RTC Buses
-
బస్సు డ్రైవర్ కు గుండెపోటు..
-
Mumbai : ఆర్టీసీ బస్సు ప్రమాదం.. వెలుగులోకి సంచలన విషయాలు
ముంబై : ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం సృష్టించిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బస్సు డ్రైవర్ సంజయ్ మోర్కి ఎలక్ట్రిక్ బస్సు నడపడం రాదని, ఈవీ బస్సుపై అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు విచారణ అధికారులు నిర్ధారించారు. విచారణలో బస్సు డ్రైవర్ సంజయ్ ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పినట్లు తేలింది. పోలీస్ కస్టడీలో ఉన్న పోలీసుల విచారణలో బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ పలు కీలక విషయాల్ని వెల్లడించాడు. ఎలక్ట్రిక్ బస్సు నడపడంలో తనకు అనుభవం లేదని, కేవలం ఒక్క రోజు ఈవీ బస్సును డ్రైవింగ్ చేసినట్లు చెప్పాడు. ఆ ఒక్క రోజు కేవలం మూడుసార్లు నడిపిట్లు చేసినట్లు, అనంతరం విధులకు హజరైనట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు.కాబట్టే 60 కేఎంపీహెచ్ వేగంతో వెళ్తున్న ఈవీ బస్సును ఎలా కంట్రోల్ చేయాలో తనకు అర్ధం కాలేదని, కాబట్టే ఈ ఘోర ప్రమాదానికి దారి తీసినట్లు పోలీసులకు చెప్పాడు. అనుభవం లేకపోవడంతో ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి ఘోర ప్రమాదానికి దారి తీసింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కిటికి అద్దాలు పగులగొట్టి, తన క్యాబిన్లో ఉన్న బ్యాగ్ తీసుకుని పారిపోయినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ముంబై ఆర్టీసీ విభాగంపై విమర్శలుముంబై ఆర్టీసీ నిబంధనల ప్రకారం.. ఆరు వారాల పాటు ఎలక్ట్రిక్ బస్సు డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా సంజయ్ మోరాకు ఈవీ బస్సులో విధులు అప్పగించడంపై ముంబై ఆర్టీసీ అధికారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఆర్టీసీ బస్సు బీభత్సంగత సోమవారం సాయంత్రం 9.30 గంటల సమయంలో హౌసింగ్ కాలనీలో కుర్లాలోని ఎస్జీ బార్వేరోడ్‌లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవ్వడంతో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. 42మందికి తీవ్ర గాయాలయ్యాయి. 20కి పైగా వాహనాలు ధ్వంస మయ్యాయి. బస్సు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ సంజయ్ మోర్(43)ని అరెస్ట్ చేశారు. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్)కు చెందిన బస్సు కుర్లా స్టేషన్ నుంచి అంధేరికీ వెళ్తుండగా బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్టు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్ధారించారు. 👉చదవండి : ఆర్టీసీ బస్సు బీభత్సం.. జనాలపైకి దూసుకెళ్లి.. -
గోండియా వద్ద అదుపు తప్పి తిరగబడిన బస్సు
-
‘పల్లె’కూ బ్యాటరీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వెలుపలా ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టబోతున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో పరిమితంగా తిరుగుతున్న ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇటీవల హైదరాబాద్–విజయవాడ మధ్య ప్రయోగాత్మకంగా పది ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను గరుడ ప్లస్ కేటగిరీలో ప్రారంభించారు. ఇప్పుడు తొలిసారి రాష్ట్రపరిధిలో హైదరాబాద్‌తో ఇతర ప్రధాన పట్టణాలను ఎలక్ట్రిక్ బస్సులతో అనుసంధానించే బృహత్తర కార్యక్రమానికి ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. ఇవి సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు కేటగిరీలో సేవలందించనున్నాయి. ఇప్పటివరకు నగరం వెలుపలి ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులు లేవు. ఆ లోటును భర్తీ చేస్తూ 450 బస్సులు ఆర్టీసీ బస్సు శ్రేణిలో చేరబోతున్నాయి. మరో వారం తర్వాత నుంచి ఈ బస్సులు దశలవారీగా రోడ్డెక్కనున్నాయి. హైదరాబాద్–నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట మధ్య ఇవి తిరగనున్నాయి. నేషనల్ ఎలక్ట్రిక్ బస్సు ప్రోగ్రాం కింద సరఫరా.. దేశవ్యాప్తంగా వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటానని భారత్ ఐక్యరాజ్య సమితికి హామీ ఇచ్చి, ఆమేరకు చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకునే మోదీ ప్రభుత్వం గతంలో ‘ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యూఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఫేమ్)’పేరుతో పథకాన్ని ప్రారంభించింది. రెండుదశల్లో దీన్ని అమలు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ విమానాశ్రయానికి నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు ఈ పథకం కింద వచ్చినవే. రెండోదశలో మరో 500 బస్సుల కోసం ఆర్టీసీ ప్రతిపాదించగా, అవి కూడా మంజూరయ్యాయి. కానీ కొన్ని కారణాలతో ఆ కాంట్రాక్టు వ్యవహారం న్యాయస్థానానికి చేరింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉండటంతో ఆ బస్సులు రాలేదు. ఇప్పుడు ఫేమ్ స్థానంలో కేంద్రప్రభుత్వం నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రాజెక్టు(ఎన్‌ఈబీపీ)ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు కింద తెలంగాణ ఆర్టీసీకి 450 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయి. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు (జీసీసీ) పద్ధతిలో బస్సులు సరఫరా చేసే ఆ టెండర్‌ను ఢిల్లీకి చెందిన జేబీఎం కంపెనీ దక్కించుకుంది. వారంరోజుల్లో తొలిదశ బస్సులు బ్యాటరీ బస్సులకు జేబీఎం సంస్థ మరో వారంరోజుల్లో శ్రీకారం చుట్టనుంది. ఆ సంస్థనే అద్దె ప్రాతిపదికన బస్సుల నిర్వహణ చూసుకుంటుంది. డ్రైవర్ల బాధ్యత జేబీఎందే కాగా,కండక్టర్ మాత్రం ఆర్టీసీ నుంచి విధుల్లో ఉంటాడు. ఈ బస్సులను నడిపినందుకుగాను ప్రతి కి.మీ.కు రూ.40 చొప్పున అద్దెను ఆర్టీసీ ఆ సంస్థకు చెల్లిస్తుంది. వీటికి అవసరమైన చార్జింగ్ వ్యవస్థను ఆ సంస్థనే ఏర్పాటు చేసుకుంటుంది. హైదరాబాద్‌తోపాటు ఆయా పట్టణాల్లోని సంబంధిత డిపోల్లో వీటిని ఏర్పాటు చేస్తుంది. తొలుత 20 బస్సులు రానున్నాయి. అలా విడతలవారీగా వచ్చే రెండు నెలల్లో మొత్తం బస్సులు రోడ్డెక్కే అవకాశముంది. 450 బస్సులను సరఫరా చేయాల్సి ఉండగా, 400 బస్సులకు సంబంధించిన షెడ్యూళ్లను ఆర్టీసీ ఆ సంస్థకు అందించింది. ఇప్పుడు ఆ 400 బస్సులు వీలైనంత త్వరలో అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ ఆ సంస్థకు సూచించింది. వీటిల్లో 245 ఎక్స్‌ప్రెస్ బస్సులు, 85 సూపర్ లగ్జరీ బస్సులు, 70 పల్లెవెలుగు సర్వీసులు ఉంటాయి. దాదాపు వేయి వరకు డీజిల్ బస్సులను ఆర్టీసీ దశలవారీగా సమకూర్చుంటుండగా, వాటికి అదనంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకసారి చార్జింగ్ చేస్తే 350 కి.మీ. వరకు ప్రయాణం గతంలో ఎలక్ట్రిక్ బస్సులు ఒకసారి ఫుల్‌చార్జ్ చేస్తే 225 కి.మీ.వరకు తిరిగేవి. దీంతో వాటిని దూరప్రాంతాలకు నడపటం కష్టంగా మారింది. హైదరాబాద్ నుంచి గమ్యం చేరి తిరిగి సిటీకి వచ్చేలోపు చార్జింగ్ అయిపోయే పరిస్థితి ఉండేది. ఈ సమస్యను అప్పటికిప్పుడు అధిగమించలేక ఇతర పట్టణాలకు తిప్పేందుకు ఆర్టీసీ సాహసించలేదు. ఇప్పుడు కొత్తగా వస్తున్న బస్సులు ఫుల్‌చార్జ్ చేస్తే 350 కి.మీ.వరకు నడుస్తాయి. దీంతో దూరప్రాంత పట్టణాలకు వాటిని తిప్పేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఆయా పట్టణాల్లో కూడా చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నందున, తిరుగు ప్రయాణంలో మళ్లీ ఫుల్ చార్జింగ్‌తో వస్తాయి. దీంతో మధ్యలో చార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. -
అమ్మో ‘రాజధాని’ బస్సులు
సాక్షి, హైదరాబాద్: రాజధాని బస్సులు ఆర్టీసీ ప్రయాణికులకు చుక్కలు చూపుతున్నాయి. విరిగిన కుర్చిలు, సరిగ్గా పనిచేయని ఏసీ, పరిశుభ్రత అంతంతమాత్రమే కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రయాణికుల నుంచి సంపూర్ణ ఆదరణ ఉన్నా, కొత్త బస్సులు కొనేందుకు ఆర్టీసీ వద్ద నిధులు లేకపోవటంతో కావాల్సినన్ని బస్సులను ఆర్టీసీ సమకూర్చుకోలేకపోతోంది. గత సంవత్సరం ఖరారైన టెండర్లకు సంబంధించిన బస్సులు విడతల వారీగా సమకూరుతున్నాయి. కానీ, అది ఆర్టీసీ డిమాండ్‌కు తగ్గట్టుగా లేకపోవటంతో గత్యంతరం లేని పరిస్థితిలో డొక్కు బస్సులను ఆర్టీసీ కొనసాగించాల్సి వస్తోంది. ఇటీవల 750 వరకు కొత్త సూపర్ లగ్జరీ బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేసింది. పాత సూపర్ లగ్జరీ బస్సుల్లో కొన్నింటిని వినియోగించుకుంటూ, మిగతా వాటిని ఎక్స్‌ప్రెస్ బస్సులుగా, సిటీ బస్సులుగా అధికారులు మార్చారు. కానీ, రాజధాని కేటగిరీకి మాత్రం కొత్త బస్సులు లేక, పాత వాటినే వినియోగిస్తున్నారు. డిమాండ్ ఉన్నా.. రాజధాని బస్సులకు బాగా డిమాండ్ ఉంది. గరుడ బస్సుల్లో టికెట్ ధర ఎక్కువగా ఉన్నందున, టికెట్ ధరలు తక్కువగా ఉండే ఏసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. రైలు నెట్వర్క్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అంతగా తిరగని దూర ప్రాంతాల్లో ఈ బస్సులకు మంచి డిమాండ్ ఉంది. ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో అయితే, విజయవాడ లాంటి రైలు కనెక్టివిటీ మెరుగ్గా ఉన్న ప్రాంతాలకు కూడా వీటిల్లో సీట్లు దొరకని పరిస్థితి ఉంది. 2016లో కొన్న బస్సులే... ప్రస్తుతం 235 రాజధాని బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. అవన్నీ 2016లో కొన్న బస్సులు. సాధారణంగా ఐదు లక్షల కిలోమీటర్లు తిరగ్గానే బస్సులను మార్చేస్తారు. కానీ, ఇవి 10 లక్షల కి.మీ. తిరిగినా వాటినే వాడాల్సి వస్తోంది. పాతవాటి స్థానంలో కొత్తవి కొనాల్సి ఉన్నా నిధుల లేమితో ఆర్టీసీ సమకూర్చుకోలేకపోయింది. గతేడాది 46 బస్సులకు టెండర్లు పిలిచారు. తాజాగా అవి సమ కూరాయి. దీంతో వాటి సంఖ్య 281కి చేరింది. వాస్తవానికి పాత 235 బస్సు లను తొలగించి అంతమేర కొత్తవి సమకూర్చుకోవాల్సి ఉంది. నిధులు లేక కొత్తవి కొనలేకపోతున్నారు. అన్నీ సమస్యలే.... పాత బస్సుల్లో ఏవీ సక్రమంగా ఉండటం లేదు. సీట్లు పాడైనా మరమ్మతు చేయకుండానే ట్రిప్పులకు పంపుతున్నారు. ఆది, సోమవారాల్లో పరిస్థితి దారుణంగా ఉంటోంది. సీట్లు విరిగినా.. ఆన్లైన్లో అడ్వాన్స్ రిజర్వేషన్లో ఉంచుతున్నారు. వాటిని బుక్ చేసుకున్నవారు వాటిల్లో కూర్చోలేక నానా తిప్పలు పడుతున్నారు. కొందరు మధ్యలోనే దిగిపోతున్నారు. ఇక వాటిల్లో ఏసీ వ్యవస్థ పాతబడి సరిగ్గా పనిచేయటం లేదు. మధ్యాహ్నం వేళ ఏసీ ప్రభావం అంతగా లేక ప్రయాణికులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఎండ తీవ్రత పెరగటంతో ఈ బస్సులెక్కాలంటే జనం ఇబ్బంది పడుతున్నారు. ఈ బస్సుల్లో సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదం నిత్యకృత్యమైంది. -
Hyderabad: బస్సులు లేక హైదరాబాద్ లో ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు నరకం
-
ఆర్టీసీకి హ్యాపీ సంక్రాంతి!
సాక్షి, విశాఖపట్నం: ఆర్టీసీకి సంక్రాంతి సంతోషాన్నిచ్చింది. ఈ ఏడాది ఊహించిన దానికంటే అధిక ఆదాయాన్ని ఆర్జించింది. ఈనెల ఎనిమిదో తేదీ నుంచే సంక్రాంతి రద్దీ మొదలైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని విశాఖ జిల్లా ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులను అందుబాటులోకి తెచ్చారు. 765 సంక్రాంతి స్పెషల్ సర్వీసులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 22వ తేదీ వరకు నడిపారు. వీటిలో జోన్–1 నుంచి హైదరాబాద్‌కే 120కి పైగా బస్సులను తిప్పారు. గత సంక్రాంతికి కేవలం 60 బస్సులనే నడపగా ఈసారి వాటిని రెట్టింపు చేశారు. తెలంగాణలో మహలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించడంతో ఎక్కువ బస్సులను అక్కడ అవసరాలకే కేటాయించారు. ఫలితంగా సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ బస్సుల కొరతతో ఆంధ్రప్రదేశ్ వైపు స్పెషల్ సర్వీసులను గణనీయంగా తగ్గించింది. దీంతో ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్–విశాఖపట్నంల మధ్య ఎక్కువ సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేసింది. ఈ ప్రయత్నం బాగా ఫలించి మంచి ఆదాయాన్ని సమకూర్చింది. గత సంక్రాంతికి విశాఖ జిల్లా నుంచి 745 స్పెషల్స్‌ను నడపగా.. ఈ సంవత్సరం 20 బస్సులను అదనంగా వెరసి 765 స్పెషల్స్‌ను నడిపారు. వీటిలో సంక్రాంతికి ముందు 472, తర్వాత 293 సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. వీటిని ప్రయాణికుల డిమాండ్, రద్దీకి అనుగుణంగా విశాఖపట్నం నుంచి హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, శ్రీకాకుళం, పార్వతీపురం, పలాస, పాలకొండ, రాజాం, విజయనగరం, బొబ్బిలి, సాలూరు తదితర ప్రాంతాలకు ఎక్కువ సర్వీసులు తిప్పారు. ఈ స్పెషల్ బస్సుల ద్వారా సంక్రాంతి దాకా రూ.79,81,655, అనంతరం రూ.74,64,119 వెరసి రూ. 1,54,45,774 రాబడి వచ్చింది. గత సంక్రాంతికి రూ.1,41,57,400 ఆదాయాన్ని ఆర్జించింది. అంటే గత సంక్రాంతికంటే సుమారు రూ.12 లక్షలకు పైగా ఆదాయం సమకూరిందన్న మాట! పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో మరోవైపు ఈ సంక్రాంతికి ప్రయాణికుల ఆక్యపెన్సీ రేషియో (ఓఆర్) కూడా బాగానే పెరిగింది. గతేడాది ఓఆర్ 62 శాతం ఉండగా ఇప్పుడది 67 శాతానికి చేరింది. కిలోమీటరుకు రూ.42.90 ఆదాయం సమకూరింది. కాగా సంక్రాంతి పండగకు వచ్చి తిరుగు ప్రయాణమయ్యే వారిని దృష్టిలో ఉంచుకుని ఈనెల 28వ తేదీ వరకు స్పెషల్ సర్వీసులను నడుపుతామని విశాఖ జిల్లా ఆర్టీసీ ప్రజా రవాణా అధికారి ఎ.అప్పలరాజు ‘సాక్షి’కి చెప్పారు. -
ఆర్టీసీలో ‘మానసిక’ టెన్షన్!
ముందు రోజు రాత్రివిధులు నిర్వహించి వచ్చాడు ఆ డ్రైవర్.. మరుసటి రోజు రాత్రి విధులకు వెళ్లేలోపు కనీసం నాలుగు గంటలన్నా నిద్రపోవాలి.. కానీ దగ్గరి బంధువుల ఇంట్లో వేడుకకు వెళ్లాల్సి ఉంది, సెలవులు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో పగటి పూట వేడుకలో గడిపి, 110 కి.మీ. దూరంలోని తానుంటున్న పట్టణం నుంచి సొంత వాహనం నడుపుకుంటూ హైదరాబాద్ వచ్చి విజయవాడ బస్సు తీసుకుని బయలుదేరాడు. దారిలో ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనటంతో మృతి చెందాడు. మరో 9 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ డ్రైవర్ కొన్నేళ్లుగా కుటుంబ వివాదాలతో సతమతమవుతున్నాడు.. దాదాపు కుటుంబ సభ్యులు వెలివేసినంత పనిచేశారు.. దీంతో అతని మానసిక స్థితి అదుపు తప్పింది. దూరప్రాంత బస్సు కావటంతో ఇద్దరు డ్రైవర్లు విధుల్లో ఉంటున్నారు. మరో డ్రైవర్ నడుపుతున్నప్పుడు అతను మద్యం సేవిస్తున్నాడు. ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేయగా, ఆ రోజు అధికంగా మద్యం తాగి ఉన్నట్టు తేలి అధికారులు కంగుతిన్నారు. అప్పుడు కాని అతన్ని విధుల నుంచి తప్పించలేదు. సాక్షి, హైదరాబాద్: ఇది తెలంగాణ ఆర్టీసీలో నెలకొన్న పరిస్థితి. సగటున ఒక్కో బస్సులో 60 మందికిపైగా ప్రయాణికులు ఉంటారు. వారిని క్షేమంగా గమ్యం చేర్చేది డ్రైవరే. కానీ, ఇప్పుడు ఆర్టీసీకి డ్రైవర్లపై పర్యవేక్షణే లేకుండా పోయింది. డ్రైవర్ భద్రంగా బస్సును గమ్యం చేర్చటమనేది డ్రైవింగ్ స్కిల్స్ పైనే కాకుండా, అతని మానసిక స్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే గతంలో డ్రైవర్‌పై నిఘా, పర్యవేక్షణ ఉండేది. కానీ, క్రమంగా నష్టాలను అధిగమించేందుకు ఆదాయంపైనే దృష్టి కేంద్రీకరించటం మొదలయ్యాక ఇది గతి తప్పింది. ఇప్పుడు డ్రైవర్ల కొరత కూడా ఉండటంతో, కచ్చి తంగా ఉన్నంత మంది విధులకు వచ్చేలా చూడ్డానికే అధికారులు పరిమితమవుతున్నారు. వారికి గతంలోలాగా సెలవులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో విధులు ముగిసిన తర్వాత నుంచి తిరిగి విధులకు వచ్చే వరకు ఆ డ్రైవర్ విషయాన్ని సంస్థ పట్టించుకోవటం లేదు. డ్యూటీకి వచ్చే సమయానికి అతని మానసిక స్థితి ఏంటో కూడా తెలుసుకోలేకపోతున్నారు. మద్యం తాగి ఉన్నాడా లేదా అన్న ఒక్క విషయాన్ని మాత్రమే తేల్చుకుని బస్సు అప్పగిస్తున్నారు. సెలవులు లేక.. ఒంట్లో కాస్త నలతగా ఉన్నా, విశ్రాంతి సమయంలో నిద్రపోలేని పరిస్థితిలో ఉన్నా, రకరకాల వివాదా లతో మానసికంగా ఆందోళనతో ఉన్నా.. డ్రైవింగ్ సరిగా చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో తనకు సెలవు కావాలంటూ డ్రైవర్లు అడుగుతారు. అయితే, సెలవు ఇస్తే డ్రైవర్ల కొరత వల్ల సరీ్వసునే రద్దు చేసుకోవాల్సి వస్తోంది. దీంతో వా రికి సెలవుల్లేక విధులకు హాజరు కావాల్సి వస్తోంది. విజయవాడ మార్గంలో జరిగిన యాక్సిడెంట్లో చనిపోయిన డ్రైవర్.. ఆ రోజు నిద్రలేమితో ఉండి కూడా సెలవుకు దరఖాస్తు చేయకుండా డ్యూటీకి హాజరయ్యాడని తెలిసింది. ఆ విధానమేమైంది..? గతంలో ప్రతి డిపోలో స్పేర్ డ్రైవర్లు ఉండేవారు. డ్యూటీ చేయలేని స్థితిలో డ్రైవర్ ఉంటే అతని స్థానంలో మరో డ్రైవర్‌ను పంపే వారు. కానీ 13 ఏళ్లుగా డ్రైవర్ల రిక్రూట్మెంట్ లేకపోవటం, రిటైర్మెంట్లు, మరణించడం, పదోన్నతులు.. వంటి కారణాల వల్ల డ్రైవర్లకు కొరత ఏర్పడింది. గతంలో డ్రైవర్ల మానసిక స్థితిని తెలుసుకునే విధానం ఉండేది. ఏవైనా కారణాలతో వారు మానసికంగా కుంగిపోతున్నారా అన్నది సంస్థకు తెలిసే ఏర్పాటు ఉండేది. ప్రతి సంవత్సరారంభంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించేవారు. వాటికి డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా డ్రైవర్ల స్థితిగతులపై ఆర్టీసీకి సమాచారం చేరేది. డ్రైవర్లతోపాటు, వారి కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ చేసేవారు. డ్యూటీకి–డ్యూటీకి మధ్య చాలినంత నిద్ర ఉండేలా చూడాలంటూ కుటుంబ సభ్యులకు సూచించేవారు. ఇప్పుడు ఆ వారోత్సవాలు సరిగా నిర్వహించటం లేదు. సంవత్సరంలో ఒకసారి ప్రమాదరహిత వారోత్సవాలు నిర్వహించేవారు. ఆ వారంలో ఒక్క బస్సు కూడా ప్రమాదానికి గురి కాకుండా డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలుండేవి. ఇది కూడా వారి నైపుణ్యం, మానసిక స్థితి తెలుసుకునేందుకు ఉపయోగపడేది. ఇప్పుడు దీన్ని నిర్వహించటం లేదు. వరుస ప్రమాదాలతో.. చాలా విరామం తర్వాత మళ్లీ ఆర్టీసీ డ్రైవర్ల కుటుంబ సభ్యులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. ఇటీవలి వరుస ప్రమాదాలతో సంస్థలో టెన్షన్ నెలకొంది. డ్యూటీకి వచ్చేప్పుడు సరైన స్థితితో డ్రైవర్లు ఉండేలా చూడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులది అని అధికారులు చెబుతున్నారు. వారు రెస్ట్ సమయంలో తగినంతగా నిద్రపోవటం, సెల్ఫోన్లతో ఎక్కువ సేపు గడపకుండా చూడటం, అనవసర వివాదాలతో ఒత్తిడికి గురికాకుండా చూడటం.. లాంటి అంశాలపై కుటుంబ సభ్యులు దృష్టి సారించాలని చెప్పనున్నారు. కానీ, గతంలో ఉన్నట్టు పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేస్తే తప్ప ఇది ఫలించే సూచనలు కనిపించటం లేదు. డ్రైవర్లపై పని ఒత్తిడి తగ్గటంతోపాటు డ్రైవింగ్ చేయలేని పరిస్థితి ఉంటే సెలవు ఇచ్చే ఏర్పాటు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అది జరగాలంటే, తాత్కాలిక పద్ధతిలోనైనా డ్రైవర్ల రిక్రూట్మెంట్ ఉండాలని వారు పేర్కొంటున్నారు. -
దసరాకు ఆర్టీసీ ‘ స్పెషల్’!
యాదాద్రి: తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన దసరాకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ ఏటా స్పెషల్ బస్సులు నడుపుతోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులతో మంచి ఆదాయాన్ని అర్జిస్తోంది. ఇందులో భాగంగానే ఈనెల 13వ తేదీ నుంచి 15 వరకు, తిరిగి 19 నుంచి 22వ తేదీ వరకు నల్లగొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలో 409 బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారు. గతేడాది మాదిరిగానే ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలనే వసూలు చేయనున్నారు. ఇక ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నియామకం తర్వాత వినూత్న కార్యక్రమాలతో ముందుకు వస్తుండగా.. రాఖీ సందర్భంగా సత్ఫలితాలు ఇచ్చిన గిఫ్ట్‌ల కార్యక్రమాన్ని ఈ పండుగకు ప్రవేశపెట్టనున్నారు. 10 మందికి రూ.9,900 చొప్పున నగదు బహుమతులు ఇవ్వనున్నారు. 10 మంది ప్రయాణికులకు గిఫ్ట్‌లు ప్రయాణికుల ఆదరణ పొందడం.. తద్వారా మంచి ఆదాయాన్ని గడించేందుకు వినూత్న కార్యక్రమాలతో ఆర్టీసీ ముందుకు వస్తోంది. రాఖీ సందర్భంగా చేపట్టిన బహుమతుల పథకానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ దసరాకు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం రీజియన్ పరిధిలో ఐదుగురు మహిళలు, ఐదుగురు పురుషులను ఎంపిక చేయనున్నారు. పండుగకు ముందు ఈనెల 21 నుంచి 23 వరకు, పండుగ తర్వాత 28నుంచి 30వ తేదీల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు తమ టికెట్ వెనుక పేరు, ఫోన్‌నంబర్ రాసి.. ఆర్టీసీ ఏర్పాటు చేసే బాక్సుల్లో వేయాల్సి ఉంటుంది. ఈ బాక్సులను నల్ల గొండ, దేవరకొండ, చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, కొండమల్లేపల్లి, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట హైటెక్ బస్టాండ్, కొత్తబస్టాండ్, యాదగిరిగుట్ట కొత్త బస్టాండ్, పాతబస్టాండ్, భువనగిరి బస్టాండ్లలో ఏర్పాటు చేయనున్నారు. రద్దీ రోజులను గుర్తించి.. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా నల్లగొండ, నార్కట్‌పల్లి, మిర్యాలగూడ, దేవరకొండ, కోదాడ, సూర్యాపేట, యాదగిరిగుట్ట మొత్తం ఏడు ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ప్రధానంగా ఉమ్మడి జిల్లావాసులు ఉద్యోగాలు, ఇతర పనులు, విద్య కోసం రాజధాని హైదరాబాద్‌లోనే అధికంగా ఉంటుంటారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ఉండడం, బతుకమ్మ, దసరా అతి పెద్ద పండుగలు కావడంతో పెద్దఎత్తున జనం సొంత గ్రామాలకు తరలి వస్తుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ఆయా డిపోలకు వచ్చే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. మొదట్లో విద్యాసంస్థలకు సెలవు ఉండడంతో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు, తర్వాత సాధారణ జనం రద్దీ కారణంగా 19నుంచి 22వ తేదీ వరకు.. ఇలా మొత్తంగా ఏడు రోజుల పాటు ప్రయాణికుల రద్దీ ఉంటుందని భావించి ఆయా తేదీల్లో రాజధానికి అదనపు బస్సులు నడపనున్నారు. 409 బస్సులు.. సాధారణ చార్జీలు పండుగ నేపథ్యంలో ఆర్టీసీ నల్లగొండ రీజియన్ పరిధిలో మొత్తం 409 బస్సులతో అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. మొదటిరోజు శుక్రవారం ఏడు డిపోల నుంచి 56 బస్సులను నడిపారు. ఇక 14వ తేదీన 36 బస్సులు నడపనున్నారు. 15వ తేదీన 35 బస్సులు తిప్పుతారు. తిరిగి ఈనెల 19న 71 బస్సులు, 20వ తేదీన 56 బస్సులు, 21వ తేదీన 75 బస్సులు, 22వ తేదీన 80 బస్సులు నడపనున్నారు. అయితే గతంలో స్పెషల్ బస్సులను నడిపితే 20 శాతం మేర చార్జీలు అదనంగా వసూలు చేసేవారు. 2022లో బస్ చార్జీలు రెండుసార్లు పెంచడం, చిల్లర సమస్యతో మరోసారి పెంచడంతో గతేడాది దసరా స్పెషల్ బస్సులకు చార్జీలను పెంచలేదు. ఈ సారి కూడా రోజువారీగా వసూలు చేసే చార్జీలనే తీసుకోనున్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి బతుకమ్మ, దసరా పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నల్లగొండ రీజియన్ పరిధిలో 409 ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ప్రయాణికులు స్పెషల్ బస్సులను సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణికుల రద్దీని బట్టి ఇంకా అదనంగా సర్వీసులు నడుపుతాం. ఈ పండుగకు నగదు బహుమతులు అందిస్తున్నాం. – ఎస్.శ్రీదేవి, ఆర్టీసీ ఆర్ఎం, నల్లగొండ -
అడ్రస్ లేని ఆర్టీసీ బంకులు.. ఒకటితోనే సరి !
భద్రాద్రి : తీవ్ర నష్టాల బారి నుంచి బయటపడేందుకు ఆర్టీసీ స్థలాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. సంస్థ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టీసీని ప్రగతిబాట పట్టించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్లు, వాటి పరిసరాల్లోని ఖాళీ స్థలాల్లో హిందుస్థానన్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలతో రాష్ట్రంలోని 46 చోట్ల పెట్రోల్ బంకులు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జిల్లాలో కొత్తగూడెం, బూర్గంపాడు, చర్ల, ఇల్లెందు, చండ్రుగొండ, మణుగూరు, వెంకటాపురంలో బంకుల ఏర్పాటుకు అవకాశం కల్పించారు. ఆర్టీసీ స్థలాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుతో దాని ద్వారా వచ్చే లీజు ఆదాయ వనరులతో పాటు ఇంధన సంస్థలు కొంతమేర కమీషన్‌ను ఆర్టీసీకి చెల్లిస్తాయి. ఈ ప్రక్రియలో మొదట జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో పెట్రోల్ బంక్‌కు ప్రాధాన్యత కల్పించారు. కొత్తగూడెంలో బంక్ అందుబాటులోకి తేవడంతో వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మిగతా ఆరు చోట్ల కూడా స్థలాలను గుర్తించిన ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. అయితే ఇందులో మణుగూరు, బూర్గంపాడు ఇంధన వ్యాపారానికి అనుకూలంగా లేవని గుర్తించిన ఉన్నతాధికారులు.. కొత్తగా దమ్మపేటలో బంక్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు రావాల్సి ఉంది. ప్రతిపాదనలు పంపి నెలలు గడుస్తున్నా బంకుల ఏర్పాటులో ఎలాంటి పరోగతి కనిపించడం లేదు. స్థలాలను సద్వినియోగం చేసేలా.. రోజువారీ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా ఆక్యుపెన్సీ రేషియోతో పాటు ఆదాయం పెంచుకుంటున్న ఆర్టీసీ.. మరింతగా ఆదాయం పెంచుకునేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం డిపోల పరిధిలో ప్రధాన రహదారుల పక్కనే ఆర్టీసీకి స్థలాలు ఉన్నాయి. డిపోల పక్కన ఏర్పాటు చేయబోయే బంకులను సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించారు. సొంతంగా పెట్రోల్ బంకుల నిర్వహణ చేపడితే స్థలాలకు ఆయా చమురు సంస్థల నుంచి లీజుతో పాటు లీటర్ పెట్రోల్‌పై రూ.2.83, డీజిల్‌కు రూ.1.89 పైసల చొప్పున కంపెనీలు ఇచ్చే కమీషన్ కూడా ఆర్టీసీకే సమకూరుతుంది. జిల్లాలోని మూడు డిపోల పరిధిలో ఆర్టీసీకి అత్యంత విలువైన స్థలాలు ఉన్నాయి. కొత్తగూడెం పాతబస్ డిపో ఏరియాలో 2.50 ఎకరాలు, పాల్వంచలో 1.50 ఎకరాలు, చండ్రుగొండలో సుమారు ఎకరం, భద్రాచలంలో 6 ఎకరాలు, ఇల్లెందులో 6 ఎకరాలు, బూర్గంపాడులో 2.50 ఎకరాలు, మణుగూరులో 8 ఎకరాలు, అశ్వాపురంలో 2 ఎకరాల చొప్పున ఆర్టీసీకి స్థలాలున్నాయి. వీటితో పాటు చర్ల, వెంకటాపురంలో కూడా అనువైన స్థలాలే ఉన్నాయి. వీటి పరిధిలో బంకు ఏర్పాటుకు అవసరమైన 1000 గజాల స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలోని ఏడు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఒక్క కొత్తగూడెంలో మాత్రమే ప్రారంభించారు. మిగిలిన చోట్ల కూడా ఏర్పాటు చేస్తే సంస్థకు గణనీయమైన ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయి. ప్రక్రియ నడుస్తోంది ఆర్టీసీ స్థలాల్లో సంస్థ ఇప్పటికే పెట్రోల్ బంకులను ఏర్పాటు చేస్తోంది. దీని వల్ల లీజు, కమీషన్ పద్ధతుల్లో సంస్థకు కొంత ఆదాయం సమకూరుతుంది. జిల్లాలో మొదట ఏడు చోట్ల ఆర్టీసీ బంకుల ఏర్పాటుకు స్థలాలు గుర్తించి ప్రతిపాదనలు పంపాం. తొలి ప్రాధాన్యతగా కొత్తగూడెం డిపో పరిధిలో ఇటీవలే పెట్రోల్ బంకును ప్రారంభించాం. మిగిలిన చోట్ల అనుకూలమైన వాటికి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఇందుకోసం ప్రాసెన్ నడుస్తోంది. – భవానీప్రసాద్, డిప్యూటీ ఆర్ఎం(మెయింటెనెన్స్) -
కావేరి జలాల వివాదం.. నేడు బెంగళూరు బంద్
బెంగళూరు: కావేరీ నీటి వివాదం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. తమిళనాడుకు ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కావేరీ నీటిని విడుదల చేయడాన్ని వివిధ కన్నడ సంఘాలు తప్పుపడుతున్నాయి. తమిళనాడుకు 15 రోజులపాటు రోజూ 5 వేల క్యూసెక్కుల కావేరి నీటినివిడుదల చేయాలని కావేరి వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ (సిడబ్ల్యుఎంఎ) ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా దాదాపు 300కు పైగా సంస్థలు మంగళవారం బెంగళూర్ బంద్‌కు పిలుపునిచ్చాయి. రైతు నాయకుడు కురుబూర్ శాంతకుమార్ నేతృత్వంలోని రైతు సంఘాలు, ఇతర సంస్థల ఆధ్వర్యంలో ‘కర్ణాటక జల సంరక్షణ సమితి’ పేరుతో బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆందోళన కారుల పిలుపు మేరకు బెంగుళూర్ బంద్ కొనసాగుతోంది. నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సలను ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు. దీంతో కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ క్రమంలో బెంగళూరు వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం అర్థరాత్రి వరకు 144 సెక్షన్ విధించారు. అలాగే నేడు నగరంలో ఎలాంటి ఊరేగింపులకు అనుమతులు లేవని తేల్చిచెప్పారు. స్వచ్చందంగా బంద్‌ను పాటించాలని, బలవంతంగా బంద్‌ను అమలు చేయకూడదని బెంగళూరు పోలీస్ కమిషనర్ సూచించారు. స్కూల్స్, కాలేజీలు బంద్ బంద్ నేపథ్యంలో మంగళవారం బెంగుళూరులోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు బెంగళూరు అర్భన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ దయానంద్ కేఏ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అదే విధంగా ఆటోలు, ట్యాక్సీ యూనియన్లు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. మెట్రో, ఆర్టీసీ సేవలు యధాతథం అయితే మెట్రో సేవలు బంద్ పిలుపుతో ప్రభావితం కాకుండా యథాధావిధిగా పనిచేయనున్నాయి. ఓలా, ఉబర్ వంటి సర్వీసులు సైతం పనిచేయనున్నాయి. తాము బంద్‌కు మద్దతు తెలపడం లేదని, తమ సర్వీసులు పనిచేస్తాయని ఓలా ఉబర్ యాజమాన్యాలు ప్రకటించాయి. హోటళ్ల యజమానుల సంఘం కూడా బంద్‌కు మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్ల కూడా తెరుచుకొని ఉండనున్నాయి. #WATCH | Karnataka: Bengaluru Bandh has been called by various organizations regarding the Cauvery water issue. According to BMTC, all routes of Bengaluru Metropolitan Transport Corporation will be operational as usual. (Visuals from Majestic BMTC Bus stop, Bengaluru) pic.twitter.com/fSZSeLyKMh — ANI (@ANI) September 26, 2023 వీటితోపాటు బెంగుళూరు ఆర్టీసీ బస్సులు కూడా బంద్‌తో సంబంధం లేకుండా యథావిధిగా తమ సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. అయితే కర్ణాటక-తమిళనాడు సరిహద్దుల్లో మాత్రం తమిళనాడు బస్సుల ప్రవేశాన్ని నిలిపివేశారు. బెంగళూరు బంద్ దృష్ట్యా తమ ప్రయాణాలను అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని విమాన ప్రయాణికులను అభ్యర్థిస్తూ బెంగళూరు విమానాశ్రయం ఓ ప్రకటన విడుదల చేసింది. #WATCH | An auto driver at Majestic BMTC Bus stop, Bengaluru, Naseer Khan says "We support the bandh called by various organisations. When the Cauvery water issue comes, we have a very clear stand that Karnataka will not provide water to anyone. Only night drivers are here, autos… pic.twitter.com/jMeVz3GeB8 — ANI (@ANI) September 26, 2023 విమానాశ్రయానికి ప్రయాణించేటప్పుడు విలైనంత త్వరగా బయలుదేరాలని ఇండిగో సూచించింది. బంద్ కారణంగా సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చని.. డొమెస్టిక్ ప్రయాణానికి రెండున్నర గంటల ముందు, అంతర్జాతీయ ప్రయాణానికి మూడున్నర గంటల ముందు చేరుకోవాలని ట్విటర్లో తెలిపింది. కర్ణాటకలో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ మంగళవారం బంద్‌కు మద్దతు తెలిపింది. బెంగళూరు బంద్‌కు జేడీఎస్ కూడా మద్దతు తెలిపింది. బంద్‌కు తమ పార్టీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ నేత హెచ్డీ కుమారస్వామి తెలిపారు. కాగా, తమిళనాడుకు కావేరీ నీటి విడుదలకు వ్యతిరేకంగా కర్ణాటకలో మంగళవారం చేపట్టిన నిరసనలను నిషేధించేలా కేంద్రం ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు కావేరి రైతుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. నిరసనలకు ప్రభుత్వం అనుమతి అయితే బెంగళూరు బంద్‌కు కర్ణాటక ప్రభుత్వం అనుమతినిచ్చింది. తమ ప్రభుత్వం నిరసనలను అడ్డుకోబోమని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఈ ఆందోళనలను కట్టడి చేయబోమని హామీ ఇచ్చింది. అయితే బంద్ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కూడా ముఖ్యమని చెప్పారు. కావేరీ జలాలపై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తామని పేర్కొన్నది. ఏంటీ కావేరి వివాదం? తమిళనాడుకు 15 రోజుల పాటు రోజుకు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అధారిటీ కర్నాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే నీటిని విడుదల చేయడానికి వీలులేదంటూ కర్నాటకలోని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. దీంతో కర్నాకట ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో కర్నాటక ప్రభుత్వం నీటిని విడుదల చేయాలని నిర్ణయించుకుంది. దీంతో పలు ప్రజాసంఘాలు బెంగళూరు బంద్‌కు పిలుపునిచ్చాయి. -
‘పల్లెవెలుగు’లో మరో రాయితీ టికెట్
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల్లో వెళ్లే ప్రయాణికులను బస్సుల వైపు మళ్లించేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్తగా పల్లె వెలుగు బస్సుల్లో 30 కి.మీ. దూరం ప్రయాణించే వారికి రాయితీ టికెట్‌ను అందుబా టులోకి తీసుకువచ్చింది. కొద్ది రోజుల క్రితం సంస్థ టీ9–60 పేరుతో పల్లెవెలుగు బస్సుల్లో 60 కి.మీ. పరిధిలో తిరిగే ప్రయాణికులకు రూ.100కే రాను పోను రాయితీ టికెట్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దానికి స్పందన తక్కువగా ఉండటంతో, ఇప్పుడు టీ9–30 పేరుతో 30 కి.మీ. పరిధిలో తిరిగే వారికి రూ.50కే రానుపోను వర్తించేలా రాయితీ టికెట్‌ను ప్రారంభించింది. ఈ టికెట్లు గురువారం నుంచి కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. ఆటోల్లో ప్రయాణించేవారిపై గురి.. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఆటోలను ఆశ్రయి స్తున్నారు. పల్లెవెలుగు బస్సు టికెట్‌పై రాయితీ ప్రకటిస్తే వారిలో కొందరైనా బస్సులెక్కు తారని ఆర్టీసీ భావిస్తోంది. ప్రస్తుతం పల్లెవెలుగు బస్సుల్లో 30 కి.మీ. నిడివిలో ప్రయాణించే వారి సంఖ్య దాదాపు మూడున్నర లక్షలుగా ఉంది. అంతకు రెట్టింపు జనం అదే పరిధిలో ఆటోల్లో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తెచ్చిన రాయితీ టికెట్ తీసుకుంటే.. రూ.50తో గమ్యం వెళ్లితిరిగి రావచ్చు. దానికి అదనంగా రూ.20 చెల్లించి కాంబి టికెట్ తీసుకుంటే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా అదే టికెట్‌తో రాను, పోనూ ప్రయాణించవచ్చు. కొద్ది రోజుల క్రితం 60 కి.మీ. నిడివిలో ప్రయాణించేవారికోసం రూ.100కే రానుపోను టికెట్ తీసుకురాగా, 60 కి.మీ. పరిధిలో తిరిగే ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో దానికి పెద్దగా స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో చాలా మంది డిపో మేనేజర్లు కోరటంతో కొత్త విధానం ప్రారంభించారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ టికెట్ చెల్లుబాటులో ఉంటుంది. సాయంత్రం 6 వరకు టికెట్ల జారీ ఉంటుంది. 30 కి.మీ. పరిధిలో పొరుగు రాష్ట్రంలో ప్రయాణం ఉంటే.. అక్కడ కూడా ఇది చెల్లుబాటు (టీఎస్ఆర్టీసీ బస్సుల్లోనే) అవుతుందని అధికారులు ప్రకటించారు. ఈ కొత్త టికెట్‌కు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం బస్‌భవన్‌లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్‌లు ఆవిష్కరించారు. -
త్రుటిలో ప్రమాదం తప్పింది!
