tenders
-
అవినీతి నిర్మాణానికి రెట్టింపు ‘అడుగు’
సాక్షి, అమరావతి: రాజధానిలో భవనాల నిర్మాణ పనుల టెండర్లలో అడుగు అడుగుకు కమీషన్లు దండుకోవడానికి ముఖ్య నేతలు ప్రణాళికాయుతంగా పావులు కదుపుతున్నారు. ఐఏఎస్ అధికారుల బంగ్లాల పనుల టెండర్లలోనైతే మరీ బరితెగించారు. అడిగినంత కమీషన్ ఇచ్చే కాంట్రాక్టు సంస్థకు కట్టబెట్టేందుకు సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) అధికారులపై ముఖ్య నేతలు ఒత్తిడి తెచ్చారు. నిర్మాణ అంచనా వ్యయాన్ని పెంచేసేలా చక్రం తిప్పారు. ఆ కాంట్రాక్టు సంస్థ బ్రోచర్నే నిబంధనలుగా పెట్టి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. నిర్దేశించిన కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు కాంట్రాక్టు సంస్థకు పనులు కట్టబెట్టాక.. అందులో పది శాతాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి.. దాన్నే తొలి విడత కమీషన్‌గా వసూలు చేసుకోవడానికి స్కెచ్ వేశారు. ఆ తర్వాత చేసిన పనులకు బిల్లులు చెల్లించేటప్పుడు మిగతా కమీషన్ వసూలుకు ప్రణాళిక రచించారు. వివరాల్లోకి వెళితే..రాజధానిలో రాయపూడి వద్ద ఐఏఎస్ అధికారులకు 30.47 ఎకరాల్లో జీ+1 పద్ధతిలో పైల్ ఫౌండేషన్‌తో ఆర్సీ కాలమ్స్, బీమ్స్‌తో లోపల, బయట విద్యుదీకరణ, ఐటీ పనులు.. లోపల, బయటి ప్రాంతాల్లో ప్లంబింగ్‌తో బంగ్లాల నిర్మాణ పనులకు సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బంగ్లాలకు రహదారులు, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలి. మొత్తం 5,28,100 చదరపు అడుగుల్లో 115 బంగ్లాలను నిర్మించాలని టెండర్లో పేర్కొంది. కాంట్రాక్టు సంస్థలు టెండర్లో పాల్గొంటూ బిడ్లు దాఖలు చేసుకోవడానికి మార్చి 3వరకు గడువు ఇచ్చింది. అదే రోజున టెక్నికల్ బిడ్ తెరుస్తారు. అందులో అర్హత సాధించిన కాంట్రాక్టు సంస్థల ఆర్థిక బిడ్లను మార్చి 7న తెరిచి, తక్కువ ధర(ఎల్–1)కు కోట్ చేసిన సంస్థకు పనులు అప్పగించనున్నారు.వ్యయంపై నోరెళ్లబెడుతున్న బిల్డర్లు, ఇంజినీర్లుఒక్కొక్కటి 5,464 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో ముఖ్య కార్యదర్శుల కోసం జీ+1లో 25 బంగ్లాలు.. కార్యదర్శుల కోసం జీ+1లో ఒక్కొక్కటి 4,350 చదరపు అడుగులతో 90 బంగ్లాలు నిర్మించాలి. మొత్తం నిర్మిత ప్రాంతం 5,28,100 చదరపు అడుగులు.. ఇందులో రూ.2,500 వెచ్చిస్తే అత్యంత విలాసవంతంగా నాణ్యంగా బంగ్లాలు కట్టవచ్చని బిల్డర్లు, ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ లెక్కన 115 బంగ్లాల నిర్మాణ విలువ రూ.132.02 కోట్లే అవుతుంది. బంగ్లాల నిర్మిత ప్రాంతంలో అంతర్గత రహదారులు, విద్యుత్తు, తాగు నీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇంటర్నెట్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.100 కోట్లకు మించి కాదని స్పష్టం చేస్తున్నారు. అంటే.. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.232.02 కోట్లకు మించదు. మౌలిక సదుపాయాలను కూడా కలుపుకొంటే 115 బంగ్లాల నిర్మాణంలో చదరపు అడుగుకు అన్ని పన్నులతో కలిపి రూ.4,393.48కు మించదని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. సీఆర్డీఏ మాత్రం ప్రాజెక్టు కాంట్రాక్టు విలువను రూ.498.16 కోట్లకు నిర్ణయించింది. దీనిప్రకారం చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.9,433.06 అవుతోంది. ఒక్కో చదరపు అడుగుకు రూ.5,040.12కు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఇలా భారీగా పెంచేయడంపై బిల్డర్లు, ఇంజినీర్లు అవాక్కవుతున్నారు. అడిగినంత కమీషన్ ఇచ్చే కాంట్రాక్టు సంస్థకు పనులు కట్టబెట్టి దోచుకోవడానికి ముఖ్య నేతలు సీఆర్డీఏ అధికారులపై ఒత్తిడి తెచ్చారని, అంచనా వ్యయాన్ని పెంచేలా చక్రం తిప్పారని చెబుతున్నారు.తన రికార్డు తానే బద్దలురాజధాని ప్రాంతంలో జీ+12 పద్ధతిలో (14 టవర్లలో 1440 ఫ్లాట్లు) గెజిటెడ్ అధికారుల క్వార్టర్ల నిర్మాణానికి సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్లో చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.1806.29. రాజధానిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ వెంచర్ హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో జీ+18 పద్ధతిలో 12 టవర్లలో 1200 ఫ్లాట్ల నిర్మాణానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.4,511.75. అంతస్తులు పెరిగే కొద్దీ భవన నిర్మాణ వ్యయం తగ్గుతుంది. బహుళ అంతస్తులతో అత్యంత విలాసవంతంగా నిర్మించినా చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించదని అప్పట్లో బిల్డర్లు, ఇంజినీర్లు స్పష్టం చేశారు. కానీ.. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో కాంట్రాక్టు సంస్థతో కుమ్మక్కై అంచనా వ్యయాన్ని భారీగా పెంచేయించిన ముఖ్య నేతలు కమీషన్ల దందాకు తెరతీశారు. ఇప్పుడు ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణ పనుల టెండర్లలో కూడా సీఆర్డీఏ, ఏడీసీఎల్ తమ రికార్డులను తామే బద్ధలు కొడుతూ అంచనా వ్యయాన్ని పెంచేశాయనే చర్చ బిల్డర్లు, ఇంజినీర్లలో జోరుగా సాగుతోంది. -
‘భవ్యం'గా టెండరు!
సాక్షి, అమరావతి : వడ్డించేవాడు మనోడైతే బంతి చివర్లో కూర్చున్నా అన్నీ సమకూరుతాయన్నది సామెత. ప్రభుత్వంలోనూ ఇలాంటి కీలక వ్యక్తులను ప్రసన్నం చేసుకుంటే ఇంక తిరుగే ఉండదు.. అనుకున్న పనులు అనుకున్నట్లు చకచకా జరిగిపోతాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో ఇప్పుడు అచ్చం ఇదే జరుగుతోంది. 108, 104 వాహనాలు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ నిర్వహణ టెండర్లలో ఓ అస్మదీయ సంస్థకు భారీగా లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ ముఖ్యనేతల డైరెక్షన్లో ‘భవ్య’మైన స్కెచ్ వేశారు. ఆ ప్రణాళిక కథాకమామిషు ఇదిగో ఇదే.. ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే లక్ష్యంపేద, బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేలా గత ప్రభుత్వంలో అమలైన డైరెక్ట్ బెన్ఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) స్కీంలను టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే అటకెక్కించింది. కూటమి పార్టీ నేతల జేబులు నింపే దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) కార్యక్రమాలనే పక్కాగా అమలుచేస్తోంది. అస్మదీయ సంస్థలకు పనులను కట్టబెట్టడం ద్వారా రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే లక్ష్యంగా అడుగు లు వేస్తోంది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖలోని 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ), 108 అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్సీ) నిర్వహణ కాంట్రాక్టును తమ అస్మదీయ సంస్థకు కట్టబెట్టడానికి ఓ ‘భవ్య’మైన ప్రణాళిక రచించినట్లు విశ్వసనీయ సమాచారం. పై మూడింటికీ కలిపి ఏపీఎంఎస్ఐడీసీ ఒకే టెండరును పిలిచింది. ఈ టెండరు నిబంధనలను చూసి ‘నిబంధనలన్నీ ప్రభుత్వ పెద్దలు నిశ్చయించుకున్న సంస్థకే కాంట్రాక్టు కట్టబెట్టేలా ఉన్నాయి. ఆ సంస్థ పేరొక్కటే టెండరు డాక్యుమెంట్లో పొందుపరచలేదు’.. అని వైద్యశాఖలో ఇప్పుడీ అంశాన్ని విస్తృతంగా చర్చించుకుంటున్నారు. నిజానికి.. రోడ్డు ప్రమాదాలు, ఇతర ఘటనల్లో బాధితులకు సత్వర వైద్యసాయం అందజేత, ప్రివెంటివ్ కేర్‌లో 108, 104 సేవలు కీలకపాత్ర పోషిస్తుంటాయి. ఇంత పెద్ద వ్యవస్థ నిర్వహణ కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ పూర్వ అనుభవం, సామర్థ్యం ఎంతో కీలకం. వీలైనన్ని ఎక్కువ సంస్థలు ఈ టెండరులో పాల్గొనే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలి. కానీ, పెద్దఎత్తున అంబులెన్స్‌లు, ఎంఎంయూలు నిర్వహించిన, అనుభవం, సామర్థ్యంలేని సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టడం కోసం ఇష్టమొచ్చినట్లు నిబంధనలు రూపొందించినట్లు స్పష్టమవుతోంది. ఒకే తరహా సేవలకు వేర్వేరు నిబంధనలు.. రాష్ట్రవ్యాప్తంగా 1,700 అంబులెన్స్‌లు, ఎంఎంయూలు ఐదేళ్లపాటు నిర్వహణ, ఇతర అవసరాలకు రూ.రెండు వేల కోట్ల అంచనాతో టెండరు రూపొందించారు. ఇంత విలువైన కాంట్రాక్టులను ఓ చిన్న సంస్థకు కట్టబెట్టడం కోసం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) మార్గదర్శకాలకు తూట్లు పొడిచారు. సీవీసీ మార్గదర్శకాల ప్రకారం.. ప్రాజెక్టు అంచనా వ్యయంలో మూడు ఆర్థిక సంవత్సరాల సగటు వార్షిక టర్నోవర్ కనీసం 30 శాతం ఉండాలి. అయితే, ప్రస్తుత టెండరులో వార్షిక టర్నోవర్ రూ.100 కోట్ల వరకూ ఉండాలని పేర్కొన్నారు. అలాగే, గిరిజన ప్రాంతాల్లో 122 ఫీడర్ అంబులెన్స్ నిర్వహణ కోసం ఏపీఎంఎస్ఐడీసీ టెండర్లు పిలిచింది. ఇందులో సర్వీస్ ప్రొవైడర్‌కు కనీసం రెండేళ్ల అనుభవంతో పాటు, కనీసం 33 శాతం (40) ఫీడర్ అంబులెన్సులను గిరిజన, మారుమూల ప్రాంతాల్లో నిర్వహించి ఉండాలని నిబంధన విధించారు. కానీ, 108, 104 టెండరులో మాత్రం బిడ్ దాఖలుచేసే నాటికి 100 వరకూ అంబులెన్స్‌లు/ఎంఎయూ/వెటర్నరీ యూనిట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో నిర్వహించి ఉంటే చాలన్నారు. ఈ నేపథ్యంలో.. ఒకే తరహా సేవలకు సంబంధించిన టెండర్లలో వేర్వేరు నిబంధనలు విధించడం ఇక్కడ గమనార్హం. ఫీడర్ అంబులెన్స్‌ల తరహాలో 33 శాతం నిబంధన పెడితే అస్మదీయ సంస్థ బిడ్ పరిశీలన దశలోనే తిరస్కరణకు గురవుతుందని 104, 108 టెండరులో మెలికపెట్టినట్లు తెలిసింది. సదరు సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో వెటర్నరీ అంబులెన్స్‌లు నిర్వహిస్తుండడంతో ప్రస్తుత టెండర్లలో వెటర్నరీ అంశాన్ని చేర్చినట్లు సమాచారం. మరోవైపు.. ఎల్రక్టానిక్ హెల్త్ రికార్డుల (ఈహెచ్‌ఆర్) సృష్టిలో అనుభవం ఆధారంగా ఐదు మార్కులు కేటాయిస్తామని టెండరులో పేర్కొన్నారు. ఇక సదరు అస్మదీయ సంస్థ పలు రాష్ట్రాల్లో ఈహెచ్‌ఆర్ ప్రాజెక్టులు చేసిన క్రమంలో దాని ఆధారంగా మార్కులిచ్చి మేలు చేయడానికే ఈ నిబంధన కూడా చేర్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు హెల్త్‌కేర్ ప్రాజెక్టుల్లో ఈ సంస్థ ఉన్న నేపథ్యంలో ప్రతి ప్రాజెక్టుకు 1.5 చొప్పున 15 మార్కుల వరకూ బోనస్ ఇచ్చేలా నిబంధన పెట్టారు.ఒకే బిడ్ వచ్చినా ఆమోదించేలా.. ఇక సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా పనులకు టెండర్లు పిలిచినప్పుడు ఒకే సంస్థ బిడ్ వేస్తే ఆ టెండర్‌ను రద్దుచేసి, మరోసారి పిలవడం ఆనవాయితీ. కానీ, ఓ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టడం కోసం పూర్వ అనుభవం, సామర్థ్యం కలిగిన సంస్థలు పోటీలో ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ ‘భవ్య’మైన ప్రణాళికను రచించింది.ఒక్క బిడ్ దాఖలైనా ఆమోదించేలా షరతు విధించింది. దీంతో.. ఒకే సంస్థ పోటీలో ఉండేలా నిబంధనలు పొందుపరిచి, ఆ మేరకు బిడ్ ఆమోదించే వెసులుబాటు కల్పించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గతంలో టెండర్లు పిలిచినప్పుడు ఇలాంటి నిబంధనలు ఉండేవి కావని, ఇప్పుడే చేర్చారని ఏపీఎంఎస్ఐడీసీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
‘జన్ ఔషధి’కి అవినీతి ‘సత్యం’
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో ధనార్జనే ధ్యేయంగా కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. ఓ రేటు మాట్లాడేసుకుని టెండర్లు లేకుండానే ప్రభుత్వ శాఖల్లో పనులను నచ్చిన వారికి కట్టబెట్టేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రులకు జన్ ఔషధి మందుల సరఫరా పేరిట ఓ మంత్రి కమీషన్ల రూపంలో రూ.కోట్లలో కొట్టేయడానికి పన్నాగం పన్నారని వైద్య శాఖలో జోరుగా చర్చ సాగుతోంది. బోధనాస్పత్రులకు మందులు, సర్జికల్స్ కొనుగోలుకు కేటాయించే బడ్జెట్లో 80 శాతం సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానంలో ఏపీఎంఎస్ఐడీసీ ఆస్పత్రులకు మందులు, సర్జికల్స్ సరఫరా చేస్తుంది.మిగిలిన 20 శాతం డీ సెంట్రలైజ్డ్ బడ్జెట్‌తో అత్యవసర మందులు, సర్జికల్స్ స్థానికంగానే కొనుగోలు చేస్తుంటారు. ఏటా డీ సెంట్రలైజ్డ్ బడ్జెట్‌తో రూ.50 కోట్ల మేర కొనుగోళ్లు చేపడుతుంటారు. వీటితో పాటు, సెంట్రలైజ్డ్ బడ్జెట్ కింద ఏపీఎంఎస్ఐడీసీ నుంచి సరఫరా అవ్వని మందుల కొనుగోళ్లలో జన్ ఔషధికే ప్రాధాన్యం ఇవ్వాలనే విధానాన్ని గతేడాది వైద్య శాఖ ప్రవేశపెట్టింది. జన్ ఔషధిలో సరఫరా చేయని మందులనే, ప్రత్యామ్నాయ మార్గాల్లో కొనుగోలు చేయాలని షరతులు పెట్టారు. ఏకంగా ఉత్తర్వులు మార్చి గ్రీన్ సిగ్నల్ ఈ నేపథ్యంలో సదరు మంత్రి ఒక మందుల సరఫరా సంస్థతో డీల్ కుదుర్చుకున్న క్రమంలోనే జన్ ఔషధి వ్యవహారం తెరమీదకు వచ్చిందని ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, వైద్యులు చర్చించుకుంటున్నారు. తిరుపతికి చెందిన సదరు సంస్థ ప్రతినిధులు ‘జన్– ఔషధి విధానం ప్రవేశపెట్టిందే మా కోసం.. మాతోనే ఎంవోయూ చేసుకోవాలి’ అని ఆస్పత్రుల సూపరింటెండెంట్లను సంప్రదించినట్టు సమాచారం. ఈ క్రమంలో ఫలానా సంస్థతో ఎంవోయూ చేసుకోవాలని ఆదేశాలివ్వాలని మంత్రి కార్యాలయం ఒత్తిళ్లు చేసినట్టు తెలిసింది. దీంతో మంత్రి ఒత్తిళ్లకు తలొగ్గి.. సదరు సంస్థతోనే సూపరింటెండెంట్లు ఒప్పందం కుదుర్చుకునేలా నిబంధనల్లో మెలికలు పెడుతూ గత నెల (జనవరి) 23న ఇచ్చిన ఉత్తర్వులకు సవరణలు చేశారు. మంత్రికి చెందిన సరఫరాదారుడికి రాయలసీమతోపాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోనూ జన్ ఔషధి స్టోర్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ పీఎంబీజేకే – జన్ఔషధి స్టోర్స్ ఉన్న సంస్థతోనే ఒప్పందం కుదుర్చుకోవాలని నిబంధనలు మార్చారు. అదే విధంగా తొలుత ఇచ్చిన ఉత్తర్వుల్లో కనీసం ఏడాది ప్రాతిపదికన ఒప్పందం చేసుకోవాలన్నారు. ఈ నిబంధనను సవరించి, రెండేళ్ల కాలనికి పొడిగించారు. హెచ్‌డీఎస్, ఆరోగ్యశ్రీ మందుల కొనుగోళ్లలోనూ ఇవే నిబంధనలు పాటించాలని మెలిక పెట్టారు.ఈ మేరకు సవరించిన ఉత్తర్వులను జనవరి 28న ఇచ్చారు. దీంతో ఏటా రూ.50 కోట్లకుపైగా మందులు, సర్జికల్స్ కొనుగోళ్ల వ్యవహారంలో టెండర్లు పిలవకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సంస్థకు మేలు జరిగేలా మంత్రి చక్రం తిప్పారని వైద్య వర్గాల్లో చర్చ నడుస్తోంది. సవరించిన ఉత్తర్వుల ప్రకారం రెండేళ్ల ప్రాతిపదికన ఎంవోయూ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన రూ.100 కోట్లకుపైగా బిజినెస్ కల్పించడం ద్వారా కమీషన్ల రూపంలో రూ.కోట్లలోనే లబ్ధి పొందాలని మంత్రి ప్రణాళికలు రచించినట్టు స్పష్టమవుతోంది.పెనాల్టీలు కూడా లేవట!పీఎంబీజేకే–జన్ ఔషధి గుర్తింపు పొందిన, కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకు మందులు సరఫరా చేసే సంస్థలతో ఎంవోయూ చేసుకోవాలని డీఎంఈ డిసెంబర్లో ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రధానంగా సూపరింటెండెంట్లకు సూచించారు. ఎమర్జెన్సీ మందులు అయితే 24 గంటల్లో, తక్కువ మొత్తంలో మందులు అయితే ఇండెంట్ పెట్టిన మూడు రోజుల్లో, పెద్ద ఎత్తున అయితే వారంలో సరఫరా చేయాల్సి ఉంటుందని మార్గదర్శకాలు రూపొందించారు. నిర్దేశించిన సమయంలోగా మందులు సరఫరా చేయకుంటే సదరు సంస్థకు పెనాల్టీ విధించేలా ఎలాంటి నిబంధనలు పెట్టకుండానే ఎంవోయూ రూపొందిస్తున్నట్లు సమాచారం. మందుల సరఫరాలో పదే పదే ఆలస్యం చేసినా చర్యలు తీసుకోలేని విధంగా కాంట్రాక్టర్‌కు అనుకూలంగా నిబంధనలు తయారు చేశారని తెలిసింది. -
రేట్లు పెంచుకుని.. కమీషన్లు పంచుకునేలా!
సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో నిత్యావసర సరుకుల తరలింపునకు సంబంధించిన స్టేజ్–1 టెండర్లలో భారీ అవినీతి బాగోతం నడుస్తోంది. గతంలో ఒకసారి టెండర్లు పిలిచి.. ఫైనాన్షియల్ బిడ్లు తెరిచిన తర్వాత.. వాటిని రద్దుచేసి కొత్తగా టెండర్లు(Tenders) పిలవడం చర్చనీయాంశమైంది. తాజాగా 22 జిల్లాలకు స్టేజ్–1 టెండర్లు ఆహ్వానించగా.. గతంలో కోట్ చేసిన ధరలకంటే ఈసారి ఏకంగా 15 శాతం అధికంగా ధరలు ఉండటం గమనార్హం. కమీషన్ల కోసమే కొత్త టెండర్!గతేడాది అక్టోబర్–నవంబర్‌లో పౌరసరఫరాల సంస్థ(Civil Supplies Corporation) స్టేజ్–1 టెండర్లు నిర్వహించింది. ఇందులో ఎక్కువగా రాజకీయ సిఫారసులు నడిచాయి. చాలాచోట్ల సింగిల్ టెండర్లు వచ్చాయి. అప్పట్లో కూడా పాత టెండర్లతో పోలిస్తే 10 శాతం వరకు అధిక ధరలు కోట్ చేశారు. కొందరు కాంట్రాక్టర్లు తమను అన్యాయంగా టెండర్ ప్రక్రియ నుంచి తప్పించారంటూ కోర్టుకు వెళ్లి మరీ అనుమతులు తెచ్చుకున్నారు. అయితే.. దోపిడీయే పరమావధిగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వ పెద్దలు పాత టెండర్ల రద్దుకు ప్రణాళిక వేశారు. దీంతో మూడు నాలుగు జిల్లాల్లో ఎక్కువ రేట్లు వచ్చాయని సాకుగా చూపించి మొత్తం టెండర్లను రద్దు చేసేశారు. విచిత్రం ఏమంటే.. తాజాగా పిలిచిన టెండర్లలో గతంలో కోట్ చేసిన దానికంటే ఎక్కువ ధరలు వచ్చాయి. ఇప్పుడు ఎక్కువ టెండర్లనే ఖరారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు కాంట్రాక్టర్లను చర్చల (నెగోషియేషన్స్) పేరుతో పిలిచి కోట్ చేసిన ధరలో రూపాయి, అర్ధరూపాయి తగ్గించి.. ఏదో భారీగా తగ్గించినట్టు మభ్యపెడు తున్నారు. ఉదాహరణకు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో టెండర్ల ధర ఎక్కువ రాగా.. అయినా వీటిని ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్లలో ఎక్కువ ధరలు వచ్చినట్టు భావిస్తే వాటికి రీ టెండరింగ్‌కు వెళ్లాల్సిన అంశాన్ని పూర్తిగా విస్మరించారు.టెండర్ అంతా గోల్మాల్తాజాగా పౌరసరఫరాల సంస్థ స్టేజ్–1 టెండర్ల ప్లాట్‌ఫామ్ ఎంపికమైనా విమర్శలు వెల్లువెత్తు న్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వ పోర్టల్ జమ్ (జీఈఎం) ద్వారా జిల్లాల్లో బఫర్ గోడౌన్ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు సరుకు రవాణాకు టెండర్లు పిలిచారు. ఇందులో నాలుగు జిల్లాలకు టెండర్ ఖరారు చేశారు. మిగిలిన జిల్లాల్లో టెండర్లు రద్దు చేయగా.. ఈసారి జమ్ పోర్టల్ నుంచి కాకుండా మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ పోర్టల్ అయిన ఎన్‌ఈఎంఎల్ ద్వారా టెండర్లు పిలవడం వెనక అసలు గుట్టు ఉందని కాంట్రాక్టర్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. జమ్ పోర్టల్ తమకు ఎంతో సౌలభ్యంగా ఉందని, ఇందులో ఎటువంటి ప్లాట్‌ఫామ్ కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేకుండా టెండర్లు వేయగా.. ఎన్‌ఈఎంఎల్ ద్వారా ఒక్కో కాంట్రాక్టర్ సుమారు రూ.2.50 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇదంతా ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే పౌరసరఫరాల సంస్థలో పని చేస్తున్న ఓ ఉద్యోగి చక్రం తిప్పి టెండర్ ప్లాట్‌ఫామ్‌ను మార్చినట్టు సమాచారం. మరోవైపు ఇక్కడ ఖరారైన టెండర్లకు అగ్రిమెంట్ల కోసం ఒక్కో కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ పంపకాల్లో గొడవలు రావడంతో అసలు విషయం బయటకు పొక్కింది. -
మా ప్రభుత్వం.. అంతా మా ఇష్టం!
సాక్షి, నంద్యాల: కస్తూర్బా బాలికల వసతి గృహాలు, మోడల్ పాఠశాలలకు నిత్యావసర సరుకుల సరఫరాకు సంబంధించిన టెండర్లలో అధికారులు నిబంధనలకు తిలోదకాలిచ్చారు. మా ప్రభుత్వం.. మా ఇష్టం.. అంటూ అధికార పార్టీ నేతలు ఒత్తిడి తేవడంతో వారు చెప్పిన వారికే టెండర్లు కట్టబెట్టారు. నంద్యాల జిల్లాలో 27 కస్తూర్బా బాలికల వసతి గృహాలు, 19 మోడల్ పాఠశాలల(మొత్తం 46)కు కిరాణా సరుకులు (ప్రొవిజన్స్), కూరగాయలు, గుడ్లు, పండ్లు, చికెన్ సరఫరా చేయడం కోసం సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు గత డిసెంబర్ 21న టెండర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడాదికి ప్రొవిజన్స్‌కు రూ.6.43 కోట్లు, కూరగాయలకు రూ.1.75 కోట్లు, పండ్లకు రూ.96.49 లక్షలు, ఎగ్స్‌కు రూ.96.49 లక్షలు, చికెన్‌కు రూ.75.68 లక్షలుగా టెండర్లో పేర్కొన్నారు. తక్కువ ధరకు కోట్ చేసిన వారికి కాంట్రాక్ట్ ఇస్తామని నోటిఫికేషన్లో తెలిపారు. టెండర్ వేయొద్దని అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగినప్పటికీ తుదకు ఇద్దరు టీడీపీ నేతలు సహా తొమ్మిది మంది టెండర్లో పాల్గొని.. ఒక కేజీబీవీ వసతి గృహం, ఒక మోడల్ స్కూల్‌కు కలిపి (నెలకు) కోట్ చేశారు. గత నెల 31న టెండర్ ఓపెన్ చేసిన తర్వాత రూ.2,71,731 ధరను కోట్ చేసి శ్రీ శ్రీనివాస ట్రేడర్స్ ఎల్1గా నిలిచింది. అయితే తమ వారికి ఈ కాంట్రాక్టు రాకపోవడంతో జిల్లాకు చెందిన మంత్రులు రంగంలోకి దిగి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఎల్1గా నిలిచిన శ్రీ శ్రీనివాస ట్రేడర్స్‌కు 16, ఎల్4 శ్రీసాయి ఎంటర్ ప్రైజెస్‌కు 15, ఎల్7 కేవీఆర్ ఆగ్రోస్‌కు 15 పాఠశాలల చొప్పున విభజించి కాంట్రాక్టు కేటాయించినట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించడం కలకలం రేపింది. జిల్లా పర్చేజింగ్ కమిటీ చైర్మన్ అయిన జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి, టెండర్ ప్రక్రియనే మార్చేశారని టెండర్లో పాల్గొన్న వారు ఆరోపిస్తున్నారు. చికెన్ టెండర్‌ను ఓపెన్ చేయకుండానే కేవీఆర్ ఆగ్రోస్‌కు కట్టబెట్టారని, అసలు ఆ సంస్థకు అర్హతే లేదని చెబుతున్నారు. ఇలా ఏకపక్షంగా కేటాయించాలనుకున్నప్పుడు ఎందుకు టెండర్లు పిలిచారని ప్రశ్నిస్తున్నారు. కాగా, శ్రీ శ్రీనివాస ట్రేడర్స్ మాత్రమే సరుకుల సరఫరా ప్రారంభించగా, మిగతా రెండు సంస్థలు ఇంకా మొదలు పెట్టలేదు. టెండర్లలో అవకతవకల విషయమై జేసీ విష్ణు చరణ్‌ను సంప్రదించగా.. ఎల్1 కోట్ చేసిన మొత్తానికే తాము కూడా ప్రొవిజన్స్ సరఫరా చేస్తామని ఎల్4, ఎల్7లు ముందుకు రావడంతో అందరికీ కలిపి కాంట్రాక్ట్ ఇచ్చామన్నారు. చికెన్ టెండర్లో మిగతా వారంతా రింగ్ అయినట్లు తెలియడంతో అలా చేశామన్నారు. -
కిలోమీటర్‌కు రూ.53.88 కోట్లు!
మీరు బ్యాంకు నుంచి అప్పు తీసుకుని ఇల్లు కట్టుకుంటుంటే ఏం చేస్తారు? సిమెంటు దగ్గర నుంచి స్టీలు, కిటికీ తలుపుల వరకు నాణ్యమైన వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. బేరమాడి తక్కువ ధరకే ఇంటి నిర్మాణ పనులకు అంగీకరించిన మేస్త్రీకే వాటిని అప్పగిస్తారు. ఎందుకంటే అప్పు తీసుకుని ఇంటిని నిర్మిస్తున్నారు కాబట్టి. తీసుకున్న అప్పులో ఒక్క రూపాయి వృథా అయినా అది భారంగా మారుతుంది కాబట్టి. ఎవరైనా సరే ఇలానే చేస్తారు. కానీ.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అందుకు తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. అప్పుగా తెచ్చిన సొమ్ములోంచి.. ‘మీకింత.. మాకింత’ అంటూ కమీషన్లు దండుకునేందుకు రాజధాని రహదారుల పనుల్లో బరితెగించి అంచనాలు పెంచడం విస్తుగొలుపుతోంది. సాక్షి, అమరావతి: దేశంలో ఒక కిలోమీటర్ పొడవున ఆరు లేన్ (ఒక్కో వైపు 50 మీటర్ల వెడల్పు) జాతీయ రహదారిని సగటున రూ.20–22 కోట్లతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) నిర్మిస్తోంది. అదీ.. అన్ని రకాల పన్నులు అంటే జీఎస్టీ, నాక్ (నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ), సీనరేజీతో కలిపి. కానీ.. రాజధాని అమరావతిలో అదే ఆరు లేన్లతో చేపట్టిన ప్రధాన రహదారుల పనుల్లో మిగిలి పోయిన పనులకు కిలోమీటర్‌కు గరిష్టంగా రూ.53.88 కోట్లు.. కనిష్టంగా రూ.24.88 కోట్లను కాంట్రాక్టు విలువగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) ఖరారు చేసింది. వాటికి అదనంగా జీఎస్టీ, నాక్, సీనరేజీ పన్నులను రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. వీటిని పరిశీలిస్తే ప్రధాన రహదారుల పనులను.. అదీ మిగిలిపోయిన పనుల అంచనా వ్యయాన్ని కిలోమీటర్‌కు గరిష్టంగా రూ.31.88 కోట్లు, కనిష్టంగా రూ.24.88 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. రాజధాని ప్రాంతంలో చేపట్టిన 11 ప్రధాన రహదారుల పనుల్లో మిగిలిన పనులను పూర్తి చేయడానికి రూ.3,405.57 కోట్ల వ్యయంతో వేర్వేరుగా టెండర్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ముందే ఎంపిక చేసిన కాంట్రాక్టు సంస్థలకే పనులు దక్కేలా ఆ నోటిఫికేషన్లో నిబంధనలు పెట్టారని కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన నేపథ్యంలో.. నిర్దేశించిన కాంట్రాక్టు విలువ కంటే సగటున 4 నుంచి 5 శాతం అధిక ధరలకు ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అప్పగించి.. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి తీసుకున్న రుణం నుంచి కాంట్రాక్టు విలువలో పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు ముట్టజెప్పి, వాటినే కమీషన్ల రూపంలో వసూలు చేసుకోవడానికి ముఖ్య నేతలు రంగం సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి తీసుకున్న రుణాన్ని కాంట్రాక్టు సంస్థలతో కలిసి దోచుకుంటుండటంపై ఇంజినీరింగ్ నిపుణులు, అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంచనాల్లో గోల్మాల్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి ప్రభుత్వం రూ.15 వేల కోట్లు రుణంగా తీసుకుంది. రాజధాని అమరావతిలో 11 ప్రధాన రహదారుల పనులను ఏడీసీఎల్ చేపట్టింది. ప్రధాన రహదారుల్లో మిగిలిపోయిన పనులకు ఈ నెల 4, 9న టెండర్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో టెండర్లు ఖరారు చేసి, పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించనుంది. ఆరు లేన్లు.. ఒక్కో వైపు 50 మీటర్ల వెడల్పు(ఒక్క ఈ–3 రహదారి మాత్రమే ఒక్కో వైపు 60 మీటర్లు వెడల్పు)తో చేపట్టిన ప్రధాన రహదారుల పనుల్లో మిగిలిన పనులకు అంచనా వ్యయాలను ఖరారు చేయడంలో భారీ ఎత్తున గోల్మాల్ జరిగినట్లు ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ప్రధాన రహదారులతోపాటు వరద నీటిని ఒడిసి పట్టడానికి, తాగునీటి సరఫరాకు, మురుగు నీటిని తరలించడానికి, భూగర్భ విద్యుత్ సరఫరా.. పంపిణీ, ఆర్సీసీ డక్ట్.. 220/33 కేవీ, 415 కేవీ విద్యుత్ తీగల ఏర్పాటుకు హెచ్డీపీఈ పైపు లైన్, ఆఫ్టికల్ పైబర్ కేబుల్‌కు, హెచ్‌డీపీ పైపు లైన్, సైకిల్ ట్రాక్, రహదారికి ఇరు వైపులా చెట్లు నాటడం తదితర పనుల్లో ఒక్క విద్యుత్ సరఫరా మినహా తక్కినవన్నీ ఇదే రీతిలో చేపడుతోంది.వాస్తవానికి ఎన్హెచ్ఏఐ.. జీఎస్టీ, నాక్, సీనరేజీ వంటి అన్ని రకాల పన్నులతో కలిపి ఆరు లేన్ జాతీయ రహదారి (సరీ్వసు రోడ్లతో కలిపి) నిర్మాణానికి కిలోమీటరుకు సగటున రూ.20–22 కోట్లు వ్యయం చేస్తోంది. ఈ లెక్కన.. రాజధాని అమరావతిలో ప్రధాన రహదారుల నిర్మాణ వ్యయం అంతకన్నా పెరగడానికి వీల్లేదు. ఎందుకంటే జీఎస్టీ, నాక్, సీనరేజీ వంటి పన్నులను అదనంగా కాంట్రాక్టు సంస్థకు రీయింబర్స్ చేస్తామని ఏడీసీఎల్ నిబంధన పెట్టింది కాబట్టి. ఆ పన్నుల విలువతో భూగర్భ విద్యుత్ సరఫరా వ్యవస్థ, సైకిల్ ట్రాక్ తదితరాలను నిరి్మంచవచ్చునని నిపుణులు చెబుతున్నారు. కానీ గరిష్టంగా రూ.53.88 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్దేశించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు సంస్థలకే పనులు! ప్రధాన రహదారుల్లో మిగిలి పోయిన పనులకు సంబంధించి అంచనాల దశలోనే పలు కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో ముఖ్య నేతలు బేరసారాలు జరిపారనే చర్చ అప్పట్లో సాగింది. నాలుగు సంస్థలు అడిగిన మేరకు కమీషన్లు ఇచ్చేందుకు అంగీకరించడంతో ఆ సంస్థలకే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఏడీసీఎల్ అధికార వర్గాలకు ముఖ్య నేతలు నిర్దేశించినట్లు కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు 11 రహదారుల పనుల టెండర్లలో ఒక్కో టెండర్లో నాలుగింటిలో మూడు సంస్థలు షెడ్యూలు దాఖలు చేసేలా.. కనిష్టంగా 4 నుంచి 5 శాతం అధిక ధరకు కోట్ చేసేలా ఒప్పందం కుదిరినట్లు చెబుతున్నారు. షెడ్యూలు దాఖలుకు తుది గడువు ముగిశాక, ఆరి్థక బిడ్‌ను తెరిచి కనిష్టంగా కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకే పనులు అప్పగించడానికి వేగంగా పావులు కదుపుతున్నారు. -
బాబు పబ్లిసిటీకి వందల కోట్లు..! కొత్త ఏజెన్సీకి టెండర్లు
సాక్షి,విజయవాడ:చంద్రబాబు పబ్లిసిటీ కోసం కొత్త ఏజెన్సీని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వందల కోట్లతో పబ్లిసిటీ చేసుకోవాలని సీఎం చంద్రబాబు డిసైడయ్యారు. దీంతో ప్రచారం తారాస్థాయికి వెళ్లడానికి కొత్త ఏజెన్సీ కావాలని ప్రభుత్వం భావించింది. తాజాగా న్యూస్ అండ్ కమ్యూనికేషన్ ఏజెన్సీ కోసం టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించింది.ఇప్పటికే సమాచార శాఖ ఉండగా మరో పబ్లిసిటీ ఏజెన్సీ ప్రభుత్వం తీసుకురావడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడున్న పబ్లిసిటీ సరిపోకపోవడం వల్లే కొత్త ఏజెన్సీని ఆహ్వానించినట్లు ప్రభుత్వం చెబుతోంది.పాన్ ఇండియా రేంజ్లో పబ్లిసిటీ చెయ్యాలని డిసైడయ్యారు.ఇక నుంచి పబ్లిసిటీ కంటెంట్,ప్రకటనలు అన్ని పత్రికలు,మీడియా,సోషల్ మీడియాకు ప్రభుత్వం ఏజెన్సీ ద్వారానే ఇవ్వనున్నారు. పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చెయ్యడంపై సమాచారశాఖ అధికారులే విస్తుపోతుండడం గమనార్హం. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం చంద్రబాబు పబ్లిసిటీ కోసం ఖర్చు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇదీ చదవండి: ఏపీలో బడా నేతల కాలక్షేపం కబుర్లు -
వైద్య శాఖ కాంట్రాక్టుల్లో వింత నిబంధనలతో దోపిడీకి సిద్ధం
-
ముందు డిజైన్లు..ఆపై టెండర్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3.61 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే డిండి ఎత్తిపోతల పథకం పనులకు చకాచకా అడుగులు పడుతున్నాయి. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీరు తీసుకోవాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత నియోజకవర్గాలైన మునుగోడు, దేవరకొండకు నీరందించే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను చేపట్టేందుకు ఆమోదముద్ర వేసింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకోవడం, రిజర్వాయర్ల భూసేకరణ, పరిహారం పూర్తి చేస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. ఇందుకోసం ఏదుల నుంచి రోజుకు అర టీఎంసీ చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీల నీటిని తీసుకుంటారు. త్వరలోనే గ్లోబల్ టెండర్లుడిండి ఎత్తిపోతల పథకానికి ఏదుల నుంచి నీటిని తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం.. అక్కడి నుంచి ఉల్పర వరకు నీటిని తరలించే పనులను రూ.1,800 కోట్లతో చేపట్టాలని నిర్ణయించింది. వాటికి సంబంధించి త్వరలోనే గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోంది. ఏదుల రిజర్వాయర్ నుంచి 800 మీటర్ల అప్రోచ్‌చానల్, అక్కడి నుంచి 2.525 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ తవ్వి, తొమ్మిది మీటర్ల డయాతో 16 కిలోమీటర్ల టన్నెల్, ఆ తర్వాత 3.050 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ తవ్వుతారు. మొత్తంగా ఏదుల నుంచి 21.575 కిలోమీటర్ల తర్వాత నీరు దుందుభి నదిలోకి చేరి, అక్కడి నుంచి 6.325 కిలోమీటర్ల తర్వాత ఉన్న పోతిరెడ్డిపల్లి చెక్‌డ్యామ్‌కు చేరుతుంది. అయితే అక్కడ చెక్‌డ్యాం స్థానæంలో రబ్బర్ డ్యాం , దానికి 1.5 కిలోమీటర్ల దిగువన ఉల్పర వద్ద బరాజ్‌ను నిర్మిస్తారు. వీటికి సంబంధించిన డిజైన్లపై సాగునీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే వాటిని ఖరారు చేసి, గ్లోబల్ టెండర్లు పిలవనున్నట్టు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. పర్యావరణ అనుమతులు పెండింగ్ పర్యావరణ అనుమతులు లేకుండానే చేపట్టిన డిండి పనులను ఆపేయాలని 2022 డిసెంబర్లో జాతీయ గ్రీన్‌ట్రిబ్యునల్ ఆదేశించింది. అంతేకాదు రూ.92.85 కోట్ల జరిమానా కూడా విధించింది. దీంతో ప్రభుత్వం పర్యావరణ అనుమతులు సాధించే బాధ్యతను ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు (ఈపీటీఆర్ఐ) అప్పగించింది. ఇంతవరకు అనుమతుల వ్యవహారం కొలిక్కి రాలేదు. భూసేకరణ, నిర్వాసితుల సమస్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ పథకానికి డిటైయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేయాలని 2007లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడే వరకు కూడా డీపీఆర్‌లు ప్రభుత్వానికి అందలేదు. చివరకు 2015లో జూన్ 11వ తేదీన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకానికి ఉత్తర్వులు (జీఓ 107) జారీ చేసింది. మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లోని 3.61 లక్షల ఎకరాల్లో ఆయకట్టుకు నీరందించేందుకు రూ.6,194 కోట్లతో ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. అయితే పాలమూరు–రంగారెడ్డి డీపీఆర్‌ను ఆమోదించి, నిధులు కేటాయించి పనులను వేగంగా చేయించిన నాటి ప్రభుత్వం డిండి డీపీఆర్‌ను ఆమోదించలేదు. అయినా కొంత డబ్బు కేటాయించి 2015లో శివన్నగూడెంలో రిజర్వాయర్ల పనులను శంకుస్థాపన చేసి చేపట్టింది. ఉల్పరకు దిగువ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన కాలువ, డిండి ప్రాజెక్టు ఎత్తు పెంపు, అప్రోచ్ చానల్స్, సింగరాజుపల్లి, ఎర్రవల్లి–గోకారం, ఇర్విన్, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్మాణాలకు సుమారు 16,030 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు 12,052 ఎకరాల భూమినే సేకరించారు. భూసేకరణతో నిర్వాసితులు అయ్యే దాదాపు 1,899 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇప్పటివరకు ప్యాకేజీలు కుదరకపోవడంతో నిర్వాసితుల ఆందోళన చేస్తున్నారు. పర్యావరణ అనుమతులు సాధిస్తే అన్ని పనులు వేగిరం అవుతాయి. -
అమరావతిపై కపట ప్రేమ చూపిస్తున్న కూటమి నేతలు
-
కొత్త మెట్రోలకు ఏప్రిల్‌లో టెండర్లు
సాక్షి, హైదరాబాద్: ఫ్యూచర్ సిటీ, శామీర్‌పేట్, మేడ్చల్ మెట్రో మార్గాలకు సంబంధించి వచ్చే ఏప్రిల్‌లో టెండర్లు పిలవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్చిలోగా డీపీఆర్‌లు (సమగ్ర ప్రాజెక్టు నివేదికలు) పూర్తి చేసి, కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్ల నిర్మాణాలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలపై సీఎం మంగళవారం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం–ఫ్యూచర్ సిటీ మెట్రో (40 కి.మీ), జేబీఎస్–శామీర్‌పేట మెట్రో (22 కి.మీ), ప్యారడైజ్–మేడ్చల్ మెట్రో (23 కి.మీ) మార్గాలకు సంబంధించిన భూ సేకరణను వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఎలైన్మెంట్ రూపొందించే సమయంలోనే క్షేత్ర స్థాయిలో సమగ్ర పరిశీలన చేయాలని చెప్పారు. మేడ్చల్ మార్గంలో జాతీయ రహదారిపై ఇప్పటికే ఉన్న మూడు ఫ్లైఓవర్లను దృష్టిలో ఉంచుకుని మెట్రో లైన్ తీసుకెళ్లాలని సూచించారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని సాధ్యమైంతన త్వరగా ప్రారంభించాలని కూడా అధికారులను సీఎం ఆదేశించారు. శామీర్‌పేట్, మేడ్చల్ మెట్రోలు ఒకేచోట ప్రారంభం కావాలి శామీర్‌పేట్, మేడ్చల్ మెట్రోలు ఒకేచోటు నుంచి ప్రారంభమయ్యేలా చూడాలని, అక్కడ అధునాతన వసతులు, భవిష్యత్ అవసరాలకు తగినట్లు భారీ జంక్షన్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆయా ప్రాంతాల వారు ప్రతి పనికి నగరంలోకి రానవసరం లేకుండా అక్కడే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఆ జంక్షన్‌ను అభివృద్ధి చేయాలన్నారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) కింద రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఫ్లాగ్షిష్ కార్యక్రమాల కమిషనర్ శశాంక తదితరులు పాల్గొన్నారు. -
రీజినల్ రింగ్ రోడ్డుకు టెండర్లు..
-
హ్యాపీనెస్ట్ నిర్మాణానికి టెండర్లు
సాక్షి, అమరావతి: అమరావతిలోని నేలపాడులో నిర్మించనున్న హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు చంద్రబాబు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టం అమల్లో ఉన్న సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు టెండర్ డాక్యుమెంట్‌ను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపింది. కానీ అప్పటి నుంచి టెండర్లను ఆహ్వానించకుండా.. జ్యుడీషియల్ ప్రివ్యూ రద్దు చేసిన తర్వాత ఇప్పుడు సీఆర్డీఏ ద్వారా టెండర్లను ఆహ్వానించడం గమనార్హం. అలాగే ఈ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.720 కోట్ల నుంచి రూ.930 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం ఇటీవల పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇప్పుడు సీఆర్డీఏ ద్వారా ఈ ప్రాజెక్టుకు రూ.818.03 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ కాంట్రాక్టు విధానంలో టెండర్లను ఆహ్వానించింది. ప్రాజెక్టు పూర్తికి 24 నెలల గడువుఈ ప్రాజెక్టులో భాగంగా జీ+18 అంతస్తులతో 12 టవర్లలో 1,200 అపార్ట్మెంట్ యూనిట్లు నిర్మించాలని టెండర్ డాక్యుమెంట్లో సీఆర్డీఏ పేర్కొంది. షేర్ వాల్ టెక్నాలజీ వినియోగం ద్వారా హ్యాపీనెస్ట్ రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. అంతర్గత–బాహ్య విద్యుత్ పనులు, ప్లంబింగ్, శానిటరీ, అగ్నిమాపక పనులు, లిఫ్ట్‌లు, ల్యాండ్ స్కేపింగ్ తదితర పనులు చేపట్టాలని పేర్కొంది. ఓపెన్ టెండర్ విధానంలో టెండర్లను ఆహ్వానించనున్నట్లు సీఆర్డీఏ తెలిపింది. టెండర్ దక్కించుకున్న సమయం నుంచి 24 నెలల్లోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ప్లంబింగ్, శానిటరీ, ల్యాండ్‌స్కేప్, ఫైర్ ఫైటింగ్, లిఫ్ట్‌లు, సెక్యూరిటీ వ్యవస్థ, ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ తదితరాలను అంశాల వారీగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే పనులు పూర్తి చేసినప్పటి నుంచి మూడేళ్ల సమయాన్ని డిఫెక్ట్ లయబిలిటీగా సీఆర్డీఏ పేర్కొంది.10% మొబిలైజేషన్ అడ్వాన్స్..కాంట్రాక్టు వ్యయంలో 10శాతం మేర మొబిౖలెజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం పనులు దక్కించుకున్న సంస్థలకు ముందుగానే పనుల విలువలో పది శాతం మేర మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వనున్నట్లు టెండర్లో పేర్కొంది. అంచనావ్యయానికి ఐదు శాతంలోపు కోట్ చేసిన టెండర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. అంతకన్నా ఎక్కువ కోట్ చేసిన టెండర్లను తిరస్కరించనున్నట్లు వెల్లడించింది. టెండర్ల దాఖలుకు వచ్చే నెల 8 వరకు గడువు ఇచ్చింది. 8వ తేదీ సాయంత్రం సాంకేతిక బిడ్‌ను తెరవనున్నట్లు ప్రకటించింది. జనవరి 10న ఆర్థిక బిడ్‌ను తెరవనున్నట్లు తెలిపింది. -
ఉత్తర ‘రింగు’ ఇంకాస్త ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తరభాగానికి టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నా, నిర్వాసితులకు పరిహారం అందించే విషయంలో మాత్రం స్పష్టత రావటం లేదు. టెండర్లు పిలిచే నాటికే పరిహారం అందిస్తారని ఆశించినా, అందుకు కనీసం మరో రెండుమూడు నెలల సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.పరిహారం అందించిన తర్వాతే భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ జాతీయ రహదారి ప్రాజెక్టులపై ఇటీవల ఎన్హెచ్ఏఐ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి స్పష్టంగా ఆదేశించారు. కానీ, ప్రస్తుతం ఎన్హెచ్ఏఐ చేపట్టే ప్రాజెక్టుల్లో అత్యంత కీలకమైన ట్రిపుల్ ఆర్ పరిహారం విషయంలో మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతోంది. జాప్యమెందుకు? ట్రిపుల్ఆర్ ఉత్తర భాగాన్ని ఎన్హెచ్ఏఐ చేపడు తున్న విషయం తెలిసిందే. ఈ భాగానికి టెండర్లు పిలిచేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటీవలే కన్సల్టెన్సీ సంస్థ టెండర్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేసి ఎన్హెచ్ఏఐకి సమర్పించింది. డిసెంబరు చివరికల్లా టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబరు చివరి నాటికి లేదా జనవరి మొదటి వారంలో టెండర్లు పిలుస్తారని ఓ సందర్భంలో మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఉత్తర భాగానికి అటవీ అనుమతులు కూడా వచ్చాయని ఆయన అధికారికంగా వెల్లడించారు. కానీ, ఇప్పటి వరకు పర్యావరణ అనుమతులు మాత్రం రాలేదు. అవి రాకుండా అవార్డులు పాస్ చేసే వీలు లేదని అధికారులు చెబుతున్నారు. పర్యావరణ అనుమతులు రావాలంటే, ఆ రోడ్డుకు నంబరు కేటాయించాల్సి ఉంటుంది. ట్రిపుల్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే కేటగిరీలో నిర్మిస్తున్నందున దానికి ఎక్స్‌ప్రెస్ వే నంబరు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు నంబరు కేటాయించలేదు. ఉన్నతస్థాయి కమిటీ భేటీ అయితేనే... దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలకు నంబర్లు కేటాయించాలంటే నీతి ఆయోగ్, కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ అనుమతివ్వాల్సి ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు ఆ కమిటీ ఇంకా భేటీ కాలేదు. దాదాపు ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్న రోడ్లన్నింటికి సంబంధించి ఒకేసారి నంబర్లు కేటాయించే కసరత్తు చేస్తున్నందున, అన్నింటికి కలిపి ఒకేసారి సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. ఈ నంబరు కేటాయింపులో జరుగుతున్న జాప్యం.. ఇప్పుడు పరిహారం చెల్లింపులో ఆలస్యానికి కారణమైంది. ప్రస్తుతం అటవీ శాఖకు సంబంధించి ప్రాథమిక అనుమతి లభించింది. సేకరించే అటవీ భూముల్లో పనులు చేపట్టేందుకు ఇది అనుమతిస్తుంది. దీని కాలపరిమితి ఏడాది మాత్రమే. ఈలోపు అటవీశాఖకు పరిహారం, ప్రత్యామ్నాయ భూకేటాయింపు, అక్కడ చెట్ల పెంపకానికి అయ్యే వ్యయంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కసరత్తు జరిగితేనే పూర్తిస్థాయి అనుమతులు వస్తాయి. అటవీశాఖ పూర్తి అనుమతులు, పర్యావరణ అనుమతులు రాకుండా కూడా టెండర్లు పిలిచుకునే వీలుంటుంది. కానీ, టెండర్లు తెరవాలంటే మాత్రం ఆ అనుమతులు వచ్చి ఉండాలి. ఇక పరిహారం మొత్తాన్ని రైతుల ఖాతాల్లో డిపాజిట్ చేయాలంటే మాత్రం విధిగా పర్యావరణ అనుమతులు వచ్చి ఉండాలి. దాని విషయంలో జాప్యం పరిహారం అందకుండా చేస్తోంది. ఇప్పటికిప్పుడు రోడ్డు నంబరు కేటాయించినా, ఆ తర్వాత పర్యావరణ అనుమతుల జారీ కసరత్తు పూర్తయ్యేందుకు కనీసం రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వెరసి మరో రెండుమూడు నెలల సమయం పట్టే వీలుందని వారు చెబుతున్నారు. -
విశాఖ–ఖరగ్‌పూర్ మధ్య హైవే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం– ఖరగ్‌పూర్ (పశ్చిమ బెంగాల్) మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను అనుసంధానిస్తూ ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేను నిర్మించనున్నారు. దీనికోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) టెండర్లు పిలిచింది. కేంద్ర ప్రభుత్వం గతి శక్తి ప్రాజెక్ట్‌లో భాగంగా దీనిని నిర్మించనుంది. గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రధాన అంశాలివీ⇒ తూర్పు, ఈశాన్య రాష్ట్రాల మధ్య సరుకు రవాణాను వేగవంతం చేయడం ద్వారా లాజిస్టిక్ రంగ అభివృద్ధి కోసం ఈ హైవేను నిర్మించనున్నారు. ⇒ విశాఖపట్నం– ఖరగ్‌పూర్ మధ్య 783 కి.మీ. మేర ఆరు లేన్లుగా దీనిని నిర్మిస్తారు.⇒ నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం నుంచి ఖరగ్‌పూర్‌కు 8 గంటల్లోనే చేరుకునే అవకాశం.⇒ విశాఖపట్నం, భావనపాడు, గోపాల్పూర్, కేంద్ర పారా పోర్టులను ఈ హైవే అనుసంధానిస్తుంది.⇒ విశాఖపట్నం నుంచి ఖుర్దా రోడ్ ( ఒడిశా) వరకు ఒక ప్యాకేజీ, ఖుర్దా రోడ్ నుంచి ఖరగ్‌పూర్ వరకు మరో ప్యాకేజీ కింద ఈ ప్రాజెక్ట్ చేపడతారు.⇒ డీపీఆర్ రూపొందించేందుకు టెండర్లు పిలవగా.. 10 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. డిసెంబర్ చివరి వారానికి ఎన్హెచ్ఏఐ కన్సల్టెన్సీని ఖరారు చేయనుంది. ⇒ 2025 జూన్ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తారు.⇒ ఏడాదిన్నరలో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తి చేయాలన్నది ఎన్హెచ్ఏఐ లక్ష్యం. -
రవాణా కాంట్రాక్టుల్లో ‘మనీ ట్రాన్స్ఫర్’!
సాక్షి, అమరావతి: పౌరసరఫరాల సంస్థలో స్టేజ్–1 ట్రాన్స్‌పోర్టు టెండర్లలో భారీ అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నట్టు విమర్శలొస్తున్నాయి. ఇటీవల టెక్నికల్ బిడ్‌లో క్వాలిఫై అయినట్టు ప్రకటించిన కాంట్రాక్టర్లను మళ్లీ డిస్క్వాలిఫై చేయడం పెను దుమారం రేపింది. ఓ మహిళా మేనేజర్ నేతృత్వంలో ఈ కాంట్రాక్టులను అధికార కూటమి నేతల అనుంగులకు అప్పజెప్పేందుకు నిబంధనలను సైతం తుంగలో తొక్కేస్తున్నారు. పౌర సరఫరాల సంస్థ బఫర్ గోడౌన్ల నుంచి మండల గోడౌన్లకు నిత్యావసరాలు రవాణా చేసేందుకు పిలిచిన ఈ టెండర్లలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్టు సమాచారం. ఈ మేనేజర్, అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు కలిసి టెండర్ ప్రక్రియను పూర్తిగా పక్కదారి పట్టించి, వీలైనన్ని జిల్లాల్లో నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ టెండర్‌తోనే అనుకూలమైన వారికి కాంట్రాక్టు అప్పజెప్పేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ మంత్రి, వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తొలుత క్వాలిఫై చేసిన ట్రాన్స్ ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ కంపెనీని తర్వాత డిస్క్వాలిఫై చేసినట్లుగా ఉద్యోగులు చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట ట్రాన్స్ ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ కంపెనీ కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అనంతపురంలో స్టేజ్–1 ట్రాన్స్‌పోర్టు టెండర్లు వేసింది. రోజులు గడిచినా టెక్నికల్ బిడ్‌లో ఎటువంటి రిమార్క్ చూపించని అధికారులు ఫైనాన్షియల్ బిడ్‌కు వచ్చేసరికి సంస్థ నిర్వహకులపై పోలీసు కేసులు ఉన్నాయంటూ ఊహాజనిత సాకును చూపించి తొలుత కర్నూలు జిల్లాలో డిస్క్వాలిఫై చేశారు. తర్వాత మిగిలిన జిల్లాల్లోనూ డిస్క్వాలిఫై చేశారు. దీంతో ఆ సంస్థ కోర్టును ఆశ్రయించి, టెండర్లలో పాల్గొనేలా ఆర్డరు తెచ్చుకొంది.రీ టెండర్‌కు ఎందుకు వెళ్లట్లేదు?నిబంధనల ప్రకారం సింగిల్ టెండర్ వస్తే రీ టెండర్‌కు వెళ్లాలి. టెండర్లలో టెక్నికల్ బిడ్‌లో అర్హత సాధించిన సంస్థలు ఫైనాన్షియల్ బిడ్‌కు వెళ్తాయి. సరైన పత్రాలు, అర్హతలు లేని టెండర్లు డిస్క్వాలిఫై అవుతాయి. ఇక్కడే అధికారులు చాకచక్యంగా చాలా జిల్లాల్లో ఫైనాన్షియల్ బిడ్‌కు అర్హత పొందిన టెండర్లు ఒక్కటే (సింగిల్) ఉండేలా చక్రం తిప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రీటెండర్‌కు వెళ్లకుండా టెక్నికల్ బిడ్‌లో డిస్క్వాలిఫై అయిన టెండర్లను కూడా కలిపి చూపించి, ఎక్కువ టెండర్లు వచ్చినట్టు మాయ చేస్తున్నారు. పోటీ ఉంటే షెడ్యూల్ ఆఫ్ రేట్ల (ఎస్‌వోఆర్) కంటే తక్కువ రేట్లకు కోట్ చేసే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ బిడ్‌లో సింగిల్ టెండర్ ఉంటే అసలు పోటీనే ఉండదు. ఫలితంగా కాంట్రాక్టరు అధిక రేట్లను కోట్ చేస్తారు. ఇప్పుడు స్టేజ్–1 టెండర్లలోనూ ఎస్ఓఆర్కు మించి 20 నుంచి 25 శాతం అధికంగా రేట్లు కోట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సింగిల్ టెండర్లు ఖరారైతే పౌరసరఫరాల సంస్థకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీన్ని పట్టించుకోని ఆ మేనేజర్.. సింగిల్ టెండర్లను ఒకే చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఓ మంత్రి, ఎమ్మెల్యే ఒత్తిడితో ట్రాన్స్ ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ టెండర్లు దాఖలు చేసిన నాలుగు జిల్లాలతో పాటు కర్నూలు, వైఎస్సార్‌లో జిల్లాల టెండర్లను టీడీపీకి చెందిన ఓ కాంట్రాక్టర్‌కు అప్పజెప్పేందుకు సర్వం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఈ ట్రాన్స్‌పోర్టు సంస్థకు సరైన ఫర్మ్ అంటూ లేదు. అసలు యజమాని పేరుపై ఒక్క వాహనం కూడా లేదు.ఆమెదంతా క్విడ్ ప్రోకోనే..ఈ టెండర్ల ప్రక్రియలో మహిళా మేనేజర్‌తో పాటు ఇటీవల బదిలీపై ప్రధాన కార్యాలయానికి వచ్చిన గ్రేడ్–1 ఉద్యోగి కీలకంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఆ ఉద్యోగికి టెండర్లతో సంబంధం లేకపోయినా, మేనేజర్‌కు సహకరిస్తూ ముడుపులు మూటగడుతున్నట్టు విమర్శలొస్తున్నాయి. ఇలా సింగిల్ టెండర్లను ఖరారు చేయించేందుకు రూ.25 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి తోడు ఆ మహిళా మేనేజర్ కోనసీమ జిల్లాకు డీఎంగా వెళ్లాలని అనుకున్నప్పటికీ, అక్కడ ఆమెపై ఏసీబీకి ఫిర్యాదులు ఉండటంతో.. తూర్పుగోదావరి జిల్లాకు డీఎంగా వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు తూర్పు గోదావరి జిల్లాలో మునుపటి స్టేజ్–1 టెండర్ కాంట్రాక్టర్, తాడేపల్లిగూడేనికి చెందిన కూటమి నాయకుడొకరు సహకరిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు ప్రతిగా ఆయనకు తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో సింగిల్ టెండర్ ద్వారా రవాణా కాంట్రాక్టును అప్పజెప్పేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. వీటితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, అన్నమయ్య, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనూ సింగిల్ టెండర్లనే ఎంపిక చేస్తున్నట్టు తెలిసింది. -
రాజధాని నిర్మాణానికి కొత్తగా టెండర్లు
సాక్షి, అమరావతి: రాజధాని అభివృద్ధి పనులకు అడ్డంకిగా ఉన్న పాత టెండర్లను రద్దు చేసి త్వరలో కొత్తగా టెండర్లను పిలుస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. మూడేళ్లలో అమరావతి అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం సీఎం అధ్యక్షతన 39వ సీఆర్డీఏ సమావేశం అనంతరం ఆయన వివరాలను మీడియాకు వివరించారు. అమరావతి అభివృద్ధి పనుల కోసం 2014–19 మధ్య రూ.41 వేల కోట్ల విలువైన టెండర్లను పిలిచి, రూ.38 వేల కోట్ల పనులను ప్రారంభించినట్టు తెలిపారు. వీటిలో హైకోర్టు, అసెంబ్లీ భవనాలు, రహదారులు, హైకోర్టు జడ్జిలు, మంత్రులు, అధికారుల వసతి గృహాల నిర్మాణం చేపట్టామన్నారు. గత ప్రభుత్వం ఈ పనులను కొనసాగించేందుకు శ్రద్ధ చూపలేదన్నారు. పాత టెండర్ల సమస్యలను పరిష్కరించి నూతన టెండర్లకు విధి విధానాల రూపకల్పనకు ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ 23 పాయింట్లతో గతనెలలో నివేదిక ఇవ్వగా, ఈ సమావేశంలో దానిని ఆమోదించినట్టు చెప్పారు. దాని ప్రకారం హైకోర్టు, అసెంబ్లీ భవన నిర్మాణానికి జనవరిలోగా, మిగతా పనులకు వచ్చేనెల 31 లోపు టెండర్లు పిలుస్తామని, మూడేళ్లలో వీటిని పూర్తి చేస్తామని వివరించారు. వరద నివారణ పనులుఅమరావతికి రూ.15 వేల కోట్లు ఇచ్చేందుక ప్రపంచ బ్యాంకు అంగీకరించిందని, అయితే నిబంధనల మేరకు వరద నివారణ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరిందని తెలిపారు. అందుకనుగుణంగా అమరావతిలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో వరద నివారణ పనులను ఆమోదించామన్నారు. కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్‌ను విస్తరిస్తామని చెప్పారు. నీరుకొండ వద్ద 0.04 టీఎంసీలు, కృష్ణాయపాలెం వద్ద 0.01 టీఎంసీలు, శాఖమూరు వద్ద 0.01 టీఎంసీల స్టోరేజి సామర్ధ్యంతో రిజర్వాయర్లు నిర్మిస్తామన్నారు. ఉండవల్లి వద్ద 7,350 క్యూసెక్కుల పంపింగ్ స్టేషన్ నిర్మిస్తామని చెప్పారు. గతంలో నిర్ణయించిన ప్రకారం ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం త్వరలో చేపడతామని చెప్పారు. -
ఇసుకపై మాయోపాయం
సాక్షి, అమరావతి: ఇసుక ఉచితం అంటూనే డబ్బు వసూలు చేస్తూ జనాన్ని మోసం చేస్తున్న టీడీపీ ప్రభుత్వం తాజాగా ప్రైవేటు ఏజెన్సీలకు ఇసుక తవ్వకాలు అప్పగించే విషయంలోనూ నాటకాలకు తెరలేపింది. ప్రైవేటు వ్యక్తులకు ఇసుక తవ్వకాలను అప్పగించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు సోమవారం జరిగిన గనుల శాఖ సమీక్షలో సూచించారు. కానీ ఇప్పటికే 80కిపైగా ఇసుక రీచ్‌లను ప్రైవేటు ఏజెన్సీల ముసుగులో తమ పార్టీ మద్దతుదారులకు కట్టబెట్టేశారు. రాష్ట్రంలోని 108 ఇసుక రీచ్‌లను దసరా పండుగ సమయంలో ప్రైవేటు వారికి అప్పగించేందుకు గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలవారీగా ఇసుక కమిటీ ద్వారా షార్ట్ టెండర్లు పిలిచారు. టెండర్లు దాఖలు చేయడానికి కేవలం రెండు రోజులే సమయం ఇచ్చి, తమ పార్టీకి చెందిన వారు, తమకు అనుకూలమైన వారికే ఇసుక కాంట్రాక్టులు అప్పగించేలా జిల్లా కలెక్టర్ల ద్వారా టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. ఆఖరి నిమిషంలో తెలుసుకుని టెండర్లు దాఖలు చేయడానికి వచ్చిన వారిని టీడీపీ ఎమ్మెల్యేల అనుచరులు బెదిరించి వెనక్కు పంపారు. దాదాపు 80 రీచ్‌లను ఎమ్మెల్యేలకు చెప్పిన వారికి అప్పగించేయగా, మిగిలిన రీచ్‌లకు సైతం అనుకూలమైన వారిని ఖరారు చేశారు. అప్పగించిన రీచ్‌ల్లో ఈ నెల 16వ తేదీ నుంచే ఇసుక తవ్వకాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 108 రీచ్‌ల్లో ఈ నెలాఖరు నుంచి ఇసుక తవ్వకాలు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉల్లంఘనలు కప్పిపుచ్చేందుకే.. ప్రైవేటు వారికి అప్పగించే టెండర్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేలా ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు చెప్పడం ఉల్లంఘనలను కప్పిపుచ్చేందుకేనని స్పష్టమవుతోంది. మరో వైపు ఇసుక వ్యవహారంలో ఎమ్మెల్యేలు ఎవరూ జోక్యం చేసుకోవద్దని కూడా సూక్తులు చెబుతున్నారు. ఇప్పటికే కాంట్రాక్టులు అయిన వారికి కట్టబెట్టేసి, వాటిల్లో తవ్వకాలు కూడా మొదలు పెట్టి.. బయటకు మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై రాష్ట్రంలో చర్చ నడుస్తోంది. ఇసుక రీచ్‌లను ప్రైవేటు వారికి అప్పగించే విషయం ఇంకా చర్చల దశలో ఉందని సీఎం చెబుతుండటం చూస్తుంటే, గ్రీన్ ట్రిబ్యునల్‌ను తప్పుదోవ పట్టించేందుకేనని తెలుస్తోంది. వర్షాకాలం సీజన్లో ఇసుక రీచ్‌లలో తవ్వకాలు చేపట్టకూడదు. సాధారణంగా నవంబర్ నెలాఖరు వరకు రీచ్‌లు ప్రారంభించకూడదు. కానీ అక్టోబర్ 7వ తేదీనే పలు జిల్లాల్లో టెండర్లు పిలిచి కాంట్రాక్టులను ఖరారు చేశారు. 16వ తేదీ నుంచి తవ్వకాలు కూడా ప్రారంభించారు. కానీ ఇదంతా గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధం కావడంతో, పైకి మాత్రం ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే విషయాన్ని ఇంకా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకపక్క రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు సాగించి అడ్డగోలుగా అమ్ముకుంటూ.. పైకి మాత్రం అదేమీ లేదనేలా సీఎం స్థాయి వ్యక్తి నమ్మబలుకుతుండడం విస్తుగొలుపుతోంది. రీచ్‌లు ఇంకా ప్రారంభం కాలేదని చిత్రీకరించే క్రమంలోనే సీఎం ఇలా మాట్లాడుతున్నారని తేటతెల్లమవుతోంది. -
తమకు దక్కలేదని.. ఇసుక టెండర్లే రద్దు
సాక్షి టాస్క్‌ఫోర్స్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక మంత్రి ఇసుక రీచ్‌ల విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించారు. జిల్లాలో గురువారం నాలుగు ఓపెన్ ఇసుక రీచ్‌లకు టెండర్లు తెరిచారు. రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువవడంతో కలెక్టర్ లాటరీ విధానంలో నలుగురికి అనుమతులు ఇచ్చారు. మెట్ట నియోజకవర్గంలో ఒక రీచ్ దక్కిన కాంట్రాక్టర్‌పై మంత్రి వీరంగం వేశారు. ఆ కాంట్రాక్టర్‌ను పిలిపించుకుని.. నా ఇలాఖాలో ఎలా టెండర్ వేస్తావంటూ బూతులు తిట్టారు. తోటి ఎమ్మెల్యేలతో కలిసి ఏకంగా ఇసుక టెండర్లనే రద్దుచేయించారు. జరిగింది ఇలా.. జిల్లాలోని పెన్నానదిలో నాలుగుచోట్ల ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇహ్వాది. మినగల్లు, పడమటి కంభంపాడు, పల్లిపాడు, విరువూరుల్లో ఓపెన్ రీచ్‌ల ద్వారా 2.86 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నెల ఏడో తేదీన టెండర్లు ఆహ్వానించారు. ఆ రీచ్‌లకు 23 మంది కాంట్రాక్టర్లు 43 దరఖాస్తులు దాఖలు చేశారు. వీటిలో ఒకటి జీఎస్టీ సక్రమంగా లేకపోవడంతో రద్దయింది. మిగిలిన దరఖాస్తులు అర్హత సాధించడంతో కలెక్టర్ ఆనంద్ లాటరీ విధానంలో నలుగురు కాంట్రాక్టర్లకు నాలుగు రీచ్‌లు కేటాయించారు. రీచ్‌లను పంచుకునేందుకు.. నాలుగు ఓపెన్ రీచ్‌లను పంచుకునేందుకు ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు తమ షాడోలతో టెండర్లు దాఖలు చేయించారు. టెండర్ల ప్రక్రియను నామమాత్రం చేసి తమ షాడోలకు అప్పగించేందుకు పెద్ద ఎత్తున రాజకీయ ఒత్తిళ్లు తెచ్చారు. నదుల్లో ఇసుక తవ్వకాలు జరిపించేందుకు మెట్రిక్ టన్నుకు గతంలో రూ.90–100 చొప్పున చెల్లించారు. ఇప్పుడు అదే ధరతో టెండర్లు ఆహ్వానించినా.. తమ్ముళ్లు మాత్రం రీచ్‌ల్లోకి ఎంట్రీ అయితే చాలన్నట్లుగా గిట్టుబాటు చూడకుండానే టన్నుకు రూ.36 మాత్రమే కోట్ చేశారు. అంత తక్కువ ధరకే కేటాయిస్తే గిట్టుబాటు కాదని, అక్రమ రవాణాను ప్రోత్సహించినట్లే అవుతుందని భావించి టన్నుకు రూ.114.90 వంతున నిర్ణయించిన కలెక్టర్ లాటరీతో ఒక్కో రీచ్‌కు ముగ్గురిని ఎంపికచేసి ప్రథమస్థానంలో ఉన్నవారికి రీచ్ కేటాయించారు. మరో ఇద్దరిని రిజర్వులో ఉంచారు. తమ అనుచరులకు టెండర్లు దక్కలేదని ఆ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు టెండర్ల ప్రక్రియ జరిగినప్పుడు లాటరీ విధానంలో ఎలా ఎంపిక చేస్తారంటూ తీవ్రంగా ఒత్తిడి తెచ్చి ఏకంగా టెండర్లనే రద్దుచేయించారు. నా ఇలాఖాలోకి వస్తావా.. తాట వలిచేస్తా.. లాటరీ విధానంలో ఇసుక రీచ్ దక్కించుకున్న ఒక కాంట్రాక్టర్‌పై మెట్ట ప్రాంతానికి చెందిన ఒక మంత్రి చిందులు తొక్కారు. తన నియోజకవర్గంలో ఉన్న ఇసుక రీచ్‌కు తన అనుమతి లేకుండా టెండర్ ఎలా దాఖలు చేస్తావంటూ గురువారం రాత్రి బండబూతులతో రెచి్చపోయారు. ‘నా ఇలాఖాలోకి వచ్చి ఇసుక రీచ్‌కు టెండరు వేస్తావా.. నీ తాట తీస్తా..’ అంటూ మంత్రి కన్నెర్ర చేయడంతో వణికిపోయిన కాంట్రాక్టర్ తాను రీచ్ నుంచి తప్పుకుంటానని వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. -
వీళ్ళ దోపిడీకి నిదర్శనం.. లిక్కర్ టెండర్లపై వైఎస్ జగన్ సంచలన నిజాలు
-
లిక్కర్ పాలసీ గొప్పదే అయితే.. బెదిరింపులు ఎందుకు ?
-
సిండికేట్ కైవశం!
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేటే పైచేయి సాధించింది. ప్రైవేటు మద్యం దుకాణాలకు లైసెన్సుల ప్రక్రియను ఆ ‘పచ్చ’ముఠా పూర్తిగా హైజాక్ చేసేసింది. ప్రభుత్వ ముఖ్య నేత పన్నాగం.. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టెండర్ల వైపు ఇతరులెవ్వరూ కన్నెత్తి చూడకుండా ఎప్పటికప్పుడు వారిని అడుగడుగునా అడ్డుకుంటూ హడలెత్తించారు. తద్వారా.. రాష్ట్రంలో మద్యం వ్యాపారం ద్వారా భారీ దోపిడీకి మొదటి అంకాన్ని అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తిచేశారు. దీంతో రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం 87,116 దరఖాస్తులు రాగా.. వాటిలో దాదాపు 99 శాతం టీడీపీ మద్యం సిండికేట్‌వే. సాధారణ వ్యాపారులు దరఖాస్తులు దాఖలు చేయకుండా.. అదే సమయంలో తమలో తామే పోటీపడినట్లు బిల్డప్ ఇస్తూ మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియను ఏకపక్షంగా పూర్తిచేశారు. ఇక లాటరీ ద్వారా టీడీపీ సిండికేట్ ఏకపక్షంగా మొత్తం 3,396 దుకాణాలను దక్కించుకోవడం.. ఆ తర్వాత యథేచ్ఛగా మద్యం ఏరులను పారిస్తూ భారీ దోపిడీకి తెగబడటమే తరువాయి.టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల దందా..2014–19 కంటే రెట్టింపు స్థాయిలో మద్యం వ్యాపారం ద్వారా దోపిడీయే లక్ష్యంగా అధికార టీడీపీ కూటమి మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియను శాసించింది. ఎందుకంటే ఏకంగా ముఖ్యనేతే ఇందుకు పచ్చజెండా ఊపడంతో ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డూ అదుపులేకుండా చెలరేగిపోయారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు టీడీపీ మద్యం సిండికేట్‌ను ఏర్పాటుచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినవారు తప్ప ఇతరులెవరూ దరఖాస్తులు చేయడానికి వీల్లేదని హెచ్చరికలు జారీచేశారు. కాదని ఎవరైనా దరఖాస్తు చేసినా వారికి మద్యం దుకాణాల ఏర్పాటుకు ఎవరూ షాపులు అద్దెకు ఇవ్వకూడదని బహిరంగంగానే ప్రకటించారు. ఇక ఇతరులు తమ సొంత దుకాణాల్లో ఏర్పాటుచేసుకుంటే ఎక్సైజ్ శాఖ అధికారులతో తరచూ తనిఖీలు, దాడులతో వేధిస్తామని అల్టిమేటం జారీచేశారు. అయినా కొందరు దరఖాస్తులు దాఖలు చేసేందుకు ప్రయత్నించగా టీడీపీ నేతలు, కార్యకర్తలు వారిపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడి బెదరగొట్టారు. దీంతో అసలు టెండర్లు దాఖలు చేసేందుకు సాధారణ వ్యాపారులెవరూ సాహసించలేదు. నిజానికి.. టెండర్ల ప్రక్రియలో మొదటి వారం రోజులు ఒక్కో దుకాణానికి సగటున 10 కూడా దరఖాస్తులు రాలేదు. దీంతో టీడీపీ సిండికేట్ వ్యవహారం బహిరంగ దందాగా మారింది. ఆ తర్వాత ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రభుత్వ ముఖ్యనేత కొత్త ఎత్తుగడ వేశారు. దరఖాస్తుల సంఖ్య కొంత పెంచాలని.. కానీ, అవి కూడా టీడీపీ సిండికేట్ సభ్యులవే ఉండేలా చూడాలన్నారు. తద్వారా ఒక్కో మద్యం దరఖాస్తుకు రూ.2 లక్షల వరకు నాన్ రిఫండబుల్ డిపాజిట్ భరించాలన్నారు. ఎలాగూ మద్యం దందా ద్వారా విచ్చలవిడి దోపిడీకి పచ్చజెండా ఊపాం కదా అని అసలు లోగుట్టు చెప్పారు. ఫలితంగా.. టీడీపీ సిండకేట్ సభ్యులే ఒక్కొక్కరు వేర్వేరు పేర్లతో దరఖాస్తులు దాఖలు చేశారు.దాచినా దాగని దందా..ఇక టీడీపీ మద్యం సిండికేట్ దందాకు ఎంతగా కనికట్టు చేయాలని చూసినా కుదరలేదు. తెలంగాణతో పోల్చిచూస్తే రాష్ట్రంలో ఈ దరఖాస్తుల ప్రక్రియ ఎంత ఏకపక్షంగా సాగిందన్నది స్పష్టమవుతోంది. విస్తీర్ణపరంగా ఆంధ్రప్రదేశ్ కంటే చిన్నదైన తెలంగాణలో మద్యం దుకాణాల సంఖ్య కూడా తక్కువే. తెలంగాణలో గత ఏడాది మొత్తం 2,620 మద్యం దుకాణాలకు టెండర్లు పిలవగాఏకంగా 1.50 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అంటే.. ఒక్కో మద్యం దుకాణానికి సగటున 57 దరఖాస్తులు దాఖలయ్యాయి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో అంతేకంటే అధికంగా 3,396 మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తులు పిలిచారు. కానీ, దరఖాస్తులు మాత్రం కేవలం 87,116 మాత్రమే రావడం గమనార్హం.అంటే సగటున ఒక మద్యం దుకాణానికి 25 మాత్రమే వచ్చాయి. చివరికి..ఆ దరఖాస్తులుకూడా టీడీపీ సిండికేట్‌వే. ‘బెల్టు’లూ బార్లా..ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో పంచాయతీలో రెండు నుంచి ఆరు వరకు బెల్టుషాపులను ఏర్పాటుచేసేందుకు కసరత్తు జరుగుతోంది. పట్టణాల్లో వీటి సంఖ్య మరింత పెరగనుంది. ఇప్పటికే గత టీడీపీ హయాంలోని బెల్టు షాపుల నిర్వాహకులతో సిండికేట్ సభ్యులు మంతనాలు మొదలుపెట్టారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బలంగా ఉన్న మద్యం సిండికేట్లే ఇప్పుడూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. చాలాచోట్ల ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు ఈ సిండికేట్లను వెనకుండి నడిపిస్తున్నారు. ఒకవేళ లాటరీలో బయటివారికి షాపులు దక్కినా వారి వ్యాపారం సజావుగా సాగాలంటే తమ సిండికేట్లలో కలవాల్సిందేనని సంకేతాలిస్తున్నారు. ఇక ఒక్కో బెల్టుషాపు ఏర్పాటుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు డిపాజిట్టు చెల్లించాలని చెబుతున్నట్లు తెలిసింది. డిపాజిట్ చేసిన వారికే తమ షాపుల పరిధిలో బెల్టుషాపు ఏర్పాటుకు అనుమతించి అందుకు అవసరమైన సరుకు ఇస్తామంటున్నారు. లేనిపక్షంలో దాడులు చేయించి కేసులు పెట్టిస్తామని హెచ్చరిస్తున్నట్టు సమాచారం. కాగా.. షాపుల నిర్వహణ తగ్గించుకునేందుకే సిండికేట్లు బెల్టుషాపుల ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక్కో మద్యం షాపు నిర్వహణకు నెలనెలా అన్ని రకాల ఖర్చులకు లక్షకు పైగానే వ్యయమవుతుందని వారి అంచనా. ఈ భారాన్ని తగ్గించుకునేందుకే వారు ‘బెల్టు’ వైపు మొగ్గుచూపుతున్నారు.చివరిరోజూ అరాచకమే..టెండర్ల చివరిరోజైన శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బెదిరింపుల పర్వం యథేచ్ఛగా కొనసాగింది. టెండరు కేంద్రాల వద్ద సినీఫక్కీ మాదిరిగా ఎమ్మెల్యేలు, మంత్రుల అనుచరులు మాటువేశారు. ఉదయం నుంచి సాయంత్రం గడువు ముగిసే వరకూ అడుగడుగునా నిఘా ఏర్పాటుచేశారు. వేరే వ్యక్తి ఎవరైనా ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లినా.. టెండరు వేసేందుకు దరఖాస్తు తీసుకున్నా.. క్షణాల్లో వారిపై బెదిరింపులకు పాల్పడేలా మందీమార్బలాన్ని మోహరించారు. ‘ఏం మిస్టర్.. ఎక్సైజ్ ఆఫీస్‌కి వెళ్లావట. దరఖాస్తు చేద్దామనా? అప్లై చేసి చూడు.. మా వాళ్లను కాదని టెండరు వేస్తే తాటతీస్తా’.. అంటూ కృష్ణాజిల్లాలోని ఓ ఎమ్మెల్యే మద్యం షాపు దరఖాస్తు కోసం వెళ్లిన వ్యక్తిని బెదిరించారంటే అధికార పార్టీ సిండికేట్ల అరాచకం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. అలాగే.. ఇదే జిల్లా గన్నవరం, గుడివాడ, పామర్రు నియోజకవర్గాల్లో గతంలో షాపులు నిర్వహించుకున్న వారు లేదా స్థానికులు లేదా ఇతర పార్టీల వారు దరఖాస్తుకు వెళ్తే స్థానిక ఎమ్మెల్యేల అనుచరులు వార్నింగ్‌లు ఇచ్చి వెనక్కి పంపేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్నాయి. ఒకవైపు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇలా యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతుండగా మరోవైపు.. సామ, దాన, భేద దండోపాయాలనూ పోలీసుల ద్వారా కూటమి ప్రభుత్వం ప్రయోగించింది. చివరికి.. అధికార పార్టీ నేతలకూ ఈ హెచ్చరికలు తప్పలేదని భోగట్టా. -
ఉచిత ఇసుకకు ‘టెండర్’!
‘తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు..’ అని చిన్నప్పుడు చదువుకున్న పద్యంలో ప్రభుత్వ పెద్దలు ఈ వాక్యాన్ని బాగానే గుర్తుపెట్టుకున్నారు. ఇసుకను అడ్డు పెట్టుకుని ఎన్ని విధాలా డబ్బులు పిండుకోవచ్చో ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. గత ప్రభుత్వం ముందు చూపుతో సమకూర్చిన 80 లక్షల టన్నుల ఇసుకను అడ్డగోలుగా దోచేసి జేబులు నింపుకున్నది చాలదన్నట్లు.. తాజాగా దొడ్డి దారిలో అంతకు మించి దోపిడీకి భారీ స్కెచ్ వేశారు. రాత్రికి రాత్రి గుట్టుచప్పుడు కాకుండా టెండర్లు పిలిచి వారికి కావాల్సిన వాళ్లకు కట్టబెట్టేశారు. సాక్షి, అమరావతి : ఓ వైపు మద్యం మాఫియాను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా ఇసుక మాఫియాకు గేట్లు ఎత్తేసింది. ఉచితం పేరుతో ఇసుకను బంగారంలా మార్చింది చాలదన్నట్లు.. మరింతగా దోపిడీ చేసేందుకు రహస్యంగా పెద్ద స్కెచ్చే వేసింది. జనమంతా పండుగ సందడిలో ఉంటే.. సందట్లో సడేమియాలా ఇసుక రీచ్‌లను తను అనుకున్న వారికి హస్తగతం చేసింది. ఎటువంటి ఇసుక పాలసీ లేకుండానే 70 లక్షల టన్నులకంటూ 108 ఇసుక రీచ్‌లకు టెండర్లు పిలిచి ఆగమేఘాల మీద వాటిని ఖరారు చేసేసింది.సీఎంవోలో ముఖ్య నేత నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీలు పూర్తి ఏకపక్షంగా వ్యవహరించి అధికార పార్టీ వారికి రీచ్‌లను కట్టబెట్టేశాయి. ఇందుకోసం గుట్టు చప్పుడు కాకుండా, ఎవరికీ తెలియనీయకుండా అత్యంత రహస్యంగా జిల్లాల్లో టెండర్ల ప్రక్రియను నిర్వహించాయి. లక్షల రూపాయల విలువ ఉండే చిన్న టెండర్లకే వారం రోజుల వ్యవధి ఇవ్వాల్సివుండగా, రూ.వందల కోట్ల విలువైన ఇసుక టెండర్లను ఎటువంటి ప్రచారం లేకుండా, ఎవరికీ సమాచారం కూడా ఇవ్వకుండా రెండు రోజుల్లోనే గోప్యంగా తన వాళ్లకు కట్టబెట్టడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. రెండు రోజుల్లోనే టెండర్లు పిలవడం, ఖరారు చేసేయడం భారతదేశ టెండర్ల చరిత్రలోనే ఎప్పుడూ జరిగి ఉండదని నిపుణులు సైతం విస్తుపోతున్నారు. అసలు ఇసుక రీచ్‌లకు టెండర్లు పిలుస్తున్న విషయమే ఎవరికీ తెలియకుండా ఎలా మేనేజ్ చేశారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఇసుకను ఉచితంగా ఇస్తామన్న ప్రభుత్వం దానికి టెండర్లు పిలవాల్సిన అవసరం ఏమిటి? అది కూడా షార్ట్ టెండర్లు ఎందుకు పిలవాల్సివచ్చింది? ఎవరికీ తెలియకుండా ఆగమేఘాల మీద వాటిని ఎందుకు ఖరారు చేశారు? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. అడ్డగోలుగా తవ్వేయొచ్చనే అతి తక్కువ ధరకు.. టన్ను ఇసుక ఇసుక తవ్వడానికి రూ.90 నుంచి రూ.120 వరకు వివిధ జిల్లాల్లో బేస్ ధరగా నిర్ణయించారు. చాలా జిల్లాల్లో టన్ను ఇసుకను రూ.50 నుంచి రూ.60కే తవ్వుతామని బిడ్లు దాఖలవ్వడం గమనార్హం. అధికారం ఉండడంతో ఎలాగైనా టెండర్ దక్కించుకుని, ఆ తర్వాత అడ్డగోలుగా తవ్వేయొచ్చనే ఉద్దేశంతో అతి తక్కువకు కోట్ చేసి రీచ్‌లు దక్కించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు ఛైర్మన్లుగా ఉన్న జిల్లా స్థాయి ఇసుక కమిటీలు ప్రభుత్వం చెప్పిన వారికి ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టాయి. ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ప్రశ్నించినా వారిని దబాయించి, బెదిరించి పంపించేశారు. రెండు, మూడు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ ఇసుక టెండర్లు ఖరారైపోయాయి. ఈ నెల 16వ తేదీ నుంచి అక్కడ తవ్వకాలు ప్రారంభించనున్నారు. తూ.గోలో అడ్డగోలుగా టెండర్ల ప్రక్రియ తూర్పుగోదావరి జిల్లాలోని 17 రీచ్‌లకు 7వ తేదీన టెండరు పిలిచి 9వ తేదీ సాయంత్రం లోపు బిడ్లు దాఖలు చేయాలని నిర్దేశించారు. 48 గంటల్లోనే అప్పటికే సిద్ధంగా ఉన్న టీడీపీ వారి నుంచి బిడ్లు స్వీకరించి 9వ తేదీ రాత్రికల్లా ఖరారు చేశారు. ఆఖరి నిమిషంలో విషయం తెలుసుకుని కొందరు టెండర్లు వేయడానికి వస్తే వారిని బెదిరించి కలెక్టరేట్ లోపలికి సైతం వెళ్లనీయలేదు. మరికొందరు ఎలాగోలా టెండరు దాఖలు చేసినా, బిడ్లు ఓపెన్ చేసే సమయంలో వారిని కలెక్టరేట్ ప్రాంగణంలోనే ఉండనీయకుండా పంపేశారు. వారంతా గురువారం రాత్రి అధికారులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసుల సాయంతో వారిని బయటకు పంపి, టెండర్లు ఖరారు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే స్వయంగా తన కంపెనీ పేరుతో సీతానగరం మండలంలోని ఒక రీచ్‌కు టెండర్ వేసి దక్కించుకున్నట్లు తెలిసింది. కర్నూలులో నోటిఫికేషన్ ఇవ్వకుండానేకర్నూలు జిల్లాలో ఇసుక టెండర్ల నోటిఫికేషన్ ఇవ్వకుండానే టెండర్‌ను ఖరారు చేశారు. కేవలం మైనింగ్ శాఖ వెబ్సైట్లో మాత్రమే ప్రకటన ఇచ్చారు. టెండర్ గురించి ఎవరికీ తెలియకుండా మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత బంగారయ్య అనే వ్యక్తితో మాత్రమే టెండర్ దాఖలు చేయించారు. ఎవరినీ రానీయకుండా ఒకే టెండర్ వచ్చేలా చేయడంతో అతనికే రీచ్ తవ్వకాల కాంట్రాక్టు ఖరారైంది. ఒకే టెండర్ దాఖలైతే టెండర్ రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవాలన్న నిబంధనకు నీళ్లొదిలారు. పల్నాడు జిల్లాలో 8వ తేదీన టెండర్ పిలిచి 10వ తేదీన ఖరారు చేశారు. బాపట్ల జిల్లాలో 7న పిలిచి 8న టెండర్లు ఫైనల్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో గొట్టిముక్కల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి టెండర్ వేసేందుకు వెళ్లగా వెనక్కి పంపించారు. మీ వాహనాలకు జీపీఎస్ సిస్టం (డివైస్) బాగా లేదని, టెండర్ వేసేందుకు వీలు లేదని నిరాకరించడంతో ఆయన వెనుదిరిగారు. పాలసీ లేకుండానే తవ్వకాలకు రెడీ మూడు నెలల క్రితం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా అమలవుతున్న ఇసుక విధానాన్ని రద్దు చేసింది. త్వరలో పూర్తి స్థాయి ఇసుక విధానాన్ని ప్రకటించి రీచ్‌ల్లో తవ్వకాలు చేపడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈలోపు స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుకను ఉచితంగా ప్రజలకు సరఫరా చేస్తామని ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. అయితే గత ప్రభుత్వం వర్షాకాలం కోసం స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకను టీడీపీ నేతలు సగానికి సగం వారం రోజుల్లోనే మాయం చేశారు. మిగిలిన 40 లక్షల టన్నుల ఇసుకను ఎక్కడికక్కడ భారీ రేట్లకు ప్రభుత్వం విక్రయించడంతో ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. ఉచిత ఇసుక పేరుతో జనాన్ని నిండా ముంచిందే కాక, ఇప్పుడు అడ్డగోలు తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మరో భారీ దోపిడీకి తెరలేపింది. 2, 3 రోజులే సమయం.. అంతా రహస్యంసరికొత్త దోపిడీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 108 మాన్యువల్ ఇసుక రీచ్‌ల్లో (యంత్రాలు ఉపయోగించకుండా) తవ్వకాలకు ఉన్నట్టుండి ప్రభుత్వం పచ్చజెండా ఊపేసింది. ఎటువంటి ఇసుక విధానం లేకుండా, మార్గదర్శకాలు చెప్పకుండా అన్ని జిల్లాల్లో ఈ రీచ్‌ల్లో తవ్వకాలకు కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీల ద్వారా షార్ట్ టెండర్లు పిలిచింది. ఇసుక తవ్వకాల గురించి ప్రజలకు ఎటువంటి సమాచారం లేకుండా, టెండర్లలో తమ వారు తప్ప బయట వారు పాల్గొనే అవకాశం లేకుండా చేసేందుకే గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం చక్కబెట్టింది. షార్ట్ టెండర్‌కు కనీసం వారం రోజుల సమయం ఇవ్వాలి. కానీ దాదాపు అన్ని జిల్లాల్లో రెండు, మూడు రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. ఆ జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు సూచించిన వారు మాత్రమే టెండర్లు వేయడానికి ముందుగానే సిద్ధం చేశారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి వారితో దగ్గరుండి దాఖలు చేయించి, వారికే ఖరారు చేయించినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద నిర్ణయాన్ని పాలసీ ప్రకటించకుండా ఎలా చేశారనే దానికి అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. -
ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపు
సాక్షి,అమరావతి: ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తులకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ఈ నెల11వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఈ నెల 14వ తేదీన అధికారులు మద్యం షాపులకు లాటరీ తీయనున్నారు. 16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమలు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే టీడీపీ నేతలు,లిక్కర్ సిండికేట్ల కోసం ప్రభుత్వం గడువు పెంచినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల కనుసన్నల్లో మద్యం దుకాణాలకు దరఖాస్తులు అవుతున్నాయి. వాటాలు ఇస్తునే మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసే అవకాశం కల్పిస్తామని లేదంటే అంతు చూస్తామంటూ సిండికేట్ల హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో వ్యాపారులు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసే సాహసం చేయడం లేదు.రాష్ట్రంలో పలు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునే వారు లేకపోవడం, అవి ఖాళీ ఉన్నాయి. ఈ తరుణంలో ఖజానా నింపుకునేందుకు మద్యం దుకాణాల దరఖాస్తులకు ప్రభుత్వం గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. -
నక్క జిత్తులు.. కొత్త ఎత్తులు!
సాక్షి, అమరావతి : వంద రోజుల పాలనలో వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు రాజకీయ దురుద్దేశాలతో తప్పుడు వ్యాఖ్యలు చేసి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తాను అపవిత్రం చేశానన్నది సుప్రీంకోర్టు సాక్షిగా ప్రజలకు తేటతెల్లమవడంతో.. దాన్నుంచి బయట పడేందుకు సీఎం చంద్రబాబునాయుడు మరోమారు టాపిక్ డైవర్షన్‌పై దృష్టి సారించారు. లడ్డూ గురించి మాట్లాడటం మానేసి.. దానికి సంబంధించిన టెండర్లు, డెయిరీలు, ధరలు, గతంలో జరిగిన సంఘటనలంటూ ఎల్లో మీడియాతో సరికొత్త కథనాలు వండివారి్పస్తున్నారు.ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతినేలా ఎలా మాట్లాడతారంటూ సుప్రీంకోర్టు నిలదీయడంతో బాబు అండ్ గ్యాంగ్‌కు ముచ్చెమటలు పట్టాయి. ‘కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పినా, లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు? ఆధారాలు లేకపోయినా సీఎం మీడియా ముందు అలా ఎలా మాట్లాడతారు? ఒకవైపు విచారణ జరుగుతుండగా.. ఆ వ్యాఖ్యలతో సిట్ ప్రభావితం కాదా? తమ నివేదిక తప్పు కావచ్చని స్వయంగా ఎన్డీడీబీ రిపోర్టులోనే రాశారు కదా? ఎన్డీడీబీ నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? అదొక్కటే కాదు.. దేశంలో ఎన్నో ల్యాబ్స్ ఉన్నాయి కదా? ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఈవో ప్రకటన ఉంది.ఆ నెయ్యి వాడనే లేదని ఈవో చెప్పారు. సీఎం చేసిన ప్రకటనకు ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తునకు ఆదేశించినప్పుడు పదాల గారడీ ఎంత మాత్రం అవసరం లేదు. ఎన్డీడీబీ నివేదిక జూలైలో వస్తే దానిపై సీఎం ఎందుకు సెపె్టంబరులో మాట్లాడినట్లు? జూలైలోనే ఎందుకు మాట్లాడలేదు? మీడియాతో మాట్లాడటానికి ముందు లడ్డూలను పరీక్షించడం సరైనదని సీఎం భావించలేదా? అసలు బహిరంగ ప్రకటనలు ఎందుకు చేయాలి? దాని వల్ల సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా? అది కోట్ల మంది మనోభావాలను దెబ్బ తీస్తుందని తెలియదా? సిట్ ఏర్పాటు చేసినా, ఇంకా కల్తీ నెయ్యిపై ప్రకటన ఎలా చేస్తారు? మీడియాతో ఎలా మాట్లాడతారు?’ అని గత నెల 30వ తేదీన సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఆ తరువాత సీబీఐ నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో తాను ప్రజల్లో మరింత చులకన కాకూడదని ఓ వైపు పవన్ కళ్యాణ్, మంత్రులు.. మరో వైపు ఎల్లో మీడియాను రంగంలోకి దించి ట్రాక్ మార్చేశారు. లడ్డూ పోయి టెండర్లొచ్చె.. కల్తీ అయిందని చెబుతున్న నెయ్యిని అసలు వాడనేలేదని టీటీడీ ఈవో చెబుతున్నా వినిపించుకోకుండా దురుద్దేశంతో దుష్ప్రచారం చేసిన చంద్రబాబు అండ్ గ్యాంగ్.. ఇప్పుడు ఆ నెయ్యి గురించి కాకుండా టెండర్లపై వివాదం సృష్టిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచి్చన రోజు నుంచే ఏఆర్ డెయిరీ టీటీడీకి నెయ్యి సరఫరా ప్రారంభించింది. ఆ డెయిరీ జూలై 6, 12న సరఫరా చేసిన 4 ట్యాంకర్ల నెయ్యిలో కల్తీ ఉన్నట్లు తేలడంతో.. వాటిని వెనక్కి పంపేసి, బ్లాక్ లిస్ట్‌లో పెడుతూ షోకాజ్ నోటీలిచ్చామని టీటీడీ ఈవో జూలై 23న ప్రకటించారు. ఆ వెంటనే టెండర్ల సమయంలో ఏఆర్ డెయిరీని పరిశీలించి.. పది లక్షల కేజీల నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం ఆ సంస్థకు ఉందని నివేదిక ఇచ్చిన ఘీ నిపుణుల కమిటీ సభ్యులను టీటీడీగానీ ప్రభుత్వంగానీ విచారించి చర్యలు తీసుకోలేదు. అప్పుడే ఈ వ్యవహారంపై విచారించి.. చర్యలు తీసుకోకుండా టీటీడీ, ప్రభుత్వాన్ని ఎవరు అడ్డుకున్నారు? ప్రభుత్వం తాను చేయాల్సిన పని చేయకుండా.. ఉత్తరాఖండ్ రూర్కిలోని బోలేబాబా డెయిరీ, తిరుపతికి సమీపంలోని వైష్ణవి డెయిరీల నుంచి ఏఆర్ డెయిరీ అధిక ధరకు నెయ్యి కొనుగోలు చేసిందని కొత్త పల్లవి అందుకుంది. ఈ విషయమై ఎల్లో మీడియాతో కథనాలను వండివార్పిస్తోండటంపై విస్మయం వ్యక్తం అవుతోంది. పవన్ కళ్యాణ్.. తిరుమల లడ్డూ ఒక్కటే కాదని.. గత ఐదేళ్లలో తిరుమలలో జరిగిన ఘటనలపై తాను పశ్చాత్తాప దీక్ష చేశానని ప్లేటు ఫిరాయించారు. సనాతన ధర్మం అంటూ.. కోర్టులు అంటూ ఇటు నుంచి ఎటో తీసుకెళ్లారు. తిరుమల శ్రీవారి లడ్డూను వివాదం చేసి.. వంద రోజుల పాలన, ఎన్నికల్లో ఇచి్చన హామీల అమల్లో వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లిద్దామనుకున్న చంద్రబాబుకు చేతులు కాలడంతో ఇప్పుడు ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా దాన్ని దారి మళ్లించాలని ఎత్తులు వేస్తున్నారు. -
హా‘హాకా’రాలు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఓ వ్యాపారికి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలో కిరాణా సామాను సరఫరా పనులను ‘హాకా’ పేరుతో అధిక ధరలకు కొనుగోళ్ల కమిటీ కట్టబెట్టింది. ఆ తరువాత అవే రేట్లతో ‘హాకా’ పేరుతో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో కిరాణా సామాను సరఫరా పనులను నామినేషన్‌పై జిల్లా యంత్రాంగం కట్టబెట్టింది. ఇలా మొత్తంలో 200 విద్యాసంస్థల్లో కిరాణా సామాను సరఫరాను అధిక ధరలకు ఇచ్చేసింది. ఈ తతంగంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కీలకంగా వ్యవహరించాడు. అధిక ధరలతో ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లేలా ‘హాకా’ పేరుతో సదరు వ్యాపారే రూ.కోట్ల విలువైన పనులను దక్కించుకున్నట్లు, ‘హాకా’ కేవలం 2 శాతం కమీషన్‌పై ఈ పనులను సదరు వ్యాపారికి అప్పగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడే కాదు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని మైనారిటీ గురుకులాల్లో స్టేషనరీ, బూట్లు, ఫరి్నచర్, ఎస్సీ గురుకులాల్లో బ్లాంకెట్లు, వైద్య, ఆరోగ్య శాఖలో సామగ్రి సరఫరా పనులను కూడా ‘హాకా’ పేరుతో తీసుకొని, 2 శాతం కమీషన్‌పై ఇతరులకు అప్పగించారన్న ఆరోపణలున్నాయి.‘హాకా’కే ఇవ్వాలనుకుంటే టెండర్లు ఎందుకు?ప్రభుత్వ సంస్థ అయిన ‘హాకా’ ద్వారానే విద్యా సంస్థలకు కిరాణా సామాను, ఇతరత్రా పరికరాలు, వివిధ శాఖలకు అవసరమైన ఫర్నిచర్ వంటివి సరఫరా చేయాలని ప్రభుత్వం అనుకుంటే టెండర్లు పిలువడం ఎందుకు? ‘హాకా’కే నేరుగా ఇచ్చేస్తే తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు లభిస్తాయనే చర్చ సాగుతోంది. పైగా టెండర్లు పిలిచినప్పుడు వాటిలో ప్రైవేట్ వ్యాపారులు పాల్గొనేలా చేసి, అధిక ధరకు ‘హాకా’ దక్కించుకుంటోందని, మళ్లీ కమీషన్లపై ప్రైవేట్ సంస్థలకు అప్పగించి సరఫరా చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ‘హాకా’కు సరఫరా చేసే సామర్థ్యమే లేదన్న చర్చ సాగుతున్న తరుణంలో ఈ పనులను పొందిన కాంట్రాక్టర్లు, సంస్థలు నాసిరకం కిరాణా సామాను, వస్తువులను సరఫరా చేస్తే దానికి బాధ్యులెవరు? 2 శాతం కమీషన్‌తో ఆ పనులను పొందిన వ్యాపారులు, సంస్థలు బాధ్యత వహిస్తాయా? ‘హాకా’ బాధ్యత వహిస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.వ్యాపారుల దందాతో నాణ్యత గాలికి..ప్రభుత్వ సంస్థల్లో కొన్ని పనులను ‘హాకా’నే కాంట్రాక్టుకు తీసుకొని వ్యాపారం చేయొచ్చు.. కానీ అలా చేయడం లేదు. ‘హాకా’ పేరుతో కాంట్రాక్టు తీసుకుంటూ ఇతర వ్యాపారులకు కమీషన్‌పై పనులను అప్పగిస్తోందన్న ఆరోపణలున్నాయి. కొన్ని సందర్భాల్లో ‘హాకా’ పేరుతో వ్యాపారులే అధిక ధరలకు టెండర్లు దాఖలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిని సంస్థ కనీసం పరిశీలన చేయడం లేదు. పైగా ఈ తతంగంలో అందులోని కొందరు అధికారులు పెద్ద ఎత్తున మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక ఆ పనులను పొందిన వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వస్తువుల నాణ్యతను పాటిస్తున్నారా? లేదా చూసే వారు లేకుండాపోయారు. కనీసం ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ సంస్థ అయిన ‘హాకా’ పేరుతో వ్యాపారులు దర్జాగా తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 200 విద్యాసంస్థల్లో దాదాపు రూ.కోట్ల విలువైన పనులను ‘హాకా’ పేరుతో టెండర్లలో అధిక ధరకు కోట్ చేసి వ్యాపారులు దక్కించుకొని ప్రభుత్వ ఖాజానాకు గండికొడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతున్నా స్పందించడం లేదు. మూలాలను మరిచిన ‘హాకా’.. రైతుల సంక్షేమానికి పనిచేస్తూ.. రైతులను లాభాల బాటలో నడిపించేందుకు ఏర్పడిందే హైదరాబాద్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ సొసైటీ (హాకా). గతంలో వ్యాపారుల బ్లాక్ మార్కెటింగ్ కారణంగా రైతులు ఎరువులు, విత్తనాలను అధిక ధరకు కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోయే వారు. ఈ నేపథ్యంలో రైతులకు మేలు చేసేందుకు, ఎరువులు, విత్తనాలను సరఫరా చేసేందుకు, తద్వారా రైతు సంక్షేమానికి పాటు పడేందుకు ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా ‘హాకా’ను ఏర్పాటు చేసింది. ఆ తరువాత జిల్లాల్లోనూ తన కార్యాలయాలను విస్తరించి రైతులు నష్టపోయకుండా చూసేది. అలాంటి సంస్థ ఇప్పుడు తన ముఖ్య లక్ష్యాన్ని వదిలేసి గాడి తప్పుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులతోపాటు ఆహారానికి సంబంధించిన ఇతర సంస్థల్లోనూ వ్యాపారం చేసే వెసులుబాటు ‘హాకా’కు ఉంది. దాన్ని ఆసరాగా తీసుకొని ప్రధానమైన రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్న చర్చ సాగుతోంది. వివిధ ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టులు పొంది 2 శాతం కమీషన్‌తో ఇతర వ్యాపారులకు ఆయా కాంట్రాక్టులను అప్పగిస్తోందన్న ఆరోపణలున్నాయి. పూర్తిగా కమీషన్ వ్యాపార దృక్పథంతోనే ముందుకు సాగుతోందన్న విమర్శలున్నాయి. -
అమృత్ టెండర్లలో రేవంత్ కుటుంబం భారీ అవినీతి
-
‘అమృత్ టెండర్లలో రేవంత్ కుటుంబీకుల భారీ అవినీతి’: KTR
హైదరాబాద్, సాక్షి: అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబీకులు భారీ అవినీతిని పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అమృత్ టెండర్లలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చాలంటూ నిన్న(శుక్రవారం) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు రాసిన లేఖను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.‘‘ఈరోజు అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి బావమరిది కంపెనీ ఎలాంటి అర్హతలు లేకున్నా దొడ్డిదారిన రూ. 1137 కోట్ల పనుల దక్కించుకున్న పత్రాలు ఇవిగో.ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీని రంగంలోకి దించి టెండర్లలో తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులను దక్కించుకున్న రేవంత్ రెడ్డి కుటుంబం. ఆ తర్వాత ఇదే కంపెనీతో తన సొంత బావమరిది సూదిని సృజన్ రెడ్డి కంపెనీతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసుకున్న ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ. ఇదే కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు అప్పజెప్తుంది.ప్రజలకు అందుబాటులో ఉంచకుండా చీకటి వ్యవహారాన్ని నడుపుతుంది.అమృత్ పథకంలో ఇప్పటిదాకా జరిగిన టెండర్ల పైన పూర్తిస్థాయి విచారణ జరిపి, టెండర్లు దక్కించుకున్న ప్రతి కంపెనీ వివరాలను బయటపెట్టాలి. 9 నెలలుగా రాష్ట్ర లోని అవినీతి పూరిత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ప్రతి టెండర్ పైన విచారణ జరిపి సమీక్ష చేసి అక్రమాలు జరిగిన ప్రతి టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి టెండర్ల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా’’ అని పేర్కొన్నారు.SCAM Alert - AMRUT Tenders I wrote a letter to Union Ministers Shri Manohar Lal Khattar Ji (@mlkhattar) and Shri Tokhan Sahu Ji (@tokhansahu_bjp) regarding corruption in AMRUT tendersContracts were awarded to Chief Minister Revanth Reddy's Brother-in-law, Srujan Reddy’s… pic.twitter.com/pqgz7aLBGR— KTR (@KTRBRS) September 21, 2024చదవండి: కోకాపేటపై హైడ్రా ఫోకస్.. కూల్చివేతలు షురూ -
అమృత్ టెండర్లపై కేంద్రానికి కేటీఆర్ లేఖ
హైదరాబాద్: అమృత్ టెండర్ల అంశంలో అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తూ కేంద్రానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మనోహల్లాల్ కట్టర్. టోచన్ సాహూలకు కేటీఆర్ లేఖ రాశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత బావమరిది సృజన్‌రెడ్డికి, తమ్ముడి కంపెనీలకు అర్హతలు లేకున్నా కాంట్రాక్టులు కట్టబెట్టారని కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు.వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులను అప్పనంగా దక్కించుకున్న సీఎం కుటుంబీకుల వ్యవహారంపైన నిజాలు నిగ్గు తేల్చాలని కేటీఆర్ డిమాండ్ ేశారు. గత తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో జరిగిన టెండర్ల తాలూకా సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెడుతుందని ఆరోపించారు. అమృత్ పథకంలో జరిగిన ప్రతీ టెండర్, పనులు దక్కించుకున్న కంపెనీల వివరాలను బహిర్గతం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతీ టెండర్‌ను సమీక్షించి, ఈ చీకటి టెండర్లను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. వెంటనే టెండర్ల తాలూకా ప్రతీ సమాచారాన్ని ప్రజల ముందు పారదర్శకంగా ఉంచాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.అర్హతలు లేకున్నా అమృత్ టెండర్లు దక్కించుకున్న కంపెనీలపైనా ఎంక్వయిరీ వేయాలన్నారు కేటీఆర్. ఆరు నెలలుగా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేసినా, స్పష్టత ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వ తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్పందించకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కేంద్రానికి కూడా భాగస్వామ్మం ఉందని ప్రజలు నమ్మాల్సి వస్తుందన్నారు. -
ఖజానా దోపిడీకి లైన్ క్లియర్
ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని పరిరక్షించాల్సిన సర్కారే.. ఖజానా దోపిడీకి లైన్ క్లియర్ చేసింది. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పద్ధతి (2003 జూలై 1న జారీ చేసిన జీవో 94) ప్రకారమే టెండర్లు పిలిచి, పనులను కాంట్రాక్టర్లకు అప్పగించాలని ఆగస్టు 28న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దానిని అమలు చేస్తూ ఆదివారం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నంబర్ 40) జారీ చేశారు. దీంతో 2014–19 మధ్య కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ ఖజానాను దోచేసినట్లుగానే ఇప్పుడూ దోపిడీకి ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. సీబీఎస్ఈ సిలబస్ రద్దు.. ఇంగ్లిష్ మీడియం రద్దు.. టోఫెల్ వ్యవస్థ రద్దు.. సెబ్ రద్దు.. వలంటీర్ వ్యవస్థ రద్దు.. ఇలా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన వ్యవస్థలన్నీంటినీ చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడమే లక్ష్యంగా అడుగులేస్తోంది. కీలక వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది. ఈ పరంపరలో పొరుగు రాష్ట్రాల ప్రశంసలు పొందిన రివర్స్ టెండరింగ్ విధానాన్నీ తాజాగా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.ప్రతిపాదన దశలోనే బేరసారాలు రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ముఖ్య నేతలు ఒక పని ప్రతిపాదన దశలోనే కాంట్రాక్టర్లతో బేరసారాలాడి కమీషన్లు ఖరారు చేసుకునేవారు. ఈ మేరకు అంచనాలు పెంచేయించడం.. ఎక్కువ కమీషన్ ఇచ్చేందుకు అంగీకరించిన కాంట్రాక్టర్‌కే ఆ పని దక్కేలా నిబంధనలను రూపొందించి టెండర్లు పిలవడం.. అదే కాంట్రాక్టర్‌కు అధిక ధరకు పనులు కట్టబెట్టడం.. ప్రభుత్వ ఖజానా నుంచి ఆ కాంట్రాక్టర్‌కు మొబిలైజేషన్ అడ్వాన్సు ఇచ్చేసి.. వాటినే కమీషన్లుగా రాబట్టుకుని తమ జేబులో వేసుకోవడం రివాజుగా మార్చుకున్నారు. అప్పట్లో కేవలం టెండర్ల వ్యవస్థను నీరుగార్చి ప్రభుత్వ ఖజానా నుంచి సుమారు రూ.20 వేల కోట్లను దోచేశారు. 7,500కోట్లు ఆదా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్(బీవోసీఈ) ఇచ్చిన నివేదిక ఆధారంగా టెండర్ల వ్యవస్థను ప్రక్షాళన చేశారు. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానం వంటి విప్లవాత్మక సంస్కరణలను అమల్లోకి తెస్తూ 2019, ఆగస్టు 16న ఉత్తర్వులు(జీవో 67) జారీ చేశారు. మొబిలైజేషన్ అడ్వాన్సులను పూర్తిగా రద్దు చేశారు. అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు నిర్వహించడంతో కాంట్రాక్టర్లు భారీ ఎత్తున పోటీ పడ్డారు. దీంతో కాంట్రాక్టు విలువ కంటే తక్కువ ధరకే పనులు చేయడానికి ముందుకొచ్చారు. 2019 ఆగస్టు 16 నుంచి 2024 మే వరకు ప్రభుత్వ ఖజానాకు రూ.7,500 కోట్లకుపైగా ఆదా అయ్యాయి. రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాలంటూ 2019, జూలై 26న నివేదిక ఇచ్చిన బీవోసీఈతోనే... ఆ విధానం రద్దు చేయాలంటూ గత నెల 21న చంద్రబాబు ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. ఆ నివేదికను అదే నెల 28న కేబినెట్లో ఆమోదించి.. పాత విధానంలో టెండర్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి0ది.– సాక్షి, అమరావతి -
మరమ్మతులకు తక్షణమే టెండర్లు
సాక్షి, హైదరాబాద్: భారీవర్షాలు, వరదలతో దెబ్బతిన్న చెరువుల కట్టలు, కాల్వలు, ఇతర ప్రాజెక్టుల పునరుద్ధరణకు తక్షణమే స్వల్పకాలిక టెండర్లు ఆహ్వానించాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పనులకు పరిపాలనాపర అనుమతులను అత్యవసరంగా జారీ చేసి శుక్రవారం ఉదయం నాటికి ఆన్లైన్లో టెండర్లను పొందుపర్చాలని సూచించారు. దెబ్బతిన్న చెరువులు, కాల్వలు, ఇతర ప్రాజెక్టుల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ఆయన జలసౌధ నుంచి క్షేత్రస్థాయిలోని నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మొత్తంగా 544 జలవనరులకు నష్టం వాటిల్లిందని, అత్యవసర మరమ్మతులకు రూ.113 కోట్లు అవసరమని అధికారులు మంత్రికి నివేదించారు.అత్యవసర, శాశ్వత మరమ్మతులకు రూ.1,100 కోట్లు కేటాయించాలని కోరగా, రాష్ట్ర ఆర్థిక శాఖ రూ.350 కోట్లు కేటాయించిందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నిధులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, తక్షణమే అన్ని పనులకు షార్ట్ టెండర్లు ఆహ్వానించాలని మంత్రి ఆదేశించారు. మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. మానవ తప్పిదంతో ఏదైనా నష్టం జరిగితే సంబంధిత చీఫ్ ఇంజనీర్లను బాధ్యులుగా చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వట్టెం పంప్‌హౌస్ పునరుద్ధరణ ఖర్చు నిర్మాణ సంస్థదే...: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని వట్టెం వద్ద నిర్మించిన పంప్‌హౌస్‌తోపాటు సొరంగం నీటమునగగా, 4000 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన 16 పంపుల ద్వారా నీళ్లను బయటకు తోడేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు మంత్రికి చెప్పారు. నిర్మాణ సంస్థే సొంతఖర్చుతో పునరుద్ధరణ పనులు నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు. త్వరలో పదోన్నతులు, బదిలీలు..: విపత్తుల సమయంలో 90 శాతం మంది ఉద్యోగులు బాగా పనిచేశారని, మిగిలిన 10 శాతం మంది సైతం తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. కొత్తగా నియామకం పొందిన 700 మంది ఏఈలకు త్వరలో పోస్టింగులతోపాటు నీటిపారుదల శాఖలో ఇంజనీర్లకు పదోన్నతులు, బదిలీలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. తాత్కాలిక పదోన్నతులు కాకుండా శాశ్వత పదోన్నతులే ఇస్తామన్నారు. నీటిపారుదలశాఖలో ఖాళీగా ఉన్న 1,800 లస్కర్ పోస్టుల భర్తీకి అనుమతి కోరుతూ ఆర్థికశాఖకు ప్రతిపాదనలను పంపించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఈఎన్సీ(జనరల్) అనిల్‌కుమార్, ఈఎన్సీ (ఓఅండ్ఎం) నాగేందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఏది నిజం?: కూటమి ‘స్మార్ట్’ నాటకం!
‘అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ పథకాలను అమలు చేయలేక కుప్పిగంతులు వేస్తోంది. ప్రజలను ఏమార్చేందుకు అబద్ధాలు, మోసాలతో మాయా నాటకాన్ని మొదలుపెట్టింది. అందులో భాగంగా ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ తమకు గిట్టని అధికారులపై కక్ష సాధిస్తోంది. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతోంది.హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వ విభాగాల్లో డబ్బులు లేవంటూ శ్వేతపత్రాల పేరుతో కాలం వెళ్లదీస్తోంది. తప్పుడు లెక్కలు చూపిస్తూ ఖజానా ఖాళీగా ఉందంటూ బేలతనాన్ని ప్రదర్శిస్తోంది. తాను అమలు చేయాల్సిన పథకాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ దుష్ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలోనే స్మార్ట్ మీటర్ల టెండర్లపై ఎల్లో మీడియాతో కలిసి విషం చిమ్ముతోంది’’సాక్షి, అమరావతి: వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు అమర్చే కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థకు గత ప్రభుత్వంలో అడ్డగోలుగా చెల్లింపులు జరిగాయంటూ ‘స్మార్ట్ దోపిడీపై ఆడిట్’ శీర్షికన ఓ అసత్య కథనాన్ని సీఎం చంద్రబాబు డైరెక్షన్లో ఈనాడు సోమవారం ప్రచురించింది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మార్గదర్శకాలకు అనుగుణంగా, న్యాయ సమీక్ష ద్వారా అనుమతి పొందిన టెండర్లపై అడ్డగోలుగా అసత్యాలు అచ్చేసింది. జరగని దోపిడీపై ఆడిట్‌కు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమవుతోందంటూ చెప్పుకొచ్చింది.నిజానికి వ్యవసాయ విద్యుత్ మోటార్లకు స్మార్ట్ మీటర్లు అమర్చే టెండర్లు, ఆ టెండర్లు దక్కించుకున్న సంస్థకు బిల్లులు చెల్లింపుల్లో గత ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు అత్యంత పారదర్శకంగా వ్యవహరించాయి. ఇందులో ఎలాంటి దాపరికం, నిబంధనల ఉల్లంఘన జరగలేదు. రైతులకు ఎప్పటికీ పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను హక్కుగా ఇచ్చేందుకు జరుగుతున్న యత్నాన్ని టీడీపీ మొదటి నుంచీ వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంది.స్మార్ట్ మీటర్లకు సంబంధించిన లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయని, అన్నీ నిబంధన మేరకే జరిగాయని ఇంధన శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అలాంటప్పుడు గత ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తే తప్పేముంది? అసలు ఈనాడు, చంద్రబాబు బాధేమిటో అర్ధం కాదు. బిల్లులు చెల్లిస్తే చెల్లించేశారంటూ ఏడుపు..! చెల్లించకపోతే ఇంకా చెల్లించలేదంటూ గగ్గోలు పెట్టడం ఎల్లో మీడియా, కూటమి ప్రభుత్వానికి పరిపాటిగా మారింది.ఇంత పెద్ద వ్యవస్థలో తనిఖీ కష్టమా?నిర్ణీత సమయంలో ఎంత సామగ్రినైనా తనిఖీ చేసే సామర్ధ్యం రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ వ్యవస్ధకు ఉంది. విద్యుత్ సంస్థలకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ఉద్యోగులున్నారు. ఇలాంటి తనిఖీల కోసమే ప్రతి విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లో కన్స్ట్రక్షన్ విభాగం ఉంటుంది.అందులోని అధికారులు స్టోర్స్‌కి మెటీరియల్ రాగానే స్వయంగా పరిశీలిస్తారు. ప్రతి పరికరం నాణ్యత ప్రకారం ఉందోలేదో తనిఖీ చేస్తారు. పరికరాల సంఖ్య కూడా లెక్కిస్తారు. ఈ వివరాలన్నీ నమోదు చేసుకున్న తరువాత మాత్రమే బిల్లులను అకౌంట్స్ విభాగానికి సమర్పిస్తారు. కన్స్ట్రక్షన్ విభాగం నుంచి వచ్చిన బిల్లుల ఆధారంగా టెండర్లో పొందుపరిచిన నిబంధనలకు అనుగుణంగా అకౌంట్స్ విభాగం అధికారులు బిల్లులు మంజూరు చేస్తారు. స్మార్ట్ మీటర్ల విషయంలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తిగా, సక్రమంగా జరిగింది. అందువల్లే డిస్కంలు బిల్లులు చెల్లించాయి. న్యాయ సమీక్షకు టెండర్లు..ఏ సంస్థ అయినా స్మార్ట్ మీటర్ల బిడ్లలో పాల్గొనేలా నిబంధనలున్నాయి. స్మార్ట్ మీటర్ల టెండర్లను ఆహ్వానిస్తూ డిస్కంలు తెలుగు, ఇంగ్లీషు దినపత్రికల్లో ప్రకటన కూడా జారీ చేశాయి. ప్రధానంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టెండర్లలో అక్రమాలను అరికట్టడానికి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. రివర్స్ టెండరింగ్, న్యాయ సమీక్ష అనే విధానాలను ప్రవేశపెట్టి పక్కాగా అమలు చేశారు. ఈ వినూత్న నిర్ణయాలతో రూ.100 కోట్లు దాటిన ప్రతి టెండర్ న్యాయ సమీక్షకు వెళుతుంది. అక్కడ వెబ్సైట్లో 14 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో టెండర్ డాక్యుమెంట్లను ఉంచి ప్రజల నుంచి అభ్యంతరాలను, సలహాలు, సూచనలను తీసుకుంటారు.అదంతా ముగిసిన తరువాతే అనుమతి లభిస్తుంది. స్మార్ట్ మీటర్ల టెండరు ప్రక్రియ ఏపీ–ఈ–ప్రొక్యూర్మెంట్, జెమ్ పోర్టల్ ద్వారా జరిగింది. ఎంపిక అత్యంత పారదర్శకంగా జరిగింది. అందువల్ల ఏదైనా సంస్థ పూర్తి అర్హతలతో పారదర్శకంగా నిబంధనల ప్రకారం కాంట్రాక్టులు, ప్రాజెక్టులు పొందితే దానికి లబ్ధి చేకూర్చేలా నిబంధనలు మార్చేశారనడంలో అర్ధం లేదు. ఒకసారి టెండర్ ఖరారయిన తరువాత అందులోని నిబంధనలు మార్చకూడదు. అలాంటిదేమీ ఇక్కడ జరగలేదు. గతేడాది పిలిచిన టెండర్ నిబంధనలే ఈ ఏడాదీఉండాలని, ఒక టెండర్లో ఉన్నట్లుగానే మరో టెండర్లో నిబంధనలు పెట్టాలని ఏ చట్టం చెబుతుందో ఈనాడుకే తెలియాలి.రివర్స్ టెండరింగ్‌తో 15.75 శాతం తగ్గిన ధరవ్యవసాయానికి పగటిపూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడం, మీటర్లు కాలిపోకుండా, రైతులు ప్రమాదాల బారిన పడకుండా కాపాడటంతోపాటు మోటార్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని స్మార్ట్ మీటర్లను రక్షణ పరికరాలతో ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం ఆదేశించింది. ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా డిస్కంలు టెండర్లను పిలిచాయి. ఎల్ 1గా నిలిచిన కాంట్రాక్టర్‌కు టెండర్‌ను అప్పగించాయి. అయితే టెండర్ ధర అధికంగా రావటాన్ని గమనించిన గత ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను రద్దు చేయాలని ఆదేశించింది. దీంతో తొలి టెండర్ రద్దు అయింది. అనంతరం రివర్స్ టెండరింగ్ ద్వారా టెండర్ల ధర మొదటిసారి కంటే 15.75 శాతం తగ్గింది. తద్వారా ప్రజాధనాన్ని ఆదా చేశారు. ఇక మీటర్ గ్యారంటీ సమయం 10 ఏళ్లకు పెరిగింది. నిర్వహణ సమయం పెంచడం వల్ల డిస్కంలకు వ్యయంలో 2 శాతం ఆదా అవుతుంది. అంటే డిస్కంలకు ఆర్ధికంగా కొన్ని కోట్ల రూపాయలు మిగులుతాయి. అదీగాక ప్రతి టెండర్ నిబంధన న్యాయ సమీక్షకు వెళ్లింది. ఆ తరువాతే ఖరారైంది. అంతేకాకుండా ఏపీఈఆర్సీ అనుమతి కూడా పొందింది. ఇందులో ఎలాంటి ఉల్లంఘనగానీ, ఒకరికి ఉద్దేశపూర్వకంగా మేలు చేయడంగానీ లేదు.నిబంధన మేరకే బిల్లులు..గుత్తేదారు సంస్థ బిల్లులు పంపడమే ఆలస్యం డిస్కంలు చకచకా రూ.1,828 కోట్లు చెల్లించాయని సమాచారమంటూ ఈనాడు చెప్పుకొచ్చింది. వ్యవసాయ స్మార్ట్ మీటర్లకు అయ్యే ఖర్చులో ప్రతి పైసాను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘జి.ఓ.ఎం.ఎస్. 22, తేదీ:01.09.2020’ ద్వారా స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే డిస్కంలు టెండర్లు పిలిచాయి. తాము కాంట్రాక్టు సంస్థకు చెల్లించిన డబ్బును తిరిగి తమకు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాయి. అందుకు గత ప్రభుత్వం అంగీకరించింది.ఈలోగా ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ ఆగింది. కూటమి ప్రభుత్వంగానీ ఈనాడుగానీ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. కాంట్రాక్టర్‌తో పని చేయించుకుని బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత ప్రాథమికంగా డిస్కంలదే. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. ఇందులో ఏ తప్పూ లేదు. ఇదేమీ కొత్తగా జరిగిందీ కాదు. సంక్షేమ పథకాల ద్వారా వివిధ వర్గాలకు విద్యుత్ రాయితీలు అందించే ప్రభుత్వం ఆ మొత్తాన్నీ ముందుగా డిస్కంలు భరిస్తే, ఆ తర్వాత రీయింబర్స్మెంట్ చేస్తుంటుంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో రైతులకు ఉచిత విద్యుత్‌కు సంబంధించిన ఖర్చును డిస్కంలు ముందుగా భరించాయి. ఆ బకాయిలు రూ.8,845 కోట్లు కాగా వాటిని ఇవ్వకుండా నాడు చంద్రబాబు ఎగవేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆ మొత్తం బకాయిలను చెల్లించింది.రాష్ట్రపతి అవార్డు అందుకున్న సంస్థపై ఎందుకీ కక్ష?మూడు డిస్కమ్‌ల పరిధిలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టు పొందిన షిర్డీ సాయి సంస్థ చిన్న సంస్థ ఏమీ కాదు. 25 ఏళ్లుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను తయారు చేస్తూ సుదీర్ఘ అనుభవం, సామర్థ్యం ఉన్న కంపెనీగా పేరు పొందింది. ట్రాన్స్ఫార్మర్ల తయారీలో 2022కిగానూ ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డు కూడా దక్కించుకుంది. ఎనర్జీ కన్జర్వేషన్ (ఇంధన పొదుపు) అవార్డును కేంద్రం నుంచి రెండు సార్లు అందుకుంది. అండర్ స్టాండింగ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్‌కు కూడా ఈ సంస్థ అర్హత సాధించింది.స్మార్ట్ మీటర్లతో జవాబుదారీతనంఒకప్పుడు వ్యవసాయ విద్యుత్తు సర్వీసులకు మీటర్ల ద్వారా వినియోగం జరిగేది. ఆ తర్వాత మోటార్ హార్స్ పవర్ ప్రాతిపదికన వినియోగాన్ని లెక్కించడంతో మీటర్ల వాడకం తగ్గింది. విద్యుత్ సంస్థలు కెపాసిటర్లను విడతలవారీగా వినియోగదారులకు అందించినప్పటికీ కాలక్రమేణా వాటిని రైతులే తీసేశారు. దీంతో సరఫరాలో హెచ్చుతగ్గులు వచ్చి ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయి. ఇలాంటి సమస్యలను తీర్చడంతో పాటు విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసం స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. రైతు ఖాతాలో నెలవారీ వినియోగ చార్జీలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డీబీటీ) ద్వారా ప్రభుత్వం జమ చేసేలా రైతుల బ్యాంకు ఖాతాలను కూడా సేకరించింది. రైతులే ఆ మొత్తాన్ని డిస్కంలకు చెల్లించడం ద్వారా జవాబుదారీతనం పెరుగుతుందని భావించింది.నాణ్యమైన విద్యుత్స్మార్ట్ మీటర్లతో పాటు అనుబంధ పరికరాలైన పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, మీటరు బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటి మరమ్మతుల కోసం ఏటా రూ.102 కోట్ల వ్యయాన్ని డిస్కంలు భరించాల్సి వస్తోంది. వీటివల్ల ఆ ఖర్చు తప్పుతుంది. కెపాసిటర్లను అమర్చడం ద్వారా నాణ్యమైన ఓల్టేజ్‌తో రైతులకు విద్యుత్ సరఫరా చేయవచ్చు.కేంద్రమే చెప్పిందికేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదిత రీ వ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డిఎస్ఎస్)లో భాగంగా స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు దేశంలోని అనేక రాష్ట్రాలతో జరుగుతోంది. ‘ఆర్డీఎస్ఎస్’లో భాగంగా 2025 మార్చి నాటికి దేశం అంతటా అన్ని రాష్ట్రాలూ స్మార్ట్ విద్యుత్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు 2019లోనే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఒక రెగ్యులేషన్ ఇచ్చింది. దాని ప్రకారం రాష్ట్రంలో 18.58 లక్షల వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చాలని 2020లో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు గత ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్ల ప్రక్రియ 50 శాతం నుంచి 100 శాతం వరకూ పూర్తవుతోంది. స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ నష్టాలను అరికట్టవచ్చని, సరఫరా వ్యయాన్ని తగ్గించవచ్చని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కూడా వెల్లడించింది. ఈ మీటర్లను పెట్టడం వల్ల ఎనర్జీ ఆడిటింగ్, అకౌంటింగ్‌కు అవకాశం ఉంటుందని తెలిపింది. -
ధరలు పెరిగేలోపే ‘దక్షిణం’ పనులు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం పనుల టెండర్ల ప్రక్రియ ముగిసేలోపు దక్షిణ భాగం భూసేకరణ ప్రక్రియ కొలిక్కి తేవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయానికొచ్చాయి. టెండర్లు కాగానే ఉత్తరభాగం పనులు మొదలవుతాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరుగుతాయి. దీని ప్రభావం దక్షిణ భాగంపై కూడా పడుతుంది. అక్కడా భూముల ధరలు పెరుగుతాయి. అప్పుడు, దక్షిణభాగంలో తమకు ఇచ్చే పరిహారం చాలదని, దానిని పెంచాలంటూ భూనిర్వాసితుల నుంచి డిమాండ్ వస్తుందన్న సంకేతాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. దీంతో దక్షిణభాగంలో జరుగుతున్న జాప్యాన్ని నిలవరించి..అక్కడ భూసేకరణ ప్రక్రియ వేగిరం చేయాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని తొలుత రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దీనికి తాజాగా కేంద్రం కూడా సమ్మతించినట్టు తెలిసింది. పనులకు అడ్డంకిగా మారుతుందని.. ప్రస్తుతం ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలో గ్రామాల వారీగా అవార్డులు పాస్ చేస్తారు. దీంతో భూనిర్వాసితుల ఖాతాలో పరిహారం జమ అవుతుంది. సంగారెడ్డి పట్టణ సమీపంలోని కొన్ని ప్రాంతాలు, యాదాద్రి ఆర్డీఓ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో నిర్వాసితుల నుంచి ప్రతిఘటన ఎదురుకాగా, మిగతా ప్రాంతాల్లో సాఫీగానే సాగుతోంది. ఉత్తర భాగానికి సంబంధించి రూ.5200 కోట్ల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అంచనా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం చొప్పున భరించాల్సి ఉంది. ఉత్తర భాగంతో పోలిస్తే, దక్షిణ భాగంలో భూముల ధరలు తక్కువగా ఉన్నాయి. దాని నిడివి మాత్రం ఎక్కువ. దీంతో అక్కడ దాదాపు రూ.6000 కోట్ల వరకు పరిహారం రూపంలో చెల్లించాల్సి ఉంటుందని అంచనా. మరో రెండు మూడునెలల్లో ఉత్తర భాగం టెండర్ల దశకు చేరుకుంటుంది. కానీ, దక్షిణభాగం విషయంలో ఇంకా అలైన్మెంట్ కూడా ఖరారు కాలేదు. ఉత్తర భాగం టెండర్లు పూర్తయ్యేనాటికి స్థానికంగా భూముల ధరలు భారీగా పెరుగుతాయన్న అంచనా ఉంది. పనుల్లో జాప్యం జరుగుతున్నా.. దక్షిణ భాగంలో కూడా రింగ్ నిర్మాణం ఎలాగూ ఖరారైనందున, స్థానికంగా కూడా భూముల ధరలు అప్పటికి భారీగా పెరుగుతాయి. దీంతో అప్పటి భూముల ధరలకు తగ్గట్టుగా పరిహారం మొత్తం పెంచాలని దక్షిణ భాగం నిర్వాసితులు డిమాండ్ చేసే పరిస్థితి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో ఉత్తర భాగంలో భూముల ధరలు పెరిగేలోపు దక్షిణ భాగంలో భూసేకరణ ప్రక్రియ కొలిక్కి తేవాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. భూ పరిహార భారం పెరిగితే, నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. రూ.17 వేల కోట్లతో రెండు భాగాలు పూర్తి చేయాలని తొలుత లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పుడు నిర్మాణ వ్యయం రూ.35 వేల కోట్లకు చేరేలా కనిపిస్తోంది. పరిహారం మరింత పెంచాల్సి వస్తే నిర్మాణ వ్యయం మరింత పెరుగుతుంది. దీంతో మరో మూడు నెలల్లోగా దక్షిణభాగంలో కూడా భూసేకరణ ప్రక్రియ ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. -
‘రింగు’ చెరిసగం!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు పనుల నిర్వహణ బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం చూసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం టెండర్ల దశకు చేరువలో ఉన్న ఉత్తరభాగాన్ని కేంద్రప్రభుత్వం నిర్వహించనుంది. ఇక అలై న్మెంట్ దశలోనే ఆగిపోయిన దక్షిణభాగాన్ని రాష్ట్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో నిర్వహించాలన్న అంశాన్ని కేంద్రం పరిశీ లిస్తోంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్గడ్కరీతో నిర్వహించిన భేటీలో చర్చకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వమే ఈ మేరకు ప్రతిపాదించినట్టు సమాచారం. దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. భారత్‌మాల పరియోజనలో చోటు దక్కకపోవటంతో..రీజినల్‌రింగ్ రోడ్డులో 162.4 కి.మీ నిడివి ఉండే ఉత్తరభాగాన్ని, 189.2 కి.మీ. నిడివి ఉండే దక్షిణభాగాన్ని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్హెచ్ఏఐ పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తర భాగం భూపరిహారం పంపిణీకి సంబంధించిన అవార్డులు పాస్ చేసే దశలో ఉంది. మరో రెండుమూడు నెలల్లో టెండర్ల ప్రక్రియ జరగనుంది. కానీ, దక్షిణభాగానికి ఏడాది క్రితం అలైన్మెంట్ పూర్తయినా, ఇప్పటికీ కేంద్రం నుంచి ఆమోదం లభించలేదు. ఆ భాగానికి సంబంధించి ఎలాంటి కసరత్తు జరగటం లేదు. నిజానికి ఈ రెండు భాగాలను భారత్‌మాల పరియోజన కార్యక్రమంలో చేర్చాల్సి ఉంది. ఉత్తర భాగాన్ని గతంలోనే ఆ జాబితాలో చేర్చారు. కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయం లోపించటం, భూసేకరణ పరిహారంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించే విషయంలో అగాధం ఏర్పడటంతో రోడ్డు ప్రక్రియలో జాప్యం జరిగింది. భారత్‌మాల పరియోజనపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవటంతో రీజినల్ రింగురోడ్డును దాని నుంచి మినహాయించారు. దీంతో మిగిలిపోయిన 7500 కి.మీ. నిడివి గల ఎక్స్‌ప్రెస్‌వే పనులతోపాటు మరో 5000 కి.మీ. ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టులను చేరుస్తూ 2047 సంవత్సరం లక్ష్యంతో కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది.భారత్‌మాల పరియోజనలో చోటు దక్కిన వాటిని ముందు నిర్వహించి, రెండో ప్రోగ్రామ్‌లో ఉన్న వాటిని తర్వాత నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి తగ్గట్టుగానే నిధుల కేటాయింపు ఉంటుంది. రింగు ఉత్తరభాగాన్ని తొలుత భారత్‌మాలలో చేర్చినందున, దానిని అలాగే కొనసాగిస్తూ దక్షిణభాగాన్ని రెండో ప్రోగ్రామ్‌లో చేర్చారు. ఫలితంగా దక్షిణ భాగం పనులు ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలే లేవు. దీనిని ఇటీవల ముఖ్యమంత్రి కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణ భాగాన్ని మరో రకంగానైనా చేపట్టాలని కోరారు. దీనిపై అధికారులతో చర్చించిన మీదట, పీడబ్ల్యూడీ ద్వారా నిర్వహించే అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న జాతీయ రహదారుల విభాగం(ఎన్‌హెచ్)ను పీడబ్ల్యూడీకి స్థానిక ప్రత్యామ్నాయంగా వ్యవహరిస్తున్నది. ఈ విభాగం ద్వారా నిర్వహించే రోడ్డు పనులకు కేంద్రమే నిధులు సమకూరుస్తున్నా, పనుల నిర్వహణ మాత్రం పూర్తిగా రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతాయి. భారత్‌మాల పరియోజన కింద కేంద్రప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండే ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో ఉత్తరభాగం, రాష్ట్రప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండే ఎన్‌హెచ్ విభాగం ఆధ్వర్యంలో దక్షిణభాగం పనుల నిర్వహణ ఉంటుందన్నమాట. దీనిపై కేంద్రప్రభుత్వం స్పష్టత ఇచ్చాక తదుపరి కార్యాచరణ ఉంటుంది. అదే జరిగితే ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో ఉత్తరభాగం పనులు ప్రారంభమైన వెంటనే ఎన్‌హెచ్ ఆధ్వర్యంలో దక్షిణభాగం పనులు పట్టాలెక్కుతాయి. ఆ విభాగానికి పెద్ద టాస్కే..రింగురోడ్డు దక్షిణ విభాగం పనుల అంచనా దాదాపు రూ.19 వేల కోట్లు ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్‌హెచ్ విభాగం ఇంత పెద్ద పనులు చేపట్టలేదు. దాదాపు 2500 హెక్టార్ల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. తక్కువ నిడివి ఉండే జాతీయ రహదారులను ఆ విభాగం చేపడుతూ వచ్చింది. ఇప్పుడు రీజినల్ రింగురోడ్డు బాధ్యత వస్తే ప్రత్యేకంగా అంతర్గతంగా కొన్ని విభాగాలనే ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు సిబ్బందిని కూడా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. -
HMDA: ఆమ్రపాలికి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్ల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టే యోచనలో ఉంది తెలంగాణ సర్కార్. సీబీఐ లేదా అదేస్థాయి సంస్థలతో విచారణ చేయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హెచ్ఎండీఏ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్పై సమీక్ష జరిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం.. రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్కు అనుసంధానంగా రేడియల్ రోడ్లు అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. మాస్టర్ ప్లాన్-2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఇదీ చదవండి: హెచ్ఎండీఏ డైరెక్టర్లే లక్ష్యంగా.. విజిలెన్స్ సోదాలు! -
APSRTC: 541 అద్దె బస్సులకు ఆర్టీసీ టెండర్లు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో అద్దె బస్సుల కోసం ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. ఎంఎస్టీసీ ఈ-కామర్స్ పోర్టల్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఆర్టీసీ 541అద్దె బస్సుల కోసం టెండర్లను పిలిచింది. ఆసక్తి ఉన్నవారు ఎంఎస్టీసీ ఈ-కామర్స్ పోర్టల్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఈ నెల 21 నుంచి మార్చి 6వ తేదీ వరకు బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. మార్చి 14వ తేదీ ఈ–వేలం నిర్వహిస్తారు. అద్దె బస్సులు నిర్వహించా ల్సిన రూట్లు, టెండరు నిబంధనలు, ఇతర వివరాల కోసం తమ వెబ్సైట్ http://apsrtc.ap.gov.inను సంప్రదించాలని ఏపీఎస్ ఆర్టీసీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. టెండర్లు పిలిచిన బస్ సర్వీసుల వివరాలు ఏసీ స్లీపర్–2, నాన్ ఏసీ స్లీపర్–9, సూపర్ డీలక్స్–22, అల్ట్రా డీలక్స్–33, ఎక్స్‌ప్రెస్–168, అల్ట్రా పల్లెవెలుగు–74, పల్లె వెలుగు–225, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు–3, సిటీ ఆర్డినరీ–5. -
2,002 ఎకరాల్లో బల్క్‌డ్రగ్ పార్క్
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద 2,001.8 ఎకరాల్లో బల్‌్కడ్రగ్ పార్క్ రూపుదిద్దుకోనుంది. ఈ బల్‌్కడ్రగ్ పార్కును ఈపీసీ విధానంలో నిర్మించడానికి ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. రూ.1,234.75 కోట్లతో బల్‌్కడ్రగ్ పార్కును డిజైన్ చేసి అభివృద్ధి చేసే విధంగా ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. 2001.8 ఎకరాల్లో.. 139.07 ఎకరాల్లో ఉన్న చెరువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పార్కును అభివృద్ధి చేయనున్నారు. అభివృద్ధి చేసిన పార్కులో 1,009.85 ఎకరాల్లో ఫార్మా పరిశ్రమలు, 595.4 ఎకరాల్లో ఏపీఐ–డీఐఎస్ సింథసిస్, 414.1 ఎకరాల్లో ఫెర్మిటేషన్స్, 150 ఎకరాలు ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే విధంగా ఈ పార్కును అభివృద్ధి చేయనున్నారు. మార్చి 18 నాటికి బిడ్డింగ్ ప్రక్రియ పూర్తిచేసి పనులు అప్పగించనున్నారు. చైనా నుంచి ఫార్మా దిగుమతులను తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మూడు బల్‌్కడ్రగ్ పార్కులను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తే.. 16 రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ ఈ పార్కును కైవసం చేసుకున్న విషయం విదితమే. తొలుత కాకినాడ వద్ద నిర్మించడానికి ప్రయత్నం చేయగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేయాలన్న నిబంధన మేరకు నక్కపల్లి వద్ద పార్కును అభివృద్ధి చేస్తున్నారు. ఫార్మాహబ్‌గా ఏపీ ఈ బల్‌్కడ్రగ్ పార్కుతో రాష్ట్రం ఫార్మాహబ్‌గా ఎదగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో 300కు పైగా ఫార్మా కంపెనీలున్నాయి. ఈ బల్క్ డ్రగ్ పార్కు అందుబాటులోకి వస్తే 100కు పైగా ఫార్మా కంపెనీలు కొత్తగా ఏర్పాటవుతాయని అంచనా వేస్తున్నారు. వీటిద్వారా 27,360 మందికి ప్రత్యక్షంగా ఉపాధికి లభిస్తుందని అంచనా. ప్రస్తుతం దేశీయ ఫార్మా ఉత్పత్తుల్లో రాష్ట్రం 16 శాతం వాటాతో మూడోస్థానంలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.41,500 కోట్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు వస్తుండగా.. అందులో రూ.8,300 కోట్లకుపైగా ఎగుమతులు జరుగుతున్నాయని అంచనా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2,400 ఎకరాల్లో అభివృద్ధి చేసిన జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఇప్పటికే మైలాన్, ఫైజర్, డాక్టర్ రెడ్డీస్, అరబిందో వంటి 60కి పైగా దిగ్గజసంస్థలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ బల్‌్కడ్రగ్ పార్కు అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ కంపెనీలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
మంగంపేట గనులపై దొంగరాతలా?
