
న్యూఢిల్లీ: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆహ్వానం పంపింది. 2022లో జనవరి 17-21 మధ్య దావోస్‌లో నిర్వహించే సదస్సులో పాల్గొనాలని కోరింది. ఈ మేరకు డబ్ల్యూఈఎఫ్ ప్రతినిధి బోర్జ్ బ్రెండె..మంత్రి గౌతమ్ రెడ్డిని కలిశారు. ఈ సారి ‘వర్కింగ్ టుగెదర్, రీస్టోరింగ్ ట్రస్ట్’ నేపథ్యంలో సమావేశం జరగనున్నట్లు బోర్జ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీ ఆర్థికవృద్ధికి సీఎం తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామిక విధానాన్ని మంత్రి గౌతం రెడ్డి ఆయనకు వివరించారు.
కాగా కోవిడ్-19 నియంత్రణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నా చర్యలను బోర్ట్ బ్రెండె ప్రశంసించారు. పారిశ్రామిక విధానం, ఆర్థికాభివృద్ధి, అభివృద్ధి వికేంద్రీకరణ తదితరవిషయాలపై బ్రెండె ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు.
చదవండి: ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Comments
Please login to add a commentAdd a comment