సాక్షి, న్యూఢిల్లీ: రోడ్డు రవాణా కార్పొరేషన్ లిక్విడేషన్ (ఆస్తుల విక్రయం ద్వారా అప్పుల చెల్లింపు) ప్రక్రియకు రోడ్డు రవాణా కార్పొరేషన్ చట్టం–1950లోని సెక్షన్ 39 ప్రకారం కేంద్ర ప్రభుత్వ అనుమతితో రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీచేయవచ్చని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు సోమవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా బదులిచ్చారు. కొన్ని రాష్ట్రాల రోడ్డు రవాణా కార్పొరేషన్లకు కేంద్రం మూలధన నిధులు సమకూర్చిందని వివరించారు. కొన్ని రాష్ట్రాల కార్పొరేషన్లలో ఈ మూలధన నిధులు ఈక్విటీ మూలధనంగా మారినట్టు వివరించారు. రాష్ట్రాల ఆర్టీసీలో వచ్చే నష్టాలను కేంద్ర ప్రభుత్వం భరించబోదని స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment