హైదరాబాద్: రాష్ట్రంలో రహదారులు చాలా తక్కువగా ఉన్నాయని మరో 1850 కిలోమీటర్ల రోడ్లు తెలంగాణకు ఇవ్వాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భధ్రచలం నుంచి ఏటూరు నాగారం వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారిగా గుర్తించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో జలరవాణాకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరామన్నారు. దీనిపై స్పందించిన కేంద్రం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెడతామని హామీ ఇచ్చిందని చెప్పారు. దీనిపై సోమవారం సీఎం నివాసంలోనే ప్రకటన చేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరామన్నారు. బెంగళూరు రోడ్డును కూడా బాగు చేయాలని, ఈపీసీ కింద అమరావతి నుంచి భద్రాచలం రోడ్డుని కొత్తగూడెం నుంచి భధ్రాచలం ఇవ్వాలని కోరినట్టు తుమ్మల తెలిపారు.
సీఎం కేసీఆర్తో కలిసి నితిన్ గడ్కరీ ఆలేరు-వరంగల్ జాతీయ రహదరి విస్తరణ పనులను రేపు(సోమవారం) ప్రారంభించనున్నారు. అనంతరం ఏటూరు నాగారంలోని ముల్లకట్ట వద్ద గోదావరి నదిపై నిర్మించిన వంతెనను ప్రారంభిస్తారు.
'జలరవాణాకు ఏర్పాట్లు చేయండి'
Published Sun, Jan 3 2016 4:38 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM
Advertisement