APSRTC: 541 అద్దె బస్సులకు ఆర్టీసీ టెండర్లు  | apsrtc invites tenders for 541 rent buses In ap | Sakshi
Sakshi News home page

APSRTC: 541 అద్దె బస్సులకు ఆర్టీసీ టెండర్లు 

Published Sat, Feb 17 2024 9:05 AM | Last Updated on Sat, Feb 17 2024 12:37 PM

apsrtc invites tenders for 541 rent buses In ap - Sakshi

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో అద్దె బస్సుల కోసం ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. ఎంఎస్‌టీసీ ఈ-కామర్స్ పోర్టల్‌లో రిజిస్టర్‌ కావాల్సి ఉంటుంది. ఆర్టీసీ 541అద్దె బస్సుల కోసం టెండర్లను పిలిచింది. ఆసక్తి ఉన్నవారు ఎంఎస్‌టీసీ ఈ-కామర్స్ పోర్టల్‌లో రిజిస్టర్‌ కావాల్సి ఉంటుంది.  ఈ నెల 21 నుంచి మార్చి 6వ తేదీ వరకు బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. మార్చి 14వ తేదీ ఈ–వేలం నిర్వహిస్తారు.

అద్దె బస్సులు నిర్వహించా ల్సిన రూట్లు, టెండరు నిబంధనలు, ఇతర వివరాల కోసం తమ వెబ్‌సైట్‌   http://apsrtc.ap.gov.inను సంప్రదించాలని ఏపీఎస్‌ ఆర్టీసీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.  టెండర్లు పిలిచిన బస్‌ సర్వీసుల వివరాలు ఏసీ స్లీపర్‌–2, నాన్‌ ఏసీ స్లీపర్‌–9, సూపర్‌ డీలక్స్‌–22, అల్ట్రా డీలక్స్‌–33, ఎక్స్‌ప్రెస్‌–168, అల్ట్రా పల్లెవెలుగు–74, పల్లె వెలుగు–225, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు–3, సిటీ ఆర్డినరీ–5. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement