
అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న సీఎం కేసీఆర్ దంపతులు
హైదరాబాద్ : సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఆదివారం సీఎం కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం కేసీఆర్ మొక్కులు చెల్లించికున్నారు. అనంతరం ఆలయ అధికారులు కేసీఆర్ దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
అంతకుముందు మహంకాళి అమ్మవారిని ఆలయానికి కేసీఆర్ దంపతులు చేరుకోగానే... వారికి తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఏ. ఇంద్రకరణ్రెడ్డి, మరో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్తోపాటు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. బోనాలు సందర్భంగా సికింద్రాబాద్ లో భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు.