‘ఇంకోసారి జాబ్‌కి అప్లయ్‌ చేశావనుకో’.. అభ్యర్ధికి ఐటీ కంపెనీ చుక్కలు! | 'don't Attempt To Apply Again': It Company's Rude Rejection Email Goes Viral | Sakshi
Sakshi News home page

‘ఇంకోసారి జాబ్‌కి అప్లయ్‌ చేశావనుకో’.. అభ్యర్ధికి ఐటీ కంపెనీ చుక్కలు!

Published Sat, Jan 6 2024 12:30 PM | Last Updated on Sat, Jan 6 2024 1:34 PM

'don't Attempt To Apply Again': It Company's Rude Rejection Email Goes Viral - Sakshi

కోరుకున్న ఐటీ జాబ్‌. కోరుకున్నంత జీతం దక్కుతుందంటే ఎవరైనా ఏం చేస్తారా? ప్రయత్నిస్తారు..ప్రయత్నిస్తారు. చివరికి అనుకున్నది సాధిస్తారు. ఈ ప్రాసెస్‌లో లెక్కలేనని రిజెక్షన్‌లు ఎదరవుతుంటాయి. అని తెలిసినా ఆ జాబ్‌ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం. అలా ఐటీ జాబ్‌ కోసం ప్రయత్నించిన ఓ ఉద్యోగికి చుక్కెదురైంది. 

ఓ అభ్యర్ధి పేరున్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్‌ కోసం అప్లయ్‌ చేశాడు. ఇంటర్వ్యూకి వెళ్లాడు. కానీ అక్కడ ఇంటర్వ్యూలో రాణించలేకపోయాడు. ఆ విషయాన్ని సదరు కంపెనీ యాజమన్యం అభ్యర్ధికి మెయిల్‌లో సమాచారం అందిచింది. ఆ మెయిల్‌లో..‘‘మేం నిర్వహించిన ఇంటర్వ్యూలో మీరు ఫెయిల్‌ అయ్యారు’’అని తెలిపింది. అంత వరకు బాగానే ఉంది. కానీ ‘‘ఇంకో సారి నువ్వు మా కంపెనీలో జాబ్‌ కావాలని అప్లయ్‌ చేశావనుకు ఊరుకునేది లేదు. ఏడాది వరకు ఇంటర్వ్యూ అటెండ్‌ కాకుండా బ్లాక్‌ చేస్తా’’ అని మెయిల్‌ పెట్టింది. 

ఆ మెయిల్‌ ఎందుకు అలా పెట్టిందనే అంశంపై స్పష్టత రానప్పటికీ ప్రస్తుతం ఈ అంశం ఐటీ కంపెనీల పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఐటీ కంపెనీ ఈ తరహా మెయిల్స్‌ పంపడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిలో చాలా మంది ఐటీ కంపెనీల పరిస్థితిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. 

మీకు మేం ఉద్యోగం ఇవ్వలేం
అమెరికా కేంద్రంగా ఎలైట్ సాఫ్ట్‌వేర్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఆ కంపెనీలో  ఫ్రంటెండ్ డెవలప్‌ జాబ్‌ కోసం ఓ అభ్యర్ధి అప్లయ్‌ చేశాడు. అందుకు మా కంపెనీలో జాబ్‌ కోసం అప్లయ్‌ చేసినందుకు అభ్యర్థికి కృతజ్ఞతలు ఈమెయిల్‌ పంపింది. అందులో ఆటోమేటెడ్ ఆన్‌లైన్ పరీక్షను క్లియర్ చేయడంలో విఫలమైనందున జాబ్‌ ఇవ్వలేమని తెలిపింది.  

జాబ్‌ కోసం అప్లయ్‌ చేయొద్దు
ఇంతవరకు అంతా బాగనే ఉంది. ‘‘ కనీసం వచ్చే ఏడాది చివరి వరకు మళ్లీ జాబ్‌ కోసం అప్లయ్‌ చేయొద్దని హెచ్చరించింది. ఈ సమయాని కంటే ముందే మళ్లీ ఈ స్థానానికి దరఖాస్తు చేయడానికి మీరు ప్రయత్నిస్తే, ఇంటర్వ్యూ కాల్‌ వస్తే మీ రెస్యూమ్‌  ఆటోమెటిక్‌గా బ్లాక్‌ అవుతుంది. భవిష్యత్‌లో మా కంపెనీలో ఇతర ఉద్యోగాలకు అప్లయ్‌ చేసుకునే వెసులు బాటు కూడా ఉండదు’’ అని ఈమెయిల్‌లో పేర్కొంది.

 

మమ్మల్ని నిందించడం మానేసి
పైగా ఆన్‌లైన్ ఆటోమెషిన్‌ పంపే మెయిల్స్‌ వల్ల అభ్యర్ధులు ఇబ్బంది పడుతుంటే..పరిష్కారం చూడాల్సి కంపెనీ.. జాబ్‌ రాలేదని, లేదంటే బ్లాక్‌ చేసిందని కంపెనీని నిందించడం మానేసి తమను తాము మెరుగుపరుచుకోవాలని సూచించింది. 

ఉద్యోగులతో ఎలా వ్యవహరిస్తుందో
దీనిపై నెటిజన్‌లు పలు విధాలు స్పందిస్తున్నారు. ఈ సాకుతోనైనా ఆ కంపెనీలో జాబ్‌ కోసం ప్రయత్నిస్తా అని ఒకరు అంటుంటే .. ‘‘ఇంటర్వ్యూ అభ్యర్ధులతో ఇలా ప్రవర్తిస్తే.. వారి ఉద్యోగులతో ఎలా వ్యవహరిస్తుందో ’’ఊహించుకోండి అని మరొకరు కామెంట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement