invites
-
పీక్స్‌కు చేరిన కోడి పందేల సందడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సంక్రాంతి వేళ కోడి పందేలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బరులు సర్వహంగులతో సిద్ధమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఏ రోజున ఎక్కడెక్కడ పందేలు జరుగుతాయనే షెడ్యూల్స్ ప్రకటిస్తున్నారు. పలానా చోట పలానా బరి సిద్ధమవుతోందని.. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు.. ఎంత మొత్తంలో పందేలు వేయొచ్చనే వివరాలతో కూడిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. కోడిపందేలు నిర్వహించడం నేరమని కలెక్టర్లు ప్రకటిస్తున్నా.. పందేలను కట్టడి చేయాలని హైకోర్టు గట్టిగా ఆదేశాలు ఇచ్చినా.. పోలీసులు హైకోర్టు ఆదేశాలు పాటించాల్సిందేనని న్యాయస్థానం సీరియస్ వార్నింగ్ ఇచ్చినా ఎక్కడికక్కడ జరగాల్సిన పనులు జరిగిపోతున్నాయి. పందేలరాయుళ్లు ఇన్‌స్టా వేదికగా కోడి పందేలపై విస్తృత ప్రచారానికి తెరతీయడం చర్చనీయాంశంగా మారింది. బిగ్ డే మ్యాచ్‌లట.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్ కళాశాల సమీపంలోని వెంకట్రామయ్య బరిలో భారీ పందేలు నిర్వహిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. భోగి రోజున రూ.9 లక్షల పందేలు 9, రూ.6 లక్షల పందేలు 5, రూ.27 లక్షలు లేదా రూ.25 లక్షల పందెం ఒకటి చొప్పున జరుగుతాయని షెడ్యూల్ ప్రకటించుకున్నారు.మరోవైపు బడా కోడి పందేంరాయుళ్లు నలుగురు పేర్లతో 13వ తేదీ గణపవరం, 14వ తేదీ శింగవరం, 15వ తేదీ సీసలిలో బిగ్డే మ్యాచ్‌లంటూ షెడ్యూల్ ప్రకటించడం వంటివి రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇదే తరహాలో భీమవరం, ఉండి నియోజకవర్గాల్లోని స్థానిక పందెంరాయుళ్లు బరులు, ఇతర వివరాలతో సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల్లోనూ భారీ ఎత్తున పందేలకు ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. నిషేధం బేఖాతరు.. కోడిపందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఈ నెల 7న సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఏపీ గేమింగ్ యాక్ట్–1974లోని సెక్షన్ 9 (1), 2 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా పశు సంవర్ధకశాఖ, పోలీసులు, రెవెన్యూ శాఖతో బృందాలు ఏర్పాటు చేశామని ప్రకటించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పోలీసులు కోడిపందేల నిషేధంపై ఫ్లెక్సీలు, పోస్టర్లు ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా.. సోషల్ మీడియాలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా పందేలు జరిగే ప్రాంతాలు, షెడ్యూల్స్, పందేలు వేసే ప్రముఖుల పేర్లతో పోస్టులు ట్రెండింగ్ అవుతున్నాయి.దెందులూరు నియోజకవర్గంలో ‘ప్రీమియర్ లీగ్’ వివాదాస్పద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి మండలం దుగ్గిరాలలో కాకతీయ ప్రీమియర్ లీగ్ (కోడి పందేల లీగ్) పేరుతో పందేలకు రెడీ అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. క్రికెట్ టోర్నమెంట్స్ లీగ్ మాదిరిగా కోడి పందేల లీగ్ అనే పోస్టర్లు కూడా విడుదల చేశారు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ ప్రచారం సాగిస్తున్నారు. -
పెళ్లి మూడ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ సోనియా ఆకుల.. ప్రముఖులకు ఆహ్వానాలు! (ఫొటోలు)
-
‘వివాహ ఆహ్వానం’
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ నెల 22న జరిగే తన పెళ్లికి హాజరు కావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేసింది. సింధుతో పాటు తల్లిదండ్రులు పీవీ రమణ, విజయ ఆమె వెంట ఉన్నారు. వెంకటదత్తసాయితో రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో సింధు వివాహం జరగనుంది. -
నా పెళ్లికి రండి.. సెలబ్రిటీలకు వరలక్ష్మి శరత్‌కుమార్ ఆహ్వానం (ఫోటోలు)
-
కేసీఆర్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు రావాల్సిందిగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ శుక్రవారం కేసీఆర్‌ను కలిశారు. నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి జీఏడీ అధికారులతో కలిసి వెళ్లిన వేణుగోపాల్.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వాన పత్రికను ఇవ్వడంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌కు రాసిన లేఖను అందజేశారు.అనంతరం వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. తెలంగాణ అవతరణ దినోత్సవం అందరికీ పండుగ. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని కేసీఆర్‌ను కోరాం. ఆయన మా ఆహ్వానానికి సానుకూలంగా స్పందించారు’అని వెల్లడించారు. అయితే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఈ వేడుకల్లో పాల్గొనేదీ లేనిదీ తెలియదని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
బీఆర్ఎస్కు షాక్! జెడ్పీటీసీ సభ్యురాలు పార్టీకి గుడ్‌బై..
కరీంనగర్: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్కు తొలి షాక్ తగిలింది. కొత్తపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు పిట్టల కరుణ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి, కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం నగరంలోని ఓ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమెకు పార్టీ కండువా కప్పి, ఆహ్వానించారు. అలాగే మత్స్యపారిశ్రామిక సంఘం అధ్యక్షుడు పిట్టల రవీందర్, వార్డు సభ్యులు పిట్టల విష్ణు, పిల్లి శ్రీధర్, గుర్రం సత్యం, కోమలతోపాటు కొత్తూరి వెంకట్రాజయ్య, ముస్కు అంజిరెడ్డి, గుగులోతు దివ్య, బానోతు రవినాయక్, శ్రవణ్‌నాయక్, గంగాధర కనకయ్య కాంగ్రెస్‌లో చేరినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తపల్లి జెడ్పీటీసీ సభ్యురాలి చేరికతో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందన్నారు. ముదిరాజ్ కులస్తుల అభ్యున్నతికి కృషి చేస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ముదిరాజ్‌లకు న్యాయం జరగలేదని, అందుకే కాంగ్రెస్‌లో చేరామని జెడ్పీటీసీ సభ్యురాలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నగర శాఖ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. ఇవి చదవండి: కాంగ్రెస్‌లోకి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి -
APSRTC: 541 అద్దె బస్సులకు ఆర్టీసీ టెండర్లు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో అద్దె బస్సుల కోసం ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. ఎంఎస్టీసీ ఈ-కామర్స్ పోర్టల్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఆర్టీసీ 541అద్దె బస్సుల కోసం టెండర్లను పిలిచింది. ఆసక్తి ఉన్నవారు ఎంఎస్టీసీ ఈ-కామర్స్ పోర్టల్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఈ నెల 21 నుంచి మార్చి 6వ తేదీ వరకు బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. మార్చి 14వ తేదీ ఈ–వేలం నిర్వహిస్తారు. అద్దె బస్సులు నిర్వహించా ల్సిన రూట్లు, టెండరు నిబంధనలు, ఇతర వివరాల కోసం తమ వెబ్సైట్ http://apsrtc.ap.gov.inను సంప్రదించాలని ఏపీఎస్ ఆర్టీసీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. టెండర్లు పిలిచిన బస్ సర్వీసుల వివరాలు ఏసీ స్లీపర్–2, నాన్ ఏసీ స్లీపర్–9, సూపర్ డీలక్స్–22, అల్ట్రా డీలక్స్–33, ఎక్స్‌ప్రెస్–168, అల్ట్రా పల్లెవెలుగు–74, పల్లె వెలుగు–225, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు–3, సిటీ ఆర్డినరీ–5. -
‘టీఎస్పీఎస్సీ’కి దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్, సభ్యుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి తెరలేపింది. రాజ్యాంగబద్ధమైన ఈ పోస్టులకు ఇప్పటివరకు అర్హత కలిగిన వ్యక్తులను నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తుండగా..తొలిసారిగా దరఖాస్తు విధానాన్ని కొత్త సర్కారు ప్రవేశపెట్టింది. దరఖాస్తులు ఆహ్వనిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి, అర్హతలు ఉన్నవారు ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని సీఎస్ పేర్కొన్నారు. www. telangana.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పూరించిన దరఖాస్తును secy-ser-gad@telangana.gov. in ఈమెయిల్ ద్వారా సమర్పించాలని స్పష్టం చేశారు. మూడు పేజీల దరఖాస్తు టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు పేజీల దరఖాస్తును రూపొందించింది. విద్యార్హతలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసిన ఉద్యోగి అయితే నియామకం వివరాలు, విధులు, సాధించిన విజయాలు తదితర పూర్తి సమాచారాన్ని పొందుపరచాలి. అకడమిక్, మేనేజ్మెంట్, న్యాయశాస్త్రం, శాస్త్ర సాంకేతిక రంగం, హ్యుమానిటీస్ లేదా వారి పనిని గుర్తించే రంగానికి సంబంధించిన వివరాలను, నిర్వహించిన బాధ్యతలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. తమ ప్రత్యేకతలు, విజయాలను 200 పదాల్లో వివరించాలి. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చూడాలని సీఎస్ తెలిపారు. సెర్చ్ కమిటీ ద్వారా పరిశీలన చైర్మన్, మెంబర్ పోస్టులకు వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్ కమ్ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తుంది. ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు రాజ్యాంగంలోని ఆరి్టకల్ 316 ప్రకారం టీఎస్పీఎస్సీ చైర్మన్, మెంబర్లను గవర్నర్ నియమిస్తారు. ఆరి్టకల్ 316 ప్రకారం టీఎస్పీఎస్సీ నిబంధనలకు లోబడి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మరో సభ్యురాలి రాజీనామా టీఎస్పీఎస్సీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించారు. ఆరేళ్ల పాటు కొనసాగాల్సిన తాను రెండున్నరేళ్లకే రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల టీఎస్పీఎస్సీలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వ మార్పు నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. -
Sara Ali Khan: బాలీవుడ్ హీరోయిన్ ఇంట దీపావళి వేడుకలు (ఫోటోలు)
-
గుడ్ న్యూస్: 30 వేల మంది భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ ఆహ్వానం..
ప్యారిస్: విదేశీ విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ శుభవార్త చెప్పింది. 2030 నాటికి భారత్ నుంచి 30,000 మంది విద్యార్థులను ఆహ్వానించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ పారిస్‌ను సందర్శించిన దాదాపు నెల రోజుల తర్వాత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ ప్రకటన చేశారు. ఎక్కువ మంది భారతీయ విద్యార్థులను ఆకర్షించడానికి ఐదేళ్ల షార్ట్-స్టే స్కెంజెన్ వీసాతో సహా అనేక చర్యలను ఫ్రాన్స్ రూపొందించింది. ప్రధాన మంత్రి మోదీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాల్లో భాగంగానే ఫ్రాన్స్ ఈ చర్యలు తీసుకుంది. విద్యార్థుల ప్రయోజనం కోసం ఫ్రెంచ్ భాషతో సహా ఇతర విద్యా విభాగాలలో సమగ్ర శిక్షణ ఇవ్వడానికి ఫ్రాన్స్ సిద్ధపడిందని రాయభార కార్యాలయం తెలిపింది. విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రెసిడెంట్ మాక్రాన్, ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారు. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని, ప్రపంచ స్థాయి విద్యా అవకాశాలను భారతీయులతో పంచుకోవడానికి ఆసక్తిని ఫ్రాన్స్ కలిగి ఉంది. భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ మంచి స్నేహితునిలా పనిచేస్తుంది.'అని ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ తెలిపారు. ఫ్రాన్స్ విద్యావకాశాలు విద్యార్థులకు పరిచయం చేసేలా చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, ముంబైలలో ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను కూడా నిర్వహించనుంది. అక్టోబర్‌లో జరగనున్న ఈ వేడుకకు దాదాపు 40 ఇన్స్టిట్యూషన్లకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇదీ చదవండి: జీ20 సదస్సుకు అధ్యక్షుడు జిన్‌పింగ్ స్థానంలో చైనా ప్రీమియర్ -
పెట్టుబడులతో రండి... అమెరికన్ కంపెనీలకు ప్రధాని పిలుపు
వాషింగ్టన్: భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రముఖ అమెరికన్ కంపెనీలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని పలు అగ్రగామి కంపెనీల సీఈవోలతో వాషింగ్టన్లో చర్చలు నిర్వహించారు. భారత సెమీకండక్టర్ పరిశ్రమకు మద్దతుగా నిలవాలని అమెరికన్ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీని కోరారు. టెక్నాలజీ ప్రాసెస్, ప్యాకేజింగ్ సామర్థ్యాల అభివృద్ధికి భారత్‌కు విచ్చేయాలని సెమీకండక్టర్ రంగంలో పనిచేసే ప్రముఖ సంస్థ అప్లయ్డ్ మెటీరియల్స్ సంస్థను ప్రధాని కోరారు. భారత్‌లోని సంస్థలతో సహకారానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అప్లయ్డ్ మెటీరియల్స్ సీఈ వో గ్యారీ డికర్సన్‌కు సూచించారు. భారత ఏవి యేషన్, రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో ముఖ్య పాత్ర పోషించాలని జనరల్ ఎలక్ట్రిక్ సీఈవో హెచ్ లారెన్స్‌కల్ప్‌తో భేటీ సందర్భంగా కోరారు. సుముఖంగా ఉన్నాం పరస్పర విజయానికి వీలుగా ప్రధాని మోదీ, భారత్‌లోని ప్రతి ఒక్కరితో కలసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నాం. – గ్యారీ డికర్సన్, అప్లయ్డ్ మెటీరియల్స్ -
నికోబార్ వద్ద భారీ ట్రాన్స్షిప్మెంట్ కార్గో ప్రాజెక్ట్
న్యూఢిల్లీ: గ్రేట్ నికోరాబ్ ఐలాండ్ వద్ద బంగాళాఖాతంలో ‘ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ప్రాజెక్ట్’కు కేంద్ర షిప్పింగ్ శాఖ ఆసక్తి వ్యక్తీకరణలను (ఈవోఐ) ఆహ్వానించింది. పీపీపీ కాంట్రాక్ట్ సంస్థ, ప్రభుత్వ పెట్టుబడులు కలసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.41,000 కోట్ల వ్యయం చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ప్రతిపాదిత పోర్ట్ ప్రాజెక్ట్ వార్షికంగా 16 మిలియన్ కంటెయినర్ల నిర్వహణ సామర్థ్యంతో ఉంటుందని తెలిపింది. మొదటి దశ రూ.18,000 కోట్లతో 2028 నాటికి పూర్తవుతుందని, 4 మిలియన్ టన్నులకు పైగా కంటెయినర్లను ఇది నిర్వహించగలదని వివరించింది. ఈ రవాణా పోర్ట్‌కు అనుబంధంగా ఎయిర్పోర్ట్, టౌన్షిప్, పవర్ ప్లాంట్ కూడా నిర్మించాలనేది ప్రణాళికగా షిప్పింగ్ శాఖ తెలిపింది. అంతర్జాతీయ జల రవాణా మార్గంలో ఈ పోర్ట్ ఏర్పాటు కానుందని, ఇదే మార్గంలో ప్రస్తుతం సింగపూర్, క్లాంగ్, కొలంబో పోర్ట్‌లు ఉన్నట్టు పేర్కొంది. -
షిప్పింగ్ కార్ప్ విక్రయానికి సిద్దమవుతున్న రంగం: త్వరలోనే బిడ్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ షిప్పింగ్ కార్పొరేషన్(ఎస్సీఐ) ప్రయివేటీకరణకు ఈ ఆర్థిక సంవత్సరం(2022-23) చివరి త్రైమాసికంలో ఫైనాన్షియల్ బిడ్స్‌ను ఆహ్వానించే వీలుంది. ఇందుకు వీలుగా ప్రభుత్వం కంపెనీకి చెందిన కీలకంకాని, భూమి సంబంధ ఆస్తుల విడదీతను ప్రారంభించింది కూడా. ఈ ప్రక్రియ తుది దశకు చేరినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. రానున్న మూడు నెలల్లోగా పూర్తికావచ్చని అంచనా వేశారు. దీంతో జనవరి-మార్చి(క్యూ4)కల్లా అర్హతగల కంపెనీల నుంచి ఫైనాన్షియల్ బిడ్స్‌కు ఆహ్వానం పలికే వీలున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది మే నెలలో కీలకంకాని ఆస్తుల విడదీతకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా షిప్పింగ్ హౌస్, ముంబై, మ్యారిటైమ్ ట్రయినింగ్ ఇన్స్టిట్యూట్, పోవైసహా ఎస్సీఐ ల్యాండ్ అండ్ అసెట్స్ లిమిటెడ్(ఎస్‌సీఐఎల్‌ఏఎల్)ను విడదీయనుంది. తద్వారా ఎస్‌సీఐఎల్‌ఏఎల్ పేరుతో విడిగా కంపెనీ ఏర్పాటుకు తెరతీయనుంది. -
ఇస్రో చూసొద్దామా.. లక్కీ ఛాన్స్ మిస్సవకండి.. దరఖాస్తు చేయండిలా..
రాజమహేంద్రవరం రూరల్/భానుగుడి (కాకినాడ సిటీ): అంతరిక్ష పరిజ్ఞానం పెంచేందుకు వీలుగా తొమ్మిదో తరగతి విద్యార్థులకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చక్కని అవకాశం కల్పిస్తోంది. ఇందుకు యువికా–2022 పేరుతో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని వివిధ అంతరిక్ష పరిశోధన కేంద్రాలను ప్రతిభావంతులైన విద్యార్థులు సందర్శించవచ్చు. చదవండి: New Education Policy: డిగ్రీ ఇక నాలుగేళ్లు అంతరిక్షంలో ఎలా ఉంటుంది, ఉపగ్రహ ప్రయోగాలు ఎలా చేస్తారు తదితర విషయాలు ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. నిపుణులతో చర్చలు తదితర కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఈ స్ఫూర్తితో భావి శాస్త్రవేత్తలుగా ఎదగవచ్చు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 9వ తరగతి విద్యార్థులు 82,412 మంది ఉన్నారు. అందరూ ఈ అవకాశానికి ప్రయతి్నంచాలని విద్యాశాఖాధికారులు సూచిస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులు విద్యార్థులను ఈ దిశగా ప్రోత్సహించాలని కోరుతున్నారు. దరఖాస్తు చేయడమిలా.. ఇస్రో ప్రధాన వెబ్సైట్ ‘ఐఎస్ఆర్ఓ.జీఓవీ.ఇన్’లో సొంత ఈ–మెయిల్ ఐడీతో విద్యార్థి లాగిన్ అయి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తరువాత రెండు రోజులకు ఇస్రో నిర్వహించే ఆన్లైన్ క్విజ్ పోటీల్లో పాల్గొనాలి. ఆ తరువాత అదే వెబ్సైట్ ద్వారా ఏప్రిల్ 10వ తేదీ లోగా దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తుతో పాటు విద్యార్థులు తరగతిలో తమ ప్రతిభకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి. ఎంపికైన వారి జాబితాను అదే నెల 20న వెబ్సైట్లో ఉంచుతారు. పరిశీలన అనంతరం ఇస్రో తుది జాబితా ప్రకటిస్తుంది. దేశవ్యాప్తంగా జరిగే వడపోతలో రాష్ట్రానికి ముగ్గురు చొప్పున అవకాశం కల్పిస్తారు. చదవండి: కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం.. అవతరణకు ముహూర్తం ఖరారు ఎంపికైన విద్యార్థులకు విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ (తిరువనంతపురం), యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (బెంగళూరు), స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (అహ్మదాబాద్), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (హైదరాబాద్), నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (షిల్లాంగ్)లలో మే 16 నుంచి 28వ తేదీ వరకూ 13 రోజుల పాటు రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇస్తారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సైతం అవకాశం కల్పించారు. శిక్షణ, బస, ప్రయాణ తదితర అన్ని ఖర్చులనూ ఇస్రో భరిస్తుంది. శిక్షణ పూర్తయిన విద్యార్థులకు శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో రాకెట్ ప్రయోగాలపై అవగాహన కల్పిస్తారు. ఎంపిక చేస్తారిలా.. ఎనిమిదో తరగతిలో సాధించిన మార్కులకు 60 శాతం వెయిటేజీ ఇస్తారు. 2016 నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్, చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి 10 శాతం, క్రీడల్లో ప్రతిభకు 10 శాతం ఎన్సీసీ, స్కౌట్ విభాగాల్లో ఉన్న వారికి 5 శాతం, గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివే వారికి 15 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంపిక చేస్తారు. అవకాశాన్ని అందుకోవాలి జిల్లాలోని తొమ్మిదో తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఏ రంగంలోనైనా అవకాశాలను అందిపుచ్చుకున్న వారినే విజయం వరిస్తుంది. చిన్న వయస్సులోనే శాస్త్ర, సాంకేతిక అంశాలు పరిచయమైతే భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. వివరాలకు 99127 88333 సెల్ నంబరులో సంప్రదించాలి. – ఎం.శ్రీనివాస్ వినీల్, జిల్లా సైన్స్ అధికారి, కాకినాడ -
సీఎం జగన్‌ను ఆహ్వానించిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్
న్యూఢిల్లీ: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆహ్వానం పంపింది. 2022లో జనవరి 17-21 మధ్య దావోస్‌లో నిర్వహించే సదస్సులో పాల్గొనాలని కోరింది. ఈ మేరకు డబ్ల్యూఈఎఫ్ ప్రతినిధి బోర్జ్ బ్రెండె..మంత్రి గౌతమ్ రెడ్డిని కలిశారు. ఈ సారి ‘వర్కింగ్ టుగెదర్, రీస్టోరింగ్ ట్రస్ట్’ నేపథ్యంలో సమావేశం జరగనున్నట్లు బోర్జ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీ ఆర్థికవృద్ధికి సీఎం తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామిక విధానాన్ని మంత్రి గౌతం రెడ్డి ఆయనకు వివరించారు. కాగా కోవిడ్-19 నియంత్రణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నా చర్యలను బోర్ట్ బ్రెండె ప్రశంసించారు. పారిశ్రామిక విధానం, ఆర్థికాభివృద్ధి, అభివృద్ధి వికేంద్రీకరణ తదితరవిషయాలపై బ్రెండె ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు. చదవండి: ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు -
DRDO: 2-డీజీ డ్రగ్, కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి చికిత్సలో డా.రెడ్డీస్‌తో కలిసి అభివృద్ధి చేసిన 2-డీజీ ఉత్పత్తికి సంబంధించి డీఆర్డీవో కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ డ్రగ్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేలా తమ సాంకేతిక పరిజ్ఞానాన్నిఇతర ఔషధ సంస్థలకు బదిలీ చేయనుంది. ఇందుకు కంపెనీలనుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ (ఈఓఐ)ను ఆహ్వానిస్తోంది. ఈమెయిల్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని కోరింది. ఆయా కంపెనీలు దరఖాస్తులను సమర్పించడానికి జూన్ 17 చివరి తేదీగా వెల్లడించింది. పరిశ్రమలు సమర్పించిన ఈఓఐను తమ టెక్నికల్ అసెస్మెంట్ కమిటీ పరిశీలిస్తుందని వీటి ఆధారంగా 15 పరిశ్రమలకు మాత్రమే ఉత్పత్తికి అనుమతి ఉంటుందని డీఆర్డీవో స్పష్టం చేసింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్, సామర్ధ్యం, తమ సాంకేతిక హ్యాండ్‌హోల్డింగ్ సామర్ధ్యం ఆదారంగా కేటాయింపు ఉంటుందని డీఆర్డీవో ఒక ప్రకటనలో తెలిపింది. క్లినికల్ ట్రయల్స్ ఫలితాల ఆధారంగా కరోనా నివారణలో తమ 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2డీజీ) ఆసుపత్రులో చేరిన రోగులు వేగంగా కోలుకోవడానికి దోహదపడుతుందని, ఆక్సిజన్‌పై ఆదారపడటాన్ని కూడా తగ్గిస్తుందని డీఆర్డీవో గతంలోనే ప్రకటించినసంగతి తెలిసిందే. ఈ మందు తయారీకి బిడ్డర్లకు డ్రగ్ లైసెన్సింగ్ అథారిటీలనుండి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్ (ఏపీఐ), డబ్ల్యూహెచ్ఓ జీఎమ్‌పి (మంచి తయారీ పద్ధతులు) ధృవీకరణ తయారీకి డ్రగ్ లైసెన్స్ ఉండాలి. కాగా వినూత్నమైన పనితీరు కారణంగానే కరోనావైరస్ను 2డీజీ సమర్థంగా నిరోధించ గలుగుతోందని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జీ సతీశ్‌రెడ్డి చెప్పారు. ఈ మందు తయారీ, పంపిణీ సులువుగా ఉంటుందన్నారు. అలాగే కరోనా వైరస్ రూపాంతరాలపై కూడా తాము అభివృద్ధి చేసిన 2డీజీ ఔషధం సమర్థంగా పనిచేస్తుందని డీఆర్డీవోకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ శాస్త్రవేత్త డాక్టర్ అనంత్ నారాయణ్ భట్ తెలిపారు. చదవండి : DRDO 2G Drug: వైరస్ రూపాంతరాలపైనా 2-డీజీ ప్రభావం! -
ఎన్డీయేయేతర పార్టీలకు సోనియా ఆహ్వానం!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: తమకు 300 పైచిలుకు సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెబుతున్నప్పటికీ.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ బీజేపీకి రాకపోవచ్చని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. కాషాయ పార్టీని అధికారానికి దూరంగా ఉంచే లక్ష్యంతో పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ఈ నెల 23న ఎన్డీయేయేతర పార్టీలు, ఇతర భావసారూప్య పార్టీలతో సమావేశం నిర్వహించనున్నారు. పలు ప్రధాన ప్రాంతీయ పార్టీలతో సహా 20కి పైగా ప్రతిపక్ష పార్టీలతో ఇప్పటికే చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌లతో పాటు ఆర్జేడీ, టీఎంసీ వంటి లౌకిక, తటస్థ పార్టీల నేతలను సోనియా ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీల నేతలు అందుబాటులో ఉండటాన్ని బట్టి ఈ సమావేశం 21 లేదా 22వ తేదీన కూడా జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ అంశంలో సమన్వయం కోసం నలుగురు కాంగ్రెస్ నేతలతో ఒక బృందం ఏర్పాటైనట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, పి.చిదంబరం, గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లోత్‌లతో కూడిన బృందం.. భావసారూప్య పార్టీలతో ఎన్నికల అనంతర పొత్తు అవకాశాలపై కసరత్తు చేస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఫ్రంట్ ఏర్పాటు యోచన బీజేపీకి మెజారిటీ రాదని కాంగ్రెస్ విశ్వసిస్తోందని, ఒకవేళ హంగ్ పార్లమెంట్ ఏర్పడిన నేపథ్యంలో బీజేపీకి ఎలాంటి అవకాశం చిక్కకుండా చేసే క్రమంలో ఓ ఫ్రంట్‌ను ముందుకు తేవాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రధానమంత్రి పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదని ఆజాద్ ఇప్పటికే ప్రకటించడంతో ఆ అంశం ఇందుకు ఆటంకం కాబోదని వివరించాయి. కర్ణాటకలో తమకు 78 మంది ఎమ్మెల్యేలున్నా, కేవలం 37 సీట్లున్న జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు మద్దతు పలికిన విషయం గుర్తు చేశాయి. పరిస్థితిని బట్టి వీలైతే ప్రతిపక్ష పార్టీల ప్రతినిధి బృందం 23నే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పూర్తి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిందిగా కోరాలని నిర్ణయించుకున్నట్లు వివరించాయి. -
ఇద్దరు కేంద్ర మంత్రులకు ఆహ్వానం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): అభివృద్ధి పనుల శంకుస్థాపనకు కర్నూలు జిల్లాకు రావాలంటూ ఇద్దరు కేంద్ర మంత్రులను ఆహ్వానించినట్లు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. గురువారం ఎంపీ కార్యాలయం నుంచి ఈమేరకు ప్రకటన వెలువడింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీని.. ఆదోనిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా మైనారిటీల కోసం మంజూరైన వివిధ పనులను ప్రారంభించాలని కోరినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్‌లో పార్లమెంట్ సమావేశాల తర్వాత పర్యటించనున్నట్లు కేంద్ర మంత్రి నక్వి హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు. కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీని..ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటించాలని కోరామని, చేనేత కార్మికుల ఇబ్బందులను వివరించగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ పేర్కొన్నారు. -
కూచిపూడి కళాకారులకు ఆహ్వానం
అనంతపురం కల్చరల్ : కృష్ణా పుష్కరాల సందర్భంగా సాంస్కృతిక శాఖ ఈనెల 23న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో 1000 మంది నృత్య కళాకారులతో కూచిపూడి మహా బృంద నాట్య ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు యువజన సంక్షేమ శాఖ అధికారిణి గీతా గాంధీ వాణి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రదర్శనలో పాల్గొనడానికి కూచిపూడి కళాకారులందరికీSఅవకాశం కల్పిస్తున్నామని, ఆసక్తి గల వారు ఈనెల 11లోపు జిల్లా యువజన సంక్షేమ శాఖ కార్యాలయంలో వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. -
అమెరికా వర్సిటీలో ప్రసంగించనున్న కమల్
చెన్నై: నటుడిగా విశ్వనటుడు కమలహాసన్‌ది ఎల్లలు దాటిన ఖ్యాతి అని ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయనకు అమెరికా నుంచి అరుదైన ఆహ్వానం అందింది. అమెరికాలోని బాస్టన్ నగరంలో గల ప్రఖ్యాత హార్వర్డు వర్సిటీలో కమల్ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 6,7 తేదీల్లో ఈ యూనివర్శిటీలో జరిగే సదస్సులో భారతదేశ అభివృద్ధి, ఎదుర్కొంటున్న సవాళ్ల వంటి అంశాలపై కమల్ ప్రసంగించనున్నారు. ఇలాంటి సదస్సులో పాల్గొననున్న తొలి దక్షిణాది నటుడు కమలహాసన్ కావడం విశేషం. -
హైకోర్టు సీజేకు సీఎం కేసీఆర్ ఆహ్వానం
హైదరాబాద్: హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలేతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు భేటీ అయ్యారు. ఈ నెల 23 నుంచి 27 వరకు నిర్వహించతలపెట్టిన ఆయుత చండీయాగంలో పాల్గొనవలసిందిగా సీఎం.. చీఫ్ జస్టిస్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ తలపెట్టిన ఆయుత చండీయాగానికి ఇప్పటికే దేశంలోని ప్రముఖులకేకాక, రాష్ట్రంలోని ముఖ్య వ్యక్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తదితరులను ఇప్పటికే ఆహ్వానించిన కేసీఆర్.. నేడో, రేపో విజయవాడకు వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా చండీయాగం ఆహ్వాన పత్రికను అందించనున్నారు. -
అమరావతి శంకుస్థాపనకు రండి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ఢిల్లీలోని పలువురు ప్రముఖులను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఆహ్వానించారు. ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ లను బుధవారం ఆయన కలిసి ఆమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని కోరారు. ఈ సందర్భంగా ప్రధానిని కలిసిన ఆయన ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణంపై చర్చించారు. రాజధాని నిర్మాణానికి అందరి సహకారం అవసరమని చంద్రబాబునాయుడు తెలిపారు. -
గిలానీ.. ఓ సారి మా ఊరికిరా..
- కశ్మీర్ వేర్పాటువాదనేత గిలానీకి నవాజ్ షరీఫ్ ప్రత్యేక లేఖ - పాకిస్థాన్ లో పర్యటించాల్సిందిగా ఆహ్వానం న్యూఢిల్లీ: కశ్మీర్ అంశంలో పాకిస్థాన్ మరోసారి భారత్ ను రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శించింది. ఐక్యరాజ్యసమితి వేదికగా ఇదే అంశంపై ఇరుదేశాలు భిన్నవాణులను వినిపించిన దరిమిలా చర్చల ప్రక్రియ ఎలాంటి మలుపు తీసుకుంటుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో.. పాకిస్థాన్ పర్యటనకు రావాల్సిందిగా హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ అలీషా గిలానీకి ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆహ్వానం పంపడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు నవాజ్ పంపిన ఆహ్వాన పత్రాన్ని పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్.. గిలానీకి అందజేశారు. 'శుక్రవారం రాత్రి జరిగిన విందు సమావేశంలో బాసిత్.. నవాజ్ షరీఫ్ పంపిన ఆహ్వానాన్ని గిలానీకి అందజేశారు' అని పాక్ కమిషనర్ కార్యాలయ అధికార ప్రతినిధి ఒకరు శనివారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా లేఖలోని అంశాలను ఆయన ఉటంకించారు. కశ్మీర్ అంశం కారణంగా పార్ ఏర్పాటు ప్రక్రియ అసంపూర్ణంగా మిగిలిపోయిందని, ఇందులో ఇరు దేశాలేకాక రెండు కోట్ల మంది ప్రజల మనోభావాలు ఇమిడి ఉన్నాయని షరీఫ్ లేఖలో పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి పాక్ విస్తృత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అందుకు భారత్ సహకరించటంలేదని, కశ్మీర్ అంశంపై మాట్లాడేందుకు సిద్ధంగా లేని కారణంగానే ఎన్ఎస్ఏ స్థాయి చర్చల్లో భారత్ వెనుకడుగువేసిందని ఆరోపించారు. ఇస్లామాబాద్- ఢిల్లీల మధ్య మైత్రి కొనసాగాలన్నదే తమ అభిమతమని తెలిపారు. గిలానీ కూడా పాక్ ఆహ్వానానికి అంగీకరించారని, అతి త్వరలోనే పర్యటనకు సంబంధించిన తేదీల వివరాలు తెలియజేస్తామని అధికార ప్రతినిధి తెలిపారు. -
తెలంగాణలో పెట్టుబడులు కోరనున్న కేసీఆర్
-
రాష్ట్రపతికి ఇచ్చే విందుకు హాజరుకానున్నా సీఎంలు
-
'మోదీ మా దేశం రాండి.. మాట్లాడండి'
న్యూఢిల్లీ: నేపాల్‌కు భారత ప్రధాని నరేంద్రమోదీని ఆదేశ ప్రధాని సుశీల్ కోయిరాలా ఆహ్వానించారు. తమ వద్ద జరుగుతున్న తొలి డోనర్స్ సమావేశంలో పాల్గొని అందులో ప్రసంగించాల్సిందిగా ఆయన చెప్పారు. ఈ మేరకు గురువారం మోదీకి సుశీల్ నేరుగా ఫోన్ చేయడమే కాకుండా ప్రత్యేక ఆహ్వాన పత్రికతో నేపాల్ ఆర్థిక మంత్రి రామ్ చంద్ర మహత్ ను కూడా ఢిల్లీ పంపించనున్నారు. జూన్ 25న ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా కొయిరాలా మోదీని పొగడ్తల్లో ముంచెత్తారు. పొరుగు దేశాలతో మోదీ భారత్‌కు బలపరుస్తున్న సంబంధాలు అద్వితీయం అని చెప్పారు. బంగ్లాదేశ్ పర్యటన కూడా ఆయన ప్రస్థావించారు. దీంతోపాటు భూకంప బారినుంచి త్వరగా కోలుకునేందుకు తీసుకుంటున్న సహాయక చర్యలను కూడా ఆయన మోదీకి వివరించారు. అయితే, తాను తప్పక వస్తానని హామీ ఇచ్చిన మోదీ ఏదైనా కారణాల వల్ల రాలేకపోతే మాత్రం ఉన్నత స్థాయి కమిషన్ వస్తుందని చెప్పినట్లు సమాచారం. చక్కటి వాక్చాతుర్యం ఉన్న నేత నరేంద్ర మోదీకావడంతో ఆయనే వెళ్లే అవకాశం ఉంది. అంతేకాకుండా, భూకంపం బారిన పడిన నేపాల్‌కు అన్ని విధాల సాయం అందించిన దేశాల్లో భారత్ ముందున్న నేపథ్యంలో కూడా మోదీనే వెళ్లొచ్చు. భూకంపం బారిన పడిన తమకు సహాయం చేసిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపే ఉద్దేశంతో నేపాల్ ఈ సమావేశం నిర్వహిస్తోంది. -
రాహుల్‌కు విజయ్ గోయల్ ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీ నగరాన్ని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారంటూ కితాబిచ్చిన కాంగ్రెస్‌పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని వాస్తవాలు తెలుసుకునేందుకు నగర పర్యటనకు రావాలంటూ ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ ఆహ్వానించారు. పండిత్ పంత్ మార్గ్‌లోని కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ సీఎం షీలా ప్రజలను, కాంగ్రెస్ అధిష్టానాన్ని మోసం చేస్తున్నారంటూ ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రసంగం వింటే అతనికి నగరంపై పూర్తిగా అవగాహనలేదనిపిస్తోందని ఎద్దేవా చేశారు. నగరంలో స్వయంగా పర్యటిస్తేనే పదిహేనేళ్ల కాంగ్రెస్ నిర్లక్ష్యపు పాలనలో ఢిల్లీవాసులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుస్తాయన్నారు. రాజధాని నగరాన్ని స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న డిమాండ్‌పై సైతం ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తున్నాయంటూ దుయ్యబట్టారు. ‘ఢిల్లీ నగరాన్ని అభివృద్ధి చేశానంటూ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఢిల్లీవాసులనేకాదు ఆపార్టీ అధిష్టానాన్ని మోసం చేస్తోంది. ముఖ్యమంత్రి చూపుతున్న అభివృద్ధి చిత్రాలను చూసి నగరం మొత్తం ఇలాగే ఉందన్న భావనలో రాహుల్‌గాంధీ ఉన్నట్టున్నారు. వాస్తవాలు తెలియాలంటే ఆయన నగరంలో స్వయంగా పర్యటించాల’ని అన్నారు. నగరానికి అధికారాలు విస్తరించాలంటూ ముఖ్యమంత్రి కొత్త ప్రతిపాదలను చేస్తూ అనవసర గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ రాష్ట్ర ప్రతిపత్తిపై బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం 2004లో పంపితే ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తిరస్కరించారన్నారు. సోనియా, మన్మోహన్ క్షమాపణ చెప్పాలి: హర్షవర్ధన్ నరేంద్ర మోడీ పాట్నాలో నిర్వహించిన హూంకర్ ర్యాలీ సమీపంలో బాంబుపేలుళ్ల్లు జరగడంపై ఆయా పార్టీల నాయకులు చేసిన వ్యాఖ్యలను ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ తీవ్రంగా ఖండించారు. ఇందుకు బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పేలుళ్లపై కాంగ్రెస్, జేడీయూ నాయకులు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. నాయకుల మాటలు దేశం పరువుతీసేలా ఉన్నాయన్నారు. ముందస్తు పథకం ప్రకారమే బాంబు పేలుళ్లు జరిపారని బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. పార్టీ సీనియర్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. పేలుళ్లలో గాయపడిన వారికి, మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాట్నాలో హూంకర్ ర్యాలీ నిర్వహించనున్నట్టు కొన్ని నెలల ముందే బీహార్ ప్రభుత్వానికి బీజేపీ నాయకులు సమాచారం ఇచ్చారని గుర్తు చేశారు. సంఘ విద్రోహ శక్తులు బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ హత్యకు కుట్రచేస్తున్నా నితీశ్‌సర్కార్ చూస్తూ కూర్చుందన్నారు. నెల క్రితమే ర్యాలీలో బాంబులు పేల్చేందుకు ఉగ్రవాదులు పథక రచన చేసినట్టు కేంద్ర హోంశాఖ బీహార్‌ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు హోంమంత్రి షిండే పేర్కొన్నారన్నారు. అయిన్పటికీ ర్యాలీ మైదానం సమీపంలో మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయలేదన్నారు. కనీసం అంబులెన్స్‌లను సైతం ర్యాలీ ప్రదేశంలో ముందస్తుగా ఉంచలేదన్నారు. దాదాపు ఏడు లక్షల మందికిపైగా ప్రజలు ఒక్కచోట చేరినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. అదే రాహుల్‌గాంధీ ప్రచారానికి భద్రత కల్పిస్తున్న ప్రభుత్వాలు బీజేపీ విషయంలో వివక్ష చూపుతున్నాయని ఆరోపించారు. రాహుల్ ర్యాలీ విఫలం ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, మరికొందరు కేంద్రమంత్రులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని భారీగా ఏర్పాట్లు చేసినా మంగోలిపురిలో రాహుల్‌గాంధీ నిర్వహించిన ర్యాలీకి ప్రజల నుంచి స్పందన రాలేదని వ్యాఖ్యానించారు. దీనిద్వారా రాహుల్‌కి ప్రజల్లో ఏమాత్రం గుర్తింపు ఉందో మరోమారు అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీ పూర్తిగా విఫలమైందన్నారు. సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్‌గాంధీకి ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలుసన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తధ్యమన్నారు. -
మోడీకి బ్రిటన్ పార్టీల ఆహ్వానం
లండన్: బ్రిటన్ను సందర్శించాల్సిందిగా బీజేపీ ఎన్నికల కమిటీ ప్రచార సారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి ఆహ్వానాలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిటన్ అధికార కన్సర్వేటివ్ పార్టీతోపాటు ప్రతిపక్ష లేబర్ పార్టీ నేతలు కూడా మోడీకి ఆహ్వానం పంపటంపై ఏకీభవించటం ఆరుదైన విషయమని చెబుతున్నారు. 2002లో గోద్రా అల్లర్ల అనంతరం నరేంద్రమోడీ తమ దేశానికి రాకుండా బ్రిటన్ పదేళ్ల పాటు బహిష్కరించిన విషయం తెలిసిందే. గతేడాది బ్రిటన్ తన దృ క్పథాన్ని మార్చుకుంది. భారత్‌లో యూకే దౌత్యాధికారి జేమ్స్ బెవాన్ గత ఏడాది అక్టోబర్‌లో 22న మోడీని కలిసి బ్రిటన్ రావాలని ఆహ్వానించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఐరోపా యూనియన్ కూడా మోడీని బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఢిల్లీలో ఆయనకు విందు ఇచ్చింది. తాజాగా బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ కూడా మోడీకి ఆహ్వానం పలికింది. లేబర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా చైర్మన్, ఎంపీ బారీ గార్డినర్ ఈమేరకు గత వారం లేఖ పంపారు. ‘ఆధునిక భారత్ భవిష్యత్తు’ అనే అంశంపై దిగువ సభ(హౌస్ ఆఫ్ కామన్స్)లో ప్రసంగించాలని మోడీని కోరారు. కాగా, వెంటనే బ్రిటన్ను సందర్శించే యోచనేదీ మోడీకి లేదని అని గుజరాత్ సీఎం కార్యాలయం ప్రతినిధి పేర్కొన్నారు.