీవీఎస్ఓ గోపినాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ ఇతర ఉన్నతాధికారులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బేడి ఆంజనేయస్వామి వారిని వైఎస్ జగన్ దర్శించుకున్నారు. ఇక్కడ ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి స్వామివారి వస్త్రాన్ని తలపాగా కట్టారు. తన వెంట తీసుకొచ్చిన పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని రాత్రి 7.11గంటలకు మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు 7.21గంటలకు చేరుకున్నారు. తిరుమల పెద్దశేష వాహన సేవలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం స్వామి వారి సన్నిధికి చేరుకుని ఆలయ అర్చకులకు పట్టువస్త్రాలను అందించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలోని వకుళామాత, ఆనంద నిలయంపై ఉన్న విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహ స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ముఖ్యమంత్రికి శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించి ఆశీర్వచనాలు పలికారు. అక్కడే బియ్యంతో తులాభారం మొక్కు సమర్పించారు. ఆ తర్వాత వాహన మండపానికి చేరుకుని పెద్దశేష వాహనంపై కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, రెడ్డెప్ప, టీటీడీ తిరుపతి జేఈఓ బసంత్‌కుమార్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పీఎస్.గిరీష, ఎమ్మెల్యేలు జంగాలపల్లి శ్రీనివాసులు, చింతల రామచంద్రారెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆదిమూలం ఉన్నారు. బియ్యంతో తులాభారం సమర్పిస్తున్న సీఎం వైఎస్ జగన్ వైఎస్ కుటుంబానికి అరుదైన గౌరవం బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించే అరుదైన గౌరవం వైఎస్ కుటుంబానికే దక్కింది. ఇంతకు ముందెప్పుడూ సీఎం హోదాలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పట్టువస్త్రాలను సమర్పించిన దాఖలాల్లేవు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఐదు సార్లు సమర్పించారు. ఇప్పుడు వైఎస్ జగన్ పట్టు వస్త్రాలను సమర్పించారు. -
భద్రాచలంలో శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవం
-
ఘనంగా వీరభద్రుడి కల్యాణం
టేక్మాల్(మెదక్): మండలం లోని బొడ్మట్‌పల్లిలో గుట్టపై వెలసిన భద్రకాళీ సమేత వీరభద్రాలయంలో నవాహ్నిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వీరభద్రుడి కల్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారం కల్యాణ వేడుకలో పది జంటలు పాల్గొన్నాయి. వివాహ వేడుకలకు ఏడుపాయల ఆలయ కమిటీ చైర్మన్ విష్ణువర్ధన్ వీరభద్రుడికి పట్టువస్త్రాలను సమర్పించారు. కాగా కల్యాణాన్ని తిలకిచేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వీరికి ఆలయ నిర్వాహకులు అన్నప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బస్వరాజ్, సర్పంచ్ బీరప్ప, మండల ఎంపీపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ యశ్వంత్‌రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ రవిశంకర్, నాయకులు నిమ్మరమేష్, దశరథ్‌గౌడ్, ఈశ్వరప్ప, బేగరి మొగులయ్య, శ్రీనివాస్, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్.
-
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్
హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఆదివారం సీఎం కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం కేసీఆర్ మొక్కులు చెల్లించికున్నారు. అనంతరం ఆలయ అధికారులు కేసీఆర్ దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు మహంకాళి అమ్మవారిని ఆలయానికి కేసీఆర్ దంపతులు చేరుకోగానే... వారికి తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఏ. ఇంద్రకరణ్‌రెడ్డి, మరో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్తోపాటు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. బోనాలు సందర్భంగా సికింద్రాబాద్ లో భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు.