thummala nageshwar rao
-
పెద్దవాగును పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
-
ప్రజలు గుండెల్లో పెట్టుకుని గెలిపించారు! అందరినీ కాపాడుకుంటాం.. : మంత్రి తుమ్మల
ఖమ్మం: గుండెల్లో పెట్టుకుని గెలిపించిన సత్తుపల్లి ప్రజలు రుణం తీర్చుకున్నారు... ఈ తీర్పును మనసులో పెట్టుకుని పనిచేస్తాం.. కష్టపడిన ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం... అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి బుధవారం బాధ్యతలు స్వీకరించగా, మంత్రి పాల్గొన్నారు. తొలుత డాక్టర్ మట్టా దయానంద్ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్‌చేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ దయానంద్ కష్టం, శ్రమ, సేవా కార్యక్రమాలే రాగమయిని ఎమ్మెల్యేగా గెలి పించాయని తెలిపారు. కాంగ్రెస్ కోసం దయానంద్ కుటుంబం ఎన్నో కష్టాలు పడిందని, వారి శ్రమ ఊరికే పోలేదని చెప్పారు. రాగమయిని గెలిపించాలని తాను పిలుపునిస్తే ప్రజలు ఆశీర్వదించి రుణం తీర్చుకున్నారని తెలిపారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన సత్తుపల్లి నియోజకవర్గాన్ని శక్తిమేరకు అభివృద్ధి చేస్తానని మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆశీర్వదించి మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. తానెప్పుడు గెలిచినా మంత్రిని చేస్తున్నారని, నలుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసే అవకాశం తనకు లభించిందని చెప్పారు. కాగా, సత్తుపల్లి వేశ్యకాంతల చెరువుకు గోదావరి జలాలను తరలించి తన రాజకీయ లక్ష్యం పూర్తి చేస్తానని తుమ్మల వివరించారు. అద్భుతమైన బహుమతి.. ఎమ్మెల్యేగా తనను గెలిపించి దయానంద్‌కు అపూర్వమైన బహుమతి ఇచ్చారని ఎమ్మెల్యే రాగమయి తెలిపారు. కష్టసుఖాల్లో తమ వెంట ఉన్నవారిని వదలబోమని చెప్పారు. ఏ అభివృద్ధి పనైనా సత్తుపల్లి నుంచే ప్రారంభిస్తామని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారన్నారు. అనంతరం దయానంద్ మాట్లాడుతూ పార్టీలో కష్టించి పనిచేసిన వారికి గుర్తింపు ఇస్తామని, కొత్తవాళ్లను నెత్తిన పెట్టుకోబోమని తెలిపారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తోట సుజలారాణితో పాటు చల్లగుళ్ల నర్సింహారావు, ఉడతనేని అప్పారావు, పసుమర్తి చందర్రావు, నున్నా రామకృష్ణ, రావి నాగేశ్వరరావు, కూసంపూడి నర్సింహారావు, గాదె చెన్నారావు, వందనపు సత్యనారాయణ, దొడ్డా శ్రీనివాసరావు, నారాయణవరపు శ్రీని వాస్, ఎస్.కే.మౌలాలీ, ఎండీ.కమల్‌పాషా, సోమిశెట్టి శ్రీధర్, రామిశెట్టి మనోహర్, దూదిపాల రాంబాబు, గోలి ఉషారాణి పాల్గొన్నారు. ఇవి చదవండి: నామినేటెడ్ పోస్టు.. మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల చుట్టూ ప్రదక్షిణ! -
కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే మాట తప్పదు: డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం అమలులో భాగంగా ఖమ్మం పాత బస్టాండ్‌లో మహిళలకు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆర్టీసీ బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలకు ఉచిత టికెట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం, కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే మాట తప్పదని తెలిపారు. ఇది ప్రజల ప్రభుత్వం, రాహుల్ గాంధీ చెప్పినట్టుగా అన్ని హామీలను అమలు చేస్తాం, సంపాదను సృష్టిస్తాం, సంపాదను ప్రజలకు పంచుతామని పేర్కొన్నారు. మహిళలు ఒక్క రూపాయ ఖర్చు లేకుండా ప్రయాణం చేయొచ్చని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గత ప్రభుత్వం అమలు చెయ్యలేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా బ్రతకోచ్చని, ఎలాంటి నిర్భందాలు ఉండవని తెలిపారు. ఖమ్మం జిల్లాలో 10కి 9 స్థానాలల్లో ప్రజలు