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంగా రామోజీరావు మరింత రెచ్చిపోతున్నారు. ప్రభుత్వంపై ఏదో ఒకలా బురదజల్లి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. తద్వారా తన చంద్రబాబుకు మేలు చేయాలని ఆరాటపడుతున్నారు. అందులో భాగంగానే మంగంపేట బెరైటీస్ గనుల టెండర్లపైనా అడ్డగోలు రాతలు రాశారు. ‘మంగంపేట ముగ్గురాయి గనుల్లో భారీ దోపిడీకి తొలగిన తెర’ అంటూ అవాస్తవాలతో కూడిన కథనాన్ని శుక్రవారం ఈనాడులో అచ్చేశారు. నిబంధనల ప్రకారమే అంతా సక్రమంగా జరిగినా అబద్ధాలతో ఆ కథనాన్ని నింపేశారు. అన్నమయ్య జిల్లా మంగంపేటలో గనుల్లో ఏటా 30 లక్షల టన్నుల బెరైటీస్‌ను ఏపీఎండీసీ ఉత్పత్తి చేస్తోంది. ఇందులో సగటున 10 లక్షల టన్నులు ‘ఎ’ గ్రేడ్, 3 లక్షల టన్నులు ‘బి’ గ్రేడ్ కాగా, మిగిలిన 17 లక్షల టన్నులు ‘సీ, డీ – డబ్ల్యూ (వేస్ట్)’ గ్రేడ్లుగా ఉంటుంది. సీ, డీ గ్రేడ్ ఖనిజానికి డిమాండ్ తక్కువగా ఉండటంతో గత కొన్నేళ్లుగా వాటి నిల్వలు పెద్దఎత్తున పేరుకుపోయాయి. ఇప్పటి వరకు దాదాపు 80 లక్షల టన్నుల సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ బెరైటీస్ నిల్వలు అమ్ముడవకుండా ఉండిపోయింది. దాని విక్రయం, బెనిఫికేషన్ కోసం గతంలో పలుసార్లు టెండర్లు పిలిచినా సరైన స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఏపీఎండీసీ ఆ నిల్వల విక్రయానికి టెండర్లు పిలిచింది. సాధారణంగా ఏటా 20 లక్షల టన్నుల సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ ఖనిజానికి టెండర్లు పిలుస్తారు. కానీ కొనుగోలుదారుల నుంచి స్పందన రావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏడాదికి 20 లక్షల టన్నుల చొప్పున ఐదేళ్లకు ఒకేసారి కోటి టన్నుల ఖనిజానికి టెండర్లు పిలిచారు. ఈ వాస్తవం తెలియకుండా అభూత కల్పనలతో ఒకేసారి కోటి మెట్రిక్ టన్నులకు టెండర్లు పిలిచారంటూ మతి లేని కథనాన్ని ఈనాడు ప్రచురించింది. సీ, డీ గ్రేడ్ ఖనిజానికి రిజర్వు ధరను తగ్గించారంటూ మరో తప్పుడు ఆరోపణ చేసింది. నిజానికి రిజర్వు ధర నిర్ణయానికి సంబంధించి జీవో 262ను 2017లో చంద్రబాబు హయాంలోనే విడుదల చేశారు. ఆ జీవోలోని నిబంధనలకు అనుగుణంగానే ఇప్పుడు రిజర్వు ధరను నిర్ణయించారు. అంతర్జాతీయ మార్కెట్‌కు తగ్గట్టు రేటును పెట్టారు. ఎంఎస్టీసీ పర్యవేక్షణలో టెండర్ల ప్రక్రియ టెండర్ల ప్రక్రియను మినీరత్నగా కేంద్రం గుర్తించిన ఎంఎస్టీసీ పర్యవేక్షిస్తోంది. కేంద్ర నిబంధనల ప్రకారమే ధరావత్తు ఖరారు చేశారు. 17 రోజుల్లో టెండర్లను పూర్తి చేయాలనేది కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే. టెండర్ డాక్యుమెంట్ ధరను ఖరారు చేసే క్రమంలో టెండర్ ప్రక్రియకు సంబంధించిన డాక్యుమెంటేషన్, కన్సల్టెన్సీ చార్జీలు, ప్రిపరేషన్, కమ్యూనికేషన్ చార్జీలు, ఎంఎస్టీసీ చెల్లింపులకయ్యే మొత్తాన్ని లెక్కించి ధర నిర్ణయించారు. సాధారణంగా ఏ సంస్థ అయినా అనుసరించే ఈ విధానాన్ని ఈనాడు మాత్రం అక్రమం అంటూ చిత్రీకరించడం విడ్డూరం. న్యాయ సమీక్షకు పంపలేదంటూ అవగాహనారాహిత్యాన్ని ఆ కథనంలో చూపించింది. రూ.100 కోట్లకుపైగా వ్యయం అయ్యే ప్రాజెక్టును నిర్వహించే టెండర్లను మాత్రమే న్యాయ సమీక్షకు పంపుతారు. బెరైటీస్ నిల్వలను విక్రయించేందుకు పిలిచిన టెండర్లలో వ్యయం ఎక్కడ ఉంది? ఇది న్యాయ సమీక్ష పరిధిలోకి రాదనే కనీస జ్ఞానం లేకుండా ఆ కథనాన్ని ప్రచురించినట్లు స్పష్టమవుతోంది. దుర్బుద్ధితోనే ఈ కథనం రాసినట్లు తెలుస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం నాణ్యమైన బెరైటీస్‌తో పాటు సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ ఖనిజాన్ని ఎప్పటికప్పుడు విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాలను దోపిడీగా చిత్రీకరించడం దారుణం. ఈ తప్పుడు కథనంపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం. – వీజీ వెంకటరెడ్డి, వీసీ అండ్ ఎండీ, ఏపీఎండీసీ -
TS: ప్రజాభవన్‌లో రిపేర్లకు అంత ఖర్చా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ కాస్త ప్రజా భవన్‌గా మారింది. ప్రజా సందర్శనకు అనుమతి ఇస్తూ.. వాటి ముందు ఉన్న బారికేడ్లను సైతం తొలగించారు. ఆపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ప్రజా భవన్‌ను కేటాయించారు. అయితే కేసీఆర్ హయాంలో దుబార జరిగిందని.. కాబట్టి హంగులు ఆర్బాటాలకు పోకుండా ఉంటామని ప్రకటించుకుంది రేవంత్ సర్కార్. కానీ, ప్రజా భవన్ రిపేర్ల కోసం చేస్తున్న ఖర్చుపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రజా భవన్లో టాయిలెట్ల రిపేర్లు కోసం.. అలాగే దోమ తెరల కోసం రూ.35 లక్షలకు టెండర్లను కాంగ్రెస్ ప్రభుత్వం పిలిచినట్లు తెలుస్తోంది. మరో టెండర్లో భాగంగా జిమ్ రూంలో పొడుగు అద్దాలు, గన్‌మెన్ రూముల కోసం రూ.28.70 లక్షలకు టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతుల పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న ఈ ప్రచారంపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
టీడీపీ హయాంలో చంద్రబాబు ఇంటి దగ్గరే అక్రమ తవ్వకాలు
-
Fact Check: ‘మీటర్ల’ కొద్దీ అసత్యాలు అల్లేస్తున్నారు!
సాక్షి, అమరావతి: అర్హత ఉన్నవారెవరైనా స్మార్ట్ మీటర్ల టెండర్ ప్రక్రియలో పాల్గొనవచ్చని స్పష్టంగా చెప్పి.. వచ్చిన టెండర్లలో పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసి తక్కువ ధర వచ్చేలా రివర్స్ టెండరింగ్ కూడా జరిపి.. అప్పుడు వ్యవసాయ బోర్లకు స్మార్ట్‌మీటర్లు బిగించే టెండర్‌ను ఖరారుచేసినా ఈనాడు రామోజీరావు పెడబొబ్బలు పెడుతున్నారు. అదేదో ఘోరమైనట్లు తన విషపుత్రిక ఈనాడులో పిచ్చి రాతలు రాసిపారేస్తున్నారు. తమకు అభ్యంతరంలేదని రైతులే చెబుతున్నా స్మార్ట్‌మీటర్లపై ఆ పత్రిక పదే పదే విషం కక్కుతోంది. ఇందులో భాగంగానే ‘స్మార్ట్‌గా మేసేస్తున్నారు’ పేరుతో గురువారం మరోసారి అక్కసు వెళ్లగక్కింది. కానీ, ఎప్పటిలాగే రామోజీ రాతల్లో ఏమాత్రం వాస్తవంలేదని.. అయినా రైతులకు లేని అభ్యంతరం ఆయనకెందుకని ఆంధ్రప్రదేశ్ దక్షిణ, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీ కె. సంతోషరావు, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ఐ.పృధ్వీతేజ్‌లు తెలిపారు. శాస్త్ర, సాంకేతికతపై అవగాహనా లేమితో ఈనాడు కథనం వాస్తవానికి దూరంగా వుందని వారు తెలిపారు. ఈ మేరకు సీఎండీలు ‘సాక్షి’కి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. నాణ్యమైన విద్యుత్ కోసమే స్మార్ట్ మీటర్లు.. పూర్వం వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు మీటర్ల ద్వారా విద్యుత్ వినియోగం జరిగేది. ఆ తర్వాత మోటార్ హార్స్ పవర్ ప్రాతిపదికన వినియోగాన్ని లెక్కించడంతో మీటర్ల వాడకం తగ్గింది. ఆ తర్వాత విద్యుత్ సంస్థలు విడతల వారీగా వినియోగదారులకు కెపాసిటర్లను అందించినప్పటికీ కాలక్రమేణా వాటిని రైతులే తీసేశారు. దీంతో సరఫరాలో హెచ్చుతగ్గులు వచ్చి ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయి. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వ ఉత్తర్వులు (జిఓ ఎంఎస్. 22, తేదీ : 01.09.2020) జారీచేసింది. దీని ప్రకారం.. ఃనాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంతో పాటు విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసమే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుచేస్తున్నాం. తద్వారా రైతు ఖాతాలో నెలవారీ వినియోగ చార్జీలను ప్రభుత్వం జమచేస్తోంది. ఆ మొత్తాన్ని రైతులు డిస్కంలకు చెల్లిస్తారు. ఒక్కో వ్యవసాయ విద్యుత్ సర్వీసుకు అనుబంధ పరికరాలకు రూ.12,128.71పై.. పన్నులతో కలిపి రూ.14,455ల వ్యయంతో మీటరు బాక్స్‌తో పాటు పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్ పరికరాలను ఏర్పాటుచేస్తున్నాం. తద్వారా ‘ఆర్డీఎస్ఎస్’ పథకంలో 60 శాతం గ్రాంటు రూపంలో డిస్కంలకు సమకూరుతుంది’.. అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రమాదాలను తగ్గించవచ్చు.. అనుబంధ పరికరాలైన పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, మీటరు అమర్చడానికి, అవి పాడైపోకుండా వుండేందుకు వీలుగా మీటరు బాక్సులను ఏర్పాటుచేస్తున్నాం. ఎంసీబీ ద్వారా ఓవర్ లోడ్ ప్రొటెక్షన్ జరుగుతుంది. తద్వారా విద్యుత్ ప్రమాదాలను తగ్గించడంతోపాటు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్‌ను కూడా తగ్గించవచ్చు. ప్రస్తుతం ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటి మరమ్మతుల కోసం ఏటా రూ.102 కోట్ల వ్యయాన్ని డిస్కంలు భరించాల్సి వస్తోంది. కెపాసిటర్లను అమర్చడం ద్వారా నాణ్యమైన ఓల్టేజ్‌తో రైతులకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. మహారాష్ట్రతో పోలికేంటి? మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎంఎస్‌ఇడీసీఎల్) సంస్థ పరిధిలో హెచ్‌వీడీఎస్ పథకం కింద వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు వాల్ మౌంటెడ్ ఎస్ఎంసీ మీటరు బాక్సును మాత్రమే రూ.2,100లతో ఏర్పాటుచేశారు. అయితే, మన రాష్ట్రంలో ఏర్పాటుచేస్తున్న ఎస్ఎంసీ మీటరు బాక్సులో అనుబంధ పరికరాలైన పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్ పరికరాలు కూడా వుండడంతో మీటరు బాక్సు సైజు సుమారు రెండింతలు వుంటుంది. మహారాష్ట్ర స్మార్ట్ మీటర్లు గృహ, వాణిజ్య వినియోగదారుల కోసం అమర్చుతున్నారు. ఇక్కడ పూర్తిగా వ్యవసాయ విద్యుత్ ఆధారిత సర్వీసులకు మాత్రమే పెడుతున్నాం. వ్యవసాయ స్మార్ట్ మీటర్ అమర్చడంతో గృహ, వాణిజ్య అవసరాల కోసం అమర్చిన స్మార్ట్ మీటర్లను పోల్చడం సరికాదు. మీటర్లతో అందరికీ మేలు.. మీటర్ల ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సబ్సిడీ మొత్తం మిగులుతుంది. ఈ మిగులు డబ్బుతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుంది. డిస్కంకు జవాబుదారీతనం పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 7వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో రాష్ట్రవ్యాప్తంగా వున్న వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుతో లోడ్ సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటూ భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకునే సౌలభ్యం వుంటుంది. అంతేకాక.. సరఫరాలో అంతరాయాలను, ఓల్టేజ్ హెచ్చుతగ్గులను రైతులు, సంస్థ మధ్య పారదర్శకతను పెంపొందించేందుకు అవకాశం వుంటుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా టెండర్ల ప్రక్రియలో అర్హత సాధించిన సంస్థలకే పనులను అప్పగించాం. ఈ ప్రక్రియలో ఎలాంటి గోప్యతకు ఆస్కారం లేదు. విద్యుత్ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) పథకంలో భాగంగా స్మార్ట్ మీటర్లను 2025 మార్చిలోపు ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆ మేరకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటుచేస్తున్నామని సీఎండీలు వివరించారు. తెలియకపోతే తెలుసుకోండి.. విద్యుత్ సంస్థల్లో డీబీటీ విధానం కోసం 93 నెలల కాలపరిమితితో టెండర్లను ఆహ్వానించాం. అనుబంధ పరికరాలకు సంబంధించిన టెండరును విక్రాన్ ఇంజనీరింగ్ అండ్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకోవడంతో ఆ సంస్థ అనుబంధ పరికరాలను బాక్సులో అమర్చి సరఫరా చేసి వ్యవసాయ సర్వీసు వద్ద అమర్చుతోంది. అంతేతప్ప అది ఖాళీ బాక్సులు ఇస్తున్నట్లు కాదు. ♦ స్మార్ట్ మీటర్ల టెండర్లను దక్కించుకున్న షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ విక్రాంత్ సంస్థ అమర్చిన అనుబంధ పరికరాలతో కూడిన మీటరు బాక్సులో మీటరు సరఫరా, అమరిక, అనుసంధానం పనులు చేపడుతోంది. ♦ ఈ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత సెంట్రల్ సర్వర్లతో అనుసంధానం అయిన ప్రతి సర్వీసు మీటర్ డేటా ఆన్లైన్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ♦సరఫరాలో అంతరాయాలను, ఓల్టేజ్ హెచ్చుతగ్గులను నివారించడంతో పాటు రైతులు, సంస్థ మధ్య పారదర్శకతను పెంపొందించేందుకు అవకాశం వుంటుంది. ♦ ఒప్పందం ప్రకారం డేటా నమోదైన సర్వీసులకు మాత్రమే ప్రతినెలా బిల్లింగ్ చేయడం జరుగుతుంది. ♦ మీటర్ రీడింగ్‌లో సర్వే, జీఎస్ మ్యాపింగ్, అనుసంధానం, హెచ్ఏఎస్, ఎంఏఎస్, ఎంఎంఎస్, సిమ్‌కార్డ్ రెంటల్, నెట్వర్క్ కాస్ట్, ఆపరేషన్–మెయింటినెన్స్ వంటి సేవలను పొందుపరిచారు. ♦ వ్యవసాయ సర్వీసులు దూరంగా వుండడంవల్ల నెట్వర్క్ హెచ్చుతగ్గులు ఉన్నచోట మీటరు దగ్గరకు వెళ్లి మీటరు డేటా స్వీకరిస్తున్నారు. ∙దీని అంచనా సుమారు 15 శాతంగా నిర్ణయించాం. ఈ అంచనా వ్యయం అధ్యయనం చేసిన తర్వాత నెలకు ఒక మీటరుకు రూ.197.05 పైసలుగా నిర్ణయించాం. -
సాంకేతిక నిపుణుల సూచనలతో పోలవరం పనులు
సాక్షి, అమరావతి: జాతీయ, అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల సూచనలు, సలహాలు తీసుకుని పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ దిశానిర్దేశం చేశారు. తొలి దశ సవరించిన అంచనా వ్యయాన్ని పది రోజుల్లోగా ఖరారు చేసి, పనులకు నిధుల సమస్య లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించి, గడువులోగా పూర్తి చేయడానికి ఈ సీజన్లో చేపట్టాల్సిన పనులను ఖరారు చేసేందుకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యాలయంలో ఆమె ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. డ్యామ్ డిజైర్ రివ్యూ ప్యానల్ (డీడీర్పి) చైర్మన్ ఏబీ పాండ్య, సీడబ్ల్యూసీ చైర్మన్ కుశీ్వందర్ సింగ్ వోరా, పీపీఏ చైర్మన్ శివ్‌నందన్‌కుమార్, సభ్య కార్యదర్శి రఘురాంతో పాటు రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని వివరించారు. నిపుణుల కమిటీ కోసం పీపీఏ టెండర్లు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య గోదావరి వరదల ఉద్ధృతికి కోతకు గురైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని యధాస్థితికి తెచ్చేందుకు చేస్తున్న పనులను వివరించారు. ఒక స్టోన్ కాలమ్ 45 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉండగా 2.30 గంటలు పడుతోందని, దీని వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు. స్టోన్ కాలమ్స్ వేయడంలో సహకరించేందుకు, డిజైన్లను రూపొందించేందుకు వేస్తామన్న నిపుణుల కమిటీని ఇప్పటిదాకా నియమించలేదని రాష్ట్ర అధికారులు చెప్పారు. డయాఫ్రమ్ వాల్లో జాయింట్లను అతికించడంలో కూడా నిపుణుల సలహాలు, సూచనలు అవసరమన్నారు. డయాఫ్రమ్ వాల్, స్టోన్ కాలమ్స్ వేయడంలో దేశంలో నిపుణుల కొరత ఉన్నందున, టెండర్ నోటిఫికేషన్ జారీ చేశామని పీపీఏ ఛైర్మన్ చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణులు కమిటీగా ఏర్పడి ఈ టెండర్లో పాల్గొంటారన్నారు. ఆ టెండర్‌ను ఖరారు చేసి నిపుణుల కమిటీని అందుబాటులోకి తెస్తామన్నారు. ఆలోగా డయాఫ్రమ్ వాల్, స్టోన్ కాలమ్స్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం సహా హెడ్ వర్క్స్‌లో చేయాల్సిన పరీక్షలను జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో చేయించి, నివేదిక సిద్ధంగా ఉంచాలని సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా ఆదేశించారు. ఆ పరీక్షల కోసం స్వీడన్‌కు చెందిన ఆఫ్రిన్ అనే సంస్థతో కాంట్రాక్టు సంస్థ మేఘా ఇప్పటికే ఒప్పందం చేసుకుందని అధికారులు వివరించారు. నిపుణుల కమిటీ సలహాతోనే డయాఫ్రమ్ వాల్ ఆఫ్రిన్ సంస్థ పరీక్షల నివేదిక ఆధారంగా పీపీఏ ఖరారు చేసే నిపుణుల కమిటీ స్టోన్ కాలమ్స్‌ను వేగంగా వేయడంపై సలహాలు ఇస్తుంది. ఆ పరీక్షల నివేదిక ఆధారంగా దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, దానికే మరమ్మతలు చేయాలా లేదంటే సమాంతరంగా కొత్త వాల్ నిర్మించాలా అనే అంశంపై సూచనలు చేయనుంది. వాటి ఆధారంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై సీడబ్ల్యూసీ తుది నిర్ణయం తీసుకోనుంది. సీడబ్ల్యూసీ నిర్ణయం ఆధారంగా డయాఫ్రమ్ వాల్ డిజైన్లను నిపుణుల కమిటీ రూపొందిస్తుంది. -
మొదలైన కొత్త మద్యం పాలసీ.. అప్పుడే 171 కోట్ల ఆదాయం!
మహబూబ్‌నగర్ క్రైం: రెండేళ్ల పాటు కొనసాగిన మద్యం పాలసీ గురువారంతో ముగిసింది. శుక్రవారం నుంచి కొత్త మద్యం పాలసీ విధానం అమల్లోకి రానుంది. పాత మద్యం దుకాణాలు నిర్వహించే వ్యాపారులకు 75శాతం రాకపోవడంతో ఇకపై ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు. కొత్తగా దుకాణాలను సొంతం చేసుకున్న వారితో కొందరు వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నారు. మరికొందరు తమ అనుచరులు, పనిచేసే వ్యక్తులతో టెండర్లు వేయించి దుకాణాలు దక్కేలా వేసిన ఎత్తుగడలు ఫలించాయి. మద్యం దుకాణాల్లో మళ్లీ లిక్కర్ కింగ్‌లదే పైచేయిగా మారింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆగస్టు 21న నిర్వహించిన టెండర్లలో మొత్తం 8,595 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.171.90కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి మద్యం దుకాణాలకు టెండర్లు రావడం ఆశ్చర్యం కల్గిస్తోంది. రోజురోజుకూ మద్యం వ్యాపారంపై చాలా మంది దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈసారి ఉమ్మడి జిల్లా వ్యాపారులతో పాటు ఆంధ్ర, కర్ణాటక నుంచి కూడా టెండర్లు దాఖలయ్యాయి. 2021 కంటే ఈసారి దరఖాస్తులు రెండింతలు పెరిగాయి. ప్రధానంగా మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలో దరఖాస్తులు రెట్టింపయ్యాయి. బిజీబిజీ.. ఉమ్మడి జిల్లాలో కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం నుంచి హడావుడి మొదలైంది. 230 దుకాణాల్లో కొన్నింటిని అదే దుకాణాల్లో ఏర్పాటు చేసుకుంటుంటే.. మరికొన్ని దుకాణాలు కొత్తగా నిర్మాణం చేసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం 10గంటల వరకు అన్నింటిని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వ్యాపారులు ఆయా దుకాణాల నిర్మాణ పనులు చేస్తూ బీజీబీజీగా కన్పించారు. లాభాలు ఉండటంతో.. మద్యం విక్రయాల వల్ల భారీగా లాభాలు ఉండటంతో మద్యం వ్యాపారులతో పాటు రాజకీయ నేతలు కూడా రంగప్రవేశం చేశారు. దుకాణం ఎవరి పేరుతో వచ్చినా అంతా కలిసే వ్యాపారం చేసుకోవాలని ముందుగానే ఒప్పందం చేసుకున్నారు. ఒక్కో దుకాణానికి ఒక్కొక్కరు 10మందికిపైగా బినామీ పేర్లతో దరఖాస్తు చేసుకున్నారు. వాళ్లలో ఏ ఒక్కరికి వచ్చినా అందరికీ లబ్ధి చేకూరేలా చేసుకున్నారు. మద్యం దుకాణాదారులే గ్రామాలు, వార్డుల్లో బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా చేస్తుంటారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో రూ.4వేల కోట్ల వ్యాపారం సాగుతుండగా.. రానున్న రోజుల్లో విక్రయాలు మరింత పెరుగుతాయనే విశ్వాసంతో వ్యాపారులు ఉన్నారు. -
ధాన్యం టెండర్లకు ఈసీ బ్రేక్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం రెండో దఫా పిలిచిన టెండర్లకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. గతేడాది యాసంగికి సంబంధించిన సుమారు 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో మూలుగుతోంది. ఈ ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లు ముందుకు రాలేదు. దీంతోపాటు గత వానాకాలం ధాన్యం కూడా మిల్లుల్లో సీఎంఆర్ కింద మిల్లింగ్ జరు గుతోంది. మరోవారంలో కొత్త పంట మళ్లీ మార్కె ట్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మిల్లుల్లోని ధాన్యా న్ని వదిలించుకునేందుకు ప్రభుత్వం తొలి విడత 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయించాలని నిర్ణయించింది. ఆగస్టులో పిలిచిన టెండర్లకు తక్కువ మొత్తంతో బిడ్లు రావడంతో వాటిని రద్దు చేసిన సర్కార్ ఈనెల 7న నిబంధనలు సడలిస్తూ రెండోసారి బిడ్లను ఆహ్వానించింది. ఈనెల 17తో గడువు ముగిసినప్పటికీ 21వ తేదీ వరకు గడువు పెంచారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ప్పుడు, టెండర్ల ప్రక్రియ ఎలా జరుపుతారని కాంగ్రెస్ సీనియర్ నేత జి.నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు టెండర్లను పిలవొద్దని ఆదేశించింది. -
ధాన్యం విక్రయ టెండర్లు రద్దు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైస్‌మిల్లుల్లో మూలుగుతున్న గత యాసంగి నాటి ధాన్యాన్ని విక్రయించేందుకు పౌరసరఫరాల సంస్థ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన 10 సంస్థలు హెచ్–1 ప్రాతిపదికన 25 లాట్లను దక్కించుకున్నాయి. కానీ సగటున క్వింటాల్‌కు రూ.375 నష్టానికి బిడ్లు ఆమోదం పొందడం, ప్రభుత్వానికి వెయ్యి కోట్ల మేర నష్టం వచ్చే అవకాశం ఉండటంతో.. ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ధాన్యం టెండర్లపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ టెండర్ల వ్యవహారాన్ని లోతుగా పరిశీలించి నష్టాన్ని అంచనా వేసింది. ఈ క్రమంలో సమాలోచనలు జరిపిన ప్రభుత్వ పెద్దలు.. ఈ టెండర్లను రద్దు చేసి, కొత్తగా బిడ్లను ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈసారి కనీస ధరను కోట్ చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం మద్దతు ధరతో సేకరణ రాష్ట్ర ప్రభుత్వం గత యాసంగి (2022–23)లో పౌర సరఫరాల సంస్థ ద్వారా రూ.2,060 మద్దతు ధరతో 66.85 లక్షల టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఆ ధాన్యాన్ని యథావిధిగా మిల్లులకు తరలించింది. దాన్ని సీఎంఆర్ కింద ముడిబియ్యంగా మిల్లింగ్ చేయాలని ప్రభుత్వం కోరినా.. అలా చేస్తే నూకల శాతం ఎక్కువై నష్టం వస్తుందని రైస్‌మిల్లులు తేల్చి చెప్పాయి. దీంతో సుమారు 9 నెలలుగా మిల్లుల్లో మూలుగుతున్న ఈ ధాన్యాన్ని టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్న ధరకన్నా తక్కువకు.. 25 ఎల్ఎంటీ ధాన్యాన్ని 25 లాట్లుగా విభజించి టెండర్లు పిలిస్తే 11 సంస్థలు ముందుకురాగా.. ఫైనాన్షియల్ బిడ్స్ తెరిచిన తరువాత గురునానక్ అనే సంస్థ తిరస్కరణకు గురైంది. మిగతా 10 సంస్థలకు హెచ్–1 ప్రాతిపదికన 25 లాట్లను కేటాయించారు. ఈ పది సంస్థలు 25 లాట్లను క్వింటాల్‌కు కనిష్టంగా రూ.1,618 నుంచి గరిష్టంగా రూ.1,732 ధరతో దక్కించుకున్నాయి. సగటున చూస్తే క్వింటాల్ ధర రూ.1,685 మాత్రమే అవుతోంది. ప్రభుత్వం కొన్నధర రూ.2,060తో పోలిస్తే క్వింటాల్‌కు రూ.375 చొప్పున తక్కువ వస్తుంది. మొత్తంగా రూ.925 కోట్ల నష్టమని అంచనా వేశారు. ఇక సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్నీ బ్యాగులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, కమీషన్లు, మిల్లులకు ధాన్యం రవాణా తదితర ఖర్చులన్నీ కలిపితే క్వింటాల్ ధాన్యానికి మరో రూ.100కుపైగా సర్కారు వెచ్చించింది. ఈ ఖర్చునూ కలిపితే.. మొత్తంగా 25 లక్షల టన్నుల ధాన్యం విక్రయంపై రూ.1,200 కోట్లవరకు నష్టం వస్తుందని లెక్కతేలింది. భారీ నష్టం నేపథ్యంలో ప్రస్తుత టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్లను ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలిసింది. -
ధాన్యం కొనుగోలుకు 54 టెండర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మిల్లుల్లో మూలుగుతున్న ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంచి స్పందన లభించింది. తొలి విడతగా 25 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని విక్రయించాలని భావించిన పౌరసరఫరాల సంస్థ ఈ మేరకు గత నెలలో టెండర్లను ఆహ్వనించింది. 25 ఎల్ఎంటీల ధాన్యాన్ని 25 లాట్లుగా విభజించి , ప్రతి ఎల్ఎంటీ ఒక లాట్‌గా ఆన్లైన్లో బిడ్స్ ఆహ్వనించింది. గురువారంతో గడువు ముగియగా, సాయంత్రం 5 గంటలకు అధికారులు టెక్నికల్ బిడ్లు తెరిచారు. 25 లాట్ల కోసం మొత్తం 54 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఇందులో 8 లాట్లకు సంబంధించి కేవలం ఒక్కో బిడ్ మాత్రమే దాఖలైనట్లు విశ్వసనీయ సమాచారం. మిగతా 17 లాట్ల కోసం 46 సంస్థలు పోటీ పడ్డాయి. యాసంగిలో 66.85 ఎల్ఎంటీల ధాన్యం సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా గత యాసంగి (2022–23)లో 66.85 ఎల్ఎంటీల ధాన్యాన్ని సేకరించారు. ఈ మొత్తం ధాన్యాన్ని మిల్లుల్లో నిల్వ చేయగా, అందులో కొంత భాగం అకాల వర్షాల కారణంగా తడిచిపోయింది. తడిచిన ధాన్యంతో పాటు మిగతా ధాన్యాన్ని కూడా ముడి బియ్యంగా మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లు నిరాకరించారు. బాయిల్డ్ రైస్‌గా మాత్రమే ఇస్తామని చెప్పినా, కేంద్రం నిబంధనలతో అది సాధ్యం కాలేదు. దీంతో మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని ఏక మొత్తంగా విక్రయించాలని ప్రభుత్వం భావించింది. పౌరసరఫరాల సంస్థ సీఎండీ అనిల్‌కుమార్ ఈ మేరకు నివేదిక రూపొందించగా, తొలి విడత 25 ఎల్ఎంటీలు విక్రయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గత నెలలో ప్రక్రియ ప్రారంభం అయింది. గురువారం గడువు ముగిసే సమయానికి 54 టెక్నికల్ బిడ్లను ధ్రువీకరించారు. ఈ సంస్థల పూర్వాపరాలు పరిశీలించి, అర్హత పొందిన వాటిని ఫైనాన్షియల్ బిడ్లకు ఎంపిక చేస్తారు. ఈనెల 16న ఫైనాన్షియల్ బిడ్లను తెరిచిన అనంతరం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీ అర్హులైన సంస్థలను ఎంపిక చేయనుంది. -
నిమ్స్‌కు రూ.1,800 కోట్ల రుణం మంజూరు
లక్డీకాపూల్ (హైదరాబాద్): నిజాం వైద్య విజ్ఞా న సంస్థ (నిమ్స్) విస్తరణ పనులకు రూ. 1,800 కోట్లు రుణాన్ని మహారాష్ట్ర బ్యాంక్ మంజూరు చేసింది. నిమ్స్ ఆస్పత్రి విస్తరణలో భాగంగా నిర్మించతలపెట్టిన 2 వేల పడకల దశాబ్ది బ్లాక్‌కు సీఎం కేసీఆర్ జూన్ 14న భూమి పూజ చేశారు. నిమ్స్‌కు కేటాయించిన 33 ఎకరాల్లో విస్తరణ పనుల్లో భాగంగా కొత్తగా మూడు భవనాలను నిర్మించనున్నారు. ఇందుకు ఆర్అండ్బీ అధికారులు టెండర్ల ప్రక్రియను చేపట్టారు. ఈనెల 31న టెండర్లను ఖరారు చేయనున్నారు. అందులో భాగంగా మహారాష్ట్ర బ్యాంక్ రుణ సదుపాయాన్ని కల్పించింది. ఈ రుణ మొత్తాన్ని నిమ్స్ నిరీ్ణత కాల వ్యవధిలో బ్యాంక్‌కు చెల్లించాల్సి ఉంది. పేదలకు మరింత మెరుగైన సేవలు అందించేందు కు చేస్తున్న కృషిలో భాగంగా విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందుకు నిమ్స్ ప్రత్యేకంగా ఓ రిటైర్డ్ ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీర్ లక్ష్మారెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. -
కిక్కే కిక్కు.. తెలంగాణ అబ్కారీ శాఖకు కాసుల పంట!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మద్యం టెండర్ల ప్రక్రియకు గడువు ముగిసింది. చివరి రోజు 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. శంషాబాద్, సరూర్ నగర్, మేడ్చల్, వరంగల్, మహబూబ్ నగర్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి.. అత్యల్పంగా నిర్మల్ నుంచి దాఖలయ్యాయి. మొత్తం లక్షకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ టెండర్ల ప్రక్రియ ద్వారా.. రూ.2వేల కోట్లు ఆదాయం వచ్చినట్లు సమాచారం. తద్వారా అబ్కారీ శాఖకు భారీగా ఆదాయం సమకూరినట్లయ్యింది రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు టెండర్లు నిర్వహించగా, ఎక్సైజ్ శాఖ అంచనాలను మించి దరఖాస్తులు వచ్చాయి. ఇవాళ రాత్రి 12 లేదా రాత్రి ఒంటి గంట వరకు పూర్తి స్థాయి లెక్కలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 1,03,489 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. గత ఏడాది 79 వేల దరఖాస్తులు రాగా, గత ఏడాదితో పోలిస్తే 40 శాతం దరఖాస్తులు పెరిగాయి. చదవండి: కాంగ్రెస్ రూట్లో కమలం.. సర్ప్రైజ్ అందుకే! ఇంకా ఆదాయం పెరిగే అవకాశం ఉండటంతో మద్యం టెండర్ ప్రక్రియతో అబ్కారీ శాఖకు కాసుల పంట పడుతోంది. ఈ నెల 21న లక్కీ డ్రా నిర్వహించనున్నారు. అదే రోజు లైసెన్సులు జారీ చేయనున్నారు. డిసెంబర్ 1నుంచి కొత్త షాపులు ప్రారంభం కానున్నాయి. టెండర్ల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ తెలంగాణ వైన్స్ టెండర్ల నోటిఫికేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రద్దు చేయాలంటూ లంబాడీ హక్కుల పోరాట సమితి నాయకులు భూక్యా దేవా నాయక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పీసా చట్టానికి అనుగుణంగా వైన్స్ టెండర్స్ నోటిఫికేషన్ జారీ చేయలేదంటూ పిటిషన్లో పేర్కొన్నారు. షెడ్యూల్ ఏరియాలో పీసా చట్టానికి అనుగుణంగా తీర్మాణాలు తెలంగాణ ఎక్సైజ్ శాఖ తీసుకోకుండా టెండర్ల ప్రక్రియ జారీ చేసిందని, వెంటనే టెండర్లు నిలిపి వేయాలంటూ పిటిషనర్ తరపు న్యాయవాది మంగీలాల్ నాయక్ కోరారు. రేపటి వరకు ప్రభుత్వం సమయం కోరగా, తదుపరి విచారణను హైకోర్టు.. రేపటికి వాయిదా వేసింది. -
పారదర్శకంగా స్మార్ట్ మీటర్ల టెండర్లు
సాక్షి, అమరావతి: వ్యవసాయ బోర్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు టెండర్ల ప్రక్రియ అంతా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగిందని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ.పృథ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు తెలిపారు. మీటర్ల ధర ఇతర రాష్ట్రాలకంటే మన రాష్ట్రంలో ఎక్కువగా ఉందని, టెండర్లలో అవకతవకలు ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగా కొందరికి టెండర్లు కట్టబెట్టారని, ఈ ఖర్చంతా ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలపైనే వేస్తారని పచ్చ పత్రికలు, విపక్షాలు చేస్తున్న తప్పు డు ప్రచారంపై వారు స్పందించారు. వారు శని వా రం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. టెండర్లలో ఎటువంటి దాపరికం లేదని స్పష్టంచేశారు. నిబంధనల ప్రకా రం జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ అనుమతి తీసుకొన్న తరువాత ఏపీ ఈ–ప్రొక్యూర్మెంట్ పో ర్టల్ ద్వారా టెండర్లను ఆహ్వానించామని చెప్పారు. దే శంలోని ప్రతి గుత్తేదారు పాల్గొనేలా టెండర్ల ప్రక్రి య పారదర్శకంగా నిర్వహించామని స్పష్టం చేశా రు. వారు వెల్లడించిన వివరాలు వారి మాటల్లోనే.. స్మార్ట్ మీటర్ల టెండర్లలో షిరిడీ సాయి, అదానీ సంస్థలు పాల్గొనగా షిరిడీ సాయి ఎల్ 1 గా నిలిచింది. అనుబంధ పరికరాల టెండర్లలో షిరిడీ సాయి, జీవీఎస్, విక్రాన్ సంస్థలు పాల్గొనగా షిరిడీ సాయి ఎల్ 1 గా నిలిచింది. ఒక్కో వ్యవసాయ సర్వీసుకు, అనుబంధ పరికరాలతో కలిపి రూ.11,191.64 మాత్రమే. పన్నులతో కలిపి మొత్తం రూ.13,334.88 ఖర్చవుతుంది. స్మార్ట్ మీటర్ల ధరను మాత్రమే కేంద్రం రూ.6 వేలతో అంచనా వేసింది. ఒక్కో మీటరు వ్యయం రూ.36,700కు కొంటుందనడంలో వాస్తవం లేదు. ఆపరేషన్, మెయింటెనెన్స్, రీడింగ్స్ కోసం అయ్యే మొత్తాన్ని నెలవారీగా 93 నెలల కాంట్రాక్ట్ కాల వ్యవధిలో ప్రాజెక్టు వ్యయాన్ని చెల్లిస్తారు. వీటికి నెలకు రూ.194 చొప్పున టెండర్లను దాఖలు చేశారు. మీటరు బాక్స్‌తో పాటు పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్ పరికరాలను ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా విద్యుత్ ప్రమాదాలు, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ తగ్గుతాయి. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. రైతులు పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్తు యథాతథంగా కొనసాగుతుంది. ప్రజల నుంచి ఏ విధమైన ట్రూ అప్ చార్జీలు వసూలు చేయరు. ఉత్తరప్రదేశ్‌లోని మధ్యాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ మీటరుకు రూ.10 వేలు చొప్పున సింగిల్ ఫేజ్ మీటర్లను మాత్రమే ఏర్పాటు చేస్తోంది. వీటికి ఎటువంటి అనుబంధ పరికరాలూ లేవు. మన రాష్ట్రంలో మొత్తం అన్ని పంపుసెట్లకు త్రీ ఫేజ్ స్మార్ట్ మీటర్లతో పాటు అనుబంధ పరికరాలను ఏర్పాటు చేస్తున్నాం. మహారాష్ట్రలోని పట్టణ ప్రాంతాల్లో ఒక్కో స్మార్ట్ మీటరుకు ఏడున్నరేళ్ల పాటు నెలకు రూ.200.96గా ధర ఖరారు కాగా వాటిలో 80 శాతం సింగిల్ ఫేజ్వే. ఏపీలో మొత్తం త్రీ ఫేజ్ మీటర్లే. అయినప్పటికీ ఇక్కడ 93 నెలలకు నెలకు రూ.194 మాత్రమే చెల్లిస్తారు. -
తెలంగాణలో మద్యం షాపుల టెండర్లకు దరఖాస్తుల స్వీకరణ
-
ఒక ఎంపీ అడిగితే వివరాలివ్వకపోవడమేంటి..?: హైకోర్టు
-
ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోవడమేంటి?: హైకోర్టు
సాక్షి,హైదరాబాద్: ఓఆర్ఆర్ టోల్గేట్ టెండర్లపై రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోవడమేంటి?. ఆర్టీఐ ఉన్నది ఎందుకు? ప్రతిపక్షాలకు వివరాలు ఇవ్వకపోతే అసెంబ్లీలో వారు ఏం మాట్లాడతారంటూ హైకోర్టు ప్రశ్నించింది. 2 వారాల్లోగా రేవంత్ అడిగిన వివరాలు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. వివరాలు ఇచ్చేందుకు సిద్ధం అని కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. తదుపరి విచారణ ఆగస్టు 4కి కోర్టు వాయిదా వేసింది. కాగా, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) టోల్ నిర్వహణ బదిలీ (టీవోటీ)కి సంబంధించిన సమాచారాన్ని, సమాచార హక్కు చట్ట ప్రకారం కోరినా అధికారులు ఇవ్వడం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గత నెల 14న దరఖాస్తు చేసినా ఇప్పటివరకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. అధికారుల తీరు ఆర్టీఐ చట్టంతో పాటు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను కూడా ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. తాను మే 1న తొలిసారి దరఖాస్తు చేయగా, మే 23న అరకొర సమాచారం మాత్రమే ఇచ్చారని వివరించారు. దీంతో జూన్ 14న మరోసారి దరఖాస్తు చేశానన్నారు. ఓఆర్ఆర్ లీజు నివేదికలు, 30 ఏళ్లకు ఇవ్వడంపై మంత్రిమండలి నిర్ణయం, 2021–22, 2022–23 సంవత్సరాలలో ఆర్జించిన మొత్తం ఆదాయానికి సంబంధించి సమాచారం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. లీజు పారదర్శకంగా జరిగిందా? లేదా? తెలుసుకోవడానికి ఈ సమాచారం కీలకం అన్నారు. చదవండి: లిక్కర్ స్కాం: కల్వకుంట్ల కవిత పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ప్రజా సంబంధాల అధికారి, ఎండీ(ఎఫ్ఏసీ)లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆర్టీఐ చట్టం ప్రకారం కోరిన సమాచారం ఇచ్చేలా ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఓఆర్ఆర్ నిర్వహణ, టోలు వసూలు బాధ్యతలను 30 ఏళ్ల పాటు ఐఆర్బీ ఇన్ఫ్రాస్టక్చర్ డెవెలప్మెంట్ లిమిటెడ్, ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్‌లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
ఇంకా అందని పుస్తకం.. మొదలవ్వని పాఠం
పాఠశాలలు ప్రారంభించి 15 రోజులవుతోంది. ప్రైవేటు స్కూళ్లలో ఇప్పటికే కొన్ని చాప్టర్లకుసంబంధించిన పాఠాలు పూర్తయ్యాయి. కానీ వేలాది ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ఇప్పటివరకు కనీసం ఒక్క పాఠం కూడా ఉపాధ్యాయులు బోధించలేదు. రాష్ట్రవ్యాప్తంగా 26 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలుంటే... ఇప్పటికీ 15 వేలకు పైగా స్కూళ్ళలో ఇప్పటికీ పాఠాలు మొదలవ్వలేదు. పాఠ్య పుస్తకాలు అందకపోవడంతో జూలై నెల ప్రారంభమైనా ఇంకా పునఃశ్చరణకే పరిమితం అవ్వాల్సి వస్తోంది. –సాక్షి, హైదరాబాద్ హెచ్ఎంలకు బిల్లులు ఇవ్వకపోవడంతో.. వాస్తవానికి స్కూళ్ళు తెరిచేలోగా పుస్తకాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు తగ్గట్టుగానే పుస్తకాల ముద్రణపైనా దృష్టి పెట్టారు. ముద్రణ పూర్తయిన పుస్తకాలను స్కూళ్ళు తెరిచేలోగానే జిల్లా కేంద్రాలకు పంపారు. కానీ వాటిని వేసవి సెలవులు ముగిసేలోగా స్కూళ్ళకు చేరవేయడంలో సర్కారు విఫలమయ్యింది. ప్రతి ఏటా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు జిల్లా కేంద్రాల నుంచి స్కూళ్ళకు పుస్తకాలు చేరవేసే వాళ్ళు. ఇందుకయ్యే రవాణా ఖర్చులను ప్రభుత్వం భరించేది. అయితే గత ఏడాదికి సంబంధించిన బిల్లులు ఏడాది గడిచినా ఇవ్వకపోవడంతో హెచ్ఎంలు ఈ ఏడాది మొండికేశారు. దీంతో కొద్దిరోజుల క్రితం వరకు పుస్తకాలన్నీ జిల్లా కేంద్రాల్లోనే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో రవాణా కోసం ప్రత్యేకంగా టెండర్లు పిలవాలని విద్యాశాఖ ఆదేశించినా, ఈ ప్రక్రియ కూడా చాలా ఆలస్యం అయ్యింది. టెండర్ల ఖరారులో ఆలస్యం.. పుస్తకాలను స్కూళ్లకు రవాణా చేసేందుకు ప్రతి జిల్లా డీఈవో పరిధిలో టెండర్లు పిలిచారు. అయితే స్కూళ్ళు తెరిచిన తర్వాత టెండర్లు పిలవడంతో వాటిని ఖరారు చేసేవరకే జూన్ నెలాఖరు అయ్యింది. ఈ కారణంగానే రాష్ట్రంలోని సగానికిపైగా స్కూళ్లకు పాఠ్య పుస్తకాలు అందలేదు. పుస్తకాల రవాణా పూర్తి చేసేందుకు మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని టెండర్లు దక్కించుకున్న సంస్థలు చెబుతున్నాయి. పంపిణీ పూర్తయినా కొరతే.. రాష్ట్రవ్యాప్తంగా 28,77,675 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నారు. వీరికి ఉచితంగా పుస్తకాలు అందించాల్సి ఉంటుంది. సబ్జెక్టులు, లాంగ్వేజీలు కలిపి 1,63,78,607 పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. గత ఏడాది ముద్రించినవి పోను, 1,57,48,270 పుస్తకాలు అందించాల్సి ఉంది. ఇప్పటివరకు 1,35,85,185 పుస్తకాలు ముద్రించి, జిల్లా కేంద్రాలకు కూడా చేరవేశారు. ఇంకా 14 శాతం పుస్తకాలు ముద్రించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న వాటి పంపిణీ పూర్తి చేసినా, కొన్ని స్కూళ్ళకు పుస్తకాల కొరత తప్పేట్టు లేదు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు వచ్చే నెలాఖరు వరకూ కూడా పుస్తకాలు అందే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. రెగ్యులర్ క్లాసులు మొదలు పెట్టాలి.. పుస్తకాల పంపిణీ ఆలస్యమై ఇప్పుడిప్పుడే పాఠశాలలకు చేరుతుండటంతో.. ప్రస్తుతం చాలావరకు ప్రాథమిక పాఠశాలల్లో గతేడాది మొదలు పెట్టిన తొలిమెట్టు కార్యక్రమం కొనసాగుతోంది. ప్రాథమికోన్నత పాఠశాలలు, హైస్కూల్స్‌లో పునఃశ్చరణ చేస్తున్నారు. కోవిడ్ కాలంలో జరిగిన అభ్యసన నష్టాన్ని పూడ్చడం కోసం ఈ ప్రక్రియ అనివార్యమని విద్యాశాఖ భావించింది. అయితే దీన్ని అదనపు గంటల్లో చేపట్టి, రెగ్యులర్ క్లాసులు మొదలు పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
కనీస ధర 350 కోట్లేనా!.. బీసీసీఐ ఎందుకిలా?
టీమిండియా క్రికెట్‌కు త్వరలోనే కొత్త స్పాన్సర్షిప్ రానుంది. ఈ మేరకు బీసీసీఐ టీమిండియా లీడ్ స్పాన్సర్స్ హక్కుల కోసం రూ. 350 కోట్ల బేస్‌ప్రైస్‌తో టెండర్లకు ఆహ్వానించింది. బీసీసీఐ జూన్ 14న టెండర్లను రిలీజ్ చేసింది. పోటీకి వచ్చే సంస్థలకు జూన్ 26 వరకు టెండర్లను దక్కించుకునే అవకాశం ఇచ్చింది. ఇటీవలే టీమిండియా టూల్ కిట్ స్పాన్సర్‌గా ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ ఆదిదాస్‌తో బీసీసీఐ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐదేళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. ఈ క్రమంలోనే లీడ్ స్పాన్సర్‌గా కూడా ఎక్కువ కాలం ఉండే సంస్థతోనే ఒప్పందం చేసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే రూ. 350 కోట్లను బేస్‌ప్రైస్‌గా బీసీసీఐ నిర్ణయించడం ఆసక్తి కలిగించింది. గతంలో బైజూస్ సంస్థ టీమిండియాకు స్పాన్సర్స్‌గా వ్యవహరించినప్పుడు భారత జట్టు స్వదేశంలో ఆడే ఒక్కో మ్యాచ్‌కూ రూ.5.07 కోట్లను బైజూస్ చెల్లించేది. అదే ఐసీసీ, ఏసీసీకి సంబంధించిన టోర్నీల్లో అయితే మ్యాచ్‌కు రూ.1.56 కోట్లు చెల్లించేది. కానీ ఈసారి మాత్రం స్పాన్సర్ షిప్ హక్కుల కనీస ధరను బీసీసీఐ బాగా తగ్గించినట్లు తెలుస్తోంది. మరి ఈ హక్కులు ఎవరికి దక్కుతాయో చూడాలి. కాగా టీమిండియా ఇటీవలే ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎలాంటి స్పాన్సర్స్ లేకుండానే బరిలోకి దిగింది. బీసీసీఐ తక్కువ ధరకే స్పాన్సర్షిప్ కోసం టెండర్లను పిలవడం వెనుక ఒక కారణం ఉన్నట్లు సమాచారం. ఖర్చును తగ్గించుకునే పనిలోనే బీసీసీఐ స్పాన్సర్షిప్ కొనుగోలు విషయంలో తెలివైన నిర్ణయం తీసుకుందని నిపుణులు అంటున్నారు. ''లీడ్ స్పాన్సర్ హక్కులకు చాలా రియలిస్టిక్‌గా కనీస ధరను బీసీసీఐ నిర్ణయించింది. ఇంతకాలం క్రికెట్‌పై భారీగా ఖర్చు పెట్టిన చాలా మంది స్పాన్సర్లు తమ ఖర్చును భారీగా తగ్గించేసుకుంటున్నారు'' అంటూ అభిప్రాయపడ్డారు. చదవండి: హరారే స్పోర్ట్స్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం.. ఐసీసీ కీలక ప్రకటన -
టెండర్లు జీరో.. చేపపిల్లల సరఫరాకు వ్యాపారుల అనాసక్తి
నారాయణపేట: జిల్లాలో చేపపిల్లల పంపిణీకి రెండు సార్లు టెండర్లకు పిలిచినా ఎవరూ ముందుకురావడం లేదు. దీంతో అధికారులు ఎటూ తేల్చలేక ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. మత్య్సకారులకు జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో వందశాతం సబ్సిడీపై చేపపిల్లలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో కలెక్టర్ దిశానిర్దేశంతో జిల్లా మత్య్సశాఖ అధికార యంత్రాంగం ప్రణాళికలను సిద్ధంచేసి టెండర్లకు పిలుపునిచ్చింది. కానీ ఎవరూ చేప పిల్లలను సరఫరా చేసేందుకు ముందుకు రాలేదు. ప్రభుత్వం ఽనిర్ణయించిన ధరలకు వ్యాపారస్తులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష నియమించిన టెండర్ల కమిటీ చైర్మన్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, మెంబర్, కం కన్వీనర్‌గా జిల్లా మత్య్సశాఖ అధికారి రానాప్రతాప్ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియను ఈ ప్రొక్య్రూట్మెంట్ను ఈనెల 12న ఓపెన్ చేసి చూడగా ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో ఈ నివేదికను రాష్ట్ర ఉన్నతాధికారులకు జిల్లా మత్య్స శాఖ అధికారులు పంపించినట్లు తెలుస్తోంది. గడువు పెంచినా.. చేపపిల్లలను సరఫరా చేసేందుకు గతనెల 5న బిడ్ కాలింగ్ చేస్తూ రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బిడ్ డాక్యుమెంట్‌ను గతనెల 12 నుంచి డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు తొలిసారిగా మే 30 గడువు విధించారు. అప్పటి వరకు ఏ ఒక్క కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో మరోసారి గడువును జూన్ 12వరకు పెంచింది. అయినప్పటికి చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం టెండర్లను ఓపెన్ చేయడంతో స్పష్టమైంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు చేప పిల్లలను పంపిణీ చేయలేమని బహిరంగంగానే కాంట్రాక్టర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. రెండుసార్లు అవకాశం ఇచ్చిన ప్రభుత్వ ధరకు గిట్టుబాటు కాదనే ముందుకు రావడంలేదని సమాచారం. ధరలు పెరిగేనా.. టెండర్లు అయ్యేనా? ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కాక కాంట్రాక్టర్లు ఆశించిన స్థాయిలో ధరలు పెరుగుతాయనేది కష్టమే అనిపిస్తోంది. చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ట్రాన్స్‌ఫోర్ట్ ఖర్చులతో పాటు విత్తనోత్పత్తి ఖర్చులు పెరిగాయంటూ వ్యాపారస్తులు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సరఫరా చేయలేమంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేపపిల్లల వ్యాపారస్థులు ఏకమై ఎక్కడా టెండర్లు వేయలేదని తెలుస్తోంది. ప్రభుత్వం ధరలు పెంచకపోతే సకాలంలో టెండర్లు అయ్యే అవకాశం కనిపించడం లేదనిపిస్తోంది. రూ.1.78 కోట్లతో ఆహ్వానం.. ఈ ఏడాది చేపపిల్లలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. పెద్దసైజు చేపపిల్లలు (80–100 ఎంఎం) 81.03 లక్షల చేపలకు గాను రూ.1.22 కోట్లు నిర్ణయించింది. టెండర్లు దక్కించుకున్న వారు బొచ్చ40 శాతం, రోహు 50 శాతం, మ్రిగాల 10శాతం చేప పిల్లలను సరఫరా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చిన్న చేపపిల్లలకు (45–40 ఎంఎం) ధర రూ.56.17 లక్షలు నిర్ణయించి టెండర్లకు పిలిచింది. అయితే టెండర్లు వేసే వ్యాపారస్తులు 106.29 లక్షల చేపపిల్లలను (బొచ్చ 35శాతం, రోహు 35శాతం, బంగారుతీగ 30శాతం చొప్పున) సరఫరా చేయాల్సి ఉంటుంది. టెండర్లు వేయలేదు.. చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ఆన్లైన్లో టెండర్లు వేసేందుకు ఈనెల 12తో గడువు ముగిసింది. అయితే టెండర్లు ఎవరూ వేయలేదు. సంబంధిత నివేదికలను ఉన్నతాధికారులకు పంపించాం. త్వరలో మళ్లీ టెండర్లు పిలిచే అవకాశం ఉంది. – రానాప్రతాప్, జిల్లా మత్య్సశాఖ అధికారి, నారాయణపేట 2020 నుంచి చేప పిల్లల ధరలు ఇలా.. చేప పిల్లల పంపిణీ విషయంలో ప్రతి ఏటా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. 2020వ సంవత్సరంలో జిల్లాలోని 590 చెరువులు, మూడు రిజార్వాయర్‌లో వదిలేందుకు కావాల్సిన 1.60 కోట్ల చేపపిల్లల(సీడ్స్)ను రూ. 96.10 లక్షలతో కై కలూరి నుంచి కోనుగోలు చేసింది. అందులో 85–100 ఎంఎం సైజు చేపపిల్లలు లక్షకు రూ. 1.04,000 చొప్పున 40లక్షలు కొనుగోలు చేయగా, 35–40 ఎంఎం సైజు చేపపిల్లలు లక్షకు 45,786 చొప్పున 1.20 కోట్లు కొనుగోలు చేసింది. ● 2021లో సంవత్సరంలో 1.84 కోట్ల చేప పిల్లలను చేసేందుకు టెండర్లు పిలువగా వనపర్తి జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ ముందుకు వచ్చి రూ.1.49 కోట్లకు టెండర్లు వేసి సరఫరా చేశారు. అందులో 85–100 ఎంఎం సైజు చేపపిల్లలు లక్షకు రూ.1.58,000 చొప్పున 43లక్షల చేప పిల్లలకు గాను రూ.67,46,600లు, 35–40 ఎంఎం సైజు చేపపిల్లలు.. లక్ష పిల్లలకు 58వేల చొప్పున రూ1.41 కోట్ల చేప పిల్లలకుగాను రూ. 82,24,980లకు సరఫరా చేశారు. ● 2022 లో టెండర్లు వేసిన వారిలో ఎల్–1 తప్పుకోవడంతో మిగతా నలుగురు కలిసి చేప పిల్లలను పంపిణీ చేశారు. చేపపిల్లలను పంపిణీ చేసిన వారిలో పద్మనాగ భూని నాగ వెంకటసూర్య సతిస్ రాజ్‌కుమార్ కై కలూరు (ఏపి) 35–40 ఎంఎం రూ.43,800, 80–100 ఎంఎంకు రూ.1,33,650కు ఎల్2గా టెండర్ దక్కించుకున్నారు. అయితే టెండర్లలో పాల్గొన్న మరో ముగ్గురు సైతం రాజ్‌కుమార్‌తో కలసి (అక్వా స్పార్క్ హచారీ నర్వ మండలం ఉందేకోడ్కు చెందిన వ్యాపారి, డి.శివకుమార్ ఆత్మకూర్ మండలం అరెపల్లికి చెందిన వ్యాపారి) చేప పిల్లలను పంపిణీ చేశారు. -
అదిగో పులి.. అంటే, ఇదిగో తోక.. ఈనాడు తీరిదే! ఖరారుకాని టెండర్లపై కట్టుకథ
సాక్షి, అమరావతి: అదిగో పులి.. అంటే, ఇదిగో తోక.. అన్నట్లుంది ఈనాడు తీరు. అసలు టెండర్లే ఖరారు కాని స్మార్ట్ మీటర్లపై అప్పుడే ప్రజలపై భారం మోపేసినట్లు ఇష్టారాజ్యంగా కట్టుకథలు అల్లేస్తోంది. నిజానికి.. రాష్ట్రంలో దాదాపు 1.96 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులుంటే వాణిజ్య, పరిశ్రమ, ప్రభుత్వ సంస్థలకు, ట్రాన్స్ఫార్మర్లకు, 11 కేవీ ఫీడర్లకు కలిపి 42 లక్షల మీటర్లకు మాత్రమే టెండర్లు పిలిచారు. ఇందులో తొలివిడతలో ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 8,04,864 స్మార్ట్ మీటర్లు, ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 9,77,288 స్మార్ట్ మీటర్లు, ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 9,85,894 స్మార్ట్ మీటర్లు ఉన్నాయి. అవికూడా ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. కానీ, ఈనాడు మాత్రం రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారుల సర్వీసులన్నింటికీ స్మార్ట్‌మీటర్లు పెట్టి, ప్రతినెలా గృహ వినియోగదారులపై నెలకు రూ.153.40 భారం మోపనున్నారని అదానీ ‘స్మార్ట్’ షాక్ అంటూ అడ్డగోలు రాతలు అచ్చేసింది. ఈనాడు రాసిన అబద్ధాల వెనుక అసలు నిజాలు ఇవీ.. ఆరోపణ: స్మార్ట్ మీటర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై రూ.29 వేల కోట్ల భారంవేసి, భారీగా బాదేసేందుకు సిద్ధమైంది. వాస్తవం: ఇది పూర్తిగా పచ్చి అబద్ధం. పదేళ్ల పాటు స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు, నిర్వహణకు రూ.5 వేల కోట్ల వరకు వ్యయం అవుతుందని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు అంచనా వేశాయి. అది వదిలేసి రూ.29వేల కోట్లని కాకిలెక్కలతో పచ్చపత్రిక పిచ్చిరాతలు రాసింది. విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించే చర్యలలో భాగంగా డిస్కంల పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) ద్వారా 2025 నాటికి ప్రతి విద్యుత్ సర్వీసు, ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లకు స్మార్ట్‌మీటర్స్ అమర్చాలని కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీలు నిబంధన విధించాయి. ఈ ఆదేశాలను అనుసరించి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల డిస్కంలు ఈ పనులు చేపట్టాయి. ఏదో ఏపీ మాత్రమే చేస్తున్నట్లు చెప్పడం ప్రజలను ఏమార్చే ప్రయత్నమే ఇది. వినియోగదారులపై ఎటువంటి అదనపు భారంలేకుండా స్మార్ట్‌మీటర్ల ఏర్పాటువలన కలిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. దీని ద్వారా మీటరుకు రూ.1,350 వరకు గ్రాంట్ పొందే వెసులుబాటు కల్పించింది. దానితోపాటు ఇతర రాష్ట్రాల్లో ఖరారుచేసిన రేట్లను దృష్టిలో పెట్టుకుని, నోడల్ ఏజెన్సీ అయిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) ఆమోదం, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తీసుకున్న తరువాతే టెండర్లు ఖరారుచేస్తారు. ఈ విషయాన్ని దాచి, టెండరు ఖరారు కాకుండానే ప్రతినెలా రూ.153.40 భారం అని ప్రచురించటం పూర్తిగా అవాస్తవం. ఆరోపణ: టెండర్ల వివరాలను డిస్కంలు అత్యంత రహస్యంగా ఉంచాయి. వాస్తవం : ప్రస్తుత టెండర్లను 42 లక్షల మీటర్లకు మాత్రమే డిస్కంలు పిలిచాయి. ఇందులో వినియోగదారుల మీటర్లతో పాటు ఫీడర్ మీటర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల (డీటీఆర్) మీటర్లు, ఎల్టీ, సీటీ మీటర్లు, సీటీ, పీటీ మీటర్లు ఉన్నాయి. టెండర్ డాక్యుమెంట్లను న్యాయ సమీక్షకు పంపించిన తరువాతే ఏపీ ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ ద్వారా పారదర్శకంగా టెండర్లు పిలిచింది. ఇందులో టెండర్ల వ్యవహారం గుట్టుగా జరిగిందేమీలేదు. ఆరోపణ : ప్రజలపై పడే భారాన్ని లెక్కచేయకుండా ప్రభుత్వం ముందుకెళ్తోంది. వాస్తవం : స్మార్ట్‌మీటర్ల ద్వారా విద్యుత్ కనెక్షన్ల వినియోగం, ఇతర సర్వీస్ వినియోగ వివరాలను ఆన్లైన్ ద్వారా రియల్ టైం డేటాను పొందే సౌలభ్యం ఉంటుంది. అందువల్ల మీటర్ రీడింగ్ లను మనుషుల అవసరం లేకుండా తీసుకోవచ్చు. ఎనర్జీ ఆడిటింగ్, అకౌంటింగ్ వ్యవస్థను పటిష్టవంతం చేయడం ద్వారా విద్యుత్ నష్టాల తగ్గింపు, బిల్ తీసేందుకు అయ్యే ఖర్చులో మిగులు, ముందుస్తు చెల్లింపు వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఇలా మిగిలిన దాని నుంచే గుత్తేదారు సంస్థకు డిస్కం నేరుగా ఏర్పాటు, నిర్వహణ ఖర్చులు చెల్లిస్తుంది. వినియోగదారులు ఆఫ్ పీక్ సమయాలలో విద్యుత్‌ను ఉపయోగించినప్పుడు అదనపు రాయితీని పొందవచ్చు. మొబైల్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు విద్యుత్ వినియోగం తెలుసుకుని అవసరమైన మేర రీచార్జ్ చేసుకోవటం ద్వారా పొదుపును పాటించవచ్చు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ప్రతి వినియోగదారునికీ స్మార్ట్‌మీటర్ అమర్చాలని నిబంధనలున్నా, రాష్ట్రంలో మన డిస్కంలు ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఐఆర్డీఏ మీటర్ల ద్వారా వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించడంలో దేశంలోనే ఉత్తమంగా ఉండడంతో, కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించి వాటిని స్మార్ట్ మీటర్ల ఏర్పాటు నుంచి మినహాయించాయి. ఇవన్నీ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేసినవే. -
Hyderabad Metro: ‘ఎయిర్‌పోర్టు మెట్రో’కు గ్లోబల్ టెండర్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టుకు ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) కాంట్రాక్టర్ ఎంపిక కోసం హెచ్ఏఎంఎల్ టెండర్లను ఆహ్వానించింది. ఈ కాంట్రాక్టు అంచనా రూ 5,688 కోట్లు అని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వియస్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన కాంట్రాక్టర్ మెట్రో రైలు వ్యవస్థకు అవసరమైన ఎలివేటెడ్ వయాడక్ట్, భూగర్భ పనులు, స్టేషన్లు, ట్రాక్ పనులు, ఎలక్ట్రికల్, మెకానికల్, సరఫరా పనులను చేపట్టాల్సి ఉంటుంది. అలాగే రోలింగ్ స్టాక్ (రైలు బోగీలు), ఎలక్ట్రిక్ ట్రాక్షన్, విద్యుత్ సరఫరా, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్స్, రైలు నియంత్రణ వ్యవస్థలు, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (ఏఎఫ్సీ) గేట్లను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే, పెగ్ మార్కింగ్, అలైన్మెంట్ ఫిక్సేషన్ వంటి ప్రాథమిక పనులన్నింటినీ ఇప్పటికే పూర్తి చేశారు. భూసామర్థ్య పరీక్షల పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. కొత్త సర్వే ప్రకారం రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ టెర్మినల్ స్టేషన్ వరకు దూరం 31 కి.మీ. ఉంది. ఇందులో 29.3 కి.మీ. ఆకాశమార్గం (ఎలివేటెడ్) కాగా. అండర్‌గ్రౌండ్‌లో 1.7 కి.మీ పొడవున పనులు చేపట్టాల్సి ఉంటుందని ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. విమానాశ్రయ టెర్మినల్‌కు ఆనుకొని ఒక భూగర్భ మెట్రో స్టేషన్‌తో కలిపి రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు మొత్తం 9 స్టేషన్లు ఉంటాయి. ఆఖరు తేదీ జూలై 5 ఎయిర్‌పోర్టు మెట్రో రైలు నిర్మాణం పట్ల ఆసక్తి ఉన్న సంస్థలు జూలై 5లోగా టెండర్ పత్రాలను తెలంగాణ ప్రభుత్వ ఇ–పోర్టల్ https://tender. telangana.gov.in లో అప్లోడ్ చేయాలి. విమానాశ్రయ మెట్రో కారిడార్‌కు సమీపంలో అనేక వాణిజ్య, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం పెద్దఎత్తున జరుగుతోందని ఎన్విఎస్ రెడ్డి చెప్పారు. శివార్లలో మధ్యతరగతి వారికోసం తక్కువ ఖర్చుతో నివాసప్రాంతాలను అభివృద్ధి చేసి అన్ని తరగతులవారు ఎయిర్పోర్ట్ మెట్రో ద్వారా గమ్యస్థానాలకు చేరుకొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అవసరమైతే నాలుగు అదనపు స్టేషన్ల నిర్మాణానికీ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. టెండర్ విలువ, ప్రాజెక్టు వ్యయం వేర్వేరు ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.6,250 కోట్లు కాగా, ప్రస్తుతం రూ,5,688 కోట్లకే టెండర్లను ఆహ్వానించారు. దీనిపై ఎన్విఎస్ రెడ్డి స్పందిస్తూ, ప్రాజెక్టు వ్యయం, టెండర్ విలువ రెండూ భిన్నమైనవని చెప్పారు. అంచనా వేసిన టెండర్ విలువలో జీసీ ఖర్చు, ఆకస్మిక పరిస్థితులు, మల్టిమోడల్ ఇంటిగ్రేషన్ వంటివి ఉండవన్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో మాత్రం అవి ఉంటాయన్నారు. అందుకే ఈ రెండింటి మధ్య తేడా ఉన్నట్లు స్పష్టం చేశారు. -
పప్పు.. పాలు.. గుడ్లు.. టెండర్ల ఖరారు ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాల కింద సరుకుల పంపణీకి కాంట్రాక్టర్ల ఎంపిక అధికార యంత్రాంగానికి ప్రహసనంగా మారింది. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లను ఖరారు చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం టెండరులో పాల్గొంటున్న బిడ్డర్లు అత్యధిక ధరలు కోట్ చేయడమే. బిడ్డర్లు కుమ్మక్కై వాస్తవ ధరల కంటే అత్యధిక ధరలను కోట్ చేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న తీరును అధికారులు గుర్తించడంతో కాంట్రాక్టరు ఎంపిక వాయిదా పడుతూ వస్తోంది. దాదాపు రెండు నెలలుగా ఒక్క టెండరు సైతం ఖరారు కాలేదు. వన్.. టూ.. త్రీ.. అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన గర్భిణులు, బాలింతలు, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు ఉన్న చిన్నారులకు ఆరోగ్యలక్ష్మి తదితర పోషకాహార కార్యక్రమాల్లో భాగంగా పాలు, కోడి గుడ్లు, కందిపప్పును వివిధ రూపాల్లో అందిస్తున్నారు. సంపూర్ణ పోషకాహారం కింద పాలను, గుడ్లను నేరుగా అందిస్తుండగా... ఫుల్ మీల్స్‌లో భాగంగా కందిపప్పుతో కూడిన కూరలతో భోజనాన్ని ఇస్తున్నారు. ఈ పథకాలకు అవసరమైన పాలు, గుడ్లు, కందిపప్పును సరఫరా చేసేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తుంది.మూడు లేదా ఆరు నెలల పాటు ఈ కాంట్రాక్టును అప్పగించి సరుకులను స్వీకరిస్తుంది. తక్కువ ధరల కోసం.. ఈ క్రమంలో మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలో సరుకుల కొనుగోలు లక్ష్యంగా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు చేపట్టింది. కానీ ఇందులో పాల్గొంటున్న వారంతా మార్కెట్ ధర కంటే అత్యధిక ధరలను కోట్ చేస్తూ రావడంతో సర్కారు ఖజానాకు భారీగా గండి పడుతుందన్న భావనతో ఆ శాఖ టెండర్లను రద్దు చేస్తూ వస్తోంది. ► అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరా కోసం ఈ ఏడాది మార్చిలో మొదటిసారి, ఏప్రిల్ మొదటి వారంలో రెండోసారి టెండరు పిలిచారు. కానీ అందులో పాల్గొన్న సంస్థలు నిబంధనలకు సరితూగలేదు. దీంతో రెండు టెండర్ల ద్వారా అర్హులు ఎంపిక కాకపోవడంతో మరో టెండరు పిలవాల్సి వచి్చంది. ఈ క్రమంలో పాల పంపిణీకి ఇబ్బందులు కలగకుండా ఇప్పటివరకు పంపిణీ చేసిన సంస్థకు పాత ధరలోనే పంపిణీ చేసేలా అవకాశమిస్తూ ఆర్నెళ్లకు పొడిగిస్తూ రాష్ట్ర మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సెపె్టంబర్ వరకు పంపిణీకి అవకాశం దక్కినట్లయింది. ► కందిపప్పు పంపిణీకి మార్చి నెలాఖరులోనే టెండరు పిలిచింది. గత టెండరు సమయంలో కిలోకు రూ.114 చొప్పున పంపిణీ చేయగా... ఈ సారి టెండర్లు ఓ కనిష్ట ధర(ఎల్–1)ను రూ.145 కోట్ చేసింది. ఇక గరిష్ట ధర కింద ఏకంగా రూ.175 చొప్పున కోట్ చేశారు. గత ధర కంటే భారీగా ధరలు పెంచిన కారణంగా ఆ టెండరును రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రద్దు చేసింది. కొత్తగా మరో టెండరును పిలిచినప్పటికీ ధరలు ఆదే స్థాయిలో ఉండడంతో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ► కోడిగుడ్ల పంపిణీకి సంబంధించిన టెండరులో జిల్లాల వారీగా పంపిణీ దారుల ఎంపికకు టెండరు పిలిచింది. దీనిపై పలు పౌల్ట్రీ సంస్థల యజమానులు న్యాయపోరాటానికి ఉపక్రమించారు. కోర్టు కేసులు నమోదు చేయగా... కొన్నాళ్లుగా ఎంపిక ప్రక్రియ ముందుకు కదల్లేదు. తాజాగా వీటన్నింటినీ పరిష్కరించి కాంట్రాక్టర్లను ఎంపిక చేసేందుకు సీఎం కార్యాలయాధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆ పోస్టులకు ఏజ్ భారమైంది! వైద్య విద్య విభాగంలో ‘వయో పరిమితి’సంక్షోభం -
సీనరేజి వసూళ్లపై వక్రభాష్యం
సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై బురదచల్లే ఉద్దేశంతోనే ‘ఖనిజాల సీనరేజి వసూళ్లు ప్రైవేటుపరం’ అంటూ ఈనాడు పత్రిక తప్పుడు కథనాన్ని ప్రచురించిందని గనుల శాఖ సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు పెంచేలా పూర్తి అవాస్తవాలతో అందులోని రాతలు ఉన్నాయంటూ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అవినీతి, అలసత్వాన్ని పూర్తిగా తొలగించాలనే మంచి ఉద్దేశంతో పారదర్శక విధానాలకు పెద్దపీట వేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గనుల శాఖలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న విధానాలతో రాష్ట్రంలో మైనింగ్ కార్యక్రమాలు పెరిగాయన్నారు. తద్వారా అటు ప్రభుత్వానికి మైనింగ్ రెవెన్యూ, ఇటు పరిశ్రమలకు అవసరమైన ఖనిజాల లభ్యత, పెద్దఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఆ ప్రకటనలో ఇంకా ఏం పేర్కొన్నారంటే.. అధ్యయనం తరువాతే.. ఇతర రాష్ట్రాలు చిన్నతరహా ఖనిజాల సీనరేజి వసూళ్లను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం ద్వారా మైనింగ్ రెవెన్యూలో స్థిరత్వం, పురోగతి సాధిస్తున్నాయి. దీనిపై అధ్యయనం చేసి నివేదిక సమరి్పంచాలని ప్రభుత్వం ఇచి్చన ఆదేశాలతో గనుల శాఖకు చెందిన మైనింగ్ అధికారులు రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పర్యటించి ఈ విధానాన్ని అధ్యయనం చేశారు. దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని నివేదించడంతో ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీనరేజి వసూళ్ల కోసం మూడుసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఎక్కువమంది టెండర్లలో పాల్గొనేలా నిబంధనలను సరళతరం చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని మైనింగ్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మైనింగ్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలు, జనరల్ ఫైనాన్షియల్ రూల్స్–2017కు అనుగుణంగానే ప్రభుత్వం రిజర్వు ధర, సరళమైన నిబంధనలను అమలులోకి తెస్తూ టెండర్ల నిర్వహణకు ఆమోదం తెలిపింది. కొత్త నిబంధనలతో నిర్వహించిన టెండర్లలో 5 జిల్లాలకు టెండర్లు ఖరారయ్యాయి. మొదట సాంకేతిక బిడ్‌ను పరిశీలించి అందులో అర్హులైన వారిని మాత్రమే ఫైనాన్షియల్ బిడ్‌లో పాల్గొనేందుకు అనుమతిస్తున్నాం. కోట్ చేసిన వాటిలో అధిక మొత్తం నుంచి ఆక్షన్ ప్రారంభమవుతుంది. అంతకంటే ఎక్కువ ఎవరైతే కోట్ చేస్తారో వారికే టెండర్ దక్కుతుంది. ఇంత పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తుంటే ‘ఈనాడు’ పనిగట్టుకుని అబద్ధాలతో ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. టెండర్లలో ‘ఈనాడు’ పాల్గొనవచ్చు టెండర్లలో బిడ్లు దాఖలు చేసిన సంస్థల అర్హతలను మాత్రమే గనుల శాఖ పరిశీలిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న ఈనాడు పత్రికకు కనీసం ఈ విషయం తెలియకపోవడం బాధాకరం. ఆసక్తి ఉంటే ఈ టెండర్లలో ఈనాడు సంస్థ ప్రతినిధులు కూడా పాల్గొనవచ్చు. వారిని కూడా ఆహ్వానిస్తున్నాం . రాష్ట్రంలో ఖనిజాలను రవాణా చేసే వాహనాలను ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు పర్యవేక్షిస్తూ సీనరేజి వసూళ్లలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తారు. దీనివల్ల ప్రభుత్వానికి మైనింగ్ రెవెన్యూ పెరుగుతుంది. మైనింగ్‌పై పటిష్ట పర్యవేక్షణ కోసం సీఎం వైఎస్ జగన్ ప్రతి జిల్లాలో ఒక విజిలెన్స్ బృందాన్ని నియమించేలా ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం ఇంత మంచి విధానాన్ని అమలు చేస్తుంటే అవగాహన లేకుండా ఈనాడు పత్రిక వక్రీకరణ కథనాలను ప్రచురించడం సరికాదు. -
ఫేమ్ ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: టెండర్లలో తక్కువ మొత్తం కోట్ చేసిన కంపెనీకి ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా కాంట్రాక్టును అప్పగించే విషయంలో నెలకొన్న వివాదం సకాలంలో బస్సులు రోడ్డెక్కకుండా చేస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈపాటికల్లా 300 ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ విషయం కోర్టుకు చేరటంతో బస్సులు రావటానికి మరింత సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచే ఉద్దేశంతో తాజాగా ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఇన్ ఇండియా)–2 పథకం కింద 10 వేల బస్సులను రాయితీపై సరఫరా చేయాలని నిర్ణయించింది. తెలంగాణకు 300 బస్సులు మంజూరయ్యాయి. ఇటీవల కేంద్ర భారీ పరిశ్రమల శాఖ టెండర్లు పిలిచి ఖరారు చేసింది. ఇందులో ఎల్–1(తక్కువ మొత్తం కోట్ చేసిన కంపెనీ)గా వచ్చిన కంపెనీకి ఎక్కువ బస్సులు సరఫరా ఉన్న రాష్ట్రాల బాధ్యత అప్పగించింది. ఎల్–2గా ఉన్న కంపెనీ జాబితాలో తెలంగాణ ఉంది. కాగా ఎల్–2గా ఉన్న కంపెనీతో ఒప్పందం చేసుకునే సమయంలో వివాదం తలెత్తింది. ఆ కంపెనీ కోర్టుకు వెళ్లటంతో.. తొలుత టెక్నికల్ బిడ్ తెరిచినప్పుడు ఓ కంపెనీ బిడ్‌కు అర్హమైంది కాదని భావించిన అధికారులు దాన్ని తిరస్కరించారు. నిజానికి ఆ కంపెనీ కోట్ చేసిన మొత్తం ప్రకారం ఎల్–2 స్థానంలో అదే ఉంటుంది. మూడో స్థానంలో ఉన్న కంపెనీని ఎల్–2గా నిర్ధారించారు. దీనికి తెలంగాణకు బస్సుల సరఫరా బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. ఇంతలో అన ర్హమైందిగా అధికారులు తేల్చిన కంపెనీ కోర్టును ఆశ్రయించిందని, తీర్పు ఆ కంపెనీకి అనుకూలంగా వచ్చిందని అధికారులు చెబుతున్నారు. దీంతో మూడో స్థానంలో ఉన్న కంపెనీని ఎల్–2గా నిర్ధారిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తొలుత ఎల్–2గా నిర్ధారించిన కంపెనీకే బస్సుల సరఫరా బాధ్యత అప్పగించాల్సి ఉంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ఆ కంపెనీతో చర్చించే సమయంలో, కేంద్ర ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుని దీనిపై ఎలాంటి నిర్ణయానికి రావద్దని, తాము కోర్టు తీర్పును సవాల్ చేయబోతున్నామని చెప్పినట్టు సమాచారం. త్వరలో 500 అద్దె ఎలక్ట్రిక్ బస్సులు.. ఫేమ్–2 పథకం బస్సుల పరిస్థితి ఇలావుండగా, గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) పద్ధతిలో 500 ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి పిలిచిన టెండర్లలో రెండు బడా కంపెనీలు పాల్గొన్నాయి. టెక్నికల్ బిడ్ ఓకే అయింది. ఫైనాన్షియల్ బిడ్‌లో తక్కువ మొత్తం కోట్ చేసిన కంపెనీకి ఆర్డర్ ఇవ్వనున్నారు. మరో నెలరోజుల్లో ఈ బస్సుల రాక ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. -
భారీ వరదకూ చెక్కుచెదరకుండా పింఛా ప్రాజెక్టు పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: భారీ వరద వచ్చినా చెక్కు చెదరకుండా ఉండేలా పింఛా ప్రాజెక్టును ప్రభుత్వం పునరుద్ధరించనుంది. గతేడాది నవంబర్‌లో వచ్చిన ఆకస్మిక వరదలకు దెబ్బతిన్న ఈ ప్రాజెక్టును రూ.68.32 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పునరుద్ధరించనుంది. ఇందుకోసం లంప్సమ్ – ఓపెన్ విధానంలో రెండేళ్లలో పూర్తి చేయాలనే షరతుతో ఈ నెల 5న జలవనరుల శాఖ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 26న ఆర్థిక బిడ్‌ను తెరిచి, రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించనున్నారు. అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి మండలం ముడుంపాడు వద్ద పింఛా నదిపై 1954లో ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మించింది. కుడి కాలువ కింద 2211.31 ఎకరాలు, ఎడమ కాలువ కింద 1562.10 ఎకరాలు మొత్తం 3,773.41 ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీ (పిల్ల కాలువలు)లను అభివృద్ధి చేసింది. అప్పట్లో పింఛాకు గరిష్టంగా 58 వేల క్యూసెక్కుల వరద వస్తుందనే అంచనాతో ప్రాజెక్టు నిర్మించారు. గతేడాది నవంబర్ 14 నుంచి నల్లమల అడవుల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో పింఛా నది ఉప్పొంగింది. దాంతో గతేడాది నవంబర్ 18న లక్ష క్యూసెక్కులకుపైగా వరద వచ్చింది. వరద ధాటికి పింఛా ప్రాజెక్టు రింగ్ బండ్, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో పింఛాకు ఎంత వరద వచ్చినా చెక్కుచెదరకుండా ఉండేలా పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. పింఛాకు గరిష్టంగా వచ్చే వరదపై మళ్లీ అధ్యయనం చేసిన అధికారులు.. రూ.84.33 కోట్లతో పనులు చేపట్టడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాటిని ప్రభుత్వం ఆమోదించింది. దాంతో పనరుద్ధరణ పనులకు 68.32 కోట్ల అంచనా వ్యయంతో అధికారులు టెండర్లు పిలిచారు. -
స్మార్ట్ మీటర్లపై ‘పచ్చ’ పత్రిక అసత్య కథనాలు
పుంగనూరు (చిత్తూరు జిల్లా): ‘విద్యుత్ వినియోగంపై ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లపై అసత్య కథనాలు వల్లించి, విష ప్రచారం చేసి, టెండర్లకు ఎవరినీ రానీయకుండా చేయడమే ఈనాడు యాజమాన్యం లక్ష్యమా? ఆరోపణలు చేసే వారు టెండర్లు దాఖలు చేయండి.. ప్రభుత్వం ఎంత పారదర్శకంగా పనిచేస్తుందో మీకే అర్థమవుతుంది’ అంటూ రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈనాడు కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరు మండలం కురప్పల్లెలో గురువారం తొలిరోజు పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల విషయంలో ఆర్టీఎస్ఎస్ కింద కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు టెండర్లను ఆహ్వానించినట్టు తెలిపారు. ఈనాడులో రాసిన మేరకు షిరిడీసాయి ఎలక్ట్రికల్ వర్క్స్వారికి పనులు అప్పగించామని, సాధారణ మీటర్ల ధరతో పోల్చితే అధికంగా ఉందనడం బాధాకరమన్నారు. ఈనాడు పత్రిక తనకు నచ్చిన వారితో టెండర్లు వేసుకోవాలన్నారు. టెండర్లు జరగకుండా పనులు కేటాయించే ప్రసక్తే లేదని చెప్పారు. తెలిసీతెలియకుండా రాయడం మంచిదికాదని, ఇలాంటి విషయాల్లో తగిన సమాచారం సేకరించి వార్తలు రాస్తే బాగుంటుందని హితవుపలికారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. -
Fact Check: స్మార్ట్‌గా ‘పచ్చ’ అబద్ధాలు! ‘ఈనాడు’ రాసిన మరో దిగజారుడు కథనం
సాక్షి, అమరావతి: ఆర్థిక శాఖ అంటే ప్రభుత్వంలో భాగం కాదా? ఇంధన శాఖ అంటే ప్రభుత్వంలో భాగం కాదా? మరి ప్రభుత్వం కుంభకోణానికి ప్రయత్నిస్తే ఆర్థిక శాఖ, ఇంధన శాఖ ఆపటమేంటి? అసలు ఇలాంటి కథనానికి అర్థమేమైనా ఉందా? ‘స్మార్ట్ మేతకు ఎత్తు’ అంటూ గురువారం ‘ఈనాడు’ ప్రచురించిన వార్త ఇలాంటిదే. ప్రభుత్వం కుంభకోణానికి ప్రయత్నిస్తే, ‘ఇంధన, ఆర్థిక శాఖలు తీవ్ర అభ్యంతరం’ వ్యక్తం చేయడంతో ఆ ప్రయత్నం ఫలించలేదన్నది వార్త సారాంశం. స్మార్ట్ మీటర్ల విషయంలో ఆర్థిక శాఖ లేవనెత్తిన అంశాలను పరిశీలించి, తగిన వివరణ ఇవ్వాలంటూ డిస్కంలకు ఇంధనశాఖ కార్యదర్శి మూడు నెలల క్రితం రాసిన లేఖల అర్థ్ధాన్నే మార్చేసి... ఇప్పుడేదో జరిగిపోతున్నట్లుగా కథనాన్ని వండేసింది. విచిత్రమేంటంటే టెండర్లను పిలిచింది ప్రభుత్వమే. శ్రీకాకుళంలో స్మార్ట్ మీటర్లను ప్రయోగాత్మకంగా పరిశీలించిన మీదట... అక్కడ దాదాపు 20 శాతం విద్యుత్ వినియోగం తగ్గింది. పైపెచ్చు విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కం) చంద్రబాబునాయుడు ఏకంగా రూ.21,000 కోట్ల అప్పుల్లో ముంచి దిగిపోవటంతో వాటి ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతింది. వాటిని గాడిలో పెట్టాలంటే వాటికీ కాస్త జవాబుదారీ తనం పెరగాలి. మరోవంక మీటర్ల వల్ల రైతులు తాము వాడిన విద్యుత్తుకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో అందుకున్న సొమ్మును తామే నేరుగా డిస్కమ్‌లకు చెల్లిస్తారు. వారికి నాణ్యమైన విద్యుత్తును అడిగే హక్కుంటుంది. ఈ కారణాలతో స్మార్ట్ మీటర్లకు ప్రభుత్వం ముందడుగు వేసింది. కాకపోతే కోవిడ్ సమయంలో సరఫరా వ్యవస్థలు దెబ్బతిని... ప్రతి వస్తువు ధరా దారుణంగా పెరిగిన విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అప్పట్లో పిలిచిన టెండర్లు కావటంతో.. ముందుకొచ్చిన కంపెనీలు అప్పటికి తగ్గట్టు రేట్లు కోట్ చేశాయి. రకరకాల కారణాలతో టెండర్లు ఆలస్యం కావా? చివరకు కోవిడ్ తగ్గి పరిస్థితులు మామూలు స్థాయికి రావటంతో పరికరాల ధరలూ తగ్గుముఖం పట్టాయి. ఇది గమనించబట్టే ప్రభుత్వం టెండర్లను రద్దు చేసి... ప్రస్తుత ధరలతో పిలిస్తే కొంత ఆదా అవుతుందని భావించింది. అందుకే ప్రభుత్వమే టెండర్లను రద్దు చేసింది. మరి దీన్లో కుంభకోణమేంటో.. ప్రభుత్వమే స్కామ్ చెయ్యబోతే దాన్ని ఇంధన శాఖ ఆపేయటమేంటో... రామోజీరావే చెప్పాలి. ఇప్పుడైనా మీరు టెండర్లు వేయొచ్చు కదా? ప్రతిసారీ ప్రభుత్వం చెబుదున్నదొకటే. పనికిమాలిన ఆరోపణలు చేసే బదులు... అలాంటి టెండర్లలో మీరూ పాల్గొనవచ్చు కదా... అని!!. ఎందుకంటే అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ పద్ధతిలో వీటికి ప్రభుత్వం టెండర్లు పిలవనుంది. దాన్లో ఎవరైనా పాల్గొనవచ్చు.ఎవరు తక్కువకు కోట్‌చేస్తే... వారికే పని దక్కుతుంది. రకరకాల రాష్ట్రాల పేర్లు చెబుతూ ఎక్కడెక్కడ ఎంత తక్కువో చెబుతున్న రామోజీరావు... వారితో ఒప్పందం చేసుకుని తానే టెండర్లు వేయొచ్చు కదా? లేకపోతే రామోజీకి తందానతాన పలికే చంద్రబాబునాయుడే టెండర్లు వేయొచ్చు కదా? మీరు తక్కువ కోట్ చేస్తే మీకే వస్తుంది కదా? ఎందుకీ పనికిమాలిన ఆరోపణలు?. అయినా కేంద్ర ప్రభుత్వం ఈ మీటర్లకు గ్రాంటు ఇస్తూ... వీటి ఏర్పాటుకు రకరకాల నిబంధనలు పెట్టింది. ఆ మార్గదర్శకాలకు లోబడే ఎవరైనా చెయ్యాలి. అలాంటి వాస్తవాలు రాయనే రాయరు. ఇంకా ‘ఈనాడు’ రాసిన ఈ దిగజారుడు కథనంలో అసలు నిజాలేంటంటే... ఆరోపణ: ఇతర రాష్ట్రాల్లో వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు అమర్చే ఒక్కో స్మార్ట్ మీటర్ (3 ఫేజ్)కు రూ.3,500 వ్యయం వాస్తవం: ఇది పచ్చి అబద్ధం. ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలోనూ వ్యవసాయ మీటర్లకు టెండర్ల ప్రక్రియ పూర్తికాలేదు. దీనికితోడు కాంట్రాక్టు సంస్థలకు నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వం ముందే చెల్లించేస్తుందంటూ ‘ఈనాడు’ రాయటం కూడా పచ్చి అబద్ధమే. ఎందుకంటే నిర్వహణ వ్యయంలో మాత్రం 40 శాతాన్ని కాంట్రాక్టు సంస్థకు ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగిలిన 60 శాతాన్ని ఏడేళ్ల వ్యవధిలో చెల్లిస్తుంది. కానీ మొత్తం 100 శాతాన్నీ కాంట్రాక్టు సంస్థకు ప్రభుత్వం ముందే చెల్లించేస్తుందంటూ ‘ఈనాడు’ రాయటాన్ని ఏమనుకోవాలి? అయినా టెండర్ల ప్రక్రియే పూర్తికాకుండా... దానికి ఎక్కువ పెట్టేశారని ఒకసారి... ఇంధన శాఖ అడ్డుకోవటంతోనే రద్దు చేశారని మరోసారి... ఇలాంటి రాతలను ఏమనుకోవాలి రామోజీరావు గారూ? ఈనాడు’ ఆరోపణ: మహారాష్ట్ర కంటే ఆంధ్రప్రదేశ్‌లో మూడు రెట్లు ఎక్కువ వాస్తవం: రాష్ట్రంలో ఒక్కో స్మార్ట్ మీటర్ ఏర్పాటు, నిర్వహణకు నెలకు రూ.581.16 పైసలు అవుతుందనడం అబద్ధం. అసలు టెండర్లే ఖరారు కానపుడు రేట్లెలా నిర్ధారిస్తారు? ఇంకా విచిత్రమేంటంటే మహారాష్ట్రలోని మీటర్లతో వీటిని పోల్చటం. మహారాష్ట్రలో బెస్ట్ కంపెనీ స్మార్ట్ మీటర్లను అమర్చింది ప్రధానంగా అర్బన్ ప్రాంతంలోని ఇళ్లకు. 80 శాతం సింగిల్ ఫేజ్, 20 శాతం త్రీఫేజ్ మీటర్లు. నిర్వహణ కాల వ్యవధి ఏడున్నరేళ్లు. ఈ వ్యవధిలో కాంట్రాక్టరుకు చెల్లించాల్సిన మొత్తం మీటరుకు రూ.18,690. కానీ మన రాష్ట్రంలో అమరుస్తున్నది గ్రామాల్లో.. అది కూడా వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు. అన్నీ త్రీఫేజ్ మీటర్లే. మరి వాటికీ వీటికీ పోలిక ఎక్కడ? పైపెచ్చు మన రాష్ట్రంలో టెండర్లు పిలిచే నాటికి ఎక్కడా గ్రామీణ ప్రాంతాల్లో వీటిని అమర్చిన సందర్భాల్లేనందున దీనికి బెంచ్‌మార్క్ ధరంటూ లేదు. అయినా సరే.. కాంట్రాక్టు సంస్థలు కోట్ చేసిన ధర ఎక్కువని ప్రభుత్వమే భావించినందున ప్రభుత్వమే రద్దుచేసి మళ్లీ పిలుస్తోంది. కానీ ‘ఈనాడు’ వంకర రాతలే పనిగా పెట్టుకుంది. ‘ఆరోపణ: స్మార్ట్ మీటర్లలో ఫీచర్లు ఎక్కువ ఉన్నంత మాత్రన అంత ధరలా? వాస్తవం: ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఐఆర్డీఏ మీటర్లను మీటరు బోర్డుపై అమర్చారు. మీటర్ రీడర్లు ఐఆర్డీఏ పోర్టు ద్వారా రీడింగ్ తీయాలి. వేర్వేరు ప్రాంతాల్లోని ఈ వ్యవసాయ సర్వీసులన్నింటికీ రీడింగ్ తీయడం కష్టమైది. మీటరు బోర్డుకు ఎటువంటి అనుబంధ, భద్రతా పరికరాలను అమర్చలేదు. వ్యవసాయ పంపుసెట్లకు దగ్గరగా బహిరంగ ప్రదేశంలో వీటిని అమర్చడంతో ఎండ, వర్షాలకు పరికరాలు దెబ్బతింటున్నాయి. దీంతో మీటర్లను మార్చాల్సిన పరిస్థితొస్తోది. రీడింగ్ తీయడానికి కూడా ఏజెన్సీలు ముందుకు రావడం లేదు. విద్యుత్ శాఖ సిబ్బందితోనే ప్రస్తుతం రీడింగ్ తీస్తుండటంతో సాదారణ విధులకు ఆటంకమేర్పడుతోంది. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ పంపు సెట్లకు ప్రస్తుతం అనుబంధ, భద్రత పరికరాలు ఏమీ లేవు. దీంతో భద్రతా పరికరాలైన కెపాసిటర్లు (నాణ్యమైన ఓల్టేజ్, పంపిణీ నష్టాలు తగ్గింపునకు), సర్వీసు వైరు, పీవీసీ వైరు, ఎర్తింగ్, ఎంసీబీ(ఓవర్ లోడ్ ప్రొటెక్షన్, విద్యుత్ భద్రతా చర్యల బలోపేతానికి) కూడా చేర్చారు. ఈ ఎస్ఎంసీ బాక్స్‌లో మీటర్లను ఏర్పాటు చేస్తారు కనక వివిధ వాతావరణ పరిస్థితుల్లో వాటికి భద్రత ఉంటుంది. రైతులకి విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షణా ఉంటుంది. యంసీబీ ద్వారా ట్రాన్స్ ఫార్మర్ ఫెయిల్యుర్నూ తగ్గించొచ్చు. ప్రస్తుతం ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటి మరమ్మతు కోసం ఏటా రూ.102 కోట్లు భరించాల్సి వస్తోంది. అందుకే ఈ పరికరాలన్నిటినీ చేరిస్తే... ఇవన్నీ అనవసరమైనవంటూ తేల్చేశారు ఘనత వహించిన రామోజీరావు!!. అదీ ‘ఈనాడు’ పాఠకుల దౌర్భాగ్యం. -
3 పెద్దాసుపత్రుల టెండర్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో రూ. వెయ్యి కోట్ల చొప్పున నిర్మించబోయే మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి సోమవారం టెండర్లు ఖరారయ్యాయి. ఎల్బీ నగర్ సమీపంలోని గడ్డిఅన్నారం మార్కెట్ ప్రాంతంలో, సనత్‌నగర్‌లోని ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి ప్రాంగణంలో, అల్వాల్ వద్ద నిర్మించబోయే ఈ మూడు ఆసుపత్రుల టెండర్లను మేఘా, ఎల్అండ్టీ, డీఈసీ వంటి ప్రముఖ సంస్థలు దక్కించుకున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ఆసుపత్రుల డిజైన్‌పై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారని, దీంతో వాటిని తిరిగి డిజైన్ చేసే పనిలో ఉన్నట్లు తెలిపాయి. వైద్య, ఆరోగ్యశాఖ మార్గనిర్దేశంలో రోడ్లు, భవనాలశాఖ సహకారంతో ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. టెండర్లు ఖరారైనందున డిజైన్‌పై తుది నిర్ణయం తీసుకున్నాక ఆసుపత్రుల నిర్మాణం మొదలవనుంది. అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందేలా, దేశంలో ఎక్కడా లేనివిధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. హెలికాప్టర్ కూడా దిగేలా ఆసుపత్రులను తీర్చిదిద్దే అవకాశముంది. అవయవ మార్పిడి వంటి శస్త్రచికిత్సలు చేయాల్సిన సందర్భాల్లో అవయవాలను తరలించేందుకు వీలుగా లేదా రోగులను అత్యవసరంగా తీసుకురావాల్సిన అవసరం ఉన్నప్పుడు హెలికాప్టర్ సేవలను ఈ ఆస్పత్రుల నుంచి వినియోగించేలా వాటిని నిర్మించనున్నారు. వెయ్యి పడకలతో... ఇప్పటివరకు కార్పొరేట్ ఆస్పత్రుల కారణంగా హెల్త్ హబ్‌గా పేరుగాంచిన హైదరాబాద్... రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగంలోనూ పేదలకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందించే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ద్వారా ఆ ఘనతను సాధించాలని సర్కారు భావిస్తోంది. ఇందుకోసం ఒక్కో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఒక్కో స్పెషాలిటీ వైద్యాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేయనుంది. ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కనీసం 30 మంది నిష్ణాతులైన డాక్టర్లను నియమించనుంది. వీటిల్లో పనిచేసే డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీస్ చేయడానికి వీలుండదు. అంతేకాదు ఈ ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఒక్కో ఆస్పత్రిలో వెయ్యి పడకలు, 200 ఐసీయూ పడకలు ఉంటాయి. వీటిల్లో పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులూ అందుబాటులోకి తెస్తారు. ఏడాదిన్నరలోగా పూర్తిచేయాలన్నది సర్కారు సంకల్పం. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి అవసరమైన క్వార్టర్లను నిర్మించనున్నారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ బ్లూప్రింట్ తయారు చేసింది. -
కాజీపేట రైల్వే యూనిట్‌కు మోక్షం
సాక్షి, హైదరాబాద్: ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కాజీపేటలో వాగన్ పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. రెండు దఫాలు టెండర్లు విఫలమైన తర్వాత మూడో ప్రయత్నంగా బుధవారం టెండర్లను తెరవబోతున్నారు. నిర్మాణసంస్థను గుర్తిస్తే.. సరిగ్గా రెండున్నరేళ్లలో యూనిట్ పని ప్రారంభించనుంది. రూ.383 కోట్ల వ్యయంతో రైల్వే శాఖ నిర్మిస్తున్న ఈ యూనిట్లో నెలకు 250 వ్యాగన్ల జీవిత కాలాన్ని పెంచేలా ఓవర్‌హాలింగ్ చేయనున్నారు. 2016లో రైల్వే శాఖ రూ.269 కోట్ల అంచనాతో మంజూరు చేసిన ఈ ప్రాజెక్టు, ఎప్పుడో పని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. దానికి కావాల్సిన 150 ఎకరాల భూమి కోర్టు వివాదంలో చిక్కుకోవటం, ఆ తర్వాత రెవెన్యూ యంత్రాంగం దాన్ని రైల్వేకు అప్పగించటంలో జాప్యం చేయటంతో ప్రాజెక్టు పనులు ప్రారంభం కాలేదు. గతేడాదే ఆ భూమి రైల్వేకు అందటంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభించి యూనిట్ ఏర్పాటు పనులు ముమ్మరమయ్యాయి. -
కృష్ణా నదిపై రెండంతస్తుల కేబుల్ బ్రిడ్జి
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారి రెండు అంతస్తుల కేబుల్ వంతెన రాష్ట్రంలో నిర్మాణం కాబోతోంది. కృష్ణానదిపై సోమశిల వద్ద ప్రతిపాదించిన భారీ బ్రిడ్జికి కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ అధీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదముద్ర వేసింది. శుక్రవారం ఢిల్లీలో ఈ కమిటీ భేటీ అయ్యింది. మరో రెండు నెలల్లో జాతీయ రహదారుల విభాగం కేబుల్ వంతెనకు టెండర్లు పిలవబోతోంది. నిర్మాణ సంస్థకు వర్క్ ఆర్డర్ ఇచ్చిన రెండేళ్ల కాలంలో ఇది సిద్ధం కానుంది. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ కృష్ణా నదిపై నిర్మించే ఈ వంతెనలో పైన వాహనాలు వెళ్లే ప్రధాన క్యారేజ్ వే ఉంటుంది. దాని దిగువన పర్యాటకులు నడుచుకుంటూ సోమశిల ప్రకృతి సౌందర్యం, కృష్ణా నదీ పరవళ్లను తిలకించేందుకు వీలుగా గాజు వంతెన (పెడస్ట్రియన్ డెక్) ఉంటుంది. అక్కడ ఎందుకు..? తెలంగాణ నుంచి ఏపీలోని నంద్యాల వైపు రోడ్డు మార్గాన వెళ్లేవారికి దూరాభారాన్ని తగ్గించే క్రమంలో కొత్త జాతీయ రహదారిని ప్రతిపాదించారు. నంద్యాల, తిరుపతి వెళ్లాలంటే కర్నూలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అదే కొల్లాపూర్ మీదుగా కృష్ణా నదిని దాటేలా వంతెన నిర్మిస్తే ఆ దూరం దాదాపు 90 కి.మీ మేర తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్–శ్రీశైలం రహదారి మీద ఉన్న కోట్రా జంక్షన్ నుంచి మల్లేశ్వరం, అక్కడి నుంచి నంద్యాల వరకు 173.73 కి.మీ మేర రహదారిని (హైవే 167 కే) నాలుగు వరసలుగా నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు కృష్ణానదిపై వంతెన అవసరమైంది. అయితే దీన్ని సాదాసీదాగా నిర్మించకుండా, పర్యాటకులను ఆకట్టుకునేలా ఐకానిక్ వంతెనగా నిర్మిస్తే బాగుంటుందని అధికారులు ప్రతిపాదించారు. పాపికొండలు తరహాలో ఈ ప్రాంతం అత్యంత రమణీయంగా ఉన్నందున ఇక్కడికి నిత్యం వేలల్లో పర్యాటకులు వస్తారు. గాజు నడక వంతెన నిర్మిస్తే వారు నదీ పరవళ్లను తిలకిస్తూ ప్రత్యేక అనుభూతిని పొందేందుకు అవకాశం ఉంటుందని భావించారు. వాహనాల వంతెన దిగువన గాజు డెక్ ఉండేలా రెండంతస్తులుగా డిజైన్ చేశారు. 800 మీటర్ల పొడవుండే ఈ వంతెన నిర్మాణానికి రూ.1,082 కోట్ల వ్యయం అంచనా వేశారు. నదిలోనే నడుస్తున్నట్టుగా..! దుర్గం చెరువు, మానేరు మీద ఉన్న సస్పెన్షన్ వంతెనల తరహాలో ఇప్పుడు సోమశిల వద్ద కేబుల్ బ్రిడ్జి (స్తంభాలు లేని వంతెన) నిర్మించనున్నారు. ఇటు తెలంగాణ వైపు మల్లేశ్వరం తీరం, అటు ఏపీలోని సంగమేశ్వరం తీరంను అనుసంధానిస్తూ రెండా భారీ పైలాన్లను నిర్మిస్తారు. ఒక్కో పైలాన్‌కు రెండు వైపులా 15+15 చొప్పున 30 జతల భారీ కేబుల్స్ ఏర్పాటు చేసి వాటిì ఆధారంగా వంతెన నిలిచేలా నిర్మిస్తారు. ఈ వంతెన పైనుంచి చుట్టూ ఉన్న ప్రకృతిని, గాజు ప్యానెల్స్ నుంచి దిగువన కృష్ణమ్మ అందాలను ఆస్వాదించేందుకు అవకాశం ఉంటుంది. పర్యాటకులు నదిలో నడుస్తున్న అనుభూతిని పొందొచ్చు. -
క్రిస్ సిటీ నిర్మాణానికి మూడు సంస్థలు పోటీ
సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద అభివృద్ధి చేస్తున్న కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ(క్రిస్ సిటీ) నిర్మాణానికి మూడు సంస్థలు పోటీ పడుతున్నాయి. తొలి దశలో సుమారు 2,006 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,054.6 కోట్ల విలువైన పనులకు ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. ఈ పనులు చేజిక్కించుకునేందుకు ఎన్సీసీ, నవయుగ, షాపూర్జీపల్లోంజీ సంస్థలు వేసిన బిడ్లు సాంకేతికార్హత సాధించాయి. ఈ మధ్యనే జరిగిన ఏపీఐఐసీ బోర్డు సమావేశంలో సాంకేతిక అర్హత సాధించిన ఈ మూడు బిడ్లు ఆమోదం పొందాయి. త్వరలోనే ఆర్థిక అంశాలను పరిశీలించాక రివర్స్ టెండరింగ్ విధానంలో ఒక సంస్థను ఎంపిక చేయనున్నట్టు ఏపీఐఐసీకి చెందిన ఉన్నతాధికారి చెప్పారు. చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా మొత్తం 11,095.9 ఎకరాల్లో క్రిస్ సిటీ నిర్మాణాన్ని చేపడుతుండగా.. అందులో తొలి దశలో 2,000 ఎకరాలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నిక్‌డిక్ట్ నిధులతో అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం ఏపీఐఐసీ నిక్‌డిక్ట్ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ మొత్తం ప్రాజెక్టుకు ఇప్పటికే పూర్తిస్థాయి పర్యావరణ అనుమతులూ మంజూరయ్యాయి. ఈ పారిశ్రామికవాడకు కండలేరు నుంచి నీటిని సరఫరా చేస్తారు. తుది బిడ్ ఎంపిక కాగానే త్వరలోనే పనులు ప్రారంభించేలా ఏపీఐఐసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకొస్తే 2.96 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. -
263 అద్దె బస్సులకు ఆర్టీసీ టెండర్లు
సాక్షి, అమరావతి: ప్రజారవాణా విభాగం (ఆర్టీసీ) మరో 263 అద్దె బస్సుల కోసం టెండర్లు పిలిచింది. ఆసక్తి ఉన్నవారు ఎంఎస్టీసీ ‘ఈ’ కామర్స్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని టెండర్లు దాఖలు చేయవచ్చు. ఈ నెల 23న ఉదయం 10 గంటల నుంచి అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టెండర్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 19న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహిస్తామని ఆర్టీసీ ఈడీ కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కేటగిరీల వారీగా టెండర్లు పిలిచిన అద్దె బస్సులు ఏసీ స్లీపర్ 4, నాన్ ఏసీ స్లీపర్ 6, సూపర్ లగ్జరీ 12, అల్ట్రా డీలక్స్ 15, ఎక్స్‌ప్రెస్ 30, అల్ట్రా పల్లె వెలుగు 95, పల్లె వెలుగు 72, మెట్రో ఎక్స్‌ప్రెస్ 27, సిటీ ఆర్డినరీ 2. జిల్లాల వారీగా టెండర్లు పిలిచిన అద్దె బస్సులు శ్రీకాకుళం జిల్లా 23, పార్వతీపురం మన్యం 29, విజయనగరం 12, విశాఖపట్నం 42, అనకాపల్లి 16, కాకినాడ 35, తూర్పుగోదావరి 2, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ 24, పశ్చిమ గోదావరి 29, కృష్ణా 4, ఎన్టీఆర్ 3, గుంటూరు 2, పల్నాడు 2, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 5, తిరుపతి 8, అన్నమయ్య 5, నంద్యాల 3, అనంతపురం 8, శ్రీసత్యసాయి జిల్లా 11. బస్సు రూట్లు, టెండరు నిబంధనల కోసం సంప్రదించాల్సిన ఆర్టీసీ వెబ్సైట్: https:// apsrtc.ap.gov.in -
అవిగో..! ఆహారశుద్ధి కేంద్రాలు
సాక్షి, అమరావతి: వ్యవసాయ ఉత్పత్తులకు నిరంతర డిమాండ్ కల్పించడం ద్వారా రైతులకు అదనపు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో అందుబాటులోకి తెస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకుంది. తొలిదశ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక చేయూత అందించేందుకు ముందుకొచి్చన స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిబ్డీ) మంగళవారం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వచ్చే నెలలో పనులను పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మేరకు.. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలో భాగంగా రూ.3,726.16 కోట్ల అంచనా వ్యయంతో పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయిలో ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. తొలిదశలో రూ.1,148.11 కోట్లతో పది పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను, రూ.66.92 కోట్లతో 13 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పనున్నారు. రెండో దశలో రూ.2,511.13 కోట్లతో 16 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా పంటలను శుద్ధిచేసి అదనపు విలువను జోడించడం, వృథాను తగ్గించడం, ఎగుమతి సామర్థ్యంతో పాటు బేరసారాల శక్తిని పెంపొందించడం ద్వారా రైతులకు అదనపు ప్రయోజనాలను కల్పించాలని నిర్ణయించారు. తద్వారా వినియోగదారులకు సరసమైన ధరలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించాలన్నది ప్రభుత్వ ధ్యేయం. అవసరమైన ముడి సరుకును రైతులు, రైతు ఉత్పాదకత సంఘాలు, మార్క్‌ఫెడ్, ఆర్బీకేల ద్వారా సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ పర్యవేక్షణలో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేయగా రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాలు, ఆస్తుల నిర్వహణ సంస్థ (ఏపీ యూఐఎఎంఎల్)తో పాటు నాబ్కాన్స్ సంస్థలు డీపీఆర్ రూపొందించాయి. 24 యూనిట్లకు భూసేకరణ పూర్తి పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో 24 యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన 325.39 ఎకరాల భూసేకరణ ఇప్పటికే పూర్తైంది. 23 చోట్ల 295.39 ఎకరాల భూమిని ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి ఇప్పటికే అప్పగించారు. 13 మిల్లెట్ యూనిట్ల కోసం 13 ఎకరాల భూసేకరణ కూడా పూర్తైంది. అంచనా వ్యయంలో 90% రుణంగా సేకరించనుండగా మిగిలిన 10% రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. వీటి నిర్వహణకు 118 జాతీయ, అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు ముందుకొచ్చాయి. తొలిదశ యూనిట్ల ఏర్పాటుకు రూ.1,000 కోట్ల రుణం అందించేందుకు సిబ్డీ ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి కె.ఆదినారాయణ సమక్షంలో ఫుడ్ ప్రాసెసింగ్ సీఈవో శ్రీధర్‌రెడ్డి, సిబ్డీ డిప్యూటీ జనరల్ మేనేజర్ పి.రాజేంద్రప్రసాద్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఏపీయూఐ ఎఎంఎల్ సీనియర్ ఆఫీసర్లు రాహుల్‌రెడ్డి, సుదీష్ పాల్గొన్నారు. 3.25 శాతం స్వల్ప వడ్డీతో రుణం ఈ ఒప్పందం ప్రకారం 3.25 శాతం వడ్డీతో రూ.1,000 కోట్లను సిబ్డీ రుణంగా అందించనుంది. ఈ మొత్తానికి ప్రభుత్వం మరో రూ.215 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ సమకూర్చనుంది. తొలిదశ యూనిట్ల కోసం నెలాఖరులోగా టెండర్లు పిలిచేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్‌లో భూమిపూజ చేసి పనులు ప్రారంభించి మార్చి కల్లా పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో దశ ఆర్థిక సాయం కోసం నాబార్డు, అప్కాబ్‌తో పాటు పలు వాణిజ్య బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. -
ఫోర్జరీ కేసులో జనసేన జెడ్పీటీసీ.. తెలంగాణ ప్రభుత్వం విచారణ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఫోర్జరీ పత్రాలతో నకిలీ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించి రొయ్యలు, చేప పిల్లల సరఫరా టెండర్లు దక్కించుకున్న వ్యవహారంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం జెడ్పీటీసీ, జనసేన నాయకుడు గుండా జయప్రకాష్ నాయుడు బృందంపై తెలంగాణ ప్రభుత్వ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలోని 32 జిల్లాల్లోని చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు, రొయ్యలను వదిలేందుకు ఆ రాష్ట్ర మత్స్యశాఖ సుమారు రూ.113 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. భీమవరానికి చెందిన జన సేన నాయకుడు గుండా జయప్రకాష్ నాయుడు పలువురి పేర్లతో తెలంగాణలో 9 నుంచి 12 జిల్లాల్లో టెండర్లు దాఖలు చేసి దక్కించుకున్నాడు. అయితే, బ్యాంకు గ్యారెంటీ, పర్ఫామెన్స్ గ్యారెంటీల విషయంలో మోసానికి పాల్పడ్డాడు. దీనిపై ఫిర్యాదులు అందడంతో తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టింది. బ్యాంకు గ్యారెంటీ నకిలీవని, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. -
659 అద్దెబస్సులకు ఆర్టీసీ టెండర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అద్దె ప్రాతిపదికన 659 బస్సుల కోసం ఏపీఎస్ఆర్టీసీ టెండర్లు పిలిచింది. వాటిలో ఏసీ స్లీపర్ 9, నాన్ ఏసీ స్లీపర్ 47, ఇంద్ర ఏసీ 6, సూపర్ లగ్జరీ 46, అల్ట్రా డీలక్స్ 22, ఎక్స్‌ప్రెస్ 70, అల్ట్రా పల్లె వెలుగు 208, పల్లె వెలుగు 203, మెట్రో ఎక్స్‌ప్రెస్ 39, సిటీ ఆర్డినరీ బస్సులు 9 ఉన్నాయి. ‘ఎంఎస్టీసీ’ ఇ–పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని, ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టెండర్లు దాఖలు చేయవచ్చునని బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ఆగస్టు 5 ఉదయం 10గంటల నుంచి ఆగస్టు 6 సాయంత్రం 4గంటల వరకు రివర్స్ టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తారు. అనంతరం అద్దె బస్సుల టెండర్లను ఖరారు చేస్తారు. బస్సు రూట్ల వివరాలు, బస్సు ప్రమాణాలు, టెండర్ల నిబంధనలు, ఇతర వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్: http://apsrtc.ap. gov. in టెండర్లు పిలిచిన అద్దె బస్సుల వివరాలు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి శ్రీకాకుళం–39, పార్వతీపురం మన్యం–32, విజయనగరం–14, విశాఖపట్నం–61, అనకాపల్లి–22, కాకినాడ–41, తూర్పు గోదావరి–27, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ – 39, పశ్చిమ గోదావరి–52, ఏలూరు – 21, కృష్ణా – 28, ఎన్టీఆర్ – 12, గుంటూరు – 26, పల్నాడు – 30, బాపట్ల– 6, ప్రకాశం– 10, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు – 39, తిరుపతి– 35, చిత్తూరు – 2, అన్నమయ్య – 10, వైఎస్సార్ – 6, నంద్యాల – 29, కర్నూలు – 14, అనంతపురం – 31, శ్రీసత్యసాయి – 33. -
234 ఖనిజ లీజులకు ఈ–వేలం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు చిన్న తరహా ఖనిజాల తవ్వకానికి లీజు అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ–వేలం కొనసాగుతోంది. తొలి దశలో 234 ఖనిజాలకు క్వారీ లీజులు ఇచ్చేందుకు గనుల శాఖ జిల్లాలవారీగా టెండర్లు పిలిచింది. అందులో 169 కలర్ గ్రానైట్‌వే. మిగిలినవి క్వార్‌ట్ట్జ, బ్లాక్ గ్రానైట్, బెరైటీస్, సిలికా శాండ్, ప్రొఫలైట్ ఖనిజ లీజులు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 70 క్వారీ లీజులకు ఈ–వేలం నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత అనంతపురం జిల్లాలో 54, విజయనగరం జిల్లాలో 35, వైఎస్సార్ జిల్లాలో 31, కర్నూలు జిల్లాలో 18, నెల్లూరు జిల్లాలో 9, విశాఖపట్నం జిల్లాలో 9, తూర్పు గోదావరి జిల్లాలో 8 లీజులకు వేలం నిర్వహిస్తున్నారు. వీటిలో కొన్నిటికి ఇప్పటికే అనుమతులు కూడా మంజూరు చేశారు. మరికొన్నింటికి త్వరలో మంజూరు చేయనున్నారు. గతంలో ఉన్న మైనింగ్ విధానం ప్రకారం లీజు దరఖాస్తులు సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉండిపోయేవి. లీజులు తీసుకున్న వారిలో ఎక్కువ మంది తవ్వకాలు జరపకుండా వదిలేసేవారు. అలాంటివి 2,162 లీజులు ఉన్నట్లు గుర్తించారు. అనుమతిచ్చిన ఈ క్వారీల్లో తవ్వకాలు చేయకపోవడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నిలిచిపోయింది. మైనింగ్ ఆధారిత పరిశ్రమలకు ముడిసరుకు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తవ్వకాలు జరపని క్వారీలకు ఒక అవకాశం ఇచ్చి చూశారు. అప్పటికీ సద్వినియోగం చేసుకోకపోవడంతో ఆ లీజులను రద్దు చేసి వాటికి ఈ–వేలం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం వెయ్యి క్వారీలను తిరిగి ఆపరేషన్లోకి తేవాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొలి దశలో 234 లీజులకు ఈ–వేలం నిర్వహిస్తున్నారు. ఇందులో అనుమతి పొందిన వారికి రెవెన్యూ శాఖ నుంచి త్వరితగిన నిరభ్యంతర పత్రాలు ఇప్పించంతోపాటు ఇతర అనుమతులూ త్వరగా వచ్చేలా చూస్తున్నారు. -
అత్యవసర మందుల కొరతకు చెక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులకు అత్యవసర మందుల సరఫరాలో కొత్త విధానాన్ని వైద్య, ఆరోగ్య శాఖ ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా మెడికల్ ఏజెన్సీలు, చెయిన్ ఫార్మసీల నుంచి ఏపీ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) టెండర్లను ఆహ్వానించింది. రాష్ట్రంలో డీఎంఈ పరిధిలో 32, వైద్య విధాన పరిషత్ పరిధిలో 13 జిల్లా ఆస్పత్రులున్నాయి. వీటిలో చికిత్సకు సాధారణంగా వినియోగించే మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ఏపీఎంఎస్ఐడీసీ సరఫరా చేస్తోంది. స్పెషాలిటీ, సూపర్‌స్పెషాలిటీ చికిత్సల్లో వినియోగించే మందులు స్థానికంగా కొనుగోలు చేయడానికి మొత్తం మందుల బడ్జెట్లో డీఎంఈ ఆస్పత్రులకు 20 శాతం, జిల్లా ఆస్పత్రులకు 10 శాతం బడ్జెట్‌ను ఆయా ఆస్పత్రుల ఖాతాల్లో ఏపీఎంఎస్ఐడీసీ వేస్తుంది. ఈ నిధులతో స్థానిక అవసరాలకు అనుగుణంగా అత్యవసర మందులను ఆస్పత్రులు స్థానికంగానే కొనుగోలు చేస్తాయి. అయితే ఈ విధానంలో కొన్ని చోట్ల అధిక ధరలకు మందులు కొనుగోలు చేయడం, మందుల సరఫరాలో ఆలస్యం సహా పలు ఇబ్బందులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీ, చెయిన్ ఫార్మసీల ద్వారా డీ–సెంట్రలైజ్డ్ విధానంలో అత్యవసర మందుల సరఫరా చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బోధనా, జిల్లా ఆస్పత్రికి సమీపంలో మందుల దుకాణాలున్న వారి నుంచి టెండర్లు స్వీకరిస్తున్నారు. ఎమ్మార్పీపై ఎక్కువ డిస్కౌంట్‌తో మందులు సరఫరా చేసే సంస్థను ఎంపిక చేసి కాంట్రాక్ట్ అప్పజెప్పనున్నారు. నేరుగా చెల్లింపులు.. ఆస్పత్రి సూపరింటెండెంట్లు ఇండెంట్ పెట్టిన ఎంత సమయంలోగా మందులు సరఫరా చేయాలన్నదానిపై నిబంధనలు రూపొందించారు. చాలా అత్యవసరమైన మందులను ఆరు గంటల్లోగా ఫార్మసీ సంస్థ సరఫరా చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ మెడిసిన్ అయితే 24 గంటల్లో, బల్క్ మెడిసిన్‌ను వారంలోగా సరఫరా చేయాలని గడువు విధించారు. సరఫరా చేసిన మందులకు బిల్లులను ఏపీఎంఎస్‌ఐడీసీనే నేరుగా చెల్లిస్తుంది. ఈ విధానం వల్ల మందుల సరఫరాలో కాలయాపన తగ్గడంతో పాటు, వినియోగంపై స్పష్టత రావడంతో పాటు, ఆడిటింగ్‌కు ఆస్కారం ఉంటుంది. కొరతకు తావివ్వకూడదనే.. అత్యవసర మందుల సరఫరాకు టెండర్లు పిలిచాం. వచ్చే వారంలో ఫైనల్ చేస్తాం. ఆస్పత్రుల సూపరింటెండెంట్లు మొబైల్ యాప్ ద్వారా ఆర్డర్లను ఇచ్చే విధానాన్ని తీసుకొస్తాం. ఆర్డర్ ఇచ్చిన వెంటనే మందులు ఆస్పత్రులకు సరఫరా అవుతాయి. మందుల కొరతకు తావుండకూడదని నూతన విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. – మురళీధర్‌రెడ్డి, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ, వైస్ చైర్మన్ -
5 ఫిషింగ్ హార్బర్లకు టెండర్లు ఓకే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం రెండో దశలో చేపట్టే 5 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ టెండర్లను విశ్వ సముద్ర ఇంజనీరింగ్ లిమిటెడ్ దక్కించుకుంది. రెండో దశ కింద రూ.1,496.85 కోట్ల వ్యయంతో బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (విశాఖపట్నం), బియ్యపుతిప్ప (పశ్చిమ గోదావరి), ఓడరేవు (ప్రకాశం), కొత్తపట్నం (ప్రకాశం)లలో నిర్మించే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లు పిలిచింది. అతి తక్కువ ధర కోట్ చేసిన విశ్వ సముద్ర టెండర్లు దక్కించుకున్నట్లు మారిటైమ్ బోర్డు అధికారులు తెలిపారు. ఇప్పటికే తొలి దశ కింద రూ.1,204 కోట్లతో ఉమ్మడి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్టా జిల్లా మచిలీపట్నం, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ ఫిషింగ్ హర్బర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ పనులను ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ వేగంగా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రూ.3,622.86 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇవి అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో 60 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. 10 వేల మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునే అవకాశం ఏర్పడుతుంది. -
ఆర్టీసీ ప్రయాణికులకు ఊరట.. గేర్ మార్చిన టీఎస్ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: డొక్కు బస్సులతో నత్తనడకన సాగుతున్న తెలంగాణ ఆర్టీసీ గేర్ మార్చింది. కొత్త బస్సులు కొనే దిశగా వేగం పెంచింది. 1,016 కొత్త బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలిచింది. తయారీదారులకు ఆ బస్సుల గురించిన వివరాలు అందించి కొటేషన్లు ఆహ్వానించింది. అవి విడతలవారీగా మరో నాలుగైదు నెలల్లో ఆర్టీసీ చెంతకు చేరనున్నాయి. కాలం చెల్లిన వాటితోపాటు డొక్కుగా మారిన బస్సులతోనే ఆర్టీసీ ఇంతకాలం నెట్టుకొస్తోంది. అయితే ఇటీవల కండీషన్ లేని బస్సుల వల్ల ప్రమాదాలు పెరగడంతో వాటిని తొలగించడానికి ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వరసగా జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువగా అద్దె బస్సులే ఉంటున్నాయి. కొన్ని సొంత బస్సులు కూడా ప్రమాదాలకు కారణమవుతుండటాన్ని ఆర్టీసీ తీవ్రంగానే పరిగణిస్తోంది. పది రోజుల క్రితం జరిగిన ఆర్టీసీ బోర్డు సమావేశంలో కొత్త బస్సులు కొనే అంశాన్ని చర్చించారు. ఆ వెంటనే బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలిచారు. కొత్త బస్సులను కొత్త ప్రాంతాలతోపాటు కొరత ఉన్న చోట తిప్పనున్నారు. కాగా, ఆర్టీసీ తొలిసారి స్లీపర్ బస్సులు కొనబోతోంది. ఇప్పుడు కొనేవాటిల్లో 16 ఏసీ స్లీపర్ బస్సులు ఉన్నట్టు ప్రకటించింది. (చదవండి: పడవతో గస్తీ..లేక్ పోలీసింగ్ వ్యవస్థ) -
రూ.10 వేల కోట్లతో హైవేల అభివృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి వేగం పుంజుకుంటోంది. మరో 1,586 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల అభివృద్ధి ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించింది. రాబోయే మూడేళ్లలో దశలవారీగా మొత్తం రూ.10 వేల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఈమేరకు ప్రతిపాదనలను జాతీయ రహదారులశాఖ ఖరారు చేసింది. గత వార్షిక ప్రణాళికలో మిగులు పనులతోపాటు రాష్ట్రంలో పోర్టులు, ప్రధాన పారిశ్రామిక పట్టణాలను అనుసంధానించే రహదారులను 12 మీటర్ల వెడల్పుతో (టూ లేన్స్ విత్ పావ్డ్ సోల్టర్స్)గా విస్తరించేందుకు మార్గం సుగమమైంది. సూత్రప్రాయంగా ఆమోదించిన ఈ ప్రణాళికలకు త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ రహదారుల నిర్మాణానికి ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు ఖరారు చేశారు. త్వరలోనే టెండర్లు పిలిచి మూడేళ్లలో పనులు పూర్తిచేయనున్నారు. అభివృద్ధి చేయనున్న కొన్ని ప్రధాన రోడ్లు కల్వకుర్తి–నంద్యాల 250 కిలోమీటర్లు, నంద్యాల–జమ్మలమడుగు 82 కి.మీ., డోన్–సోమయాజులపల్లి 78 కి.మీ., గోరంట్ల–హిందూపురం 50 కి.మీ., పెడన–హనుమాన్‌జంక్షన్ 51 కి.మీ., అమలాపురం–బొబ్బర్లంక 55 కి.మీ., ఆకివీడు–దిగుమర్రు 45 కి.మీ., నరసాపురం రింగ్‌రోడ్డు 40 కిలోమీటర్ల రహదారుల్ని అభివృద్ధి చేయనున్నారు. ఇవేగాక రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులతో అనుసంధానించే పలు రోడ్లను 12 మీటర్ల వెడల్పుతో విస్తరించనున్నారు. -
రూ.551.9 కోట్లతో మూడు క్లస్టర్ల అభివృద్ధి
సాక్షి, అమరావతి: విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) అభివృద్ధిలో భాగంగా ఏపీఐఐసీ రెండో దశ పనులపై దృష్టిసారించింది. విశాఖ సమీపంలోని నక్కపల్లి, అచ్యుతాపురం–రాంబల్లి, చిత్తూరు సౌత్ క్లస్టర్లను ట్రాంచ్–2 కింద అభివృద్ధి చేస్తోంది. ఏడీబీ రుణ సహాయంతో విశాఖ–చెన్నై కారిడార్‌ను రూ.5,604 కోట్లతో రెండు దశల్లో అభివృద్ధి చేయనుండగా, తొలిదశ పనులు తుదిదశకు రావడంతో ఇప్పుడు రెండో దశ పనులపై ఏపీఐఐసీ దృష్టిసారించింది. ఇందుకోసం మూడు క్లస్టర్లల్లో రూ.551.9 కోట్ల విలువైన పనులకు టెండర్లను ఆహ్వానించింది. వీటిద్వారా.. ► నక్కపల్లి క్లస్టర్లో సుమారు 1,120 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను రూ.302.01 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ పారిశ్రామిక పార్కు అందుబాటులోకి రావడానికి అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేస్తారు. ► అచ్యుతాపురం–రాంబల్లిలోని 396 ఎకరాల స్టార్టప్ ఏరియాలో కూడా రూ.105.79 కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తారు. ► చిత్తూరు సౌత్ జోన్‌లోని శ్రీకాళహస్తి క్లస్టర్లో 2,770 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం రూ.414.53 కోట్లు వ్యయం చేయనుండగా, ఇప్పుడు తాజాగా 1.2 ఎంఎల్డీ సామర్థ్యంతో ఉమ్మడి మురుగు నీటిశుద్ధి కేంద్రాన్ని (సీఈటీపీ–కామన్ ఎఫ్లు్యయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్) రూ.144.10 కోట్లతో ఏర్పాటుచేస్తోంది. ఈ టెండర్ల ప్రక్రియను మేలో పూర్తిచేసి పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధంచేసినట్లు ఏపీఐఐసీ ఉన్నతాధికారులు తెలిపారు. ఏడు రెట్లు పెరగనున్న తయారీరంగం ఇక వీసీఐసీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రాష్ట్ర తయారీ రంగ ఉత్పత్తి ఏడు రెట్లు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కారిడార్ కింద నక్కపల్లి వద్ద 4,316 ఎకరాలు, అచ్యుతాపురం–రాంబిల్లి వద్ద 2,532 ఎకరాలు, మచిలీపట్నంలో 12,145 ఎకరాలు, శ్రీకాళహస్తి–ఏర్పేడులో 24,324 ఎకరాలు, దొనకొండలో 17,117 ఎకరాలు, కొప్పర్తిలో 6,914 ఎకరాల్లో మొత్తం 6 భారీ పారిశ్రామిక పార్కులను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. ఈ ఆరు పారిశ్రామిక పార్కులు అందుబాటులోకి వస్తే రాష్ట్ర తయారీ రంగంవిలువ ఏడు రెట్లు పెరిగి 2035 నాటికి రూ.7.8 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. దీనివల్ల 1.1 కోట్ల మందికి అదనంగా ఉపాధి లభించనుంది. -
ఒకేచోట.. నచ్చిన ఆట
సాక్షి, అమరావతి: యువతలో క్రీడాసక్తిని పెంపొందించడంతో పాటు.. అన్ని వర్గాల ప్రజలు ఆడుకునేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధునిక ఆట స్థలాలను అభివృద్ధి చేస్తోంది. ‘స్పోర్ట్స్ అరేనా’ ప్రాజెక్టు పేరుతో తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మునిసిపాలిటీలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరులో పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించేందుకు టెండర్లు సైతం ఆహ్వానించింది. అన్ని జిల్లాల్లో డీఎస్ఏ (డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ) ప్రాంగణాలు, మునిసిపాలిటీల నుంచి స్థలాలను సేకరించి నిర్మాణాలు చేపట్టనుంది. ఏ ఆటైనా ఆడేందుకు అనువుగా.. ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఆట స్థలాలను మర్చిపోతున్నారు. ఎవరైనా ఆడుకుందామన్నా అనువైన ప్రదేశాలు లేక అభిరుచిని చంపేసుకుంటున్నారు. ఇలాంటి వారి కోసమే ప్రైవేట్ రంగంలో స్పోర్ట్స్ అరేనాలు వెలిశాయి. గంటల లెక్కన అద్దె వసూలు చేస్తూ ఆడుకోవాలనే అభిలాష ఉన్నవారికి క్రీడా వేదికను కల్పిస్తున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా చక్కటి వాతావరణం, రాత్రి వేళ ఫ్లడ్‌లైట్ల వెలుతురులోనూ ఆటలను ఎంజాయ్ చేసేలా అవకాశం కల్పిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో క్రీడా ప్రమాణాలను పాటిస్తూ శాప్ స్వయంగా అరేనాలను నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. ఔత్సాహికులకు ఆడుకునే స్వేచ్ఛను కల్పిస్తూనే ఆదాయాన్ని ఆర్జించేలా ప్రణాళికలు రచిస్తోంది. సాధారణ క్రీడా మైదానాలతో పోలిస్తే అరేనా ప్రాంగణాలు విభిన్నంగా ఉంటాయి. కొద్దిపాటి స్థలంలోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆటలు ఆడుకునేందుకు వీలుంటుంది. మట్టి కనిపించకుండా ఆట స్థలం మొత్తం నెట్స్‌లో ఉండి.. టర్ఫ్‌తో కప్పి ఉంటుంది. ఒకే ప్రదేశం.. అనేక రకాల ఆటలకు నెలవుగా వీటిని రూపొందిస్తారు. ఈ స్పోర్ట్స్ అరేనాల్లో క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్, వాలీబాల్, యోగా ఇలా.. నచ్చిన క్రీడలను ఆడి ఆస్వాదించవచ్చు. ఆధునికతకు అనుగుణంగా.. ప్రస్తుత కాలానికి తగిన విధంగా ఆట స్థలాలు ఉండాలి. అందరూ మట్టి క్రీడా ప్రాంగణాల్లో ఆడేందుకు ఆసక్తి చూపరు. కానీ వారికి ఆడుకోవాలనే కోరిక ఉంటుంది. అటువంటి ఔత్సాహిక క్రీడాకారుల కోసమే స్పోర్ట్స్ అరేనాలను తీసుకొస్తున్నాం. ఒకేచోట తమకు నచ్చిన క్రీడను ఎంజాయ్ చేసే సౌలభ్యం ఇందులో ఉంటుంది. అన్ని వయసుల వారు ఇందులో ఆడుకునేందుకు ఇష్టపడతారు. – ఎన్.ప్రభాకరరెడ్డి, ఎండీ, శాప్ -
వేగంగా 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దేశ చరిత్రలో తొలిసారిగా రూ.3,622.86 కోట్ల వ్యయంతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో తొలిదశలో రూ.1,204.56 కోట్లతో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణాజిల్లా మచిలీపట్నం, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడల్లో ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇండస్ట్రీస్ సంస్థ వీటిని నిర్మిస్తోంది. ఇప్పటికే రూ.300 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తయినట్లు ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. పూర్తయిన పనులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నాలుగు ఫిషింగ్ హార్బర్లను వచ్చే ఏడాది ప్రారంభం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ మారిటైమ్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే నాలుగు ఫిషింగ్ హార్బర్లలో డ్రెడ్జింగ్ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. దీంతో కీలకమైన ఫిల్లర్లు, జెట్టీల నిర్మాణ పనులు మొదలు పెట్టారు. అదనంగా మూడులక్షల టన్నుల మత్స్యసంపద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ హార్బర్లు అండుబాటులోకి వస్తే రాష్ట్రంలో 60 వేలమందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. అలాగే 10 వేల మెకనైజ్డ్ బోట్లు నిలుపుకొనే సామర్థ్యం లభిస్తుంది. రెండోదశలో శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, విశాఖపట్నం జిల్లాలో పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం, ఓడరేవుల్లో హార్బర్ల నిర్మాణాలకు రూ.1,496.85 కోట్ల విలువైన పనులకు ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. -
సొంత నిధులతోనే రైల్వే స్టేషన్ల అభివృద్ధి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో రాష్ట్రంలో రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసేందుకు టెండర్లు పిలిచినా.. ఆశించిన స్పందన రాకపోవడంతో సొంత నిధులతోనే పనులు చేపట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా దాదాపు 50కుపైగా రైల్వే స్టేషన్లను పీపీపీ విధానం కింద ప్రైవేటు సంస్థలకు 90 ఏళ్ల పాటు అప్పగించాలని సూత్రప్రాయంగా గతంలో నిర్ణయించారు. ఆ జాబితాలో ఏపీలోని విజయవాడ, నెల్లూరు, తిరుపతి రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. రైల్వే స్టేషన్లలో మల్టీప్లెక్స్‌లు, మాల్స్, రెస్టారెంట్లు, పలు రకాల ఇండోర్ గేమ్స్ అందుబాటులోకి తేవాలని ప్రతిపాదించారు. దీనిపై అప్పట్లోనే తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చినప్పటికీ రైల్వే శాఖ పట్టించు కోలేదు. మొదటగా నెల్లూరు, తిరుపతి రైల్వే స్టేషన్లను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు టెండర్ల ప్రక్రియ చేపట్టింది. కానీ రైల్వే శాఖ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. మొదటి రెండు అంతస్తులు రైల్వే శాఖకు అప్పగించి మిగిలిన అంతస్తుల్లో వాణిజ్య సముదాయాల నిర్వహణ లాభసాటి కాదని ప్రైవేటు సంస్థలు భావించాయి. పైగా రైల్వే శాఖ కనీస బిడ్ ధర కూడా చాలా ఎక్కువుగా నిర్ణయించడంతోపాటు ఇతర షరతులు కూడా సానుకూలంగా లేవన్న అభిప్రాయం వ్యక్తమైంది. కొన్ని బడా కార్పొరేట్ సంస్థలతో రైల్వే శాఖ సంప్రదింపులు కూడా జరిపినా ఫలితం దక్కలేదు. నగరాల్లో ప్రధాన కూడళ్లలో కాకుండా కొంచెం దూరంగా ఉండే రైల్వే స్టేషన్ల ప్రాంగణంలో షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌ల నిర్మాణం లాభసాటి కాదని కూడా ఆ ప్రైవేటు సంస్థలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దాంతో రైల్వే శాఖ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించింది. రైల్వే స్టేషన్లను తమ నిధులతోనే అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అభివృద్ధి ప్రణాళికకు ఆమోదం రాష్ట్రంలోని నెల్లూరు, తిరుపతి రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ నిధులతోనే అభివృద్ధి చేసేందుకు రూపొందించిన ప్రణాళికను తాజాగా ఆమోదించారు. దాదాపు రూ. 300 కోట్లతో వీటిని అభివృద్ధి చేయనున్నారు. ప్రైవేటు సంస్థలతో పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు గతంలో రూపొందించిన ప్రణాళిక దీనికి వర్తించదని కూడా రైల్వే శాఖ స్పష్టం చేసింది. వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా కాకుండా ప్రయాణికులకు అధునాతన సౌకర్యాల కోణంలోనే రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించమని రైల్వే శాఖ దక్షిణ మధ్య రైల్వేను ఆదేశించింది. డీపీఆర్ ఖరారైన తరువాత రైల్వే స్టేషన్ల అభివృద్ధి ప్రణాళిక ఓ కొలిక్కి వస్తుందని రైల్వే శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.