సాక్షి, అమరావతి: ప్రజారవాణా విభాగం (ఆర్టీసీ) మరో 263 అద్దె బస్సుల కోసం టెండర్లు పిలిచింది. ఆసక్తి ఉన్నవారు ఎంఎస్‌టీసీ ‘ఈ’ కామర్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని టెండర్లు దాఖలు చేయవచ్చు. ఈ నెల 23న ఉదయం 10 గంటల నుంచి అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టెండర్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 19న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహిస్తామని ఆర్టీసీ ఈడీ కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
కేటగిరీల వారీగా టెండర్లు పిలిచిన అద్దె బస్సులు
ఏసీ స్లీపర్ 4, నాన్ ఏసీ స్లీపర్ 6, సూపర్ లగ్జరీ 12, అల్ట్రా డీలక్స్ 15, ఎక్స్‌ప్రెస్ 30, అల్ట్రా పల్లె వెలుగు 95, పల్లె వెలుగు 72, మెట్రో ఎక్స్‌ప్రెస్ 27, సిటీ ఆర్డినరీ 2.
జిల్లాల వారీగా టెండర్లు పిలిచిన అద్దె బస్సులు
శ్రీకాకుళం జిల్లా 23, పార్వతీపురం మన్యం 29, విజయనగరం 12, విశాఖపట్నం 42, అనకాపల్లి 16, కాకినాడ 35, తూర్పుగోదావరి 2, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ 24, పశ్చిమ గోదావరి 29, కృష్ణా 4, ఎన్టీఆర్ 3, గుంటూరు 2, పల్నాడు 2, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 5, తిరుపతి 8, అన్నమయ్య 5, నంద్యాల 3, అనంతపురం 8, శ్రీసత్యసాయి జిల్లా 11.
బస్సు రూట్లు, టెండరు నిబంధనల కోసం సంప్రదించాల్సిన ఆర్టీసీ వెబ్‌సైట్: https:// apsrtc.ap.gov.in
263 అద్దె బస్సులకు ఆర్టీసీ టెండర్లు
Published Fri, Sep 23 2022 6:30 AM | Last Updated on Fri, Sep 23 2022 7:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment