World Economic Forum
-
తాగునీరే కాదు... తప్పుడు సమాచారమూ సవాలే!
సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో మన దేశం ప్రధానంగా రెండు సవాళ్లను ఎదుర్కోనుంది. వాటిలో ఒకటి తాగునీటి సరఫరా కాగా... మరొకటి తప్పుడు సమాచారం. ఈ రెండు 2025–2027 మధ్య దేశానికి అత్యంత క్లిష్టమైన సమస్యలుగా మారుతాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) హెచ్చరించింది. ఈ సమస్యలను ఇప్పటి నుంచే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయాలని సూచించింది. ఇటీవల దావోస్‌లో జరిగిన వార్షిక సమావేశానికి ముందు డబ్ల్యూఈఎఫ్ వార్షిక గ్లోబల్ రిస్క్ రిపోర్టు–2025ను విడుదల చేసింది.ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎక్కువగా నీటి సరఫరా కష్టాలు ఎదుర్కొనే దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉందని ఈ నివేదిక వెల్లడించింది. మొదటి నాలుగు స్థానాల్లో మెక్సికో, మొరాకో, ట్యునీషియా, ఉజ్బెకిస్తాన్ ఉన్నట్టు ప్రకటించింది. మానవ తప్పిదాలు, పెరుగుతున్న పారిశ్రామిక అవసరాలతోపాటు పర్యావరణ వ్యవస్థ దెబ్బతినడం వంటి అంశాలు తాగునీటి సమస్యకు కారణమవుతున్నట్లు వివరించింది. నీటి సరఫరా కొరతను ఎదుర్కొనే ‘టాప్ రిస్క్’ దేశాల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతున్నట్టు తెలిపింది. 2024లో నీటి సరఫరా సంక్షోభాన్ని ఏడు దేశాలు ఎదుర్కోగా, 2025 ప్రారంభంలో ఆ సంఖ్య 27కి పెరిగింది. రానున్న కాలంలో మరిన్ని దేశాల్లో ఈ సంక్షోభం తీవ్రతరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.రెండో స్థానంలో తప్పుడు సమాచారం భారతదేశం రానున్న రెండేళ్లలో నీటి సరఫరా సమస్యతోపాటు మరో నాలుగు ప్రమాదాలను ఎదుర్కోనుందని గ్లోబల్ రిస్క్ రిపోర్ట్–2025 వివరించింది. వీటిలో తప్పుడు సమాచారం రెండో స్థానంలో, మానవ హక్కుల ఉల్లంఘన–పౌర స్వేచ్చ క్షీణత మూడో స్థానంలోను, కాలుష్యం నాలుగో స్థానంలోను, కార్మికుల కొరత–ప్రతిభ కొరత ఐదో స్థానంలో ఉంటాయని వెల్లడించింది.గాలి, నీరు, నేల కాలుష్యం వల్ల భారతదేశానికి గణనీయమైన ఆరోగ్య, ఆర్థిక నష్టాలను కలిగిస్తుందని హెచ్చరించింది. వచ్చే రెండేళ్లల్లో ప్రపంచం ఎదుర్కొనే మరో అత్యంత తీవ్రమైన ప్రమాదం విపరీతమైన వాతావరణ మార్పులేనని కూడా ఈ నివేదిక తెలిపింది. అదేవిధంగా విపరీత వాతావరణ మార్పులు మానవ వినాశనానికి దారితీస్తున్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వార్షిక నివేదిక ప్రకటించింది. విపరీత వాతావరణ మార్పుల కారణంగా 2024లో దేశవ్యాప్తంగా 3,238 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. ఇది 2022తో పోలిస్తే 18 శాతం పెరిగినట్లు వెల్లడించింది. -
‘పెద్దలు’ దావోస్ వెళ్లేది అందుకేనా..?
వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF)దావోస్‌లో పెట్టుబడుల సదస్సు అంటూ జనవరి 20-24 తేదీల మధ్య నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం అబాసుపాలైంది. ఈ సదస్సులో పెట్టుబడులు,వ్యాపారం,పరిశ్రమల స్థాపన,ఆయా రంగాల్లో నిపుణులు,అనుభవజ్ఞులతో చర్చలు, ఉపచర్చలు అంతిమంగా ఆరోగ్యకరమైన పారిశ్రామిక విధానాల రూపకల్పన వంటివి ఉంటాయనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. అసలా సదస్సు ఉద్దేశ్యం అదే అయినా..వెళ్లినవారి ఉద్దేశాలు వేరని అందరూ అక్కడికి విలాసాలకు కులాసాలకు మాత్రమే వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడి హోటల్స్ రిసార్ట్స్ బుకింగ్స్ బట్టి ఇదే అర్థం అవుతోందని జాతీయ,అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.అక్కడికి వచ్చేవారికి వారి కోరికమేరకు 'వ్యక్తిగత సేవలు' అందించే సంస్థలకు భారీ గిరాకీ దక్కిందని ఈ సర్వీసుల సేవల విలువ దాదాపు రూ.పదికోట్ల పైమాటే అని ఆ కథనాల్లో వివరిస్తున్నారు.పెట్టుబడులు,పారిశ్రామిక విధానాలు,వాతావరణ మార్పుల మీద చర్చలకన్నా అక్కడికి ధనికులు 'గాలి మార్పు' రిలాక్సేషన్ కోసమే ఎక్కువ తాపత్రయపడినట్లు ఓ అంతర్గత నివేదిక బయటకు వచ్చింది. స్విట్జర్లాండ్ లో అలాంటి సేవలు అందించే సంస్థలకు దావోస్ సదస్సు టైమ్‌లో డిమాండ్ గణనీయంగా పెరిగింది అంటూ బ్రిటన్ నుంచి వెలువడే డైలీ మెయిల్ పత్రిక,వెబ్ సైట్ ఒక సంచలన కథనాన్ని వెలువరించింది. ఇలాంటి బుకింగ్స్ అందుబాటులో ఉంచే ఒక వెబ్ సైట్ ఐతే మొదటి రెండు మూడు రోజుల్లోనే దాదాపు రూ.3 కోట్లు ఆర్జించింది.గత ఏడాది ఈ సర్వీసులు కేవలం 170 సంస్థలు మాత్రమే అందించగా ఈసారి వాటి సంఖ్య దాదాపు మూడు వందలకు పెరిగిందట.దావోస్‌లో పెట్టుబడులు అంటూ వెళ్లే పెద్దలు..పెద్దల ముసుగులో వెళ్లే నాయకులూ అక్కడకు వెళ్లి చేసే రాచకార్యాలు ఇవీ అంటూ హిందూస్తాన్ టైమ్స్,ఎకనామిక్ టైమ్స్ తో పాటు పలు వెబ్ సైట్స్ కూడా బోలెడు ఇన్సైడర్ కథనాలు ప్రచురించాయి.దీనిమీద సోషల్ మీడియాలోనూ పంచులు పేలుతున్నాయి. ఓ నెటిజన్ అయితే దావోస్ సదస్సుమీద వ్యంగ్యంగా పాట కూడా రాశారు..గుడివాడ యెల్లాను... గుంటూరు పొయ్యాను... దావోసూ పోయాను... ఎన్నెన్నో చూశాను. యాడ చూసినా, ఎంత చేసినా ఏదో కావాలంటారు... నోళ్ళు... ‘పెట్టుసచ్చిబడుల వేటకు వచ్చినోళ్ళు’. అంటూ పాట రాశారు. మొత్తానికి పెట్టుబడుల వేట అంటూ వెళ్లిన వేటగాళ్లు.. అసలు పనికన్నా కొసరూపానికి ప్రాధాన్యం ఇచ్చారని.. మీడియా.. సోషల్ మీడియా కోడై కూస్తోంది..-- సిమ్మాదిరప్పన్న -
జ్ఞానోదయం కలిగేది ఎప్పుడు?
విజన్ ఉన్న ఏ నాయకుడు కూడా విధ్వంసాన్ని ప్రేరేపించడు. అలా చేసేవారు పాలకులైతే పెట్టుబడులు రాకపోవడం అటుంచి ఉన్న పరిశ్రమలూ వేరే చోటుకు తరలిపోతాయి. దావోస్‌లో ఇటీవల జరిగిన ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ సదస్సుకు కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి నారా వారు చేసిన పెట్టుబడుల సాధన పర్యటన నీరు గారిపోయింది. ఇందుకు కారణం వారి ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ ప్రకారం సృష్టించిన విధ్వంసకాండే అనేది వేరే చెప్పవలసిన పనిలేదు. వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఎంతోమంది పారిశ్రామిక దిగ్గజాలను కలిసినా వారితో ఒక్క మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాడింగ్ (ఎంఓయూ)ను కూడా ఏపీ ప్రభుత్వం కుదుర్చుకోలేక పోయింది. ‘ఉద్యోగం కోసం... ఉపాధి కోసం నువ్వీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లు. నువ్వు అక్కడకు వెళ్లే లోపే నీ చరిత్ర అక్కడ టేబుల్ మీద ఉంటుంది’ అని ఓ ఇంగ్లీష్ సామెత ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలో చిందించిన రక్తాన్ని దావోస్‌కి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు, వారి తాలూకు ప్రతినిధులు ఎలా మర్చిపోగలరు? లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ధాటికి పెట్టుబడులు కూడా ముఖం చాటేశాయి. సాధారణంగా పారిశ్రామిక వేత్తలు వ్యాపారానికి అనుకూల పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లోనే పెట్టుబడులు పెడతారు. ముఖ్యంగా శాంతిభద్రతలు బాగుంటేనే కొత్త పరిశ్రమలు వస్తాయి. విధ్వంసం, రక్తపాతాన్ని ప్రోత్సహించేవారు పాలకులుగా ఉన్న రాష్ట్రాల్లో నయాపైసా పెట్టుబడి పెట్టినా వ్యర్థమని పారి శ్రామికవేత్తలు అనుకుంటారు. ఇప్పుడు దావోస్‌లో ఏపీ ప్రభుత్వం సంప్రదించినవారు ఇందుకే పెట్టు బడులకు ఆసక్తి చూపించలేదని పరిశీలకుల అంచనా. అధికారంలోకి వచ్చీ రాగానే రెడ్‌బుక్ చేతిలో పట్టుకుని చూపిస్తూ... తమ వ్యతిరేకులను అక్ర మంగా అరెస్టుచేసి జైళ్లలో కుక్కడం, దాడులు, హత్యలు చేయడంతో ప్రజలతో పాటు పెట్టుబడి దారులు కూడా భయపడిపోయారు. ‘సింగిల్‌విండో’ విధానంలో అన్ని అనుమతులు ఇస్తా మన్నా ఏపీలో పెట్టుబడులు పెట్టే ప్రసక్తే లేదని ముక్తకంఠంతో తీర్మానించుకున్నట్లున్నారు పారి శ్రామికవేత్తలు. అందుకే ఒక్కరు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదు. నేను చేసేది చేసేదే. ఇది నా రాజ్యం. ఇది నా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నట్లు రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి వ్యవహరిస్తుంటే పెట్టుబడులు ఎలా వస్తాయి? దావోస్ వేదికగా ఇది ఏపీకి జరిగిన అవమానం కాక మరేమిటి? తండ్రీ – కొడుకులు చేసిన తప్పిదాలే ఇప్పుడు ఏపీ ప్రజలకు శాపాలుగా పరిణమించాయి. ఈ అవమానంనుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికి ఇంకో ‘కల్తీ తిరుమల లడ్డు’ను తెరమీదకు తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. పెట్టుబడులు తీసు కొస్తామని దావోస్ వెళ్లి నయాపైసా పెట్టుబడి తేకుండా వచ్చిన మన ప్రభుత్వ నిర్వాకం వల్ల అయిన ఖర్చు దాదాపు 75 కోట్ల రూపాయల పైమాటే! మరి ఇంత డబ్బూ బూడిదలో పోసిన పన్నీరేనా? పాలకులకు ఎకౌంటబిలిటీ ఉండాల్సిన అవసరం లేదా? ఈ ప్రజా ధన నష్టానికి బాధ్యత వహిస్తూ ఏమి చేయగలరో సీఎం, ఐటీ మంత్రులే చెప్పాలి.తాజాగా దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం రూ. 1.79 లక్షల కోట్లు, మహా రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 లక్షల కోట్ల మేర ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ముందు శాంతి భద్రతల మీద పట్టు సాధించి ఆ దిశగా పురోగమిస్తే ఏ రాష్ట్రమైనా ఇటువంటి పెట్టుబడులను ఆకర్షిస్తుంది. అంతే తప్ప... రెడ్ బుక్ రాజ్యాంగాలు అమలు చేసే నెత్తుటి గడ్డలపై ఉన్న పాలకులు ‘మేం సుద్దపూసలం. మా రాష్ట్రం వెన్నపూస’ అంటే అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు ఎంత మాత్రమూ విశ్వసించే పరిస్థితి లేదు. ఇది మన రాష్ట్ర ప్రస్తుత పాలకులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. – ఆర్కేడి నాయుడు ‘ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ -
అమెరికాలో ఉత్పత్తి చేయండి లేదంటే టారిఫ్ కట్టండి
దావోస్: అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోగానే డజన్ల కొద్దీ కార్యనిర్వాహక ఉత్తర్వులతో అమెరి కన్లనేకాదు ప్రపంచదేశాలనూ విస్మయపరిచిన వివాదాస్పద నేత డొనాల్డ్ ట్రంప్ తన హెచ్చరికల ఖడ్గాన్ని ఈసారి పారిశ్రామికవేత్తలపై ఝలిపించారు. ఏకంగా ప్రపంచ వాణిజ్య సదస్సు వార్షిక సమావేశం సాక్షిగా అంతర్జాతీయ వాణిజ్యవేత్తలకు తనదైన శైలిలో ‘సూచనలు’ చేశారు. అమెరికాలో వస్తూత్పత్తిని పెంచాలని, ఈ మేరకు తమ కర్మాగారాలను అమెరికాకు తరలించాలని పిలుపునిచ్చారు. అమెరికాలో తయారు చేయకపోతే దిగుమతిచేసుకునే వస్తువులపై మరింత టారిఫ్ భారం మోపుతామని పరోక్షంగా హెచ్చరించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ వాణిజ్య సదస్సు(డబ్ల్యూఈఎఫ్)లో గురువారం ట్రంప్ వర్చువల్‌గా ప్రసంగించారు. ‘‘ ప్రపంచంలోనే ప్రతి వస్తూత్పత్తి సంస్థకు నేను చాలా సులభమైన సలహా ఇస్తున్నా. అమెరికాకు వచ్చి ఇక్కడే ఉత్పత్తి మొదలెట్టండి. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత అత్యల్ప పన్నులను విధిస్తాం. అయితే తమ ఉత్పత్తులను ఏ దేశంలో తయారు చేయాలనే పూర్తి స్వేచ్ఛ ఆయా కంపెనీలకు ఉంది. అయితే అమెరికా ఆవల తయారయ్యే ఉత్పత్తుల విషయంలో, వాటి ఆర్థికఅంశాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వాటి పర్యావసానాలు ఎలా ఉంటాయి అనేది అమెరికానే నిర్ణయిస్తుంది. నేను ఇంతచెప్పినా మీరు అమెరికాలో తయారుచేయబోమని భీష్మించుకుని కూర్చుంటే, మీరు అధిక టారిఫ్ చెల్లించక తప్పదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. సౌదీ.. రేట్లు తగ్గించుకో..‘‘చమురు ధరలను సౌదీ అరేబియా తగ్గించాలి. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ చెప్పినట్లు 600 బిలియన్ డాలర్లుకాకుండా సౌదీ మా దేశంలో ఒక ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలి. హాస్యాస్పదమైన, ఏకపక్షంగా ఉన్న పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికాను ఉపసంహరించా. అమెరికాలో మొత్తం వాహనాల్లో నిష్పత్తిలో కొంతమేరకు అత్యంత ఖరీదైన విద్యుత్ వాహనాలనే తప్పకుండా వాడాలనే నిబంధనను రద్దుచేశా. అధిక చమురు ధరలను సౌదీ అరేబియా తగ్గించాల్సిందే. చమురు ధరలు తగ్గితే రష్యా– ఉక్రెయిన్ యుద్ధం కూడా ఒక ముగింపునకు వస్తుంది’’ అని ట్రంప్ అన్నారు. -
రూపాయి పడినా ఇంకా విలువైనదే..
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి(Rupee) మారకం విలువ ఇటీవల భారీగా క్షీణిస్తోంది. అయినా అంతర్జాతీయ మార్కెట్లో ఇతర పోటీ కరెన్సీలతో పోలిస్తే రూపాయి ఇంకా అధిక విలువ కలిగి ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్(Rajan) పేర్కొన్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF)లో రూపాయి భవిష్యత్తు గమనంపై తన అభిప్రాయాలు పంచుకున్నారు.ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదుఅమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని రాజన్ అన్నారు. అనేక ఇతర కరెన్సీలు కూడా ఇదే ధోరణిని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి రియల్ ఎఫెక్టివ్ ఎక్స్ఛేంజ్ రేట్ (ఆర్ఈఈఆర్) ఇప్పటికీ అధిక విలువను సూచిస్తోందన్నారు. ఈ ఓవర్ వాల్యుయేషన్ రూపాయి మరింత పతనం అయ్యేందుకు అవకాశం ఉన్నట్లు సూచిస్తుందని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి అధిక విలువ కలిగి ఉండడం వల్ల భవిష్యత్తులో భారతీయ ఎగుమతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.ఆర్బీఐ జోక్యం తగదురూపాయి విలువను కాపాడేందుకు కరెన్సీ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని రాజన్ అన్నారు. ప్రాథమిక ఆర్థిక సర్దుబాట్లకు ప్రతిస్పందనగా, కరెన్సీ విలువను పెంచేలా కేంద్ర బ్యాంకులు జోక్యం చేసుకోవడం మానుకోవాలని, స్వల్పకాలిక అస్థిరతను అరికట్టడానికి మాత్రమే చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. రూపాయి క్షీణత, అమెరికా డాలర్ బలపడటం, ఇతర ప్రపంచ ఆర్థిక అంశాలు సహజ మార్కెట్ ప్రతిస్పందనగానే భావించాలని రాజన్ తెలిపారు.ఇదీ చదవండి: ఇన్ఫీలో మూర్తి కుటుంబం కంటే రెట్టింపు వాటాఅమెరికా కరెన్సీ యుద్ధంప్రపంచ కరెన్సీలను అమెరికా ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉందని రాజన్ హెచ్చరించారు. ఇతర దేశాలపై ఆర్థిక సుంకాలు విధించడానికి అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరెన్సీలపై పెరుగుతున్న ఈ ఆర్థిక యుద్ధం ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకర్లకు ఆందోళన కలిగిస్తుందన్నారు. -
వచ్చే 10 ఏళ్లలో ప్రపంచానికి అతి పెద్ద ముప్పు ఏంటో తెలుసా?
ఈ ప్రపంచం వచ్చే రెండేళ్లలో, అలాగే వచ్చే పదేళ్లలో ఎదుర్కొనే అతి పెద్ద ముప్పు (Global Risk) ఏమిటి? వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) ఇదే ప్రశ్న రాజకీయ, వ్యాపార, విద్యా రంగాలకు చెందిన 900 మంది నిపుణులకు వేసింది. వారి సమాధానాల ఆధారంగా తన వార్షిక గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. దాని ప్రకారం వచ్చే రెండేళ్లలో.. ఉద్దేశపూర్వకంగా లేదా తెలియకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం అన్నది అతి పెద్ద ముప్పుగా నిలిచింది. ఇలాంటి అసత్య సమాచార వ్యాప్తి పెద్ద పెద్ద సమస్యలకు దారి తీస్తుందని, సమాజంలో అశాంతి తలెత్తేలా చేస్తుందని హెచ్చరించింది.వచ్చే పదేళ్ల లెక్క తీసుకుంటే.. వాతావరణ మార్పులు, దాని వల్ల కలిగే దుష్ఫలితాలు అతి పెద్ద ముప్పుగా పేర్కొంది. వాతావరణ పరిస్థితుల్లో వచ్చే విపరీత మార్పులు.. స్వల్పకాలంలోనూ అలాగే దీర్ఘకాలంలోనూ ఈ ప్రపంచానికి అతి పెద్ద సమస్యగా మారనుందని తెలిపింది. జీవన వ్యయం, ద్రవ్యోల్బణం (inflation) పెరగడం లాంటి వాటిని ఆయా రంగాల నిపుణులు ఇప్పుడు పెద్ద సమస్యలుగా చూడటం లేదని ఈ నివేదిక పేర్కొంది. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో ఈ సమాచారాన్ని సేకరించారు. ఈ నివేదిక ప్రకారం టాప్–10 ముప్పులివీ.. ఇదీ చదవండి: రోమ్‌లో 2 వేల ఏళ్ల నాటి బాత్ హౌస్! -
అంతర్జాతీయ అనిశ్చితిలోనూ భారత్ పురోగతి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆర్థికవేత్తలలో అధికశాతం మంది 2025లో బలహీన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నారు. అయితే కొంత మందగమన సంకేతాలు ఉన్నప్పటికీ, భారతదేశం బలమైన వృద్ధిని కొనసాగించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు విడుదలైన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) చీఫ్ ఎకనమిస్ట్ అవుట్‌లుక్‌లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. సర్వేలో అభిప్రాయం వ్యక్తం చేసిన ఆర్థికవేత్తలో 56 శాతం 2025లో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉంటాయని భావిస్తున్నారు. కేవలం 17 శాతం మెరుగుదల ఉంటుందని అభిప్రాయపడ్డారు. 2025లో భారత్, అమెరికాలు మాత్రం చక్కటి పురోగతి సాధిస్తాయని అంచనా. యూరోప్ ఎకా నమీ బలహీనంగా ఉంటుందని సర్వేలో పాల్గొన్న వారిలో 74 శాతం మంది అభిప్రాయడ్డారు. చైనా వృద్ధిపై కూడా అనుమానాలే వ్యక్తం మయ్యాయి. -
దీర్ఘకాలిక వృద్ధిని పెంచగలదా?
2023–24 ఆర్థిక సంవత్సరంలో, ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధి చెందింది. తద్వారా పెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారత్ అత్యంత వేగంగా ముందుకు సాగు తున్న దేశంగా నిలబడింది. దీన్నిబట్టి, గత పదేళ్లలో సాధించినదాని పట్ల కేంద్ర ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నట్టుంది! కానీ అధిక వృద్ధి ఫలాలను పెద్ద సంఖ్యలో ప్రజలు పొందుతున్నారా? బడ్జెట్ రూపకల్పన వారికి అనుగుణంగా జరిగిందా? వృద్ధి ఊపందుకున్నప్పటికీ, పేదరికం కారణంగా వినియోగ డిమాండ్ తక్కువగానే ఉంది. ఈ వృద్ధి నిలకడగా ఉండాలంటే, కార్మికులు మెరుగైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. హ్రస్వ దృష్టితో చూస్తే బడ్జెట్ వాస్తవికంగానే కనబడుతుంది. కానీ దీర్ఘకాలిక వృద్ధిని నిర్ధారించే అంశాలను అది పరిష్కరించకుండా వదిలేసింది.ప్రతి సంవత్సరం, ఆర్థిక సర్వే, బడ్జెట్లను ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి సమ ర్పిస్తుంది. ఈ సర్వే ద్వారా ఆర్థిక వ్యవస్థ ఎలా దూసుకు పోతోందో వివరించేందుకు ప్రయత్నిస్తుంది. బడ్జెట్ ద్వారా, తన మనస్సులో ఏ కార్యాచరణ ప్రణాళిక ఉందో వివరించడానికి ప్రయ త్నిస్తుంది. రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు ఉండాలి: ప్రస్తుత పరిస్థితిలో ఏమి చేయాలి? విషయాలు సరైన దిశలో వెళ్ళే అవకాశం ఉందా? చూస్తుంటే గత పదేళ్లలో సాధించినదానిపట్ల ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నట్టుంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో, ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధి చెందింది. తద్వారా అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారతదేశాన్ని అత్యంత వేగంగా ముందుకు కదలిపోయేదేశంగా నిలబెట్టింది. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2 శాతమే పెరిగింది. 2024–25లో ప్రధాన ద్రవ్యోల్బణాన్ని 4.5 శాతానికికట్టడి చేయగలమనే విశ్వాసంతో ప్రభుత్వం ఉంది. కానీ ఈ కథ పూర్తిగా ఆశాజనకంగా లేదు. 2023–24లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం 7.5 శాతం వరకు ఉంటూ, మరింత ఆందోళనకరంగా మారింది. మొత్తంమీద, ఈ విషయంలో బాగా పనిచేసినందున, కింది వృద్ధి వ్యూహాన్ని ఆర్థిక సర్వే సూచించింది; తద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవచ్చని చెప్పింది: స్థిరంగావృద్ధి చెందడానికి ప్రైవేట్ రంగం దాని సొంత మూలధనాన్ని ఏర్పాటుచేసుకోవాల్సి ఉంది. దేశంలో హరిత పరివర్తన జరగడా నికి ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహించాలి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తమ వృద్ధిని కొనసాగించేలా ప్రభుత్వం ఖాళీలను పూడ్చాలి. దేశం అభివృద్ధి చెందడానికి వీలుగా నైపుణ్యాల అంతరాన్ని పూరించడానికి ఒక విధానం అవసరం. ఈ విధానాన్ని రూపొందించాలంటే, రాష్ట్ర యంత్రాంగ సమర్థత, వ్యవస్థ ఒకేలా ఉండాలి.ఇది పావు శతాబ్దానికి దీర్ఘకాలిక లక్ష్యం అయితే, మనం ఇప్పుడు ఎక్కడ నుండి ప్రారంభించాలి? ముందుగా, పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. నిర్ణీత తగ్గింపు (స్టాండర్డ్ డిడక్షన్) రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచుతున్నారు. రూ.17,000 వరకు ఉద్యోగులకు ఆదా అయ్యేలా శ్లాబుల్ని మెలితిప్పారు. ఉద్యోగాల్లో చేరేందుకు ప్రొఫెషనల్స్ ప్రోత్సా హకాలు పొందబోతున్నారు. దీని వల్ల రెండు లక్షల మంది యువ కులు ప్రయోజనం పొందనున్నారు. కేవలం జీతం ఆదాయం మాత్రమే కాదు, పెట్టుబడిపై లాభాలు ఆర్జించే వారికి మూలధన లాభాలకు మినహాయింపు కూడా పెరుగుతోంది.ఈ లెక్కన తక్కువ పన్నులు చెల్లించాల్సిన మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్ తోడ్పడుతుంది. తమాషా ఏమిటంటే, ఆదాయపు పన్ను చెల్లించే అవసరం లేని పేదలు, వారు తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిన వస్తువులు అన్నింటికీ వాస్తవ చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఇది జీఎస్టీ పరిధిలోకి వస్తుంది. ఏకాభిప్రాయం సాధించడం ఎల్లప్పుడూ కష్టమైనప్పటికీ, మరిన్ని జీఎస్టీ–అనుబంధ సంస్కరణలను కేంద్రం, రాష్ట్రాలు చేపట్టవచ్చు. అంతేకాకుండా, రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేని సెస్ నుండి కేంద్రం ప్రయోజనం పొందడం అన్యాయం. పేద పిల్లలు చదువుకునేలా చేయడం వంటి అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే ప్రాజెక్ట్‌ల కోసం సేకరించగలిగే మొత్తం ఆదాయం రాష్ట్రాలకు అవసరం.నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూనీ, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీనీ సంతోషపెట్టడానికి అనేక భారీ ప్రాజెక్టులకు కూడా బడ్జెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన ప్రాజెక్టులలో పట్నా–పూర్నియా, బక్సర్–భాగల్పూర్ ఎక్స్‌ప్రెస్‌వేలు ఉన్నాయి. అంతేకాకుండా, బిహార్‌లోని బక్సర్ జిల్లాలో గంగా నదిపై రెండు లేన్ల వంతెనను నిర్మించనున్నారు. అదనంగా, భాగల్పూర్లోని పీర్‌పైంతిలో 2,400–మెగావాట్ల పవర్ ప్లాంట్ రానుంది. ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే, రోడ్డు మార్గాల ప్రాజెక్టులను ప్రకటించారు. కొత్త రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15,000 కోట్లు ప్రకటించారు.బడ్జెట్ అనేది రాజకీయ చర్య. దానికి స్పష్టమైన లక్ష్యంఉంది. బీజేపీ సంకీర్ణ భాగస్వాములు, మధ్యతరగతి సంతృప్తిచెందేలా చూసుకోవడమే దాని లక్ష్యం. ప్రధాన పార్టీపై ఆధిపత్యం చలాయించే రాజకీయ వ్యాపారుల వెరపులేని ధీమా కారణంగానేసంకీర్ణ భాగస్వాములను సంతోషపెట్టాలనే లక్ష్యం నడుస్తుంటుంది. పూర్తిగా సంఖ్యల పరంగానే, చిన్న మధ్యతరగతి ఎన్నికల ఫలితాలను నిర్ణయించలేదు. పాలకవర్గం అంతిమ ఉద్దేశ్యం జనబాహు ళ్యాన్నిసంతోషపెట్టడమే.అయితే రానున్న రోజుల్లో ప్రభుత్వానికి మంచి జరగనుంది. ప్రపంచ వ్యాఖ్యాతలు కూడా భారత్ అధిక వృద్ధి రేటును ప్రశంసించారు. కానీ వృద్ధి నిలకడగా ఉండాలంటే, కార్మికులు మెరుగైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ కీలక సమస్యలను పరిష్కరించడానికి బడ్జెట్ సంకేత పథకాలను మాత్రమే ప్రవేశపెట్టింది. అందుకే, అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్లను బాగా అర్థం చేసుకున్నా, దూరదృష్టితో వ్యవహరించడం లేదనేది మొత్తం భావన.ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతోందనే దానితోసంబంధం లేకుండా, బడ్జెట్ అంచనాలు కూడా పరిష్కరించాల్సిన మూడు సమస్యలను ఎత్తిపట్టాయి. వృద్ధి ఊపందు కున్నప్పటికీ, వినియోగ డిమాండ్ తక్కువగానే ఉంది. పైగా ఉపాధి చాలా వెనుకబడి ఉంది. అధిక ఆర్థిక వృద్ధి ఫలాలను పెద్దసంఖ్యలో ప్రజలు పొంద లేకపోతున్నారా? ఇది కొంచెం ఎక్కువగా సాంకేతికమైనది. తక్కువ స్థాయి ద్రవ్యోల్బణం అనేది ఛేదించగలిగే టంత దృఢంగా ఉందా?నోట్ల రద్దు, కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో, వృద్ధి రేటు అనుకున్నంత ఎక్కువగా లేదని చాలా మంది వాదించారు. కాబట్టి, ఒక విధంగా, ఆర్థిక వ్యవస్థ కేవలం తేరుకోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రజలు ఎక్కువ పొదుపు చేయడం వల్ల కాదు కానీ, రెండు ఎదురుదెబ్బల ఫలితంగా ఆదాయ వనరును కోల్పోయినప్పుడు వారు తీసుకున్న భారీ అప్పును తిరిగి చెల్లించ డానికి ప్రయత్నిస్తున్నందున వినియోగం కుంచించుకుపోయింది. రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నది సమృద్ధిగా ఉన్న సరఫరాల వల్ల కాదు. ప్రజలు తాము కోరుకున్న వాటిని వినియోగించుకోలేక పోవడం వల్ల.ఇక్కడ శక్తిమంతమైన వైరుధ్యం కూడా ఉంది. ఆర్థిక వ్యవస్థ, వ్యాపారాలు బాగా కొనసాగాలంటే, రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తక్కు వగా ఉంచాలి. అయితే, ఎక్కువ డిపాజిట్లను సంపాదించడానికి బ్యాంకులు అధిక వడ్డీ రేటును ఎలా చెల్లించగలవు? అందు వల్ల, బ్యాంకులు రుణాలు, పొదుపు మధ్య అసమతుల్యతను చూస్తున్నాయి. మొత్తంమీద, హ్రస్వ దృష్టితో చూస్తే బడ్జెట్ వాస్తవికంగానే కనబడుతుంది. కానీ ఇది మధ్యతరగతి ద్వారా, మధ్యతరగతి కోసం చేసే ఒక కసరత్తు. అది దీర్ఘకాలిక వృద్ధిని నిర్ధారించే అంశాలను పరిష్కరించకుండా వదిలివేసింది.- వ్యాసకర్త సీనియర్ ఆర్థిక విశ్లేషకులు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- సుబీర్ రాయ్ -