ఫిరంగిపురం: ప్రమాదవశాత్తు వ్యాన్‌ను ఢీకొని ఆర్టీసీ బస్సు రోడ్డు మార్జిన్‌లోని పొలాల్లోకి వెళ్లింది. ఈ సంఘటన మండల కేంద్రంలోని రేపూడి గ్రామశివారులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హిందూపురం నియోజకవర్గం మడకశిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో విజయవాడ వెళు తోంది. నంద్యాల నుంచి బట్టల లోడుతో విజయవాడ వెళుతున్న వ్యాన్‌కు మండలంలోని రేపూడి గ్రామశివారులో ఎదురుగా ఆటో రావడంతో షడన్ బ్రేకు వేసి రోడ్డు పక్కకు వచ్చాడు. అదే సమయంలో వెనుకగా వస్తున్న ఆర్టీసీ బస్సు వ్యాన్‌ను ఢీకొని రోడ్డు పక్కగా ఉన్న పొలాల్లోకి జారిపోయింది. సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది ప్రయాణికులు బస్సు డ్రైవర్లు పాపయ్య, నాగరాజులకు ఎటువంటి ప్రమాదం సంభవించ లేదు. వ్యాను డ్రైవర్‌కు ఏ ప్రమాదం జరగలేదు. దీంతో స్థానికులు బస్సులోని ప్రయాణికులను అటుగా వస్తున్న మరో బస్సులో విజయవాడకు పంపించి వేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు నమోదు చేసినట్లు తెలిపారు. -
RTC: ప్రమాదాల విరుగుడుకు మూడో మిర్రర్!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు దిగిన భార్యాభర్తలు మరో బస్సు ఎక్కాలన్న ఆత్రుతలో దిగిన బస్సు ముందు నుంచే రోడ్డు దాటబోయారు. వారు రోడ్డు దాటుతున్నది కనిపించక బస్సు డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. బస్సు తగిలి ఇద్దరూ కింద పడిపోగా బస్సు చక్రాలు వారిని చిదిమేశాయి. కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్‌లో జరిగిన దుర్ఘటన అక్కడి వారిని కలిచివేసింది. ఇందులో తప్పెవరిది..? బస్సు డ్రైవర్‌కు కొన్ని కోణాల్లో ముందున్న ప్రాంతం కనిపించదు. అందులో ముఖ్యమైంది బస్సు ముందు దాదాపు మూడునాలుగు అడుగుల స్థలం. దాన్నే బ్లైండ్స్పాట్గా చెబుతారు. తక్కువ ఎత్తున్న వారు, బస్సు రేడియేటర్ ముందు నుంచి ద్విచక్రవాహనంపై వెళ్లేవాళ్లు ఆ ప్రాంతంలో బస్సును దాటుతున్నప్పుడు వారిని గుర్తించటం డ్రైవర్‌కు సాధ్యం కాదు. ఆ ప్రాంతంలో ఎవరూ బస్సు దాటకూడదని తరచూ ఆర్టీసీ అధికారులు ప్రకటనలు చేస్తున్నా చాలామంది అవగాహన లేక దాటుతూ బస్సు చక్రాల కింద నలిగిపోతున్నారు. దానికి విరుగుడుగా ఆర్టీసీ బస్సు ముందుభాగంలోని ‘కనపడని ప్రాంతం’డ్రైవర్‌కు కనిపించేలా ప్రత్యేకంగా మిర్రర్ ఏర్పాటు చేస్తోంది. ప్రత్యేక ఏర్పాటు కొంతకాలంగా ఆర్టీసీ బస్సులకు ముందు భాగంలో మూడు మిర్రర్లు కనిపిస్తున్నాయి. ఆయా డిపోల్లో ప్రత్యేకంగా వాటిని బిగిస్తున్నారు. బస్సు ముందు భాగంలో ఉండే రెండు అద్దాల మధ్య బయటి నుంచి ఈ మిర్రర్ ఏర్పాటై ఉంటోంది. ఇటీవల కొత్తగా కొనుగోలు చేసిన సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులకు మాత్రం బస్సు ముందు రెండు వైపులా ఉండే సైడ్ మిర్రర్ రాడ్లకే ఈ ప్రత్యేక మిర్రర్ బిగించి ఉంది. బస్సు బాడీని నిర్మించేటప్పుడే వీటిని బిగిస్తుండటం విశేషం. బస్సు ఆగినప్పుడు అందులోంచి దిగిన వారో, ఆ బస్సు ఎక్కాలన్న ఆత్రుతలో పక్క నుంచి వచ్చిన వారో బస్సు ముందు భాగం నుంచి దాటుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. అలాంటి ప్రమాదాల్లో ఎక్కువ మంది మృత్యువాతపడుతున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్టీసీ పెద్దమొత్తంలో నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తోంది. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా ఆర్టీసీ అధికారులే ఈ ఆలోచన చేశారు. ఆ మిర్రర్ లో బస్సు ముందు భాగం డ్రైవర్‌కు స్పష్టంగా కనిపిస్తుంది. బస్సును ముందుకు కదిలించేప్పుడు ఆ మిర్రర్‌ను చూసి ముందు భాగంలో ఎవరూ లేరని నిర్ధారించుకున్నాకే కదిలించాలని డిపో మేనేజర్లు డ్రైవర్లకు సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని బస్సులకు వీటిని బిగించారు. కొద్ది రోజుల్లో అన్ని బస్సులకు ఏర్పాటు చేయనున్నారు. -
మస్త్ పైసల్!...లాభాల బాటలో మెదక్ డిపో
మెదక్‌జోన్ : మెదక్ ఆర్టీసీ డిపో లాభాల బాటలో దూసుకుపోతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ముందంజలో ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మెదక్, జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, నర్సాపూర్, సిద్దిపేట, గజ్వేల్, ప్రజ్ఙాపూర్, దుబ్బాక డిపోలు ఉన్నాయి. వాటిలో ఆదాయం రాబట్టడంలో మెదక్ ప్రథమ స్థానంలో ఉంది. ● మెదక్ డిపోలో మొత్తం 98 బస్సులు ఉన్నాయి. వాటిలో 66 ప్రైవేట్ బస్సులు, 35 ఆర్టీసీ సంస్థకు చెందినవి ఉన్నాయి. వీటిలో 8 ఎక్స్‌ప్రెస్, 10 డీలక్స్, 2 సూపర్ లగ్జరీలు ఉండగా, మిగతావి ఆర్డినరీ బస్సులు ఉన్నాయి. ● ఈ బస్సులు నిత్యం 35,180 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండగా 36, 800 కిలో మీటర్ల వరకు ప్రయాణం చేస్తున్నాయి. లెక్కల ప్రకారం తిరగాల్సిన దానికన్న 1,620 కిలోమీటర్లు అదనంగా తిరుగుతున్నాయి. దీంతో రోజుకు రూ.15 లక్షల ఆదాయం రావాల్సి ఉండగా రూ.16.50 లక్షల ఆదాయం వస్తుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ● ఈ లెక్కన మెదక్ డిపోకు నెలకు రూ.4.50 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా, ఏకంగా రూ.4.95 కోట్లు వస్తుంది. అంటే నెలకు రూ.45లక్షలు అదనంగా ఇన్‌కం వస్తుంది. అలాగే ఇందుకు భిన్నంగా గత ఏప్రిల్, మే నెలల్లో ఏకంగా రూ.11.45 కోట్ల ఆదాయం వచ్చిందని, ఇందులో ఆర్టీసీకి అదనంగా కోటి రూపాయల ఆదాయం రావడం ఉమ్మడి జిల్లాలోనే రికార్డుగా నిలిచిందని అధికారులు తెలిపారు. ఆదాయం సమకూరే రూట్లు ఇవే.. మెదక్ జిల్లాలో మెదక్ డిపోతో పాటు పాతబస్టాండ్, రామాయంపేట బస్టాండ్, కౌడిపల్లి బస్టాండ్, చేగుంట, నర్సాపూర్ డిపోలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మెదక్ –జేబీఎస్, మెదక్– పటాన్చెరువు, మెదక్– సిద్దిపేట రూట్లలో అధిక ఆదాయం వస్తుంది. అలాగే పాత బస్సుల స్థానంలో 8 కొత్త బస్సులను వేశారు. అందులో 2 సూపర్ లగ్జరీ, 6 డీలక్స్ బస్సులు ఉన్నాయి. బీదర్‌తో పాటు కర్నూల్, తిరుపతి ప్రాంతాలకు నిత్యం మెదక్ డిపో నుంచి బస్సులను నడుపుతున్నారు. ఆర్టీసీ అందిస్తున్న సబ్సిడీలు ఆర్టీసీ పలు రకాల సబ్సిడీలు అందిస్తుంది. ప్రధానంగా డయాలసిస్ పేషెంట్లకు, జర్నలిస్టులకు ఫ్రీబస్ పాస్‌తో పాటు 80 శాతం సబ్సిడీపై విద్యార్థులకు బస్ పాస్‌లను అందిస్తోంది. అలాగే బస్సులో ప్రయాణిస్తుండగా ఏదేని ప్రమాదంలో మరణిస్తే బాధిత కుటుంబానికి పరిహారం కూడా ఇస్తారు. కార్గోతో ఆదాయం 2020లో ప్రవేశ పెట్టిన కార్గో సర్వీస్ ద్వారా ఆర్టీసీ ఆర్థికంగా పుంజుకుందని చెప్పవచ్చు. ఈ సర్వీస్‌కు ప్రజలు త్వరగా కనెక్టు అయ్యారు. ఏదేని వస్తువును పంపాలన్నా, ఉత్తరాల నుంచి మొదలుకుని వస్తువుల వరకు త్వరగా చేరవేయటంలో కార్గో సక్సెస్ అయ్యింది. ప్రయాణంలో ఆర్టీసీ ఎంత సురక్షితమో వస్తు రవాణాలో కార్గో కూడా అంతే సుక్షితమనే భావనను ప్రజల్లో కలిగించింది. కొత్త విధానాలతో మార్పు ఆర్టీసీ సంస్థ అమలు చేస్తున్న కొత్త విధానాలతో ప్రజలకు మరింత చేరువైంది. ఆర్టీసీ బస్ ఆఫీసర్ పేరుతో గ్రామానికో వ్యక్తిని నియమించారు. గ్రామాల్లో ఎవరికై నా పెళ్లి బస్సులు కావాలన్నా, ఆయా గ్రామాల్లో పండగలు, జాతరలు జరిగే సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడపటం, ప్రైవేట్ వాహనాలతో పోల్చుకుంటే ఆర్టీసీ ప్రయాణం ఎంతో సురక్షితమైనదిగా ప్రజలకు అవగాహన కలిపించటం వీరి విధి నిర్వహణ. ఇలాంటి నిర్ణయాలతో ఒకప్పుడు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ సంస్థ ఉమ్మడి మెదక్ జిల్లాతో పోల్చితే మెదక్ డిపో లాభాల బాటలో నడుస్తోంది. లాభాల బాటలో.. మెదక్ ఆర్టీసీ డిపో లాభాల బాటలో నడుస్తోంది. నా తోటి ఉద్యోగులతో పాటు కార్మికుల సమష్టి కృషి ఫలితంగానే డిపోను ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఆదాయంలో ముందంజలో ఉంచాం. అందరి సహకారంతో ఇలాగే అధిక లాభాలు గడిస్తాం –రవిచందర్, డీఎం, మెదక్ -
మహిళా ప్రయాణికులకు రూ.80 కే టీ–24 టికెట్
హైదరాబాద్: మహిళా ప్రయాణికులకు టీ–24 టికెట్లపైన ఆర్టీసీ రాయితీ కల్పించింది. రూ.80 లకే ఈ టికెట్లు లభించనున్నాయి. మంగళవారం నుంచి ఈ రాయితీ సదుపాయాన్ని నగరంలోని సిటీ బస్సుల్లో అందుబాటులోకి తేనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళల కోసం ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించేందుకు ఆర్టీసీ టి–24 టికెట్లను అందజేస్తున్న సంగతి తెలిసిందే. సాధారణ ప్రయాణికులకు రూ.90లకు విక్రయిస్తుండగా, సీనియర్ సిటిజన్లకు రూ.10 తగ్గింపుతో రూ.80 కే అందజేస్తోంది. తాజాగా మహిళా ప్రయాణికులకు సైతం ఈ రాయితీ సదుపాయాన్ని అందజేశారు. సిటీ పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయి. రోజుకు 40 వేల టిక్కెట్లు... గ్రేటర్లో ప్రయాణికులకు ఎంతో సదుపాయంగా ఉన్న టి–24 టిక్కెట్ల అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. గతంలో రోజుకు 25 వేల టికెట్లు అమ్ముడు కాగా, ఇప్పుడు వాటి సంఖ్య రెట్టింపైనట్లు పేర్కొన్నారు. గతంలో ఈ టిక్కెట్ల ధర రూ.100 ఉండగా రూ.90 తగ్గించారు. ఆ తరువాత సీనియర్ సిటిజన్లకు, ప్రస్తుతం మహిళలకు మరింత రాయితీనిచ్చి రూ.80కే విక్రయిస్తున్నారు. ధర తగ్గింపు తర్వాత ప్రతి రోజు సగటున 40 వేలకు పైగా టికెట్లు అమ్ముడవుతున్నాయి. గతంలో రోజుకు 25 వేలు మాత్రమే విక్రయించేవారు. మరోవైపు మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం టి–6 టికెట్ పేరుతో రూ.50 టికెట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఈ టికెట్లపైన ప్రయాణం చేయవచ్చు. అలాగే వీకెండ్స్, సెలవు రోజుల్లో నలుగురు కలిసి ప్రయాణం చేసేందుకు ఎఫ్–24 టికెట్లను రూ.300కు అందజేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు ఎక్కండి, తీర్థయాత్రలు పూర్తి చేసుకోండి
సాక్షి, విశాఖపట్నం : ఆదాయం పెంపు కోసం ఆర్టీసీ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ప్రయాణికుల ద్వారా వచ్చే రాబడికంటే దానికయ్యే ఖర్చే అధికంగా ఉంటోంది. అయినప్పటికీ సేవా దృక్పథంతో ప్రజల కోసం బస్సులను నడుపుతోంది. దీంతో ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే లాజిస్టిక్స్ ద్వారా ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. కొత్తగా కార్గోలో డోర్ డెలివరీ, పికప్ సదుపాయాలను కూడా ప్రవేశపెట్టింది. దీనికి వినియోగదార్ల నుంచి ఆదరణ బాగుంటోంది. ఈ నేపథ్యంలో సరికొత్తగా టెంపుల్ టూరిజంపై ఫోకస్ పెట్టింది. ఇందులోభాగంగా విశాఖపట్నం నుంచి తమిళనాడులోని అరుణాచలం, పొరుగున ఒడిశాలో ఉన్న పూరీ సహా మరికొన్ని పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఇప్పటికే నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి అరుణాచలానికి 120 వరకు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. ప్రతి పౌర్ణమికి అరుణాచల గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని విశాఖ (ద్వారకా బస్‌స్టేషన్) నుంచి అరుణాచలానికి ప్రతి పౌర్ణమికి ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ఆర్టీసీ జోన్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.రవికుమార్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. మే 5 నాటి పౌర్ణమికి 3వ తేదీ నుంచే ఇక్కడ నుంచి ఈ బస్సులు బయలుదేరేలా ప్రణాళిక రూపొందించామన్నారు. అరుణాచలం వెళ్లేటప్పుడే కాణిపాకం, శ్రీపురం, కంచి, శ్రీకాళహస్తి దేవాలయాలను కూడా దర్శించుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. పౌర్ణమి దర్శనం అయ్యాక ఏడో తేదీన విశాఖలో చేరుస్తామన్నారు. సూపర్ లగ్జరీ సర్వీసుకు రూ.4,000, ఇంద్ర ఏసీ సర్వీసుకు రూ.5,000 చొప్పున ఒక్కొక్కరికి టిక్కెట్టు ధర నిర్ణయించామన్నారు. ఈ యాత్రకు ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకునే వీలు కల్పించామన్నారు. పూరీ, భువనేశ్వర్‌లకు కూడా.. మరోవైపు పొరుగున ఒడిశాలోని కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు కూడా స్పెషల్ ప్యాకేజీతో బస్సులను నడపనున్నట్టు ఈడీ రవికుమార్ తెలిపారు. పూరీలోని జగన్నాథస్వామి, భువనేశ్వర్‌లోని లింగరాజస్వామి, కోణార్క్ సూర్య దేవాలయం, చిలక సరస్సుల సందర్శనకు ప్రతి వారాంతం (శనివారం)లో వీటిని నడుపుతామన్నారు. ఈనెల 29 నుంచి ఈ బస్సులను ప్రారంభిస్తామన్నారు. ఈ ప్యాకేజీలో (సూపర్ లగ్జరీ) టిక్కెట్టు ధర రూ.2,350గా నిర్ణయించామని చెప్పారు. డిమాండ్‌ను బట్టి ఏసీ సర్వీసులను కూడా ప్రవేశపెడతామన్నారు. అరుణాచలంతో పాటు ఒడిశా పుణ్యక్షేత్రాలకు ఏడాది పొడవునా ఈ టెంపుల్ టూరిజం బస్సులు నడుపుతామని తెలిపారు. మీడియా సమావేశంలో ఆర్టీసీ డీపీటీవో బలిజి అప్పలనాయుడు, డిప్యూటి సీటీఎం జి.సత్యనారాయణ, విశాఖ డిపో మేనేజర్ గంగాధరరావులు పాల్గొన్నారు. -
Vizag: ఇన్ఫోసిస్ కోసం చకచకా.. విశాఖలో పూర్తి స్థాయి కార్యకలాపాలు
సాక్షి, విశాఖపట్నం: దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ విశాఖలో పూర్తి స్థాయి కార్యకలాపాలు చేపట్టడానికి అవసరమైన చర్యలను జిల్లా యంత్రాంగం చకచకా తీసుకుంటోంది. ఇప్పటికే విశాఖ రుషికొండ ఐటీ సెజ్‌లో అక్టోబర్ ఒకటిన ఇన్ఫోసిస్ శాటిలైట్ కార్యాలయాన్ని తెరిచింది. త్వరలోనే ఈ ఐటీ సెజ్ నుంచి ఉద్యోగులు విధులు నిర్వహించడానికి ఇన్ఫోసిస్ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తమకు అవసరమైన వనరులు, సదుపాయాల గురించి ఇన్ఫోసిస్ ప్రతినిధులు పరిశ్రమల శాఖ, ఆర్టీసీ, పోలీసు, జీవీఎంసీ తదితర అధికారులతో ఇటీవల చర్చించారు. నగరం నుంచి రుషికొండ ఐటీ సెజ్‌కు ఆ సంస్థ ఉద్యోగులు రాకపోకలు సాగించడానికి వీలుగా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను కోరారు. ఇందుకు ఆర్టీసీ అధికారులు సమ్మతిని తెలియజేశారు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తారు. అందువల్ల 24 గంటలూ బస్సు సర్వీసులు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. ఇన్ఫోసిస్ అవసరాలకు ప్రత్యేకంగా బస్సులను కేటాయించడానికి కూడా తమకు అభ్యంతరం లేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఐటీ సెజ్‌కు ఎన్ని బస్సుల అవసరం అన్నది ఉద్యోగుల సంఖ్యను బట్టి ఉంటుందని, దీనిపై కొద్ది రోజుల్లోనే స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. జనవరి నాటికి తమకు బస్సుల అవసరం ఉంటుందని ఇన్ఫోసిస్ ప్రతినిధులు చెప్పారని, కావలసినన్ని బస్సులను నడపడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పినట్టు ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎ.అప్పలరాజు ‘సాక్షి’కి చెప్పారు. రోడ్లకు మరమ్మతులు.. వీధిలైట్లు.. మరోవైపు భీమిలి వెళ్లే బీచ్ రోడ్డు నుంచి ఐటీ సెజ్‌కు వెళ్లే రోడ్డు మరింత మెరుగు పరచడంతో పాటు మరమ్మతులు చేపట్టేందుకు జీవీఎంసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. అలాగే రాత్రి వేళల్లో రాకపోకలు సాగించే వారు ఇబ్బందులు పడకుండా ఆ రోడ్డుకు ఇరువైపులా పూర్తి స్థాయిలో వీధి లైట్లను ఏర్పాటు చేయనున్నారు. భద్రతకు పెద్దపీట ఐటీ సెజ్‌కు వెళ్లే దారిలో భద్రత (సెక్యూరిటీ)పై కూడా దృష్టి సారిస్తున్నారు. ఆ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలను, ఆకతాయిలు, తాగుబోతులు, అల్లరి మూకల ఆగడాలను కట్టడి చేయడానికి పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం పోలీసులతో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఇన్ఫోసిస్‌తో పాటు ఐటీ సెజ్‌లో విధులు నిర్వహించడానికి వెళ్లి వచ్చే ఉద్యోగినులు ఎలాంటి భయాందోళనలకు ఆస్కారం లేకుండా చూస్తారు. త్వరలో విశాఖ క్యాంపస్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు పరిశ్రమల శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నామని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఎ.రామలింగేశ్వరరాజు ‘సాక్షి’కి చెప్పారు. ఇందుకోసం సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నామని తెలిపారు. -
TSRTC: సుందర జలపాతాలు చూసొద్దాం రండి..
సాక్షి, హైదరాబాద్: పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులకు శుభవార్త. జలపాతాల సందర్శనకు తెలంగాణ ఆర్టీసీ ప్రతి శని, ఆదివారాల్లో బస్సులు నడపాలని నిర్ణయించింది. ఆదిలాబాద్‌లోని కుంటాల జలపాతాన్ని సందర్శించేందుకు ఈ సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈప్రత్యేక బస్సులు ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 5 గంటలకు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ప్లాట్‌ఫామ్ 55, 56) నుంచి, ఉదయం 5.30 గంటలకు జూబ్లీ బస్‌స్టేషన్ (ప్లాట్‌ఫామ్ 20) నుంచి బయల్దేరుతాయి. పర్యటనలో భాగంగా పోచంపాడ్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, పోచేరా జలపాతం సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆదిలాబాద్‌లోని కుంటాల జలపాతాన్ని, అనంతరం నిర్మల్ బొమ్మలు, హస్తకళలను సందర్శిస్తారు. రాత్రి 10.45 గంటలకు తిరిగి నగరానికి చేరుకుంటారు. (క్లిక్: ఆర్టీసీ ‘హైదరాబాద్ దర్శిని’.. వీకెండ్లో స్పెషల్ సర్వీసులు) ఈ పర్యటనలో కుంటాల వద్ద మధ్యాహ్న భోజనం, తిరుగు ప్రయాణంలో చేగుంట వద్ద రాత్రి భోజన సదుపాయం ఉంటుంది. పిల్లలకు రూ.599, పెద్దవాళ్లకు రూ.1099 చొప్పున చార్జి ఉంటుంది. పర్యటన టిక్కెట్ల బుకింగ్ కోసం ఫోన్ : 7382842582 నంబర్‌ను సంప్రదించవచ్చు. (క్లిక్: పెద్ద జబ్బులకు ఉచితంగా పీహెచ్‌సీల్లో చికిత్స) -
263 అద్దె బస్సులకు ఆర్టీసీ టెండర్లు
సాక్షి, అమరావతి: ప్రజారవాణా విభాగం (ఆర్టీసీ) మరో 263 అద్దె బస్సుల కోసం టెండర్లు పిలిచింది. ఆసక్తి ఉన్నవారు ఎంఎస్టీసీ ‘ఈ’ కామర్స్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని టెండర్లు దాఖలు చేయవచ్చు. ఈ నెల 23న ఉదయం 10 గంటల నుంచి అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టెండర్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 19న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహిస్తామని ఆర్టీసీ ఈడీ కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కేటగిరీల వారీగా టెండర్లు పిలిచిన అద్దె బస్సులు ఏసీ స్లీపర్ 4, నాన్ ఏసీ స్లీపర్ 6, సూపర్ లగ్జరీ 12, అల్ట్రా డీలక్స్ 15, ఎక్స్‌ప్రెస్ 30, అల్ట్రా పల్లె వెలుగు 95, పల్లె వెలుగు 72, మెట్రో ఎక్స్‌ప్రెస్ 27, సిటీ ఆర్డినరీ 2. జిల్లాల వారీగా టెండర్లు పిలిచిన అద్దె బస్సులు శ్రీకాకుళం జిల్లా 23, పార్వతీపురం మన్యం 29, విజయనగరం 12, విశాఖపట్నం 42, అనకాపల్లి 16, కాకినాడ 35, తూర్పుగోదావరి 2, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ 24, పశ్చిమ గోదావరి 29, కృష్ణా 4, ఎన్టీఆర్ 3, గుంటూరు 2, పల్నాడు 2, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 5, తిరుపతి 8, అన్నమయ్య 5, నంద్యాల 3, అనంతపురం 8, శ్రీసత్యసాయి జిల్లా 11. బస్సు రూట్లు, టెండరు నిబంధనల కోసం సంప్రదించాల్సిన ఆర్టీసీ వెబ్సైట్: https:// apsrtc.ap.gov.in -
AP: అదనపు చార్జీల్లేకుండానే దసరా స్పెషల్ బస్సులు
సాక్షి, అమరావతి: ప్రయాణికులపై అదనపు చార్జీల భారం లేకుండానే దసరా ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు చెప్పారు. దశాబ్దకాలం తరువాత ఇలా అదనపు చార్జీలు లేకుండా ఆర్టీసీ దసరా ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహించడం ఇదే తొలిసారని తెలిపారు. విజయవాడలోని బస్‌భవన్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది దసరా రద్దీ దృష్ట్యా 4,500 ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహిస్తామని చెప్పారు. దసరా ఉత్సవాల ముందు ఈ నెల 29 నుంచి అక్టోబరు 4 వరకు 2,100 బస్సులు, దసరా తరువాత అక్టోబరు 5 నుంచి 9 వరకు 2,400 బస్సులు నడుపుతామని తెలిపారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులతోపాటు రాష్ట్రంలోని 21 నగరాలు, ముఖ్య పట్టణాలకు ప్రత్యేక బస్సులు నడుపుతామని చెప్పారు. అన్ని సర్వీసుల్లోను యూటీఎస్ విధానాన్ని అమలు చేస్తూ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్లు, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా టికెట్లు తీసుకోవచ్చని వివరించారు. అన్ని బస్సులను జీపీఎస్ ట్రాకింగ్ విధానంతో అనుసంధానించి కంట్రోల్ రూమ్ నుంచి 24/7 పర్యవేక్షిస్తామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపే ప్రైవేటు బస్సులను నిరోధించేందుకు పోలీసు, రవాణా శాఖలతో కలసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఈ–బస్ సర్వీసులు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆర్టీసీ ఈ–బస్ సర్వీసులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో 10 ఈ–బస్సులను నడుపుతామన్నారు. అనంతరం దశలవారీగా డిసెంబర్ నాటికి తిరుమల–తిరుపతి ఘాట్‌రోడ్డులో 100 ఈ–బస్ సర్వీసులను ప్రవేశపెడతామని చెప్పారు. తిరుమల ఘాట్రోడ్తోపాటు రాష్ట్రంలో దూరప్రాంత సర్వీసుల కోసం కొత్తగా 650 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. గత ఏడాది 1,285 బస్సులను ఫేస్‌లిఫ్ట్ విధానంలో నవీకరించామని ఈ ఏడాది రూ.25 కోట్లతో మరో 1,100 బస్సులను నవీకరిస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు అక్టోబర్ 1 నుంచి కొత్త పేస్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తామన్నారు. ఇటీవల పదోన్నతులు పొందిన దాదాపు రెండువేల మందికి సాంకేతికపరమైన అంశాలను పూర్తిచేసి నవంబర్ 1 నుంచి కొత్త పేస్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఈడీ (కమర్షియల్) కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఆర్టీసీ కొత్త ప్రయత్నం.. ఆర్టీసీ ఆధ్వర్యంలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు
-
‘ఎమర్జెన్సీ సైరన్ అండ్ టైమర్’
కొత్తపేట: రోడ్డు ప్రమాదాలు రెప్పపాటులో జరిగిపోతున్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరింత మంది క్షతగాత్రులవుతున్నారు. అటువంటి ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం నివారణకు ‘ఎమర్జెన్సీ సైరన్ అండ్ టైమర్’ను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన వీవీవీ సత్యనారాయణరాజు తయారు చేశారు. రావులపాలెం ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆయన తన ఆలోచనతో దీనిని రూపొందించారు. ప్రమాదాలు జరగకుండా వాహన డ్రైవర్‌తో పాటు ప్రయాణికులను అప్రమత్తం చేసే ఈ ‘ఎమర్జెన్సీ సైరన్ అండ్ టైమర్’ గురించి ఆయన ‘సాక్షి’కి వివరించారు. తయారు చేసే విధానం ఎలక్ట్రానిక్ పరికరాలతో ఎమర్జెన్సీ సైరన్ అండ్ టైమర్‌ను తయారు చేశారు. దానికి పైన బ్లాక్ బటన్ అమర్చారు. అది టైమర్. ఎడమవైపు కింద రెడ్ స్విచ్ ఉంటుంది. అది సైరన్ మోగడానికి ఉపయోగించారు. కుడివైపున కింద ప్రెస్ బటన్. అది ప్రెస్ చేశాక సైరన్‌కు పవర్ వెళ్లకుండా నిలిపివేస్తుంది. పరికరానికి బ్యాటరీ ద్వారా సప్లయి ఇచ్చారు. మూడు రకాలుగా ఉపయోగం ఈ పరికరానికి బ్యాటరీ సప్లయి ఇచ్చిన తరువాత పవర్ సైరన్ ఆఫ్, ఆన్ స్విచ్‌కు వెళుతుంది. ఈ స్విచ్ ఆన్ చేయగానే సైరన్ మోగుతుంది. బస్సులో వైర్లు, షార్ట్ సర్క్యూట్ జరిగి పొగ గాని మంటలు గాని వచ్చినప్పుడు ఈ స్విచ్ ద్వారా డ్రైవర్ సైరన్ మోగించి ప్రయాణికులను అప్రమత్తం చేయవచ్చు. బస్ లేదా ఇతర వాహనం నుంచి కిందకు దించి వారి ప్రాణాలు కాపాడవచ్చు. డ్రైవర్‌కు అనారోగ్యం కారణంగా లేదా గుండెపోటు వంటివి వస్తే బస్‌ను కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఈ స్విచ్ ఉపయోగించి ఎమర్జెన్సీ సైరన్ మోగించడం ద్వారా ప్రయాణికులను అలర్ట్ చేయవచ్చు. దూర ప్రాంత సర్వీసు బస్సులలో డ్రైవర్‌కు తెల్లవారు జామున నిద్రవచ్చి అదుపు తప్పడం, బ్రిడ్జిలపై నుంచి నదులలో, లోయల్లో పడి ప్రాణనష్టం జరుగుతుంది. అటువంటి ప్రమాదాలు జరగకుండా పవర్నాబ్ (స్విచ్) ఆన్ చేసి ఉంచగా దానిలో గల టైమర్ నిమిషానికి 6 సెకన్ల చొప్పున బల్బు వెలుగుతూ, ఆరుతూ డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. దానితో డ్రైవర్ దానిని గమనించి ప్రెస్ బటన్ నొక్కుతాడు. బల్బు నిమిషం పాటు ఆఫ్ అవుతుంది. ఒకవేళ డ్రైవర్ ఆ బల్బును గమనించకపోతే (నిద్రపోతే) సైరన్ మోగి డ్రైవర్‌ను అలెర్ట్ చేస్తుంది. ప్రయాణికులు కూడా గమనించి డ్రైవర్ వద్దకు వచ్చి అప్రమత్తం చేయవచ్చు. ఈ విధంగా ‘ఎమర్జెన్సీ సైరన్ అండ్ టైమర్’ ప్రమాదాల నివారణకు దోహదపడుతుంది. ప్రమాదాలు చూసి.. ఆలోచించి.. తాను ఆర్టీసీ డ్రైవర్‌గా అనేక రోడ్డు ప్రమాదాలు చూశాను. వీటిని ఏదో రకంగా అరికట్టాలనే ఉద్దేశంతో డ్రైవర్, ప్రయాణికులను అప్రమత్తం చేసే ‘ఎమర్జెన్సీ సైరన్ అండ్ టైమర్’ను రూపొందించాను. దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలకు రూ.3 వేలు అయ్యింది. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్లపై చర్యలు తీసుకుంటున్నారు. కానీ ప్రమాదాల నివారణకు పైవిధంగా ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. ప్రమాదాలు అరికట్టేందుకు చిన్న పరికరాలతో సైరన్ అండ్ టైమర్ వంటివి ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలి. –వీవీవీ సత్యనారాయణరాజు, ఆర్టీసీ డ్రైవర్, రావులపాలెం డిపో -
Telangana: బస్సుల్లో లగేజీ చార్జీలను భారీఎత్తున పెంచిన ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ప్రయాణికుల లగేజీపై దృష్టి సారించింది. బస్సుల్లో తరలించే సామగ్రిపై విధించే చార్జీలను భారీఎత్తున పెంచేసింది. పల్లె వెలుగు బస్సుల్లో 25 కి.మీ. దూరానికి ఇప్పటివరకు ఉన్న రూపాయి చార్జీని ఏకంగా రూ.20కి పెంచింది. ఎక్స్‌ప్రెస్, ఆపై కేటగిరీ బస్సుల్లో ఇదే దూరానికి ఉన్న రూ.2 చార్జీని రూ.50కి పెంచింది. సిటీ బస్సుల్ని కూడా వదలకుండా పాత చార్జీలతో పోల్చుకుంటే పెద్దమొత్తంలో చార్జీలు వసూలు చేయనుంది. కొత్త చార్జీలను ఈ నెల 22 నుంచే అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది. 2002 నాటి చార్జీలే ఇప్పటివరకు.. బస్సుల్లో లగేజీ చార్జీలు 2002లో ఖరారు చేసినవే ఇప్పటికీ అమలవుతున్నాయి. అప్పటి నామమాత్రపు రుసుములే కొనసాగుతున్నాయి. 2002 తర్వాత పలుమార్లు టికెట్ చార్జీలు పెరిగినా లగేజీ చార్జీలను మాత్రం సవరించలేదు. ఇటీవల నష్టాలను పూడ్చుకునేందుకు డీజిల్ సెస్ విధింపు, ఆ వెంటనే దాని సవరింపుతో టికెట్ రూపంలో ఆదాయాన్ని భారీగా పెంచుకున్న ఆర్టీసీ..తాజాగా లగేజీ చార్జీలను పెంచడంతో పాటు పకడ్బందీగా వసూలు చేయాలని నిర్ణయించింది. ఇంతకాలం ఇవి రూపాయి, రెండు రూపాయలు.. ఇలా మాత్రమే ఉండగా, ఇప్పుడు ఆర్టీసీ సరుకు రవాణా (కార్గో) చార్జీలకు దాదాపు సమంగా పెంచేసింది. ఒక్కో బస్సులో గరిష్ట లగేజీ పరిమితి ఇలా.. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ 750 కిలోలు సూపర్ లగ్జరీ 1,000 కిలోలు 50 కిలోలు మించితే బాదుడే.. ఒక్కో ప్రయాణికుడు/ప్రయాణికురాలు తమ వెంట 50 కిలోల బరువుండే సామగ్రిని ఉచితంగా తీసుకెళ్లొచ్చు. అంతకంటే మించి ఉండే సామగ్రిపై చార్జీలు విధిస్తారు. 25 కిలోల వరకు బరువును ఓ యూనిట్‌గా పరిగణిస్తారు. అంటే ఉచిత పరిమితికి మించి ఒక కిలో ఎక్కువున్నా సరే, దాన్ని ఒక యూనిట్‌గానే పరిగణించి చార్జీ వడ్డిస్తారు. 25 కిలోల కంటే ఒక కిలో ఎక్కువున్నా..దాన్ని రెండో యూనిట్‌గా పరిగణించి చార్జీ విధిస్తారు. ఆ మేరకు చార్జీలు నిర్ధారించారు. పల్లె వెలుగులో అయితే ప్రతి 25 కి.మీ చొప్పున, ఎక్స్‌ప్రెస్, ఆ పై కేటగిరీలో ప్రతి 50 కి.మీ చొప్పున చార్జీ మారుతుంది. మూడు ప్యాకెట్లు మించకూడదు! ►ప్రయాణికుడు ఉచితంగా తీసుకెళ్లే 50 కిలోల బరువు కూడా మూడు ప్యాకెట్ల (బ్యాగులు, సూట్‌కేసులు వగైరా)కు మించి ఉండకూడదు. ►ప్రతి ప్యాకెట్ 20 కిలోల బరువు మించి ఉండకూడదు. ఒకవేళ ఉచిత పరిమితిలోపు ఉండే బరువు మూడు ప్యాక్‌లకు మించితే అదనపు ప్యాక్‌లపై చార్జీ విధిస్తారు. ►ఒక్కో ప్రయాణికుడు వంద కిలోలకు మించిన బరువును తీసుకెళ్లరాదు. వంద కిలోల్లో 50 ఉచితం కాగా, మిగతాది చార్జీ పరిధిలోకి వస్తుంది. ►చార్జీ విధించే 50 కిలోల బరువు రెండు ప్యాకెట్లలో మాత్రమే ఉండాలి. మూడో ప్యాక్ ఉంటే దాన్ని అదనపు యూనిట్‌గా భావించి అదనపు చార్జీ విధిస్తారు. ►100 కిలోలకు మించి బరువు ఉంటే ప్రయాణికుల బస్సుల్లో అనుమతించరు. కార్గో బస్సుల్లోనే తరలించాలి. జంతువుల తరలింపు అనుమతించరు ►బస్సుల్లో నిషేధిత వస్తువులు, అగ్ని ప్రమాదాలకు కారణమయ్యేవి, అటవీ సంబంధిత వస్తువులు, పెంపుడు జంతువులు సహా ఏ జంతువులనూ అనుమతించరు. ►భారీ వస్తువులు, పాడయ్యే వస్తువులకు రెట్టింపు చార్జీ విధిస్తారు. ట్రక్ టైర్‌ను మూడు యూనిట్లుగా పరిగణిస్తారు. టీవీ, రిఫ్రిజరేటర్, సైకిల్, ఫిల్మ్ బాక్స్ (ప్యాక్డ్), వాషింగ్ మెషీన్, కార్ టైర్.. వీటిని రెండు యూనిట్లుగా పరిగణిస్తారు. ►చాలాచోట్ల కూరగాయలు, పాలు, పండ్లను ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తున్నారు. ఇప్పుడు అలాంటి రైతులు భారీగా చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. దుర్వినియోగం అరికట్టేందుకు.. ఆర్టీసీకి సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా కార్గో బస్సులున్నాయి. కానీ కొంతమంది కార్గో చార్జీలను తప్పించుకునేందుకు సరుకును ప్రయాణికుల బస్సుల్లో తరలిస్తున్నారు. వీటి చార్జీ నామమాత్రంగా ఉండటంతో, డ్రైవర్/కండక్టర్లకు కొంత మొత్తం ముట్టచెప్పి సరుకు తరలిస్తున్నారు. దీంతో ఆర్టీసీ నష్టపోతోంది. దీన్ని నివారించేందుకు ఈ చార్జీలను పెంచినట్టు ఆర్టీసీ పేర్కొంటోంది. -
జనారే.. సజ్జనారే!.. పండగ రద్దీ
అఫ్జల్‌గంజ్: విధి నిర్వహణలో ఆయనదో విలక్షణ ముద్ర. పోలీస్ అధికారిగా ఆయనది సంచలన చరిత్ర. ఏ శాఖలో పనిచేసినా తనదైన శైలిలో దూసుకువెళ్లే ప్రత్యేకత. ఆయనే ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్. ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలోనే ఆర్టీసీలో ఎన్నో సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారు. సంస్థ అభివృద్ధికి, ప్రయాణికుల అభిమానాన్ని చూరగొనేందుకు ఇతోధికమైన కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం మహాత్మా గాంధీ బస్‌స్టేషన్‌లో ఆయన పర్యటించారు. బస్సులోకి వెళ్లి డ్రైవర్లను ఆప్యాయంగా పలకరించారు. ప్రయాణికులకు నమస్కరించారు. వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. బస్సులో ఓ తల్లి ఒడిలో ఉన్న చిన్నారిని ఎత్తుకుని అలరించారు. ఆర్టీసీ ప్రచార కళాకారులతో కలిసి ఫొటో దిగారు. సంక్రాంతి వేళ భారీ రద్దీ నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటించి గమ్యస్థానాలకు సురక్షితంగా వెళ్లాలని ప్రయాణికులకు ఆయన సూచించారు. ఎంతైనా సజ్జనార్.. సజ్జనారే! పండగ రద్దీ సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ కోసం సిటీ నుంచి జనం బుధవారం కూడా భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఏపీ, టీఎస్ ఆర్టీసీలతోపాటు ప్రైవేట్ బస్సులు కిక్కిరిసిపోయాయి. విజయవాడ, విశాఖపట్టణం, రాజమండ్రి, అమలాపురం తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులన్నీ నిండిపోయాయి. పండగ రద్దీతో ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, కూకట్పల్లి, ఎల్బీనగర్ తదితర ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి. -
ఇక్కడింకా నడుస్తూనే ఉన్నారు
సాక్షి, యాదాద్రి: ఏదైనా ఘటన జరిగినప్పుడు అధికారులు, నాయకులు చేసే ఆర్భాటం, హడావుడి అంతాఇంతాకాదు, హామీల మీద హామీలు ఇస్తుంటారు. వాటిని వెంటనే నెరవేరుస్తామని నమ్మబలుకుతారు. ఆ తరువాత అతీగతీ ఉండదనడానికి హాజీపూర్ ఉదంతమే చక్కని ఉదాహరణ. 2019లో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో వెలుగు చూసిన బాలికలపై అత్యాచారం, హత్యల నేపథ్యంలో బస్సు సౌకర్యం కల్పిస్తామన్న హామీ నెరవేరలేదు. హాజీపూర్ నుంచి బాలికలు ప్రతిరోజూ కాలినడకన మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మోడల్ స్కూల్‌కు వెళ్లి వస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్‌రెడ్డి ట్రాప్ చేసి, ముగ్గురు బాలికలపై హత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన 2019 ఏప్రిల్ 26న వెలుగు చూసింది. నిందితుడు ప్రస్తుతం చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. దారుణ సంఘటన అనంతరం హాజీపూర్ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం, గ్రామం పక్కన గల శామీర్‌పేట వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపడతామని అధికారులు అప్పట్లో హామీలు ఇచ్చారు. ఇంతవరకు అవి అమలైన దాఖలా లేదు. ప్రస్తుతం హాజీపూర్ నుంచి 16 మంది బాలికలు ప్రస్తుతం కాలినడకన బొమ్మలరామారం మోడల్ స్కూల్‌కు వెళ్లి వస్తున్నారు. ఉదయం 8 గంటలకు కాలినడకన బయలుదేరి 9.30 వరకు పాఠశాలకు చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు తిరిగి బయలుదేరి 6 గంటల వరకు ఇళ్లకు చేరుకుంటారు. పిల్లలు నడుచుకుంటూ వెళ్తుంటే కొందరు ఆకతాయిలు అప్పుడప్పుడు వేధిస్తున్నారు. ఆ విద్యార్థినుల బాధలేమిటో వారి మాటల్లో.. ఆకతాయిలతో ఇబ్బంది స్కూల్ నుంచి ఇంటికి కాలినడకన వెళ్లే సమయంలో కొందరు యువకులు బైక్‌లపై వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. మాకు తాకేలా దగ్గర నుంచి వేగంగా వెళ్తున్నారు. స్టంట్స్ చేస్తున్నారు. వెకిలిచేష్టలు చేస్తున్నారు. చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నాం. – గొండ్రు అర్చన, 6 వ తరగతి బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నాం ఆ ముగ్గురు బాలికలను చంపిన బావులకు సమీపంగా నడిచేటప్పుడు భయం వేస్తోంది. గతంలో జరిగిన సంఘటనలు జరగకుండా ప్రభుత్వం మాకు రవాణా సౌకర్యాలు కల్పించాలి. గ్రామం నుంచి మా బడి వరకు బస్సు నడపాలి. – సిరిమిల్ల శ్వేత, ఇంటర్ సెకండ్ ఇయర్ 3 గంటలు నడుస్తున్నాం ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి పాఠ శాలకు గంటన్నర సమయంలో చేరుకుంటున్నాం. పుస్తకాలు, నోట్‌పుస్తకాల బరువుతో బ్యాగ్ మోయలేకపోతున్నాం. రోజూ మూడు గంటల సమయం కాలినడకకే సరిపోతుంది. – ధీరావత్ సరిత, ఇంటర్ సెకండియర్ -
ఆ రోజు వీఐపీలకు అనుమతివ్వకండి
సాక్షి, హైదరాబాద్: ‘‘మేడారం.. శుక్రవారం.. సమ్మక్క, సారలమ్మ దేవతలిద్దరూ గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. లక్షల్లో భక్తులు దర్శించుకుంటున్నారు. ఇక భక్తుల రద్దీ మరీ పెరిగిపోవటంతో దర్శించుకున్నవారిని వేగంగా ఆ ప్రాంతం నుంచి తరలించేందుకు అధికారుల సూచనతో ఆర్టీసీ బస్సులు బయలుదేరుతున్నాయి. నిమిషానికి 20 బస్సులు బయలుదేరేలా ఏర్పాట్లు జరిగాయి. కానీ అదే సమయంలో కొందరు వీఐపీలు వస్తున్నా రన్న సమాచారంతో పోలీసులు ప్రధాన రోడ్డుపైకి బస్సులను రాకుండా ఆపేశారు. అలా 2 గంటలపాటు బస్సులు నిలిచిపోవటంతో, ఆ ప్రాంతంలో విపరీతమైన రద్దీ ఏర్పడింది. భక్తుల్లో అసహనం పెరిగింది. క్యూలైన్లు అదుపుతప్పాయి. అంతా గందరగోళం.. పరిస్థితి అదుపు తప్పి తొక్కిలసలాటకు దారితీస్తుండగా... అతికష్టమ్మీద అధికారులు అదుపు చేశారు’’ఇది గత జాతరలో నెలకొన్న పరిస్థితి.. ఉన్నత స్థానాల్లో ఉండీ అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించిన రాజకీయ నేతలు, వారికి దారి ఇప్పించే అత్యుత్సాహంతో పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలపాలైంది. ఏమాత్రం అదుపుతప్పి తొక్కిసలాట జరిగినా... పర్యవసానం భయంకరంగా ఉండేది. రద్దీని నివారించేందుకు ముందస్తు సన్నాహాలు... ఈసారి ఆ పరిస్థితి పునరావృతం కాకూడదంటే, సమ్మక్క, సారలమ్మలు గద్దెలపై కొలువుదీరిన రోజు వీఐపీలకు అనుమతివ్వొద్దని.. ఆర్టీసీ, పోలీసు అధికారులకు సూచించింది. వచ్చే ఫిబ్రవరి రెండో వారంలో జరగనున్న మేడారం జాతరకు మెరుగైన రవాణా వసతి కల్పించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు ముందస్తుగా సన్నాహాలు ప్రారంభించింది. తాజాగా ఆర్టీసీ అధికారులు భేటీ అయి గతంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఈసారి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈసారి 4500 బస్సులను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఉత్సవాలు జరిగే రెండో వారంలో గురు, శుక్ర, శనివారాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. అందులో శుక్రవారం ఇద్దరు దేవతలు గద్దెమీద ఆసీనులై సంయుక్తంగా దర్శనమిస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఆ సమయంలో అక్కడే ఉండేందుకు ఇష్టపడతారు. దీంతో రద్దీ పెరుగు తుంది. దర్శనం ముగిసిన వారిని వీలైనంత వేగంగా అక్కడి నుంచి తరలించటం ద్వారా, రద్దీని నియంత్రించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం పెద్దమొత్తంలో బస్సులను సిద్ధంగా ఉంచి, నిమిషానికి కనీసం వేయి మందిని తరలించాలని నిర్ణయించారు. ఇది జరగాలంటే ప్రధాన రోడ్డు క్లియర్‌గా ఉండాలి. గత జాతరలో సరిగ్గా అదే సమయంలో వీఐపీలు వచ్చారు. సాధారణ భక్తుల రాకపోకలపై రెండుగంటలపాటు పోలీసులు ఆంక్షలు విధించారు. అది సమస్యలకు కారణమైంది. ఈసారి ఆ కీలక తరుణంలో వీఐపీలు రాకుండా, వారు ముందుగానే దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆధ్వర్యంలో మరో సమావేశం ఏర్పాటు చేసుకుని తదుపరి పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. -
అంతర్రాష్ట్ర ప్రయాణం సులభతరం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అంతర్రాష్ట్ర ప్రయాణాలను మరింత సులభతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో ప్రత్యేకంగా నియమనిబంధనలు విధించాయి. క్వారంటైన్, ఐసోలేషన్ వంటివి అమలుచేశాయి. అయితే కరోనా కేసుల ఉధృతి తగ్గడంతో ప్రయాణాలను సులభతరం చేయాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. విమాన, రైలు, బస్సు ప్రయాణాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఏకీకృత ప్రొటోకాల్స్‌ను అమలు చేయాలని స్పష్టం చేసింది. వీటిని అన్ని రాష్ట్రాలు అనుసరించాలని సూచించింది. సులభతరం చేయడమంటే, ఇష్టారాజ్యంగా ప్రయాణికులు తిరగడమన్న ఉద్దేశం కాదని, అవసరమైన ఆరోగ్య ప్రొటోకాల్స్‌ను తప్పక పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఏదైనా రాష్ట్రంలో అసాధారణంగా కరోనా కేసులు పెరిగిన సందర్భాల్లో తగిన ప్రజారోగ్య చర్యలను వెంటనే ప్రారంభించవచ్చు. అటువంటప్పుడు స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్రాలు అదనపు ఆంక్షలను అమలు చేయవచ్చు. మార్గదర్శకాలు ఇవీ... ►ప్రయాణికులు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలి. కోవిడ్ సంబంధిత లక్షణాలు లేనప్పుడు మాత్రమే ప్రయాణించాలి. మాస్క్, హ్యాండ్ హైజీన్, భౌతికదూరం పాటించాలి. ►ప్రయాణ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదు. ►ప్రయాణికులందరూ తమ మొబైల్లో ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ►ప్రయాణ సమయంలో వారికి జ్వరం వచ్చినట్లయితే, వారు సంబంధిత విమాన సిబ్బందికి లేదా రైలు టీటీఈకి లేదా బస్ కండక్టర్‌కు తెలియజేయాలి. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత కూడా లక్షణాలు కనిపిస్తే, కోవిడ్ కాల్ సెంటర్‌కు వివరాలు ఇవ్వాలి. ►విమానాశ్రయాలు/రైల్వే స్టేషన్లు/పోర్టులు/బస్ స్టేషన్లలో కరోనాకు సంబంధించిన ప్రకటనలు జారీచేయాలి. ►ప్రయాణికులందరూ బయలుదేరే సమయంలో థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే విమానం/రైలు/ఓడ/బస్సు ఎక్కడానికి అనుమతిస్తారు. ►ప్రయాణికులకు శానిటైజర్లు, మాస్క్‌లను అందుబాటులో ఉంచాలి. ►ప్రయాణం తర్వాత బయటకు వెళ్లేవారికి థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలి. లక్షణాలు లేని ప్రయాణికులు 14 రోజులపాటు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలనే సలహా ఇవ్వాలి. ►ఒకవేళ ప్రయాణికుల్లో ఎవరికైనా లక్షణాలుంటే, వారిని ఐసోలేట్ చేయాలి. అవసరమైతే రోగులను తగిన ఆసుపత్రికి తరలించాలి. ►అవసరమైన రోగులకు పల్స్ ఆక్సిమీటర్, థర్మామీటర్ అందుబాటులో ఉంచాలి. శిక్షణ పొందిన సిబ్బంది కూడా ఉండాలి. ►ప్రయాణికులు ఆప్రాన్ వాడాల్సిన అవసరంలేదు. అయితే ఎయిర్‌లైన్/రైల్వే కోచ్/షిప్ క్యాబిన్లు/బస్సులో సిబ్బంది మాత్రం ఎల్లప్పుడూ మాస్క్‌లు, ఫేస్ షీల్డ్, గ్లౌజులు ధరించాలి. ఇతర తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ►విమానాలు/రైళ్లు/నౌకలు/బస్సులను క్రమం తప్పకుండా శానిటైజ్ చేయాలి. ►రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య విమానాలు, రైలు, రహదారి ద్వారా జరిగే అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ►ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో ప్రవేశించడానికి ముందు ఆర్టీపీసీఆర్ లేదా యాంటీజెన్ పరీక్షలు అవసరమైతే, విస్తృతంగా ప్రచారం చేయాలి. అయితే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులను వేసుకున్నవారిని మినహాయించాలి. -
అన్నీ కుదిరితే.. త్వరలోనే హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్లు!
సాక్షి, హైదరాబాద్: అదిగో డబుల్ డెక్కర్.. ఇదిగో డబుల్ డెక్కర్ అంటూ ఊరించిన ఆర్టీసీ చివరకు వాటి ధరతో హడలిపోతోంది. అవసరమైన నిధులపై మల్లగుల్లాలు పడుతోంది. ముందుగా ప్రతిపాదించిన ప్రకారం నగరంలో కొత్తగా 25 డబుల్ డెక్కర్లను ప్రవేశపెట్టాలంటే ఇప్పటికిప్పుడు రూ.17 కోట్లు కావాలి. అన్ని డబ్బులు లేకపోవడంతో కొత్త డబుల్ డెక్కర్ బస్సులకు ఆర్డర్ ఇవ్వలేకపోతోంది. అయితే హైదరాబాద్ సిటీ షాన్‌ను తిరిగి తెప్పించేందుకే ఈ బస్సులు కొనాలనుకున్నందున.. ఆ ఖర్చును పురపాలక పట్టణాభివృద్ధి శాఖ భరిస్తే బాగుంటుందన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇదే విషయాన్ని ఆ శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి ప్రవేశపెట్టాలన్న ఆలోచన కూడా కేటీఆర్‌దే కావటంతో సానుకూల నిర్ణయం వెలువడవచ్చనే ఆశాభావంతో ఆర్టీసీ అధికారులు ఉన్నారు. ఒక్కో బస్సు రూ.68 లక్షలు.. మొదట్లో 40 బస్సులు ప్రారంభించాలని భావించినా వాటికయ్యే వ్యయం దృష్ట్యా 25 బస్సులకు పరిమితమయ్యారు. ఈ మేరకు టెండర్లు పిలవగా, ఐషర్, అశోక్ లేలాండ్, వీరవాహన, ఎంజీ కంపెనీలు స్పందించాయి. చివరకు అశోక్ లేలాండ్ టెండర్ దక్కించుకుంది. ఆ కంపెనీ ఒక్కో బస్సుకు రూ.70 లక్షలు చొప్పున ధర కోట్ చేసింది. అయితే టీఎస్ఆర్టీసీ చర్చల నేపథ్యంలో చివరకు రూ.68 లక్షలకు ఖరారు చేసింది. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో అంత ధర పెట్టి 25 బస్సులు కొనేందుకు ఆర్టీసీ వద్ద డబ్బులు లేకపోవటంతో కొనుగోలు దిశగా ముందుకు వెళ్లలేకపోతోంది. ఆ అప్పులోంచి డబ్బులిచ్చినా.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుతో ఆర్టీసీ ఓ బ్యాంకు నుంచి రూ.500 కోట్ల రుణం తీసుకుంది. వివిధ రూపాల్లో చెల్లించాల్సినవి రూ.2 వేల కోట్లు, దగ్గరున్నవి రూ.500 కోట్లే కావటంతో సీఎంతో చర్చించిన ఎలా ఖర్చు చేయాలో నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ప్రభుత్వం రూ.1,000 కోట్లకు పూచీకత్తు ఇవ్వగా, ఆ బ్యాంకు రూ.500 కోట్లు మాత్రమే ఇచ్చింది. దీంతో మిగతా రూ.500 కోట్లను మరోచోట నుంచి తెచ్చుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. అదే అప్పు నుంచి డబుల్ డెక్కర్ బస్సులకు నిధులు కోరే ఆలోచనలో ఉంది. ఆశించిన విధంగా మంత్రి కేటీఆర్ స్పందించినా, రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు అప్పు నుంచి వాడుకునేందుకు అనుమతించినా.. కొత్త డబుల్ డెక్కర్ బస్సుల్ని మరోసారి భాగ్యనగరంలో పరుగులు తీయించేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉంది. ఒక ట్వీటు .. వెంటనే స్పందన డబుల్ డెక్కర్లు ఒకప్పుడు హైదరాబాద్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇతర ప్రాంతాల నుంచి నగర పర్యటనకు వచ్చినవారు ఈ బస్సులో ఒకసారైనా పైన కూర్చొని ప్రయాణించకుండా వెళ్లేవారు కాదు. సికింద్రాబాద్–మెహిదీపట్నం వంటి కొన్ని పరిమిత రూట్లలో ఈ బస్సులు నడిచేవి. వీటిల్లో సికింద్రాబాద్–అఫ్జల్‌గంజ్–జూ పార్క్ రూటు బాగా ప్రజాదరణ పొందింది. గత ఏడాది నవంబర్ 7న నగరవాసి ఒకరు ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్తున్న సికింద్రాబాద్–జూపార్క్ 7 జడ్ నంబర్ పాత డబుల్ డెక్కర్ ఫొటోను పంచుకుంటూ.. నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు వస్తే బాగుంటుందని ట్వీట్ చేశాడు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను ట్యాగ్ చేశాడు. దీనిపై స్పందించిన కేటీఆర్.. అప్పట్లో హైదరాబాద్‌కు అలంకారంగా ఉన్న ఆ బస్సులను ఎందుకు ఉపసంహరించుకున్నారో తెలియదని పేర్కొన్నారు. అవకాశం ఉంటే మళ్లీ నడిపే అంశాన్ని పరిశీలించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు సూచిస్తూ ట్వీట్ చేశారు. దీనికి పువ్వాడ వెంటనే ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మతో మాట్లాడటంతో డబుల్ డెక్కర్ల కొనుగోలు తెరపైకి వచ్చింది. ప్రతిపాదిత రూట్లు ఇవే.. నం.219: సికింద్రాబాద్–పటాన్చెరు వయా బాలానగర్ 229: సికింద్రాబాద్–మేడ్చల్ వయా సుచిత్ర 218: కోఠి–పటాన్చెరు 9 ఎక్స్: సెంట్రల్ బస్‌స్టేషన్–జీడిమెట్ల 118: అఫ్జల్‌గంజ్–మెహిదీపట్నం -
గ్రేటర్ ఆర్టీసీపై కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్
-
ఆర్టీసీకి దారులు మూస్తున్న ప్రైవేట్ రూట్
సాక్షి, హైదరాబాద్: నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీని మరింతగా అగాథంలోకి నెట్టే కొత్త విధానానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. నిబంధనలకు పాతరేసి స్టేజీ క్యారియర్లుగా ప్రయాణికులను తరలిస్తూ ఆర్టీసీ కొంప ముంచుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఇక దర్జాగా తిరగనున్నాయి. ఇంతకాలం టూరిస్ట్ పర్మిట్లకే పరిమితమవుతూ వచ్చిన బస్సులు ఇక సమూహాలతోపాటు వ్యక్తులుగా కూడా ప్రయాణికులను తరలించొచ్చు. దీంతో ఇప్పుడు ఆర్టీసీకి పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఏంటీ ఈ మార్పు.. కేంద్ర ప్రభుత్వం గతంలో రోడ్డు రవాణా నిబంధనల్లో చేసిన అతి కీలక సవరణ ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వచ్చింది. గతంలో టూరిస్టు పర్మిట్లతో కేవలం నిర్ధారిత ప్రాంతం నుంచి గమ్యం వరకు సమూహాలను మాత్రమే తరలించే వెసులుబాటు ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు బస్సులకు ఉండేది. ఏయే రాష్ట్రాల మీదుగా ఆ బస్సు తిరిగితే, ఆయా రాష్ట్రాలకు పర్మిట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు పర్యాటకాన్ని ప్రోత్సహించే పేరుతో కేంద్రం అఖిల భారత టూరిస్ట్ పర్మిట్ నిబంధనలను సవరించింది. ఇందులో భాగంగా కొత్త పర్మిట్ విధానం, ప్రయాణికుల తరలింపులో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. గతంలో పెళ్లి బృందాలు, యాత్రలు, ఇతర అవసరాలకు సంబంధించి ఒక ప్రాంతం నుంచి గమ్యం వరకు ఒకే బృందంగా ప్రయాణికులను తరలించేవారు. కానీ, ఇప్పుడు ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా ఎవరికి వారుగా ప్రయాణాలు చేయొచ్చు. అలాంటప్పుడు వారి గమ్యస్థానాలు కూడా వేరుగా ఉంటాయి. అంటే.. స్టేజీ క్యారియర్లుగా అధికారికంగా మారినట్టే. బస్సుకు బోర్డు పెట్టొద్దన్న నిబంధన తప్ప మిగతా అంతా ఆర్టీసీ బస్సు తరహాలోనే మారే అవకాశం కనిపిస్తోంది. పర్మిట్ ఫీజులు ఇలా.. గతంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పర్మిట్ ఫీజులు వసూలు చేసుకునేవి. ఇప్పుడు దేశం మొత్తం ఒకే పర్మిట్ ఫీజు ఉంటుంది. మొత్తం వసూళ్ల నుంచి దామాషా ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు పంచుతుంది. కొత్త ఫీజులు ఇలా... డ్రైవర్ కాకుండా తొమ్మిది మంది లోపు ప్రయాణికులుండే వాహనాలకు సంబంధించి ఏసీ వాహనాలకు రూ.25 వేలు, నాన్ ఏసీ వాహనాలకు రూ.15 వేలు, పది అంతకంటే ఎక్కువ–23 కంటే తక్కువ మంది ప్రయాణికుల సామర్ధ్యం ఉండే వాహనాలలో ఏసీ అయితే రూ.75 వేలు, నాన్ ఏసీ అయితే రూ.50 వేలు, 23 మంది ప్రయాణికులు అంతకంటే ఎక్కువ సామర్ధ్యం ఉన్న వాహనాలకు ఏసీ అయితే రూ.3 లక్షలు, నాన్ ఏసీ అయితే రూ.2 లక్షలు వార్షిక పర్మిట్ ఫీజు చెల్లించాలి. ఇది మ్యాక్సీ క్యాబ్, టూరిస్టు బస్సులకు మాత్రమే వర్తిస్తుంది. సొంత వాహనాలకు ఇది వర్తించదు. పెరగనున్న ప్రైవేటు బస్సులు ప్రస్తుతం రాష్ట్రంలో 4,575 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి. వీటిల్లో కొన్ని టూరిస్టు బస్సులు పోను, మిగతావన్నీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులే. ఆర్టీసీ తరహాలో ఇవి టికెట్లు బుక్ చేసి ప్రయాణికులను తరలిస్తున్నాయి. వీటి వల్ల సాలీనా ఆర్టీసీ రూ.3 వేల కోట్ల వరకు నష్టపోతోందన్న అంచనా ఉంది. ప్రైవేట్ బస్సులను నియంత్రించే యంత్రాంగంలోని పలువురు సిబ్బంది నిర్వాహకుల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేసి వదిలేస్తున్నారు. ఎప్పుడో ఓసారి దాడులు చేస్తూ చేతులు దులుపుకొంటున్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్టీసీ, రవాణా శాఖలతో కలిపి ఓ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించి, అప్పటి జేటీసీ వెంకటేశ్వర్లుకు బాధ్యత అప్పగించారు. కానీ, ఆ తర్వాత దాని గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆ అధికారి రిటైరయ్యే వరకు ఎలాంటి కార్యాచరణ లేకుండా పోయింది. ఇప్పుడు కొత్తవిధానం వచ్చిన నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని దూరప్రాంతాలకు అవి స్టేజీ క్యారియర్లుగా తిరిగే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఆర్టీసీకి అశనిపాతమే.. ‘కొత్తగా అమలులోకి వచ్చిన ఈ వెసులుబాటు నిజంగా ఆర్టీసీకి అశనిపాతమే కానుంది. ఊరి పేరుతో బోర్డు లేకుండా ప్రైవేటు బస్సులు స్టేజీ క్యారియర్ల తరహాలోనే తిరుగుతాయి. చర్యలు తీసుకుంటారన్న భయం కూడా ఉండదు. కేంద్రం చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకించే వెసులుబాటు ఇందులో లేకుండా పోయింది’’ –గాంధీ, రవాణా శాఖ విశ్రాంత అదనపు కమిషనర్ -
ఏపీ: డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
సాక్షి, అమరావతి: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు శుక్రవారం భారత్ బంద్‌కు పిలుపు నిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బంద్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఇదే రోజున ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కార్మికులు కూడా బంద్ చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అనేక రూపాల్లో నిరసనల కార్యక్రమాలు చేపట్టారు. అంబులెన్స్, అత్యవసర సేవలు మినహా నేడు ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత బస్సులు రోడ్డెక్కనున్నాయి. కాగా, వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు బంద్‌లో పాలుపంచుకుంటున్నాయి. బీజేపీ, జనసేన మినహా మిగిలిన రాజకీయ పార్టీలన్నీ బంద్‌కు మద్దతు తెలిపాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున బంద్‌లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. గ్రేటర్ విశాఖలో సైతం ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇక విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా పాఠశాలలు, కళాశాలలకు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాయి. అదే విధంగా వ్యాపార, వాణిజ్య సముదాయాలు సైతం బంద్‌కు మద్దతు తెలుపుతూ స్వచ్చందంగా మూతపడ్డాయి. మద్దిలపాలెం, గాజువాక జంక్షన్లో వామపక్షాలు నిరసనలు చేపట్టగా.. చిత్తూరు జిల్లాలో సైతం వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేసి విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, సాగుచట్టాలను రద్దు చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బంద్ నేపథ్యంలో డీజీపీ సవాంగ్ అవసరమైన చర్యలు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లను డీజీపీ ఆదేశించారు. చదవండి: నేడే భారత్ బంద్ -
తెలంగాణ బడ్జెట్: ‘గ్రేటర్’కు సర్కారు వారి పాట
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసుల కలల మెట్రోకు తాజా బడ్జెట్లో కాసుల వర్షం కురిసింది. మెట్రోకు రూ.వెయ్యి కోట్ల నిధులను కేటాయించడంతో ఎంజీబీఎస్–పాత నగరం (5.3 కి.మీ), రాయదుర్గం– శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (31 కి.మీ) మార్గంలో మెట్రో కూత పెడుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. గత మూడేళ్లుగా మెట్రోకు రాష్ట్ర సర్కారు మొండిచేయి చూపడంతో హైదరాబాద్ మెట్రోరైలు (హెచ్ఎంఆర్) అభివృద్ధి ప్రణాళికలు, ప్రయాణికుల వసతుల కల్పన ప్రాజెక్టులు అటకెక్కిన విషయం విదితమే. చివరకు హెచ్ఎంఆర్ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర నిర్వహణ ఖర్చులకు కూడా నిధులు లేని దుస్థితి నెలకొన్న తరుణంలో తాజా బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించడం విశేషం. తొలి విడత మెట్రో ప్రాజెక్టులో ఎంజీబీఎస్– ఫలక్‌నుమా మార్గంలో మెట్రో విస్తరణ పనులు నిధుల లేమి కారణంగా పట్టాలెక్కని విషయం విదితమే. రాయదుర్గం– శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పనులు తాజాగా ప్రభుత్వం కేటాయించిన నిధులతో మొదలవుతాయని మెట్రో వర్గాలు తెలిపాయి. పట్టాలెక్కని ఎంఎంటీఎస్! ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టుకు బడ్జెట్లో మొండిచెయ్యే దక్కింది. ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. నిధుల కొరతతో ఇప్పటికే చాలా చోట్ల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని రూట్లలో రైల్వే లైన్ల నిర్మాణం, విద్యుదీకరణ పూర్తయినా కొత్త రైళ్ల కొనుగోళ్లకు నిధులు లేక పట్టాలు అలంకారప్రాయంగా మారాయి. అయిదేళ్ల క్రితం రూ.850 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రాష్ట్రం తన వాటాగా 2/3 వంతు చొప్పున సుమారు రూ.550 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు దశలవారీగా రూ.130 కోట్లు మాత్రమే ఇచ్చింది. రైల్వేశాఖ సొంత నిధులతోనే చాలావరకు పనులు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులు లేక కొంతకాలంగా రైల్వేశాఖ సైతం చేతులెత్తేయడంతో పనులు స్తంభించాయి. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రతిపాదించిన యాదాద్రి ఎంఎంటీఎస్‌కు సైతం నిధులు కేటాయించకపోవడం గమనార్హం. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు నిర్మించదలచిన ఈ ప్రాజెక్టు మూడేళ్ల క్రితమే సర్వే పూర్తయింది. ప్రగతిరథ చక్రం రయ్ రయ్ సిటీ బస్సుకు ఊరట లభించింది. పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీకి ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. రెండేళ్లుగా ఆర్థిక నష్టాలతో పాటు ప్రయాణికుల ఆదరణను సైతం కోల్పోయిన ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పునర్వైభవాన్ని సంతరించుకొనే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రూ.1500 కోట్ల బడ్జెట్ కేటాయింపులతో పాటు, మరో రూ.1500 కోట్ల బడ్జెటేతర సహాయం అందజేయనుంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రతిపాదించిన 25 డబుల్ డెక్కర్ బస్సులతో పాటు ఎలక్ట్రిక్ బస్సులు సైతం ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. తాజా కేటాయింపులతో బస్సుల కొనుగోళ్లు వేగంగా జరిగే అవకాశం ఉంది. ‘ఆర్టీసీకి ఇది అన్ని విధాలా సానుకూల సమయం. సకాలంలోనే డబుల్ డెక్కర్ బస్సులు రోడ్డెక్కుతాయి’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కేటాయింపులతో కొత్త బస్సులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. గ్రేటర్లో పెరుగుతున్న వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయడంతో పాటు ఇప్పుడు ఉన్న బస్సులను కూడా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ సంవత్సరం కొంత ప్రగతి సాధించే అవకాశముంది. ‘మహా’ అత్తెసరు! హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కొనసాగిస్తున్న అభివృద్ధి ప్రాజెక్టులపై తాజా బడ్జెట్ ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చే బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులతో పాటు మెహిదీపట్నం, ఉప్పల్‌లో స్కైవే, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే ర్యాంపులు, చెరువులు సుందరీకరణ, నెక్లెస్ రో డ్డులో అభివృద్ధి పనులు చేస్తున్న హెచ్ఎండీఏకు ఈ బడ్జెట్లో అభివృద్ధి కార్యకలాపాల కోసం కేవలం రూ.10 లక్ష లు మాత్రమే కేటాయించడం అధికారులను విస్మయపరిచింది. ఎప్పటిలాగానే ఈసారి కూడా హెచ్ఎండీఏ సొంత ఆదాయంతోనే పనులను ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు రూ.900 కోట్లపైగా అంచనా వ్యయంతో జరుగుతున్న ఈ పనులకు ఇక హెచ్ఎండీఏ అటు కోకాపేట, ఇటు మూసాపేట భూముల విక్రయాలపై వచ్చే ఆదాయమే ఆధారం కానుంది. 158 కి.మీ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లకు 2011 నుంచి ప్రతి ఏడాది బీఓటీ అన్యూటి పేమెంట్ రెండు వాయిదాల్లో రూ.331.38 కోట్లు చెల్లిస్తోంది. 2016 నుంచి రీయింబర్స్మెంట్ విధానాన్ని తీసుకొచ్చిన హెచ్ఎండీఏ కాంట్రాక్టర్లకు రూ.440 కోట్లు చెల్లించింది. గతేడాది ఓఆర్ఆర్ బీవోటీ అన్యూటి పేమెంట్ల కింద గతంలో పెండింగ్‌లో ఉన్న వాటితో కలుపుకొని రూ.1687 కోట్లు కేటాయించాలని హెచ్ఎండీఏ ప్రతిపాదనలిస్తే కేవలం రూ.20 లక్షలు మాత్రమే కేటాయించింది. ఈసారి జైకా రుణం చెల్లింపుల కోసం రూ.478 కోట్లు అడిగితే రూ.472 కోట్లు కేటాయించారు. 2022 డిసెంబర్‌తో రుణాల చెల్లింపు ముగియనుంది. ఆర్ఆర్ఆర్.. హుషార్: భూసేకరణకు రూ.750 కోట్లు సాక్షి, రంగారెడ్డి జిల్లా: రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) నిర్మాణానికిగాను భూ సేకరణ కోసం ప్రభుత్వం రూ.750 కోట్లు కేటాయించింది. మహానగరం చుట్టూ విస్తరించిన ప్రధాన పట్టణాలను కలుపుతూ సుమారు 330 కి.మీ మేర ఆర్ఆర్ఆర్ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రెండు భాగాలుగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఆర్ఆర్ఆర్.. దక్షిణ మార్గం రంగారెడ్డి జిల్లా మీదుగా వెళ్లనుంది. చేవెళ్ల, షాబాద్, షాద్‌నగర్, కడ్తాల్, యాచారం మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ వద్ద కలుస్తుంది. సుమారు 120 కి.మీ పరిధి రంగారెడ్డి జిల్లాలో ఉండనుంది. దక్షిణ మార్గానికి ఇంకా కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించలేదు. చౌటుప్పల్ నుంచి భువనగిరి, గజ్వేల్ మీదుగా కంది వరకు విస్తరించనున్న ఉత్తర భాగానికి ఇప్పటికే కేంద్రం అనుమతిచ్చింది. తాజాగా బడ్జెట్లో భూ సేకరణకు నిధులు కేటాయించడంతో తొలుత ఈ మార్గంలో భూ సేకరణ చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దక్షిణ మార్గంలో అలైన్మెంట్ ఖరారు కావడానికి కొంత సమయం పట్టనుండటంతో భూ సేకరణ కొంత ఆలస్యం కానుంది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో జిల్లా రూపు రేఖలు మారిపోయాయి. త్వరలో ఏర్పాటు కానున్న ఆర్ఆర్ఆర్తో జిల్లా మరింత అభివృద్ధి దిశగా పయనించే వీలుంది. మూసీకి మహర్దశ: రూ.200 కోట్ల కేటాయింపులు సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని గ్రేటర్ భాగ్యరేఖ.. చారిత్రక మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ పనులకు తాజా బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో మూసీ ప్రవహిస్తున్న బాపూఘాట్ నుంచి ప్రతాప సింగారం (45 కి.మీ) మార్గంలో నదికి సమాంతరంగా ఇరువైపులా తీరైన రహదారుల ఏర్పాటు, పాదచారుల దారులు, సుందర ఉద్యానాల ఏర్పాటు, ప్రక్షాళన, సుందరీకరణ పనులు ఊపందుకోనున్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సబర్మతి, గంగా నది తరహాలో మూసీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు కాలుష్య కోరల నుంచి విముక్తి లభించనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. నగర వాసులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచడంతో పాటు గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వ్యర్థ జలాలను శుద్ధి చేసేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు ఊతం ఒకవైపు వాహన విస్ఫోటనం. మరోవైపు కాలుష్యం చిమ్ముతున్న కాలం చెల్లిన వాహనాలు. నగరజీవిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సముచితమైన ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నట్లు తాజా బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలు ఈ రంగానికి ఊతమిచ్చాయి. ఎలక్ట్రిక్ రవాణా, వ్యక్తిగత వాహనాల తయారీకి సబ్సిడీ ఇవ్వడంతో పాటు వాహన కొనుగోలుదారులకు జీవితకాల పన్ను నుంచి మినహాయింపు లభించనుంది. దీంతో నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో కేవలం 5,700 ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే నమోదయ్యాయి. సుమారు 3 వేల ద్విచక్ర వాహనాలు కాగా.. మిగతావి బస్సులు, ఇతర కేటగిరీలకు చెందిన రవాణా వాహనాలు ఉన్నాయి. మరోవైపు నగరంలో రోజురోజుకూ వాహనాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం వివిధ కేటగిరీలకు చెందిన వాహనాలన్నీ సుమారు 60 లక్షల వరకు ఉన్నాయి. వీటిలో 15 లక్షలకుపైగా కాలం చెల్లినవే. వ్యక్తిగత వాహనాలతో పాటు 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలు కూడా యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఆటో రిక్షాలు, ఇతర వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో వాహన కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర కేటగిరీల్లో ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తే పర్యావరణానికి కొంత మేరకు రక్షణ లభించనుంది. -
సిటీ బస్సుల పెంపునకు ఆర్టీసీ ప్రణాళిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్య నగరాల్లో సిటీ సర్వీసులు పెంచేందుకు ఆర్టీసీ ప్రణాళిక రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ బస్ రెజునేషన్’ స్కీం కింద ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలను ఎంపిక చేసింది. ఈ పథకం ద్వారా కేంద్రం నిధులు ఇస్తుంది. ఈ నిధులతో ఆర్టీసీ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సిటీ సబర్బన్ సర్వీసులు పెంచుకునే అవకాశం ఉంది. సెట్విన్ తరహాలో బస్సులను ప్రవేశపెట్టడం, డిపోల నిర్మాణం తదితర పనులు చేపట్టవచ్చు. కేంద్ర నిధులతో నిరుద్యోగ యువత సెట్విన్ తరహా బస్సులు కొనుక్కుని బస్సు ఆపరేటర్లుగా మారి సొంతంగా నడుపుకొనేందుకు అవకాశముంది. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 1,100 సిటీ సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది. గుంటూరులో సిటీ సర్వీసులు తిప్పేందుకు గతంలో ప్రయత్నించినా.. ఆర్టీసీకి కిలోమీటరుకు భారీ నష్టం వస్తుందని వాటి జోలికి వెళ్లలేదు. మిగిలిన నగరాల్లోనూ సిటీ సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అర్బన్ మాస్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (యూఎంటీసీ) ద్వారా అధ్యయనం చేయించనుంది. ఆర్టీసీ ఇప్పటికే కాకినాడ నగరంలో అధ్యయనం చేసింది. ఇక్కడ సిటీ సర్వీసులు పెంచేందుకు కాకినాడకు 20 కి.మీ. పరిధిలో 215 సిటీ సర్వీసులు నడిపేలా ప్రతిపాదనల్ని యూఎంటీసీకి అందించింది. మిగిలిన చోట్ల అధ్యయనం చేసి ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 20 కి.మీ. వరకు.. మొత్తం పదివేల సిటీ బస్సుల్ని తిప్పడం ఆర్టీసీ లక్ష్యంగా ఉంది. కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన ఆర్టీసీ పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రజారవాణాను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో కేంద్రం ‘నేషనల్ బస్ రెజునేషన్’ స్కీం ద్వారా ఆర్టీసీలను ఆదుకోవాలని నిర్ణయించింది. దీని ప్రకారం కిలోమీటరుకు రూ.7 వంతున సబ్సిడీ రూపంలో ఆర్టీసీకి ఇవ్వనుంది. రాష్ట్రంలో భారీగా సిటీ సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. విజయవాడలో 650కి పైగా సిటీ సర్వీసులు తిప్పుతున్నా.. ప్రజల అవసరాలకు సరిపోవడం లేదని, ఇక్కడ సర్వీసులు పెంచాలని ప్రతిపాదనలు రూపొందించారు. కేంద్ర పథకం కింద గ్రాంటుగా నిధులిస్తే తొలివిడత రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో మూడువేల బస్సులు నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. -
బస్సేది.. ఎలా వెళ్లేది..?
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో ప్రజారవాణా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కోవిడ్ కారణంగా నిలిచిపోయిన సిటీ బస్సులు 8 నెలల తర్వాత కూడా పూర్తిస్థాయిలో రోడ్డెక్కలేదు. నగరంలోని వివిధ ప్రాంతాలను కలిపే ఎంఎంటీఎస్ రైళ్లూ పట్టాలెక్కలేదు. మెట్రో రైళ్లు తప్ప ప్రయాణికులకు మరో ప్రత్యామ్నాయం లేదు. శివారు కాలనీలు, గ్రామాలను నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు అనుసంధానం చేసే సిటీ బస్సులు రద్దయ్యాయి. దీంతో రాత్రి 8 గంటలు దాటితే సిటీలో చిక్కుకున్న ప్రయాణికులు ఇళ్లకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు ఆటోలు, క్యాబ్ నిర్వాహకులు రెట్టింపు చార్జీలతో ప్రయాణికులకు చుక్కలు చూపుతున్నారు. ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నారు. ప్రధాన మార్గాల్లోని మెట్రోస్టేషన్లకు అనుసంధానంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ కార్యాచరణకు నోచుకోలేదు. ‘చక్ర బంధం’లో సిటీ బస్సు.. ⇔ కోటికి పైగా జనాభా, 625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న గ్రేటర్ అవసరాల మేరకు కనీసం 7,500 బస్సులు అవసరం. రోజురోజుకూ వందల కొద్దీ కొత్త కాలనీలు నగరంలో విలీనమవుతున్నాయి. కానీ ఇందుకు అనుగుణంగా ప్రజారవాణా సదుపాయాల విస్తరణ మాత్రం జరగడం లేదు. ⇔ ఐటీ హబ్ విస్తరణతో పాటు ఫార్మాసిటీ వంటి కొత్త ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. దీంతో ఇటు పటాన్చెరు నుంచి సదాశివపేట వరకు, అటు ఘట్కేసర్ నుంచి బీబీనగర్ చుట్టుపక్కల ఉన్న పల్లెలకు హైదరాబాద్‌తో కనెక్టివిటీ తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం సిటీ బస్సులు లేకపోవడం వల్ల ప్రజలు సెవెన్ సీటర్ ఆటోలు, టాటా ఏస్‌లు వంటి వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. మనుగడ ప్రశ్నార్థకం.. ⇔ గతేడాది ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘమైన సమ్మె చేపట్టారు. అప్పటి వరకు నగరంలో ప్రతిరోజూ 3,550 బస్సులు 33 లక్షల మందికి రవాణా సదుపాయాన్ని కలి్పంచేవి. 44 వేలకు పైగా ట్రిప్పులు తిరిగేవి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రయాణికులకు సిటీ బస్సులు అందుబాటులో ఉండేవి. ⇔ ఏ రాత్రయినా సరే ఇల్లు చేరుకుంటామనే భరోసా ప్రయాణికులకు ఉండేది. ముఖ్యంగా మహిళలు, సీనియర్ సిటిజన్లు ఎలాంటి భయం లేకుండా సిటీ బస్సుల్లో రాకపోకలు సాగించారు. ⇔ సుదీర్ఘ కార్మికుల సమ్మె తర్వాత సిటీ బస్సుల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. 800 బస్సులను పూర్తిగా విస్మరించారు. నగర శివార్లలోని పల్లెలకు రాకపోకలు సాగించే సుమారు 250 ⇔ దీంతో ఇబ్రహీంపట్నం, శంకరపల్లి, చేవెళ్ల, కీసర, పటాన్చెరు, ఘట్కేసర్ తదితర ప్రాంతాల చుట్టూ ఉన్న పల్లెలకు 80 శాతానికి పైగా సిటీ బస్సులు వెళ్లడం లేదు. పిడుగుపాటుగా ‘కోవిడ్’.. ⇔ రవాణా నిపుణుల అంచనా మేరకు గ్రేటర్ అవసరాల మేరకు 7,500 బస్సులు అవసరం. కానీ ఇప్పుడు ఉన్నవి 2,750 మాత్రమే. పైగా కోవిడ్ దృష్ట్యా దశలవారీగా బస్సులను పునరుద్ధరిస్తున్నారు. ఇప్పటి వరకు 50 శాతం బస్సులే రోడ్డెక్కాయి. ⇔ గతంలో రోజుకు 33 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తే ఇప్పుడు కనీసం 15 లక్షల మందికి కూడా సిటీ బస్సు సౌకర్యం లేకుండా పోయింది. ⇔ సాధారణంగానే ప్రతిరోజూ రూ.కోటి నష్టంతో నడుస్తున్న సిటీ బస్సులకు ఆర్టీసీ కారి్మకుల సమ్మె, కోవిడ్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ మరిన్ని నష్టాలను తెచి్చపెట్టింది. ప్రస్తుతం గ్రేటర్ ఆర్టీసీ రూ.550 కోట్లకు పైగా నష్టాల్లో ఉంది. ⇔ బస్సుల సంఖ్య తగ్గించడంతో పాటు సుమారు 2 వేల మందికి పైగా కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లను కూడా విధుల నుంచి తప్పించి డిపో అటెండర్లుగా, బంకుల నిర్వాహకులుగా, కార్గో బస్సు సిబ్బందిగా మార్చారు. ఎంఎంటీఎస్ ఎక్కడ? ⇔ ప్రతిరోజూ 1.5 లక్షల మందికి రవాణా సదుపాయంఅందజేసే 121 ఎంఎంటీఎస్ సర్వీసులు కూడా ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విస్తరణకు నోచుకోని ఎంఎంటీఎస్.. కోవిడ్ కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేశారు. గతంలో రోజుకు 121 సరీ్వసులు, 1.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఫలక్‌నుమా-లింగంపల్లి, నాంపల్లి-లింగంపల్లి, సికింద్రాబాద్-లింగంపల్లి మార్గాల్లో సర్వీసులు ఉన్నాయి. నగర శివారు ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పించే రెండో దశ ఎంఎంటీఎస్ విస్తరణ ఇప్పటికీ నోచుకోలేదు. ఘట్కేసర్–సికింద్రాబాద్, పటాన్చెరు-తెల్లాపూర్, సికింద్రాబాద్-బొల్లారం వంటి మార్గాల్లో లైన్లు పూర్తయినా రైళ్లు మాత్రం పట్టాలెక్కలేదు. నిధుల కొరత ఈ ప్రాజెక్టును వెంటాడుతోంది. ఆర్టీసీపై మెట్రో ప్రభావం గ్రేటర్ ఆర్టీసీపై మెట్రో ప్రభావం కూడా పడింది. ప్రస్తుతం నాగోల్– రాయదుర్గం, జేబీఎస్–ఎంజీబీఎస్, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలో ప్రతిరోజూ 57 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం సుమారు 1200 ట్రిప్పుల్లో ప్రయాణికులకు రవాణా సదుపాయం ఉంది. ప్రస్తుతం కోవిడ్ వల్ల ప్రయాణికుల రద్దీ తగ్గినప్పటికీ సాధారణ రోజుల్లో 3.5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. గతంలో హైటెక్‌సిటీ, కొండాపూర్, మాదాపూర్, జేఎన్టీయూ తదితర రూట్లలో ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసిన వాళ్లు క్రమంగా మెట్రోవైపు మళ్లారు. దీంతో ఆ రూట్లలో తిరిగిన సుమారు 35 ఏసీ బస్సులను ఆర్టీసీ విరమించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఈ బస్సులు నడుస్తున్నాయి. ఉపాధి కోసం నగరానికి వెళ్లేవారు గతంలో మా ఊరిలో ఆర్టీసీ బస్సు రాత్రి బస చేసేది. ఉదయమే చాలామంది నగరానికి ఉపాధి కోసం వెళ్లేవారు. గ్రామం నుంచి మెహిదీపట్నం వరకు బస్సు నడిపించేవారు. ఆ బస్సును నిలిపివేయడంతో గ్రామస్తులు ఆటోల్లో ప్రయాణిస్తున్నారు. చార్జీలు అధికంగా ఉండటంతో ఇబ్బంది పడుతున్నారు. పలుమార్లు ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. రాత్రివేళలో ఆటోలు లేక తిప్పలు తప్పడం లేదు. పాత సరీ్వసులను పునరుద్ధరించాలి. – పులకంటి భాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీ చౌదరిగూడ, ఘట్కేసర్ మా ఊరికి ఆటోలు రావు మాది మజీద్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అనుబంధంగా ఉండే పీర్లగూడెం. మండల కేంద్రానికి 8 కిలోమీటర్లు. గ్రామ పంచాయతీకి 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మాములు రోజుల్లో మా గ్రామానికి రోజుకు రెండుసార్లు మాత్రమే బస్సు వచ్చేది. కరోనా కాలం నుంచి రావడం లేదు. కనీసం ఆటో సదుపాయాలు కూడా లేవు. ఆస్పత్రికి వెళ్లాలన్నా కష్టమే.. – లక్ష్మమ్మ, పీర్లగూడెం, అబ్దుల్లాపూర్‌మెట్ -
గుడ్ న్యూస్ : నేటి నుంచి 50 శాతం బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఒక వైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందడి పుంజుకుంటోంది.మరోవైపు జంటనగరవాసులకు టీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త అందించింది. నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50 శాతం బస్సులు రోడెక్కాయి. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నగరంలోని అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సుల సర్వీసుల సంఖ్య పెంచామని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకూ గ్రేటర్ పరిధిలో 25శాతం బస్సులు మాత్రమే నడిచిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 శాతం బస్సులు తిప్పుతున్నట్లు తెలిపిన గ్రేటర్ ఆర్టీసీ వెల్లడించింది. అలాగేబస్ పాస్ కౌంటర్లను కూడా 26కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉదయం 7.30 నుండి రాత్రి 8.15 వరకు బస్ పాస్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా కరోనా వైరస్ లాక్డౌన్ తర్వాత ప్రజా రవాణాకు కేంద్రం పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చినప్పటికీ తెలంగాణాలో వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా 25 శాతం బస్సులకు మాత్రమే అనుమతినిచ్చింది. కేసుల సంఖ్య ఇప్పుడు గణనీయంగా తగ్గిందంటూ సర్కార్ తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో కరోనా మహమ్మారి కారణంగా సంక్షోభంలో పడిన ఆర్టీసీ ఆదాయం భారీగా పుంజుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు గత ఎనిమిది నెలలుగా మూతపడిన సినిమా థియేటర్లను తెరుచుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన ఆయన సినిమా రంగానికి పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. -
జీతాలు ఇచ్చేదెట్లా?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. వచ్చేనెల ఉద్యోగులకు జీతాలు ఎలా చెల్లించాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది మార్చిలో బ్యాంకు నుంచి తెచ్చిన రూ.600 కోట్ల అప్పు నుంచి ఇంతకాలం ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తూ వచ్చారు. గత నెలతో ఆ డబ్బులు పూర్తిగా ఖర్చయ్యాయి. వచ్చే నెల జీతాలకు డబ్బుల్లేవు. మూడు రోజుల కిందట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. జీతాలకు డబ్బు సర్దుబాటు చేయాల్సిందిగా ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ ఆర్థిక శాఖ అధికారులను కోరారు. ఇందుకు వారు నిరాకరించారు. తమ వద్ద ప్రస్తుతానికి అంత వెసులుబాటు లేదని, డబ్బు కావాలంటే సీఎంతోనే మాట్లాడుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయాలపై దృష్టి సారించాలని, ఇలా ప్రతినెలా ఆర్థిక శాఖను డబ్బు అడగటం సరికాదని పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో ఎండీ సునీల్‌శర్మ అధికారులతో సమావేశమై ఆదాయాన్ని పెంచే మార్గాలపై చర్చించారు. మరోవైపు కేంద్రం బ్యాంకు అప్పులపై విధించిన మారటోరియం గడువు పూర్తి కావటంతో బ్యాంకులకు పెద్ద మొత్తంలో ఆర్టీసీ డబ్బులు చెల్లించాల్సి ఉంది. అవి చెల్లించని పక్షంలో నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ (ఎన్పీఏ)గా ఆర్టీసీకి రిమార్క్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు మూడు నెలలుగా బిల్లుల కోసం తిరుగుతున్న అద్దె బస్సు యజమానులు మూడు రోజుల క్రితం బస్‌భవన్‌ను ముట్టడించారు. డబ్బులు చెల్లిం చని పక్షంలో వారు న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆర్టీసీ సహకార పొదుపు సంఘం (సీసీఎస్) సంస్థ వాడుకున్న తమ డబ్బు కోసం హైకోర్టులో కోర్టు ధిక్కార కేసు దాఖలు చేసింది. వచ్చేనెల 5న కోర్టుకు హాజరు కావాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగటంతో ఆర్టీసీకి దిక్కుతోచడం లేదు. శివారు గ్రామాలకు బస్సులు చేతిలో చిల్లిగవ్వలేక సతమతమవుతున్న ఆర్టీసీ రోజువారీ ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో నగరానికి సమీపంలో ఉన్న ఊళ్లకు తిప్పే బస్సులను బుధవారం తిరిగి ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సిటీ బస్సులకు అనుమతి లేకపోవటంతో జిల్లా సర్వీసులను తిప్పుతున్న సంగతి తెలిసిందే. నగరానికి చేరువగా ఉన్న గ్రామాలకు సిటీ డిపోల నుంచి తిరిగే బస్సులను కూడా జిల్లా సర్వీసులుగానే పరిగణిస్తూ బుధవారం ఉదయం నుంచి తిప్పటం ప్రారంభించారు. నగరంలోని 18డిపోల నుంచి 230 సర్వీసులు ప్రారంభించారు. నగరానికి 50 నుంచి 60 కి.మీ. పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలకు ఇవి తిరుగుతాయి. సిటీలో తిరగవు. వీటి రూపంలో రోజుకు రూ.25 లక్షల వరకు ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం జిల్లా సర్వీసుల ద్వారా వస్తున్న రూ.4 కోట్ల రోజువారీ ఆదాయానికి ఇది తోడై కొంత ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక సిటీ బస్సులు నడపాలా వద్దా అన్న నిర్ణయం ముఖ్యమంత్రి పరిధిలో ఉంది. ఆయన ఆదేశం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. -
కరోనా: ఇదేం జర్నీ!!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సమయంలో జర్నీ బెంబేలెత్తిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వైరస్వ్యాప్తిని అడ్డుకొనేందుకు మాస్కు ఒక్కటే రక్షణ కవచం అని తెలిసినప్పటికీ కొంతమంది ప్రయాణీకులు బేఖాతరు చేస్తున్నారు. డ్రైవర్లు, కండక్టర్లలోనూ అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. మాస్కులు ఉన్నప్పటికీ వాటిని కేవలం అలంకారప్రాయంగా ధరిస్తున్నారు.లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో గత 3 నెలలుగా దూరప్రాంతాలు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. పరిమితంగానైనా ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. మొదట్లో ఈ బస్సులను ఉప్పల్, ఎల్బీనగర్, బీఎన్‌రెడ్డి నగర్, తదితర శివార్లకే పరిమితం చేశారు. ఆ తరవాత మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్ వంటి ప్రధాన స్టేషన్లకు కూడా బస్సులను అనుమతించారు. బస్సులు రోడ్డెక్కిన తొలి రోజుల్లో కోవిడ్ నిబంధనలు పటిష్టంగానే అమలు జరిగాయి. ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేశారు. బస్సు ఎక్కే ముందు ప్రతి ప్రయాణికుడు చేతులు శుభ్రం చేసుకొనేవిధంగా శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. మాస్కులేని వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు మైకుల ద్వారా ప్రచారం కూడా చేపట్టారు.కానీ క్రమంగా ఈ నిబంధనలన్నీ గాల్లో కలిసిపోయాయి. ఇటు ప్రయాణికులు, అటు ఆర్టీసీలోనూ నిర్లక్ష్యం చోటుచేసుకుంది. చివరకు కరోనా బాధితులు ప్రయాణం చేసినా పట్టించుకొనే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు కరోనా బారిన పడకుండా కాపాడుకొనేందుకు ఎవరికి వారు స్వీయజాగ్రత్తలు పాటించడం ఒక్కటే శ్రీరామ రక్ష అని వైద్య నిపుణులు పదే పదే చెబుతున్నప్పటికీ ‘తమకేం కాదులే’ అని నిర్లక్ష్య ధోరణి అన్ని చోట్ల కనిపిస్తోంది. ఇందుకు ఆర్టీసీ బస్సులు కూడా ఏ మాత్రం మినహాయంపు కాదు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్న బస్సులను పరిశీలించినప్పుడు ఈ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. నిబంధనలు నీరుగార్చారు.... సాధారణంగా హైదరాబాద్ నుంచి ప్రతి రోజు 3500 బస్సులు తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తాయి. 1.25 లక్షల మంది వివిధ ప్రాంతాలకు బయలుదేరుతారు.కానీ కరోనా నియంత్రణకు విధించిన లాక్డౌన్లో భాగంగా అన్ని సర్వీసులను నిలిపివేశారు. లాక్డౌన్ సడలింపుల అనంతరం తెలంగాణ జిల్లాలకు మాత్రమే బస్సులను పరిమితం చేశారు. దీంతో రోజుకు 800 నుంచి 1000 బస్సుల వరకు హైదరాబాద్ నుంచి జిల్లాలకు నడుస్తున్నాయి. మొదట్లో ప్రయాణికుల ఆదరణ పెద్దగా లేకపోయినప్పటికీ జూలై నుంచి క్రమంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఒక బస్సులో సగటున 50 మంది చొప్పున ప్రస్తుతం 40 వేల నుంచి 50 వేల మంది ప్రయాణికులు తెలంగాణలో ప్రయాణం చేస్తున్నారు. ఎక్కువ శాతం హైదరాబాద్ నుంచి జిల్లాలకు రాకపోకలు సాగిస్తున్న బస్సులకే డిమాండ్ బాగా ఉంది. కానీ ఇదే సమయంలో గత రెండు నెలలుగా కోవిడ్ ఉధృతి కూడా పెరిగింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్‌కే పరిమితమైన వైరస్ జిల్లాలను, గ్రామీణ ప్రాంతాలను సైతం చుట్టుముట్టింది పల్లెల్లోనూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పట్టణాల్లో వందల్లో కోవిడ్ బాధితులు పెరుగుతున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణికుల్లో నిబంధనలు కచ్చితంగా అమలు కాకపోవడం ఆందోళన కలిగిస్తుందని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది రాకపోకలు సాగించే మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో 8 చోట్ల కాలితో తాకి వినియోగించుకొనే శానిటైజర్లను ఏర్పాటు చేస్తే వాటిని గుర్తు తెలియని వాళ్లు తీసుకెళ్లారు. దీంతో ప్రస్తుతం మేనేజర్ కార్యాలయం వద్ద మాత్రం రెండు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ‘ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్లను వినియోగించాలని’ చెబుతున్నప్పటికీ కొంతమంది పట్టించుకోవడం లేదని ఎంజీబీఎస్ అధికారి ఒకరు చెప్పారు. జేబీఎస్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇక ఎల్బీనగర్, ఉప్పల్, తదితర కూడళ్ల నుంచి రాకపోకలు సాగించే బస్సుల్లో మొదట ఆర్టీసీ సిబ్బందే ప్రయాణికులకు శానిటైజర్ ఇచ్చే వారు. ఇప్పుడు అలాంటి సదుపాయం కనిపించడం లేదు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలనే ఒత్తిడి కూడా లేకుండా పోయింది. అన్‌లాక్‌లో పెరగనున్న రాకపోకలు... సెప్టెంబర్ నుంచి నిబంధనలు మరింత సడలనున్నాయి. అన్‌లాక్‌లో భాగంగా అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభమవుతాయి. ఏపీ, తెలంగాణ ఆర్టీసీల మధ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. మిగతా రాష్ట్రాలతో కూడా రాకపోకలు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ మెట్రో సర్వీసులతో పాటు, ఎంఎంటీఎస్ రైళ్లు, సిటీ బస్సులు కూడా అందుబాటులోకి వస్తే ప్రయాణికుల రాకపోకలు మరింత పెరుగుతాయి. సరిగ్గా ఇదే సమయంలో కరోనా కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి.‘‘ జిల్లాల్లో పాజిటివ్‌ల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రయాణికుల రాకపోకలు పెరగడం వల్ల కరోనా వ్యాప్తి కూడా పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో కొద్దిగా తగ్గుముఖం పడుతున్న వైరస్ ఉధృతి తిరిగి పుంజుకున్నా ఆశ్చర్యం అవసరం లేదు’’ అని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీ హర్ష చెప్పారు. జాగ్రత్తలు తప్పనిసరి.... ⇔ మాస్కులు ధరించడంతో పాటు, ప్రతి ప్రయాణికుడు శానిటైజర్ వెంట తీసుకెళ్లడం తప్పనిసరి. ⇔ బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు హ్యాండిల్ రాడ్ పట్టుకోక తప్పదు. ఇలాంటప్పుడు తప్పనిసరిగా చేతులు శానిటైజ్ చేసుకోవలసిందే. ⇔ సీట్లో కూర్చున్న తరువాత కూడా చాలా మంది తరచుగా తమ ముందు ఉన్న సీట్ ఫ్రేమ్‌ను పట్టుకుంటారు.అలా పట్టుకోవలసి వచ్చినప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం మంచిది. ⇔ సీట్లో ఇద్దరు, ముగ్గురు అపరిచితులు కూర్చోవలసి వచ్చినప్పుడు మధ్యలో మాస్కు తీయకుండా ప్రయాణం పూర్తయ్యే వరకు పూర్తిగా ధరించి ఉండాల్సిందే. ⇔ డ్రైవర్లు, కండక్టర్లు మాస్కులు లేకుండా విధులు నిర్వహిస్తున్నప్పుడు ప్రయాణికులే వారిని అప్రమత్తం చేయడం మంచిది. -
ఏపీఎస్ఆర్టీసీ అడ్వాన్స్ బుకింగ్ గడువు పెంపు
సాక్షి, అమరావతి: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు 30 రోజులు ముందుగానే సీట్లను రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి రోజు (శనివారం) నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులిచ్చింది. కోవిడ్–19 కారణంగా ఇంతకుముందు ఏడు రోజులు ముందుగా మాత్రమే రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉండేది. ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు అనుమతించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో హైదరాబాద్‌కు బస్ సర్వీసులు తిప్పడంపై ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అధికారులు హైదరాబాద్ బస్ భవన్లో సోమవారం భేటీ కానున్నారు. ► ఇప్పటివరకు ఏపీఎస్ఆర్టీసీ కర్ణాటకకు మాత్రమే సర్వీసులు నడుపుతోంది. తమిళనాడు, తెలంగాణలకు సర్వీసులు లేవు. ఈ రాష్ట్రాలకు ప్రైవేటు బస్సులు కూడా తిరగడం లేదు. ► కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేయాలని నిర్ణయించడంతో సెప్టెంబర్ 1 నుంచి ప్రైవేటు ఆపరేటర్లు తమ బస్సులను తిప్పనుండటంతో ఏపీఎస్ఆర్టీసీ ఎప్పటి నుంచి సర్వీసులు తిప్పాలనే అంశంపై సోమవారం నిర్ణయం వెలువడనుంది. ► రెండు రాష్ట్రాల మధ్య సమానంగా అంతరాష్ట్ర బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీలు గతంలోనే అవగాహనకు వచ్చాయి. -
ఏపీఎస్ ఆర్టీసీకి గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరాతి : రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిచేందుకు అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బస్సులను నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. అయితే ఆన్లైన్లో మాత్రమే టికెట్ బుకింగ్‌కు అవకాశం కల్పించింది. కేవలం సూపర్ లగ్జరీ సర్వీసులకు మాత్రమే కాకుండా ఆర్డినరీ బస్సులకు కూడా ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. బస్సు సర్వీసుల రూట్లపై ఏపీఎస్ ఆర్టీసీ పూర్తి వివరాలను ప్రకటించనుంది. వైరస్ వ్యాప్తి చెందకుండా సగం సీట్లు మాత్రమే నింపి బస్సు సర్వీసులు నడపడానికి అనుమతివ్వాలని ప్రభుత్వం భావించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఆర్టీసీకి పలు సూచనలు చేశారు. ప్రైవేటు బస్సులకూ అనుమతులు ఇవ్వాలని, ఒక్కో బస్సులో 20 మందినే అనుమతించాలని సీఎం స్పష్టం చేశారు. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించి, ప్రయాణికులందరూ మాస్క్ ధరించే విధంగా విధివిధానాలు రూపొందించాలని సీఎం జగన్ ఇదివరకే ఆదేశించారు. -
త్వరలో రయ్.. రయ్..!
సగం సీట్లు మాత్రమే నింపి బస్సు సర్వీసులు నడపడానికి అనుమతివ్వాలి. ప్రైవేటు బస్సులకూ అనుమతులు ఇవ్వాలి. ఒక్కో బస్సులో 20 మందినే అనుమతించాలి. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. ప్రయాణికులందరూ మాస్క్ ధరించాలి. ఈ మేరకు విధివిధానాలు రూపొందించాలి. బస్సు సర్వీసులు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే అంశంపై మూడు నాలుగు రోజుల్లో తేదీ ప్రకటించాలి. కారులో ముగ్గురు మాత్రమే ప్రయాణించడానికి అనుమతించాలి. ప్రజల భాగస్వామ్యంతో కరోనా నివారణపై దృష్టి సారించాలి. వలస కార్మికులను ఆదుకునే విషయంలో అధికారులు బాగా పని చేశారు. రాష్ట్రం మీదుగా నడిచి వెళ్తున్న వారికి సహాయంగా నిలిచారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. వీళ్లు మన ఓటర్లా? మన రాష్ట్ర ప్రజలా? అని ఆలోచించకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన సమయం ఇది. మానవత్వంతో వారిని ఆదుకోవాలి. వలస కార్మికుల తరలింపు త్వరితగతిన పూర్తి చేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సు సర్వీసులు నడిచేందుకు అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పటి నుంచి నడపాలన్నది మూడు నాలుగు రోజుల్లో నిర్ణయించాలని, ఇందుకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం ఆదివారం జారీ చేసిన నూతన మార్గదర్శకాలు, కోవిడ్–19 నివారణ చర్యలు, బస్సు సర్వీసులు నడపడం, వలస కూలీలను స్వస్థలాలకు తరలింపు తదితర అంశాలపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే కేంద్ర మార్గదర్శకాల మేరకు సాధారణ పరిస్థితులు కల్పించడంపై ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. జాగ్రత్తలు తప్పనిసరి ► ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అన్ని దుకాణాలు తెరిచేందుకు అనుమతి. ప్రతి దుకాణం వద్ద ఐదుగురిని మాత్రమే అనుమతించాలి. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగించాలి. ► రెస్టారెంట్ల వద్ద టేక్ అవే కు అనుమతి. ఆ సమయంలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. పెళ్లిళ్లు లాంటి కార్యక్రమాలకు 50 మందికే అనుమతి ఇవ్వాలి. భయాందోళనలు తొలగించాలి ► కరోనా పట్ల ప్రజల్లో ఆందోళన, భయం తొలగిపోయేలా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. కోవిడ్ లక్షణాలు ఉన్న వారు స్వచ్ఛందంగా ఆరోగ్య పరిస్థితులను తెలియ జేయడంపై దృష్టి సారించాలని సూచించారు. ► వార్డు క్లినిక్స్ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని, ఇందుకు అవసరమైన స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలని.. ఈ ప్రక్రియ వచ్చే మార్చి నాటికి పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. అన్ని ఆరోగ్య సమస్యలకు విలేజ్, వార్డు క్లినిక్స్ ద్వారా మంచి పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. ► ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రి కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. తగిన జాగ్రత్తలతో రాష్ట్రంలో బస్సు సర్వీసులు ► అంతర్ రాష్ట్ర సర్వీసులు ఎలా నడపాలనే అంశంపై చర్చ జరిగింది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాల నుంచి రావాలనుకుంటున్న వారి కోసం బస్సులు నడపడంపై దృష్టి సారించాలని, దశల వారీగా సర్వీసులు పెంచుకుంటూ వెళ్లాలని నిర్ణయించారు. ► తొలుత బస్టాండ్ నుంచి బస్టాండ్ వరకు సర్వీసులు నడపాలి. మధ్యలో ప్రయాణికులు ఎక్కేందుకు అనుమతి లేదు. బస్టాండ్‌లో ప్రయాణికులు దిగిన తర్వాత పరీక్షలు నిర్వహించాలి. బస్సు ఎక్కిన వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు.. అతను వెళ్లాలనుకుంటున్న చిరునామా తీసుకోవాలి. తద్వారా అవసరమైతే ఆ వ్యక్తి ట్రేసింగ్ సులభం అవుతుంది. ► వలస కార్మికుల తరలింపు పూర్తి కాగానే బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయం. ప్రభుత్వ ఉద్యోగులంతా కార్యాలయాలకు హాజరయ్యేలా తగిన ఆదేశాలు జారీ చేయాలి. -
ఆర్టీసీపై కరోనా ఏఫెక్ట్
-
టికెట్ కౌంటర్ల వద్ద శానిటైజర్ల ఏర్పాటు
-
పట్టణాలకు ప్రత్యేక బస్సులు!
సాక్షి, హైదరాబాద్: ఇక పట్టణాల్లో అద్దె బస్సులు రాజ్యమేలబోతున్నాయి. నగరాలు, పట్టణాల్లో ప్రజా రవాణా భారీ నష్టాలతో ఆర్టీసీ కుదేలవుతున్న వేళ.. వాటిని పూడ్చేందుకు కేంద్రం ఓ అడుగు ముందుకేసింది. ప్రపంచ బ్యాంకు చేయూతతో ప్రత్యేక ప్రాజెక్టును తెస్తోంది. ఇందులో భాగంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రధాన పట్టణాల మధ్య అద్దె బస్సులను భారీగా తిప్పేందుకు వీలుగా రంగం సిద్ధం చేస్తోంది. వీటి నిర్వహణతో వచ్చే నష్టాలను ఐదేళ్లపాటు భరించేందుకు సమాయత్తమైంది. ఈలోపు వాటి నష్టాలను పూడ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఐదేళ్ల కాలానికి గాను రూ.75 వేల కోట్లను ఇందు కోసం ఖర్చు చేయనున్నారు. ఈ మొత్తాన్ని ఆయా రాష్ట్రాల డిమాండ్ ఆధారంగా పంచుతారు. ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యేందుకు ఉన్న సంసిద్ధతను తెలపాల్సిందిగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం ఓకే అంటే అందులో భాగస్వామ్యం ఉంటుంది. పట్టణ ప్రాంతంలో ప్రత్యేకంగా తిప్పే బస్సుల నిర్వహణతో వచ్చే నష్టాలతో పాటు, వాటి నిర్వహణకు సంబంధించిన మౌలిక వసతుల కల్పనకు అయ్యే వ్యయంలో సగభాగాన్ని భరించేందుకు వీలుగా గ్రాంట్లు అందించనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా వచ్చే బస్సులన్నీ ఆర్టీసీ సొంత బస్సులుగా కాకుండా పూర్తిగా అద్దె ప్రాతిపదికన ప్రైవేటు ఆపరేటర్లే నిర్వహించనున్నారు. వెరసి ప్రజా రవాణా సంస్థలో అద్దె బస్సుల హవా మరింతగా పెరగనుంది. ప్రపంచ బ్యాంకు సాంకేతిక సహకారంతో.. ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ అత్యంత వేగంగా పెరుగుతోంది. కానీ, పెరుగుతున్న జనాభాకు వీలుగా ఆయా ప్రాంతాల్లో ప్రజా రవాణా విస్తరించటం లేదని ప్రపంచ బ్యాంకు ప్రత్యేక అధ్యయనాలతో తేల్చింది. దీన్ని మార్చాలంటే పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణాను బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మన దేశంతో కూడా అవగాహనకు వచ్చింది. కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆధ్వర్యంలో ఈ బృహత్ ప్రాజెక్టును చేపట్టబోతోంది. ఇందుకు సంబంధించి తన వంతుగా సాంకేతిక సహకారాన్ని ఉచితంగా అందించటంతో పాటు కేంద్రానికి అవసరమైన కొంత ఆర్థిక చేయూతను అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు వచ్చే ఐదేళ్లలో పట్టణ ప్రజా రవాణా రూపురేఖలు మార్చాలన్నది ప్రణాళిక. ఇందుకు ఐదేళ్ల కాలానికి రూ.75 వేల కోట్లు ఖర్చవుతాయని ఓ అంచనా. దీనికి కేంద్రం కూడా సానుకూలంగా ఉండి, రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వాములు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి తాజాగా ఢిల్లీలో ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ప్రాజెక్టు వివరాలు వెల్లడించింది. ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేసేందుకు మహారాష్ట్ర, ఏపీలను ఎంపిక చేసి, మిగతా రాష్ట్రాలు సమ్మతిని తెలపాల్సిందిగా కేంద్రం కోరింది. ప్రాజెక్టులో చేరేందుకు ఉన్న అభ్యంతరాలను తెలపాల్సిందిగా సూచించింది. ఈ సమావేశానికి టీఎస్ఆర్టీసీ తరుఫున పలువురు హాజరయ్యారు. దీనిపై కేంద్రానికి తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. పదేళ్లు భరించాలి.. ఈ సమావేశంలో పేర్కొన్న వయబిలీటీ గ్యాప్ ఫండ్‌ను ఐదేళ్లు కాకుండా పదేళ్లు భరించాలని సమావేశంలో వివిధ రాష్ట్రాల ప్రతినిధులు కోరారు. దీనిపై ఇంకా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. ఇక బస్సులను కూడా తమ ప్రాంతాలకు సూటయ్యే వాటిని తామే సమకూర్చుకునే వెసులుబాటు కల్పించాలని కూడా కోరారు. గతంలో జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద నాసిరకమైన బస్సులు సరఫరా కావటంతో అవి కేవలం మూడేళ్లకే పాడై ఆ తర్వాత భారీ నష్టాలు మూటగట్టినట్టు వారు కేంద్రం దృష్టికి తెచ్చారు. అందుకోసం నాణ్యమైన బస్సులను తామే సమకూర్చుకుంటామని, అందుకయ్యే వ్యయాన్ని కేంద్రం భరించాలని కోరారు. దీనిపై కేంద్రం నిర్ణయం తెలపాల్సి ఉంది. -
మహిళతో బస్సు కండక్టర్ అసభ్య ప్రవర్తన!
బెంగుళూరు: బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ పట్ల కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పట్టపగలే మహిళ చెయ్యి పట్టుకుని వికృతంగా ప్రవర్తించిన ఘటన కర్ణాటక రోడ్డు రవాణ సంస్థ(కేఎస్ఆర్టీసీ) బస్సులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని పుత్తూరు డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహించే ఓ ప్రబుద్ధుడు ప్రయాణికురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. పుత్తూరు నుంచి హసన్‌కు బస్సులో ఓ మహిళ ప్రయాణిస్తోంది. మధ్యాహ్న సమయం కావడం.. బస్సులో ఎవరూ లేకపోవడంతో కండక్టర్ ప్రయాణికురాలిని లైంగికంగా వేధించాడు. ఈ క్రమంలోనే ఆమె పక్క సీట్లోకి వెళ్లి మెల్లగా మాటలు కలిపాడు. తర్వాత చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. సదరు మహిళ కండక్టర్‌ను వారించే ప్రయత్నం చేసిన ఈ ప్రబుద్ధుడు పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకొని సదరు మహిళ అతగాడు చేస్తున్న వికృత చేష్టలను తన మొబైల్ ఫోన్లో బంధించింది. బస్సు హసన్‌కు చేరుకోగానే బస్సు దిగిన ఆ మహిళ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో పాటు కేఎస్ఆర్టీసీ అధికారులకు పంపించింది. వెంటనే ఈ ఘటనపై సంస్థ యాజమాన్యం స్పందించి దీనిపై దర్యాప్తుకు ఆదేశించింది. ఆడపిల్లలపై జరుగుతున్న అఘాత్యాలు ఇప్పటిదాకా క్యాబ్‌లు, ఆటోలకే పరిమితం కాగా.. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో అది కూడా బస్సు కండక్టర్ ఈ దారుణానికి పాల్పడటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా కండక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
‘స్లో’ట్యాగ్!
ఇది హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న రాజధాని బస్సు. దానికి ఫాస్టాగ్ ఉంది. టోల్‌ప్లాజాలో అక్కడి సెన్సార్ దాన్ని స్కాన్ చేసి రుసుము డిడక్ట్ చేసుకుని క్షణాల వ్యవధిలో గేట్ తెరుచుకోవాల్సి ఉంది. కానీ సెన్సార్లు ఆ పని చేయకపోవటంతో టోల్‌ప్లాజా సిబ్బంది హ్యాండ్‌హెల్డ్ యంత్రం ద్వారా స్కాన్ చేసే ప్రయత్నం చేశారు. అయినా సాధ్యం కాకపోవటంతో ఆ యంత్రాన్ని డ్రైవర్ చేతికే ఇచ్చారు. ఆయన కాసేపు అటూఇటూ కదిలిస్తూ తిప్పలుపడితేగాని పని కాలేదు. ఇందుకు ఐదారు నిమిషాల సమయం తీసుకుంది. ఈలోపు వెనక వాహనాలు నిలిచిపోయాయి. ఇది ఈ ఒక్క బస్సుకు ఎదురైన సమస్య కాదు. దాదాపు అన్ని బస్సులది ఇదే సమస్య.. – సాక్షి, హైదరాబాద్ కొత్తగా ఓ పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే దాన్ని ఎలా వినియోగించుకోవాలో కూడా తెలియాలి. అందుకు కొంత నేర్పు, అవగాహన, శిక్షణ అవసరం. ఇవేవీ లేకుండా ఆ పరిజ్ఞానాన్ని వినియోగిస్తే కొత్త ఇబ్బందులు రావటమే కాకుండా అభాసుపాలు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫాస్టాగ్ విషయంలో ఇదే జరుగుతోంది. పాత పద్ధతిలో నగదు చెల్లించి టోకెన్ తీసుకునేందుకు పట్టే సమయం కంటే, ఫాస్టాగ్ వచ్చాక ట్యాగ్ స్కానింగ్‌కు ఎక్కువ సమయం పట్టాల్సి రావటం విశేషం. ఆర్టీసీ బస్సులు, కొన్ని ఇతర ప్రైవేటు బస్సులు, లారీలకు ఈ సమస్య ఎక్కువగా ఉత్పన్నమవుతోంది. టోల్గేట్ల పైభాగంలో ఉండే స్కానర్లు వీటి ట్యాగ్‌లను స్కాన్ చేయలేకపోతున్నాయి. ఎక్కడ అతికించాలో తెలియదు.. కేంద్ర ఉపరితల రవాణాశాఖ గడువు విధించి మరీ ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అంతకు కొన్ని నెలల ముందు నుంచే ప్రయోగాత్మకంగా దాన్ని అమలు చేయటం కూడా ప్రారంభించింది. నగదు చెల్లించే వాహనాలకు సంబంధించి కేవలం ఒక్క లేన్ మాత్రమే అందుబాటులో ఉంచుతామని, మిగతావన్నీ ఫాస్టాగ్ అతికించిన వాహనాలకే కేటాయిస్తామని, ట్యాగ్ లేని వాహనాలు టోల్ చెల్లించేందుకు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంటుందంటూ ప్రకటనల రూపంలో ప్రచారం కూడా చేసింది. దీంతో వాహనదారులు హడావుడిగా ట్యాగ్ కొంటూ వచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ కొన్న ట్యాగ్‌ను వాహనానికి ఎక్కడ అతికించాలనే విషయంలో చాలామందికి అవగాహన లేకుండా పోయింది. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. కార్లతో పోలిస్తే పెద్ద వాహనాల్లో ఈ సమస్య ఏర్పడింది. ట్యాగ్‌ను తోచిన చోట అతికించటంతో స్కానర్లు దాన్ని గుర్తించటం లేదు. పెద్ద వాహనాలకు ఆ చోటనే.. లారీలు, బస్సులు లాంటి పెద్ద వాహనాలకు ఫాస్టాగ్‌ను ముందు వైపుండే ఎడమ అద్దానికి దిగువ భాగంలో డ్రైవర్ వైపు అతికించాలి. సెన్సార్లు గుర్తించే స్థలం ఇదే. ఆటోమేటిక్‌గా స్కాన్ చేసి గ్రీన్‌సిగ్నల్ చూపి గేట్‌ను ఓపెన్ చేస్తుంది. కానీ చాలామంది డ్రైవర్ ముందుండే అద్దం పైభాగంలో అతికిస్తున్నారు. ఫలితంగా సెన్సార్లు మొండికేస్తున్నాయి. ఇక కార్లకు అయితే అద్దంపై భాగంలో అతికించాలి. అక్కడ ఉంటేనే సెన్సార్లు గుర్తిస్తాయి. ఆర్టీసీ స్టిక్కర్లు పాతబడి.. ఇటు స్టిక్కర్లు తప్పుడు ప్రాంతాల్లో అతికించటం వల్ల ఏర్పడ్డ సమస్యకు తోడు ఆర్టీసీ బస్సుల్లో మరో ఇబ్బంది వచ్చిపడింది. ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన 2017లోనే ఆర్టీసీ కొన్ని దూర ప్రాంత బస్సులకు ఫాస్టాగ్‌లు తీసుకుంది. ఇప్పుడు అవి పాతబడిపోయాయి. బస్సు అద్దాలను కడిగే సమయంలో చాలా ట్యాగ్లు స్వల్పంగా దెబ్బతింటూ వచ్చాయి. దీంతో సెన్సార్లు వాటిని గుర్తించటం లేదు. కొన్ని బస్సులకు ట్యాగ్ ఉండి కూడా డ్రైవర్లు నగదు చెల్లించి పాత పద్ధతిలో టోకెన్ తీసుకోవాల్సి వస్తోంది. సమస్యను గుర్తించాం.. ‘ఆర్టీసీ బస్సుల్లో ఎదురవుతున్న సమస్యను గుర్తించాం. తప్పుడు చోట్ల అతికించిన వాటిని తొలగించి సరైన స్థానంలో అతికించుకోవాలని ఆర్టీసీకి సూచించాం. దీంతోపాటు పాతబడ్డ ట్యాగ్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసుకోవాలని కూడా పేర్కొన్నాం. గతంలో ట్యాగ్ అతికించిన కొన్ని బస్సులు ఇతర డిపోలకు మారటంతో వాటికి అక్కడ కొత్త ట్యాగ్లు తీసుకున్నారు. ఇలా రెండు ఉండటం వల్ల కూడా సమస్య ఎదురవుతోంది. మిగతా బస్సులకు కూడా ట్యాగ్లు ఏర్పాటు చేసే విషయంలో సోమవారం బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ లోపాలపై చర్చించి ఆర్టీసీ అధికారులకు సూచనలు జారీ చేశాం..’ – ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ -
నేటి నుంచి ఏపీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు
-
అంచనాలు మించిన ఆదాయం
సాక్షి, హైదరాబాద్: చార్జీల పెంపుదల ఆర్టీసీలో ఆశలు రేకెత్తిస్తోంది. కొన్నేళ్లుగా తీవ్ర నష్టాలతో కునారిల్లుతున్న ఆర్టీసీ, ఇప్పుడు చార్జీల పెంపుతో వచ్చే అదనపు ఆదాయం తో గట్టునపడొచ్చన్న నమ్మకం వ్యక్తమవుతోంది. మంగళవారం తొలి షిఫ్ట్ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెరగగా, తొలి రోజు అందిన ప్రాథమిక లెక్కల ప్రకారం ఆదాయం 22 శాతాన్ని మించి ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో రెండు రోజులు చూస్తే గానీ కచ్చితమైన వివరాలు అందవని పేర్కొంటున్న అధికారులు, తొలిరోజు మాత్రం అంచనాకు మించి ఆదాయం ఉన్నట్టుగా గుర్తించామంటున్నారు. నగరంలో అది 25 శాతంగా ఉండగా, జిల్లాల్లో 20 శాతాన్ని మించి ఉందని అంటున్నారు. వెరసి రోజువారీ ఆదాయంలో రూ.2 కోట్లు చొప్పున పెరిగే అవకాశం కనిపిస్తోంది. త్వరలో బస్సుల షెడ్యూల్ మార్చడం, కార్మికుల డ్యూటీ సమయాలను సవరణ వల్ల పనితీరు మెరు గుపడి ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుందని, దీంతో ఆదాయం మరింత పెరుగుతుందని అంటున్నారు. నగరంలో ప్రస్తుతం డ్రైవర్లు, కండక్టర్లు ఒక షిఫ్ట్‌లో 6.50 గంటల మేర పనిచేస్తున్నారు. మరో 40 నిమిషాలు డ్యూటీ బాధ్యతలు తీసుకోవటం, అప్పగించటం (చేంజ్ ఓవర్)గా ఉంటోంది. ఇప్పుడు చేంజ్ ఓవర్ సమయాన్ని తగ్గించటంతోపాటు డ్యూటీ సమయాలను 7.20 గంటలకు పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల ఉత్పాదకత బాగా పెరిగి కిలోమీటరుకు ఆదాయం (ఈపీకే) బాగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. సిటీ డిపోల్లో సగటున అదనపు ఆదాయం రోజుకు రూ.1.75 లక్షల మేర పెరిగినట్టు గుర్తించారు. -
ఆర్టీసీ లిక్విడేషన్‌కు కేంద్రం అనుమతి అవసరం
సాక్షి, న్యూఢిల్లీ: రోడ్డు రవాణా కార్పొరేషన్ లిక్విడేషన్ (ఆస్తుల విక్రయం ద్వారా అప్పుల చెల్లింపు) ప్రక్రియకు రోడ్డు రవాణా కార్పొరేషన్ చట్టం–1950లోని సెక్షన్ 39 ప్రకారం కేంద్ర ప్రభుత్వ అనుమతితో రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీచేయవచ్చని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు సోమవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా బదులిచ్చారు. కొన్ని రాష్ట్రాల రోడ్డు రవాణా కార్పొరేషన్లకు కేంద్రం మూలధన నిధులు సమకూర్చిందని వివరించారు. కొన్ని రాష్ట్రాల కార్పొరేషన్లలో ఈ మూలధన నిధులు ఈక్విటీ మూలధనంగా మారినట్టు వివరించారు. రాష్ట్రాల ఆర్టీసీలో వచ్చే నష్టాలను కేంద్ర ప్రభుత్వం భరించబోదని స్పష్టంచేశారు. -
తాత్కాలిక కార్మికులతో రోడ్డెక్కిన బస్సులు
సాక్షి, తాండూరు: జిల్లాలో మూడో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగింది. తాత్కాలిక కార్మికులతో అధికారులు బస్సులను నడిపిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ఈనెల 5నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. తాత్కాలికంగా కండక్టర్లు, డ్రైవర్లతో బస్సులను తిప్పుతోంది. అయితే, ఆర్టీసీకి మాత్రం తీవ్ర నష్టాలు వస్తున్నాయి. తాత్కాలిక సిబ్బంది అందిన కాడికి జేబులు నింపుకోవడంతో పరిస్థితి దారుణంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో జిల్లాలో సదరు సంస్థకు రూ.60 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. మన జిల్లాలో పరిగి, వికారాబాద్, తాండూరు పట్టణాల్లో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఈ మూడు డిపోల్లో కలిసి మొత్తం 254 బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. సుమారు 700 మందికి పైగా కార్మికులు విధులు నిర్వహిస్తుండేవారు. నిత్యం దాదాపు రూ.22 లక్షల ఆదాయాన్ని సంస్థ ఆర్జిస్తుండేది. ఈనెల 5నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. బస్సులను ఎలాగైనా తిప్పాలనే తలంపుతో డిపోలను పోలీసుశాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 5వ తేదీన జిల్లాలో 86 బస్సులు, మరుసటి రోజు 143 బస్సులు, సోమవారం 151 బస్సులను నడిపించారు. జిల్లాలో దాదాపు 90 మంది అద్దె కార్మికులను విధుల్లోకి తీసుకున్నారు. ఇందులో కొన్ని అద్దె బస్సులు ఉన్నాయి. మూడురోజులు బస్సులను తిప్పినా జిల్లా మొత్తం రూ.4 లక్షలే రావడం గమనార్హం. సందట్లో సడేమియా అన్నచందంగా ప్రైవేట్ వాహనదారులు అందిన కాడికి ప్రయాణికులను దోచుకుంటున్నారు. బస్సుల్లోనూ చార్జీలకు అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల భద్రత నడుము బస్సులు నడుస్తున్నాయి. కొన్ని చోట్ల ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. సోమవారం పరిగిలో డ్రైవర్లు, కండక్టర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి బస్‌డిపో వద్ద నిరసన వ్యక్తం చేసే యత్నం చేశారు. 144 సెక్షన్ అమలులో ఉండటంతో పోలీసులు వారిని అడ్డుకొని ఠాణాకు తరలించారు. దీంతో కార్మికులు ఠాణా ఎదుటే బైఠాయించారు. కేసీఆర్ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. తగ్గేది లేదంటున్న కార్మికులు ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని కార్మికులు భీష్మించారు. కార్మికులతో చర్చలు జరిపేది లేదని సర్కారు స్పష్టం చేస్తోంది. ఇటు ఆర్టీసీ, అటు సర్కారు పంతానికి పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఆర్టీసీ కార్మికులకు పలు రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. ఆదాయం తక్కువే.. మన జిల్లాలోని పరిగి, వికారాబాద్, తాండూరు ఆర్టీసీ డిపోల ద్వా రా ఇప్పటివరకు 151 బస్సులను రోడ్డుపైకి తీసుకొచ్చాం. అయితే, ప్రయాణికులు సంఖ్య పెరగడం లేదు. గతంలో నిత్యం రూ.22లక్షల ఆదాయం సమకూరేది. ప్రస్తుతం మూడు రోజుల్లో కేవలం జిల్లా మొత్తంలో ఆర్టీసీకి కేవలం రూ.4 లక్షలు మాత్రమే వచ్చాయి. – రమేష్, డీవీఎం, వికారాబాద్ జిల్లా -
విధులకు రాంరాం!
సాక్షి, వికారాబాద్ : ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డా రు. సిబ్బంది ఎవరూ విధులకు హాజరు కాకపోవడంతో ఉదయం 10గంటల వరకు ఒక్క బస్సుకూడా డిపోల నుంచి బయటకు రాలేదు. ఆయా గ్రామాల నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లే వారు ప్రైవేటు వాహనాల ను ఆశ్రయించారు.10 గంటల తర్వాత ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్ల సహకారంతో మూడు డిపోల నుంచి కొన్ని బస్సులు బయటకు వచ్చాయి. పోలీసు బందోబస్తుతో వీటిని నడిపించారు. కార్మికుల సమ్మెతో అత్యధిక బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రైవేటు వ్యక్తులతో నడిచిన కొద్దిపాటి సర్వీసులు జనం అవస్థలను కొంతవరకు నిరోధించగలిగాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.. కార్మికుల సమ్మె కారణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ఆర్టీసీ అధికారులు.. అనుభవం ఉన్న 87మంది డ్రైవర్లను, 87మంది కండక్టర్లను ఎంపిక చేసి బస్సులు నడిపించారు. డ్రైవర్లకు రోజుకు రూ.1,500, కండక్టర్లకు రూ.1,000 ఇస్తామని చెప్పడంతో చాలా మంది నిరుద్యోగులు విధులు నిర్వర్తించేందుకు ముందుకు వచ్చారు. వికారాబాద్ డిపో పరిధిలో 22 ఆర్టీసీ, 2 ప్రైవేటు బస్సులు నడిపారు. తాండూరు డిపో పరిధిలో 30 ఆర్టీసీ బస్సులు, 1 ప్రైవేటు బస్సు, పరిగి డిపో పరిధిలో 17 ఆర్టీసీ, 15 ప్రైవేటు బస్సులు సేవలందించాయి. ఎస్పీ, ఏఎస్పీ పర్యవేక్షణ.. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని పట్టణాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డిపోలతో పాటు ఆర్టీసీ బస్టాండ్ల వద్ద పోలీసు బలగాలను మోహరించారు. డిపోల నుంచి వెళ్లిన బస్సులు ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లే వరకు ఎస్కార్ట్‌గా అనుసరించారు. వికారాబాద్ ఆర్టీసీ డిపోల వద్ద పరిస్థితిని ఎస్పీ నారాయణ, అడిషనల్ ఎస్పీ భాస్కర్ పర్యవేక్షించారు. కార్మికులు ఎలాంటి ఆందోళనకు దిగినా.. బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేసినా వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. విధులకు హాజరు కాని కార్మికులు.. జిల్లా పరిధిలోని 3 ఆర్టీసీ డిపోలో పనిచేసే 1,111 మంది కార్మికుల్లో ఒక్కరు కూడా శనివారం విధులకు హాజరు కాలేదు. వికారాబాద్ డిపో ఎదుట ఉదయం 9గంటల సమయంలో కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులు తిరిగి వెళ్లిపోయారు. బస్సు అద్దాలు ధ్వంసం... వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం ఉదయం పరిగి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వికారాబాద్ పోలీస్ శిక్షణ కేంద్రం సమీపంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బస్సును ఆపి ముందుభాగంలోని అద్దాలను ధ్వంసం చేశారు. కార్మికులకు వ్యతిరేకంగా బస్సులు నడపరాదంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు. బస్సును నడుపుతున్న డ్రైవర్, కండక్టర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల నిరసన... ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వికారాబాద్ కాంగ్రెస్ నాయకులు కార్మిక సంఘాల నాయకులతో కలిసి డిపో ఎదుట నిరసన చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తామని అధికారంలోకి రాకముందు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట మార్చారన్నారు. డిపో ఎదుట నిరసన చేస్తున్న కాంగ్రెస్ నాయకులు సుధాకర్‌రెడ్డి, సత్యనారాయణ, అనంత్‌రెడ్డి, రత్నారెడ్డి, మధు, కిష్టారెడ్డితో పాటు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు గోపాల్, జీవీకే రెడ్డి, అశోక్‌లను అరెస్టు చేసి వికారాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచిపై వదిలేశారు. -
ఆర్టీసీ సమ్మె సక్సెస్..
సాక్షి,ఆదిలాబాద్ : సమస్యల పరిష్కారం కోసం ఓ వైపు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టడం, మరోవైపు ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు ప్రత్యామ్నాయ చర్యలకు పూనుకున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగవద్దనే ఆదేశాల మేరకు పాక్షికంగా బస్సులు నడిపించారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. ఉదయం నుంచి బస్టాండ్ వద్ద నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని రూట్లలో మాత్రమే బస్సులు నడపడంతో గత్యంతరం లేక ప్రైవేట్ వాహనాలను ప్రయాణికులు ఆశ్రయించారు. దీనిని అదునుగా తీసుకొని ప్రైవేట్ వాహనదారులు అందినకాడికి దండుకుంటున్నారని ప్రయాణికులు వాపోయారు. పండగ పూట సొంత ఊర్లకు వెళ్దామనుకునే వారు ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు కూడా కనిపించాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు దిగడంతో రాత్రి 12గంటల వరకు రథచక్రాలు నిలిచిపోయాయి. హైదరాబాద్‌తోపాటు దూరప్రాంతాల బస్సులను శుక్రవారం అర్ధరాత్రి నుంచి నడిపించలేదు. శనివారం తెల్లవారుజాము 4 గంటలకు మొదటి బస్సు వెళ్లాల్సి ఉండగా, ఉదయం 7గంటల వరకు బస్సులు బస్‌డిపో నుంచి కదలలేదు. ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరాలని, లేనిపక్షంలో డిస్మిస్ చేస్తామని ఆదేశాలు జారీ చేశారు. నోటీసు బోర్డుపై డిస్మిస్ చేస్తామని హెచ్చరికలు సైతం అతికించారు. అయినా కార్మికులు మాత్రం వెనక్కి తగ్గకుండా సమ్మె కొనసాగించారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయ్‌భాస్కర్‌కు రవాణాశాఖ మంత్రి పువ్వాడ విజయ్‌కుమార్ ఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అద్దె (హైర్) బస్సులన్నింటిని నడిపించాలని సూచించారు. దీంతోపాటు విద్యాసంస్థలకు దసరా పండగ సెలవులు ఉన్నందున పాఠశాలల బస్సులను కూడా వినియోగించుకునేలా చూడాలన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.. గత రెండు మూడు రోజుల నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ కార్మికులు హెచ్చరికతో అధికారులు ముందస్తుగా ప్రణాళికలు తయారు చేసుకున్నారు. అద్దె బస్సుల డ్రైవర్లతోపాటు తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్ల నియామకానికి చర్యలు చేపట్టారు. ఉదయం 6 గంటలకే వారిని పిలిపించారు. దీంతో నిరుద్యోగులతో డిపో ఎదుట సందడి వాతావరణం కనిపించింది. అవసరం ఉన్న రూట్లకు మాత్రమే బస్సులు నడిపించారు. తాత్కాలిక కండక్టర్ల నుంచి సర్టిఫికెట్లను తీసుకొని వారికి విధులు అప్పగించారు. డ్రైవర్లను ఆర్టీఏ అధికారులతో డ్రైవింగ్‌ను పరిశీలించి బస్సులను అప్పగించారు. ఉదయం 7 గంటల తర్వాత ఆదిలాబాద్ బస్టాండ్ నుంచి బస్సులు బయల్దేరాయి. మొదట అద్దె బస్సులు నడపగా, ఆ తర్వాత తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు రోడ్డుపైకి ఎక్కాయి. ఆదిలాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 102 ఆర్టీసీ బస్సులు ఉండగా, 34 అద్దె బస్సులు ఉన్నాయి. 579 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఉట్నూర్ డిపో పరిధిలో 30 ఆర్టీసీ బస్సులు ఉండగా 5 అద్దె బస్సులు ఉన్నాయి. 157 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కాగా శనివారం ఆదిలాబాద్ డిపో నుంచి మొత్తం 65 బస్సులు రోడ్డెక్కాయి. వీటిలో 33 ప్రైవేట్ బస్సులు ఉండగా, 32 ఆర్టీసీ బస్సులు నడిచాయి. వీటిలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు మాత్రమే తిరిగాయి. డీలక్స్, సూపర్‌లగ్జరి, రాజధాని తదితర బస్సులను నడిపించలేదు. ఉట్నూర్ డిపోకు సంబంధించి మొత్తం 25 బస్సులు నడిపించారు. వీటిలో 5 ప్రైవేట్ బస్సులు నడవగా, 20 ఆర్టీసీ బస్సులు తిరిగాయి. బందోబస్తు మధ్య కదిలిన బస్సులు సమ్మె నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆదిలాబాద్, ఉట్నూర్ ఆర్టీసీ డిపోలు, బస్టాండ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికులు డిపోలోనికి వెళ్లకుండా, బస్సులను అడ్డుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఆయా డిపోల్లో డీఎస్పీల పర్యవేక్షణలో బందోబస్తు సాగింది. అదేవిధంగా ఆర్టీఏ శాఖాధికారులు సైతం ఆర్టీసీ అధికారులతో చర్చించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. తాత్కాలికంగా నియమించిన డ్రైవర్లకు డ్రైవింగ్ టెస్టులు నిర్వహించారు. ఆయా ప్రైవేట్ పాఠశాలల బస్సుల యాజమాన్యాలతో ఆర్టీఏ అధికారులు మాట్లాడి వారికి నచ్చిన ప్రాంతాల్లో బస్సులు నడుపుకునేందుకు అవకాశం కల్పించారు. కాగా బస్టాండ్ వైపు వచ్చే ఆయా మార్గాల్లో ఎస్సై స్థాయి అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా సమ్మెకు పలు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు, బీజేసీ పార్టీ మద్దతు తెలిపాయి. ఆర్టీసీ సంఘాల నాయకులు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను చేపట్టారు. సమ్మెతో తగ్గిన ఆదాయం.. ఆదిలాబాద్, ఉట్నూర్ ఆర్టీసీ డిపోల పరిధిలో మొత్తం రోజుకు రూ.20లక్షల వరకు ఆదాయం వస్తుంది. సమ్మెతో శనివారం కేవలం రూ.50వేలలోపే ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ డిపో పరిధిలో రోజుకు రూ.16లక్షల 82వేలు, ఉట్నూర్ డిపో పరిధిలో రూ.3లక్షల 70వేలు, ఆదిలాబాద్ డిపో పరిధిలోని తలమడుగు రూట్లో రూ.2,200, బోథ్ రూట్లో రూ.3వేలు, కరంజి రూట్లో కేవలం రూ.500 మాత్రమే ఆదాయం వచ్చింది. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించడంతోనే ఆదాయం తగ్గినట్లు తెలుస్తోంది. తక్కువ బస్సులు నడుపుతున్నారు తక్కువ సంఖ్యలో బస్సులను నడిపిస్తున్నారు. సుదూర, ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండే ప్రాంతాలకు మాత్రమే బస్సులను నడిపిస్తున్నారు. దసరాను పురస్కరించుకుని ఆదిలాబాద్ నుంచి బేల మండలం సాంగిడి గ్రామానికి వెళ్తున్నా. తక్కువ సర్వీసులు నడుపుతున్నారు. మరిన్ని సర్వీసులను నడిపించాలి. – రాజు, ఆదిలాబాద్ 30 రూట్లలో బస్సులు నడిపించాం 30 రూట్లలో బస్సులు నడిపించాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 314 బస్సులు తిరిగాయి. వీటిలో 149 ప్రైవేట్ బస్సులు, 165 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాం. కండక్టర్‌కు రోజు రూ.వెయ్యి చొప్పున, డ్రైవర్‌కు రూ.1500 చొప్పున చెల్లిస్తాం. – విజయ్‌భాస్కర్, ఆర్ఎం -
సమ్మె సంపూర్ణం.. బస్సులు పాక్షికం!
సాక్షి, కరీంనగర్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, జీతభత్యాల సవరించాలనే ప్రధాన డిమాండ్లతో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె జిల్లాలో శనివారం సంపూర్ణంగా సాగింది. కార్మికులు ఒక్కరు కూడా విధులకు హాజరుకాలేదు. విధులకు హాజరుకాకుంటే ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదులకున్నట్లుగా భావిస్తామని ప్రభుత్వం హెచ్చరించినా కార్మికులు బేఖాతరు చేశారు. మొదటి షిఫ్టు నుంచి డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరుకాకపోవడంతో అద్దె బస్సులు మినహా సంస్థకు చెందిన బస్సులు రోడెక్కలేదు. ఆర్టీసీ జేఏసీ నాయకులు అర్ధరాత్రి నుంచే డిపోల నుంచి బస్సులు బయటికి రాకుండా అక్కడే తిష్టవేశారు. ఉదయం 5 గంటల నుంచి కార్మికులు బస్టాండ్‌కు చేరుకుని నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ఇబ్బందులను ప్రయాణికులు, ప్రజలకు వివరిస్తూ భిక్షాటన చేశారు. తిరిగిన అద్దె బస్సులు.. ఆర్టీసీ సమ్మె తొలిరోజు సంపూర్ణంగా జరిగినా బస్సుల బంద్ పాక్షికంగానే సాగింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 10 డిపోలకు చెందిన 91 ఆర్టీసీ బస్సులు, 90 అద్దె బస్సులు, విద్యా సంస్థలకు సంబంధించిన 55 బస్సులు మొత్తం 236 బస్సులను అధికారులు నడిపించారు. ఇవే కాకుండా ఇతర ప్రైవేటు ట్రావెల్ వాహనాలు నడిపించారు. దసరా సందర్భంగా 90 శాతం మంది ప్రయాణికులు ఇప్పటికే స్వగ్రామాలకు చేరుకోవడంతో ప్రయాణికుల రద్దీకూడా అంతగా కనిపించలేదు. ఆర్టీసీ యాజమాన్యం బస్సులు ఏర్పాటు చేసినా ప్రయాణికులు అనుకున్నంత రాక బస్టాండ్ వెలవెలబోయింది. ఆర్టీసీ, డీటీసీ, పోలీస్ సంయుక్తంగా.... ప్రయాణికులపై సమ్మె ప్రభావం పడకుండా ఉండేందుకు ఆర్టీసీ, జిల్లా ట్రాన్స్‌పోర్టు కమిషనర్, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ సంయుక్తంగా పర్యవేక్షించారు. ఆర్టీసీ, డీటీసీ ప్రైవేటు సంస్థల నుంచి వాహనాలను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు. వీటిని కార్మికులు అడ్డుకోకుండా బస్టాండ్‌లో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు శాంతియుతంగా నిరసన చేపట్టడంతో కరీంనగర్లో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. రిక్రూట్మెంట్పై యువకుల ఆసక్తి.. సమ్మె కారణంగా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక విధుల కోసం కండక్టర్, డ్రైవర్ల రిక్రూట్మెంట్ చేపట్టింది. ఈ రిక్రూట్మెంట్కు యువకులు తరలివచ్చారు. 10వ తరగతి పాస్ అయిన వారిని కండక్టర్లుగా, హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ ఉన్నవారిని డ్రైవర్లుగా తీసుకున్నారు. వీరికి సంబంధించిన అన్ని అర్హత పత్రాలను పరిశీలించి తాత్కాలిక విధుల్లోకి తీసుకున్నారు. జిల్లాలో 91 మంది డ్రైవర్లు, 91 మందిని కండక్టర్లుగా విధుల్లోకి తీసుకున్నారు. అడ్డగోలు చార్జీలు... సమ్మె సందర్భంగా బస్సులు బంద్ ఉండటంతో ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. కరీంనగర్ నుంచి సికింద్రాబాద్‌కు ఒక్కొక్కరికీ రూ.300 నుంచి రూ.400 వరకు చార్జి వసూలు చేశారు. దగ్గరికి ప్రయాణానికి ప్రజలు ఎక్కువగా ఆటోలను ఆశ్రయించారు. 30 నుంచి 40 కిలోమీటర్ల దూరానికి మాత్రం ఆర్టీసీ నిర్ణయించిన చార్జీలు వసూలు చేయగా, దూరప్రాంతాలకు వెళ్లే వారి నుంచి రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. బస్టాండ్‌ను పరిశీలించిన జేసీ.. సమ్మె సందర్భంగా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా కల్పించిన సౌకర్యాలను జేసీ జీవీ.శ్యామ్‌ప్రసాద్‌లాల్ పరిశీలించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సరిపడా బస్సులు నడుపుతున్నామని తెలిపారు. జిల్లాలో 206 ఆర్టీసీ అద్దె బస్సులు ఉండగా వాటిలో 191 బస్సులు సికింద్రాబాద్, హన్మకొండ, గోదావరిఖని, నిజామాబాద్, సిరిసిల్ల, వేములవాడ తదిరత ప్రాంతాలకు నడుపుతున్నట్లు వివరించారు. డిపో మేనేజర్లు, ఎంవీఐలు ఆధ్వర్యంలో నైపుణ్యాన్ని పరిశీలించి 195 మంది డ్రైవర్లను తాత్కాలికంగా విధుల్లోకి తీసుకున్నట్లు తెలిపారు. 195 మంది కండక్టర్లను విధుల్లోకి తీసుకుని బస్సులు నడుపుతున్నామన్నారు. జిల్లాలోని 79 విద్యా సంస్థలు, 17 కాంట్రాక్ట్ క్యారియర్ సీసీ బస్సులు నడుపుతున్నామన్నారు. ముందస్తుగా తెలిపిన విధంగానే ప్రయాణ చార్జీలు వసూలు చేయాలని ఆదేశాలు జారీచేశామన్నారు. -
తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్ల ఎంపిక
సాక్షి, సిద్దిపేట: తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్ల నియామక ప్రక్రియ నేడు (శుక్రవారం) సంగారెడ్డిలో చేపడుతున్నట్లు సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ రామ్మోహన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ సంస్థలోని వివిధ సంఘాలు ఈ నెల 5వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు ఇచ్చినందున ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో తాత్కలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకం చేపడుతున్నట్లు తెలిపారు. డ్రైవర్ల ఎంపిక ప్రక్రియ 4న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సంగారెడ్డి ఆర్టీఓ కార్యాలయంలో ఉంటుందన్నారు. ఈ డ్రైవర్ పోస్టుకు 18నెలల కాల పరిమితి పూర్తయిన హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి 25 నుంచి 50 ఏళ్ల వయస్సు గల వారు అర్హులని పేర్కొన్నారు. అలాగే కండక్టర్లకు అదేరోజు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సంగారెడ్డి డిపో అవరణలో ఎంపిక ప్రక్రియ ఉంటుందని, దీనికి 10వ తరగతి పాసైన వారు అర్హులన్నారు. ఎంపికైన వారు 10వ తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్‌ను సంబంధిత డిపో మేనేజర్ వద్ద సమ్మె కాలంలో భద్రపరచవలసి ఉంటుందని తెలిపారు. రిటైర్డ్ అయిన సూపర్వైజర్లు, అధికారులు, మెకానిక్, క్లరికల్ స్టాఫ్ పనిచేయడానికి ఆసక్తిగల వారు రీజనల్ మేనేజర్ సంగారెడ్డి కార్యాలయంలో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటలలోపు సంప్రదించాలన్నారు. జీతం రిటైర్డ్ అధికారులు, సూపర్వైజర్లకు రోజుకు రూ.1,500, రిటైర్డ్ మెకానిక్, క్లరికల్ ఉద్యోగులకు రోజుకు రూ.1,000 వరకు ఉంటుందని, డ్రైవర్లకు రోజుకు రూ.1,500, కండక్టర్లకు రోజుకు రూ.1,000 ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 99592 26266, సిద్దిపేట డివిజనల్ ఫోన్ నంబర్ 99592 26263లలో సంప్రదించాలని సూచించారు. -
అక్కడ రద్దు.. ఇక్కడ స్పెషల్
సాక్షి, హైదరాబాద్: దసరా వేళ ఆర్టీసీకి కొత్తచిక్కొచ్చి పడింది. అటు ప్రయాణికులకు సరిపడా బస్సులు నడపలేక, ఇటు ఉన్న బస్సుల్ని సర్దలేక సతమతమవుతోంది. దసరా రద్దీ కోసం దాదాపు 4,900 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ప్రకటించింది. అందుకోసం రెగ్యులర్ సర్వీసుల్ని తగ్గించి, లేదా పూర్తిగా రద్దు చేసి దసరా స్పెషల్‌గా తిప్పేందుకు సిద్ధమైంది. వాస్తవానికి రాష్ట్రంలో సుమారు 850 గ్రామాలకు బస్సు వసతి లేదు. ఈ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాంటే ఆర్టీసీ ఇప్పటికిప్పుడు కనీసం 3 వేల బస్సులు సమకూర్చుకోవాలని అధికారులు చెబుతున్నారు. అదనపు చార్జీ వసూలు నిబంధన పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ సర్వీసులకు 50% మేర అదనపు చార్జీ వసూలుకు అధికారికంగా వెసులుబాటు ఉంది. అసలే తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఈ అవకాశాన్ని చేజార్చుకునే పరిస్థితి లేదు. దీంతో డిమాండ్ తక్కువగా ఉన్న ప్రాంతాల సర్వీసులను కుదించి, కొన్నింటిని పూర్తిగా రద్దు చేసి స్పెషల్ బస్సులుగా తిప్పేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. మరికొన్ని చోట్ల ట్రిప్పు వెళ్లి వచ్చిన తర్వాత, తదుపరి ట్రిప్పునకు సమయం ఉండి, కొన్ని బస్సులు ఖాళీగా ఉంటాయి. ఇలాంటి వాటిని కూడా దసరా స్పెషల్‌గా వేసేశారు. నగరం నుంచే దాదాపు 20 లక్షల మంది తెలంగాణలో దసరా రద్దీ అధికంగా ఉంది. బతుకమ్మతో కలసి వచ్చే పర్వదినాలు కావటంతో సొంతూళ్లకు వెళ్లేవారి సంఖ్య భారీగా ఉంటుంది. వారిలో మూడొంతుల మంది బస్సులపైనే ఆధారపడతారు. ఒక్క హైదరాబాద్ నుంచే దాదాపు 20 లక్షల మంది పయనమవుతారు. ఇంతమందికి రెగ్యులర్ సర్వీసులు చాలనందున కచ్చితంగా స్పెషల్ సర్వీసులు తిప్పాల్సి ఉంటుంది. అయితే కొన్నేళ్లుగా ఆర్టీసీ కొత్త బస్సులు కొనకపోతుండటంతో అంతపెద్ద సంఖ్యలో స్పేర్ బస్సులు లేకుండా పోయాయి. గతంలో ఉన్న అదనపు బస్సుల్ని ఆర్టీసీ రెగ్యులర్ సర్వీసులుగా చేసేసింది. దీంతో వేరే ప్రాంతాల సర్వీసులను రద్దు చేసి లేదా కుదిం చి స్పెషల్ బస్సులుగా తిప్పాల్సిన దుస్థితి ఇప్పుడు ఆర్టీసీకి నెలకొంది. గతేడాది కంటే 500 సర్వీసులు పెంచారు. ఒక్క హైదరాబాద్ నుంచే దాదాపు 1,200 సిటీ సర్వీసులు స్పెషల్ బస్సులుగా వాడుకుంటున్నారు. ప్రైవేటు బస్సులు ఇప్పటికే టికెట్ ధరలు రెట్టింపు చేసి అమ్ముతుండటంతో ఎక్కువమంది ఆర్టీసీ బస్సులవైపే చూస్తున్నారు. దీంతో ఈ అదనపు సర్వీసులు ఏర్పాటు తప్పనిసరి కావటం, బస్సులు చాలినన్ని లేకపోవటంతో అధికారులకు కత్తిమీద సాములాగా తయారైంది. -
దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సాక్షి, నిజామాబాద్(నాగారం) : దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కేటాయించింది. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు ప్రతినిత్యం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ప్రధాన బస్టాండ్ నుం చి హైదరాబాద్‌లోని జూబ్లీ బస్టాండ్ వరకు బ స్సులు నడుపనున్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారుస్తులు దసరా సెలవులు రావడంతో సొంత గ్రామాల కు పయనం అవుతున్నారు. ఇందుకోసం ఆర్టీసీ ప్రత్యేకంగా సుమారుగా 400 బస్సులను కేటా యింది. ప్రయాణీకుల రద్దీని ఆధారంగా బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సోలేమాన్ తెలిపారు. జూబ్లీ బస్టాండ్‌లో ప్రత్యేకంగా ఒక డివిజనల్ మేనేజర్, డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు సైతం అక్కడే ఉండి మానిటరింగ్ చేస్తారని తెలిపారు. అవసరమైతే ప్రయాణికుల సౌకర్యార్థం బెంగళూరు, ఇతర ప్రాంతాలకు సైతం బస్సులను పంపిస్తామన్నారు. దసరా పండుగ రోజు 12 బస్సులు సైతం నడిపించడానికి ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి టౌన్: ప్రభుత్వం విద్యాసంస్థలకు దసరా సెలవులను ప్రకటించింది. ఈనెల 28 నుంచి అక్టోబర్ 13 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.రాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సెలవు రోజుల్లో నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు కొనసాగించినట్లయితే యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోజువారీగా బస్సులు ఇలా.. 28న 60 బస్సులు 29న 36 బస్సులు 30 12 బస్సులు అక్టోబర్ 1న 12 బస్సులు 2న 12 బస్సులు 3న 12 బస్సులు 4న 60 బస్సులు 5న 60 బస్సులు 6న 60 బస్సులు 7న 8 బస్సులు -
హైదారాబాద్ బస్సు సర్వీసులపై అభ్యంతరం
నిజాంసాగర్(జుక్కల్): సంగారెడ్డి, పటాన్ చెరు మీదుగా హైద్రాబాద్ వెళ్తున్న బాన్సువాడ ఆర్టీసీ బస్సు సర్వీసులపై నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో అధికారులు అభ్యంతరం తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా నిజాంపేట బస్టాండ్ వద్ద బాన్సువాడ నుంచి హైద్రాబాద్ వెళ్తున్న బస్సులను నారాయణఖేడ్ డిపో అధికారులు అడ్డుకున్నారు. బిచ్కుంద, పిట్లం మీదుగా హైద్రాబాద్‌కు బాన్సువాడ డిపో నుంచి ఆరు అదనపు బస్సులు నడుపుతూ నారాయఖేడ్, సంగారెడ్డి, హైద్రాబాద్ ఆర్టీసీ డిపోల ఆదాయానికి గండి కొడుతున్నారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, మెదక్ మీదుగా వెళ్లాల్సిన బస్సు సర్వీసులను రద్దు చేసి, సంగారెడ్డి, పటాన్ చెరు మీదుగా బస్సు సర్వీసులను ప్రారంభించడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల ఆర్టీసీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాన్సువాడ నుంచి బస్సు సర్వీసులను నడపడం వల్ల తమ బస్సులకు ఆదాయం తగ్గుతోందని, నష్టాలకు గురికావాల్సి వస్తుందని అధికారులు అంటున్నారు. దీంతో బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులను నిజాంపేటలో నిలిపి, ప్రయాణికులను ఇతర డిపోల బస్సుల్లో హైద్రాబాద్‌కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బస్సు సర్వీసులను రద్దు చేసుకొవాలని బాన్సువాడ ఆర్టీసీ అధికారులకు వారు సూచించారు. -
అయితే డొక్కు.. లేదా తుక్కు!
సాక్షి, హైదరాబాద్: కాలం చెల్లిన బస్సులతో కుస్తీ పడుతున్న ఆర్టీసీ ఇప్పుడు కొన్ని రూట్లకు సర్వీసులు ఆపేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏడాది కాలంలో దాదాపు 200 బస్సులను కోల్పోవడమే దీనికి కారణం. కొన్నేళ్లుగా నిధులు లేక కునారిల్లుతున్న రవాణా సంస్థ కొత్త బస్సులు సమకూర్చుకోలేకపోయింది. ఫలితంగా దాదాపు జీవితకాలం పూర్తి చేసుకున్న బస్సులని బలవంతంగా తిప్పాల్సి వస్తోంది. వాటిల్లో కొన్ని ఇక అంగుళం కూడా ముందుకు కదలని స్థితికి చేరుకోవటంతో పక్కన పెట్టేసింది. అలా దాదాపు 150 సొంత బస్సులను తుక్కు కింద మార్చేసింది. మరో 50 అద్దె బస్సులు కూడా రద్దయ్యాయి. దీంతో ఒక్కసారిగా 200 బస్సులు తగ్గిపోవటంతో ఇప్పుడు ఆర్టీసీకి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. గడచిన ఏడాది కాలంలో ఏకంగా కోటి కిలోమీటర్ల మేర తక్కువగా బస్సులు తిరిగాయి. కొన్ని గ్రామాలకు ట్రిప్పుల సంఖ్య తగ్గించగా, మరికొన్ని గ్రామాలకు సర్వీసులు నిలిపేసింది. ముఖ్యంగా నైట్‌హాల్ట్ సర్వీసుల్లో కొన్నింటిని రద్దు చేసుకుంది. ఇది ఇప్పుడు సంస్థ పనితీరుపై ప్రభావం చూపుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో ఐదారొందల బస్సులను తుక్కుకింద మార్చాల్సిన పరిస్థితి ఉండటంతో రవాణా సేవలపై ప్రభావం పడబోతోంది. తుక్కు చేసినవి 4,401.. కొన్నవి 1,584.. ఏయేటికాయేడు ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నందున బస్సుల సంఖ్య కూడా పెంచాల్సి ఉంటుంది. ఇందుకోసం కొత్త బస్సులు కొనుగోలు చేయాలి. కానీ ఆర్టీసీలో పరిస్థితి విరుద్ధంగా ఉంది. గడచిన ఐదేళ్లలో 4,401 బస్సులను తుక్కు కింద మూలపడేశారు. వాటి స్థానంలో కేవలం 1,584 బస్సులను మాత్రమే కొత్తగా చేర్చారు. అంటే దాదాపు 3 వేల బస్సులు తగ్గిపోయాయి. ఇప్పట్లో కొత్త బస్సులుకొనే ఆర్థిక స్తోమత ఆర్టీసీకి లేదు. అప్పులు పేరుకుపోయినందున కొత్త రుణాలిచ్చేందుకు బ్యాంకులు కూడా ససేమిరా అంటున్నాయి. ఇక ప్రభుత్వం గ్రాంట్లు ఇవ్వడంలేదు. దీంతో కొత్త బస్సులు కొనే అవకాశమే లేదు. ఇప్పుడు దాదాపు నాలుగు వేల బస్సులు పరిమితికి మించి తిరిగి పూర్తి డొక్కుగా మారాయి. రవాణాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీ వాటిని వాడుతోంది. కొత్త బస్సులు రానందున ఒకేసారి అన్ని బస్సులను తుక్కుగా మారిస్తే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. దీంతో దశలవారీగా కొన్ని చొప్పున వచ్చే మూడునాలుగేళ్లలో వాటిని తొలగించబోతున్నారు. ఈ సంవత్సరం కనీసం ఐదొందల వరకు తొలగించే అవకాశం ఉంది. ఇప్పుడు 200 బస్సులు తగ్గిపోతేనే కోటి కిలోమీటర్ల మేర బస్సులు తిరగలేకపోయాయి. బ్యాటరీ బస్సుల కోసం ఎదురుచూపు కేంద్రం ఇచ్చే సబ్సిడీతో కొనే బ్యాటరీ బస్సుల కోసం ఇప్పుడు ఆర్టీసీ ఎదురు చూస్తోంది. ఫేమ్ పథకం రెండో దశ కింద 500 నుంచి 600 బస్సులు కోరుతూ ఆర్టీసీ ఈ నెలలో ఢిల్లీకి ప్రతిపాదన పంపబోతోంది. ఇందులో కనీసం మూడొందలకు తగ్గకుండా బస్సులు మంజూరవుతాయని ఆశిస్తోంది. ఇవన్నీ అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోనున్నా... ప్రయాణికులకు సేవలు మెరుగవటం ఖాయం. సొంతంగా బస్సులు కొనే పరిస్థితి లేనందున వీటిపై ఆధారపడాల్సి వస్తోంది. బ్యాటరీ బస్సులు ఎంతవరకు సత్ఫలితాలిస్తాయోనన్న ఆందోళన కూడా ఆర్టీసీని వెంటాడుతోంది. -
మేం ఇంతే.. వేటినీ వదలం..!
అప్పుల భారంతో ఆర్టీసీ ప్రగతి గతి తప్పింది. గత టీడీపీ ప్రభుత్వ సేవలో తరించి నిండా మునిగిం ది. ఆర్టీసీ బస్సులను ప్రభుత్వ సభలు, సమావేశాలకు ఇష్టానుసారంగా వాడుకోవడంతో నష్టాల పాలైంది. ఇందుకు గాను ఆర్టీసీకి ప్రభుత్వం కోట్లాది రూపాయలు బకాయి పడింది. బకాయిలు చెల్లించాల్సిన ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా నష్టాల్లో నడుస్తోంది. ప్రస్తుతం ఖర్చులు, కార్మికుల జీతాలు భరించలేని స్థితిలో ఉంది. సాక్షి, చిత్తూరు రూరల్: టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీని ముంచేసింది. ప్రచార అర్భాటాల కోసం ఆర్టీసీ బస్సులను ఇష్టానుసారంగా వాడుకుంది. సభలు, సమావేశాలు, విహారయాత్రల పేరుతో ఆర్టీసీకి రూ.4 కోట్ల వరకు బకాయిలు పడింది. ఈ బకాయిల వసూళ్లకు నాలుగేళ్లుగా ఆర్టీసీ అధికారులు శాఖల వారీగా ప్రదక్షిణలు చేశారు. చెల్లింపు విషయంలో వివిధ శాఖల అధికారులు పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో ఆర్టీసీని అప్పుల భారం వెంటాడుతోంది. బకాయిలు వసూళ్లు కాకపోవడంతో ఏం చేయాలో తెలియక ఆర్టీసీ అధికారులు తలలుపట్టుకుంటున్నారు. జిల్లాలోని 14 ఆర్టీసీ డిపోల్లో మొత్తం 1,378 బస్సులు ఉన్నాయి. ఇందులో పల్లె వెలుగు 583, సప్తగిరి ఎక్స్‌ప్రెస్ 422, ఎక్స్‌ప్రెస్ 192, అల్ట్రా డీలక్స్ 38, సూపర్‌లగ్జరీ 78, ఏసీ 32, మెట్రో సర్వీసులు 33 ఉన్నాయి. ఈ బకాయిల బస్సు సర్వీసుల్లో నిత్యం 7 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఫలితంగా ఆర్టీసీకి రోజుకు సుమారు రూ.2 కోట్లు ఉంటే.. నెల రూ.55 నుంచి రూ.60 కోట్లకు వరకు ఆదాయం వస్తోంది. అయితే ప్రతి నెలా ఆర్టీసీ ఖర్చులు పోను రూ.6 కోట్లు నష్టం వస్తున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. దీనికి తోడు టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో ఆర్టీసీ బస్సులను వాడుకుని వదిలేయడంతో ఆర్టీసీకి అప్పుల భారం పెరిగింది. ప్రచారం కోసమే.. గత నాలుగేళ్ల కాలంలో ఆర్టీసీ చంద్రబాబు సేవలకు మాత్రమే పరిమితమైంది. ప్రయాణికుల సౌకర్యాలను పక్కనపెట్టింది. ఇష్టానుసారంగా టీడీపీ ప్రభుత్వ సమావేశాలకు, పోలవరం షోలకు బస్సులను మళ్లించారు. అవసరమైనప్పుడల్లా కావాల్సినన్ని బస్సులను పంపించారు. ఇలా తరచూ బస్సులను మళ్లించడంతో జిల్లాలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అప్పట్లో వారికి ప్రైవేటు సర్వీసులే దిక్కుగా మారాయి. 2015 అక్టోబర్ నుంచి 2019 వరకు వివిధ ప్రాంతాల్లో జరిగే సభలకు, పోలవరం విహారయాత్రకు మొత్తం 1,292 సర్వీసులను తిప్పించారు. ఇందుకుగాను జిల్లాలోని వివిధ డిపోలకు టీడీపీ ప్రభుత్వం రూ.4 కోట్లు బకాయిలు పడింది. ఇటీవల ఈ బకాయిల్లో కేవలం రూ.14.64 లక్షలు మాత్రమే చెల్లించింది. 2015 నుంచి బకాయిల కోసం ఆర్టీసీ అధికారులు వివిధ శాఖల వారీగా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరకు కోట్లలో ఉన్న బకాయిలను రూ. 14.64 లక్షలు చెల్లించి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం కూడా ఆర్టీసీ అధికారులు వివిధ శాఖలకు ప్రతి రోజూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మరింత భారం.. ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల్లో నడుస్తోంది. ప్రతి నెలా సుమారు రూ.60 కోట్ల ఆదాయం వస్తుంటే.. ఆదాయం ఖర్చులకు, కార్మికుల జీతాలకు సరిపోవడం లేదు. దీంతో నెలకు రూ. 6 నుంచి 7 కోట్ల వరకు నష్టాలు వస్తున్నట్లు అధికారులు వాపోతున్నారు. ఈ తరుణంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులు ఆర్టీసీకి మరింత భారాన్ని తెచ్చిపెడుతోంది. సొంత డప్పు కోసం చంద్రబాబు ఆర్టీసీని వాడుకున్నారని, ప్రయాణికుల సేవలను పక్కనబెట్టిన బాబు సేవలో నిమగ్నమైన ఆర్టీసీకి గుణపాఠామని కార్మికవర్గాలు, పలువురు ప్రయాణికులు విమర్శిస్తున్నారు. సర్వీసుల్లో నిత్యం 7 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఫలితంగా ఆర్టీసీకి రోజుకు సుమారు రూ.2 కోట్లు ఉంటే.. నెల రూ.55 నుంచి రూ.60 కోట్లకు వరకు ఆదాయం వస్తోంది. అయితే ప్రతి నెలా ఆర్టీసీ ఖర్చులు పోను రూ.6 కోట్లు నష్టం వస్తున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. దీనికి తోడు టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో ఆర్టీసీ బస్సులను వాడుకుని వదిలేయడంతో ఆర్టీసీకి అప్పుల భారం పెరిగింది. ప్రచారం కోసమే.. గత నాలుగేళ్ల కాలంలో ఆర్టీసీ చంద్రబాబు సేవలకు మాత్రమే పరిమితమైంది. ప్రయాణికుల సౌకర్యాలను పక్కనపెట్టింది. ఇష్టానుసారంగా టీడీపీ ప్రభుత్వ సమావేశాలకు, పోలవరం షోలకు బస్సులను మళ్లించారు. అవసరమైనప్పుడల్లా కావాల్సినన్ని బస్సులను పంపించారు. ఇలా తరచూ బస్సులను మళ్లించడంతో జిల్లాలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అప్పట్లో వారికి ప్రైవేటు సర్వీసులే దిక్కుగా మారాయి. 2015 అక్టోబర్ నుంచి 2019 వరకు వివిధ ప్రాంతాల్లో జరిగే సభలకు, పోలవరం విహారయాత్రకు మొత్తం 1,292 సర్వీసులను తిప్పించారు. ఇందుకుగాను జిల్లాలోని వివిధ డిపోలకు టీడీపీ ప్రభుత్వం రూ.4 కోట్లు బకాయిలు పడింది. ఇటీవల ఈ బకాయిల్లో కేవలం రూ.14.64 లక్షలు మాత్రమే చెల్లించింది. 2015 నుంచి బకాయిల కోసం ఆర్టీసీ అధికారులు వివిధ శాఖల వారీగా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరకు కోట్లలో ఉన్న బకాయిలను రూ. 14.64 లక్షలు చెల్లించి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం కూడా ఆర్టీసీ అధికారులు వివిధ శాఖలకు ప్రతి రోజూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. -
ఆర్టీసీ నష్టాలు రూ.928 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ రికార్డు సృష్టించింది. కాకపోతే నష్టాల్లో! రూ.వేయికోట్ల నష్టాల మార్కుకు చేరువైంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికిగాని ఏకంగా రూ.928.67 కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్నట్టు ప్రభుత్వానికి టీఎస్ ఆర్టీసీ నివేదించింది. ఆర్టీసీ ఆవిర్భవించిన 8 దశాబ్దాల చరిత్రలో ఇదే అతి భారీనష్టం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలి ఏడాదిలో స్వల్ప లాభాలు నమోదు చేసిన ప్రగతిరథం నష్టాల బాట వీడనుందనే ఆశ కల్పించింది. కానీ, ఆ తర్వాత క్రమంగా ఏ యేటికాయేడు నష్టాల ఊబిలోకే పరుగులు పెట్టింది. దీంతో సిబ్బందికి జీతాలు చెల్లించటమే గగనంగా మారింది. ఆరేళ్లుగా సిబ్బంది నియామకాలు లేకపోవటంతో డ్రైవర్ల కొర త ఏర్పడింది. కొంతకాలంగా అద్దె బస్సులనే తీసుకుంటోంది. 600 బ్యాటరీ బస్సులు కేటాయించాలంటూ కేంద్రాన్ని కోరాలని నిర్ణయించిన ఆర్టీసీ.. వాటిని కూడా అద్దె బస్సులుగానే ఏర్పాటు చేసుకోవాలనుకుంది. దీంతో అద్దె బస్సుల సంఖ్య పెరిగి ప్రైవేటీకరణకు మార్గం సుగమమవుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రూ.312 కోట్ల ఆదాయం పెరిగినా... ఈసారి ఆర్టీసీలో ఏకంగా రూ.312 కోట్ల మేర ఆదాయం పెరిగినా నష్టాలు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. నియంత్రించలేని ఖర్చులు పెరగటంతో నష్టాలు కూడా నమోదయ్యాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీ రూ.4,570 కోట్ల ఆదాయం సమకూర్చుకుంది. గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం రూ.4,882 కోట్లుగా తేలింది. అంటే అంతకుముందు సంవత్స రం కంటే రూ.312 కోట్ల ఆదాయం పెరిగింది. బస్సుచార్జీలు పెంచకున్నా ఆదాయం పెరగడం విశేషం. కొంప ముంచిన వడ్డీ, డీజిల్, ఐఆర్ ఆర్టీసీకి రూ.3,500 కోట్లకుపైగా బ్యాంకు అప్పులున్నాయి. వడ్డీ భారం రూ.181 కోట్లు. ఇది అంతకు ముందు సంవత్సరం కంటే రూ.16 కోట్లు ఎక్కువ. తాజా నష్టాల్లో డీజిల్ వాటా పెద్దదే. చమురు రూపంలో రూ.1,384 కోట్లు ఖర్చయింది. ఇది అంతకుముందు సంవత్సరం కంటే రూ.192.33 కోట్లు ఎక్కువ. గతేడాది ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బందికి మధ్యంతర భృతి(ఐఆర్)ని 16 శాతంగా ప్రకటించిం ది. ఇది వెంటనే అమలులోకి రావటంతో వేతన భారం కూడా పెరిగింది. ఆర్థిక సంవత్సరంలో వేత నాల రూపంలో రూ.2,381 కోట్లు చెల్లించారు. ఇది అంతకుముందు ఏడాదికంటే రూ.127.77 కోట్లు ఎక్కువ. మోటారు వెహికిల్ టాక్స్ రూ.174 కోట్లు. ఇలా అన్నీ కలిపి అంతకుముందు సంవత్సరం నష్టాల కంటే రూ.179.76 కోట్లను పెంచుకుని రూ.వేయి కోట్లకు చేరువైంది. ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువగా... ప్రస్తుత ఆర్థిక సంవవత్సరం తొలి త్రైమాసిక నష్టాలను చూస్తే ఏప్రిల్‌లోనే రూ.38.23 కోట్లు, మేలో రూ.37.96 కోట్లు నష్టాలు నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ (రూ.34 కోట్లు), మే(రూ.26 కోట్ల) కంటే చాలా ఎక్కువ. - తెలంగాణలో వేయి గ్రామాలకు బస్సు వసతి లేదు. వీటికి బస్సులు నడపాలంటే కనీసం 1,500 కొత్త బస్సులు కొనాలి. మూడు వేల మంది అదనపు డ్రైవర్లు, కండక్టర్లు కావాలి. - 3 వేల బస్సులు డొక్కుగా మారి నడవటానికి యోగ్యంగా లేవు. వాటిని రీప్లేస్ చేయాలంటే కొత్త బస్సులు కొనాలి. -
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ..
సాక్షి, భద్రాచలం(ఖమ్మం) : ఆర్టీసీ ఇన్‌గేట్ సమీపంలో బస్‌ను లారీ ఢీకొట్టిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకొంది. భద్రాచలం డిపోకు చెందిన టీఎస్ 28జెడ్ 0058 నంబరు గల ఆర్టీసీ డీలక్స్ బస్ విజయవాడ నుంచి భద్రాచలం బస్టాండ్‌లోకి వస్తున్నది. బస్ ఇన్ గేట్లోకి ప్రవేశించే సమయంలో బస్ వెనకభాగాన్ని వెనుక నుంచి లారీ బలంగా ఢీకొన్నది. ఇదే సమయంలో అంబేడ్కర్ సెంటర్ నుంచి బ్రిడ్జిరోడ్డు వైపు రెండు లారీలు ఒకదాని వెనక మరొకటి వేగంగా వస్తున్నాయి. ఇదేక్రమంలో బస్టాండ్‌లోకి బస్ ప్రవేశిస్తుండటంతో లారీ డ్రైవర్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ఆ లారీ వెనుకనే వస్తున్న లారీ డ్రైవర్ కూడా సడన్ బ్రేక్ వేశాడు. ఆ సమయంలో వర్షం కురుస్తున్నందున సడన్ బ్రేక్ వేయడంతో లారీలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. దీంతో ముందు లారీ ఆర్టీసీ బస్‌ను ఢీ కొట్టింది. ఆ సమయంలో ఆర్టీసీ బస్‌లో ప్రయాణికులెవరూ లేక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 0042 లారీ డ్రైవర్‌కు మాత్రమే స్వల్ప గాయాలు అయ్యాయి. ఆర్టీసీ అధికారులు అక్కడకు చేరుకొని బస్‌కు రూ.10 వేల ఆస్తినష్టం జరిగినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటో బోల్తా..10 మందికి గాయాలు అశ్వారావుపేటరూరల్: అదుపుతప్పి ఆటో బోల్తా పడి పది మందికి గాయాలైన సంఘటన ఆదివారం మండలంలో జరిగింది. ఖమ్మం జిల్లా వీఎం బంజరకు చెందిన భక్తులు అశ్వారావుపేట మండలంలోని గోగులపుడి అటవీ ప్రాంతంలోగల శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకొని తిరిగి ఆటోలో వస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని పాత కన్నాయిగూడెం–కొత్త కన్నాయిగూడెం గ్రామాల మధ్యలో గల మూల మలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడిపోయింది. దాంతో ఆటోలో ప్రయాణిస్తున్న వీఎం బంజర మండలం ఉప్పలచలక గ్రామానికి చెందిన లింగపోగు వెంకటేశ్వరరావుతో పాటు, అదే ప్రాంతానికి చెందిన చిల్లముంత రామకృష్ణ, చిల్లముంత వెంకటేశ్వరరావు, చిల్లముంత జమలయ్య, జొన్నలగడ్డ రవితోపాటు, ఆటో డ్రైవర్ కొత్తపల్లి శ్రీనుకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితోపాటు మరో నలుగురికి స్వల్ప గాయాలు కాగా 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స నిర్వహించారు. వీరిలో లింగపోగు వెంకటేశ్వరరావుకు ఎడమ చేతికి తీవ్ర గాయాలు కాగా, చిల్లముంత రామకృష్ణ తలకు బలమైన గాయం అయింది. మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. సమా చారం అందుకున్న స్థానిక పోలీసులు వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కూసుమంచిలో ట్రాలీ ఆటో బోల్తా.. కూసుమంచి: లోక్యాతండా సమీపంలో కూలీలతో వెళుతున్న ట్రాలీ ఆటో బోల్తా పడిన ఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ముదిగొండ మండల మాధాపురం గ్రామానికి చెందిన కూలీలు పనుల నిమిత్తం కూసుమంచి వస్తున్న క్రమంలో ట్రాలీ ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురు కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగ్రాతులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎటువంటి సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు. -
ఇన్‌చార్జ్‌లతో ఆర్టీసీ అస్తవ్యస్తం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఆయన ఓ ఉన్నతాధికారి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న బస్‌భవన్‌లో ఇన్చార్జి ఈడీగా ఉన్నారు. ఆయన అసలు పోస్టు ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్. హైదరాబాద్–ఆదిలాబాద్ మధ్య 300 కి.మీ. దూరం ఉంటుంది. ఇంతదూరంలో ఉన్న రెండు ప్రాంతాల్లో ఒకే వ్యక్తి ఎలా పనిచేయగలరు. ఇది ఆర్టీసీలో ఉన్న గందరగోళానికి ఓ నిదర్శనం. ఇదే అధికారి ఈనెలాఖరున పదవీ విరమణ పొందనున్నారు. సీనియారిటీ క్రమంలో ఆయనకు ఈడీ పదోన్నతి రావాలి. కానీ, ఎన్నికల కోడ్ పేరుతో ఇంతకాలం కాలయాపన జరిగింది. కోడ్ ముగిసినా ఇప్పటివరకు పదోన్నతుల ఊసు లేదు. ఇలాగే ఉంటే ఆయన ఈడీగా కాకుండా అంతకంటే ఓ మెట్టు దిగువన ఉండే రీజినల్ మేనేజర్‌గానే పదవీ విరమణ పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం దాదాపు పది ప్రాంతాల్లో పూర్తిస్థాయి ఆర్ఎంలు, డీవీఎంలు లేరు. ఎక్కడెక్కడో ఉన్న వారితో ఇన్చార్జులుగా నెట్టుకొస్తున్నారు. ఇంత గందరగోళంగా ఉన్న ఆర్టీసీకి అసలు పూర్తిస్థాయి ఎండీనే లేకపోవటంతో ఈ పదోన్నతులు, బదిలీల గందరగోళం తీవ్రమైంది. మూడు పోస్టులతో సతమతమవుతున్న ఇన్చార్జి ఎండీకి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ, కీలక అంశాలకు సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేసేవారు కూడా లేకపోవటంతో అంతా అస్తవ్యస్తంగా తయారైంది. అసలే తీవ్ర నష్టాలతో దివాలా దిశలో సాగుతున్న ఆర్టీసీ... గాడిలో పడాల్సింది పోయి ఇలా గందరగోళంతో కుస్తీపడుతోంది. ఆ కమిటీ ఎక్కడుంది? రాష్ట్ర విభజన జరిగినా ఇప్పటికీ ఆర్టీసీ సాంకేతికంగా రెండు రాష్ట్రాల మధ్య విడిపోలేదు. దీంతో తెలంగాణ ఆర్టీసీకి పాలకమండలి లేదు. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సింది పాలకమండలి కావటంతో చాలా పనులు తాత్కాలిక పద్ధతిలో జరుగుతున్నాయి. పదోన్నతుల విషయంలోనూ అదే జరుగుతోంది. దీంతో గత సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రభుత్వం సెలక్షన్, డిసిప్లినరీ కమిటీని నియమించింది. ఆర్టీసీ చైర్మన్, ఆర్టీసీ ఎండీ, జీహెచ్ఎంసీ కమిషనర్, రవాణా శాఖ, ఫైనాన్స్ (ట్రాన్స్‌పోర్టు), కార్మిక శాఖల కార్యదర్శులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సమావేశమై కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ఇది అమలులో ఉంటుంది. అంటే గతేడాది సెప్టెంబర్‌లో ఈ కమిటీ ఏర్పడినందున అంతకుముందు జరిగిన వాటిని రెగ్యులరైజ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బస్‌భవన్‌లో పురుషోత్తమనాయక్, వినోద్‌కుమార్‌లు ఈడీలుగా పదోన్నతి పొంది పనిచేస్తున్నారు. వీరిద్దరిని కూడా ఈ కమిటీ రెగ్యులరైజ్ చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు కొత్త పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్ రావటంతో గతేడాది చివరి నుంచి పదోన్నతులు ఆగిపోయాయి. పదోన్నతులు లేనందున కొత్త ఖాళీలు ఏర్పడక బదిలీలు కూడా నిలిచిపోయాయి. వాస్తవానికి ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటై ఉన్నందున, ఆ కమిటీ సమావేశమై బదిలీలు, పదోన్నతులపై నిర్ణయం తీసుకుని అత్యవసర పనిగా ఎన్నికల కమిషన్ ముందు ప్రతిపాదిస్తే ఆమోదం లభించే అవకాశం కూడా ఉండేదన్న అభిప్రాయం ఉంది. కానీ, ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు కమిటీ సమావేశమే కాలేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగిసినా ఆ ఊసే లేక పాలన అంతా అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 20 కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సాక్షాత్తూ బస్‌భవన్‌లోనే ముగ్గురు ఈడీలు ఇన్చార్జులుగా ఉన్నారు. ఇటీవల ఆర్ఎం స్థాయిలో ఉన్న అధికారులను తాత్కాలిక పద్ధతిలో ఈడీలుగా కూర్చోబెట్టారు. పదోన్నతులు లేనందున వీరు పర్యవేక్షించే రెగ్యులర్ పోస్టుల్లో ఎవరినీ నియమించలేదు. ఈ ముగ్గురు అధికారులకు ఈడీ పదోన్నతి ఇస్తే వారు చూసే రెగ్యులర్ ఆర్ఎం కేడర్ పోస్టులు ఖాళీ అవుతాయి. వాటిని డీవీఎంలతో భర్తీ చేస్తారు. అలా ఖాళీ అయ్యే డీవీఎం పోస్టులను సీనియర్ డీఎంలతో భర్తీ చేస్తారు. వాటిని అసిస్టెంట్ డీఎం పోస్టులతో.. ఇలా కిందిస్థాయి వరకు పోస్టులు భర్తీ అవుతాయి. కానీ ఈ ప్రక్రియ జరగక అధికారుల్లో అయోమయం నెలకొంది. ఇక దాదాపు పది డిపోలకు పూర్తిస్థాయి డిపో మేనేజర్లు లేరు. వాటిని తాత్కాలిక పద్ధతిలో ఇతరులు పర్యవేక్షిస్తున్నారు. ఈ వ్యవహారం ఆర్టీసీ బస్సుల నిర్వహణపై పడుతోంది. సాధారణంగా రెండుమూడేళ్లు జిల్లాల్లో పనిచేసే పెద్ద అధికారులను ఆ తర్వాత నగరానికి బదిలీ చేస్తారు. కానీ ప్రస్తుతం నాలుగేళ్లు దాటినా తమకు హైదరాబాద్ భాగ్యం దక్కటం లేదని కొందరు అధికారులు వాపోతున్నారు. ఇక పాఠశాలలు తెరిచేలోపే బదిలీలు జరిగితే బాగుండేదని, ఇప్పుడు బడులు తెరిచినందున మధ్యలో ట్రాన్స్ఫర్స్ జరిగితే పిల్లల చదువులకూ ఇబ్బందులు ఏర్పడతాయని అధికారులు వాపోతున్నారు. ఈ వ్యవహారం మరోవైపు ఆర్టీసీ అధికారుల సంఘంలోనూ లుకలుకలకు కారణమైంది. బదిలీలు, పదోన్నతుల విషయంలో ఎండీపై ఒత్తిడి చేయటం లేదంటూ బాధ్యులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంఘానికి ఎన్నికలు నిర్వహించాలంటూ కొందరు డిమాండ్ ప్రారంభించారు. ఇక సందట్లో సడేమియాగా జూనియర్ అధికారులు కొందరు పైరవీలతో పెద్ద పోస్టుల్లో తాత్కాలిక పద్ధతిలో నియామకమయ్యేలా చక్రం తిప్పుతున్నారు. -
రోడ్లపై బస్సులు ఆపేస్తున్నారు..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఇష్టార్యాజ్యంగా వ్యవహరిస్తున్న అద్దె బస్సు డ్రైవర్ల జాడ్యం ఇప్పుడు బ్యాటరీ బస్సులకూ పట్టుకుంది. తొలిసారి హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. భారీ వ్యయంతో కూడుకున్నవి కావటంతో వీటిని అద్దెకు తీసుకుంది. కేంద్రం నుంచి వీటి కొనుగోలుపై వచ్చిన సబ్సిడీ కూడా ప్రైవేటు కంపెనీకే మళ్లించింది. దీంతో ఓ సంస్థ ముందుకొచ్చి హైదరాబాద్‌లో 40 బ్యాటరీ బస్సులను ప్రవేశపెట్టింది. ఉన్నట్టుండి ఆపేస్తున్నారు.. ఈ 40 బస్సుల్లో ప్రైవేటు సంస్థే డ్రైవర్ల్లను నియమిస్తుంది. వారికి సంబంధించిన వ్యవహారాలను ఆ సంస్థే చూసుకోవాలని ఒప్పందంలో ఉంది. కానీ తమ డిమాండ్లు పరిష్కారం కావట్లేదన్న పేరుతో వాటి డ్రైవర్లు ఉన్నట్టుండి బస్సులను ఆపేస్తున్నారు. మియాపూర్–2, కంటోన్మెంట్ డిపోలకు 20 బస్సుల చొప్పున కేటాయించారు. గతంలో కంటోన్మెంట్ డిపో పరిధిలోని డ్రైవర్లు బస్సులను ఆపేయగా తాజాగా మియాపూర్ డిపో డ్రైవర్లు మొండికేశారు. ఈ బస్సులు విమానాశ్రయ మార్గంలో నడుస్తాయి. ఉన్నట్టుండి బస్సులను ఆపేసేసరికి ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రతిదానికీ నిరసన.. తమకు వేతనాలు తక్కువగా చెల్లిస్తున్నారని ఆ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయంలో టికెట్ల విక్రయానికి ఆర్టీసీ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. కౌంటర్లో టికెట్ కొని ఎలక్ట్రిక్ బస్సు ఎక్కితే డ్రైవర్లకు కమీషన్ రావట్లేదు. బస్సులో అమ్మే టికెట్లపైనే వస్తుంది. దీంతో విమానాశ్రయంలోని కౌంటర్లను తొలగించి బస్సులోనే టికెట్లు కొనేలా ఏర్పాటు చేయాలని డ్రైవర్లు డిమాం డ్ చేస్తున్నారు. కౌంటర్లు తొలగించేది లేదని ఆర్టీసీ చెబుతోంది. తమకు సిటీలో తిరిగేందుకు ఉచిత బస్‌పాస్‌లు ఇవ్వాలని మరో డిమాండ్ తెరపైకి తెచ్చారు. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఇంటి నుంచి తాము పనిచేసే డిపో వరకు వెళ్లేందుకు ఆర్టీసీ పాస్ ఇస్తుంది. కానీ ఎలక్ట్రిక్ బస్సులను నిర్వహించే సంస్థ ఆర్టీసీతో చేసుకున్న ఒప్పందంలో ఈ అంశం లేకపోవటంతో ఆర్టీసీ వారికి పాస్‌లు ఇవ్వలేదు. వారికి రూట్‌పాస్ ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలి సింది. వేతనాల విషయం ఆ ప్రైవేటు సంస్థతోనే మాట్లాడుకోవాలని తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. -
తప్పిన పెనుప్రమాదం
జైపూర్(చెన్నూర్): ఆర్టీసీ బస్సులు వరుసగా ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. శుక్రవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో మరో బస్సు ప్రమాదానికి గురైంది. మండల కేంద్రంలోని ఎల్లమ్మగుడి సమీపంలో మంచిర్యాల–చెన్నూర్ 63వ నంబర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 30 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మంచిర్యాల ఆర్టీసీ డిపోకు చెందిన పల్లెవెలుగు (అద్దె బస్సు) శుక్రవారం మధ్యాహ్నం మంచిర్యాల నుంచి చెన్నూర్‌కు 70 మంది ప్రయాణికులతో బయల్దేరింది. ఎల్లమ్మగుడి సమీపంలోకి రాగానే.. బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి కల్వర్టును వేగంతో ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలోకి పడిపోయింది. దీంతో ప్రయాణికులు ఒకరిపైఒకరు పడిపోయారు. బస్సు అద్దాలు, సీట్లు, ఇనుపరాడ్లు బలంగా తాకడంతో ప్రయాణికుల తలలు, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు కండక్టర్‌తో సహా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పప్రతికి తరలించి చికిత్స అందించారు. స్వల్పంగా గాయపడ్డ వారిని జైపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందించి మంచిర్యాలకు రెఫర్ చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని, నిద్రమత్తుతో బస్సు నడిపాడని ప్రయాణికులు చెబుతున్నారు. బస్సు డ్రైవర్ మాత్రం బ్రేక్‌ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని పేర్కొంటున్నాడు. వరుసగా చోటు చేసుకుంటున్న ఆర్టీసీ బస్సుల ప్రమాదాలతో ప్రయాణికుల్లో ఆందోళన చెందుతున్నారు. -
‘ఓటు’ జనం
సాక్షి, హైదరాబాద్: దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలన్నీ ఒకేసారి వచ్చినట్లు హైదరాబాద్ వాసులు ఓట్ల పండుగ కోసం సొంత ఊళ్లకు పోటెత్తారు. రెండు రోజులుగా కొనసాగుతున్న ప్రయాణికుల రద్దీ బుధవారం తారస్థాయికి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో గురువారమే ఎన్నికలు కావడంతో పెద్ద ఎత్తున సొంత ఊళ్లకు బయల్దేరారు. ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఎక్కువ శాతం ప్రధాన రాజకీయ పార్టీలే గంపగుత్తగా బుక్ చేసుకుని ప్రయాణికులను తరలించాయి. దీంతో సాధారణ జనానికి ప్రైవేట్ బస్సు లు చాలా వరకు అందుబాటులో లేకుండా పోయా యి. ఉన్న కొద్ది పాటి బస్సుల్లోనూ చార్జీలను రెట్టింపు చేశారు. విద్యాసంస్థలకు చెందిన బస్సుల్లోనూ ప్రయాణికులను సొంత ఊళ్లకు తరలించినట్లు సమాచారం. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజు రాకపోకలు సాగించే 3,500 ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌లగ్జరీ, ఏసీ బస్సులతో పాటు మరో 700 బస్సులను రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీలు అదనంగా ఏర్పాటు చేశాయి. సిటీ బస్సులను సైతం ఏపీలోని వివిధ ప్రాంతాలకు నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేష న్ ప్రాంతాలు జనంతో పోటెత్తాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ఆర్టీసీ యథావిధిగా 50 శాతం అదనపు చార్జీలు విధించింది. బుధవారం ఒక్క రోజే సుమారు 8 లక్షల మందికి పైగా తెలుగు రాష్ట్రాలకు తరలివెళ్లినట్లు అంచనా. మొత్తంగా సుమారు 20 లక్షల మంది నగరం నుంచి వెళ్లారు. అదనపు బోగీలు.. మూడు రోజులుగా సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్లు పోటెత్తాయి. విజయవాడ, విశాఖపట్టణం, కాకినాడ, తిరుపతి, తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ కిటకిటలాడాయి. రెగ్యులర్ రైళ్లతో పాటు, ప్రత్యేక రైళ్లలోనూ రద్దీ భారీగా పెరిగింది. బుధవారం ఒక్క రోజే అదనంగా మూడు సాధారణ రైళ్లను నడిపారు. మరో 8 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో సికింద్రాబాద్–కాకినాడ, సికింద్రాబాద్–తిరుపతి, లింగంపల్లి–కాకినాడల మధ్య ఏర్పాటు చేసిన సాధారణ రైళ్లలో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. సికింద్రాబాద్–గూడూరు సింహపురి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్. సికింద్రాబాద్–నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–విశాఖ గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, కాచిగూడ– చిత్తూరు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, కాచిగూడ– రేపల్లె, సికింద్రాబాద్–కాకినాడ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. ఏపీ వైపు వెళ్లే రైళ్లతో పాటు వరంగల్, కాజీపేట్, మహబూబ్‌నగర్, తదితర మార్గాల్లో రాకపోకలు సాగించే ప్యాసింజర్ రైళ్లలోనూ రద్దీ పెరిగింది. బుధవారం ఒక్క రోజే సుమారు 4 లక్షల మందికి పైగా రైళ్లలో వెళ్లినట్లు అంచనా. రిజర్వేషన్లు లభించని ప్రయాణికులు సాధారణ బోగీల్లో వెళ్లేందుకు పోటీపడ్డారు. దీంతో పిల్లలు, పెద్దవాళ్లు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఓటు హక్కును వినియోగించుకోవాలనే పట్టుదలతో కష్టాలను లెక్కచేయకుండా బయల్దేరి వెళ్లారు. రెగ్యులర్ సర్వీసుల్లో కోత ఏపీకి వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రాజకీయ పార్టీలు గంపగుత్తగా బుక్ చేసుకోవడంతో బుధవారం పలు రూట్లలో ఆపరేటర్లు సర్వీసులను నిలిపేశారు. మిగిలిన సర్వీసుల్లో చార్జీలను రెట్టింపు చేశారు. మియాపూర్, కూకట్పల్లి, అమీర్‌పేట్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగ ర్ వంటి ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ఓటర్లను వారి సొంత ఊళ్లకు తరలించారు. నిత్యం ఏపీ వైపు రాకపోకలు సాగిం చే 1000 ప్రైవేట్ బస్సుల్లో సగానికి పైగా రాజ కీయ పార్టీలే బుక్ చేసుకున్నాయని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెంట్ తెలిపారు. వాహనాల రద్దీ వల్ల విజయవాడ, కర్నూల్, వరంగల్, తూప్రాన్ మార్గాల్లో ఉన్న టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. -
అదును దొరికితే బాదుడే...
విజయనగరం అర్బన్: ప్రజల కష్ట,సుఖాలనెరిగి పరిపాలన చేసేవారిని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. అలాంటి నాయక వారసత్వాన్నే కోరుకోవడం సహజం. దివంగత ముఖ్యమంత్రి, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన పాలనను కూడా మరలా ప్రజలు కోరుకుంటున్నారు. తన హయాంలో పేదల సంక్షేమానికి పెద్దపీట చేశారు. తన ఐదేళ్ల పదవీకాలంటే ఆర్టీసీ వ్యవస్థను పరిరక్షిస్తూ ఏనాడూ బస్సు చార్జీలు పెంచకపోడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మహానేత మరణానంతరం వచ్చిన ముఖ్యమంత్రులు ఎడాపెడా చార్జీలను పెంచి సామాన్యుడి నడ్డి విరిచారు. దీంతో బస్సు ఎక్కాలంటే పేదోడు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి తొమ్మిదేళ్ల పాలనలో ఇలాగే విద్యుత్, బస్సు చార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారు. రవాణా సౌకర్యం.. పేద, ధనిక అనే తేడాలేకుండా ప్రభుత్వం అందరికీ రవాణా సౌకర్యం కల్పించాలి. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మినహా మిగతా ముఖ్యమంత్రులెవ్వరూ దీనిని అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన తొమ్మిదేళ్లపాలనా కాలంలో ఇష్టానుసారంగా బస్సుచార్జీలు పెంచి ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అదే టీడీపీ తాజాగా గడచిన ఐదేళ్లలో బసు చార్జీలు పెంచకపోయినా.. ఖరీదైన లగ్జరీ, ఆల్ట్రా డీలక్స్, సూపర్‌లగ్జరీ, గరుడా వంటి సర్వీసులను ప్రవేశపెట్టింది. అలాగే నష్టం వస్తుందనే సాకుతో చాలా గ్రామాలకు పల్లె వెలుగు సర్వీసులను రద్దు చేశారు. కొన్ని చోట్ల ఆర్డినరీ బస్సులన్నా ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేయడం విశేషం. పైగా సంస్థ నష్టాల్లో ఉంటే ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా ఆర్థిక సాయం చేయలేదు. కానీ వైఎస్సార్ తన హయాంలో ఏడాదికి రూ. 300 కోట్ల ఆర్థిక సాయం చేయడంతో పాటు కార్మికులు కోరిన వేతన ఒప్పందం అందజేశారు. నాలుగేళ్లలో నాలుగుసార్లు.. నష్టాల్లో ఉన్న రోడ్డు రవాణా సంస్థను ఆదుకునేందుకు అనేక మార్గాలు ఉన్నా పట్టించుకోకుండా చార్జీలు పెంచడమే లక్ష్యంగా రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు పనిచేశాయి. ఆ తర్వాత వచ్చిన టీడీపీ ఖరీదైన లగ్జరీ సర్వీసులను ప్రవేశ పెట్టి సామాన్యులకు ఆర్టీసీ ప్రయాణం భారంగా మార్చారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని నెక్ రీజయన్లో 920 బస్సులకు పైగా ఉన్నాయి. ఇవి రోజుకు మూడు లక్షలకు పైగా కిలోమీటర్లు తిరుగుతున్నాయి. 2010 జనవరి 6న రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చార్జీల పెంచి రూ. 30 కోట్ల భారం మోపారు. ఆ తర్వాత 2011 జూలై 16న కిరణ్‌కుమార్ రెడ్డి సర్కారు పెంచిన చార్జీలతో ఏటా రూ. 26 కోట్ల భారం పడగా.. 2012 సెప్టెంబర్ 24న పెంచిన చార్జీలతో ఏటా రూ. 35 కోట్లు.. 2013 నవంబర్ 6వ తేదీన చార్జీలు పెంచడంతో రూ. 35.50 కోట్ల మేరకు భారం పడింది. దీంతో చార్జీల భారం సుమారు రూ.130 కోట్లకు చేరింది. టీడీపీ హయాంలో అభివృద్ధి సెస్ పేరుతో టిక్కెట్‌కి రూపాయలు వసూలు చేయడంతో ప్రయాణికులపై రూ. 3.50 కోట్ల భారం పడింది. టోల్‌ప్లాజా చార్జీని ఆర్డినరీ మినహా ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసులకు రూ.3 నుంచి ఐదు రూపాయలకు... ఇంద్ర, వెన్నెల, గరుడా, వెన్నెలా ప్లస్, తదితర సర్వీసుల టోల్ ప్లాజా చార్జీని మూడు రూపాయల నుంచి రూ.6కు పెంచారు. పల్లె వెలుగు కనీసం చార్జీ రూ. 3 నుంచి ఐదు రూపాయలకు పెంచి గ్రామీణ ప్రాంత ప్రయాణికుల నడ్డి విరిచారు. రాజన్న రాజ్యం రావాలంటే ఆయన ఆశయ సాధనకు కృషి చేసే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. -
నష్టాలకు మళ్లీ రెక్కలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ నష్టాల బాట వీడలేదు. రెండేళ్లతో పోలిస్తే నష్టాలు కొంత తగ్గాయి. అయితే, గత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి మళ్లీ నష్టాలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. జనవరితో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నష్టాలు రూ.603 కోట్లుగా లెక్కతేలింది. ఇందులో జనవరి నెల వాటా రూ.69 కోట్లుగా గుర్తించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలల్లో లాభాలు నమోదైతేనే మొత్తంగా నష్టాలు తగ్గుతాయి. కానీ గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఏకంగా రూ.170 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం నష్టాలు రూ.650 కోట్లుగా తేలాయి. 2015–16, 2016–17 ఆర్థిక సంవత్సరాల్లో ఈ నష్టాలు ఏకంగా రూ.700 కోట్లను మించిపోయాయి. ఆ తర్వాత దాన్ని రూ.650 కోట్లకే పరిమితం చేశారు. కొన్ని పొదుపు చర్యల వల్లే నష్టాలు తగ్గాయని పేర్కొన్న అధికారులు, పొదుపు మరింత పెంచి ఈ ఆర్థిక సంవత్సరంలో నష్టాలను మరింత తగ్గిస్తామని పేర్కొన్నారు. కానీ, గత నవంబర్‌లో రూ.105 కోట్లు, డిసెంబర్లో రూ.72 కోట్ల నష్టం రావటంతో పరిస్థితి చేయిదాటిపోయింది. ప్రస్తుతం ఆర్టీసీతీరు గందరగోళంగా మారింది. సంస్థకు పూర్తిస్థాయి ఎండీ లేరు. గతంలో పనిచేసిన రిటైర్ట్ అధికారి రమణారావు పదవీకాలం పొడిగించలేదు. సంస్థపై పూర్తిస్థాయిలో దృష్టి సారించేవారు లేక నష్టాలకు ముకుతాడు పడలేదు. ఇదే ఆర్థిక సంవత్సరంలో ముగ్గురు ఈడీలు పదవీవిరమణ పొందారు. మరో నెల రోజుల్లో ఇంకో అధికారి కూడా రిటైర్ కానున్నారు. నష్టాలకు ముకుతాడు వేస్తా: మంత్రి వేముల ఆర్టీసీని కచ్చితంగా చక్కదిద్దుతానని రవాణా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... గత ఆర్థిక సంవత్సరం కం టే 5 శాతం నష్టాలు తక్కువగా నమోదయ్యాయని, వచ్చే ఆర్థిక సంవత్సరం తుదివరకు అది 10 శాతం తక్కువగా ఉండేలా చూస్తానని పేర్కొన్నారు. 72 బస్టేషన్లలో బడ్జెట్ హోటళ్ల నిర్మాణం, 97 కేంద్రాల్లో ఇంధన ఔట్లెట్ల ఏర్పాటుతో ఆదాయం పెరుగుతుందన్నారు. ఆర్టీసీ ప్రజాసేవకే ఉందని, లాభార్జన కోసం కాదన్న విషయాన్ని కూడా గుర్తించాలన్నారు. రవాణా శాఖ 2015లో రూ.1,800 కోట్లు ఉన్న ఆదాయాన్ని ప్రస్తుతం రూ.3 వేల కోట్లకు పెంచుకుందని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తుల విభజన ఇంకా పీటముడిగానే ఉందన్నారు. నా కోసం కొత్త బస్సుల ప్రారంభం ఆపకండి ‘కొత్త బస్సుల ప్రారంభోత్సవం కోసం నేనో, మరొకరో రావాలని ఎదురు చూడకండి. ఎండీ అందుబాటులో లేకున్నా ఈడీలే వాటిని ప్రారంభించేసుకోవచ్చు. నాలుగైదు రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కాలి’అని ఆర్టీసీ అధికారులను మంత్రి వేముల ఆదేశించారు. మంత్రో, మరెవరో ప్రారంభోత్సవాలకు రావాలని ఎదురుచూస్తూ బస్సులను డిపోలకే పరిమితం చేయటం సరికాదన్నారు. గత సంవత్సరం ఆర్టీసీ కొత్తగా సమకూర్చుకున్న దాదాపు 400 బస్సులను ముఖ్యమంత్రి ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఏడెనిమిది నెలలపాటు పార్కింగ్ యార్డులో ఉంచారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌కు వంద ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేయగా తొలిదశలో 40 బస్సులు సమకూరాయి. ఒక్కోటి రూ.3 కోట్ల ఖరీదు చేసే ఈ బస్సులను అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ వినియోగించుకోనుంది. కేంద్రం ఇచ్చిన సబ్సిడీని కూడా ప్రైవేటు సంస్థకు మళ్లించిన అధికారులు ఆ సంస్థ నుంచి వాటిని అద్దెరూపంలో తీసుకోనున్నారు. కిలోమీటరుకు రూ. 34 చొప్పున ఆ సంస్థకు ఆర్టీసీ అద్దె చెల్లిస్తుంది. అంతకుమించి వసూలయ్యే మొత్తాన్ని తాను జమ చేసుకుంటుంది. ప్రస్తుతం నగరంలోని కంటోన్మెంట్, మియాపూర్–2 డిపోలకు 20 చొప్పున బస్సులు కేటాయించారు. -
ఆర్టీసీకి పండుగే పండుగ!
సాక్షి, హైదరాబాద్: నష్టాల్లో ఆర్టీసీ సంక్రాంతితో కలెక్షన్ల పండుగ చేసుకుంది. ఈసారి ఏకంగా రూ.135 కోట్ల కలెక్షన్లతో ఆర్టీసీ వసూళ్లు కలకలలాడుతున్నాయి. గతేడాదితో పోలిస్తే.. ఈ సారి రూ.4.57 కోట్లు అధిక వసూళ్లు రాబట్టింది. జనవరి 10 నుంచి 15 వరకు తెలంగాణ, ఏపీల్లోని వివిధ ప్రాంతాలకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా సర్వీసులు నడిపింది. ఇందుకు 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేసింది. ఆర్టీసీ అధికారులు ఈసారి రూ.130 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నా దాన్ని సునాయాసంగా అధిగమించారు. గతేడాది కన్నా అధికం.. ఈ సారి సంక్రాంతికి ఏపీతో పాటు తెలంగాణ పల్లెలకు పెద్ద ఎత్తున హైదరాబాద్‌వాసులు తరలివెళ్లారు. ముఖ్యంగా తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో పెద్ద ఎత్తున తెలంగాణవాసులు పల్లెబాట పట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ 5,252 ప్రత్యేక సర్వీసులను హైదరాబాద్ నుంచి నడిపింది. ఇందులో 1,560 ఏపీకి, 3,600 పైగా బస్సులను తెలంగాణలోని జిల్లాలకు నడిపింది. రూ.63.36 కోట్లు వసూలు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇదంతా అప్ జర్నీదే కావడం గమనార్హం. ఈ లెక్కన 10 నుంచి 15 వరకు 6 రోజుల పాటు రోజుకు రూ.10.33 లక్షలు వచ్చినట్లు అధికారులు వివరించారు. 16 నుంచి 21 వరకు రివర్స్ జర్నీ వసూళ్లు రూ.72 కోట్లు వచ్చాయి. రోజుకు రూ.12 లక్షల చొప్పున వసూలైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో 21న పంచాయతీ ఎన్నికలు జరగడం కూడా ఆర్టీసీకి కలిసొచ్చింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆది, సోమవారాల్లో హైదరాబాద్ నుంచి పెద్దఎత్తున జనం వెళ్లారు. ఏపీకి భారీ వసూళ్లు.. ఏపీఎస్ ఆర్టీసీతో పోలిస్తే.. టీఎస్ఆర్టీసీ ఆదాయం సగమే కావడం గమనార్హం. ఏపీఎస్ ఆర్టీసీకి గతేడాది ఆదాయంతో పోలిస్తే రూ.10 కోట్లు అదనపు ఆదాయం రాగా, టీఎస్ ఆర్టీసీకి రూ. 4.57 కోట్లే ఆదాయం వచ్చింది. ఏపీ నుంచి హైదరాబాద్‌కు ఏపీఎస్ఆర్టీసీ 2,600 బస్సులు నడపగా, హైదరాబాద్ నుంచి ఏపీకి టీఎస్ఆర్టీసీ 1,560 బస్సులనే నడిపింది. ఏపీఎస్ఆర్టీసీ టికెట్ల ధరలు అధికంగా వసూలు చేయడం, హైదరాబాద్ నుంచి తెలంగాణ కన్నా ఎక్కువ సర్వీసులు నడపడంతో అధిక వసూళ్లు సాధించడంలో ఏపీఎస్ఆర్టీసీ సఫలీకృతమైంది. -
హైదరాబాద్‌లో ‘ఆలంబాగ్’!
ఆధునిక బస్స్టేషన్ల నిర్మాణానికి ఆర్టీసీ శ్రీకారం చుట్టింది.హైదరాబాద్ నగర అందాన్ని ద్విగుణీకృతం చేసే విధంగా వీటిని నిర్మించడంతో పాటు, అత్యాధునిక సదుపాయాలను కల్పిస్తారు. ఏసీ సదుపాయం , ఫుడ్‌ప్లాజాలు, షాపింగ్‌మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్లు, బ్యాంకులు, తదితర అన్ని వాణిజ్య కార్యకలాపాలకు, వినోదాలకు కేంద్రంగా సిటీబస్స్టేషన్ల ఏర్పాటుకు గ్రేటర్ ఆర్టీసీ ప్రణాళికలను రూపొందిస్తోంది. నగర వాసులను, పర్యాటకులు సైతం వీటిని సందర్శించేవిధంగా నిర్మించనున్నారు.యూపీ రాజధాని లక్నోలోని ఆలంబాగ్‌లో కట్టించిన హైటెక్ బస్‌స్టేషన్ తరహాలో నగరంలోని గౌలిగూడ, జూబ్లీబస్‌స్టేషన్, తదితర ప్రాంతాల్లో నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. ఇందుకోసం ఆర్టీసీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తంతో పాటు మరి కొందరు సీనియర్ అధికారులతో కూడిన బృందం ఫిబ్రవరి ఒకటో తేదీన లక్నోకు వెళ్లనుంది. యూపీలోని పలు నగరాల్లో ఉత్తరప్రదేశ్ ఆర్టీసీ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో కట్టించిన బస్స్టేషన్లను కూడా అధికారులు పరిశీలించనున్నారు. ఈ బస్స్టేషన్లలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల ద్వారా ఏటా రూ.100 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జించాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. – సాక్షి, హైదరాబాద్ ఆలంబాగ్ ప్రత్యేకతలు.. - మొత్తం 26,500 చదరపు గజాల విస్తీర్ణంలో అక్కడి అందాలను రెట్టింపుచేసే విధంగా నిర్మించారు. - రోజుకు 80 వేలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగేలా ఏర్పాట్లు . 50 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. - షాలీమార్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సుమారు రూ.200 కోట్లతో నిర్మించింది. ఇది ఒక అత్యాధునిక టౌన్షిప్పులా ఉంటుంది. - డిజైన్,బిల్డ్, ఫైనాన్స్,ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో దీన్ని కట్టించారు. 35 ఏళ్ల పాటు దీనిని లీజుకు ఇచ్చారు. - ఇలాంటివే లక్నో, ఆగ్రా, అలహాబాద్, మీరట్, ఘజియాబాద్, కాన్పూర్లలో 21 బస్స్టేషన్లను యూపీఎస్ ఆర్టీసీ నిర్మిస్తోంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మాణం.. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని బస్స్టేషన్లలో స్టాల్స్, ఇతర వ్యాపార కేంద్రాల నుంచి ఆర్టీసీకి ఏటా రూ.86 కోట్ల ఆదాయం లభిస్తోంది.ఈ ఏడాది రూ.103 కోట్లకు పెంచేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. మరోవైపు పెట్రోల్ బంకుల ద్వారా మరో రూ.25 కోట్లను ఆర్జించేందుకు చర్యలు చేపట్టారు. ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో 113 చోట్ల బంకుల నిర్మాణానికి కార్యాచరణ చేపట్టారు. వీటిలో 9 బంకులు ఆచరణలోకి వచ్చాయి. మరో 5 చోట్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇక ఆధునిక బస్స్టేషన్ల ఏర్పాటు ద్వారా రానున్న రెండేళ్లలో మొత్తంగా వాణిజ్య ఆదాయాన్ని రూ.300 కోట్లకు పెంచుకోవాలని ఆర్టీసీ యోచిస్తోంది. ఇందులో తొలి విడతగా గౌలిగూడలోని 4.5 ఎకరాలు, జూబ్లీబస్‌స్టేషన్‌కు ఆనుకొని ఉన్న 3.5 ఎకరాల స్థలాల్లో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) మోడల్లో అత్యా ధునిక బస్స్టేషన్లు నిర్మించనున్నారు. సికింద్రాబాద్ మెట్రో స్టేషన్‌కు, మహాత్మాగాంధీ మెట్రో స్టేషన్‌కు ఆనుకొని ఉండే ఈ స్థలాల్లో బస్స్టేషన్లను ఏర్పాటు చేయడం వల్ల ఆర్టీసీ–మెట్రో కనెక్టివిటీ పెరగడంతో పాటు, రెండు చోట్లా మల్టీప్లెక్స్ థియేటర్లు, మాల్స్, ఫుడ్‌ప్లాజాలు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఈ బస్స్టేషన్లు భాగ్యనగర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నిర్మించి 30 ఏళ్ల నుంచి 35 ఏళ్ల పాటు ప్రైవేట్ వ్యాపారులకు లీజుకు ఇస్తారు. అనంతరం చిలకలగూడ, మెట్టుగూడ,కాచిగూడ, ఆర్టీసీ పాత ఎండీ కార్యాలయ స్థలాల్లోనూ పీపీపీ తరహాలో వాణిజ్య భవన సముదాయాలను నిర్మించే ప్రణాళికలో అధికారులు ఉన్నారు. -
తిరుగు ప్రయాణం కొండంత భారం
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: సంక్రాంతి కోసం స్వస్థలాలకు వచ్చినవారి తిరుగు ప్రయాణం కొండంత భారం కానుంది. నేటి నుంచి ఈ నెల 20 వరకు ప్రయాణికులకు కష్టాలు తప్పేలా లేవు. డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రైవేటు ట్రావెల్స్, ఆర్టీసీ పోటాపోటీ పడుతున్నాయి. సాధారణ రోజుల్లో టిక్కెట్ల ధరల కంటే ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు మూడు, నాలుగు రెట్లు అధికంగా వసూలు చేస్తుండగా.. ఆర్టీసీ కూడా వ్యాపార ధోరణి ప్రదర్శిస్తోంది. రెగ్యులర్ బస్సులతో పాటు మూడు వేలకు పైగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ రిజర్వేషన్లకు ఫ్లెక్సీ ఫేర్ విధానం(విమాన చార్జీల్లాగా పరిస్థితిని బట్టి రేట్లు అమలు చేయడం) ప్రవేశపెట్టింది. రెగ్యులర్ చార్జీల కంటే 150 శాతం అధికంగా వసూలు చేస్తోంది. సిటీ మెట్రో కూడా ప్రత్యేక బస్సే..! సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి ఏపీలోని అన్ని జిల్లాలకు 20 లక్షల మంది వచ్చారని అంచనా. వీరి తిరుగు ప్రయాణం కోసం అన్ని జిల్లాల నుంచి 1,100 ప్రత్యేక బస్సుల్ని నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ బస్సుల్లో రిజర్వేషన్లు దాదాపు పూర్తయ్యాయి. ప్రతిరోజూ హైదరాబాద్‌కు అన్ని జిల్లాల నుంచి 150 వరకు సర్వీసులు నడుపుతున్నారు. వీటితో పాటు గురువారం నుంచి నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌కు 1,100 బస్సులు తిప్పుతున్నట్లు ప్రకటించారు. ఫ్లెక్సీ ఫేర్ అమలు చేయడం ద్వారా ప్రయాణికులను బాదేస్తున్న ఆర్టీసీ.. ప్రత్యేక బస్సుల పేరిట సిటీల్లో తిరిగే మెట్రో, సాధారణ బస్సుల్ని అందుబాటులో ఉంచింది. దీంతో ప్రయాణికులు గంటలకొద్దీ ఆ సీట్లలో నానా ఇబ్బందులు పడుతున్నారు. రిజర్వేషన్ సమయంలో ఏ బస్సు నడుపుతున్నారో కూడా సమాచారమివ్వకుండా వ్యాపార ధోరణి అవలంభిస్తోందంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. మరోవైపు రెగ్యులర్ సర్వీసులు కూడా సరైన సమయంలో తిప్పకుండా ప్రత్యేక బస్సుల్నే ఆర్టీసీ నడపడం గమనార్హం. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సు 3571 అమరావతి సర్వీస్ మధ్యాహ్నం 1.30కు బయల్దేరాల్సి ఉండగా.. ప్రత్యేక బస్సుకు ప్లాట్‌ఫాం కేటాయించి, ఈ బస్సును గంట పాటు పక్కన పెట్టారు. ఇక సంక్రాంతి హడావుడి ఎక్కువగా ఉండే పశ్చిమగోదావరి జిల్లాలోని 8 డిపోల నుంచి రోజూ 28 బస్సులు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటాయి. పండుగ నేపథ్యంలో మరో 57 ప్రత్యేక సర్వీసుల్ని ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే బుధవారం వీటిలో చాలా వరకు సీట్లు మిగిలిపోయాయని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుధాకర్ పేర్కొన్నారు. ఇక రాయలసీమలోని అనంతపురం జిల్లా నుంచి ప్రధాన నగరాలకు అదనంగా 50 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. అయితే ప్రత్యేకం పేరిట సిటీ మెట్రో బస్సులు పెట్టడంపై పలువురు ప్రయాణికులు మండిపడ్డారు. ప్రైవేటు ట్రావెల్స్ బాదుడు ఎక్కువ ఉండటంతో తప్పనిసరి పరిస్థితిలో వీటిలోనే వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. మా కష్టాలు పట్టవా? కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో సంక్రాంతి జరుపుకుందామని వస్తే.. ఇలా బాదేస్తున్నారని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వానికి మా కష్టాలు పట్టవా అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీకి ప్రభుత్వం తగిన చేయూతనిస్తే.. తమకు ఈ బాధలుండేవి కాదన్నాడు. 50 శాతం అదనంగా చార్జీలు వసూలు చేయకుండా.. అదనపు బస్సులు మరిన్ని ఏర్పాటు చేస్తే తమకు వెతలుండేవి కాదని మరో ప్రయాణికుడు వాపోయాడు. పోలవరం సందర్శన, సీఎం సభలకైతే ఇష్టారీతిన బస్సులు పెడతారని.. సామాన్యులను పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదేశాలిచ్చినా టోల్ ట్యాక్స్ వసూలు.. పండుగ సందర్భంగా 3 రోజుల పాటు వాహనదారుల నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేయబోమని ప్రభుత్వమిచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదు. కృష్ణా జిల్లా కీసర టోల్ ప్లాజా సిబ్బంది ఎప్పటిలానే టోల్‌ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. దీనిపై వాహనదారులు మండిపడుతున్నారు. తెలంగాణలోని పంతంగి, కొర్లపహాడ్ టోల్‌ప్లాజాల వద్ద ట్యాక్స్ వసూలు చేయడం లేదని.. రాష్ట్రంలో మాత్రం ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. కాగా, ఈ విషయంపై ప్లాజా సీవోఎం హరిపాండు రంగస్వామిని వివరణ కోరగా.. తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు పాటిస్తున్నామన్నారు. -
పండుగ చేసుకున్నారు!
సాక్షి, హైదరాబాద్: మద్యం వ్యాపారులు, రైల్వేశాఖ, ఆర్టీసీ, మెట్రోసంస్థలు పండుగ చేసుకున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా వాటికి కాసులపంట పండింది. రూ.వందకోట్ల మేర మద్యం విక్రయమైనట్లు ఆబ్కారీశాఖ అంచనా వేస్తోంది. దూర ప్రాంతాలకు ప్రయాణించినవారితో రైల్వేశాఖకు రూ.50 కోట్లు, ఆర్టీసీకి రూ.15 కోట్లు, మెట్రోకు రూ.5 కోట్ల మేర ఆదాయం లభించినట్లు ఆయా విభాగాల అధికారులు అంచనా వేస్తున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో అటు మెట్రోరైళ్లు సైతం కిటకిటలాడాయి. నగరం ఒక చివరి నుంచి మరో చివరికి.. అంటే అత్యధిక రద్దీ ఉండే ఎల్బీనగర్–మియాపూర్(29 కి.మీ.) మార్గంలో మెట్రోరైళ్లు అందుబాటులోకి రావడంతో మెజార్టీ సిటిజన్లు మెట్రోసేవలను వినియోగించుకున్నారు. ఐదురోజులుగా మెట్రోకు సుమారు రూ.5 కోట్ల ఆదాయం లభించినట్లు అంచనా వేస్తున్నారు. వరుస సెలవులు రావడంతో నుమాయిష్‌ను తిలకించేందుకు మెజార్టీ సిటిజన్లు మెట్రోరైళ్లలో ప్రయాణం చేసినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఆర్టీసీకి రూ.15 కోట్లు.. సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలు, నగరాలకు సుమారు పదివేల రెగ్యులర్, ప్రత్యేక బస్సులు నడిపింది. ఈ బస్సుల్లో సుమారు 10 లక్షలమంది ఆయా ప్రాంతాలకు ప్రయాణం చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీంతో 4 రోజులుగా సుమారు రూ.15 కోట్ల ఆదాయం లభించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే పండుగ సందర్భంగా రూ.50 కోట్ల ఆదాయం సమకూరినట్లు రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. శని, ఆది, సోమ, మంగళవారాల్లో మద్యం దుకాణాలు, బార్లు కిటకిటలాడాయి. వరుస సెలవులు రావడంతో 4 రోజుల్లో వందకోట్ల విలువైన మద్యం విక్రయమైనట్లు ఆబ్కారీశాఖ అంచనా వేస్తోంది. -
పెరుగుతున్న ప్రయాణ కష్టాలు
సాక్షి, అమరావతి: తెలుగు ప్రజల ముఖ్య పండుగ సంక్రాంతికి గత రెండ్రోజుల నుంచి ప్రయాణ కష్టాలు రెట్టింపవుతున్నాయి. రద్దీకి తగ్గట్లు ఆర్టీసీ, రైల్వే శాఖలు బస్సులు, రైళ్లు నడపకపోవడంతో సొంతూళ్లకు వెళ్లే వారిలో పండుగ ఉత్సాహం నీరుగారిపోతోంది. బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు నిల్చొని పడిగాపులు కాస్తున్నారు. ప్రయాణికుల వెతలు సర్కారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు ఏ మూలకూ సరిపోవడం లేదు. 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తూ విజయవాడ సిటీలో తిరిగే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లను సుదూర ప్రాంతాలైన రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్నంలకు తిప్పుతున్నారు. వీటిలో సూపర్ లగ్జరీ బస్సుల్లో వసూలు చేసే చార్జీలను వసూలు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికోమారు వచ్చే పండుగకు ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు ఇవేనా? అంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. రెగ్యులర్ సర్వీసుల్ని నిలిపేసి ఆదాయం కోసం ప్రత్యేక బస్సులను తిప్పడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బస్టాండ్లలో రిజర్వేషన్ కౌంటర్ల ముందు భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. ఆదివారం ఏలూరు, ఒంగోలు, తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు నానాపాట్లు పడాల్సి వచ్చింది. వృద్ధులు, పిల్లలతో కలిసి సొంతూరికి వెళ్లే వారికి సీటు కోసం కష్టాలు తప్పలేదు. రద్దీకి తగ్గట్లు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయడం లేదు. 15 నుంచి 20 కిలోమీటర్లు తిరిగే బస్సులను 200 కిలోమీటర్ల ప్రయాణానికి వినియోగిస్తూ రూ.200 నుంచి రూ.250 వరకు వసూలు చేయడంపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు కేవలం దూర ప్రాంత సర్వీసులపై దృష్టి కేంద్రీకరించారే తప్ప సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల్ని పట్టించుకోకపోవడంతో వారి ఇబ్బందులు వర్ణనాతీతమయ్యాయి. రైళ్లలో నిల్చొనేందుకు జాగా లేకపోవడంతో ప్రయాణం నరకంగా మారిందని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. ఈ ప్రయాణ కష్టాలు ఈనెల 21 వరకు తప్పేలా లేవని ఆర్టీసీ వర్గాలు చెప్పడం గమనార్హం. రహదార్లపై తగ్గని రద్దీ హైదరాబాద్–విజయవాడ, విజయవాడ–చెన్నై జాతీయ రహదార్లపై ఆదివారం రద్దీ తగ్గలేదు. టోల్గేట్ల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. టోల్ రుసుం రద్దు చేశామని ప్రభుత్వం ప్రకటించినా.. తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని వాహనదారులతో నిర్వాహకులు చెబుతున్నారు. కనీసం అదనపు కౌంటర్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. జన్ సాధారణ్ రైళ్లను ప్రకటించిన రైల్వే శాఖ పండుగ రద్దీ దృష్ట్యా ఏడు జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. సాధారణ రైలు చార్జీలతో ఈ రైళ్లలోని ఏ బోగీలో అయినా కూర్చుని ప్రయాణించవచ్చు. ఈ రైళ్లలో సికింద్రాబాద్ నుంచి విజయవాడకు రూ.130, విజయవాడ నుంచి హైదరాబాద్ కు రూ.135, కాకినాడ నుంచి తిరుపతికి రూ.175, విజయనగరం, విజయవాడ మధ్య ప్రయాణానికి రూ.145 టికెట్ ధరను నిర్ణయించినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. దండుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లు సంక్రాంతి రద్దీ ప్రైవేటు ఆపరేటర్లకు వరంగా మారింది. విజయవాడ నుంచి ఏలూరుకు సాధారణ రోజుల్లో కారులో వెళితే రూ.70 వసూలు చేస్తారు. ఇప్పుడు రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. అదేమంటే ఇష్టమైతే రండి..లేకుంటే పొండి.. అని ప్రైవేటు ఆపరేటర్లు చెబుతున్నారని, చేసేదేమీ లేక అడిగినంత ఇవ్వాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. -
నేడు ఆటో, క్యాబ్‌ల బంద్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెకు మద్దతుగా హైదరాబాద్‌లో ఆటోలు, క్యాబ్‌లు మంగళవారం బంద్ పాటించనున్నాయి. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తదితర కార్మిక సంఘాలు సైతం సమ్మెకు మద్దతునిస్తున్న నేపథ్యంలో బస్సుల రాకపోకలపై కూడా బంద్ ప్రభావం ఉండనుంది. అయితే ప్రధాన కార్మిక సంఘమైన టీఎంయూ (తెలంగాణ మజ్దూర్ యూనియన్) మాత్రం సమ్మెకు దూరంగా ఉండనుంది. ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపనున్నట్లు ఆ సంఘం ప్రకటించింది. ఎక్కడికక్కడే స్టాప్.. సమ్మె నేపథ్యంలో లక్షకు పైగా ఆటోరిక్షాలు, మరో 50 వేల క్యాబ్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. ముఖ్యంగా ఓలా, ఊబెర్ క్యాబ్‌లు, 25 వేలకు పైగా స్కూల్ ఆటోలు, వ్యాన్లు కూడా ఆగిపోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమ్మెను కొనసాగించనున్నట్లు ఆటో సంఘాల జేఏసీ ప్రతినిధులు వెంకటేశ్, సత్తిరెడ్డి.. తెలంగాణ టాక్సీ అండ్ డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్, ప్రతినిధులు ఈశ్వర్రావు, కొండల్‌రెడ్డి ప్రకటనల్లో తెలిపారు. కేంద్ర మోటారు వాహన చట్టంలోని కార్మిక వ్యతిరేక విధానాలను ఎత్తేయాలని.. డ్రైవర్ల భద్రత, సంక్షేమం కోసం డ్రైవర్స్ వెల్ఫేర్ బోర్డ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తిరగనున్న రైళ్లు.. రైల్వే కార్మిక సంఘాలు సైతం సార్వత్రిక సమ్మెకు మద్దతునిస్తున్నప్పటికీ రైళ్ల రాకపోకలు మాత్రం యథావిధిగా ఉంటాయి. దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రధాన రైళ్లతో పాటు, నగరంలోని వివిధ మార్గాల్లో ప్రయాణికులకు సదుపాయం అందజేసే ఎంఎంటీఎస్ రైళ్లు యథావిధిగా నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. అలాగే మెట్రో రైళ్లు కూడా యథావిధిగా తిరుగుతాయి. బస్సులపై ప్రభావం.. సమ్మెకు కొన్ని కార్మిక సంఘాలు మద్దతునిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల రాకపోకల పైనా పాక్షికంగా ప్రభావం పడే అవకాశముంది. గ్రేటర్లో ప్రతి రోజూ 3,850 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు 32 లక్షల మంది ప్రయాణిస్తారు. బంద్ ప్రభావం కారణంగా ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సమ్మెలో పాల్గొనే సిబ్బంది వల్ల కొన్ని రూట్లలో బస్సులు నిలిచిపోవచ్చు. అయితే సాయంత్రం అన్ని రూట్లలో యథావిధిగా బస్సులు తిరిగే అవకాశం ఉంటుంది. -
2018 అచ్చిరాలేదు
రాష్ట్ర ఆర్టీసీకి ఈ ఏడాది చాలా చేదు జ్ఞాపకాలే మిగిలాయి. పెరుగుతున్న అప్పులు,వాటి వడ్డీలు, నిర్వహణ వ్యయం, డీజిల్ ధరలతో ఓ వైపు సతమతమవుతుంటే.. మరోవైపు ఫిట్నెస్ లేని బస్సుల కారణంగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు మరింత కలవరపెట్టాయి. ఇటు ప్రభుత్వం నుంచి ఆశించినంత సహకారం అందకపోవడం సంస్థకు శాపంగా మారింది. ఆర్టీసీకి కేటాయించిన బడ్జెట్లో ఇంతవరకు పూర్తిస్థాయిలో ఎప్పుడూ నిధులు విడుదల కాలేదు. కొత్త బస్సుల కొనుగోలు, సిబ్బందిపై పని ఒత్తిడి ఆర్టీసీలో సత్వరమే పరిష్కరించాల్సిన సమస్యలుగా ఉన్నాయి. అయితే స్పెషల్ సీజన్లలో ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనతో ఆదాయం పెరుగుతుండటం కొంత ఊరట కలిగించే విషయంగా చెప్పవచ్చు. మొదటి 6 నెలల పరిణామాలు ఈ ఏడాది మొదటి నుంచి ఆరు నెలల పాటు ఆర్టీసీ అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. కార్మికుల సమ్మె నిర్ణయం, రెండు ప్రమాద ఘటనలు పెద్దవిగా చెప్పవచ్చు. జనవరిలో హైదరాబాద్‌లో టికెట్ రేట్లను ఆర్టీసీ స్వల్పంగా సవరించింది. చిల్లర ధర తలెత్తుతుండటంతో ఈ మేరకు కొన్ని టికెట్ల ధరలో పెంపు, మరికొన్నింటికి కోత విధించింది. ఫిబ్రవరిలో సంస్థ ఇంధన పొదుపు, వాహన ఉత్పాదకతలో స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్ ఆర్టీసీకి ఉత్తమ రవాణా సంస్థగా అవార్డు దక్కింది. మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆర్టీసీకి రూ.975 కోట్లు కేటాయించింది కానీ, రూ.230 (సెప్టెంబర్ వరకు) మాత్రమే విడుదల చేశారు. ఏప్రిల్‌లో కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం రూ.140 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. మేలో వేతన సవరణ జరపాలని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. స్పందన లేకపోయే సరికి 11వ తేదీన సమ్మెలోకి వెళ్తున్నట్లు గుర్తింపు పొందిన సంఘం టీఎంయూ, ఇతర సంఘాలు ప్రకటించాయి. కానీ, ఆ నెలలో సమ్మెజరగలేదు. ఇటు రిమ్మనగూడలో జరిగిన రోడ్డు ప్రమాదం 13 మంది మరణించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు సమీపంలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మృతి చెందారు. జూన్‌లో మరోసారి కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లాలని నిర్ణయించాయి. దీనిపై ప్రభుత్వం మండిపడింది. అవసరమైతే ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తారన్న ప్రచారం జరిగింది. మంత్రుల కమిటీతో యూనియన్ల చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించారు. 16 శాతం మధ్యంతర భృతి చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. ఇదే నెలలో సంస్థ ఎండీ రమణారావు పదవీకాలం పూర్తవడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఇన్చార్జి ఎండీగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సునీల్ శర్మ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్‌లో కొండగట్టు ప్రమాదం.. జూలైలో ఆదాయం పెంచుకునేందుకు, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఎక్స్పర్ట్ కమిటీ నియమించారు. తర్వాతి నెలలో పెద్దగా పరిణామాలు జరగలేదు. అయితే సెప్టెంబరు 11న ఆర్టీసీ చరిత్రలోనే ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. కొండగట్టు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు లోయలో పడి ఏకంగా 62 మంది దుర్మరణం పాలయ్యారు. ఆర్టీసీ చరిత్రలోనే ఈ స్థాయి ప్రమాదం ఎప్పుడూ చోటుచేసుకోలేదు. అదే నెల దసరా సెలవులప్పుడు నడిపిన బస్సుల ద్వారా దాదాపు రూ.18 కోట్లు ఆర్జించినట్లు సమాచారం. నవంబర్‌లో ఆర్టీసీ నష్టాలు రూ.270 కోట్లు (సెప్టెంబర్) వరకు దాటినట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఆర్టీసీకి కొత్తగా రూ.500 కోట్ల అప్పు దొరికింది. ప్రభుత్వ పూచీకత్తుతో బ్యాంకులు ఈ మొత్తాన్ని సంస్థకు ఇచ్చాయి. డిసెంబర్లో సీసీఎస్ నుంచి వాడుకున్న నిధుల్లో రూ.80 కోట్లు తిరిగి ఆర్టీసీ చెల్లించింది. – సాక్షి, హైదరాబాద్ -
ఎన్నికలకు ‘ఆర్టీసీ’ సిద్ధం..!
సాక్షి,మిర్యాలగూడ టౌన్ : తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉంటూ నిత్యం సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడంలో ముందుండే ఆర్టీసీ సంస్థ ఎన్నికల రూపంలో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే ప్రస్తుతం నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థను ఈ ఎన్నికల్లో రీజియన్‌కు రూ.32లక్షలకు పైగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి 364 ఆర్టీసీ బస్సులతో పాటు 7డీజీటీ(ఆర్టీసీ గూడ్స్)లను ఈ ఎన్నికల్లో రెండు రోజుల పాటు సేవలు అందించనున్నాయి. అందుకుగాను ఒక్కొక్క బస్సుకు రూ.21వేల చొప్పున ఎన్నికల కమిషన్ ఆర్టీసీ సంస్థకు అద్దే రూపంలో చెల్లించనున్నది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ఎన్నికల నిర్వహణకు ఆర్టీసీ బస్సులను అన్నీ విధాలుగా అధికారులు సిద్ధం చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, పోలీసులు, ఈవీఎంలను తరలించేందుకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ఉపయోగిస్తోంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు ఆర్టీసీ అధికారులకు అవసరమైన బస్సులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలనుఆర్టీసీ రీజినల్‌కు పంపించిన విషయం విధితమేఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలోని ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఆర్టీసీ బస్సులను సన్నద్ధం చేయాలని ఇప్పటికే ఆర్ఎంకు అందించిన లేఖలో పేర్కొనడంతో ఆయన ఆదేశాల మేరకు ఎన్నికలకు అవసరమైన ఆర్టీసీ బస్సులను రీజియన్‌లోని కోదాడ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, నల్లగొండ, నార్కట్‌పల్లి, యాదగరిగుట్ట డీపోలలో అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే పొలింగ్ సిబ్బందిని మొదలుకుని పోలీస్ యంత్రాంగం, ఈవీఎంల తరలింపు తదితర రవాణా సౌకర్యాలకు ఆర్టీసీ బస్సులను ఉపయోగిస్తున్నారు. ఎన్నికలు సమర్థంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేపట్టింది. అందులో ప్రధానంగా ఈవీఎంల తరలింపు ఎంతో భద్రతతో కూడిన పని కావడంతో డీపో గ్యారేజీ ట్రాన్స్‌ఫోర్ట్(గూడ్స్)బస్సులో ఈవీఎంలను తరలించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు.మరో వైపు ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది ఆయా పోలింగ్ బూత్‌లకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏడు డిపోలలోని బస్సులను ఎన్నికల నిర్వహణకు పంపించేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 364 బస్సులు : ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, దేవరకొండ, కోదాడ, యాదాద్రి భునవగిరి, నల్లగొండ, సూర్యాపేట, నార్కట్‌పల్లి డిపోలకు చెందిన 364 ఆర్టీసీ బస్సులతో పాటు 7 డీజీటీ బస్సులను ఈ ఎన్నికలకు ఆర్టీసీ బస్సులు అవసరమని ఎన్నికల కమిషన్ కోరింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏడు డీపోల్లో సుమారు 800 ఆర్టీసీ బస్సులు ఉండగా అందులో సగానికి పైగా ఎన్నికల నిర్వహణ కోసమే తరలించనున్నారు. ప్రధానంగా డిసెంబరు 6, 7వ తేదీల్లో ఆర్టీసీ బస్సులను ఎన్నికల అధికారులు ఉపయోగించనున్నారు. అయితే నల్లగొండ జిల్లాలో 150 ఆర్టీసీ బస్సులతో పాటు 4డీజీటీ బస్సులు, సూర్యాపేట జిల్లాలోని 150 ఆర్టీసీ బస్సులు రెండు డీజీటీ బస్సులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 64 ఆర్టీసీ బస్సులు ఒక డీజీటీ బస్సును ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాలో ఆర్టీసీ బస్సులు తక్కువగా ఉన్నందున నల్లగొండ జిల్లా నుంచి కొన్నింటిని తరలి స్తున్నారు. ఏడు డిపోలు కలిసి 364 ఆర్టీసీ బస్సులు ఎన్ని కల విధుల్లో ఉంటాయి. రెండు రోజుల పాటు ఎన్ని కల వి«ధుల్లో ఉన్నంతరం ఎన్నికలు ముగియగా నే తిరిగి ఏ బస్సులు ఆ డిపోలకు వెళ్లిపోనున్నాయి. ఆర్టీసీకి చేకూరనున్న భారీ ఆదాయం : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆర్టీసీ సంస్థ అదనపు ఆదాయాన్ని చేకూర్చుకొనున్నది. నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీకి అసెంబ్లీ ఎన్నికలు కొంత వరకు లాభాన్ని చేకురుస్తుంది.ఎన్నికలకు ఉపయోగించే ఆర్టీసీ బస్సులకు ఒక్కదానికి 21వేయి రూపాయలను ఆర్టీసీ సంస్థకు ఎన్నికల అధికారులు చెల్లించనున్నది. ఈ లెక్కన చూస్తే 364 ఆర్టీసీ బస్సులకు రెండు రోజులకు గాను రూ.1.52కోట్ల వరకు ఆదాయం చేకూరే అవకాశం ఉంది. ఈవీఎంలను తరలించేందుకు ఏర్పాటు చేసే డీజీటీ బస్సులకు మరో రెండు లక్షల 10వేల రూపాయల వరకు ఆదాయం రానున్నది. అన్నీ ఖర్చులు పోను ఒక్కో ఆర్టీసీ బస్సుకు రూ.4 నుంచి 5వేల వరకు మిగులుబాటు ఉండవచ్చని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆర్టీసీ బస్సులను ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బస్సులను ఉపయోగిస్తే ఆ సమయంలో ఒక్కో బస్సుకు కేవలం రూ.14వేల చొప్పున చెల్లించారు. కానీ ప్రస్తుతం పెరిగిన డీజిల్, ఇతర నిర్వహణ ఖర్చులతో ఈ సారి ఒక్కో బస్సుకు రూ.21వెయ్యి వరకు చెల్లించేందుకు ఎన్నికల కమిషన్ ముందుకు వచ్చింది. దీంతో ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో రెండు రోజులకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో సంస్థ నిర్వహణ ఖర్చులు పోను 25లక్షల రూపాయల వరకు మిగిలే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నల్లగొండ రీజియన్‌లో గత ఎప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీ సంస్థ ఆరు కోట్ల రూపాయల వరకు నష్టాల్లో ఉందని అంటున్నారు. కాగా బహిరంగం సభలకు కూడా ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో కొంత మేరకు ఆదాయం పెరుగనున్నది. డిసెంబరు 6, 7 తేదీల్లో ఇక్కట్లు : అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుండటంతో డిసెంబరు 6, 7వ తేదీల నల్లగొండ రీజియన్‌లో పరిధిలో ఆర్టీసీ బస్సులు ఎన్నికల్లో భాగంగా తగ్గనున్నాయి. 7వ తేదీన ఎన్నికలు అయినందున ఒక రోజు ముందుగానే ఆర్టీసీ బస్సులో సిబ్బందిని, ఈవీఎంలను తరలించేందుకు రెండు రోజుల పాటు బస్సులను ఉపయోగించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ రెండు రోజుల్లో 364 ఆర్టీసీ బస్సులు సగానికి పైగా తగ్గుతుండటంతో ప్రధాన రూట్లు అయిన మిర్యాలగూడ నుంచి దేవరకొండ, కోదాడ, నల్లగొండ, సూర్యాపేట తదితర ప్రాంతాలకు బస్సులు తగ్గనున్నాయి. ఈ రెండు రోజులు ఆయా ప్రాంతాలకు సుమారు 10 ఆర్టీసీ బస్సులను మాత్రమే పంపించనున్నారు. అదే విధంగా డిసెంబరు మొదటి వారంలో కూడా పెళ్లిళ్లు, శుభకార్యాలు కూడా అధికంగా ఉన్నందున ఆ బస్సులను ఎన్నికలకు తరలించడంతో ఆ రెండు రోజుల పాటు ఇబ్బందికరంగానే ఉండే అవకాశం ఉంది. ప్రత్యేక చర్యలు తీసుకుంటాం: ఎన్నికల నిర్వహణకు ఆర్టీసీ బస్సులను వినియోగించడం వలన కొంత వరకు ఆర్టీసీ బస్సులు తగ్గినప్పటికి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలను చేపడతాం. బస్సులను స్పెషల్ ఆపరేషన్‌ను చేయించి ఇబ్బందులు రాకుండా చర్యలను తీ సుకుంటాం. కాగా డిసెంబరు 6, 7వ తేదీల్లో 48 గంటల పాటు ఆర్టీసీ సంస్థకు ప్రయాణికులు సహకరిం చాలి. – సుధాకర్‌రావు, ఆర్టీసీ డీఎం, మిర్యాలగూడ -
దసరా: ఆర్టీసీకి అదనంగా రూ.39 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రవాణాసంస్థలకు దసరా రద్దీ కాసుల వర్షం కురిపించింది. అదనపు సంపాదన భారీగా సమకూరింది. అంచనాలకు మించి నగర జనం సొంత ఊళ్లకు వెళ్లడంతో రైల్వే, ఆర్టీసీలకు అదేస్థాయిలో ఆదాయం లభించింది. ఆర్టీసీతోపాటు ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలు సైతం అదనపు చార్జీలు వడ్డించాయి. దసరా సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లినవారు రెండు రోజులుగా తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. సోమవారం కూడా హైవేలపైన వాహనాల రద్దీ భారీగా కనిపించింది. దసరా సెలవుల సందర్భంగా 25 లక్షల మందికి పైగా నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్లారు. ఆర్టీసీ బస్సుల్లోనే 13 లక్షల మందికిపైగా ప్రయాణించినట్లు ఆ సంస్థ లెక్కలు వేసింది. ఆర్టీసీకి రూ.39 కోట్లకుపైగా ఆదాయం... ఆర్టీసీ ఈ ఏడాది దసరా సందర్భంగా 4,500 ప్రత్యేక బస్సులను వేయాలనుకుంది. చివరి మూడు రోజుల్లో అంచనాలకు మించి జనం బయలుదేరడంతో 5 వేలకుపైగా అదనపు బస్సులను నడిపింది. సుమారు రూ.39 కోట్ల ఆదాయం అదనంగా లభించినట్లు ఆర్టీసీ అధికారవర్గాలు పేర్కొన్నాయి. ద.మ.రైల్వేకు రూ.50 కోట్లు : దసరా సందర్భంగా మొత్తంగా 7 లక్షలకుపైగా మంది రైళ్లల్లో సొంత ఊళ్లకు తరలివెళ్లినట్లు అంచనా. రూ.50 కోట్లకుపైగా అదనంగా ఆర్జించినట్లు దక్షిణ మధ్య రైల్వే అంచనా వేసింది. 23 వరకు ఆర్టీసీ ‘ప్రత్యేక’చార్జీలు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ‘ప్రత్యేక’బాదుడు ఇంకా కొనసాగుతోంది. రద్దీ కారణంగా ఈ సర్వీసులను 23 వరకు పొడిగించాలని అధికారులు నిర్ణయించారు. -
బాబోయ్ బస్సు ప్రయాణం!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో దసరా సెలవుల రద్దీ కొనసాగుతోంది. ప్లాట్ఫారం మీదకి వచ్చిన ప్రతీ బస్సు క్షణాల్లో ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. పండుగ రద్దీ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ‘దసరా స్పెషల్’పేరిట ప్రత్యేక బస్సులను నడుపుతోంది. హైదరాబాద్ నుంచి 4,480 ప్రత్యేక బస్సులు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు నడుస్తున్నాయి. ఈ నెల 13 నుంచి 21 వరకు ఈ సర్వీసులు తిరుగుతాయి. ప్రతీ బస్ టికెట్‌పై ఆర్టీసీ 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తోంది. కార్యాలయాలు, కళాశాలలు, ఇతర కోచింగ్ సెంటర్లకు సెలవులు ప్రకటించిన దరిమిలా.. ఈ రద్దీ ఆదివారం నుంచి మరింత పెరిగింది. బస్సు దొరికితే చాలు, కనీసం నిలబడి అయినా సరే వెళదామనుకునే వారి సంఖ్య అధికంగా ఉంది. కానరాని సదుపాయాలు.. రద్దీ నేపథ్యంలో ఎంజీబీఎస్, ఉప్పల్, కాచిగూడ, జేబీఎస్‌ల నుంచి ఆర్టీసీ దసరా స్పెషల్ బస్సులను నడుపుతోంది. ఇందులో ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌లగ్జరీ బస్సులు ఉన్నాయి. వీటిలో చాలా బస్సుల్లో సరైన సదుపాయాల్లేవు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కిటికీలు సరిగ్గా లేక రాత్రిపూట ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సూపర్ లగ్జరీ బస్సుల్లో టీవీలు లేక ఖాళీ అరలు దర్శనమిస్తున్నాయి. అయినా టికెట్ ధరలో ఎలాంటి మార్పులు ఉండకపోవడం గమనార్హం. ఇక రాజధాని, గరుడ బస్సుల్లో దుప్పట్లు, వాటర్ బాటిళ్లు అందజేయాలి. కానీ కొన్ని బస్సుల్లో వాటిని ఇవ్వడం లేదని ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు. సూపర్‌లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో ఎక్కువగా ఆన్లైన్ ద్వారానే బుకింగ్ ఉంటుంది. ఆన్లైన్ చెల్లింపుల్లో ప్రతి టికెట్‌పై అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. అయినా, వీరికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. పలుచోట్ల డ్రైవర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. సమస్య పరిష్కారమైంది: మునిశేఖర్ సీటీవో, టీఎస్ఆర్టీసీ కరీంనగర్, వరంగల్‌తోపాటు కొన్ని జిల్లాలకు వెళ్లే బస్సుల్లో దుప్పట్లు, వాటర్ బాటిళ్లు అందించడం లేదన్న ఫిర్యాదులు మా దృష్టికి వచ్చాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడిన విషయం వాస్తవమే. వీటిని సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపులో జరిగిన జాప్యమే దీనికి కారణం. ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది. ప్రయాణికులు బస్సుల్లో కిక్కిరిసిపోతున్నా.. ఆ బస్సులన్నీ తిరిగి వచ్చేటప్పడు ఖాళీగానే వస్తున్నాయి. అందుకే తాము ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాం. -
ఆర్టీసీ బస్సులో మంటలు..
