nithin gadkari
-
తుక్కు కేంద్రాలను కూడా ప్రారంభించండి
న్యూఢిల్లీ: ఆటోమొబైల్స్ డీలర్లు.. వాహనాల తుక్కు కేంద్రాలను కూడా ప్రారంభించాలని కేంద్ర రహదారులు, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలు, బయోఫ్యుయల్ వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, అలాగే హరిత హైడ్రోజన్ ఉత్పత్తిలో భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కూడా కృషి చేస్తోందని మంత్రి వివరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఉందని అయిదో ఆటో రిటైల్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి తెలిపారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఎదగడంలో ఆటో డీలర్లు కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. ప్యాసింజర్ వాహనాల తయారీలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్న భారత్.. వాణిజ్య వాహనాల తయారీలో ఆరో స్థానంలో ఉందన్నారు. దేశాన్ని టాప్ ఆటోమొబైల్ హబ్‌గా తీర్చిదిద్దడం తన కల అని ఆయన చెప్పారు. -
మునుపెన్నడూ లేని విధంగా ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్: ఇప్పటికే..
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగం రోజురోజుకి పెరుగుతోంది, దీనిని దృష్టిలో ఉంచుకుని పెద్ద కంపెనీల దగ్గర నుంచి చిన్న కంపెనీల వరకు దాదాపు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడంలో నిమగ్నమైపోయాయి. ఇప్పటికే దేశీయ విఫణిలో చాలా వాహనాలు ఎలక్ట్రిక్ వెర్షన్లో అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో భారత్ పరుగులు పెడుతోంది. 2023 ప్రారంభమైన కేవలం మూడు నెలల కాలంలోనే ఏకంగా 2.78 లక్షల ఈవీలు విక్రయించినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ఏడాది దేశ చరిత్రలోనే ఎప్పుడూ అమ్ముడుకానన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్ముడయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2022లో మార్కెట్లో మొత్తం ఒక మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ప్రతి నెలలోనూ 90వేలకు తగ్గకుండా అమ్ముడయ్యాయని నితిన్ గడ్కరీ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర రోడ్డు, రవాణాశాఖ ఆధ్వర్యంలోని వాహన్ పోర్టల్ రిజిస్ట్రేషన్ రికార్డులను పరిశీలించి ఈ డేటాను రూపొందించినట్లు ఈ సందర్భంగా వివరించారు. వాహన్ పోర్టల్ ప్రకారం మన దేశంలో 2021లో 3.29లక్షల ఎలక్ట్రిక్ వెహికల్స్ రిజిస్ట్రేషన్లు జరుగగా, 2022లో ఆ సంఖ్య 10.20 లక్షలకు చేరింది. 2021 కంటే 2022లో ఈవీల అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయని స్పష్టమవుతోంది. ఇప్పటికి కూడా కొన్ని రాష్ట్రాల్లో వాహన్ పోర్టల్ జాబితా లేదు. ఇవన్నీ త్వరలోనే జాబితాలో చేరనున్నట్లు కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చి 15 నాటికి దేశంలో 21.70 లక్షల ఈవీ విక్రయాలు జరిగాయి. ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోన్ రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ (4.65 లక్షలు) మొదటి స్థానంలో నిలిచింది. తరువాత స్థానాల్లో మహారాష్ట్ర (2.26లక్షలు), ఢిల్లీ (2.03లక్షలు) ఉన్నాయి. ఫోర్ వీలర్ విభాగంలో టాటా మోటార్స్ ముందంజలో ఉంది. టూ వీలర్ సెగ్మెంట్లో హీరో, ఓలా కంపెనీలు ఉన్నాయి. -
కేంద్రం గుడ్‌న్యూస్! రూ.429.28 కోట్లతో మద్నూర్–బోధన్ రోడ్డు విస్తరణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని కామారెడ్డి, నిజామాబాద్, మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేలా మద్నూర్– బోధన్ రహదారి విస్తరణకుగాను రూ.429.28 కోట్ల వ్యయానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర రోడ్డు రవాణ, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌గడ్కరి తెలిపారు. ఈ మేరకు గురువారం కేంద్రమంత్రి ప్రకటన చేశారు. కామారెడ్డి, నిజామాబాద్, నాందేడ్‌లోని ఎన్‌హెచ్–161బీబీలోని మద్నూర్ నుంచి బోధన్ సెక్షన్ వరకు రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించడానికి ఆమోదం తెలిపారు. 39.032 కిలోమీటర్ల పొడవు గల ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్, సేకరణ, నిర్మాణం(ఈపీసీ) పద్ధతిలో 2022–23 వార్షిక ప్రణాళిక కింద అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎన్‌హెచ్–163జీ(ఖమ్మం–విజయవాడ)లో రేమిడిచెర్ల గ్రామం నుంచి జక్కంపూడి గ్రామం (ఎన్‌హెచ్–16లో) వరకు నాలుగు లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే సెక్షన్ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 29.709 కిలోమీటర్ల లేఅవుట్‌కు రూ.1,190.86 కోట్లు ఖర్చు అవుతుందని, ఇతర ఎకనామిక్ కారిడార్(ఎన్‌హెచ్(ఒ)) ప్రోగ్రామ్‌ల కింద హైబ్రిడ్ యాన్యుటీ మోడ్‌లో తెలంగాణలోని ఖమ్మం, ఆంధ్రపద్రేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాల్లో నిర్మిస్తామని తెలిపారు. -
Vehicle scrapping policy: డొక్కు బండ్లు తుక్కుకే..
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కర్బన ఉద్గారాల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కర్బన ఉద్గారాల విషయంలో ‘కాలం చెల్లిన వాహనాల’ వాటా గణనీయంగానే ఉంది. దేశంలో 4.50 కోట్లకు పైగా పాత వాహనాలు రోడ్లపై తిరుగున్నాయి. కాలుష్యానికి కారణమవుతున్న డొక్కు వాహనాలను రోడ్లపైకి అనుమతించరాదని నిపుణులు తేల్చిచెబుతున్నారు. 2021–22 బడ్జెట్లో ‘వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన 9 లక్షలకు పైగా డొక్కు వాహనాలను ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి తుక్కు(స్క్రాప్)గా మార్చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి చెందిన పాత వాహనాలను, పాత అంబులెన్స్‌లను తుక్కుగా మార్చడానికి, వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడానికి అదనంగా నిధులు సమకూరుస్తామని 2023–24 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు అందుబాటులో ఉన్న విధానం ఏమిటో తెలుసుకుందాం.. పాత వాహనాలు అంటే? ► రవాణా వాహనం(సీవీ) రిజిస్ట్రేషన్ గడువు సాధారణంగా 15 సంవత్సరాలు ఉంటుంది. ఈ తర్వాత ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవడంలో విఫలమైతే స్క్రాపింగ్ పాలసీ ప్రకారం ఆ వాహనం రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. అప్పుడు దాన్ని తుక్కుగా మార్చేయాల్సిందే. ► ప్యాసింజర్ వాహనాల(పీవీ) రిజిస్ట్రేషన్ గడువు 20 ఏళ్లు. గడువు ముగిశాక వెహికల్ అన్‌ఫిట్ అని తేలినా లేక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను రెన్యువల్ చేసుకోవడంలో విఫలమైనా రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. వెహికల్‌ను స్క్రాప్‌గా మార్చాలి. ► 20 ఏళ్లు దాటిన హెవీ కమర్షియల్ వాహనాలకు(హెచ్‌సీవీ) ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లలో ఫిట్‌నెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ► ఇతర కమర్షియల్ వాహనాలకు, వ్యక్తిగత, ప్రైవేట్ వాహనాలకు జూన్ 1 నుంచి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ టెస్టులో ఫెయిలైన వాహనాలను ఎండ్–ఆఫ్–లైఫ్ వెహికల్(ఈఎల్వీ)గా పరిగణిస్తారు. ► ఫిట్నెస్ పరీక్షలో నెగ్గిన వాహనాలపై 10 శాతం నుంచి 15 శాతం దాకా గ్రీన్ ట్యాక్స్ విధిస్తారు. ► రిజిస్ట్రేషన్ అయిన తేదీ నుంచి 15 ఏళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, మున్సిపల్ కార్పొరేషన్ల, రాష్ట్ర రవాణా సంస్థల, ప్రభుత్వ రంగ సంస్థల, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలకు చెందిన అన్ని వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి, తుక్కుగా మార్చాలని స్క్రాపింగ్ పాలసీ నిర్దేశిస్తోంది. ► ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4.50 కోట్లకు పైగా పాత వాహనాలు రోడ్లపై తిరుగున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వాస్తవానికి వీటన్నింటినీ తుక్కుగా మార్చాలి. ► ప్రతి నగరంలో కనీసం ఒక స్క్రాపింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహనదారులకు ప్రోత్సాహకాలు ► కాలం చెల్లిన వాహనాన్ని తుక్కుగా మార్చేందుకు ముందుకొచ్చిన వాహనదారులకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఇందుకోసం ఏం చేయాలంటే.. ► తొలుత ఏదైనా రిజిస్టర్డ్ స్క్రాపింగ్ కేంద్రానికి వాహనాన్ని తరలించి, తుక్కుగా మార్చాల్సి ఉంటుంది. ► ఆ వాహనం స్క్రాప్ విలువ ఎంత అనేది స్క్రాపింగ్ కేంద్రంలో నిర్ధారిస్తారు. సాధారణంగా కొత్త వాహనం ఎక్స్–షోరూమ్ ధరలో ఇది 4–6 శాతం ఉంటుంది. ఆ విలువ చెల్లిస్తారు. స్క్రాపింగ్ సర్టిఫికెట్ అందజేస్తారు. ► స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఉన్న వాహనదారులు కొత్త వ్యక్తిగత వాహనం కొనుగోలు చేస్తే 25 శాతం వరకూ రోడ్డు ట్యాక్స్ రిబేట్, వాణిజ్య వాహనం కొంటే 15 శాతం వరకూ రోడ్డు ట్యాక్స్ రిబేట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఉన్న వాహనదారులకు కొత్త వాహనం విలువలో 5 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని వాహనాల తయారీ సంస్థలను కోరింది. ► పాత వాహనాన్ని తుక్కుగా మార్చి, కొత్తది కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ ఫీజులోనూ మినహాయింపు ఇస్తారు. స్క్రాప్ రంగంలో కొత్తగా 35,000 ఉద్యోగాలు! పాత వాహనాలను తుక్కుగా మార్చేయడం ఇప్పటికే ఒక పరిశ్రమగా మారింది. కానీ, ప్రస్తుతం అసంఘటితంగానే ఉంది. రానున్న రోజుల్లో సంఘటితంగా మారుతుందని, ఈ రంగంలో అదనంగా రూ.10,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, కొత్తగా 35,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ అంచనా వేస్తోంది. ప్రత్యామ్నాయాలు ఏమిటి? పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలను దశల వారీగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. ప్రత్యామ్నాయ వాహనాలు క్రమంగా అందుబాటులోకి వస్తున్నాయి. విద్యుత్‌తో నడిచే (ఎలక్ట్రిక్) వాహనాల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్లో పలు రాయితీలు ప్రకటించారు. రాబోయే రోజుల్లో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయి. సమీప భవిష్యత్తులో ఇథనాల్, మిథనాల్, బయో–సీఎన్జీ, బయో–ఎల్ఎన్జీ వాహనాలు విరివిగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్నెన్నో ప్రయోజనాలు ► కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చడం ప్రధానంగా పర్యావరణానికి మేలు చేయనుంది. కాలుష్య ఉద్గారాలు భారీగా తగ్గుతాయి. ఆధునిక వాహనాలతో ఉద్గారాల బెడద తక్కువే. ► పర్యావరణహిత, సురక్షితమైన, సాంకేతికంగా ఆధునిక వాహనాల వైపు వాహనదారులను నడిపించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ► పాత వాహనాల స్థానంలో కొత్తవి కొంటే వాహన తయారీ రంగం పుంజుకుంటుంది. ఈ రంగంలో నూతన పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయి. ► కొత్త వాహనాలతో యజమానులకు నిర్వహణ భారం తగ్గిపోతుంది. చమురును ఆదా చేయొచ్చు. తద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు. ► స్క్రాప్ చేసిన వెహికల్స్ నుంచి ఎన్నో ముడిసరుకులు లభిస్తాయి. ► ఆటోమొబైల్, స్టీల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు తక్కువ ధరకే ఈ ముడిసరుకులు లభ్యమవుతాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అట్టహాసంగా ముగిసిన ఫార్మసీ కాంగ్రెస్.. హైదరాబాద్‌లో నెక్స్ట్
సాక్షి, నాగ్‌పూర్: కోవిడ్ మహమ్మారి సమయంలో డాక్టర్లు, నర్సులతో సమానంగా ఫార్మసిస్టులు తమ బాధ్యతలను నిర్వర్తించారని కొనియాడారు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. నాగ్‌పూర్‌లో ఇటీవలే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మహాసభలు జరగ్గా.. కొద్ది రోజులకే ఇండియన్ ఫార్మసీ కాంగ్రెస్ మహాసభలు ఇంత పెద్ద ఎత్తున జరగడం అభినందనీయమన్నారు గడ్కరీ. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోషియేషన్ తరపున 72వ భారతీయ ఫార్మస్యూటికల్ కాంగ్రెస్ మహాసభలు జరిగాయి. జనవరి 20వ తేదీన ప్రారంభం కాగా, కేంద్ర మంత్రి గడ్కరీ ప్రారంభోపన్యాసం చేశారు. ఇవాళ్టితో( 22 తేదీతో) మహాసభలు ముగిశాయి. ముగింపు సమావేశాలకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హాజరయ్యారు. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ VG సోమాని అధ్యక్షతన జరిగిన ఈ సభల్లో "యాక్సెస్ టు క్వాలిటీ అండ్ అఫర్డబుల్ మెడికల్ ప్రోడక్ట్స్" అన్న అంశంపై చర్చ జరిగింది. ఈ సభలకు దేశవ్యాప్తంగా పదివేల మంది ఫార్మసీ విద్యార్థులు, రెండున్నర వేల మంది శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు, ఫార్మసీ పరిశ్రమల యజమానులు హాజరయ్యారు. ఈ సభల వేదికగా తమ వార్షిక నివేదికను సమర్పించారు ఐపీసీఏ సెక్రటరీ జనరల్, ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసొసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ టీవీ నారాయణ. భారతీయ ఫార్మసీ రంగ పరిణామ క్రమాన్ని తన నివేదికలో సవివరంగా తెలిపారు. కోవిడ్ సమయంలో మన దేశం ప్రపంచానికి కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్లను అందించిందని, దాని వెనక ఇండియన్ ఫార్మసీల ఘనత ఉందని కొనియాడారు టీవీ నారాయణ. తెలంగాణ నుంచి హాజరైన ఫార్మా ప్రతినిధులు ఈ మహాసభల్లో భారత్ బయోటెక్ అధినేత, పద్మభూషణ్ కృష్ణ ఎల్లా, ప్రపంచ ఫార్మసీ సమాఖ్య అధ్యక్షులు డామ్నిక్ జోర్డాన్, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ మోంటు పటేల్, కామన్ వెల్త్ దేశాల ఫార్మసీ సంఘ పూర్వ అధ్యక్షులు డాక్టర్ రావు వడ్లమూడి, నాగ్‌పూర్ సభల ఫార్మసీ కాంగ్రెస్ నిర్వహణ ఛైర్మన్ అతుల్ మండ్లేకర్, మహాసభల కార్యదర్శి ప్రొఫెసర్ మిలింద్ ఉమేకర్, ఐపీసీఏ కోశాధికారి డాక్టర్ సి.రమేష్, ఇతర ఫార్మసీ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా ఫార్మసీ అభ్యసిస్తోన్న వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమ ముఖ్యఅతిథి ఫడ్నవీస్ నాగ్‌పూర్ వేదికగా మూడు రోజులుగా జరిగిన ఫార్మసీ కాంగ్రెస్ సభల్లో ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. వంద సంవత్సరాల నాగ్‌పూర్ యూనివర్సిటీ ఫార్మసీ డిపార్ట్మెంట్ పూర్వ విద్యార్థులు వెలువరించిన ప్రత్యేక సంచికను ఫడ్నవీస్ ఆవిష్కరించారు. వచ్చే ఏడాది మహాసభలకు వేదిక హైదరాబాద్ జనవరి 2024లో జరగనున్న 73వ భారతీయ ఫార్మసీ కాంగ్రెస్ మహాసభలను హైదరాబాద్‌లో నిర్వహించాలని ఈ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నట్టు ఐపీఏ అధ్యక్షులు టీవీ నారాయణ ప్రకటించారు. తెలంగాణ ఐపీఏ అధ్యక్షులు డాక్టర్ బి.ప్రభాశంకర్ అధ్వర్యంలో జరిగే ఈ మహా సభలకు దేశవ్యాప్తంగా 15 వేల మంది ఫార్మసీ విద్యార్థులు, ఫార్మసీ రంగ ప్రముఖులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ మహాసభలకు తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ ఫార్మసీ కళాశాలల సంఘ నాయకులు డాక్టర్ కె.రామదాసు, టి. జైపాల్‌రెడ్డి, పుల్లా రమేష్ బాబు, ఏ.ప్రభాకర్‌రెడ్డి, మొలుగు నరసింహారెడ్డి, బొమ్మా శ్రీధర్, మధుసూధన్‌రెడ్డి, ఇతర ఫార్మసీ రంగ ప్రముఖులు హాజరుకానున్నారు. -
4 లక్షల రోడ్డు ప్రమాదాలు
న్యూఢిల్లీ: దేశంలో 2021 ఏడాదిలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిందని కేంద్రం తెలిపింది. 2020లో 3,66,138 ప్రమాద ఘటనలు చోటుచేసుకోగా 2021లో ఇవి 4,12,432కు చేరాయని వివరించింది. కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ గురువారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం తెలిపారు. ప్రమాదాలను తగ్గించేందుకు రోడ్డు ఇంజనీరింగ్ నిపుణుల సూచనల ప్రకారం రహదారుల పునర్నిర్మాణం, రహదారి భద్రతను పటిష్టం చేయడం వంటి పలు చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఏ ఒక్క జాతీయ రహదారిని కూడా మూసివేసే ప్రతిపాదన లేదని తెలిపారు. రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ వద్ద ఇప్పటి వరకు 5,215 వాహనాలను తుక్కుగా మార్చినట్లు చెప్పారు. -
ఢిల్లీలో కేంద్రమంత్రి గడ్కరీని కలిసిన ఏపీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ
-
ఒక మొక్కను తొలగిస్తే 10 మొక్కలు నాటాలి : నితిన్ గడ్కరీ
-
సరకు రవాణా ఖర్చులు తగ్గించాలి
సాక్షి, న్యూఢిల్లీ : వాటాదారులు మధ్య సహకారం, సమన్వయం, కమ్యునికేషన్లతో సరకు రవాణా ధరను 14 శాతం, 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ పిలుపునిచ్చారు. తద్వారా ఎగుమతుల్లో 50 శాతం పెరుగుదల సాధించొచ్చని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో‘ క్లైమేట్ గోల్స్: టెక్నలాజికల్ రోడ్ మ్యాప్ టు నెట్ జీరో ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నైతికత, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం సమాజానికి ముఖ్యమైన మూలస్తంభాలని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. కేంద్రం, రాష్ట్రాలు ఒక బృందంగా కలిపి పని చేస్తూ ప్రజా రవాణాను ప్రోత్సహించాల్సిన అవసరసం ఉందన్నారు. భారతదేశంలో యువ ప్రతిభావంతులైన ఇంజినీరింగ్ మానవశక్తితోపాటు తక్కువ కార్మిక వ్యయంతో దేశీయ మార్కెట్ ఉందన్నారు. బయో ఇథనాల్, బయో సీఎన్జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం ఆవశ్యకత వివరించారు. ఏటా 16 లక్షల కోట్ల శిలాజ ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడం వల్ల చాలా కాలుష్యం ఏర్పడుతోందన్నారు. ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి 27 గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేలు రూపొందించాలని నిర్ణయించామని కేంద్రమంత్రి గడ్కరీ వివరించారు. చదవండి: అమెరికా చెప్పినా వినలేదు.. అందుకే రూ.35వేల కోట్లు లాభం వచ్చింది! -
ఎలక్ట్రిక్ హైవేలు కమింగ్ సూన్: కేంద్రం భారీ కసరత్తు
న్యూఢిల్లీ: సౌరశక్తిని వినియోగించుకుని భారీ ట్రక్కులు, బస్సుల చార్జింగ్కు ఉపయోగపడేలా ఎలక్ట్రిక్ హైవేలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశీయంగా విద్యుత్‌తోనే నడిచే విధంగా ప్రజా రవాణా వ్యవస్థను తీర్చిదిద్దాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు వెల్లడించారు. ఉపరితలంపై ఉన్న విద్యుత్ లైన్స్‌తో పాటు రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలకు కూడా చార్జింగ్ కోసం విద్యుత్ సరఫరా చేసే విధంగా తీర్చిదిద్దే రోడ్లను ఎలక్ట్రిక్ హైవేగా పరిగణిస్తారు. మరోవైపు, టోల్ ప్లాజాల్లో కూడా సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు గడ్కరీ చెప్పారు. మౌలిక సదుపాయాలను పటిష్టంగా అభివృద్ధి చేస్తే ఆర్థిక కార్యకలాపాలు కూడా పుంజుకుంటాయని, కొత్త వ్యాపారాలు.. ఉద్యోగాల కల్పనకు దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు. భారత లాజిస్టిక్స్, రోప్‌వేలు, కేబుల్ కార్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అమెరికా ప్రైవేట్ ఇన్వెస్టర్లను ఈ సందర్భంగా మంత్రి ఆహ్వానించారు. అలాగే, చౌకైన, విశ్వసనీయమైన ఎలక్ట్రోలైజర్లు, హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్ టెక్నాలజీ అభివృద్ధిలో అమెరికా కంపెనీ సహకారం అందించాలని ఆయన కోరారు. రిటైల్ ఇన్వెస్టర్లకు ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లకు మించి రాబడులు లభించేలా ఇన్విట్ వంటి వినూత్న పథకాలు అందుబాటులోకి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వాడకాన్ని బట్టే టోల్ ఫీజు.. టోల్ ప్లాజా రద్దీని తగ్గించేలా నంబర్ ప్లేట్లను ఆటోమేటిక్‌గా గుర్తించే విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు గడ్కరీ చెప్పారు. అలాగే, టోల్ రహదారులపై ప్రయాణించినంత దూరానికి మాత్రమే వాహనదారుల నుంచి ఫీజు వసూలు చేసే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు వివరించారు. టోల్ బూత్‌ల దగ్గర వాహనాలను ఆపాల్సిన అవసరం లేకుండా, అలాగే రహదారిని ఉపయోగించినంత దూరానికే చెల్లింపులు జరిగేలా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ కెమెరాల టెక్నాలజీ ఉపయోగపడగలదని మంత్రి పేర్కొన్నారు. 2018-19లో టోల్ ప్లాజాల దగ్గర వాహనాల నిరీక్షణ సయమం సగటున 8 నిమిషాలుగా ఉండగా ఫాస్టాగ్‌లను ప్రవేశపెట్టాక 2021-22లో ఇది 47 సెకన్లకు తగ్గిందని గడ్కరీ చెప్పారు. నిరీక్షణ సమయం గణనీయంగా తగ్గినప్పటికీ జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇప్పటికీ నిర్దిష్ట సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా నిర్మించే జాతీయ రహదారుల పైనా, ప్రస్తుతం ఉన్న 4 పైగా లేన్ల హైవేలపైనా అధునాతన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ (ఏటీఎంఎస్) ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 2024నాటికి జాతీయ రహదారులపై 15వేల కి.మీ. మేర ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ సిస్టంను(ఐటీఎస్) అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారు. -
గుండెల్ని పిండేస్తున్న వీడియో.. స్పందించిన గడ్కరీ కార్యాలయం
వైరల్: గుండెల్ని పిండేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్లో వైరల్ అవుతోంది. రోడ్డు విస్తరణలో భాగంగా జేసీబీతో ఓ భారీ వృక్షాన్ని నేల్చకూల్చగా.. అంతకాలం ఆ చెట్టు మీద గూళ్లు కట్టుకుని జీవిస్తున్న పక్షులు చెల్లాచెదురు అయిపోయాయి. అంతకంటే బాధాకరం ఏంటంటే.. పాపం ఆ చెట్టు కిందే నలిగి కొన్ని చనిపోవడం. వైరల్ అయిన ఈ వీడియో.. కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయం దాకా చేరడంతో చర్యలకు సిద్ధమయ్యారు అధికారులు. వైరల్ అవుతున్న వీడియోలో కొన్ని పక్షులు ఎగిరిపోగా.. మరికొన్ని పక్షులు, పిల్ల పక్షులు మాత్రం సమయానికి ఎగరలేక ఆ చెట్టు కిందే నలిగి చనిపోయాయి. అక్కడున్న చాలామంది పక్షుల పరిస్థితిని చూస్తూ అరవడం వీడియోలో గమనించొచ్చు. It not about road widening.. It’s about “how we treat other living-beings on earth..” Hope concerned authorities must have taken needful legal action..#wilderness #UrbanEcology #nature #ConserveNature pic.twitter.com/aV16cIWmo8 — Surender Mehra IFS (@surenmehra) September 2, 2022 చెట్టు నెలకొరిగాక.. చనిపోయిన పక్షుల్ని బాధతో ఒకవైపుగా వేశారు స్థానికులు. ప్రస్తుతం ఈ విషాదకరమైన వీడియో వైరల్ అవుతోంది. దీంతో చాలామంది కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ట్యాగ్ చేస్తూ.. ఫిర్యాదులు చేశారు. మనుషులు ఎంత క్రూరంగా మారిపోయారో అని కామెంట్లు చేస్తున్నారు చాలామంది. దీనికి ఫలితం అనుభవించక తప్పదంటూ మరికొందరు కామెంట్లు చేశారు. అయితే.. ఈ ఘటన ఆగష్టు తొలివారంలోనే కేరళ మలప్పురం జిల్లా తిరురంగడి వీకే పడి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఐఎఫ్ఎస్ అధికారి సురేందర్ మెహ్రా ఈ వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. క్రూరమైన ఈ పనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాన్ని కోరారు. మరోవైపు ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ కూడా ఈ వీడియోను పోస్ట్ చేసి తన అసంతృప్తి వెల్లగక్కారు. అటు ఇటు తిరిగి ఈ వీడియో కాస్త గడ్కరీ కార్యాలయానికి చేరింది. దీంతో.. Everybody need a house. How cruel we can become. Unknown location. pic.twitter.com/vV1dpM1xij — Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 2, 2022 నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యాలయం స్పందించింది. విషయం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దాకా వెళ్లిందని, ఆయన వీడియో చూసి విచారం వ్యక్తం చేశారని తెలిపింది. సేవల్ వెట్‌ల్యాండ్స్ ఇంటర్నేషనల్ మూమెంట్ సీఈవో థామస్ లారెస్స్ ఫిర్యాదు మేరకు.. స్వయంగా స్పందించిన మంత్రి నితిన్ గడ్కరీ.. ఈ ఘటనకు సంబంధించిన కాంట్రాక్టర్‌ను, బాధ్యులైన వాళ్లను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో.. రంగంలోకి దిగిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని సదరు కాంట్రాక్టర్‌ను, స్థానిక అధికారులను కోరింది. మరోవైపు ఈ ఘటనపై కేరళ అటవీ శాఖ విభాగం స్పందించింది. ఆ చెట్టు కూల్చివేతలకు అనుమతులు లేకపోవడంతో జేసీబీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై కేరళ అటవీ పరిరక్షణ శాఖ మంత్రిణేకే ససీంద్రన్ ఈ ఘటనను క్రూరమైన చర్యగా అభివర్ణించారు. తమ అనుమతులు లేకుండానే ఈ ఘటన జరిగిందని ఆయన నేషనల్ హైవేస్ అథారిటీపై ఆరోపణలు గుప్పించారు. ఇదీ చదవండి: మనిషి జీవితం నీటి బుడగ.. అందుకు ఉదాహరణే ఈ వీడియో -
7 ఎలక్ట్రిక్ బైక్స్ అగ్నికి ఆహుతి, ఓవర్ చార్జింగే కారణమా?
సాక్షి,ముంబై: మహారాష్ట్ర, పూణెలోని ఓ ఎలక్ట్రిక్ బైక్ షాపులో ఏడు ఎలక్ట్రిక్ బైక్‌లు దగ్ధమైన ఉదంతం కలకలం రేపింది. రాత్రి పూట వాహనాలు చార్జ్ అవుతుండగా, షార్ట్ సర్క్యూట్ అయినట్టు తెలుస్తోంది. నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక దళం మంటలను ఆర్పాల్సి వచ్చింది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణాన్ని తోసిపుచ్చిన ఫైర్ అధికారి బ్యాటరీ ఓవర్ చార్జ్ కావడంతో మంటలంటుకుని ఉండవచ్చన్నారు. సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడ లేదు. షోరూంలో మొత్తం 16 స్కూటర్లు ఉన్నందున ఈ సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని అంచనా. సమగ్ర విచారణ తర్వాతే కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. షోరూమ్‌లో ఒక బైక్‌లో పొగలు వ్యాపించడంతో మంటలు చెలరేగాయనీ, తరువాత ఆరు స్కూటర్లను చుట్టుముట్టాయని యాజమాన్యం వెల్లడించింది. ఇతర ఆస్తులకు కూడా నష్టం వాటిల్లిందని యాజమాన్యం పేర్కొంది. మొత్తం స్కూటర్ల అంచనా ఖరీదు దాదాపు రూ.7 లక్షలుగా భావిస్తున్నారు. విచారణ తరువాత వివరాలు అందిస్తామని కొమాకి దేవల్ రైడర్స్ షోరూమ్ యజమాని ధనేష్ ఓస్వాల్ తెలిపారు. కాగా ఈ వేసవిలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన అనేక అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఈ ఏడాది మార్చిలో పూణెలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగాయి. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తర్వాత తనిఖీ కోసం 1,441 ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ లోపాలే ఈ ప్రమాదానికి కారణమన్న ఆందోళనల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక తరువాత కేంద్రం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. నాసిరకం బ్యాటరీ ప్యాక్‌లకు సంబంధించి షోకాజ్ నోటీసులు ఆయా కంపెనీలకు పంపింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రకారం నిబంధనలను పాటించడంలో విఫలమైతే డిఫాల్టర్ కంపెనీలకు భారీ జరిమానాలు తప్పవని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
గాలొచ్చి బ్రిడ్జి కూలిందట
న్యూఢిల్లీ: ‘గాలి మరీ గట్టిగా వచ్చింది. అందుకే బ్రిడ్జి కడుతుండగానే కూలిపోయింది’ – కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రి నితిన్ గడ్కరీకి ఓ ఐఏఎస్ అధికారి ఇచ్చిన వివరణ ఇది. దాంతో విస్తుపోవడం ఆయన వంతైంది. ఈ విషయాన్ని సోమవారం ఓ సమావేశంలో మంత్రే స్వయంగా చెప్పుకొచ్చారు. బిహార్‌లోని సుల్తాన్‌గంజ్‌లో గంగా నదిపై కడుతున్న ఓ బ్రిడ్జిలో కొంత భాగం ఏప్రిల్ 29న కూలిపోయింది. దీనిపై సంబంధిత ఐఏఎస్ అధికారిని వివరణ కోరితే పెనుగాలే కారణమని తేలిగ్గా చెప్పేశారన్నారు మంత్రి. ‘‘ఎంత గట్టిగా వీచినా గాలికి బ్రిడ్జి ఎలా కూలుతుందో నాకింత వరకూ అర్థం కాలేదు. ఏకంగా రూ.1,710 కోట్లతో కడుతున్న బ్రిడ్జి కూలిందంటే నిర్మాణంలోనే లోపముందన్నమాటే’’ అని అభిప్రాయపడ్డారు. 3.12 కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే దేశంలోనే అతి పొడవైందిగా నిలవనుంది. -
అతని సమాధానం విని ఆశ్చర్యపోయా: నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: మీడియాకు ఆసక్తికరమైన అనుభూతుల్ని పంచుకోవడంలో ముందుంటారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. వంతెనల నిర్మాణం విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గడ్కరీ.. ఈ సందర్భంగా ఆయనకు ఎదురైన ఓ అనుభవం గురించి తెలిపారు. ‘‘బీహార్ సుల్తాన్‌గంజ్ వద్ద నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జిలో కొంత భాగం ఈ మధ్య కూలిపోయింది. ఏప్రిల్ 29న ఈ ఘటన జరిగింది. కారణం ఏంటని నా సెక్రెటరీని అడిగా.. అతను ‘బలమైన గాలుల వీయడం వల్లే కూలింది సార్’ అన్నాడు. ఐఏఎస్ అధికారి స్థాయిలో ఉండి.. ఆయన అలాంటి వివరణ ఇచ్చేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. వెంటనే నేను.. ‘గాలులకు బ్రిడ్జి కూలిపోవడం ఏంటయ్యా. మరేదైనా కారణం అయ్యి ఉండొచ్చేమో’ అంటూ ఖుల్లాగా నా అభిప్రాయం చెప్పేశా. దేశంలో వంతెనల నిర్మాణంలో ఖర్చు తగ్గించాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో ఇలాంటి ఘటనలను పరిగణనలోకి తీసుకుని నాణ్యత విషయంలో కాంప్రమైజ్ కాకూడదంటూ ఢిల్లీలో ఓ ఈవెంట్‌కు హాజరైన గడ్కరీ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. సుల్తాన్‌గంజ్‌లో జరిగిన ఘటనపై సీఎం నితీశ్ కుమార్ ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. సుమారు 1,700 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న భారీ బ్రిడ్జి ఇది. 2014లోనే మొదలైన పనులు.. ఇంకా పూర్తి కొనసాగుతున్నాయి. అలాంటిది గాలులకు కూలిపోవడం ఏంటన్న ఆశ్చర్యమూ వ్యక్తం అవుతోంది అంతటా. -
ఆరెస్సెస్ అలాంటిది కాదని ఆయనకు చెప్పా: గడ్కరీ
పుణే: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికరమైన ఓ ఘటనను మీడియాతో పంచుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా, ఆరెస్సెస్‌పై వ్యాఖ్యలు చేయడంతో.. దానికి ప్రతి సమాధానం ఇచ్చి గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో నేను మహారాష్ట్ర మంత్రిగా ఉన్నా. ఔరంగాబాద్‌లో ఆరెస్సెస్ చీఫ్, దివంగత కేబీ హెగ్డేవార్ పేరు మీద ఓ ఆస్పత్రిని ప్రారంభించాం. దాని ప్రారంభోత్సవానికి రతన్ టాటాను ఆహ్వానించాం. సంతోషంగా ఆయన వచ్చారు. అయితే కార్యక్రమం మొదలయ్యే టైంలో.. ఈ ఆస్పత్రి కేవలం హిందూ కమ్యూనిటీ కోసమేనా? అని అడిగారు, ఎందుకలా అడిగారు? అని నేను అన్నాను. దానికి ఆయన.. ఇది ఆరెస్సెస్ వాళ్లకు చెందింది కదా అన్నారు. అప్పుడు నేను ఇది అన్నీ కమ్యూనిటీలకు చెందిన ఆస్పత్రి అని, ఆరెస్సెస్‌కు అలాంటి వివక్ష ఏం ఉండదని చెప్పారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఈ విషయమై చాలాసేపు సంభాషణ జరిగింది. చివరికి నా వివరణతో ఆయన సంతోషించారు అని గడ్కరీ గుర్తు చేసుకున్నారు. ఆరెస్సెస్ ఇప్పటికీ అలాంటి వివక్షకు దూరంగానే ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. గురువారం పుణేలో అప్లా ఘర్ సేవా సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆస్పత్రి ప్రారంభ కార్యక్రమంలో గడ్కరీ పై ఘటనను గుర్తు చేసుకున్నారు. అలాగే దేశం ఆదివాసీల దీనస్థితిపైనా సంఘీభావం వ్యక్తం చేసిన ఆయన.. ఆరోగ్య, విద్యా రంగాల్లో వాళ్లకు అందుతున్న వసతుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు గడ్కరీ. -
గడ్కరీతో భేటీలో సీఎం జగన్ చర్చించిన అంశాలివే
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ ముగిసింది. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు హాజరయ్యారు. బుధవారం ఉదయం జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుల పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇక సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగియడంతో.. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఏపీకి తిరుగుపయనం అయ్యారు సీఎం జగన్. గడ్కరీతో చర్చించిన అంశాలు.. ► విశాఖ- భోగాపురం బీచ్ కారిడర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని మేలైన ఆలోచనలు చేయాలంటూ గత రాష్ట్ర పర్యటనలో గడ్కరీ ఇచ్చిన సలహామేరకు.. అధికారులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారని సీఎం జగన్ వివరించారు. ► విశాఖ నుంచి వేగంగా భోగాపురం చేరేందుకు సౌకర్యవంతమైన రోడ్డుతోపాటు, పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని మంత్రిని కోరారు. ► విజయవాడ వెస్ట్రన్ బైసాస్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, దీనికి సీఆర్డీయే గ్రిడ్ రోడ్డును అనుసంధానం చేసి పనులు ముందుకుసాగేలా చర్యలు తీసుకోవాలని గడ్కరీని కోరారు. ► విజయవాడ వెస్ట్రన్ బైపాస్కు సంబంధించి మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్‌కు భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, ఈ భూములను కూడా గుర్తించిందని వెంటనే డీపీఆర్ సిద్ధంచేసి పనులు ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ► విజయవాడ ఈస్ట్రన్ బైపాస్కు సంబంధించి కూడా డీపీఆర్ సిద్ధంచేసి పనులు వేగవంతంగా చేపట్టేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ► రాష్ట్రంలో 20 ఆర్వోబీలకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఇప్పటికే మంజూరుచేసిందని, మిగిలిన 17 ఆర్వోబీలనూ మంజూరుచేయాలని విజ్ఞప్తిచేశారు. ► రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను, పారిశ్రామిక నోడళ్లను, స్పెషల్ ఎకనమిక్ జోన్లను కలుపుతూ 1,723 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లాల కేంద్రాలను కలుపుతూ ఈ రోడ్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ► రాష్ట్రంలో దాదాపు 14 ప్రాంతాల్లో రోప్ వే ల నిర్మాణానికి పర్యాటక శాఖ ప్రతిపాదనలు పంపించింది. ఇప్పటికే 2 చోట్ల నిర్మాణానికి అంగీకరించింది. మిగిలిన ప్రతిపాదనలకూ అనుమతి మంజూరుచేయాలని కేంద్రమంత్రి గడ్కరీని కోరారు సీఎం జగన్. -
పెట్రోల్, డీజిల్, కరెంట్ ఏదీ అక్కర్లేని కారు.. త్వరలో ఇండియాలో
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్‌తో కూడా కొద్దోగొప్పో కాలుష్యం సమస్య ఉంటుందేమోగానీ.. హైడ్రోజన్‌తో మాత్రం అస్సలు ఉండదు. ఈ విషయం చాలాకాలంగా మనందరికీ తెలుసు. అయితే, మనం ఇప్పుడు దీని గురించి ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే. ఇప్పటికే రోడ్ల మీద పెట్రోల్, డీజిల్, సీఎన్'జీ, ఎలక్ట్రిక్ కార్లు తిరుగుతున్నాయి. త్వరలో హైడ్రోజన్‌తో నడిచే కార్లు కూడా దర్శనం ఇవ్వనున్నాయి. తాజాగా టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రయివేట్ లిమిటెడ్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ(ఐసీఏటీ) భారతీయ రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నడిచే హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ టయోటా మిరాయ్ కారును మన దేశంలో పరీక్షించనున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రేపు(మార్చి 16) ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇది. దేశంలో ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ గురించి అవగాహన పెంచడం కోసం ఈ పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. గత ఏడాది టయోటా కంపెనీకి చెందిన మిరాయ్ కారు హైడ్రోజన్ ఫ్యూయెల్'ని ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత అత్యధిక దూరం ప్రయాణించి ఏకంగా 'గిన్నిస్ వరల్డ్ రికార్డ్' కైవసం చేసుకుంది. ఈ విధమైన అత్యధిక మైలేజ్ అందించిన మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ కారు ఇదే. కొన్ని నివేదికల ప్రకారం.. హైడ్రోజన్ ఫ్యూయెల్'ని ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత 1,359 కిమీల దూరం ప్రయాణించింది. ఈ మొత్తం దూరం ప్రయాణించడానికి 5.65 కిలోగ్రాముల హైడ్రోజన్‌ను వినియోగించింది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో విద్యుత్ ఉత్పత్తి చేసే గ్రీన్ హైడ్రోజన్ 1 కేజీ ధర రూ.350-400 వరకు ఉంది. (చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్... భారత్‌కు ఇదే గోల్డెన్ ఛాన్స్..! అమెరికాకు చెక్..!) -
వెహికల్ సేఫ్టీ కోసం స్వదేశీ ఎన్సీఏపీ రేటింగ్ అవసరం: నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: కొత్త వాహనాల భద్రతను తనిఖీ చేయడానికి, ప్రపంచ రేటింగ్ సంస్థల నిబందనలకు అనుగుణంగా భద్రత నాణ్యత విషయంలో వాహనాలకు స్టార్ రేటింగ్స్ కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం భారత్ న్యూ కార్ అసెస్ మెంట్ ప్రోగ్రామ్(ఎన్సీఏపీ) వ్యవస్థను తీసుకొస్తుందని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు. అన్ని ప్యాసింజర్ వాహనాలకు ప్రభుత్వం ఆరు ఎయిర్ బ్యాగులను తప్పనిసరి చేస్తుందని ఆయన అన్నారు. త్రీ పాయింట్ సీట్ బెల్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్(ఏఈబీఎస్) సహా ఇతర ఫీచర్లు కూడా వాహనాలకు తప్పనిసరి ఫీచర్లుగా ఉండబోతున్నాయని ఆయన తెలిపారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇనిషియేటివ్(పీఎల్ఐ) పథకం వంటి చర్యలు ఎయిర్ బ్యాగుల దేశీయ ఉత్పత్తిని పెంచాయని, ఫలితంగా ధరలు తగ్గాయని మంత్రి తెలిపారు. ప్రతి సంవత్సరం సుమారు 1.5 లక్షల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, దీనివల్ల జీడీపీకి 3.1% నష్టం వాటిల్లుతుందని ఆయన మీడియా సమావేశంలో అన్నారు. 2025 నాటికి రోడ్డు ప్రమాదాలను 50% తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. (చదవండి: మార్కెట్లోకి కేటీఎమ్ ఎలక్ట్రిక్ బైక్.. ఇక యువత తగ్గేదె లే!) -
ఫాస్ట్ ట్యాగ్ చరిత్రలో రికార్డు స్థాయి వసూళ్లు..!
న్యూఢిల్లీ: 2019-20 ముందు సంవత్సరంతో పోలిస్తే ఏప్రిల్ 2021 నుంచి జనవరి 2022 మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ ఫాస్ట్ ట్యాగ్ ద్వారా సేకరించిన ఆదాయం 148% పెరిగినట్లు కేంద్ర రోడ్డు & రవాణా మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఎఐ) 2016లో ఫాస్ట్ ట్యాగ్ ప్రవేశ పెట్టిన తర్వాత మొదటిసారి రికార్డు స్థాయిలో ఈ ఏడాది ₹26,622.93 కోట్ల టోల్ వసూలైంది. 2022-23 సంవత్సరంలో ఫాస్ట్ ట్యాగ్ ద్వారా టోల్ సేకరణ రూ.35,000 కోట్ల వరకు పెరుగుతుందని ఆ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ ఫాస్ట్ ట్యాగ్ ద్వారా ఎన్హెచ్ఎఐ 2019-20లో ₹10,728.52 కోట్లు ఆర్జించింది. ఈ టోల్ వసూళ్లు 2020-21లో ₹20,837.08 కోట్లకు చేరుకున్నట్లు పేర్కొంది. జనవరి 31 వరకు 45 మిలియన్లకు పైగా ఫాస్ట్ ట్యాగ్లు జారీ చేసినట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం పార్లమెంటులో తెలిపారు. 2025 నాటికి ₹50,000 కోట్లను టోల్ ద్వారా సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిందని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్ అరామానే తెలిపారు. ఫిబ్రవరి 5 నాటికి 1.2 మిలియన్ ఫాస్ట్ ట్యాగ్ రీఫండ్ కేసులను జనవరి 202 నుంచి పరిష్కరించినట్లు గడ్కరీ రాజ్యసభకు తెలిపారు. 2020-21 వరకు సుమారు ₹3,36,661 కోట్ల విలువైన హైవే ప్రాజెక్టులను మంత్రిత్వ శాఖ మంజూరు చేసినట్లు గడ్కరీ ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2020లో జాతీయ రహదారులపై జరిగిన 1,16,496 రోడ్డు ప్రమాదాల్లో 47,984 మంది మరణించారని ఆయన తెలిపారు. (చదవండి: శాలరీ రూ.7.3లక్షలు!! విద్యార్ధులకు టీసీఎస్ బంపరాఫర్!) -
అలా చేస్తే.. ఇక పెట్రోల్ అవసరం లేదు: నితిన్ గడ్కరీ
వాహనాల్లో ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ ఇంజిన్లను ప్రవేశపెట్టాలని కార్ల తయారీదారులకు ప్రభుత్వం సలహా ఇచ్చినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు. ఒక కార్యక్రమంలో గడ్కరీ ప్రసంగిస్తూ.. ఎలక్ట్రిక్ వాహనలను, ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ''నిన్న, నేను ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్లను తయారు చేయమని కార్ల తయారీదారులకు సలహా ఇవ్వడానికి ఒక ఫైల్ పై సంతకం చేశాను. ఈ ఇంజిన్లను కార్ల తయారీదారులు తయారు చేయడానికి ఆరు నెలలు సమయం ఇచ్చాము' అని ఆయన అన్నారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ లేదా ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ అనేది గ్యాసోలిన్, మిథనాల్ లేదా ఇథనాల్ కలయికతో తయారు చేసిన ప్రత్యామ్నాయ ఇంధనం. టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో వంటి కంపెనీలు ఇప్పటికే తమ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల కోసం ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి తెలిపారు. ''త్వరలో, కార్లు కూడా 100 శాతం ఇథనాల్ ఇంధనంతో నడుస్తాయి. కాబట్టి, మాకు పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. అలాగే గ్రీన్ ఫ్యూయల్ వాడకం వల్ల భారీగా డబ్బు ఆదా అవుతుంది' అని గడ్కరీ అన్నారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ ఎలా పని చేస్తుంది? ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ అనేది ఒక అంతర్గత దహన యంత్రం. ఈ ఇంధనం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రకాల ఇంధనంతో పని చేయగలదు. సాధారణ భాషలో చెప్పాలంటే ఈ ఇంజిన్‌లో పెట్రోల్, ఇథనాల్ లేదా మిథనాల్ మిశ్రమాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఈ ఇంజన్ మిక్సర్‌లోని ఇంధన పరిమాణానికి అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే ఫ్యూయల్ మిక్సర్ సెన్సార్ లాగా పనిచేస్తుంది. ఫ్యూయల్ కంపోజిషన్ సెన్సార్, ఈసీయు ప్రోగ్రామింగ్ వంటి సాంకేతికత అందుబాటులోకి రావడంతో, ఇంజిన్ పరిమాణాన్ని సెట్ చేయడం ద్వారా ఆటోమేటిక్‌గా ఇంధనాన్ని ఉపయోగించుకోవచ్చు. (చదవండి: క్యాబ్ యూజర్ల కష్టాలకు చెక్.. సరికొత్త ఆప్షన్ తీసుకొచ్చిన ఓలా!) -
పాత వాహనాలను తుక్కుకిస్తే.. కొత్తవాటిపై భారీగా రాయితీలు
న్యూఢిల్లీ: జాతీయ ఆటోమొబైల్ స్క్రాపేజీ పాలసీని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పాత వాహనాలను తుక్కు కింద మార్చడానికి ఇచ్చేసి, కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారికి పన్నుపరంగా మరిన్ని ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ప్రభుత్వం ఆమోదం పొందిన మారుతీ సుజుకీ టొయొట్సు ఇండియాకి చెంది తొలి స్క్రాపింగ్, రీసైక్లింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ అంశాలు వివరించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు కూడా స్క్రాపేజీ పాలసీ ఉపయోగపడగలదని మంత్రి చెప్పారు. పన్నుల పరంగా మరిన్ని ప్రోత్సాహకాలు ఎలా ఇవ్వచ్చు అన్నదానిపై ఆర్థిక శాఖతో చర్చించనున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే తుక్కు విధానం కింద ఇంకా ఏయే ప్రోత్సాహకాలు ఇవ్వడానికి వీలుంటుందో పరిశీలించాలని జీఎస్టీ మండలిని కూడా కోరారు. (చదవండి: విదేశాలకు దేశీయ 6జీ టెక్నాలజీ ఎగుమతి!) కేంద్రం, రాష్ట్రాలకు పెరగనున్న ఆదాయం.. స్క్రాపేజీ విధానంతో కేంద్రం, రాష్ట్రాలకు జీఎస్టీ ఆదాయం కూడా పెరుగుతుందని మంత్రి వివరించారు. రెండింటికి చెరో రూ.40,000 కోట్ల వరకూ ఆదాయం లభించగలదని తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు తయారీకి, ఉద్యోగాల కల్పనకు ఊతం లభించగలదని ఆయన చెప్పారు. ‘కొత్త కార్లతో పోలిస్తే పాత కార్లతో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని దశలవారీగా తప్పించాలి. స్క్రాపేజీ విధానం కారణంగా అమ్మకాలు 10-12 శాతం పెరిగే అవకాశం ఉంది‘ అని గడ్కరీ తెలిపారు. స్క్రాపింగ్ వల్ల ముడి వస్తువులు తక్కువ ధరకే లభించగలవని, దీనితో తయారీ వ్యయాలూ తగ్గుతాయని ఆయన చెప్పారు. రెండేళ్లలో మరో దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం 3-4 వాహనాల రీసైక్లింగ్, స్క్రాపింగ్ కేంద్రాలు ఏర్పాటు కావాలని ప్రభుత్వం భావిస్తోందని గడ్కరీ చెప్పారు. రెండేళ్లలో మరో 200-300 స్క్రాపింగ్ కేంద్రాలు రాగలవని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం వార్షిక టర్నోవరు రూ. 7.5 లక్షల కోట్లుగా ఉండగా, దీన్ని వచ్చే అయిదేళ్లలో రూ. 15 లక్షల కోట్లకు చేర్చాలన్నది తమ లక్ష్యంగా మంత్రి చెప్పారు. మరోవైపు, మిగతా దేశాల తరహాలోనే భారత్‌లో కూడా 15 ఏళ్ల వరకూ ఆగకుండా.. వాహనాల ఫిట్నెస్ను 3-4 ఏళ్లకోసారి పరిశీలించే విధానాన్ని అమల్లోకి తేవాల్సిన అవసరం ఉందని మారుతీ ఎండీ కెనిచి అయుకావా తెలిపారు. (చదవండి: తప్పిన తిప్పలు.. ఆన్లైన్లో అందుబాటులోకి జియోఫోన్ నెక్ట్స్!) టొయోటా సుషో సంస్థ భాగస్వామ్యంతో మారుతి సుజుకి నోయిడాలో ఏర్పాటు చేసిన స్క్రాపింగ్ కేంద్రం దాదాపు 10,993 చ.మీ. విస్తీర్ణంలో ఉంది. ఏటా 24,000 పైచిలుకు కాలపరిమితి తీరిపోయిన వాహనాలను (ఈఎల్వీ) తుక్కు కింద మార్చి, రీసైకిల్ చేయగలదు. దీనిపై సుమారు రూ. 44 కోట్లు ఇన్వెస్టే చేశారు. -
ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి తీపికబురు చెప్పిన నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: రాబోయే రెండేళ్లలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) ధర పెట్రోల్ వాహనాల స్థాయికి చెరనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. "రాబోయే రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ధర పెట్రోల్ వేరియెంట్లతో సమానంగా ఉంటుంది. ఇప్పటికే ఈవీలపై జీఎస్టీ కేవలం 5% మాత్రమే ఉంది. లిథియం అయాన్ బ్యాటరీల ఖర్చు కూడా తగ్గుతోంది. అంతేగాకుండా, పెట్రోల్ పంపులు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది" అని గడ్కరీ డెన్మార్క్ దేశ రాజధానిలో ఎలక్ట్రిక్ వాహనాలపై ది సస్టైనబిలిటీ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు. "భారత దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ మంచి ఊపు అందుకుంది. పెట్రోల్ వాహనం కిలోమీటరు ప్రయాణించడానికి ₹10, డీజిల్ వాహనం కిలోమీటరు ప్రయాణించడానికి ₹7 ఖర్చు అయితే, అదే ఈవీలు కిలోమీటరు ప్రయాణించడానికి ₹1 ఖర్చు అవుతుంది" అని ఆయన అన్నారు. 2030 నాటికిఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) అమ్మకాలు ప్రైవేట్ కార్ల అమ్మకాలలో 30%, వాణిజ్య వాహనాల అమ్మకాలలో 70%, బస్సుల అమ్మకాలలో 40%, ద్విచక్ర & త్రిచక్ర వాహనాల అమ్మకాలలో 80% చేరుకోవాలని భారతదేశం లక్ష్యాన్ని పెట్టుకుంది. ప్రస్తుతం దేశంలో 2/3 ఎలక్ట్రిక్-కార్ వేరియెంట్ల ధర ₹15లక్షల కంటే తక్కువగా ఉంది. కేంద్రం సబ్సిడీ అందించిన తర్వాత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాల ధర ఇప్పటికే ఉన్న పెట్రోల్ వాహనాలతో సమానంగా ఉంది అని అన్నారు. పెట్రోల్ స్టేషన్లలో ఛార్జింగ్ పాయింట్లు ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వేలో ఎలక్ట్రిక్ హైవే వ్యవస్థను ఏర్పాటు చేయడానికి పైలట్ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నట్లు గడ్కరీ తెలిపారు, ఈ ప్రాంతంలో సమృద్ధిగా సౌర శక్తి శక్తిని ఉపయోగించి విద్యుదీకరణ చేయవచ్చు. దీనితో పాటు పెట్రోల్ స్టేషన్లలో ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) 2023 నాటికి దేశంలోని జాతీయ రహదారులలో వెంట కనీసం 700 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే ప్రణాళికను రూపొందించింది. వీటిని ప్రతి 40-60 కిలోమీటర్లకు ఒకటి ఏర్పాటు చేయనున్నారు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు సౌరశక్తి ద్వారా విద్యుత్తును పొందేలా చూడటంపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించిందని కేంద్ర మంత్రి తెలిపారు. త్వరలో దేశంలో ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ను కూడా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. "బొగ్గు ఆధారిత విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో ప్రయోజనం లేదు. సౌర, టైడల్, పవన శక్తి, బయోమాస్ వంటి పునరుత్పాదక వనరులపై మా దృష్టి ఇప్పుడు ఉంది. రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ద్వారా డొమెస్టిక్ ఈవి ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయవచ్చు. దేశవ్యాప్తంగా కిడబ్ల్యుహెచ్ సగటు రిటైల్ విద్యుత్ ఛార్జ్ ధర ₹7-8 వరకు ఉంది, అదే డీజిల్ జనరేటర్ విద్యుత్ ₹20/కెడబ్ల్యుహెచ్ ఉంది. కానీ, సౌరశక్తి విద్యుత్ ధర నేడు ₹2/కెడబ్ల్యుహెచ్ కంటే తక్కువగా ఉంది. కాబట్టి, రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ సోలార్ పవర్ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల తలెత్తే విద్యుత్ సమస్యను పరిష్కరించగలదు" అని ఆయన అన్నారు. ఈవీల ఎగుమతి దేశంగా ఇండియా ప్రస్తుతం, భారతదేశం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని(145 జీడబ్ల్యు) కలిగి ఉంది. సోలార్ పివీ సెల్స్, ఇళ్ల వద్ద ప్యానెల్ సిస్టమ్, మాల్స్, పార్కింగ్ స్థలాలు, కార్యాలయాల ద్వారా దేశీయ ఈవి ఛార్జింగ్ ధరలను మరింత చౌకగా మారుస్తుందని గడ్కరీ అన్నారు. గత రెండేళ్లలో ఈ-స్కూటర్లు, ఈ-కార్ట్ లు, ఈ-ఆటోలు, ఈ-సైకిళ్లు వంటి చిన్న బ్యాటరీతో నడిచే వాహనాలకు దేశంలో భారీగా డిమాండ్ పెరిగిందని గడ్కరీ తెలిపారు. ఎలక్ట్రిక్ టూ వీలర్, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు కోవిడ్ పూర్వ కాలంతో పోలిస్తే వరుసగా 145%, 190% పెరుగుదలను చూశాయి అని ఆయన అన్నారు. ఈ రెండు సెగ్మెంట్లలో భారతదేశం ఎగుమతిదారుగా మారే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. -
చైనా కార్లా?.. టెస్లాకు భారత్ డెడ్లీవార్నింగ్
న్యూఢిల్లీ: గత కొద్ది నెలల నుంచి ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఎలక్ట్రిక్ కార్ల దిగుమతి సుంకాలను తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో ఐకానిక్ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని అమెరికాకు చెందిన టెస్లాను అనేకసార్లు కోరినట్లు, అదే సమయంలో సంస్థకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 'ఇండియా టుడే కాన్ క్లేవ్ 2021'ను ఉద్దేశించి గడ్కరీ మాట్లాడుతూ.. టాటా మోటార్స్ తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్లు టెస్లా తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్ల కంటే తక్కువ ఏమి కాదని అన్నారు. చైనా ఎలక్ట్రిక్ కార్లు విక్రయించొద్దు.. "చైనాలో తయారు చేసిన మీ కంపెనీ ఎలక్ట్రిక్ కార్లను భారతదేశంలో విక్రయించవద్దు. భారతదేశంలోనే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలి. ఇంకా అవసరం అయితే టెస్లా కార్లను ఇక్కడ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు" అని ఆయన అన్నారు. పన్ను రాయితీల విషయంలో సంస్థ డిమాండ్ చేసిన వాటి గురుంచి టెస్లా అధికారులతో తాను ఇంకా చర్చలు జరుపుతున్నానని రోడ్డు రవాణా, రహదారుల మంత్రి తెలిపారు. గత నెలలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ టెస్లాను మొదట భారతదేశంలో తన ఐకానిక్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రారంభించాలని కోరిన విషయం మనకు తెలిసిందే. (చదవండి: టెస్లా ఎలన్ మస్క్.. బెంజ్‌ని చూసి నేర్చుకో..!) ఇప్పటికే జర్మనికి చెందిన మెర్సిడెజ్ బెంజ్ ఇక్కడే ప్లాంట్ ఏర్పాటు చేసింది. గతేడాది ఆ సంస్థ రిలీజ్ చేసిన ఎస్ సిరీస్ కార్లు ఇండియాలో బాగానే క్లిక్ అయ్యాయి. దీంతో అమ్మకాలు పెంచుకునేందుకు పూనేలో కార్ల తయారీ యూనిట్‌ని రూ. 2,200 కోట్ల వ్యయంతో మెర్సిడెజ్ బెంజ్ ఏర్పాటు చేసింది. ఇండియాలో కార్ల తయారీ యూనిట్ నెలకొల్పి కార్ల ఉత్పత్తి ప్రారంభించడంతో కేంద్రం విధించే దిగుమతి సుంకం నుంచి మినహాయింపు లభించింది. దీంతో ఒక్కసారిగా బెంజ్ కార్ల ధరలు తగ్గిపోయాయి. మెర్సిడెజ్ బెంజ్ ఎస్ క్లాస్ 450 4 మ్యాటిక్ ధర రూ. 2.19 కోట్ల నుంచి రూ. 1.62 కోట్లకు తగ్గిపోయింది. అలాగే, టెస్లా గనుక ఇక్కడే కార్ల తయారీ ప్లాంట్ నిర్మిస్తే దిగుమతి సుంకం నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉన్నట్లు కొందరు అధికారులు తెలుపుతున్నారు. -
‘ఫ్లెక్స్ ఇంధనాల’ ఇంజిన్లపై త్వరలో ఆదేశాలు
పుణె: కార్ల తయారీ కంపెనీలు.. ఫ్లెక్స్–ఫ్యుయల్ ఇంజిన్లను ప్రవేశపెట్టడం తప్పనిసరి చేస్తూ త్వరలోనే ఆదేశాలు ఇవ్వనున్నట్లు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ మొదలుకుని టాటా, మహీంద్రా వంటి సంస్థలు దీన్ని పాటించేలా 3–4 నెలల్లో ఆదేశాలు జారీ చేయనున్నట్లు వివరించారు. తన జీవితకాలంలో పెట్రోల్, డీజిల్ వినియోగం పూర్తిగా నిలిచిపోవాలని, దేశీయంగా ఉత్పత్తయ్యే ఇథనాల్ ఇంధన వినియోగం పెరగాలని ఆకాంక్షిస్తున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. ఫ్లెక్స్ ఇంజిన్లు తయారు చేసే దాకా తన వద్దకు రావద్దంటూ ద్విచక్ర వాహన సంస్థలకు కూడా సూచించానని, ఆ తర్వాత అవి ఇథనాల్–ఫ్లెక్స్ ఇంజిన్లను రూపొందించాయని గడ్కరీ తెలిపారు. ఇంధనంలో 51–83% దాకా ఇథనాల్ లేదా మిథనాల్‌ను కలిపినా పనిచేయగలిగే ఇంజిన్లను ఫ్లెక్స్ ఇంజిన్లుగా వ్యవహరిస్తారు. మరోవైపు, శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు హారన్లను కూడా సంగీత ధ్వనులతో రూపొందించాలని కార్ల తయారీ సంస్థలకు సూచించినట్లు గడ్కరీ చెప్పారు. -
జాతీయ రహదారిపై 170 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన కేంద్ర మంత్రి
దేశ రోడ్డు రవాణా వ్యవస్థలో కీలకమైన ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే పనులు 2023, మార్చి నాటికి పూర్తి కానునట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్ధిక రాజధాని ముంబై మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి కేంద్రం రూ.98 వేల కోట్లతో ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే నిర్మాణ పనులను 2019 నుంచి చేపడుతుంది. ఈ ప్రాజెక్టు పనులను కేంద్రం మంత్రి గడ్కరీ తనిఖీ చేశారు. ప్రస్తుతం దీని నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అలాగే, ఈ రహదారి మీద నితిన్ గడ్కరీ స్పీడ్ టెస్ట్ నిర్వహించారు. నిర్మాణ దశలో ఉన్న ఈ రహదారి మీద 170 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లారు. రత్లామ్ జిల్లాలోని ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే నిర్మాణ పనులను పరిశీలించే సమయంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అకస్మాత్తుగా తన పక్కనున్న వ్యక్తితో కారు వేగాన్ని పెంచామని సూచించారు.. దీంతో ఆ వ్యక్తి వెంటనే కారును 170 కి.మీ వేగంతో తీసుకెళ్ళాడు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ ఎంపీ లోకేంద్ర పరాశర్ ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గడ్కరీ ఇంతకు ముందు హెలికాప్టర్ లో ఈ ప్రాంతాన్ని తనిఖీ చేశారు.(చదవండి: అమ్మకానికి విరాట్ కోహ్లి కారు ? ధర ఎంతంటే) #नया_भारत केंद्रीय मंत्री @nitin_gadkari जी ने रतलाम जिले से गुजरने वाले दिल्ली-मुंबई एक्सप्रेस वे पर 170 किमी प्रति घंटे की रफ्तार से कार चलवाकर लिया स्पीड टेस्ट @BJP4MP pic.twitter.com/Xq5b4jupqs — लोकेन्द्र पाराशर Lokendra parashar (@LokendraParasar) September 16, 2021 ఇప్పటివరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల ప్రాజెక్టుల కోసం రూ.1.50 లక్షల కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రోడ్డు ప్రాజెక్టుల కోసం మరో లక్ష కోట్ల రూపాయలు మంజూరు చేయబోతున్నాను అని ఆయన ఒక కార్యక్రమంలో చెప్పారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వేలో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వాహనాన్ని నడిపినట్లు గడ్కరీ పేర్కొన్నారు. 45 నిమిషాలకు పైగా కొనసాగిన ఈ తనిఖీలో గడ్కరీతో పాటు ఎంపిలు గుమాన్ సింగ్ దామోర్, అనిల్ ఫిరోజియా, సుధీర్ గుప్తా, రత్లాం జిల్లా ఎమ్మెల్యే చేతన్యా కశ్యప్ ఉన్నారు. ఈ ఎక్స్ ప్రెస్ వే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మూడు జిల్లాల గుండా వెళుతుంది, వీటిలో రత్లామ్, మాండ్ సౌర్, ఝబువా ఉన్నాయి. -
త్వరలో దేశంలో ఈ నగరాల మధ్య తొలి ఎలక్ట్రిక్ హైవే!
న్యూఢిల్లీ: ఢిల్లీ, జైపూర్ మధ్య త్వరలో దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ హైవే నిర్మించే అవకాశం ఉన్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు మీడియాతో తెలిపారు. ఈ రెండు నగరాల మధ్య రహదారిని నిర్మించడానికి తమ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఒక విదేశీ సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు గడ్కరీ తెలిపారు. ఢిల్లీ-జైపూర్ మధ్య రహదారి విస్తరణతో పాటు, ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే విషయంలో కూడా ఎలక్ట్రిక్ హైవే విస్తరణ కోసం స్వీడిష్ సంస్థతో కూడా చర్చలు జరుగుతున్నాయి అని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 22 గ్రీన్ ఎక్స్ ప్రెస్ వేలు నిర్మించాలని చూస్తున్నట్లు, ఇప్పటికే వాటిలో ఏడింటి పనులు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు. (చదవండి: గంటల వ్యవధిలోనే రూ.21 కోట్ల ఆర్జన!) "ఢిల్లీ నుంచి జైపూర్ వరకు ఎలక్ట్రిక్ హైవేను నిర్మించడం నా కల. ఇది ఇప్పటికీ ప్రతిపాదిత ప్రాజెక్ట్. దీని కోసం మేము ఒక విదేశీ సంస్థతో చర్చిస్తున్నాము" అని నితిన్ గడ్కరీ వార్తా సంస్థ పీటీఐతో పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, బస్సులు & ట్రక్కులు వంటి ప్రజా రవాణా వాహనాలను త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలకు మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ తెలిపారు. అలాగే, నితిన్ గడ్కరీ ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే పురోగతిని సమీక్షించారు. ఈ రహదారి వల్ల రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 24 గంటల నుంచి సగానికి తగ్గనున్నట్లు పేర్కొన్నారు. జైపూర్ - ఢిల్లీ మధ్య ప్రయాణం త్వరలో రెండు గంటలకు తగ్గనున్నట్లు ఆయన ప్రకటించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ)ప్రకారం వచ్చే ఏడాది మార్చి నాటికి ఢిల్లీ, జైపూర్ మధ్య ప్రయాణ సమయం సగానికి తగ్గుతుంది అని అన్నారు. -
జాతీయ రహదారిపై ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
జైపూర్: కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్.కేఎస్ భదౌరియా కలిసి ప్రయాణిస్తున్న భారత వైమానిక దళానికి చెందిన సీ-130జె సూపర్ హెర్క్యులస్ రవాణా విమానం మాక్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఫెసిలిటీ(ఈఎల్ఎఫ్) డ్రిల్ లో భాగంగా రాజస్థాన్ బార్మర్ సమీపంలోని సట్టా-గాంధవ్ జాతీయ రహదారిపై ల్యాండ్ అయ్యింది. భారత వైమానిక దళానికి చెందిన రవాణా విమానం అత్యవసర ల్యాండింగ్ కోసం జాతీయ రహదారిని ఉపయోగించడం ఇదే మొదటిసారి. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రోడ్డు రవాణా & రహదారి మంత్రి నితిన్ గడ్కరీ కలిసి సంయుక్తంగా రాజస్థాన్ బార్మర్ సమీపంలో ఐఏఎఫ్ అత్యవసర ల్యాండింగ్ కోసం నిర్మించిన సట్టా-గాంధవ్ జాతీయ రహదారిని ప్రారంభించారు. ఈ మాక్ డ్రిల్ విజయవంతం కావడంతో రక్షణ మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కేవలం 19 నెలల్లో నిర్మించిన సట్టా-గాంధవ్ జాతీయ రహదారిపై నేడు జరిగిన ఈఎల్ఎఫ్ విమాన కార్యకలాపాలను వారు వీక్షించారు. ఐఏఎఫ్ కు చెందిన 32 సైనిక రవాణా విమానం, మీ-17వి5 హెలికాప్టర్ కూడా ఈఎల్ఎఫ్ వద్ద దిగాయి. (చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు వాయిదా..?) #WATCH | C-130J Super Hercules transport aircraft with Defence Minister Rajnath Singh, Road Transport Minister Nitin Gadkari & Air Chief Marshal RKS Bhadauria onboard lands at Emergency Field Landing at the National Highway in Jalore, Rajasthan pic.twitter.com/BmOKmqyC5u — ANI (@ANI) September 9, 2021 రాజస్థాన్‌లోని సట్టా-గాంధవ్ స్ట్రెచ్‌ను ప్రారంభించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజస్థాన్‌లోని బర్మేర్ జిల్లాలో సట్టా-గాంధవ్ జాతీయ రహదారి మాదిరిగానే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్స్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. యుద్ద సమయాలలో ఈ రహదారులు ముఖ్య భూమిక పోషిస్తాయి అని అన్నారు. కోవిడ్-19 ఆంక్షలు ఉన్నప్పటికీ ఐఎఎఫ్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ రంగం చేతులు కలిపి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్ నిర్మాణాన్ని 19 నెలల్లో పూర్తి చేసినందుకు రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. "బహుళ విభాగాలు, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయానికి ఇది గొప్ప ఉదాహరణ" అని ఆయన అన్నారు. రాజ్ నాథ్ సింగ్ 3 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐఎఎఫ్ విమానాల ల్యాండింగ్ సరికొత్త ఇండియా చారిత్రాత్మక బలంగా నిర్వచించారు. భారత వైమానిక దళానికి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ కోసం మూడు కిలోమీటర్ల విభాగాన్ని ఎన్హెచ్ఏఐ అభివృద్ధి చేసింది. ఈ మొత్తం జాతీయ రహదారిని(196.97 కిలోమీటర్ల పొడవు) భారత్ మాల ప్రాజెక్టు కింద రూ.765.52 కోట్లు ఖర్చుతో నిర్మిస్తున్నారు. వీటి పనులు జూలై 2019లో ప్రారంభమైతే, జనవరి 2021లో పూర్తి అయ్యాయి. ఈ ప్రాజెక్టు అంతర్జాతీయ సరిహద్దులో ఉన్న బార్మర్, జలోరే జిల్లాల గ్రామాలను కలుపుతుంది. చైనా, పాకిస్తాన్ సహా ఉపఖండంలో శత్రువులు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి మరిన్ని జాతీయ రహదారులు అవసరమని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్ తో పాటు, సాయుధ దళాల అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు కింద కుందన్ పురా, సింఘానియా, బఖసర్ గ్రామాల్లో మూడు హెలిప్యాడ్ లను నిర్మించారు. -
దేశంలో పెరిగిపోతున్న ఉల్లం‘ఘనులు’
ట్రాఫిక్ కానిస్టేబుల్ లేడు కదా అని సిగ్నల్ జంప్ చేసినా, రోడ్డు బాగుంది కదా అని పరిమితికి మించి వేగంగా నడిపారో జాగ్రత్త. మీ కోసం ఛలానా రెడీగా ఉంటుంది. ట్రాఫిక్ నిబంధనలు మీరు ఉల్లంఘించడం పోలీసులు చూడకపోయినా మెషిన్లు చూస్తున్నాయి. మీ తప్పులను అట్టే పసిగట్టి ఫైన్లు విధిస్తున్నాయి. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ట్రాఫిక్ ఫైన్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగాయి. 7.7 కోట్ల ఛలానాలు నూతన మోటారు వాహనాల చట్టం 2019 అమల్లోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఛలాన్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫైన్లు కడుతున్న వారి సంఖ్య పెరిగిపోయింది. 2017 ఆగస్టు 1 నుంచి 2019 ఆగస్టు 1 వరకు దేశవ్యాప్తంగా 1.9 కోట్ల జరిమానాలు విధిస్తే 2019 ఆగస్టు నుంచి 2021 జులై వరకు ఈ సంఖ్య ఏకంగా 7.7 కోట్లకు చేరుకుంది. ఇదే కాలానికి తమిళనాడులో ట్రాఫిక్ ఛలాన్ల సంఖ్య 10.50 లక్షల నుంచి ఏకంగా 2.5 కోట్లకు చేరుకుంది. దాదాపు 24 రెట్లు ఎక్కువగా ఈ రాష్ట్రంలో అధికారికంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినట్టుగా రికార్డయ్యింది. దేశ రాజధానిలో నేషనల్ కాపిటల్ రీజియన్‌లో ఉండి ఎల్లవేళలా వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండే ఢిల్లీలోనూ ట్రాఫిక్ ఉల్లంఘనలు తక్కువగా లేవు. కిలోమీటరకు నలుగురు కానిస్టేబుళ్లు ఉండే దేశ రాజధానిలో ఛలాన్ల సంఖ్య 49.70 లక్షల నుంచి 2.2 కోట్లకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా, చెన్నైలలో రిజిస్టరయిన వాహనాల సంఖ్య కంటే ఢిల్లీలో జారీ అయిన ట్రాఫిక్ ఛలాన్ల సంఖ్యనే ఎక్కువ. ఇక్కడ సగటున ఒక్కో వాహనంపై రెండు మూడు వరకు జరిమానాలు ఉన్నాయి. మరోవైపు గుజరాత్, హర్యానలో ఈ చలాన్ల సంఖ్య తగ్గింది. కెమెరాల వల్లే గతంలో ట్రాఫిక రూల్స్ మీరిన వారికి పోలీసులే ఫైన్లు విధించడం చేసే వారు కానీ ఇప్పుడా పనిని సీసీ కెమెరాలు చేస్తున్నాయి. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో మనుషులు చేసే పనిని అవే చేస్తున్నాయి. దీంతో ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ఇలా ప్రతీ ఒక్క సంఘటన రికార్డు అవుతోందని పోలీసులు అధికారులు అంటున్నారు. కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లోకి రాకముందు ట్రాఫిక్ రూల్స్ పాటించే విషయంలో నిర్లక్ష్యం ఉండేదని ఇప్పుడది తగ్గిందని రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ అభిప్రాయపడ్డారు. వివిధ రాష్ట్రాల్లో ట్రాఫిక్ ఛలాన్ల పెరిగిన తీరు (ఆగస్టు నుంచి ఆగస్టు వరకు) రాష్ట్రం 2017 నుంచి 2019 2019 నుంచి 2021 తమిళనాడు 10.5 లక్షలు 2.50 కోట్లు ఢిల్లీ 49.70 లక్షలు 2.20 కోట్లు ఉత్తర్‌ప్రదేశ్ 44.30 లక్షలు 1.50 కోట్లు హర్యాన 41.60 లక్షలు 27.30 లక్షలు గుజరాత్ 27.80 లక్షలు 11.40 లక్షలు మొత్తం 1.90 కోట్లు 7.70 కోట్లు -
విశాఖలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుపై అధ్యయనం: గడ్కరీ
సాక్షి, ఢిల్లీ: విశాఖపట్నంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ (ఎంఎంఎల్పీ) ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై ప్రాథమిక అధ్యయనం జరుగుతున్నట్లు రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ జైరామ్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ దేశంలోని 35 నగరాల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు ఆర్థిక వ్యవహాల కేబినెట్ కమిటీ ఆదేశించింది. లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు గుర్తించిన నగరాలలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ ఉన్నాయి. ఎంఎంఎల్పీ అభివృద్ధి చేయడానికి ముందు ఆ ప్రాంతంలో సప్లై, డిమాండ్‌తో పాటు ఆచరణ సాధ్యతను అంచనా వేయడానికి ప్రాథమిక అధ్యయనం జరుగుతుందని మంత్రి తెలిపారు. విజయవాడలో ఎంఎంఎల్పీ ఏర్పాటుకు సంబంధించిన అధ్యయనం పూర్తయింది. ప్రస్తుతం అక్కడ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్‌కు ఆశించినంత డిమాండ్ లేనట్లు అధ్యయనంలో వెల్లడైందని మంత్రి చెప్పారు. ఇక విశాఖపట్నానికి సంబంధించి ఈ తరహా ప్రాథమిక అధ్యయనం కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. -
పెట్రోల్‌కి ప్రత్యామ్నాయం ఇథనాల్, అడ్డా తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: పెట్రోలుకు ప్రత్యామ్నాయంగా భావిస్తోన్న ఇథనాల్ తయారీకి తెలంగాణ అడ్డా కాబోతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణలో ఇథనాల్ తయారీ ప్లాంటు స్థాపనకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ ఉంది. వరితో పాటు మొక్కజొన్న, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడ ఎక్కువే. దీంతో వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ‘ఇంధన గ్రేడ్’ఇథనాల్ తయారీ ప్లాంటును తెలంగాణలో ఏర్పాటు చేయాలని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ప్రతిపాదిస్తోంది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఇథనాల్ తయారు చేసే 1జీ (ఫస్ట్ జనరేషన్) ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రూ.1000 కోట్లతో స్థాపించే ఈ ప్లాంట్ ద్వారా రోజుకు 5 లక్షల లీటర్ల ఇథనాల్ తయారవుతుంది. ప్లాంటు ఏర్పాటుకు వంద ఎకరాల స్థలం అవసరమవుతుందని అంచనా. ఈ ప్లాంటు రోజూవారీ కార్యకలాపాల నిర్వహణకు 4 వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది. ఇథనాల్ తయారీ ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరడంతో పాటు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అధికారులతో సమావేశం తెలంగాణలో ఇథనాల్ తయారీ పరిశ్రమ నెలకొల్పే అంశంపై బీపీసీఎల్ ఎగ్జిక్టూటివ్ డైరెక్టర్ (జీవ ఇంధనాలు) అనురాగ్ సరోగి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో భేటీ అయ్యారు. జయేశ్‌ను కలసిన వారిలో బీపీసీఎల్ ఈడీ (ఇంజనీరింగ్, ప్రాజెక్టులు) ఎల్ఆర్ జైన్, కేహెచ్‌పీఎల్ ప్రాజెక్టు లీడర్ బి.మనోహర్ ఉన్నారు. భవిష్యత్తులో ఇథనాల్ ఇథనాల్ తయారీ పరిశ్రమకు తమ మద్దతు ఉంటుందని కేంద్ర మంతత్రి నితిన్ గడ్కారీ ప్రకటించారు. పెటట్రోలు ఇథనాల్‌తో నడిచేలా ఫ్లెక్స్ ఇంజన్లు తయారు చేయాలంటూ వాహన తయారీదారులకు సూచించారు. అంతకు ముందు పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ శాతం పెంచాలంటూ ప్రధాని మోదీ ప్రకటించారు. కేంద్రం నుంచి ఇథనాల్ తయారీకి భారీగా మద్దతు దక్కుతున్న తరుణంలో కొత్త ప్లాంటు ఏర్పాటుకు బీసీసీఎల్ తెలంగాణను ఎంచుకోవడం గమనార్హం -
పెట్రోల్, డీజిల్‌లతోకాదు.. ..ఇథనాల్‌తో నడిచేలా ..
పెరగడమే తప్ప తరగడం అనే మాట లేకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. ఫ్యూయల్ ఛార్జీలకు ప్రత్యామ్నయంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుదామంటే వాటి ధర ఎక్కువ. దీంతో వాహనదారుల సమస్యలకు ఇథనాల్ ఇంజన్లు ప్రత్యామ్నాయంగా నిలవబోత్నున్నాయి. ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లు పెట్రోలుతోనే కాకుండా ఇథనాల్‌తో కూడా నడిచే విధంగా ‘ఫ్లెక్స్ ఇంజన్లు’ డిజైన్ చేయాలంటూ వాహన తయారీ కంపెనీలను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఇటీవల కోరారు. ఫ్లెక్స్ ఇంజన్లు అంటే రెండు రకాల ఇంధనాలతో నడిచే వాహనాలు. ప్రస్తుతం మనకు పెట్రోల్, సీఎన్జీ (గ్యాస్)తో నడిచే ఫ్లెక్స్ ఇంజన్ వాహనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో పెట్రోల్, ఇథనాల్‌లతో నడిచే ఫెక్స్ ఇంజన్లు రూపొందించేందుకు వాహన తయారీ సంస్థలు ముందుకు వచ్చేలా కేంద్రం కార్యాచరణ సిద్ధం చేయనుంది. పంట ఉత్పత్తులతో విదేశాల్లో గోధుమలు, మొక్కజోన్న, వరి ధాన్యాల నుంచి కూడా ఇథనాల్ ముడి పదార్థాలను తయారు చేస్తున్నారు. మనదగ్గర ఇథనాల్ తయారు చేసేందుకు కేవలం చెరుకు ఉత్పత్తులనే ఉపయోగిస్తున్నారు. మన దగ్గర సమృద్ధిగా ఉన్న చెరుకుతో పాటు వరి, గోదుమ, మొక్కజొన్నల నుంచి భారీ ఎత్తున ఇథనాల్ తయారు చేసేందుకు అవకాశాలున్నాయి. ఇలా చేయడం వల్ల రైతుల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. గతంలోనూ గతంలో పలు కంపెనీలు ఇథనాల్‌తో నడిచే వాహనాలు తయారు చేసినా అవేవీ మార్కెట్లోకి రాలేదు. ఇప్పుడు కొత్తగా ఇథనాల్ ఉత్పత్తి పెంచడంతో పాటు ఇథనాల్ బంకులు కూడా ప్రారంభిస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో పలు కంపెనీలు ఇథనాల్ ఆధారిత ఫ్లెక్స్ ఇంజన్ వాహనాల తయారీపై ఆసక్తి చూపించే అవకాశం ఉంది. 20 శాతం గత ఎనిమిదేళ్లుగా పెట్రోలులో ఇథనాల్లు కలిపే విక్రయిస్తున్నారు. అయితే పెట్రోలులో కలిపే ఇథనాల్ శాతాన్ని క్రమంగా ఒక శాతం నుంచి 10 వరకు తీసుకొచ్చారు. రాబోయే మూడేళ్లలో 20 శాతం ఇథనాల్‌ను పెట్రోల్, డీజిల్‌లో కలపాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి : దూసుకుపోతున్న ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ పరిశ్రమ -
భారత్‌లో టెస్లా కార్ల తయారీకి మంచి అవకాశం: గడ్కరీ
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో భారత్‌లో విద్యుత్ కార్ల తయారీ ప్రారంభించేందుకు అమెరికన్ దిగ్గజం టెస్లా ముందు బంగారం లాంటి అవకాశం ఉందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. ఇప్పటికే భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల నుంచి వివిధ విడిభాగాలను కొనుగోలు చేస్తున్న టెస్లా.. ఇక్కడే బేస్ కూడా ఏర్పాటు చేసుకుంటే కంపెనీకి ఆర్థికంగా కూడా ప్రయోజనకరంగా ఉండగలదని రైసినా డైలాగ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. టెస్లా సంస్థ స్వంతంగా పారిశ్రామిక ప్లాంట్ నిర్మించడం వల్ల ఇక్కడ నుంచి ఇతర ఆసియా దేశాలకు ఎగుమతి చేయడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది అని అన్నారు. భారతదేశంలో కార్ల తయారీకి ముందుకు వస్తే వారికి మద్దతు కూడా ఇస్తాము అని ఆయన అన్నారు. టెస్లా మోటార్స్ ఇండియా జనవరి 8న టెస్లా ఆర్ & డి విభాగాన్ని బెంగళూరులో నెలకొల్పనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ సంస్థకు డైరెక్టర్ లలో ఒకరిగా డేవిడ్ ఫెనిస్టియన్ పేరును కూడా తెలిపింది. అలాగే, దేశ రాజధాని న్యూఢిల్లీ, దేశ ఆర్థిక రాజధాని ముంబై, దక్షిణాదిన టెక్ సిటీ అయిన బెంగళూరులో షోరూమ్‌లు & సర్వీస్ సెంటర్లు తెరిచేందుకు టెస్లా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. చదవండి: ఛార్జింగ్ అవసరంలేని ఎలక్ట్రిక్ కారు! -
ఇక ‘తుక్కు’ రేగుతుంది..!
న్యూఢిల్లీ: కాలుష్యకారక పాత వాహనాల వినియోగాన్ని తగ్గించి, కొత్త వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పాత వాహనాలను తుక్కు కింద మార్చేందుకు ఇచ్చి, స్క్రాప్ సర్టిఫికెట్ తీసుకుంటే కొత్త కారుకు రిజిస్ట్రేషన్ ఫీజును మాఫీ చేయాలని భావిస్తోంది. అలాగే, వ్యక్తిగత వాహనాలకు 25 శాతం దాకా, వాణిజ్య వాహనాలకు 15 శాతం దాకా రోడ్ ట్యాక్స్‌లో రిబేటు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించనుంది. ఇక స్క్రాపింగ్ సర్టిఫికెట్ గల వాహనదారులకు కొత్త వాహనాలపై అయిదు శాతం మేర డిస్కౌంటు ఇచ్చేలా వాహనాల తయారీ సంస్థలకు కూడా సూచించనుంది. వాహనాల స్క్రాపేజీ విధానంపై కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం పార్లమెంటులో ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఈ విధానంపై సంబంధిత వర్గాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాబోయే కొన్ని వారాల్లో ముసాయిదా నోటిఫికేషన్‌ను ప్రచురించనున్నట్లు ఆయన తెలిపారు. రిజిస్టర్డ్ తుక్కు కేంద్రాల్లో పాత, అన్‌ఫిట్ వాహనాలను స్క్రాప్ కింద ఇచ్చేసి, స్క్రాపింగ్ సర్టిఫికెట్ పొందే యజమానులకు ఈ స్కీమ్ కింద పలు ప్రోత్సాహకాలు లభిస్తాయని గడ్కరీ తెలిపారు. స్క్రాప్ కింద ఇచ్చేసే వాహనాల విలువ.. కొత్త వాహనాల ఎక్స్‌షోరూం రేటులో సుమారు 4–6% దాకా ఉండేలా స్క్రాపింగ్ సెంటర్ సర్టిఫికెట్ జారీ చేసే అవకాశం ఉంటుందన్నారు. దేశీ వాహన పరిశ్రమ టర్నోవరు ప్రస్తుతం రూ. 4.5 లక్షల కోట్ల స్థాయి నుంచి రూ. 10 లక్షల కోట్లకు పెరిగేందుకు స్క్రాపేజీ పాలసీ తోడ్పడగలదని మంత్రి తెలిపారు. అందరికీ ప్రయోజనకరం..: స్క్రాపేజీ విధానం అన్ని వర్గాలకూ ప్రయోజనకరంగా ఉండబోతోందని గడ్కరీ తెలిపారు. ఇంధన వినియోగ సామర్థ్యం మెరుగుపడేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు, కొత్త వాహనాల కొనుగోళ్లపై జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేందుకు కూడా ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. పాత, లోపభూయిష్టమైన వాహనాల సంఖ్యను తగ్గించడం ద్వారా కాలుష్య కారక వాయువుల విడుదలను నియంత్రించేందుకు, రహదారి.. వాహనాల భద్రతను మెరుగుపర్చేందుకు ఈ పాలసీ ఉపయోగపడుతుందన్నారు. ప్రాణాంతకంగా రోడ్డు ప్రమాదాలు.. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య కోవిడ్–19 మరణాల కన్నా ఎక్కువ ఉండటం ఆందోళనకరమని గడ్కరీ తెలిపారు. గతేడాది కోవిడ్–19తో 1.46 లక్షల మంది మరణించగా రోడ్డు ప్రమాదాల్లో 1.5 లక్షల మంది మృత్యువాత పడ్డారని ఆయన పేర్కొన్నారు. వీరిలో అత్యధిక శాతం 18–35 ఏళ్ల మధ్య వయస్సున్న వారేనని మంత్రి చెప్పారు. తుక్కు పాలసీ ప్రతిపాదనల్లో మరికొన్ని... ► వాహనాల ఫిట్నెస్ టెస్టులు, స్క్రాపింగ్ సెంటర్ల సంబంధ నిబంధనలు 2021 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. పదిహేనేళ్లు పైబడిన ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల వాహనాలను తుక్కు కింద మారుస్తారు. ► 2023 ఏప్రిల్ 1 నుంచి భారీ వాణిజ్య వాహనాల ఫిట్నెస్ టెస్టింగ్‌ను తప్పనిసరి చేస్తారు. మిగతా వాహనాలకు దశలవారీగా 2024 జూన్ 1 నుంచి దీన్ని అమల్లోకి తెస్తారు. ► ఫిట్నెస్ టెస్టులో విఫలమైనా, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పునరుద్ధరణలో విఫలమైనా సదరు వాహనాల జీవితకాలం ముగిసినట్లుగా పరిగణిస్తారు. 15 ఏళ్ల తర్వాత ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందడంలో విఫలమైన వాణిజ్య వాహనాలను డీ–రిజిస్టర్ చేస్తారు. ఇలాంటి వాహనాల వినియోగాన్ని తగ్గించే దిశగా 15 ఏళ్ల పైబడిన కమర్షియల్ వాహనాల ఫిట్నెస్ టెస్టు, సర్టిఫికెట్ల ఫీజును భారీగా పెంచుతారు. ► ప్రైవేట్ వాహనాల విషయానికొస్తే .. 20 ఏళ్ల తర్వాత ఫిట్నెస్ టెస్టులో లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పునరుద్ధరణలో విఫలమైన పక్షంలో డీ–రిజిస్టర్ చేస్తారు. 15 ఏళ్ల నుంచే రీ–రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచుతారు. ► ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో రిజిస్టర్డ్ వాహనాల స్క్రాపింగ్ కేంద్రాల (ఆర్వీఎస్ఎఫ్) ఏర్పాటుకు కేంద్రం ప్రోత్సాహమిస్తుంది. స్క్రాపింగ్ కేంద్రం ఏర్పాటుకు మార్గదర్శకాల ముసాయిదా.. రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ కేంద్రం (ఆర్వీఎస్ఎఫ్) ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాల ముసాయిదాను కేంద్రం ప్రకటించింది. దీని ప్రకారం వచ్చే రెండేళ్లలో దేశ వ్యాప్తంగా 100 స్క్రాపింగ్ సెంటర్లు అందుబాటులోకి వస్తాయి. ఆర్వీఎస్ఎఫ్ ఏర్పాటుకు రూ. లక్ష లేదా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలు నిర్దేశించే మొత్తం ప్రాసెసింగ్ ఫీజుగా ఉంటుంది. ప్రతీ ఆర్వీఎస్ఎఫ్కు ముం దస్తు డిపాజిట్‌గా రూ.10 లక్షల బ్యాంక్ గ్యా రంటీ ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కో సం దరఖాస్తు చేసుకున్న 60 రోజులల్లోగా అనుమ తులపై నిర్ణయం తీసుకోవాలి. ఈ ముసా యిదా నిబంధనలపై సంబంధిత వర్గాలు 30 రోజుల్లోగా అభిప్రాయాలు తెలియజేయాలి. -
దేశీ విడిభాగాలకే ప్రాధాన్యమివ్వాలి
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ తయారీ సంస్థలు దేశీయంగా తయారైన విడిభాగాల తయారీ, కొనుగోళ్లకు మరింతగా ప్రాధాన్యమివ్వాలని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఆటో విడిభాగాల దిగుమతులను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం 70 శాతంగా ఉన్న విడిభాగాల లోకలైజేషన్‌ను .. 100 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. లేని పక్షంలో దిగుమతి చేసుకునే విడిభాగాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని వ్యాఖ్యానించారు. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ‘వాహనాలు, ఆటో విడిభాగాల తయారీదారులు స్థానిక పరికరాల కొనుగోళ్లను గరిష్ట స్థాయిలో.. 100 శాతం దాకా పెంచుకోవాలని కోరుతున్నా. ఇలాంటివన్నీ తయారు చేసేందుకు అవసరమైన సామర్థ్యాలు మనకు పుష్కలంగా ఉన్నాయి. మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా నినాదానికి దేశీ ఆటో పరిశ్రమ మద్దతుగా నిలిచేందుకు ఇదే సరైన తరుణం‘ అని ఆయన పేర్కొన్నారు. సెమీకండక్టర్ల తయారీకి తోడ్పాటు కావాలి.. ఎలక్ట్రానిక్ విడిభాగాలు .. ముఖ్యంగా సెమీకండక్టర్లను స్థానికంగా తయారు చేసేందుకు ప్రభుత్వం కూడా తోడ్పాటు అందించాలని భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సొసైటీ సియామ్ ప్రెసిడెంట్ కెనిచి అయుకావా కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమ రెండంకెల వృద్ధి సాధించగలని అంచనా వేస్తున్నట్లు ఏసీఎంఏ ప్రెసిడెంట్ దీపక్ జైన్ తెలిపారు. -
‘టీఆర్ఎస్తో ఏ దోస్తీ లేదు’
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్తో బీజేపీకి ఏ దోస్తీ లేదని, ప్రజా సమస్యలపై వారితో కుస్తీ కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్తో బీజేపీ ‘గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ’అన్నట్లుగా వ్యవహరిస్తోందన్న కాంగ్రెస్ విమర్శలను తప్పుబట్టారు. గత ప్రభుత్వాల్లో టీఆర్ఎస్–కాంగ్రెస్ పారీ్టలే మిత్రపక్షాలుగా ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ నాయకులకు చురకలంటించారు. గురువారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భూసేకరణ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం కారణంగా అనేక జాతీయ రహదారులు అభివృద్ధికి నోచుకోవట్లేదని, త్వరలోనే ఈ అంశంపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాయనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఈ నెల 21న కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రంలోని 370 కిలోమీటర్ల విస్తీర్ణంలోని రూ.3,717 కోట్ల విలువైన 6 ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. దీంతో పాటే రాష్ట్రంలో 396 కిలోమీటర్ల పొడవున రూ.9,440 కోట్ల విలువైన 8 ప్రాజెక్టులకు భూమి పూజ చేసి పునాది రాయి వేయనున్నారని వెల్లడించారు. భారతమాల పరియోజనలో భాగంగా దేశవ్యాప్తంగా 35 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు అభివృద్ధి జరుగుతున్నాయని, ఇందులో 1,400 కిలోమీటర్ల జాతీయ రహదారులను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నారని కిషన్‌రెడ్డి వివరించారు. దేశానికి అంకితం చేయనున్న 6 ప్రాజెక్టులివే.. 1) జాతీయ రహదారి–163పై యాదగిరిగుట్ట–వరంగల్ మధ్య నిర్మించిన 99 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారి. 2) జాతీయ రహదారి 163పై మన్నెగూడ–రావులపల్లి మధ్య నిర్మించిన 73 కి.మీ. రెండు లేన్ల రహదారి. 3) వరంగల్ జిల్లాలో జాతీయ రహదారి–163పై 35 కి.మీ. రహదారి విస్తరణ. 4) వరంగల్ జిల్లాలో జాతీయ రహదారి–353సీపై 34 కి.మీ. మేర రెండు లేన్లలో క్యారేజ్‌వే విçస్తరణ. 5) హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎన్‌హెచ్–765డీలోని మెదక్ సెక్షన్ వరకు 63 కిలోమీటర్ల రహదారి విస్తరణ. 6) నకిరేకల్ నుంచిæ ఎన్‌హెచ్–365లోని తనంచెర్ల వరకు చేసిన 67 కిలోమీటర్ల రహదారి విస్తరణ. భూమి పూజ జరగనున్న 8 ప్రాజెక్టులివే.. 1) జాతీయ రహదారి–161పై కంది నుంచి రామ్సన్పల్లె వరకు 40 కి.మీ. నాలుగు లేన్ల రహదారి నిర్మాణం. 2) జాతీయ రహదారి–161పై రామ్సన్పల్లె నుంచి మంగ్లూరు వరకు 47 కి.మీ. నాలుగు లేన్ల రహదారి నిర్మాణం. 3) జాతీయ రహదారి–161పై మంగ్లూరు నుంచి తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు వరకు 49 కి.మీ. నాలుగు లేన్ల రహదారి నిర్మాణం. 4) జాతీయ రహదారి–363పై రేపల్లెవాడ నుంచి తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు వరకు 53 కి.మీ. నాలుగు లేన్ల రహదారి నిర్మాణం. 5) జాతీయ రహదారి–363పై మంచిర్యాల నుంచి తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు వరకు 42 కి.మీ. నాలుగు లేన్ల రహదారి నిర్మాణం. 6) జాతీయ రహదారి–365బీబీపై సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు 59 కి.మీ. నాలుగు లేన్ల రహదారి నిర్మాణం. 7) నిర్మల్ జిల్లాలో జాతీయ రహదారి–61పై నిర్మల్–ఖానాపూర్ మధ్య 22 కి.మీ. రెండు లేన్ల రహదారి విస్తరణ, బలోపేతం. 8) నల్లగొండ జిల్లాలో 2020–21 సంవత్సరానికి ఎన్‌హెచ్ (ఓ) కింద నకిరేకల్ నుంచి ఎన్‌హెచ్–565పై నాగార్జునసాగర్ వరకు 85 కి.మీ. మేర రహదారి పెండింగ్ పనుల పూర్తి. -
బస్సుల్లో అగ్ని ప్రమాదాలు నివారించే టెక్నాలజీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాణ సమయాల్లో ప్రజారవాణా బస్సుల్లో జరుగుతున్న అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) సరికొత్త టెక్నాలజీతో ముందుకొచ్చింది. అగ్ని ప్రమాదాన్ని గుర్తించి, నివారించే ‘ఫైర్ డిటెన్షన్ అండ్ సప్రెషన్ సిస్టం’ (ఎఫ్డీఎస్ఎస్)కు సంబంధించిన డెమోను కేంద్రానికి చూపించింది. ఈ డెమోను సోమవారం∙రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పరిశీలించారు. ప్యాసింజర్ కంపార్ట్మెంట్ భద్రత కోసం నీటి ఆధారిత ఎఫ్డీఎస్ఎస్ విధానాన్ని, ఇంజన్లో చెలరేగే మంటలను కట్టడి చేసేందుకు ఏరో సొల్యూషన్ ఆధారిత ఎఫ్డీఎస్ఎస్ విధానాన్ని వారికి అధికారులు వివరించారు. æప్యాసింజర్ కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగిన 30 సెకన్లలో గుర్తించి 60 సెకన్లలో చల్లార్చే విధంగా నూతన ఫైర్ డిటెన్షన్ అండ్ సప్రెషన్ సిస్టం(ఎఫ్డీఎస్ఎస్)ను తయారుచేశారు. ఇందులో భాగంగా బస్సులో 80 లీటర్ల నీటి ట్యాంకును, 6.8కేజీల నైట్రోజన్ సిలిండర్‌ను అమర్చారు. కొత్త విధానం ద్వారా మంటలను 5 సెకన్లలోనే ఆర్పివేయవచ్చు. దీనిని రూపొందించిన శాస్త్రవేత్తలను రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, డీఆర్డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి అభినందించారు. అనంతరం డీఆర్డీవోలో యాంటీ శాటిలైట్ మిస్సైల్ సిస్టమ్ మోడల్‌ను రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించారు. ( పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉంది: రాజ్‌నాథ్) -
కేంద్రమంత్రి నితిన్ గడ్కారీని కలిసిన బుగ్గన
-
దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభం ఫొటోలు
-
ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
-
రహదారుల అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తుంది
-
బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం
-
నేడు విజయవాడలో రెండు ఫ్లైఓవర్లు ప్రారంభం
సాక్షి, అమరావతి: విజయవాడ నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తూ బెజవాడకు తలమానికంగా నిలిచే బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్లు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ వర్చువల్ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వాటితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా రూ.15,591.9 కోట్ల అంచనాలతో రూపొందించిన 61 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పది ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు. భవానీపురం నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్ మీదుగా వాహనాల రాకపోకలను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్‌లతో కలిసి గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ అత్యంత సాంకేతిక విలువలతో రూ.501 కోట్లతో నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ విజయవాడ నగరానికి మకుటంలా నిలుస్తుందన్నారు. (దసరాకు 1,850 ప్రత్యేక బస్సులు) ►రాష్ట్రంలో రూ.7,584.68 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టులకు శంకుస్థాపన, రూ.8,007.22 కోట్లతో పూర్తయిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. ►ఏపీలో 878.4 కి.మీ. మేర కొత్తగా జాతీయ రహదారుల్ని రూ.7,584.68 కోట్లతో నిర్మించనున్నారు. రూ.8,007.22 కోట్లతో పూర్తయిన 532.696 కి.మీ. మేర రహదారుల నిర్మాణం, ఆర్వోబీలను జాతికి అంకితం చేయనున్నారు. అంటే మొత్తంగా ఈ ప్రాజెక్టుల విలువ రూ.15,591.9 కోట్లు. కాగా, మొత్తం రహదారులు 1,411.096 కిలోమీటర్లు. విజయవాడ ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే: సోము సాక్షి, అమరావతి: దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంతో విజయవాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2.6 కి.మీ పొడవుతో వంపులు తిరుగుతూ ఉన్న దుర్గగుడి ఫ్లైఓవర్ దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. -
కరోనా నుంచి కోలుకున్న కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: కరోనా బారిన పడిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోలుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ ద్వారా తన ఆరోగ్యం గురించి చెప్పారు. కరోనా నుంచి కోలుకున్నాని చెప్పడానికి సంతోషంగా ఉందని, తాను కోలుకోవాలని కోరుకున్న అందరి దీవెనల వల్లే తాను కోలుకున్నట్లు తెలిపారు. కరోనా సోకినట్లు ఈ నె 16న ఆయనకు తెలియగా, అప్పటి నుంచి ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు. పలువురు ఎంపీలు, కొందరు మంత్రులు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. (చదవండి: సివిల్స్ ప్రిలిమినరీ యథాతథం) -
అరకోటి దాటాయ్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భారత్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. బుధవారం ఉదయానికి కేసుల సంఖ్య ఏకంగా అరకోటి దాటేసింది. గత 24 గంటల్లో ఏకంగా 90,123 కొత్త కరోనా కేసులు భారత్‌లో నమోదయ్యాయి. ప్రపంచ పట్టికలో ఒకటో స్థానానికి చేరుకునే రోజు ఎంతో దూరంలో లేదు. కరోనా కేసుల్లో నంబర్ వన్ స్థానంలో ఉన్న అమెరికాకి, మనకి మధ్య కేసుల సంఖ్యలో తేడా క్రమేపీ తగ్గిపోతోంది. మంగళవారం రాత్రికి అమెరికా కేసుల సంఖ్య 68.77 లక్షలు ఉంటే, మన దేశంలో 50.20 లక్షలుగా ఉంది. దేశంలో తొలి కేసు నమోదైన దగ్గర్నుంచి 10 లక్షల కేసులకు చేరుకోవడానికి 169 రోజులు పడితే, 40 నుంచి 50 లక్షలకు చేరుకోవడానికి కేవలం 11 రోజులు మాత్రమే పట్టింది. దీనిని బట్టి దేశంలో వైరస్ వ్యాప్తి తీవ్రత అర్థమవుతుంది. కాగా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకింది. ఆయన హోం ఐసొలోషన్లో ఉన్నట్లు ట్వీట్‌చేశారు. భారత్‌లో సెకండ్ వేవ్ ? 1918లో ప్రపంచాన్ని వణికించిన ఫ్లూ ఏడాదిలో మూడు దశల్లో విజృంభిం చింది. కరోనా అలా ఎన్ని దశల్లో విజృంభిస్తుందో నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు. ప్రస్తుతం దేశంలో కొన్ని ప్రాంతాల్లో సెకండ్ వేవ్ నడుస్తోందన్న అనుమానాలున్నట్టుగా కోవిడ్‌పై జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ రణదీప్ వెల్లడించారు. ‘కేసుల సంఖ్య అత్యధిక స్థాయికి చేరుకున్నాక మళ్లీ తగ్గుతుంది. ఆ తర్వాత మళ్లీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. అక్కడ సెకండ్ వేవ్ అని అనుకోవచ్చు’ అని చెప్పారు. కేసుల సంఖ్య ఎంత ఉన్నప్పటికీ అదే స్థాయిలో రికవరీ రేటు కూడా ఉంటోంది. గత 24 గంటల్లో.. గత 24 గంటల్లో 82,961 మంది రికవరీ కాగా, 1,290 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 82,066 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 39,42,360 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 9,95,933 గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 78.53 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. -
ఈ నెల 18న కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభం
విజయవాడ : ఈ నెల 18న కనకదుర్గ వంతెన ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ఈ ఫ్లైఓవర్ వంతెన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంయుక్తంగా నిర్వహించనున్నారు.కరోనా నేపథ్యంలో కేంద్రమంత్రి గడ్కరీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొననున్నారు. ఫ్లై ఓవర్ ప్రారంభంతో పాటు అదే రోజు రూ. 7,584 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులకు భూమి పూజతో పాటు 887 కిలోమీటర్లు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేపట్టనున్నారు. రూ. 8,083 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కరీతో కలిసి సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేయనున్నారు. కాగా తొలుత ఈనెల 4న కనకదుర్గ వంతెనను ప్రారంభించాల్సి ఉంది.అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం మరణించడంతో ప్రభుత్వం ఐదు రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తోంది. దీంతో ఈ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. రూ.502 కోట్ల వ్యయంతో ఈ వంతెనను నిర్మించిన సంగతి తెలిసిందే. (చదవండి : కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభం వాయిదా) -
చైనాను ఆర్థికంగా ఢీకొట్టే వ్యూహాలు..
ముంబై: ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నెల 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రజలు చైనాకు సంబంధించిన వస్తువులను వాడకూడదని డిమాండ్ ఎక్కువైంది. కాగా తయారీ రంగంలో ప్రపంచ వ్యాప్త ఎగుమతులలో కీలక పాత్ర పోషిస్తున్న చైనాను ఢీకొట్టడం అంత సులువు కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి చైనా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ.. దిగుమతులు తగ్గించుకొని, తయారీ రంగంలో చైనా వస్తువులతో ఆధారపడకుండా, సొంతంగా ఎదగడానికి ప్రభుత్వం వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో చైనాపై ఆర్థిక ఆంక్షలను ప్రభుత్వం మరింత కఠినతరం చేయనున్నట్లు తెలుస్తోంది. మరో కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ స్పందిస్తూ.. చైనా వస్తువులను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. తాజా ఉద్రిక్త పరిస్థితులలో నూతన స్మార్ట్పోన్లను లాంచ్ చేసే ఈవెంట్లను చైనీస్ స్మార్ట్ ఫోన్ సంస్థలు వాయిదా వేసుకున్నాయి. కాగా దేశ వృద్ధిలో చైనా ఎగుమతులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2017 సంవత్సరంలో సిక్కింలో డొక్లాం ప్రాంతంపై సరిహద్దు వివాదాలున్న మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడకుండా చర్యలు చేపట్టింది. మరోవైపు చైనీస్ దిగ్గజాలు హువాయి టెక్నాలజీస్, షియోమీ బ్రాండ్స్ వైవిధ్యమైన స్మార్ట్ఫోన్స్తో అలరిస్తున్నాయి. అయితే దేశీయ మొబైల్ వినియోగంలో 75 శాతం చైనా నుంచి దిగుమతవుతున్నాయి. మరోవైపు దేశీయ ఫార్మా దిగుమతులలో 75శాతం ముడిపదార్థాలు చైనా నుంచి లభిస్తున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం చైనాను ఢీకొట్టాలంటే ఒకేసారి వస్తువులను బ్యాన్ చేయాలనడం సరికాదని, అలా పిలుపునిస్తే అంతర్జాతీయంగా దేశానికి నష్టం కలిగే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విశ్లేషకుల ప్రకారం.. దేశీయ తయారీ రంగానికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తు, యువతకు నైపుణ్య శిక్షణ అందించాలి. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారిస్తే తయారీ రంగంలో వేరే దేశంపై భారత్‌కు ఆధారపడే అవకాశం తగ్గుతుంది. అలాగే యువతకు ఉపాధితో పాటు నిరుద్యోగం తగ్గి, దేశ వృద్ధి రేటు పెరుగుతుంది. కాగా దేశీయ సంస్థలు తక్కువ ధరకే క్వాలిటీ వస్తువులు అందించి, చైనాను భావోద్వేగంతో కాకుండా క్వాలిటీతో ఢీకొట్టాలి. దేశీయ మార్కెట్లో చైనా వస్తువులను ప్రజలు స్వచ్చందంగా బహిష్కరించే ప్రణాళికలు రచించడానికి సన్నద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.(చదవండి: ఈ పాపులర్ యాప్స్ అన్నీ చైనావే) -
చిన్న సంస్థలకు పెట్టుబడుల ఊతం
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఊతమిచ్చేందుకు ఉద్దేశించిన ఉద్దీపన ప్యాకేజీలో ప్రతిపాదనలకు కేంద్ర క్యాబినెట్ సోమవారం ఆమోదముద్ర వేసింది. ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈలకు రూ. 20,000 కోట్ల రుణాలు అందించడం, ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) ద్వారా రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులపరమైన తోడ్పాటునివ్వడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. రూ. 20,000 కోట్ల స్కీమ్‌తో 2 లక్షల ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రతిపాదనల ప్రకారం రూ. 10,000 కోట్ల కార్పస్‌తో ఎఫ్‌వోఎఫ్ ఏర్పాటు చేస్తారు. అనుబంధంగా ఉండే చిన్న ఫండ్స్ ద్వారా ఇది ఎంఎస్ఎంఈలకు రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులపరమైన తోడ్పాటు అందిస్తుందని గడ్కరీ చెప్పారు. చిన్న సంస్థలు సామర్థ్యాన్ని పెంచుకునేందుకు, స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యే అవకాశం దక్కించుకునేందుకు ఇది ఉపయోగపడగలదని వివరించారు. ఎంఎస్ఎంఈ నిర్వచనంలో సవరణలు .. ఎంఎస్ఎంఈల నిర్వచనాన్ని కూడా కేంద్రం సవరించింది. మధ్య స్థాయి సంస్థల టర్నోవర్ పరిమితిని గతంలో ప్రకటించిన రూ. 100 కోట్ల స్థాయి నుంచి రూ. 250 కోట్లకు పెంచింది. వీధి వ్యాపారులకు రూ. 10,000 దాకా నిర్వహణ మూలధనం ఇచ్చేందుకు ఉద్దేశించిన ’పీఎం స్వనిధి’ స్కీముకు కూడా క్యాబినెట్ ఓకే చెప్పింది. ఇది 50 లక్షల మంది చిల్లర వ్యాపారులకు లబ్ధి చేకూరుతుందని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. ఏడాది వ్యవధి లో నెలవారీ వాయిదాల్లో ఈ రుణమొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో చెల్లింపులు జరిపేవారికి 7% వడ్డీ సబ్సిడీ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమవుతుంది. ముందస్తుగా చెల్లించినా పెనాల్టీలు ఉండవు. చాంపియన్స్ ప్లాట్‌ఫాం ఆవిష్కరణ.. సంక్షోభంలో ఉన్న ఎంఎస్ఎంఈలు సమస్యలను అధిగమించి, జాతీయ.. అంతర్జాతీయ స్థాయిలో దిగ్గజాలుగా ఎదిగేందుకు తోడ్పాటునిచ్చేలా champions.gov.in పేరిట టెక్నాలజీ పోర్టల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఆర్థికాంశాలు, ముడివస్తువులు, కార్మికులు, నియంత్రణ సంస్థల అనుమతులు తదితర సమస్యల పరిష్కార వ్యవస్థగా ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. అలాగే కొత్త వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకునేందుకు తోడ్పడుతుంది. -
ఎంఎస్ఎంఈ రంగ వృద్ధికి ఐడియాలు ఇవ్వండి..
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) అభివృద్ధి చెందడానికి అవసరమైన సలహాలు, సూచనలను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరుతోంది. ఎంఎస్ఎంఈ పోర్టల్‌లో నమోదైన వ్యక్తులు తమ ఐడియాలు, ఇన్నోవేషన్(ఆవిష్కరణలు), పరిశోధనలను అందించడం ద్వారా ఈ రంగ వృద్ధికి తోడ్పాటును ఇచ్చినట్లుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబం« దించిన ప్రత్యేక ప్లాట్‌ఫాం ఎం ఎస్ఎంఈ బ్యాంక్ ఆఫ్ ఐడియాస్‌ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. -
‘చిన్నతరహా పరిశ్రమలకు చేయూతనివ్వండి’
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న సూక్మ్ష, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(ఎమ్ఎస్ఎమ్ఈ) చేయూతనిచ్చి ఆదుకోవాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వి. విజయసాయి రెడ్డి సంబంధిత మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ పనితీరుపై గురువారం రాజ్యసభలో కొనసాగిన చర్చలో పాల్గొన్న ఆయన భారత దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో మూడో వంతు భాగస్వామ్యం చిన్నపరిశ్రమలదేన్నారు. దేశంలోని మాన్యుఫాక్చరింగ్ రంగం మొత్తం ఉత్పాదనల్లో 45 శాతం వాటా రూ. 7.5 కోట్లు ఎమ్ఎస్ఎమ్ఈలదేనని తెలిపారు. చిన్న పరిశ్రమల ద్వారా దేశంలో రూ. 11 కోట్ల మందికి ఉపాధి లభిస్తోంది కాబట్టి చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం నిలకడగా వృద్ధి చెందితేనే దేశ జీడీపీ వృద్ధి రేటు లక్ష్యాల సాధన సాధ్యపడుతుందని ఆయన అన్నారు. (ఏపీలో థియేటర్లు, మాల్స్ బంద్) సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎలాంటి ఆటుపోట్లకు గురికాకుండా వృద్ధి చెందడానికి ప్రధానంగా తీసుకోవలసిన కొన్ని చర్యలను విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. సాధారణంగా ఈ తరహా పరిశ్రమలు తమ ఉత్పాదనలకు చెల్లింపులు చేయడానికి కొనుగోలుదారులకు 90 రోజుల గడువు ఇస్తాయి. కానీ జీఎస్టీ నిబంధనల ప్రకారం ఇన్వాయిస్ ఇచ్చిన 20 రోజుల్లో జీఎస్టీ చెల్లంపులు జరగాలన్నారు. ఫలితంగా మూలధనం సమస్య ఈ పరిశ్రమలను నిత్యం వేధిస్తూ ఉంటుందని అన్నారు. అందువలన జీఎస్టీ చెల్లింపు, రిటర్న్స్ ఫైల్ చేసే విషయంలో ఎంఎస్ఎంఈకి నిబంధనలు సడలింపు కల్పించాలని కోరారు. అలాగే గడువు దాటిన చెల్లింపులకు విధించే జరిమానా వడ్డీని తగ్గించాలని కోరారు.(‘పరోక్షంగా తప్పు ఒప్పుకున్న నిమ్మగడ్డ’ ) చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధిలో రుణ సౌకర్యం కీలక పాత్ర పోషిస్తుందని విజయసాయిరెడ్డి అన్నారు. తక్కువ వడ్డీకి రుణం లభ్యమైనప్పుడే అవి పెద్ద పరిశ్రమలతో పోటీ అన్నారు. అయితే ఈ పరిశ్రమలు రిస్క్ కేపిటల్‌ను సేకరించలేకపోతున్నాయని, అలాగే బ్యాంక్‌లకు అవసరమైన కొలేటరల్ హామీని కూడా సమకూర్చలేని స్థితిలో ఉన్నాయని తెలిపారు. కాబట్టి రుణ సౌకర్యం పొందలేక ఎమ్ఎస్ఎమ్ఈలు విలవిలలాడే పరిస్థితి ఏర్పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్ఎస్ఎమ్ఈలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ఆయన ఉదహరిస్తూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు వాటి సైజును బట్టి రూ. 25 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బ్యాంకుల నుంచి రుణ పొందే సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు. (నిర్భయ: ‘బతకాలని లేదు.. నేను చచ్చిపోతా’) ఈ విధంగా ప్రభుత్వం హామీదారుగా ఉండి బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం కల్పిస్తున్నందున ఆంధ్రప్రదేశ్‌లో 6,572 చిన్నతరహా పరిశ్రమలు ఆవిర్భవించాయని అన్నారు. ఎమ్ఎస్ఎమ్ఈ మంత్రిత్వ శాఖ చేపట్టిన వినూత్న కార్యక్రమాల కారణంగా దేశంలో 80 లక్షల మంది మహిళలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కాగలిగారు. గడచిన అయిదేళ్ళలో వారి సంఖ్య 38 శాతం పెంచేందుకు కృషి చేజత్రి గడ్కరీని ఆయన అభినందించారు. అలాగే కొన్ని రకాల ఉత్పాదనలు కేవలం చిన్నపరిశ్రమలు మాత్రమే ఉత్పాదన చేసేలా రిజర్వ్ చేసి వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని శ్రీ విజయసాయి రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. (కరోనా నివారణకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు) ఎన్నాళ్లు తప్పించుకుంటావ్ బాబూ? ‘నిమ్మగడ్డకు ఈసీగా కొనసాగే అర్హత లేదు’ -
కాలుష్య నివారణకు సలహాలు ఇవ్వండి: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు బుధవారం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాలుష్య నివారణకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వినూత్న ఆలోచనలకు ప్రాధాన్యమిస్తున్నారని సీజేఐ ఎస్ఏ బాబ్డే వ్యాఖ్యానించారు. కాలుష్య నివారణకు ఆయన సుప్రీం కోర్టుకు పరిష్కార మార్గాలను సూచించాల్సిందిగా కోరారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన విధానాన్ని అవలంభిస్తుందన్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషన్ కేంద్రానికి ఓ సలహా ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ కార్లపై అధిక పన్నులు వసూలు చేసి ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడి ఇవ్వాలని సూచించారు. పటాసులు కాల్చడం వాతావరణానికి కొంతమేర హాని కలిగించినా, మోటారు వాహనాల నుంచి విడుదలయ్యే కాలుష్యం దీర్ఘకాలికంగా వాతావరణాన్ని నాశనం చేస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. వాతావరణ కాలుష్యపై సమగ్రంగా విచారించాలనుకుంటున్నట్లు సీజేఐ పేర్కొన్నారు. కాలుష్య నివారణకు కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో నాలుగు వారాల్లోగా తెలపాలని ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆటోకు ఆర్థిక శాఖ తోడ్పాటు..
గ్రేటర్ నోయిడా: కొంగొత్త టెక్నాలజీలపై పరిశోధన, అభివృద్ధి కోసం ఆటోమొబైల్ పరిశ్రమకు తగు తోడ్పాటు అందించాలని ఆర్థిక శాఖను కోరినట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. విద్యుత్ వాహనాల తయారీకి, ఎగుమతులకు భారత్ గ్లోబల్ హబ్‌గా ఎదగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆటో ఎక్స్పో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘కొన్నాళ్ల క్రితం రెండు ఎలక్ట్రిక్ వాహనాల ఆవిష్కరణ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. వాటి నాణ్యత చూశాక, రాబోయే రోజుల్లో ద్విచక్ర వాహనాలైనా.. కార్లయినా.. బస్సులైనా.. విద్యుత్ వాహనాల తయారీ, ఎగుమతుల్లో మనం కచ్చితంగా నంబర్ వన్ కాగలమని నాకు అనిపించింది‘ అని ఆయన చెప్పారు. వాహనాల తుక్కు పాలసీ తుది దశల్లో ఉందని, ఆటోమొబైల్ పరిశ్రమకు ఇది గణనీయంగా మేలు చేయగలదని గడ్కరీ తెలిపారు. మరోవైపు వాహనాలపై జీఎస్టీ తగ్గించాలన్న పరిశ్రమ డిమాండ్‌పై స్పందిస్తూ.. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని గణనీయంగా తగ్గించినట్లు చెప్పారు. భారత దిగుమతుల భారాన్ని, కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ వాహనాల్లాంటి ప్రత్యామ్నాయ టెక్నాలజీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గడ్కరీ చెప్పారు. ‘శాంత్రోవాలా’.. షారుఖ్.. దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ ఇప్పటిదాకా అనేక కొత్త కార్లు ప్రవేశపెట్టినా.. ఇప్పటికీ తనకు శాంత్రో కారన్నా, శాంత్రో వాలా ప్రకటన అన్నా తనకు చాలా ఇష్టమని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ చెప్పారు. ఆటో ఎక్స్‌పోలో కొత్త క్రెటా ఎస్‌యూవీని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. 22 సంవత్సరాలుగా హ్యుందాయ్‌కి షారుఖ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. గ్రేట్ వాల్ మోటర్స్ ఉత్పత్తి హవల్ ఎఫ్5 ఎస్‌యూవీతో మోడల్స్ ఫోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ కారు ‘ఐడీ క్రాజ్’తో సంస్థ ప్రతినిధులు జేకే మోటర్ స్పోర్ట్స్ పెవిలియన్‌లో రేసింగ్ కారుతో మోడల్స్ ఆటో ఎక్స్‌పోలో సుజుకీ హయబుసా బైక్‌తో మోడల్ -
'ప్రాజెక్టుల పేరుతో మైహోంకు దోచిపెడుతున్నారు'
సాక్షి, రంగారెడ్డి : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పేద ప్రజలపై ప్రేమ లేదని, ప్రాజెక్టుల పేరుతో మైహోం రామేశ్వర్‌రావుకు దోచిపెడుతున్నారంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి కోమటిరెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, ఆయన కుటుంబం కలిసి అభివృద్ధి పేరుతో రూ. 2 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణను లోటు బడ్జెట్ కింద మార్చారని విమర్శించారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయం వల్లే ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ. 2లక్షల కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్ మూసీ ప్రక్షాళలను గాలికి వదిలేసారని దుయ్యబట్టారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడు ముందుండే కాంగ్రెస్‌ను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి మున్సిపాలిటీల అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువస్తామని, మూసీ ప్రక్షాళనకు ప్రధాని మోదీని కలిసి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తానని వెల్లడించారు. కాగా మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే ఆరుసార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి నిధులు తీసుకువచ్చానని స్పష్టం చేశారు. తాను కేంద్రం వెంటపడి ఎల్బీ నగర్ నుంచి హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట నుంచి అందోల్ మైసమ్మ గుడి వరకు ఎనిమిది లైన్ల రోడ్డును తెచ్చామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి, ఇతరులు పాల్గొన్నారు. (కేటీఆర్‌కు కాంగ్రెస్ గురించి బాగా తెలుసు : కోమటిరెడ్డి) -
దేశంలో ఉన్నవారందరూ హిందువులే: గడ్కరీ
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టంపై ఉన్న అనుమానాలను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొట్టిపారేశారు. మంగళవారం ఆజ్‌తక్ చానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు విషయాలపై స్పష్టతనిచ్చారు. ప్రభుత్వం ఏ మైనారిటీకి వ్యతిరేకం కాదని, ఏ ముస్లింను దేశం నుంచి పంపించే ఆలోచన లేదని ఆయన పేర్కొన్నారు. ‘ఈ చట్టం గురించి ప్రజలు తప్పుడు సమాచారంతో ప్రభావితమైనారని భావిస్తున్నాను. రాజకీయ కారణాలతో కొన్ని శక్తులు వారిని రెచ్చగొడుతున్నాయి. మైనార్టీలు వారి ఉచ్చులో పడకూడదు. అక్రమ వలసదారులను అమెరికాతో సహా ఏ దేశం కూడా రెడ్ కార్పెట్ పరచదు. మన దేశమేమీ ధర్మశాల కాదు. అసలు ఈ చట్టం మన పౌరుల గురించి కాదు. పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలోని మైనారిటీల గురించి. హింస కారణంగా అక్కడ వారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. వారు ఎక్కడికీ వెళ్లలేరు కాబట్టి వారు ఇక్కడకు వస్తే వారికి పౌరసత్వం ఇస్తున్నామ’ని వివరించారు. ప్రశ్న: పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్త నిరసనలపై మీ అభిప్రాయం? గడ్కరీ : అభద్రతాభావానికి గురైన కొంతమంది రాజకీయ నాయకులు మైనార్టీల మనసులో భయాన్ని, అభద్రతను సృష్టిస్తున్నారు. జాతీయ సమస్యపై వారు ఇలా చేయడం భావ్యం కాదు. ఈ చట్టం ఏ భారతీయ పౌరుడిపై కులం, మతం, లింగం, ప్రాంతం ఆధారంగా వివక్ష చూపదు. ఇది కేవలం దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులకు మాత్రమే వ్యతిరేకం. దీనికి శాంతియుత ముగింపు వస్తుందని అనుకుంటున్నా. ప్రశ్న : ‘క్యాబ్’పై ప్రతిపక్షాల తీవ్ర స్పందనపై మీ అభిప్రాయమేంటి? గడ్కరీ : కొందరు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మైనార్టీలలో భయాన్ని సృష్టించడం మొదలుపెట్టారు. నిరాధార ప్రకటనలు చేస్తూ రాజకీయ లాభం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రశ్న: భారత్‌ను హిందూ రాష్ట్రంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై.. గడ్కరీ : హిందూ రాష్ట్రం అంటే ఏమిటి? కొన్ని మీడియా సంస్థలు.. రాజకీయ పార్టీలు హిందూను, హిందుత్వను తప్పుగా వ్యాఖ్యానిస్తున్నాయి. హిందుత్వ అంటే ఒక జీవన విధానంగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. హిందుస్తాన్‌లో నివసిస్తున్న ఏ మతానికి చెందినవారైనా వారంతా హిందువులే. కాబట్టి హిందూ, హిందుత్వలతో ఎలాంటి సమస్య లేదు. ప్రశ్న: ఎన్ఆర్సిపై ఏమంటారు? గడ్కరీ : అస్సాంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అనేక మంది అక్రమ వలసదారులకు ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల వారికి పౌరసత్వం లభించింది. పెద్ద సంఖ్యలో ఓటర్ల సంఖ్య పెరగడానికి కారణం అదే. ఈ విషయంపై అస్సాంలో ఇంతకు ముందు నిరసన వ్యక్తమైంది. అయినా అనంతర పరిణామాల్లో వారికి ఓటుహక్కు కూడా లభించి వారిలో కొందరు చివరికి రాష్ట్ర అసెంబ్లీ వరకు చేరుకున్నారు. ప్రశ్న : ఆర్థిక మందగమనం నుండి దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని తీసుకువచ్చిందా? గడ్కరీ : ఇది ఒక సమగ్ర విధానం. భద్రతతో కూడిన ఆర్థిక వ్యవస్థ కూడా ముఖ్యమే. ప్రభుత్వం ఎప్పుడూ ఒకే అంశంపై పనిచేయదు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు నిరంతర ప్రక్రియ. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా మారేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. అందుకు అన్ని అంశాలపై శ్రద్ధ వహిస్తోంది. ప్రశ్న : మహారాష్ట్రలో కూటమి మనుగడపై? గడ్కరీ : విరుద్ధమైన భావజాలమున్న పార్టీల కూటమి ఐదేళ్లు కొనసాగడం కష్టం. -
ఆర్టీసీ లిక్విడేషన్‌కు కేంద్రం అనుమతి అవసరం
సాక్షి, న్యూఢిల్లీ: రోడ్డు రవాణా కార్పొరేషన్ లిక్విడేషన్ (ఆస్తుల విక్రయం ద్వారా అప్పుల చెల్లింపు) ప్రక్రియకు రోడ్డు రవాణా కార్పొరేషన్ చట్టం–1950లోని సెక్షన్ 39 ప్రకారం కేంద్ర ప్రభుత్వ అనుమతితో రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీచేయవచ్చని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు సోమవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా బదులిచ్చారు. కొన్ని రాష్ట్రాల రోడ్డు రవాణా కార్పొరేషన్లకు కేంద్రం మూలధన నిధులు సమకూర్చిందని వివరించారు. కొన్ని రాష్ట్రాల కార్పొరేషన్లలో ఈ మూలధన నిధులు ఈక్విటీ మూలధనంగా మారినట్టు వివరించారు. రాష్ట్రాల ఆర్టీసీలో వచ్చే నష్టాలను కేంద్ర ప్రభుత్వం భరించబోదని స్పష్టంచేశారు. -
'మరింత ప్రజాసేవ చేయాలని కోరుకున్నా'
సాక్షి, అనంతపురం : పుట్టపర్తి సత్యసాయి 94వ జయంతి వేడుకలకు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. సత్యసాయి తన భోదనలతో మానవునిలో మానవత్వాన్ని, ఆధ్యాత్మికతను మేల్కొల్పారని తెలిపారు. విద్య, వైద్య, తాగునీటి రంగాలకు సత్యసాయి అందించిన సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. ప్రతి మనిషి సేవ, ప్రేమ భావనలను పెంపొందించుకొని సమసమాజ స్థాపనకు కృషి చేయాలనేదే సత్యసాయి అభిమతమని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నాకు మరింత ప్రజాసేవ చేసే అవకాశం ఇవ్వాలని సత్యసాయిని వేడుకున్నట్లు తెలిపారు. -
పాత కూటమి... కొత్త సీఎం?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ గడువు శనివారంతో ముగుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టత వచ్చినట్లే కనిపిస్తున్నా ఎప్పుడు ఏర్పడుతుందో చెప్పలేని పరిస్థితి. మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌తో భేటీ కావటం, బీజేపీ– సేన తెరవెనుక చర్చలు, గురువారం బీజేపీ నేతలు గవర్నర్ భగత్‌సింగ్ కోషియారిని కలవనుండటం ఇవన్నీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టతనిచ్చాయి. కానీ గవర్నరును కలిసే బీజేపీ నేతల్లో ఫడ్నవీస్ లేరు. బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ నేతృత్వంలో గవర్నర్‌ను కలవనున్నట్లు పార్టీ సీనియర్ నేత సుధీర్ ముంగంటివార్ చెప్పారు. పలు అంశాలను చర్చించడానికే తప్ప ప్రభుత్వ ఏర్పాటుపై మాట్లాడటానికి కాదని కూడా చెప్పారాయన. గవర్నరును కలవటంపై తమకు ఆహ్వానంలేదని శివసేన స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో... తెరవెనక పరిణామాలు చాలానే జరుగుతున్నట్లు తెలిసింది. వాటిలో గడ్కరీని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలనే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. మహా పీఠంపై గడ్కరీ? మంగళవారం రాత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కలిశారు. ప్రతిష్టంభన తొలగాలంటే గడ్కరీని సీఎంను చేయడమే పరిష్కారమని ఆరెస్సెస్ చీఫ్ భావిస్తున్నారనేది రాజకీయ వర్గాల సమాచారం. దీనికి శివసేన తేలిగ్గా అంగీకరిస్తుందన్న అంచనాలున్నాయి. ఎందుకంటే ఆది నుంచీ శివసేనతో గడ్కరీకి మంచి సంబంధాలే ఉన్నాయి. దివంగత అధ్యక్షుడు బాల్ థాకరేకు గడ్కరీ అత్యంత సన్నిహితుడు. థాకరే జీవించి ఉన్న రోజుల్లో గడ్కరీ ఆయన నివాసం మాతోశ్రీకి తరచూ వెళ్లేవారు. బీజేపీ – సేన మధ్య ఎప్పుడు విభేదాలొచ్చినా గడ్కరీయే మధ్యవర్తిత్వం నెరిపి పరిష్కరించేవారు. గడ్కరీని సీఎంను చేస్తే శివసేన 50–50 ఫార్ములాపై పట్టు వీడవచ్చని బీజేపీ అంచనా వేస్తోంది. కాకపోతే ఇప్పటికే ఫడ్నవీస్‌ను తమ శాసనసభా పక్ష నేతగా మహారాష్ట్ర బీజేపీ ఎన్నుకుంది. సీఎంగా ఆయనే ఉంటారని బీజేపీ స్పష్టంగా చెప్పింది కూడా. తాజా పరిణామాల నేపథ్యంలో బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ నితిన్ గడ్కరీతో భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ తాను మహారాష్ట్ర రైతులకు రవాణా సౌకర్యాలపై మాట్లాడటానికే కలిశానని పటేల్ చెప్పారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటాం: పవార్ ప్రజా తీర్పును గౌరవించి మహారాష్ట్రలో వెంటనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ, శివసేనలకు శరద్ పవార్ స్పష్టం చేశారు. ఎన్సీపీ–కాంగ్రెస్ కూటమి బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందని చెప్పారాయన. శివసేన నేత సంజయ్ రౌత్ తనను కలిశాక పవార్ విలేకరులతో మాట్లాడారు. బీజేపీ, శివసేన బంధం 25 ఏళ్లుగా ఉందని, ఆ రెండు పార్టీలే రేపో మాపో ఒక అవగాహనకు వస్తాయని చెప్పారాయన. 170 మంది ఎమ్మెల్యేల మద్దతుతో శివసేన సీఎం పదవిని చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై పవార్ ఆశ్యర్యం వ్యక్తం చేశారు. అంత మంది ఎమ్మెల్యేను శివసేన ఎలా తెస్తుందో చూడాలని ఆసక్తి ఉందన్నారు. సోనియా వద్దనడంతో..! 50–50 ఫార్ములాపై గట్టిగా కూర్చున్న శివసేన ఒక దశలో ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్‌ను సంప్రతించి బీజేపీ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేసింది. కాకపోతే శివసేన–ఎన్సీపీ కలిసినంత మాత్రాన ఏమీ జరగదు. కాంగ్రెస్ సహకరించాలి. అందుకే పవార్ వెళ్లి సోనియాను కలిసి శివసేనకు మద్దతిచ్చేలా ఒప్పించబోయారని తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు కర్ణాటక ఉదంతం చూసిన సోనియా... సేనకు మద్దతిచ్చి బీజేపీకి అధికారాన్ని దూరంచేస్తే కర్ణాటకలో జరిగినట్లు తమ ఎమ్మెల్యేల్ని లాగేస్తారని సందేహపడ్డారు. దీనికితోడు బీజేపీ హిందూత్వ విధానాల్ని సేనను నమ్మితే ముస్లిం ఓట్లు దూరమవుతాయని సోనియా భయపడ్డారు. మొదటికే మోసం వచ్చి అది కూడా బీజేపీకి కలిసివస్తుందని కూడా ఆమె భావించారు. అందుకే ఈ ప్రతిపాదనకు సుతరామూ అంగీకరించలేదు. వేరే దారిలేని శివసేన బీజేపీతో ముందుకెళ్లేందుకు సిద్ధపడుతోంది. ఇక పవార్ కూడా తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని గట్టిగా చెప్పేశారు. -
ఆయన్ని రప్పించండి.. రెండు గంటల్లో ముగిస్తారు!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఏర్పడ్డ ప్రతిష్ఠంభనపై తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ శివసేన నాయకుడు కిశోర్ తివారీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు లేఖ రాశారు. అంతేకాకుండా సందిగ్ధం తొలిగిపోవాలంటే బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రంగంలోకి దింపాలని కోరింది. ఆయన వస్తే సంక్షోభం వెంటనే తొలిగిపోతుందని, ప్రభుత్వ ఏర్పాటు సులభం అవుతుందని లేఖలో వివరించారు. ‘‘ఈ సంక్షోభం సమసిపోవాలంటే శివసేనతో చర్చలు జరపడానికి నితిన్ గడ్కరీని రంగంలోకి దించాలి. ఆయన ‘సంకీర్ణ ధర్మా’న్ని పాటించడమే కాకుండా ఈ సంక్షోభానికి రెండు గంటల్లోనే మార్గాన్ని చూపిస్తారు’’ అని లేఖలో పేర్కొన్నారు. ఫడణ్‌విస్ వ్యక్తిగత శైలిపై అభ్యంతరాలున్నాయని, సీనియర్ అయిన నితిన్ గడ్కరీని స్వరాష్ట్రానికి రప్పిస్తే రాష్ట్రం అద్భుతంగా ప్రగతి చెందుతుందని ఆయన తెలిపారు. కాగా ఫడ్నవిస్ కేంద్ర హోంమత్రి అమిత్‌షాను కలవడం, మరోవైపు సోనియా గాంధీ అధ్యక్షతన ప్రతిపక్షాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కిశోర్ తివారీ లేఖ బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలావుండగా.. పలువురు బీజేపీ సీనియర్ నేతలు, శ్రేణులు రాష్ట్రంలో రీ-ఎలక్షన్‌కు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జయ్‌కుమార్ రావల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. -
పెట్రోల్, డీజిల్ వాహనాల నిషేధం అక్కర్లేదు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించాల్సిన అవసరం లేదన్నారు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ. ఎలక్ట్రిక్ వాహన (ఈవీ)విక్రయాలు సమజంగానే ఊపందుకుంటున్నాయని చెప్పారు. వచ్చే రెండేళ్లలో అన్ని బస్సులు ఎలక్ట్రిక్ రూపంలోనే ఉంటాయన్నారు. 2030 తర్వాత దేశంలో ఈవీ విక్రయాలనే అనుమతించాలన్నది నీతి ఆయోగ్ సిఫారసు. 150సీసీలోపు ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను 2025 తర్వాత ఈవీ రూపంలో అనుమతించాలని కూడా సిఫారసు చేసింది. కాకపోతే మంత్రులు గడ్కరీ, ధర్మేంద ప్రధాన్ వంటి వారు తర్వాత ఈ ప్రతిపాదనలను ఖండించారు. ఎంఎస్ఎంఈల్లో ఇంధన సామర్థ్యం అనే అంశంపై ఢిల్లీలో నిర్వహించిన జాతీయ సదస్సులో సోమవారం పాల్గొన్న సందర్భంగా మంత్రి గడ్కరీ ఈ అంశాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. ‘‘ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లు, బస్సుల అమ్మకాలు సహజంగానే పెరుగుతున్నాయి. వాటి అమ్మకాలను తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదు. అలాగే, పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించాల్సిన అవసరం కూడా లేదు. రెండేళ్లలో అన్ని బస్సులు ఎలక్ట్రిక్, బయో ఎథనాల్, సీఎన్జీతో తిరిగేవే ఉంటాయి’’ అని గడ్కరీ వివరించారు. వ్యవసాయ వ్యర్థాలు (వరిగడ్డి వంటివి) వంటి వాటితో విద్యుత్తును తయారు చేసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. ఆ విద్యుత్తును వాహనాలకు వినియోగించుకోవడం ద్వారా, రైతుల ఆదాయం పెంచుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఈ గడ్డిని రైతులు వృథాగా కాల్చేస్తున్నారని, దీనివల్ల వాయు, భూ కాలుష్యం పెరుగుతున్నట్టు చెప్పారు. ఎన్టీపీసీ సంస్థ ద్వారా ఇప్పటికే ఈ తరహా వ్యర్థాల సమీకరణను ప్రారంభించినట్టు తెలిపారు. ఎంస్ఎంఈలకు తక్కువ రేటుకు రుణాలు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈలు) తక్కువ రేటుకే రుణాలు అందించేందుకు గాను ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నట్టు నితిన్ గడ్కరీ తెలిపారు. ‘‘అధిక మూలధన వ్యయ సమస్య ఉంది. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు 2–3 శాతంగా ఉన్నాయి. కొన్ని దేశాల్లో అయితే ఒక్క శాతమే. కానీ, మన దేశంలో ఎంఎస్ఎంఈ రుణాలపై 11–14 శాతం వరకు వడ్డీ రేట్లు అమలవుతున్నాయి. నిధుల వ్యవయాలను తగ్గించాల్సిన అవసరం ఉంది’’ అని వివరించారు. రవాణా వ్యయాలను తగ్గించగలిగితే ఎగుమతులు ప్రస్తుత స్థాయికి రెట్టింపునకు పైగా పెరుగుతాయన్నారు. -
జీఎస్టీ తగ్గింపుపై త్వరలో నిర్ణయం
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ రంగానికి జీఎస్టీ తగ్గింపు విషయమై రాష్ట్రాలతో సంప్రదింపులు చేస్తున్నామని, త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రేటు తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అధికారం జీఎస్టీ మండలికే ఉంటుందని తెలిసిందే. ‘‘రాష్ట్రాలతో ఆరి్థక శాఖ చేస్తున్న సంప్రదింపులపై నేను నమ్మకంతో ఉన్నాను. ఒకవేళ సాధ్యపడితే వారు ఓ నిర్ణయం తీసుకుంటారు’’ అని మంత్రి తెలిపారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ప్రమాదాల నివారణకే అధిక జరిమానాలు ట్రాఫిక్ జరిమానాలను భారీగా పెంచడాన్ని గడ్కరీ సమర్థించుకున్నారు. 30 ఏళ్ల తర్వాత జరిమానాలను పెంచినట్టు గుర్తు చేశారు. అధిక జరిమానాలు రోడ్డు ప్రమాదాలను నివారించంతోపాటు రహదారి భద్రతను ప్రోత్సహిస్తాయన్నారు. ఆదాయ పెంపు కంటే ప్రాణాలను కాపాడటానికే జరిమానాలను పెంచినట్టు వివరణ ఇచ్చారు. ఈ విషయమై సానుకూల స్పందన వచి్చనట్టు చెప్పారు. రాష్ట్రాలు కావాలనుకుంటే జరిమానాలను తగ్గించుకోవచ్చని సూచించారు. బీఎస్–6 ప్రమాణాలతో ‘యాక్టివా 125’ విడుదల ధరల శ్రేణి రూ. 67,490 – 74,490 న్యూఢిల్లీ: దేశీ రెండో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ ‘యాక్టివా 125’లో భారత్ స్టేజ్–6 (బీఎస్6) ప్రమాణాలతో కూడిన అధునాతన వెర్షన్‌ను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి బీఎస్–6 ప్రమాణాలు కలిగిన వాహనాలను మాత్రమే కంపెనీలు విడుదలచేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తాజా వాహనాన్ని హోండా విడుదల చేసింది. మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచి్చన ఈ నూతన స్కూటర్ ధరల శ్రేణి రూ. 67,490 – రూ. 74,490 (ఎక్స్–షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. ఇందులో 124సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజిన్ అమర్చింది. ఈనెల చివరికి వినియోగదారులకు చేరనుందని ప్రకటించింది. -
అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో మట్టికప్పుల్లోనే చాయ్!
న్యూఢిల్లీ: ఇకపై ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్ డిపోల వద్ద ఉన్న స్టాళ్లు, ఎయిర్‌పోర్టులు, మాల్స్‌లో మట్టి కప్పుల్లో చాయ్‌ని ఆస్వాదించవచ్చు. ఈమేరకు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ.. రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం వారణాసి, రాయ్‌బరేలీ రెండు రైల్వే స్టేషన్లలో మాత్రమే కేటరర్లు ఈ మట్టి కప్పుల్లో చాయ్‌ను అందిస్తున్నారు. ‘సుమారు 100 రైల్వే స్టేషన్లలో, ఎయిర్‌పోర్టులు, రాష్ట్రాల్లోని బస్ డిపోల వద్ద ఉన్న టీ స్టాళ్లలో మట్టి కప్పుల్లోనే చాయ్‌ను అందించడాన్ని తప్పనిసరి చేయాలని గోయల్‌కు లేఖ రాశాను. దీంతో స్థానిక తయారీదారులకు మార్కెట్ లభించడంతో పాటు పర్యావరణానికి హాని కలిగించే పేపర్, ప్లాస్టిక్‌ల వాడకాన్ని నిషేధించినట్లవుతుందని వివరించారు. -
ఆటో మొబైల్ పరిశ్రమకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ ఆటో పరిశ్రమకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్పిడికి ఎలాంటి గడువు లేదని తేల్చి చెప్పారు. ఇ-వాహనాల పరివర్తన సహజంగా జరుగుతుందని స్పష్టం చేశారు. దాదాపు ఏడాది కాలంగా మందగమనంలో విలవిల్లాడుతూ, విక్రయాలు 19ఏళ్ల గరిష్ఠానికి పడిపోయిన నేపథ్యంలో ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలుకు గడ్కరీ ప్రకటన భారీ ఊరటనివ్వనుంది. 2023 నుంచి 150 సీసీ లోపు ద్విచక్రవాహనాలు, 2025 నాటికి త్రిచక్ర వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా పూర్తిగా మారాలని ప్రభుత్వ థింక్-ట్యాంక్ నీతి ఆయోగ్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై స్పందించాల్సిందిగా కేంద్రమంత్రిని కోరినపుడు ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ వాహనాలను ఈ గడువులోగా నిషేధించాలనే గడువు లేదని, అలాంటిదేమైనా వుంటే సంబంధిత వర్గాలను సంప్రదించిన తరువాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి మాత్రం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తున్నాయి. పరివర్తన సహజ ప్రక్రియగా జరుగుతుందన్నారు. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే ప్రయత్నంలో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ఇంజన్లను నిషేధించదని లోక్‌సభ సమావేశాల్లో కూడా గడ్కరీ ఆటోమొబైల్ పరిశ్రమకు హామీ ఇచ్చిన సంగతి గమనార్హం. ఈవీ వాహనాల పరివర్తన గడువుపై ఆటోమొబైల్ మేజర్స్ టీవీఎస్ మోటార్ బజాజ్ ఆటో కూడా ఇలాంటి ఆకస్మికంగా ఈ మార్పును సాధించలేమని టీవీఎస్ మోటార్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ ఇంతకుముందే వెల్లడించారు. ఈ విషయంలో దేశం, ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమ రెండూ చాలా దూరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఫలితంగా 4 మిలియన్ల ఉద్యోగాలను కల్పిస్తున్న ఆటోమొబైల్ పరిశ్రమ దెబ్బతింటుందని శ్రీనివాసన్ తెలిపారు. కాగా గత కొన్ని నెలలుగా ఆటో పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. డిమాండ్ క్షీణించి తో ఆటోమొబైల్ పరిశ్రమ వృద్ధిలో మందగమనంలో ఉందని, గత కొన్ని నెలలుగా ఆటో కాంపోనెంట్స్ రంగంలో లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని నివేదికలు వెలువడ్డాయి. అటు ఈ ధోరణి మరో మూడు నాలుగు నెలలు కొనసాగితే, 10లక్షలకు పైగా ఉద్యోగనష్టాలకు దారితీస్తుందని ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎసిఎంఎ) డైరెక్టర్ జనరల్ విన్నీ మెహతా వ్యాఖ్యానించారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల ప్రకారం, ఆటో పరిశ్రమ గత సంవత్సరంతో పోల్చితే 2019 లో అమ్మకాలలో 31శాతం తగ్గుదల నమోదైంది. -
అకస్మాత్తుగా టేకాఫ్ రద్దు, విమానంలో కేంద్రమంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్‌గడ్కరీ ప్రయాణించే ఇండిగో విమానాన్ని అకస్మాత్తుగా నిలిపి వేయాల్సి వచ్చింది. నాగపూర్ నుంచి ఢిల్లీ వెళుతున్న ఇండిగో విమానంలో తీవ్రమైన సాంకేతికలోపం తలెత్తడంతో టేకాఫ్‌ను నిలిపివేశారు. ఇండిగో ఫ్లైట్ 6 ఇ 636లో లోపాన్ని గుర్తించిన పైలట్ టేకాఫ్‌ను నిలిపివేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇండిగో కూడా ధృవీరించింది. కేంద్రమంత్రి గడ్కరీ సహా, 143 మంది ప్రయాణీకులు ఇందులో ఉన్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఢిల్లీలోని సంబంధిత మంత్రిత్వ శాఖ కార్యాలయానికి సమాచారం అందించామని వెల్లడించింది. ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారనీ నాగపూర్ విమానాశ్రయం సీనియర్ డైరెక్టర్ విజయ్ మూలేకర్ తెలిపారు. -
వాహనాలకు ‘నైట్రోజన్’ టైర్లు
న్యూఢిల్లీ: టైర్ల నాణ్యతను పెంచేందుకు టైర్ల తయారీలో రబ్బర్‌తో సిలికాన్ కలపడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ విషయాన్ని ఓ ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభలో కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ చెప్పారు. సిలికాన్ కలసిన రబ్బర్ టైర్లలో సాధారణ గాలికి బదులు నైట్రోజన్ వాయువు నింపడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. దీంతో టైర్లు పేలే అవకాశాలు తగ్గుతాయని, ఆగ్రాలో రోడ్డుప్రమాదం వంటి ఘటనలు తగ్గుతాయని గడ్కరీ అన్నారు. నోయిడా–ఆగ్రా హైవేలో సోమవారం జరిగిన ప్రమాదం బాధాకరమన్నారు. యమునా ఎక్స్‌ప్రెస్‌వేను యూపీ ప్రభుత్వమే నిర్మించిందని దాంతో కేంద్రానికి ఏ సంబంధం లేదని అన్నారు. పార్లమెంట్లో రోడ్డు భద్రత బిల్లు గత సంవత్సర కాలంగా పెండింగ్‌లో ఉందని దాన్ని ఆమోదించాలని సభ్యులను కోరారు. అది పాసైతే 30 శాతం బోగస్ లైసెన్స్‌లు రద్దవుతాయన్నారు. దేశంలో 25 లక్షల మంది అనుభవజ్ఞులైన డ్రైవర్ల అవసరం ఉందన్నారు. ప్రతి జిల్లాలోనూ ఓ లోక్‌సభ సభ్యుడు చైర్మన్‌గా ఓ కమిటి ప్రారంభిస్తామన్నారు. ఈ కమిటీ ద్వారా రోడ్డు భద్రతా సూచనలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. -
రూ.15 లక్షల కోట్లతో జాతీయ రహదారులు
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వంలో రెండో సారి మంత్రి అయిన నితిన్ గడ్కరీ తన మంత్రిత్వ శాఖలైన జాతీయ రహదారులు, సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు సంబం ధించి బృహత్ ప్రణాళికలను ప్రకటించారు. రూ.15 లక్షల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఖాదీ, ఎంఎస్ఎంఈ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కల్పించడం ద్వారా స్థూల జాతీయోత్పత్తిని (జీడీపీ)ని పెంచుతామన్నారు. 22 హరిత ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంతోపాటు రూ.15 లక్షల కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్టులు చేపట్టనున్నారు. అర్ధంతరంగా నిలిచిపోయిన రహదారి ప్రాజెక్టులను వచ్చే వంద రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు గడ్కరీ వివరించారు. విద్యుత్ గ్రిడ్ తరహాలో రహదారుల గ్రిడ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వచ్చే సమావేశాల్లో మోటారు వాహనాల బిల్లు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మోటారు వాహనాల సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు మంత్రి గడ్కరీ చెప్పారు.2017లో లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉందని, అయితే గత ఫిబ్రవరిలో లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడటంతో బిల్లు మురిగిపోయిందని అన్నారు. కొత్త మంత్రి వర్గం ఆమోదం లభించిన వెంటనే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. -
పెట్టుబడులు, ఉద్యోగ సృష్టిపై దృష్టి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడంతో పాటు యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు దేశచరిత్రలోనే తొలిసారిగా రెండు కేబినెట్ కమిటీలను ఏర్పాటు చేశారు. వీటిలో మొదటిదైన ‘పెటుబడులు, అభివృద్ధి కేబినెట్ కమిటీ’లో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, పీయూష్‌గోయల్‌లను సభ్యులుగా నియమించారు. భారత్‌లోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఆర్థికవ్యవస్థ వృద్ధిపై కమిటీ దృష్టి సారించనుంది. అలాగే ఉద్యోగకల్పన–నైపుణ్యాభివృద్ధిపై ఏర్పాటైన కేబినెట్ కమిటీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, సీతారామన్, పీయూష్ గోయల్, నరేంద్రసింగ్ తోమర్, రమేశ్ నిశాంక్, ధర్మేంద్ర ప్రధాన్, ఎంఎన్ పాండే, సంతోష్ కుమార్ గంగ్వార్, హర్దీప్ పురీలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ దేశంలో కొత్త ఉద్యోగాల సృష్టితో పాటు యువత ఉపాధి పొందేందుకు వీలుగా నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడంపై దృష్టి పెట్టనుంది. ఈ రెండు కేబినెట్ కమిటీలు ప్రధాని మోదీ నేతృత్వంలో పనిచేస్తాయి. ఈ రెండు కమిటీలను ఏర్పాటుచేసేందుకు నిబంధనలు అనుమతిస్తున్నప్పటికీ ఎన్డీయే–1 ప్రభుత్వం వీటిని ఏర్పాటుచేయలేదు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విపక్షాలు ప్రధాని మోదీని దేశంలో నిరుద్యోగం, ఆర్థికవ్యవస్థ మందగమనంపై తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. ఈసారి అలాంటి విమర్శలకు తావివ్వకుండా చేసేందుకు మోదీ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. మరోవైపు దేశభద్రత, విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీని బుధవారం ఏర్పాటుచేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో రక్షణ, హోం, విదేశాంగ, ఆర్థిక శాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు. ప్రకృతితో మమేకమైతే ఉజ్వల భవిష్యత్ ప్రకృతితో మమేకమై సామరస్యంగా జీవించడం ఉజ్వల భవిష్యత్‌కు నాంది పలుకుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం(జూన్ 5) సందర్భంగా ఆయన అందరికి శుభాకాంక్షలు చెప్పారు. ‘భూమి, పర్యావరణం.. మనం పరిరక్షించుకోవాల్సిన గొప్ప అంశాలు ఇవి. ప్రపంచ పర్యావరణ దినోత్సవమైన నేడు స్వచ్ఛమైన భూమి కోసం కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నా’ అంటూ ట్విట్టర్లో ప్రధాని ఓ వీడియోను పోస్ట్ చేశారు. మొక్కల్ని నాటడం గొప్ప విషయం కాదనీ, అవి చెట్లుగా మారేవరకూ పరిరక్షించాలని మోదీ సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం(జూన్ 21) సమీపిస్తున్న వేళ యోగాను జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. యోగా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్న మోదీ.. తాను ఆసనాలు వేస్తున్నట్లు ఉన్న యానిమేషన్ వీడియోను ట్విట్టర్లో పోస్ట్‌చేశారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఢిల్లీ, సిమ్లా, మైసూరు, అహ్మదాబాద్, రాంచీలో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. రంజాన్ శుభాకాంక్షలు.. రంజాన్(ఈద్–ఉల్–ఫితర్) పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ముస్లిం సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘రంజాన్ పర్వదినం మన సమాజంలో సామరస్యం, కరుణ, శాంతిని పెంపొందిస్తుందని ఆశిస్తున్నా. ప్రతీఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా’ అని ప్రధాని తెలిపారు. -
స్టేజీపైనే సొమ్మసిల్లిన గడ్కరీ
షిర్డీ: నాగ్‌పూర్ ఎంపీగా బరిలో ఉన్న కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్ధి నితిన్ గడ్కరీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. షిర్డీలో ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆయన స్టేజీపైనే సొమ్మసిల్లారు. షిర్డీ లోక్‌సభ నియోజకవర్గం శివసేన అభ్యర్థి సదాశివ్ లొఖాండే తరఫున శనివారం సాయంత్రం రహతాలో ప్రచారంలో పాల్గొన్నారు. ప్రసంగం పూర్తి చేసి కుర్చీలో కూర్చోబోతూ సొమ్మసిల్లారు. భద్రతా సిబ్బంది, నేతలు కిందకు పడిపోకుండా పట్టుకున్నారు. కొద్దిసేపటి తర్వాత కోలుకున్న ఆయన తన కారు వద్దకు ఎవరి సాయం లేకుండానే నడిచి వెళ్లారు. అనంతరం ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. -
కొంచెం కనికరించండి..!
ముంబై: ఆర్బీఐ నూతన గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ముంబైలో ప్రభుత్వరంగ బ్యాంకుల సారథులతో భేటీ అయ్యారు. అరగంట పాటు ఈ సమావేశం జరిగింది. ఆర్బీఐ అనుసరిస్తున్న కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ), రుణ చెల్లింపుల్లో ఒక్క రోజు ఆలస్యమైనా ఆయా ఖాతాలను ఎన్పీఏలుగా వర్గీకరించడమనే నిబంధనలను సడలించాలని ఈ సందర్భంగా ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులు కోరారు. అలాగే, బ్యాంకులు ఎదుర్కొంటున్న అనేక అంశాలపై దాస్తోపాటు ఆర్బీఐకి చెందిన నలుగురు డిప్యూటీ గవర్నర్లు చర్చించారు. వీటిల్లో ద్రవ్య లభ్యత, ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభం వంటి అంశాలున్నాయి. ఎస్బీఐ, పీఎన్బీ, ఐడీబీఐ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, దేనా బ్యాంకు చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పీసీఏ నిబంధనలను సరళించాలని గవర్నర్‌ను కోరినట్టు వీరు తెలిపారు. బ్యాలన్స్ షీట్లను చక్కదిద్దుకోలేక, ఎన్పీఏలు భారీగా పెరిగిపోయిన ప్రభుత్వరంగ బ్యాంకులను ఆర్బీఐ పీసీఏ పరిధిలోకి తీసుకొచ్చి కఠినంగా వ్యవహరిస్తోంది. 21 ప్రభుత్వరంగ బ్యాంకులకు 11 బ్యాంకులు పీసీఏ పరిధిలో ఉన్నాయి. దీంతో ఈ బ్యాంకులు కొత్తగా రుణాలు ఇవ్వడంపై ఆంక్షలు అమలవుతున్నాయి. కాగా, నియంత్రణ సంస్థ, బ్యాంకుల మధ్య చర్చలకు వీలు కల్పించడమే ఈ సమావేశం ఉద్దేశమని పీఎన్బీ ఎండీ సునీల్ మెహతా మీడియాకు తెలిపారు. దాస్‌కు నేడే తొలి పరీక్ష! గవర్నర్‌గా తొలి బోర్డు సమావేశం నేడు న్యూఢిల్లీ: నూతన గవర్నర్ శక్తికాంత్‌దాస్ ఆధ్వర్యంలో ఆర్బీఐ డైరెక్టర్ల బోర్డు శుక్రవారం సమావేశం కాబోతుంది. ఈ సందర్భంగా సెంట్రల్ బ్యాంకు నిర్ణయాలు తీసుకునే ప్రక్రియపై డైరెక్టర్ల నుంచి ప్రశ్నలు ఎదురుకానున్నాయి. నవంబరు 19న జరిగిన గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రగతిపై సమీక్ష జరగనుంది. డీమోనిటైజేషన్, జీఎస్టీ నిర్ణయాల కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్ఎంఈ)కు ఉపశమనం కల్పించే చర్యలు, ఆర్బీఐ విధాన నిర్ణయాల్లో సెంట్రల్ బోర్డు పాత్రపైనా చర్చ జరగనుంది. ప్రస్తుత నిర్మాణంలో, ఆర్బీఐ సెంట్రల్ బోర్డు కేవలం సలహా పాత్రకే పరిమితం అవుతోంది. ప్రభుత్వ ప్రాతినిధ్యం కూడా ఉన్న బోర్డును ఆర్బీఐ తీసుకునే కీలక నిర్ణయాల్లోనూ భాగస్వామిని చేయాలన్న ప్రతిపాదన ఉంది. ఒక్కరోజు రుణ చెల్లింపుల్లో విఫలమైనా దాన్ని ఎన్పీఏగా వర్గీకరించడం వంటి ఎన్నో కీలక అంశాల్లో ప్రస్తుతం బోర్డు జోక్యం చేసుకునే అవకాశం లేదు. అయితే, ఆర్బీఐ బోర్డు కేవలం సలహా పాత్రకే పరిమితం కావాలని, ఆర్బీఐ స్వతంత్రత, స్వయంప్రతిపత్తిని కాపాడాలన్నది మాజీ గవర్నర్లు, నిపుణుల అభిప్రాయం. ఆర్బీఐ స్వతంత్రతను, విశ్వసనీయతను తాను కాపాడతానని గవర్నర్ బాధ్యతల తర్వాత దాస్ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలను సమయానుకూలంగా పరిష్కరిస్తామని కూడా ఆయన చెప్పారు. ఆర్బీఐ సెంట్రల్ బోర్డుకు గవర్నర్ అధిపతిగా వ్యవహరిస్తారు. ఇందులో ఇద్దరు ప్రభుత్వ నామినీ డైరెక్టర్లు, 11 ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఉంటారు. ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు చేపట్టిన రెండోరోజే ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో దాస్ సమావేశం కాగా, మూడో రోజు ఆర్బీఐ బోర్డు కీలక సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ప్రభుత్వానికి ఆర్బీఐ మద్దతివ్వాలి ఏ సంస్థనూ నిర్వీర్యం చేయలేదు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముంబై: ఆర్బీఐని కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వీర్యం చేయబోదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఆర్బీఐ ప్రభుత్వంలో ఒక భాగమని, అది ప్రభుత్వ ఆర్థిక విధానానికి మద్దతుగా నిలవాలని అభిప్రాయపడ్డారు. కొన్ని అంశాల్లో కేంద్ర ప్రభుత్వంతో విభేదాల వల్ల ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసిన నేపథ్యంలో మంత్రి గడ్కరీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఉర్జిత్ పటేల్ స్థానంలో శక్తికాంత దాస్ ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర బ్యాంకు స్వతంత్ర సంస్థగానే పనిచేయాలని, అదే సమయంలో ప్రభుత్వ ఆర్థిక విధానాలకు కూడా మద్దతు నివ్వాలన్న అభిప్రాయాన్ని గడ్కరీ వ్యక్తం చేశారు. ఏ విధంగానూ సెంట్రల్ బ్యాంకును తాము దెబ్బతీయలేదన్నారు. దేశం కోసం ఆర్థిక మంత్రి ఓ విధానాన్ని ప్రతిపాదిస్తే దానికి మద్దతుగా నిలవాల్సిన బాధ్యత ఆర్బీఐపై లేదా? అని గడ్కరీ ప్రశ్నించారు. ‘‘ఎక్కడైనా ఎగుడుదిగుళ్లు సహజమే. ఏ సంస్థనూ మేం నిర్వీర్యం చేయలేదు. ఆర్బీఐ నిర్వహణలో మేమేమీ రాజకీయంగా జోక్యం చేసుకోలేదు. పారదర్శకమైన, అవినీతి రహిత వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉంది. వేగంగా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియకు తోడు, ప్రభుత్వ నిర్ణయాలకు ప్రతీ సంస్థ కట్టుబడాలి’’ అని గడ్కరీ చెప్పారు. ఒకవేళ ఆర్బీఐ పూర్తి సర్వస్వతంత్రంగా ఉండాలనుకుంటే, ఆర్థిక అనారోగ్యానికి అదే బాధ్యత వహించాలని, ఆర్థిక శాఖ కాదని చెప్పారాయన. ‘‘ఒకవైపు ఆర్థిక వ్యవస్థలో అనారోగ్యాలకు బాధ్యత మాదంటారు. దాంతో మేము నిర్ణయాలు తీసుకుంటే ఆర్బీఐ స్వతంత్రత ప్రమాదంలో పడిందంటారు’’ అని గడ్కరీ పేర్కొన్నారు. మాల్యాకు మద్దతు! వ్యాపారంలో ఎత్తు పల్లాలు ఉంటాయని, అది బ్యాంకింగ్ అయినా, బీమా అయినా తప్పిదాలు జరిగితే క్షమించి మరో అవకాశం ఇవ్వాలని కోరారు. ఓ కంపెనీ వ్యాపార పరంగా గడ్డు పరిస్థితుల్లోకి వెళితే ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చాలా కాలం క్రితం మహారాష్ట్ర ప్రభుత్వ సంస్థ సికామ్ విజయ్ మాల్యాకు రుణం ఇచ్చిందని, మాల్యా దానికి 40 ఏళ్ల పాటు వడ్డీ కట్టారని చెప్పారు. ‘‘ఒక వ్యక్తి రుణానికి 40 ఏళ్లు చెల్లింపులు చేసి, ఆ తర్వాత ఏవో కారణాల వల్ల రుణ చెల్లింపులు చేయలేకపోతే అతన్ని ఉద్దేశపూర్వక ఎగవేతదారు అని నిర్ధారించడం సరికాదన్నారు. ‘‘నీరవ్‌మోదీ లేదా విజయ్ మాల్యా మోసానికి పాల్పడితే వారిని జైలుకు పంపించాలి. కానీ, ఆర్థిక సమస్యల్లో ఉన్న ప్రతీ ఒక్కరినీ మోసగాళ్లుగా చిత్రీకరిస్తే ఆ ఆర్థిక వ్యవస్థ పురోగతి చెందలేదు’’ అని గడ్కరీ అభిప్రాయపడ్డారు. -
ముందు మా అవసరాలు తీర్చాలి
సాక్షి, న్యూఢిల్లీ : గోదావరి బేసిన్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటిని కేటాయించిన తర్వాత మిగిలిన అదనపు నీటిని గోదావరి–కావేరి అను సంధానం ద్వారా కావేరి బేసిన్‌కు తరలిస్తే తమకు అభ్యంతరం లేదని కేంద్రానికి మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో జరిగిన నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్‌డబ్ల్యూడీఏ) 32వ వార్షిక సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గోదావరి–కావేరి నదుల అనుంసంధానానికి సంబంధించి డీపీఆర్‌ను తయారు చేసే ముందు తెలంగాణ నీటి అవసరాలు తీర్చాలని కోరా రు. గోదావరి బేసిన్లో తెలంగాణకు హక్కుగా 954 టీఎంసీల నీరు రావాల్సి ఉందన్నారు. ముందుగా బేసిన్లో నీటి లభ్యతను లెక్కగట్టాలని, అనంతరం తెలంగాణ అవసరాలు, కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు తుది కేటాయింపుల తర్వాత అదనంగా మిగిలే నీటిని కావేరి బేసిన్‌కు తరలిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. నది పరీవాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అవసరాలను కేంద్రం ముందుగా పరిగణనలోకి తీసుకుని నీటి లెక్కలు తేల్చాలని కోరారు. ‘సీతారామ’కు అనుమతులివ్వండి గోదావరి–కావేరి అనుసంధానానికి ముందు గోదా వరి బేసిన్లో తెలంగాణ చేపట్టిన సీతారామ ప్రాజెక్టుకు అనుమతులివ్వాలని గడ్కరీని హరీశ్ కోరారు. బేసిన్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కేంద్రం వేగంగా అనుమతులివ్వకుండా నదుల అనుసంధానికి డీపీఆర్‌లు తయారు చేయడం సరికాదని పేర్కొన్నారు. కాళేశ్వరానికి నిధులివ్వండి రాష్ట్రాలు నిర్మించే సాగునీటి ప్రాజెక్టులకు 60:40 శాతం నిధులు ఇస్తామని కేంద్రం చెప్పిందని.. ఆ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులివ్వాలని హరీశ్‌రావు కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల కీలక అనుమతులు వచ్చాయని గుర్తు చేశారు. కాళేశ్వరానికి కేంద్రం తన వాటా నిధులివ్వాలన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని ప్రాజెక్టుల వద్ద ఇంజనీర్లు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. 45 వేల క్యూసెక్యుల సామర్థ్యం కలిగిన సాత్నాల ప్రాజెక్టుకు 75 వేల క్యూసెక్కుల వరద వచ్చిందని, ఇంజనీర్లు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పిందన్నారు. పిడుగు పడటంవల్ల ప్రాజెక్టు మోటార్లు కాలిపోవడంతో గేట్లు ఎత్తలేని పరిస్థితి ఏర్పడిందని, స్థానికుల సాయంతో మాన్యువల్‌గా గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశామన్నారు. సుమారు 8 వేల మందిని కాపాడగలిగామని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సహకరించండి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, భవిష్యత్ అవసరాల కోసం ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)కు సాయం చేయాలని గడ్కరీని మంత్రి హరీశ్‌రావు, ఎంపీ వినోద్‌కుమార్ కోరారు. సమావేశం సందర్భంగా గడ్కరీకి సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఆర్ఆర్ఆర్ ప్రాధాన్యాన్ని వివరించారు. రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 12 వేల కోట్లతో ప్రతిపాదనలు పంపిందని, దీనిపై సానుకూల నిర్ణయం తీసుకొని ప్రాజెక్టుకు అనుమతులతో పాటు నిధులు విడుదల చేయాలని కోరారు. 2018–19 ఏడాదికి గానూ సెంట్రల్ రోడ్ ఫండ్ కింద తెలంగాణకు రూ. 800 కోట్లు విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని సమావేశం అనంతరం మీడియాకు వినోద్ తెలిపారు. కేంద్రం ఏటా రూ. 400 కోట్లే విడుదల చేసేదని, రోడ్ల అభివృద్ధిలో రాష్ట్రం మెరుగైన పనితీరు కనబరుస్తుండటంతో మరో రూ. 400 కోట్లు సాధించగలిగామన్నారు. 31 జిల్లాల్లో 53 ప్రధాన రోడ్ల అభివృద్ధికి ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. సోమవారం ఢిల్లీలో జరిగిన దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సంతాప సభలో వినోద్ పాల్గొన్నారు. గడ్కరీతో హరీశ్ భేటీ ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి గడ్కరీని రాత్రి ఆయన నివాసంలో మంత్రి హరీశ్, ఎంపీ వినోద్ కలిశారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, వాటికి విడుదల కావాల్సిన కేంద్ర వాటాపై చర్చించారు. నీతి ఆయోగ్ యాస్పిరేషన్ డిస్ట్రిక్స్ కింద దేశవ్యాప్తంగా పలు జిల్లాలను ఎంపిక చేసి ఉపరితల చిన్న తరహా సాగునీటి పథకాలు, ఆర్ఆర్ఆర్ పథకాలు కేంద్రం అమలు చేస్తోందని.. ఇందులో తెలంగాణలోని 3 జిల్లాలనే ఎంపిక చేశారని, మరిన్ని జిల్లాలను చేర్చాలని కోరారు. రాష్ట్రం చాలా వరకు భూగర్భ జలాలు అడుగంటాయని, కాబట్టి సమర్థ భూగర్భ జలాల నిర్వహణకుగాను తెలంగాణను అటల్ భూజల్ యోజన కింద చేర్చాలని విన్నవించారు. -
‘ఆయన సాయంతోనే కాళేశ్వరం అనుమతులు’
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోనే అత్యంత వేగంగా పూర్తవుతోన్న ప్రాజెక్టు కాళేశ్వరం అని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీశ్ రావు అన్నారు. మంగళవారం ఢిల్లీ వెళ్లిన హరీశ్ రావు.. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు రావాల్సిందిగా గడ్కరీని ఆహ్వానించారు. గడ్కరీ సహకారంతోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని పేర్కొన్న హరీశ్.. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని విఙ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. -
అభివృద్ధి పనులకు శ్రీకారం
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): రూ.6,688 కోట్ల విలువైన ఏడు జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా శుక్రవారం భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప పాల్గొన్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 6400 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నాయని, వీటిని 8 వేలకు పెంచాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుందని, దీనికి కేంద్రం సహకారం అందించాలన్నారు. ఎంపీలు కె.హరిబాబు, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలవరం, రైల్వే జోన్ తదితర అంశాలను ప్రస్తావించారు. విశాఖ నగర ప్రజలకు కాలుష్యరహితమైన గాలిని అందించడానికి ఖర్చుకు వెనకడుగు వెయ్యవద్దని కేంద్ర మంత్రి తమకు స్వేచ్ఛ ఇచ్చారని విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు అన్నారు. కేంద్ర హైవేల శాఖ సభ్యుడు ఆర్.కె పాండే మాట్లాడారు. వీసీటీఎల్లో నూతన క్రేన్లు ప్రారంభం పాతపోస్టాఫీసు: విశాఖ కంటెయినర్ టెర్నినల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రేన్లను కేంద్ర ఉపరితల, నౌకాయన మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీటీఎల్ ప్రతినిధులు మాట్లాడుతూ రూ.151 కోట్ల వ్యయంతో రెండు పోస్ట్ పనామెక్స్ క్వే క్రేన్లు, రబ్బర్ టైర్స్ గేంట్రీ క్రేన్లు నాలుగు కొనుగోలు చేశామని తెలిపారు. క్వే క్రేన్లు 41 టన్నుల బరువున్న కంటెయినర్లను ఒక గంటలో 27 నుంచి 30 వరకు లోడ్ చేయగలవని తెలిపారు. లోడ్ చేసే సమయంలో కంటెయినర్‌కు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఆధునిక రక్షణ వ్యవస్థ ఉందన్నారు. ఇప్పటికే ఉన్న నాలుగు క్వే క్రేన్లకు మరో రెండు నూతన క్రేన్లు తోడవ్వడంతో లోడింగ్‌ను ఆపకుండా రౌండ్ ది క్లాక్ చేయవచ్చని తెలిపారు. శ్రీకారం చుట్టిన ప్రాజెక్టులు ఇవే.. ఆరు నూతన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. పూర్తయిన ఒక ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్ల రహదారి సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి 444.5 కోట్లు నరసన్నపేట నుంచి రణస్థలం వరకు 54.2 కిలోమీటర్ల పరిధిలో, రణస్థలం నుంచి ఆనంద ³#రం వరకు 47 కిలోమీటర్ల రహదారి నిర్మాణం ఆనందపురం నుంచి పెందుర్తి వరకు 50.75 కిలో మీటర్లు, ఎన్‌హెచ్ 16 నుంచి విశాఖ పోర్టుకు కనెక్టివిటీకి 12.7 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారి కాన్వెంట్ జంక్షన్ వద్ద బైపాస్ ఏర్పాటు చేస్తూ పోర్ట్ రద్దీని నియంత్రించే రోడ్డుకు 60 కోట్లతో నిర్మాణాలు విశాఖ పోర్ట్ నుంచి ఎన్‌హెచ్ 16కు 4.15 కిలోమీటర్ల పరిధిలో 100 కోట్లతో నిర్మించిన నాలుగు లేన్ల రహ దారిని జాతికి అంకితం చేశారు. -
నీటి సంక్షోభం: నీతి ఆయోగ్ సంచలన నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడిన వ్యవస్థ నీతి ఆయోగ్ (నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా) సంచలన నివేదికనువిడుదల చేసింది. భారతదేశం అత్యంత ఘోరమైన నీటి సంక్షోభంతో బాధపడుతోందని వ్యాఖ్యానించింది. దాదాపు 60 కోట్లమంది తీవ్ర నీటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సురక్షితమైన నీటికి నోచుకోక ప్రతి ఏటా సుమారు 2 లక్షల మంది మరణిస్తున్నారంటూ నితీ ఆయోగ్ కాంపోజిట్ వాటర్ మేనేజ్ మెంట్ ఇండెక్స్ (సీడబ్ల్యూఎంఐ) పేరిట గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడించింది. అంతేకాదు భారత చరిత్రలో ఎన్నడూ లేనంత నీటి కొరత సమీప భవిష్యత్తులో రానుందని, కోట్లాది మంది ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని నీతి ఆయోగ్ హెచ్చరించింది. 2030 నాటికి నీటి కష్టాలు తీవ్ర రూపం దాలుస్తాయని అంచనా వేసింది. నీటి వనరుల రక్షణ, వాడుకపై అవగాహన పెంచుకోవాల్సిన తక్షణ సమయమిదని నొక్కి చెప్పింది. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో భూగర్భ జల వనరులు కనిపించని పరిస్థితి రానుందని నీటి వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విడుదల చేసిన నీతి ఆయోగ్ నివేదికలో తెలిపారు. నీటి నిర్వహణ చాలా పెద్ద సమస్యగా ఉందని, అయితే వ్యవసాయ రంగాలలో కొన్నిరాష్ట్రాలు మంచి ఫలితాలు సాధించాయని గడ్కరీ అన్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం మరియు నీటి నిర్వహణ సమస్యను పరిష్కరించేందుకు , ఢిల్లీ ముఖ్యమంత్రితో సమావేశంకానున్నామని ఆయన చెప్పారు. 2030 నాటికి దేశంలో నీటి సరఫరాకు డిమాండ్ రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు. దేశం జీడీపీ 6 శాతం నష్టపోతుందని పేర్కొన్నారు. అయితే 2015-16 పరిస్థితులతో పోలిస్తే, 2016-17 సంవత్సరానికిగాను నీటి నిర్వహణ విషయంలో గుజరాత్ ముందు వరుసలో ఉందనీ, ఆ తరువాత మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు సమర్థవంతంగా పని చేస్తున్నాయని పేర్కొంది. మరోవైపు జార్ఖండ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని నీతి ఆయోగ్ పేర్కొంది. హిమాలయ రాష్ట్రాల విషయానికి వస్తే, త్రిపురలో నీటి లభ్యత బాగుందని, ఆపై హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అసోం రాష్ట్రాలున్నాయని తెలిపింది. నీటి కొరతకు ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభేదాలు కూడా కారణం అవుతున్నాయని, ముఖ్యమైన ప్రాజెక్టులు, నీటి పంపకాల విషయంలో ఉన్న అడ్డంకులు తొలగాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కల్పించుకోవాలని సూచించింది. స్వతంత్ర సంస్థల నివేదికను ఉదాహరించిన నీతి ఆయోగ్ దేశంలో దాదాపు 70 శాతం నీరు కలుషితమైందని, నీటి నాణ్యత సూచికలో 122 దేశాలలో భారత దేశం 120 వ స్థానంలో ఉందని నీతి అయోగ్ తన నివేదికలో పేర్కొంది. -
సల్మాన్ ఖాన్‌ను కలిసిన కేంద్ర మంత్రి
సాక్షి, ముంబై : ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ ప్రచారంలో భాగంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీం ఖాన్‌ను కలిశారు. ఈ సందర్భంగా బాంద్రాలోని సల్మాన్ నివాసానికి (గెలాక్సీ) వెళ్లిన గడ్కరీ నాలుగేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించే కరపత్రాలను సలీం ఖాన్‌కు అందజేశారు. 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశానికి నితిన్ గడ్కరీతో పాటు ముంబై బీజేపీ సీనియర్ నేత రాజ్ పురోహిత్ కూడా హాజరయ్యారు. ‘సంపర్క్ ఫర్ సమర్థన్‌లో భాగంగా శ్రీ సలీం ఖాన్, సల్మాన్ ఖాన్‌లను కలిశాను. నాలుగేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి చర్చించామంటూ’ సల్మాన్ ఖాన్‌ను కలిసిన సందర్భంగా..నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. అయితే గడ్కరీ ట్వీట్‌ను లైక్ చేసిన సల్మాన్, సలీం ఖాన్లు ఎటువంటి కామెంట్లు చేయలేదు. కాగా ఎన్డీయే పాలనకు నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీజేపీ ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 4 వేల మంది పార్టీ ప్రముఖులు.. వివిధ రంగాల్లో విజయవంతమైన వ్యక్తులుగా పేరు పొందిన లక్ష మందిని కలవడం లక్ష్యంగా పెట్టుకున్నారు. Met Sri Salim Khan ji & Salman Khan as part of "Sampark For Samarthan" campaign. Have discussed the achievement and initiative of Modi govt in last 4 years . pic.twitter.com/8gBSgNKZ89 — Nitin Gadkari (@nitin_gadkari) June 8, 2018 -
సమాజ శ్రేయస్సే మీడియా లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: సమాజ శ్రేయస్సు, భావి తరాల ప్రగతి మీడియాకు అంతిమ లక్ష్యంగా ఉండాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆకాం క్షించారు. ప్రముఖ వ్యాపారవేత్త సి.ఎల్. రాజం ఆధ్వర్యంలో ప్రారంభమవుతున్న ‘విజయక్రాంతి’దినపత్రికను హైదరాబాద్‌లో ని ఒక హోటల్లో శనివారం ఆయన ఆవిష్క రించారు. కార్యక్రమంలో గడ్కరీ సతీమణి కాంచన గడ్కరీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారా యణ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు రమణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. నితిన్ గడ్కరీ మాట్లాడుతూ విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, సాంకేతికరంగం వంటి ఎన్నో అంశాల్లో అభివృద్ధికి మీడియా పనిచే యాల్సి ఉందన్నారు. రాజకీయాలు ఒక్కటే మీడియా లక్ష్యం కాకూడదని, మిగిలిన చాలా అంశాల్లో ప్రగతి కోసం కృషి చేయాలన్నారు. ప్రజాస్వామిక స్ఫూర్తిని కాపాడటానికి నిర్భయంగా, నిష్పక్షపాతంగా కొత్తపత్రిక వార్తలు రాయాలని కోరారు. పత్రికల ముడి సరుకు విదేశాల నుంచి దిగుమతి అవుతోంద న్నారు. దీనివల్ల దేశీయ మారకం విదేశాలకు తరలిపోవడంతోపాటు పత్రిక నిర్వహణ ఆర్థికభారంగా మారుతోందన్నారు. అనుకూలంగా రాసినవారికే ప్రకటనలు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ చిన్న రాష్ట్రం లో ఇప్పటివరకు సుమారు రూ.వెయ్యి కోట్లు పబ్లిసిటీకి ఖర్చు పెట్టిందన్నారు. సీఎం కేసీఆర్ అనుకూలంగా రాసిన వారికి ప్రభుత్వ ప్రకటనలిస్తూ, ఇవ్వనివారిని బెదిరిస్తూ అప్రజాస్వామిక చర్యలకు దిగారని ఆరోపిం చారు. అధికారంలో ఉన్నవారి బెదిరింపులకు మీడియా కూడా అనివార్యంగా లొంగిపోయి, ఏకపక్షంగా వార్తలు రాయాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మీడియాపై నిర్బంధం తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ మీడియాపై తీవ్రమైన నిర్బంధం తెలంగాణ రాష్ట్రంలోనే చూస్తున్నామన్నారు. ప్రభుత్వ ప్రకటనలను నిలిపేయడం, ఇతర బెదిరింపులతో మీడియాను ముఖ్యమంత్రి కార్యాలయం నియంత్రిస్తోందని ఆరోపించారు. ఏ పత్రికలో ఏ వార్త రాయాలో ముఖ్యమంత్రి కార్యాల యమే ఆదేశిస్తోందని కోదండరాం ఆరోపించారు. విజయక్రాంతి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సి.ఎల్.రాజం మాట్లాడుతూ రాజకీయ పార్టీల కోసం కాకుండా ప్రజలు, ప్రజల కోసం పనిచేసే నాయకుల అండతో పత్రికను నడిపిస్తానని రాజం ప్రకటించారు. -
నంబర్ ప్లేట్లతోపాటే కొత్త కార్లు: గడ్కారీ
న్యూఢిల్లీ: కొత్తగా మార్కెట్లోకి వచ్చే నాలుగు చక్రాల వాహనాలకు త్వరలో నంబర్ ప్లేట్లు బిగించి వస్తాయని, వాటికయ్యే ఖర్చును కలుపుకునే వాహనం ధరలు ఉంటాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. ‘ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు వాహన తయారీదారులే నంబర్ ప్లేట్లను బిగించి ఇస్తారు. తర్వాత ప్రత్యేక యంత్రంతో వాటిపై నంబర్‌ను నమోదు చేస్తారు’ అని గడ్కారీ తెలిపారు. ‘తాజా నిర్ణయంతో వినియోగదారులకు ఉపశమనం కలుగుతుంది. అలాగే అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధానం అమలయ్యేందుకు వీలు కలుగుతుంది’అని వివరించారు. అధికారిక రిజిస్ట్రేషన్ నంబర్‌తో కూడిన ప్లేట్లను ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లోని జిల్లా స్థాయి ప్రాంతీయ రవాణా కార్యాలయాలు అందజేస్తున్నాయి. ఒక్కో నంబర్ ప్లేట్‌కు రాష్ట్రాలు వేలల్లో వసూలు చేస్తున్నాయని గడ్కారీ పేర్కొన్నారు. -
హజారే డిమాండ్లకు అంగీకరించిన కేంద్రం
-
హజారే డిమాండ్లకు కేంద్రం ఓకే
న్యూఢిల్లీ: ఆమరణ దీక్ష చేస్తున్న అన్నా హజారే డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్రం అంగీకరించింది. లోక్‌పాల్ ఏర్పాటు సహా 11 డిమాండ్లపై స్పష్టత ఇచ్చినందున ఆమరణ దీక్షను విరమించాలని కోరింది. సోమవారం మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పక్షాన ఢిల్లీలో దీక్ష చేస్తున్న హజారేను కలిసి చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘హజారేతో జరిగిన చర్చల్లో ఆయన డిమాండ్లను అంగీకరిస్తామని చెప్పాం. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ఈ విషయంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో చాలా అంశాలను పేర్కొన్నాం. మంగళవారం హజారే దీక్ష విరమిస్తారని అనుకుంటున్నాం’ అని మహాజన్ తెలిపారు. -
కావేరికి నీరిస్తాం
సాక్షి, బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌లో 60 వేల కోట్ల రూపాయలతో పోలవరం ఆనకట్టను నిర్మించడం ద్వారా గోదావరి ఉప నది అయిన ఇంద్రావతిలో ప్రవాహానికి అడ్డుకట్ట వేయనున్నామని జల వనరుల శాఖ మంత్రి గడ్కారీ చెప్పారు. ఆ తర్వాత 1,300 కిలో మీటర్ల పైపులైను నిర్మించి 450 టీఎంసీల నీటిని తమిళనాడు చివరి వరకు తీసుకెళ్లొచ్చన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) బెంగళూరులో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన ప్రసంగించారు. గోదావరిని, కృష్ణా, పెన్నా నదుల మీదుగా కావేరితో అనుసంధానం చేయడం ద్వారా కర్ణాటక రాష్ట్రానికి కూడా తాగు, సాగు నీరు అందించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామనీ, త్వరలోనే నదుల అనుసంధాన ప్రక్రియ ప్రారంభమవుతుందని గడ్కారీ పేర్కొన్నారు. భారత్ నుంచి పాకిస్తాన్లోకి ప్రవహిస్తున్న నదుల్లోని జలాలను వాడుకోవడం ద్వారా పంజాబ్, హరియాణ, రాజస్తాన్ రాష్ట్రాల్లో నీటి సమస్యను తీర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు గడ్కారీ చెప్పారు. -
ఐ యామ్ వెరీ సారీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన మరో ఇద్దరు ప్రత్యర్థులకు తాజాగా క్షమాపణలు చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా, ఆధారాల్లేకుండా ఆరోపణలు చేశాననీ, తనను క్షమించాలని కోరుతూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ కొడుకు అమిత్ సిబల్‌లకు ఆయన లేఖలు రాశారు. దేశంలోనే తొలి 20 మంది అత్యంత అవినీతిపరుల్లో గడ్కారీ ఒకరంటూ గతంలో కేజ్రీవాల్ ఓ జాబితాను ప్రచురించారు. అమిత్ సిబల్పై కూడా అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో వారు కేజ్రీవాల్‌పై వేర్వేరుగా పరువునష్టం కేసులు వేయగా ప్రస్తుతం విచారణ నడుస్తోంది. కేజ్రీవాల్ క్షమాపణ లేఖలను ఆయన తరఫు న్యాయవాదులు సోమవారం అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌కు సమర్పించారు. అమిత్ సిబల్‌కు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా క్షమాపణలు చెప్పారు. అనంతరం పరువునష్టం కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు గడ్కారీ, కేజ్రీవాల్ సంయుక్తంగా ఒక దరఖాస్తును, కేజ్రీవాల్, అమిత్ సిబల్‌లు మరో దరఖాస్తును కోర్టుకు సమర్పించారు. దీంతో ఈ రెండు కేసుల నుంచి కేజ్రీవాల్‌కు కోర్టు విముక్తి కల్పించింది. కాగా, కోర్టు కేసుల నుంచి బయటపడటానికి కేజ్రీవాల్ న్యాయవాదులు అమలు చేస్తున్న వ్యూహం ఇదని విశ్లేషకులు అంటున్నారు. సిసోడియా మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేయాల్సిన సమయాన్ని అహంభావంతో కోర్టుల చుట్టూ తిరిగి వృథా చేయకూడదనే ఉద్దేశంతోనే క్షమాపణలు చెప్పామన్నారు. ‘మా వ్యాఖ్యలతో ఎవరైనా బాధకు గురైతే మేం క్షమాపణలు చెప్తాం. అహంకారంతో దాన్ని వైరంగా మార్చం. ప్రజల కోసం పనిచేయడానికి మేం ఇక్కడున్నాం. కోర్టుల చుట్టూ తిరగడానికి కాదు’ అని ఆయన అన్నారు. మరోవైపు తనపై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వేసిన రెండో పరువునష్టం కేసును కేజ్రీవాల్ కోర్టులో వ్యతిరేకించారు. కేజ్రీవాల్ సూచనల మేరకే ఆయన న్యాయవాది రాం జెఠ్మలానీ తనను అభ్యంతరకర పదాలతో దూషించాడంటూ జైట్లీ ఈ కేసు వేశారు. మూడు పోయి.. మరో 30 ఉన్నాయి కేజ్రీవాల్‌పై ఇంకా 30 పరువునష్టం కేసులున్నాయి. శిరోమణి అకాలీదళ్ నేత విక్రమ్ సింగ్ మజీథియాకు మాదక ద్రవ్యాల ముఠాతో సంబంధాలు ఉన్నాయని కేజ్రీవాల్ ఆరోపించడంతో ఆయన పరువునష్టం కేసు వేయడం, ఇటీవలే ఆయనకూ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పి కేసును ఉపసంహరించుకునేలా చేయడం తెలిసిందే. కేజ్రీవాల్ వైఖరిని ఆప్ నేతలే కొందరు వ్యతిరేకిస్తున్నారు. కేజ్రీవాల్ క్షమాపణ కోరడంతో ఆప్ పంజాబ్ చీఫ్ పదవికి ఎంపీ భగవంత్ మన్ రాజీనామా కూడా చేశారు. గడ్కారీ, సిబల్‌లకు కేజ్రీ క్షమాపణ చెప్పడంతో మరో రెండు కేసుల నుంచి ఆయన బయటపడనున్నారు.అయినా మరో 30 పరువునష్టం కేసులు ఆయనపై ఉన్నాయి. ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? 20 మంది అత్యంత అవినీతిపరుల జాబితాను ప్రచురించిన కేజ్రీవాల్ ఇప్పుడు ఎందుకు వెనక్కు జారుకుంటున్నారని ఆప్ మాజీ నాయకురాలు అంజలీ దమానియా ప్రశ్నించారు. గడ్కారీ అవినీతిపరుడే అనేందుకు తన వద్ద ఉన్న ఆధారాలను అప్పుడే కేజ్రీవాల్‌కు ఇచ్చాననీ, అవినీతిపరులకు శిక్ష పడేలా చేయకుండా ఆయన ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారన్నారు. అంజలీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ తరఫున గడ్కారీపై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2015లో పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తిన సమయంలో ఆమె ఆప్‌ను వీడారు. -
20 ఏళ్లకు పైబడిన వాహనాలకు నో ఎంట్రీ!
న్యూఢిల్లీ: 20 ఏళ్లకు పైబడిన వాణిజ్య వాహనాలను తప్పనిసరిగా వినియోగం నుంచి తప్పించడానికి ఉద్దేశించిన విధానానికి ప్రధాని కార్యాలయం(పీఎంఓ) సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ విధానం 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ‘వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ తుది దశకు చేరుకుందని రవాణా మంత్రి గడ్కరీ గతంలో చెప్పారు. ప్రధాని మోదీ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పీఎంఓలో జరిగిన భేటీలో ఈ విధానానికి సూత్రప్రాయంగా ఆమోదం లభించినట్లు సీనియర్ అధికారి చెప్పారు. -
నేడు త్రిపుర సీఎం ఎంపిక
అగర్తలా: మంగళవారం జరిగే త్రిపుర బీజేపీ, దాని మిత్రపక్షం ఐపీఎఫ్టీ శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. త్రిపుర సీఎంగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విప్లవ్ దేవ్ పేరు దాదాపుగా ఖరారైనా.. నేడు జరిగే భేటీలో కొత్తగా ఎన్నికైన∙ఎమ్మెల్యేలు ఆయనను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు గడ్కారీ, ఓరంలు పరిశీలకులుగా హాజరవుతారు. ఈనెల 8న నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేస్తుంది. నాగాలాండ్‌లో..: ఎన్నికల భాగ స్వామి ఎన్డీపీపీతో కలిసే నాగా లాండ్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ తెలిపింది. 15 ఏళ్ల పాటు మిత్రపక్షంగా కొనసాగిన నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్)కు మద్దతు ఇవ్వబోమని చెప్పింది. -
త్రిపుర కొత్త సీఎం విప్లవ్!
అగర్తలా: త్రిపుర తదుపరి ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విప్లవ్ కుమార్ దేవ్ నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ–ఐపీఎఫ్టీ (ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర) కూటమి ఎమ్మెల్యేలు మంగళవారం సమావేశమై తమ ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ హాజరవనున్నారు. విప్లవ్ మాట్లాడుతూ ‘నేను ఇంకా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నిక కాలేదు. మాణిక్‌ను కలసి ఆశీర్వాదం తీసుకున్నాను’ అని చెప్పారు. త్రిపురలో పుట్టి పెరిగిన విప్లవ్ తన గ్రాడ్యుయేషన్ అనంతరం ఢిల్లీ వెళ్లి 16 ఏళ్లు ఆరెస్సెస్‌లో పనిచేశారు. అనంతరం 2015లో త్రిపురకు తిరిగొచ్చి బీజేపీలో కీలక బాధ్యతలు చేపట్టారు. 2016లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. గతేడాది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు. విప్లవ్ సీఎంగా ఈనెల 8న ప్రమాణం చేసే అవకాశముంది. మాణిక్ సర్కార్ రాజీనామా శాసనసభ ఎన్నికల్లో ఓడిపోవడంతో త్రిపుర ప్రస్తుత సీఎం మాణిక్ సర్కార్ తన పదవికి రాజీనామా చేశారు. మాణిక్ ఆదివారం గవర్నర్ తథాగత రాయ్‌ని కలసి తన రాజీనామా లేఖను సమర్పించారు. 1998 నుంచీ త్రిపుర సీఎంగా ఉన్న మాణిక్ సర్కార్.. బీజేపీ కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకునే వరకు పదవిలో కొనసాగుతారు. త్రిపురలో 59 స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీ–ఐపీఎఫ్టీ కూటమి 43, సీపీఎం 16 సీట్లు గెలుపొందడం తెలిసిందే. కాగా, మంత్రివర్గంలో తమ పార్టీకి గౌరవనీయమైన ప్రాతినిధ్యం కల్పించాలని బీజేపీని ఐపీఎఫ్టీ కోరింది. బీజేపీ 35 స్థానాల్లో గెలవడంతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే స్థితిలో ఉంది. అటు ఐపీఎఫ్టీ 9 స్థానాల్లో పోటీచేసి 8 చోట్ల గెలిచింది. కాంగ్రెస్‌తో పొత్తుపై పునరాలోచన.. జనవరిలో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశం జరిగినప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ, భవిష్యత్తులో కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తులూ ఉండకూదంటూ పార్టీ శ్రేణులు అప్పట్లో ఓ ముసాయిదా తీర్మానం కూడా చేశాయి. వచ్చే నెలలో సీపీఎం మహాసభలు జరగనున్నాయి. ఇప్పుడు త్రిపురలో ఓటమి నేపథ్యంలో ఆ తీర్మానాన్ని వెనక్కు తీసుకునే అవకాశముంది. ‘కాంగ్రెస్‌తో పొత్తులు, సర్దుబాట్లు ఉండకూడదని గతంలో నిర్ణయించాం. కానీ ఇప్పుడు పునరాలోచించాల్సిన అవసరం ఉంది’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు హన్నన్ మొల్లా చెప్పారు. -
హంపీ సౌందర్యం అద్భుతం
సాక్షి, బళ్లారి : హంపిని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సతీమణి కాంచన గడ్కరి సందర్శించారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె జిందాల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న తర్వాత బళ్లారి లోక్‌సభ మాజీ సభ్యురాలు జె.శాంతతో కలిసి హంపీకి వెళ్లి విరుపాక్షేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పలు పర్యాటక స్థలాలను సందర్శించారు. తర్వాత అంజనాద్రి బెట్టలోని శ్రీఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. ఈసందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. మహిమాన్వితుడైన శ్రీవిరుపాక్షేశ్వర స్వామిని, అంజనాద్రి కొండను దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. హంపి శిల్పకళ అందాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని, అంజనాద్రి కొండ, హంపి పక్కపక్కనే ఉండటం ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా విరాజిల్లేందుకు దోహదం చేశాయని, ఈ రెండు పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు విచ్చేసినట్లు పేర్కొన్నారు. -
పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు పురోగతిపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. పోలవరం అంశంపై నితిన్ గడ్కరీతో శుక్రవారం ఆయన భేటీ అయి వినతిపత్రం ఇచ్చారు. రైల్వే బోర్డు చైర్మన్‌తో వెలగపల్లి భేటీ: కాగా, తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు రైల్వే బోర్డు చైర్మన్ అశ్వనీ లొహానీతో శుక్రవారం భేటీ అయ్యారు. తిరుపతిలో రెండు, సూళ్లూరుపేటలో ఒక సబ్ వేల నిర్మాణంపై విన్నవించారు. -
నవయుగకు ‘పోలవరం’
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనులను నవయుగ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి నామినేషన్ విధానంలో అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను సీఎం చంద్రబాబు సచివాలయంలో మీడియాకు వివరించారు. పోలవరం కాంక్రీట్ పనులను వారం రోజుల్లో నవయుగ సంస్థకు అప్పగిస్తామని తెలిపారు. 2014 స్టాండర్డ్ షెడ్యూల్ రేట్ల(ఎస్ఎస్ఆర్) ప్రకారమే డబ్బులిచ్చేందుకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించారని, కానీ మీడియాలో ఏదేదో రాస్తున్నారని అన్నారు. రూ.33 వేల కోట్ల ఆర్అండ్ఆర్ ప్యాకేజీ బాధ్యత కూడా కేంద్రానిదేనని, అందుకు వారు ఒప్పుకున్నారని చెప్పారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్లు(యూసీ) ఇవ్వడం లేదు కాబట్టే పోలవరం నిధులను కేంద్రం విడుదల చేయడం లేదన్న ప్రశ్నకు బదులిస్తూ.... అడిగే వాడికి సమాధానం చెప్పేవాడు లోకువని, యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఎక్కడ ఇవ్వలేదని ప్రశ్నించారు. అన్ని సమస్యలను అధిగమించి పోలవరం ప్రాజెక్టు పనుల్లో ముందుకు వెళుతున్నామన్నారు. మూడు నెలలు ఆలస్యమైంది కాబట్టి ప్రాజెక్టును 2019 కల్లా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రాజెక్టు పనుల్లో మళ్లీ వేగం పెరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కొందరు ప్రధానికి లేఖలు రాస్తున్నారని, కోర్టులు, ట్రిబ్యునల్‌కు వెళ్లారని విమర్శించారు. వైకుంఠపురం నుంచి నాగార్జునసాగర్ ఎడమ కాలువకు పైపులైన్ వేసి నీరందించే విషయాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. బీసీ కులాలకు, చేతి వృత్తిదారులకు ఏప్రిల్ నుంచి ఆదరణ పథకం ద్వారా ఆధునిక పనిముట్లు పంపిణీకి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. భావనపాడు పోర్టుకు జరిగిన డెవలపర్ ఎంపికలో ఒకే ఒక్క బిడ్ దాఖలు చేసిన అదానీ సంస్థను మంత్రిమండలి ఆమోదించిందన్నారు. విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం లూలూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ప్రైవేటు సంస్థకు అప్పగిస్తున్నట్టు తెలిపారు. మరికొన్ని నిర్ణయాలు... - భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన టెండర్ల రద్దు. - ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు 50 పెంచుతూ గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 151 ద్వారా లబ్ధి పొందకుండా మిగిలిపోయిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను 50 శాతం పెంచుతూ నిర్ణయం. - రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన రెండు డీఏల్లో ఒక్క డీఏను వచ్చే ఏప్రిల్ నుంచి చెల్లించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులకు ఆదేశం. -
పెట్రోల్ ధర తగ్గుతుంది!