గెలిపించారని గుర్తుచేశారు. ప్రజలు ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, అధికారులు ప్రజల ఇంటికి వచ్చి పనులు చేస్తారని తెలిపారు. రెవేన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం, ఇప్పుడు రెండు పధకాలను అమలు చేశామని తెలిపారు. మహిళ ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ స్కీమ్‌లను ప్రారంభించామని పేర్కొన్నారు. వ్యవసాయం ,మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా ప్రజల కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్న మీ ఋణం తీర్చుకోలేమని అన్నారు. తన రాజకీయ జీవితం 40 ఏళ్ళు ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు అవకాశం కల్పించారని అన్నారు. గతంలో కొందరు పనికిరాని వ్యక్తుల వలన తప్పులు జరిగాయని మండిపడ్డారు. -
ఇజ్జత్ కా సవాల్
ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ పార్టీకి తొలినుంచీ కొరుకుడు పడటంలేదు. గత రెండు ఎన్నికల్లోనూ చేదు అనుభవాలే మిగిల్చింది. అందుకే ఈసారి ఈ జిల్లాపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. తనను ధిక్కరించిన ఇద్దరు నేతలను ఎలాగైనా ఓడించాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆ రెండు నియోజకవర్గాలపై ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారట. ఆ రెండు చోట్లా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులను సైతం ఏమరుపాటు లేకుండా ప్రచారం చేసుకోవాలని ఆదేశించారు కేసీఆర్. ఇంతకీ గులాబీ బాస్‌కు కోపం తెప్పించిన ఆ ఇద్దరు ఎవరు? గత రెండు ఎన్నికల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ పునాదులు వేసుకోలేకపోయింది. రెండుసార్లు కూడా ఒక్కో సీటు మాత్రమే గెలవగలిగింది. ఏదైతేనేం ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చేరడంతో జిల్లాలో బీఆర్ఎస్ బలం పెరిగింది. ఈసారి పదికి పది స్థానాలు తమ ఖాతాలో వేసుకోవాలని అధికార పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గతంలో తమతో కలిసి ప్రయాణించిన ఇద్దరు నాయకులు ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలో చేరి బరిలో నిలవడంతో వారిద్దరు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు కేసీఆర్. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో నిలిచారు. అదేవిధంగా పాలేరులో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హస్తం అభ్యర్థిగా నిలుస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్తితుల్లోనూ బీఆర్ఎస్ చేజారనీయకుండా చూసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు గులాబీ బాస్. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకులు. జిల్లా అంతటా ఇద్దరికీ అనుచర బలగం ఉంది. రెండు బలమైన సామాజికవర్గాలకు చెందిన వీరిద్దరు జిల్లా అంతటా తమ ప్రభావం చూపగలుగుతారు. గులాబీ పార్టీలో సీట్లు రావని తేలడంతో ఇద్దరు కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇద్దిరికీ టిక్కెట్లు కేటాయించింది. ఇప్పుడు ఈ ఇద్దరినీ ఓడించడం ద్వారా గులాబీ పార్టీ బలోపేతం అయిందని.. కాంగ్రెస్ బలం తగ్గిపోయిందని నిరూపించేందుకు బీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నిస్తోంది. అందుకే ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌తో... పాలేరు అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డితోను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు చర్చిస్తూ...అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. రెండు నియోజకవర్లాల్లోనూ నెలకొన్న పరిస్తితులపై నిత్యం తెలుసుకుంటూ అక్కడి నేతలకు మార్గదర్శనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం నుంచి రెండు సార్లు గెలిచిన పువ్వాడ అజయ్ తాజా ఎన్నికల్లో కూడా గెలిచి హ్యట్రిక్ కొట్టాలనే ఉద్దేశ్యంతో ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళ్లుతున్నారు. అటు తుమ్మల కూడ ఈ ఎన్నికలతో పువ్వాడ అజయ్ పొలిటికల్ చాప్టర్ ముగిసిపోతుందని ప్రచారం చేస్తున్నారు. పాలేరులో సైతం కందాల, పొంగులేటి మధ్య పోరు రసవత్తరంగా నడుస్తోంది. పొంగులేటికి పాలేరులో బలమైన క్యాడర్ ఉండటం బాగా కలిసివస్తుందని అంటున్నారు. అయినప్పటికీ కందాలను ఏమాత్రం లైట్ తీసుకోకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందని ధీమాగా చెబుతూ ఊరూరా ప్రచారం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఆపరేషన్ ప్రారంభించగా...అటు కాంగ్రెస్ కూడా కౌంటర్ ఆపరేషన్ తీవ్రం చేసింది. కేసీఆర్ ప్లాన్స్ తిప్పికొట్టడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది. రెండు పక్షాల నుంచీ ఢీ అంటే ఢీ అని పరిస్థితి ఏర్పడటంతో ఖమ్మం జిల్లాలో పోరు యుద్ధ రంగాన్ని తలపిస్తోంది. నామినేషన్లు పూర్తయ్యే నాటికి జిల్లాలో పొలిటికల్ వార్ మరింత ఉధృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఖమ్మంలో సై అంటే సై! స్పీడ్ పెంచిన తుమ్మల, మట్టా, మదన్‌లాల్
సాక్షిప్రతినిధి, ఖమ్మం : వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్లో ఆశావహ నేతలు దూకుడు పెంచారు. ప్రధానంగా ఆ పార్టీలో పాలేరు, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వారి అనుచరగణమూ ఇదే స్థాయిలో సై అంటే సై అంటోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అశావహ నేతలు నువ్వా.. నేనా అన్నట్టుగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మళ్లీ తమకే పార్టీ టికెటన్న ధీమాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా.. పార్టీ సర్వేల్లో జాతకాలు మారుతాయన్న నమ్మకంతో ఆశావహులు ఉన్నారు. ఇటీవల ఆశావహ నేతలు హాట్‌హాట్‌గా ప్రకటనలు చేస్తూ తమ అనుచరులను క్రియాశీలకం చేసే పనిలో నిమగ్నమయ్యారు. (చదవండి: Munugode Bypoll: పోటీయా? మద్దతా?) పాలేరులో పోటా పోటీ.. పాలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కేడర్ రెండుగా చీలింది. గత కొంతకాలంగా రెండు వర్గా ల మధ్య ఉప్పు–నిప్పు అన్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలు, నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు కందాల హాజరవుతున్నారు. ఈ జోష్‌తో తన అనుచర నేతలు, కేడర్‌తో మళ్లీ పోటీలో ఉండేది తానేనంటూ సంకేతాలిస్తున్నారు. నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ సెంటర్లు పెట్టడంతో పాటు గతంతో పోలిస్తే గ్రామ పర్యటనలకు ఇటీవల ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక తన అనుచర నేతలు, కేడర్ నుంచి ఏ కార్యక్రమానికి పిలుపు వచ్చినా తుమ్మల వదులుకోవడం లేదు. వీటిల్లో పాల్గొంటూనే రాజకీయంగా చర్చనీయాంశం అయ్యేలా ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇటీవల నేలకొండపల్లి మండలంలో ఆయన పర్యటిస్తూ ‘ఎప్పుడైనా పిడుగులు పడొచ్చు’ అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. త్వరలో ఎన్నికలు వస్తాయని, టికెట్ తనకేనన్న నమ్మకంతో తుమ్మల ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆయన అనుచర వర్గం చర్చించుకుంటోంది. వైరా ‘గులాబీ’లో వార్.. జిల్లా కేంద్రానికి సమీపాన ఉన్న వైరా నియోజకవర్గ ‘గులాబీ’లో వార్ కొనసాగుతోంది. ఇండిపెండెంట్‌గా గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్ గూటికి చేరిన ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ తమకే టికెట్ అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి కూడా టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా ఏ కార్యక్రమం ఉన్నా ముఖ్యంగా ఎమ్మెల్యే రాములునాయక్, మదన్‌లాల్ వర్గాలు వేర్వేరుగా చేస్తుండడం గమనార్హం. అంతేగాకుండా