సాక్షి, వైఎస్సార్ : రాయచోటి నుంచి తిరుపతి వెళ్లే ఆర్టీసీ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సంబేపల్లి మండలం దేవపట్ల బస్‌స్టాప్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఊహించని ఈ పరిణామంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. బస్సు డ్రైవర్ అప్రమత్తమవ్వడంతో బస్సు వెంటనే ఆపారు. ప్రయాణీకులందరూ దిగిపోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో ప్రయాణీకులందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
బస్సులా...రేకు డబ్బాలా?
సాక్షి,హైదరాబాద్: ఆర్టీసీది పేరు గొప్ప ఊరు దిబ్బ పరిస్థితిగా మారింది. ఇటీవల ఆర్టీసీ చరిత్రలోనే కాక దేశంలోనే జరిగిన అతిపెద్ద రోడ్డు యాక్సిడెంట్‌గా పరిగణిస్తున్న కొండగట్టు బస్సు ప్రమాదమే అందుకు తాజా ఉదాహరణ. కేవలం లాభార్జనపైనే దృష్టిపెట్టి నిబంధనలకు నీళ్లొదిలి ప్రయాణికులపాలిట మృత్యుశకటాలుగా మారిన బస్సుల్ని ఆర్టీసీ రోడ్డుపై నడుపుతోంది. కాలం చెల్లిన, ఫిట్నెస్ లేని దాదాపు నాలుగువేలకు పైగా పాతబస్సుల్లో జనాలను కుక్కి వారి జీవితాలతో ఆర్టీసీ చెలగాటమాడుతోంది. ఎక్కడికక్కడ ఊడుతున్న డోర్లు, సీట్లకు ఇనుప తీగలు, తాళ్లు కట్టుకుని నడుస్తోన్న బస్సులు ఆర్టీసీ దుర్భరస్థితిని లోకానికి చాటుతున్నాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన ఆర్టీఏ రోడ్లపై తిరుగుతున్న డొక్కు బస్సుల్ని, రోడ్లపై జరుగుతున్న బస్సు ప్రమాదాల్ని చూసి కూడా కళ్లుమూసుకుని మొద్దు నిద్రను నటిస్తోంది. కనీసం కొండగట్టు బస్సు ప్రమాదం తర్వాతైనా ఆర్టీసీ, ఆర్టీఏ ఈ రెండూ కళ్లు తెరవలేదు. పొంచి ఉన్న ముప్పు తెలంగాణ ఆర్టీసీలో ఉన్న పాత బస్సులతో ప్రజల భద్రతకు ముప్పు పొంచి ఉంది. వీటిలో చాలా వరకు ఇప్పటికే తుక్కు దశకు చేరుకున్నా..అవే డొక్కు బస్సులను అధికారులు తిప్పుతున్నారు. ఇపుడు ఇవి మృత్యుశకటాలుగా మారి ప్రజలను అమాంతం మింగేస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీలో తక్షణం పక్కనబెట్టాల్సిన బస్సులు అక్షరాలా 4,549 బస్సులు. అంటే ఇవి 12 లక్షల కిలోమీటర్లకుపైగా తిరిగాయి. కొత్త బస్సులు వద్దా? 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి నేటి వరకు తెలంగాణ ఆర్టీసీ కొనుగోలు చేసిన బస్సుల సంఖ్య 1095గా ఉంది. స్క్రాప్ బస్సుల స్థానంలో ప్రధానంగా జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలకు నడిచే బస్సు లు కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఆర్టీసీలో అంతగా కనిపించడం లేదు. కేవలం సంస్థకు భారంగా పరిణమించే తెల్ల ఏనుగుల్లాంటి ఏసీ బస్సులపైనే అమితాసక్తిని ప్రదర్శిస్తుండటం గమనార్హం. - ఇదే క్రమంలో 2017లో దాదాపుగా రూ.20 కోట్లు వెచ్చించి వజ్ర బస్సులు కొనుగోలు చేశారు. వీటి ఆక్యుపెన్షీ రేషియో దారుణంగా ఉంది. చాలారూట్లలో ఈ బస్సులు సగం కూడా నిండటం లేదు. కొన్ని రూట్లలో ఒకరిద్దరే ఎక్కుతున్నారు. - ఈనెల 5న దాదాపుగా రూ.100 కోట్ల కేంద్రం గ్రాంటుతో 100 ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకుంది. వీటిలో తొలివిడతగా 5 బస్సులు నగరానికి చేరుకున్నాయి. హైదరాబాద్‌లో పర్యావరణ కోణంలో ఇలాంటి బస్సులను నడపాల్సిందే. కానీ, వాటిపై చూ పిన శ్రద్ధ గ్రామీణ, జిల్లాల్లో కొత్తబస్సులపైనా చూపిస్తే.. వాటికి వెచ్చించే బడ్జెట్లో జిల్లా బస్సులకు వెచ్చి స్తే జనాలకు ఉపయోగకరంగా ఉంటుందని యూని యన్ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగుల అభిప్రాయపడుతున్నారు. కాంట్రాక్టర్లకు కాకుండా..ప్రజలకు, కార్మికులకు మేలు చేసే కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. ఆర్టీఏ తనిఖీలెక్కడ? ఆర్టీసీ బస్సుల తనిఖీ అంటేనే ఆర్టీఏ అధికారులు పట్టించుకున్న దాఖలాలు తక్కువ. పోనీ, తనిఖీలు చేపట్టినా.. వెంటనే ఫోన్లు చేసి తమను అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు వస్తాయని ఆర్టీఏ ఉన్నతాధికారులే వాపోతున్నారు. కాలంచెల్లిన బస్సులు రోడ్లపై తిరుగుతున్నా గుడ్లప్పగించి చూడటం మినహా వారేం చేయలేని దుస్థితి. సాంకేతికంగా ఈ బస్సులకు నడిచేందుకు ఏమాత్రం అర్హతలేదు అయినా వీటిల్లో జనాలను కుక్కి పంపుతోంది ఆర్టీసీ. ఇదీ ఆర్టీసీ లెక్క ఆర్టీసీలో మొత్తం బస్సులు 10,500 కుపైగా రోజువారీ ప్రయాణికులు 97,00,000 ఒకరోజు ఆదాయం దాదాపు రూ.12,00,00,000/ (రూ.12కోట్లు) సంస్థలో కాలంచెల్లిన బస్సులు 4,549. వీటిలో ఒకరోజు ప్రయాణం చేసేవారు 40,00,000 మందికిపైగా ఈ బస్సులు ఎపుడు.. ఎక్కడ ప్రమాదానికి గురవుతాయో ఎవరికీ తెలియని పరిస్థితి. -
ఇం'ధన' మంట!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రవాణా రంగం సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇం‘ధన’మంట నేపథ్యంలో తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. అసలే నష్టాల ఊబిలో చిక్కుకుని విలవిల్లాడుతున్న ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీకి రోజురోజుకు పెరుగుతున్న డీజిల్ ధరలు అశనిపాతంలా మారాయి. వారం రోజులుగా పెరుగుతున్న డీజిల్ ధరలు సంస్థ ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ రెండు వారాల్లోనే లీటరుపై దాదాపుగా రూ.3.18లు పెరిగింది. దీంతో రోజుకు రూ.23 లక్షల భారాన్ని ఆర్టీసీ మోస్తోంది. మరోవైపు ప్రైవేటు రంగంలోని ప్రజా రవాణా వ్యవస్థ పరిస్థితీ ఇలానే ఉంది. ముఖ్యంగా ప్రైవేటు ట్రావెల్స్, లారీలు, క్యాబ్‌లు, ఆటోల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోకపోవడమే నేటి భారానికి కారణమని రవాణా రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. లారీ యజమానులకు కోలుకోలేని దెబ్బ పెరుగుతున్న పెట్రోల్ ధరలు రవాణా రంగానికి కీలకంగా ఉన్న లారీల యజమానులను కోలుకోని విధంగా దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం అన్ సీజన్ కారణంగా లారీలకు గిరాకీ లేదు. దీనికితోడు పెరుగుతున్న డీజిల్ ధరలు వ్యాపారాన్ని మరింతగా దెబ్బతీస్తున్నాయని యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు పెద్దగా లేకపోవడంతో కేవలం బొగ్గు, సిమెంటు రవాణా లారీలు మాత్రమే నడుస్తున్నాయి. అవి కూడా వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులకు మాత్రమే సరఫరా చేస్తున్నాయి. తాజా పరిస్థితులతో వ్యాపారం సరిగా సాగక.. యజమానులు వాయిదాలు కట్టలేకపోతున్నారు. రెండు వాయిదాలు దాటితే.. లారీలను ఫైనాన్స్ వ్యాపారులు లాక్కెళ్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కలగజేసుకోవాలని తెలంగాణ లారీల అసోషియేషన్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే వ్యాట్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని మినహాయించి డీజిల్‌ను జీఎస్టీ పరిధిలో చేర్చాలని కోరారు. -
అధికారుల నిర్లక్ష్యంతోనే కార్మికుడి మృతి
షాద్‌నగర్‌టౌన్: ఆర్టీసీ ఉన్నతాధికారుల నిర్ల్యంతోనే కార్మికుడు వెంకటేష్ మృతి చెందాడని వివిధ పార్టీల నాయకులు ఆరోపించారు. షాద్‌నగర్ ఆర్టీసీ బస్ డిపోలో పని చేస్తున్న కార్మికుడు హైదరాబాద్‌లోని హకీంపేటలోని ఆర్టీసీ గ్యారేజీలో రెండు బస్సుల మధ్య నలిగి మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వివిధ పార్టీల నాయకులు మంగళవారం షాద్‌నగర్ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. వనపర్తి జిల్లా అమరచింత గ్రామానికి చెందిన వెంకటేష్ (30) ఐటీఐ పూర్తి చేసి గత కొంత కాలంగా షాద్‌నగర్ ఆర్టీసీలో డీజిల్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అయితే కాలం చెల్లిన బస్సును రిపేర్ నిమిత్తం ఆర్టీసీ వారు హైదరాబాద్‌లోని హకీంపేటకు పంపాచారు. బస్సు డ్రైవర్‌తో పాటుగా డీజిల్ మెకానిక్ వెంకటేష్ కూడ హకీంపేటకు వెళ్లాడు. అయితే అక్కడ రెండు బస్సులు ఒకదాని వెంట మరొకటి నిలబడ్డాయి. ఓ బస్సును రివర్స్ తీసే క్రమంలో బస్సు వెనక నిలబడి ఉన్న వెంకటేష్ ప్రమాదవశాత్తు రెండు బస్సుల మధ్య చిక్కుకొని నలిగిపోయాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. నష్టపరిహారం చెల్లించాలి... కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, సీపీఐ, సీపీయం, బీఎల్ఎఫ్ నాయకులతో పాటుగా వివిధ సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. వెంకటేష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనుభవం లేని కార్మికుడిని బస్సు మరమ్మతులకు ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ... ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో కారణంగా వెంకటేష్ మృతి చెందాడని, మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడు వెంకటేష్ కుటుంబానికి పరిహారం అందజేస్తామని టీఆర్టీసీ డీఎం స్పష్టమైన హామీ ఇవ్వడంతో నాయకులు ధర్నాను విరమించారు. ఈ ధర్నాలో నాయకులు దంగు శ్రీనివాస్‌యాదవ్, శివశంకర్‌గౌడ్, ఎన్.రాజు, బుద్దుల జంగయ్య, నాగరాజు, ఈశ్వర్ నాయక్, అల్వాల దర్శన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీలో ‘చిల్లర’కొట్టుడు
విజయనగరం అర్బన్: ‘లెంక నాగభూషణ భార్యతో కలసి విజయనగరం నుంచి విశాఖకు వెళ్లడానికి మంగళవారం స్థానిక ఆర్టీసీ బస్టాండులోని మెట్రో సిటీబస్సు ఎక్కారు. కండక్టర్ టికెట్ అడగడంతో రూ.100 నోటు ఇచ్చారు. టికెట్ రూ.47 వంతున రెండు టిక్కెట్లకు రూ.94 పోగా మిగిలిన ఆరు రూపాయలకు టికెట్ వెనుక కండెక్టర్ రాసిచ్చాడు. బస్సు దిగిన తర్వాత టికెట్ చూపించగా... నాలుగు రూపాయలిస్తే పది రూపాయలు ఇస్తానని కండెక్టర్ అన్నాడు. దీంతో తన వద్ద చిల్లర లేదని ప్రయాణికుడు చెప్పడంతో కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు ప్రయాణికుడే చిల్లర వదులుకోవాల్సి వచ్చింది’. ఈ సమస్య ఒక్క విశాఖ రూట్లో సర్వీస్‌లకు మాత్రమే కాదు. దాదాపు ప్రతి సర్వీస్‌లోనూ ఎదురవుతున్నాయి చివరకు ప్రయాణికులే నష్టపోవాల్సి వస్తోంది. ప్రయాణికులకు చిల్లర తిరిగిచ్చే కండక్టర్లు ఎంతోమంది ఉన్నప్పటికీ, చిల్లర చూపులు చూసే వారు కూడా ఉండడంతో సంస్థకు చెడ్డ పేరు వస్తోంది. బస్సు దిగే సమయంలో చిల్లర అడిగితే కస్సుబుస్సులాడడం... కాయిన్స్ ఉన్నా ఇవ్వకపోవడం.. కావాలనే టికెట్ వెనుకరాయడం వంటి సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయని ప్రయాణికులు వాపోతున్నారు. ఇదే విషయమై ఇటీవల నిర్వహించిన ‘డయల్ యువర్ డీఎం’కు ఫిర్యాదులు కూడా అందాయి. టికెట్ కోసం రూ. 100, రూ.500 నోట్లు ఇచ్చినప్పుడు మిగిలిన చిల్లరను టికెట్ వెనుక రాస్తుండడంతో బస్సు దిగే తొందరలో చాలామంది డబ్బులు మరిచిపోతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. యాజమాన్యం చిల్లర ఇవ్వదా..? ఆర్టీసీ కండక్టర్లకు విధుల్లో చేరిన రోజున యాజమాన్యం కేవలం రూ.150 చిల్లర మాత్రమే ఇస్తుంది. మిగిలిన చిల్లరను డ్యూటీలోనే సర్దుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజూ చిల్లర విషయంలో ఇబ్బందులెదురవుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ మార్గాల్లో సమస్యలు జిల్లాలోని విజయనగరం, సాలూరు, పార్వతీపురం, ఎస్.కోట డిపోల పరి«ధిలో 412 బస్సులు ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తుంటాయి. నెలలో సుమారు 49.80 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా, 6.19 కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. విజయనగరం మీదుగా విశాఖ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లతో పాటు విజయనగరం నుంచి బొబ్బిలి మీదుగా పార్వతీపురం, సాలూరు రాకపోకలు చేసి పల్లెవెలుగులు, విజయగరం నుంచి చీపురుపల్లి మీదుగా రాజాం, పాలకొండ సర్వీసుల్లో ఈ చిల్లర సమస్య అధికంగా ఉంటుంది. ఈ మార్గాల్లోని కండక్టర్లకు చిల్లర సర్దుబాటు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్న భావనలు వ్యక్తమవుతున్నాయి. అలాగే పల్లెవెలుగు బస్సుల్లో చిల్లర అవసరం మరింత ఎక్కువ. ఈ విషయమై ప్రజలకు, కండక్టర్ల తరచూ గొడవలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ విధులకు హాజరయ్యే కండక్టర్లకు యాజమాన్యం చిల్లర ఇవ్వాల్సిన అవసరం ఉంది. కనీసం రూ.500 విలువచేసే రూ.1, రూ.2, రూ.5 నాణేలు, మరో రూ.1000 విలువ చేసే రూ.10 నోట్లు ఇస్తే సమస్య చాలా వరకు పరిష్కారమవుతుంది. అయితే ఆర్టీసీ అధికారులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. పరిష్కార అవకాశాలున్నా.... జిల్లాలోని ఆర్టీసీ డిపోల్లో ఉన్న వేయింగ్ (తూనిక) మిషన్ల ద్వారా చిల్లర సమస్య కొంతమేరకు పరిష్కరించుకోవచ్చు. వీటి ద్వారా వచ్చే నాణేలను ఆయా డిపోల్లో చెల్లించే విధంగా అధికారులు ఆదేశిస్తే సమస్య కొంతవరకు పరిష్కారమవుతుంది. అలాగే విశాఖ ఆ పై పట్టణాలకు రాకపోకలు చేసే బస్సుల్లో మెరుగైన ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలని ప్రయాణికులు సూచిస్తున్నారు. డెబిట్‌కార్డు, ఫోన్‌పే, నగదు బదిలీ చేసే యాప్‌లు ఉపయోగిస్తే చిల్లర సమస్య కొంతమేర తీరే అవకాశం ఉంది. సమస్య తీవ్రంగా ఉంది చిల్లరతో ప్రతిరోజూ సమస్యలొస్తున్నాయి. విధుల్లో చేరే ముందుగానే చిల్లర సిద్ధం చేసుకుంటున్నాం. అయినప్పటికీ ప్రయాణికులు రూ. 500 నోట్లు ఎక్కువగా ఇస్తుండడంతో ఇబ్బందులేర్పడుతున్నాయి. దీనికితోడు యాజమాన్యం చిల్లర నాణేలు, రూ.10 నోట్లు ఇవ్వడం లేదు. –ఎం.రామారావు, కండక్టర్, విజయనగరం డిపో సహకరించాలి చిల్లర సమస్య అన్ని చోట్లా ఎదురవుతున్నట్లు గుర్తించాం. ప్రయాణికులు ఎక్కువగా రూ. 100, రూ. 500 నోట్లు ఇస్తున్నారు. బ్యాంక్‌ల నుంచి చిల్లర తీసుకుంటున్నాం. ప్రయాణికులు సరిపడా చిల్లర తెచ్చుకుంటే మంచింది. కండక్డర్లకు ప్రయాణికులు సహకరిస్తే చిల్లర సమస్య అధిగమిస్తాం. – ఎన్వీఏస్వేణుగోపాల్, డిపో మేనేజర్, విజయనగరం -
పతనం అంచున ప్రగతి రథం!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ వార్షిక ఆదాయం రూ.4,520 కోట్లు. ఇందులో వేతనాల కోసం వెచ్చించే మొత్తం దాదాపు రూ.2,300 కోట్లు. అంటే మొత్తం ఆదాయంలో ఈ పద్దు వాటా 51 శాతం. మొత్తం ఆదాయంలో వేతనాల వాటా సగానికి చేరువైందంటే ఆ సంస్థ పతనం అంచున ఉన్నట్టేనన్నది అంతర్జాతీయ సూత్రం. అలాంటిది ఆర్టీసీలో ఇప్పటికే సగానికి మించి నమోదవుతోంది. తాజాగా కార్మికులకు ప్రభుత్వం 16 శాతం మధ్యంతర భృతి ప్రకటించినా.. త్వరలో పూర్తిస్థాయి వేతన సవరణ చేయాల్సి ఉంది. ఇది అమల్లోకి వస్తే ఆ పద్దు వాటా మరింత పెరుగుతుంది. ఇప్పుడిదే తెలంగాణ ప్రగతి చక్రం భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. వేతన సవరణతో కుదేలే! గత వేతన సవరణతోనే ఆర్టీసీ యాజమాన్యం చేతులెత్తేసినందున తాజా వేతన సవరణ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే మోయాల్సి ఉంది. ఆదాయం పెంచుకునేందుకు సంస్కరణలు చేపడితే కార్మిక నేతలు అడ్డుకుంటారు. ఇతరత్రా వినూత్న ఆలోచనలు పట్కాలెక్కే పరిస్థితి కనిపించటం లేదు.. ఆ స్థాయిలో మేధోమథనం కూడా జరగటం లేదు. ఆర్టీసీ స్థలాల్లో పెట్రోలు బంకులు, బస్టాండ్లపై సినిమా థియేటర్ల నిర్మాణం వంటి ఆలోచనలు అంతగా కలిసిరాలేదు. ప్రభుత్వం నుంచి నామమాత్రపు సాయం తప్ప ఇప్పటి వరకు పెద్దగా అందింది లేదు. ఇలాంటి తరుణంలో వేతన సవరణ ఆర్టీసీని పూర్తిగా కుదేలు చేయబోతోంది. వెరసి సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారనుంది. ఆర్టీసీ అప్పులు, పన్నుల భారం తదితరాల విషయంలో ప్రభుత్వం సాయం చేస్తుందని మంత్రుల కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గత వేతన సవరణ సమయంలోనూ ఈ తరహా హామీలొచ్చినా... మూడేళ్లుగా అవి అమలు కాకపోవటం ఆందోళన కలిగించే విషయం. ఆర్టీసీ దుస్థితిని పరిశీలిస్తే.. - ఆర్టీసీ మొత్తం వ్యయం రూ.5,200 కోట్లు (2017–18) - ప్రతినెలా వేతనాల రూపంలో చేస్తున్న వ్యయం దాదాపు రూ.195 కోట్లు - డీజిల్ రూపంలో జరుగుతున్న వార్షిక వ్యయం రూ.1,250 కోట్లు.. వేతనాల తర్వాత అతిపెద్ద భారం ఇదే. మొత్తం వ్యయంలో దీని వాటా దాదాపు 22 శాతం. - ఆర్టీసీకి రూ.3,000 కోట్ల అప్పు ఉంది. ఇందుకు ప్రతినెలా రూ.250 కోట్ల వడ్డీని చెల్లిస్తోంది. - ప్రభుత్వ రంగ సంస్థనే అయినప్పటికీ ఆర్టీసీ నుంచి ప్రభుత్వం మోటారు వాహనాల పన్ను వసూలు చేస్తోంది. ఇది ప్రతినెలా రూ.230 కోట్ల వరకు ఉంటోంది. - ఏటా దాదాపు 5 కోట్ల లీటర్ల డీజిల్ వాడుతున్న ఆర్టీసీ.. దానిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు చెల్లించేందుకు నానా తంటాలు పడుతోంది. విమానాల ఇంధనంపై పన్నును ప్రభుత్వం 1 శాతానికి తగ్గించినా.. ఆర్టీసీ వాడే ఇంధనంపై పన్ను భారం తగ్గించలేదు. సాలీనా ఆర్టీసీ దాదాపు రూ.590 కోట్ల వరకు ఈ పన్ను చెల్లిస్తోంది. - గత నాలుగేళ్లలో పెరిగిన డీజిల్ ధరల వల్ల ప్రస్తుతం కిలోమీటరుకు రూ.5 చొప్పున (నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే) అదనంగా భారం మోయాల్సి వస్తోంది. - ఆర్టీసీ వాడే టైర్లు, ఇతర యంత్ర పరికరాలకు సంబంధించి జీఎస్టీ రూపంలో మరో వంద కోట్లు చెల్లిస్తోంది. - రాయితీ బస్సు పాసులను పెద్ద మొత్తంలో జారీ చేస్తోంది. వీటి రూపంలో కోల్పోతున్న ఆదాయాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి దాదాపు రూ.1,700 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. - ప్రభుత్వం తలుచుకుంటే ఆర్టీసీపై వీటి భారం లేకుండా చేయొచ్చు. ఈ అంశాలను పరిశీలించేందుకు ఉన్నతస్థాయి కమిటీ వేస్తున్నట్టు మంత్రుల కమిటీ ప్రకటించింది. ఆ కమిటీ నివేదిక సమర్పిస్తే.. దాన్ని ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొస్తే ఆర్టీసీ గట్టెక్కుతుంది. లేదంటే వేతనాలు చెల్లించేందుకు కొత్త అప్పులు చేయాల్సిందే. -
బస్సులో నుంచి పడి ప్రయాణికుడి మృతి
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు నుంచి పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సముద్రాల గ్రామానికి చెందిన వెంకటయ్య కూలి (48)నిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం గూడూరుకు వెళ్లిన ఆయన రాత్రి తిరిగి ఆర్టీసీ బస్సులో సముద్రాలకు బయలుదేరాడు. ఈ క్రమంలో ఫుట్‌బోర్డు వద్ద ఉన్న ఆయన సముద్రాల స్టేజీ సమీపాన ఉన్న పెట్రోల్‌బంక్ వద్ద ప్రమాదవశాత్తు బస్సు నుంచి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రావుల నరేందర్ తెలిపారు. చెరువులో పడి పశువుల కాపరి.. జఫర్‌గఢ్: చెరువులో పడి పశువుల కాపరి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జఫర్‌గఢ్ గ్రామ శివారు వడ్డెగూడేనికి చెందిన కత్తుల సోమయ్య (63) అనే వ్యక్తి పశువులను కాస్తూ కాలం వెల్లదీస్తున్నాడు. రోజు వారీగా సోమయ్య ఉదయాన్నే గ్రామానికి చెందిన గేదెలను తొలుకుని గ్రామ చివర ఉన్న చెరువు వద్దకు వెళ్లాడు. ఈ సమయంలో పశువులు మేస్తూ చెరువు అవతలి గట్టుకు వెళ్లాయి. ఇది గమనించిన సోమయ్య వాటిని పక్కకు తొలుకొచ్చేందుకు చెరువులోకి దిగి వెళ్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందినట్లు వారు తెలిపారు. కాగా, మృతదేహాన్ని ముదిరాజ్ కులస్తుల సాయంతో బయటకు తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవి తెలిపారు. -
రోడ్డు ఓకే.. బస్సేదీ?
గోపాల్పేట : రవాణా వ్యవస్థ ఉన్న గ్రామాలు అభివృద్ధిలో దూసుకెళ్తాయన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిగ్రామానికి డబుల్, సింగిల్ రోడ్డును ఏర్పాటు చేస్తుంది. ఇందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. కానీ రోడ్డు ఉన్నా ఆర్టీసీ అధికారులు మాత్రం బస్సు నడపడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి మూడు రోడ్లు ఉన్నా.. మండలంలోని చెన్నూరుకు రెండు బీటీ రోడ్లు ఉన్నప్పటికి ఆర్టీసీ బస్సు నడవ డం లేదు. 25 ఏళ్ల నుంచి విద్యార్ధులు, గ్రామస్తులకు కాలినడక తప్పడం లేదు. 2009లో చెన్నూరు–గోపాల్‌పేటకు రూ. 57.50 లక్షలతో బీటీ వేశారు. 2007 లో చెన్నూరు నుంచి తాడిపర్తికి రూ .1.38 కోట్లతో మరో బీటీ రోడ్డు వేశా రు. అదేవిధంగా గ్రామం నుంచి అనంతగిరి చెరువు కట్టపై నుంచి వనపర్తికి వెళ్లేందుకు కూడా మూడో దారి ఉంది. కనీసం ఆటోలు వెళ్లకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే విధంగా కేశంపేట, గొల్లపల్లి, శానాయిపల్లి, గౌరిదేవిపల్లి తదితర గ్రామాలతో పాటు కొన్ని తండాలకు రోడ్డు సౌకర్యం ఉన్నా బస్సులు వెళ్లడం లేదు. ఈ విషయమై పలుమార్లు ఎ మ్మెల్యే చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ప్రణాళిక సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని విద్యార్థులు వాపోయారు. ఆలస్యంగా వెళ్తున్నాం మా ఊరికి ఆర్టీసీ బస్సు నడపకపోవ డంతో రోజూ ఆలస్యంగా స్కూల్ వె ళ్తున్నాం. రానుపోను రోజుకు 10 కి.మీ. న డుస్తున్నాం. 8 గంటలకు ఇంటి నుంచి బ యలుదేరితే 9 గంటలకు స్కూల్‌కు చేరుకుంటాం సాయం త్రం 5 గంటలకు స్కూల్ వదిలితే ఇంటికి చేరే వరకు 6.30 అవుతుంది. బాగా అలిసిపోయి హోంవర్క్ చేసుకోలేకపోతున్నాము. – హైమావతి, 9వ తరగతి విద్యార్థిని, చెన్నూరు కొన్నేళ్లుగా ఎదురుచేస్తున్నాం కొన్నేళ్లుగా మా సీనియర్లు బస్సు కోసం ఆందోళనలు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులను అడిగారు. అయినా బస్సు రా లేదు. మేమూ అడుగుతున్నాం. ఎం దుకోసం నడపడం లేదో చెప్పడం లేదు. ముఖ్యమైన క్లాసులకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఆలస్యంగా వెళితే ఉపాధ్యాయులు మందలిస్తున్నారు. మా బాధను అర్థం చేసుకుని బస్సు నడపాలి. – శిరీష, 9వ తరగతి విద్యార్థిని, చెన్నూరు -
ప్రింటింగ్ ప్రెస్‌కు ఆర్టీసీ బైబై
సాక్షి, హైదరాబాద్: అది 50 ఏళ్ల చరిత్ర గల ఆర్టీసీ అనుబంధ సంస్థ.. ప్రస్తుతం నలుగురే దాన్ని మోస్తున్నారు.. మరో 4 నెలల్లో వారూ పదవీవిరమణ చేయనున్నారు.. వారి రిటైర్మెంట్తో పాటు ఆ సంస్థ కూడా శాశ్వతంగా సెలవు తీసుకోబోతోంది.. అలుపెరగకుండా సేవలందించిన ఆ సంస్థే ఆర్టీసీ ముద్రణాలయం.. ఉత్పత్తి పూర్తిగా నిలిపేసి చిన్నాచితకా పనులకే పరిమితమైన ప్రింటింగ్ ప్రెస్‌ను మూసేందుకు రంగం సిద్ధమైంది. యాభై ఏళ్లుగా రవాణా సంస్థతో కలసి సాగుతున్న ఆ ప్రెస్‌తో శాశ్వతంగా బంధాన్ని తెంచుకునేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. దాన్ని మోయలేని భారంగా భావి స్తున్న ఆర్టీసీ వదిలించుకుంటోంది. మున్ముందు అవసరమైన ముద్రణ పనులకు ప్రైవేటుపై ఆధారపడేందుకు ఆసక్తి చూపుతోంది. అందులో పని చేసే ఉద్యోగుల జీత భత్యాలు, సంస్థ నిర్వహణ ఖర్చులను సమస్యగా భావిస్తుండటంతో ప్రభుత్వమూ ఆ విషయంలో జోక్యం చేసుకోనంటోంది. 50 ఏళ్ల క్రితం.. రోడ్డు రవాణా సంస్థకు అనుబంధంగా 50 ఏళ్ల క్రితం ముద్రణాలయం ఏర్పడింది. ఆర్టీసీకి అవసరమైన టికెట్లు, పుస్తకాలు, ఎస్ఆర్ జాబితాలు సహా సంస్థ అవసరాలకు సంబంధించిన అన్ని ప్రతులను ముద్రించేందుకు ప్రెస్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్‌భవన్ ఉన్న ప్రాంతంలో ఈ యూనిట్ ఉండేది. అప్పట్లో బస్‌బాడీ యూనిట్ కూడా ఇక్కడే ఉండేది. 1985లో ప్రస్తుతం ఉన్న చోట్లకు వాటిని తరలించారు. బస్‌బాడీ యూనిట్ ను మియాపూర్‌లో ఏర్పాటు చేయటంతో అక్కడే ప్రింటింగ్ ప్రెస్ నెలకొల్పారు. దానికి 200 మంది కార్మికులను కేటాయించారు. కంప్యూటరీకరణ పెరగడంతో పుస్తకాల ముద్రణ ఆపి సిబ్బంది సంఖ్యను 130కి పరిమితం చేశారు. కొంతకాలంగా ఆర్టీసీ టిమ్స్‌లో వినియోగించే టికెట్ రోల్స్‌పై ఆర్టీసీ లోగో ముద్రించే పనే అందులో నిర్వహిస్తున్నారు. పనిలేదన్న కారణంతో సిబ్బందిని ఇతర విభాగా లకు తరలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న నలుగురు పదవీ విరమణ పొందేవరకు ప్రెస్‌ను కొనసాగించి తర్వాత మూసేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక ఆర్టీసీకి ముద్రణ అవసరం ఉంటే ప్రైవేటు కంపెనీల్లో చేయించాల్సిందే. మూతబడుతున్న యూనిట్లు.. తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రి సహా జిల్లాల్లోని డిస్పెన్సరీలకు సంబంధించిన ఫార్మసీలను ఇప్పటికే ఆర్టీసీ ప్రైవేటుకు అప్పగించింది. దీని వెనక ఓ రాజకీయ నేత హస్తం ఉందన్న ఆరోపణలు కార్మికుల్లో గుప్పుమంటున్నాయి. తన బంధువుల సంస్థకు ఫార్మసీ బాధ్యతలు అప్పగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలొస్తున్నాయి. కార్మికులకు మెరుగైన సేవలందించేందుకు ఫార్మసీ ని ప్రైవేటీకరించినట్లు అధికారులు చెబుతున్నారు. వరంగల్‌లో ఉన్న ఆర్టీసీ టైర్ రీ ట్రేడింగ్ యూనిట్‌నూ ఇప్పటికే మూసేశారు. అరిగిపోయిన టైర్లు మరికొంత కాలం మన్నేలా రబ్బర్‌ను ఏర్పాటు చేసి వాటిని తిరిగి సిద్ధం చేయటం ఈ యూనిట్ విధి. ఇలాంటి మూడు సంస్థలో ఓ దాన్ని మూసేశారు. మూసే జాబితాలో ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ చేరింది. -
‘పల్లె’వెలుగులెప్పుడో?