ముంబై: పెట్రోల్‌లో 15 శాతం మిథనాల్‌ను కలపడం ద్వారా ఇంధనం ధరను, కాలుష్యాన్ని కూడా తగ్గించే విధానాన్ని తమ ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. ఇందుకు సంబంధించి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తానే ప్రకటన చేస్తానన్నారు. లీటర్ పెట్రోల్ ఖరీదు దాదాపు 80 రూపాయలు ఉంటుండగా, బొగ్గు నుంచి ఉత్పత్తి అయ్యే లీటర్ మిథనాల్ మాత్రం రూ.22కే లభిస్తుందనీ, చైనాలో అయితే ఈ ధర మరీ రూ.17 మాత్రమేనని గడ్కారీ వివరించారు. స్వీడన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ వోల్వో ముంబై కోసం పూర్తిగా మిథనాల్‌తో నడిచే ప్రత్యేక బస్సులను తయారుచేసిందనీ, త్వరలోనే 25 బస్సులను నగరంలో తిప్పేందుకు ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు. మిథనాల్‌ను ముంబైలో ఉన్న స్థానిక పరిశ్రమల నుంచే ఉత్పత్తి చేయవచ్చనీ, వాటి నుంచి వచ్చే ఇంధనాన్నే ఈ బస్సులకు వాడతామన్నారు. పెట్రోలియం శుద్ధి పరిశ్రమలను నిర్మించేందుకు రూ.70 వేల కోట్లు ఖర్చవుతుండగా, మిథనాల్‌పై అయితే ఈ వ్యయం రూ.లక్షన్నర కోట్లుగా ఉంటున్నప్పటికీ...మిథనాల్‌పై దృష్టి పెట్టాల్సిందిగా తాను పెట్రోలియం శాఖ మంత్రికి సూచించానన్నారు. దేశంలో పెరిగిపోతున్న వాహనాల సంఖ్యపై గడ్కారీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాము సగటున రోజుకు 28 కిలో మీటర్ల రహదారులను నిర్మిస్తున్నామనీ, త్వరలోనే దీనిని 40 కిలో మీటర్లకు తీసుకెళ్తామని ఆయన చెప్పారు. 2018లో 20 వేల కిలోమీటర్ల పొడవైన రహదారులను నిర్మిస్తామన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణాలు నెమ్మదిగా సాగుతున్నాయనీ, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ‘జాతీయ రహదారుల, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ’ (ఎన్హెచ్ఐడీసీఎల్–నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్)ను స్థాపించామని ఆయన చెప్పారు. -
గోదావరి–కావేరీ నదుల అనుసంధానం
చెన్నై: నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని, గోదావరి మిగులు జలాల్ని కావేరీకి తరలించేందుకు ప్రణాళిక రూపకల్పన కోసం ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. గోదావరి–కావేరీ నదుల అనుసంధానానికి జల వనరుల శాఖ కృషి చేస్తోందని, ఇది కార్యరూపం దాల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో నీటి కొరత తీరుతుందని పేర్కొన్నారు. ‘మిగులు జలాల్ని గోదావరి నది నుంచి కృష్ణకు, అక్కడి నుంచి పెన్నా.. చివరకు కావేరీకి తరలించాలని జల వనరుల శాఖ నిర్ణయించింది’ అని చెన్నైలో గడ్కారీ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రాల ఆందోళనలపై చర్చిస్తున్నామని, సమీప భవిష్యత్తులో నిర్ధిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వస్తామని ఆయన చెప్పారు. ‘తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి, వారి అనుమతితో ప్రణాళికను ఖరారు చేస్తాం. ఈ ప్రాజెక్టుల్ని జాతీయ ప్రాజెక్టులుగా పరిగణిస్తాం. 90 శాతం ఖర్చు కేంద్ర ప్రభుత్వం, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి’ అని తెలిపారు. మొదటి ప్రాజెక్టులో భాగంగా 300 టీఎంసీల గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ డ్యాం ద్వారా కృష్ణాకు మళ్లిస్తారు. అక్కడి నుంచి పెన్నా నదిపై ఉన్న సోమశిల ప్రాజెక్టుకు.. అనంతరం కావేరీ నది పరివాహకంలోని గ్రాండ్ ఆనకట్టుకు మళ్లిస్తారు. కాల్వల ద్వారా కాకుండా స్టీలు పైపుల ద్వారా నీటిని తరలిస్తాయని గడ్కారీ వెల్లడించారు. మొదటి దశలో 100 టీఎంసీల నీరు కావేరీకి వెళ్తుందని, ఈ ప్రాజెక్టు ద్వారా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు లబ్ధిపొందుతాయని తెలిపారు. రెండో ప్రాజెక్టులో భాగంగా ఇంద్రావతి నది నుంచి నీటిని నాగార్జున సాగర్ డ్యాంకు తరలిస్తాం. అక్కడి నుంచి సోమశిల ప్రాజెక్టుకు మళ్లించి అనంతరం కర్ణాటకతో సంబంధం లేకుండా కావేరీకి నీటిని తరలిస్తాం’ అని గడ్కారీ వెల్లడించారు. అలాగే చెన్నై – బెంగళూరుల మధ్య రూ. 20 వేల కోట్లతో ఎక్స్‌ప్రెస్ వేను నిర్మిస్తామని చెప్పారు. తమిళనాడులోని తాంబరం–చెంగల్పట్టు మధ్య రూ. 2,250 కోట్లు, పూనామలీ నుంచి మదురవొయల్ మధ్య రూ. 1500 కోట్లతో, చెన్నై– ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు మధ్య రూ. 1000 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. -
రాష్ట్ర పురోగతికి గుర్తింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక రంగం, స్వచ్ఛతలో పురోగతికి గుర్తింపుగా రాష్ట్రానికి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. ఇండియా టుడే ఏటా నిర్వహిస్తున్న స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ కాన్క్లేవ్–2017 సదస్సు గురువారం ఢిల్లీలో జరిగింది. ఆర్థిక, స్వచ్ఛత రంగాల్లో పురోగతికి రాష్ట్రానికి రెండు బెస్ట్ పెర్ఫార్మింగ్ లార్జ్ స్టేట్ అవార్డులు ప్రదానం చేసింది. ఈ అవార్డులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా మంత్రులు కేటీఆర్, జోగు రామన్న అందుకున్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో సాధిస్తున్న పురోగతికి గుర్తింపుగా గత మూడేళ్లుగా ఇండియా టుడే అవార్డులు అందుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మొదటి ఏడాది రాష్ట్రంలో మౌలిక సదుపాయాల వృద్ధికి, రెండో ఏడాది సమ్మిళిత వృద్ధికి, ఈ ఏడాది ఆర్థిక, స్వచ్ఛత రంగాల్లో పురోగతికి అవార్డులు దక్కడం హర్షణీయమన్నారు. జీడీపీ వృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. జోగు రామన్న మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు రాష్ట్రంలో 34 కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపారు. తెలంగాణను హరిత హారంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వివేక్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి రామచంద్ర తెజావత్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ హోదా ఇవ్వండి.. ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినట్లే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఏదో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర మంత్రి గడ్కరీని మంత్రి కేటీఆర్ కోరారు. అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా కేటీఆర్ రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రతిపాదనలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో రోడ్ల విస్తరణకు, రహదారుల నిర్మాణాలకు సహకరిస్తున్నందుకు గడ్కరీకి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆర్సీ అరవింద్ కుమార్ గురువారం మలేసియా ఆర్థిక వ్యవహారాల మంత్రి ఇక్బాల్ మహ్మద్‌నూర్ నేతృత్వంలోని బృందంతో ఢిల్లీలో సమావేశమై చర్చలు జరిపారు. -
నీటి ప్రాజెక్టులకు వేగంగా అనుమతులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలు చేపట్టే సాగునీటి ప్రాజెక్టులకు వేగంగా అనుమతులివ్వాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విన్నవించారు. లేకపోతే ఆర్థిక భారం పెరుగుతోందని, అంతిమంగా ప్రజలకు నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో అమలవుతున్న ప్రాజెక్టులపై గడ్కరీ మంగళవారం ఢిల్లీలో సమీక్షించారు. సమీక్షలో తెలంగాణలో ఏఐబీపీ కింద ఉన్న 11 ప్రాజెక్టుల తాజా స్థితిని హరీశ్‌రావు వివరించారు. ఈ ఏడాది ఆయా ప్రాజెక్టులకు కేంద్రం ఇవ్వాల్సిన రూ.651 కోట్ల సాయం విడుదల చేయాలని కోరారు. నిర్మాణం చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసేలా ప్రాధాన్యమివ్వాలని, ఎక్కువ ఆయకట్టుకు నీరివ్వాలంటే నిధుల విడుదల ప్రాధాన్యాంశమని పేర్కొన్నారు. పలు ప్రాజెక్టులకు రావాల్సిన అనుమతుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథకు కేంద్రం తరఫున నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశానికి ముందు కేంద్ర అటవీ శాఖ మంత్రి హర్షవర్దన్‌ను కలసి పాలమూరు, కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల మంజూరులో వేగం పెంచాలని కోరారు. గడ్కరీతో సమావేశం అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ ‘ఏఐబీపీ పథకం కింద కేంద్రం తెలంగాణలో 11 ప్రాజెక్టులకు సాయం చేస్తోంది. వీటికి రావాల్సిన పెండింగ్ నిధులను ఇవ్వాలని కోరాం. ఈ విషయంలో గడ్కరీ సీడబ్ల్యూసీ అధికారులకు తగిన సూచనలు చేశారు. పెండింగ్ అనుమతులను క్లియర్ చేయాలని సూచించారు’ అని వివరించారు. రెండు రాష్ట్రాలతో సమావేశం.. కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులను పిలిపించి పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి చెప్పినట్లు హరీశ్‌రావు తెలిపారు. జలవనరుల శాఖ కార్యదర్శి కూడా ఆ సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. వివిధ ప్రాజెక్టుల క్లియరెన్స్ వేగవంతం చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. అటవీ, పర్యావరణ క్లియరెన్స్‌లకు సంబంధించి కేంద్రం ఓ కమిటీని వేసినట్లు వెల్లడించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే కేంద్రం దృష్టికి తీసుకురావాలని సూచించినట్లు హరీశ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తామని గడ్కరీ చెప్పినట్లు తెలిపారు. రాజకీయ కారణాలతో ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని మంత్రికి వివరించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో ఆత్మహత్యలు తగ్గించడానికి ప్రాజెక్టు క్లియరెన్సులు త్వరితగతిన ఇవ్వాలని కోరగా.. గడ్కరీ సానుకూలంగా స్పందించారని వివరించారు. ఉప రాష్ట్రపతితో భేటీ.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో మంత్రి హరీశ్‌రావు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బీబీ పాటిల్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలసి వెంకయ్యను అయన అధికారిక నివాసంలో కలిశారు. వెంకయ్యకు ఇటీవల యాంజియోప్లాస్టీ జరగడంతో ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. -
రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ. లక్ష కోట్లు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రూ.లక్ష కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర ఉపరితల రవాణా, జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. జాతీయ అంతర్గత జలమార్గాల నిర్మాణంతో దేశం రూపురేఖలు మారిపోతాయని, ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నదిలో రూ.7,015 కోట్లతో జాతీయ అంతర్గత జలమార్గం4 నిర్మిస్తామన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుతో కలసి రాష్ట్రంలో రూ.1,614.03 కోట్ల వ్యయంతో.. 381.9 కి.మీల పొడవున అభివృద్ధి చేసిన ఏడు జాతీయ రహదారులను రిమోట్ ద్వారా జాతికి అంకితం చేశారు. రూ.2,539.08 కోట్లతో 250.45 కి.మీ. పొడవున చేపట్టిన మరో ఆరు జాతీయ రహదారుల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే, కృష్ణా నదిలో జాతీయ అంతర్గత జలమార్గం4 నిర్మాణంలో భాగంగా తొలిదశ కింద రూ.96 కోట్లతో చేపట్టిన విజయవాడముక్త్యాల జలమార్గం పనులకూ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలోను, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టును సందర్శించాక అక్కడి మీడియాతోనూ నితిన్ గడ్కరీ మాట్లాడారు. పోలవరం పూర్తికి కృషి వచ్చే ఎన్నికల్లోగా పోల వరం ప్రాజెక్టు పూర్తికావడం కష్టమేనని.. అయినా, పూర్తిచేయడానికి శాయశక్తులా కృషిచేస్తామని గడ్కరీ తెలిపారు. 2018 డిసెంబర్ తర్వాత 3,4 నెలల్లో పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. లాజిస్టిక్ హబ్‌గా ఏపీ : చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... ముక్త్యాలవిజయవాడ జలమార్గానికి శంకుస్థాపన చేయడం చారిత్రాత్మకమన్నారు. ఇది పూర్తయితే ఆగ్నేయాసియా ఖండానికి ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ హబ్ అవుతుందన్నారు. బీజేపీ నేతలతో గడ్కరీ భేటీ రద్దు రాష్ట్ర పర్యటనలో భాగంగా బీజేపీ నేతలతో జరగాల్సిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ భేటీ చివరి నిమిషంలో రద్దయింది. సమయాభావంవల్ల మంత్రి కార్యక్రమం రద్దయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 10న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 10న రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడి సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుం దని ప్రభుత్వ సీఎస్ దినేశ్ కుమార్ తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమా వేశంలో పలు సంస్థలకు భూముల కేటాయిం పు తదితర అంశాలు ఎజెండాకు రానున్నాయి. -
నేను నిత్య విద్యార్థిని: సీఎం చంద్రబాబు
సాక్షి, న్యూఢిల్లీ, అమరావతి: నిరంతరం విద్యార్థిగా ఉండడం ద్వారా అద్భుతాలు సాధించవచ్చని, తాను ఇప్పటికీ నిత్య విద్యార్థినేనని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సోమవారం ఆయన ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో సీనియర్ ఐఏఎస్ అధికారుల మిడ్ టర్మ్ కెరీర్ శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. తాను సమాజం, సామాన్యులు, అధికారుల నుంచి నేర్చుకుంటానని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో అధికారులే భవిష్యత్తు నాయకులన్నారు. ‘మానవ వనరులు, ఆంగ్ల భాష మాట్లాడే జనాభా, ఐటీ లాంటి మూడు రకాల అనుకూలతలు భారత్ సొంతం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురు ఐటీ ఉద్యోగుల్లో ఒకరు భారతీయులే. వీరిలో ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారై ఉంటారు’ అని సీఎం చెప్పారు. టెక్నాలజీ వినియోగంపై వ్యవస్థలు ఆధారపడి పనిచేస్తున్నాయని, సాంకేతికతను మరింతగా వినియోగించేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందని తెలిపారు. హెదరాబాద్‌ను బ్రౌన్ ఫీల్డ్ నగరంగా అభివృద్ధి చేశానని, ఇప్పుడు అమరావతిని కొత్తగా నిర్మిస్తున్నానని చెప్పారు.కాగా సీఎం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికిచెందిన ప్రాజెక్టుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. -
వాహనాల్లో ఫ్లెక్సీ ఇంజన్లు
సాక్షి, హైదరాబాద్: ‘పూర్తిగా మిథనాల్, తక్కువ మోతాదులో పెట్రోల్ ఉండి ఇతర పర్యావరణ హిత చమురుతో కలసి నడిచేలా వాహనాల్లో ఫ్లెక్సీ ఇంజన్లు ఏర్పాటు చేసే పరిజ్ఞానం కోసం ప్రయత్నిస్తున్నాం. ఆ ఇంజన్లతో కూడిన వాహనాలు వస్తే దేశంలో వాహన కాలుష్యం తగ్గుముఖం పడుతుంది. మిథనాల్ తయారీకి వ్యవసాయ ఉత్పత్తుల వ్యర్థాలను వాడటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఇది పట్టణాలకు వచ్చే వలసలను నియంత్రించేం దుకు సహకరిస్తుంది’అని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ బిజినెస్ స్కూల్లో జరుగుతున్న ‘ఐఎస్బీ లీడర్షిప్ సమ్మిట్–2017’లో భాగంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో గడ్కరీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జీడీపీలో వ్యవసాయరంగం వాటా 20 శాతానికి మించేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అది జరిగితే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగి పట్టణ ప్రాంతాల వలసలు భారీగా తగ్గుతాయని చెప్పారు. ఆటోమొబైల్ రంగానికి వ్యతిరేకం కాదు 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలను వాడే దేశాల్లో భారత్ స్థానం దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నామని, ఇందుకు ఓ పాలసీని రూపొందించే ఏర్పాట్లలో ఉన్నామని చెప్పారు. ‘మేము సాధారణ వాహనాలకు వ్యతిరేకం కాదు. ప్రస్తుతం దేశ ఆటోమొబైల్ పరిశ్రమ సాలీనా రూ.లక్షన్నర కోట్ల ఎగుమతులు జరుపుతోంది. దీన్ని కొనసాగించాలనే మేం చెప్తున్నాం. అయితే, సమస్యల్లా వాహన కాలుష్యం పెరిగిపోవటమే. అందుకే కాలుష్య రహిత వాహనాల తయారీవైపు మళ్లాల్సిందిగా ఆ పరిశ్రమకు సూచిస్తున్నాం. అందుకే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వైపు అడుగులు వేస్తున్నాం. ఇందులో తొలుత ప్రజారవాణాకు ప్రాధాన్యమిస్తాం’అని ఆయన స్పష్టం చేశారు. బ్లాక్స్పాట్ల గుర్తింపునకు కమిటీలు.. దేశంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందు కు కృషి చేస్తున్నామని, ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్స్పాట్లను గుర్తించి తొలగించేందుకు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు గడ్కరీ వెల్లడించారు. స్థానిక ఎంపీ అధ్యక్షుడిగా ఉండే ఈ కమిటీలో ఆ జిల్లా ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారని, జిల్లా కలెక్టర్ కార్యదర్శిగా కొనసాగుతారన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పరిశీలించి వాటి తొలగింపునకు ఈ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు. 2019 నాటికి బ్లాక్‌స్పాట్ ప్రమాదాలను 50 శాతానికి తగ్గించే ప్రణాళికతో పనిచేస్తున్నామని, బ్లాక్స్పాట్ల నివారణకు రూ.12 వేల కోట్లతో పనులు చేస్తున్నామని చెప్పారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కూడా అవసరమన్నారు. ప్రస్తుతం తాము రూ.6.55 లక్షల కోట్ల విలువైన పనులకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు వెల్లడించారు. అందరిలోనూ సంతోషం నింపాలి ‘మీరు గొప్ప చదువు చదువు తున్నారు. భవిష్యత్తులో కంపెనీలకు అధిపతులుగా, సంస్థల్లో ముఖ్య భూమిక పోషించే పాత్రలో ఉంటారు. అది మాత్రమే చాలనుకుంటే పొరపాటు. పేదలు పైకి ఎదిగేందుకు మీ వంతుగా ప్రయత్నించాలి. ఓ గెలుపుతో మీరు సంతోషంగా ఉంటే చాలదు. మీ చుట్టూ ఉన్నవారిలోనూ సంతోషాన్ని నింపినప్పుడే అసలైన గెలుపు అనిపించుకుంటుంది’అని ఐఎస్బీ విద్యార్థులకు హితబోధ చేశారు. గొప్ప సంకల్పం, దాన్ని సాధించుకునే పట్టుదల, క్రమశిక్షణ, కార్యదీక్ష, సమయపాలన ప్రాధాన్యం గుర్తించాలని విద్యార్థులకు సూచించారు. కాగా, ఐఎస్బీకి వచ్చిన గడ్కరీతో బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి ఆదివారం సాయంత్రం భేటీ అయ్యారు. -
మా ఉద్యోగాలను కాపాడండి!
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన మరింత పెరిగింది. తమ ఉద్యోగాలను రక్షించాలని కోరుతూ ఎయిర్ ఇండియా ఉద్యోగులు శుక్రవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ప్రైవేటీకరణకు బదుకులుగా సంస్థను యథాతథంగా నడపడానికి అనుమతించాలని ఎయిర్ ఇండియా ఉద్యోగుల సంఘం (ఎఐయుఇ) విజ్ఞప్తి చేసింది. ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించుకునే వ్యూహంలో భాగంగా ఏర్పాటు చేసిన కేంద్ర క్యాబినెట్ మంత్రుల బృందంలో రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియాకు చెందిన నాన్-టెక్నికల్ సిబ్బంది కేంద్రమంత్రికి ఒక మొమోరాండం సమర్పించారు. సంస్థ అప్పులను ప్రభుత్వం మాఫీ చేసి, ప్రైవేటీకరణ యోచనను మానుకోవాలని, లేని పక్షంలో తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని వేడుకున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత శాశ్వత ఉద్యోగుల భవితవ్యం, ఉద్యోగ భద్రత, వైద్య, ప్రావిడెంట్ ఫండ్, గ్యారేజీలు, సిబ్బంది రవాణా, క్యాంటీన్‌లాంటి సంక్షేమ సౌకర్యాలు తదితర డిమాండ్లతో కూడిన లేఖను ఆయనకి సమర్పించారు. అలాగే తమ పాత బకాయిలను పూర్తిగా చెల్లించాలని కోరారు. కాగా రూ.50వేల కోట్ల రుణ భారంలో కూరుకుపోయిన జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ వాటా విక్రయానికి కేంద్రం నిర్ణయించింది. ఇందుకు ఇద్దరు ఆర్థిక సలహాదారులు, ఒక న్యాయ సలహాదారు నియామకానికి సంబంధించి బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. -
ఆ కార్లతో ఉద్యోగాలు పోతాయా?
న్యూఢిల్లీ: గత ఏప్రిల్ నెలలో ‘జనరల్ మోటార్స్’ను కూడా అధిగమించిన అమెరికా కార్ల కంపెనీ ‘తెల్సా’ డ్రైవర్ రహిత కార్ల సాంకేతిక పరిజ్ఞానంలో వేగంగా దూసుకుపోతోంది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయోగాలు నిర్వహిస్తున్న డెయిమ్లర్, డైటర్, జట్చే, గూగుల్, ఆపిల్ కంపెనీల కన్నా తెల్సా ఎంతో ముందుంది. అయినప్పటికీ బొత్తిగా డ్రైవర్ అవసరం లేకుండా పూర్తిగా దానంతట అదే నడిచే కార్లు వినియోగదారుడి వద్దకు చేరాలంటే ఎంత లేదన్నా ఇంకా దశాబ్ద కాలం పడుతుంది. ట్రాఫిక్ సెన్స్ లేకుండా అడ్డదిట్టంగా నడిచే వాహనాల మధ్య, గుంతలుపడి అధ్వాన్నంగా ఉండే భారతీయ రోడ్లపైకి ఈ డ్రైవర్ రహిత కార్లు రావాలంటే మరో రెండు దశాబ్దాలు కావాల్సిందే. అప్పటివరకు ఆగకుండా మన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీగారు కంగారుపడి కోట్ల మంది డ్రైవర్ల ఉద్యోగాలను కొల్లగొట్టే డ్రైవర్ రహిత వాహనాలను భారత్‌లో అనుమతించే ప్రసక్తే లేదంటూ ప్రకటించారు. డ్రైవర్ రహిత కార్లపై గడ్కరి ఆందోళన వ్యక్తం చేయడంలో అర్థమేమైనా ఉందా? కార్లు లేనప్పుడు బండ్లు, రిక్షాలు, టాంగాలపై ప్రజలు ప్రయాణించారు. వాటిని నడిపే మనుషుల పొట్ట కొట్టుతాయనుకుంటే నేడు కార్లు వచ్చేవా? భారత్‌లో వాషింగ్ మెషిన్లు విరివిగా అందుబాటులోకి వచ్చినప్పుడు దోబీలు ఏమయ్యారు? 1970, 1980 దశకాల్లో భారత్‌లో కంప్యూటరీకరణ వేగం పుంజుకున్నప్పుడు ఎంతమంది ఉద్యోగాలు పోలేదు! పోతాయనుకుంటే ఆ ఉద్యోగాలు మాత్రమే పోతాయి. వాటిస్థానంలో అంతకన్నా ఎక్కువ ప్రత్యామ్నాయ ఉద్యోగాలు వస్తాయి. ఇంటింటికి ఇస్త్రీ పెట్టలున్నా, వాషింగ్ మెషిన్లు వచ్చినా దోబీలకు ఏమాత్రం డిమాండ్ తగ్గకపోగా డిమాండ్ పెరిగిదంటే అతిశయోక్తి కాదు. కంప్యూటర్ల విప్లవంతో పోయినా ఉద్యోగాలకన్నా ఐటీలో వచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంతో ఎక్కువన్నది అందరికీ తెల్సిందే. ఇప్పుడు పడిపోతున్న ఆ రంగం గురించి ఆలోచించడంలో అర్థం ఉంటుంది. పాత టెక్నాలజీ స్థానంలో వచ్చే కొత్త టెక్నాలజీ ఎప్పుడూ పురోగమనాన్ని కోరుకుంటుంది. ఈ పురోగమనంలో పాత ఉద్యోగాలు పోతుంటాయి. కొత్త ఉద్యోగాలు వస్తుంటాయి. అది సహజ సిద్దాంతం. దశాబ్దంలోగా డ్రైవర్ రహిత కార్లు వినియోగదారులకు చేరినా కొంతకాలంపాటు పర్యవేక్షకుడిలా వాటికీ డ్రైవర్ అసరమే. కాకపోతే డ్రైవర్ స్థానంలో సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన చాఫర్లు వచ్చి చేరవచ్చు. ఇప్పటికే ఈ ప్రజా రవాణా రంగంలో ‘రైడ్ హేలింగ్ యాప్స్’ లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఉబర్, ఓలా లాంటి కంపెనీలు పుట్టుకొచ్చాయి. వాటివల్ల ఆటో డ్రైవర్లు రోడ్డున పడతారని ట్రేడ్ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. కారు డ్రైవింగ్ వచ్చిన వారు ఆటోడ్రైవర్లలో ఎక్కువమంది క్యాబ్ డ్రైవర్లుగా మారిపోయారు. ఇంకా ఆటోలనే నడుపుతున్న డ్రైవర్లను ఓలా లాంటి కంపెనీలు తమ నెట్‌వర్క్‌లో చేర్చుకున్నాయి. కొత్తగా వచ్చే మార్పు వల్ల ఎన్ని ఉద్యోగాలు పోతాయో, ఆ మార్పు ప్రభావం ఎలా ఉంటుందో కచ్చితంగా ఎవరూ ముందుగా ఊహించలేరు. ఆ మార్పుతోపాటే మరెన్నో మార్పులు సంభవిస్తూ పాత ఉద్యోగాలు పోతూ కొత్త ఉద్యోగాలు వస్తుంటాయి. కొత్తను ఆహ్వానించినప్పుడే ముందుకుపోగలం. -
ఏటా 5లక్షల రోడ్డు ప్రమాదాలు: గడ్కరీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏటా జరిగే సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.5 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్‌సభలో తెలిపారు. రోడ్డు నిర్మాణ డిజైన్‌లో లోపమే ఇందుకు ప్రధాన కారణంగా గుర్తించామని వివరించారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను, మరణాలను కనీస స్థాయికి తీసుకురావటంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని క్వశ్చన్ అవర్‌లో వెల్లడించారు. ఇందులో భాగంగా జాతీయరహదారులపై ఉన్న గ్రామాలు, పట్టణాల్లో మరిన్ని అండర్ పాస్‌లను, ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని తలపెట్టినట్లు తెలిపారు. జాతీయ రహదారుల అభివృద్ధి ప్రభుత్వం 2016-17 కాలంలో రూ. 62, 046 కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు. -
పెండింగ్ రోడ్ల పనులు వెంటనే చేపట్టండి
♦ కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన సీఎం కేసీఆర్ ♦ జాతీయ రహదారులకు లిఖితపూర్వక అనుమతులివ్వాలని వినతి ♦ భేటీ వివరాలను మీడియాకు వెల్లడించిన మంత్రి తుమ్మల సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి పలు జాతీయ రహదారులను ఇస్తామని ప్రకటించినా ఇప్పటివరకు అనుమతులు ఇవ్వలేదని, అందుకు సంబంధించిన అనుమతులను వెంటనే మంజూరు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ సోమవారం గడ్కరీని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జాతీయ రహదారులకు సంబంధించిన పలు అంశాలపై గడ్కరీతో చర్చించారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సంబంధించి గతంలో సమర్పించిన డీపీఆర్‌లకు ఇంకా అనుమతులు రాలేదని... రహదారుల అథారిటీకి అప్పగించిన డీపీఆర్‌లకు అనుగుణంగా భూసేకరణకు అనుమతు లివ్వాలని కోరారు. రాష్ట్రంలో నాలుగు జాతీయ రహదారులను నాలుగు వరుసలుగా వెడల్పు చేయడానికి అనుమతుల మంజూరుపైనా చర్చించారు. అలాగే రాష్ట్రంలో నాలుగు ప్రధాన రహదారులను (సంగారెడ్డి– చౌటుప్పల్ 152 కి.మీ, చౌటుప్పల్–కండి 186 కి.మీ, మెదక్–ఎల్కతుర్తి 133 కి.మీ, హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు–కొత్తగూడెం 234 కి.మీ) జాతీయ రహదారులుగా ప్రకటిస్తూ వెంటనే అనుమతులు, ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.హైదరాబాద్‌లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఎన్‌హెచ్–44ను విస్తరించాల్సి ఉందని, ఇందులో కొంత స్థలం రక్షణ శాఖ పరిధిలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్నందువల్ల అందుకు సంబంధించిన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం సమావేశ వివరాలను మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మీడియాకు వివరించారు. రాష్ట్రంలో 650 కిలోమీటర్ల పొడవైన కొన్ని రహదారులను జాతీయ రహదారుల అథారిటీకి అప్పగించామని, వాటి నిర్మాణానికి భూసేకరణ చేయాల్సి ఉందని, కేంద్రం నుంచి త్వరగా అనుమతులిస్తే వాటి పనులు ప్రారంభిస్తామని తెలిపామన్నారు. గోదావరి నదిపై ఇన్లాండ్ వాటర్ వే వ్యవస్థ, డ్రైపోర్టుల ఏర్పాటు గురించి కూడా సీఎం కేసీఆర్ గడ్కరీతో చర్చించారని తుమ్మల తెలిపారు. ఈ అంశాలపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని... అనుమతుల మంజూరుకు వెంటనే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. గడ్కరీని కలసిన వారిలో ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలాచారి, రాంచంద్రు తేజావత్, ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్ కుమార్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు. -
న్యూఢిల్లీలో గడ్కరీతో తుమ్మల భేటీ
న్యూఢిల్లీ: సీఆర్ఎఫ్ నిధుల కింద రాష్ట్రానికి రూ. 830 కోట్లు మంజురు చేయాలని కేంద్ర రవాణా, రహదారులు, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరినట్లు తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో నితిన్ గడ్కరీతో తుమ్మల భేటీ అయ్యారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ... చౌటుప్పల్ - కంది వయా ఆమన్గన్, సంగారెడ్డి - చౌటుప్పల్, మెదక్ - ఎల్కతుర్తి, హైదరాబాద్ - కొత్తగూడెం మధ్య 650 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు కేంద్రం ఒప్పుకుందని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. -
18న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాక
బీచ్‌రోడ్ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 18వ తేదీన నగరానికి రానున్నారని బీజేపీ నగర అధ్యక్షుడు ఎం. నాగేంద్ర తెలిపారు. నగర పార్టీ కార్యాలయంలో మంగళవారం బీజేపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 70వ స్వాతంత్య్రదిన వేడుకలను పురస్కరించుకుని బీజేపీ చేపట్టిన తిరంగ యాత్రలో పాల్గొనడానికి గడ్కరీ వస్తున్నారని, దీనికి నగర పార్టీ నాయకులంతా సిద్ధంగా ఉండాలని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.వి.ఎస్.ప్రకాస్ రెడ్డి, నాని, గుండ రఘుబాబు పాల్గొన్నారు. -
ఇక టోల్గేట్ల వద్ద ఆగక్కర్లేదు!
సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ - విజయవాడ హైవే మీద ఉన్న టోల్గేట్ల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరి ఉంటాయి. అక్కడ వేచి ఉండాల్సి రావడంతో బోలెడంత ఇంధనం, సమయం రెండూ వృథా అవుతాయి. దేశంలో చాలాచోట్ల ఇలాంటి పరిస్థితే ఉంది. దాంతో ఈ ఏడాది ఏప్రిల్ నాటికల్లా 360 టోల్ ప్లాజాలలో ఈ-టోలింగ్ వ్యవస్థను ప్రారంభిస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇది అమలైతే.. ఇక వాహనాలు టోల్గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేదు. వాటికి ముందుండే ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ల ద్వారా టోల్ మొత్తం కట్ అవుతుంది. ముందుగా రీచార్జి చేసుకున్న కార్డుల ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసీ) చిప్‌లు, ప్రీపెయిడ్ సిస్టమ్ రీఫిల్లింగ్ కోసం ఇంతకుముందు ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే, తర్వాత మళ్లీ వెనక్కి తగ్గాయి. ఇప్పుడు కొత్తగా ఏయే బ్యాంకులు దీన్ని అమలుచేస్తాయన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం దేశంలో 96వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా, రాబోయే మూడు నెలల్లో వీటిని 1.52 లక్షల కిలోమీటర్లకు విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ ఈ సందర్భంగా చెప్పారు. -
‘ముల్లకట్ట’ నేడు జాతికి అంకితం
♦ వరంగల్-ఖమ్మం సరిహద్దులో వంతెన ♦ రూ. 335 కోట్లతో 2.80 కిలోమీటర్లు ♦ తగ్గిన హైదరాబాద్- కోల్‌కతా దూరం ♦ సీఎం కేసీఆర్,కేంద్రమంత్రి గడ్కారీహాజరు సాక్షిప్రతినిధి, వరంగల్: తూర్పు భారతదేశానికి హైదరాబాద్‌తో అనుసంధానించే కీలకమైన ముల్లకట్ట బ్రిడ్జి సోమవారం జాతికి అంకితం కానుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌గడ్కారీ ఈ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. వరంగల్ జిల్లా ఏటూరునాగారం సమీపంలోని ముల్లకట్ట, ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం పూసూరును మధ్య గోదావరి నదిపై 2.8 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. రూ.335 కోట్లతో నిర్మించిన ఈ బ్రిడ్జిపై ఆరు నెలలుగా రాకపోకలు సాగుతున్నాయి. అయితే, అధికారికంగా జనవరి 4న దీన్ని జాతికి అంకితం చేయనున్నారు. దరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలను అనుసంధానం చేసేందుకు ఈ బ్రిడ్జి ఉపయోగపడుతుంది. ముల్లకట్ట బ్రిడ్జి నిర్మాణంతో హైదరాబాద్-కోల్‌కతా మధ్య 190 కిలో మీటర్లు తగ్గింది. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్లేందుకు ప్రస్తుతం ఉన్న రెండు మార్గాలు 1,678 కిలోమీటర్లు, 1,504 కిలో మీటర్లు ఉన్నాయి. ముల్లకట్ట బ్రిడ్జితో ఈ దూరం 1,488 కిలోమీటర్లకు తగ్గింది. హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బిహార్ రాష్ట్రాలకు వెళ్లేందుకు ఈ బ్రిడ్జితో దగ్గరి మార్గాలు ఏర్పడ్డాయి. జాతీయ రహదారి విస్తరణ... తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌లను కలుపుతూ హైదరాబాద్-భూపాలపట్నం రోడ్డును జాతీయరహదారిగా అభివృద్ధి చేయాలని 1998లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. గతంలో 202 జాతీయ రహదారిగా ఉన్న దీన్ని 163గా మార్చారు. జాతీయ రహదారి విస్తరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే హైదరాబాద్-ఆలేరు మధ్య నాలుగు వరుసలుగా అభివృద్ధి చేశారు. తాజాగా ఆలేరు-వరంగల్ మధ్య 99.10 కిలో మీటర్ల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు నిర్ణయించారు. సీఎం కేసీఆర్, కేంద్ర ఉపరితల రవాణామంత్రి నితిన్‌గడ్కారీ కలిసి సోమవారం జాతీయ రహదారి విస్తరణ పనులను ప్రారంభించనున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గం మడికొండ వద్ద రహదారి విస్తరణ, ముల్లకట్ట బ్రిడ్జి ప్రారంభోత్సవ పనుల కార్యక్రమం జరగనుంది. ఎల్అండ్టీ సంస్థ జాతీయ రహదారి విస్తరణ పనులను దక్కించుకుంది. రూ. 1905 కోట్లతో ఈ పనులను చేయనున్నారు. రోడ్డు విస్తరణ కోసం 432.8 హెక్టార్ల భూములను సేకరించారు. గతంలో ఎన్నికల నియమావళి కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. -
'జలరవాణాకు ఏర్పాట్లు చేయండి'
హైదరాబాద్: రాష్ట్రంలో రహదారులు చాలా తక్కువగా ఉన్నాయని మరో 1850 కిలోమీటర్ల రోడ్లు తెలంగాణకు ఇవ్వాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భధ్రచలం నుంచి ఏటూరు నాగారం వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారిగా గుర్తించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో జలరవాణాకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరామన్నారు. దీనిపై స్పందించిన కేంద్రం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెడతామని హామీ ఇచ్చిందని చెప్పారు. దీనిపై సోమవారం సీఎం నివాసంలోనే ప్రకటన చేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరామన్నారు. బెంగళూరు రోడ్డును కూడా బాగు చేయాలని, ఈపీసీ కింద అమరావతి నుంచి భద్రాచలం రోడ్డుని కొత్తగూడెం నుంచి భధ్రాచలం ఇవ్వాలని కోరినట్టు తుమ్మల తెలిపారు. సీఎం కేసీఆర్‌తో కలిసి నితిన్ గడ్కరీ ఆలేరు-వరంగల్ జాతీయ రహదరి విస్తరణ పనులను రేపు(సోమవారం) ప్రారంభించనున్నారు. అనంతరం ఏటూరు నాగారంలోని ముల్లకట్ట వద్ద గోదావరి నదిపై నిర్మించిన వంతెనను ప్రారంభిస్తారు. -
రోడ్డు కాదు.. అభివృద్ధికి రాజమార్గం
మీరట్: కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వే రహదారికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం శంకుస్థాపన చేశారు. 7,500 కోట్ల భారీ వ్యయంతో 14 లేన్లతో నిర్మించనున్న ఈ రహదారిని అభివృద్ధికి రాజమార్గంగా ప్రధాని పేర్కొన్నారు. కాలుష్యాన్ని తగ్గించేలా ఆధునిక పద్ధతిలో ఈ రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో మీరట్ కీలక పాత్ర పోషించిన విషయాన్ని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలోని మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధి బాటలో పయనించాలంటే చక్కని రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు. వేగవంతమైన రవాణా సౌకర్యాల ద్వారా మౌలిక వసతులు సైతం వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు. గ్రామసడక్ యోజన కార్యక్రమం ద్వారా మాజీ ప్రధాని వాజ్‌పేయి రోడ్డు మార్గాల అభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు. పార్లమెంట్ కార్యక్రమాలు సజావుగా జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రధాని విమర్శించారు. ఎక్స్‌ప్రెస్ వే ద్వారా మీరట్ నుంచి ఢిల్లీ మధ్య 70 కిలోమీటర్ల దూరం ఉన్నా.. కేవలం 40 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో 50 వేల కోట్లతో జాతీయ రహదారులు: గడ్కరీ
సాక్షి,విజయవాడ: రాష్ర్టం ప్రభుత్వం భూసేకరణ చేసి, సమగ్రమైన నివేదిక (డీపీఆర్)తో ముందుకొస్తే, రాష్ట్రంలో రూ.50,560 కోట్ల వ్యయంతో 3092 కి.మీ నూతన జాతీయ రహదారులను నిర్మిస్తామని కేంద్ర రోడ్లు, రవాణా, రహదారులు శాఖల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలో రూ.15వేల కోట్లతో జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయన్నారు. జాతీయ రహదారుల శాఖ రాష్ర్ట రోడ్డు, భవనాల శాఖల సమ్వనయంతో విజయవాడ సమీపంలో 447.88 కోట్లతో దుర్గగుడి వద్ద ఆరులైన్ల ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు, 5.122 కి.మీ నాలుగులైన్ల రహదారి విస్తరణ పనులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. అదే సమయంలో ఇబ్రహీంపట్నం నుంచి చండ్రగూడెం వరకు గల ఎన్‌హెచ్ 30ని రెండు లైన్లతో పునః నిర్మాణం, కత్తిపూడి నుంచి కాకినాడ బైపాస్ సెక్షన్ వరకు 26.15 కి.మీ. ఎన్.హెచ్ 216ను నాలుగు లైన్ల పునః నిర్మాణం పనులను శంకుస్థాపన చేశారు. అంతకు ముందు బెంజిసర్కిల్ వద్ద ఫ్లై ఓవర్‌కు, విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ గతంలో రోజుకు రెండు కి.మీ మాత్రమే జాతీయ రహదారులు నిర్మాణం జరిగేదని ప్రస్తుతం 18 కి.మీ చొప్పున నిర్మిస్తున్నామని, వచ్చే మార్చినాటికి 30 కి.మీ చొప్పున నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. విజయవాడ చుట్టూ 150 నుంచి 200 కి.మీ వేగంతో వెళ్లేందుకు వీలుగా 180 కి.మీ 8 లైన్ల అవుటర్ రింగ్ రోడ్డును రూ.20 వేల కోట్లతో నిర్మిస్తామని ప్రకటించారు. గతంలో తాము ముంబాయి నుంచి పూనేకు ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మించడం వల్ల 9 గంటల్లో వెళ్లే ప్రయాణం గంటన్నరలోగా వెళ్లిపోతున్నారని వివరించారు. విజయవాడలో జాతీయ రహదారుల ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. ఈ నెల 19 న ఎయిమ్స్‌కు శంకుస్థాపన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ త్వరలోనే భూసేకరణ చేసి, బ్లూప్రింట్తో వస్తామని నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరుచేయాలని కోరారు. సమావేశంలో కేంద్ర పట్టణాభివద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మన రాష్ర్టం ఇక బీద అరుపులు అరవాల్సిన అవసరం లేదని భవిష్యత్తులో శక్తివంతమైన రాష్ట్రంగా మారుతుందన్నారు. ఇప్పటికే ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థలను కేంద్ర మంజూరు చేసిందని ఈ నెల 19న ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేస్తున్నామని వివరించారు. ఈ సమావేశానికి విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) అధ్యక్షత వహించగా, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి వైఎస్ చౌదరితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. -
‘నల్ల’పప్పుపై ఉక్కుపాదం
కొండెక్కిన పప్పుధాన్యాల ధరలపై కేంద్ర కేబినెట్ సమీక్ష పరిస్థితి సమీక్షించాలని మంత్రుల బృందానికి ఆదేశం ♦ దేశవ్యాప్తంగా 36 వేల టన్నుల పప్పుదినుసుల స్వాధీనం ♦ 10 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున దాడులు: ఆర్థిక జైట్లీ వెల్లడి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న పప్పుదినుసుల ధరలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్ బుధవారం సమావేశమై ధరలను సమీక్షించింది. ధరల పరిస్థితిని అత్యవసరంగా సమీక్షించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని మంత్రుల బృందాన్ని ఆదేశించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు, రవాణా మంత్రి నితిన్ గడ్కారీ, వాణిజ్య మంత్రి నిర్మలాసీతారామన్లు సభ్యులుగా ఉన్న ఈ బృందం వెంటనే సమావేశమై దేశవ్యాప్తంగా పప్పుదినుసుల ధరల పరిస్థితిపై యుద్ధప్రాతిపదికన సమీక్షించింది. అంతకుముందు కేబినెట్ సమావేశంలో మహారాష్ట్రలో 276 ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 23వేల టన్నుల పప్పుదినుసులను స్వాధీనం చేసుకోవటంపై చర్చ జరిగింది. ఈ దాడుల వల్ల కొన్ని దినుసుల ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు కేబినెట్ దృష్టికి తీసుకువచ్చింఒదని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, దేశవ్యాప్తంగా వ్యాపారులు అక్రమంగా నిల్వ చేసిన 36 వేల టన్నుల పప్పు దినుసులను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంత్రుల బృందం భేటీ తర్వాత విలేకర్లకు తెలిపారు. ‘నల్లబజారులో పప్పు ధాన్యాలను వెలికితీయడంలో రాష్ట్రాలు పూర్తిస్థాయిలో కృషి చేయటం లేదు. ఇప్పటి వరకు 5 వేల టన్నుల పప్పు దినుసులను దిగుమతి చేసుకుని వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేశాం. మరో మూడు వేల టన్నులను దిగుమతి చేసుకుంటున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో.. కేంద్రీయ భండార్, సఫల్కు చెందిన 500 విక్రయ కేంద్రాల ద్వారా కిలో కందిపప్పును రూ.120కే అమ్ముతున్నాం. పప్పు దినుసులను నల్లబజారులో అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దాడులు ఇకపైనా కొనసాగుతాయి. రెండుమూడు రోజుల్లో ధరలు తగ్గుముఖం పడతాయి. దిగుమతి అయిన పప్పుదినుసులను తమిళనాడు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ ఆ రాష్ట్ర రాజధాని శంకుస్థాపన తరువాత తీసుకుంటుంది’ అని వివరించారు. -
టీడీపీది రోజుకో బాగోతం!
-
టీడీపీది రోజుకో బాగోతం!
* తెలుగుదేశం పార్టీ వైఖరిపై మంత్రి కేటీఆర్ ధ్వజం * ‘ఓటుకు కోట్లు’ కేసులో చట్టం తన పని తాను చేస్తుంది.. సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో టీడీపీది రోజుకో మాట, రోజుకో బాగోతం అని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. ఈ కేసులో అడ్డంగా దొరికిపోవడమేకాక ఇతరులపై ఆ పార్టీ నేతలు బురదజల్లుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని టీడీపీ చేస్తున్న ఆరోపణలు, కేసీఆర్‌పై ఏపీలో కేసులు పెట్టడంపై గురువారం ఇక్కడ విలేకరులు కేటీఆర్ స్పందన కోరగా ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. వాస్తవంగా జరిగిందేమిటో ప్రజలు చూశారన్నారు. ఓటుకు కోట్లు కేసు గురించి అడగ్గా.. చట్టం తన పనితాను చేస్తుందన్నారు. హైదరాబాద్‌లో ఏడాది నుంచి శాంతిభద్రతల సమస్యలేదని, భవిష్యత్‌లోనూ అలాంటి వాతావరణమే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. వెంకయ్య, గడ్కారీ, రవిశంకర్‌లతో భేటీ తొలుత కేటీఆర్ కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. స్మార్ట్‌సిటీ, స్మార్ట్ టెక్నాలజీపై ఆగస్టు 22, 23 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన అంతర్జాతీయ సదస్సుకు ముఖ్యఅతిథిగా రావాలని మంత్రి వెంకయ్యను కేటీఆర్ ఆహ్వానించారు. లక్షకు పైగా జనాభా ఉన్న సిద్ధిపేటను క్లాస్-1 పట్టణ జాబితాలో చేర్చాలనే ప్రతిపాదనపై ఈ సందర్భంగా వెంకయ్య సానుకూలంగా స్పందించారు. అనంతరం మంత్రి కేటీఆర్ హడ్కో చైర్మన్ రవికాంత్‌ను కలసి వాటర్ గ్రిడ్‌కు రూ.5వేల కోట్ల రుణం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారుల స్థాయి కోసం వినతి రాష్ట్రంలోని వెయ్యి కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా స్థాయి పెంచాలని కేటీఆర్ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీకి విజ్ఞప్తి చేశారు. ట్రాన్స్‌పోర్టుభవన్‌లో ఆయన గడ్కారీని కలసి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి 2 లక్షల టన్నులు, రహదారులకు 8 లక్షల టన్నుల సిమెంటును రాయితీపై ఇవ్వాలని కోరారు. కాగా, రెండు పడకల గదుల ఇళ్లకు కూడా సిమెంటు రాయితీ సదుపాయాన్ని వినియోగించుకోవాలని గడ్కారీ సూచించారని కేటీఆర్ తెలిపారు. అనంతరం ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలసి టీహబ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రావాల్సిందిగా ఆహ్వానించినట్టు కేటీఆర్ చెప్పారు. -
నితిన్ గడ్కరీతో కేటీఆర్ భేటీ
ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణకు జాతీయ రహదార్ల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని గడ్కరీని కోరారు. అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణానికి రాయితీ ధరకే సిమెంటును ఇవ్వాలని కేటీఆర్ కోరారు. అంతకముందు హడ్కో చైర్మన్ రవికాంత్ తో భేటీ అయిన కేటీఆర్ తెలంగాణలో తాగునీటి పథకానికి రూ.25 వేల కోట్లు మంజారు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
రూ.10వేల కోట్లతో కర్ణాటకలో జాతీయ రహదారులు
బెంగళూరు : కర్ణాటకలో రూ.10వేల కోట్ల నిధులతో జాతీయ రహదారుల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్లో మంగళవారం జరిగిన రహదారుల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ... కర్ణాటకలోని 1,572 కిలోమీటర్ల పరిధిలోని రహదారులను రూ.10వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ నిధులను కర్ణాటకకు కేటాయించినట్లు చెప్పారు. ముంబై-పూణె తరహాలో బెంగళూరు-చెన్నై రహదారిని ఎక్స్‌ప్రెస్ హైవేగా అభివృద్ధి చేయడంపై చర్చలు జరుపుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇదే సందర్భంలో లోక్‌సభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ గత యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలనే ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తోంది తప్ప, ఇందులో కొత్త పథకాలేవీ లేవని అన్నారు. అందువల్ల యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలను వచ్చే మూడు, నాలుగేళ్లలో పూర్తి చేయాలని నితిన్ గడ్కరీని కోరారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు సదానందగౌడ, జి.ఎం.సిద్ధేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
భూసేకరణ బిల్లుతో రైతులకే నష్టం: సోనియా గాంధీ
ఢిల్లీ : భూసేకరణ బిల్లు అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు. భూసేకరణ బిల్లు వల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులు నష్టపోతారని ఆమె శుక్రవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే భూసేకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం చేయబోతున్న సవరణలను కాంగ్రెస్ పార్టీ ఆమోదించదని సోనియాగాంధీ తెలిపారు. -
'మహా'లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ కసరత్తు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఈ నెల 27న బీజేపీ శాసనసభ పక్షం సమావేశం కానుంది. కేంద్ర మంత్రి నితీన్ గడ్కారీ ఇప్పటికే తాను సీఎం పదవికి రేసులో లేనని ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షడు దేవేంద్ర పడ్నవిస్ సీఎం పదవిని చేపట్టే అవకాశం ఉంది. బీజేపీ అగ్ర నాయకత్వం కూడా దేవేంద్ర వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అదికాక కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం ముంబై వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సీఎం ఎంపిక అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితీన్ గడ్కారీని సీఎంగా ఎంపిక చేయాలని మహారాష్ట్రలోని పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అగ్రనాయకత్వానికి విజ్ఞప్తి చేసినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో తాను కేంద్ర మంత్రిగా న్యూఢిల్లీలోనే ఉండాలని భావిస్తున్నానని... తిరిగి ముంబై వచ్చేందుకు అంత సుముఖుంగా లేనట్లు నితీన్ గడ్కారీ గురువారం వెల్లడించారు. అక్టోబర్ 15న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ 122 సీట్లు సాధించిన అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే 288 సీట్లు గల మహారాష్ట అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 146 సీట్లు రావాలన్న విషయం తెలిసిందే. -
పదవులపై బీజేపీ కుస్తీ
సాక్షి, న్యూఢిల్లీ: ఫలితాలు లాంఛనప్రాయమే, గెలుపు తథ్యం అనే ధీమాతో ఉన్న బీజేపీ.. ప్రభుత్వం ఏర్పాటు కోసం, పార్టీలో మార్పు చేర్పుల కోసం తర్జన భర్జనలు ప్రారంభించింది. నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పాటు కానున్న ప్రభుత్వంలో సీనియర్ నేతలు ఎవరెవరికి ఏయే పదవులు కట్టబెట్టాలనే దానిపై చర్చోపచర్చలను ముమ్మరం చేసింది. మోడీ నేతృత్వంలో ఏర్పాటయ్యే సర్కారులో బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు కీలక పదవి అప్పగించాలని ఆరెస్సెస్ ఒత్తిడి చేస్తోంది. సీనియర్ నేత అద్వానీకి స్పీకర్ పదవి ఇవ్వజూపగా, ఆయన నిరాకరించినట్లు సమాచారం. ఎన్డీఏ చైర్మన్ వంటి రాజకీయ ప్రాధాన్యం గల పదవులను ఆయన కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అద్వానీతో రాజ్‌నాథ్ గురువారం చర్చలు జరిపారు. అంతకు ముందు రాజ్‌నాథ్ నివాసంలో బీజేపీ, ఆరెస్సెస్ సీనియర్ నేతలు సమావేశమై దాదాపు రెండు గంటల సేపు చర్చలు సాగించారు. ఈ భేటీలో ఆరెస్సెస్ నేతలు సురేశ్ సోనీ, రామ్‌లాల్, సౌదాన్ సింగ్, వి.సతీశ్ తదితరులు పాల్గొన్నారు. చర్చలు కొనసాగుతుండగా, మోడీ సహచరుడు అమిత్ షా వారితో చేరారు. మరోవైపు బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ఢిల్లీలో ఆరెస్సెస్ నేతలతో చర్చలు జరిపారు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంపై అసంతృప్తితో ఉన్న మురళీ మనోహర్ జోషీ, సుష్మా స్వరాజ్ వం టి వారి పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జోషీ, సుష్మ వేచి చూసే వైఖరిని అవలంబిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అద్వానీ స్పీకర్ పదవిని స్వీకరిస్తే, జోషీకి, సుష్మకు కేబినెట్లో చోటు లభించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మోడీకి మరింత భద్రతకు ఏర్పాట్లు: ప్రస్తుతం జెడ్ కేటగిరీ భద్రత ఉన్న మోడీకి మరింత భద్రత కల్పించేందుకు ఎస్పీజీ సన్నాహాలు చేస్తోంది. మోడీకి, ఆయన భార్య యశోదాబెన్, తల్లి హీరాబెన్‌లకు కూడా ఎస్పీజీ భద్రత కల్పించనున్నారు. ఎన్డీఏకు పూర్తి మెజారిటీ వస్తే, రాష్ట్రపతి ప్రకటన వరకు ఆగకుండా వెంటనే మోడీకి భద్రత కల్పించేలా ఎస్పీజీ ఏర్పాట్లు చేసుకుంటోంది. -
ఇబ్బందేమీ లేదు!
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు గడ్కరీ న్యూఢిల్లీ: లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి ఇబ్బంది లేదని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ తెలిపారు. ఢిల్లీలోని ఏడు పార్లమెంటు నియోజకవర్గాలకుగాను పోటీపడుతున్నవారి సంఖ్య పదుల్లో ఉందని, అభ్యర్థుల ఎంపిక కమలనాథులకు కష్టం గా మారిందన్న వార్తల నేపథ్యంలో ఆయన స్పం దించారు. దేశవ్యాప్తంగా బీజేపీ గెలుపుగాలి వీస్తోం దని, ఢిల్లీలో కూడా బీజేపీ అభ్యర్థులే గెలిచే అవకాశముందని, దీంతో ఆశావహుల సంఖ్య పెరిగిందన్నారు. మిగతా పార్టీల్లో ఇటువంటి పరిస్థితి లేనందున పోటీ కూడా లేదన్నారు. అయితే ఎంతమంది అభ్యర్థులు పోటీ పడుతున్నా గెలిచేవారెవరో? పార్టీ కోసం శ్రమించినవారెవరో? అధిష్టానానికి తెలుసని, ప్రజాసేవ చేసే అంకితభావమున్న వ్యక్తులకే టికెట్ కేటాయించే అవకాశముందని ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. వారంరోజుల్లో కొలిక్కి... అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోందని, తొంభై శాతం పూర్తయిందని, మిగతా మొత్తాన్ని కూడా పూర్తిచేసి వారంరోజుల్లోపే పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌కు ఢిల్లీ లోక్‌సభ అభ్యర్థుల తుది జాబితాను ఇస్తానని చెప్పారు. వారంరోజుల్లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే అవకాశం కూడా ఉందన్నారు. అభ్యర్థులను ఎంపిక చేసేముందు పార్టీలోని దిగువస్థాయి కార్యకర్తల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. నా ఎంపిక సరైందే... అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా తాను వ్యవహరించానని, తాను ప్రతి పాదించిన అభ్యర్థుల్లో 90 శాతం మంది ఘన విజ యం సాధించారని గడ్కరీ చెప్పారు. లోక్‌సభ అభ్యర్థుల విషయంలో కూడా అభ్యర్థుల ఎంపికలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, 100 శాతం విజ యం సాధించడం ఖాయమన్నారు. ఏడుగురు అభ్యర్థులు గెలుస్తారన్న ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా అభ్యర్థుల ఎంపిక సమయంలో పార్టీ సీనియర్లతో అనేకసార్లు చర్చలు జరిపానని, సిట్టింగ్ అభ్యర్థులకు టికెట్ కేటాయించే విషయమై చాలా తర్జనభర్జనలు జరిగాయన్నారు. చివరకు అంతాకలిసి తీసుకున్న నిర్ణయం పార్టీకి మెరుగైన ఫలితాలనిచ్చిందన్నారు. కాగా ప్రస్తుత లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో సిట్టింగ్ ఎంపీలకు ప్రాధాన్యతనిస్తారా? అని ప్రశ్నిం చగా... ఈ విషయమై సీనియర్లతో ఎటువంటి చర్చలు జరపలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఢిల్లీ కాంగ్రెస్‌కు చుక్కెదురు కావడం ఖాయమన్నారు. -
గడ్కారీ...కాచుకో!
నాగపూర్ అప్ అభ్యర్థిని అంజలి దమయాని మరో ఐదు కుంభకోణాలు వెలుగులోకి తెస్తా నీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళతా నాగపూర్: బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ చేసిన మరిన్ని అక్రమాలను వెలికి తీసేందుకు సిద్ధంగా ఉన్నానని నాగపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అంజలి దమయాని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర నీటి పారుదల కుంభకోణాల్లో గడ్కారీ పాత్ర ఉందని వెలుగులోకి తీసుకొచ్చిన దమనియా ఆయన ప్రమేయమున్న మరో ఐదు కుంభకోణాలు త్వరలోనే బయటపెడతానని సవాల్ చేశారు. తనకు చిన్న పిల్లలు ఉండటం వల్ల గతంలో పోటీకి ఆసక్తి చూపలేదన్నారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాకతో రాజకీయ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలిపారు. అవినీతిపై పోరాటం కోసం ఏకంగా ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా కేజ్రీవాల్ వదిలేశారని, అలాంటప్పుడు మనమెలా ఇంట్లో కూర్చుగలమని ప్రశ్నించారు. అందుకే ఆప్ తరఫున పోటీ చేసేందుకు సముఖంగా ఉన్నానని స్పష్టం చేశారు. 2011 సంవత్సరంలో జల కుంభకోణంలో ఎన్సీపీ అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్, గడ్కారీల మధ్య అవినీతి సంబంధాన్ని వెలుగులోకి తీసుకొచ్చానని తెలిపారు. ఈ కుంభకోణంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసే విషయంలో సహయం చేయాలని గడ్కారీని సంప్రదించానని, అప్పుడు ఆయన అందుకు నిరాకరించారని చెప్పారు. ఈయన ప్రమేయమున్న మరో ఐదు కుంభకోణాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఈ ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో గడ్కారీపై పోటీ చేసేందుకు సదా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు ఉంటాయని తెలుసని, అయినా ప్రజల మధ్యలోకి వెళ్లే తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాజకీయాల నుంచి అవినీతి నాయకులను సాగనంపడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. ‘అవినీతిపైనే మా యుద్ధం. ఆ పరిస్థితుల నుంచి మార్పులు తేవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. తప్పక మారుస్తామ’ని అంజలీ ధీమా వ్యక్తం చేశారు. తనను బీజేపీ స్థానికేతరురాలు అంటోందని, అయితే తాను మహారాష్ట్రీయురాలు, భారతీయురాలినని తెలిపారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి పోటీ చేస్తుండగా, తాను నాగపూర్ నుంచి బరిలోకి దిగితే తప్పేంటని ప్రశ్నించారు. మన వ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతితో పాటు ఇందుకు కారణమైన రాజకీయ నేతలను పెకిలించడమే తమ ముందున్న ధ్యేయమని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో 300, అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులను ఆప్ బరిలోకి దింపుతుందని వెల్లడించారు. అవినీతిపై పోరే ఏజెండాగా పార్టీ మేనిఫెస్టో ఉంటుందన్నారు. నాగపూర్‌లో ఈ నెల 21 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తానని దమనియా ప్రకటించారు. తమ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ప్రచారం కోసం వస్తారని వెల్లడించారు. -
కొనసాగుతున్న అనిశ్చితి!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఏర్పాటుపై ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) అంతిమ నిర్ణయానికి రాలేకపోయింది. ఆప్ విధించిన అన్ని షరతుకు కాంగ్రెస్ అంగీకరించినప్పటికీ ఆ పార్టీని విశ్వసించడానికి సంశయిస్తోంది. కేజ్రీవాల్ లేఖకు కాంగ్రెస్ నుంచి బదులు రావడంతో దానిపై చర్చించడానికి ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ మంగళవారం ఉదయం ఘజియాబాద్‌లోని కేజ్రీవాల్ నివాసంలో సమావేశమైంది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్, కుమార్ బిశ్వాస్‌తోపాటు 9 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ రెండు గంటలు చర్చోపచర్చలు జరిపింది. అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుపై నిర్ణయానికి రాలేకపోయింది. పార్టీ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని ఈ సున్నితమైన అంశంపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావించారు. దీంతో మధ్యాహ్నం ఆప్ ఎమ్మెల్యేలు అందరినీ సమావేశపరిచి కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేసే విషయాన్ని చర్చించారు. ఇందులోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ప్రజాభిప్రాయం కోరాలని నిర్ణయించారు. సమావేశం తరువాత కే జ్రీవాల్ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలా వద్దా అన్న ధర్మసంకటంలో పడ్డామని చెప్పారు. కొందరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, మరికొందరు వద్దంటున్నారని తెలిపారు. అందుకే ప్రజాభిప్రాయం కోరాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. ‘ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 18 అంశాలపై మద్దతు కోరుతూ కాంగ్రెస్, బీజేపీకి లేఖ రాశాం. కాంగ్రెస్ ఈ లేఖకు సమాధానమివ్వగా, బీజేపీ కనీస మర్యాదనైనా పాటించకుండా జవాబు రాయలేదు. మా 18 షరతుల్లో 16 షరతులు పాలనాపరమైనవని, వాటికి మా మద్దతు అవసరం లేదని, రెండింటికి మాత్రం సహకరిస్తామని కాంగ్రెస్ తెలిపింది. ఆప్ మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించినందువల్ల ఆ పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేసే విషయాన్ని మేం పరిశీలించాం. కాంగ్రెస్‌ను విశ్వసించలేమని, గతంలో చరణ్‌సింగ్, చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని కూల్చినట్లుగానే మన ప్రభుత్వాన్ని కూడా కూల్చవచ్చని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు’ అని ఆయన తెలిపారు. ప్రభుత్వాలను కూల్చడమనేది కాంగ్రెస్ రక్తంలోనే ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే లోక్‌సభ ఎన్నికలు ఇప్పట్లో లేవు కాబట్టి, ఆరునెలల వరకు కాంగ్రెస్ తమ ప్రభుత్వాన్ని కూల్చకపోవచ్చన్న నమ్మకమూ కనిపిస్తోందని ఆయన చెప్పారు. ఆరు నెలలైనా సుపరిపాలన అందించాలని కొందరు సూచించారని కేజ్రీవాల్ వివరించారు. ప్రజలు కోరితే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి తాము వెనుకాడబోమని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటుచేసే బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఆప్ ప్రయత్నిస్తోందన్న విమర్శలకు స్పందిస్తూ ఎన్నికల్లో పోటీచేసి సత్తా నిరూపించుకున్న ఆప్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా కఠినమైన విషయం కాదన్నారు. ఈ విషయంలో ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి ఢిల్లీవాసులకు 25 లక్షల లేఖలు రాస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలా వద్దా అనేదానిపై ఢిల్లీవాసులు తమ అభిప్రాయాన్ని 08806110335 నంబరుకు ‘యస్’ లేదా ‘నో’ అని ఎస్ఎంఎస్ చేయవచ్చు. ప్రజలు తమ అభిప్రాయాన్ని ఆప్ వెబ్సైట్ లేదా ఫేస్బుక్ పేజీ ద్వారా తెలియజేయవచ్చు. 272 మున్సిపల్ వార్డుల్లో జనసభల ద్వారా కూడా ప్రజాభిప్రాయం సేకరిస్తారు. ఆదివారం సాయంత్రం వరకు ప్రజాభిప్రాయాన్ని సేకరించి సోమవారం తుదినిర్ణయానికి రానున్నట్లు ఆయన చెప్పారు. సగం మంది వ్యతిరేక అభిప్రాయాలు వెలువరించినా ప్రభుత్వం ఏర్పాటు చేయబోమని కేజ్రీవాల్ ఈ సందర్భంగా స్పష్టీకరించారు. నగరంలో రాష్ట్రపతి పాలన విధించిన తరువాత కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. యుద్ధానికి మళ్లీ సిద్ధం: బీజేపీ న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుపై సంది గ్ధం నెలకొనడంపై బీజేపీ స్పందించింది. మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంగళవారం ప్రకటించింది. ఢిల్లీ బీజేపీ ఎన్నికల వ్యూహబృందం సమావేశం లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఢిల్లీ ఎన్నికల ఇన్చార్జ్ నితిన్ గడ్కారీ భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీవాసుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తమ కార్యకర్తలు మరింత శ్రమించాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చి నా ప్రభుత్వ ఏర్పాటుకు ఆమ్ఆద్మీ పార్టీ ముం దుకు రాకపోవడంపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజ య్ గోయల్ మండిపడ్డారు. మరోసారి ఎన్నికలకు వెళ్లడానికి తాము సిద్ధపడుతున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం మూడంచెల ప్రచార వ్యూ హాన్ని సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ ఎన్నికలకు ఆపే కారణమన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. తమకు ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞత లు చెప్పడానికి నియోజకవర్గాల వారీగా ‘విజ యోత్సవాలు’ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. -
బీజేపీలోకి యడ్డి రాకపై త్వరలో నిర్ణయం
= ఢిల్లీలో గడ్కరీ వెల్లడి = కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను కూడగట్టాలి = యడ్డి అనుయాయుల్లో నూతనోత్సాహం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పను తిరిగి బీజేపీలోకి తీసుకు రావాల్సిన ఆగత్యం ఏర్పడిందని ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ తెలిపారు. ఢిల్లీలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను కూడగట్టాల్సిన ప్రస్తుత తరుణంలో యడ్యూరప్ప విషయమై అధిష్టానం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. కాగా యడ్యూరప్పను పార్టీలోకి ఆహ్వానించే విషయమై ఆయన అనుయాయులు తీవ్రంగా మదనపడుతున్నారు. బీజేపీ నుంచి సరైన ఆహ్వానం అందకపోవడంతో ఒకానొక దశలో యడ్యూరప్ప లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. అంతకు ముందు నరేంద్ర మోడీ ప్రధాని కావాలన్నది తన ఆకాంక్ష అంటూ, బీజేపీతో సీట్ల సర్దుబాటులో భాగంగా ఎనిమిది స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. గత ఆదివారం నగరంలో మోడీ సభ జరిగినప్పుడు బీజేపీలోని యడ్యూరప్ప అనుయాయులకు చేదు అనుభవం ఎదురైంది. వారినెవరూ పెద్దగా పట్టించుకోలేదు. వేదికపైకి ఎవరినీ ఆహ్వానించ లేదు. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న శాసన సభ ఎన్నికల అనంతరం ఢిల్లీకి వెళ్లి, అధిష్టానంతో చర్చలు జరపాలని యడ్యూరప్ప వర్గీయులు నిర్ణయించారు. బీజేపీలోకి యడ్యూరప్పను తీసుకు రాకపోతే పార్టీలో తమకు తీరని అన్యాయం జరుగుతుందని వారు భావిస్తున్నారు. ఈ తరుణంలో ఢిల్లీలో గడ్కరీ చేసిన వ్యాఖ్యలు వారిలో ఉత్సాహాన్ని నింపాయి. యడ్యూరప్పకు ఈడీ నోటీసు ఈ పరిణామ క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) యడ్యూరప్పకు శనివారం నోటీసులు జారీ చేసింది. నగరంలోని రాచేనహళ్లిలో జరిగిన డీనోటిఫికేషన్ వ్యవహారంలో యడ్యూరప్ప కుటుంబానికి ముడుపులు ముట్టాయనే ఆరోపణపై కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. డీనోటిఫికేషన్ సమయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోని ప్రేరణ ట్రస్టుకు ముడుపులు ముట్టాయని ఆరోపణలు వచ్చాయి. తద్వారా ప్రభుత్వానికి రూ.40 కోట్ల నష్టం వాటిల్లిందని, ఆ మేరకు మీ ఆస్తులను ఎందుకు జప్తు చేయకూడదని ప్రశ్నిస్తూ ఈడీ నోటీసులిచ్చింది. -
రాజకీయాల్లో అస్పృశ్యులు ఉండరు
నాగ్‌పూర్: రాజకీయాల్లో ఎవరూ అస్పృశ్యులు కారని కేంద్ర మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు. ‘రాజకీయాల్లో, సామాజిక సేవలో ఎవరినీ అస్పృశ్యులుగా చూడొద్దు’ అని అన్నారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ సరసన పవార్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గడ్కారీకి చెందిన వివాదాస్పద పూర్తి గ్రూపు కంపెనీ శనివారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పవార్ పాల్గొన్నారు. డొల్ల కంపెనీల పెట్టుబడుల వ్యవహారంలో పూర్తి గ్రూపు చిక్కుకోవడం, ఫలితంగా గడ్కారీ బీజేపీ సారథ్యం నుంచి తప్పుకోవడం తెలిసిందే. కాగా తమ కంపెనీ ఎస్సార్ గ్రూప్‌తో కలసి దేశవ్యాప్తంగా వంద పెట్రోల్ బంకులు ప్రారంభించనున్నట్లు గడ్కారీ తెలిపారు. ఈ బంకుల్లో ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని ప్రభుత్వ చమురు కంపెనీలు అమ్మే ధరకంటే రూ.2 తక్కువకే అమ్మనున్నట్లు వెల్లడించారు. పూర్తి కంపెనీ చెరకు పిప్పి, జీవ వ్యర్థ్యాలతో ఇథనాల్ ఉత్పత్తి చేస్తోంది. కాగా, గడ్కారీ చిన్న సాగునీటి ప్రాజెక్టులతో స్వల్పకాలంలోనే సత్ఫలితాలు సాధిస్తున్నారని పవార్ పొగిడారు. పెట్రోల్‌లో ఇథనాల్ కలిపితే విదేశీ మారక ద్రవ్యాన్ని మిగుల్చుకోవచ్చని, అయితే ప్రభుత్వ చమురు కంపెనీలు మాత్రం ఇందుకు విముఖంగా ఉన్నాయని పవార్, గడ్కారీలు విమర్శించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి ప్రఫుల్ పటేల్ కూడా పాల్గొన్నారు.