చైనాలోని టియాంజిన్ వేదికగా ఈ ఏడాది జూన్ 27 నుంచి 29వ తేదీ వరకు ప్రపంచ ఆర్థిక వార్షిక సదస్సు (wef) జరగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందించింది.
వలర్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్యక్షుడు బోర్గె బ్రెండే మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. నేషనల్ డెవలప్‌మెంట్, రిఫోర్మ్ కమిషన్‌లు చైనాతో కలిసి ఈ సమాశం ఏర్పాటు చేసింది.
కోవిడ్-19 వరుస పరిణామల అనంతరం పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కొత్త కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాయి. ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు కీలకమైన ఈ సమయంలో చైనాలో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు , విద్యా సంస్థలకు చెందిన సుమారు 1500 మంది గ్లోబుల్ లీడర్స్ ఈ సదస్సులో పాల్గొననున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment