IT & Infotech
-
మూడు నెలల్లో భారీగా ఉద్యోగాలు.. ఈ రంగాల్లోనే అధికం
న్యూఢిల్లీ: భారత కంపెనీలు నియామకాల పట్ల బలమైన ధోరణితో ఉన్నట్టు మ్యాన్‌పవర్ గ్రూప్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్‌లుక్ సర్వే క్యూ4, 2024’ నివేదిక వెల్లడించింది. 37 శాతం భారత కంపెనీలు వచ్చే మూడు నెలల్లో (అక్టోబర్–డిసెంబర్) నికరంగా తమ సిబ్బందిని పెంచుకోనున్నట్టు ఈ సర్వేలో తెలిపాయి. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ కాలంలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 7 శాతం అధికం. క్రితం ఏడాది అక్టోబర్ - డిసెంబర్‌తో పోల్చి చూస్తే తటస్థంగా ఉంది.వివిధ రంగాల్లోని 3,150 కంపెనీల అభిప్రాయాలను సర్వేలో భాగంగా మ్యాన్‌పవర్ గ్రూప్ తెలుసుకుంది. భారత్ తర్వాత కోస్టారికాలో అత్యధికంగా 36 శాతం కంపెనీలు, ఆ తర్వాత యూఎస్‌లో 34 శాతం కంపెనీలు నియామకాల పట్ల సానుకూలంగా ఉన్నాయి. సిబ్బందిని తగ్గించుకునే కంపెనీలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నికర నియామకాల గణాంకాలను ఈ సంస్థ రూపొందించింది.‘‘నియామకాల ఉద్దేశ్యం భారత ఆర్థిక వ్యవస్థ పట్ల సానుకూల ధోరణిని తెలియజేస్తోంది. విదేశీ విధానాలు, పెద్ద ఎత్తున మౌలిక వసతుల అభివృద్ధికి తోడు మనకున్న అధిక యువ జనాభా సానుకూలతలు అంతర్జాతీయ మార్కెట్లో భారత పోటీతత్వాన్ని పెంచుతాయి’’అని మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా ఎండీ సందీప్ గులాటి పేర్కొన్నారు. రంగాల వారీగా..మ్యానపవర్ గ్రూప్ సర్వే ప్రకారం.. దాదాపు అన్ని రంగాల్లోనూ నియామకాల పట్ల సానుకూలత వ్యక్తమైంది. ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో వచ్చే మూడు నెలల్లో 47 శాతం కంపెనీలు నియామకాల పట్ల సానుకూలంగా ఉంటే, ఐటీలో 46 శాతం, ఇండ్రస్టియల్స్, మెటీరియల్స్‌రంగాల్లో 36 శాతం, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రంగాల్లో 35 శాతం కంపెనీలు సిబ్బందిని పెంచుకోవాలని అనుకుంటున్నాయి. అతి తక్కువగా కమ్యూనికేషన్ సర్వీసెస్ రంగాలో 28 శాతం కంపెనీలే వచ్చే మూడు నెలల్లోనియామకాల పట్ల సానుకూలంగా ఉన్నాయి.ఇదీ చదవండి: 6జీ టెక్నాలజీపై కేంద్రం దృష్టి: జ్యోతిరాదిత్య సింధియా ఉత్తరాదిలో ఉద్యోగాల డిమాండ్ 41 శాతంగా ఉంటే, పశ్చిమాదిన 39 శాతంగా ఉంది. అధిక దేశీయ వినియోగం, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే పథకాలు, ఔట్‌సోర్స్ సేవల డిమాండ్ పెంచడం, తయారీపై భారత్ దృష్టి సారిస్తుందని అంచనా వేస్తున్నట్టు గులాటి తెలిపారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం చూస్తుంటే.. భారత్ నిరుద్యోగాన్ని తగ్గించి, కొత్త తరహా పరిశ్రమల అవసరాలు తీర్చే మానవ వనరుల అభివృద్ధి ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయొచ్చని గులాటీ వివరించారు. -
ఐటీ ఉద్యోగుల్లో ఒంటరి తనం.. కారణం ఇదే
ఇటీవల మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్న ఓ ఐటీ ఉద్యోగి ఆటో డ్రైవర్‌గా మారాడు. అందుకు కారణం ఒంటరితనాన్ని భరించలేక, నలుగురితో మాట్లాడే అవకాశం కోసం ఇలా ఆటో నడుపుతున్నట్లు చెప్పుకొచ్చాడు. దీంతో సదరు టెక్కీ ఆటో నడుపుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే బెంగళూరు నగరంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఉండడంపై బిట్స్ ఫిలానీ పూర్వ విద్యార్ధి హర్ష్ బెంగళూరులోని టెక్కీల పరిస్థితుల గురించి పోస్ట్ చేశారు. Most techies in Bangalore are pretty lonely. Away from family, no real friends, stuck in traffic, high rents, children not getting good values, peers into status games, cringe tech meet-ups, shoves body with coffee & alcohol, hair-loss, tummies popping out & pays highest taxes.— harsh (@harshwsingh) July 23, 2024 ఒంటరితనం, పర్సనల్ లైఫ్-ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం, శారీరక, మానసిక అంశాలు ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ‘బెంగుళూరులో చాలా మంది టెక్కీలు చాలా ఒంటరిగా ఉన్నారు. కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. వారికి నిజమైన స్నేహితులు ఉండరు. ట్రాఫిక్ కష్టాలు,భారీగా ఇంటి రెంట్లు,పిల్లలు వారికి గౌరవం ఇవ్వకపోవడం, టెక్ మీట్ అప్లు, కాఫీ - ఆల్కహాల్ అధికంగా సేవించడం, ఎయిర్ లాస్ అవ్వడం, పొట్టలు విపరీతంగా పెరిగిపోవడం, అధిక మొత్తంలో పన్నులు చెల్లించడం వంటి కారణాలు ముడిపడి ఉన్నాయని, అందుకే బెంగళూరులో పనిచేస్తున్న టెక్కీల్ని ఒంటరితనం ఆవహించేస్తోంది అని ట్వీట్ చేశారు. దీని నుంచి బయటపడాలంటే ఆరోగ్యం పట్ల శ్రద్ద, కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. అంతే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌ని 6.94 లక్షల మంది వీక్షించారు. 12వేల మంది లైక్ చేశారు. -
ఒకే ‘క్లౌడ్’ను నమ్ముకుంటే ఇంతే..
సాక్షి, అమరావతి: ఒక్క ‘క్లౌడ్’నే నమ్ముకొంటే ఇంతే.. మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ప్రపంచానికి నేర్పిన గుణపాఠమిది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్లౌడ్ సర్వీసులు ఉన్నప్పటికీ, మైక్రోసాఫ్ట్ అజూర్ పైనే ఆధారపడిన సంస్థలన్నీ ఇప్పడు చిక్కుల్లో పడ్డాయి. ఐటీ, ఇతర రంగాలకు చెందిన సంస్థలు ఖర్చుల నియంత్రణ కోసం క్లౌడ్ సర్వీసులపై ఆధారపడుతుంటే ఇప్పుడు వాటి ఉనికే ప్రశ్నార్థకం అవుతోంది.తాజాగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన క్లౌడ్ సర్వీసెస్ ‘అజూర్’ సంక్షోభంతో ఐటీ కంపెనీలు వాటి విధానంపై పునరాలోచనలో పడ్డాయి. అజూర్ సైబర్ సెక్యూరిటీలో ఒక అప్డేట్ సందర్భంగా తలెత్తిన సమస్యతో ప్రపంచవ్యాప్తంగా విమాన, బ్యాంకింగ్, స్టాక్ ఎక్సే్ఛంజ్, వైద్యం వంటి పలు రంగాల్లో సేవలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఐటీ కంపెనీలు దీనిపైనే దృష్టి పెట్టాయి. డేటా బ్యాకప్ కోసం క్లౌడ్ సర్వీసులపై ఆధారపడితే వాటిల్లో అజూర్ లాగా సమస్య తలెత్తితే సాధారణ సేవలకు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారిస్తున్నాయి.ఒక క్లౌడ్‌పైనే ఆధారపడొద్దుఐటీ కంపెనీలు డేటా బ్యాకప్ కోసం కేవలం ఒక క్లౌడ్ సర్వీసుపైనే ఆధారపడకుండా అత్యవసర సమయాల కోసం మరో క్లౌడ్ సర్వీసు కూడా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అజూర్ కాకుండా పదికి పైగా ప్రముఖ క్లౌడ్ సర్వీసు సంస్థలు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్ ఫ్లాట్‌ఫాంలతో పాటు ఐబీఎం, ఒరాకిల్, ఆలీబాబా, డిజిటల్ ఓషన్, వీఎంవేర్, రెడ్‌హాట్ వంటి అనేక క్లౌడ్ సర్వీసులు ఉన్నాయి.తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అత్యంత చౌకగా క్లౌడ్ సర్వీసులు అందించే కోర్వేవ్ వంటి సంస్థలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇదే సమయంలో ఐటీ సంస్థలు కేవలం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఒక ఐటీ వెండర్పైనే ఆధారపడకుండా ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్‌పైనా సేవలంగించడానికి సిద్ధంగా ఉండాలని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ప్రొఫెసర్ ఓకు ఇస్క్ చెబుతున్నారు.మైక్రోసాఫ్ట్‌తో పాటు మ్యాక్, లీనక్స్ వంటి ఐటీ వెండర్స్నూ వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణబమైన మైక్రోసాఫ్ట్‌కు సైబర్ సెక్యూరిటీ అందిస్తున్న క్రౌడ్‌స్ట్రైక్ చేసిన ప్రకటన దీనికి ఊతమిస్తోంది. సెబర్ సెక్యూరిటీలో అప్‌గ్రెడేషన్ సందర్భంగా తలెత్తిన సంక్షోభం కేవలం విండోస్కే పరిమితమైందని ఆ ప్రకటన తెలిపింది. మ్యాక్, లీనక్స్ వంటి వాటిపై ఈ ప్రభావం లేదని క్రౌడ్‌స్ట్రైక్ పేర్కొంది. అందువల్ల ఐటీ, ఇతర సంస్థలు ప్రత్యామ్నాయాలనూ అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.తప్పించుకున్న రష్యామైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అప్‌గ్రెడేషన్‌లో తలెత్తిన సమస్యలతో ప్రపంచవ్యాప్తాంగా అనేక దేశాల్లో పలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. రష్యాలో మాత్రం ఆ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. దీనికి ప్రధాన కారణం ఇతర దేశాలపై రష్యా దాడులు. ఈ యుద్ధం కారణంగా అమెరికాకు చెందిన పలు సంస్థలు రష్యాకు తమ ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించాయి. అందుకే మైక్రోసాఫ్ట్ సంస్థ కొన్ని సంవత్సరాలు రష్యాకు ఎటువంటి సహకారం అందించలేదు.ఈ సంక్షోభానికి కారణమైన అమెరికాకు చెందిన క్రౌడ్ స్ట్రైక్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇంత వరకు రష్యాలో అడుగే పెట్టలేదు. దీంతో రష్యా సొంత సాఫ్ట్వేర్ పైనే ఆధారపడుతోంది. కాస్పర్స్క్రై వంటి స్వదేశానికి చెందిన సెబర్ సెక్యూరిటీ సేవలనే వినియోగించుకుంటోంది. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అప్‌గ్రెడేషన్‌తో తలెత్తిన సంక్షోభం తమ దేశంలో ఎక్కడా కనిపించలేదని రష్యా ప్రకటించింది. -
విప్రో ఈ ఏడాది వేరియబుల్ పే ఎంతంటే...??
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం విప్రో ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.రెండు త్రైమాసికంలో (క్యూ1,క్యూ2) సిబ్బందికి 80 శాతం వేరియబుల్ పే చెల్లించగా.. మూడో త్రైమాసికంలో (క్యూ3) సమయానికి ఆ మొత్తాన్ని పెంచి 85 శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. ఆర్ధిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికంలో విప్రో సంస్థ ఉద్యోగులకు వేరియబుల్పే 80 శాతం, 81 శాతం చెల్లించింది. అదే సంస్థకు చెందిన క్లౌడ్ విభాగం ‘విప్రో ఫుల్ స్ట్రైడ్ క్లౌడ్’ నివేదిక ఆధారంగా.. విప్రో క్యూ3లో గడించిన ఆదాయం ప్రాతిపదికన 80వేల మంది ఉద్యోగులకు సగటున ఒక్కొక్కరికి వేరియబుల్ పే 100శాతం అందిచగా..డిసెంబర్ క్యూ4లో 89.74శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు విప్రో మెయిల్ వేరియబుల్ పే చెల్లింపులు ఎలా ఉంటాయనే అంశంపై విప్రో సంస్థ ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్ పంపింది. అందులో రెవెన్యూ (40శాతం), గ్రాస్ మార్జిన్ (30శాతం), మొత్తం కాంట్రాక్ట్ వ్యాల్యూ (30శాతం) ఆధారంగా ఉంటుందని స్పష్టం చేసింది. శాలరీ పెంచింది విప్రోలో కాస్ట్, ఖర్చులను తీసివేయగా వచ్చే ఆదాయం పరంగా ఉద్యోగులకు శాలరీ చెల్లింపులు ఉంటాయి.అయితే ఈ ఆదాయాలు క్యూ2, క్యూ3లో ఆశించిన మేర లేకపోవడంతో విప్రో యాజమాన్యం ఉద్యోగుల జీతాల పెంపును తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ తర్వాత మార్కెట్లో డిమాండ్, పెరిగిన ఆదాయంతో కొద్ది నెలల తర్వాత విప్రో ఉద్యోగుల వేతనాన్ని ఏడాదికి 6-8 శాతం పెంచింది. ఈ పెరిగిన జీతం డిసెంబర్1,2023 నుంచి అమల్లోకి వచ్చింది. వేరియబుల్ పే అంటే ఏమిటి? అభివృద్ధి, సాధించిన విజయాలకు అనుగుణంగా ఆయా సంస్థలు ఉద్యోగులకు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరానికి వేరియబుల్ పేని చెల్లిస్తుంటాయి. వేరియబుల్ పే ‘పెర్ఫార్మెన్స్-లింక్డ్ పే’గా ప్రసిద్ధి చెందింది. ఇది సాధారణంగా కాంట్రిబ్యూషన్, బోనస్ లేదా కమీషన్ రూపంలో చెల్లిస్తాయి సంస్థలు -
‘ఎడారిలో ఒయాసిస్సు’ లా, ఐటీ ఉద్యోగులకు టీసీఎస్ బంపరాఫర్!
ఆర్ధిక మాద్యం, ప్రాజెక్ట్ ల కొరత, చాపకింద నీరులా అన్నీ రంగాల్లో మనుషుల స్థానాన్ని కృతిమమేధతో భర్తీ చేయడం వంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో టెక్నాలజీ సంస్థలు కొత్త ఉద్యోగాల నియామకాల్ని తగ్గించాయి. ఈ తరుణంలో ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ హైరింగ్‌పై కీలక ప్రకటన చేసింది. టీసీఎస్ నియామకాల్ని తగ్గిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఆ సంస్థ సీఈఓ కే.కృత్తివాసన్ స్పందించారు.మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా ఉద్యోగుల నియమాకం ఉంటుందని తెలిపారు. సంస్థ పనితీరు బాగుంది. ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో ఉంది. సంస్థకు వచ్చే ప్రాజెక్ట్‌ల పరంగా ఎక్కువ మంది ఉద్యోగులు అవసరం. వాస్తవానికి, మా నియామక ప్రణాళికలను తగ్గించడానికి మాకు ఎటువంటి ప్రణాళిక లేదు. చెప్పినట్లుగానే నియామకాన్ని కొనసాగిస్తాము అని సీఈఓ స్పష్టం చేశారు. జాబ్ ఆఫర్ లెటర్లను వెనక్కి పలు దేశాల్లో ఐటీ మార్కెట్లో ఒడిదడుకులు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఇప్పటికే క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిపి.. ఇచ్చిన జాబ్ ఆఫర్ లెటర్లను వెనక్కి తీసుకుంటున్నారని నివేదికల మధ్య టీసీఎస్ ఈ ప్రకటన వచ్చింది. నాస్కామ్ నివేదిక ప్రకారం.. 2023-24లో పరిశ్రమ కేవలం 60వేల కొత్త ఉద్యోగా అవకాశాలు కల్పించాయని, మొత్తం ఉద్యోగుల సంఖ్య 5.43 మిలియన్లకు చేరుకుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (NASSCOM)గత వారం తెలిపింది. ఉద్యోగులు ఆఫీస్ కు రావాల్సిందే ఇక వర్క్ ఫ్రమ్ హోంలో ఉద్యోగుల్ని కార్యాలయాలకు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేయడంపై కృతివాసన్ స్పందించారు. ఆఫీస్ నుంచి పనిచేయడం వల్ల ఉద్యోగులు కొత్త కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. కానీ ఇంటి నుంచి, లేదంటే వారానికి మూడు రోజులు ఆఫీస్ కు రావడం వల్ల వ్యక్తిగతంగా ఉద్యోగులకు, సంస్థలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని నేను నమ్ముతున్నాను. ఒక సంస్థగా మేం ఉద్యోగులకు సహాకారం, స్నేహానికి విలువ ఇస్తాం. ఇదంతా ఆన్లైన్ లేదంటే జూమ్ కాల్ ద్వారా సాధ్యం కాదు. సీనియర్ల ఎలా పనిచేస్తున్నారో ఇంటి వద్ద నుంచి పనిచేసే వారికి ఏం తెలుస్తోంది? అని ప్రశ్నించారు. అంతేకాదు వర్క్ ఫ్రమ్ హోం కంటే ఆఫీస్ కి వచ్చి పనిచేయడమే సరైన మార్గమని విశ్వసిస్తున్నట్లు టీసీఎస్ సీఈఓ కృతివాసన్ తెలిపారు. -
ఐటీ ఉద్యోగుల గొంతెమ్మ కోరికలు.. టెక్ కంపెనీలు అందుకు ఒప్పుకుంటాయా?
ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్ధిక మాంద్యం భయాలు ఆందోళనకు గురిచేస్తున్న వేళ.. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు స్టార్టప్‌ల నుంచి పెద్ద కంపెనీలైన గూగుల్, అమెజాన్లు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. దీంతో ఉద్వాసనకు గురైన ఉద్యోగులు మరో కొత్త కంపెనీలో చేరడం పరిపాటిగా మారింది. వీరిలో కొంత మంది సంస్థలు తమని తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేయగా.. ఎక్కువ మంది తమకు మంచి సమయం ఇప్పుడు ప్రారంభమైందనే సోషల్ మీడియా వేదికగా తమ అనుభవాల్ని షేర్ చేస్తున్నారు. పైన పేర్కొన్న రెండు కేటగిరిలకు చెందిన ఉద్యోగులకు కాకుండా.. మూడో రకం కేటగిరీ ఉద్యోగులు మాత్రం గొంతెమ్మ కోరికలు కోరుతున్నట్లు తెలుస్తోంది. సంస్థలు ఉద్యోగులపై పెట్టే ఖర్చును తగ్గించుకుంటుంటే ఓ ఐటీ ఉద్యోగి తన కోరికల చిట్టా విప్పాడు. ‘ నాకు 4.5 ఏళ్ల అనుభవం ఉంది. ఏడాదికి రూ.43 లక్షల శాలరీ తీసుకుంటున్నాను. కానీ నెలవారీ భోజనానికి పెట్టే ఖర్చు ఎక్కువగా ఉంది. అందుకే రోజుకి నాలుగు సార్లు ఫ్రీగా భోజనం స్పాన్సర్ చేసే కంపెనీల కోసం వెతుకుతున్నాను. మంచి ప్రొటీన్ ఫుడ్ అందించే కంపెనీల్లో చేరడం, మొత్తం 4 మీల్స్ కోసం ఫుడ్ ఆఫర్ చేసే కంపెనీల గురించి ఆలోచిస్తున్నాను. నేను గూగుల్ ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్నాను. నా కొరికల్ని నెరవేర్చే కంపెనీలు ఇంకా ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నిస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌ను ఉద్యోగులు తమ కెరియర్ గురించి చర్చలు జరిపే నెట్వర్క్ ‘గ్రేప్‌వైన్’ ఫౌండర్ త్రిపాఠి షేర్ చేశాడు. అందులో ‘తమ ప్రాధాన్యతలు, భవిష్యత్తు గురించి చాలా స్పష్టత ఉన్న మీలాంటి వ్యక్తులను నేను చాలా అరుదుగా చూస్తాను. మంచి భోజనం కోసం జాబ్ మారాలని అనుకున్నారు. మీ ఆలోచన చాలా బాగుందని పేర్కొన్నాడు. I rarely see people with so much clarity about their priorities and future choices His reason to get his next job is simple: good food Whole discussion is quite good, 68 comments : https://t.co/XEBIOcNDee pic.twitter.com/1nHNWt0Qvr — Saumil (@OnTheGrapevine) February 15, 2024 త్రిపాఠి షేర్ చేసిన పోస్ట్‌ను ఇప్పటి వరకు సుమారు 77 వేల మంది కంటే ఎక్కువమంది వీక్షించారు. అందులో కొంత మంది తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. ‘అతను జొమాటోలో చేరాలి.. వారే చూసుకుంటారు’ అని మరొకరు సూచించారు. భారీ మొత్తంలో శాలరీ ప్యాకేజీ తీసుకుంటున్నా.. ఫ్రీ ఫుడ్ కోసం ఎంతలా తపిస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. ఓ నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేయగా.. ఈ సీటీసీ అతను తన సొంత ఫిట్నెస్ బ్రాండ్‌ను ప్రారంభించుకోవచ్చని మరొకరు రాశారు. చదవండి👉 : ఓలా మైండ్‌బ్లోయింగ్ ఆఫర్..అస్సలు మిస్సవ్వద్దు! -
‘వర్క్ ఫ్రం హోమ్’లో ఐటీ ఉద్యోగులు.. షాకిచ్చిన టీసీఎస్!
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ఉద్యోగులకు షాకిచ్చింది. త్వరలో పెరగనున్న జీతాలు, ప్రమోషన్లతో పాటు ఇతర సౌకర్యాలు రిటర్న్ టూ ఆఫీస్ పాలసీపై ఆధారపడి ఉంటాయని చెప్పనిట్లు సమాచారం. వేరియబుల్ చెల్లింపులను సైతం ఈ పాలసీతో అనుసంధానం చేసింది. అసైన్డ్ కోర్సులు పూర్తి చేసి, ప్రారంభంలో ఏడాదికి వేతనం రూ.3 లక్షలకు మించి శాలరీలు తీసుకుంటున్న ఫ్రెషర్లకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. అంతేకాదు ఉద్యోగులు ఇకపై వర్క్ ఫ్రం హోమ్ చేస్తామంటే కుదరదని, తప్పని సరిగా వాళ్లు ఆఫీస్‌కు రావాల్సిందేనని పట్టుబడుతోంది. పలు నివేదికల ప్రకారం.. ఉద్యోగులు తాము నివాసం ఉంటుంన్న ప్రాంతాలకు సమీపంలోని ఆఫీస్ కార్యాలయాలను ఎంపిక చేసుకోవద్దని కోరింది. తామే వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ఉద్యోగులు ఎక్కడి నుంచి పనిచేయాలని చెబుతామని సూచించింది. కోవిడ్-19 కేసుల వారీగా పరిమిత వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను హెచ్ఆర్ విభాగం అనుమతిస్తోందని నివేదిక తెలిపింది. కాగా, ఇప్పటికే ఇన్ఫోసిస్, విప్రో సహా పలు ఐటీ సంస్థలు ఉద్యోగులు ఆఫీసు నుంచి పనిచేయడాన్ని తప్పనిసరి చేశాయి. దీంతో వర్క్ ఫ్రం హోమ్ విధానం ముగిసినట్లేనని ఐటీ నిపుణులు భావిస్తుండగా.. విప్రో తప్పనిసరి హైబ్రిడ్ వర్క్ పాలసీని అమలు చేస్తోంది. ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయంలో భౌతికంగా హాజరు కావాల్సి ఉంటుంది’అని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. -
ఆర్థిక కష్టాల్లో అగ్రరాజ్యం.. ప్రమాదంలో ఐటీ ఉద్యోగుల భవిష్యత్!
అగ్రరాజ్యం అమెరికాను ఆర్థిక కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు జాబ్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి బడా బడా టెక్ కంపెనీల వరకూ ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. దీంతో 2024 జాబ్ మార్కెట్ మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అందుకు ఊతం ఇచ్చేలా 2022లో అమెరికన్ కంపెనీలు 363,832 మందికి లే-ఆఫ్‌లు ప్రకటించగా.. 2023లో గత ఏడాది అత్యధికంగా 721,677 మందికి ఉద్వాసన పలికాయి. ఆ మొత్తం తొలగింపుల్లో 168,032 మంది మెటా, అమెజాన్ ఉద్యోగులేనని అమెరికాకు చెందిన ప్రముఖ స్టాఫింగ్ సంస్థ ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ తెలిపింది. ‘లేబర్ కాస్ట్ ఎక్కువ. కాబట్టే ఈ ఏడాది సైతం సంస్థలు పొదుపు మంత్రం జపిస్తున్నాయి. క్యూ1లో నియామకాలు తగ్గించి..ఉద్యోగులకు కోత విధించేందుకు సిద్ధంగా ఉన్నాయని’ ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండీ ఛాలెంజర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. టెక్ కంపెనీల్లో ఎక్కువే కోవిడ్-19 వంటి సమయాల్లో ఓ వెలుగు వెలిగిన ఐటీ రంగం.. కృత్తిమ మేధ వంటి టెక్నాలజీ కారణంగా నేల చూపులు చూస్తోంది. ఆర్ధిక మాంద్యం, ప్రాజెక్ట్ లేమి వంటి సమస్యల్ని ఎదుర్కొంటున్న ఆయా టెక్ కంపెనీలు ఖర్చుల్ని తగ్గించుకునే పనిలో పడ్డాయి. అందుకు ఏఐ టెక్నాలజీ అస్త్రంగా ఉపయోగించుకుంటున్నాయి. ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతున్నాయని ఆండీ ఛాలెంజర్ తెలిపారు. టెక్నాలజీ తర్వాత ఈ రంగాల్లో తొలగింపులు ఎక్కువే ఈ ఏడాది మొత్తం సంస్థలు ఆర్ధిక సామర్ధ్యాలకు అనుగుణంగా ఉద్యోగుల్ని నియమించుకునేలా కసరత్తు చేస్తున్నట్లు ఛాలెంజర్ చెప్పారు. 2023లో రీటైల్ కంపెనీలు 78,840 మందిని తొలగించాయి. ఈ ఏడాది సైతం రీటైల్ రంగంలో తొలగింపులు ఉంటాయన్న ఛాలెంజర్..ఆ రంగం తర్వాత హెల్త్‌కేర్, ప్రొడక్ట్ మ్యానిఫ్యాక్చరింగ్ రంగాలు ఉద్యోగుల్ని తొలగించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి : ఉద్యోగులపై లేఆఫ్స్ కత్తి -
‘ఇంకోసారి జాబ్‌కి అప్లయ్ చేశావనుకో’.. అభ్యర్ధికి ఐటీ కంపెనీ చుక్కలు!
కోరుకున్న ఐటీ జాబ్. కోరుకున్నంత జీతం దక్కుతుందంటే ఎవరైనా ఏం చేస్తారా? ప్రయత్నిస్తారు..ప్రయత్నిస్తారు. చివరికి అనుకున్నది సాధిస్తారు. ఈ ప్రాసెస్‌లో లెక్కలేనని రిజెక్షన్లు ఎదరవుతుంటాయి. అని తెలిసినా ఆ జాబ్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం. అలా ఐటీ జాబ్ కోసం ప్రయత్నించిన ఓ ఉద్యోగికి చుక్కెదురైంది. ఓ అభ్యర్ధి పేరున్న సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కోసం అప్లయ్ చేశాడు. ఇంటర్వ్యూకి వెళ్లాడు. కానీ అక్కడ ఇంటర్వ్యూలో రాణించలేకపోయాడు. ఆ విషయాన్ని సదరు కంపెనీ యాజమన్యం అభ్యర్ధికి మెయిల్లో సమాచారం అందిచింది. ఆ మెయిల్లో..‘‘మేం నిర్వహించిన ఇంటర్వ్యూలో మీరు ఫెయిల్ అయ్యారు’’అని తెలిపింది. అంత వరకు బాగానే ఉంది. కానీ ‘‘ఇంకో సారి నువ్వు మా కంపెనీలో జాబ్ కావాలని అప్లయ్ చేశావనుకు ఊరుకునేది లేదు. ఏడాది వరకు ఇంటర్వ్యూ అటెండ్ కాకుండా బ్లాక్ చేస్తా’’ అని మెయిల్ పెట్టింది. ఆ మెయిల్ ఎందుకు అలా పెట్టిందనే అంశంపై స్పష్టత రానప్పటికీ ప్రస్తుతం ఈ అంశం ఐటీ కంపెనీల పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఐటీ కంపెనీ ఈ తరహా మెయిల్స్ పంపడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిలో చాలా మంది ఐటీ కంపెనీల పరిస్థితిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మీకు మేం ఉద్యోగం ఇవ్వలేం అమెరికా కేంద్రంగా ఎలైట్ సాఫ్ట్వేర్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఆ కంపెనీలో ఫ్రంటెండ్ డెవలప్ జాబ్ కోసం ఓ అభ్యర్ధి అప్లయ్ చేశాడు. అందుకు మా కంపెనీలో జాబ్ కోసం అప్లయ్ చేసినందుకు అభ్యర్థికి కృతజ్ఞతలు ఈమెయిల్ పంపింది. అందులో ఆటోమేటెడ్ ఆన్లైన్ పరీక్షను క్లియర్ చేయడంలో విఫలమైనందున జాబ్ ఇవ్వలేమని తెలిపింది. జాబ్ కోసం అప్లయ్ చేయొద్దు ఇంతవరకు అంతా బాగనే ఉంది. ‘‘ కనీసం వచ్చే ఏడాది చివరి వరకు మళ్లీ జాబ్ కోసం అప్లయ్ చేయొద్దని హెచ్చరించింది. ఈ సమయాని కంటే ముందే మళ్లీ ఈ స్థానానికి దరఖాస్తు చేయడానికి మీరు ప్రయత్నిస్తే, ఇంటర్వ్యూ కాల్ వస్తే మీ రెస్యూమ్ ఆటోమెటిక్‌గా బ్లాక్ అవుతుంది. భవిష్యత్‌లో మా కంపెనీలో ఇతర ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునే వెసులు బాటు కూడా ఉండదు’’ అని ఈమెయిల్లో పేర్కొంది. మమ్మల్ని నిందించడం మానేసి పైగా ఆన్లైన్ ఆటోమెషిన్ పంపే మెయిల్స్ వల్ల అభ్యర్ధులు ఇబ్బంది పడుతుంటే..పరిష్కారం చూడాల్సి కంపెనీ.. జాబ్ రాలేదని, లేదంటే బ్లాక్ చేసిందని కంపెనీని నిందించడం మానేసి తమను తాము మెరుగుపరుచుకోవాలని సూచించింది. ఉద్యోగులతో ఎలా వ్యవహరిస్తుందో దీనిపై నెటిజన్లు పలు విధాలు స్పందిస్తున్నారు. ఈ సాకుతోనైనా ఆ కంపెనీలో జాబ్ కోసం ప్రయత్నిస్తా అని ఒకరు అంటుంటే .. ‘‘ఇంటర్వ్యూ అభ్యర్ధులతో ఇలా ప్రవర్తిస్తే.. వారి ఉద్యోగులతో ఎలా వ్యవహరిస్తుందో ’’ఊహించుకోండి అని మరొకరు కామెంట్ చేశారు. -
యూజ్డ్ ఐటీ హార్డ్‌వేర్.. నిబంధనల్లో మార్పులివే..
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్లలోని (సెజ్) యూనిట్లు ఉపయోగించిన ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తులను (ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మానిటర్లు, ప్రింటర్లు) బైటికి తరలించడానికి సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం సడలించింది. దేశీ టారిఫ్ ఏరియాల్లో (డీటీఏ) తాము సొంతంగా వినియోగించుకోవడానికి మాత్రమే లైసెన్సు అవసరం లేకుండా కంపెనీలు వాటిని సెజ్‌ల నుంచి తరలించవచ్చని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. అయితే, ఆ పరికరాలను సెజ్ యూనిట్లలో కనీసం రెండేళ్ల పాటు ఉపయోగించి ఉండాలి. అయిదేళ్ల కన్నా పాతవై (తయారీ తేదీ నుంచి) ఉండకూడదు. దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల దిగుమతులపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం స్వల్పంగా సడలించిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా దేశీ మార్కెట్లోని సంస్థలు వాటిని దిగుమతి చేసుకోవాలంటే లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, కస్టమ్స్ చట్టాలపరంగా సెజ్‌లను విదేశీ భూభాగంగా పరిగణించడం వల్ల వాటిలోని యూనిట్లకు సుంకాలపరమైన మినహాయింపులు ఉంటాయి. కానీ, సెజ్‌లలోని సంస్థలు తమ ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాల్లోకి తీసుకువస్తే .. వాటిని దిగుమతులుగా పరిగణిస్తారు. తదనుగుణంగా సుంకాలూ వర్తిస్తాయి. -
రూ.284 కోట్ల పన్ను చెల్లించండి.. జైడస్‌కు ఐటీ శాఖ నోటీసులు
న్యూఢిల్లీ: జైడస్ లైఫ్ సైన్సెస్ అనుబంధ సంస్థ జైడస్ హెల్త్‌కేర్ లిమిటెడ్‌కు ఆదాయపన్ను శాఖ నుంచి రూ.284.58 కోట్ల మేర నోటీసు జారీ అయింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 143(1) కింద జారీ అయిన ఈ డిమాండ్ నోటీసు, 2023–24 అసెస్మెంట్ సంవత్సరానికి చెందినదని సంస్థ ఎక్సే్చంజీలకు తెలిపింది. రిటర్నుల్లో స్పష్టమైన తప్పుల కారణంగానే ఇది చోటు చేసుకుందని, తప్పొప్పులను సరిదిద్దిన అనంతరం మొత్తం పన్ను డిమాండ్ తొలగిపోతుందని భావిస్తున్నట్టు పేర్కొంది. పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ సూచనలు కాగా, పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన రిటర్నుల్లోని సమాచారం, రిపోర్టింగ్ ఎంటెటీల (బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు, బ్రోకరేజీలు తదితర) నుంచి అందిన సమాచారం మధ్య పోలిక లేని కేసుల్లో.. వారికి సూచనలు పంపినట్టు ఐటీ శాఖ ప్రకటించింది. టీడీఎస్/టీసీఎస్‌కు, దాఖలు చేసిన ఐటీఆర్‌లోని సమాచారం మధ్య వ్యత్యాసం ఉన్న వారికి కూడా సూచనలు పంపింది. -
ఐటీ హబ్‌గా అవతరించనున్న విశాఖ
ఐటి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన వృద్ధిని నమోదు చేసిందని కేంద్రం ఐటీ మంత్రిత్వశాఖకు చెందిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (STPI) ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. 2018-19 నాటికి ఆంధ్రప్రదేశ్ ఐటి ఎగుమతుల విలువ రూ. 986 కోట్లు ఉండగా.. 2022-23 నాటికి ఎగుమతులు గణనీయంగా పెరిగి రూ. 1867 కోట్లకు చేరుకున్నాయని స్టెపి నివేదిక తెలిపింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ ఎగుమతులు 90 శాతం పెరిగినట్లు నివేదికలో పేర్కొంది. అవకాశాల వెల్లువ ఇక 2018-19 నాటికి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ ఉద్యోగులు 14527 మంది ఉండగా.. 2022-23 నాటికి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ ఉద్యోగుల 24719 కి పెరిగారు. గత 4 ఏళ్లలో వేలాది మంది ఉపాధి పొందారు. దీనికి తోడు కొత్తగా ప్రారంభమైన ఇన్ఫోసిస్‌తో పాటు విస్తరిస్తున్న ఐటీ కంపెనీల 2023-24 సంవత్సరంలో ఏపీ ఐటి ఎగుమతులు మరో 20శాతం పెరగనున్నట్లు అంచనా. తద్వారా వేల ఐటీ ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. విశాఖ పెట్టుబడలు వరద విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి టీసీఎస్,హెచ్‌సీఎల్,యాక్సెంచర్‌తో పాటు ఇతర దిగ్గజ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఫలితంగా రానున్న రోజుల్లో విశాఖ ఐటీ హబ్‌గా అవతరించనుంది. హర్షం వ్యక్తం చేస్తున్న నిపుణులు ఇక రాష్ట్రంలో ఐటీ ఉద్యోగ అవకాశాలు అంతకంతకూ పెరుగుతుండడం విద్యార్ధులకు, నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ధిక అనిశ్చితి, తొలగింపులు వంటి క్లిష్ట సమయాల్లో రాష్ట్రంలో ఉపాధి అవకాశాల్లో వృద్ది సాధించడంపై ఐటీ రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఈ కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగం వచ్చినట్లే.. మార్కెట్లో డిమాండ్ ఉన్న జాబ్స్ ఇవే!
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో నియామకాలు అంతంత మాత్రంగానే ఉంటున్నప్పటికీ కొన్ని విభాగాల్లో నిపుణులకు మాత్రం డిమాండ్ మెరుగ్గానే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఈఆర్పీ (ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్), ఆటోమోటివ్ డిజైన్, టెస్టింగ్, ఆడ్మినిస్ట్రే షన్ వంటి విభాగాల్లో నైపుణ్యాలు ఉన్న వారికి డిమాండ్ నెలకొన్నట్లు బిజినెస్ సొల్యూషన్స్ సేవల సంస్థ క్వెస్ కార్ప్ ఒక నివేదికలో తెలిపింది. ‘ఈమధ్య కాలంలో తొలిసారిగా పెద్ద ఐటీ సర్వీసుల కంపెనీల్లో సిబ్బంది సంఖ్య, గైడెన్స్ తగ్గింది. ఇది, రాబోయే రోజుల్లో ఆచి తూచి అడుగులు వేయాలని పరిశ్రమ సమిష్టిగా నిర్ణయించుకున్నట్లు సూచిస్తోంది. మళ్లీ పరిస్థితి మెరుగుపడే వరకు ఒకట్రెండు త్రైమాసికాల పాటు ఈ అనిశ్చితి కొనసాగుతుందని భావిస్తున్నాం‘ అని క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈవో విజయ్ శివరామ్ చెప్పారు. నైపుణ్యాలను పెంచుకుంటే బోలెడు అవకాశాలు.. కంపెనీలు తమ వ్యాపార నిర్వహణ విధానాలను మార్చుకుంటున్నాయని, వచ్చే రెండేళ్లలో కృత్రిమ మేథ (ఏఐ)పై ఇన్వెస్ట్ చేయాలని 85 శాతం పైగా భారతీయ సంస్థలు భావిస్తున్నాయని విజయ్ శివరామ్ తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంపై ఇన్వెస్ట్ చేసే వారికి అపార అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) వ్యవస్థ గణనీయంగా వృద్ధి చెందుతోందని, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో దేశీ ఐటీ రంగానికి మరిన్ని కొత్త సాంకేతికతలు తోడయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. క్వెస్ ఐటీ స్టాఫింగ్ తమ కార్యకలాపాల్లో భాగంగా గమనించిన డిమాండ్, సరఫరా గణాంకాల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. ఈఆర్పీ, ఆటోమోటివ్ డిజైన్, టెస్టింగ్, డెవలప్మెంట్, అడ్మినిస్ట్రేషన్ అనే 5 నైపుణ్యాలకు .. నియామకాలకు సంబంధించిన మొత్తం డిమాండ్‌లో 65 శాతం వాటా ఉంది. వీటితో పాటు జెన్ ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్, ఆటోమోటివ్ ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ, నెట్వర్కింగ్ స్పెషలైజేషన్ మొదలైన నైపుణ్యాలు ఉన్న వారికి కూడా డిమాండ్ నెలకొంది. టెక్నాలజీ హబ్‌గా పేరొందిన బెంగళూరును దాటి ఐటీ రంగం ఇతర ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తోంది. వర్ధమాన టెక్ హబ్‌లైన హైదరాబాద్‌తో పాటు పుణె, ముంబై, చెన్నై, ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) కూడా గణనీయంగా ఎదుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో టెక్నాలజీ సంబంధ పరిశ్రమలు వృద్ధి చెందుతుండటం, దేశ విదేశాలకు చెందిన దిగ్గజ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తుండటం మొదలైన అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయి. -
ఐటీకి బ్యాడ్ టైమ్.. 25 ఏళ్ల టెక్నాలజీ చరిత్రలో ఇదే తొలిసారి!
భారత ఐటీ రంగం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. చాలా వరకు ప్రాజెక్టులు తగ్గిపోయాయి. క్లయింట్స్ తగ్గిపోయారు. ఇదే సమయంలో చాలా వరకు దిగ్గజ ఐటీ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు ఉద్యోగులను తీసేయడంతో పాటు.. కొత్త నియామకాలను కూడా నిలిపివేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్స్ ఇచ్చి చేర్చుకోవడంలో జాప్యం చేస్తున్నాయి. వారిని వేతనాలు తగ్గించుకొని చేరాలని చెబుతున్నాయి. ఫలితంగా జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఐటీ సేవలందించే 10 కంపెనీలలో తొమ్మిదింటిలో నియామకాలు తగ్గాయి. నివేదిక ప్రకారం, 25 ఏళ్ల దేశ ఐటీ రంగ చరిత్రలో నియామకాలు తగ్గడం ఇదే తొలిసారి. జులై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ2) ముగింపు నాటికి ప్రముఖ టాప్ 10 భారత ఐటీ కంపెనీల్లో వర్క్‌ఫోర్స్ 2.06 మిలియన్లకు పడిపోయింది. త్రైమాసికం ప్రారంభంలో ఈ సంస్థలు 2.11 మిలియన్ల ఉద్యోగులను కలిగి ఉన్నాయి. ఒక్క ఎల్ అండ్ టీ మాత్రమే ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ మాత్రమే ఉద్యోగుల నియామకాల్లో వృద్దిని సాధించింది. క్యూ2లో 32 మంది ఉద్యోగులను నియమించుకుంది. తద్వారా హెడ్‌కౌంట్‌ను ఆల్ టైమ్ హై 22,265కి చేరింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్, విప్రో, టెక్ మహీంద్రా, పెర్సిస్టెంట్ సహా ఇతర ప్రధాన సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి. అనిశ్చితే కారణం ఈ సందర్భంగా టీమ్‌లీజ్ డిజిటల్ స్టాఫింగ్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ చెమ్మన్‌కోటిల్‌ను మాట్లాడుతూ..మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఉద్యోగుల నియమకాలు తక్కువగా ఉన్నాయి. చివరి నాటికి ఈ హెడ్‌కౌంట్ ఇంకా తగ్గే అవకాశం ఉంది. వర్క్ ప్రొడక్టివిటీని పెంచే టెక్నాలజీతో పాటు గిగ్స్ వంటి విభాగాల ఉద్యోగుల నియామకాలు ఉంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. -
ఐటీ డెస్టినీ విశాఖ
సాక్షి, విశాఖపట్నం : భారత్‌ను నడిపించే చోదక శక్తులుగా మారుతున్న టైర్–2 నగరాల్లో ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు.. తమ శాఖల్ని విస్తరించుకుంటున్నాయి. మెట్రో నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతూ.. సకల సౌకర్యాలతో పరిఢవిల్లుతున్న టైర్–2 నగరాల్లో మిన్నగా ఉన్న విశాఖను మొదటి ఆప్షన్‌గా ఎంపిక చేసుకుంటూ తమ సంస్థ కార్యాలయాల్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. అద్భుతమైన ఐటీ పాలసీని ప్రవేశపెడుతూ.. మరోవైపు ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు హబ్‌గా త్వరలోనే అభివృద్ధి చెందేందుకు విశాఖపట్నంలో అపారమైన అవకాశాలున్నాయని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ప్రభుత్వం బీచ్ ఐటీ కాన్సెప్ట్‌ని ప్రమోట్ చేసింది. అందుకే అంతర్జాతీయంగా పేరొందిన ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు విశాఖకు తరలివస్తున్నాయి. టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్ఎస్ మొదలైన ఐటీ, ఐటీ అనుబంధ దిగ్గజ సంస్థలు విశాఖ వైపు అడుగులు వేశాయి. తాజాగా ఇన్ఫోసిస్ సంస్థ తన డెవలప్మెంట్ సెంటర్ కార్యకలాపాలను మొదలుపెడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఇన్ఫోసిస్ని ప్రారంభించనున్నారు. తొలి దశలో 1000 మందితో కార్యకలాపాలు ప్రారంభించి దశలవారీగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అడుగులు వేస్తున్న మరిన్ని సంస్థలు ఇన్ఫోసిస్ మాదిరిగా విశాఖలో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు అనేక ఐటీ సంస్థలు ముందుకు వస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 2006లో విప్రో క్యాంపస్‌కు స్థలాన్ని కేటాయించారు. 750 మందితో ప్రారంభించాలని భావించినా.. చంద్రబాబు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో 300 మందితో ప్రస్థానం మొదలు పెట్టింది. ఇప్పుడు కార్యకలాపాల జోరు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం విప్రో ప్రతినిధులతో చర్చించింది. దశల వారీగా 1000 సీట్లకు విస్తరించేందుకు సిద్ధమని ప్రకటించింది. వర్చువల్ డెస్క్‌టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(వీడీఐ), క్లౌడ్ ప్రాజెక్టులకు కేంద్రంగా విశాఖ క్యాంపస్‌ని మార్చాలని నిర్ణయించింది. విశాఖలో స్టార్టప్‌ల ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్) సీఈవో సంజీవ్ మల్హోత్రా ప్రకటించారు. అదేవిధంగా ఐటీ రంగంలో తిరుగులేని నగరంగా విశాఖను అభివృద్ధి చేసేందుకు ఇక్కడే ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీ రీసెర్చ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఐటీ పరిశోధనలు, అభివృద్ధిలో భాగంగా.. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎకోసిస్టమ్‌ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు కేంబ్రిడ్జిలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) సహకారంతో పాటు సంయుక్త సర్టిఫికేషన్ కోర్సుల్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం ఐఏఎస్ అధికారులతో కూడిన ప్యానెల్‌ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అపారమైన అవకాశాలు ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు హబ్‌గా త్వరలోనే అభివృద్ధి చెందేందుకు విశాఖలో అపారమైన అవకాశాలున్నాయి. ఐటీ పరిశ్రమలన్నీ తమ తదుపరి డెస్టినేషన్‌గా ద్వితీయ శ్రేణి నగరాల్ని ఎంపిక చేసుకుంటున్నాయి. ఐటీ సర్వీస్ సెక్టార్ పరిశ్రమల ఏర్పాటుకు వైజాగ్ వంటి నగరాలే మొదటి ప్రాధాన్యం. ఐటీ సంస్థలకు కావల్సిన మానవ వనరుల్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎమర్జింగ్ టెక్నాలజీ, కోర్ ఐటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులపై సంస్థలు దృష్టిసారిస్తూ విశాఖలో కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. – కిరణ్‌రెడ్డి, ఎపిటా గ్రూప్ సీఈవో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ మహానేత వైఎస్ హయాంలోనే.. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే విశాఖలో ఐటీకి అడుగులు పడ్డాయి. మధురవాడలోని మూడు కొండల మధ్య 300 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సెజ్‌లో తొలిదశలో ఇన్ఫోటెక్, సింబియాసిస్, మిరాకిల్, కెనెక్సా వంటి ప్రముఖ ఐటీ కంపెనీలు సహా మొత్తం 26 సంస్థలు తరలివచ్చాయి. క్రమంగా సంస్థలు పెరిగాయి. అయితే.. రూ.1800 కోట్లకు చేరుకున్న ఎగుమతులు ఆయన మరణానంతరం చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక.. రూ.1400కి పడిపోయాయి. అనంతరం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖలో ఐటీ అభివృద్ధిపై సీఎం వైఎస్ జగన్ దృష్టిసారించారు. గత ప్రభుత్వ హయాంలో బకాయి పడ్డ వందకోట్ల ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేశారు. అద్భుతమైన ఐటీ పాలసీని రూపొందించిన ప్రభుత్వం దిగ్గజ సంస్థల్ని ఆకర్షిస్తోంది. -
‘జీతంలో జీవితం ఉండదు బ్రదర్’, రూ.3 కోట్ల జీతాన్ని వద్దనుకున్న ఉద్యోగి
జీతంలో జీవితం ఉండదనుకున్నాడో ఏమో ఓ ఐటీ ఉద్యోగి తాను చేస్తున్న జాబ్‌కు రాజీనామా చేశాడు. రూ.కోట్లలో జీతం, పెద్ద ఉద్యోగాన్ని వదులుకున్నందుకు హాయిగా ఉందని అంటున్నాడు. ఇంతకీ ఆ ఉద్యోగి కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం పదండి ఎరిక్ యు (28) మెటా ఉద్యోగి. జీతం రూ.3 కోట్లు. అంతా బాగానే ఉంది. కానీ జాబ్ చేసే సమయంలో గుండె వేగంగా కొట్టుకోవడం, చెవులు పగిలిపోయా శబ్ధాలు వచ్చేవి. అయినప్పటికీ, కోడింగ్‌తో కుస్తీ పట్టాడు. చివరికి తీవ్ర భయాందోళనల మధ్య మెటాకు రిజైన్ చేసి బయటకొచ్చాడు. ఇప్పుడు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నట్లు లింక్డిన్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. కష్టపడ్డా.. జాబ్ సంపాదించా ఊహ తెలిసిన వయస్సు నుంచే ఫేస్బుక్లో పనిచేయాలన్న కోరిక బలంగా ఉండేది. అందుకు తగ్గేట్లే కష్టపడ్డా. నా స్కిల్‌కు గూగుల్‌లో ఉద్యోగం వచ్చినా మెటాలో పనిచేసేందుకు మొగ్గు చూపా. ఎందుకంటే? మెటా క్యాంపస్ చాలా బాగుంటుంది. కానీ నేను తీసుకున్న నిర్ణయం తప్పని తర్వాతే తెలిసింది. భయంకరమైన ఒత్తిడికి గురైన తాను మెటాలో తన అనుభవాల్ని నెటిజన్లతో పంచుకున్నాడు. View this post on Instagram A post shared by Eric Yu (@helloericyu) అదృష్టాన్ని పరీక్షించి ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఎంతో ప్రయత్నించా. అదృష్టవశాత్తూ, మెటాలో పనిచేస్తున్న నా స్నేహితురాలు వాండా (ఇప్పుడు ఎరిక్ కాబోయే భార్య) నాలో ఆందోళల్ని గుర్తించింది. అందుకే ఆ ఒత్తిడి నుంచి బయట పడేలా ప్రయత్నించారు. ఇతర ఆదాయా మార్గాల్ని అన్వేషించా. చివరికి రియల్ ఎస్టేట్‌లో అదృష్టాన్ని పరీక్షించుకున్నా. మెటా నుంచి బయటకొచ్చినట్లు చెప్పుకొచ్చాడు. రూ.3 కోట్ల జీతం అంటే మాటలా 370,000 డాలర్లు (రూ.3 కోట్లు) ఉద్యోగాన్ని వదిలివేయడం పిచ్చి పనే అని నాకు తెలుసు. మెటాలో కొనసాగితే ఆర్ధిక భద్రత ఉండేది. అయితే అది నాకు సరైనది కాదని భావిస్తున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న యుకు’ ఇలాగే కొనసాగుతానని మాత్రం చెప్పడం లేదు. భవిష్యత్ బాగుండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు లింక్డిన్ పోస్ట్‌లో ముగించాడు. -
పెట్టుబడులు ఆకర్షించేలా వసతుల కల్పన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో పనిచేస్తోందని ఐటీ, మునిసిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు. నగరంలో ఐటీ, దాని అనుబంధ రంగాలతోపాటు లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ రంగాల్లోనూ భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేలా చేపట్టిన మౌలిక వసతుల కల్పన ఆశించిన ఫలితాలను ఇస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రగతి, హైదరాబాద్ అభివృద్ధిపై అధ్యయనం కోసం మహారాష్ట్ర నుంచి 250 మందితో కూడిన రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధుల బృందం మూడు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చింది. శనివారం వారు టీ–హబ్‌లో కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారులకు కల్పిస్తున్న సదుపాయాల కారణంగానే ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో తమ అతిపెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేశాయన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరు నగరాన్ని హైదరాబాద్ వరుసగా రెండేళ్లు దాటేసిందన్నారు. ఐటీ ఎగుమతులతోపాటు ధాన్యం ఉత్పత్తిలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా విప్లవాత్మకమైన టీఎస్ ఐపాస్, భవన నిర్మాణాల అనుమతుల కోసం టీఎస్ బీపాస్‌ను ప్రవేశపెట్టామన్నారు. టీఎస్–బీ పాస్ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు రియల్ ఎస్టేట్ రంగ భాగస్వాములతో ముఖ్యమంత్రి స్వయంగా సమావేశమై ఒక్కరోజే 7 జీవోలను జారీ చేశారని గుర్తుచేశారు. ఇప్పటికే తెలంగాణ విధానాలను, పథకాలను అనేక రాష్ట్రాలు వచ్చి అధ్యయనం చేసి వెళ్లాయన్నారు. అందుకే తెలంగాణ ఈరోజు చేసిన కార్యక్రమాలను భారతదేశం రేపు అనుసరిస్తుందని అంటున్నారని చెప్పారు. మహారాష్ట్రతో అనుబంధం వీడనిది విద్యార్థిగా పుణేలో చదివిన రోజుల నుంచి మహారాష్ట్రతో తనకు అనుబంధం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని అనేక జిల్లాలు చరిత్రాత్మకంగా తెలంగాణతో అనుబంధాన్ని కలిగి ఉన్నాయని, ఇవి గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్నాయని గుర్తు చేశారు. అందుకే తెలంగాణ, మహారాష్ట్ర మధ్యన సాంస్కృతిక, మానవ సంబంధాలు బలంగా ఉన్నట్లు చెప్పారు. దేశంలో ముంబై తర్వాత ఎత్తైన భవనాలు కలిగిన నగరంగా హైదరాబాద్ స్థానం సంపాదించుకుంటుందన్నారు. బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా అభివృద్ధి: మహారాష్ట్ర ప్రతినిధి బృందం హైదరాబాద్ గత పదేళ్లలో అద్భుతంగా అభివృద్ధి చెందిందని మహారాష్ట్ర ప్రతినిధులు వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పాటు కన్నా ముందు హైదరాబాద్‌లో ఉన్న పరిస్థితి తమకు గుర్తుందని, పాలకులకు సరైన విజన్ ఉంటే అభివృద్ధి చెందుతుందనడానికి హైదరాబాద్ నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ వేగాన్ని మించి అభివృద్ధి చెందుతుందని ప్రశంసలు కురిపించారు. -
విప్రో గ్లోబల్ ఏఐ హెడ్‌గా 'బ్రిజేష్ సింగ్' - ఆయన బ్యాగ్రౌండ్ ఇదే!
ప్రముఖ ఐటీ సంస్థ 'విప్రో' (Wipro) తన గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హెడ్‌గా భారతీయ ఐటీ దిగ్గజం మాజీ డెలాయిట్ ఎగ్జిక్యూటివ్ 'బ్రిజేష్ సింగ్'ను ఎంపిక చేసింది. కంపెనీ పోర్ట్‌ఫోలియో అంతటా AI అడాప్షన్‌ను వేగవంతం చేయడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించనున్నారు. బ్రిజేష్ సింగ్ టెక్నాలజీ కన్సల్టింగ్ స్పేస్‌లో 30 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నాడు. అంతే కాకుండా ఈయన గతంలో డెలాయిట్‌లో సీనియర్ భాగస్వామిగా, డేటా-లీడ్ ట్రాన్స్ఫర్మేషన్ను నడపడంలో బాధ్యత వహించినట్లు తెలుస్తోంది. లింక్డ్ఇన్ ప్రకారం ఈయన BIT సింద్రీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: నీరు తాగి మనిషి చేతులు కడిగిన చింపాంజీ - ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్! ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో కంపెనీ 1 బిలియన్ డాలర్ల పెట్టుబడితో Wipro ai360 ప్రారంభించిన తర్వాత సింగ్ నియామకం జరిగింది. కావున దీని అభివృద్ధికి ఈయన కొత్త వ్యూహాలు రచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకూండా ఈ మొత్తం పోర్ట్‌ఫోలియోను వేగవంతం చేసే సామర్థ్యాలను పెంపొందించడంలో కూడా ఆయన ప్రధాన పోషించాల్సి ఉంది. -
పాపం టెక్కీ, 2 నిమిషాలు హిందీలో మాట్లాడితే ఉద్యోగం పోయింది!
బంధువు మరణంపై ఫోన్లో తన కుటుంబ సభ్యులతో హిందీలో మాట్లాడినందుకు టెక్కీ జాబ్ పోగొట్టుకున్నారు. అకారణంగా తనని జాబ్ నుంచి తొలగించినందుకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు న్యాయ పోరాటానికి దిగారు. భారత్‌కు చెందిన 78 ఏళ్ల అనిల్ వర్ష్నే 2002 నుంచి అమెరికాలో శత్రుదేశాలు బాలిస్టిక్ క్షిపణి లక్ష్యాల నుంచి యూఎస్ రక్షణదళాల్ని రక్షించేలా ఇంటిగ్రేటెడ్, లేయర్డ్ మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ విభాగంలో అమెరికా ఫెడరల్ ఏజెన్సీ తరుపున పార్సన్స్ కార్పొరేషన్ అనే సంస్థలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబరు 26, 2022న ఆఫీస్‌లో తలా మునకలైన అనిల్‌కు అవతల వ్యక్తి నుంచి ఫోన్ కాల్. భారత్‌లోని బంధువులు చనిపోయారనేది ఆ కాల్ సారాంశం. ఫోన్ చేసింది ఆయన బావమరిదే. ఫోన్ కాల్ సంభాణ అంతా హిందీలో జరిగింది. అదే ఆయన చేసిన తప్పు. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు. సంస్థ రహస్యాల్ని ఎవరికో షేర్ చేస్తున్నారు’ అంటూ భారత టెక్కీ ఫోన్ కాల్‌పై అనుమానంగా ఉంది అంటూ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుతో సమాచారం అందుకున్న యాజమాన్యం టెక్కీ అనిల్‌ను విధుల నుంచి తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నాకు అన్యాయం జరిగింది దీంతో అన్యాయంగా తనని ఉద్యోగం నుంచి తొలగించారంటూ బాధితుడు అనిల్ అలబామాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్లోపార్సన్స్ కార్పొరేషన్, యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్లపై దావా వేసినట్లు ఆలబామా స్థానిక మీడియా సంస్థ ఏఎల్. కామ్ నివేదించింది. దావాలో ‘గత ఏడాది భారత్‌లో బంధువు మరణంపై బావమరిదితో దాదాపు రెండు నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడా. ఆ సమయంలో సంస్థలోని అత్యంత సున్నితమైన రహస్యాల్ని చేరవేస్తున్నానని తప్పుగా భావించిన శ్వేత జాతీయుడు ఫిర్యాదు చేశాడని, సహోద్యోగి ఫిర్యాదుతో కంపెనీ నన్ను విధుల నుంచి తొలగించిందని దావాలో పేర్కొన్నారు. ఇక, ఆ ప్రాంతంలో ఫోన్ మాట్లాడకూడదన్న నిషేదాజ్ఞలు కూడా లేవు. అయిననప్పటికీ నేను భద్రతా ఉల్లంఘనకు పాల్పడ్డారని యాజమాన్యం తన ఫిర్యాదులో తెలిపింది. ఇప్పుడు నా భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. అమెరికా మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ (MDA)తో కలిసి పనిచేయకుండా ఆంక్షలు విధించారని వాపోయారు. మేం తప్పు చేయలేదు తాజాగా ఈ ఏడాది జూలై 24న కోర్టుకు దాఖలు చేసిన ప్రతిస్పందనలో పార్సన్స్ తాము ఎలాంటి తప్పు చేయలేదని ఖండించింది. అంతేకాదు, వర్ష్నే వేసే దావాను కొట్టివేయాలని కోరింది. తన న్యాయవాదుల ఫీజులు, ఇతర ఖర్చులు సైతం ఖర్చులను చెల్లించాలని కోరినట్లు తెలుస్తోంది. ఏల్.కామ్ ప్రకారం.. అనిల్ తన దావాలో తొలగించిన ఉద్యోగం తిరిగి ఇప్పించాలని, సంస్థ నిబంధనల్ని ఉల్లంఘించారని పేర్కొన్న రికార్డ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తన ఉద్యోగాన్ని పునరుద్ధరించకపోతే జాబ్ నుంచి తొలగించినందుకు నష్టపరిహారం, న్యాయవాదుల రుసుములతో పాటు, ప్రయోజనంతో కూడిన ముందస్తు చెల్లింపులు, మానసిక వేదన అనుభవించినందుకు నష్టపరిహారాన్ని కోరనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. బెనారస్ హిందూ యూనివర్సిటీ నుండి అనిల్ వర్షి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. 1968లో అమెరికాకు వలస వచ్చారు. అతను జూలై 2011 నుండి అక్టోబర్ 2022 వరకు పార్సన్స్ హంట్స్‌విల్లే కార్యాలయంలో పనిచేశాడు. సిస్టమ్స్ ఇంజనీరింగ్‌లో కాంట్రాక్టర్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తింపు పొందాడు. భూమి ఆధారిత క్షిపణి రక్షణ కార్యక్రమంలో 5 మిలియన్లను ఆదా చేసినందుకు మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ సిఫార్స్ లేఖను అందుకున్నారు. -
టీసీఎస్ కీలక నిర్ణయం.. సీనియర్ మేనేజ్మెంట్ పదవుల్లో మార్పులు
ప్రముఖ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో కీలక మార్పులు చేసినట్లు తెలిపింది. కంపెనీ కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయం ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ►టీసీఎస్‌లోని మార్పులతో సంస్థ మాజీ గ్లోబుల్ హెడ్ ఫర్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) కే.కృతివాసన్ సీఈవో, ఎండీగా నియమించింది. ►బీఎస్ఈ ఫైలింగ్‌లో ప్రస్తుతం టీసీఎస్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్,రాజశ్రీని సీనియర్ మేనేజ్మెంట్ పర్సనల్ (ఎస్ఎంపీ) బాధ్యతల నుంచి తొలగించింది. జులై 31 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. వైస్ ప్రెసిడెంట్‌గా ప్రమోషన్ ఇచ్చింది. ►ఇక, టీసీఎస్‌లో 21 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న గ్లోబుల్ మార్కెట్ న్యూ చీఫ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అభినవ్ కుమార్ ఇకపై పూర్తి స్థాయిలో యూరప్ మార్కెట్‌పై దృష్టి సారించనున్నారు. ►జులై 31న టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కే.అనంత్ కృష్ణన్ రీటైర్ కానున్నారు. ►ఆగస్ట్ 1 నుంచి టీసీఎస్‌లో 18 ఏళ్ల నుంచి 32 ఏళ్ల వరకు విధులు నిర్వహిస్తున్న హారిక్ విన్, శంకర్ నారాయణ్, వి. రాజన్న, శివ గణేశన్, అశోక్ పై, రెగురామన్, అయ్యాస్వామీ’లు సీనియర్ మేనేజ్మెంట్ పర్సనల్ (ఎస్ఎంపీ)గా బాధ్యతలు చేపట్టనున్నారు. చదవండి👉 టెక్ దిగ్గజం టీసీఎస్‌కు భారీ షాక్.. ఇదేం పద్ధతంటూ కోర్టు చివాట్లు! -
ఇన్ఫోసిస్ నుంచి వేల మంది - ఐటీ ఉద్యోగుల్లో..
కరోనా మహమ్మారి భారతదేశంలో వ్యాపించినప్పటి నుంచి ఐటీ పరిశ్రమ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఈ ప్రభావం ఇప్పటికి కూడా అలాగే ఉండటం గమనార్హం. కొన్ని కంపెనీలు ఇప్పటికీ తమ ఉద్యోగుల వేతనాలను పెంచకపోగా.. మరి కొన్ని సంస్థలు ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. తాజాగా 'ఇన్ఫోసిస్' (Infosys) ఈ ఆర్థిక సంవత్సరం త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఇందులో చాలా మంది ఎంప్లాయిస్ సంస్థను వీడి వెళ్లినట్లు తెలిసింది. నిజానికి కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత ఐటీ సంస్థలు కొంత ఊపిరి పీల్చుకోగలుగుతున్నాయి. ఈ కారణంగానే స్వల్ప లాభాలను పొందగలుగుతున్నాయి. ఇన్ఫోసిస్ నికర లాభం, ఆదాయం వంటివి మునుపటికంటే కూడా కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ 2023 ఏప్రిల్ & జూన్ సమయంలో ఏకంగా 6,940 మంది ఉద్యోగులు కంపెనీ నుంచి వెళ్లినట్లు నివేదికలు చెబుతున్నాయి. కాగా ప్రస్తుతం సంస్థలో 3,36,294 మంది ఉన్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఐటీ కంపెనీల కీలక ప్రకటన!) ఇన్ఫోసిస్‌లో మాత్రమే కాకుండా విప్రోలో 8812 మంది, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీలో 2506 మంది ఉద్యోగులు తగ్గుముఖం పట్టడం గమనార్హం. అయితే టీసీఎస్ సంస్థలో 523 మంది కొత్త ఉద్యోగులు చేరినట్లు సమాచారం. అంతే కాకుండా ఇన్ఫోసిస్ తమ ఉద్యోగుల జీతాల పెంపులో కూడా కొంత వాయిదా వేసింది. ఈ బాటలోనే మరి కొన్ని కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. ఇది కూడా ఉద్యోగులు తగ్గడానికి కారణం అని తెలుస్తోంది. -
అందరూ ఐటీ ఉద్యోగులే, లక్షల్లో ప్యాకేజీలు..ఎవర్ని పెళ్లి చేసుకోవాలో చెప్పరా! ప్లీజ్!
సాఫ్ట్వేర్! ఇదేదో డిగ్రీ పేరో, కోర్స్ పేరో కాదు. ఇండియాలో ఇదో లైఫ్‌స్టైల్. కొత్తగా రెక్కలొచ్చిన పక్షి ఎంత స్వేచ్ఛగా ఎగిరిపోతుందో.. అంతకన్నా స్వేచ్ఛగా యువతరం ఎగిరేలా చేసినా ఓ కొత్త లైఫ్ ట్రెండ్. బీటెక్ పూర్తి చేయకముందే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో స్టూడెంట్స్‌ను కంపెనీలు ఎత్తుకెళ్లిపోయేవే. కెరియర్లో అడుగు పెట్టగానే నెలనెల అకౌంట్లో శాలరీ వచ్చి పడేది. రెండ్రోజులు సెలవు. ఈలోగా కంపెనీలు ఇచ్చే పార్టీలు, ఇన్సెంటీవ్స్‌తో ఒక్కసారిగా లగ్జరీ లైఫ్ ఆవరించేసింది. రెండుమూడేళ్లు తిరిగే సరికి ఒక్కొక్కరికి ప్రమోషన్లు. జీతం వేలు దాటి లక్షల్లోకి ఎగబాకింది. అప్పటి వరకు ఎప్పుడూ చూడనంత డబ్బు చేతికొచ్చింది. చదువుకునే రోజుల్లో వందకి, వెయ్యికి నాన్నని అడిగే రోజుల నుంచి లక్షల్లో బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటెన్ చేసే రేంజ్‌కి ఎదిగిపోయారు. దీంతో ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా అంతా తమ హైక్లాస్ రేంజ్ చూపించుకునే వారు. ఇలా జాబ్, శాలరీలోనే కాదు చేసుకునే అర్ధాంగి విషయంలోనూ పోటీ పడుతున్నారు టెక్కీలు. ‘దిగ్గజ టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నాం. లక్షలు సంపాదిస్తున్నాం అంటూ బీకాం చదివి ఇంటి దగ్గరే ఉంటున్న 29 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకునేందుకు యువకులు పోటీ పడుతున్నారు. మాట్రిమోని వెబ్సైట్లో ఆమె గురించి ఆరా తీస్తున్నారు. ఏ సంస్థలో పనిచేస్తున్నారు? ఎంత సంపాదిస్తున్నారనే విషయాల గురించి కులంకషంగా చర్చిస్తూ పెళ్లి ప్రపోజల్స్ సైతం పంపారు. దీంతో వాళ్లు జాబ్ చేస్తున్న కంపెనీలు, తీసుకుంటున్న శాలరీలను చూసి పాపం ఆ యువతికి ఎలాంటి వరుణ్ని భాగస్వామిగా ఎంచుకుంటే బాగుంటుందనే నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇదే విషయాన్ని నెటిజన్లతో పంచుకుంది. అందులో ‘నా పెళ్లి గురించి మాట్రిమోనీలో 14 మంది యువకులతో విడివిడిగా మాట్లాడుతున్నాను. ఎవరిని పెళ్లి చేసుకోవాలో అర్ధం కావడం లేదు’. శాలరీలు ఏడాదికి రూ.14 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు ఉన్నాయి. బైజూస్, ఫ్లిప్‌కార్ట్, డెలాయిట్, టీసీఎస్‌లో పనిచేస్తున్నారు. మీరే చెప్పండి ఎవర్ని పెళ్లి చేసుకోవాలో అర్ధం కావడం లేదు. సాయం చేయండని అభ్యర్ధించినట్లుగా ఉన్న ఓ ట్వీట్ వెలుగులోకి వచ్చింది. Here's how I approach this Girl is 29 yr old jobless BCOM. For such a girl most of the below options are too good to be safe For instance, Why is 45 LPA guy or a doc vying for her? Unless guys have some major shortcomings Under 30 & under 20 LPA seems a realistic bet (no 14) pic.twitter.com/UXa6KZd2rK — Dr Blackpill (@darkandcrude) July 18, 2023 ఆ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వయస్సులో ఎందుకు జాబ్ చేయడం లేదని ప్రశ్నిస్తుంటే..మరికొందరు ఈ పోస్ట్ ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు. ఏది ఏమైనా యువతి పెళ్లి చూపుల వ్యవహారం ఎలా ఉన్నా.. ఆర్ధిక మాంద్యంలోనూ ఐటీ ఉద్యోగుల జీతాలు భారీ స్థాయిలో ఉండడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 150 ఏళ్ల చరిత్రలో.. తొలి ఐఫోన్ తయారీ సంస్థగా టాటా గ్రూప్! -
‘AI’ అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి.. జయేశ్ రంజన్ పిలుపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ రంగంలో భారత్ వేగంగా పురోగమిస్తోందని తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం వై2కే సమస్య తలెత్తినప్పుడు దాని పరిష్కారానికి దేశీ ఐటీ సంస్థలు, నిపుణులు తోడ్పాటు అందించారని పేర్కొన్నారు. ప్రస్తుతం మళ్లీ వై2కే తరహాలో..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ విభాగాల్లో వస్తున్న అవకాశాలను మరింతగా అందిపుచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా కొత్త ఆవిష్కరణలు, భవిష్యత్ డిజిటల్ పరివర్తనపైన నిర్వహించిన ఐటీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా జయేశ్ రంజన్ ఈ విషయాలు చెప్పారు. మరోవైపు, 2022–23లో తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు 31 శాతం వృద్ధి చెందాయని, ఉద్యోగాల కల్పన 16.2 శాతం పెరిగిందని, ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని సీఐఐ తెలంగాణ చైర్మన్ సి. శేఖర్ రెడ్డి తెలిపారు. -
‘నాకు జీతం పెంచడం లేదు సార్’, కోర్టుకెక్కిన ఉద్యోగి..కంగుతిన్న ఐబీఎం!
ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీ ఐబీఎంకు భారీ షాకిచ్చాడో ఓ ఉద్యోగి. పనిచేయకుండా 15 ఏళ్ల నుంచి నెల నెలా ఠంచన్‌గా జీతం తీసుకుంటున్నాడు. పైగా సంస్థ తనకు జీతం పెంచడం లేదని, కంపెనీ తన వైకల్యం పట్ల కంపెనీ వివక్ష చూపుతుందని కోర్టు మెట్లెక్కాడు. మరి చివరికి కోర్టులో ఉద్యోగికి న్యాయం జరిగిందా? లేదంటే ఐబీఎంకు అనుకూలంగా తీర్పిచ్చిందా? ఇయాన్ క్లిఫోర్డ్ సీనియర్ ఐటీ ఉద్యోగి. అనారోగ్యం కారణంగా 2008 సెప్టెంబర్ నుంచి సిక్ లీవ్‌లో ఉన్నాడు. సహృదయంతో నిబంధనలకు అనుగుణంగా ఐబీఎం ప్రతినెల జీతాన్ని ఇయాన్ ఖాతాలో జమ చేసేది. ఈ క్రమంలో 2013లో ఐబీఎంపై ఫిర్యాదు చేశాడు. ఐదేళ్ల నుంచి తన జీతాన్ని ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించాడు. అధికారుల వద్ద మొరపెట్టుకున్నాడు. దీంతో కంగుతిన్న ఐబీఎం యాజమాన్యం అతనితో ఓ ఒప్పొందానికి వచ్చింది. సంస్థపై ఫిర్యాదు చేయకూడదు. అందుకు ప్రతిఫలంగా 8,685 పౌండ్లు (సుమారు రూ.9 లక్షలు) అదనంగా చెల్లించింది. పైగా ఉద్యోగిగానే పరిగణిస్తూ వేతన ప్యాకేజీ (72,037 పౌండ్లు)లో 75 శాతం మేర ఏటా 54,000 పౌండ్లు (సుమారు రూ.55.31 లక్షలు) 65 ఏళ్లు వచ్చే వరకు ఐబీఎం వేతనం అందిస్తూ వచ్చింది. ఈ తరుణంలో ఇయాన్ మరో సారి ఐబీఎం ఉన్నతాధికారుల్ని ఆశ్రయించాడు. పెరిగిన ఖర్చులతో పోల్చితే హెల్త్ ప్లాన్ కింద తనకు అందే వేతనం చాలా తక్కువ. కాబట్టి తన వేతనం పెంచాలని కోరారు. అందుకు సంస్థ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. దీంతో చేసేది లేక 2022 ఫిబ్రవరిలో ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. తన వైకల్యం పట్ల ఆ కంపెనీ వివక్ష చూపుతున్నదని ఆరోపించాడు. ఇయాన్ క్లిఫోర్డ్ ఆరోపణలను కోర్టు ఖంఢించింది. ‘సంస్థ వైద్యం చేయిస్తుంది, ప్రయోజనం చేకూర్చే ప్యాకేజీనీ అందిస్తుందని న్యాయమూర్తి తెలిపారు. కాకపోతే పెరిగిన నిత్యవసర వస్తుల ధరలతో ఇయాన్కు సంస్థ ఇచ్చే వేతనం సరిపోకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, సంస్థపై అతను చేసిన వివక్ష ఆరోపణల్ని, శాలరీ పెంచాలన్న అభ్యర్థనను సున్నితంగా తిరస్కరిస్తూ తీర్పిచ్చారు. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? -
ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే?
వారానికి ఐదురోజులే పని. ఐదంకెల జీతం. లగ్జరీ జీవితం. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్. కరోనాలోనూ తరగని ఆదాయం. ఛాన్సుంటే రెండు కంపెనీల్లో జాబ్. బిటెక్ చేశామా? బోనస్‌గా ఏదో ఒక కోర్స్ చేశామా? ఐటీ జాబ్‌లో చేరిపోయామా? అంతే! లైఫ్ సెటిల్ బిందాస్‌గా బ్రతికేయొచ్చు. కొంచెం టెన్షన్ ఎక్కువే అయినా దానికి తగ్గట్లు ఇన్ కమ్ ఉంటుంది. ఇతర ఫెసిలిటీస్ ఎలాగూ ఉంటాయి. ఇంకాస్త అదృష్టం తోడైతే విదేశాలకు వెళ్లొచ్చు. డాలర్లను జేబులో వేసుకోవచ్చు. అందుకే యూత్‌కు ఐటీ జాబ్స్ అంటే వెర్రీ. కాలు కదపకుండా కంప్యూటర్ ముందు చేసే ఉద్యోగమంటే క్రేజ్. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు విభిన్నంగా ఉన్నాయి. ఉద్యోగులు అనుభవిస్తున్న ఆ భోగభాగ్యాల వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన క్షణాలున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ కంపెనీలు చెల్లించే లక్షలకు లక్షలు ప్యాకేజీలు ఏం చేసుకోను. మనసు విప్పి నాలుగు మాటలు మాట్లాడే వారు లేకపోతే’ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఐటీ ఉద్యోగులు. చదవండి👉 పాక్ అభిమాని గూబ గుయ్‌మనేలా..గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ రిప్లయ్ అదిరింది లక్షలు ప్యాకేజీ ఏం చేసుకోను? ఇటీవల బెంగళూరుకు చెందిన 24 ఏళ్ల ఐటీ ఉద్యోగి తన వ్యక్తి గత జీవితం గురించి నెటిజన్లతో పంచుకున్నారు. ‘నేనో ప్రముఖ టెక్ కంపెనీలో జాబ్ చేస్తున్నా. శాలరీ రూ.58 లక్షలు. అయినా సరే సంతృప్తిగా లేను. ఎప్పుడూ ఒంటరిగా ఫీలవుతున్నాను. ప్రేమగా మాట్లాడేందుకు ప్రేమికురాలు లేదు. స్నేహితులేమో క్షణం తీరిక లేకుండా ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమయ్యారు’ అంటూ తన బాధను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు. దీంతో అయ్యో పాపం! అనడం నెటిజన్ల వంతైంది. ఐటీ ఉద్యోగుల్ని మరో ప్యాండమిక్ ముంచేస్తుందా? ఐటీ ఉద్యోగుల్లో ఈ తరహా ధోరణికి కారణం కంపెనీల్లో మారిపోతున్న వర్క్ కల్చరేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్-19 కారణంగా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో రిమోట్ వర్క్ కల్చర్‌ని అమలు చేశాయి. అది కాస్త సుదీర్ఘ కాలంగా కొనసాగుతుంది. దీంతో ఉద్యోగులు నెలల తరబడి ఇంటికే పరిమితం కావాల్సి వస్తుంది. కానీ ఇలాగే కొనసాగితే వర్క్ కల్చర్‌లో కోవిడ్ కాకుండా మరో ప్యాండమిక్ సైతం ఆవహించేస్తుందని, ఆ ప్యాండమిక్ పేరే ఒంటరితనమని అంటున్నారు టెక్ నిపుణులు. చదవండి👉 ‘ఇక చాలు.. దయ చేయండి’.. గూగుల్ ఉద్యోగులకు సీఈఓ ఈ మెయిల్ ఎంఐటీ ఏం చెబుతోంది ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు అనేక లాభాలున్నాయి. వర్క్ ప్రొడక్టివిటీ పెరగడం, ప్రయాణం, ఖర్చులు, డబ్బులు ఆదా చేసుకోవడం, కుటుంబ సభ్యులతో గడపం వంటి స్వల్ప కాలంలో బాగుంటాయి. కానీ సూదీర్ఘంగా ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ఉద్యోగుల్లో ఒంటరి తనం పెరిగిపోతుంది. ఇదే విషయాన్ని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైతం తెలిపింది. రిమోట్ వర్క్‌తో సహచర ఉద్యోగులతో గడపలేకపోవడం, ఇతరులపై నమ్మకం పెరగడం, శరీరాన్ని కష్టపెట్టకపోవడం వల్ల శారీరక ప్రతిస్పందనలు తగ్గిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు న్యూరో సైన్స్ అధ్యయనంలో తేలింది. అందరి మధ్యలో ఉన్నా ఒంటరిగా ఆఫీస్‌లో పనిచేస్తూ సహచరులతో మాట్లాడడం, క్యాంటీన్లలో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడం, వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకోవడంతో పాటు ఉత్పాదకత పెరుగుతుంది. మహమ్మారి ప్రారంభ నెలల్లో రిమోట్‌గా పని చేస్తున్నప్పుడు ఐదుగురిలో ముగ్గురు (60శాతం) భారతీయ ఐటీ నిపుణులు ఏదో ఒక సమయంలో అందరి మధ్యలో ఉన్న ఒంటరిగా ఉన్నామని భావించారు. 16,199 మంది భారతీయ టెక్ నిపుణులపై లింక్డిన్ సంస్థ వర్క్‌ఫోర్స్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ పేరుతో నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో ఇదే అంశం వెలుగులోకి వచ్చింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కే మా ఓటు ఈ ఏడాది మార్చి నెలలో లింక్డిన్ సర్వేలో 78 శాతం మంది ఇండియన్ ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వెళుతున్నారు. ఆరోగ్యకరమైన పని-జీవిత సమతుల్యతను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి అవగాహన ఉన్నప్పటికీ, వారిలో చాలా మంది ఇంట్లో ఉండి పనిచేయడం కంటే ఆఫీస్‌లో పనిచేయడం వల్ల ఉత్పాదక పెరగుతున్నట్లు సర్వే పేర్కొంది. చివరిగా.. మహమ్మారితో ఆకస్మికంగా పనిలో వచ్చిన మార్పులు ఆనందాన్ని దూరం చేసినట్లు 62శాతం మంది ఉద్యోగులు భావిస్తుండగా.. రిమోట్/హైబ్రిడ్ వర్క్ కల్చర్ రానున్న రోజుల్లో ఉద్యోగులపై ఏ విధమైన ప్రతికూల ప్రభావం చూపిస్తాయోనని టెక్నాలజీ నిపుణులు చర్చించుకుంటున్నారు. చదవండి👉 రాత్రికి రాత్రే ఐటీ ఉద్యోగాలు ఊడుతున్న వేళ..టీసీఎస్ గుడ్‌న్యూస్! -
కడుపు నిండా తిండి పెట్టి.. ఉదయాన్నే చావు కబురు చల్లగా చెప్పిన ఐటీ సంస్థ!
ఆర్ధిక మాంద్యం దెబ్బకు ప్రపంచ దేశాల్లోని ఆయా కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తొలగింపులపై ముందస్తు సమాచారం ఇస్తున్నాయి. కానీ కొన్ని సంస్థల లేఆఫ్స్ తీరుపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు పింక్ స్లిప్‌లను మెయిల్స్, మెసేజ్‌ల ద్వారా తెలుపుతాయి. కానీ ఈ సంస్థ అందుకు భిన్నంగా వ్యవహరించింది. కడుపు నిండా తిండి పెట్టి, తాగినోళ్లకు తాగినంత మందు పోసి చావు కబురు చల్లగా చెప్పింది అమెరికాలోని అరిజోనా కేంద్రంగా బిషప్ ఫాక్స్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే ఇటీవల అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లతో ప్రాజెక్ట్‌లు లేక.. సంస్థలో ఆర్ధిక అనిశ్చితి నెలకొంది. దీంతో ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైంది. బిషప్ ఫాక్స్‌లో మొత్తం 400 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారందరికి ఖరీదైన హోటల్లో పార్టీ ఇచ్చింది. కంపెనీ ఇచ్చిన పార్టీకి ఉద్యోగులు హాజరయ్యారు. కడుపు నిండా తిండి పెట్టి, తాగినోళ్లకు తాగినంత సైబర్ సూప్ పేరుతో కంపెనీ ఖరీదైన మద్యం సరఫరా చేసింది. పార్టీ అయిపోయింది. ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. తెల్లారేసరికి లేఆఫ్ అంటూ చావు కబురు చల్లగా చెప్పడంతో షాక్ తిన్నారు. ముందురోజు రాత్రి పార్టీని బాగా ఎంజాయ్ చేసిన ఉద్యోగులు తెల్లారి కంపెనీ ప్రకటన విని ఊహించలేకపోయామంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉దేశంలోని ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. డబుల్ శాలరీలను ఆఫర్ చేస్తున్న కంపెనీలు! -
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు.. మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం
చైనాలోని టియాంజిన్ వేదికగా ఈ ఏడాది జూన్ 27 నుంచి 29వ తేదీ వరకు ప్రపంచ ఆర్థిక వార్షిక సదస్సు (wef) జరగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందించింది. వలర్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్యక్షుడు బోర్గె బ్రెండే మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. నేషనల్ డెవలప్మెంట్, రిఫోర్మ్ కమిషన్లు చైనాతో కలిసి ఈ సమాశం ఏర్పాటు చేసింది. కోవిడ్-19 వరుస పరిణామల అనంతరం పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కొత్త కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాయి. ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు కీలకమైన ఈ సమయంలో చైనాలో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు , విద్యా సంస్థలకు చెందిన సుమారు 1500 మంది గ్లోబుల్ లీడర్స్ ఈ సదస్సులో పాల్గొననున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. -
కంట్రోల్-ఎస్‌కు టువర్డ్స్ ఆన్-సైట్ నెట్ జీరో అవార్డ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డేటా సెంటర్ల రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ కంట్రోల్-ఎస్ డేటాసెంటర్స్ తాజాగా ‘టువర్డ్స్ ఆన్-సైట్ నెట్ జీరో’ అవార్డ్ దక్కించుకుంది. మొనాకోలో జరిగిన డేటాక్లౌడ్ గ్లోబల్ కాంగ్రెస్ 2023 సందర్భంగా కంపెనీ చైర్మన్ శ్రీధర్ పిన్నపురెడ్డి అవార్డును స్వీకరించారు. నెట్ కార్బన్ జీరో కార్యక్రమాలు, ఎన్విరాన్మెంటల్, సోషల్, గవర్నెన్స్ (ఈఎస్జీ) లక్ష్యాల పట్ల కంపెనీ నిబద్ధతకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కిందని కంట్రోల్–ఎస్ తెలిపింది. -
ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం.. ఆ రంగానికి చెందిన ఉద్యోగాలకు భారీ డిమాండ్!
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి నెలకు సంబంధించి ఉపాధి అవకాశాల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగం ముందున్నట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ తెలిపింది. 2023 మార్చి నెలకు సంబంధించి నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ (బ్యాంకింగ్) ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 4,555కి చేరుకుందని, 2022 మార్చి నెలలో ఉన్న 3188తో పోలిస్తే 45 శాతం మేర వృద్ధి చెందినట్టు పేర్కొంది. నాన్ మెట్రో పట్టణాలు ఉపాధి అవకాశాల వృద్ధికి తోడ్పడినట్టు వివరించింది. బీఎఫ్ఎస్ఐ మినహా దేశంలో నియామకాల ధోరణి అప్రమత్తతో కూడిన ఆశావహంగా ఉందని నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ తెలిపింది. నూతన ఉద్యోగ నియామకాల డేటా ఆధారంగా ప్రతి నెలా ఈ నివేదికను నౌకరీ సంస్థ విడుదల చేస్తుంటుంది. మార్చి నెలకు సంబంధించి ఈ సూచీ 2979గా ఉంది. 2022 మార్చి నెలతో పోలిస్తే 5 శాతం పెరగ్గా.. ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఫ్లాట్‌గా ఉంది. నాన్ టెక్నాలజీ రంగాలు నూతన ఉపాధి కల్పన పరంగా బీమా, బ్యాంకింగ్ రంగాలు సంప్రదాయ బుల్ ర్యాలీలో ఉన్నట్టు, మొత్తం మీద కార్యాలయ ఉద్యోగాల మార్కెట్లో గణనీయమైన నియామకాలకు తోడ్పడుతున్నట్టు నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. బీమా రంగంలో ఉపాధి అవకాశాలు మార్చి నెలలో 108 శాతం వృద్ధి (క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు) చెందాయి. ప్రధానంగా బీమా పాలసీలను విక్రయించే విభాగంగా కొత్త ఉద్యోగాలు లభించాయి. డిజిటల్ బ్యాంకింగ్ సేవలకు డిమాండ్ పెరగడంతో బ్యాంకింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చినప్పుడు 45 శాతం ఎక్కువగా వచ్చాయి. పట్టణాల వారీగా బ్యాంకింగ్ ఉపాధి అవకాశాల్లో వైవిధ్యం కనిపించింది. అహ్మదాబాద్ పట్టణంలో 149 శాతం వృద్ధి కనిపిస్తే, వదోదరలో 72 శాతం, కోల్‌కతాలో 49 శాతం కొత్త ఉపాధి అవకాశాలు బ్యాంకింగ్ రంగంలో వచ్చాయి. బహుళజాతి బీఎఫ్ఎస్ఐ సంస్థలతోపాటు, బ్యాంకింగ్, బీమా ఉత్పత్తులపై దృష్టి సారించిన దేశీ ఆర్థిక దిగ్గజాల నుంచి ఈ ఉపాధి అవకాశాలు వచ్చినట్టు ఈ నివేదిక వివరించింది. ఐటీ రంగంలో క్షీణత ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు మార్చి నెలలో 17 శాతం తగ్గాయి. మెషిన్‌లెర్నింగ్ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. ఆయిల్ రంగంలో 36 శాతం, రియల్ ఎస్టేట్ రంగంలో 31 శాతం, ఎఫ్ఎంసీజీలో 14 శాతం, హాస్పిటాలిటీ రంగంలో 7 శాతం మేర నూతన ఉద్యోగాలు మార్చి నెలలో (క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చినప్పుడు) అందుబాటులోకి వచ్చాయి. రిటైల్, విద్య, బీపీవో రంగాల్లో 4–2 శాతం మేర నియామకాలు తగ్గాయి. హైదరాబాద్‌లో స్వల్పంగా క్షీణత మెట్రో పట్టణాల పరంగా చూస్తే ముంబైలో మార్చి నెలలో 17 శాతం మేర ఉపాధి అవకాశాలు పెరగ్గా, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో 7 శాతం వృద్ధి కనిపించింది. బెంగళూరులో 12 శాతం, హైదరాబాద్ మార్కెట్లో 11 శాతం, పుణెలో 2% చొప్పున నియామకాలు తగ్గాయి. -
స్టార్టప్‌లలో 24 వేల మంది ఉద్యోగుల తొలగింపులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 24,000 పైచిలుకు ఉద్యోగులకు 84 ప్రధాన స్టార్టప్స్ ఉద్వాసన పలికాయి. మరికొన్ని కంపెనీలు సిబ్బంది సంఖ్యను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. వీటిలో యూనికార్న్ కంపెనీలైన బైజూస్, చార్జ్బీ, కార్స్24, లీడ్, ఓలా, ఓయో, మీషో, ఎంపీఎల్ తదితర సంస్థలు ఉన్నాయి. కంపెనీనిబట్టి కొన్ని ఏకంగా 85 శాతం వరకు సిబ్బంది సంఖ్యను కుదించడం గమనార్హం. పునర్వ్యవస్థీకరణ, వ్యయ నియంత్రణ, తీవ్ర ఆర్థిక పరిస్థితులు, వ్యాపార విధానం మార్పు వంటివి ఉద్యోగుల తీసివేతలకు ప్రధాన కారణాలు. పనితీరు బాగోలేకపోవడం వల్ల కొంత మందిని కొన్ని కంపెనీలు తొలగించాయి. రాజీనామా చేయాల్సిందిగా కొన్ని సంస్థలు పలువురిని కోరాయి. 19 ఎడ్టెక్ స్టార్టప్స్‌లో నాలుగు యూనికార్న్ కంపెనీలు 9 వేల మందికిపైగా సిబ్బందిని సాగనంపాయి. ఎడ్టెక్ తర్వాత కంజ్యూమర్ సర్వీసెస్, ఈ–కామర్స్ రంగ కంపెనీల్లో ఎక్కువగా తీసివేతలు నమోదయ్యాయి. ఈ మూడు రంగాల్లోని 46 స్టార్టప్స్ సుమారు 19,000 మంది ఉద్యోగులను తొలగించినట్టు తెలుస్తోంది. అయిదు ఎడ్టెక్ స్టార్టప్స్ 2022లో మూతపడ్డాయి. ఈ విభాగంలోని 36 స్టార్టప్స్ 2023లో 5,800 మందికి ఉద్వాసన పలికాయి. -
ఉద్యోగులపై వేలాడుతున్న లేఆఫ్స్ కత్తి.. 2.70 లక్షల మంది తొలగింపు!
ఐటీ,ఐటీయేతర కంపెనీల్లో ఉద్యోగాల ఊచకోతలు ఆగడం లేదు. ఆయా సంస్థలు వరుసగా విసురుతున్న లేఆఫ్స్ కత్తులు టెక్కీలతో పాటు ఇతర రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు భయంతో వణికిపోయేలా చేస్తున్నాయి. ఉద్యోగం నుంచి తొలగించినట్లు అర్ధరాత్రి అపరాత్రి వేళల్లో వస్తున్న ఈ-మెయిల్స్ వారిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. తాజాగా విడుదలైన ఓ నివేదిక సైతం క్యూ1లో అమెరికాకు చెందిన కంపెనీలు మొత్తం 2.70లక్షల మందికి ఉద్యోగుల్ని తొలగించినట్లు తెలిపింది. లేఆఫ్స్‌కు గురైన ఉద్యోగుల్లో ఐటీ రంగానికి చెందిన వారే ఎక్కువ మంది ఉన్నట్లు తేలింది. ఈ తరుణంలో చికాగోకు కేంద్రంగా ప్లేస్మెంట్ కార్యకలాపాలు నిర్వహించే ‘ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్’ అనే సంస్థ ఉద్యోగాల తొలగింపులపై ‘ఛాలెంజర్ రిపోర్ట్’ పేరుతో ఏప్రిల్ 6న ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్‌లో జనవరి 2023 నుంచి మార్చి నెల ముగిసే సమయానికి 396 శాతంతో అమెరికాలో సుమారు 2,70,416 మంది ఉద్యోగుల్ని ఆయా సంస్థలు ఇంటికి పంపినట్లు తెలిపింది. గత ఏడాది ఇదే సమయానికి మొత్తం 55,696 (క్యూ1) మందికి పింక్ స్లిప్‌లు జారీ చేయగా.. ఈ ఏడాది క్యూ1లో 2,70,416 ఉద్యోగాలు కోల్పోయినట్లు హైలెట్ చేసింది. ఇక జనవరిలో 102,943, ఫిబ్రవరిలో 77,770, మార్చి నెలలో 89,703 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ ఛాలెంజర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల విషయంలో కంపెనీలు సానుకూల దృక్పదంతో ఉన్నాయని, కాకపోతే పట్టిపీడిస్తున్న ముందస్తు ఆర్ధిక మాంద్యం భయాలు, వడ్డీరేట్ల పెంపు, కంపెనీల ఖర్చలు తగ్గించుకునే ప్రణాళికల్లో భాగంగా ఉద్యోగుల్ని ఫైర్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ తొలగింపుల్లో టెక్నాలజీ రంగంలో ఎక్కువగా ఉన్నాయని సూచించారు. 2023 జనవరి - మార్చి సమాయానికి ఉద్యోగం కోల్పోయిన వారిలో 38 శాతంగా ఉన్నట్లు చెప్పారు. ఉద్యోగుల తొలగింపులకు కారణం ఈ సంవత్సరంలో 167,575 ఉద్యోగుల తొలగింపులకు మార్కెట్, ఆర్థిక పరిస్థితులే కారణమని తెలుస్తోంది. మరో 24,825 మందిని ఫైర్ చేయడానికి కాస్ట్ కటింగ్ కారణం కాగా డిపార్ట్మెంట్ మూసివేతతో 22,109 మంది, ఆర్ధిక అనిశ్చితితో 9,870 మంది, పునర్వ్యవస్థీకరణ కారణంగా 8,500 ఉద్యోగాలు పోయాయి. ఈ ఏడాది వరుసగా 7,944 ఉద్యోగాల కోతలకు డిమాండ్ తగ్గుదల కారణమైనట్లు ‘ఛాలెంజర్ రిపోర్ట్’ నివేదిక హైలెట్ చేసింది. చదవండి👉 రాత్రికి రాత్రే ఐటీ ఉద్యోగాలు ఊడుతున్న వేళ..టీసీఎస్ గుడ్‌న్యూస్! -
ఈ వెరిఫికేషన్ కోసం 68వేల ఐటీఆర్‌లు
న్యూఢిల్లీ: రిటర్నుల్లో ఆదాయం తక్కువ చూపించడం లేదా అసలు చూపించకపోవడానికి సంబంధించి ఆదాయపన్ను శాఖ 2019–20 సంవత్సరానికి 68,000 ఐటీఆర్‌లను ఈ–వెరిఫికేషన్ కోసం ఎంపిక చేసుకుంది. ఈ విషయాన్ని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చీఫ్ నితిన్ గుప్తా తెలిపారు. పన్ను చెల్లింపుదారుల వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లోని వివరాలు, రిటర్నుల్లో పేర్కొన్న వివరాలకు మధ్య పోలిక లేకపోతే ఆదాయపన్ను శాఖ ఈ–వెరిఫికేషన్ నోటీసు జారీ చేస్తుంది. దాంతో పన్ను చెల్లింపుదారులు సమాచారం మధ్య పోలిక లేకపోవడంపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ–వెరిఫికేషన్ నోటీసులో పేర్కొన్న సమాచారం నిజమేనని పన్ను చెల్లింపుదారులు గుర్తించినట్టయితే సవరించిన రిటర్నులు వేసి, అవసరమైతే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తాము 68,000 పన్ను చెల్లింపుదారులకు నోటీసులు ఇవ్వగా.. 35,000 కేసుల్లో సంతృప్తికరమైన వివరణ ఇవ్వడం లేదంటే సవరించిన రిటర్నులు వేసినట్టు గుప్తా తెలిపారు. ఇప్పటి వరకు 15 లక్షల సవరించిన రిటర్నులు దాఖలయ్యాయని, వీటి రూపంలో రూ.1,250 కోట్లు వసూలైనట్టు చెప్పారు. మరో 33,000 కేసులకు సంబంధించి ఇంకా సమాధారం రాలేదని.. వారు సవరించిన రిటర్నులు (2019–20 సంవత్సరానికి) వేసేందుకు మార్చి 31 వరకు సమయం ఉందన్నారు. -
కేంద్రం కీలక నిర్ణయం.. పాన్, ఆధార్ కార్డ్ ఉన్న వారికి గుడ్ న్యూస్!
రేషన్‌కార్డ్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటీ ఐడీ కార్డ్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ గుర్తింపు కార్డులలో వేర్వేరు వివరాలు ఉండి వాటిని మార్చుకునేందుకు ఇబ్బంది పడుతున్న వారికి ఊరట కలిగిలించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌లో అడ్రస్ సహా ఎమైనా వివరాలు తప్పుగా ఉండి వాటిని అప్ డేట్ చేస్తే మిగతా డాక్యుమెంట్లలో మార్పులకై ఆయా కార్యాలయాలకు వెళ్లకుండా అన్నింట్లోనూ ఆటోమెటిక్ వివరాలు అప్డేట్ అయ్యేలా కొత్త వ్యవస్థను మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ విభాగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ఆధార్ కార్డ్‌తో ఆటో అప్డేట్ ఎలా సాధ్యం? ప్రధానంగా పైన పేర్కొన్నట్లుగా ప్రభుత్వ ఐడీ కార్డ్‌లను డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్‌తో పాటు ఇతర డాక్యుమెంట్లను డిజిలాకర్ (DigiLocker)లో భద్రపరుచుకుంటుంటారు. ఆ డిజిలాకర్‌లో ఉన్న ఆధార్ కార్డులో ఏదైనా అడ్రస్ లేదంటే ఇతర వివరాలు మారిస్తే.. వెంటనే డిజి లాకర్లో ఉన్న మిగిలిన ఐడెంటిటీ కార్డ్‌లలో డేటా సైతం అటోఅప్డేట్ అవుతుంది. ప్రస్తుతం, ఈ ఆటో అప్డేట్పై కేంద్ర ఐటీ శాఖ.. రవాణా, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ వంటి పరిమిత మంత్రిత్వ శాఖలతో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. పాస్‌పోర్ట్‌లను ఆటోమేటిక్‌గా అప్డేట్ చేయడానికి యూజర్లకు అనుమతి ఇచ్చిన తర్వాత ఆధార్ ఆటో అప్డేట్ విధానం అమల్లోకి రానుంది. ఆటో అప్డేట్ సిస్టమ్ ప్రయోజనాలు ఆధార్ ద్వారా డిజిలాకర్‌లో ఉన్న ఐడెంటిటీ కార్డ్‌లను ఆటో అప్డేట్ చేయడం ద్వారా ఆయా డిపార్ట్మెంట్ల సమయం, ఖర్చుల తగ్గింపుతో పాటు ఫేక్ ఐడీ కార్డ్‌ల ముప్పు నుంచి సురక్షితంగా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల కారణంగా తరచు ప్రాంతాలు మారే వారికి ప్రయోజనం కలుగుతుంది. కాగా, గత నెలలో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదే విధమైన వ్యవస్థను త్వరలో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
రంగారెడ్డి జల్లా షాబాద్‌లో ఐటీ సెంటర్: మంత్రి కేటీఆర్
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లిలో త్వరలో ఐటీ సెంటర్ ఏర్పాటు చేస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఐటీ సెంటర్ ఏర్పాటు వల్ల 1,200 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. బుధవారం చందనవెల్లిలో వెల్స్పన్ పరిశ్రమ రెండో యూనిట్‌ను మంత్రి సబితారెడ్డి, ఎంపీ జి.రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులతో కలసి ఆయన ప్రారంభించారు. తర్వాత వెల్స్పన్ చైర్మన్ బీకే గోయెంకా తదితరులతో కలిసి కంపెనీలో కలియదిరిగి పరికరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. చందనవెల్లిలో ప్రస్తుతం వెల్స్పన్ కంపెనీతోపాటు ఐటీఈఎస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ కేంద్రంలో మహిళలు, యువకులకు శిక్షణ అందించి ఉద్యోగాలు కలి్పంచే బాధ్యతను కంపెనీ తీసుకుందని చెప్పారు. ఐటీ సెంటర్ ఏర్పాటుతో మరిన్ని చిన్న, మధ్య తరహా కంపెనీలు ఈ ప్రాంతం వైపు దృష్టి సారిస్తాయని అశాభావం వ్యక్తం చేశారు. త్వరలో సీతారాంపూర్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఐటీని మరింతగా విస్తరిస్తామని ప్రకటించారు. 40 నుంచి 50 పరిశ్రమల ఏర్పాటుకు కృషి వెల్స్పన్లో కార్యక్రమం అనంతరం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హైతాబాద్ చౌరస్తాలో బీఆర్ఎస్ జెండాను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించి మాట్లాడారు. చందనవెల్లి, సీతారాంపూర్‌కు పరిశ్రమలు తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని.. ఇక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఇక్కడ 40 నుంచి 50 పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హైతాబాద్, చందనవెల్లి, మాచనపల్లి గ్రామాల్లో భూములు కోల్పోయిన రైతులకు హెచ్ఎండీఏ ప్లాట్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో పాలమూరు పూర్తి చేస్తాం కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరలో పూర్తిచేసి షాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని కేటీఆర్ చెప్పారు. రైతులకు సాగునీరు పుష్కలంగా అందుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ధిక మాద్యం దెబ్బ..భారత్‌లో భారీగా పెరిగిపోతున్న ఉద్యోగుల తొలగింపు
వరల్డ్ వైడ్‌గా లక్షలాది కంపెనీలు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. ఇప్పుడు అదే బాటలో దేశీయ స్టార్టప్ కంపెనీలు పయనిస్తున్నాయి. ఇప్పటి వరకు 3-4 నెలలో వేలాది మంది వర్క్ ఫోర్స్‌కు పింక్ స్లిప్‌లు జారీ చేశారు. యూనికార్న్‌లతో సహా 70 కంటే ఎక్కువ స్టార్టప్‌లు 21వేల మంది అంతకంటే ఎక్కువ మందిని ఇంటికి సాగనంపినట్లు తెలుస్తోంది. ఓలా, ఎంపీల్, ఇన్నోవాకర్, అనాకాడెమీ, వేదాంతు, కార్స్24,ఓయో, మీషో, ఉడాన్ వంటి మరెన్నో కంపెనీలు ఉద్యోగుల్ని ఫైర్ చేశాయి. ఇప్పటి వరకు 16 ఎడ్యూటెక్ స్టార్టప్‌లు 8,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. జనవరి ప్రారంభంతో ఇప్పటికే దేశంలోని 16కి పైగా స్వదేశీ స్టార్టప్‌లు ఉద్యోగులను తొలగించాయి. సోషల్ మీడియా సంస్థ షేర్ చాట్ (మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్) అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల కారణంగా 20 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఉద్యోగుల తొలగింపు కంపెనీలో దాదాపు 500 మందిపై ప్రభావం చూపింది ఇక హెల్త్ యూనికార్న్ ఇన్నోవేకర్ దాదాపు 245 మంది ఉద్యోగులను తొలగించింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ డెలివరీ వృద్ధి మందగించడంతో కంపెనీ 380 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ధృవీకరించింది. ఎండ్-టు-ఎండ్ డిజిటల్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫారమ్ అయిన మెడీబడీ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా అన్నీ విభాగాలలో దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించింది అయితే రానున్న రోజుల్లో లేఆఫ్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
15 రోజులు.. 91 టెక్ కంపెనీల్లో 24 వేల మంది ఉద్యోగుల తొలగింపు!
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం భయాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ భయాలు భారత్‌లో ఎక్కువగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికల్ని ఉటంకిస్తూ.. ఉద్యోగుల తొలగింపుల్ని ట్రాక్ చేసే సంస్థ లేఆఫ్స్.ఎఫ్‌వైఐ. తాజాగా ఈ ఏడాదిలో అంటే జనవరి 1 నుంచి జనవరి 16 వరకు 91 సంస్థలు సుమారు 25,151 మందిని తొలగించినట్లు తెలిపింది. ఆ సంస్థలో అమెజాన్,సేల్స్‌ఫోర్స్, కాయిన్‌బేస్ తో పాటు ఇతర కంపెనీలున్నాయి. క్రిప్టో ఎక్ఛేంజ్ క్రిప్టో.కామ్ గత వారంలో ప్రపంచ వ్యాప్తంగా 20 శాతం మంది సిబ్బందిని తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఓలా (200 మంది ఉద్యోగులను తొలగించింది), వాయిస్ ఆటోమేటెడ్ స్టార్టప్ స్కిట్.ఏఐ వంటి కంపెనీలు జనవరిలో భారీ ఎత్తున ఉద్యోగుల్ని ఫైర్ చేశాయి. లేఆఫ్స్.ఎఫ్‌వైఐ ప్రకారం..2022లో మెటా,ట్విటర్,ఒరాకిల్,ఎన్విడియా,స్నాప్,ఉబెర్,స్పాటిఫై,ఇంటెల్,సేల్స్‌ఫోర్స్ సంస్థలు 153,110 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేశాయి.నవంబర్‌లో ఉద్యోగుల తొలగింపుల సంఖ్య తారాస్థాయికి చేరుకున్నట్లు నివేదించింది. ఒక్క నెలలోనే 51,489 మంది టెక్కీలు ఉపాధి కోల్పోయారు. మరో టెక్ దిగ్గజం గూగుల్ ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగుల్ని తగ్గించేలా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ వరుస లేఆఫ్స్‌తో 2023 సైతం టెక్నాలజీ రంగంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ నెలాఖరులో టెక్ రంగ సంస్థలు త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయోనని జాబ్ మార్కెట్ నిపుణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
టీసీఎస్ సంచలనం, ఇక ‘ఐటీ ఉద్యోగులకు పండగే!’
ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో కొన్ని కంపెనీలు ఉద్యోగుల్ని భారీ ఎత్తున ఇంటికి పంపిచేస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక మాంద్యం భయాలు, ఆశించిన ఫలితాలు అందుకోవడంలో విఫలం’ అంటూ కారణాలు చెప్పి చేతులు దులిపేసుకుంటున్నాయి. కానీ టీసీఎస్ అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుంది. రానున్న రోజుల్లో సుమారు 1.50 లక్షల మందిని నియమించుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. టెక్ దిగ్గజం తాజాగా క్యూ3 ఫలితాల్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా ..టీసీఎస్ జనవరి 9న 2023-24 ఆర్ధిక సంవత్సరం నాటికి సుమారు 1.25 లక్షల మంది నుంచి 1.50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు గతేడాది డిసెంబర్ నెల ముగిసే సమయానికి సంస్థలో 613,974 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. క్యూ3లో 2,197 మంది ఉద్యోగులు సంస్థకు రిజైన్ చేశారు. అదే సమయంలో గడిచిన 18 నెలల కాలంలో భారీ ఎత్తున సిబ్బందిని హైర్ చేసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు రానున్న రోజుల్లో టీసీఎస్ నియామకాలు జోరుగా చేపట్టనున్నట్లు ఆ సంస్థ సీఈవో గోపీనాథన్ తెలిపారు. 150,000 మంది నియామకం టీసీఎస్ త్రైమాసిక ఫలితాల విడుదల అనంతరం కంపెనీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపినాథన్ విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఉద్యోగుల్ని ఎలా నియమించుకున్నామో.. రానున్న రోజుల్లో ఆ తరహా ధోరణి కొనసాగుతుంది. వచ్చే ఏడాది 1,25,000-1,50,000 మందిని నియమించుకోనున్నాం’ అని తెలిపారు. చదవండి👉 మూన్‌లైటింగ్ దుమారం, ఉద్యోగులపై ‘కాస్త సానుభూతి చూపించండయ్యా’ -
ఐటీ కంపెనీల్లో భారీగా పెరిగిన సీఈవోల జీతాలు.. మరి ఉద్యోగుల శాలరీలో
దేశీయ ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు, సీఈవో స్థాయి అధికారులకు జీతాలు భారీ ఎత్తున పెరిగాయి. గత 10 ఏళ్లలో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి అంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆయా దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల శాలరీలు అరకొర పెంచితే.. సీఈవో స్థాయి వారికి మాత్రం ఊహించని విధంగా హైక్ చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. 2012తో పోల్చితే 2022లో ఐటీ కంపెనీల్లోని ఫ్రెషర్స్ జీతాలు 47 శాతం మాత్రమే పెరిగాయి. సీఈవోల జీతాల్లో మాత్రం 1,492 శాతం పెరిగినట్లు తేలింది. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో, బోర్డు సభ్యుడు టీవీ మోహన్‌దాస్ పాయ్ మాట్లాడుతూ..‘ఫ్రెషర్ల జీతాల్లో ఎలాంటి మార్పులు లేవు. 10 నుంచి 12 ఏళ్ల క్రితం కంపెనీలు చెల్లిస్తున్నట్లుగా రూ.3.5 నుంచి రూ. 4 లక్షలే చెల్లిస్తున్నారు. అదే సమయంలో మేనేజర్లు, సీనియర్ల జీతం 4,5,7 రెట్లు పెరిగిందని అన్నారు. హెచ్‌సీఎల్ టెక్ మాజీ సీఈవో వినీత్ నాయర్ సైతం ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్రను గుర్తించకపోవడం నిజంగా దురదృష్టం. ఆయా కంపెనీలు మార్కెటింగ్, ఆఫీస్ నిర్వహణ కోసం చేసే ఖర్చు.. ఉద్యోగులకు శాలరీలుగా ఇస్తే.. 10 రెట్ల రాబడి పొందవచ్చనే విషయాన్ని సంస్థలు గుర్తించలేకపోతున్నాయని చెప్పారు. టీమ్ లీజ్ డిజిటల్ డేటా టీమ్ లీజ్ డిజిటల్ డేటా ప్రకారం.. సీఈవోతో పాటు అదే కంపెనీలు పనిచేస్తున్న ఫ్రెషర్ల మధ్య వేతనాల వ్యత్యాసం భారీ స్థాయిలో ఉన్నట్లు తేలింది. ఉదాహరణకు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగులు - సీఈవోల మధ్య శాలరీ రేషియో 1973, విప్రోలో 2,111, హెచ్‌సీఎల్ 1,020, టెక్ మహీంద్రాలో 644, టీసీఎస్‌లో 619గా ఉంది. శాలరీ వ్యత్యాసానికి కారణం! విద్యార్ధులు గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటూ చదువు పూర్తి చేస్తున్నారు. కానీ మార్కెట్లోని డిమాండ్‌కు అనుగుణంగా కావాల్సిన స్కిల్స్ వారిలో లేకపోవడం కారణమనే అభిప్రాయం వ్యక్తం చేశారు నాస్కామ్ మాజీ ప్రెసిడెంట్ కిరణ్ కార్నిక్. కార్నిక్ మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీలో వాస్తవ పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాను. కంపెనీకి అవసరమైన నైపుణ్యాలు వారికి (ఫ్రెషర్స్) లేవు. డొమైన్ నైపుణ్యాలు ఉండవు. ఆ విభాగంలో శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఐటీ పరిభాషలో వీటిని సాఫ్ట్ స్కిల్స్ అని అంటాం. ఆయా టీమ్స్‌లలో వర్క్ చేయడం, ఏ భాషలోనైనా కమ్యూనికేట్ చేసే టాలెంట్ ఉండాలని సూచించారు. -
విశాఖను ఐటీ కేంద్రంగా మారుస్తాం : మంత్రి గుడివాడ అమర్నాథ్
-
‘ఏ పూట ఉద్యోగం ఊడుతుందో’, మరోసారి గూగుల్,అమెజాన్ షాకింగ్ నిర్ణయం?
ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందన్న ఆర్ధిక నిపుణుల అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా చిన్న చిన్న కంపెనీల నుంచి దిగ్గజ టెక్ సంస్థల వరకు కాస్ట్ కటింగ్ పేరుతో వర్క్ ఫోర్స్‌ను తగ్గించుకుంటున్నాయి. రానున్న రోజుల్లో ఉద్యోగుల తొలగింపులు నిపుణులు అంచనాలకు మించి ఉంటాయంటూ కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల ప్రకటించిన కంపెనీ ఫలితాల్లో నష్టాలు రావడంతో మెటా 11 వేల మందిని ఫైర్ చేసింది. రెసిషన్ ముప్పుతో సంస్థలు అడ్వటైజ్మెంట్పై చేసే ఖర్చు తగ్గించుకోవడం వల్లే నష్టాలు వచ్చిపడుతున్నాయని, కాబట్టే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకోక తప్పలేదని తెలిపింది. ఇక తాజాగా మెటా దారిలో గూగుల్, అమెజాన్లు మరోసారి భారీ ఎత్తున లేఆఫ్స్‌కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. 20వేలు కాదు అంతకంటే ఎక్కువే? మెటా తర్వాత అమెజాన్ ఉద్యోగుల తొలగింపులపై అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటి నుంచి 2023 ప్రారంభం వరకు సంస్థలోని అన్నీ విభాగాల్ని రివ్యూ చేస్తున్నాం. ఆ రివ్యూ ఆధారంగా ఒక్కసారిగా కాకుండా దశల వారీగా ఉద్యోగుల్ని తొలగిస్తామని అమెజాన్ సీఈవో జెఫ్‌బెజోస్ తెలిపారు. అయితే ఎంతమందికి అమెజాన్ పింక్ స్లిప్‌లు జారీ చేయనుందనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. పలు నివేదికల ప్రకారం.. 20వేల మంది ఉద్యోగుల్ని పక్కన పెట్టనుందని తెలిపగా.. నవంబర్ నెలలో 10వేల మందిపై వేటు వేసింది. త్వరలో 20 వేలు, అంతకంటే ఎక్కువ మందిని ఇంటికి సాగనంపనుందని సమాచారం. ఖర్చు తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా అమెజాన్ పలు ప్రాజెక్ట్‌ల్ని బీటా టెస్టింగ్‌కే పరిమితం చేసింది. ఏ మాత్రం లాభాసాటి లేని వ్యాపారాల్ని (భారత్‌లో అమెజాన్ అకాడమీ) షట్ డౌన్ చేస్తుంది. అమెజాన్ దారిలో గూగుల్ గూగుల్ సైతం తన మొత్తం వర్క్ ఫోర్స్‌లో 6 శాతం అంటే 10వేల మందిని ఫైర్ చేయగా.. 2023 ప్రారంభం నాటికి పనితీరును బట్టి ఉద్యోగులకు గుడ్‌బై చెప్పనుంది. ఇందుకోసం ఉద్యోగుల పనితీరును అంచనా వేయాలని సెర్చ్ దిగ్గజం మేనేజర్లను కోరింది. తద్వారా పేలవ పనితీరు కనబరిచిన వారిని తొలగించే అవకాశం ఉంది. ఈ ఏడాది క్యూ4 నిరాశజనకమైన ఫలితాలతో అసంతృప్తిగా ఉన్న యాజమాన్యం నియామకాల్ని నిలిపేసింది. ఖర్చులను ఆదా చేయడానికి ఇతర టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తే నష్టపరిహారం చెల్లిస్తున్నాయి. కానీ ఉద్యోగుల్ని ఫైర్ చేయడం, పింక్ స్లిప్‌లు జారీ చేసిన ఉద్యోగులకు ఇతర బెన్ఫిట్స్ అందించ లేమని తేల్చి చెప్పింది. చదవండి👉 ‘ఇక నిద్ర పోండి’, ట్విటర్ ఆఫీస్‌లో ఎలాన్ మస్క్ సరికొత్త ప్రయోగం! -
మీలో ఈ స్కిల్స్ ఉన్నాయా?, 3.64 లక్షల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ క్యాప్టివ్ సెంటర్లు (జీసీసీ) వచ్చే 12 నెలల్లో సుమారు 3.64 లక్షల మంది ఉద్యోగులను చేర్చుకోనున్నాయని ఎన్ఎల్బీ సర్వీసెస్ తన నివేదికలో తెలిపింది. అంతర్జాతీయంగా ప్రధాన మార్కెట్లలో సేవలకు డిమాండ్ నేపథ్యంలో ఈ నియామకాలు ఉంటాయని వెల్లడించింది. సర్వేలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), హెల్త్‌కేర్, ఫార్మా, ఇంటర్నెట్, టెలికం, ఐటీ సాఫ్ట్వేర్, కన్సల్టింగ్, తయారీ, చమురు, సహజ వాయువు, రిటైల్ రంగంలో ఉన్న 211 జీసీసీ కంపెనీలు పాల్గొన్నాయి. హైదరాబాద్‌సహా ఎనమిది నగరాల్లో ఇవి విస్తరించాయి. ‘గ్లోబల్ క్యాప్టివ్ సెంటర్ల పరిశ్రమ ప్రస్తుత రూ.2.95 లక్షల కోట్ల నుంచి 2026 నాటికి రూ.4.94–7 లక్షల కోట్లకు చేరుతుంది. సర్వేలో పాలుపంచుకున్న ఐటీ, సాఫ్ట్వేర్, కన్సల్టింగ్ రంగ కంపెనీల్లో సిబ్బంది సంఖ్యను పెంచుకోనున్నట్టు 33 శాతం తెలిపాయి. నియామకాలకు బీఎఫ్ఎస్ఐలో 21 శాతం, ఇంటర్నెట్, టెలికంలో 16 శాతం కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్టు వెల్లడించాయి. ప్రస్తుతం కార్యకలాపాలలో ఉన్న ప్రపంచ జీసీసీల్లో భారత్ దాదాపు 45 శాతం వాటా కలిగి ఉంది. ఇది మరింత పెరుగుతుందని అంచనా. ఉపాధిలో ఈ రంగం 2023లో 10.8 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేస్తుంది. డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగ్, స్టాటిస్టికల్ అనాలిసిస్, యూఐ/యూఎక్స్ డిజైన్ వంటి డిజిటల్, మెషీన్ లెర్నింగ్ స్కిల్స్‌కు ప్రస్తుతం డిమాండ్ ఉంది’ అని నివేదిక వివరించింది. క్లయింట్లు సొంతంగా నిర్వహిస్తున్న డెలివరీ సెంటర్లే జీసీసీలు. -
ఆర్ధిక మాంద్యంలో ఐటీ జాబ్ కొట్టడమే మీ లక్ష్యమా..మైక్రోసాఫ్ట్ అదిరిపోయే ఆఫర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. ఒక లక్షకుపైచిలుకు భారతీయ సాఫ్ట్వేర్ డెవలపర్లకు నెలరోజుల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఫ్యూచర్ రెడీ చాంపియన్స్ ఆఫ్ కోడ్ కార్యక్రమం కింద నెలరోజుల శిక్షణతోపాటు అభ్యర్థులను ధ్రువీకరించనుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న డెవలపర్ కమ్యూనిటీలతో ఆవిష్కరణల కేంద్రంగా భారత్ మారిందని మైక్రోసాఫ్ట్ ఇండియా కస్టమర్ సక్సెస్ ఈడీ అపర్ణ గుప్త అన్నారు. దేశ వృద్ధిని నడిపించే సాంకేతికత అభివృద్ధిలో డెవలపర్ల సృజనాత్మకత, ఆవిష్కరణ, అభిరుచిని మైక్రోసాఫ్ట్ గుర్తిస్తుందని చెప్పారు. -
భారీ షాక్, మరో రంగానికి చెందిన వేలాది మంది ఉద్యోగుల తొలగింపు
కోవిడ్-19, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వంటి వివిధ కారణాలతో ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే భయాలు వెంటాడుతున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయా సంస్థలు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. దీంతో కేవలం రెండు నెలలో ఒక్క టెక్నాలజీ రంగంలో 1.25లక్షల మంది ఉపాది కోల్పోగా..ఈ తొలగింపులు ఇప్పుడు మీడియా రంగాన్ని సైతం కుదిపేస్తున్నాయి. యాక్సియోస్ నివేదిక ప్రకారం..ప్రపంచ ఆర్థిక మందగమనంతో సంస్థలు ప్రకటనలపై చేసే ఖర్చును తగ్గించాయి. వెరసి మీడియా రంగంలో ఉద్యోగాల తొలగింపు షురూ అయినట్లు తెలిపింది. ► గత నెలలో మీడియా ఇండస్ట్రీలో పనిచేస్తున్న సుమారు 3 వేల మంది ఉద్యోగులపై వేటు వేసినట్లు తెలుస్తోంది. వార్న్‌ర్ బ్రదర్స్‌కు చెందిన డిస్కవరీలో ఉద్యోగాల కోత కొనసాగుతుండగా.. రానున్న రోజుల్లో సిబ్బందిని ఇంటికి పంపేందుకు మీడియా యాజమాన్యాలు సిద్ధమైనట్లు సీఎన్ఎన్ చీఫ్ క్రిస్ లిచ్ట్ తెలిపారు. ►పారామామౌంట్ గ్లోబల్ నుంచి వాల్ట్ డిస్నీ కంపెనీలు, ఇతర మీడియా సంస్థలు కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేయడం, నియామకాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ►కామ్‌క్యాస్ట్ కేబుల్ యూనిట్ గత నెలలో ఉద్యోగుల్ని తొలగించింది. ఆ సంస్థ ఎంటర్టైన్మెంట్ విభాగం, ఎన్బీసీ యూనివర్సల్‌లో సైతం తొలగింపులు ఉంటాయని నివేదికలు పేర్కొన్నాయి. ►ప్రోటోకాల్, పొలిటికో నుండి 2020లో టెక్ న్యూస్ వెబ్సైట్ ప్రారంభమైంది. ఆ వెబ్ సైట్ ఈ ఏడాది చివరి నాటికి షట్‌డౌన్ చేసేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. తద్వారా యాక్సియోస్ ప్రకారం, దాదాపు 60 మంది ఉద్యోగులు ఉద్యోగులు కోల్పోనున్నారు. ►వైస్ మీడియా సీఈవో నాన్సీ డుబాక్ ఈ నెల ప్రారంభంలో చిన్న కోతల తర్వాత 15 శాతం వరకు ఖర్చులను తగ్గించుకోవాలని యోచిస్తున్నట్లు సిబ్బందికి తెలిపారు. ►నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కోవిడ్ కారణంగా మీడియా నిర్వాహణ ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో యుఎస్ఎ టుడే మాతృ సంస్థ గానెట్, ఆగస్ట్‌లో 400 మందిని తొలగించింది. మరో సారి ఉద్యోగుల్ని ఫైర్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. చదవండి👉 ‘ట్విటర్లో మా ఉద్యోగాలు ఊడాయ్’..లైవ్‌లో చూపించిన ఉద్యోగులు -
" ఐటీకి ఏమైంది ".. సీనియర్ HR ప్రొఫెషనల్ చైతన్య రెడ్డి తో స్పెషల్ ఇంటర్వ్యూ
-
‘బాబ్బాబూ ఒక్కసారి రావూ’..ఉద్యోగుల్ని బ్రతిమిలాడుతున్న ఎలాన్ మస్క్!
లక్షల కోట్లతో కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ నాటి నుంచి ట్విటర్‌ను సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తున్నారు. ఉద్యోగుల తొలగింపు, బ్లూటిక్, కార్యాలయాల మూసివేత తాజాగా ఉద్యోగులకు జారీ చేసిన అల్టిమేట్టం వరకు ఆ సంస్థ భవిష్యత్‌ను మరింత గందర గోళంలోకి నెట్టేస్తుంది. అయినా మస్క్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తాను ఏం చేయాలని అనుకుంటున్నారో అదే చేస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా హాట్ టాపిగ్గా మారుతున్నారు. ‘వర్క్ ఫ్రమ్ హోమ్ రద్దు చేస్తున్నాం. సంస్థ కోసం ఎక్కువ పనిగంటలు పనిచేయాలంటూ’ మస్క్ ఉద్యోగులకు అల్టిమేట్టం జారీ చేశారు.అంతే మస్క్ ఆదేశంతో చిర్రెత్తిపోయిన ఉద్యోగులు ‘నువ్వు వద్దు నీ ఉద్యోగం వద్దు’ అంటూ సుమారు 1200 మంది ఉద్యోగులు ట్విటర్‌కు రిజైన్ చేశారు. ఆ రిజైన్ చేసిన మరోసటి రోజే మస్క్ ప్రస్తుతం ట్విటర్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఓ మెయిల్ పెట్టారు. అందులో.. ‘మీలో కోడింగ్ రాసే నైపుణ్యం ఉంటే వెంటనే ఈరోజు మధ్యాహ్నం 2గంటల లోపు శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ఆఫీస్‌కు స్వయంగా వచ్చి రిపోర్ట్ చేయాలని కోరారు. కుటుంబ అత్యవసర పరిస్థితులు ఉన్నవారిని మినహాయించినట్లు ఆ మెయిల్స్‌లో మస్క్ చెప్పారని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. గత ఆరు నెలల్లో కోడింగ్‌లో ఫలితాలు రాబట్టిన ఇంజనీర్లు బుల్లెట్ పాయింట్ సారాంశాన్ని, అలాగే అత్యంత ముఖ్యమైన 10 కోడ్ లైన్ల స్క్రీన్షాట్లను పంపమని కోరారు. ఎందుకంటే ట్విటర్‌ను బిల్డ్ చేసేందుకు సహాయపడిన టెక్ స్టాక్ (టెక్నాలజీ) ను అర్థం చేసుకోవడంలో తనకు సహాయపడుతుందనే ఉద్దేశంతో ఈ మెయిల్ పెట్టినట్లు మస్క్ చెప్పారు. చదవండి👉 వాళ్లు పోతే పోనివ్వండి.. ఆయన పునరాగమనం కావాలా? వద్దా?: ఆసక్తికర పోల్ -
‘నా ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో’..టెక్కీలకు చుక్కలు చూపిస్తున్న కంపెనీలు!
నిన్న ట్విటర్..మెటా. నేడు అమెజాన్. సంస్థ ఏదైనా సందర్భం ఒక్కటే. అదే కాస్ట్ కట్. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌తో పాటు..ఆ రంగానికి అనుసంధానంగా ఉన్న ఇతర రంగాల్లో నడుస్తున్న చర్చ ఇది. డిజిటల్ అడ్వటైజ్మెంట్ నుంచి వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టడం, మాంద్యం భయాలు వెంటాడుతున్న వేళ ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియదు. ఎప్పుడు ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో తెలియక ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు సంస్థలు మీటింగ్ అని పిలిచి వేరే ఉద్యోగం చూసుకోమని చీటింగ్ చేయడం కొసమెరుపు ప్రపంచ దేశాల్లో కోవిడ్-19 సంక్షోభం కారణంగా డిజిటల్ వినియోగం విపరీతంగా పెరిగింది. కూర్చున్న చోటు నుంచే కావాల్సిన పనులన్నీ చక్కబెట్టుకోవడంతో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ క్లాసులు, ఓటీటీలు, యాప్స్, యూపీఐ పేమెంట్స్, సోషల్ మీడియా, ఈకామర్స్ సేవలు, ఆన్లైన్ సర్వీసులు ఇలా ఊహించని విధంగా డిజిటల్ కార్యకలాపాలు జోరందుకున్నాయి. మరి ఆ కార్యకలాపాలు నిర్విరామంగా కొనసాగాలంటే ఐటీ రంగం, అందులో పనిచేసేందుకు ఉద్యోగులు కావాలి. దీంతో టెక్ కంపెనీలు డిమాండ్‌కు మించి ఉద్యోగుల్ని నియమించున్నాయి. నాస్కామ్ నివేదిక ప్రకారం. ఒక్క భారత్‌లో 2021- 2022 ఆర్ధిక సంవత్సరంలో సుమారు నాలుగున్నర లక్షల మందికి పైగా కొత్తగా ఈ రంగంలో ఉపాధి పొందారు. ఇక వారిని నిలుపుకునేందుకు దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకు శాలరీల పెంపు, ప్రోత్సాహకాలు, ఉద్యోగుల్ని నిలుపుకునేందుకు డబుల్ శాలరీలు, ఇన్సెంటీవ్స్లు, బోనస్‌లు ఇచ్చాయి. మహమ్మారి కారణంగా రియల్ ఎస్టేట్, అగ్రికల్చర్, ట్రాన్స్పోర్ట్, ఏవియేషన్ ఇలా అన్నీ రంగాలు కుదేలయ్యాయి. కానీ ఒక్క ఐటీ రంగం ఎన్నడూ లేని విధంగా లాభాల్ని గడించింది. . కానీ ఇప్పుడు పరిస్థితుల మారాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా అమెరికా, యూరప్‌తో పాటు మిగిలిన దేశాలపై ఆ ప్రభావం తీవ్రంగా పడింది. భారత్‌కు చెందిన దిగ్గజ టెక్ కంపెనీలు 80శాతం ప్రాజెక్ట్‌లు అమెరికా, యూరప్ దేశాల మీద ఆధారపడ్డాయి. ఆ దేశాల్లో ఆర్ధిక మాంద్యం కారణంగా వడ్డీ రేట్లు పెంచడం, ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడం, జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. దీంతో ఖర్చు తగ్గించుకునేందుకు మెటా, ట్విటర్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. మెటా మొత్తం ఉద్యోగుల్లో 13 శాతం అంటే 11 వేల మందిపై వేటు వేయగా, ట్విటర్ ప్రపంచ వ్యాప్తంగా 3,700 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ జారీ చేసింది. భారత్‌లో ట్విటర్ ఉద్యోగులు 200 మంది ఉండగా వారిలో 12 మంది మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు స్ట్రైప్, సేల్స్ ఫోర్స్, మైక్రోసాఫ్ట్, జిల్లో, స్నాప్,రాబిన్ హుడ్ వంటి సంస్థలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ వారంలో 10వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది. మీటింగ్ పేరుతో ఉద్యోగుల్ని పిలిపించి రెండు నెలల్లోగా వేరే ఉద్యోగాలు చూసుకోవాలని తెగేసి చెబుతున్నట్టు సమాచారం. అందుకు ఊతం ఇచ్చేలా లింక్డిన్ పోస్టులు దర్శనమిస్తున్నాయి.అమెజాన్ అలెక్సా వర్చువల్ అసిస్టెంట్ బిజినెస్, క్లౌడ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్, కిండిల్ ఇలా 126 వంటి విభాగాలకు చెందిన ఉద్యోగులపై లేఆఫ్స్ ఎఫెక్ట్ అధికంగా ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. పైన పేర్కొన్న సంస్థలతో పాటు ఇతర కంపెనీలు లేఆఫ్స్‌కు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. ఆర్ధిక మాంద్యం కారణంగా ఖర్చును తగ్గించుకునేందకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే విధుల నుంచి తొలగించడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 ‘ట్విటర్లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్ -
టీసీఎస్ మరింత విస్తరణ
ముంబై: ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అమెరికాలో తమ వ్యాపారాన్ని మరింతగా పెంచుకుంటోంది. ఇందులో భాగంగా ఇలినాయిస్ రాష్ట్రంలో కార్యకలాపాలు విస్తరిస్తున్నట్లు సంస్థ తెలిపింది. దీనితో 2024 నాటికి కొత్తగా 1,200 ఉద్యోగాలు కల్పించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఇల్లినాయిస్లో టీసీఎస్‌కు 3,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. యునైటెడ్ ఎయిర్‌లైన్స్, వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయన్స్ వంటి క్లయింట్లకు సర్వీసులు అందిస్తున్నారు. -
ఐటీ హబ్‌గా విశాఖలో అపారమైన అవకాశాలు
సాక్షి, విశాఖపట్నం: ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు హబ్‌గా అభివృద్ధి చెందేందుకు విశాఖపట్నంలో అపారమైన అవకాశాలున్నాయని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) డైరెక్టర్ జనరల్ అరవింద్‌కుమార్ చెప్పారు. సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇండస్ట్రీ 4.0– అవకాశాలు, సవాళ్లు’ సదస్సులో పాల్గొనేందుకు ఆయన శుక్రవారం విశాఖ వచ్చారు. చదవండి: ‘టెక్’ల కేంద్రంగా విశాఖ ఎస్టీపీఐ డైరెక్టర్ సి.వి.డి.రామ్‌ప్రసాద్‌తో కలిసి ఆయన సాక్షితో మాట్లాడారు. ఐటీ పరిశ్రమలన్నీ తమ తదుపరి డెస్టినేషన్‌గా ద్వితీయశ్రేణి నగరాల్ని ఎంపిక చేసుకుంటున్నాయని, ఇందులో మొదటి వరుసలో విశాఖపట్నం ఉందని చెప్పారు. ఆసియా–పసిఫిక్ ప్రాంతానికి డేటా సెంటర్ హబ్‌గా భారత్ అవతరించబోతోందన్నారు. అరవింద్‌కుమార్ ఇంకా ఏమన్నారంటే.. ఏపీ ఐటీ పాలసీ అద్భుతం ఐటీ సర్వీస్ సెక్టార్ పరిశ్రమల ఏర్పాటుకు వైజాగ్ వంటి నగరాలే మొదటి ప్రాధాన్యం. విశాఖపట్నం ఒక డైనమిక్ సిటీ. కాస్త ప్రోత్సాహకాలు అందిస్తే.. ఐటీ రంగం మొత్తం విశాఖ వంటి నగరాల వైపు పరుగులు తీస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐటీ పాలసీ కూడా అద్భుతంగా ఉంది. మరిన్ని అవకాశాల కోసం పరిశ్రమలు ఎదురు చూస్తున్నాయి. చైనా, జపాన్ వంటి దేశాల పోటీని తట్టుకోవాలంటే వైజాగ్ వంటి టైర్–2 నగరాలని ఎంపిక చేసుకోవాల్సిందే. బీపీవోల ఓటు వైజాగ్‌కే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (బీపీవో) కంపెనీలు కూడా ద్వితీయశ్రేణి నగరాల బాట పడుతున్నాయి. వీటి ఓటు కూడా వైజాగ్‌కే ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీపీవో సీట్స్‌లో ఏపీ వాటా 27 శాతం కాగా.. విశాఖపట్నం వాటా 20 శాతం ఉండటం గమనార్హం. ఇది ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల వల్ల సాధ్యమైంది. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో ఎస్టీపీఐ సేవలు మరింత విస్తృతం చేయాలని నిర్ణయించాం. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న కార్యాలయం కాకుండా మరో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నాం. 2026 నాటికి 80 బిలియన్ల మార్కెట్ ఎస్టీపీఐ లక్ష్యం ప్రస్తుతం ఎస్టీపీఐ సేవలను విస్తృతం చేశాం. వై2కే సమస్యని అధిగమించి అడుగులు వేయడం వల్లే.. ఎస్టీపీఐపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం ఏర్పడింది. అందుకే సాఫ్ట్వేర్ ఉత్పత్తుల ఎగుమతుల మార్కెట్లో 1992లో రూ.17 కోట్లు మాత్రమే ఉన్న మా వాటా.. ప్రస్తుతం రూ.5.69 లక్షల కోట్లకు చేరుకుంది. 2026 నాటికి 80 బిలియన్ డాలర్లకు చేరుకోవడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. అదేవిధంగా సాఫ్ట్వేర్ సేవల మార్కెట్లోను రూ.227 కోట్ల వాటాను ఆర్జించాం. సీవోఈలకు అమ్మలాంటి కల్పతరు ఇప్పటికే ఎస్టీపీఐ 20 సెంటర్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (సీవోఈ)లని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసింది. విశాఖపట్నంలోను సేవలందిస్తున్నాం. పరిశోధనలు, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు అన్ని విధాలా అడుగులు వేస్తున్నాం. ఇందుకోసం కల్పతరు ప్రారంభించాం. ఏపీ ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామిగా ఉండటం హర్షదాయకం. సాఫ్ట్వేర్ ఉత్పత్తుల క్లస్టర్‌గా ఇది ఉపయుక్తమవుతుంది. ఇప్పటివరకు కల్పతరు ఇండస్ట్రీ 4.0 కోసం 250 దరఖాస్తులు వచ్చాయి. డేటా సెంటర్ హబ్‌గా భారత్ ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో డేటా సెంటర్ హబ్‌గా భారత్ అవతరించే అవకాశం ఉంది. ఇందుకు ఎస్టీపీఐ నుంచి సంపూర్ణ మద్దతు అందిస్తున్నాం. డేటా సెంటర్లకు సంబంధించిన విధానాన్ని రూపొందించే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ పాలసీని అమలుచేసే ఏజెన్సీగా ఎస్టీపీఐ వ్యవహరిస్తుంది. ఫిన్‌టెక్, హెల్త్‌కేర్, బ్లాక్‌చెయిన్ వంటి సాంకేతిక రంగాలపై దృష్టిసారిస్తున్నాం. -
టెక్ కంపెనీల్లో.. మూన్‌లైటింగ్ పరాకాష్ఠకు ఈ సంఘటనే ఉదాహరణ..
ఒక బడా ఐటీ కంపెనీకి చెందిన ఉద్యోగి ఇతర కంపెనీలకూ పని చేస్తున్నట్టు తేలింది. ఇంకేముంది? యాజమాన్యం అతన్ని తొలగించింది. కంపెనీ ఇచ్చిన ల్యాప్‌టాప్‌ను వెనక్కు తీసుకునేందుకు అతని ఇంటికి వెళ్లిన సిబ్బంది నోరెళ్లబెట్టారట.అతని గదిలో ఏకంగా ఐదు ల్యాప్‌ట్యాప్‌లు ఉండడమే కాదు, ఏ ల్యాప్‌ట్యాప్‌ను ఏ కంపెనీ ఇచ్చిందో తెలియని స్థితిలో ఆ ఉద్యోగి ఉన్నాడట. మూన్‌లైటింగ్ పరాకాష్ఠకు ఈ సంఘటనే ఉదాహరణ. మూన్‌లైటింగ్ ఐటీ రంగాన్ని కుదిపేస్తోంది. పేరోల్‌లో ఉన్న 300 మందిని విప్రో తొలగించడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. మూన్‌లైటింగ్ (ఒకటికి మించి కంపెనీలకు సేవలు అందించడం) చట్టబద్ధత, నైతికతపై ఇప్పుడు చర్చ ఊపందుకుంది. మూన్‌లైటింగ్ మోసం అంటూ విప్రో చైర్మన్ రిశద్ ప్రేమ్‌జీ ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘చేరిన సమయంలో కంపెనీ కోసం మాత్రమే పని చేస్తామని ఒప్పందంపై సంతకం పెడతారు. అయినప్పటికీ అభ్యర్థులు తమ మిగిలిన సమయంలో ఏమి చేయాలో ఎంచుకోవచ్చు. అలా చేయడం నైతికంగా సరైనది కాదు’ అని ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్ అన్నారు. ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు ద్వంద్వ ఉద్యోగాలను అనుమతించేది లేదని నొక్కిచెప్పింది. కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఉద్యోగం నుంచి తీసివేస్తామని హెచ్చరించింది. వేలాది కంపెనీలు మూన్‌లైటింగ్‌కు పాల్పడిన ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. అయితే ఇవేవీ బయటకు పొక్కడం లేదు. దేశంలో 2008 నుంచి 2020 వరకు ఐటీ రంగంలో ఉన్న ప్రతి ఉద్యోగి కొంత అభద్రతా భావంతో పనిచేశారు. ఆటోమేషన్, కృత్రిమ మేధ వంటి టెక్నాలజీలు ఏ క్షణంలో తమ ఉద్యోగాలకు ఎసరు పెడతాయో తెలియని పరిస్థితి. ఆ సమయంలో ఐటీ కంపెనీలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. ఎక్కువ పని గంటలు, అతి తక్కువ వార్షిక ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లకు సుదీర్ఘ కాలం తీసుకోవడం లాంటి పరిస్థితి దాచాలన్నా దాగని వాస్తవం. కానీ 2020లో కోవిడ్ రాకతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. లాక్‌డౌన్‌తో అన్ని కంపెనీలు డిజిటల్ వైపు మారాయి. దీంతో ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు వెల్లువెత్తాయి. ఎవరూ ఊహించని ఈ పరిస్థితితో ఐటీలో మానవ వనరుల కొరత తీవ్రమైంది. అప్పటి వరకు బిక్కుబిక్కుమంటూ పని చేస్తున్న ఉద్యోగులకు రెండు, మూడు రెట్ల జీతం ఇచ్చి కంపెనీలు తీసుకున్నాయి. ఫ్రెషర్లకు, అరకొరగా స్కిల్స్, నాలెడ్జి ఉన్న అభ్యర్థులను సైతం నియమించుకున్నాయి. ప్రాజెక్టులు, వర్క్ ఆర్డర్లు క్యూ కట్టడంతో ఉద్యోగుల సమస్యపై కంపెనీలు వ్యూహాత్మక మౌనం పాటించాయి. మూడవ లాక్డౌన్ తరువాత ప్రాజెక్టులు కూడా క్రమబద్ధం కావడంతో ఉద్యోగుల సమస్య వైపు కంపెనీలు దృష్టి సారించాయి. అందులో మొదటి అడుగు హైబ్రిడ్ పని విధానం. ఈ విధానంలో ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వారంలో కొన్ని రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాలని ప్రకటించాయి. కొన్ని కంపెనీలు పూర్తిగా ఆఫీస్ నుంచే విధులు నిర్వర్తించాలని తేల్చిచెప్పాయి. ఇక్కడే సమస్య మొదలైంది. కొత్తగా జాయిన్ అయిన ఉద్యోగులలో చాలామందికి సరైన నైపుణ్యాలు, అనుభవం లేవని, వాళ్ళు కంపెనీకి సమర్పించిన ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్లు కూడా తప్పుడువేనని తేలింది. ఈ సమస్యను మరింత లోతుగా పరిశీలించడంతో నమ్మశక్యం కానీ విషయాలు ఐటీ కంపెనీలకు బోధపడ్డాయి. ఇంటి నుంచి పని నేపథ్యంలో అనుభవజ్ఞులైన ఉద్యోగులు ఒకేసారి రెండు, మూడు కంపెనీలకు పనిచేస్తున్నట్లు (మూన్‌లైటింగ్) గుర్తించాయి. కొందరైతే వాళ్ళ పనిని అనుభవజ్ఞులకు ఇచ్చి చేయించుకున్నట్లు తేలింది. మరోవైపు కొత్తగా చేరినవారిని, బెంచ్‌పైన ఉన్న అభ్యర్థులను క్లయింట్లు స్వయంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. నిర్ణీత గడువులోగా ఇంటర్వ్యూలో గట్టెక్కితేనే కంపెనీ జీతం చెల్లిస్తుంది. లేదంటే ఇంటిబాట పట్టాల్సిందే! గడిచిన రెండేళ్లలో రెండు చేతులా సంపాదనకు అలవాటు పడ్డ సిబ్బంది కొంతమంది ఉన్న ఉద్యోగాలలో మంచిది ఒకటి ఎంచుకొని హైబ్రిడ్ విధానానికి మారారు. ఇంకొంతమంది మూన్‌లైటింగ్ విధానాన్ని చట్టబద్ధం చేయాలని బహిరంగంగా ప్రకటించారు. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపైన చర్చ ఊపందుకొంది. ఈ పరిస్థితుల్లో నాణ్యత దెబ్బతినడం, డేటా ప్రైవసీకి భంగకరం అని క్లయింట్లు భావించి ప్రాజెక్టులను రద్దు చేసుకుంటే పరిస్థితి ఏంటని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. మనుగడకే ఇబ్బంది కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ అత్యంత అనుకూలం, లాభదాయకం. కానీ ఉద్యోగులు ఎంచుకుంటున్న విధానాలను క్రమబద్ధం చేయకుంటే ప్రపంచ ఐటీ రంగంలో భారత కంపెనీల పట్ల ఉన్న సానుకూలతను చేజేతులా కోల్పోతాము. విదేశీ క్లయింట్లు డేటా సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యమిస్తాయి. అందుకు ఉన్న చట్టాలు కూడా రోజు రోజుకి పటిçష్ఠం అవుతున్న సంగతి అనుభవజ్ఞులైన ఉద్యోగులకు తెలుసు. తమ ఉద్యోగులు రెండు మూడు కంపెనీలకు పనిచేస్తున్న విషయం తెలిస్తే మెజారిటీ క్లయింట్లు ప్రాజెక్టులను వెనక్కి తీసుకుంటే ఒక్క ఐటీ మాత్రమే కాకుండా దేశ ఆర్థిక రంగాన్ని కూడా విషమ పరిస్థితుల్లోకి నెట్టడం ఖాయం. కొంతమంది క్లయింట్లు కన్సల్టెంట్ విధానానికి మొగ్గు చూపినా, బిల్లింగ్ విషయంలో విపరీతంగా తగ్గిస్తే కంపెనీల ఆదాయంలో భారీ కోతపడే అవకాశం ఉంటుంది. కన్సల్టెంట్ విధానం స్వల్పకాలంలో కంపెనీలకు, అనుభవజ్ఞులైన ఉద్యోగులకు లాభదాయకంగా కనపడినా, ధీర్ఘకాలంలో ఐటీ రంగం మనుగడకే ఇబ్బంది. అవర్లీ బిల్లింగ్ లేదా మొత్తం పని గంటలు గణనీయంగా తగ్గించమని ఒత్తిడి చేస్తే కంపెనీల ఆదాయం, లాభాలు తగ్గుతాయి. ఐటీ రంగానికి గొడ్డలిపెట్టు మూన్‌లైటింగ్ విధానం ఐటీ రంగానికి ఒక గొడ్డలిపెట్టు. ఈ విధానానికి అనుభజ్ఞులైన ఉద్యోగుల నుండి మద్దతు పెరుగుతూ ఉంటే మరొక వైపు లక్షల సంఖ్యలో నిరుద్యోగులుగా ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులు.. తమ అవకాశాలను గణనీయంగా దెబ్బ తీస్తుందని ఆందోళన చెందుతున్నారు. మూన్‌లైటింగ్ చట్టబద్ధం అయితే కంపెనీలు ఫ్రెషర్ల నియామకాలకు, క్యాంపస్ రిక్రూట్మెంట్లకు స్వస్తి పలుకుతాయని భావిస్తున్నారు. ‘వైద్య రంగంలో డాక్టర్ల కొరత ఉంటుంది కాబట్టి వాళ్లకు కన్సల్టెంట్ విధానం పనికి వస్తుంది. కానీ లక్షల సంఖ్యలో మానవ వనరులు ఉన్న సాఫ్ట్వేర్ రంగంలో ఈ విధానం అవసరం లేదు’ అని కాంటార్ జీడీసీ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ కందుకూరి సురేశ్ బాబు తెలిపారు. మూన్‌లైటింగ్‌కు ఓకే మూన్‌లైటింగ్‌ను సమర్థించే కంపెనీలూ లేకపోలేదు. టెక్ మహీంద్రా సీఈవో సి.పి.గుర్నానీ అయితే కాలానికి అనుగుణంగా మారుతూ ఉండవలసిన అవసరాన్ని ఎత్తి చూపారు. పని విధానంలో మార్పులను స్వాగతిస్తున్నట్టు ఆయన చెప్పారు. ‘ఎవరైనా సమర్థత, ఉత్పాదకత నిబంధనలకు అనుగుణంగా, ఆ వ్యక్తి మోసం చేయనంత వరకు కొంత అదనపు డబ్బు సంపాదించాలని కోరుకుంటే తన కంపెనీ విలువలు, నైతికతకు విరుద్ధంగా ఏమీ చేయరు. ఈ విషయంలో నాకు ఏమీ ఇబ్బంది లేదు. రెండు చోట్లా పని చేయడాన్ని ఒక విధానంగా చేయాలనుకుంటున్నాను. మీరు దీన్ని చేయాలనుకుంటే సంతోషం. కానీ దాని గురించి బహిరంగంగా ఉండండి’ అని గుర్నానీ అన్నారు. ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ మూన్‌లైటింగ్ పాలసీని ప్రకటించింది. సంస్థ విధులకు ఆటంకం కలగకుండా గిగ్ ప్రాజెక్టులు చేపట్టేందుకు తన ఉద్యోగులకు అనుమతినిచ్చింది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే, పని విషయంలో స్విగ్గీ, విప్రో.. పూర్తిగా భిన్నమైన స్వభావం కలవి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు మూన్‌లైటింగ్‌కు మద్దతు ఇవ్వడానికి స్విగ్గీని ఉదాహరణగా పేర్కొంటున్నారు. అయితే రెండు కంపెనీల మధ్య ప్రాథమిక వ్యత్యాసం ఉందని ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్షా గోయెంకా గుర్తు చేశారు. ‘విప్రో వర్సెస్ స్విగ్గీ – ఈ రెండు కంపెనీలనూ ఒకేగాటన కట్టలేము. ఫార్చూన్–500 కంపెనీలకు విప్రో సేవలు అందిస్తోంది. ఈ సంస్థలకు డేటా గోప్యత ప్రాణప్రదమైనది. డేటా బయటకు పొక్కే అవకాశం ఉందని భావిస్తే అవి సహించవు’ అని అన్నారు. ‘ఒక సంస్థలో పనిచేస్తూ మరో కంపెనీకి మూన్లైటింగ్కి పాల్పడడం అనైతికం. ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టే. దీనికి అనుమతించేది లేదు. కానీ భవిష్యత్ వర్క్‌ఫోర్స్ మోడల్ అనేది కన్సల్టెంట్లుగా పనిచేసే వ్యక్తుల సమూహం. సహకార సమూహాలుగా కంపెనీల కోసం ఉత్పత్తులను రూపొందిస్తారు. వారు ఒకే సమయంలో ఐదు వేర్వేరు కంపెనీల కోసం దీన్ని చేయవచ్చు. అయితే చాలామంది వ్యక్తులు భవిష్యత్తులో వ్యవస్థాపకులుగా మారబోతున్నారని, వారు సొంతంగా కంపెనీలను ప్రారంభించాలని చూస్తున్నారని కంపెనీలు గుర్తించాలి’ అని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ‘ఉద్యోగుల నుంచి పారదర్శకత లేకపోవడం వల్ల మూన్‌లైటింగ్‌పై భిన్నాభిప్రాయాలు ఉత్పన్నమవుతాయి. పూర్తి సమయం ఉద్యోగిగా ఉన్నప్పుడు ప్రస్తుత యజమానికి తెలియజేయకుండా ఇతర అవకాశాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నప్పుడే సమస్య తలెత్తుతుంది. ఇక్కడే యజమాని, ఉద్యోగుల మధ్య నమ్మకం విచ్ఛిన్నమవుతుంది. దీనిని ఎలా పరిష్కరించాలన్నదే ముందున్న సవాలు. మహమ్మారి తదనంతరం పని విషయంలో ఉద్యోగుల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా కంపెనీలు అప్‌గ్రేడ్ అవ్వాలి. కంపెనీలు రెండు మోడళ్లను స్వీకరించాలి. ఒకటి కంపెనీలో పూర్తి సమయం కేటాయించే ఉద్యోగులను కలిగి ఉండడం. మరొకటి గిగ్ వర్కర్లతో సైతం పనులు చేయించుకోవడం. బహుళ ఉద్యోగాలు చేయడం సమస్య కాదు. కానీ దీన్ని ఎలా చేస్తారన్నదే ప్రశ్న’ అని నాస్కామ్ ప్రెసిడెంట్ దేబజానీ ఘోష్ వెల్లడించారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్, సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) భారత్‌లో సాంకేతిక పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఒప్పందానికి కట్టుబడాల్సిందే! ఉద్యోగి ఒక కంపెనీలో చేరే ముందు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా ఆ ఎంప్లాయీ ఒప్పందానికి కట్టుబడాల్సిందే! ఇక్కడ పనిచేస్తూ మరో సంస్థకు సేవలు అందించడం, మేధాసంపత్తి హక్కులను, వ్యాపార రహస్యాలను, సమాచారాన్ని ఇతరులకు చేరవేయడం, ల్యాప్‌టాప్ వంటి సంస్థ అందించిన ఆస్తులను ఇతరులతో, ఇతర కంపెనీలతో పంచుకుంటే ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టే. ఇలా ఒప్పందాన్ని కాలరాసిన ఉద్యోగిని తీసివేసే హక్కు సంస్థలకు ఉంటుంది. ‘ఉద్యోగులు తమ ఆఫర్ లెటర్లోని నిబంధనలకు కట్టుబడి ఉండాలి. వారు ఒకటి కంటే ఎక్కువ కంపెనీలతో పని చేయాలనుకుంటే గిగ్ వర్కర్‌గా కెరీర్ ఎంచుకోవచ్చు’ అని హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైసెస్ అసోసియేషన్ (హైసియా) ప్రెసిడెంట్ మనీషా సబూ తెలిపారు. ద్రవ్యోల్బణానికి తగ్గట్టుగా ‘ఎంట్రీ లెవెల్ ఉద్యోగికి ఐటీ కంపెనీలు 2003–04లో రూ.2.5–3 లక్షలు ఆఫర్ చేశాయి. ఇప్పుడు ఇదే రోల్‌కు రూ.3–3.5 లక్షలు చెల్లిస్తున్నాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎంట్రీ లెవెల్ ఉద్యోగికి ఇప్పుడు వేతనం రూ.6.5–7 లక్షలు ఉండాలి. జీతాలు మెరుగ్గా ఉంటే జాబ్ వదిలేయరు. మూన్‌లైటింగ్‌కు పాల్పడరు’ అని ఓ ఉద్యోగి వ్యాఖ్యానించారు. గిగ్ కార్మికులు స్వతంత్రంగా, తాత్కాలికంగా పనిచేసేవారే గిగ్ కార్మికులు. అంటే ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్స్ వంటి వారు అన్నమాట. ఫ్రీలాన్స్ ఐటీ నిపుణులూ గిగ్ జాబితాలో వచ్చి చేరారు. పని, కాంట్రాక్ట్ పూర్తి అయ్యేవరకు లేదా కొన్ని గంటల కాలానికి వీరు సేవలు అందిస్తారు. వీరి కోసం ఆన్లైన్ వేదికలూ వచ్చాయి. గిగ్‌వర్కర్, గిగ్ఇండియా, వర్క్ఫ్లెక్సి, ఫ్లెక్సిపుల్, ఫ్లెక్స్‌జాబ్స్, జంగిల్వర్క్స్, గిగ్మోస్ వంటివి వీటిలో ఉన్నాయి. ఈ వేదికల్లో కార్మికులు, నిపుణులు తమ పేర్లను నమోదు చేసుకుంటే చాలు. కస్టమర్ల కాల్స్ ఆధారంగా పని ఒప్పదం కుదురుతుంది. ఫలానా సాంకేతిక నైపుణ్యం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చంటూ పోర్టల్స్‌లో తాటికాయంత అక్షరాలతో ఇవి ఊదరగొడుతున్నాయి. అంతేకాదు ఎన్ని డబ్బులు అందుకుంటారో వెల్లడిస్తున్నాయి. ఏ కంపెనీకి ఎంతమంది నిపుణుల సేవలు అవసరమో కూడా స్పష్టం చేస్తున్నాయి. ఎన్ని గంటలు, రోజులు పనిచేయాల్సి ఉంటుందీ తెలియజేస్తున్నాయి. ఎందుకు ప్రోత్సహిస్తున్నాయంటే? నిపుణుల కొరత, సేవల ఖర్చు పెరగడం, సరైన నిపుణుల దొరక్కపోవడం, సమయానికి పనులు పూర్తి చేయడం కోసం, పోటీ కంపెనీని దెబ్బతీయడానికి, వ్యయాలు తగ్గించుకోవడానికి, త్వరితగతిన ప్రాజెక్టును డెలివరీ చేయడం కోసం కొన్ని కంపెనీలు మూన్‌లైటింగ్‌ను ప్రోత్సహిస్తున్నాయి. ప్రధానంగా స్టార్టప్స్ ఇందుకు సై అంటున్నాయి. అదనపు సంపాదన కోసం... జీవన వ్యయం అనూహ్యంగా పెరిగింది. బీమా, అద్దెలూ అధికం అయ్యాయి. ‘కోవిడ్’ మహమ్మారి కారణంగా భవిష్యత్తు పట్ల భయం పట్టుకుంది. అనుకోని ఖర్చులు మీద పడితే ఎలా అన్న ఆందోళన మొదలైంది. జీవనం అస్తవ్యస్తం అయింది. ఉద్యోగం ఉంటుందా లేదా అన్న సందేహం. చివరకు డబ్బే జీవితం అన్న అభిప్రాయానికి వచ్చారు. ప్రతిభకు పదునుపెట్టారు. కొత్త కోర్సులు చేశారు. మరో కంట పడటం లేదు కదా అన్న భావనతో ఇతర కంపెనీలకూ పని చేస్తున్నారు. తద్వారా అదనంగా ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇంటి నుంచి పని విధానం ఇందుకు కలిసి వచ్చింది. ఎలా బయటపడిందంటే? మూన్‌లైటింగ్‌కు పాల్పడిన ఉద్యోగులను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పోర్టల్ ద్వారా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) సాయంతో కంపెనీలు గుర్తిస్తున్నాయి. యూఏఎన్ ఆధారంగా అభ్యర్థి ఎక్కడెక్కడ ఉద్యోగం చేస్తున్నదీ, ఎప్పుడు చేరిందీ వంటి వివరాలను కంపెనీలు తెలుసుకుంటున్నాయి. అలాగే సంస్థ అందించిన ల్యాప్‌టాప్స్‌ను కంపెనీ సర్వర్ ద్వారా ట్రాక్ చేస్తున్నాయి. అంతా క్యాష్ మూన్‌లైటింగ్ మరో కంట కనపడకుండా అభ్యర్థులు కన్సల్టెంట్ల అవతారం ఎత్తుతున్నారు. అత్యధికంగా యూఎస్, యూకే కంపెనీల నుంచి కాంట్రాక్ట్ తీసుకుని అవసరం అయితే ఓ నలుగురిని పెట్టుకుని పని పూర్తి చేస్తున్నారు. నగదు రూపంలో మాత్రమే అందుకునే ఈ ప్రతిఫలాన్ని కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లిస్తున్నారు. బ్యాంక్ క్యాష్ కార్డులు, గిఫ్ట్ వోచర్లనూ స్వీకరిస్తున్నారు. - నూగూరి మహేందర్ చట్టం ఏం చెబుతోంది కార్మిక చట్టాలు కార్మికుల సామాజిక భద్రత కోసం ఉద్దేశించబడ్డాయి. చేస్తున్న పని అలసటకు దారి తీయకూడదు. సాధారణంగా వారానికి 48 గంటలు– అంటే రోజుకు 8 గంటల పని. వారానికి ఒక రోజు విశ్రాంతి ఉంటుంది. రెండు కంపెనీల కోసం ఒక వ్యక్తి పనిచేస్తున్నట్లయితే ఈ భావనను ఉల్లంఘించినట్టే! సాధారణంగా ఒక వ్యక్తిని తొలగించినప్పుడు చేతిలో ఉద్యోగం ఉందా? మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్నారా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తికి ఇప్పటికే వేరే ఉద్యోగం ఉంది. కాబట్టి తొలగింపును తీవ్రంగా పరిగణించలేము. కంపెనీలు సాధారణంగా అపాయింట్మెంట్ ఉత్తర్వుల్లో తమ వ్యాపార గోప్యత గురించి కూడా పేర్కొంటాయి. ఉద్యోగి ఒకే రకమైన యూనిట్లో మరోచోట పనిచేస్తుంటే, ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లే! కాబట్టి కంపెనీలు చర్య తీసుకోవచ్చు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్– సెక్షన్ 69 రెండు చోట్లా ఉపాధిని నిరోధించడానికి నిర్దేశించినది. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం ఉద్యోగికి సెలవు ఇచ్చిన లేదా సెలవులో ఉన్న ఒక రోజు లేదా రోజులో కొంత సమయం ఏ సంస్థలో కూడా పని చేయకూడదు. ఏ యజమాని అయినా ఉద్యోగిని ఉద్దేశపూర్వకంగా అనుమతించకూడదు. –శ్యామ్‌సుందర్ జాజు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, హైదరాబాద్–2 ఒకే ప్రవర్తనా నియమావళి కోవిడ్ తర్వాత పని విధానం మారింది. కార్పొరేట్లు తమ ఉద్యోగ ఒప్పందాలను పునర్నిర్వచించుకోవాలి. ఉద్యోగులతో సంబంధాలను మెరుగుపరచాలి. ఉద్యోగులు, యజమానుల మధ్య భారీ సంక్లిష్టతను, విభజనను మూన్‌లైటింగ్ సృష్టిస్తోంది. జాతీయ స్థాయిలో ఐటీ ఉద్యోగుల కోసం మోడల్ ప్రవర్తనా నియమావళి అవసరం. పనిగంటలు, సెలవులు, విధి విధానాల విషయంలో ప్రామాణికత రావాలి. ఉద్యోగులకు తమ సంస్థలోనే అదనపు పని గంటలు చేసేందుకు అనుమతి ఇవ్వాలి. అందుకు తగ్గట్టుగా నగదుతో ప్రోత్సహించాలి. నిపుణులను సొంతంగా తీర్చిదిద్దాలి. ఇందుకు నియామకాల్లో 30 శాతం మంది ఫ్రెషర్స్ ఉండేలా చూసుకోవాలి. అభ్యర్థి ఉద్యోగంలో చేరుతున్న సమయంలోనే ఒప్పందంలోని అంశాలను సవివరంగా తెలియజేయాలి. – వెంకా రెడ్డి, హెచ్ఆర్ రంగ నిపుణుడు నియామకాల్లో స్తబ్ధత తప్పుడు ఇంటర్వ్యూలు, తప్పుడు అనుభవ పత్రాలతో ఉద్యోగాలు సంపాదించిన ఉద్యోగులను తొలగించడాన్ని కంపెనీలు వేగవంతం చేశాయి. గత రెండు, మూడు నెలలుగా నూతన నియామకాలు చేపట్టకుండా తప్పుడు అభ్యర్థులను తొలగించడంపైన దృష్టి పెట్టడంతో ఒక్కసారిగా నియామకాల్లో స్తబ్ధత నెలకొంది. ఈ సమస్యను సకాలంలో పరిష్కరించకపొతే క్లయింట్ల నమ్మకం కోల్పోయి తమ సంస్థలే కాకుండా ఐటీ రంగం మొత్తం కుదేలయ్యే పరిస్థితి వస్తుందని ఇండస్ట్రీ గుర్తించి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. – నానాబాల లావణ్య కుమార్, కో–ఫౌండర్, స్మార్ట్‌స్టెప్స్ -
ఐటీలో అలజడి : మరో ఊహించని షాక్..తలలు పట్టుకుంటున్న ఫ్రెషర్లు!
ఐటీ సంస్థల్లో మూన్‌లైటింగ్ వివాదం ఇప్పట్లో సమిసిపోయేలా లేదు. ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీలు ఫ్రెషర్లకు భారీ షాకిచ్చాయి. ఇంటర్వ్యూల్లో సెలక్ట్ అయిన ఫ్రెషర్లకు అపాయిట్మెంట్ లెటర్లు ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ తిరిగి వెనక్కి తీసుకున్నాయి. తాజాగా డెలాయిట్ సంస్థ ఆఫర్లను లెటర్లను ఇప్పట్లో ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న ఆర్ధిక సంక్షోభం కలవరానికి గురి చేస్తున్న వేళ.. ఐటీ సంస్థలు ఆఫర్ లెటర్లను వెనక్కి తీసుకోవడం చర్చాంశనీయమైంది. అయితే ఆర్ధిక సంక్షోభం కాదని, మూన్‌లైటింగ్ కారణమంటూ ఐటీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే? ఇటీవల రెండేసి జాబులు చేస్తున్న 300మంది ఉద్యోగుల్ని విప్రో తొలగించింది. ఆ తర్వాత దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులపై ఓ కన్నేశాయి. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన ఉద్యోగుల్ని గుర్తించడం, బ్యాంక్ స్టేట్మెంట్లు పరిశీలించి ఇటీవల ఉద్యోగం పొందిన వారికి తిరిగి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇవన్నీ కొలిక్కి వచ్చేంత వరకు ఫ్రెషర్ల నియామకాలు చేపట్టవద్దని కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ఆఫర్ లెటర్లను రద్దు చేస్తే ఇండస్ట్రీ నుంచి తప్పుడు సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతో..వాటిని తిరిగి తీసుకుంటున్నాయి. చదవండి👉 ‘అలా చేస్తే మీకే కాదు..నా ఉద్యోగానికే దిక్కుండదు’, రషీద్ ప్రేమ్‌జీ సంచలన వ్యాఖ్యలు తాజాగా డెలాయిట్.. గతేడాది క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపిక చేసిన ఫ్రెషర్లకు ఇవ్వాల్సిన ఆఫర్ లెటర్లను ఇచ్చేందుకు మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో డెలాయిట్ నిర్ణయంపై ఫ్రెషర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘క్యాంపస్ ఇంటర్వ్యూల్లో డెలాయిట్‌కు సెలక్ట్ అయ్యాయి. నేను సెలక్ట్ అయ్యానంటూ 2021అక్టోబర్‌లో డెలాయిట్ కన్ఫామ్ చేసింది. అప్పటి నుంచి ఆఫర్ లెటర్ కోసం, జాయిన్ డేట్ కోసం ఎదురు చూస్తున్నాన్నా’ ఓ ఫ్రెషర్ ఆవేదన ‘క్యాంపస్ ప్లేస్మెంట్లో డెలాయిట్ అసోసియేట్ ఎనలిస్ట్, కన్సల్టింగ్ డిపార్ట్ మెంట్ పొజిషన్లో జాబ్ వచ్చింది. ఇప్పటి వరకు ఆఫల్ లెటర్ రాలేదు. సంస్థ ఈ ప్రక్రియను ఎందుకు అంత ఆలస్యం చేస్తోంది?’ - ప్రశ్నిస్తున్న ఓ అభ్యర్ధి ‘డెలాయిట్ ఆఫ్లెటర్లు ఇవ్వడం ఆలస్యం కావడంతో ఫ్రెషర్లు అవమానంగా ఫీలవుతున్నారు. ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ ఆలస్యం చేసిన తరువాత, నా కుటుంబ సభ్యులు,బంధువులు ఉద్యోగం ఉందా? లేదా? అని ప్రశ్నిస్తున్నారు. నేను వారిని మోసం చేశానని అందరూ అనుకుంటున్నారు’ - ఇటీవల గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఓ అభ్యర్ధి ఆఫర్ లెటర్ల ఆలస్యం సుమారు 500మందిపై ప్రభావం చూపింది. మాకు టెలిగ్రామ్ గ్రూపు ఉంది. సుమారు 500 మంది ఇందులో భాగం. ఈ ఆలస్యంపై డెలాయిట్ నుండి రిప్లయి కోసం ఎదురు చూస్తున్నాను. - టెలిగ్రామ్ గ్రూప్ సభ్యుడు, డెలాయిట్ ఇచ్చే ఆఫర్ లెటర్ కోసం ఎదురు చూస్తున్న ఓ అభ్యర్ధి ఆఫర్ లెటర్లు ఆలస్యం చేయడంపై అంతర్జాతీయ మీడియా సంస్థలు డెలాయిట్ ప్రతినిధుల్ని సంప్రదించారు. ఆఫర్లెటర్ల గురించి అడగ్గా..‘మేం నియామకాలు,కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆఫర్లెటర్లను ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నాం. అందుకు కొంత సమయం పడుతుంది’ అని రిప్లయి ఇచ్చారు. కాగా ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్‌జెమిని, యాక్సెంచర్, మైండ్ ట్రీతోఎ పాటు అనేక ఐటీ కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇవ్వకపోవడం, వెనక్కి తీసుకున్న ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. చదవండి👉 దిగ్గజ కంపెనీల్లో సాఫ్ట్వేర్ జాబ్ చేయడమే మీ లక్ష్యమా! గూగుల్ అదిరిపోయే ఆఫర్! -
కంపెనీలను మోసం చేస్తున్న ఐటీ ఉద్యోగులు, ఏరివేసే పనిలో సంస్థలు!
300 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన విప్రో మూన్‌లైటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలుంటాయంటూ మరో బడా ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగులకు హెచ్చరిక మూన్‌లైటింగ్ అనైతికమని, దీన్ని ఆమోదించబోమంటూ స్పష్టం చేసిన అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం స్వల్ప లాభాల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడే ఉద్యోగులు కెరీర్‌నే రిస్కులో పెట్టుకుంటున్నారంటూ పేర్కొన్న టీసీఎస్. ఇలా దిగ్గజ ఐటీ కంపెనీలను ఇంతగా ప్రభావితం చేస్తున్న మూన్‌లైటింగ్ తప్పా, ఒప్పా అంటూ ఓ వైపు చర్చలు కొనసాగుతుండగా.. మరో వైపు మూన్‌లైటింగ్ పాల్పుడుతున్న ఉద్యోగుల్ని సంస్థలు విధుల నుంచి తొలగిస్తున్నాయి. నియామకాల్ని నిలిపివేసి.. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి మరోసారి ఇంటర్వ్యూలు నిర్వహించడం చర్చాంశనీయంగా మారింది. ఇప్పుడు ఈ అంశం ఉద్యోగులకు, ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉద్యోగం సంపాదించిన అభ్యర్ధుల్ని కలవరానికి గురి చేస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలు జల్లెడ పడుతున్నాయి. మూన్‌లైటింగ్‌కు పాల్పడిన ఉద్యోగులను, తప్పుడు పత్రాలతో చేరిన సిబ్బందిని ఏరివేస్తున్నాయి. అభ్యర్థులకు ప్రత్యక్షంగా మరోసారి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు బ్యాంక్, ప్రావిడెంట్ ఫండ్ స్టేట్మెంట్లను ఉద్యోగుల సమక్షంలో, లైవ్‌లో తనిఖీ చేస్తున్నాయి. స్నేహితులు, సీనియర్ల సహకారంతో గతంలో ఇంటర్వ్యూలు గట్టెక్కినవారు.. ఈ ఇంటర్యూల్లో నోరెళ్లబెడుతున్నారట. కొందరు ఒకటికి మించి ఉద్యోగాలు చేస్తున్నట్టు బయటపడింది. బెంచ్ మీద ఉన్నవారిని క్లయింట్లు స్వయంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తుండడం కొసమెరుపు. ఈ ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తేనే వేతనం. లేదంటే ఇంటిదారి పట్టాల్సిందే. నియామకాలు చేపట్టవద్దని.. మూడు నెలల నుంచే జల్లెడ పట్టే కార్యక్రమాన్ని కంపెనీలు ప్రాధాన్యతగా చేపట్టాయి. తప్పుడు అనుభవం, వేతన ధ్రువపత్రాలతో వందలాది మంది చేరినట్టు తేలిందని పరిశ్రమ వర్గాల సమాచారం. విధుల్లో మరొకరి సాయం తీసుకున్నట్టు కొందరిని గుర్తించారు. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చేంత వరకు ఫ్రెషర్ల నియామకాలు చేపట్టవద్దని కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్లు ఇచ్చినప్పటికీ చేరిక తేదీని ఐటీ సంస్థలు వాయిదా వేస్తున్నాయని స్మార్ట్‌స్టెప్స్ కో–ఫౌండర్ నానాబాల లావణ్య కుమార్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఆఫర్ లెటర్లను రద్దు చేస్తే పరిశ్రమలో తప్పుడు సంకేతం వెళుతుందన్నారు. కాగా.. విప్రో, ఇన్ఫీ, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు ఫ్రెషర్లకు ఇచ్చిన ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలా బయటపడింది.. మహమ్మారి కాలంలో ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తించారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత కొన్ని కంపెనీలు హైబ్రిడ్ విధానం, మరికొన్ని పూర్తిగా కార్యాలయం నుంచి విధులను అమలులోకి తెచ్చాయి. కొందరు ఆఫీస్‌కు రాలేమని పట్టుపట్టారు. సిబ్బంది ఎందుకు ఇలా చేస్తున్నారనే అంశంపై కంపెనీలు లోతుగా పరిశీలించాయి. వీరు మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్నట్టు తేలింది. కంపెనీలు పట్టుపట్టడంతో అధికంగా జీతం ఇచ్చే సంస్థల్లో ఇటువంటివారు చేరారు. ఆఫీస్‌లో ప్రత్యక్షంగా పని చేయాల్సి రావడంతో తప్పుడు అనుభవంతో చేరినవారు సాంకేతిక పరిజ్ఞానం లేక చేతులెత్తేశారు. మోసపూరితంగా చేరినవారిని రాజీనామా చేసి వెళ్లిపోవాల్సిందిగా కంపెనీలు ఆదేశిస్తున్నాయి. చదవండి👉 డెలివరీ బాయ్‌లను చులకనగా చూస్తున్నారా! -
ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ రవి కుమార్ ఎస్ రాజీనామా
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ రవి కుమార్ ఎస్ రాజీనామా చేశారు. అయితే, ఇందుకు గల కారణాలను కంపెనీ వెల్లడించలేదు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇన్ఫోసిస్ గ్లోబల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ విభాగానికి ఆయన సారథ్యం వహించారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో న్యూక్లియర్ సైంటిస్టుగా కెరియర్ ప్రారంభించిన రవి కుమార్ 2002లో ఇన్ఫీలో చేరారు. 2016లో ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2017లో డిప్యుటీ సీవోవోగా నియమితులైన రవి .. ఆ తర్వాత సీవోవోగా పదోన్నతి పొందుతారనే అంచనాలు ఉండేవి. అయితే, అప్పటి సీవోవో యూబీ ప్రవీణ్ రావు రిటైర్మెంట్ తర్వాత ఇన్ఫీ ఆ పోస్టునే తీసివేసింది. -
మూన్‌లైటింగ్‌కు కేంద్రం సపోర్ట్, రూటు మార్చిన టెక్ కంపెనీలు
మూన్ లైటింగ్ (రెండు చోట్ల ఉద్యోగాలు చేయడం) విధానాన్ని కేంద్రం సమర్ధించడంతో దేశీయ టెక్ కంపెనీలు రూటు మార్చాయి. ఇప్పటి వరకు తమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఉద్యోగుల్నిటెక్ కంపెనీలు విధుల నుంచి తొలగించాయి. తాజాగా మూన్‌లైటింగ్ అంశంలో ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రముఖ టెక్ సంస్థ టీసీఎస్ వెల్లడించింది. ఇప్పుడు టీసీఎస్ దారిలో మరికొన్ని కంపెనీలు ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం ఉందని హెచ్ఆర్ కన్సల్టెన్సీ సర్వీస్ నిపుణులు భావిస్తున్నారు. దేశీ ఐటీ సేవల కంపెనీలు అక్టోబర్ 10 (సోమవారం) నుంచి ఈ ఏడాది 2022 -23 క్యూ2 (రెండో త్రైమాసిక) ఫలితాల్ని విడుదల చేస్తున్నాయి. తొలుత టీసీఎస్ క్యూ2 ఫలితాల చేయగా.. తర్వాత విప్రో,హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్ సైతం క్యూ2 పనితీరు వెల్లడించనున్నాయి. ఈ నేపథ్యంలో క్యూ2 ఫలితాల అనంతరం టీసీఎస్ చీఫ్ హెచ్‌ఆర్‌వో మిలింద్ లక్కడ్ మూన్‌లైటింగ్ అంశంపై స్పందించారు. 6.16 లక్షల మందికి పైగా ఉద్యోగులున్న తమ సంస్థ (టీసీఎస్) ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై తుది అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు అన్నీ కోణాల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. మూన్‌లైటింగ్ అనేది నైతికతకు సంబంధించిన అంశం. ఇది తమ సంస్థ విలువలు, సంస్కృతికి విరుద్ధమే. అయినప్పటికీ మరో టెక్ సంస్థ విప్రో మూన్ లైటింగ్ పాల్పడుతున్న 300 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసిందని, కానీ మేం మాత్రం ఇప్పటి వరకూ ఉద్యోగులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని పేర్కొన్నారు. అంతేకాదు టీసీఎస్ తన ఉద్యోగుల పట్ల దీర్ఘకాలిక నిబద్ధతను కలిగి ఉందని, ఉద్యోగులకు కంపెనీ పట్ల పరస్పర నిబద్ధత ఉందని, ప్రస్తుతం ఐటీ పరిశ్రమలో ఇతర సంస్థలు వారి ఉద్యోగుల విషయంలో భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉండవచ్చని ఆయన అంగీకరించారు. మూన్‌లైటింగ్‌పై కంపెనీ తన వైఖరిని వెల్లడిస్తుందని టీసీఎస్ చీఫ్ హెచ్‌ఆర్‌వో మిలింద్ లక్కడ్ తెలిపారు. మరోవైపు, జాబ్ ఆఫర్లు అన్నింటినీ గౌరవిస్తున్నామని, ప్రథమార్ధంలో ఇప్పటికే 35,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకున్నామని చెప్పారు. మరో 12,000 మందిని తీసుకోబోతున్నామని.. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 40,000 పైచిలుకు ఫ్రెషర్స్ నియామక లక్ష్యాన్ని అధిగమించబోతున్నామని లక్కడ్ తెలిపారు. కేంద్రం సపోర్టు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్ 21న వర్క్ ఫ్రం హోం పేరిట ఒకేసారి రెండు ఉద్యోగాలు చేస్తున్న 300 మంది ఉద్యోగుల్ని విప్రో ఫైర్ చేసింది. మూన్ లైటింగ్ విధానం అనైతికమని..నిబంధనలు అతిక్రమిస్తే వేటు తప్పదని ఇన్ఫోసిస్ విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ హెచ్చరించారు. విప్రో నిర్ణయం తర్వాత సెప్టెంబర్ 24న పబ్లిక్ అఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. ఉద్యోగుల మూన్‌లైటింగ్‌ను సమర్ధించారు. టెక్ దిగ్గజ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న ఉద్యోగులు.. అదే ఉద్యోగం కోసం తమ జీవితాల్ని త్యాగం చేసే రోజులు గడిచిపోయాయని అన్నారు. అంతేకాదు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించి ఇతర స్టార్టప్‌లలో పని చేయకూడదని చెబుతున్న ఐటీ కంపెనీల ప్రయత్నాలు విఫలమవుతున్నాయని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. చదవండి👉 విప్రో మరో కీలక నిర్ణయం, ఉద్యోగుల్లో ఆందోళన! -
దేశీయ టెక్ దిగ్గజ కంపెనీల క్యూ2 ఫలితాలు..ఎలా ఉండబోతున్నాయి?
న్యూఢిల్లీ: దేశీ ఐటీ సేవల కంపెనీలు త్రైమాసికవారీగా చూస్తే స్థిర వృద్ధిని నమోదు చేయవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది(2022–23) రెండో త్రైమాసిక ఫలితాలు టీసీఎస్‌తో ప్రారంభంకానున్నాయి. 10న జులై–సెప్టెంబర్(క్యూ2) ఫలితాలు విడుదల చేయనుంది. తదుపరి విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ సైతం క్యూ2 పనితీరు వెల్లడించనున్నాయి. ప్రపంచ ఆర్థిక మాంద్య ఆందోళనల నేపథ్యంలోనూ ఆదాయ వృద్ధిలో నిలకడకు అవకాశమున్నట్లు నిపుణులు అంచనా వేశారు. అయితే రష్యా– ఉక్రెయిన్ యుద్ధ భయాలు తదితర రిస్కుల కారణంగా భవిష్యత్ ఆర్జనలపట్ల యాజమాన్య అంచనాల(గైడెన్స్)కు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని తెలియజేశారు. డీల్ పైప్‌లైన్, డిమాండ్ ఔట్లుక్ తదితరాలపై అత్యున్నత అధికారుల అభిప్రాయాలు కీలకంగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. రానున్న త్రైమాసికాలలో పలు దిగ్గజాల పనితీరుపై యూఎస్, యూరప్‌లో కనిపిస్తున్న ఆర్థిక సవాళ్లు, ఆర్థిక మాంద్య భయాలు ప్రతికూల ప్రభావం చూపవచ్చునని అభిప్రాయపడ్డారు. మరోవైపు యూఎస్‌లో టెక్నాలజీసహా పలు రంగాల కంపెనీలు ఈ ఏడాది(2022) వేలాది ఉద్యోగులను తొలగించడం ప్రస్తావించదగ్గ అంశమని వివరించారు. అయితే మరికొంతమంది నిపుణులు మందగమన ప్రభావం దేశీ సాఫ్ట్వేర్ సేవలకు డిమాండును పెంచవచ్చని భావిస్తున్నారు. వ్యయ నియంత్రణల్లో భాగంగా ఔట్సోర్సింగ్ కాంట్రాక్టులకు వీలున్నదని అంచనా వేస్తున్నారు. స్వీట్స్పాట్ : సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్ పాయ్ దేశీ ఐటీ రంగాన్ని స్వీట్స్పాట్తో పోల్చారు. గత త్రైమాసికంతో పోలిస్తే డిమాండు స్వల్పంగా క్షీణించినప్పటికీ ప్రపంచ అనిశ్చితులు ఇందుకు కారణమని పేర్కొన్నారు. అయితే అంతర్గతంగా పరిశ్రమ అత్యంత పటిష్టంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. యూఎస్ కంపెనీలు వ్యయ నియంత్రణగా ఉద్యోగ కోతలు అమలు చేస్తున్నప్పటికీ, ఇదే మరింత ఔట్‌సోర్సింగ్‌కు వీలు కల్పిస్తుందని అంచనా వేశారు. -
టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ బంపరాఫర్
ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ సంస్థ శుభవార్త చెప్పింది. హెచ్‌సీఎల్ టెక్ 18,000 మంది టెక్, కన్సల్టింగ్ నిపుణులకు గూగుల్ క్లౌడ్ సాంకేతికతపై శిక్షణ ఇవ్వనుంది. గూగుల్ క్లౌడ్ భాగస్వామిగా ఉన్న హెచ్‌సీఎల్ టెక్ ఎంటర్ప్రైస్ క్లౌడ్‌ను విస్తృతం చేసేందుకు 2019లో గూగుల్ క్లౌడ్ ఎకోసిస్టమ్ యూనిట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. -
మూన్ లైటింగ్ దుమారం: విప్రో మరో కీలక నిర్ణయం, ఉద్యోగుల్లో ఆందోళన!
ఒకే సమయంలో రెండేసి ఉద్యోగాలు చేస్తున్న 300 మందిని తొలగించిన విప్రో.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 10 నుంచి సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో ఏదైనా మూడు రోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనంటూ ఉద్యోగులకు మెయిల్ పెట్టింది. అయితే విప్రో తీసుకున్న ఈ నిర్ణయంపై ఐటీ రంగ ఉద్యోగుల సంఘం (నైట్స్) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విప్రో ఉద్యోగులకు పంపిన ఇ - మెయిల్స్‌లో..‘హైబ్రిడ్ పని విధానాన్ని కొనసాగిస్తూ ఉద్యోగులు మధ్య స్నేహ పూర్వకమైన వాతావరణాన్ని కల్పించే ఈ ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది’ అంతేకాదు ‘మా రిటర్న్ టు ఆఫీస్ పాలసీలో సౌకర్యవంతమైన, హైబ్రిడ్ విధానాన్ని విప్రో అవలంభిస్తోంది. అక్టోబర్ 10 నుండి లీడర్షిప్ రోల్స్‌లో ఉన్న ఉద్యోగులు వారానికి మూడుసార్లు తిరిగి కార్యాలయాలకు రావాలి. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో ఆఫీసులు ఉద్యోగులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. చదవండి👉 ఐటీ సంస్థల్లో జీతాలు ఎక్కువగా ఉంటాయా? అది ఎంత వరకు నిజం! ఈ నేపథ్యంలో ఆఫీసుకు రావాలంటూ ఉద్యోగులకు విప్రో పెట్టిన మెయిల్‌పై ఐటీ రంగ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సలూజ స్పందించారు. దేశీయ టెక్ సంస్థ ఉద్యోగులకు అకస్మాత్తుగా ఈ-మెయిల్ పంపింది. ‘కంపెనీ నెల క్రితమే మెయిల్ పంపి ఉండాల్సింది. ఉద్యోగులకు కావాల్సిన ప్రాంతాలకు చేరుకునే వెసులుబాటు ఉండేది. అలాగే, ఉద్యోగుల అనుమతి, వారి అభిప్రాయాలను కంపెనీ పరిగణనలోకి తీసుకోవాల్సిందని’ అన్నారు. కొద్ది రోజుల క్రితం టీసీఎస్ గత సెప్టెంబర్‌లో మరో ఐటీ రంగ సంస్థ టీసీఎస్ ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాలని చెప్పింది. రిటర్న్ టూ ఆఫీస్ పాలసీలో భాగంగా టీం లీడర్లు హెచ్ ఆర్ టీం విభాగంతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 300 మందిపై వేటు ఐటీ కంపెనీల్లో మూన్‌లైటింగ్ వివాదం దుమారం రేపుతోంది. ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేస్తున్న ఐటీ ఉద్యోగులకు కంపెనీలు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. మార్కెట్లో తమ కాంపిటీటర్లతో కలిసి వర్క్ చేయడంపై విప్రో 300 మంది ఉద్యోగులపై వేటు వేసింది. విప్రోలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రత్యర్ధి కంపెనీల్లో సైతం పనిచేస్తుండడాన్ని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ తరుణంలో విప్రో వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలికి ఉద్యోగుల్ని ఆఫీసుకు రావాలని పిలుపునివ్వడంతో రెండేసి ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. చదవండి👉 పదోతరగతి కుర్రాడికి అమెరికా నుండి పిలుపు -
‘సాఫ్ట్వేర్ ఉద్యోగమా..వద్దు బాబోయ్’, కంపెనీలకు షాకిస్తున్న ఐటీ ఉద్యోగులు!
ఐటీ - బీపీఎం ఇండస్ట్రీలో అట్రిషన్ రేటు రోజురోజుకి భారీ స్థాయిలో పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. 2025 నాటికి 22 లక్షల మంది ప్రొఫెషనల్స్ ఐటీ రంగానికి స్వస్తి చెప్పనున్నట్లు ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. ఐటీ ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో కంపెనీకి మారడం సాధారణమే. అయితే కోవిడ్ పరిణామాల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు డిమాండ్ పెరగడంతో ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి అడుగు పెట్టే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. వారిని నిలుపుకునేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నా, వేరే సంస్థలు ఇస్తున్న ఆఫర్లు నచ్చడంతో ఉద్యోగులు వెళ్లిపోతున్నారు. దీంతో కంపెనీలకు జీతభత్యాల పెరిగిపోవటం, ఇప్పటికే ఖాళీగా ఉన్న స్థానాల్ని భర్తి చేసేందుకు భారీ ఎత్తున శాలరీలు అందించడం తలనొప్పిగా మారింది. అయినా అట్రిషన్ రేటు ఐటీ సంస్థల్ని తీవ్రంగా వేధిస్తోంది. ఈ తరుణంలో టీమ్ లీజ్ డిజిటల్ సంస్థ రానున్న సంవత్సరాల్లో ఐటీ ప్రొఫెషనల్స్ టెక్నాలజీ రంగాన్ని వదిలేస్తున్నారంటూ ఓ షాకింగ్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం..57 శాతం మంది నిపుణులు భవిష్యత్‌లో తిరిగి ఐటీ రంగంలో తిరిగి వచ్చే ఉద్దేశం తమకు లేదనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సంప్రదాయ ఐటీ సంస్థల్ని వదిలేసే ఇతర రంగాల వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆ నివేదికలో తెలిపింది. ఐటీ ఉద్యోగానికి సెలవు దాదాపు 50 శాతం మంది ఉద్యోగులకు తమ పనికి తగిన ప్రతి ఫలం లేదనే అసంతృప్తిలో ఉన్నారని, 25 శాతం మంది కెరీర్ వృద్ధి లేకపోవడమే కారణమని అభిప్రాయపడ్డారు అట్రిషన్ రేటు 55 శాతం ఫైనాన్షియల్ ఇయర్ 2022లో ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల అట్రిషన్ రేటు 49శాతం ఉండగా, ఆర్ధిక సంవత్సరం 2023 నాటికి 55 శాతం పెరుగుతుందని టీమ్ లీజ్ విడుదల చేసిన ‘టాలెంట్ ఎక్సోడస్ రిపోర్ట్’లో హైలెట్ చేసింది. అంతేకాదు జీతం పెంపు పనితీరును మెరుగుపరుస్తుందని, ఉద్యోగ సంతృప్తిని పెంచుతుందని, 2025 నాటికి 20 లక్షల-22 లక్షల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను వదిలివేస్తారని వెల్లడించింది. చదవండి👉 ఉద్యోగులకు బంపరాఫర్.. రండి బాబు రండి మీకు భారీ ప్యాకేజీలిస్తాం! -
ఐటీ సంస్థల్లో జీతాలు ఎక్కువగా ఉంటాయా? అది ఎంత వరకు నిజం!
విద్యార్ధులకు, ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి సాఫ్ట్ వేర్ జాబ్ కొట్టడం అనేది ఓ డ్రీం. ఎందుకంటే ఆ రంగంలో భారీ ఎత్తున శాలరీలు తీసుకోవచ్చని. కానీ అది ఎంత వరకు నిజం? ఇటీవల బెంగళూర్‌కు చెందిన ‘వీక్డే’ సంస్థ దేశ వ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు ఇతర ప్రొఫెషనల్ రంగాల్లో పనిచేస్తున్న వారి శాలరీల డేటాను కలెక్ట్ చేసింది. ఆ డేటా ప్రకారం..సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఎంత జీతం తీసుకుంటున్నారో..అదే స్థాయిలో ఇతర ప్రొఫెషనల్ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు సైతం కళ్లు చెదిరేలా శాలరీలు తీకుంటున్నారనే ఆసక్తికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. 50వేల మంది ఉద్యోగుల నుంచి బెంగళూరులో ఐటీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న అమిత్ సింగ్ ఐటీ ఉద్యోగ నియామకాల సంస్థ ‘వీక్ డే’ను స్థాపించారు. ఆ సంస్థ కోసం దేశ వ్యాప్తంగా 50 వేల మంది ఐటీ నిపుణుల వద్ద నుంచి సేకరించిన డేటానే అమిత్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దేశంలో దిగ్గజ ఐటీ కంపెనీలు విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్‌తో పాటు ఇతర సంస్థల్లో పనిచేసే ఐటీ ఉద్యోగుల శాలరీ కంటే..షేర్ చాట్, క్రెడ్, మీషో, స్విగ్గీతో పాటు ఇతర స్టార్టప్‌లలో పనిచేసే ఐటీ ఉద్యోగులు జీతాలు భారీగా ఉన్నట్లు తేలింది. ఎవరికెంత! వీక్డే సర్వే ప్రకారం..4 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ( మిడ్ లెవల్) సాఫ్ట్వేర్ ఉద్యోగికి సోషల్ మీడియా సంస్థ షేర్ చాట్ అత్యధికంగా ఏడాదికి రూ.47 లక్షలు చెల్లిస్తుండగా..ఫిన్ టెక్ కంపెనీ క్రెడ్, ఈ కామర్స్ కంపెనీ మీషో రూ.40 లక్షల నుంచి రూ.39 లక్షల ప్యాకేజీ అందిస్తున్నాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్‌లో ఇదే నాలుగేళ్ల అనుభవం ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీతం రూ.10 లక్షలుగా ఉంది.ఈ టెక్ సంస్థల్లో ఏడాదికి బేసిక్ శాలరీ రూ.7 లక్షలు. ఈ శాలరీ స్టార్టప్‌లు చెల్లించే వేతనం కంటే చాలా తక్కువగా ఉంది. రికార్డులను తిరిగి రాస్తున్నాయ్ ఏదైనా స్టార్టప్ మంచి పనితీరును కనబరిచి పెట్టుబడులు సాధిస్తూ దాని మార్కెట్ వాల్యుయేషన్ వన్ బిలియన్ డాలర్లకు చేరుకుంటే దాన్ని యూనికార్న్‌గా వ్యవహరిస్తారు. ఒకప్పుడు ఈ యూనికార్న్‌లు అమెరికా, యూరప్, చైనా, జపాన్ దేశాల్లోనే ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దేశీయ కంపెనీలు వ్యాపారంలో రయ్ రయ్ మంటూ దూసుకుపోతున్నాయి. బైజూస్, ఫ్రెష్ వర్క్స్, క్విక్కర్, షాప్ క్లస్ వంటి యూని కార్న్ సంస్థలు ఉద్యోగులకు చెల్లించే జీతాల విషయంలో రికార్డులను తిరగ రాస్తున్నాయి. జొమాటాలో జీతం 50వేల మంది ఐటీ ఉద్యోగుల డేటాలో.. 4 ఏళ్ల అనుభవం ఉన్న షాప్ క్లస్ ఐటీ ఉద్యోగికి ఏడాదికి రూ.12 లక్షలు, జొమాటోలో రూ.32 లక్షలు, పేటీఎంలో రూ.22 లక్షలు, ఫ్లిప్ కార్ట్‌లో రూ.36 లక్షలు చెల్లిస్తున్నాయి. ఐటీ కంపెనీస్ వర్సెస్ యూనికార్న్ కంపెనీలు జీతాల సంగతి పక్కన పెడితే యూనికార్న్ కంపెనీలతో పోలిస్తే ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు ఎక్కువ కాలం పని చేస్తున్నారు. పైన పేర్కొన్న స్టార్టప్‌లలో ఉద్యోగి సగటున 1.5 నుండి 2 సంవత్సరాల వరకు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ వంటి కంపెనీల్లో పనిచేసే ఇంజనీర్లు సగటున 2.4 సంవత్సరాలు, బైజూస్ కంపెనీలో పని చేసే ఇంజనీర్లు సగటున 1.4 సంవత్సరాలు, క్రెడ్లో పనిచేసే ఇంజనీర్లు సగటున 1.8 సంవత్సరాలు ఉంటున్నట్లు వీక్ డే రిపోర్ట్‌లో తేలింది. ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒకే సంస్థలో ఏళ్లకు ఏళ్లు పనిచేయడానికి కారణం.. సంవత్సరానికి సగటున 10 శాతం శాలరీ పెంపుదల ఉంటుందనే భావన ఎక్కువగా ఉందని వీక్ డే జరిపిన అనాలసిస్‌లో ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగుల రిజైన్కి కారణం ఇతర ఉద్యోగాలతో పోల్చి చూస్తే ఐటీ సెక్టార్లో ఉద్యోగులు ఒక సంస్థను వదిలి మరో సంస్థకు వెళ్లుతున్నారు. అందుకు కారణం.. సంస్థ మారిన ప్రతి సారి 50 నుంచి 70శాతం శాలరీ ఎక్కువగా పొందుతున్నారు. అందుకే భారత్‌లో ఐటీ ఉద్యోగులు తరుచు జాబ్ మారేందుకు దోహదపడుతుంది. -
హెచ్‌సీఎల్ ఉద్యోగులకు భారీ షాక్!
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. హెచ్‌సీఎల్ సంస్థ మైక్రోసాఫ్ట్ న్యూస్ విభాగానికి చెందిన ప్రొడక్ట్‌పై వర్క్ చేస్తోంది. ఈ తరుణంలో ఆ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్న 300 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్‌లపై వర్క్ చేస్తున్నాం. భవిష్యత్‌లో ఎలాంటి ప్రాజెక్ట్‌లపై వర్క్ చేయబోతున్నామనే అంశాలపై చర్చించేందుకు హెచ్‌సీఎల్ ఉద్యోగులతో టౌన్ హాల్ మీటింగ్ నిర్వహించింది. ఆ సమావేశంలో ఉద్యోగుల తొలగింపులపై ప్రకటన చేసినట్లు సమాచారం. ఇక హెచ్‌సీఎల్ తొలగించిన ఉద్యోగులు భారత్, గ్వాటెమాల, ఫిలిప్పీన్స్ తో పాటు ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఉద్యోగులకు కంపెనీలో చివరి రోజైన సెప్టెంబర్ 30 నాటికి ప్రతి ఉద్యోగికి వేతనాన్ని అందించనున్నట్లు హెచ్‌సీఎల్ తెలిపిందని ఆ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో తొలగించిన ఉద్యోగులు మాట్లాడుతూ..మా సంస్థకు..మైక్రోసాఫ్ట్‌కు క్వాలిటీ ఆఫ్ వర్క్ విషయంలో విభేదాలు తలెత్తాయి. మేం భారత్,యూరప్,యూఎస్ వంటి దేశాల నుండి మైక్రోసాఫ్ట్ న్యూస్ ప్లాట్‌ఫారమ్ ఎంఎస్ఎన్ కోసం కంటెంట్‌ను పర్యవేక్షించడం, క్యూరేట్ చేయడం, సవరించడంలాంటి వర్క్స్ చేస్తుంటాం.అయితే ఇటీవల మైక్రోసాఫ్ట్ గ్లోబల్ న్యూస్ మానిటరింగ్ కోసం మైక్రోసాఫ్ట్ ఆటోమెషిన్‌ను వినియోగించడం ప్రారంభించింది. మేం వర్క్ చేయడానికి ముందు జర్మనీకి చెందిన హుబెర్ట్ బుర్దా మీడియా ఈ సైట్‌ను నిర్వహించేది. బింగ్‌లో ట్రెండింగ్, జియోపొలిటికల్ న్యూస్ క్యూరేషన్, కామెంట్ మోడరేషన్, టాబ్లాయిడ్ హిట్ యాప్‌లను పర్యవేక్షించేది' అని చెప్పారు. హెచ్‌సీఎల్‌కు గుడ్‌బై మైక్రోసాఫ్ట్- హెచ్‌సీఎల్ మధ్య కాంట్రాక్ట్ ముగిసిందని,ఆ కారణం చేతనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. మైక్రోసాఫ్ట్ ఈ కాంట్రాక్ట్‌ను వేరే సంస్థకు అప్పగించాలని భావిస్తున్నట్లు..హెచ్సీఎల్ను కాదనుకొని యాక్సెంచర్‌కు తన ప్రాజెక్ట్ కట్టబెట్టాలని మైక్రోసాఫ్ట్ మంతనాలు నిర్వహిస్తుంది. ఇతర టెక్ కంపెనీల బాటలో హెచ్‌సీఎల్ సైతం ఇతర టెక్ కంపెనీల బాటలో చేరింది.ఇటీవల యాపిల్,మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఇతర టెక్ కంపెనీలు ఆర్థిక సంక్షోభం కారణంగా ఉద్యోగుల్ని, పలు విభాగాల్ని పూర్తి స్థాయిలో తొలగించింది. అదే సమయంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులు 100 శాతం వర్క్ ప్రొడక్టవిటీపై దృష్టిసారించాలని కోరడం చర్చాంశనీయంగా మారింది. -
దేశంలో జోరుగా డేటా సెంటర్ల వ్యాపార విస్తరణ!
న్యూఢిల్లీ: డేటా సెంటర్ల వ్యాపార విస్తరణ దేశంలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే 138 డేటా కేంద్రాలతో ఈ పరిశ్రమ 5.6 బిలియన్ డాలర్ల (రూ.44,800 కోట్లు) స్థాయికి చేరుకుంది. 2025 నాటికి కొత్తగా 45 డేటా సెంటర్లు ఏర్పాటవుతాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ పేర్కొంది. బిన్స్వేంజర్తో కలసి ఈ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. ‘‘ప్రస్తుతం ఉన్న 138 డేటా కేంద్రాలు 11 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో 737 మెగావాట్ల ఐటీ సామర్థ్యంతో ఉన్నాయి. ఇందులో 57 శాతం సామర్థ్యం ముంబై, చెన్నైలోనే ఏర్పాటై ఉంది. మరో 13 మిలియన్ చదరపు అడుగుల పరిధిలో 1,015 మెగావాట్ల ఐటీ సామర్థ్యంతో 45 డేటా కేంద్రాలు వచ్చే మూడేళ్లలో ఏర్పాటు కానున్నాయి. ఇందులోనూ 69 శాతం సామర్థ్యం చెన్నై, ముంబైలోనే ఏర్పాటు కానుంది. కొత్తవి కూడా కార్యకలాపాలు ప్రారంభించిన అనంతరం దేశవ్యాప్తంగా 183 డేటా సెంటర్లు, 24 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో, 1,752 మెగావాట్ల ఐటీ సామర్థ్యంతో ఉంటాయి. భారత్‌లో డేటా సెంటర్ల వ్యాపారం పరిణామ క్రమంలో ఉందని నివేదిక పేర్కొంది. టెక్నాలజీ, డిజిటైజేషన్ డిమాండ్ ‘‘టెక్నాలజీ ఆమోదం, డిజిటైజేషన్ అన్నది అన్ని రంగాల్లోనూ వేగంగా కొనసాగుతోంది. భారత్ కూడా ఒక దశాబ్దం పాటు దీని ఒరవడిని చూస్తుంది. దేశవ్యాప్తంగా డేటా సెంటర్ల డిమాండ్ 2025 నాటికి 2,100 మెగావాట్లకు చేరుతుంది’’అని అనరాక్ క్యాపిటల్ ప్రెసిడెంట్ దేవిశంకర్ తెలిపారు. భవిష్యత్తులో 2,688 మెగావాట్ల మేర ప్రణాళికలేని అదనపు సరఫరా భారత మార్కెట్లోకి వస్తుందన్నారు. భిన్న రంగాల్లోని డేటా సంబంధిత సదుపాయాల నిర్వహణలో అనుభవం కలిగిన నిపుణులు ఈ నివేదిక రూపొందించినట్టు పేర్కొంది. -
ఐటీ కంపెనీల్లో వలసలకు ఇలాంటి వాళ్లే కారణం, సీఈవోపై నెటిజన్ల ఆగ్రహం!
కొద్ది రోజుల క్రితం ముంచుకొస్తున్న ద్రవ్యోల్బణం కారణంగా ఖర్చుల్ని తగ్గించేందుకు ఓ సీఈవో తన సంస్థ ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించారు. పైగా ఉద్యోగుల్ని తొలగించడంపై మొసలి కన్నీరూ కారుస్తూ (నెటిజన్ల కామెంట్) ఉద్యోగుల క్షేమం కోరి తాను ఈ పోస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యారు. తాజాగా మరో సీఈవో ఉద్యోగులు రోజుకు 18 గంటలు పనిచేయాలంటూ లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడం చర్చాంశనీయంగా మారింది బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు శాంతను దేశ్‌పాండే అప్పుడే చదుపు పూర్తి చేసుకొని ఉద్యోగంలోకి అడుగుపెట్టిన యువకులు ఆఫీస్ వర్క్‌ను - లైఫ్‌ను బ్యాలెన్స్ చేయాలనే కోరికతో కాకుండా రోజుకు 17-18 గంటలు పని చేయాలని సూచించారు. రోజుకు 18గంటలు లింక్డ్ ఇన్ పోస్ట్‌లో.. ఉద్యోగులు 22 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు..వారు కనీసం 4 నుంచి 5 ఏళ్ల పాటు ప్రతి రోజు 18గంటల పనులు చేయాలి. "బాగా తినండి, ఫిట్‌గా ఉండండి, కానీ 4 - 5ఏళ్ల పాటు రోజుకు 18గంటలు పని చేసేలా టార్గెట్ పెట్టుకోండని హితబోధ చేశారు. యువకులు ఇంటర్నెట్తో కాలం గడిపేస్తున్నారు. పని-జీవితంలో సమతుల్యత, కుటుంబంతో సమయం గడపడం ముఖ్యమని తమను తాము సమర్ధించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రాష్ అండ్ బర్న్ ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు దేశ్ పాండేపై మండిపడ్డారు. కార్పొరేట్ ప్రపంచంలో అధిక అట్రిషన్ రేట్ (ఉద్యోగ వలసల)కు అతనిలాంటి వారే కారణమని కామెంట్ చేశారు. దేశ్‌పాండే, అతని వ్యాపారం "క్రాష్ అండ్ బర్న్"కి అర్హులని మరో నెటిజన్ తన కామెంట్లో పేర్కొన్నారు. "ఎందుకు 18గంటలు మాత్రమే పనిచేయాలి. 24 లేదా 48 గంటలు ఎందుకు పనిచేయకూడదని ఎద్దేశా చేశారు. ఇలా నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో రోజుకి 18 గంటలు పనిచేయడం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. -
ఐటీతో పాటు ఈ రంగంలో దూసుకెళ్తున్న భారత్!
బెంగళూరు: దేశీ ఐటీ రంగం వృద్ధి బాటలో దూసుకెడుతున్న నేపథ్యంలో భారత్ రాబోయే కొన్నేళ్లలో సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్‌లకు (సాస్) హబ్‌గా ఎదగనుంది. ఇందుకు భారీ కంపెనీలతో పాటు చిన్న, మధ్యతరహా సంస్థలు ఊతంగా నిలవనున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ ఈవై, పరిశ్రమల సమాఖ్య సీఐఐ రూపొందించిన ’ఇండియా: తదుపరి అంతర్జాతీయ సాస్ రాజధాని’ అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 50 పైచిలుకు సాస్ ప్రమోటర్లు, ఇన్వెస్టర్లతో ఇంటర్వ్యూల ఆధారంగా దీన్ని రూపొందించారు. ఇప్పటికే దేశీయంగా వివిధ విభాగాల్లో 100కు పైగా యూనికార్న్‌లు (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ గల స్టార్టప్‌లు) ఉన్నాయని నివేదిక పేర్కొంది. సాస్ స్టార్టప్‌లకు హబ్‌గా భారత్ అత్యంత వేగంగా ఎదుగుతోందని నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రతిభావంతులు అందుబాటులో ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని 80 శాతం మంది సాస్ ప్రమోటర్లు అభిప్రాయపడ్డారు. కస్టమర్లను పెంచుకునేందుకు సాస్ ప్రోడక్టులపై మరింతగా అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని 50 శాతం మంది తెలిపారు. సాస్ సేవలు అందించే సంస్థలు కొత్త క్లయింట్లను దక్కించుకోవడంపైన, వివిధ ఉత్పత్తులు విక్రయించడం ద్వారా ప్రస్తుత కస్టమర్లు జారిపోకుండా అట్టే పెట్టుకోవడంపైనా మరింతగా దృష్టి పెడుతున్నాయి. మార్కెట్ వ్యూహం విషయంలో పేరొందిన క్లయింట్లను దక్కించుకునేందుకు ప్రత్యేక విభాగాలను లక్ష్యంగా పెట్టుకుంటున్నాయి. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు .. ► ఈ ఏడాది తొలి రెండు త్రైమాసికాల్లో సాస్ స్టార్టప్‌లలోకి వచ్చిన నిధులు .. గతేడాది మొత్తం మీద వచ్చిన నిధుల పరిమాణాన్ని దాటేశాయి. ►దేశీయంగా వినియోగదారుల ఆధారిత సా స్ సొల్యూషన్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. ► 2025 నాటికి భారత్‌లో సాస్ మార్కెట్ అనేక రెట్లు పెరగనుంది. ప్రస్తుతం అంతర్జాతీయ సాస్ మార్కెట్లో భారత్ వాటా 2 నుంచి 4 శాతంగా ఉండగా.. ఇది ఏడు నుంచి 10% వరకూ పెరగనుంది. ► దేశీయంగా 2018లో ఒకే ఒక సాస్ యూనికార్న్ ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 18కి చేరింది. అమెరికా, చైనాల తర్వాత అతి పెద్ద సాస్ వ్యవస్థగా భారత్ మూడో స్థానంలో ఉంది. ►2019తో పోలిస్తే 2021లో దేశీయంగా సాస్ కంపెనీల సంఖ్య రెట్టింపయ్యింది. పెట్టుబడులు 2.6 బిలియన్ డాలర్ల నుంచి ఆరు బిలియన్ డాలర్లకు ఎగిశాయి. -
ఉద్యోగులకు టీసీఎస్ షాక్!
ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ కారణంగా సుధీర్ఘకాలంగా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలని మెయిల్స్ పెట్టింది. ఈ ఏడాది నవంబర్ 15 నుంచి ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు తిరిగి కార్యాలయాల నుంచి విధులు నిర్వహించాలని సూచించింది. కోవిడ్-19 ప్రారంభం నుంచి రిమోట్ వర్క్ చేసుకునేలా ఉద్యోగులకు అనుమతిచ్చింది. ఈ తరుణంలో కోవిడ్ తగ్గుముఖం పట్టి యధావిధిగా కార్యకాలపాలు కొనసాగుతుండడంతో.. వర్క్ ఫ్రం హోమ్‌కు గుడ్ బై చెప్పాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలని స్పష్టం చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వర్క్ ఫ్రం హోం చేస్తున్న ప్రతి ఉద్యోగి తప్పని సరిగా ఆఫీస్‌కు రావాలని చెప్పింది. అదే సమయంలో 95 శాతానికి పైగా పాక్షికంగా, 70శాతం పైగా ఉద్యోగులు పూర్తిస్థాయిలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని టీసీఎస్ సీఈవో రాజేష్ గోపినాధన్ తెలిపారు.ప్రస్తుతం 20 నుంచి 25శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్‌కు స్వస్తి చెప్పి ఆఫీస్‌కు వస్తున్నారు. రిటర్న్ టూ ఆఫీస్ మోడల్‌ను అమలు చేస్తున్నాం. తద్వారా 25/25 ప్లాన్‌ను మరింత నియంత్రిత పద్ధతిలో అమలు చేయాలి' అని తెలిపారు. కాగా, ఇంటి వద్ద నుంచి వర్క్ చేస్తున్న ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చేలా ప్రోత్సహించేందుకు టీసీఎస్ వేరియబుల్ పే విధానాన్ని వినియోగించుకుంటుంది. మిగిలిన టెక్ కంపెనీలతో సంబంధం లేకుండా ఉద్యోగులకు చెల్లించే వేరియబుల్స్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని తాజాగా స్పష్టం చేసింది. చదవండి👉 వర్క్ ఫ్రమ్ హోమ్ !! రండి.. రండి.. దయచేయండి.. ఉద్యోగులకు టెక్ కంపెనీల పిలుపు!! -
ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్!
ఐటీ ఉద్యోగులు బ్యాడ్ న్యూస్. ఐటీ ఉద్యోగులంటే వారి జీత భత్యాలు, ఆ తర్వాతే వారి కార్యకలాపాలు గుర్తుకు వస్తాయి. ఇప్పుడా ఆ విషయంలో ఐటీ సంస్థలు ఆచుతూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కంపెనీలు ఉద్యోగులకు భారీ ఎత్తున పెంచే ఇంక్రిమెంట్స్ వచ్చే ఏడాది తగ్గించనున్నట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారికి కారణంగా అన్నీ రంగాలు కుప్పకూలితే ఒక్క ఐటీ రంగం భారీ లాభాల్ని గడించాయి. రానున్న రోజుల్లో ఆ రంగం వృద్ధి బాగుంటుందని సంబరపడే లోపే ఆర్ధిక మాంద్యం, ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం, ది గ్రేట్ రిజిగ్నేషన్, రిటెన్షన్ వంశాలు ఆయా దిగ్గజ సంస్థల్ని కలవరానికి గురి చేస్తున్నాయి. ఈ తరుణంలో వచ్చే ఏడాది ఐటీ ఉద్యోగులు ఇంక్రిమెంట్లు 12శాతం నుంచి 9శాతానికి తగ్గి ప్రీ కోవిడ్ లెవల్స్ చేరుకుంటాయంటూ ప్రముఖ స్టాఫింగ్ సర్వీసెస్ అండ్ హెచ్ఆర్ రిక్రూట్మెంట్ సీఈవో సునీల్ చెమ్మన్ కోటిల్ తెలిపారు. గత కొన్ని నెలలుగా టెక్ సంస్థలు ఐటీ ఉద్యోగులకు 70శాతం నుంచి 80శాతం ఇంక్రిమెంట్స్ ఇచ్చాయి. కానీ వచ్చే ఏడాది ఈ పరిస్థితి మారనుంది. ఐటీ సర్వీస్‌లు అందించేందుకు స్టార్టప్స్ నుంచి దిగ్గజ కంపెనీలకు వరకు ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటితో పాటు రిటెన్షన్ సమయంలో ఉద్యోగులకు చెల్లించే వేతనాల్ని తగ్గించి..వారిని పూర్తి స్థాయిలో వినియోగించుకోనున్నాయి. ముఖ్యంగా యూఎస్, అమెరికా, యూరప్ దేశాల టెక్ సంస్థలు ప్రయత్నాల్లో ఉన్నాయి. వాటి ప్రభావం దేశీయ కంపెనీలు, ఉద్యోగులపై పండనుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు చదవండి👉 ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం,వరస్ట్ ఇయర్‌గా 2022 -
ఇంకోసారి, ఉద్యోగుల తొలగింపుపై బాంబు పేల్చిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగి!
ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో సారి వందల మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జులై నెలలో పునర్వ్యవస్ధీకరణ పేరుతో 1800 మంది ఉద్యోగులను తొలగించగా..తాజా లే ఆఫ్స్ ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఓ సీనియర్ డిజైనర్ ఉద్యోగుల తొలగింపుపై లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేశారు. ఈ వారంలో ముఖ్యంగా మోడ్రన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ టీం (ఎంఎల్‌ఎక్స్) ఉద్యోగుల్ని ఫైర్ చేయనుందని ఓ బాంబు పేల్చారు. సీనియర్ డిజైనర్‌తో పాటు మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం ప్రతినిధులు ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎంఎల్‌ఎక్స్ టీం తో పాటు ప్రపంచంలోని మైక్రోసాఫ్ట్ కు చెందిన లోకేషన్లలో విధులు నిర్వహించే హెచ్ ఆర్ కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ సభ్యుల్ని తొలగించే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తోంది. 2018లో 2018లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఉత్పత్తుల్ని వినియోగించుకునే కస్టమర్లు..మళ్లీ తిరిగి వాటిని ఉపయోగించేలా మోడ్రన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ టీం (ఎంఎల్‌ఎక్స్) విభాగాన్ని ఏర్పాటు చేసింది. తొలిసారి ఈ ఎంఎల్‌ఎక్స్ సభ్యులు ఎఫెక్టీవ్ వేలో హెల్దీ ఆన్ లైన్ హ్యాబిట్స్‌తో వినియోగదారులు వారి రోజూవారీ కార్యకలాపాల్ని చక్కదిద్దే లక్ష్యంతో ఎక్స్ బాక్స్ తరహా ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్స్‌ను డెవలప్ చేశారు. జూన్ 2020లో మనీ ఇన్ ఎక్స్ఎల్ అనే టెంప్లెట్‌ను మార్కెట్‌కు పరిచయం చేశారు. ఈ మనీ ఎక్స్ అనే టెంప్లెట్ సాయంతో వినియోగదారులు మైక్రోసాఫ్ట్ ఎక్స్ ఎల్ నుంచి డైరెక్ట్‌గా వారి బ్యాంక్ అకౌంట్స్, క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ అకౌంట్లలో ఎంటర్ అవ్వొచ్చు. పెట్టుబడులు సైతం పెట్టుకోవచ్చు. కాగా, ఈ మనీ ఇన్ ఎక్సెఎల్ అనే టెంప్లెట్ వచ్చే ఏడాది జూన్ 30న షట్ డౌన్ చేయనుంది. ఉద్యోగుల తొలగింపు సాధారణమే ఆర్ధిక మాంద్యంతో ఇక టిక్‌టాక్, ట్విట్టర్, నెట్‌ఫ్లిక్స్ ఇతర సంస్థలు ఉద్యోగుల్ని తొలగించాయి. ఆ సమయంలో ఉద్యోగుల తొలగించడం సాధారణమని మైక్రోసాఫ్ట్ చెప్పుకొచ్చింది. కంపెనీకి చెందిన 1.8 లక్షల మంది ఉద్యోగుల్లో కేవలం 1 శాతం లోపు ఉద్యోగులనే తొలగించామని తెలిపింది. చదవండి👉వేలమంది ఉద్యోగులపై వేటు,టెక్కీలకు గడ్డుకాలం..వరస్ట్ ఇయర్‌గా 2022 -
ఆఫీస్‌కు రావడంలేదు..వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితమైన ఐటీ ఉద్యోగులు!
కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గడంతో అత్యధికంగా టెలికం, కన్సల్టింగ్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తిరిగి కార్యాలయం నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ విషయంలో ఐటీ కంపెనీల ఉద్యోగుల్లో అత్యధికులు ఇంటి నుంచే పని చేస్తున్నారని ప్రాపర్టీ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా, కో–వర్కింగ్ ఆపరేటర్ ఆఫిస్ సంయుక్తంగా మే–జూన్‌లో చేపట్టిన సర్వేలో తేలింది. సర్వే ప్రకారం.. ఫిబ్రవరి నుంచి కోవిడ్ కేసులు క్షీణించడంతో కార్యాలయాలకు ఉద్యోగుల రాక పెరిగింది. ఫలితంగా 34 శాతం కంపెనీలకు చెందిన ఉద్యోగుల్లో 75–100 శాతం మంది ఆఫీసులకు వచ్చి (హైబ్రిడ్‌తో కలిపి) విధులు నిర్వర్తిస్తున్నారు. 25 శాతం మంది మాత్రమే కార్యాలయానికి వచ్చి పని చేస్తున్నట్టు 41 శాతం కంపెనీలు వెల్లడించాయి. టెలికం, కన్సల్టింగ్ రంగాల్లో 75–100 శాతం, ఐటీ, నూతన తరం సాంకేతిక రంగాల్లో 25 శాతం వరకు ఉద్యోగులు కార్యాలయాలకు తిరిగి వచ్చి విధులు చేపడుతున్నారు. వికేంద్రీకరణ విధానం.. హైబ్రిడ్ విధానానికి 53 శాతం కంపెనీలు సై అంటున్నాయి. కార్యాలయాల వికేంద్రీకరణ విధానాన్ని స్వీకరించనున్నట్టు 74 శాతం కంపెనీలు వెల్లడించాయి. వికేంద్రీకరణలో భాగంగా వివిధ ప్రాంతాల్లో ఫ్లెక్స్ సెంటర్లను అద్దెకు తీసుకోవాలని భావిస్తున్నట్టు 49 శాతం కంపెనీలు తెలిపాయి.పనిచేయడానికి అనువుగా ఉండే ఫ్లెక్సిబుల్ స్థలం మెట్రోయేతర నగరాల్లో 2022 డిసెంబర్ నాటికి రెండింతలకుపైగా అధికమై 55 లక్షల చదరపు అడుగులకు చేరుకుంటుందని అంచనా. వర్క్‌స్పేస్ వ్యూహం కింద 77 శాతం కంపెనీలు ఫ్లెక్స్ స్పేస్‌ను భాగంగా చేసుకుంటాయని కొలియర్స్, ఆఫిస్ వెల్లడించాయి.2022 జనవరి–జూన్‌లో 2.75 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలాన్ని వివిధ కార్యాలయాలు అద్దెకు తీసుకున్నాయి. గతేడాది జనవరి–జూన్‌లో ఇది 1.03 కోట్ల చదరపు అడుగులు మాత్రమే. ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వాటా 13 శాతంగా ఉంది. సర్వేలో సీఈవోలతోసహా.. ఐటీ, ఐటీఈఎస్, బీఎఫ్ఎస్ఐ, ఇంజనీరింగ్, తయారీ రంగాలకు చెందిన కంపెనీలు సర్వేలో పాలుపంచుకున్నాయి. గరిష్టంగా ఈ కంపెనీల్లో 10,000 వరకు సిబ్బంది ఉన్నారు. సీఈవోలు, సీవోవోల వంటి కీలక వ్యక్తుల నుంచి 150కిపైగా స్పందనల ఆధారంగా నివేదికను విడుదల చేశాయి. -
వేలమంది ఉద్యోగులపై వేటు,టెక్కీలకు గడ్డుకాలం..వరస్ట్ ఇయర్‌గా 2022
Tech companies fired over 32,000 employees : టెక్ దిగ్గజ కంపెనీ ఉద్యోగులకు భారీ షాకిచ్చాయి. ఒక్క జులై నెలలో సుమారు 32వేల మంది టెక్కీలపై వేటు వేసినట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగులకు 2022 వరస్ట్ ఇయర్‌గా నిలిచిపోనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో గట్టెంకేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఆయా టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించడం, నియామకాల్ని నిలిపివేయం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ జులై నెలలో అమెరికా సిలీకాన్ వ్యాలీలో కార్యకాలపాలు నిర్వహిస్తున్న ఆయా సంస్థలు మొత్తం 32 వేల మందిని విధుల నుంచి తొలగించాయని వెలుగులోకి వచ్చిన క్రంచ్ బేస్ నివేదిక పేర్కొంది. ఉద్యోగులపై వేటు విధించిన సంస్థల్లో నెట్‌ఫ్లిక్స్, షాఫిఫై, కాయిన్ బేస్‌తో పాటు ఇతర కంపెనీలు వందల మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసినట్లు పేర్కొంది. వారం వారం పెరిగిపోతున్నారు. మా దృష్టికి వచ్చింది. సిలికాన్ వ్యాలీలో ఉన్న టెక్ కంపెనీలు వారం వారం ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. అందుకే మాకు (క్రంచ్‌బేస్) ఏ ఉద్యోగం స్థిరంగా ఉండడం లేదని అనిపిస్తుంది. స్పష్టమైన కారణం లేకుండానే ఉద్యోగాలు కోల్పోతున్నందున చాలా మందికి 2022 మరో వరస్ట్ ఇయర్‌గా మారుతోంది. కొన్ని టెక్ కంపెనీలు ఇప్పటికే నియామక ప్రక్రియను నిలిపివేశాయి. ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొనేందుకు చాలా సంస్థలు ఉద్యోగల్ని తొలగిస్తున్నాయి. అమెరికాలో దాదాపు 64 ప్రముఖ టెక్ కంపెనీలు జూలై నెలలో 32వేల కంటే ఎక్కువ మంది విధుల నుంచి తొలగించాయని క్రంచ్ బేస్ హైలెట్ చేసింది. ►క్రంచ్‌బేస్ సేకరించిన డేటా ప్రకారం..ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ షాఫిఫై గత నెలలో వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది. వారిలో రిక్రూటింగ్, సపోర్ట్, సేల్స్ విభాగాల ఉద్యోగులున్నారు. ►ట్విట్టర్ తన టాలెంట్ అక్విజిషన్ టీమ్‌లో 30 శాతం మందిని తొలగించింది.పెరుగుతున్న వ్యాపార ఒత్తిళ్లను ఎదుర్కొంటుందని అందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. ►మైక్రోసాఫ్ట్ తన 1,80,000 మంది వర్క్‌ఫోర్స్‌లో 1 శాతాన్ని తగ్గించింది, కొన్ని నిర్మాణాత్మక సర్దుబాట్లు, వ్యాపార అవసరాలను తీర్చాలని యోచిస్తోంది. ►టిక్‌టాక్ కంపెనీ పునర్నిర్మాణం పేరుతో ఉద్యోగులను తొలగించడం ప్రారంభించిందని,100 కంటే తక్కువ మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందని వైర్డ్ నివేదిక పేర్కొంది. ►హూప్ వంటి ఇతర స్టార్టప్‌లు 15 శాతం మంది సిబ్బందిని తొలగించాయి. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ విమెమో (Vimeo) 72 మంది ఉద్యోగులను తొలగించింది. ►కేవలం రెండు నెలల్లో, నెట్‌ఫ్లిక్స్ మొత్తం 450 మంది పర్మినెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించింది. సబ్స్క్రైబర్లు తగ్గడం, అదే సమయంలో ఆదాయం తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ►కాయిన్‌బేస్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లు 1100 మంది ఉద్యోగుల్ని తొలగించాయి. కంపెనీ సీఈవో బ్రియాన్ ఆర్మ్‌స్ట్రాంగ్ మొదట ఉద్యోగుల తొలగింపుకు ఆర్ధిక పరిస్థితులేనని అన్నారు. ఆపై అవసరానికి మించి ఉద్యోగుల్ని హయ్యర్ చేసుకుందని మాట మార్చారు. -
దేశంలో అత్యధిక వేతనం పొందే ఐటీ కంపెనీ సీఈవో ఎవరో తెలుసా!
కోవిడ్ కారణంగా అన్నీ రంగాలు కుదేలయ్యాయి. కానీ ఐటీ రంగం మాత్రం అందుకు భిన్నంగా ఎన్నడూ లేని విధంగా కార్యకలాపాల్ని నిర్వహించాయి. భారీ లాభాల్ని గడించాయి. అందుకే దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులకు, సీఈవోలకు కళ్లు చెదిరేలా వేతనాల్ని అందిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మన దేశానికి చెందిన ఏ ఐటీ కంపెనీ సీఈవో అత్యధిక వేతనం పొందుతున్నారో తెలుసా? ఇంతకీ ఆయన పేరేంటీ? ఆ సంస్థ ఏంటో తెలుసుకోవాలని ఉందా? నిన్న మొన్నటి వరకు మన దేశానికి చెందిన ఐటీ కంపెనీలో అత్యధిక వేతనం పొందిన సీఈవోలో జాబితాలో ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ నిలిచారు. ఆయన ఏడాదికి రూ.71కోట్ల వేతనం పొందుతున్నట్లు ఈ ఏడాది మేనెలలో ఆ కంపెనీ వార్షిక ఫలితాల విడుదల సందర్భంగా తెలిపింది. తాజాగా సలీల్ పరేఖ్ కంటే అత్యధికంగా హెచ్‌సీఎల్ టెక్నాలజీ యూఎస్ ఆధారిత సీఈవో సి.విజయ్ కుమార్ రూ.123.13కోట్ల శాలరీ పొందినట్లు ఆ సంస్థ విడుదల చేసిన వార్షిక ఫలితాల నివేదిక పేర్కొంది. అయితే సీఈవో విజయ్ కుమార్ రూ.123.13కోట్లను శాలరీ రూపంలో ఇవ్వలేదని, కొంత మొత్తాన్ని లాంగ్ టర్మ్ ఇన్సెన్టీవ్స్ -(ఎల్టీఐ (స్టాక్స్) రూపంలో అందించినట్లు హెచ్‌సీఎల్ యాజమాన్యం తెలిపింది. బేసిక్ యాన్యువల్ శాలరీ ఎంతంటే? హెచ్‌సీఎల్ టెక్నాలజీ వార్షిక ఫలితాల్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా ఈ ఏడాది మార్చి 31 వరకు ఆ సంస్థ సీఈవో సి.విజయ్ కుమార్‌కు ఎంత వేతనం చెల్లిస్తుందో చెప్పే ప్రయత్నం చేసింది. తమ సంస్థ సీఈవో బేసిక్ యాన్యువల్ శాలరీ 2మిలియన్ డాలర్లు ఉండగా, సంస్థకు లాభాల్ని తెచ్చినందుకు ప్రోత్సహకాల కింద మరో 2 మిలియన్ డాలర్లు, బోనస్‌లు ఇతర అలవెన్స్‌లు 0.02 మిలియన్ డాలర్లు చెల్లించినట్లు వెల్లడించింది. మొత్తంగా ఎల్టీఐ 12.50 మిలియన్ డాలర్లను కలుపుకొని విజయ్ కుమార్ వేతనం 16.52 మిలియన్ డాలర్లుగా ఉందని చెప్పింది. 2021-2022లో సీఈవోల శాలరీ ఎంతంటే 2021-2022లో మనదేశానికి చెందిన సీఈవోలు అత్యధిక వేతనం తీసుకోవడంలో సరికొత్త రికార్డ్లను సృష్టిస్తున్నారు. 2021-2022లో ఏడాదికి ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ శాలరీ రూ.79.75కోట్లు,హెచ్‌సీఎల్ సీఈవో సి.విజయ్ కుమార్ శాలరీ రూ.123.13కోట్లు, టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ వార్షిక వేతనం రూ. 25.76 కోట్లు, విప్రో పారిస్ ఆధారిత సీఈవో వేతనం రూ. 64.34 కోట్లు. హెచ్‌సిఎల్ టెక్ సిఇఓ రూ.32.21 కోట్లు టెక్ మహీంద్రా సీఈవో రూ.22 కోట్ల వేతనం అందుకుంటున్నారు. -
ర్యాపిడో డ్రైవర్‌గా మైక్రోసాఫ్ట్ ఉద్యోగి..ప్యాసింజర్‌కు ఊహించని అనుభవం!
కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు కొత్త దనాన్ని కోరుకుంటున్నారు. నాలుగు గోడల మధ్య కాకుండా నలుగురితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే జిమ్‌లు, ట్రెక్కింగ్, క్యాంపింగ్‌లు చేస్తున్నారు. మరికొందరు తాము ఉన్నత ఉద్యోగం చేస్తున్నామనే విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు. క్యాబ్, టూవీలర్లకు డ్రైవర్లుగా మారిపోతున్నారు. బెంగళూరుకు చెందిన నిఖిల్ సేఠ్ తనకు ఎదురైన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. తాను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ర్యాపిడో బుక్ చేసుకున్నట్లు తెలిపాడు. ర్యాపిడో బైక్ ఎక్కి వెళుతుండగా..మార్గం మధ్యలో ర్యాపిడో డ్రైవర్‌తో మాట కలిపినట్లు చెప్పాడు. మాటల సందర్భంలో తాను (ర్యాపిడో డ్రైవర్) మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపాడు. అంత పెద్ద సంస్థలో ఉద్యోగం చేస్తున్నా..ర్యాపిడ్ ఎందుకు చేస్తున్నారు. అని ప్రశ్నించిన నిఖిల్ సేఠ్‌కు సదరు డ్రైవర్ నుంచి ఊహించిన సమాధానం ఎదురైంది. నేను మనుషుల్ని ప్రేమిస్తాను..వస్తువుల్ని వాడుకుంటాను సార్. నాకు మనుషులతో మాట్లాడడం అంటే మహా ఇష్టం. కానీ నేను మాట్లాడేందుకు నా చుట్టు పక్కల మనుషులు లేరు.అందుకే నేను వారితో మాట్లాడేందుకు ఇలా ర్యాపిడో డ్రైవర్‌గా అవతారం ఎత్తినట్లు చెప్పినట్లు నిఖిల్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా..ఆ ట్విట్‌పై నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. -
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ చేతికి డెన్మార్క్ సంస్థ!
న్యూఢిల్లీ: లైఫ్ సైన్సెస్ విభాగంలో పట్టున్న డెన్మార్క్ కంపెనీ బేస్(బీఏఎస్ఈ) లైఫ్ సైన్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ తాజాగా పేర్కొంది. ఇందుకు పూర్తి నగదు రూపేణా 11 కోట్ల యూరోలు(రూ. 875 కోట్లు) వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఈ కొనుగోలు ద్వారా లైఫ్ సైన్సెస్ డొమైన్లో మరింత నైపుణ్యాన్ని అందుకోనున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా యూరోప్‌లో సేవలు విస్తరించనున్నట్లు పేర్కొంది. యూరప్, నార్డిక్స్ ప్రాంతంలో డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సామర్థ్యాలు, క్లౌడ్ ఆధారిత పరిశ్రమ సొల్యూషన్స్ విస్తరణకు దోహదపడనున్నట్లు తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో డీల్ పూర్తయ్యే వీలున్నట్లు అంచనా వేస్తోంది. బేస్ లైఫ్‌కు 200 మంది అత్యుత్తమ పరిశ్రమ నిపుణులున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఇన్ఫీ షేరు 0.7% పెరిగి రూ.1,448 వద్ద క్లోజైంది. -
పెరిగిపోతున్న ఆర్ధిక నేరాలు, బ్యాంకులకు ఆర్బీఐ కీలక నిబంధనలు!
ముంబై: బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు సహా తన నియంత్రణలో ఉన్న ఇతరత్రా సంస్థలు ఆర్థిక, పరపతిపరమైన రిస్కుల్లో పడకుండా చూసేలా..ఐటీ సర్వీసుల అవుట్సోర్సింగ్కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను ప్రతిపాదించింది. వీటి ప్రకారం బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు, ఎన్బీఎఫ్సీలు మొదలైనవి బోర్డు ఆమోదిత సమగ్ర ఐటీ అవుట్సోర్సింగ్ విధానాన్ని పాటించాల్సి ఉంటుంది. ఏ కార్యకలాపాలనైనా అవుట్సోర్సింగ్కు ఇచ్చినంత మాత్రాన సదరు నియంత్రిత సంస్థ (ఆర్ఈ) తన బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి కుదరదని, అంతిమంగా ఆయా అంశాలకు సంబంధించి జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిందేనని ఆర్బీఐ స్పష్టం చేసింది. అవుట్సోర్సింగ్ సంస్థ కచ్చితంగా ఆర్ఈ ప్రమాణాలతోనే కస్టమర్లకు అందించాల్సి ఉంటుందని, అలా చేసేలా చూడాల్సిన బాధ్యత ఆర్ఈదేనని తెలిపింది. బోర్డు .. సీనియర్ మేనేజ్మెంట్ పాత్ర, క్లౌడ్ కంప్యూటింగ్ సేవల వినియోగం, సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (ఎస్వోసీ) అవుట్సోర్సింగ్ మొదలైన వాటికి సంబంధించిన నిబంధనలను ముసాయిదా ప్రతిపాదనలో ఆర్బీఐ పేర్కొంది. ఆర్ఈలు పటిష్టమైన ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. వీటిపై జూలై 22లోగా పరిశ్రమ వర్గాలు తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. -
నిరుద్యోగులకు అలర్ట్,'సాఫ్ట్వేర్' కొలువుల జాతర!
ముంబై: ఓమ్నీ చానల్, మల్టీ ప్లాట్‌ఫామ్ టెక్నాలజీ సంస్థ ఫైండ్.. 2022–23 నాటికి 2,000 మంది ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. ఇందులో 800 మంది ఇంజనీర్లు దక్షిణాది నుంచి ఉంటారని తెలిపింది. ఈ సంస్థ బెంగళూరులో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. ఇక్కడే ఎక్కువ మందిని నియమించుకోనున్నట్టు పేర్కొంది. ఈ సంస్థ రిలయన్స్ గ్రూపులో భాగం. ప్రస్తుతం 750 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఇందులో సగం మందిని గత ఆరు నెలల్లోనే నియమించుకోవడం గమనార్హం. వృద్ధిని కొనసాగించేందుకు వీలుగా ఉద్యోగులను పెంచుకోనున్నట్టు తెలిపింది. -
మరో ఐదేళ్ల పాటు, ఇన్ఫోసిస్ సీఈవోగా సలీల్ పరేఖ్!
మరో 5ఏళ్ల పాటు ఇన్ఫోసిస్ ఎండీ, సీఈవోగా సీఈఓ సలీల్ పరేఖ్ కొనసాగనున్నారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ సీఈవోగా ఉన్న ఆయన పదవి కాలాన్ని కొనసాగిస్తున్నట్లు ఇన్ఫోసిస్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ ఏడాది జులై 1నుంచి 2027 మార్చి 31వరకు ఆయన తన పదవిలో కొనసాగనున్నారు. ఇక ఎప్పటిలాగే ఇన్ఫోసిస్ ఎక్స్‌ప్యాండ్ స్టాక్ ఓనర్ షిప్ -2019 ప్లాన్ లో భాగంగా ఆయనకు ఇన్ఫోసిస్ షేర్లను కట్టబెట్టనుంది. ఇన్ఫోసిస్ ప్రకటన మే 21న ఇన్ఫోసిస్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ(ఎన్ఆర్సీ) సభ్యులు సలీల్ పరేఖ్‌ను మళ్లీ సంస్థ సీఈవోగా ఎంపిక చేయాలని నిర్ణయించారు. దీంతో పరేఖ్ ఈ ఏడాది జులై 1,2022 నుంచి మార్చి 31,2027వరకు పదవిలో ఉంటారని ఇన్ఫోసిస్ తన రెగ్యులరేటరీ ఫైలింగ్ తెలిపింది. -
ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్! బోనస్‌లు,ప్రమోషన్లు..అబ్బో ఇంకా ఎన్నెన్నో!
ప్రపంచ దేశాలకు చెందిన ఐటీ కంపెనీల్ని అట్రిషన్ రేటు విపరీతంగా వేధిస్తుంది. వచ్చిపడుతున్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయలేక..ఆఫర్లని, లేదంటే తమకు నచ్చిన రంగంలో అడుగుపెట్టేందుకు చేస్తున్న ఉద్యోగాల్ని ఉన్న ఫళంగా వదిలేస్తుంటే..ఆ ఉద్యోగుల్ని నిలుపుకోలేక ఐటీ సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ టెక్ దిగ్గజాలు అట్రిషన్ రేట్ తగ్గించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాయి. కోవిడ్-19 కారణంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఐటీ రంగానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీనికి తోడు టెక్నాలజీ పరంగా అవకాశాలు విసృతంగా పెరిగిపోయాయి. అందుకే ఉద్యోగులు తమకు వస్తున్న అవకాశాల్ని వినియోగించుకుంటున్నారు. ఇతర సంస్థల నుంచి వస్తున్న ఆఫర్లను అందుకుంటున్నారు. దీంతో ఐటీ సెక్టార్‌ను ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ప్రముఖ టెక్ దిగ్గజాలు డిజిటల్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫీయల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో అట్రిషన్ రేట్ తగ్గిస్తూ, స్కిల్స్ ఉన్న ఉద్యోగుల్ని ఎంపిక చేసే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా విప్రో, కాగ్నిజెంట్, మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, ఎంఫసిస్లాంటి సంస్థలు ఉద్యోగులకు స్పెషల్ బోనస్‌లు ప్రకటిస్తున్నాయి. కంపెనీ స్టాక్స్(ఈఎస్ఓపీఎస్) భాగస్వామ్యం ఇవ్వడం, ఉన్న జాబ్‌లో స్మార్ట్‌గా చేసేందుకు సిల్స్, లేదంటే మరో విభాగానికి చెందిన ప్రాజెక్ట్ చేసేలా ప్రత్యేకంగా క్లాసుల్ని నిర్వహించడం, ఉన్న సంస్థలో చేస్తున్న జాబ్ నచ్చక ఇబ్బంది పడుతుంటే..అదే సంస్థలో వారికి నచ్చిన విభాగంలో పనిచేసేలా ప్రోత్సహించడం, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకునేలా అనుమతి ఇవ్వడం, వర్క్ ఫ్రమ్ లేదంటే ఎక్కడి నుండైనా పనిచేసేలా ఉద్యోగులకు అవకాశాల్ని కల్పిస్తున్నాయి. తద్వారా అట్రిషన్ రేట్‌ను పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చని ఐటీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఉద్యోగులు సైతం ఈ ఆఫర్లకు అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. చదవండి👉ఈ తరహా ఉద్యోగుల కోసం వేలకోట్ల ఖర్చు, పోటీపడుతున్న ఐటీ కంపెనీలు! -
ఈ తరహా ఉద్యోగుల కోసం వేలకోట్ల ఖర్చు, పోటీపడుతున్న ఐటీ కంపెనీలు!
కరోనా మహమ్మారికి కారణంగా టెక్నాలజీ వినియోగం పెరిగింది.దీంతో ఆ రంగంలో పనిచేసే ఉద్యోగులకు సైతం డిమాండ్ ఏర్పడింది. అయితే తమకు అర్హులైన ఉద్యోగుల్ని ఎంపిక చేయడం టెక్ సంస్థలకు కత్తిమీద సాములాగా తయారైంది. అందుకే వేలకోట్లు ఖర్చు చేసి మరీ స్టాఫింగ్ ఏజెన్సీల సాయంతో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగుల్ని నియమించుకుంటున్నాయి. మార్కెట్లో ఉన్న డిజిటల్ స్కిల్ కొరతను అధికమిస్తున్నాయి. దీంతో టెక్ మార్కెట్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ టెక్ కంపెనీలు స్టాఫింగ్ ఏజెన్సీల సాయంతో ఉద్యోగల్ని (సబ్ కాంట్రాక్టర్స్ను) నియమించుకుంటున్నాయి. స్టాఫింగ్ ఏజెన్సీలు సైతం వాళ్ల పద్దతిలో సెలక్ట్ చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు శాలరీ, ఇన్స్యూరెన్స్ కవరేజ్‌తో పాటు ఇతర బెన్ఫిట్స్ను అందిస్తున్నాయి. అయితే ఈ తరహా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని నియమించుకునేందుకు ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెసీఎల్'లు పోటీ పడుతున్నాయి. అందుకోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నాయి. సాధారణ ఉద్యోగుల నియామకానికి సమానంగా కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఇలా ఈఏడాది ఫైనాన్షియల్ ఇయర్లో టీసీఎస్ 34.2శాతం వృద్ధితో కాంట్రాక్ట్ ఉద్యోగులపై రూ.16,975కోట్లు ఖర్చు చేస్తుండగా ఇన్ఫోసిస్ 77.9శాతం వృద్ధితో రూ.12,607కోట్లు ఖర్చు చేసింది. అదే సమయంలో విప్రో 30శాతం వృద్ధితో రూ.10,858 కోట్లు ఖర్చు చేయగా..23శాతం వృద్ధితో హెచ్‌సీఎల్ ఖర్చు చేసినట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. పర్మినెంట్ చేస్తున్నాయి సంస్థలు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని నియమించుకోవడం వల్ల డిమాండ్‌కు అవసరమయ్యే డిజిటల్ స్కిల్స్‌ను ఉపయోగించుకోవడంతో పాటు, స్కిలున్న ఉద్యోగుల్ని గుర్తించడం స్టాఫింగ్ ఏజెన్సీలకు సులభం అవుతుంది.తద్వారా సంస్థకు వస్తున్న ప్రాజెక్ట్‌లను తక్కువ సమయంలో పూర్తి చేయడం, ఐటీ సంస్థల్ని కుదిపేస్తున్న అట్రిషన్ రేట్‌ను తగ్గించుకునేందుకు సంస్థలు ట్రై-బై-అప్రోచ్ పద్దతిని అవలంభిస్తున్నాయని టెక్ అడ్వైజరీ సంస్థ క్యాటలిన్క్స్ పార్టనర్ రామ్ కుమార్ రామ మూర్తి తెలిపారు. ట్రై-బై-అప్రోచ్ పద్దతి అంటే కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగులు నియమించుకొని ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తున్నాయి. అవసరం అనుకున్నప్పుడు ఆ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని సంస్థలు సాధారణ ఉద్యోగులుగా ఎంపిక చేసుకుంటున్నాయి. చదవండి👉సాఫ్ట్వేర్ ఉద్యోగులకు బంపరాఫర్, ఎన్ని సెలవులు కావాలంటే అన్నీ తీసుకోండి! -
టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ చేతికి స్విట్జర్లాండ్ కంపెనీ!
న్యూఢిల్లీ: డిజిటల్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ కాన్ఫినాలేను కొనుగోలు చేసినట్లు సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా పేర్కొంది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. స్విట్జర్లాండ్ కంపెనీ కొనుగోలుకి యూకే అనుబంధ సంస్థ ద్వారా తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. 2012లో ఏర్పాటైన కాన్‌ఫినాలే బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్ రంగాలలో ఐటీ కన్సల్టింగ్ సేవలందిస్తోంది. ఈ వ్యూహాత్మక కొనుగోలుతో అవలాక్ కన్సల్టింగ్, అమలు, నిర్వహణ సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టి ద్వారా గ్లోబల్ వెల్త్‌మేనేజ్‌మెంట్‌లో విస్తరించనున్నట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలియజేసింది. అవలాక్ ప్రీమియం ఇంప్లిమెంటేషన్ పార్టనర్ టైటిల్ పొందిన నాలుగు గ్లోబల్ సంస్థలలో కాన్‌ఫినాలే ఒకటని ఈ సందర్భంగా వెల్లడించింది. బ్యాంకింగ్ నైపుణ్యానికి సాఫ్ట్వేర్ సామర్థ్యం జతకావలసిన అవసరమున్నదని బలంగా విశ్వసిస్తున్నట్లు కాన్‌ఫినాలే సీఈవో రోలండ్ స్టాబ్ పేర్కొన్నారు. ఇందుకు హెచ్‌సీఎల్ టెక్ పరిపూర్ణమైన భాగస్వామి అని పేర్కొన్నారు. -
ఐటీ కంపెనీ ఆఫర్:రండి బాబు రండి పెళ్లి సంబంధాలు చూస్తాం,శాలరీలు పెంచుతాం!
కరోనా కారణంగా పుట్టుకొచ్చిన కొత్త కొత్త టెక్నాలజీతో ఉద్యోగులు అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్నారు. దీంతో ప్రపంచ దేశాలకు చెందిన ఇతర సంస్థలతో పాటు టెక్ కంపెనీల్లో సైతం అట్రిషన్ రేటు తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన ఓ ఐటీ సంస్థ ఉద్యోగులకు కళ్లు చెదిరే ఆఫర్లు ప్రకటించింది. ఇంతకీ ఆ ఆఫర్లేంటని అనుకుంటున్నారా? ప్రపంచ వ్యాప్తంగా అన్నీ సంస్థల్లో కంటే ఐటీ కంపెనీల్లో అట్రిషన్ రేటు రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈ అట్రిషన్ రేటును తగ్గించేందుకు మదురైలోని సాఫ్ట్ వేర్ సంస్థ శ్రీ మూకాంబిక ఇన్ఫోసొల్యూషన్స్ (ఎస్ఎంఐ) అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకోసారి ఫ్రీగా పెళ్లి సంబంధాలు చూడడమే కాదు,ఇంక్రిమెంట్లను అందిస్తుంది. కంపెనీ ఉద్యోగులందరికీ ప్రతి ఆరు నెలలకు 6 నుంచి 8 శాతం ఇంక్రిమెంట్లు, ఉద్యోగుల పర్ఫామెన్స్‌ను బట్టి టాప్ 40 లేదా టాప్ 80 ఉద్యోగులకు అదనపు బెన్ఫిట్స్ అందిస్తుంది. 100కోట్లకు చేరువలో 2006లో శివకాశిలో ఎస్ఎంఐ సంస్థను ప్రారంభించి..ఆ తర్వాత 2010 మధురైకి మార్చారు.ఎస్‌ఎంఐతో దాని అసోసియేట్ కంపెనీలో కలిపి మొత్తం 750 మంది పనిచేస్తున్నారు. వీరిలో 40 శాతం మంది 5ఏళ్లకు పైగా అక్కడే పనిచేస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ వార్షిక ఆదాయం రూ.100 కోట్లకు చేరువలో ఉంది. కాగా,ఆ కంపెనీలో అట్రిషన్ రేటును తగ్గించేందుకు ఎస్ఎంఐ సంస్థ ప్రతినిధులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి👉యాపిల్ ఉద్యోగుల సంచలన నిర్ణయం, సీఈఓ టిమ్‌కుక్‌కు భారీ షాక్! -
ఉద్యోగుల షాక్, ఇన్ఫోసిస్‌కు కేంద్రం నోటీసులు!
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కార్మిక చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఐటీ ఎంప్లాయీ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫిర్యాదుకు సంబంధించి ఇన్ఫోసిస్‌కు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నోటీసులు అందజేసింది. ఆ నోటీసుల మేరకు ఇన్ఫోసిస్ కేంద్రం కార్మిక మంత్రిత్వశాఖ జరిపే చర్చల్లో పాల్గొంది. ఆ చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల్లో ఏ నిర్ణయం వెలువడుతుందో తెలుసుకునేందుకు ఐటీ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇన్ఫోసిస్ గ్రూప్ హెచ్ఆర్ విభాగం హెడ్ క్రిష్ శంకర్‌కు పంపిన నోటీసు ప్రకారం..“గురువారం ఐటీ ఉద్యోగుల సమస్యపై కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ చీఫ్ లేబర్ కమిషనర్ ముందు ఉమ్మడి చర్చ జరపాలని నిర్ణయించాం.” కార్మిక మంత్రిత్వ శాఖ సమక్షంలో జరిగే ఈ చర్చల్లో ఇన్ఫోసిస్ అధికారులతో పాటు, ఎన్ఐటీఈఎస్ ప్రతినిధులను కూడా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎన్ఐటీఈఎస్ జనరల్ సెక్రటరీ హర్‌ప్రీత్ సలూజా జాతీయ మీడియాతో మాట్లాడుతూ..ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు తాము పనిచేసిన క్లయింట్లకు.. మరో సంస్థలో చేరినప్పుడు సేవలు అందించకూడదంటూ నిబంధనల్ని విధించాం. పోటీ నియంత్రణ ఒప్పందంలో ఈ పనిచేయాల్సి వచ్చింది.ఆ నిబంధనలు నచ్చకనే దాదాపు 100 మంది ఇన్ఫోసిస్ ఉద్యోగులు యూనియన్ను సంప్రదించారని అన్నారు. కాగా ఇన్ఫోసిస్ తమ కంపెనీ నుంచి రాజీనామా చేసిన ఉద్యోగులందరికీ కొత్త నియమాన్ని విధించింది. దీని ప్రకారం.. ఇన్ఫోసిస్‌లో రాజీనామా చేసిన ఉద్యోగులు ఆరు నెలల పాటు టీసీఎస్, యాక్సెంచర్, ఐబీఎం, కాగ్నిజెంట్, విప్రో వంటి కంపెనీల్లో పనిచేయకూడదు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఐక్యంగా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్ట్ చట్టంలోని సెక్షన్ 27ను ఇన్ఫోసిస్ ఉల్లంఘించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందు ఇవ్వాళ కేంద్ర కార్మిక శాఖ.. ఇన్ఫోసిస్ యాజమాన్యాన్ని, ఐటీ కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయి. చదవండి👉ఇన్ఫోసిస్ షాకింగ్ నిర్ణయం..కేంద్రం తలుపుతట్టిన ఐటీ ఉద్యోగులు..! -
భారత్‌కు బంపరాఫర్! అమెరికా,యూరప్ దేశాలకు రష్యా భారీ షాక్!
తమతో ఖయ్యానికి కాలు దువ్వుతున్న దేశాలకు రష్యా భారీ షాకివ్వనుంది. ఓ వైపు యుద్ధం కొనసాగిస్తూనే..పాశ్చాత్య దేశాలు విధిస్తున్న ఆంక్షల్ని తట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా అమెరికాతో పాటు యూరేపియన్ దేశాలకు చెక్ పెడుతూ..రష్యా..భారత్‌లో భారీ ఎత్తున ఐటీ సంస్థల్ని ఏర్పాటు చేయనుంది. ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా తీరును తప్పుబడుతూ ఇప్పటి వరకు 400 దిగ్గజ కంపెనీలు ఆ దేశంలో కార్యకలాపాల్ని నిలిపివేసినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. యుద్ధం కారణంగా 2లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని మాస్కో మేయర్ ప్రకటించారు. అయినా రష్యా యుద్ధ మంత్రాన్నే జపిస్తోంది. అదే సమయంలో భారత్‌తో స్నేహం తమకు లాభిస్తోందని రష్యా భావిస్తుంది. అందుకే భారత్‌తో పాటు బ్రిక్స్ దేశాల భాగస్వామ్యంలో ఐటీ కంపెనీలను ఏర్పాటు చేయనుంది. 261ఐటీ కంపెనీలకు అధిపతి రష్యాలో సెయింట్ పీటర్ బర్గ్ కేంద్రంగా రస్ సాఫ్ట్ అనే సంస్థ 261 ఐటీ కంపెనీలకు, అందులో పనిచేస్తున్న 85వేల మంది ఉద్యోగులకు నాయకత్వం వహిస్తుంది. ఈ రస్ సాఫ్ట్ సంస్థ అధ్యక్షుడు వాలెంటిన్ మకరోవ్ మాట్లాడుతూ.. ఇటీవల భారత్‌లో జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్(బీజీబీఎస్)కు రష్యాకు చెందిన ఐటీ సంస్థలు.. భారత్‌కు చెందిన పలు ఐటీ సంస్థలతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. మేం నమ్ముతున్నాం అమెరికా,యూరప్ దేశాలు రష్యాపై విధిస్తున్న ఆంక్షల కారణంగా అనేక సవాళ్లతో పాటు ఉపాధి అవకాశాలు తగ్గుతాయని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. ఆ ఇబ్బందుల వల్లే వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే అవకాశాల్ని అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నామని మకరోవ్ చెప్పారు. కాబట్టి, బ్రిక్స్ దేశాలతో పాటు ఐటీ రంగంలో అగ్రగామిగా అడుగులు వేస్తున్న భారత్ లో సంస్థల్ని నెలకొల్పేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు రస్‌సాఫ్ట్ ప్రతినిధి పీటీఐ చెప్పారు. “గత కొన్ని రోజులుగా, మా(రస్‌సాఫ్ట్) ప్రతినిధి బృందం అనేక భారతీయ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యింది. తమ భాగస్వామ్యంలో ఇక్కడ(భారత్‌లో) సంస్థల్ని ఏర్పాటు చేసేందుకు భారత్‌కు చెందిన 19 సంస్థలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆటోమేషన్, సైబర్ సెక్యూరిటీ , టెలిమెడిసిన్, డిజిటల్ గవర్నెన్స్ వంటి రంగాల్లో సేవలందించే సంస్థలు ఎక్కువగా ఉన్నట్లు రస్ సాఫ్ట్ సహా మా నైపుణ్యాన్ని అందించగల అనేక రంగాలు ఉన్నాయి, ”అని రస్ సాఫ్ట్ అధ్యక్షుడు వాలెంటిన్ మకరోవ్ వెల్లడించారు. బీజీబీఎస్ ఓ మంచి అవకాశం రస్ సాఫ్ట్ ప్రతినిధి బృందం, భారతీయ కంపెనీల మధ్య సత్సంబంధాలు నెరిపేందుకు బీజీబీఎస్ సులభతరం చేసిందని మకరోవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రష్యన్ ఐటీ కంపెనీలు సాంకేతిక నైపుణ్యంతో భారతీయ సంస్థలను ఎలా పెంచవచ్చో వివరించామన్నారు. పన్నులో రాయితీ ఇస్తూ ఆర్టీపీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అందుబాటులో తీసుకొని రావడం, సాఫ్ట్వేర్ ద్వారా ట్రాఫిక్ మూవ్‌మెంట్స్‌ను ఆప్టిమైజ్ చేయడం, విద్యుత్ వినియోగాన్ని పొదుపు చేయడం, లాజిస్టిక్స్ కోసం సమాచార వ్యవస్థలపై పని చేయడంలో చాలా అవకాశాలు ఉన్నాయని మకరోవ్ చెప్పారు. పెద్దన్నతో భారత్ ఢీ అమెరికాతో పోటీపడే స్థాయికి భారత్ అడుగులు వేస్తుందని మకరోవ్ పేర్కొన్నారు. అయితే తయారీ నాణ్యతలో మెరుగులైన ఫలితాల్ని సాధించే అవకాశం ఉందని అన్నారు. “ప్రపంచ మార్కెట్లో ఇతర దేశాలకు గట్టి పోటీ ఇచ్చేలా భారత్‌కు సహాయం చేసేందుకు ఆసక్తిగా ఉన్నాం. దాని కోసం కొత్త సాఫ్ట్వేర్ పరిజ్ఞానాన్ని అందుబాటులో తేవాలంటే భారతీయ మానవ వనరులను పొందడం మాకు అవసరం. కలిసి ఉత్పత్తులన్ని తయారు చేయడం, ఇక్కడ, విదేశాలలో విక్రయించడం మా లక్ష్యం, ”అని మకరోవ్ స్పం చేశారు. ఇక అంతర్జాతీయ వాణిజ్యం కోసం అమెరికన్ డాలర్‌పై ఆధారపడకుండా ఉండటానికి డిజిటల్ కరెన్సీ, రూపాయి-రూబుల్ చెల్లింపు వ్యవస్థల్ని అందుబాటులోకి తెస్తామని మకరోవ్ పునరుద్ఘాటించారు. చదవండి👉పిలిచి మరి ఉద్యోగాలిస్తున్న దిగ్గజ ఐటీ కంపెనీలు..బాబోయ్ వద్దంటున్న ఉద్యోగులు! -
ఇన్ఫోసిస్ సంచలనం నిర్ణయం! ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త..!
టెక్కీలకు ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ బంపరాఫర్ ప్రకటించింది. ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చే పనిలేకుండా..వారి కంఫర్ట్‌కు అనుగుణంగా కొత్త వర్క్ కల్చర్‌ను అందుబాటులోకి తెచ్చేలా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్13న ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యూ4 ఫలితాల్ని విడుదల చేసింది. ఈ ఫలితాల్ని ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ నీలంజన్ రాయ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇన్ఫోసిస్‌లో మొత్తం 3,14,105 మంది ఉద్యోగులు అంటే 95శాతం మంది వర్క్‌ఫ్రమ్ నుంచి విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు వారిని పూర్తిస్థాయిలో ఆఫీస్‌లో వర్క్ చేసేలా 3 పద్దతుల్ని అవలంభిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేస్‌లో ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు.. ఆఫీస్‌కు వచ్చే పనిలేకుండా వారి ప్రాంతాల్లో సంస్థ(ఇన్ఫోసిస్) డెవలప్మెంట్ సెంటర్(డీసీ)లను ఏర్పాటు చేయనుంది. ఈ డీసీ సెంటర్లకు ఉద్యోగులు కనీసం వారానికి రెండు సార్లు వచ్చేలా ఎంకరేజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక సెకండ్ ఫేజ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో డీసీ సెంటర్లను ఏర్పాటు చేయలేమని, అలా డీసీ సెంటర్ల ఏర్పాటు చేయలేని ప్రాంతాల ఉద్యోగులు మరికొన్ని రోజుల్లో తిరిగి కార్యాలయాలకు వచ్చేలా సన్నద్ధం అవ్వాలని, అది వారి వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని నీలంజన్ రాయ్ పేర్కొన్నారు. మూడో ఫేజ్‌లో ఉద్యోగుల కోసం హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. అయితే ఈ వర్క్ మోడల్ క్లయింట్ రిక్వెరైమెంట్‌కు అనుగుణంగా ఉంటుందని ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ నీలంజన్ రాయ్ పేర్కొన్నారు. చదవండి: ప్రమోషన్లు వద్దంటున్న ఉద్యోగులు ! కారణం తెలిస్తే షాకవుతారు?