దావోస్‌లో సీఎం బృందం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పలు భేటీల్లో పాల్గొంటోంది. ఐటీ, జీవ, వైద్య రంగాల్లో తెలంగాణ శక్తిని ప్రపంచానికి చాటడంతో పాటు, భారీ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా కీలక చర్చలను ప్రారంభించింది. తొలిరోజు డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో సమావేశమైన సీఎం, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఇథియోపియా ఉప ప్రధాని డెమెక్ హసెంటోతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్ మ్యాప్‌పై చర్చించారు. సీఎం, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జాని ఘోష్తోనూ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగాల కల్పనకు సాయం అందించడంపై సంప్రదింపులు జరిపారు. తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు.. డబ్ల్యూఈఎఫ్ సదస్సులో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా ‘వేర్ ట్రెడిషన్ మీట్స్ ఇన్నోవేషన్’నినాదంతో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేశారు. బతుకమ్మ, బోనాల పండుగలు, చారిత్రక వారసత్వ సంపదకు చిహ్నం చారి్మనార్‌తో పాటు చేర్యాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కత్, టీ హబ్‌తో పాటు విభిన్న రంగాల విజయాలు చాటే లా పెవిలియన్‌ను తీర్చిదిద్దారు. భారీగా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ అనుకూలతలను వివరించేలా నినాదాలు ఏర్పాటు చేశారు. జ్యూరిచ్‌లో ప్రవాస భారతీయుల స్వాగతం మూడు రోజుల పాటు జరిగే డబ్ల్యూఈఎఫ్ 54వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లిన సీఎం రేవంత్ బృందానికి మార్గం మధ్యలోని జ్యూరిచ్‌లో ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. సమ్మిళిత, సంతులిత అభివద్ధి ద్వారా ప్రజలందరి పురోగతి తమ లక్ష్యమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నవ తెలంగాణ నిర్మాణం కోసం మొదలైన తమ ప్రభుత్వ ప్రయత్నంలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావటంపై హర్షం వ్యక్తం చేశారు. -
ఇంధన డిమాండ్ తగ్గితే ఏటా 2 లక్షల కోట్ల డాలర్ల ఆదా
న్యూఢిల్లీ: ఈ దశాబ్దం ఆఖరు నాటికి ఇంధన వినియోగ డిమాండ్ తీవ్రతను తగ్గించుకునేలా తగిన చర్యలు తీసుకోగలిగితే ప్రపంచ ఎకానమీకి ఏటా 2 లక్షల కోట్ల (ట్రిలియన్) డాలర్లు ఆదా కాగలవని ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఒక నివేదికలో వెల్లడించింది. వృద్ధికి ఊతమిచ్చేందుకు, గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాలను తగ్గించేందుకు ఇవి ఉపయోగపడగలవని పేర్కొంది. జనవరి 15–19 మధ్య దావోస్‌లో వార్షిక సమావేశం జరగనున్న నేపథ్యంలో డబ్ల్యూఈఎఫ్ ఈ నివేదికను విడుదల చేసింది. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీతో కలిసి తయారు చేసిన ఈ రిపోర్టు రూపకల్పనలో 120 మంది పైగా గ్లోబల్ సీఈవోలు సహాయ, సహకారాలు అందించారు. ప్రభుత్వాలు విధానపరంగా సరైన చర్యలు తీసుకుంటే వృద్ధి.. ఉత్పాదకతకు తో డ్పాటు లభించగలదని, కంపెనీలు నిధులను ఆదా చేసుకోగలవని, కాలుష్యకారక ఉద్గారాలను తగ్గించగలవని నివేదిక పేర్కొంది. ఫ్యాక్టరీ లైన్లను డిజైన్ చేయడంలో కృత్రిమ మేథను ఉపయోగించుకోవడం, విద్యుత్ వినియోగంలో సమర్ధతను మెరుగుపర్చుకోవడం, రవాణా వ్యవస్థను విద్యుదీకరించ డం మొదలైన చర్యలను పరిశీలించవచ్చని సూచించింది. -
అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నా.. భారత్ భేష్
న్యూఢిల్లీ: రాజకీయ, ఆర్థిక అస్థిరతల మధ్య వచ్చే సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని చాలా మంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే 90 శాతం కంటే ఎక్కువ మంది దక్షిణాసియా, ముఖ్యంగా భారతదేశంలో మధ్య తరహా లేదా బలమైన వృద్ధి నమోదవుతుందని విశ్వసిస్తున్నారు. ఈ మేరకు తమ అధ్యయనంలో అభిప్రాయాలు వ్యక్తం అయినట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తాజా ‘చీఫ్ ఎకనమిస్ట్ ఔట్లుక్’ నివేదిక పేర్కొంది. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో తీవ్ర ప్రతికూలతల నేపథ్యంలో చైనా అవుట్‌లుక్ మసకబారింది. ► ప్రపంచం రాజకీయ, ఆర్థిక అస్థిరతతో పోరాడుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి నిర్దేశిస్తున్న సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) చేరుకోవడంలో పురోగతి బలహీనంగా ఉంటుందని దాదాపు 10 మందిలో ఆరుగురు విశ్వస్తున్నారు. ► ప్రత్యేకించి ఆహార భద్రత, వాతావరణ పరిరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణతో సహా ఎస్డీజీకి సంబంధించి పలు లక్ష్యాల్లో మందగమనం ఉంటుంది. 2030లో అర బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు తీవ్ర పేదరికంలో జీవిస్తారు. ► ఇటీవల అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినప్పటికీ కఠిన ఫైనాన్షియల్ పరిస్థితులు కొనసాగుతాయని మెజారిటీ (86 శాతం) అంచనా. ఆయా అంశాల నేపథ్యంలో వ్యాపార రుణాలపై ఒత్తిడి, కార్పొరేట్ రుణ ఎగవేతలలో పెరుగుదల, ఆస్తి–ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర దిద్దుబాట్లు తప్పదు. ► 74 శాతం మంది భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరికొన్ని సంవత్సరాలు తప్పదని భావిస్తున్నారు. ► అమెరికాలో మే నుండి అవుట్‌లుక్ బలపడింది. ప్రతి 10 మందిలో ఎనిమిది మంది 2023, 2024 అమెరికా ఒక మోస్తరు లేదా లేదా బలమైన వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నారు. ► యూరోప్ విషయంలో ఎకానమీ బలహీనం లేదా మరీ బలహీన పరిస్థితులు ఈ ఏడాది ఉంటాయని 77 శాతం మంది భావిస్తున్నారు. 2024లో పరిస్థితులు కొంత మెరుగుపడవచ్చని అంచనా. -
మెరుగ్గా వ్యవహరించిన భారత్
అంతర్జాతీయ పరిణామాలు సవాలు విసురుతున్న సమయంలో గత ఏడాది భారతదేశం జీ20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. కోవిడ్–19 మహమ్మారి ప్రభావం నుండి ప్రపంచం క్రమంగా కోలుకున్నప్పటికీ, ప్రపంచ వృద్ధి ఇంకా దుర్బలంగానే ఉంది. ద్రవ్యోల్బణం కూడా మొండిగాఉంది. విపరీతమైన వాతావరణ ఘటనలు పెరుగుతున్న తరుణంలో (రికార్డుల పరంగా జూలై అత్యంత వేడి అయిన నెల అని గ్రహించాలి), వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై ఈ ‘కార్యాచరణ దశాబ్ది’లో తక్షణ చర్యలు అవసరం. అయితే, అంతర్జాతీయ సహకారాత్మక చర్యకు సంబంధించిన ఆవశ్యకత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ – భౌగోళిక రాజకీయ పోటీ, ఘర్షణ ప్రమాదాలు ఆ సహకారానికి అడ్డుగా నిలుస్తున్నాయి. ఈ కష్టతరమైన ప్రపంచ ముఖచిత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటే, బహుశా భారతదేశ అత్యంత పరిణామాత్మకమైన, అత్యంత బోధనాత్మకమైన నిర్ణయం, జీ20 చర్చా ప్రక్రియకు ఉపక్రమించడం! చెప్పాలంటే,ఇండియా చేయాల్సినదాని కంటే ఎక్కువ చేసింది. అత్యంత సంఘటిత ప్రక్రియను నడిపించడం ద్వారా సహకార విధానంలోకి మొగ్గు చూపింది. భౌగోళిక కమ్యూనిటీలు అన్నింటికీ స్వరాలు ఉండాల్సిన ఈ బహుముఖ, బహుళ వాటాదారుల విధానం... ప్రపంచ సహకారాన్ని పునరుజ్జీవింపజేయడానికి ఒక నమూనాగా ఉపయోగపడుతుంది. మన భాగస్వామ్య ప్రాధాన్యాలపై పురోగతి సాధించడానికి ప్రపంచం తక్షణమే మార్గాలను కనుగొనాల్సిన తరుణంలో ఇది చాలా కీలకమైనది. ప్రపంచ జనాభాలో 85 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణార్ధ దేశాల సమూహానికి బహుముఖ సంభాషణలలో తరచుగా చోటివ్వరు. అయితే దక్షిణార్ధ ప్రపంచ (గ్లోబల్ సౌత్) వాణికి అవకాశం ఇవ్వడం ద్వారా భారతదేశం భౌగోళికంగా జీ20 చర్చలను విస్తరించింది. జీ20 కూటమి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మొదటి నెలల్లో భారతదేశం 125 దేశాలకు చెందిన నాయకులు, మంత్రుల భాగస్వామ్యంతో కూడిన ‘వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్’ శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జీ20 కూటమిలో ప్రాతినిధ్యం వహించని దేశాలతో సంప్రదింపులు జరపడం, వారి ప్రాధాన్యాలను అర్థం చేసుకోవడమే దీని లక్ష్యం. అటువంటి ప్రాధాన్యాల్లో ఒకటి ప్రపంచ సార్వభౌమాధికార దేశాల రుణ సమస్య. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 50 శాతం దేశాలు తీవ్రమైన రుణ బాధలో ఉన్నట్టు అంచనా. ఈ రుణ విచికిత్స కోసం భారతదేశం గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇచ్చింది. 3 ట్రిలియన్ డాలర్ల సామూహిక జీడీపీ ఉన్న 55 ఆఫ్రికన్ రాజ్యాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆఫ్రికన్ యూనియన్ను జీ20లో చేర్చాలని కూడా భారతదేశం వాదించింది (ఈ మేరకు సఫలమైంది కూడా). విభిన్న భౌగోళిక ప్రాంతాల నుండి పెట్టుబడులను తీసుకువచ్చే బహుముఖ ప్రక్రియకు నాయకత్వం వహించడంతో పాటు, భారతదేశం కమ్యూనిటీలలో కూడా వాటాదారులతో చర్చలు జరిపింది. ఉదాహరణకు, థింక్20 కమ్యూనిటీ అనేది, జీ20కి ‘ఐడియా బ్యాంక్’గా పనిచేస్తుంది. అదే సమయంలో, ప్రపంచ వాణిజ్య కమ్యూనిటీకి ప్రాతి నిధ్యం వహించే అధికారిక డైలాగ్ ఫోరమ్‌గా బి20 వ్యవహరిస్తుంది. గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు మొట్ట మొదటిసారిగా ‘స్టార్టప్20 ఎంగేజ్మెంట్ గ్రూప్’ ప్రాతినిధ్యం వహిస్తుంది. జీ20 కూటమి అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న భారత్, సాధారణ సవాళ్లను పరిష్కరించడానికి ఒక సాధనంగా అంతర్జాతీయ బహుళ వాటాదారుల సహకారానికి ప్రాముఖ్యమిస్తోంది. ఈ విధానం స్పష్టమైన హామీని కలిగి ఉంది. పెరుగుతున్న సంక్లిష్ట ప్రపంచంలో– భౌగోళికాలు, వ్యాపార రంగాలు, పర్యావరణ వ్యవస్థలు, కమ్యూనిటీలలోని సవాళ్లను పరిష్కరించడానికి బహుళ వాటాదారుల విధానం చాలా అవసరం. సమ్మిళిత జీ20 ప్రక్రియను తీర్చి దిద్దడానికి చేసిన భారత ప్రయత్నాలను సులభంగా తీసేయకూడదు. జనాభాలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశం భారత్. ప్రస్తుతం నిట్టనిలువుగా ఎదుగుతున్న పథంలో ఉంది. అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో వరుసగా మూడేళ్లుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతేకాకుండా 2030 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. 100 కంటే ఎక్కువ స్టార్టప్ యునికార్న్స్ (1 బిలి యన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన స్టార్టప్‌లు) కలిగివుంది. ఇటీవలి సంవత్సరాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెరుగుదలను చూసింది. ఇవి 2021–22 ఆర్థిక సంవత్సరంలో 85 బిలియన్ డాలర్ల కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం, ప్రపంచం త్వరలో కొత్త జీ3 యుగానికి స్వాగతం పలుకుతుంది. ఈ అంచనా అమెరికా, చైనాతోపాటు ప్రపంచంలోని ఉత్కృష్ట దేశాలలో భారతదేశాన్ని కూడా చేర్చింది. ఇది మరోలా ఉండి వుంటే, ఈ పరిణామాలు వేరుగా ఉండేవి. ఇదంతా భారతదేశం దాని తలలోకి ఎక్కించు కొని ఉండవచ్చు. అందరినీ కలుపుకొని పోవడం కాకుండా, కొందరితో ప్రత్యేకంగా చర్చలు జరిపి వుండొచ్చు. కానీ భారతదేశం స్వభావరీత్యా పైనుంచి కిందివరకూ చర్చలను నడిపించడానికి ప్రోత్సహించింది. జీ20 అధ్యక్షతలో తొలి నుండీ ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ మకుటంతో, మరింత సంపన్నమైన, సురక్షితమైన భవి ష్యత్తును రూపొందించడానికి ఏకైక మార్గం సహకారమే అని గుర్తు చేసింది. సహకారం పట్ల అంతర్జాతీయ నిబద్ధత క్షీణిస్తున్న తరుణంలో, భారతదేశ జీ20 అధ్యక్షత ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాత్రధారులు తమ సహకార విధానాలకు మళ్లీ కట్టుబడి ఉండాలని గుర్తుచేస్తోంది. బోర్గే బ్రెండే వ్యాసకర్త వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు; నార్వే మాజీ విదేశాంగ మంత్రి -
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు.. మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం
చైనాలోని టియాంజిన్ వేదికగా ఈ ఏడాది జూన్ 27 నుంచి 29వ తేదీ వరకు ప్రపంచ ఆర్థిక వార్షిక సదస్సు (wef) జరగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందించింది. వలర్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్యక్షుడు బోర్గె బ్రెండే మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. నేషనల్ డెవలప్మెంట్, రిఫోర్మ్ కమిషన్లు చైనాతో కలిసి ఈ సమాశం ఏర్పాటు చేసింది. కోవిడ్-19 వరుస పరిణామల అనంతరం పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కొత్త కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాయి. ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు కీలకమైన ఈ సమయంలో చైనాలో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు , విద్యా సంస్థలకు చెందిన సుమారు 1500 మంది గ్లోబుల్ లీడర్స్ ఈ సదస్సులో పాల్గొననున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. -
World Economic Forum: వచ్చే ఐదేళ్లలో నికరంగా... 1.4 కోట్ల కొలువులకు కోత
జెనీవా: వచ్చే ఐదేళ్లలో ఉద్యోగాల సృష్టిలో భారీ తగ్గుదల నమోదవుతుందని వరల్డ్ ఎకనామిక్ ఫో రం (డబ్ల్యూఈఎఫ్) అంచనా వేసింది. కొత్తగా 6.9 కోట్ల ఉద్యోగాల సృష్టి జరగనుండగా ఏకంగా 8.3 కోట్ల ఉద్యోగాలు కనుమరుగవుతాయని పేర్కొంది. నికరంగా 1.4 కోట్ల ఉద్యోగాలకు కోత పడుతుందని ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్’ పేరిట ఆదివారం విడుదల చేసిన ద్వై వార్షిక నివేదికలో వివరించింది. ప్రస్తుతం మొత్తం ప్రపంచ ఉద్యోగితలో ఇది 2 శాతం. వచ్చే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 23 శాతం ఉద్యోగుల వలస చోటుచేసుకోవచ్చని పేర్కొంది. భారత్‌లో ఇది 22 శాతం దాకా ఉండొచ్చని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 45 పెద్ద ఆర్థిక వ్యవస్థలు, 27 భారీ పారిశ్రామిక క్లస్టర్లు, 800 దిగ్గజ కంపెనీల్లోని దాదాపు 67.3 కోట్ల ఉద్యోగాలపై డబ్ల్యూఈఎఫ్ విస్తృతంగా సర్వే జరిపింది. విశేషాలు... ► వచ్చే ఐదేళ్లలో సప్లై చైన్స్, రవాణా, మీడియా, వినోద, క్రీడా రంగాలకు ఉద్యోగుల వలసలు ఎక్కువగా ఉంటాయి. ► ప్రపంచవ్యాప్తంగా నూతన ఉద్యోగాల సృష్టిలో చాట్‌జీపీటీ వంటి కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీలదే కీలక పాత్ర. ► 75 శాతం కంపెనీలు, సంస్థలు, కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీలను అందిపుచ్చుకుంటాయి. ► ఫలితంగా ఏకంగా 44 శాతం మంది ఉద్యోగుల నైపుణ్యాలకు పూర్తిగా కాలదోషం పట్టనుంది. ► సమర్థ పనితీరును కొనసాగించాలంటే ప్రతి 10 మంది ఉద్యోగుల్లో కనీసం ఆరుగురికి శిక్షణ అవసరమవుతుంది. ► దాంతో ఏకంగా 45 శాతం వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, కంపెనీలు ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధిపై హెచ్చు నిధులు వెచ్చిస్తాయి. ► ప్రపంచవ్యాప్తంగా ఆటోమేషన్ వేగం గత అంచనాల కంటే తగ్గింది. ప్రస్తుతం కేవలం 34 శాతం టాస్కులు ఆటోమేషన్తో నడుస్తున్నాయి. ఇది 2020తో పోలిస్తే కేవలం 1 శాతమే ఎక్కువ. కంపెనీలు కూడా ఆటోమేషన్ అంచనాలను కుదించుకున్నాయి. తొలుత 2025 నాటికి 47 శాతం టాస్కులను ఆటోమేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా తాజాగా దాన్ని 2027 నాటికి కేవలం 42 శాతానికి పరిమితం చేసుకున్నాయి. ► కృత్రిమ మేధ రాకతో బ్యాంక్ క్యాషియర్లు, క్లర్కులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు వంటి 2.6 కోట్ల ఉద్యోగాలు కనుమరుగవుతాయి. ► ఏఐ, మెషీన్ లెర్నింగ్ స్పెషలిస్టులు, ఫిన్‌టెక్ ఇంజనీర్లు, డేటా అనలిస్టులు, సైంటిస్టులు, అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ ఆపరేటర్లు వంటి ఉద్యోగాలు బాగా పెరుగుతాయి. ► స్వచ్ఛ ఇంధనం, వ్యర్థాల నిర్వహణ, సహజ వనరుల సమర్థ వినియోగం వంటి రంగాల్లో మేనేజర్లు, విండ్ టర్బైన్ టెక్నీషియన్లు, సోలార్ కన్సల్టెంట్లు, ఎకాలజిస్టులు, పర్యావరణ స్పెషలిస్టుల వంటి ఉద్యోగాలు కూడా భారీగా పెరుగుతాయి. ఈ రంగంలో భారత్‌తో సహా టాప్ 10 దేశాలు పర్యావరణ లక్ష్యాలు చేరుకోవాలంటే కనీసం 1.2 కోట్ల ఉద్యోగాల సృష్టి జరగాలి. భారత్‌లో సామాజికేతర రంగాల్లోనే ఉద్యోగ సృష్టి ► కరోనా అనంతరం భారత్‌లో విద్య, ఆరోగ్యం వంటి సామాజిక రంగాలతో పోలిస్తే సామాజికేతర రంగాల్లోనే ఉద్యోగాల సృష్టి ఎక్కువగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. భారత్‌లో వచ్చే ఐదేళ్లలో కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీ ఆధారిత రంగాలకు ఉద్యోగుల వలస అత్యధికంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. ► పర్యావరణ, సామాజిక, పాలన రంగాల్లో ఉపాధి వృద్ధి ఊపందుకుంటుందని భారత్‌లో సర్వేలో పాల్గొన్న వారిలో 61 శాతం మంది పేర్కొన్నారు. తర్వాత కొత్త టెక్నాలజీలకు 59 శాతం, డిజిటల్ యాక్సెస్‌కు 55 శాతం, వాతావరణ మార్పులు, పెట్టుబడుల రంగాలకు 53 శాతం ఓటేశారు. ► అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలను పెంచుకునేందుకు తమ యాజమాన్యమే అవకాశం కల్పించడం మేలని సర్వేలో పాల్గొన్న భారతీయ ఉద్యోగుల్లో ఏకంగా 97 శాతం అభిప్రాయపడ్డారు. ఇది ప్రభుత్వపరంగా జరగాలన్నవారు 18 శాతమే. ► ఉపాధి సృష్టిపై డేటా అనలిటిక్స్ పెను ప్రభావం చూపుతుందని 62 శాతం కంపెనీలు నమ్ముతున్నాయి. తర్వాతి స్థానాన్ని ఎన్క్రిప్షన్–సైబర్ సెక్యూరిటీ (53 శాతం), డిజిటల్ ప్లాట్‌ఫాంలు, అప్లికేషన్లు (51), ఇ–కామర్స్ (46 శాతం)కు ఇచ్చాయి. భారత్‌లో వచ్చే ఐదేళ్లలో ఉద్యోగుల వలస ఏఐ, మెషీన్ లెర్నింగ్ 38% డేటా అనలిస్టులు, సైంటిస్టులు 33% డేటా ఎంట్రీ క్లర్కులు 32% ఫ్యాక్టరీ కార్మికులు 18% ఆపరేషన్స్ మేనేజర్స్ 14% అకౌంటెంట్లు, ఆడిటర్లు 5% -
1.4 కోట్ల ఉద్యోగాలు ఉఫ్! ప్రపంచ ఆర్థిక వేదిక సంచలన రిపోర్ట్
భారత జాబ్ మార్కెట్‌పై ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సంచలన నివేదిక వెలువరించింది. దేశంలో వచ్చే ఐదేళ్లలో భారత జాబ్ మార్కెట్ 22 శాతం క్షీణిస్తుందని, ప్రపంచ వ్యాప్తంగా 1.4 కోట్ల ఉద్యోగాలు ఊడిపోనున్నాయని ఆ రిపోర్ట్ పేర్కొంటోంది. ఇదీ చదవండి: International labour Day: 23 దేశాల్లో జీతాలు రూ.లక్షకుపైనే.. మరి భారత్‌లో...? అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. గత కొన్ని నెలలుగా అనేక కంపెనీలు లేఆఫ్స్ అమలు చేస్తున్నాయి. అమెజాన్, గూగుల్ వంటి పెద్ద పెద్ద టెక్ దిగ్గజాలు సైతం వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ జాబ్ మార్కెట్‌పై 800కు పైగా కంపెనీలతో సర్వే నిర్వహించిన డబ్ల్యూఈఎఫ్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. వచ్చే ఉద్యోగాల కన్నా పోయేవే ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా 2027 నాటికి 69 మిలియన్ల (6.9 కోట్లు) కొత్త ఉద్యోగాలు వస్తాయని, ఇదే సమయంలో 83 మిలియన్ల (8.3 కోట్లు) ఉద్యోగాలు ఊడిపోతాయని డబ్ల్యూఈఎఫ్ సర్వే ద్వారా అంచనా వేసింది. అంటే కొత్తగా వచ్చే ఉద్యోగాల కన్నా ఊడిపోయే ఉద్యోగాల సంఖ్యే ఎక్కువగా ఉంది. మొత్తంగా 1.4 కోట్ల ఉద్యోగాలు ఊడిపోనున్నాయని డబ్ల్యూఈఎఫ్ నివేదిక ద్వారా తెలుస్తోంది. జాబ్ మార్కెట్ క్షీణత భారత్‌లో 22 శాతంగా ఉంటుందని అంచనా వేసిన డబ్ల్యూఈఎఫ్ ప్రపంచ వ్యాప్తంగా 23 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, డేటాసెట్ విభాగాల్లో ఉన్న 673 మిలియన్ (67.3 కోట్లు) ఉద్యోగాల్లో 83 మిలియన్ (8.3 కోట్లు) ఉద్యోగాలను వచ్చే ఐదేళ్లలో తొలగించాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో 69 మిలియన్ (6.9 కోట్లు) ఉద్యోగాలు ఇవ్వనున్నాయి. ఫలితంగా 14 మిలియన్ల (1.4 కోట్లు) ఉద్యోగాలు పోతాయి. ఇది ప్రస్తుతం ఉపాధిలో 2 శాతం. ఆర్థిక వ్యవస్థ బలహీనపడటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కంపెనీలు అవలంబించడమే ఇందుకు కారణమని డబ్ల్యూఈఎఫ్ వెల్లడించింది. ప్రమాదంలో ఉన్న ఉద్యోగాలు ఇవే.. పెరుగుతున్న సాంకేతికత, డిజిటలైజేషన్ కారణంగా బ్యాంక్ టెల్లర్లు, క్యాషియర్లు డేటా ఎంట్రీ క్లర్క్‌ల వంటి క్లరికల్ ఉద్యోగాలు వేగంగా తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే డేటా అనలిస్టులు, డేటా సైంటిస్టులు, బిగ్ డేటా నిపుణులు, ఏఐ మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టుల ఉద్యోగాలు 2027 నాటికి సగటున 30 శాతం పెరుగుతాయని అంచనా. ఇదీ చదవండి: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్.. 44 వేల జాబ్ ఆఫర్లు.. అందరికీ ఉద్యోగాలు! -
భూతాపం.. పర్యావరణంపై ప్రతాపం
భూ గ్రహం వేగంగా వేడెక్కుతోంది. మానవ అనుచిత ప్రవర్తన వాతావరణ సంక్షోభాన్ని సృష్టిస్తోంది. పర్యావరణ క్రియాశీలతలో పెనుమార్పులు తీసుకొస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అడవులు ధ్వంసం కావటం గ్లోబల్ వార్మింగ్ సంకేతాలను బలంగా వినిపిస్తోంది. భూమిపై కర్బన ఉద్గారాల్లో దాదాపు 15 శాతం అటవీ నిర్మూలన కారణంగానే వెలువడుతుండగా.. ఏటా 10 మిలియన్ హెక్టార్లలో ఉష్ణమండల అడవులు తరిగిపోతున్నాయి. దీనిని 2030 నాటికి అరికట్టకుంటే గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే పెరగకుండా పరిమితం చేయడం అసాధ్యమని వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక హెచ్చరిస్తోంది. – సాక్షి, అమరావతి ఉష్ణ మండలంలో 2002 నుంచి 60 మిలియన్ హెక్టార్ల కంటే ఎక్కువ అడవుల్ని కోల్పోయామని.. ఇది ఫ్రాన్స్ దేశ పరిమాణానికి సమానమని డబ్ల్యూఈఎఫ్ నివేదిక పేర్కొంది. ఉష్ణ మండల అడవుల నరికివేతలో 80 శాతం కంటే ఎక్కువ వ్యవసాయం కోసం చేస్తున్నట్టు గుర్తించింది. 2021లోనే 11.0 మిలియన్ హెక్టార్లలో చెట్లు అంతరించిపోగా.. ఇందులో 3.75 మిలియన్ హెక్టార్లు ఉష్ణ మండల ప్రాథమిక వర్షారణ్యాల ధ్వంసం ఫలితంగా 2.5 గిగా టన్నుల కర్బన ఉద్గారాలు వెలువడ్డాయి. ఇవి భారతదేశంలో వెలువడే వార్షిక శిలాజ ఇంధన ఉద్గారాలతో సమానంగా ఉండటం గమనార్హం. గ్రీన్హౌస్ వాయువులు, కర్బన ఉద్గారాలను 2030 నాటికి కనీసం 43 శాతానికి, 2035 నాటికి 60 శాతానికి తగ్గించాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. భూతాపం కట్టడి చేయకపోతే.. పారిశ్రామిక విప్లవానికి ముందునాటి పరిస్థితులతో పోలిస్తే ప్రపంచంలో సగటున 1.15 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అంటే.. భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే పెరగకుండా కట్టడి చేయకపోతే సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరుగుతాయి. ఫలితంగా తీరప్రాంత దేశాలైన భారత్, బంగ్లాదేశ్, చైనా, నెదర్లాండ్స్ వంటి దేశాలకు చాలా ప్రమాదం. కైరో, లాగోస్, మపుటో, బ్యాంకాక్, ఢాకా, జకార్తా, ముంబై, షాంఘై, కోపెన్‌హాగెన్, లండన్, లాస్ ఏంజిలిస్, న్యూయార్క్, బ్యూనస్ ఏరిస్, శాంటియాగో వంటి నగరాలకు ముప్పు వాటిల్లుతుంది. మునుపటి శతాబ్దాల కంటే 1900 నుంచి ప్రపంచ సగటు సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్ మించి పెరగకుండా పరిమితం చేయగలిగితే.. వచ్చే 2 వేల సంవత్సరాలలో ప్రపంచ సగటు సముద్ర మట్టం 2 నుంచి 3 మీటర్లు పెరుగుతుంది. 2 డిగ్రీల సెల్సియస్ పెరుగుదలతో సముద్రాలు 6 మీటర్లు, 5 డిగ్రీల సెల్సియస్ పెరుగుదలతో సముద్రాలు 22 మీటర్లు వరకు పెరగవచ్చు. దీనివల్ల లోతట్టు ప్రాంతాలు, మొత్తం దేశాలు జలసమాధి అవుతాయి. భూతాపం పెరిగితే అది తీవ్రమైన కరువు, కార్చిచ్చు, వరదలు లాంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేస్తుంది. లక్షలాది మందికి ఆహారం కొరత ఏర్పడేలా చేస్తుంది. ఇది భూ తాపంపై 1.50 డిగ్రీల సెల్సియస్ కంటే పెరగకుండా ఉంచేందుకు అడవులను కాపాడాలని డబ్ల్యూఈఎఫ్ సూచిస్తోంది. ఇందుకు 100 బిలియన్ల డాలర్ల నుంచి 390 బిలియన్ల డాలర్ల వరకు ఖర్చవుతుందని భావిస్తోంది. ప్రపంచ జీడీపీలో సగాని కంటే ఎక్కువ.. అంటే దాదాపు 44 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక విలువ ప్రకృతిపై ఆధారపడి ఉంటుందని.. దాదాపు 1.60 బిలియన్ల మంది ప్రజలు ఆహారం, నీరు, కలప, ఉపాధి కోసం అడవులపై ఆధారపడుతున్నారని వెల్లడించింది. మన దేశంలో ఏటా గ్రీస్ దేశమంత అడవికి నష్టం 2021లో భారతదేశంలో వెలువడిన ఇంధన ఉద్గారాల కంటే వర్షారణ్యాల ధ్వంసం ద్వారా వచ్చిన కార్బన్డైఆౖMð్సడ్ ఎక్కువ ఉన్నట్టు నివేదిక చెబుతోంది. ఇక్కడ ఏటా జరిగే అటవీ నిర్మూలన శాతం గ్రీస్ దేశ పరిమాణానికి దగ్గరగా ఉందని వివరించింది. అటవీ నిర్మూలన, మానవ నివాసాల విస్తరణ, వ్యవసాయం, అడవుల్లో అధికంగా పశువులను మేపడం వంటి కారణాలతో మానవ, జంతువుల మధ్య దాడులకు దారి తీస్తున్నాయి. అడవులు తగ్గిపోతుండటంతో వన్యప్రాణులు తమ భూ భాగాలను కోల్పోతున్నాయి. ఆహారం, ఆశ్రయం లేకపోవడంతో పెద్దఎత్తున బాహ్య ప్రపంచంలోకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని మూడు ప్రధాన పులుల అభయారణ్యాలలో చుట్టుపక్కల మానవ–జంతు సంఘర్షణ పెరిగినట్టు నివేదిక పేర్కొంది. -
‘అట్టడుగు’కు చేరేలా అంతరాలు తగ్గేలా..
ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే ఆఫీసులో పనులు చక్కబెట్టుకోవచ్చు.. సంగీతం, సినిమాల వంటి వినోదమూ దొరుకుతుంది. మరి ఇంటర్నెట్ కారణంగా కూలీల జీవితాల్లో వెలుగులు నిండుతాయని, వారి ఆరోగ్యం బాగుపడుతుందని ఎంత మందికి తెలుసు? అట్టడుగు వర్గాల వారికి చదువు అవకాశాలతోపావారిజీవితాలు బాగుపడతాయనీఎందరికి తెలుసు? కొన్ని సంస్థలు, ప్రభుత్వాల కృషితో ఇంటర్నెట్ విషయంలో ధనికులు– పేదలు, విద్యావంతులు– అత్తెసరు చదువరుల మధ్యఇప్పుడు అంతరం తగ్గుతోంది! 2025 నాటికి ఇది మరింత తగ్గనుంది! ఇందుకు బాటలు వేస్తున్న ‘ఎడిసన్ అలయన్స్’గురించి ఈ ప్రత్యేక కథనం.. ప్రపంచ జనాభా సుమారు 800 కోట్లు! వీరిలో 270 కోట్ల మందికి ఇంటర్నెట్ అందుబాటులో లేదు. దీనికి కారణాలెన్నో. ఈ పరిస్థితిని మార్చేందుకు 2021లో ఓ పెద్ద ప్రయత్నమే మొదలైంది. అదే ‘ఎడిసన్ అలయన్స్ (ఎసెన్షియల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వి సెస్ నెట్వర్క్ అలయన్స్’. 2025 నాటికి అదనంగా కనీసం వంద కోట్ల మందిని ఇంటర్నెట్ సూపర్ హైవేలోకి చేర్చాలన్నదే దీని లక్ష్యం. ఏదో వినోదం పంచేందుకు ఈ ప్రయత్నం జరగడం లేదు. ఆరోగ్యం, విద్య, ఆర్థిక సేవలు సమాజంలోని అట్టడుగు వర్గాల వారికీ చేరాలన్న ఉదాత్త లక్ష్యాన్ని ఈ అలయన్స్ తన భుజాలపైన వేసుకుంది. ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్, రుణాల వంటి ఆర్థిక సేవలు అందుబాటులోకి వస్తే వారి జీవితాలు మారిపోతాయని భావించింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలోని ఆసక్తికరమైన అంశం.. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలూ భాగస్వాములు కావడం. పేద దేశాలు, లేదా డిజిటల్ సేవలు అందుబాటులో లేనివారికి వాటిని సులువుగా అందించడం, వాడుకునేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడం వంటివి ఈ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నాయి. సూటిగా చెప్పాలంటే ఇంటర్నెట్ సౌకర్యం చౌకగా అందించేందుకు, డిజిటల్ నైపుణ్యాలను నే ర్పించేందుకు, విద్య, వైద్యం అందించేందుకు జరుగుతున్న కృషి ఇది. రెండేళ్ల క్రితం మొదలైన ఎడిసన్ అలయన్స్ ఇప్పటివరకూ సాధించిందేమిటన్న దానిపై వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ఇటీవలే ఒక నివేదికను విడుదల చేసింది. రానున్న రెండేళ్లలో సాధించాలనుకుంటున్న లక్ష్యాలను సమీక్షించింది. లక్ష్యంలో ఇప్పటికే సగం.. 2021 జనవరిలో ప్రారంభమైన ఎడిసన్ అలయన్స్ తన భాగస్వాముల సాయంతో ఇప్పటివరకు సుమారు 45.4 కోట్ల మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపిందని వరల్ఎకనమిక్ ఫోరమ్ విడుదల చేసిన తాజా నివేదిక తెలిపింది. మొత్తం 90 దేశాల్లో 250కిపైగా కార్యక్రమాలు మొదలయ్యాయి. 2021లో మొత్తం 140 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్ కానీ, రుణ వసతి గానీ లేకపోయింది. ఎడిసన్ అలయన్స్ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటివరకూ కనీసం 28 కోట్ల మందికి ఈ–బ్యాంకింగ్, మొబైల్ వ్యాలెట్స్, ఎల్రక్టానిక్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. అలాగే సుమారు తొమ్మిది కోట్ల మంది ఆరోగ్యాన్ని డిజిటల్ ఆరోగ్య సేవల రూపంలో పరిరక్షించడం సాధ్యమైంది. టెలిహెల్త్, టెలిమెడిసిన్ వంటి టెక్నాలజీల సాయంతో వేర్వేరు ఆరోగ్య సమస్యలకు చికిత్స అందిస్తున్నారు. విద్య విషయానికొస్తే 2021లో ప్రపంచవ్యాప్తంగా 24.4 కోట్ల మంది (ఆరు నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులు) పాఠశాలలకు దూరం కాగా.. ఎడిసన్ అలయన్స్ భాగస్వాములు ఆన్లైన్ విద్య, రిమోట్ లెర్నింగ్ సొల్యూషన్స్ సాయంతో కోటీ 18 లక్షల మందికి విద్యను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ఉద్యోగం చేసేందుకు అవసరమైన నైపుణ్యాలపైనా శిక్షణ ఇవ్వడం గమనార్హం. ఎంతమందికి.. ఏయే రకంగా? ఎడిసన్ అలయన్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి డిజిటల్ టెక్నాలజీ లాభాలు అందాయనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. డిజిటల్ రంగం మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టిన ఖర్చుతోనే 6.4 కోట్ల మందికి లబ్ధి చేకూరిందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నివేదిక చెబుతోంది. అయితే 250 మంది భాగస్వాముల్లో మూడొంతుల మంది ఆన్లైన్ విద్యపై దృష్టిపెట్టినా దీనివల్ల బాగుపడిన వారి సంఖ్య కొంచెం తక్కువగానే ఉంది. నాణ్యమైన ఆన్లైన్ విద్యకు అవసరమైన వనరులు లేకపోవడం దీనికి కారణంగా చెప్తున్నారు. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్, ఇంటర్నెట్ ఆధారిత పరికరాలు, ఆన్లైన్ సర్వి సుల ఖర్చులు తగ్గడం 12.8 కోట్ల మందికి ఉపయోగపడింది. దాదాపు 27 కోట్ల మందికి కనెక్టివిటీ లేదా డిజిటల్ సేవలు లభించడం మొదలైంది. ముందున్న సవాళ్లు.. ఇంకో మూడేళ్లలో 55 కోట్ల మందికి డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఎడిసన్ అలయన్స్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగస్వాములు కావాల్సిందిగా మరిన్ని కంపెనీలను ఆహా్వనిస్తోంది. ప్రస్తుత భాగస్వాముల్లో కేవలం 12 శాతం మంది మాత్రమే 50 శాతం మేర లక్ష్యాన్ని అందుకోవడంపై అలయన్స్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సగం మంది భాగస్వాములు లక్ష్యంలో 20 శాతాన్ని మాత్రమే చేరుకోవడంపై అసంతృప్తిగా ఉంది. వచ్చే రెండేళ్లలో పాత, కొత్త భాగస్వాములు వేగంగా లక్ష్యాల సాధనకు పూనుకోవాలని కోరింది. పర్వత ప్రాంతాలకు అపోలో ఆరోగ్య సేవలు ప్రఖ్యాత వైద్యసేవల సంస్థ అపోలో హాస్పిటల్స్, అపోలో టెలిహెల్త్ సర్వి సులను ఎడిసన్ అలయన్స్‌లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ వంటి పర్వత ప్రాంతాల్లో అందిస్తోంది. ఆ రాష్ట్రంలో వైద్యసేవలు, నిపుణుల కొరత ఎక్కువగా ఉండటంతో.. ఆ సమస్యను అధిగమించేందుకు డిజిటల్ టెక్నాలజీల సాయం తీసుకుంటున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నాలుగు కీలక ప్రాంతాల్లో టెలిమెడిసిన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 2021 జూలై నాటికి 22,727 టెలికన్సల్టేషన్లు అందించారు. 1,300కుపైగా ఎమర్జెన్సీ కేసులను డిజిటల్ పద్ధతిలోనే ఎదుర్కొని పరిస్థితిని చక్కదిద్దారు. టెలి డిస్పెన్సరీల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండటం ఒక విశేషమైతే.. రక్తహీనత, అసాంక్రమిక వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 4,000 మందితో విస్తృత ప్రయత్నం జరుగుతుండటం ఇంకో విశేషం. ‘‘ఎడిసన్ అలయన్స్‌లో భాగస్వామి అయిన మేం మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఐదు డిజిటల్ డిస్పెన్సరీలు ప్రారంభించాం. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం. వ్యాధుల నివారణ, నిర్దిష్ట సమస్యలపై టెలికన్సల్టేషన్ సర్వి సులు కూడా అందిస్తున్నాం’’అని అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభన కామినేని చెప్పారు. అగ్రరాజ్యంలో వెరిజాన్ సేవలు అమెరికా టెక్ దిగ్గజ సంస్థ వెరిజాన్ ఆ దేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని విద్యార్థులకు ఎడిసన్ అలయన్స్‌లో భాగంగా కనెక్షన్లు అందించే ప్రయత్నం చేస్తోంది. అమెరికాలో లక్షల మంది విద్యార్థులకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులో లేదని.. ఈ కాలపు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు తగ్గట్టుగా నైపుణ్యాలు లేక విద్యార్థులు నష్టపోతున్నారని వెరిజాన్ గుర్తించింది. దీనిని అధిగమించేందుకు వెరిజాన్ ఇన్నోవేటివ్ లెర్నింగ్ సాయంతో స్కూల్ డిస్ట్రిక్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఉపాధ్యాయులు, విద్యార్థులకు కూడా టెక్నాలజీ వినియోగంలో శిక్షణ ఇస్తోంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ (స్టెమ్) రంగాలకు సంబంధించిన శిక్షణ కూడా ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. 2021–22లో ఆ దేశవ్యాప్తంగా సుమారు 500 పాఠశాల్లో 6.5 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారని అంచనా. ఈ కార్యక్రమం కోసం వెరిజాన్ వందకోట్ల డాలర్లకుపైగా ఖర్చు పెడుతోంది. - కంచర్ల యాదగిరిరెడ్డి -
మనిషి ఇప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటి? బతుకుడెట్లా?
పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది ప్రపంచం పరిస్థితి ఇప్పుడు! కోవిడ్ నుంచి గట్టెక్కామని ఊపిరి పీల్చుకుంటుండగానే బోలెడన్ని ఇతర సమస్యలు చుట్టుముట్టేస్తున్నాయి! రెండేళ్ల వృద్ధిని అందుకొనే క్రమంలో కర్బన ఉద్గారాలు పెరిగిపోతూండటం ఒకవైపు... రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని అదుపుతప్పిన ద్రవ్యోల్బణం ఇంకోవైపు... పలు దేశాల ఆర్థిక విధానాల్లో మార్పుల కారణంగా పేద, ధనిక అంతరాలూ పెరిగిపోతున్నాయి! ఈ నేపథ్యంలో మనిషి ఇప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటి? రానున్న రెండేళ్లలో ఏమైనా మార్పులొస్తాయా? దీర్ఘకాలం అపరిష్కృతంగా ఉండే చిక్కుల మాటేమిటి? ఈ అంశాలన్నింటిపై ఇటీవలే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక సర్వే నిర్వహించింది. గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే ప్రకారం ఇప్పటి ప్రధాన సమస్య ఏమిటో తెలుసా? బతకడానికయ్యే ఖర్చుల్లో పెరుగుదల! కాస్ట్ ఆఫ్ లివింగ్! రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధానికి ఏడాది పూర్తయ్యింది. కోవిడ్ అనంతర పరస్థితుల్లో మొదలైన ఈ యుద్ధం అనేక రంగాల్లో ప్రపంచ స్థితిగతులను మార్చేసిందనడంలో సందేహం లేదు. పైగా ఇప్పుడిప్పుడే యుద్ధం ముగిసే సూచనలు కనపడని నేపథ్యంలో ప్రపంచం మొత్తం మీద పెరిగిపోతున్న జీవన వ్యయంపై ప్రజల్లో తీవ్రమైన ఆందోళన నెలకొందని గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే చెబుతోంది. ఇంకో రెండేళ్లపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని సర్వేలో పాల్గొన్న అధికులు అభిప్రాయపడ్డారు. కోవిడ్‌కు ముందు పరిస్థితులన్నీ బాగున్నప్పుడు పరిశ్రమలకు, కంపెనీలకు బ్యాంకుల ద్వారా చాలా సులువుగా అప్పులు పుట్టేవని, ఇప్పుడా స్థితి లేకపోవడం, మాంద్యం భయంతో ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండటం కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్పై ఆందోళనలు పెరిగేందుకు కారణమైందని ఆ సర్వే తేల్చింది. ఈ నేపథ్యంలో గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే రాగల రెండేళ్లు, పదేళ్ల కాలవ్యవధుల్లో ఎదుర్కొనే అవకాశమున్న ఐదు అతిపెద్ద ముప్పులపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సిద్ధం చేసిన గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే 40కిపైగా దేశాల్లోని వివిధ రంగాల నిపుణుల నుంచి సమాచారాన్ని సేకరించారు. విద్య, వ్యాపార రంగాలతోపాటు ప్రభుత్వ అధికారులు పలువురు నిపుణుల బృందంలో ఉన్నారు. ఈ సర్వేలో రిస్క్ లేదా ముప్పుగా పరిగణించిన అంశాలు ప్రపంచ స్థూల ఉత్పత్తిపై లేదా ప్రజలు, ప్రకృతి వనరులపై దుష్పభావం చూపగలిగేవి. రానున్న రెండేళ్లలో ఈ ముప్పుల తీవ్రత, పరిణామాలు, ప్రభుత్వాల సన్నద్ధత వంటి అంశాలను కూడా ఈ సర్వేలో పొందుపరిచారు. అన్ని ప్రియమవుతున్న వేళ కోవిడ్ కంటే ముందు కూడా ప్రపంచవ్యాప్తంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెద్ద సమస్యగానే ఉండేది. కానీ మహమ్మారి పుణ్యమా అని సరఫరాలు నిలిచిపోవడం, డిమాండ్, సరఫరాల మధ్య అంతరం పెరగడంతో పరిస్థితి మరింత దిగజారింది. గతేడాది చివరి నాటికి ద్రవ్యోల్బణం కారణంగా సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఆహారం, నివాసం వంటి కనీస అవసరాలు కూడా అందనంత స్థాయికి చేరుకున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ఇంధన సరఫరాలపై పలు దేశాలు నియంత్రణలు విధించాయి. ఇది ద్రవ్యోల్బణం తద్వారా కనీస అవసరాల ఖర్చులు పెరిగిపోయేలా చేసింది. నల్ల సముద్రం నుంచి ఆహారధాన్యాల ఎగుమతికి చేసుకున్న ఒప్పందం నుంచి రష్యా తొలగిపోయేందుకు సిద్ధమవుతుండటంతో భవిష్యత్తులో పరిస్థితి మరింత దిగజారుతుందని యూరప్ దేశాల సమాఖ్య ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది మార్చిలో ప్రపంచం సాధారణ ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయికి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది విషయానికి వస్తే ఇంధన ధరలు గతేడాది జనవరితో పోలిస్తే దాదాపు 46 శాతం వరకూ ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. చైనాలో కోవిడ్ నియంత్రణలను సడలించడం వల్ల వినియోగం మరింత పెరిగి ఇంధన, ఆహార ధరలు ఇంకా పెరుగుతాయని, ఇది బ్యాంకుల వడ్డీరేట్ల పెంపునకు కారణమవుతుందన్న భయాందోళనలు అధికమవుతున్నాయని అంతర్జాతీయ ఆర్థిక సంస్థ బ్లూమ్‌బర్గ్ పేర్కొనడం గమనార్హం. వాణిజ్య యుద్ధాలతో తీవ్ర నష్టం ఒకప్పుడు దేశాల మధ్య యుద్ధాలు ఆయుధాలతో జరిగేవి. ఇప్పుడు వాణిజ్య ఆర్థికాంశాలపై ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. దీని ప్రభావం ఆయా దేశాలకే పరిమితం కావడం లేదు. ఇతర దేశాలతోపాటు అనేక రంగాలకు విస్తరిస్తోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం సందర్భంలో భారత్, రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయడం ఎంత దుమారం రేపిందో తెలియనిది కాదు. రానున్న పదేళ్లలో దేశాల మధ్య ఘర్షణలు మరింత పెరుగుతాయని, అవి వాణిజ్య యుద్ధాలకు దారితీస్తాయని గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వేలో పాల్గొన్న నిపుణులు భావిస్తున్నారు. కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తుండటం, దేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచుతుండటాన్ని దీనికి నిదర్శనంగా వారు చూపుతున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా నియంత్రణలు, నిషేధాలు విధించినట్లే భవిష్యత్తులోనూ ఆర్థికాంశాలపై దాడులు తీవ్రతరం కానున్నాయని అంచనా. ఆసియా, తూర్పు ఆసియా ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడనుంది. సమాజంలో వైషమ్యాల పెరుగుదల విలువలు, సమానత్వాల మధ్య అంతరం పెరిగిపోతుండటం కూడా స్వల్పకాలిక ముప్పుగా పరిగణిస్తున్నారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో వచ్చే విభజన క్రమేపీ రాజకీయాలకు విస్తరిస్తుందని, వలసలు, లింగవివక్ష, జాతి, కులం, మతం ఆధారంగా ఘర్షణలు పెరిగేందుకు కారణమవుతుందని అంచనా. ప్రపంచం నలుమూలలా పలు దేశాల్లో ఘర్షణలు, ఉద్యమాలు పెరిగిపోతుండటం ఇందుకేనని చెబుతున్నారు. ధరల నియంత్రణలో వైఫల్యం, అక్రమ ఆర్థిక వ్యవహారాలపై అదుపు లేకపోవడం వల్ల సమాజం తీవ్రమైన మానసిక సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని అత్యధికులు ఆందోళణ వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులు వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రపంచం ఇప్పుడు అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తోంది. సుమారు 30 ఏళ్లుగా చర్చలు జరుగుతున్నా చెప్పుకోదగ్గ ముందడు ఏదీ ఇప్పటిదాకా పడలేదు. వాతావరణంలో ఈనాటి కర్బన ఉద్గారాలను పరిగణనలోకి తీసుకుంటే భూమి సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ స్థాయికి పెంచరాదన్న లక్ష్యం నెరవేరే అవకాశం కనిపించట్లేదు. గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వేలో పాల్గొన్న వారిలో 70 శాతం మంది వాతావరణ మార్పులపై ప్రస్తుత స్థితిని తప్పుబట్టారు. 2030 నాటికే సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశాలు ఇప్పుడు 50 శాతమని ఐపీసీసీ అంచనా వేస్తుండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. మరోవైపు పరిస్థితిని ఎదుర్కొనేందుకు జీ–7 దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం లేదు. పారిస్ ఒప్పందాన్ని ధనిక దేశాలే తుంగలో తొక్కిన కారణంగా 2050 నాటికే ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువకు చేరుకొనే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు శాస్త్రీయంగా చేయాల్సిన పనులు కాకుండా రాజకీయంగా ఉపయోగకరమైన వాటిపైనే దేశాలు ఆధారపడటం పరిస్థితిని దిగజారుస్తోంది. యూరోపియన్ యూనియన్ తాజాగా శిలాజ ఇంధన ఆధారిత ఫ్యాక్టరీల మరమ్మతులకు, ఇంధనాల కోసం ఏకంగా 5000 కోట్ల యూరోలు ఖర్చు చేస్తుండటం ఇందుకు తార్కాణం. ఈ పరిస్థితి రానున్న రెండేళ్లలోనూ మెరుగయ్యే అవకాశాలు లేవని, దీర్ఘకాలంలో అంటే రానున్న పదేళ్ల వరకూ కూడా వాతావరణ మార్పులపై పోరు మందగమనం ప్రపంచానికి ఒక సమస్యగానే మిగలనుందని అంచనా. టర్కీలో ఇటీవలి భారీ భూకంపం, గతేడాది అకాల వర్షాలు, వరదలు, కరవులు అన్నీ వాతావరణ మార్పులను సూచిస్తున్నా ధనిక దేశాలిప్పటికీ మేలుకోకపోవడం ఆందోళనకరమేనని గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వేలో పాల్గొన్న స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పర్యావరణ విభాగం అధిపతి క్రిస్ ఫీల్డ్ అన్నారు. - కంచర్ల యాదగిరిరెడ్డి -
ఈ రంగాల్లో 2030 నాటికి 7.6 కోట్ల ఉద్యోగాలు అవసరం: ప్రపంచ ఆర్థిక వేదిక సర్వే
న్యూఢిల్లీ: వ్యవసాయం, విద్య, ఇంధన రంగాలు వచ్చే దశాబ్ద కాలానికి ఉపాధి పరంగా వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనవిగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) పేర్కొంది. ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ రంగాల్లో సాంకేతికత, ఆవిష్కరణలను పెట్టుబడులతో ప్రోత్సహించాల్సిన అవసరాన్ని సూచించింది. వీటిని రేపటి ఉపాధి మార్కెట్లుగా అభివర్ణించింది. ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లతో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా 120 ఆర్థిక వ్యవస్థల్లో అగ్రిటెక్, ఎడ్టెక్, ఇంధన ఆధారిత టెక్నాలజీలు వచ్చే పదేళ్ల కాలానికి వ్యూహాత్మకంగా ఎంతో కీలకమని డబ్ల్యూఈఎఫ్ సర్వే గుర్తించింది. ‘రేపటి మార్కెట్లు 2023’, ‘ప్రపంచ వృద్ధి, ఉపాధి కల్పనకు కావాల్సిన సాంకేతికతలు, రేపటి ఉద్యోగాలు’ పేరుతో రెండు నివేదికలను డబ్ల్యూఈఎఫ్ విడుదల చేసింది. భవిష్యత్తు మార్కెట్లు, ఉపాధి కల్పన కోసం ప్రభుత్వాలు, వ్యాపారవేత్తలు రెట్టింపు స్థాయిలో టెక్నాలజీలను అమల్లో పెట్టాలని సూచించింది. కేవలం 10 ఆర్థిక వ్యవస్థల్లోనే విద్య, వ్యవసాయం, హెల్త్, ఎనర్జీ సహా పర్యావరణ అనుకూల, సామాజిక రంగాల్లో 2030 నాటికి 7.6 కోట్ల ఉద్యోగాల అవసరం ఉంటుందని తెలిపింది. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, జర్మనీ, ఇండియా, జపాన్, దక్షిణాఫ్రికా, స్పెయిన్, యూకే, అమెరికాలను పది ఆర్థిక వ్యవస్థలుగా ఉదహరించింది. హెల్త్‌కేర్‌లో వ్యక్తిత సంరక్షకులు 1.8 కోట్లు, చిన్నారుల సంరక్షకులు, శిశువిద్యా టీచర్లు 1.2 కోట్లు, ప్రాథమిక, సెకండరీ విద్యా టీచర్లు 90 లక్షల మంది అవసరమని పేర్కొంది. చదవండి: అదానీకి మరో షాక్.. ఒకదాని తర్వాత మరొకటి, 3 రోజుల్లోనే -
పెట్టుబడులు, ఆవిష్కరణలతో ఉపాధికి ఊతం
న్యూఢిల్లీ: వ్యవసాయం, విద్య, ఇంధన రంగాలు వచ్చే దశాబ్ద కాలానికి ఉపాధి పరంగా వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనవిగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) పేర్కొంది. ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ రంగాల్లో సాంకేతికత, ఆవిష్కరణలను పెట్టుబడులతో ప్రోత్సహించాల్సిన అవసరాన్ని సూచించింది. వీటిని రేపటి ఉపాధి మార్కెట్లుగా అభివర్ణించింది. ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లతో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా 120 ఆర్థిక వ్యవస్థల్లో అగ్రిటెక్, ఎడ్టెక్, ఇంధన ఆధారిత టెక్నాలజీలు వచ్చే పదేళ్ల కాలానికి వ్యూహాత్మకంగా ఎంతో కీలకమని డబ్ల్యూఈఎఫ్ సర్వే గుర్తించింది. ‘రేపటి మార్కెట్లు 2023’, ‘ప్రపంచ వృద్ధి, ఉపాధి కల్పనకు కావాల్సిన సాంకేతికతలు, రేపటి ఉద్యోగాలు’ పేరుతో రెండు నివేదికలను డబ్ల్యూఈఎఫ్ విడుదల చేసింది. భవిష్యత్తు మార్కెట్లు, ఉపాధి కల్పన కోసం ప్రభుత్వాలు, వ్యాపారవేత్తలు రెట్టింపు స్థాయిలో టెక్నాలజీలను అమల్లో పెట్టాలని సూచించింది. కేవలం 10 ఆర్థిక వ్యవస్థల్లోనే విద్య, వ్యవసాయం, హెల్త్, ఎనర్జీ సహా పర్యావరణ అనుకూల, సామాజిక రంగాల్లో 2030 నాటికి 7.6 కోట్ల ఉద్యోగాల అవసరం ఉంటుందని తెలిపింది. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, జర్మనీ, ఇండియా, జపాన్, దక్షిణాఫ్రికా, స్పెయిన్, యూకే, అమెరికాలను పది ఆర్థిక వ్యవస్థలుగా ఉదహరించింది. హెల్త్‌కేర్‌లో వ్యక్తిత సంరక్షకులు 1.8 కోట్లు, చిన్నారుల సంరక్షకులు, శిశువిద్యా టీచర్లు 1.2 కోట్లు, ప్రాథమిక, సెకండరీ విద్యా టీచర్లు 90 లక్షల మంది అవసరమని పేర్కొంది. -
పుతిన్ బతికే ఉన్నాడా! తెలియడం లేదు!
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు జెలెన్స్కీ గురువారం దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్)లోని వీడియో కాల్లో ప్రసంగిస్తూ..నాకు పుతిన్ బతికే ఉన్నారో లేదో తెలియడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమావేశంలో శాంతి చర్చలు ఎప్పుడూ ప్రారంభమవుతాయన్న అంశంపై ప్రశ్నలు రావడంతో జెలెన్స్కీ ఈ విధంగా స్పందించారు. అయినా పుతిన్ తాను ఉనికిలో ఉండేందుకే ఇష్టపడరంటూ విమర్శించారు. ఆ సమావేశంలోని బ్రేక్‌ఫాస్ట్ ఈవెంట్లో జెలెన్స్కీ మాట్లాడుతూ..ఈ రోజు ఎవరితో దేని గురించి మాట్లాడాలో అస్సలు అర్థం కావడం లేదు. ఆయన గ్రీన్ స్క్రీన్(శాంతికి)కి వ్యతిరేకంగా కనిపించే పుతిన్ సరైన వారని అనిపించడం లేదు. అసలు ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడో లేదా అక్కడ ఇంకోకరెవరైనా ఆయన స్థానంలో ఉండి నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియడం లేదంటూ పుతిన్‌పై జోక్‌లు పేల్చారు. మీరంతా యూరోపియన్ నాయకులకు శాంతి చర్చలు గురించి ఎలా వాగ్దానం చేస్తారో నాకు పూర్తిగా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన శాంతి అంటూనే తర్వాత రోజే పూర్తి స్థాయిలో దళాలతో దాడులు నిర్వహిస్తాడు. అందువల్ల తనకు శాంతి చర్చలు అంటే ఎవరితోనో తనకు అర్థం కావడం లేదంటూ జెలెన్స్కీ తనదైన శైలిలో రష్యాకి గట్టి కౌంటరిచ్చారు. జెలెన్స్కీ ప్రసంగం అయిన కొద్ది గంటల్లోనే క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. "దీన్ని బట్టి రష్యా, పుతిన్, ఉక్రెయిన్, జెలెన్స్కీ ఒక పెద్ద సమస్య అని స్పష్టంగా తెలుస్తోందని గట్టి కౌంటరిచ్చారు. అదీగాక జెలెన్స్కీ మానసికంగా రష్యా లేదా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఉనికిలో ఉండకుండా ఉండేందుకు ఇష్టపడుతున్నారని ప్రత్యక్షంగానే అవగతమవుతోంది. అంతేగాదు రష్యా ఉనికిలోనే ఉంటుంది, తమ దేశ అధ్యక్షుడు పుతిన్ కూడా ఉనికిలోనే ఉంటారు. అదే ఉక్రెయిన్ వంటి దేశానికి మంచిది" అని పెస్కోవ్ ధీటుగా సమాధానమిచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్లింట తెగ వైరల్ అవుతోంది. కాగా పుతిన్ ఇటీవల కాస్త పబ్లిక్ ఇవెంట్లకి దూరంగా ఉండటంతో జెలెన్ స్కీ పుతిన్‌ని అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అదీగాక పుతిన్ కూడా డిసెంబర్లో జరగాల్సిన వార్షిక విలేకరులు సమావేశాన్ని సైతం రద్దు చేసుకున్నట్లు సమాచారం. ⚡️Zelensky refuses to negotiate with Putin because he is not sure that the Russian president is alive. Zelensky said this at the Ukrainian Breakfast in Davos this morning🤣 pic.twitter.com/KphpbM1eND — nicolasorin (@alocin96983806) January 20, 2023 (చదవండి: నో డౌట్! రష్యా గెలుపు పక్కా!: పుతిన్) -
దావోస్ లేఖపై తప్పుడు ప్రచారం... ఏపీ ప్రభుత్వం హెచ్చరిక
సాక్షి, అమరావతి: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనావిుక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానిస్తూ రాసిన లేఖపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఎంను ఆహ్వానిస్తూ నవంబర్ 25న వరల్డ్ ఎకనావిుక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్జ్ బ్రెండే రాసిన లేఖ నకిలీదంటూ పచ్చ మీడియా తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టింది. తొలుత దావోస్‌కు సీఎంకు ఆహ్వానం అందలేదంటూ చేస్తున్న ప్రచారం అబద్ధమని తేలడంతో, ఆ లేఖ నకిలీదని మరో తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూఈఎఫ్ రాసిన లేఖను యథాతథంగా విడుదల చేశామని, దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని గురువారం ప్రభుత్వం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. Due to the brutal nature of the negative campaign on the authenticity of the Invitation letter from @wef, we are reiterating, that any false claim will attract legal action. The Invitation letter is authentic and was shared as received.@GummallaSrijana@AP_EDB@ApiicOfficial https://t.co/pyeN1lMYax — FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) January 19, 2023 -
వ్యాక్సిన్‌తో తగ్గని కరోనా.. ఫైజర్ సీఈవోకి చుక్కలు చూపించిన జర్నలిస్ట్‌లు!
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరయిన ఫైజర్ సీఈవో అల్బర్ట్ బౌర్లకు చేదు అనుభవం ఎదురయింది. కరోనా కట్టడి విషయంలో .. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నా.. ఫలితం మాత్రం అంత గొప్పగా లేదంటూ కొందరు మీడియా ప్రతినిధులు అల్బర్ట్‌ను ప్రశ్నించారు. వరల్డ్ ఎకనామిక్ సదస్సు నుంచి బయటకు వచ్చి రూం వైపు అడుగులు వేస్తుండగా అల్బర్ట్‌ను చుట్టుముట్టారు మీడియా ప్రతినిధులు. మానవాళిని తప్పుదోవ పట్టించి.. అసత్యాలు, అబద్దాలతో తప్పుడు ప్రచారం చేశారని, వ్యాక్సిన్ల విక్రయించేముందు ఎంతో భరోసా ఇచ్చినా అవేవీ అమలు కాలేదని ప్రశ్నించారు. ఫైజర్ కంపెనీని నమ్మి వ్యాక్సిన్లు తీసుకున్న ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత జరిగినా.. అల్బర్ట్ మాత్రం నోరు మెదపలేదు. వ్యాక్సిన్ వల్ల వైరస్ సంక్రమణ పూర్తిగా ఉండదని ముందుగానే తెలిసినా.. దాన్ని రహస్యంగా ఉంచారా అని విలేకరులు ప్రశ్నించారు. కరోనా వల్ల చనిపోయిన వారికి ఏం సమాధానం చెబుతావని నిలదీశారు.నీ మీద ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టకూడదని అడిగినా..అల్బర్ట్ మాత్రం మౌనంగా ఉండిపోయారు. కరోనా విక్రయాల ద్వారా 2.3 బిలియన్ డాలర్లు ఫైజర్‌కు వచ్చాయని, అసలు ఈ మొత్తం వ్యాక్సిన్ తతంగం వెనక ఎవరు కమీషన్లు ఇచ్చారని అడిగారు. కరోనా వ్యాప్తిని అడ్డుకుని మానవుల ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశ్యంతో 2020 ఏప్రిల్‌లో వ్యాక్సిన్‌ను తీసుకొచ్చింది ఫైజర్. అమెరికా ప్రభుత్వం ఆమోదించిన తొలి కోవిడ్ కట్టడి వ్యాక్సిన్ కూడా ఇదే. ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు ఫైజర్‌ను మాత్రమే ఎంపిక చేసుకున్నాయి. దాదాపు ఒకటిన్నర బిలియన్ డోసులను ఫైజర్ విక్రయించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వ్యాక్సిన్లు తీసుకున్న కొందరిలో గుండెపోటు సమస్యలు తలెత్తాయని ఫిర్యాదులు వచ్చినా.. అవి వ్యాక్సిన్ వల్లే వచ్చాయని శాస్త్రీయంగా పూర్తి స్థాయిలో నిరూపితం కాలేదు. 🚨WE CAUGHT HIM! Watch what happened when @ezralevant and I spotted Albert Bourla, the CEO of Pfizer, on the street in Davos today. We finally asked him all the questions the mainstream media refuses to ask. Full story: https://t.co/wHl204orrX SUPPORT: https://t.co/uvbDgOk19N pic.twitter.com/c3STW8EGH3 — Avi Yemini (@OzraeliAvi) January 18, 2023 -
రాష్ట్రంలో డబ్ల్యూహెచ్‌వో టీకా కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా మహమ్మారి వల్ల వైద్య రంగంలో ఉన్న లోపాలు ప్రపంచవ్యాప్తంగా కనిపించాయన్నారు, కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో తమ దగ్గర కావాల్సినన్ని వెంటిలేటర్లు లేవని న్యూయార్క్ గవర్నర్ అన్నారని, ఆ పరిస్థితుల్ని అంచనా వేస్తే లైఫ్ సైన్సెస్‌కు పెద్దపీట వేయాలన్న ఆలోచన కలిగిందన్నారు. ఈ మేరకు చేసిన కృషి వల్ల ప్రపంచంలోకెల్లా మూడో వంతు వ్యాక్సిన్లు తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. తెలంగాణలోనే 40 శాతం ఫార్మసీ ఉత్పత్తులు తయారవుతున్నాయని చెప్పారు. కరోనా తరహాలో మరే ఇతర మహమ్మారులు వచ్చినా ఎదుర్కొనే రీతిలో టీకాలు అవసరమని గుర్తించి ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల ఉత్పత్తి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థను సంప్రదించామని, అందుకు ఆ సంస్థ కూడా ఆసక్తి ప్రదర్శించిందని... త్వరలోనే తెలంగాణలో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ హబ్‌ను డబ్లు్యహెచ్‌వో ఏర్పాటు చేయబోతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అత్యధిక వృద్ధి రేటు తెలంగాణలోనే.. దేశంలో అత్యధిక వృద్ధి రేటు తెలంగాణలోనే ఉన్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. కోవిడ్ ఉన్నా.. నోట్ల రద్దు చేసినా.. కేంద్రం సహకరించకున్నా.. తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటులో దూసుకువెళ్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో సమ్మిళిత వార్షిక వృద్ధిరేటు 15 శాతంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఒకవేళ కేంద్రం తమకు సహకరించి ఉంటే తెలంగాణ మరింత వేగంగా వృద్ధి సాధించేదని పేర్కొన్నారు. తెలంగాణ తరహాలో ఇతర రాష్ట్రాలన్నీ పనిచేసుంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల మార్కును దాటేదన్నారు. మోదీ సర్కార్ అప్పు రూ.100 లక్షల కోట్లు.. మోదీ ప్రధాని కావడానికి ముందు దేశ అప్పు రూ. 56 లక్షల కోట్లుగా ఉండగా మోదీ పాలనలో దేశం కొత్తగా రూ. 100 లక్షల కోట్ల మేర అప్పులపాలైనట్లు మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గత 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ఖజానాకు పన్నుల రూపంలో రూ. 3.68 లక్షల కోట్లు అందించినా తమ ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చింది కేవలం రూ. 1.68 లక్షల కోట్లేనని కేటీఆర్ తెలిపారు. -
ప్రపంచాన్ని నియంత్రించే వేదిక
దేశ సరిహద్దులను చెరిపి ప్రపంచ పాలన సాధించే దిశగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అడుగులు వేస్తున్నది. ప్రపంచీకరణను ఇంకా లోతుల్లోకి తీసుకెళ్లేలా కొత్త వ్యూహాలను రచిస్తున్నది. పర్యావరణం పట్ల శ్రద్ధ ఉన్నట్లు కనిపిస్తుంది కానీ తమ సభ్యులు ఆధిపత్యం కోల్పోని విధంగా ‘పరిష్కారాలు’ తెర మీదకు తేవడం ఈ సంస్థ ప్రత్యేకత. ప్రపంచంలో జరిగే కార్పొరేట్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే నిరసనల మీద ‘డబ్ల్యూఈఎఫ్’ ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నది. ప్రజా ఉద్యమాలను నిర్వీర్యం చేయడంలో దీని పాత్ర ఉందని నమ్ముతున్నారు. అనేక రూపాలలో ప్రపంచ ఆలోచనలను, పరిశోధనలను, వ్యక్తులను, వ్యవస్థలను నియంత్రించే రీతిలో ఈ సంస్థ పని చేస్తున్నది. గత నాలుగు దశాబ్దాలుగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాల్లో వేలాది మంది అగ్రశ్రేణి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు,బ్యాంకర్లు, ఫైనాన్షియర్లు, దేశాధినేతలు, ఆర్థిక, వాణిజ్య మంత్రులు, ధనిక దేశాల విధాన నిర్ణేతలు పాల్గొంటున్నారు. అన్ని ప్రధాన అంతర్జాతీయ సంస్థల అధిపతులు కూడా అక్కడికి వెళ్తుంటారు. ఇంతమంది నాయకులు, ప్రముఖులు అక్కడ పోషించే పాత్ర ఏమిటో తెలియదు. ప్రజాధనం ఎంత ఖర్చు అవుతుందో చెప్పరు. ఈ సంవత్సరం కనీసం ముగ్గురు ముఖ్యమంత్రులు దావోస్(స్విట్జర్లాండ్) పోతున్నారు– మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. తెలంగాణా నుంచి దావోస్ ప్రతి సమావేశంలో పాల్గొనే మంత్రి గారు వెళ్తున్నారు. ఈ సమావేశాలు నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఒక ప్రైవేటు సంస్థ. దీని ఆలోచనలు, వ్యూహాలు తెలుసుకోవడం అవసరం. సాధారణంగా ప్రపంచంలో రెండు పెట్టుబడిదారీ నమూనాలు ఉన్నాయి. మొదటిది: చాలా పాశ్చాత్య సంస్థలు స్వీకరించిన ‘షేర్ హోల్డర్ క్యాపిటలిజం’. దీని ప్రకారం ఒక కార్పొరేషన్ ప్రాథమిక లక్ష్యం దాని లాభాలను గరిష్ఠంగా పెంచడం, తద్వారా వాటాదారు లకు లాభాలు పంచడం. రెండవ నమూనా: ‘స్టేట్ క్యాపిటలిజం’. ఇందులో దేశ ఆర్థిక వ్యవస్థ దిశను నిర్ణయించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వమే పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. చైనా, ఇంకా కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ తరహ వ్యవస్థ ఇటీవల ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ రెండింటికి భిన్నంగా, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధినేత క్లాస్ శ్వాబ్ ప్రతిపాదించిన మూడవ తరహా ‘స్టేక్ హోల్డర్ పెట్టుబడిదారీ విధానం’లో ప్రైవేట్ కంపెనీలకు సమాజం, పర్యావరణం పట్ల బాధ్యత ఉంటుంది. ఇది ఒక విధంగా మన దేశంలో అమలవుతున్న సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ) లాంటిది. ఇది మంచిదేగా అనిపిస్తుంది. అసలు విషయం ఏమిటంటే, దేశ సరిహద్దులను చెరిపి ప్రపంచ పాలన సాధించే దిశగా ఈ సంస్థ అడుగులు వేస్తున్నది. వైఫల్యం చెందినప్పటికీ ప్రపంచీకరణను ఇంకా లోతుల్లోకి తీసుకెళ్లేలా కొత్త వ్యూహాలను రచిస్తూ, ప్రపంచ పరిపాలన మీద దృష్టి పెడుతున్నది. పర్యావరణం పట్ల శ్రద్ధ ఉన్నట్లు కనిపిస్తుంది కానీ ఏ సమస్యలో అయినా ‘డబ్ల్యూఈఎఫ్’ సభ్యులు తమ ఆధిపత్యం కోల్పోని విధంగా ‘పరిష్కారాలు’ తెర మీదకు తేవడం ఈ సంస్థ ప్రత్యేకత. ఈ ఆలోచనలతో క్లాస్ శ్వాబ్ రాసిన పుస్తకం: ‘ది గ్రేట్ రీసెట్’. దీనిలో భాగస్వామ్య పెట్టుబడిదారీ విధానంతో పాటు తనదైన మార్క్సిజం బ్రాండ్‌తో ప్రపంచాన్ని పూర్తిగా పునర్నిర్మించాలని పిలుపు ఇచ్చాడు. దశాబ్దాలుగా ఒక క్లబ్ మీటింగ్ తరహాలో ఇక్కడ వార్షిక సమావేశాలు జరుగుతున్నాయి. నయా ఉదారవాదం పునాదిగా కార్పొరేట్ వాణిజ్య ఒప్పందాల వ్యాప్తి, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తులను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విలీనం చేయడం ఇక్కడి ప్రక్రియలో భాగం. ప్రపంచ వాణిజ్య మార్కెట్లకు దన్నుగా ‘గ్లోబల్ గవర్నెన్స్’ను ప్రోత్సహించడానికి ఈ సమావేశాలను వాడుకుంటున్నారు. వాస్తవానికి, ఈ ఆర్థిక వేదిక ప్రధాన ఉద్దేశ్యం ప్రపంచీకరణ ద్వారా ఉన్నత వర్గాల, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలను కాపాడ టమే. 1990లో నెల్సన్ మండేలా జైలు నుండి విడుదలైనప్పుడు గనులు, బ్యాంకులు, గుత్తాధిపత్య పరిశ్రమలను ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ జాతీయం చేస్తుందని ప్రకటించారు. కాగా, అధ్యక్షుడైన వెంటనే 1992 జనవరిలో ‘డబ్ల్యూఈఎఫ్’ సమావేశాలకు హాజరై తన అభిప్రాయాలను మార్చుకుని ‘పెట్టుబడిదారీ విధానం, ప్రపంచీకరణ’ను స్వీకరించారు. చైనా, వియత్నాం, కంబోడియా వంటి కమ్యూనిస్ట్ దేశాలు కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటే తమ దేశానికి పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నాయి. 1997లో అమెరికా రాజకీయ శాస్త్రవేత్త శామ్యూల్ హంటింగ్టన్ ‘దావోస్ మగవాడు’ (దావోస్ మ్యాన్) అనే పదాన్ని సృష్టించారు. ‘దేశ సరిహద్దులను కనుమరుగవుతున్న అవరోధాలుగా, జాతీయ ప్రభు త్వాలను గతానికి అవశేషాలుగా చూస్తూ– అటువంటి ప్రభుత్వాలకు ఉండే ఏకైక ఉపయోగకరమైన పని ఉన్నత వర్గాల పుడమి స్థాయి కార్యకలాపాలను సులభతరం చేయడమే అని నమ్మేవారు’ అంటూ ఈ పదాన్ని ఆయన విశ్లేషించారు. ఏటా దావోస్ సమావేశాలకు హాజరయ్యేవాళ్ళు తమ పరపతి, వనరులు పెంచుకోవడానికీ, ఇతరులతో కలిసి తమ ఆధిపత్యానికి అడ్డంకులు తొలగించుకోవడానికీ ఈ వేదికను ఉపయోగించుకుంటున్నారు. ఒకానొక సమావేశంలో, బోరిస్ బెరెజోవ్స్కీ నేతృత్వంలోని ఏడుగురు రష్యన్ నేతలు బోరిస్ యెల్ట్సిన్ తిరిగి ఎన్నిక కావడానికి నిధులు సమకూర్చాలనీ, ‘తమ దేశ భవిష్యత్తును పునర్నిర్మించడానికి’ కలిసి పనిచేయాలనీ నిర్ణయించుకున్నారు. ఈ కూటమి అనుకున్నది సాధించింది. ఇది వారందరినీ ఇంకా ధనవంతులను చేసింది. 2009 సంవత్సరంలో అంతర్జాతీయ బ్యాంకులు, ప్రపంచ ఆర్థిక సంస్థలపై ప్రజలకు విశ్వాసం తగ్గినప్పటికీ, ప్రైవేటు ఆర్థిక సంస్థల ప్రయోజనాలను పరిరక్షించడానికి కట్టుబడి దావోస్ పని చేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఫౌండేషన్ బోర్డు (దాని అత్యున్నత పాలక సంస్థ)లో ప్రపంచ కుబేరులు ఉన్నారు. 2002లో ఏర్పాటైన మరొక పాలక మండలి ‘ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్’ను 100 మంది ప్రముఖులతో ఏర్పాటు చేశారు. వ్యూహాత్మక సలహాలు ఇస్తూ, వార్షిక సమావేశ ఎజెండా తయారీకి ఈ మండలి ఉపయోగపడుతుంది. ఇందులో ముఖేష్ అంబానీ కూడా ఉన్నారు. 2015 నాటికి ‘డబ్ల్యూఈఎఫ్’ వార్షిక వ్యూహాత్మక భాగస్వామి హోదా పొందాలంటే దాదాపు 7 లక్షల డాలర్ల రుసుము కట్టాలి. ఇందులో వ్యూహాత్మక భాగస్వామి సభ్యులుగా బ్యాంక్ ఆఫ్ అమెరికా, బార్క్లేస్, బ్లాక్ రాక్, బీపీ, చెవ్రాన్, సిటీ, కోకాకోలా, క్రెడిట్ సూయిజ్, డ్యూష్ బ్యాంక్, డౌ కెమికల్, ఫేస్బుక్, జీఈ, గోల్డ్‌మాన్ శాక్స్, గూగుల్, హెచ్ఎస్బీసీ, జేపీ మోర్గాన్ ఛేజ్, మోర్గాన్ స్టాన్లీ, పెప్సికో, సీమెన్స్, టోటల్, యూబీఎస్ లాంటి సంస్థలు ఉన్నాయి. ప్రపంచంలో జరిగే కార్పొరేట్, ఆర్థిక శక్తి ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే నిరసనలు, ప్రతిఘటన ఉద్యమాల మీద ‘డబ్ల్యూఈఎఫ్’ ఆసక్తి చూపిస్తున్నది. 1999లో ప్రపంచ వాణిజ్య సంస్థకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరిగిన నిరసనల నేపథ్యంలో ఈ ఆసక్తి స్పష్టమైంది. అప్పటి నిరసనల వల్ల సియాటెల్ నగరంలో కీలక వాణిజ్య చర్చలకు అంతరాయం ఏర్పడింది. ఈ నిరసనలను పెరుగుతున్న ‘ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమం’గా ‘డబ్ల్యూఈఎఫ్’ అభివర్ణించింది. ప్రజా ఉద్యమాలను నిర్వీర్యం చేయడంలో, లేదా నిరంకుశంగా అణిచివేయడంలో దీని పాత్ర ఉందని నమ్ముతున్నారు. 2001 జనవరిలో దావోస్ సమావేశాలకు అంతరాయం కలగకుండా అసాధారణ భద్రతా చర్యలు తీసుకున్నారు. దావోస్ పట్టణం చుట్టూ కాంక్రీట్ బ్లాక్‌లు అమర్చి, కంచెకు అవతలి వైపునే వేలాది పోలీసులు నిరసనకారులను నిలువరించారు. అదే సమయంలో, దావోస్‌కు ప్రతి వేదికగా బ్రెజిల్‌లోని పోర్టో అలెగ్రేలో ఏర్పడిన వరల్డ్ సోషల్ ఫోరమ్ కాలక్రమేణా బలహీనపడగా, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ బలపడింది. అన్ని దేశాల ఒప్పందం మేరకు ఏర్పాటైన ప్రపంచ వాణిజ్య సంస్థ ఇటీవలి సంవత్సరాలలో బలహీనపడగా, ఒక ప్రైవేటు సంస్థ అయిన ‘డబ్ల్యూఈఎఫ్’ బలపడుతున్నది. తన దగ్గర ఉన్న కోట్లాది సొమ్ముతో అనేక రూపాలలో ప్రపంచ ఆలోచనలను, పరిశోధనలను, వ్యక్తులను, వ్యవస్థలను నియంత్రించే రీతిలో ఈ సంస్థ పని చేస్తున్నది. కరోనా మహమ్మారి గురించిన వివిధ దేశాల ప్రభుత్వాల స్పందనను, విధానాలను శాసించే స్థితికి కూడా ఈ సంస్థ చేరిందని వ్యాఖ్యానించేవారూ ఉన్నారు. డాక్టర్ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త విధాన విశ్లేషకులు -
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్ జాబితాలో మంత్రి కేటీఆర్‌కు చోటు!
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. స్విర్జర్లాండ్లోని దావోస్ వేదికగా జనవరి 16 నుంచి జనవరి 20 వరకు వరల్డ్ ఎకనమిక్స్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా డబ్ల్యూఈఎఫ్ ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్ జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో మంత్రి కేటీఆర్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా చోటు దక్కించుకున్నారు. ఈ లిస్ట్‌లో కేటీఆర్ 12వ స్థానాన్ని దక్కించుకోగా.. రాఘవ్ చద్దా 23వ స్థానంలో నిలిచారు. ఇక కేటీఆర్ హ్యాండిల్ చేసే ట్విటర్ అకౌంట్ @కేటీఆర్టీఆర్ఎస్కు 12వ ర్యాంక్, @మినిస్టర్కేటీఆర్ అకౌంట్‌కు 22 ర్యాంక్ ఇచ్చింది. @truckdriverpleb @CyrilRamaphosa @ValaAfshar @rwang0 @AlinejadMasih @montymetzger @MinisterKTR @raghav_chadha @EU_Commission @vonderleyen @GBBCouncil @Oxfam @Gabucher @LassoGuillermo @ODI_Global https://t.co/KiTyPCbJIz#WEF23 #WEF #Davos #socialmedia #smm pic.twitter.com/AMjO0RKion — Jim Harris #WEF23 (@JimHarris) January 17, 2023 -
భారత అపర కుబేరుల సంపద.. దిమ్మతిరిగి పోయే వాస్తవాలు
మన దేశంలో ధనికుల సంపద.. దాని గురించి దిమ్మ తిరిగి పోయే వాస్తవాలు ఒక అధ్యయనం వెల్లడించింది. భారత్ లో సంపన్నులు 1 శాతం ఉంటే.. దేశం మొత్తం సంపద లో 40 శాతం వాళ్ళ దగ్గరే ఉంది. ఇక సగం జనాభా దగ్గర ఉన్న సంపద కేవలం 3 శాతం మాత్రమే!!.. దావోస్ వేదికగా జనవరి 16 నుంచి జనవరి 20 వరకు వరల్డ్ ఎకనమిక్స్ ఫోరమ్ వార్షిక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లోని తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రారంభమైన స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ‘సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో మనదేశ సంపన్నుల వివరాలు, వారి వద్ద ఉన్న సంపదతో ఏమేమి చేయొచ్చో పొందుపరిచింది. పిల్లలను బడుల్లో చేర్పించవచ్చు టాప్ 100 భారతీయ బిలియనీర్లకు 2.5 శాతం పన్ను విధించడం లేదా టాప్ 10 భారతీయ బిలియనీర్లపై 5 శాతం పన్ను విధించడం వల్ల పేదరికం కారణంగా చదువుకు దూరమైన పిల్లలను బడుల్లో చేర్పించవచ్చని తెలిపింది. అదాని అవాస్తవిక లాభాలపై ట్యాక్స్ విధిస్తే ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. 128.3 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో భారత్‌కు చెందిన గౌతమ్ అదానీ మూడో స్థానంలో ఉన్నారు. అయితే అదానీ 2017 నుంచి 2021 వరకు సంపాదించిన అవాస్తవిక లాభాలపై ఒక్కసారి ట్యాక్స్ విధిస్తే 1.79లక్షల కోట్లను సమీకరించవచ్చు. ఆ మొత్తాన్ని సంవత్సరానికి ఐదు మిలియన్లకు పైగా భారతీయ ప్రాథమిక పాఠశాల్లో ఉపాధ్యాయుల్ని నియమించుకునేందుకు సరిపోతుంది. పోషక ఆహార లోపం తగ్గించొచ్చు పోషకాహార లోపం.. చిక్కిపోయిన (ఐదేండ్లలోపు పిల్లలు) (ఎత్తుకు తగ్గ బరువులేని పిల్లలు), ఎదుగుదలలేని పిల్లలు (వయస్సుకు తగ్గ ఎత్తులేని పిల్లలు) పిల్లల మరణాలు వంటి నాలుగు పారామీటర్స్ ఆధారంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (ప్రపంచ ఆకలి సూచీ)-2022లో ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా 121 దేశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకులను విడుదల చేయగా భారత్ 107వ స్థానాన్ని దక్కించుకుంది. తాజా ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ‘సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్’ నివేదికలో.. భారత్‌లో ఉన్న బిలియనీర్లలో ఒక్కసారి 2శాతం ట్యాక్స్ విధిస్తే రూ.40,423కోట్లను సమీకరించవచ్చు. ఆ మొత్తంతో వచ్చే మూడేళ్లలో దేశ మొత్తంలో పోషక ఆహార లోపంతో బాధపడుతున్న వారికి బలవర్ధకమైన ఆహారాన్ని అందించవచ్చు. 1.5 రెట్లు ఎక్కువ భారత్‌లో ఉన్న 10 మంది బిలియనీర్లపై ఒక్కసారి 5శాతం ట్యాక్స్ విధిస్తే రూ.1.37లక్షల కోట్లు సమీకరించవచ్చు. ఆ మొత్తం ఎంతంటే? 2022-23లో కేంద్ర సంక్షేమ పథకాలైన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ (రూ.86,200 కోట్లు), మినిస్ట్రీ ఆఫ్ ఆయిష్ (రూ.3,050 కోట్లు) అంచనా వేసిన నిధుల కంటే 1.5 రెట్లు ఎక్కువ. పురుషుడి సంపాదన రూపాయి, మహిళ సంపాదన 63 పైసలు లింగ అసమానతపై నివేదిక ప్రకారం..ఒక పురుషుడు రూపాయి సంపాదిస్తే.. అందులో మహిళ సంపాదించేది 63 పైసలు సంపద రోజుకు రూ.3,608 కోట్లు పెరిగింది కరోనా మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి 2022 నవంబర్ వరకు భారతదేశంలోని బిలియనీర్లు తమ సంపద 121 శాతం లేదా రోజుకు రూ. 3,608 కోట్ల మేర పెరిగినట్లు ఆక్స్‌ఫామ్ తెలిపింది. 3శాతం జీఎస్టీ వసూళ్లు మరోవైపు, 2021-22లో దేశ వ్యాప్తంగా మొత్తం రూ. 14.83 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు అయ్యాయి. ఆ జీఎస్టీ దేశంలోని అట్టడుగు వర్గాల నుంచి 64 శాతం వస్తే, భారత్‌లో ఉన్న టాప్ 10 బిలియనీర్ల నుంచి కేవలం 3శాతం జీఎస్టీ వసూలైంది. పెరిగిపోతున్న బిలియనీర్లు భారతదేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 2020లో 102 కాగా 2022 నాటికి 166కు పెరిగిందని ఆక్స్‌ఫామ్ తెలిపింది. ఆక్సోఫామ్ ఆధారాలు ఎలా సేకరించిందంటే దేశంలోని సంపద అసమానత, బిలియనీర్ల సంపదను పరిశీలించేందుకు ఫోర్బ్స్,క్రెడిట్ సూయిస్ వంటి దిగ్గజ సంస్థల నివేదికల్ని ఆక్సోఫామ్ సంపాదించింది.అయితే నివేదికలో చేసిన వాదనలను ధృవీకరించడానికి ఎన్ఎస్ఎస్, యూనియన్ బడ్జెట్ పత్రాలు, పార్లమెంటరీ ప్రశ్నలు మొదలైన ప్రభుత్వ నివేదికలు ఉపయోగించింది. చివరిగా::: అవాస్తవిక లాభాలంటే వాణిజ్య భాషలో అవాస్తవిక లాభాలంటే ఉదాహరణకు..రమేష్ అనే వ్యక్తి ఏడాది క్రితం ఓ కంపెనీకి చెందిన ఓక్కో స్టాక్‌ను రూ.100 పెట్టి కొనుగోలు చేస్తే.. ఆ స్టాక్ విలువ ప్రస్తుతం రూ.105లకు చేరుతుంది. అలా పెరిగిన రూ.5 అవాస్తవిక లాభాలంటారు. చదవండి👉 చైనాపై అదానీ సెటైర్లు, ‘ఇంట కుమ్ములాటలు.. బయట ఏకాకి!’ -
దావోస్‌కు కేటీఆర్ బృందం
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు నేతృత్వంలో అధికారుల బృందం శనివారం రాత్రి బయలుదేరి వెళ్లింది. నేడు జూరిచ్‌కు చేరుకోనున్న కేటీఆర్ బృందం రోడ్డు మార్గంలో దావోస్‌కు చేరుకుంటుంది. 2018లో తొలిసారిగా తెలంగాణ నుంచి దావోస్‌కు ప్రతినిధులు వెళ్లగా 2019, 2020, 2022లోనూ హాజరయ్యారు. దావోస్ సమావేశాలకు తెలంగాణ నుంచి ప్రత్యేక బృందం వెళ్లడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. ప్రతీ ఏటా జనవరిలో వరల్డ్ ఎకనామిక్ సమావేశాలు జరగనుండగా కోవిడ్ పరిస్థితుల్లో గత ఏడాది మేలో జరిగాయి. ‘కో ఆపరేషన్ ఇన్ ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్’ నినాదంతో జరిగే ఈ ప్రతిష్టాత్మక సదస్సు ఆల్పైన్ పర్వత సానువుల్లో సముద్రమట్టానికి 1,500 మీటర్ల ఎత్తున ఉన్న విడిది పట్టణం దావోస్ ఆతిథ్యమిస్తోంది. కాగా దావోస్‌లో ఏర్పాటయ్యే తెలంగాణ పెవిలియన్‌లో పలు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు చెందిన అధినేతలతో భేటీకావడంతో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో భాగంగా జరిగే రౌండ్ టేబుల్ భేటీల్లో కేటీఆర్ పాల్గొంటారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థల నుంచి తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడం ద్వారా ప్రైవేటు రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం లక్ష్యంగా కేటీఆర్ ప్రసంగాలు, భేటీలు ఉంటాయి. -
రూ.23 లక్షల కోట్లు అవసరం..ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మర్చేందుకు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు పూర్తిగా ఎలక్ట్రిక్‌కు మారేందుకు సుమారు రూ.23 లక్షల కోట్లు అవసరమని ఒక నివేదిక వెల్లడించింది. నీతి అయోగ్ భాగస్వామ్యంతో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ రూపొందించిన ఈ శ్వేత పత్రం ప్రకారం..చివరి గమ్యస్థానం కోసం, అలాగే పట్టణాల్లో డెలివరీకి ఉపయోగించే వాహనాలే దేశంలో ఎలక్ట్రిక్ టూ, త్రీవీలర్ల స్వీకరణను ముందుండి నడిపిస్తున్నాయి. పూర్తిగా ఎలక్ట్రిక్‌కి మారబోయే మొదటి విభాగాలుగా వీటిని చెప్పవచ్చు. ముందస్తు కొనుగోలు ఖర్చు ఎక్కువగా ఉండడం, కొత్త సాంకేతికతపై విశ్వాసం లేకపోవడం, హామీ లేని విశ్వసనీయత, పునఃవిక్రయం విలువ స్థిరీకరించకపోవడం కారణంగా ఎలక్ట్రిక్‌కు మారడానికి డ్రైవర్–కమ్–ఓనర్లు వెనుకాడుతున్నారు. దేశంలో అమ్ముడవుతున్న మొత్తం వెహికిల్స్‌లో ద్విచక్ర, త్రిచక్ర వాహనాల వాటా ఏకంగా 80 శాతం ఉంది. కొన్నేళ్లుగా ఈవీల వాడకం పెరుగుతోంది. నిర్వహణ ఖర్చు తక్కువ.. భారత్‌లో ధ్రువీకరణ పొందిన 45 కంపెనీలు ఎలక్ట్రిక్ టూ, త్రీవీలర్ల తయారీలో ఉన్నాయి. ఇవి ఇప్పటి వరకు 10 లక్షల యూనిట్లను విక్రయించాయి. 25 కోట్ల మొత్తం ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో ఎలక్ట్రిక్ టూ, త్రీవీలర్ల వాటా అతిస్వల్పమే. భారత్‌లో పెరుగుతున్న ఆదాయాలు, వాహన యాజమాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ద్విచక్ర, త్రిచక్ర వాహనాల సంఖ్య మొత్తం 27 కోట్లకు పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. వీటిలో 26.4 కోట్ల యూనిట్ల ఎలక్ట్రిక్ టూవీలర్లు ఒక్కొక్కటి సగటున రూ.80,000 చొప్పున, అలాగే 60 లక్షల యూనిట్ల ఈ–త్రీవీలర్లు ఒక్కొక్కటి సగటున రూ.2.8 లక్షలుగా లెక్కించారు. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నప్పటికీ.. వాటి నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. యాజమాన్య ఖర్చుతో అంచనా వేసినప్పుడు రోజువారీ అధికంగా వినియోగించే రైడ్–హెయిలింగ్, లాస్ట్–మైల్ డెలివరీ ఫ్లీట్స్‌కు ఈవీలు ఇప్పటికే అనువైనవని పరిశ్రమ గుర్తించిందని నివేదిక వివరించింది. -
డబ్ల్యూఈఎఫ్ లైట్‌హౌస్ నెట్‌వర్క్‌లో డాక్టర్ రెడ్డీస్ ప్లాంటు
న్యూఢిల్లీ: గ్లోబల్ లైట్‌హౌస్ నెట్వర్క్ (జీఎల్ఎన్)లో కొత్తగా 11 ఫ్యాక్టరీలు, పారిశ్రామిక సైట్లను చేర్చినట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వెల్లడించింది. ఈ జాబితాలో భారత్ నుంచి దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) హైదరాబాద్ ప్లాంటు, శ్రీసిటీలోని మాండెలీజ్ ఫ్యాక్టరీ, ఇండోర్‌లోని సిప్లా ప్లాంటు ఉన్నాయి. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3డీ ప్రింటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి విప్లవాత్మకమైన సాంకేతికతలను ఉపయోగించడంలో ముందుంటున్న 100 పైగా తయారీ సంస్థలు జీఎల్ఎన్లో ఉన్నాయి. ఎప్పటికప్పుడు మారిపోతున్న నాణ్యత ప్రమాణాల అంచనాలను అందుకునేందుకు డీఆర్ఎల్ హైదరాబాద్ ప్లాంటు భారీ స్థాయిలో డిజిటలీకరణ చేపట్టినట్లు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. తయారీ వ్యయాలను 43 శాతం మేర తగ్గించుకున్నట్లు పేర్కొంది. పాతికేళ్ల హైదరాబాద్ ప్లాంటుకు డిజిటల్ లైట్‌హౌస్ ఫ్యాక్టరీ హోదా దక్కడం గర్వకారణమని డీఆర్ఎల్ గ్లోబల్ హెడ్ (తయారీ విభాగం) సంజయ్ శర్మ తెలిపారు. మరోవైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ ఆటోమేషన్స్ మొదలైన వాటితో శ్రీ సిటీలోని ప్లాంటులో మాండెలీజ్ సంస్థ తయారీ వ్యయాలను 38 శాతం తగ్గించుకుందని, కార్మికుల ఉత్పాదకతను 89 శాతం మేర పెంచుకుందని డబ్ల్యూఈఎఫ్ వివరించింది. అంతర్జాతీయంగా మాండెలీజ్‌కు ఉన్న ఫ్యాక్టరీలకు ఈ ప్లాంటు ప్రామాణికంగా మారిందని తెలిపింది. లైట్‌హౌస్ నెట్‌వర్క్‌లోని నాలుగు సంస్థలకు అత్యుత్తమమైన సస్టెయినబిలిటీ లైట్‌హౌస్‌ల హోదా ఇచ్చినట్లు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. -
వినూత్నం, ఆదర్శం.. ఏపీకి నీతిఆయోగ్ సలహాదారు ప్రశంస
సాక్షి, అమరావతి: ఏపీలో కాలుష్యానికి తావులేని పర్యావరణహిత పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 2070 నాటికి కర్బన ఉద్గారాలు లేకుండా చేయాలన్న లక్ష్యంలో భాగంగా గ్రీన్ ఎనర్జీతో పాటు ఎలక్ట్రికల్ వాహన రంగాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ‘షేపింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది మొబిలిటీ’ పేరుతో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. చదవండి: అరచేతిలో 87 రకాల సేవలు.. ఈ యాప్ ఉంటే మీ వెంట పోలీస్ ఉన్నట్టే! ఇందులో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి. సృజన, ఏపీ ఈడీబీ సీఈఓ జవ్వాది సుబ్రమణ్యంలతో పాటు 60కిపైగా ఎలక్ట్రిక్ వాహన రంగానికి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. అత్యధిక పెట్టుబడులు ఆకర్షించేలా చర్యలు ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ.. 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహన రంగంలో భారత్‌లోకి రూ.50,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారని, ఇందులో అత్యధిక భాగం రాష్ట్రానికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం మూడంచెల విధానంలో ముందుకెళ్తున్నామని, 2029 నాటికి దేశంలో అత్యధిక పెట్టుబడులు ఆకర్షించే రాష్ట్రంగా.. 2050 నాటికి అంతర్జాతీయంగా పెట్టుబడులకు అత్యంత అనువైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమర్నాథ్ తెలిపారు. ఇందుకు అనుగుణంగా పారిశ్రామిక కారిడార్లలో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నామన్నారు. జీడీపీ 5 శాతం పెరుగుతుంది జవ్వాది సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ఒకపక్క ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు దేశంలో గణనీయంగా పెరుగుతున్నప్పటికీ అదే సమయంలో ఏటా 20 లక్షల మంది వాయు కాలుష్యంవల్ల మరణించడం ఆందోళన కలిగించే అంశమన్నారు. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా వీటిని అరికట్టవచ్చని, తద్వారా దేశ జీడీపీ మరో 5 శాతం పెరుగుతుందన్నారు. పెట్టుబడులకు రాష్ట్రం చాలా అనువైనదని, సింగిల్ విండో విధానంలో కేవలం 21 రోజుల్లోనే అనుమతులను మంజూరు చేస్తున్నట్లు జవ్వాది తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంలో భాగంగా చార్జింగ్ స్టేషన్లు వంటి కీలక మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారిస్తోందన్నారు. 2030 నాటికి గ్రీన్ ఎనర్జీ వాటా 45శాతం ప్రస్తుతం రాష్ట్ర ఇంధన వినియోగంలో 30 శాతం వరకు సౌర, పవన విద్యుత్ నుంచి సమకూర్చుకుంటున్నామని, 2030 నాటికి గ్రీన్ ఎనర్జీ వాటాను 45 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విజయానంద్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వినియోగించుకోవాల్సిందిగా పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి. సృజన కోరారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహన రంగానికి చెందిన పలువురు ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి వ్యక్తంచేశారు. ఏపీకి నీతిఆయోగ్ సలహాదారు ప్రశంస ఇక ఏదైనా అనుకుంటే దానిని వెంటనే చేయడంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ముందుంటుందని సమావేశంలో నీతి ఆయోగ్ సలహాదారు సుదేందు సిన్హా ప్రశంసించారు. ఒక ఆలోచన వస్తే వెంటనే ఆచరణలో పెట్టడంలోగానీ, ఒక బృందాన్ని ఏర్పాటుచేసుకుని ప్రణాళికతో లక్ష్యాన్ని చేరడంలోగానీ ఏపీ తీరు ఆదర్శమని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఏపీ మార్గదర్శిగా నిలుస్తుందని సిన్హా అభిప్రాయపడ్డారు. -
లింగ సమానత్వం.. 146 దేశాల సూచికలో భారత్ ర్యాంక్ 135!
న్యూఢిల్లీ: లింగ సమానత్వం విషయంలో ఐస్లాండ్ ప్రపంచంలో తొలి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్ నిలిచాయి. మొత్తం 146 దేశాల సూచికలో భారత్ ర్యాంక్ 135! అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, కాంగో, ఇరాన్, చాద్ తదితర దేశాలు అట్టడుగులు స్థానాల్లో నిలిచాయి. జెనీవాలోని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) ‘వార్షిక జెండర్ గ్యాప్ రిపోర్ట్–2022’ను బుధవారం చేసింది. లింగ సమానత్వంలో ప్రపంచ దేశాలకు ర్యాంక్‌లను కేటాయించింది. లింగ అంతరం పూర్తిగా సమసిపోవడానికి మరో 132 ఏళ్లు పడుతుందని అంచనా వేసింది. లింగ సమానత్వంలో భారత్ వెనుకంజలో ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగ–ఉపాధి అవకాశాల్లో వారి భాగస్వామ్యం పెరుగుతుండడం సంతోషకరమని పేర్కొంది. మహిళా ప్రజాప్రతినిధులు తదితరుల సంఖ్యలో పెరుగుదల కన్పించింది. చదవండి: లంకాధ్యక్షుడి జంప్ జిలానీ.. గొటబయ గో! అంటే ముల్లేమూటా సర్దాల్సిందే! -
ఆర్థికశాస్త్ర దిగ్గజాల సరసన భారతీయురాలు.. తొలి మహిళగా రికార్డు
‘అర్థం కావాలేగానీ ఆర్థికశాస్త్ర విషయాలు చందమామ కథల కంటే ఎక్కువగా ఆకర్షిస్తాయి’ అంటారు. అది ఎంత వరకు నిజమో తెలియదుగానీ, గీతా గోపీనాథ్‌కు ఆర్థికశాస్త్రం అనేది శ్వాస! సివిల్ సర్వీసులలో చేరాలనేది తన మొదటి కల. అయితే ఆర్థికశాస్త్రంపై ఆసక్తి ఆమెను వేరే దారిలోకి తీసుకెళ్లింది. ప్రపంచ ఆర్థికశాస్త్ర దిగ్గజాల సరసన చేర్చింది... ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిధి) గోడ (వాల్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ ఎకనామిస్ట్స్)పై ఆ సంస్థ తరపున పనిచేసిన ప్రముఖ ఆర్థికవేత్తల ఫోటోలు వరుసగా కనిపిస్తాయి. ఒక్కో ఫొటో చూస్తూ వెళుతుంటే ఆర్థికరంగంలో వారి మేధోకృషి గుర్తుకు వస్తుంటుంది. అపురూపమైన చిత్రాలు అవి. ఇప్పుడు ఆ ఫొటోల వరుసలో ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ ఫోటో చేరింది. ఐఎంఎఫ్ వాల్ ఫొటోల వరుసలో కనిపించిన తొలి మహిళా ఆర్థికవేత్తగా గీతా గోపీనాథ్ తనప్రత్యేకతను చాటుకుంది. ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ ప్రఖ్యాత ఆర్థికవేత్తల ఫొటోల వరుసలో తన ఫోటో ఏర్పాటు చేసినందుకు ట్విట్టర్ ద్వారా సంతోషం వ్యక్తం చేసింది గీత. ఇండియన్–అమెరికన్ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్న గీతా గోపినాథ్ కోల్‌కతాలో జన్మించింది. మైసూర్‌లోని నిర్మల కాన్వెంట్ స్కూల్లో చదువుకుంది. దిల్లీలో లేడి శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో బీఏ, యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్లో ఎం.ఏ. చేసింది. ప్రిన్స్టన్ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డి పట్టా అందుకుంది. Breaking the trend 👊💥…I joined the wall of former Chief Economists of the IMF 😀 pic.twitter.com/kPay44tIfK— Gita Gopinath (@GitaGopinath) July 6, 2022 చదువు పూర్తయిన తరువాత హార్వర్డ్ యూనివర్శిటీ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసింది. ఏడవ తరగతి వరకు గీతకు 45 శాతం లోపు మార్కులు వచ్చేవి. తల్లిదండ్రులెప్పుడూ మార్కుల విషయంలో ఒత్తిడి తెచ్చేవారు కాదు. అయితే ఏడవ తరగతి తరువాత మాత్రం గీత చదువులో దూసుకుపోయింది. మార్కులే మార్కులు! అంతమాత్రాన చదువే లోకం అనుకోలేదు. హాయిగా ఆటలు ఆడేది. పాటలు పాడేది. గిటార్ వాయించేది. ఫ్యాషన్ షోలలో పాల్గొనేది. గణితం నుంచి సైన్స్ వరకు ఎంత జటిలమైన విషయాన్ని అయిన నాన్న గోపీనాథ్ ఇంట్లో ఉన్న వస్తువులను ఉదహరిస్తూ సులభంగా అర్థమయ్యేలా చెప్పేవాడు. బహుశా గీతకు ఆ లక్షణమే వచ్చి ఉంటుంది. జటిలమైన ఆర్థిక విషయాలను వేగంగా అర్థం చేసుకోవడంలోనే కాదు, వాటిని సులభంగా బోధించడంలో పట్టు సాధించింది. గీత పరిశోధన పత్రాలు టాప్ ఎకనామిక్స్ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ‘యంగ్ గ్లోబల్ లీడర్’ (2011) పురస్కారాన్ని అందుకుంది. 2014లో ‘టాప్ 25 ఎకనామిస్ట్స్ అండర్ 45’ జాబితాలో చోటు సంపాదించింది. భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అందుకుంది. ఐఎంఎఫ్‌లో చీఫ్ ఎకనామిస్ట్‌గా పనిచేసిన గీత ప్రస్తుతం ఐఎంఎఫ్–డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో ఉంది. -
భూగోళమంతటా ప్లాస్టిక్ భూతం.. సవాళ్లు ఎన్నున్నా.. స్వచ్ఛ సాగరం
ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. దాదాపు భూగోళమంతటా విస్తరించిన భూతం. చెరువులు, నదులు, సముద్రాల్లోనూ తిష్టవేసుకొని కూర్చుంది. విలువైన జలవనరులను కలుషితం చేస్తోంది. జలచరాల ఆయువును కబళిస్తోంది. తనను సృష్టించిన మనిషికే ముప్పుగా పరిణమిస్తోంది. సముద్రాల్లో మాటువేసిన ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచదేశాలకు ఇప్పుడొక పెద్ద సమస్యగా మారిపోయింది. భూమిపై అన్ని సముద్రాల్లో 19.90 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు నిపుణుల అంచనా. వీటిని తొలగించి, మహాసాగరాలను పరిశుభ్రంగా మార్చడానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఎంతోమంది పరిశోధకులు, ఇంజనీర్లు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. కృత్రిమ మేధ(ఏఐ) బీచ్ బగ్గీలు, ప్లాస్టిక్‌ను తినేసే కృత్రిమ ఎంజైమ్‌లు, ప్లాస్టిక్ ఇంటర్సెప్టర్లు, అక్వాటిక్ డ్రోన్లు వంటివి కొన్ని పరిష్కార మార్గాలుగా చెబుతున్నారు. ఎంజైమ్‌లతోపాటు మైక్రోబ్ నెట్లు, మ్యాగ్నెటిక్ లిక్విడ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వాటర్షార్క్లు సముద్రాల్లో మారుమూల ప్రాంతాలకు కూడా ప్లాస్టిక్ రక్కసి చొచ్చుకెళ్తోంది. మానవ సంచారం లేని అంటార్కిటికాలో కురిసిన మంచులోనూ సూక్ష్మ ప్లాస్టిక్ ఆనవాళ్లు బయటపడ్డాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) అంచనా ప్రకారం సముద్రాల్లో 199 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వివిధ రూపాలు, పరిణామాల్లో ఉంది. తక్కువ బరువు కలిగిన మైక్రోప్లాస్టిక్‌లు ఉపరితలంపై తేలుతుండగా, అధిక బరువు కలిగినవి అడుగు భాగానికి చేరుకున్నాయి. నీటిపై తేలుతున్న ప్లాస్టిక్‌ను తొలగించడానికి అక్వాటిక్ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. నీటి పై భాగంలోని చిన్నచిన్న ప్లాస్టిక్ ముక్కలను సైతం సులువుగా సేకరిస్తాయి. వీటిని వాటర్షార్క్లుగా వ్యవహరిస్తున్నారు. బీచ్‌లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ను ఏరివేయడానికి కృత్రిమ మేధతో పనిచేసే బగ్గీలు (చిన్నపాటి వాహనాలు) వాడుతున్నారు. కంటికి కనిపించని సూక్ష్మ ప్లాస్టిక్‌ను నిర్మూలించడానికి మ్యాగ్నటిక్ నానో–స్కేల్ స్ప్రింగ్‌లను తయారు చేస్తున్నారు. మరికొన్ని ప్రయోగాలు అభివృద్ధి దశలో ఉన్నట్లు చెబుతున్నారు. ప్లాస్టిక్‌ను భక్షించే ఎంజైమ్ నదులు, సముద్రాల్లోని ప్లాస్టిక్‌ను తినేసే ఎంజైమ్‌ను 2016లో కనిపెట్టారు. దీన్ని పెటేస్ అని పిలుస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ ఎంజైమ్ నిర్వీర్యం అవుతుండడంతో పెద్దగా ఉపయోగించడం లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక పాలిమర్‌ను డిజైన్ చేశారు. ప్లాస్టిక్‌ను తినేసే ఎంజైమ్‌ను అధిక ఉష్ణోగ్రతల్లోనూ కాపాడుతుందని అంటున్నారు. మోంటానా స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్మౌత్ పరిశోధకులు టీపీఏడీఓ అనే మరో ఎంజైమ్‌ను అభివృద్ధి చేశారు. జల వనరుల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించడానికి ఇది చక్కగా ఉపకరిస్తుందని పేర్కొంటున్నారు. సీబిన్ వాక్యూమ్ క్లీనర్లు సౌరశక్తితో పనిచేసే ప్లాస్టిక్ ఇంటర్సెప్టర్లను పలు దేశాల్లో ఉపయోగిస్తున్నాయి. ఇందులో ఇంటర్‌సెప్టర్‌కు పొడవైన చేతుల్లాంటి ఉంటాయి. నీటిలోని ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, కన్వేయర్ బెల్ట్ ద్వారా ఇంటర్సెప్టర్లోని బుట్టల్లోకి పంపిస్తాయి. బుట్టలు నిండిపోయిన తర్వాత ఒడ్డుకు చేరుస్తారు. ఇదే తరహాలో పనిచేసే వాటర్–వీల్ పవర్డ్ ప్లాస్టిక్ కలెక్టర్‌ను అమెరికాలో వాడుతున్నారు. సీబిన్ వాక్యూమ్ క్లీనర్లను 2015లో ఆస్ట్రేలియాలో రూపొందించారు. ఇవి ప్లాస్టిక్‌తో వ్యర్థాలతో కూడిన నీటిని యంత్రంలోకి సేకరిస్తాయి. రెండింటినీ వేరుచేసి, నీటిని మాత్రమే బయటకు పంపిస్తాయి. ప్లాస్టిక్ ముక్కలన్నీ క్లీనర్లోని సంచిలోకి చేరుకుంటాయి. ప్రపంచమంతటా ఇప్పుడు 860 సీబిన్ వాక్యూమ్ క్లీనర్లలో వాడుకలో ఉన్నాయి. తుపాన్ల దిశను గుర్తించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ అభివృద్ధి చేసిన సైక్లోన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(సీవైజీఎన్ఎన్ఎస్) సముద్రాలు, నదుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల కదలికలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుండడం గమనార్హం. ప్లాస్టిక్ ముక్కలు ఏ ప్రదేశంలో అధికంగా ఉన్నాయో తెలుసుకొని, సేకరించడానికి ఈ పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నారు. హాంకాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ పరిశోధకులు అతుక్కునే గుణం ఉన్న బయోఫిల్మ్తో కూడిన మైక్రోబ్ నెట్లను రూపొందించారు. నెట్లను నీటిలోకి జారవిడిస్తే అక్కడున్న ప్లాస్టిక్ వ్యర్థాలకు అతుక్కుపోతాయి. పైకి లాగితే వాటితోపాటు వ్యర్థాలు వచ్చేస్తాయి. వామ్మో ప్లాస్టిక్ ... ► ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోవాలంటే వేల సంవత్సరాలు పడుతుంది. సముద్రాల్లో కోట్లాది ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. వీటి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ► నీటిలోని సూక్ష్మ ప్లాస్టిక్‌ను పూర్తిగా ఫిల్టర్ చేసే పరిజ్ఞానం ఇంకా అందుబాటులోకి రాలేదు. ► 2050 నాటికి సముద్రాల్లోని మొత్తం చేపల బరువు కంటే ప్లాస్టిక్ బరువే ఎక్కువగా ఉంటుందని 2016లో విడుదల చేసిన ఓ నివేదికలో నిపుణులు తేల్చిచెప్పారు. ► ప్రపంచంలో కుళాయి ద్వారా సరఫరా చేస్తున్న నీటిలో 80 శాతం నీరు ప్లాస్టిక్‌తో కలుషితమైందేనని 2017లో ఒక అధ్యయనంతో తేలింది. ► కుళాయి నీటిలో ప్లాస్టిక్ కాలుష్యం ముప్పు అధికంగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా, లెబనాన్, భారత్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఫ్రాన్స్, జర్మనీ, యూకే చిట్టచివరి స్థానాల్లో ఉన్నాయి. ► ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నీటి నమూనాలను సేకరించి, పరీక్షించగా.. 83 శాతం నమూనాల్లో మైక్రోప్లాస్టిక్ కనిపించింది. ఈ మైక్రోప్లాస్టిక్ మనిషి శరీర అంతర్భాగాల్లోకి సులభంగా చొచ్చుకెళ్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లను దూరం పెట్టడమే మంచిదని సూచిస్తున్నారు. ► సూక్ష్మ ప్లాస్టిక్‌లో విషపూరితమైన రసాయనాలు ఉంటాయి. ► భూగోళంపై నివసిస్తున్న అన్ని రకాల జీవులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్లాస్టిక్‌ను స్వీకరిస్తున్నాయి. ప్లాస్టిక్ వల్ల ప్రభావితమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మహిళా సాధికారత.. 135.6 ఏళ్లు దూరం!
ఆకాశంలోసగం.. కానీ అవకాశాల్లో మాత్రం ఎంతో దూరం.. ఇక్కడ, అక్కడ అని కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా మహిళల పరిస్థితి ఇదే. దీనిపై విస్తృతంగా అధ్యయనం చేసిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఇటీవల ‘ప్రపంచ లింగ అసమానత్వ నివేదిక (గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టు)–2021’ను విడుదల చేసింది. పురుషులతో పోలిస్తే మహిళలు ఎంతగా వెనుకబడ్డారన్న వివరాలను పొందుపర్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయని, కానీ ఈ వేగం చాలదని డబ్ల్యూఈ ఎఫ్ స్పష్టం చేసింది. ఇప్పుడున్నట్టుగానే కొనసాగితే.. మహిళలు పురుషులతో సమానంగా నిలిచేందుకు ఏకంగా 135.6 ఏళ్లు పడుతుందని పేర్కొంది. –సాక్షి, సెంట్రల్‌డెస్క్ 156 దేశాల్లో.. 4 అంశాలపై డబ్ల్యూఈఎఫ్ ప్రపంచవ్యాప్తంగా 156 దేశాల్లో మహిళల పరిస్థితిని పరిశీలించింది. ముఖ్యంగా నాలుగు అంశాల (ఉద్యోగ, ఉపాధి అవకాశాలు; విద్య; వైద్యం–ఆరోగ్యం; రాజకీయ సాధికారత)ను పరిగణనలోకి తీసుకుంది. వీటన్నింటినీ కలిపి ఒక శాతానికి స్కోర్‌ను నిర్ణయించింది. ఒకటి వస్తే మహిళల సాధికారత బాగున్నట్టు.. సున్నా స్కోర్ వస్తే మహిళల పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నట్టు లెక్కించారు. భారత్ స్థానం140 ♦మహిళా సాధికారతలో మొత్తం 156 దేశాలకుగాను భారతదేశం ♦62 స్కోర్‌తో 140వ స్థానంలో నిలిచినట్టు డబ్ల్యూఈఎఫ్ నివేదిక పేర్కొంది. ♦దక్షిణాసియాలో బంగ్లాదేశ్ (65వ స్థానం), నేపాల్ (106), శ్రీలంక (16), భూటాన్ (130) మన దేశం కన్నా ముందుండగా.. పాకిస్తాన్ (153) వెనుక నిలిచింది. ♦2020 నివేదికలో మొత్తం 153 దేశాలకుగాను భారత్ 112వ స్థానంలో నిలవగా.. తర్వాతి ఏడాదికి వచ్చేసరికి ఏకంగా 140వ స్థానానికి పడిపోయింది. ప్రాంతాల వారీగా మహిళా సాధికారత తీరు(స్కోరు) ఊహించలేనంత సంపద! డబ్ల్యూఈఎఫ్ నివేదిక ప్రకారం.. పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తే ప్రపంచ ఎకానమీకి అదనంగా సమకూరే మొత్తం ఎంతో తెలుసా? ♦28 ట్రిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 22,22,66,240 కోట్లు (సులువుగా చెప్పుకోవాలంటే 22.22 కోట్ల కోట్లు అన్నమాట) -
సీఎం జగన్‌కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2022 వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని చూపిన చొరవపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం మంగళవారం కృతజ్ఞతలు తెలిపింది. ‘చరిత్రలో మలువు, ప్రభుత్వ విధానాలు, వ్యాపార వ్యూహాలు’ అనే ఇతివృత్తంపై నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్న సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా అత్యంత సవాల్‌గా ఉన్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక నేపథ్యాల్లో సమావేశం జరిగిందని, ప్రపంచానికి ఈ క్లిష్ట సమయాన దావోస్‌లో వ్యూహాత్మక సంభాషణల్లో మీ (సీఎం జగన్) సహకారం చాలా ముఖ్యమైనదని ఫోరం అధ్యక్షుడు బోర్జ్ బ్రెండే ముఖ్యమంత్రి జగన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. వాతావరణ మార్పు వంటి సమస్యలపై సమిష్టి చర్యలను వేగవంతం చేయడానికి అంతర్జాతీయ సమాజాన్ని సమీకరించడం, శాంతి, ఆర్థిక పునరుద్ధరణను కాపాడటంపై సదస్సులో చర్చించినట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రభుత్వ, వ్యాపార, ఇతర వర్గాలకు చెందిన 2,500 మందిని ఈ సమావేశం ఒకచోట చేర్చిందన్నారు. వార్షిక సమావేశంలో బలమైన స్వరంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించినందుకు సీఎం జగన్‌కు ఫోరం ధన్యవాదాలు తెలిపింది. దావోస్‌లో మీ (సీఎం జగన్) అనుభవం ఫలవంతమైందని లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మీ నిరంతర సహకారం కోసం ఫోరం ఎదురుచూస్తుందని తెలిపింది. గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్స్, ఫోరం మూవింగ్ ఇండియాతో అనుసంధానమైందని, గ్రీన్ మొబిలిటీకి పరివర్తనను వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ చొరవ ఎంతో దోహదపడుతుందని ఫోరం తెలిపింది. -
CM YS Jagan Davos Tour: రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు
సాక్షి, అమరావతి: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశాల్లో రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు పడ్డాయి. అభివృద్ధిని, పర్యావరణ హితాన్ని సమతుల్యం చేసుకుంటూ పారిశ్రామికంగా రాష్ట్రాన్ని శక్తివంతంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం దావోస్ వేదికగా చక్కటి ఫలితాలు సాధించింది. రేపటి ప్రపంచంతో పోటీపడుతూ, సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఈ వేదికను చక్కగా వినియోగించుకుంది. విఖ్యాత సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రంతో అవగాహన కుదుర్చుకున్నారు. 27,700 మెగావాట్ల క్లీన్ గ్రీన్ ఎనర్జీ నాలుగోతరం పారిశ్రామికీకరణకు ప్రధాన కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చాలన్న లక్ష్యంతో గ్రీన్ ఎనర్జీకి సంబంధించి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులపై అదానీ, గ్రీన్కో, అరబిందోలతో ఆంధ్రప్రదేశ్ ఒప్పందం కుదుర్చుకుంది. పంప్డ్ స్టోరేజీ లాంటి వినూత్న విధానాలతో మొత్తంగా 27,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ రాష్ట్రంలోకి రాబోతోంది. గ్రీన్ కోతో కలిసి తాము ప్రపంచంలోనే తొలిసారిగా గ్రీన్ ఎనర్జీపై ఏపీలో పెట్టుబడులు పెడుతున్నట్లు, ఈ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్లు ప్రపంచ ప్రసిద్ధ కంపెనీ ఆర్సిలర్ మిట్టల్ ప్రకటించింది. ముఖ్యమంత్రి.. సంస్థ సీఈఓ ఆదిత్య మిట్టల్ ఈ ప్రకటన చేశారు. ఏపీలో పారిశ్రామిక విధానాలు చాలా సానుకూలంగా ఉన్నాయని ఆయన ప్రశంసించారు. స్టీల్‌తోపాటు, ఎనర్జీ, నిర్మాణ, మైనింగ్, రవాణా, ప్యాకేజింగ్ తదితర రంగాల్లో ఉన్న 76.571 బిలియన్ డాలర్ల ఆర్సిలర్ మిట్టల్ గ్రూపు తొలిసారిగా గ్రీన్ ఎనర్జీకి వేదికగా రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంది. కర్బన రహిత పారిశ్రామికీకరణపై దృష్టి కొత్త తరం ఇంధనాలు హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తులపైనా దావోస్‌లో ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిపెట్టారు. కర్బన రహిత పారిశ్రామికీకరణకు ఏపీ కేంద్రంగా నిలుస్తోందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ కితాబిచ్చారు. గ్రీన్ ఎనర్జీని వినియోగించుకుని పారిశ్రామిక ఉత్పత్తులు దిశగా మచిలీపట్నంలో ఒక ఎస్ఈజెడ్ను తీసుకురానుండడం దావోస్ ఫలితాల్లో ఒకటి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవడంతోపాటు, అత్యాధునిక పద్ధతుల్లో ఉత్పత్తులు సాధించేందుకు వీలుగా ఈ జోన్‌ను అభివృద్ధి చేస్తారు. పారిశ్రామిక రంగానికి డబ్ల్యూఈఎఫ్ సహకారం కాలుష్యాన్ని తగ్గించడం.. పర్యావరణ సమతుల్యతకు, నాణ్యతకు పెద్దపీట వేయడం, గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవడం, టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ ప్రపంచస్థాయి ఉత్పత్తులు సాధించేలా పరిశ్రమలకు తోడుగా నిలవడానికి అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం దావోస్‌లో అడుగులు వేసింది. దీనికి సంబంధించి డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కూడా చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. డబ్ల్యూఈఎఫ్ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది. రాష్ట్రంలోని పారిశ్రామిక రంగానికి అత్యాధునికతను, కాలుష్యంలేని విధానాలను జోడించడానికి డబ్ల్యూఈఎఫ్ తగిన సహకారాన్ని అందిస్తుంది. రాష్ట్రంలోకి కొత్తగా నాలుగు పోర్టులు వస్తున్న దృష్ట్యా పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణపైనా కూడా దావోస్ సభలో సీఎం దృష్టిపెట్టారు. దస్సాల్ట్ సిస్టమ్స్, మిట్సుయి ఓఎస్‌కే లైన్స్‌తోనూ జరిగిన చర్చల్లో ముఖ్యమంత్రి జగన్ ఇవే అంశాలపై దృష్టిపెట్టారు. సముద్ర మార్గం ద్వారా రవాణాను మూడు రెట్లు పెంచే ఉద్దేశ్యంతో ఇదివరకే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. దీనికి సంబంధించిన వివరాలను వీరి ముందు ఉంచింది. తాము త్వరలో కాకినాడలో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు మిట్సుయి ఓఎస్‌కే లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈఓ తకీషి హషిమొటో ప్రకటించారు. సీఎం విజ్ఞప్తి మేరకు, లాజిస్టిక్ రంగాలపైనా దృష్టిపెడుతున్నామన్నారు. ప్రపంచంలోనే ఓడల ద్వారా అత్యధిక మొత్తంలో సరుకు రవాణా చేస్తున్న కంపెనీ ఇది. బైజూస్ పరిశోధన కేంద్రం ఏర్పాటు ఏపీలో విద్యారంగానికి తోడుగా నిలుస్తామని.. పరిశోధక కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని బైజూస్ ప్రకటించింది. పాఠ్యప్రణాళికను ఏపీ విద్యార్థులకు అందిస్తామని సీఎంతో జరిగిన సమావేశంలో సంస్థ సీఈఓ రవీంద్రన్ వెల్లడించారు. సమగ్ర భూ సర్వే రికార్డులను నిక్షిప్తం చేయడంలో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని కాయిన్‌స్విచ్ క్యూబర్ ప్రకటించింది. విశాఖకు ప్రత్యేక గుర్తింపు ఇక రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం, కార్యనిర్వాహక రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసుకున్న విశాఖపట్నానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దావోస్ వేదికగా విశేష కృషిచేశారు. ► హైఎండ్ టెక్నాలజీకి వేదికగా ఈ నగరాన్ని తీర్చిదిద్దుతున్నామని ప్రకటించారు. ఈ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలిసి హైఎండ్ టెక్నాలజీపై పాఠ్యప్రణాళిక రూపకల్పనలో భాగస్వామ్యానికి టెక్ మహీంద్ర అంగీకారం తెలిపింది. కంపెనీ కార్యకలాపాలను విస్తరించడంపైనా చర్చించారు. ► మేజర్ టెక్నాలజీ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దాలని సీఎం సంకల్పంతో ఉన్నారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ప్రధాన కేంద్రంగా ఆయన విశాఖను తీర్చిదిద్దాలనుకుంటున్నారని టెక్ మహీంద్ర సీఈఓ గుర్నాని ముఖ్యమంత్రితో భేటీ అనంతరం వెల్లడించారు. ► ఐబీఎం చైర్మన్, సీఈఓ అరవింద్ కృష్ణతోనూ ఇవే అంశాలను సీఎం జగన్ చర్చించారు. ఐటీ రంగంలో కొత్తగా వస్తున్న ఆవిష్కరణలకు, ఆ అంశాల్లో శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి అంశాలపై వీరితో ప్రధానంగా చర్చలు జరిగాయి. ► అలాగే, యూనికార్న్ స్టార్టప్స్‌కూ వేదికగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దడానికి సీఎం దావోస్ వేదికగా గట్టి ప్రయత్నాలు చేశారు. వివిధ యూనికార్న్ స్టార్టప్స్ వ్యవస్థాపకులు, సీఈఓలతో దావోస్‌లో సీఎం భేటీ అయ్యారు. ► ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి తమవంతు చేయూతనిస్తామని, రవాణా రంగానికి తోడుగా నిలుస్తామని ఈజ్‌మై ట్రిప్ వెల్లడించింది. విశాఖ వేదికగా కార్యకలాపాలపైనా ప్రణాళికలను వారు సీఎంతో పంచుకున్నారు. -
Telangana: హ్యుందాయ్ పెట్టుబడులు రూ.1,400 కోట్లు
సాక్షి, హైదరాబాద్: దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా తెలంగాణ గురువారం మరో భారీ పెట్టుబడి సాధించింది. రాష్ట్రంలో ఏర్పా టుచేస్తున్న మొబిలిటీ క్లస్టర్లో దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ కంపెనీ హ్యూండాయ్ రూ.1,400 కోట్ల పెట్టుబడిని పెడుతున్నట్లు ప్రక టించింది. మాస్టర్‌కార్డ్, జీఎంఎం ఫాడ్లర్, ఈఎం పీఈ తదితర సంస్థలూ రాష్ట్రంలో పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికలపై కీలక ప్రకటనలు చేశాయి. కేటీఆర్‌తో హ్యుందాయ్ ప్రెసిడెంట్ భేటీ హ్యుందాయ్ ప్రెసిడెంట్ యంగ్చో చి గురువారం కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలం గాణలో పెట్టుబడిపై ప్రకటన చేశారు. మొబిలిటీ క్లస్టర్లో పెట్టుబడులకే పరిమితం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ వ్యాలీ లోనూ భాగస్వామిగా ఉండేందుకు సంస్థ అంగీకరించింది. తెలంగాణలో ఏర్పాటు చేసే యూనిట్ ద్వారా టెస్ట్ ట్రాక్‌లతో పాటు ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తుంది. హ్యుందాయ్ రాకతో మొబిలిటీ రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి పౌరసేవలే లక్ష్యంగా.. డిజిటల్ టెక్నాలజీల ద్వారా తెలంగాణ పౌరులకు ప్రపంచ స్థాయి పౌర సేవలు అందించేందుకు అమెరికాకు చెందిన ‘మాస్టర్ కార్డ్’తో రాష్ట్ర ప్రభుత్వం గురువారం పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులతో పాటు ఇతర పౌర సేవా రంగాల్లో ఈ ఒప్పందం కీలకమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పౌర సేవలు, చిన్న తరహా వ్యాపార, వాణిజ్య సంస్థల కార్యకలాపాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను తమ ఎంవోయూ వేగవంతం చేస్తుందని మాస్టర్ కార్డ్ వైస్ చైర్మన్ మైఖేల్ ఫ్రొమన్ వెల్లడించారు. ఈఎంపీఈ డయోగ్నొస్టిక్స్ యూనిట్ క్షయ వ్యాధి డయోగ్నొస్టిక్ కిట్ల అంతర్జాతీయ తయారీ యూనిట్‌ను హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్నట్లు స్వీడన్‌కు చెందిన ‘ఈఎంపీఈ డయోగ్నొస్టిక్స్’ ప్రకటించింది. రూ.25 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ యూనిట్లో నెలకు 20 లక్షల కిట్లను తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తారు. తర్వాతి దశలో రూ.50 కోట్ల పెట్టుబడి పెడతామని సంస్థ వ్యవస్థాపకులు, సీఈఓ పవన్ అసలాపురం చెప్పారు. హైదరాబాద్‌లో జీఎంఎం ఫాడ్లర్ విస్తరణ ఫార్మా కంపెనీలకు అవసరమైన గ్లాస్ రియాక్టర్, ట్యాంక్, కాలమ్‌లను తయారు చేసే జీఎంఎం ఫాడ్లర్ హైదరాబాద్‌లో తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. సంస్థ ఇంటర్నేషనల్ బిజినెస్ సీఈఓ థామస్ కెహ్ల్, డబ్ల్యూఈఎఫ్ డైరెక్టర్ అశోక్ జె పటేల్ గురువారం కేటీఆర్‌తో భేటీ అయ్యారు. రెండేళ్ల క్రితం రూ.48 కోట్లకు పైగా పెట్టుబడితో తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన జీఎంఎం ఫాడ్లర్ అదనంగా మరో రూ.28 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు ఈ సందర్భంగా వారు ప్రకటించారు. ఈ పెట్టుబడి ద్వారా సంస్థలో ఉద్యోగుల సంఖ్య 300కు చేరుకుంటుంది. కాగా హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టులోనూ భాగస్వామిగా ఉండేందుకు సంస్థ ఆసక్తి చూపింది. -
దావోస్ పర్యటనలో నాలుగో రోజు సీఎం జగన్ (ఫొటోలు)
-
అంతర్జాతీయ పర్యాటక సూచిలో...భారత్ డౌన్
దావోస్: ప్రపంచ దేశాలకు ప్రయాణాలు, అంతర్జాతీయ పర్యాటక అభివృద్ధి సూచీలో భారత్ 54వ స్థానంలో నిలిచింది. 2019లో 46 స్థానాన్ని దక్కించుకున్న మన దేశం ఎనిమిది స్థానాలు తగ్గిపోయి 54వ స్థానానికి పడిపోయింది. అయినప్పటికీ దక్షిణాసియాలో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. పర్యాటక రంగంలో ప్రపంచ దేశాల్లో జపాన్ మొదటి స్థానంలో నిలిస్తే, ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, యూకే, సింగపూర్, ఇటలీలు నిలిచాయి. ప్రయాణాలు, పర్యాటకం అనే అంశంలో రెండేళ్లకు ఒకసారి అధ్యయనం చేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నివేదిక విడుదల చేస్తూ ఉంటుంది. గత రెండేళ్లు కరోనాతో విలవిలలాడిపోయిన ప్రపంచ దేశాల్లో ఇప్పుడిప్పుడే పర్యాటక రంగం గాడిన పడుతోందని, అయినా ఇంకా ఎన్నో సవాళ్లు మిగిలే ఉన్నాయని ఆ నివేదిక వెల్లడించింది. మొత్తం 117 దేశాల్లో పర్యాటక రంగ పురోగతిని సమీక్షించి ఈ నివేదిక రూపొందించారు. అమెరికా మినహా టాప్–10 జాబితాలో నిలిచినవన్నీ యూరప్, ఆసియా ఫసిఫిక్ ప్రాంతానికి దేశాలే కావడం గమనార్హం. కరోనా సంక్షోభానికి ముందున్న పరిస్థితులు ఇంకా రానప్పటికీ అన్ని దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరడం వల్ల ప్రజలు ధైర్యంగా ప్రయాణాలు చేయగలుగుతున్నారని, ప్రకృతి అందాలున్న దేశాల్లో పర్యటకానికి అధిక డిమాండ్ ఏర్పడిందని ఈ నివేదిక పేర్కొంది. -
దావోస్ పర్యటనలో మూడోరోజు సీఎం జగన్ (ఫొటోలు)
-
దావోస్ WEF సదస్సులో ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పీచ్
-
వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ఏమిటి..?
-
నా సోదరుడితో గొప్ప సమావేశం జరిగింది: సీఎం జగన్‌తో కేటీఆర్
హైదరాబాద్: విదేశీ గడ్డపై అరుదైన కలయిక జరిగింది. దావోస్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. నా సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్‌గారితో గొప్ప సమావేశం జరిగింది అంటూ మంత్రి కేటీఆర్ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. వీళ్లిద్దరూ ఎంతసేపు భేటీ అయ్యారు, ఏయే అంశాలపై చర్చించారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ వరుసగా సమావేశం అవుతున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. ఇంకోవైపు మంత్రి కేటీఆర్ కూడా తెలంగాణ పెట్టుబడుల ఆహ్వాన విషయంలో దూసుకుపోతున్నారు. Had a great meeting with my brother AP CM @ysjagan Garu pic.twitter.com/I32iSJj05k — KTR (@KTRTRS) May 23, 2022 -
30 గంటలకు ఒక కొత్త బిలియనీర్
దావోస్: కరోనా వైరస్ మహమ్మారి వెలుగు చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అసమానతలు పెరిగిపోయినట్టు ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ తెలిపింది. కరోనా కాలంలో ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్ (బిలియన్ డాలర్లు అంతకుమించి సంపద కలిగినవారు) కొత్తగా పుట్టుకువచ్చినట్టు చెప్పింది. ఈ ఏడాది ప్రతి 33 గంటలకు సుమారు పది లక్షల మంది తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని ఈ సంస్థ అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం సందర్భంగా దావోస్‌లో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికకు ‘ప్రాఫిటింగ్ ఫ్రమ్ పెయిన్’ (బాధ నుంచి లాభం/కరోనా కాలంలో పేదల కష్టాల నుంచి లాభాలు పొందడం) అని పేరు పెట్టింది. పెరిగిన ధరలతో బిలియనీర్లకు పంట దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో నిత్యావసరాల ధరలు పెరిగిపోయినట్టు తెలిపింది. దీంతో ఆహారం, ఇంధన రంగాల్లోని బిలియనీర్లు తమ సంపదను ప్రతి రెండు రోజులకు బిలియన్ డాలర్లు (రూ.7,700 కోట్లు) చొప్పున పెంచుకున్నట్టు వివరించింది. 573 మంది కొత్త బిలియనీర్లు కరోనా విపత్తు సమయంలో (రెండేళ్ల కాలంలో) కొత్తగా 573 మంది బిలీయనీర్లు పుట్టుకొచ్చినట్టు ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించింది. దీన్ని ప్రతి 30 గంటలకు ఒక బిలీయనీర్ ఏర్పడినట్టు తెలిపింది. 26 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి ఈ ఏడాది 26.3 కోట్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని అంచనా వేస్తున్నట్టు ఆక్స్‌ఫామ్ ప్రకటించింది. ప్రతి 33 గంటలకు పది లక్షల మంది పేదరికంలోకి వెళ్తారని వివరించింది. 23 ఏళ్ల కంటే రెండేళ్లలో ఎక్కువ కరోనాకు ముందు 23 ఏళ్లలో ఏర్పడిన సంపద కంటే కరోనా వచ్చిన రెండేళ్లలో బిలియనీర్ల సంపద ఎక్కువ పెరిగినట్టు ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. ‘‘ఇప్పుడు ప్రపంచంలోని బిలియనీర్ల సంపద విలువ ప్రపంచ జీడీపీలో 13.9 శాతానికి సమానం. 2000లో ప్రపంచ జీడీపీలో బిలియనీర్ల సంపద 4.4 శాతమే’’అంటూ ప్రపంచంలోని అసమానతలను ఆక్స్‌ఫామ్ తన నివేదికలో ఎత్తి చూపింది. ‘‘కార్మికులు తక్కువ వేతనానికే, దారుణమైన పరిస్థితుల మధ్య ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. అధిక సంపద పరులు వ్యవస్థను దశాబ్దాలుగా రిగ్గింగ్ చేశారు. వారు ఇప్పుడు ఆ ఫలాలను పొందుతున్నారు. ప్రైవేటీకరణ, గుత్తాధిపత్యం తదితర విధానాల మద్దతుతో ప్రపంచ సంపదలో షాక్‌కు గురిచేసే మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు’’అని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఈడీ గ్యాబ్రియెల్ బుచెర్ అన్నారు. ఆకలి కేకలు.. ‘‘మరోవైపు లక్షలాది మంది పస్తులు ఉండాల్సిన పరిస్థితి. మనుగడ కోసం వారు తదుపరి ఏం చేస్తారన్నది చూడాలి. తూర్పు ఆఫ్రికా వ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఒక వ్యక్తి ఆకలితో చనిపోతున్నారు. ఈ స్థాయి అసమానతలు మానవత్వంతో మనుషులు కలిసి ఉండడాన్ని విచ్ఛిన్నం చేస్తోంది. ఈ ప్రమాదకరమైన అసమానతలను అంతం చేయాలి’’అని బుచెర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఐదు అతిపెద్ద ఇంధన సంస్థలైన బీపీ, షెల్, టోటల్ ఎనర్జీ, ఎక్సాన్, చెవ్రాన్ కలసి ప్రతి సెకనుకు 2,600 డాలర్ల లాభాన్ని పొందాయని ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. రికార్డు స్థాయి ఆహార ధరలతో శ్రీలంక నుంచి సూడాన్ వరకు సామాజికంగా అశాంతిని చూస్తున్నాయని.. 60% తక్కువ ఆదాయం కలిగిన దేశాలు రుణ సంక్షోభంలో ఉన్నాయని తెలిపింది. సంపన్నుల ఐశ్వర్యం ‘‘2,668 బిలియనీర్ల వద్ద 12.7 లక్షల కోట్ల డాలర్ల సంపద ఉంది. ప్రపంచంలో అట్టడుగున ఉన్న 301 కోట్ల ప్రజల (40 శాతం) ఉమ్మడి సంపద కంటే టాప్ 10 ప్రపంచ బిలియనీర్ల వద్దే ఎక్కువ ఉంది. సమాజంలో దిగువ స్థాయిలో ఉన్న వ్యక్తి 112 ఏళ్లు కష్టపడితే కానీ.. అగ్రస్థానంలో ఒక వ్యక్తి ఏడాది సంపాదనకు సరిపడా సమకూర్చుకోలేని పరిస్థితి నెలకొంది’’అని ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాలు ఈ నెల 22న దావోస్‌లో ప్రారంభం కాగా, 26న ముగియనున్నాయి. -
దావోస్‌లో ఏపీ ధగధగ
సాక్షి, అమరావతి: దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా రెండో రోజైన సోమవారం పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. విద్యారంగంలో ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్ట్వేర్ సంస్థ దస్సాల్ట్ సిస్టమ్స్ ప్రకటించింది. విశాఖను హైఎండ్ టెక్నాలజీ హబ్‌గా మార్చేలా సహకారం అందించేందుకు టెక్ మహీంద్రా ముందుకొచ్చింది. జపాన్‌కు చెందిన ప్రముఖ లాజిస్టిక్ కంపెనీ మిట్సుయి కాకినాడలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు సంసిద్ధత తెలిపింది. స్విస్ పార్లమెంటు ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హై ఎండ్ టెక్నాలజీ హబ్‌గా విశాఖ విశాఖను హైఎండ్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలో భాగస్వామి కానున్నట్లు టెక్ మహీంద్రా ప్రకటించింది. దావోస్‌లోని ఏపీ పెవిలియన్‌లో టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమై నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులు లాంటి అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ యూనివర్సిటీతోపాటు 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, 175 స్కిల్ హబ్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరిస్తూ వీటిని ఐటీ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించాలని కోరారు. విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేలా ఇంటర్న్‌షిప్, అప్రెంటిషిప్ కార్యకలాపాల్లో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై గుర్నానీ స్పందిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీ లాంటి అత్యాధునిక పరిజ్ఞానంలో ఆంధ్రప్రదేశ్‌తో కలసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. యువత నైపుణ్యాలకు పదును పెట్టేందుకు హైఎండ్ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో యూనివర్సిటీతో కలసి ప్రత్యేకంగా పాఠ్యప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించారు. దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్‌తో ముఖ్యమంత్రి రూ.250 కోట్లతో అసాగో ఇథనాల్ ప్లాంట్ మహీంద్రా గ్రూపు అనుబంధ కంపెనీ అసాగో ఇండస్ట్రీస్ రాష్ట్రంలో రూ.250 కోట్లతో ఇథనాల్ తయారీ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనను సీఎం దృష్టికి తెచ్చింది. ఇథనాల్ యూనిట్ ఏర్పాటుకు అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. విద్యారంగంలో ‘దస్సాల్’ పెట్టుబడులు విద్య, నైపుణ్యాభివృద్ధి లాంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్ట్వేర్ సంస్థ దస్సాల్ట్ సిస్టమ్స్ ప్రకటించింది. దావోస్‌లో దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో పాటు పోర్టులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా సహకారం అందించాలని సీఎం కోరారు. టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానితో సమావేశమైన సీఎం వైఎస్ జగన్ ఏపీలో నైపుణ్యాభివృద్ధి అవకాశాలను మెరుగుపరచడంపై ప్రధానంగా చర్చించినట్లు అనంతరం ఫ్లోరెన్స్ వెర్జలెన్ తెలిపారు. ఏపీతో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నామని, విద్యారంగంలో పెట్టుబడులు పెట్టడానికి దస్సాల్ సిస్టమ్స్ ఆసక్తిగా ఉన్నట్లు ఆమె ప్రకటించారు. కొత్త తరహా ఇంధనాలపై కూడా చర్చించామని, త్వరలోనే రాష్ట్రంలో పర్యటించనున్నట్లు ఫ్లోరెన్స్ తెలిపారు. కాకినాడకు జపాన్ లాజిస్టిక్ దిగ్గజం సుదీర్ఘ తీర ప్రాంతం కలిగి ఉండటంతో పాటు ఏపీలో కొత్తగా నిర్మించే నాలుగు పోర్టుల ద్వారా లభించే లాజిస్టిక్ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై జపాన్‌కు చెందిన లాజిస్టిక్ కంపెనీ మిట్సుయి ఓ ఎస్కే లైన్స్ ఆసక్తి వ్యక్తం చేసింది. మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈవో తకీషి హషిమొటోతో సీఎం జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 4 గ్రీన్‌ఫీల్డ్ పోర్టులతో సరుకు రవాణాను ఏటా 507 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, దీనికి సంబంధించి కంటైనర్ హబ్, లాజిస్టిక్ రంగాలపై దృష్టి సారించాలని సీఎం కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హషిమొటో కాకినాడలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈవో తకీషి హషిమొటోతో సీఎం జగన్ ఈవీ వాహనాలపై ‘హీరో’తో చర్చలు రాష్ట్రంలో వ్యాపార విస్తరణ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ అంశాలపై హీరో గ్రూపు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజల్‌తో సీఎం జగన్ చర్చించారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన హీరో గ్రూపు అథెర్ ఎనర్జీలో ఇప్పటికే 36 శాతం వాటాను కొనుగోలు చేయడమే కాకుండా తైవాన్‌కు చెందిన బ్యాటరీ టెక్నాలజీ గగొరోలో భాగస్వామిగా చేరింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, హీరో గ్రూప్ విస్తరణ అవకాశాలపై చర్చలు జరిగాయి. సీఎం జగన్‌తో స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి సంజయ్ భట్టాచార్య తదితరులు విశాఖ– చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్లో భాగంగా పరిశ్రమలకు నీటి వనరులను సమకూర్చడంలో భాగంగా తిరుపతి సమీపంలో ఉన్న హీరో కంపెనీకి కండలేరు నుంచి నీటిని ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. అంతకుముందు భారత సంతతికి చెందిన స్విస్ ఎంపీ నిక్లాజ్ శామ్యూల్ గుగెర్‌తో కూడిన స్విస్ పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో సీఎం జగన్ సమావేశమై ఏపీలో వ్యాపార అవకాశాలపై చర్చించారు. భారత రాయబారి సంజయ్ భట్టాచార్య కూడా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమయ్యారు. -
Davos: ఆర్థిక విచ్ఛిన్నంతో విపరిణామాలు
దావోస్: ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంతో మరింత విపరిణామాలు చూడాల్సి వస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఆర్థికవేత్తలు హెచ్చరించారు. డబ్ల్యూఈఎఫ్ వేదికగా వీరు నివేదికను విడుదల చేశారు. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలు ఎక్కువగా ఉండడం, యూరోప్, లాటిన్ అమెరికాలో వాస్తవ వేతనాలు తగ్గిపోవడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. ఇటీవలి కాలంలో ప్రపంచం అతిపెద్ద ఆహార సంక్షోభాన్ని (భద్రతలేమి) ఎదుర్కొంటోందని, ముఖ్యంగా ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలో ఈ పరిస్థితులు నెలకొన్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక కార్యకలాపాల వేగం తగ్గడం, అధిక ద్రవ్యోల్బణం, తక్కువ వేతనాలు, అతిపెద్ద ఆహార అభద్రత అన్నవి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ విచ్చిన్నం కారణంగా తలెత్తే విపరిణామాలని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీకి సంబంధించి గత అంచనాలను తగ్గించేసింది. అమెరికా, చైనా, లాటిన్ అమెరికా, దక్షిణాసియా, పసిఫిక్, తూర్పు ఆసియా, మధ్యప్రాచర్యం, ఉత్తర ఆఫ్రికాలో మోస్తరు ఆర్థిక వృద్ధి ఉండొచ్చని పేర్కొంది. -
దావోస్ పర్యటనలో రెండోరోజు సీఎం జగన్ (ఫొటోలు)
-
వరల్డ్ ఎకనామిక్ ఫోరం: ప్రముఖులతో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకి హాజరయ్యారు. ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు సీఎం జగన్‌తో పాటు మంత్రులు దావోస్ సదస్సుకు వెళ్లారు. అందులో భాగంగా సమావేశం తొలిరోజు సీఎం జగన్.. డబ్ల్యూఈఎఫ్(WEF) హెల్త్ విభాగాధిపతి శ్యాం బిషేన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. ఆయనతో ఆరోగ్య రంగంపై చర్చించారు. అనంతరం, డబ్ల్యూఈఎఫ్ మొబిలిటీ, సస్టైనబిలిటీ విభాగాధిపతి పెట్రో గొమేజ్‌తో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో డబ్ల్యూఈఎఫ్‌లో ప్లాట్‌ఫాం పార్టనర్‌షిప్‌పై ఒప్పందం చేసుకున్నారు. సదస్సులో భాగంగానే బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ హాన్స్ పాల్ బక్నర్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా.. సీఎం జగన్‌ను మహారాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ఆదిత్య ఠాక్రే మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం, సీఎం జగన్‌తో అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతం అదానీ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్‌తో సమావేశమయ్యారు. అదే సమయంలో దావోస్‌లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌ని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం జ్యోతిప్రజ్వాలన చేశారు. ఏపి పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఇది కూడా చదవండి: వరల్డ్ ఎకనామిక్ ఫోరం: ఏపీ పెవిలియన్ ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దావోస్ పర్యటనలో తొలిరోజు సీఎం జగన్ (ఫొటోలు)
-
6 అంశాల్లో సహకారంపై WEF - రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం
-
డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్‌తో సమావేశమైన సీఎం జగన్
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకి హాజరైన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్‌తో సమావేశమయ్యారు. ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు సీఎం జగన్‌తో పాటు మంత్రులు దావోస్ సదస్సుకు వెళ్లారు. 2022 మే 22 నుంచి 26 వరకు ఈ సదస్సు జరగనుంది. అందులో భాగంగా సమావేశం తొలిరోజు డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్‌తో సీఎం జగన్ చర్చలు జరిపారు. పారిశ్రామిక రంగానికి ఏపీలో ఉన్న సానుకూల అంశాలను సవివరంగా సీఎం జగన్ తెలిపారు. ఏపీ పెవిలియన్ ప్రారంభం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా దావోస్‌లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌ని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం జ్యోతిప్రజ్వాలన చేశారు. ఏపి పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఆ తర్వాత సీఎం జగన్ నేతృత్వంలో మంత్రులు, ఎంపీలు సమావేశాలకు బయల్దేరి వెళ్లారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి👉దావోస్‌లో సీఎం జగన్‌కు ఘన స్వాగతం -
దావోస్ పర్యటనకు సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(శుక్రవారం) దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఈనెల 22వ తేదీ నుంచి జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో సీఎం జగన్ పాల్గొననున్నారు. రెండేళ్ల కోవిడ్ విపత్తు తర్వాత వరల్డ్‌ఎకనామిక్ ఫోరం సదస్సు ప్రత్యక్షంగా సమావేశం కానుంది. మే 22నుంచి 26వరకూ జరగనున్న ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు మంత్రులు, అధికారుల బృందం పాల్గొనున్నారు. కోవిడ్ లాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని దావోస్ వేదికగా వినిపించనుంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లకు పరిష్కారం కోసం ఈవేదిక ద్వారా ఏపీ భాగస్వామ్యం కానుంది. నాలుగో పారిశ్రామిక విప్లవం (ఇండస్ట్రియలైజేషన్ 4.0)దిశగా వేయాల్సిన అడుగులపై దావోస్ వేదికగా సీఎం జగన్ కీలక చర్చలు కూడా జరపనున్నారు. ఇందులో భాగంగా పెట్టుబడులకు ఉన్న అవకాశాలనుకూడా ఈ సదస్సులో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఇది కూడా చదవండి: ఏపీలో వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభం -
లండన్‌కు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రత్యేకతలను వివరించడం లక్ష్యంగా దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం (ప్రపంచ ఆర్థిక వేదిక) సదస్సులో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ మంగళవారం బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట ఐటీ, పరిశ్రమల శాఖ అధికారుల బృందం వెళ్లింది. బుధవారం ఉదయం లండన్‌కు కేటీఆర్ చేరుకోనున్నారు. 4 రోజులు అక్కడే ఉంటారు. ఈ నెల 18 నుంచి 21 వరకు యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్, తెలంగాణ ప్రభు త్వం భాగస్వామ్యంతో జరిగే వరుస సమావేశాల్లో పాల్గొంటారు. ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమోటివ్ పరిశ్రమల దిగ్గజ సంస్థలతో భేటీ అవుతారు. ప్రముఖ కంపెనీల సీఈవోలతో భేటీ ఆ తర్వాత వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనేందుకు కేటీఆర్ బయలుదేరి వెళ్తారు. ఈ నెల 22 నుంచి 26 వరకు సదస్సులో పాల్గొంటారు. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రముఖ కంపెనీల సీఈవోలు, యాజమాన్యాలతో భేటీ అవుతారు. సీఈవో స్థాయి సమావేశాలు, చర్చాగోష్టులు, ప్రాజెక్టులు, వర్క్ షాప్‌ల్లో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన 35 మంది ప్రముఖులతో వ్యక్తిగతంగా భేటీ అవుతారు. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా సమావేశాలు ఉంటాయని ఆయన వెంట వెళ్లిన అధికారులు తెలిపారు. భారత్ నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 2వేల మంది ప్రతినిధులు దావోస్ సదస్సులో పాల్గొనను న్నారు. సదస్సు తర్వాత ఈ నెల 27న కేటీఆర్ రాష్ట్రానికి చేరుకుంటారు. -
దావోస్ సదస్సుకు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు హాజరవుతారు. ఈ నెల 22 నుంచి 26 వరకు సదస్సు జరగనుండగా, కేటీఆర్ ఈ నెల 17న బయల్దేరి వెళ్తారు. సదస్సు ముగిసిన తర్వాత ఈ నెల 27న తిరిగి హైదరాబాద్‌కు కేటీఆర్ చేరుకుంటారు. ఈ ఏడాది జనవరిలోనే సదస్సు జరగాల్సి ఉన్నా కోవిడ్ మూలంగా వాయిదా పడింది. -
డబ్ల్యూఈఎఫ్ వార్షిక సదస్సుకు వైఎస్ జగన్!
న్యూఢిల్లీ/దావోస్: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌వార్షిక సదస్సు మే 22 నుంచి 26 దాకా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగనుంది. పలు దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు హాజరవుతారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పలువురు సీనియర్ కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్, కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే తదితరులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
రేట్లు రయ్ రయ్..దేశంలో కనుమరుగు కానున్న శిలాజ ఇంధనాల వినియోగం!
న్యూఢిల్లీ: పెరుగుతున్న ఇంధన ధరల వల్ల తమ వ్యయ శక్తి గణనీయంగా పడిపోతోందని ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ వినియోగదారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాంప్రదాయ (శిలాజ) ఇంధన వనరుల వినియోగం నుంచి తమ దేశాలు వేగంగా వైదొలగడమే మంచిదని కోరుకుంటున్నారు. ఈ మేరకు డిమాండ్ చేస్తున్న ప్రధాన దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్–ఇప్సోస్ మొత్తం 30 దేశాల్లో 22,534 మంది అభిప్రాయాలను స్వీకరించి ఈ నివేదిక విడుదల చేసింది. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4 మధ్య జరిగిన సర్వేలో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ప్రతి పది మందిలో సగటున ఎనిమిది మంది వచ్చే ఐదేళ్లలో తమ దేశం శిలాజ ఇంధనాలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు. భారత్ దేశానికి సంబంధించి సర్వేలో పాల్గొన్న వారి విషయంలో ఈ నిష్పత్తి దాదాపు 90 శాతం కంటే ఎక్కువగా ఉంది. ► 84 శాతం మంది తమ స్వంత దేశం స్థిరమైన ఇంధన వనరులకు మారాలని సూచించారు. ► ధరల పెరుగుదలకు తమ ప్రభుత్వాల వాతావరణ విధానాలే కారణమని 13 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► రోజువారీ ఖర్చుల్లో ఏ విభాగం కొనుగోలు శక్తిని భారీగా దెబ్బతీస్తోందన్న అంశంపై సర్వే దృష్టి సారించింది. ఇంధనం, రవాణా, ఎయిర్ కండీషనింగ్, వంట, విద్యుత్ ఉపకరణాల వినియోగం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. సగటున 30 దేశాలలో సగానికి పైగా వినియోగదారులు (55 శాతం) ఇంధన ధరల పెరుగుదల వల్లే తమ కొనుగోలు శక్తి గణనీయంగా ప్రభావితమవుతోందని తెలిపారు. అయితే దేశాల వారీగా ఈ శాతం విభిన్నంగా ఉంది. దక్షిణాఫ్రికా విషయంలో ఈ రేటు 77 శాతం ఉంటే, జపాన్, టర్కీ విషయంలో 69 శాతంగా ఉంది. స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్‌లో ఈ శాతం తక్కువ స్థాయి లో 37 శాతంగా ఉంది. భారత్‌కు సంబంధించి 63 శాతంగా నమోదయ్యింది. భారత్ రెస్పాండెంట్లలో 63 శాతం మంది తాము ఇంధన ధరల పెరుగుదలతో ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. ► ఇంధన ధరల పెరుగుదలకు కారణాలు కూడా విభిన్నంగా ఉండడం గమనార్హం. ► చమురు, గ్యాస్ మార్కెట్లలో అస్థిరత దీనికి కారణమని 28 శాతం మంది అభిప్రాయపడితే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణాన్ని 25 శాతం మంది పేర్కొన్నారు. మరో 18 శాతం మంది పెరిగిన డిమాండ్, సరఫరాల సమస్య కారణమని పేర్కొన్నారు. 16 శాతం మంది తమకు ఖచ్చితంగా తెలియదని చెప్పారు. 13 శాతం మంది మాత్రమే తమ ప్రభుత్వాల వాతావరణ మార్పు విధానాలను నిందించారు. దేశాల వారీగా సర్వేలో పాల్గొన్న వారిలో ఈ శాతాన్ని పరిశీలిస్తే భారత్ 24 శాతంలో ఉండగా, జర్మనీ, పోలాండ్లలో వరుసగా 20 శాతం, 19 శాతాలుగా నమోదయ్యాయి. ► ప్రభుత్వాలు అనుసరిస్తున్న వాతావరణ విధానాలే ఇంధన ధరల పెరుగుదలకు కారణమని ఏ దేశంలోనూ మెజారీటీ రెస్పాండెంట్లు పేర్కొనలేదు. భారత దేశంలో సర్వేలో పాల్గొన్నవారు ఇంధన ధరల పెరుగుదలకు ప్రధాన కారణం చమురు, గ్యాస్ మార్కెట్ అస్థిరత, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లేనని అభిప్రాయపడ్డారు. తరు వాతి స్థానంలో సరఫరాలు తగినంతగా లేకపోవడం, ప్రభుత్వాలు అనుసరిస్తునన వాతావరణ మార్పు విధానాలు దీనికి కారణంగా ఉన్నాయి. ► రాబోయే ఐదేళ్లలో శిలాజ ఇంధనాల నుండి మరింత వాతావరణ అనుకూలమైన–స్థిరమైన ఇంధన వనరులకు దేశాలు మారడం ఎంత ముఖ్యమన్న విషయంపై ప్రధాన ప్రశ్నను సంధించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సర్వే లో పాల్గొన్న వారిలో 84 శాతం మంది (సగటున ఐదుగురిలో నలుగురి కంటే ఎక్కువ మంది) ఇది తమకు ఎంతో కీలకమని చెప్పారు. ఈ విషయంలో రష్యాలో అతి తక్కువగా 72 శాతంతో ఉంది. అమెరికాలో ఈ రేటు 75 శాతం ఉండగా, భారత్ విషయంలో 89 శాతం. దక్షిణాఫ్రికా, పెరూలో 93 శాతం మంది దీనికి అనుకూలంగా వోటు వేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలు ప్రధానంగా ఈ డిమాండ్ చేస్తున్నారు. ► శిలాజ ఇంధనాల నుంచి దూరంగా జరగాలని భావిస్తున్న వారిలో పురుషుల కంటే (81%) మహిళలు (87%) అధికంగా ఉన్నారు. -
మేకపాటి మృతి పట్ల వరల్డ్ ఎకనామిక్ ఫోరం దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాలమరణం పట్ల వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో పా టు పలు విదేశీ సంస్థలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ మధ్యనే ఢిల్లీలో మేకపాటితో కలిసి చర్చలు జరిపామని, ఇంతలోనే ఇటువంటి వార్త దిగ్భాంత్రికి గురిచేసిందంటూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం తన సంతాప సందేశంలో పేర్కొంది. వారం రోజుల క్రితమే రాష్ట్రంలో పెట్టుబడుల గురించి ఆయన సమక్షంలో ఒప్పందం చేసుకున్నామని, ఆయన మరణించినా రాష్ట్రంలో పెట్టుబడుల సంబంధాన్ని కొనసాగించడం ద్వారా ఆయ న ఆత్మకు శాంతిని చేకూరుస్తామని రీజెన్సీ గ్రూపు చైర్మన్ ఎస్బీ హాము హజీ పేర్కొన్నారు. చదవండి: (ఏపీ కేబినెట్ భేటీ మార్చి 7కి వాయిదా) దుబాయ్ పర్యటనలో మంత్రిగా మేకపాటి నిబద్ధత, నిరాడంబరత మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుందని, వారం రోజు ల్లోనే ఇలాంటి వార్త హృదయాలను కలచివేసిందని షరాఫ్ గ్రూపు వైస్ చైర్మన్ షరాబుద్ధీన్ షరాఫ్ పేర్కొన్నారు. జీ42 గ్రూపు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా దుబాయ్ చాప్టర్ మేకపాటి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశాయి. -
భారత్ నుంచి రికార్డు స్థాయిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు..: మోదీ
న్యూఢిల్లీ: వచ్చే పాతికేళ్లలో స్వచ్ఛమైన, పర్యావరణ హితమైన, స్థిరమైన వృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పనపై శ్రద్ధ పెడుతున్నామని, అందువల్ల భారత్‌లో పెట్టుబడులకు ఇదే మంచి తరుణమని ప్రధాని నరేంద్ర మోదీ ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు. ప్రపంచ వాణిజ్య సంస్థ దావోస్ అజెండా 2022 సదస్సునుద్దేశించి ‘ప్రపంచ స్థితిగతులు (స్టేట్ ఆఫ్ ద వరల్డ్)’ అనే అంశంపై ఆయన సోమవారం ప్రసంగించారు. ఆర్థిక సంస్కరణలు, వ్యాపారనుకూల వాతావరణ రూపకల్పనకు భారత్ కట్టుబడి ఉందన్నారు. వ్యాపారంలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం పలు సంస్కరణలు తెచ్చిందన్నారు. ఇందులో భాగంగా అనేక రంగాల్లో నిబంధనల సడలింపు, వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు మార్గం సుగమం చేయడం వంటివి చేపట్టామన్నారు. ఒకప్పుడు భారత్‌లో లైసెన్స్ రాజ్ నడిచేదని, కానీ తాము కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించి వ్యాపారానికి ఉత్తేజాన్నిచ్చామని అన్నారు. పప్రంచం ఎదుర్కొంటున్న క్రిప్టో కరెన్సీ లాంటి నూతన సవాళ్లకు అన్ని దేశాలు కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ద్రవ్యోల్బణం, వాతావరణ మార్పు, సరఫరా వ్యవస్థల్లో (సప్లై ఛైన్స్) ఆటంకాల్లాంటివి ఆర్థికవ్యవస్థలకు సమస్యలుగా అభివర్ణించారు. నవ భారత్ రికార్డులు ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ భారత్‌లో ఉందని, ఒక్క డిసెంబర్లోనే భారత్‌లో యూపీఐ ద్వారా 440 కోట్ల లావాదేవీలు జరిగాయని, భారత్ ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఫార్మా ఉత్పత్తిదారని మోదీ గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంపై భారత్‌కు ఎనలేని నమ్మకమన్నారు. దేశంలో పలు భాషలు, భిన్నసంస్కృతులున్నా అంతా కలిసి మానవాభివృద్ధికి కృషి చేస్తాయని చెప్పారు. దేశంలో సుమారు 50 లక్షల మంది సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉన్నారని, ప్రపంచంలోని పలుదేశాల్లో భారతీయ నిపుణులు సేవలనందిస్తున్నారని తెలిపారు. భారత్ ప్రపంచంలో మూడో అత్యధిక యూనికార్న్స్ (100 కోట్ల డాలర్ల విలువైన స్టార్టప్ కంపెనీ) ఉన్న దేశమని, గత ఆరునెలల్లోనే 10వేలకు పైగా కొత్త స్టార్టప్స్ రిజిస్టరయ్యాయని మోదీ తెలిపారు. భారత యువత వ్యవస్థాపక స్ఫూర్తితో పాటు సరికొత్త ఆవిష్కరణలు చేయడంలో, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉందన్నారు. -
17 నుంచి డబ్ల్యూఈఎఫ్ వర్చువల్ సదస్సు
న్యూఢిల్లీ: వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ఐదు రోజుల వర్చువల్ సమావేశం 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలిరోజే ప్రధాని నరేంద్రమోదీ సదస్సును ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్ వృద్ధి వంటి అంశాలపై ప్రపంచవ్యాప్త దేశాల నాయకులు ప్రసంగించనున్నారు. సమావేశం డిజిటల్‌గా జరగడం ఇది వరుసగా రెండవసారి. కోవిడ్–19, సాంకేతిక సహకారం, అంతర్జాతాయ సామాజిక సహకారం, వ్యాక్సిన్ విస్తృతి, ఇంధన బదలాయింపు, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ వాణిజ్యంలో విశ్వాసాన్ని పాదుగొల్పడం, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల అవుట్‌లుక్, భవిష్యత్ సవాళ్లకు సంసిద్ధత వంటి అంశాలు ఐదు రోజుల సమావేశ అజెండాలో ప్రధాన అంశాలు కానున్నాయి. భౌతిక సమావేశం వేసవికి వాయిదా... కొత్త సంవత్సరం జనవరి 17 నుంచి 21వ తేదీ వరకూ ఐదు రోజులు జరగాల్సిన దావోస్ 2022 వార్షిక భౌతిక సమావేశాన్ని వేసవి కాలానికి వాయిదా వేస్తున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఇప్పటికే తెలిపింది. స్విట్జర్లాండ్ దావోస్‌లోని స్విస్ ఆల్పైన్ స్కీ రిసార్ట్ లో జరగాల్సిన ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికవేత్తలు, పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలు స్వయంగా పాల్గొనాల్సి ఉంది. వీరితోపాటు పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన ధ్యేయంగా వివిధ దేశాల నాయకులు సమావేశంలో భాగస్వాములు అవుతారు. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభించడానికి ముందు వరల్డ్ ఎకనమిక్ ఫోరం 2020 జనవరిలో దావోస్ సదస్సు నిర్వహించింది. అటు తర్వాత సమావేశం వాయిదా పడ్డం ఇది వరుసగా రెండవసారి. పెట్టుబడులకు సంబంధించి పరస్పర సహకారం కోసం ఉద్దేశించి జెనీవా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సంస్థ– వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ తొలుత 2021 వార్షిక సమావేశాన్ని దావోస్ కాకుండా స్విట్జర్లాండ్‌లోని మరొక ప్రదేశానికి మార్చాలని నిర్ణయించింది. అటు తర్వాత సింగపూర్‌కు మార్చాలని భావించింది. చివరకు దానినీ రద్దు చేసింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలతో 2022 భౌతిక సమావేశం కూడా వాయిదా పడ్డం గమనార్హం. -
ఒక్క నిమిషానికి ఇంటర్నెట్లో జరిగే విధ్వంసం గురించి తెలుసా?
ఇంటర్నెట్ ఒక గ్లోబల్ కంప్యూటర్ నెట్వర్క్. ఈ భూమ్మీద అతిపెద్ద కమ్యూనికేషన్ వ్యవస్థ. యూజర్లకు వివిధ రకాల సమాచారంతో పాటు పరస్పర సంభాషణల కోసం సౌకర్యాలు అందిస్తున్న వేదిక. అలాంటి వేదికపై ఒక్క నిమిషంలో జరిగే విధ్వంసం ఎలా ఉంటుందో తెలుసా? వరల్డ్ ఎకనమిక్ ఫోరం వెబ్సైట్ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. 2021లో వివిధ ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్స్(సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కలిపి)లో ఒక్క నిమిషంలో ఏమేం జరిగిందో వివరించింది. బ్రౌజింగ్, స్ట్రీమింగ్, అప్లోడ్, డౌన్లోడ్.. ఇలా మొత్తం వివరాల ఆధారంగా ఈ డేటాను సేకరించి లోరీ లూయిస్ అనే ఆవిడ.. ఈ వివరాల్ని ఆల్‌యాక్సెస్ వెబ్సైట్లో పొందుపరిచింది. వీటి ఆధారం ఏం తేలిందంటే.. యూట్యూబ్.. 500 గంటల నిడివి ఉన్న కంటెంట్ కేవలం ఒక్క నిమిషంలోనే అప్లోడ్ అయ్యింది. ఇంటర్నెట్లో 197 మిలియన్లకు పైగా ఈమెయిల్స్ పంపించుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్బుక్ మెసేంజర్లలో నిమిషానికి 69 మిలియన్ల మెసేజ్‌లు పంపించుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నిమిషానికి దాదాపు ఏడు లక్షల స్టోరీలు షేర్ అవుతున్నాయి. ప్రొఫెషనల్ సైట్ లింక్డిన్లో సుమారు పదివేల మంది కనెక్ట్ అవుతున్నారు. టిక్‌టాక్ లాంటి వీడియో కంటెంట్ జనరేటింగ్ యాప్‌లో ఐదు వేల డౌన్లోడ్లు చేస్తున్నారు నెట్‌ఫ్లిక్స్‌లో నిమిషానికి 28 వేలకు పైగా సబ్‌స్క్రయిబర్స్ వీక్షణ కొనసాగుతోంది. నోట్: మరికొన్ని అంశాలపై పరిశోధన జరిగినప్పటికీ.. పూర్తి స్థాయి లెక్కలు తేలకపోవడంతో ఈ లిస్ట్‌లో జత చేర్చలేదు. ఆన్లైన్ షాపింగ్, మరికొన్ని ప్లాట్‌ఫామ్‌ల వివరాలు పొందుపర్చలేదు. ఇది కేవలం ఆల్‌యాక్సెస్ డేటా మాత్రమే!. ►ఇంటర్నెట్ ఉపయోగం వల్ల లాభాలు మాత్రమే కాదు.. భూమ్మీదకు కర్బన ఉద్గారాలు విడుదలై వినాశం వైపు అడుగులు కూడా వేస్తోంది. అందుకే ఇంటర్నెట్ యూసేజ్‌ను తగ్గించాలని, పరిమితంగా వాడాలని సూచిస్తున్నారు పర్యావరణ నిపుణులు. ►ఇంటర్నెట్లో డాటాను లెక్కించడం కష్టమే!. ఒక అంచనా ప్రకారం మాత్రం.. ఒకరోజులో 1.145 ట్రిలియన్ ఎంబీ క్రియేట్ అవుతోంది. చదవండి: మళ్లీ అదే అంధకారమా!.. 20 ఏళ్లు వెనక్కి వెళ్లక తప్పదా? -
దావోస్ సదస్సుపై ఒమిక్రాన్ నీడ!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలపై తన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. కొత్త సంవత్సరం జనవరి 17 నుంచి 21వ తేదీ వరకూ ఐదు రోజులు జరగాల్సిన దావోస్ 2022 వార్షిక సమావేశాన్ని వేసవి కాలానికి వాయిదా వేస్తున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సోమవారం తెలిపింది. స్విట్జర్లాండ్ దావోస్‌లోని స్విస్ ఆల్పైన్ స్కీ రిసార్ట్‌లో జరగాల్సిన ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికవేత్తలు,పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలు పాల్గొంటారు. వీరితోపాటు పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన ధ్యేయంగా వివిధ దేశాల నాయకులు సమావేశంలో భాగస్వాములవుతారు. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభించడానికి ముందు వరల్డ్ ఎకనమిక్ ఫోరం 2020 జనవరిలో దావోస్ సదస్సు నిర్వహించింది. అటు తర్వాత సమావేశం వాయిదా పడ్డం ఇది వరుసగా రెండవసారి. పెట్టుబడులకు సంబంధించి పరస్పర సహకారం కోసం ఉద్దేశించి జెనీవా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సంస్థ– వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ తొలుత 2021 వార్షిక సమావేశాన్ని దావోస్ కాకుండా స్విట్జర్లాండ్‌లోని మరొక ప్రదేశానికి మార్చాలని నిర్ణయించింది. అటు తర్వాత సింగపూర్‌కు మార్చాలని భావించింది. చివరకు దానినీ రద్దు చేసింది. కొత్త వేరియంట్ భయాలతో 2022 సమావేశం కూడా వాయిదా పడ్డం గమనార్హం. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, సీఈఓలుసహా దాదాపు 100కిపైగా భారత్ నుంచి 2022 సదస్సులో పాల్గొనడానికి తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. -
ఒమిక్రాన్ పంజా..! మరో కీలక భేటీ వాయిదా...!
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. ఇప్పటికే 89 దేశాలకు ఒమిక్రాన్ వేరియంట్ పాకింది. ఈ కొత్త వేరియంట్ కారణంగా బ్రిటన్, యూరప్ దేశాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయా దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో ఇప్పటికే పలు అంతర్జాతీయ సమావేశాలకు ఆటంకం ఏర్పడింది. ఒమిక్రాన్ వ్యాప్తిపై కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో దావోస్‌లో జరగాల్సిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశం వాయిదా పడింది. ఒమిక్రాన్ కారణంగా ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఫోరమ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 17-21 మధ్య స్విట్జర్లాండ్‌లోని దావోస్-క్లోస్టర్స్‌లో జరగాల్సిన వార్షిక సమావేశం వేసవి ప్రారంభంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు కఠినమైన ఆరోగ్య ప్రోటోకాల్స్ ఉన్నప్పటికీ, ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి రేటు ఎక్కువగా ఉండడంతో సమావేశాలను వాయిదా వేసినట్లు డబ్ల్యూఈఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ప్రొఫెసర్ క్లాస్ స్క్వాబ్ మాట్లాడుతూ...కోవిడ్-19 మహమ్మారిపై ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు సమిష్టిగా పోరాడుతున్నాయని అభిప్రాయపడ్డారు. కాగా ఒమిక్రాన్ అలజడితో జెనీవాలో జరగాల్సిన డబ్య్లూటీవో మినిస్టీరియల్ (ఎంసీ12)య వాయిదా పడిన విషయం తెలిసిందే. చదవండి: 4 Day Work Week: ఇకపై అందరికీ వారానికి నాలుగు రోజులపాటే పని...! కొత్త లేబర్‌కోడ్స్ అమలులోకి వస్తే..! -
సీఎం జగన్‌ను ఆహ్వానించిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్
న్యూఢిల్లీ: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆహ్వానం పంపింది. 2022లో జనవరి 17-21 మధ్య దావోస్‌లో నిర్వహించే సదస్సులో పాల్గొనాలని కోరింది. ఈ మేరకు డబ్ల్యూఈఎఫ్ ప్రతినిధి బోర్జ్ బ్రెండె..మంత్రి గౌతమ్ రెడ్డిని కలిశారు. ఈ సారి ‘వర్కింగ్ టుగెదర్, రీస్టోరింగ్ ట్రస్ట్’ నేపథ్యంలో సమావేశం జరగనున్నట్లు బోర్జ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీ ఆర్థికవృద్ధికి సీఎం తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామిక విధానాన్ని మంత్రి గౌతం రెడ్డి ఆయనకు వివరించారు. కాగా కోవిడ్-19 నియంత్రణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నా చర్యలను బోర్ట్ బ్రెండె ప్రశంసించారు. పారిశ్రామిక విధానం, ఆర్థికాభివృద్ధి, అభివృద్ధి వికేంద్రీకరణ తదితరవిషయాలపై బ్రెండె ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు. చదవండి: ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు -
దావోస్‌కు రండి
సాక్షి, హైదరాబాద్: వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సమావేశానికి రావాలంటూ ఐటీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావుకు మరోమారు ఆహ్వానం అందింది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 21 వరకు దావోస్‌లో జరగనున్న ఈ సమావేశానికి హాజరుకావాలని ఫోరం కోరింది. కోవిడ్–19 సంక్షోభం తర్వాత వినూత్న టెక్నాలజీ, విధానాలతో ఆర్థిక వ్యవస్థ రికవరీ కోసం చేపట్టిన కార్యక్రమాల గురించి తన అనుభవాలను పంచుకోవాలని డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్గ్ బ్రాండె కేటీఆర్‌ను కోరారు. అధునాతన సాంకేతికతను సామాన్యుల ప్రయోజనాలకు వినియోగించుకునే అంశంపైనా తన అభిప్రాయాలను చెప్పాలని కోరారు. ‘ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని నివారించడం కోసం రాజకీయ, వ్యాపారరంగాలతోపాటు పౌర సమాజం కలిసి పనిచేయాల్సి ఉంది. ఆ దిశలో అందరం కృషి చేద్దాం’అని వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిపింది. ప్రగతికి దక్కిన గుర్తింపు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి అందిన ఆహ్వా నం తెలంగాణ వినూత్న విధానాలకు, ప్రగతి ప్రస్థానానికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని మంత్రి కేటీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. డబ్ల్యూఈఎఫ్ ఆహ్వానం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆయన.. ఈ వేదికగా తెలంగాణను మరోమారు ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను ప్రపంచ దిగ్గజాలకు తెలియజేసి, రాష్ట్రానికి రావాలని కోరతానని వెల్లడించారు. తనకు ఆహ్వానం పంపిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు ధన్యవాదాలు తెలిపారు. -
సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: కోవిడ్ సమయంలో ప్రభుత్వ సేవల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రశంసించింది. సంక్షేమ పథకాల అమల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్న తీరును మెచ్చుకోవడమే కాకుండా ఈ అనుభవాన్ని ప్రపంచంతో పంచుకోవాలని కోరింది. ఈ మేరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు బోర్గ్ బ్రండే.. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డికి లేఖ రాశారు. కోవిడ్–19 తర్వాత ప్రజా సేవలు, ఆర్థికాభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ప్రపంచానికి తెలిసొచ్చిందని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్‌లో ‘గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్ సమ్మిట్’ పేరిట జపాన్ రాజధాని టోక్యోలో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సును ప్రత్యక్షంగా లేదా వర్చువల్‌గా నిర్వహించబోతున్నామని, ఇందులో పాల్గొని రాష్ట్రం తన అనుభవాలను పంచుకోవాలని కోరారు. ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రభుత్వాధినేతలతోపాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, వ్యాపార, వాణిజ్య రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. -
ఆక్స్‌ఫాం నివేదిక.. చేదు నిజాలు
ఏటా విడుదలయ్యే నివేదికల్లో ప్రపంచవ్యాప్తంగా వున్న ఆర్థిక అసమానతలనూ, వాటి పర్యవసానంగా ఏర్పడే ఇతరత్రా అంతరాలనూ ఆక్స్‌ఫాం ఏకరువు పెడుతుంది. ఏడాదిగా ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టి పీడిస్తోంది గనుక ఈసారి నివేదిక మరింత గుబులు పుట్టించేదిగా వుంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్లు్యఈఎఫ్) సదస్సు సందర్భంగా ఆక్స్‌ఫాం నివేదికలు విడుదలవుతుంటాయి. ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణలు మామూలు గానే అన్ని దేశాల్లోనూ వ్యత్యాసాలు పెంచాయి. కానీ సంక్షోభం తలెత్తినప్పుడు, విలయం విరుచుకు పడినప్పుడు ఇక చెప్పేదేముంటుంది? కొన్ని నెలలక్రితం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై నివేదిక వెలువరిస్తూ తీవ్రమైన ఒత్తిళ్ల ఫలితంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ తలకిందులు కాబోతున్నాయని, కోట్లాదిమంది పేదరికంలోకి జారుకునే ప్రమాదం వున్న దని హెచ్చరించింది. ఆ నివేదిక వచ్చాక మన దేశంతో సహా అనేక దేశాలు సంక్షోభాన్ని అధిగమిం చటం కోసం ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాయి. అట్టడుగు వర్గాలకు చేయూతనందించే అనేక పథ కాలు రూపొందించాయి. వేరే దేశాల మాటెలావున్నా మన దేశంలో మాత్రం వాటివల్ల పెద్దగా ఫలితం రాలేదని తాజా ఆక్స్‌ఫాం నివేదిక తెలియజెబుతోంది. భారత్‌ను అసమానత అనే వైరస్ పట్టి పీడిస్తున్నదని, పర్యవసానంగా సంపన్నులు మరింత సంపద పోగేసుకోగా, అంతో ఇంతో పొట్ట పోషించుకునేవారు సైతం ఉపాధి కోల్పోయి కొత్తగా దారిద్య్రంలోకి జారుకున్నారని నివేదిక వ్యాఖ్యా నించటం గమనించదగ్గది. కరోనా వైరస్ విజృంభిస్తున్న కాలంలో ఆ వైరస్‌ను కొందరు ‘సోషలిస్టు వైరస్’గా చమత్కరిం చారు. ధనిక, పేద తేడా లేకుండా అందరినీ అది కాటేసిందని, దాని పర్యవసానంగా అందరూ ఒక్క లాగే ఇబ్బందులు పడ్డారని అనుకున్నారు. సంపన్నుల్లోనూ ఆ వ్యాధి వచ్చినవారూ, మరణించిన వారూ వుండొచ్చు. కానీ ఆ వర్గానికి అందుబాటులో వుండే ఆధునిక వైద్య సౌకర్యాలు ఇతరులకు లేవు. అలాగే వారికుండే ఆర్థిక వెసులుబాటు ఇతరులకు వుండదు. ఆర్థిక, సామాజిక వ్యత్యాసాలతో పాటు జెండర్ మొదలుకొని అనేకానేక అంశాల్లో వుండే అసమానతల వల్ల మనలాంటి సమాజాల్లో ఏర్పడే ఏ సంక్షోభాలైనా వాటిని మరింత పెంచుతాయి. అందువల్లే భిన్న రంగాలను శాసిస్తున్న మోతుబరులు లాక్డౌన్ కాలంలో తమ సంపద అపారంగా పెంచుకుంటే సాధారణ పౌరులు మాత్రం బతుకు భయంతో తల్లడిల్లారని ఆక్స్‌ఫాం నివేదిక ఎత్తిచూపుతోంది. మన దేశంలో లాక్డౌన్ సమయంలో భాగ్యవంతుల సంపద 35 శాతం పెరగ్గా లక్షలాదిమంది సాధారణ పౌరులు జీవిక కోల్పోయారని గణాంకాలంటున్నాయి. నిరుడు మార్చి మొదలుకొని ఇంతవరకూ వందమంది శత కోటీశ్వరుల సంపద 12,97,822 కోట్ల మేర పెరగ్గా... ఒక్క ఏప్రిల్ నెలలోనే ప్రతి గంటకూ 1,70,000 మంది చొప్పున సాధారణ పౌరులు ఉపాధి కోల్పోయారని నివేదిక వెల్లడిస్తోంది. అంటే శత కోటీశ్వరులు వున్న సంపదను కాపాడుకోవటమే కాదు... దాన్ని మరిన్ని రెట్లు పెంచుకోలిగారు. కరోనా ప్రమాదం ముంచుకొచ్చాక మన దేశంలో కఠినమైన లాక్డౌన్ అమలైంది. అది ప్రభుత్వాల సంసిద్ధతను పెంచటంతోపాటు, వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తుందని అందరూ ఆశించారు. కానీ ఆ రెండు అంశాల్లోనూ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. ఇటలీవంటిచోట్ల మన మాదిరిగా వలస కార్మికుల సమస్య లేదు గనుక లాక్డౌన్ అక్కడ సమర్థవంతంగా అమలైంది. మన దేశంలో మాత్రం పనిలేక, ఆకలిదప్పులకు తట్టుకోలేక భారీ సంఖ్యలో వలస కార్మికులు స్వస్థలాలకు నడక దారిన తరలివెళ్లటం మొదలుపెట్టారు. వారిని ఎక్కడికక్కడ నిలువరించటానికి పోలీసులు ప్రయత్నించటం, వారి కళ్లుగప్పి గమ్యస్థానాలు చేరడానికి సాధారణ ప్రజానీకం ప్రయత్నించటం కొన్ని నెలలపాటు మన దేశంలో నిత్యం కనబడిన దృశ్యం. దారిపొడవునా ఆ క్రమంలో బలైనవారెందరో! దానికితోడు సరైన పోషకాహారం లభించక, జాగ్రత్తలు పాటించటం సాధ్యంకాక ఎందరో కరోనా బారినపడ్డారు. ఎన్నో రాష్ట్రాల్లో వైరస్ కేసుల సంఖ్య చూస్తుండగానే పెరిగి కలవరపరిచింది. ఆ మహమ్మారి కాటేసిన దేశాల వరసలో అమెరికా తర్వాత మనదే రెండో స్థానం. కోటీ 6 లక్షలమందికిపైగా జనం కరోనా బారిన పడితే 1,53,525 మంది మరణించారు. కానీ ప్రాణాలు నిలబెట్టుకున్నవారి స్థితిగతులు దుర్భరంగా మారాయని ఆక్స్‌ఫాం నివేదిక చాటుతోంది. త్వరలో 2021–22 సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫాం నివేదికలోని అంశాలు పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వపరంగా చేయాల్సివేమిటో ఆలోచించటం అవసరం. లాక్డౌన్ పర్యవసానంగా ఏర్పడ్డ సంక్షోభాన్ని అధిగమించటానికి ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలు ఏమేరకు ప్రభావం కలిగించాయన్నది కూడా సమీక్షించాలి. నిరుడు ఏప్రిల్–నవంబర్ మధ్య కేంద్ర ప్రభుత్వ వ్యయం వాస్తవ గణాంకాల ఆధారంగా లెక్కేస్తే తగ్గిందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. అంతక్రితం సంవత్సరం అదే కాలంతో పోలిస్తే ఈ ఎనిమిది నెలలకాలంలో ప్రభుత్వ వ్యయం 4.7 శాతం పెరిగినట్టు కనబడుతున్నా, 6 శాతంకన్నా ఎక్కువగా వున్న ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నాక ఆ వ్యయం గణనీయంగా తగ్గిన వైనం వెల్లడవుతోంది. విద్య, వైద్యం, ఉపాధి వగైరా రంగాలన్నిటా ఇప్పటికే వున్న వ్యత్యాసాలను కరోనా అనంతర పరిస్థితులు ఎన్ని రెట్లు పెంచాయో ఆక్స్‌ఫాం నివేదిక తేటతెల్లం చేస్తోంది. ఈ రంగాల్లో ప్రభుత్వ వ్యయం అపారంగా పెరిగితే తప్ప... నేరుగా ప్రజానీకం చేతుల్లో డబ్బులుండేలా చర్యలు తీసుకుంటే తప్ప ఈ వ్యత్యాసాలు ఆగవు. సంక్షోభాలకు మూలం ఎక్కడుందో తెలుసుకుని సకాలంలో నివారణ చర్యలు తీసుకున్నప్పుడే సమాజం సజావుగా సాగు తుంది. లేనట్టయితే అది అశాంతిలోకి జారుకుంటుంది. -
కరోనాపై అవగాహనలో టెక్నాలజీదే కీలక పాత్ర
సాక్షి, హైదరాబాద్: కరోనాను కట్టడి చేయడంతో పాటు ప్రజలను చైతన్యపర్చడంలో టెక్నాలజీ ఎంతో మేలు చేసిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నా రు. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో సాంకేతికత సమస్యల పరిష్కారంతో పాటు, నూతన అవకాశాలను సృష్టిస్తోందని చెప్పారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఆధ్వర్యంలో గురువారం జరిగిన ‘రీజినల్ యాక్షన్ గ్రూప్ ఫర్ సౌత్ ఏసియా’సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ‘కోవిడ్ వైరస్‌ను ఎదుర్కోవడంలో ఎమర్జింగ్ టెక్నాలజీ పాత్ర’అనే అంశంపై ఇందులో ప్రసంగించారు. కరోనా నివారణకు కేంద్రంతో పాటు జిల్లా, గ్రామస్థాయి అధికారులతో మాట్లాడేందుకు టెక్నాలజీ ఎంతో ఉపయోగపడిందన్నారు. పట్టణాల్లో డ్రోన్ల ద్వారా క్రిమిసంహారకాల పిచికారీ, లాక్డౌన్ సమయంలో ప్రజల కదలికల నియంత్రణకు డ్రోన్ల విని యోగం తదితర అంశాలను కేటీఆర్ ప్రస్తావించారు. కోవిడ్ సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు ప్రత్యేక యాప్, వెబ్‌సైట్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని చెప్పారు. రేషన్ సరుకుల పంపిణీలోనూ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించామని వెల్లడించారు. టెక్నాలజీతోనే జీవితాల్లో మార్పు.. ప్రజల జీవితాల్లో మార్పు తేలేని టెక్నాలజీ వృథా అని, అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ వినియోగానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనా నేపథ్యంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు నూతన సాంకేతిక పరిష్కారాలు వస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సమావేశంలో కేటీఆర్‌తో పాటు మాల్దీవుల ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రి ఫయాజ్ ఇస్మాయిల్, సింగపూర్ ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఎస్.ఈశ్వరన్, వరల్డ్ ఎకానామిక్ ఫోరమ్ అధ్యక్షుడు బోర్జే బ్రెండెలు మాట్లాడారు. వీరితో పాటు వివిధ దేశాల మేధావులు, నిపుణులు తదితరులు పాల్గొన్నారు. -
వాతావరణ శాస్త్రంపై భారతీయుల్లో విశ్వాసం
దావోస్: వాన రాకడ, ప్రాణం పోకడ తెలుసుకోలేమని అంటారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక వాతావరణాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి ప్రయత్నాలైతే సాగుతున్నాయి. అయితే ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ శాస్త్రం పట్ల సగానికి సగం దేశాలు విశ్వాసం కోల్పోతున్నట్టు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) తాజా సర్వేలో వెల్లడైంది. అయితే భారతీయులు మాత్రం వాతావరణ శాస్త్రం పట్ల అత్యంత విశ్వాసంతో ఉన్నారు. ఈ శాస్త్రాన్ని నమ్మిన దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంటే, బంగ్లాదేశ్ రెండో స్థానంలో ఉన్నాయి. ఇక గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులకు మానవ కార్యకలాపాలే కారణమని అత్యధికులు నిందిస్తున్నట్టు డబ్ల్యూఈఎఫ్ సర్వే వెల్లడించింది. సర్వే ఇలా..: శాప్, క్వాలట్రిక్స్ సంస్థలతో కలిసి వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఈ సర్వే నిర్వహించింది. మొత్తం 30 దేశాల్లో, 10,500 మందిని ప్రశ్నించింది. ప్రపంచ ఆర్థిక సమాఖ్య 50వ వార్షిక సదస్సుని పురస్కరించుకొని ఈ అధ్యయనం చేసింది. సమైక్య ప్రపంచం దిశగా నివేదికలో అమెరికా, దక్షిణాసియా మినహా మిగిలిన ప్రాంతాల ప్రజలు నాణ్యమైన విద్య ఎండమావిగా మారిందని అభిప్రాయపడ్డారు. చాలా దేశాల్లో విద్యావిధానం, విద్యార్థులకు ఇచ్చే శిక్షణ వారిని నిపుణులుగా తీర్చిదిద్దడం లేదన్న అభిప్రాయాలే వ్యక్తమయ్యాయి. చేయి చేయి కలపాలి: డబ్ల్యూఈఎఫ్ వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పుల కారణంగా ఆర్థికంగా, సామాజికంగా పడుతున్న తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచదేశాల్లో అన్ని వర్గాలు చేయి చేయి కలపాల్సిన అవసరం ఉందని డబ్ల్యూఈఎఫ్‌పేర్కొంది. ప్రభుత్వాలు,పారిశ్రామిక వర్గాలు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు కలసికట్టుగా ఈ సవాళ్లను ఎదుర్కోవాలని తెలిపింది. -
ఆ ఒక్క దేశం మినహా..
న్యూఢిల్లీ: భారత్ పొరుగు దేశాల్లో ఒక్కటి(పాకిస్తాన్) మినహా అన్ని దేశాలు ప్రాంతీయ సహకారం విషయంలో కలిసికట్టుగా పని చేస్తున్నాయని, పరస్పరం చక్కగా సహకరించుకుంటున్నాయని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో భారత ఆర్థిక సదస్సు సందర్భంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బొర్జి బ్రెండేతో మాట్లాడారు. ప్రాంతీయ సహకారం విషయంలో ఆ ఒక్క దేశం కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్‌లో జాతీయవాదాన్ని ప్రతికూల అంశంగా చూడొద్దని చెప్పారు. ఇమ్రాన్ వ్యాఖ్యలు దారుణం ఆర్టికల్ 370 అంశంపై పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ తరచూ బాధ్యతారాహిత్యమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ విమర్శించారు. ఇమ్రాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇమ్రాన్ తన హోదాకు తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. భారత్‌కు వ్యతిరేకంగా జిహాద్ కు ఇమ్రాన్ బహిరంగంగా పిలుపునివ్వడం దారుణమని అన్నారు. అంతర్జాతీయ సంబంధాల గురించి ఆయనకు తెలియదని తప్పుపట్టారు. -
దేశాన్ని నడిపిస్తున్నది పట్టణ ప్రాంతాలే
సాక్షి, హైదరాబాద్: ‘జాతిపిత మహాత్మాగాంధీ చెప్పినట్లు ఇప్పటికీ భారతదేశం గ్రామాల్లోనే ఉంది. అయితే, దేశాన్ని, రాష్ట్రాలను ఆర్థికంగా నడిపిస్తున్నవి మాత్రం పట్టణ ప్రాంతాలే’అని ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారకరామారావు అన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఎకనామిక్ సమ్మిట్‌లో కేటీఆర్ పాల్గొన్నారు. సదస్సులో భాగంగా మేఘాలయ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులతో కూడిన ‘‘యూనియన్ అఫ్ స్టేట్స్’’సెషన్లో కేటీఆర్ ప్రసంగించారు. ఆర్థిక ప్రగతి సాధించడంలో కేంద్ర, రాష్ట్రాల సంబంధాల తీరుపై కేటీఆర్ తన అభిప్రాయాలు పంచుకున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఉన్నతమైన అవకాశాల కోసం ప్రజలు పట్టణాలవైపు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పట్టణాల్లో మౌలిక వసతుల్లో సంక్షోభం తలెత్తుతోందని పేర్కొన్నారు. మెరుగైన జీవన ప్రమాణాల కోసం అనుసరించాల్సిన ప్రణాళికలపై దేశంలో నూతన ఆలోచనలకు కొరతలేదని, పెట్టుబడుల కొరత మాత్రమే ఉం దని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పట్టణాల్లో మౌలిక వసతుల రంగంలో పెట్టుబడుల కోసం అనేక విదే శీ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని, అయితే కేంద్ర ప్రభుత్వ నియంత్రణతో రాష్ట్రాల్లో స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టే అవకాశం లేదన్నారు. పట్టణ ప్రాం తాల్లో మౌలికవసతులను పెంచడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచవచ్చని అన్నారు. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే ప్రగతి ఆర్థిక పురోగతిపై దూరదృష్టితో కేంద్ర, రాష్ట్రాలు సమన్వయంగా పనిచేసినప్పుడే ఆర్థిక ప్రగతి వేగవంతమవుతుందని కేటీఆర్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర జాబితాలతోపాటు ఉమ్మడిజాబితా అంటూ రాజ్యాంగం ప్రత్యేకంగా అధికారాలను నిర్ణయించిందని, అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి జాబితాలో ఉన్న అనేక అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందని కేటీఆర్ అన్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారానే ఆర్థిక పురోగతి వేగవంతమవుతుందని, అధికార వికేంద్రీకరణలో భాగంగానే తెలంగాణలో 33 కొత్తజిల్లాలతోపాటు 3,500 పం చాయతీలు, పలు రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రగతిశీల నాయకత్వంతోనే అభివృద్ధి ఐదున్నరేళ్లలో తెలంగాణలో అద్భుతమైన పారిశ్రామిక ప్రగతి సాధ్యమైందని, అనేక విధానాలను కేంద్రం నిర్ణయిస్తున్నా వాటి అమలు మాత్రం రాష్ట్రాల్లోనే జరుగుతుందని కేటీఆర్ అన్నారు. ప్రగతిశీల నాయకత్వం ఉన్న రాష్ట్రాలు ఆర్థికంగా ఎదుగుతాయనేందుకు తెలంగాణను ప్రత్యక్ష ఉదాహరణగా అభివరి్ణంచారు. టీఎస్ఐపాస్ ద్వారా అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ఈ చట్టం ద్వారా పరిశ్రమల అనుమతులపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసిందన్నారు. టీఎస్ ఐపాస్ చట్టం ద్వారా 11 వేలకుపైగా అనుమతులను ఇచ్చామని, ఇందులో 8,400 పైగా అనుమతులు కార్యరూపం దాల్చగా,12 లక్షలమందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందని వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా వివిధ కంపెనీల ప్రతినిధులను కేటీఆర్ ఆహ్వానించారు. సదస్సులో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
బ్రాండ్‌థాన్‌తో ఏపీకి బ్రాండింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే తక్షణ కర్తవ్యంగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం బ్రాండ్‌థాన్ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని.. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించే విధంగా సరికొత్త ఆలోచనలు, సలహాలను స్వీకరించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. పారదర్శకత, సుపరిపాలనకు పెద్దపీట వేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే తమ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పమని మంత్రి తెలిపారు. ఢిల్లీలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్థిక సమాఖ్య సదస్సులో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మంత్రి గౌతమ్‌రెడ్డి, ముఖ్యమంత్రి స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా. పీవీ రమేష్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా. రజత్ భార్గవ పాల్గొన్నారు. మేకపాటి మీడియాతో మాట్లాడుతూ.. నైపుణ్యంలేని ఉద్యోగాలు అందించడం కాకుండా ఆయా రంగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణనిచ్చి స్థానికులకే 75 శాతం ఉద్యోగాలను అందించేందుకు శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. యువత నుంచి సూచనలు ఆహ్వానం ఏపీకి సరికొత్త బ్రాండింగ్‌ను సృష్టించే దిశగా ‘బ్రాండ్‌థాన్’ను నిర్వహించనున్నట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. ఇందులో భాగంగా దేశం నలుమూలల నుంచి సృజనాత్మక యువత నుంచి సూచనల ఆహ్వానించినట్లు తెలిపారు. అక్టోబర్ 3 నుంచి 28 వరకు ఎంట్రీలను httpr://bit. y/2m1KVml పోర్టల్‌లో స్వీకరించనున్నట్లు మంత్రి వివరించారు. అత్యుత్తమ ఆలోచనల్లో మొదటి బహుమతికి రూ.50 వేలు, రెండో బహుమతికి రూ.25 వేలు, మూడో బహుమతికి రూ.10వేలు నగదు బహుమతి అందజేస్తామని గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. అంతకుముందు.. దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు గల ఏకైక పట్టణం విశాఖపట్నమని అన్నారు. ప్రస్తుతం అమరావతిని పాలనా పరంగా అనుకూలమైన నగరంగా మలచుకుంటున్నట్లు వెల్లడించారు. హిండ్‌వైర్, మిత్సుబిషి సంస్థలతో భేటీ సదస్సు సందర్భంగా హిండ్‌వైర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జపాన్‌కు చెందిన మిత్సుబిషి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ప్రతినిధులు మంత్రి మేకపాటితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ వాహనాలకు ప్రభుత్వం పెద్దపీట వేయనున్న నేపథ్యంలో కంపెనీ ప్రతినిధులతో మేకపాటి చర్చించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా పాల్గొన్నారు. 13 జిల్లాల్లో ఇండస్ట్రియల్ జోన్లు బ్రాండ్‌థాన్‌తో పారిశ్రామికవృద్ధిని పరుగులు పెట్టించేందుకు కృషిచేయనున్నట్లు మేకపాటి వివరించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారని.. పారదర్శకతను ఆచరణలో చూపుతున్న ఏపీలో వాణిజ్యానికి పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారన్నారు వివరించారు. రాష్ట్రంలో 31 ఎంఎస్ఎంఈ క్లస్టర్ల ఏర్పాటుతో పాటు 13 జిల్లాలను ఇండస్ట్రియల్ జోన్లుగా మార్చడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు. రానున్న ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమి తీసుకురావడమే ధ్యేయంగా ముందుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వానికి బాసటగా ఏపీ తనదైన ముద్ర వేస్తుందనడంలో సందేహం లేదన్నారు. -
తెలంగాణ దేశానికే ఆదర్శం : కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక పాలసీలో దేశానికే ఆదర్శమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియన్ ఎకనామిక్ సమ్మిట్‌లో భాగంగా జరిగిన యూనియన్ ఆఫ్ స్టేట్స్ సెషన్లో ప్రసంగించారు. గత ఐదు సంవత్సరాలుగా తెలంగాణ అద్భతమైన పారిశ్రామిక ప్రగతిని సాధించిందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారానే పారిశ్రామిక ప్రగతి సాధ్యమయిందని తెలిపారు. విజనరీ లీడర్ షిప్ ఉన్న రాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయనేందుకు తెలంగాణే నిదర్శమని అన్నారు. ఈ క్రమంలో కేంద్ర రాష్ట్రాలు బృహత్తర లక్ష్యం కోసం సమన్వయంతో పని చేసినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు రాష్ట్రాలకు అనుగుణంగా కేంద్ర పాలసీలు మరింత సరళతరం కావాల్సిన అవసరముందని సూచించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి జాబితాలోని అనేక అంశాలను రాష్ట్రాలకు అప్పగించాలని కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నది పట్టణాలు, నగరాలేనని అన్నారు. -
కేటీఆర్‌కు అరుదైన గౌరవం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావుకు అరుదైన గౌరవం దక్కింది. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆన్ ఇండియా’పేరుతో నిర్వహించే సమావేశానికి గౌరవ అతిథిగా హాజరు కావాలని ఆ ఫోరం కేటీఆర్‌ను కోరింది. సీఐఐ భాగస్వామ్యంతో ఈ ఏడాది అక్టోబర్ 3, 4 తేదీల్లో ఢిల్లీలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఫోరం తెలిపింది. మూడు దశాబ్దాలుగా ఇండియా ఎకనామిక్ సమ్మిట్ పేరుతో నిర్వహిస్తున్న సదస్సులకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశం జరగనున్నట్లు తెలిపింది. ‘మేకింగ్ టెక్నాలజీ వర్క్స్ ఫర్ ఆల్’అనే థీమ్‌తో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఫోరం తన ఆహ్వానంలో పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటని, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లోనూ సరైన అభివృద్ధిని నమోదు చేసిందని ఫోరం తెలిపింది. భారత్ సైతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రపంచం సైతం భారత్‌లో ఉన్న అవకాశాలపై అవగాహన చేసుకోవలసిన అవసరమున్న నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఉందని వెల్లడించింది. భారత్‌లోని ఆదర్శవంతమైన కార్యక్రమాలపై చర్చించడానికి ముఖ్యమైన వక్తలను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు దీనికి హాజరవుతారని వివరించింది. కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అనేక రంగాల్లో ముందంజ వేసిన విషయాన్ని ఫోరం ప్రత్యేకంగా ప్రస్తావించింది. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలో ఇన్నోవేషన్, టెక్నాలజీ రంగాల్లో వినూత్న కార్యక్రమాలను చేపట్టి దేశం దృష్టిని ఆకర్షించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఈ సమావేశానికి హాజరై తన అనుభవాలను పంచుకోవాలి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోరింది. -
సమానత్వానికి మరో 200 ఏళ్లు
మానవుడు అంతరిక్షంలోకి దూసుకుపోతున్నా లింగ వివక్షత మాత్రం తగ్గడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో లింగ భేదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆర్థికం, రాజకీయం, ఉద్యోగం ఇలా దాదాపు అన్ని రంగాల్లో ఇంకా మహిళలు వివక్షకు గురవుతూనే ఉన్నారు. ఈ లింగ వివక్షతను దాటి స్త్రీపురుష సమానత్వం సాధించడానికి ఇంకా 200 ఏళ్లు పడుతుందట. అంతర్జాతీయంగా అధ్యయనం చేసి వరల్డ్ ఎకనమిక్ ఫోరం తేల్చిన సత్యమిది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం 2018 భారత్‌లో స్త్రీపురుష సమానత్వానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని చెప్పకనే చెప్పింది. దేశంలోని ఆర్థిక రంగంలో ఉన్న లింగ అసమానతలను పరిష్కరించుకోవాల్సిన తక్షణ ఆవశ్యకతను అది నొక్కి చెప్పింది. దేశంలో, ప్రపంచవ్యాప్తంగా నాలుగు కీలకాంశాల ఆధారంగా లింగపరమైన ఆర్థిక అసమానతలను అంచనా వేసింది. ఆర్థిక అవకాశాలు, రాజకీయ సాధికారత, విద్య, ఆరోగ్య రంగాల్లో స్త్రీపురుష అంతరాలను కొలమానంగా తీసుకుని మన దేశంలో కొనసాగుతున్న అసమానతలపై దృష్టి సారించాలని చెప్పింది. గత దశాబ్దకాలంగా ఆరోగ్యం విషయంలో ప్రపంచంలోనే మన దేశం చివరి నుంచి మూడోస్థానంలో ఉండటం ప్రమాదానికి సంకేతంగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం భావించింది. స్త్రీపురుషుల మధ్య ఆర్థిక అసమానతలు తొలగడానికి రెండు శతాబ్దాల కాలం పడుతుందని స్పష్టం చేసింది. అమెరికా కన్నా బెటర్... రాజకీయ సాధికారతలో మాత్రం ప్రపంచ వ్యాప్తంగా 54వ స్థానంలో ఉన్న అమెరికా, 33వ స్థానంలో ఉన్న యుకె కన్నా మెరుగైన ఫలితాలను కనబర్చి మన దేశ మహిళలు ప్రపంచంలోనే 15వ స్థానంలో నిలిచినట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరం రిపోర్టు వెల్లడించింది. పది ప్రధాన ప్రమాణాలను గమనిస్తే.. బంగ్లాదేశ్, శ్రీలంకతో పోలిస్తే మన దేశం లింగ అసమానతలను జయించాలంటే చాలా విషయాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది. అయితే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. 100 ప్రధాన కంపెనీల్లో కేవలం 5 శాతం మంది మహిళలు మాత్రమే కీలక స్థానాల్లో ఉన్నారు. అలాగే అతి కొద్ది మందికి మాత్రమే నూతన కంపెనీల స్థాపనకు ఆర్థిక తోడ్పాటునిచ్చినట్లు తేలింది. నిర్వహణ రంగం స్త్రీ భాగస్వామ్యం - ముంబై స్టాక్ ఎక్చేంజీలోని టాప్ 100 కంపెనీల్లో సీఈఓలుగా ఉన్న మహిళలు 2018 జనవరి నాటికి ఐదుగురు మాత్రమే. అలాగే 2019 జనవరి నాటికి ఇందులో ఎలాంటి మార్పు లేదు. - ముంబై స్టాక్ ఎక్సేంజీలోని టాప్ 500 కంపెనీల్లో సీఈఓలుగా ఉన్న స్త్రీలు 2018 జనవరి నాటికి 18 మంది కాగా, 2019 జనవరి నాటికి 25 మందికి చేరారు. - ముంబై స్టాక్ ఎక్చేంజీలోని టాప్ 100 కంపెనీల్లో బోర్డు సభ్యులుగా ఉన్న మహిళలు 2018 నాటికి 172 మంది ఉండగా, 2019 జనవరి నాటికి 180 మందికి చేరారు. - టాప్ 482 కంపెనీల్లో మొత్తం డైరెక్టర్లలో మహిళలు 2018 నాటికి 14.08 శాతం ఉండగా, 2019 జనవరి నాటికి 14.49 శాతానికి పెరిగింది. మెరుగ్గా ఐస్లాండ్... ప్రపంచ దేశాల్లో ఐస్లాండ్ గత పదేళ్లుగా మహిళా సాధికారతలో మెరుగ్గా ఉంది. మహిళా శాసనకర్తలు, సీనియర్ అధికారులు, మేనేజర్లు మాత్రం ఐస్లాండ్లో గతంకన్నా కొద్దిగా తగ్గినప్పటికీ.. మిగిలిన దేశాలకన్నా అసమానతలు ఈ దేశంలో తక్కువగా ఉన్నట్లు తేలింది. గత అక్టోబర్‌లో ఐస్లాండ్ ప్రధాని కత్రిన్ జాకోబ్స్డాటిర్తో సహా ఐలాండ్ మహిళలంతా వేతనాల్లో అసమానత్వానికి, లైంగిక వేధింపులకు నిరసనగా పనిమానేసి వీ«ధుల్లోకొచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఆధారంగా రాజకీయాలు, పనిలో భాగస్వామ్యం, ఆరోగ్యం, విద్యారంగాల్లో అంతరాలను అధిగమించడంలో ప్రపంచవ్యాప్తంగా 0.1 శాతం మెరుగుదల సాధించాం. ఈ లెక్కన సమానతకు ప్రపంచం చాలా దూరంలో ఉంది. స్త్రీ పురుష సమానత్వం కోసం ఇంకా 202 ఏళ్లు ఎదురుచూడటం చాలా సుదీర్ఘ ప్రయాస అని యుఎన్ ఉమన్ రీజనల్ డైరెక్టర్ అన్నా కరీన్ జాట్ఫోర్స్ వ్యాఖ్యానించారు. సమాన వేతన విధానాలు, మహిళల అవసరాలకు తగినట్లుగా గర్భిణులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, అవకాశాలు కల్పించడం, ప్రసవానంతరం మహిళలకు చట్టబద్ధమైన ఉద్యోగ భరోసా ఇవ్వడం ద్వారా స్త్రీ పురుషుల ఆర్థిక అంతరాలను కొంతవరకైనా తగ్గించవచ్చన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 200 ఏళ్లు ఆగాల్సిందే.. జెనీవాకు చెందిన అంతర్జాతీయ సంస్థ 149 దేశాల్లో విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాలు, రాజకీయ సాధికారత తదితర రంగాల్లో కొనసాగుతున్న అసమానతలను రికార్డు చేసింది. ఈ యేడాది విద్య, ఆరోగ్యం, రాజకీయ భాగస్వామ్యంలో ఉన్న అంతరాలను ప్రపంచ ఆర్థిక సంస్థ వెల్లడించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ నైపుణ్యం తదితర విషయాల్లో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉన్నట్లు ఈ రిపోర్టు గుర్తించింది. పశ్చిమ యూరప్ దేశాలు మరో ఆరు దశాబ్దాల్లో ఆర్థిక అంతరాలను అధిగమిస్తారని, మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికాలో లింగ వివక్షను అధిగమించేందుకు మరో 153 ఏళ్లు వేచిచూడాల్సిందేనని వరల్డ్ ఎకనమిక్ ఫోరం వెల్లడించింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా స్త్రీపురుషుల మధ్య అసమానతలు పూడ్చటానికి కనీసం 202 ఏళ్లు పడుతుందని ఫోరం అంచనా వేసింది. -
ఆధునికతకు అద్దం పట్టే ‘గిఫ్ట్’
న్యూఢిల్లీ : హాంకాంగ్, సింగపూర్ సహా అంతర్జాతీయ వాణిజ్య హబ్‌లకు దీటుగా అహ్మదాబాద్‌లో అత్యంతాధునిక వసతులతో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ (గిఫ్ట్) రూపొందుతోంది. అంతర్జాతీయ దిగ్గజ సంస్ధలకు తగిన మౌలిక వసతులు, సౌకర్యాలతో పాటు నైపుణ్యాలతో కూడిన భారతీయ యువత అందుబాటులో ఉంటాయని ఈ మెగా ప్రాజెక్టు నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారత వాణిజ్య సేవల రంగం అత్యంత వేగంగా పురోగమిస్తూ 2020 నాటికి కోటికిపైగా ఉద్యోగాలను సమకూర్చుతుందని, జీడీపీకి రూ రెండు లక్షల కోట్లను సమకూర్చనుందని ఈ డ్రీమ్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నఅధికారులు పేర్కొన్నారు. గిఫ్ట్ సిటీలో భాగంగా అహ్మదాబాద్, గాంధీనగర్‌ల మధ్య మెరుగైన మౌలిక వసతులు, రవాణా కనెక్టివిటీలతో సెంట్రల్ బిజినెస్ డిస్ర్టిక్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు. క్యాపిటల్ మార్కెట్లు, వాణిజ్య, ఐటీ రంగాల్లో పది లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు లక్షలాది మందికి పరోక్ష ఉపాధి కల్పిస్తామని డెవలపర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7 శాతం పైగా ఉంటుందన్న ఐఎంఎఫ్ అంచనాలూ గిఫ్ట్ సిటీలో నూతనోత్తేజం నింపాయి. గిఫ్ట్‌తో మారనున్న రూపురేఖలు పెరుగుతున్న జనాభాతో పాటు కాలుష్యం, ఇతర రిస్క్‌లతో ప్రపంచ నగరాలు సవాళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో చెత్త నుంచి అత్యాధునిక సౌకర్యాలతో గిఫ్ట్ వంటి నగరాల నిర్మాణం వినూత్న పరిణామంగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం నివేదిక పేర్కొంది. నాలుగో పారిశ్రామిక విప్లవానికి ప్రపంచ నగరాలు సంసిద్ధం కావాల్సి ఉందని ఈ నివేదిక పిలుపు ఇచ్చింది. ఆధునిక భవంతులు, స్మార్ట్ ఇన్ఫ్రాస్ర్టక్చర్లతో గిఫ్ట్ వంటి నగరాల ఆవశ్యకత ఉందని పేర్కొంది. -
అంతులేని అంతరం
ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుష అంతరాలకు అద్దంపట్టే ‘గ్లోబల్ ర్యాంకింగ్’లో భారత పరిస్థితి ఏ మాత్రం మారలేదు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) 149 దేశాలపై వెలువరించిన జెండర్ గ్యాప్ రిపోర్టు, 2018 ప్రకారం భారత్ ర్యాంకు 108. గత సంవత్సరంలోనూ భారత్ ఇదే ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఆర్థిక భాగస్వామ్యం– అవకాశాలు, విద్య, ఆరోగ్యం– మనుగడ, రాజకీయ సాధికారత అంశాల (సబ్ ఇండెక్స్) ఆధారంగా డబ్ల్యూఈఎఫ్ఈ ర్యాంకులిచ్చింది. నివేదిక ప్రకారం భారత్ వేతన వ్యత్యాసాలను తగ్గించడంలో కొంత ప్రగతి సాధించింది. విద్యా రంగంలో 114వ స్థానంతో మెరుగైన పనితీరు కొనసాగించింది. స్త్రీలను ఆర్థికవ్యవహారాల్లో భాగస్వామిగా చేయడం, అవకాశాలు కల్పించడంలో వెనకబడింది. ఈ విభాగంలో భారత్ 142వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. రాజకీయ సాధికారత విషయంలో గత ఏడాది 15వ ర్యాంక్రాగా, ఈసారి 19కి పడిపోయింది. స్త్రీల ‘ఆరోగ్యం– మనుగడ’ సూచీలో అట్టడుగుకు చేరింది. గత సంవత్సరం 141 స్థానంలో వుండగా ఈ యేడాది 147 స్థానానికి దిగజారింది. ఆర్మీనియా (148), చైనా (149) చివరి రెండు స్థానాల్లో వున్నాయి. ఈ విభాగంలో ఒకటో స్థానానికి చేరిన దేశాల్లో శ్రీలంక కూడా వుండటం విశేషం. ర్యాంకింగ్‌పరంగా తొలి 8 స్థానాల్లోని దేశాలు తమ దేశాల్లో 80 శాతం వరకు అసమానతలను రూపు మాపాయని నివేదిక తెలిపింది. ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే స్త్రీ పురుష అంతరాలను పూడ్చే దిశగా దక్షిణాసియాలో మెరుగైన కృషి జరిగిందని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సగటు తీసుకుంటే రాజకీయ సాధికారత విషయంలో ఎక్కువ అంతరం (77.1శాతం)ఉంది. ఆర్థిక భాగస్వామ్యం– అవకాశాల విషయంలోనూ (41.9శాతం) అంతరం ఎక్కువగా వుంది. విద్య (4.4శాతం),ఆరోగ్యం– మనుగడ (4.6శాతం) అంశాల్లో వ్యత్యాసాలను బాగా తగ్గించగలిగారు. మార్పు ఇలా మందగమనంతో సాగితే స్త్రీ పురుషుల మధ్య అంతరాలను మొత్తంగా రూపు మాపాలంటే మరో 108 ఏళ్లు పడుతుందని నివేదిక పేర్కొంది. 48వ ర్యాంకు సాధించిన బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ దక్షిణాసియా విభాగంలో టాప్ ర్యాంకు (48) సాధించింది. రాజకీయ సాధికారత విషయంలో ముందడుగేసి బంగ్లాదేశ్ మెరుగైన ర్యాంక్ పొందింది. అంతర్జాతీయంగా 8వ ర్యాంకు సాధించిన ఫిలిప్పీన్స్.. ఆసియాలో ర్యాంకింగ్ పరంగా తొలి స్థానంలో వుంది. చైనా 100 నుంచి 103కి దిగజారింది. పాకిస్తాన్ చివరి నుంచి రెండో స్థానంలో వుండగా, యుద్ధంతో సతమతమవుతున్న యెమెన్ చివరి స్థానంలో వుంది. అగ్రస్థానాన ఐస్‌ల్యాండ్ ఐరోపాలోని ఐస్‌ల్యాండ్, నార్వే, స్వీడన్ వరసగా మొదటి మూడు ర్యాంకులు సాధించాయి. ఫిన్లాండ్, నికరాగువా, రువాండా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ ఆ తర్వాత స్థానాల్లో వున్నాయి. బ్రిటన్ 15, కెనడా 16, అమెరికా 51, ఆస్ట్రేలియా 53వ ర్యాంకులు సొంతం చేసుకున్నాయి. -
అమెరికాలో తెలుగు వెలుగు
అమెరికాలో అతి వేగంగా అభివృద్ధి చెందుతోన్న భాష తెలుగు భాషేనని ఓ అమెరికా సంస్థ తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచ వాణిజ్య సదస్సు(వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్) అంచనా ప్రకారం అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 2010–17కాలంలో ఏకంగా 86 శాతానికి పెరిగింది. సెన్సస్ గణాంకాలను సేకరించే అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ సంస్థ యూఎస్‌లో మాట్లాడే భాషలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 2010–17 కాలంలో ఇంగ్లిష్ మినహా అక్కడి ఇళ్ళల్లో మాట్లాడే భాషపై ఈ అధ్యయనం చేశారని బీబీసీ తెలిపింది. 2017లో యూఎస్‌లో 4 లక్షలకు పైగా తెలుగు మాట్లాడేవారున్నారు. ఈ సంఖ్య 2010నాటితో పోల్చితే రెట్టింపు. అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టాప్–10 భాషల్లో ఏడు దక్షిణాసియావే కావడం విశేషం. ఇంత వేగంగా తెలుగుమాట్లాడేవారి సంఖ్య పెరగడానికి 1990లలో యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఏర్పడిన డిమాండే కారణమని ‘తెలుగు పీపుల్ ఫౌండేషన్’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు ప్రసాద్ కూనిశెట్టి చెప్పారు. కొన్నేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల నుంచి అధిక సంఖ్యలో యూఎస్‌కు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకోసం వెళ్తున్నారని బీబీసీ తెలిపింది. అమెరికాలోని 32 కోట్ల జనాభాలో 6 కోట్ల మంది ఇంగ్లీషేతర భాషలు మాట్లాడుతున్నారు.అందులో అధికంగా స్పాని ష్ మాట్లాడే వాళ్లున్నారు. యూఎస్‌లో భారతీ య భాషల్లో హిందీ మాట్లాడుతున్నవారు టాప్‌లో ఉంటే తర్వాతి స్థానాన్ని గుజరాతీ చేజిక్కించుకుంది. బెంగాలీ భాషను తెలుగు అధిగమించింది. అయితే, తెలుగు కంటే తమిళం మాట్లాడే వారు అమెరికా అంతటా ఉన్నారని ఈ అధ్యయనంలో తేలింది. అమెరికాలోని ఇలినాయీస్ స్టేట్, న్యూయార్క్, వాషింగ్టన్, ఓరెగాన్, కాలిఫోర్నియా, పెన్సిల్వేనియాల్లో తెలుగువారు ఎక్కువ. అమెరికాలో తెలుగు మాట్లాడే వారిలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మొదలుకొని మిస్ అమెరికా కిరీటాన్ని దక్కించుకున్న తొలి భారతీయురాలు నీనా దావులూరి వరకు ప్రముఖులెందరో ఉన్నారు. అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హైదరాబాదీలే. -
ముగిసిన కేటీఆర్ దావోస్ పర్యటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ముగిసింది. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న కేటీఆర్ పలు సమావేశాల్లో ప్రసంగించడంతో పాటు అంతర్జాతీయ కంపెనీల సీఈవోలు, చైర్మన్లతో చర్చలు జరిపారు. కేటీఆర్ బృందం నిర్వహించిన ఈ పర్యటన విజయవంతమైందని ఆయన కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, టీఎస్ఐపాస్ పనితీరు, సింగిల్ విండో విధానంలో అనుమతులు తదితర అంశాలపై కేటీఆర్ వివరించారని పేర్కొంది. ఈ సదస్సులో జరిగిన చర్చల ద్వారా వరంగల్‌లో టెక్ మహీంద్ర కార్యాలయం ఏర్పాటుకు కంపెనీ యాజమాన్యం అంగీకరించడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలకు ఇది అద్భుత స్పందన అని పేర్కొన్నారు. స్థానిక సమస్యలకు స్థానిక పరిష్కారాలు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో స్థానిక సమస్యలకు చక్కటి పరిష్కారాలు చూపొచ్చని కేటీఆర్ తెలిపారు. శనివారం సదస్సులో భాగంగా జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఓ ప్రాంతంలోని సమస్యలకు పరిష్కారాలను కనుగొనే సమయంలో స్థానిక సంస్కృతి, భాష, ప్రాంతీయ వైవిధ్యాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఓ ప్రాంతంలో ఉపయోగపడే పరిష్కారాలు ఇతర ప్రాంతాల్లో పనిచేయకపోవచ్చని వివరించారు. స్థానిక సమస్యలకు పరిష్కారాలను చూపడంలో ప్రజలకు సహకరించడం, గ్లోబల్ కంపెనీలు స్థానికంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. -
'నాకు 15 మంది దోస్తులయ్యారు.. డిన్నర్ చేశాం'
దావోస్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కొత్తగా 15 మంది స్నేహితులు అయ్యారు. ఆ విషయాన్ని ట్రంప్ స్వయంగా చెప్పారు. వారితో కలిసి డిన్నర్ కూడా చేసినట్లు వెల్లడించారు. వారిలో ముగ్గురు భారతీయ సంతతికి చెందిన వారున్నట్లు తెలిసింది. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ట్రంప్ 20 నిమిషాలపాటు ప్రసంగించిన తర్వాత స్వల్ప కాలంపాటు డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాస్ శ్వాబ్ అడిగిన కొన్ని ప్రశ్నలకు ట్రంప్ సమాధానం చెప్పారు. దావోస్‌లో కొత్తగా ఎవరితో పరిచయాలు అయ్యాయని ట్రంప్‌ను ప్రశ్నించగా పదిహేను మంది అని చెప్పారు. 'నేను గురువారం మధ్యాహ్నం దావోస్‌కు వచ్చాను. అదే రోజు రాత్రి 15 మంది కొత్త మిత్రులతో భోజనం చేశాను. నాకు తెలిసిన వారు అందులో ఒక్కరు కూడా లేరు. కానీ, వీరందరి గురించి మాత్రం ఎన్నో ఏళ్లుగా తెలుసుకుంటున్నాను. నాకు ఇక్కడ 15మంది మిత్రులు దొరికేలా చేసిన వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి, దాని వ్యవస్థాపకులైన మీకు నా ధన్యవాదాలు' అని ట్రంప్ చెప్పారు. వైట్ హౌస్ తెలిపిన వివరాల ప్రకారం స్విస్ ఫార్మా దిగ్గజం నోవార్టిస్‌కు త్వరలో రానున్న సీఈవో వ్యాస్ నరసింహన్, నోకియా సీఈవో రాజీవ్ సూరి, డెలాయిట్ సీఈవో పునిత్ రేంజెన్తోపాటు, బేయర్, సైమెన్స్, ఏపీ వోల్వో, శ్యాప్, అడిదాస్, స్టాటోయిల్, నెస్ట్లే, ఏబీబీ, హెచ్ఎస్బీసీవంటి సంస్థల సీఈవోలతో ట్రంప్ భేటీ అయినట్లు తెలిసింది.