మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పక్కన రాగమయి దంపతులు
ఖమ్మం: గుండెల్లో పెట్టుకుని గెలిపించిన సత్తుపల్లి ప్రజలు రుణం తీర్చుకున్నారు... ఈ తీర్పును మనసులో పెట్టుకుని పనిచేస్తాం.. కష్టపడిన ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం... అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి బుధవారం బాధ్యతలు స్వీకరించగా, మంత్రి పాల్గొన్నారు. తొలుత డాక్టర్ మట్టా దయానంద్ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్‌చేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ దయానంద్ కష్టం, శ్రమ, సేవా కార్యక్రమాలే రాగమయిని ఎమ్మెల్యేగా గెలి పించాయని తెలిపారు.
కాంగ్రెస్ కోసం దయానంద్ కుటుంబం ఎన్నో కష్టాలు పడిందని, వారి శ్రమ ఊరికే పోలేదని చెప్పారు. రాగమయిని గెలిపించాలని తాను పిలుపునిస్తే ప్రజలు ఆశీర్వదించి రుణం తీర్చుకున్నారని తెలిపారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన సత్తుపల్లి నియోజకవర్గాన్ని శక్తిమేరకు అభివృద్ధి చేస్తానని మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆశీర్వదించి మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. తానెప్పుడు గెలిచినా మంత్రిని చేస్తున్నారని, నలుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసే అవకాశం తనకు లభించిందని చెప్పారు. కాగా, సత్తుపల్లి వేశ్యకాంతల చెరువుకు గోదావరి జలాలను తరలించి తన రాజకీయ లక్ష్యం పూర్తి చేస్తానని తుమ్మల వివరించారు.
అద్భుతమైన బహుమతి..
ఎమ్మెల్యేగా తనను గెలిపించి దయానంద్‌కు అపూర్వమైన బహుమతి ఇచ్చారని ఎమ్మెల్యే రాగమయి తెలిపారు. కష్టసుఖాల్లో తమ వెంట ఉన్నవారిని వదలబోమని చెప్పారు. ఏ అభివృద్ధి పనైనా సత్తుపల్లి నుంచే ప్రారంభిస్తామని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారన్నారు. అనంతరం దయానంద్ మాట్లాడుతూ పార్టీలో కష్టించి పనిచేసిన వారికి గుర్తింపు ఇస్తామని, కొత్తవాళ్లను నెత్తిన పెట్టుకోబోమని తెలిపారు.
మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ తోట సుజలారాణితో పాటు చల్లగుళ్ల నర్సింహారావు, ఉడతనేని అప్పారావు, పసుమర్తి చందర్‌రావు, నున్నా రామకృష్ణ, రావి నాగేశ్వరరావు, కూసంపూడి నర్సింహారావు, గాదె చెన్నారావు, వందనపు సత్యనారాయణ, దొడ్డా శ్రీనివాసరావు, నారాయణవరపు శ్రీని వాస్, ఎస్.కే.మౌలాలీ, ఎండీ.కమల్‌పాషా, సోమిశెట్టి శ్రీధర్, రామిశెట్టి మనోహర్, దూదిపాల రాంబాబు, గోలి ఉషారాణి పాల్గొన్నారు.
ఇవి చదవండి: నామినేటెడ్ పోస్టు.. మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల చుట్టూ ప్రదక్షిణ!
Comments
Please login to add a commentAdd a comment