ఇరువురూ తమ కేడర్, నేతలతో భారీగా ర్యాలీలు నిర్వహిస్తూ బలప్రదర్శన చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తమకంటూ ఒక టీం ఏర్పాటు చేసుకుని ఎక్కడా తగ్గకుండా కార్యక్రమాలు చేపడుతుండడంతో రోజురోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. ఈ ముగ్గురితోపాటు మరో ఒకరిద్దరు కూడా ఈ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ ఆశిస్తుండడంతో చివరికి పోటీలో ఎవరు ఉంటారన్నది సర్వేల్లో తేలుతుందన్నది పార్టీ వర్గాల సమాచారం. సత్తుపల్లిలోనూ ఇదే సీన్.. ఉమ్మడి జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసే నేతలకు పుట్టినిల్లు సత్తుపల్లి నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి చెందిన ప్రధాన నేతల ఆశీస్సులు ఎవరికి ఉంటే వారిదే గెలుపన్నది ఎప్పటినుంచో సాగుతున్న ప్రచారం. ఇటీవల ఏ ఎన్నికలు వచ్చినా.. మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఆశీర్వాదం ఎవరికి ఉంది.. దీంతో బరిలో ఉండే అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉంటాయన్నది అంచనా వేయడం పరిపాటిగా మారింది. అయితే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో నాలుగోసారి విజయం కోసం ఎదురుచూస్తున్నారు. 2009, 2014, 2018 లో టీడీపీ నుంచి సండ్ర గెలుపొందారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత టీఆర్ఎస్లో చేరారు. సీనియర్ ఎమ్మెల్యే కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు కూడా సండ్రకే ఉంటాయని ఆయన అనుచర వర్గం చర్చించుకుంటోంది. మరోవైపు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన డాక్టర్ మట్టా దయానంద్ ఈసారి వేగం పెంచారు. తన వర్గం కేడర్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. నాలుగో సారి విజయం తనదేనంటూ సండ్ర, తనకు టికెట్ వస్తుందన్న ధీమాలో దయానంద్ ఉండడంతో ఈ నియోజవర్గంలో గులాబీ రాజకీయం రసవత్తరంగా మారింది. (చదవండి: డిగ్రీ విద్యార్హతగల వీఆర్ఏలకు పేస్కేల్! రెవెన్యూలోనే కొనసాగింపు? ) -
నవంబరొచ్చినా.. నిధులు రాలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖను నిధుల కొరత వేధిస్తోంది. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో వారంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ప్రభుత్వ హామీతో కనీసం నవంబర్‌లోనైనా పరిస్థితి మారుతుందని ఆశించిన కాంట్రాక్టర్లకు మరోసారి నిరాశే మిగిలింది. దీంతో వారంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 20 వేల కోట్ల పనులను చేపట్టిన కాంట్రాక్టర్లకు తొలిదశలో రూ.6,500 కోట్లు చెల్లించాలని తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ మొదటివారంలో పనులు నిలిపివేసి తమ నిరసన తెలిపింది. ఈ నెలపై గంపెడాశలు.. గత నెల కాంట్రాక్టర్ల సమ్మెతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాంట్రాక్టర్ల అసోసియేషన్‌తో చర్చలు జరిపారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతోనూ చర్చలు జరిగాయి. అపుడు కాంట్రాక్టర్లకు స్పష్టమైన హామీ రాకపోయినా.. రూ.6,500 కోట్లు తొలి విడతగా బకాయిలు విడుదల చేస్తామని చెప్పడంతో నమ్మకంతో తిరిగి పనులు చేపట్టారు. అక్టోబర్ చివరి వారంలోనూ కాంట్రాక్టర్లు మంత్రి కేటీఆర్‌ను కలసి తమ సమస్యలను విన్నవించారు. అయినా పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. బ్యాంకుల్లో, ప్రైవేటుగా కోట్ల రూపాయల మేర అప్పులు తెచ్చి మరీ తాము పనులు చేపట్టామని.. తీసుకున్న అప్పులకు వడ్డీలు కూడా కట్టలేకపోతున్నామని కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు. అప్పులిచ్చిన పలు ప్రైవేటు బ్యాంకులు నోటీసులు పంపుతున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే.. తమకు ఆత్మహత్యే శరణ్యమంటున్నారు. మరోసారి సమ్మె దిశగా... నవంబర్లోనూ నిధుల విడుదలపై స్పష్టత లేకపోవడంతో కాంట్రాక్టర్లు డైలమాలో పడ్డారు. అక్టోబర్ మొదటి వారంలో పనులు నిలిపివేసి నిరసన తెలిపిన కాంట్రాక్టర్లు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారని సమాచారం. తమపై ఆర్థిక భారం పెరిగిపోతుండటంతో పనులు నిలిపి వేసే దిశగా కాంట్రాక్టర్లు యోచిస్తున్నట్లు తెలిసింది. అప్పుపై తేల్చని కన్సార్టియం.. ఈ ఏడాది రోడ్లు, భవనాల శాఖకు బడ్జెట్లో దాదాపుగా రూ.5,600 కోట్లు కేటాయించినా.. సరిగా విడుదల కాలేదు. దాదాపు రూ.3 వేల కోట్లు అప్పు తెచ్చుకోవాలని ప్రభుత్వమే ఆర్ అండ్ బీకి సలహా ఇవ్వడంతో అధికారులు అప్పుల వేటకు సిద్ధమయ్యారు. అంత పెద్ద మొత్తాన్ని ఒకే బ్యాంకు సర్దుబాటు చేయలేదు కాబట్టి అధికారుల వినతితో ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలో బ్యాంకుల కన్సార్టియం ఏర్పడింది. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంకుతోపాటు మరో రెండు బ్యాంకులు ఉన్నాయి. మే నెలలో ఈ కన్సార్టియం వీరికి అప్పులు ఇవ్వాలా? లేదా అన్న విషయంపై యోచనలో పడింది. కానీ, ఇప్పటికీ రుణం మంజూరు చేయలేదు. ఈలోపు ఇటు శాసనసభ రద్దు కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. -
సకాలంలో పనులు పూర్తిచేయండి: తుమ్మల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపడుతున్న జాతీయ రహదారుల విస్తరణ పనులను గడువులోగా పూర్తి చేయాలని రోడ్లు భవనాల అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సోమవారం ఆయన తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో జాతీయ రహదారుల నిర్మాణం, భూసేకరణ పనులపై చర్చించారు. భూసేకరణను సకాలంలో పూర్తి చేసి, ఆయా భూములను నిర్మాణ సంస్థలకు అప్పగించాలని సూచించారు. ఖమ్మం–దేవరపల్లి భూసేకరణ, ఖమ్మం–వరంగల్ విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మంచిర్యాల–వరంగల్–కంచికచర్ల రహదారిని గ్రీన్‌ఫీల్డ్ అలైన్మెంట్ పరిధిలో చేర్చినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోడ్డు విస్తరణ ప్రతిపాదనలను సమర్పించాలన్నారు. ఖమ్మం–కోదాడ, ఖమ్మం–సూర్యాపేట రహదారు ల పనులకు టెండర్లు పిలవాలన్నారు. సమావేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ పీడీ దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. -
లోకాయుక్త, అధికార భాష చట్టాలకు సవరణ బిల్లులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రెండు కీలకమైన బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టింది. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా లోకాయుక్త ఏర్పాటు, రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించేందుకు అవసరమైన బిల్లును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రవేశపెట్టారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్రంలో తెలుగు అధికార భాషగా ఉండింది. తెలంగాణలో ఖమ్మం జిల్లాలో మినహా మిగిలిన జిల్లాల్లో ఉర్దూ రెండో అధికార భాషగా అమలైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 అక్టోబరులో పది జిల్లాలను 31 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించాం. ఉర్దూ మాట్లాడే వారి జనాభా 31 జిల్లాల్లోనూ ఉంది. రాష్ట్రం మొత్తం జనాభాలో ఉర్దూ మాట్లాడేవారి జనాభా 12.69 శాతం ఉంది. తెలంగాణ అధికార భాషల చట్టంను సవరించి రాష్ట్రం మొత్తానికి ఉర్దూను రెండో భాషగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అని ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రకటన జారీ చేసింది. అలాగే లోకాయుక్త సవరణ బిల్లు విషయంలోనూ మరో ప్రకటన జారీ చేసింది. ‘తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా లోక్‌పాల్, లోకాయుక్త చట్టం నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించాము. రాష్ట్రానికి విడిగా లోకాయుక్త, ఉప లోకాయుక్త సంస్థను స్థాపించేందుకు తెలంగాణ లోకాయుక్త చట్టంలో కొన్ని సవరణలు చేసేందుకు ఈ బిల్లు ఉద్దేశించినది’అని పేర్కొన్నారు. -
'జలరవాణాకు ఏర్పాట్లు చేయండి'
హైదరాబాద్: రాష్ట్రంలో రహదారులు చాలా తక్కువగా ఉన్నాయని మరో 1850 కిలోమీటర్ల రోడ్లు తెలంగాణకు ఇవ్వాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భధ్రచలం నుంచి ఏటూరు నాగారం వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారిగా గుర్తించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో జలరవాణాకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరామన్నారు. దీనిపై స్పందించిన కేంద్రం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెడతామని హామీ ఇచ్చిందని చెప్పారు. దీనిపై సోమవారం సీఎం నివాసంలోనే ప్రకటన చేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరామన్నారు. బెంగళూరు రోడ్డును కూడా బాగు చేయాలని, ఈపీసీ కింద అమరావతి నుంచి భద్రాచలం రోడ్డుని కొత్తగూడెం నుంచి భధ్రాచలం ఇవ్వాలని కోరినట్టు తుమ్మల తెలిపారు. సీఎం కేసీఆర్‌తో కలిసి నితిన్ గడ్కరీ ఆలేరు-వరంగల్ జాతీయ రహదరి విస్తరణ పనులను రేపు(సోమవారం) ప్రారంభించనున్నారు. అనంతరం ఏటూరు నాగారంలోని ముల్లకట్ట వద్ద గోదావరి నదిపై నిర్మించిన వంతెనను ప్రారంభిస్తారు. -
రైతు ఆత్మహత్యలు కొత్తేమీ కాదు: టీ మంత్రులు
హైదరాబాద్: రైతు ఆత్మహత్యలపై టీడీపీ, కాంగ్రెస్‌లు శవరాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డిలు మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలు కొత్తేమీ కాదని..కాంగ్రెస్, టీడీపీ హయాంలో 23 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకిచ్చే పరిహారం పెంచాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. కమిషన్ల కోసమే కాంగ్రెస్ నేతలు...కాలువలు తవ్వించారని పోచారం ధ్వజమెత్తారు. రైతు కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తుమ్మల స్పష్టం చేశారు. -
నదీ జలాల వినియోగానికే ప్రాజెక్టుల రీ డిజైన్
కాళేశ్వరం వద్ద ప్రాజెక్టుతో 180 టీఎంసీలు అందుబాటులోకి.. 'ప్రాణహిత'కు జాతీయహోదాపై కేంద్రం వివక్ష రోడ్లు,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం నుంచి సాక్షి బృందం : గోదావరి జలాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తోందని రోడ్లు,భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గత పాలకుల హయూంలో తెలంగాణ ప్రజలకు నిధుల కేటాయింపు, నీటి వినియోగం, నియామకాల విషయంలో జరి గిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు పేర్కొన్నారు. మంత్రి శనివారం ఆర్డీవో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం వద్ద నిర్మించే ప్రాజెక్టుతో 180 టీఎంసీల గోదావరి నీరు వినియోగంలోకి వస్తుందన్నారు. ఈవిషయంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలోని ఏడు జిల్లాలలో 16 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించడంలో కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి(ఢిల్లీ)వేణుగోపాలాచారి మాట్లాడుతూ ఉత్పత్తి ప్రాజెక్టుల పేరుతో హడావుడిగా కాలువల తవ్వకం చేపట్టి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేశారని అభిప్రాయపడ్డారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు తదితరులున్నారు. -
ఖమ్మం పర్యటనలో హరీష్, తుమ్మల
ఖమ్మం: రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ. హరీష్‌రావు, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు ఎన్ఎస్పీ కాలువ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. అధికారులు, ఇంజనీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.