ఇల్లెందు : పల్లెల శాపమో..అధికారుల కోపమో.. కానీ నేటికీ అనేక గ్రామాలు పల్లెవెలుగు బస్సులు ఎరుగవు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బస్సులు నిండా ప్రయాణికులు ఎక్కక నష్టాలు సంభవిస్తున్నాయని, మినీ బస్సు సర్వీసులను ప్రవేశపెట్టింది. అయితే బస్సు ఎరుగని పల్లెలకు ఈ మినీ బస్సులు ఎంతగానో ఉపయోగం... అలాంటి మినీ బస్సులు ఉన్నా పల్లెలకు మాత్రం రావటం లేదు. జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో ఇల్లెందు ఒకటి. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా గతంలోని ఎర్రబస్సు ఎరుగని పల్లెలు సబ్ డివిజన్‌కు సాక్ష్యాలుగా మిగులుతున్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన పక్కా రహదారుల్లో బస్సు ఎరుగని పల్లెలుండటం విశేషం. ఈ గ్రామాల నుంచి తమ పంట ఉత్పత్తులు తరలించటం, అవసరమైన ఎరువులు తీసుకొని వెళ్లటం, విద్యార్థులు పట్టణ ప్రాంతాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవటానికి పల్లె ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. ఒకనాడు మారుమూల పల్లెలకు వెళ్లిన బస్సులు కూడా నేడు ఆ పల్లెలకు వెళ్లటం లేదు. 10 ఏళ్ల క్రితం ఇల్లెందు మండలంలోని అమర్సింగ్తండాకు వెళ్లిన బస్సులు నేడు వెళ్లటం లేదు. గతంలో ప్రైవేట్ బస్సులు తిరిగిన దనియాలపాడు గ్రామానికి బస్సు సౌకర్యం లేకుండా పోయింది. ఇటీవల కాలంలో ధర్మాపురం, పూబెల్లి, రేలకాయలపల్లి, మామిడిగుండాల, లచ్చగూడెం గ్రామాలను బీటీ రోడ్డు ఏర్పాటు చేశారు. ఇటీవల ఇల్లెందు నుంచి మాణిక్యారం మీదుగా కొమరారం వరకు మాత్రమే ఏకైక సర్వీసును ప్రవేశపెట్టారు. ఇల్లెందు నుంచి ధర్మాపురం, పూబెల్లి, మొండితోగుల మీదుగా ఇల్లెందుకు బస్సు సౌకర్యం కల్పించే అవకాశం ఉన్నా ఈ రూట్లలో ఆర్టీసీ అధికారులు ఏనాడు పరిశీలన చేయలేదు. ఇల్లెందు బస్టాండ్ పరిధిలోని చీమలపాడు, కామేపల్లి, ఊట్కూరు, పూబల్లి, పూసపల్లి, ధర్మాపురం, మామిడిగుండాల, లచ్చగూడెం, రొంపేడు గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. టేకులపల్లి మండలంలో ముత్యాలంపాడు నుంచి తడికెలపూడి, బొమ్మనపల్లి నుంచి కొండెంగులబోడు, మద్రాస్‌తండా, ముత్యాలంపాడు స్టేజీ వరకు పక్కా రహదారులు ఉన్నాయి. అనేక గ్రామాలకు ఇటీవల కాలంలో పీఎంజేఎస్వై, నాబార్డు, ఎల్‌డబ్ల్యూఈ, ఆర్టికల్ 275 కింద పలు గ్రామాలకు పక్కా రహదారులు ఏర్పాటు చేశారు. అయినా ఈ పల్లెల్లో పల్లెవెలుగులు కనిపించటం లేదు. 30 మంది ప్రయాణికులతో కండక్టర్ లేకుండా వెళ్లే మినీ పల్లె వెలుగు బస్సులను ఈ రూట్లతో తిప్పితే ఆర్టీసీకి ఆదాయం, ప్రయాణికులకు ఉపయోగం ఉంటుంది. ఈ దిశగా మినీబస్ సర్వీసులను ప్రవేశపెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
ఆర్టీసీకి సంక్రాంతి
నల్లగొండ : సంక్రాంతి పండుగ ఆర్టీసీకి భారీగానే కలిసొచ్చింది. పండుగ సందర్భంగా రీజియన్ నుంచి ప్రత్యేకంగా 220 బస్సులు నడిపారు. హైదరాబాద్‌కు రోజూ వెళ్లే బస్సులతోపాటు అదనంగా నడపడటంతో రీజియన్‌కు సాధారణ రోజులతో పోలిస్తే ఆదాయం పెరిగింది. సoక్రాంతి రోజున మినహాయిస్తే ఈ నెల 11 నుంచి 19 వరకు రీజియన్ పరిధిలోని ఏడు డిపోల నుంచి దూర ప్రాంతాలకు అదనపు బస్సులు తిప్పారు. పండుగ స్పెషల్ పేరుతో ప్రత్యేకంగా తిప్పిన బస్సుల్లో ప్రస్తుతం ఉన్న చార్జీలకు 30 శాతం అదనంగా వసూలు చేశారు. మిగిలిన బస్సుల్లో సాధారణ చార్జీలనే వసూలు చేశారు. పండుగకు ముందు, తర్వాత కూ డా అదనపు బస్సులు నడపడటంతో నష్టాల్లో ఉన్న రీజియన్‌కు కొంత మేలు జరిగింది. గతేడాది సంక్రాంతితో పోలిస్తే ఈ ఏడాది రీజియన్‌కు రూ.1.03 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. గతేడాది పండుగ రోజుల్లో రీజియన్‌కు రూ.6.93 కోట్లు ఆదాయం రాగా ..ఈ ఏడాది అదే రోజుల్లో రూ.8.23 కోట్ల ఆదాయం సమకూరింది. దసరా, సంక్రాంతి పండుగలతో అదనపు ఆదాయాన్ని రాబట్టుకుంటున్న నల్లగొండ రీజియన్ అంతే వేగంతో మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు కేటాయించింది. దీంతోపాటు చెర్వుగట్టు బ్రహోత్సవాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. మేడారం జాతరకు : లక్షలాది భక్తులు తరలివచ్చే మేడారం జాతరకు రీజియన్ నుంచి 350 బస్సులు కేటాయించారు. దేశంలోనే అతిపెద్ద జాతర కావడంతో భక్తుల రద్ధీ దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని రీజియన్ల నుంచి మేడారానికి బస్సులు పంపిస్తున్నారు. అయి తే ఏటికేడు భక్తుల రద్ధీ పెరుగుతున్నందున బస్సు ల సంఖ్య కూడా పెంచారు. గతేడాది 320 బస్సులు పంపగా ఈ ఏడాది అదనంగా 30 బస్సులు పెంచా రు. జిల్లాలోని ఏడు డిపోల నుంచి పల్లెవెలుగు 279, ఎక్స్‌ప్రెస్ 52, డీలక్స్ 19 బస్సులు పంపుతున్నట్లు ఆర్ఎం విజ య్‌కుమార్ తెలిపారు. దేవరకొండ డిపోనుంచి 45, నల్లగొండ 55, నార్కట్‌పల్లి 40, మిర్యాలగూడ 50, కోదాడ41, సూర్యాపేట 55, యాదగిరిగుట్ట డిపో నుంచి–64 బస్సులు కేటాయిం చారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 4 వరకు మేడారంలోనే బస్సుల రాకపోకలు సాగిస్తాయి. కొత్తగా మినీ బస్సులు.... రెండో విడత కింద నల్లగొండ రీజియన్‌కు కొత్తగా 15 మినీ బస్సులు మంజూరు చేశారు. దీంట్లో నల్లగొండ డిపోనకు–3, దేవరకొండ–3, మిర్యాలగూడ–2, కోదాడ–4, యాదగిరిగుట్ట డిపోనకు 3 బస్సులు కేటాయించారు. పల్లెవెలుగు బస్సుల స్థానంలో కొత్తగా మినీ బస్సులు ప్రవేశపెట్టారు. 31 సీట్ల సామర్ధ్యంతో ఉన్న మినీ బస్సుల్లో కండక్టర్లు ఉండరు. టిమ్స్ మిషన్లతోనే డ్రైవర్లే టిక్కెట్లు ఇస్తారు. ఈ బస్సుల్లో విద్యార్థులు ఎక్కేందుకు అనుమతి లేదు. ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉన్న మార్గాలు, విద్యార్థులు తక్కువగా ఉన్న రూట్లలోనే మినీ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. దీంతోపాటు పల్లెవెలుగు బస్సుకు కిలోమీటరకు అయ్యే ఖర్చు రూ.8లు కాగా, మినీ బస్సులకు రూ.7 మాత్రమే అవుతుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రయాణికుల రద్ధీ (ఓఆర్) పెంచేందుకు ఆర్టీసీ మినీ బస్సులను రోడ్ల మీదకు తీసుకొస్తోంది. ఈ బస్సుల రాకతో నష్టాల బాట నుంచి ఆర్టీసీ బయటపడే అ వకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. -
అడ్డంగా దోచేసిన ఆర్టీసీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యం 75 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) సంక్రాంతి సీజన్లో ఫక్తు వ్యాపార ధోరణిని ప్రదర్శించింది. ప్రయాణికుల అవసరాన్ని భారీగా సొమ్ము చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలతో పోటీ పడి మరీ ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేసింది. సంక్రాంతి పండుగను సొంత గ్రామాల్లో చేసుకుందామని బయలుదేరిన వారికి ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్ల రుసుములు చూసి కళ్లు బైర్లు కమ్మాయి. పండుగ నేపథ్యంలో 50 శాతం అదనంగా చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. అయితే, ఈ అదనపు చార్జీలకు మించి మరింత ఎక్కువగా వసూళ్లు చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు అందుతున్నాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంతో పాటు పలు రాయలసీమ జిల్లాల రూట్లలో భారీగా దోపిడీ జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానయాన సంస్థలు ప్రయాణికుల రద్దీని బట్టి ఫ్లెక్సీ ఫేర్ విధానంలో టిక్కెట్ల ధరలను నిర్ణయిస్తాయి. ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం సైతం పండుగ సీజన్లో ఫ్లెక్సీ ఫేర్ విధానాన్ని అమలు చేసింది. దీనిప్రకారం నచ్చిన రేట్లను వసూలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సంక్రాంతి ముగిశాక జనమంతా తిరుగు ప్రయాణమవుతారు. తిరుగు ప్రయాణంలోనూ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఆర్టీసీ యాజమాన్యం టిక్కెట్ల ధరలను భారీగానే పెంచేసింది. ఈ మేరకు టిక్కెట్లను ఆన్లైన్లో ఉంచింది. రాయితీల ఊసేది? ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వ సంస్థ కాకుండా కార్పొరేషన్ కావడంతో మనుగడ కోసం సొంత ఆదాయంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకోవాల్సిన ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. పండుగ సీజన్లో ప్రత్యేక బస్సులు నడపండి, ప్రయాణికుల జేబులు కొల్లగొట్టండి అని ఆర్టీసీ యాజమాన్యానికి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రభుత్వం రాయితీలు ఇస్తే ప్రయాణికులపై అదనపు భారం పడదు. సాధారణంగా విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే అమరావతి ఏసీ సర్వీసులోచార్జీ రూ.808. ప్రత్యేక బస్సు పేరిట 50 శాతం అదనంగా, అంటే రూ.1,200కు పైగా వసూలు చేశారు. అన్ని ప్రధాన రూట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ ట్రావెల్స్దీ అదే దారి ఆర్టీసీలో అధిక చార్జీలను సాకుగా చూపి ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ప్రయాణికులను ఇష్టారీతిన దోచుకుంటున్నాయి. నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. విజయవాడ నుంచి విశాఖపట్నానికి రూ.3 వేలకు పైగా వసూలు చేశారంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. టిక్కెట్ ధరలను కట్టడి చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేట్ ట్రావెల్స్తో కుమ్మక్కైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
‘చిల్లర సమస్య నుంచి కండక్టర్లకు ఊరట’
సాక్షి, హైదరాబాద్: రాజధానితోపాటు వరంగల్ సిటీ బస్సుల్లో టికెట్ ధరలను రూ.5, 10, 15, 20, 25, 30కు మారుస్తూ హేతుబద్ధీకరించటంతో చిల్లర సమస్య నుంచి కండక్టర్లకు ఊరట లభిస్తుందని ఆర్టీసీ ఎన్ఎంయూ వెల్లడించింది. సోమవారం నుంచి దీన్ని అమలు చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు సంఘం నేతలు నాగేశ్వరరావు, నరేందర్, మౌలానా, కమాల్‌రెడ్డి పేర్కొన్నారు. డిస్కంలకు ఉన్న రూ.12 వేల కోట్ల రుణాన్ని భరించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్టీసీకి ఉన్న రూ.2,500 కోట్ల రుణాన్ని కూడా భరించాలని కోరారు. -
కాలం చెల్లిన బస్సులే కాలయముళ్లు
సాక్షి,అమరావతిబ్యూరో/విశాఖపట్నం ఆర్టీసీ బస్సులు మృత్యుశకటాలుగా మారుతున్నాయి. కాలం చెల్లిన బస్సులను నడపుతుండటంతో అవి ప్రజల నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. నష్టాల్లో కూరుకుపోయి, నూతన బస్సులను కొనలేని స్థితిలో ఉన్న ఆర్టీసీ డొక్కు బస్సులకే రంగులద్ది రోడ్లమీదికి వదులుతోంది. దీంతో వాటికి తరచూ బ్రేకులు ఫెయిలవడం.. టైర్లు పగిలిపోవడం వంటివి జరిగి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. విజయవాడలో శుక్రవారం ఆర్టీసీ బస్సుకు బ్రేకులు ఫెయిలై అదుపు తప్పి ముగ్గురి ప్రాణాలను బలిగొంది. ఇంత జరుగుతున్నా ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయమని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 1993–97 నాటి బస్సులే అధికం.. రాష్ట్రంలో 123 ఆర్టీసీ డిపోలుండగా.. 12,000 ఆర్టీసీ బస్సులున్నాయి. వాటిలో దాదాపు 1600 దాకా కాలం చెల్లిన బస్సులున్నాయి. కృష్ణా రీజియన్ పరిధిలో 14 డిపోలున్నాయి. వీటిలో ఇబ్రహీంపట్నం, విద్యాధరపురం, ఉయ్యూరు, గవర్నర్‌పేట 1, 2, గన్నవరం పరిధిలో మొత్తం ఆరు డిపోలున్నాయి. వీటిలో మొత్తం 442 సిటీ బస్సులు రోజుకు దాదాపు 3 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. అందులో 250 బస్సులు కాలం చెల్లినవి కావడంతో ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. ఈ బస్సుల్లో సీఎన్జీ గ్యాస్‌తో నడిచేవి 299 ఉండగా.. మిగిలినవన్నీ డీజిల్‌తో నడిచేవే. ఈ డీజిల్ బస్సులు అధికంగా 1993–97 సంవత్సరాల నాటివే. అవి ఇప్పటి వరకూ దాదాపు 10 నుంచి 15 లక్షల కిలోమీటర్లు వరకూ తిరిగాయి. 12 లక్షల కిలోమీటర్ల తర్వాత ఒక్క కిలో మీటరు కూడా అదనంగా తిప్పకూడదు. కానీ ఆర్టీసీ యాజమాన్యం మాత్రం ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఆ నిబంధన పాటించలేని స్థితిలో ఉంది. కాలం చెల్లిన ఈ బస్సులు ప్రయాణికులకు నిత్యం నరకాన్ని చూపుతున్నాయి. బస్సు వెళ్తున్నప్పుడు, బ్రేకులు వేసినప్పుడు పెద్ద పెద్ద శబ్ధాలు, వానొస్తే నీరు కారడాలు వంటివి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో హెడ్లైట్లు కూడా సక్రమంగా వెలుతురును ఇవ్వడంలేదు. విజయవాడ నగరంలో పెరిగిన జనాభా అవసరాల దృష్ట్యా ఇంకా 400 బస్సులు అవసరమని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. మొరాయిస్తూ.. బెంబేలెత్తిస్తూ.. కాలం చెల్లిన బస్సులు నగరవాసుల ప్రాణాలు తీస్తున్నాయి. నగరంలో శుక్రవారం బుడమేరు వంతెన వద్ద సిటీ బస్సు సృష్టించిన బీభత్సంతో ముగ్గురు మృతి చెందారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గతంలో బస్సు వెళ్తుండగా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పుట్ రెస్ట్ జారిపడిపోయింది. మాచవరం ప్రాంతంలో స్టీరింగ్ ఊడిపోయింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. గతంలో విద్యాధరపురం ప్రాంతంలో రెండు సార్లు టైర్లు పగిలి ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇటీవల బందర్ రోడ్డులోని రేడియో స్టేషన్ వద్ద ప్రమాదవశాత్తు ఓ బస్సు పూర్తిగా కాలిపోయింది. అందులో ఉన్న 30 మంది ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన విషయం తెలిసిందే. ఔట్ సోర్సింగ్‌తో అనుభవం లేని మెకానిక్‌లు.. ఆర్టీసీ గ్యారేజ్‌లో మెకానికల్ విభాగంలో ఎక్కువ మంది అనుభవం లేని వారే. సీనియర్ మెకానిక్‌లు రిటైర్డ్ అవుతుండటంతో వారి స్థానంలో ఔట్‌సోర్సింగ్‌లో కొత్త వారిని తీసుకుంటున్నారు. వారంతా యువకులు కావడంతో వారికి బస్సుల మరమ్మతులపై సరైన అవగాహన లేదు. కేవలం డ్రైవర్లు చెప్పిన లోపాలను తాత్కాలికంగా సరిచేసి పంపుతున్నారు. మెకానిక్‌ల కొరత తీవ్రంగా ఉంది. ఒక్క విజయవాడ డిపోలోనే 23 మంది మెకానిక్‌ల కొరత ఉంది. 20 మంది చేయాల్సిన పనిని 10 మందితో చేయిస్తుండటంతో మరమ్మతులు చేసే సమయంలో లోపాలన్నింటినీ సరిచేయలేకపోతున్నారు. విజయవాడలో జరిగిన ఘటనలో తాత్కాలికంగా బ్రేక్‌ను సరిచేసి పంపినందునే బ్రేక్ ఫెయిల్ అయిందని కార్మికులు చెబుతున్నారు. విశాఖ రీజియన్‌లో కాలం చెల్లిన బస్సులు 370, నగరం పరిధిలో 205 ఆర్టీసీ విశాఖ రీజియన్‌లో 1350కి పైగా బస్సులున్నాయి. రీజియన్‌లో 10 నుంచి 17 లక్షల కిలోమీటర్లు దాటిన బస్సులను కూడా నడుపుతున్నారు. వీటిలో వందకు పైగా 13 లక్షల కిలోమీటర్లు పూర్తి చేసుకున్నవి ఉన్నాయి. విశాఖ రీజియన్‌లో సుమారు 370 వరకూ కాలం చెల్లిన బస్సులను నడుపుతున్నారు. రీజియన్‌కు ఏటా 50 కొత్త బస్సులు అవసరమవుతుండగా యాజమాన్యం అందులో సగం కూడా సమకూర్చడం లేదు. విశాఖ నగరంలో మొత్తం ఏడు డిపోలుండగా.. 670 సిటీ బస్సులున్నాయి. వాటిలో కాలం చెల్లిన బస్సులు 205 ఉన్నాయి. నగర పరిధిలో ఇంకా 35 బస్సులు అవసరం. కమీషన్ల కక్కుర్తే కాటేసింది!? విజయవాడలో శుక్రవారం జరిగిన బస్సు ప్రమాద ఘటన వెనుక కమీషన్ల కక్కుర్తి ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బస్సుల మరమ్మతులకు వినియోగించే స్పేర్ పార్ట్స్ కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. అతి తక్కువ కొటేషన్ ఇచ్చిన వారిని ఓకే చేయడం వెనుక కమీషన్ల మర్మం ఉందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. వాటిలో నాణ్యత కరువవడంతో అవి తక్కువ సమయంలోనే దెబ్బతింటున్నాయి. నాణ్యత లేమే కారణం విజయవాడ బస్సు బ్రేక్ ఫెయిల్ అవడానికి కారణం నాసిరకం బ్రేక్ లైనింగ్ అని నిపుణులు చెబుతున్నారు. ప్రతి బస్సు 18 వేల కిలోమీటర్లు తిరిగినçప్పుడు మరమ్మతులు(షెడ్యూల్–3)చేస్తారు. అంటే నాలుగు చక్రాలు తీసి గ్రీజ్ పెట్టి బ్రేక్ లైనింగ్ పరిశీలించి పంపుతారు. ప్రమాదానికి గురైన బస్సుకు ఈ నెల 20న మరమ్మతులు (సాంకేతిక పరిభాషలో షెడ్యూల్–3) చేశారు. అలా మరమ్మతులు చేస్తే మళ్లీ 18 వేల కిలోమీటర్లు తిరిగే వరకూ రిపేర్లు రాకూడదు. ఈ బస్సు గురించి ఈ నెల 26 వ తేదీన డ్రైవర్ లాగ్‌షీట్‌లో బ్రేక్‌లో ఎయిర్దిగి బ్రేక్‌లు పడటంలేదు.. అని ఫిర్యాదు నమోదుచేశాడు. మెకానిక్ పరిశీలించి తాత్కాలికంగా రిపేర్‌చేసి పంపారు. అయినా శుక్రవారం బ్రేక్‌లో ఎయిర్ దిగి వెంటనే పడలేదు. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బస్సులో ప్రధానమైన బ్రేక్ లైనింగ్ నాణ్యమైనవి వాడితే లక్ష కిలోమీటర్లు తిరిగే వరకు ఇబ్బంది ఉండదు . కానీ బ్రాండెడ్ పేరుతో వాడే నాసిరకం లైనింగ్‌ల వల్ల కొద్దిరోజులకే పాడవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. విజయవాడ బస్సు ఘటనలో ఇదే జరిగినట్లు నిపుణులు చెపుతున్నారు. -
‘ప్రైవేటు’ పోటు.. మళ్లీ నష్టాల రూటు!
సాక్షి, హైదరాబాద్: లాభాల మాట ఎన్నడో మరిచిపోయిన ఆర్టీసీ.. దాదాపు దశాబ్దం తర్వాత భారీ రాబడితో గాడిన పడినట్టు కనిపించింది. హైదరాబాద్ సిటీ జోన్ మినహా మిగతా రెండు జోన్లు ఒకేసారి లాభాలు సాధించి సంస్థలో కొత్త జోష్‌ను నింపాయి. కానీ ‘వరి గడ్డి మంట’ చందంగా ఆ సం తోషం ఎక్కువ రోజులు నిలవలేదు. స్వయం గా ప్రభుత్వ నిర్లక్ష్యమే లాభాల బాట పట్టిన ఆర్టీసీని మళ్లీ నష్టాలు చవిచూసేలా చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వందల సంఖ్యలో ప్రైవేటు అక్రమ సర్వీసులకు బ్రేకులు పడగా.. ఇప్పుడు ప్రభుత్వం చూసీ చూడనితనంతో అవి రోడ్డె క్కి బుకింగ్స్‌తో దూసుకెళ్తున్నాయి. దీంతో ఆర్టీసీ రూ.72 కోట్ల నష్టాలు చవి చూసింది. అంతకు ముందు నెలకంటే దాదాపు రూ.40 కోట్లు అధికం కావటం గమనార్హం. పైన పటారం.. ప్రైవేటు బస్సుల అక్రమ సర్వీసులతో ఆర్టీసీ తీవ్రంగా నష్టపోతోందన్నది ప్రభుత్వానికి తెలియని విషయమేమీ కాదు. ప్రైవేటు బస్సులను నియంత్రిస్తే ఆర్టీసీ దాదాపు రూ.వేయి కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తుందని నిపుణులు కూడా గతంలో నివేదికలు అందజేశారు. గతేడాది సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆర్టీసీపై జరిపిన సమీక్షలోనూ దీనిపై ప్రధానంగా చర్చ జరిగింది. దీంతో ఆర్టీసీ, రవాణా శాఖలు కలసి ప్రైవేటు అక్రమ సర్వీసుల విషయంలో చర్యలు తీసుకునేలా ఆయన ఆదేశాలు జారీ చేశారు. నాటి సంయుక్త రవాణా కమిషనర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక వ్యవ స్థను కూడా ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థ ప్రైవేటు అక్రమ సర్వీసులను నియంత్రించేం దుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పేరు కు చర్యలు గంభీరంగానే ఉన్నా.. వాస్తవంగా జరుగుతోంది మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. మళ్లీ పెరిగిన నష్టాలు.. రవాణా చట్టాలు ఎంతగా అపహాస్యమవుతున్నాయో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం తన చర్యల ద్వారా ఇటీవల బహిర్గతం చేసింది. ఆ రాష్ట్రంలో పర్మిట్లు పొంది వేరే రాష్ట్రాలు కేంద్రంగా అక్రమంగా వేల సంఖ్యలో బస్సులు తిరుగుతున్న తీరును బయటపెట్టింది. ఇందులో తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా దాదాపు వెయ్యి వరకు బస్సులున్నట్టు తేలింది. వాటిలో తెలంగాణ వాటా దాదాపు 400. ఈ నేపథ్యంలో ఆ బస్సులను నిషేధించింది. ఇదే సమయంలో ఆర్టీసీ దూర ప్రాంతాలకు దాదాపు 150 సర్వీసులు ప్రారంభించింది. ఈ రెండు చర్యల కారణంగా ఒక్కసారిగా ఆర్టీసీకి గణనీయ సంఖ్యలో రాబడి పెరిగి నష్టాలు బాగా తగ్గాయి. రెండు జోన్లు లాభాల్లోకి రావటంతో.. నష్టాలు గణనీయంగా తగ్గాయి. ప్రతినెలా రూ.వంద కోట్లకుపైగా నష్టాలు వస్తుండగా, ఆ మొత్తం రూ.40 కోట్లకు తగ్గింది. దీంతో ఆర్టీసీ దూర ప్రాంతాల సర్వీసుల సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. మరో నెలరెండు నెలల్లో ఆ మాత్రం నష్టాలు కూడా ఉండవన్న సంకేతాలిచ్చింది. కానీ ఉన్నట్టుండి సీన్ రివర్స్ అయింది. నెల క్రితం రూ.40 కోట్లకే పరిమితమైన నష్టాలు తాజాగా రూ.72 కోట్లకు చేరుకున్నాయి. కారణాలను విశ్లేషించిన ఆర్టీసీ అధికారులు మళ్లీ ప్రైవేటు అక్రమ సర్వీసులు రోడ్డెక్కడమే ప్రధాన కారణమని తేల్చారు. పట్టించుకోవద్దని ఆదేశాలు ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న బస్సులు మళ్లీ రోడ్డెక్కి పరుగు ప్రారంభించాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఆర్టీసీ అధికారులు ఇప్పటికే పలుమార్లు రవాణా శాఖ దృష్టికి తెచ్చారు. కానీ రవాణా శాఖ అధికారులు వాటిపై చర్యలు తీసుకోలేకపోయారు. ఆ బస్సుల విషయంలో చూసీచూడనట్టు ఉండాలన్న బడా నేతల ఆదేశాలే దీనికి కారణమన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులు కూడా ధ్రువీకరిస్తున్నారు. ‘దాదాపు 3 నెలలుగా దూరప్రాంత సర్వీసులు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. కొత్త బస్సులెన్ని తెచ్చిపెట్టినా నిండుగా వెళ్తున్నాయి. దీంతో లాభాలు వస్తున్నాయి. కానీ నెల రోజులుగా తీరు మారింది. కొన్ని బస్సులు రద్దు చేసుకోవాల్సి వస్తోంది. రద్దయిన ప్రైవేటు బస్సులు యథాప్రకారం తిరగటమే ఇందుకు కారణం’ అని ఓ ఆర్టీసీ డిపో మేనేజర్ పేర్కొన్నారు. బాహాటంగా మాట్లాడ్డానికి జంకుతున్నా.. ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా ఇదే విషయాన్ని తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం ఆ ప్రైవేటు బస్సులను నియంత్రిస్తే ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందని పేర్కొంటున్నారు. -
‘మెట్రోకు అనుగుణంగా సిటీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఆర్టీసీ ముఖచిత్రం మారనుంది. మెట్రో రైలు మార్గానికి అనుగుణంగా సిటీ బస్సుల విస్తరణకు ఆర్టీసీ కసరత్తు చేపట్టింది. నాగోల్ నుంచి అమీర్‌పేట్ వరకు, మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ వరకు మొత్తం 30 కిలోమీటర్ల మెట్రో మార్గానికి అనుగుణంగా సిటీ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది. మెట్రో కారిడార్ రెండు మార్గాల్లో ప్రస్తుతం 23 మెట్రో స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడున్న ప్రయాణికుల్లో సగానికి పైగా మెట్రో వైపు మళ్లే అవకాశం ఉంది. ప్రధాన రూట్లలోనే మెట్రో రానున్న దృష్ట్యా దానికి రెండు వైపులా ఉన్న సుమారు 1,000 కాలనీలను లక్ష్యంగా చేసుకుని ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు. సమాంతర మార్గాల స్థానంలో రేడియల్ రూట్లు, ఫీడర్ రూట్లు వినియోగంలోకి రానున్నాయి. ప్రతి ప్రధాన మెట్రో స్టేషన్ నుంచి బస్సులు బయలుదేరి తిరిగి అదే స్టేషన్‌కు చేరుకునే విధంగా నంబర్లలో మార్పులు చేయనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. మెట్రో రాక నేపథ్యంలో ఆర్టీసీలో చేపట్టాల్సిన మార్పులు, కాలనీలకు ఆర్టీసీ సేవల విస్తరణపైన ఎండీ రమణారావు గురువారం జూబ్లీ బస్‌స్టేషన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చలు జరిపారు. బస్టాపుల విస్తరణ.. బస్టాపుల విస్తరణపైన ఆర్టీసీ దృష్టి సారించింది. 23 స్టేషన్లలో ప్రధానమైన వాటిని ఎంపిక చేసి అక్కడి నుంచి బస్సులు రాకపోకలు సాగించే విధంగా బస్‌బేలు, టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవల ఆర్టీసీ, మెట్రో, జీహెచ్ఎంసీ తదితర విభాగాలకు చెందిన అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలోనూ ఈ అంశంపైన చర్చించారు. నాగోల్ నుంచి అమీర్‌పేట్, మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ మార్గాల్లో పర్యటించి బస్టాపుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లను గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మెట్రో స్టేషన్‌కు, అక్కడి నుంచి జూబ్లీ బస్‌స్టేషన్‌కు రాకపోకలు సాగించే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. కాలనీలే లక్ష్యంగా... నాగోల్ నుంచి అమీర్‌పేట్ వరకు, మియాపూర్ నుంచి అమీర్‌పేట్ వరకు ఉన్న మెట్రో కారిడార్‌కు 2 వైపులా సుమారు 1,000 కాలనీలకు బస్సులను నడిపేందుకు చేపట్టాల్సిన చర్యలపై గ్రేటర్ ఆర్టీసీ దృష్టి సారించింది. మెట్రో మార్గానికి అనుగుణంగా రేడియల్, ఫీడర్ రూట్లపైన చర్చించింది. ఆయా కాలనీ సంఘాల ప్రతినిధులతో సమావేశాలను నిర్వహించాలని ఎండీ రమణారావు సూచించారు. నగర శివార్ల నుంచి ప్రయాణికులను మెట్రో మార్గానికి తరలించేందుకు బస్సుల విస్తరణపై ఆర్టీసీ అధ్యయనం చేపట్టింది. మెట్రో సమాంతర మార్గాల నుంచి ఆర్టీసీ తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొన్న దృష్ట్యా అనుబంధ కాలనీలు, శివార్లే లక్ష్యంగా సేవలను విస్తరించేందుకు దృష్టి సారించింది. ప్రయాణికులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని, వారు కోరిన విధంగా సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకోవాలని ఎండీ సూచించారు. -
ఫాస్ట్ ట్యాగ్ !
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సాంకేతిక పరిజ్ఞానాన్ని అందింపుచ్చుకోవడంలో ఆర్టీసీ అధికారులు ఓ అడుగు ముందుకేశారు. టోల్గేట్ల వద్ద ఫీజు చెల్లించడం, నెలవారీ పాస్ చూపించడం వాటితో సమయం వృథా కాకుండా ఫాస్ట్‌ట్యాగ్ స్టికర్లను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. తద్వారా టోల్గేట్ల వద్ద నిరీక్షించకుండా ఫాస్ట్‌ట్యాగ్ స్టికర్లపై ఉండే బార్‌కోడింగ్ సాయంతో నేరుగా బస్సులు వెళ్లిపోనున్నాయి. ఈ మేరకు టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక కౌంటర్లు, మిషన్లు ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ రీజియన్‌లో టోల్‌ప్లాజ్‌ల మీదుగా హైదరాబాద్, కర్నూలు తిరిగే బస్సులకు ‘ఫాస్ట్ ట్యాగ్’ పద్ధతిని ఆర్టీసీ అమలు చేస్తోంది. మూడు టోల్ ప్లాజాలు మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలో ఇటు హైదరాబాద్, కర్నూలు రూట్లలో తిరిగే బస్సులకు ‘ఫాస్ట్ ట్యాగ్’ అమలు చేస్తున్నా రు. కర్నూలు నుంచి హైదరాబాద్‌కు 200 కి.మీ మేర విస్తరించి ఉన్న జాతీయ రహదారి (ఎన్‌హెచ్–44)పై మూడు టోల్ ప్లాజాలు ఉన్నాయి. వీటి వద్ద ఆర్టీసీ బస్సులు టోల్ రుసుం చెల్లించడానికి లేదా నెలవారీ పాస్ చూపించేందుకు వేచిచూడాల్సి వచ్చేది. దీనివల్ల రద్దీ సమయాల్లో సమయం వృథా అయ్యేది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ఫాస్ట్‌ట్యాగ్ పద్ధతిని తీసుకొచ్చింది. బస్సుకు సంబంధించిన ఒక అద్దానికి ఫాస్ట్‌ట్యాగ్ స్టికర్ అంటిస్తారు. ఈ స్టిక్కర్‌పై బార్ కోడ్ ఉంటుంది. రీజియన్ పరిధిలోని రాయికల్, అడ్డాకుల, ఎర్రవల్లి టోల్‌ప్లాజ్‌ల వద్దకు ఫాస్ట్‌ట్యాగ్ బస్సులు చేరుకోగానే ఎక్కువ సమయం వేచి ఉండకుండా పది అడుగుల దూరంలోనే బార్‌కోడింగ్‌ను టోల్‌ప్లాజ్‌కు చెందిన స్కానర్లు స్కానింగ్ చేసుకుంటాయి. దీంతో వెంటనే అక్కడి నుంచి బస్సులు ముందుకు కదిలేలా గేట్ తెరుచుకుంటుంది. టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న బస్సులు వెళ్లడానికి ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. రీజియన్‌లోనే ప్రథమంగా... ఫాస్ట్‌ట్యాగ్ విధానాన్ని మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్‌లో ఆగస్టు నెలలో ప్రయోగాత్మకంగా ప్ర వేశపెట్టారు. ఈ ప్రయోగం విజయ వంతం కావడంతో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పూరిస్థాయిలో దీనిని అమలు చేస్తున్నారు. రీజియన్‌లోని తొమ్మిది డిపోలకు చెందిన హైదరాబాద్, కర్నూలు రూట్లలో తిరిగే బస్సులకు ఫాస్ట్‌ట్యాగ్ స్టిక్కర్లు వేశారు.అమర్చారు. హైదరాబాద్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులకు సమయం ఆదా అవుతున్నప్పటికీ రాయికల్ టోల్‌ప్లాజ్‌లో ఒకే కౌంటర్ ఉండడంతో కొన్నిసార్లు బస్సుల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. టోల్‌ప్లాజ్‌లోని అన్ని కౌంటర్లలో ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న బస్సులకు అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. ఫాస్ట్‌ట్యాగ్‌తో సమయం ఆదా టోల్‌ప్లాజాల మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సులకు ఫాస్ట్‌ట్యాగ్ పద్ధతి అమలు చేయడం వల్ల సమయం ఆదా అవుతోంది. గతంలో టోల్‌ప్లాజాల వద్ద టికెట్ తీసుకోవాలంటే ఎక్కువ సమయం పట్టేది. ఫాస్ట్‌ట్యాగ్ వల్ల ఆ ఆలస్యాన్ని నివారించగలుగుతున్నాం. – మహేశ్, ఆర్టీసీ డీవీఎం -
ఆర్టీసీని ఆదరించాలి
రవాణా వ్యవస్థను పటిష్టం చేయాలి జిల్లాకు మరిన్ని కొత్త బస్సులు డిప్యూటీ సీఎం కడియం, రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడి హన్మకొండ : ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించి లాభాల బాటలో పయనించేలా చూడాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. రవాణా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరముందని అన్నారు. ఆర్టీసీ వరంగల్ రీజియన్‌కు మంజూరైన 24 జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులను రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి బుదవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. జిల్లాకు 24 కొత్త బస్సులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరం, చరిత్ర, వారసత్వ నగరం వరంగల్ అని అన్నారు. వరంగల్ మహానగరంలో ప్రజల రవాణ వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఆర్టీసీ యాజమాన్యం జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులు మంజూరు చేసిందన్నారు. జిల్లాకు మరిన్ని బస్సులు అవసరమని అన్నారు. చిన్న బస్సులు ప్రవేశ పెడితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని, కార్మికులకు లబ్ధి చేకూర్చేందుకు 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని అన్నారు. కార్మికులు కూడా సంస్థ పరిర క్షణకు పాటుపడాలన్నారు. రాష్ట్ర రవాణ శాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ వరంగల్ రీజియన్‌కు రూ.9 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 24 బస్సులను ఇచ్చామన్నారు. ఆర్టీసీ బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరమని, అందుకే ఈ జిల్లాకు మరిన్ని బస్సులు కేటాయిస్తున్నామని చెప్పారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు వెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పల్లెవెలుగు బస్సులతో నష్టాలు వస్తున్నా గ్రామీణ ప్రజలకు రవాణ సౌకర్యం కల్పించేందుకు ఈ సర్వీసులు నడుపుతున్నామన్నారు. దూరప్రాంతాలకు, పుణ్యక్షేత్రాలకు ఏసీ బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. ఆర్టీసీ ఆర్ఎం తోట సూర్యకిరణ్ మాట్లాడుతూ వరంగల్ రీజియన్‌కు ఒకేసారి 24 కొత్త బస్సులు రావడం ఇదే ప్రథమమని అన్నారు. కొత్త బస్సులను వరంగల్ మహా నగరంలో తిప్పుతామని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, గ్రేటర్ నగర మేయర్ నన్నపనేని నరేందర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌బాస్కర్, డాక్టర్ తాటికొండ రాజయ్య, జిల్లా రవాణ శాఖ అధికారి రాంచందర్, ఆర్టీసీ కరీంనగర్ ఈడీ గరిమిల్ల సత్యనారాయణ, డిప్యూటీ సీటీఎం జి.ఎస్.ఎస్.సురేష్, డిప్యూటీ సీఎంఈ జి.రాములు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, జెడ్పీ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్, డిపో మేనేజర్లు అర్పిత, ఎస్.భూపతిరెడ్డి, భానుకిరణ్, శ్రీనివాస్, యేసు, మధుసూదన్, చంద్రయ్య, ఆయా యూనియన్ల నాయకులు పీఆర్ రెడ్డి, సి.హెచ్.జితేందర్‌రెడ్డి, ఈఎస్ బాబు, రాతిపల్లి సాంబయ్య, ఎం.డీ.గౌస్, ఈదురు వెంకన్న, జనార్దన్, సీహెచ్.రాంచందర్, ఎస్.యాదగిరి, రాజయ్య, యాకస్వామి, వడ్డాలపు కుమారస్వామి, జి.సారంగపాణి, మోహన్, ఎన్.వీ.రెడ్డి పాల్గొన్నారు. -
టీఎస్ వర్సెస్ ఏపీ
►ఆర్టీసీ బస్టాండ్లలో ప్లాట్ ఫాంల గొడవ ► ఆంధ్రా బస్సులను ప్లాట్‌ఫాంపైకి రాకుండా అడ్డగింత ► విజయవాడలో తమను రానివ్వడం లేదని ఆరోపణ ► కోదాడ, సూర్యాపేట, మిర్యాలగూడలో అడ్డుకునేందుకు ప్రత్యేక సిబ్బంది కోదాడటౌన్ : ఆర్టీసీలో తెలంగాణ- ఆంధ్ర వివాదం ముదిరి పాకాన పడింది. బస్టాండ్లలో ప్లాట్ ఫాంలపైకి రాకుండా అక్కడి బస్సులను ఇక్కడి వారు.. ఇక్కడి బస్సులను అక్కడి వారు అడ్డుకుంటున్నారు. జాతీయ రహదారిపై ఉన్న కోదాడ, సూర్యాపేట, నార్కట్‌పల్లి బస్టాండ్లతో పాటు ఆంధ్ర బస్సులు ఎక్కువగా వచ్చే మిర్యాలగూడెం, మల్లేపల్లి బస్టాండ్లలో ఆంధ్ర బస్సులకు ఒక్క ప్లాట్ ఫాం మాత్రమే కేటాయించారు. వారు అక్కడ తప్పా మిగతా ఫ్లాట్‌ఫాంలపై బస్సులను నిలపకుండా ప్రతి బస్టాండ్‌లో ప్రత్యేక సిబ్బందిని నియమించి అడ్డుకుంటున్నారు. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బందికి టీఎస్ ఆర్టీసీ సిబ్బందికి బస్టాండ్లలో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. వివాదం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ బస్టాండ్ నుంచి కోదాడతో పాటు నల్లగొండ, మిర్యాలగూడకు నిత్యం బస్సుల రాక పోకలు సాగిస్తున్నాయి. విజయవాడ నుంచి తెలంగాణ బస్సులు హైదరాబాద్‌కు కూడా సర్వీస్‌లు కొనసాగి స్తున్నారు. అయితే తెలంగాణ బస్సుల్లో చార్జీలు ఆంధ్ర బస్సుల కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో ప్రయాణికులు తెలంగాణ బస్సులను ఎక్కుతున్నారని తమకు తీవ్ర నష్టం వస్తుందని ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు అంటున్నారు. ఈ క్రమంలో విజయవాడ బస్టాండ్‌లో 80 ప్లాట్‌ఫాంలు ఉండగా తెలంగాణ బస్సులన్నింటికి కలిపి ఒక్క ప్లాట్ పాం మాత్రమే ఇచ్చారు. బస్సులు బయట నిలపడానికి అవకాశం లేక, ప్లాట్‌ఫాం మీదకు వెళ్లనీయకపోవడంతో తెలంగాణ బస్సులు కొద్ది రోజులుగా అక్కడి నుంచి ఖాళీగా రావాల్సి వస్తుంది. నల్లగొండ నుంచి కాకినాడకు వెళ్లే బస్సుకు, పరకాల నుంచి గుంటూరు వెళ్లే బస్సులకు కూడా అక్కడ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. మేమేం తక్కువ... కోదాడ డిపో నుంచి విజయవాడకు నిత్యం నడిచే బస్సుల సిబ్బంది దీనిపై తీవ్రంగా స్పందించారు. కోదాడ బస్టాండ్‌లో మొత్తం 10 ప్లాట్ ఫాంలు ఉండగా బస్టాండ్ చివరి ప్లాట్ ఫాం ఒక్క దానిని మాత్రమే వారికి కేటాయించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులన్నీ ఆ ఒక్క ప్లాట్ ఫాం మీద మాత్రమే ఆగాలి. దీంతో పాటు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు వెళ్లే ఆర్టీసీ ఆర్డినరీ బస్సులు, విజయవాడ-కోదాడ షటిల్ బస్సులన్నింటికి ఇది ఒక్కటే కేటాయించారు. ఈ ప్లాట్‌ఫాం ఖాళీ లేకపోతే దూరంగా చెట్ల కింద ప్రయాణికులను దింపి అక్కడి నుంచి అటే వెళ్లాల్సి వస్తుంది. ఇతర ప్లాట్ ఫాంలు ఖాళీగా ఉన్నా వీరి బస్సులను మాత్రం అక్కడ నిలపనీయకుండా ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. ఈ విధంగా ఆంధ్ర బస్సుల తాకిడి ఎక్కువగా ఉండే సూర్యాపేట, మిర్యాలగూడ, మల్లేపల్లి బస్టాండ్లలో ఆంధ్ర బస్సులకు ప్లాట్‌ఫాంల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. దీంతో ఇరు రాష్ట్రాల సిబ్బంది నిత్యం ప్లాట్‌ఫాంల విషయంలో గొడవ పడుతున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందోనని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రా బస్సులకు ఒక ప్లాట్‌ఫాం కేటాయించాం కోదాడ బస్టాండ్‌లో ప్లాట్‌ఫాంల కొరత ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే కొన్ని బస్సులు వచ్చి ప్లాట్‌ఫాంలపై ఎక్కువ సమయం నిలపడం వల్ల కోదాడ డిపో బస్సులకు ప్లాట్‌ఫాం దొరకడం లే దు. వారి బస్సులు ఖాళీ ఉన్నప్పుడే బస్టాండ్‌కు వస్తున్నారు. నిండుగా ఉంటే బైపాస్‌లో వెళ్తున్నారు. ఈ సమస్యల వల్ల వారికి ఒక్క ప్లాట్ పాం కేటాయించాం. వారు అక్కడే నిలపాలి. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్సులను నడుపుతాం. - శ్రీనివాసరావు,కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్ -
సమ్మె దెబ్బ...
ఎక్కడి బస్సులు.. అక్కడే.. అతికష్టం మీద 50 వరకు బస్సులను తిప్పిన ఆర్టీసీ రూ.కోటికిపైగా ఆదాయం కోల్పోయిన వైనం చార్జీలు రెట్టింపుచేసిన ప్రైవేటు వాహనదారులు ఇబ్బందులు పడిన ప్రయాణికులు నెల్లూరు(రవాణా) : ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రయాణికులకు చుక్కలు చూపింది. ఫిట్మెంట్ 43 శాతం పెంచాలంటూ ఆర్టీసీలోనే అన్ని యూనియన్లు బుధవారం నుంచి సమ్మెకు దిగాయి. దీంతో జిల్లావ్యాప్తంగా 800లకు పైగా బస్సులు ఆయా డిపోలకే పరిమితమయ్యాయి. మొత్తం ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులతోపాటు కార్మికులు, మెకానికల్ విభాగం, కార్యాలయ సిబ్బంది, అందరూ మూకుమ్మడిగా సమ్మెలోకి వెళ్లిపోయారు. కేవలం ఆయా డిపో మేనేజర్లు, అధికారులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఆయా డిపోల నుంచి 4 నుంచి 5 బస్సుల వరకు అధికారులు అతికష్టం మీద తిప్పారు. సమ్మె కారణంగా జిల్లాకు రోజుకు రూ.కోటి వరకు రావాల్సిన రెవెన్యూను ఆర్టీసీ కోల్పోయింది. ప్రైవేటు వాహనాలు తమకు ఇష్టం వచ్చిన రీతిలో చార్జీలు పెంచి అందినకాడికి ప్రయాణికుల నుంచి దోచుకున్నారు. అధికారులు మొదటిరోజు బస్సులు తిప్పడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది ప్రయాణికులు తమ ప్రయాణాలను విరమించుకుంటే మరికొంతమంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఇబ్బందులుపడ్డ ప్రయాణికులు... జిల్లావ్యాప్తంగా 800లకుపైగా బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. అధికారులు అతికష్టం మీద ఆయా డిపోల నుంచి 51 బస్సులను తిప్పారు. ప్రయాణికులు బస్సుల కోసం డిపోల్లోనే నిరీక్షించారు. కొంతమంది చేసేదేమీలేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ప్రధానంగా బెంగళూరు, తిరుపతి, చెన్నై, వైజాగ్, విజయవాడకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముందే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో బస్టాండుకు వచ్చి ఇబ్బందులుపాలయ్యారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో అధికారులతో వాదనలకు దిగారు. కనీసం రిజర్వేషన్ చేసుకున్న సొమ్మును తిరిగి చెల్లించమని అడిగినా అధికారుల నుంచి సమాధానం కరువైందని పలువురు ప్రయాణికులు వాపోయారు. తాత్కాలిక ఏర్పాట్లలోనూ నిర్లక్ష్యం బస్సులకు డ్రైవర్లు, కండక్టర్లు కావాలన్న సమాచారం ముందే తెలియడంతో అధికసంఖ్యలో యువకులు బస్టాండుకు వచ్చారు. కేవలం డ్రైవర్లు, కండక్టర్లు ధృవపత్రాలను పరిశీలించేందుకు అంత సుముఖత కనబడటంలేదని విధులు నిర్వహించడానికి వచ్చిన పలువురు యువకులు వాపోయారు. ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పినా ఆ ప్రయత్నాలు చేయకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు రద్దుచేశారు... వారం ముందే హైదరాబాద్ నుంచి చెన్నైకి రిజర్వేషన్ చేసుకున్నాం. తీరా మంగళవారం రాత్రి బస్సు దగ్గరకి వచ్చేసరికి రిజర్వేషన్ రద్దుచేస్తూ మెసేజ్ పంపారు. అక్కడి నుంచి విజయవాడ, విజయవాడ నుంచి నెల్లూరుకు ఇతర వాహనాల్లో వచ్చాం. ఇక్కడ నుంచి చెన్నై వెళ్లేందుకు బస్సులు లేవు. బస్సుకోసం ఇబ్బందులు పడుతున్నాం. - వంశీకృష్ణ, ప్రయాణికుడు సమాచారమే కరువు... బస్సులు రద్దవుతున్నట్లు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సమ్మె విషయం తెలిసినట్లయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వాళ్లం. ఈ విషయంపై అధికారుల నుంచి ఎలాంటి సమాధానం కూడా రావడంలేదు. బస్సుకోసం నాలుగు గంటలకుపైగా ఎదురుచూస్తున్నాం. - జోయల్, ప్రయాణికుడు పిల్లలతో ఇబ్బందులు పడుతున్నాం.. తిరుపతి వెళ్దామని పిల్లలతో బస్టాండుకు వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత బస్సులు వెళ్లడం లేదని తెలిసింది. ఉదయం నుంచి తిరుపతి వెళ్లేందుకు బస్టాండులోనే కూర్చున్నాం. చిన్నపిల్లలతో ఇబ్బందులు పడుతున్నాం. - నాగిళ్ల శీనమ్మ.. ప్రయాణికురాలు బస్సులను ఏర్పాటు చేయలేదు.. సమ్మె విషయం ముందే తెలిసినా అధికారులు అం దుకు తగిన ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేయలేదు. ప్రైవేటు వాహనాలు కూ డా అంతంతమాత్రంగానే తిరుగుతున్నాయి. చార్జీలు ఎక్కువ చెల్లించి అయినా వెళ్దామన్నా కుదరడంలేదు. ఉదయం నుంచి బస్సుకోసం బస్టాండులో పడిగాపులు కాస్తున్నాం. - కొండా నాగమణి, ప్రయాణికురాలు శ్రీలంకకు విమాన టికెట్ రిజర్వు చేసుకున్నాం.. బుధవారం రాత్రికి శ్రీలంకకు వెళ్లేందుకు బెంగళూరు నుంచి విమానానికి టికెట్ రిజర్వేషన్ చేసుకున్నాం. నెల్లూరు నుంచి వెళ్లేందుకు బుధవారం వోల్వో బస్సుకు బెంగళూరుకు టికెట్ రిజర్వేషన్ చేసుకున్నాం. తీరా బస్టాండుకు వచ్చాక బస్సు లేదని అధికారులు చెప్పారు. బస్సు రద్దయిన విషయంపై ఎలాంటి సమాచారం అందించలేదు. శ్రీలంకకు వెళ్లాలంటే ఏం చేయాలో అర్థం కావడంలేదు. - ఆరాఫత్, లష్ర్పత్ -
ప్రభావం లేని రవాణా సమ్మె
రోజుకంటే అదనంగా తిరిగిన ఆర్టీసీ బస్సులు ఉదయం వరకే పరిమితమైన ఆటోల బంద్ సాయంత్రం తరువాత లారీల లోడింగ్ సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రోడ్డు భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుతో గురువారం దేశవ్యాప్తంగా నిర్వహించిన సమ్మె తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపలేదు. నేషనల్ మజ్దూర్ యూనియన్ మినహా మిగతా అన్ని కార్మిక సంఘాలు మద్దతు ప్రటించినప్పటికీ ఒకటి రెండుచోట్ల మినహా ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరిగాయి. వేసవి సెలవులు, పెళ్లిళ్ల రద్దీ తీవ్రంగా ఉండ డంతో మామూలు రోజులతో పోలిస్తే గురువారం అదనంగా బస్సులు నడపడం విశేషం. దాదాపు వేయికిపైగా బస్సులు అదనపు ట్రిప్పులేశాయి. ఇక అన్ని సంఘాలు సంఘీభావం ప్రకటించినప్పటికీ ఆటోల సమ్మె మధ్యాహ్నం వరకే పరిమితమైంది. హైదరాబాద్‌లో ఓ యూనియన్ నేతలు మాత్రం కొన్నిచోట్ల ఆటోలను అడ్డుకున్నారు. మార్కెట్లపై ప్రభావం... సమ్మె కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 60 శాతం లారీలు నిలిచిపోవడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. సరుకుల లోడింగ్, అన్లోడింగ్ కాకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. మార్కెట్లలో పగటివేళ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. సాయంత్రం 6 గంటల తరువాత లారీల లోడింగ్ ప్రారంభించారు. శుక్రవారం మేడే ఉండడంతో దగ్గరి ప్రాంతాలకు లోడింగ్ జరగలేదు. దూర ప్రాంతాలకు వెళ్లే లారీలు మాత్రం లోడింగ్‌తో బయలుదేరాయి. ఆర్టీసీ బస్టాండ్లలో భోజన విరామ సమయంలో కార్మికులు నిరసనలు నిర్వహించారు. రాజధానిలో అదనంగా 350 బస్సులు హైదరాబాద్‌లో ఆటోయూనియన్లు, రవాణా రంగానికి చెందిన కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతుగా ప్రదర్శనలు చేపట్టాయి. అన్ని రూట్లలో సిటీ బస్సులు యథావిధిగా నడిచాయి. ప్రతిరోజూ తిరిగే 3500 బస్సులకు తోడు మరో 350 బస్సులు అదనంగా నడిపినట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. మధ్యాహ్నం తరువాత అన్నిరకాల రవాణా వాహనాలు రోడ్లపై కనిపించాయి. -
పాత బస్సులకు కొత్త ‘కలర్’
సీఎం ప్రారంభించిన 100 బస్సుల్లో 20 పాతవి సాక్షి, విజయవాడ: పాత బస్సులకు రంగులు వేసి కొత్తగా మార్చేసి వాటిని సీఎం చంద్రబాబుతో ప్రారంభింప జేయించి ఔరా అనిపించారు ఏపీ ఆర్టీసీ అధికారులు. సోమవారం సీఎం విజయవాడలో వంద కొత్త బస్సులను ప్రారంభించిన సంగతి విదితమే. వీటిలో 20 పాత బస్సులకు రంగు వేసి, పూలతో అలంకరించి, స్టిక్కర్లు వేసి అధికారులు ముస్తాబు చేశారు. వాటినే సీఎం ప్రారంభించాఉ. వీటిని రీజియన్ల వారీగా కేటాయించి ఆయా డిపోలకు పంపారు. సీఎం వద్ద మెప్పుకోసం అధికారులు ఇలా ‘కలరింగ్ ’ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కొన్నవి 89 బస్సులనీ , పాత వాటికి రంగులు వేసి 100 బస్సులుగా భ్రమింపజేశారని తెలుస్తోంది. దీనిపై విజయవాడ రీజియన్ మేనేజర్ సుదేశ్‌కుమార్‌ను వివరణ అడగ్గా 89 బస్సులు కొత్తగా ఆర్టీసీ కొనుగోలు చేసిందని, పాత బస్సులకు కొత్తగా పెయింట్ వేయలేదని చెప్పారు. సుమారు రూ. 60 కోట్లతో వీటిని కొనుగోలు చేశామన్నారు.