software consultancy
-
ఎయిరిండియాలో కుంభకోణం.. మాజీ సీఎండీపై సీబీఐ ఛార్జ్ షీటు దాఖలు
ఎయిరిండియాలో జరిగిన కుంబకోణం వెలుగులోకి వచ్చింది. 2011లో సాఫ్ట్వేర్ కొనుగోలు సమయంలో రూ.225 కోట్ల మేర అవకతవకలు జరిగాయంటూ సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సాఫ్ట్వేర్ కొనుగోళ్లలో విధానపరమైన అవకతవకలను ప్రాథమికంగా గుర్తించిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) సిఫారసు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. దాదాపు ఆరేళ్ల విచారణ తర్వాత, సీబీఐ మాజీ సీఎండీ ఎయిర్ ఇండియా అరవింద్ జాదవ్, ఐబీఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఏపీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు మరో ఆరుగురిపై ఐపీసీ సెక్షన్ 120-బి (నేరపూరిత కుట్ర) కింద ఛార్జ్‌షీటు దాఖలు చేసింది. సరైన టెండరింగ్ విధానాన్ని అనుసరించకుండానే నేషనల్ క్యారియర్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ) సాఫ్ట్‌వేర్‌ను శాప్ ఏజీ నుంచి కొనుగోలు చేసినట్లు ఎయిరిండియా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ప్రాథమిక విచారణలో తేలిందని సీవీసీ సీబీఐకి అందించిన నోట్లో పేర్కొంది. 2009 జూలై 9న గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ ముందు 2010లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ముందు ప్రజెంటేషన్ ఇచ్చామని ఎయిరిండియా తెలిపింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి ఆమోదం లభించలేదని ఆరోపించింది ఇప్పటికే గతంలో ఒరాకిల్ నుంచి తీసుకున్న ఈఆర్పీ సాఫ్ట్వేర్ ఉండగా, కొత్త సాఫ్ట్వేర్ ఎందుకు తీసుకున్నారన్న విషయమై క్లారిటీ లేదు. ఓపెన్ టెండర్ ప్రక్రియ చేపట్టకుండానే ఎస్ఏపీ, ఐబీఎంలకు నామినేషన్ పద్దతిలో ఈ కాంట్రాక్టును ఎయిర్ఇండియా అప్పగించిందన్న ఆరోపణలు ఉన్నాయి. -
‘ఇంకోసారి జాబ్‌కి అప్లయ్ చేశావనుకో’.. అభ్యర్ధికి ఐటీ కంపెనీ చుక్కలు!
కోరుకున్న ఐటీ జాబ్. కోరుకున్నంత జీతం దక్కుతుందంటే ఎవరైనా ఏం చేస్తారా? ప్రయత్నిస్తారు..ప్రయత్నిస్తారు. చివరికి అనుకున్నది సాధిస్తారు. ఈ ప్రాసెస్‌లో లెక్కలేనని రిజెక్షన్లు ఎదరవుతుంటాయి. అని తెలిసినా ఆ జాబ్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం. అలా ఐటీ జాబ్ కోసం ప్రయత్నించిన ఓ ఉద్యోగికి చుక్కెదురైంది. ఓ అభ్యర్ధి పేరున్న సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కోసం అప్లయ్ చేశాడు. ఇంటర్వ్యూకి వెళ్లాడు. కానీ అక్కడ ఇంటర్వ్యూలో రాణించలేకపోయాడు. ఆ విషయాన్ని సదరు కంపెనీ యాజమన్యం అభ్యర్ధికి మెయిల్లో సమాచారం అందిచింది. ఆ మెయిల్లో..‘‘మేం నిర్వహించిన ఇంటర్వ్యూలో మీరు ఫెయిల్ అయ్యారు’’అని తెలిపింది. అంత వరకు బాగానే ఉంది. కానీ ‘‘ఇంకో సారి నువ్వు మా కంపెనీలో జాబ్ కావాలని అప్లయ్ చేశావనుకు ఊరుకునేది లేదు. ఏడాది వరకు ఇంటర్వ్యూ అటెండ్ కాకుండా బ్లాక్ చేస్తా’’ అని మెయిల్ పెట్టింది. ఆ మెయిల్ ఎందుకు అలా పెట్టిందనే అంశంపై స్పష్టత రానప్పటికీ ప్రస్తుతం ఈ అంశం ఐటీ కంపెనీల పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఐటీ కంపెనీ ఈ తరహా మెయిల్స్ పంపడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిలో చాలా మంది ఐటీ కంపెనీల పరిస్థితిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మీకు మేం ఉద్యోగం ఇవ్వలేం అమెరికా కేంద్రంగా ఎలైట్ సాఫ్ట్వేర్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఆ కంపెనీలో ఫ్రంటెండ్ డెవలప్ జాబ్ కోసం ఓ అభ్యర్ధి అప్లయ్ చేశాడు. అందుకు మా కంపెనీలో జాబ్ కోసం అప్లయ్ చేసినందుకు అభ్యర్థికి కృతజ్ఞతలు ఈమెయిల్ పంపింది. అందులో ఆటోమేటెడ్ ఆన్లైన్ పరీక్షను క్లియర్ చేయడంలో విఫలమైనందున జాబ్ ఇవ్వలేమని తెలిపింది. జాబ్ కోసం అప్లయ్ చేయొద్దు ఇంతవరకు అంతా బాగనే ఉంది. ‘‘ కనీసం వచ్చే ఏడాది చివరి వరకు మళ్లీ జాబ్ కోసం అప్లయ్ చేయొద్దని హెచ్చరించింది. ఈ సమయాని కంటే ముందే మళ్లీ ఈ స్థానానికి దరఖాస్తు చేయడానికి మీరు ప్రయత్నిస్తే, ఇంటర్వ్యూ కాల్ వస్తే మీ రెస్యూమ్ ఆటోమెటిక్‌గా బ్లాక్ అవుతుంది. భవిష్యత్‌లో మా కంపెనీలో ఇతర ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునే వెసులు బాటు కూడా ఉండదు’’ అని ఈమెయిల్లో పేర్కొంది. మమ్మల్ని నిందించడం మానేసి పైగా ఆన్లైన్ ఆటోమెషిన్ పంపే మెయిల్స్ వల్ల అభ్యర్ధులు ఇబ్బంది పడుతుంటే..పరిష్కారం చూడాల్సి కంపెనీ.. జాబ్ రాలేదని, లేదంటే బ్లాక్ చేసిందని కంపెనీని నిందించడం మానేసి తమను తాము మెరుగుపరుచుకోవాలని సూచించింది. ఉద్యోగులతో ఎలా వ్యవహరిస్తుందో దీనిపై నెటిజన్లు పలు విధాలు స్పందిస్తున్నారు. ఈ సాకుతోనైనా ఆ కంపెనీలో జాబ్ కోసం ప్రయత్నిస్తా అని ఒకరు అంటుంటే .. ‘‘ఇంటర్వ్యూ అభ్యర్ధులతో ఇలా ప్రవర్తిస్తే.. వారి ఉద్యోగులతో ఎలా వ్యవహరిస్తుందో ’’ఊహించుకోండి అని మరొకరు కామెంట్ చేశారు. -
నిరుద్యోగులకు అలర్ట్,'సాఫ్ట్వేర్' కొలువుల జాతర!
ముంబై: ఓమ్నీ చానల్, మల్టీ ప్లాట్‌ఫామ్ టెక్నాలజీ సంస్థ ఫైండ్.. 2022–23 నాటికి 2,000 మంది ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. ఇందులో 800 మంది ఇంజనీర్లు దక్షిణాది నుంచి ఉంటారని తెలిపింది. ఈ సంస్థ బెంగళూరులో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. ఇక్కడే ఎక్కువ మందిని నియమించుకోనున్నట్టు పేర్కొంది. ఈ సంస్థ రిలయన్స్ గ్రూపులో భాగం. ప్రస్తుతం 750 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఇందులో సగం మందిని గత ఆరు నెలల్లోనే నియమించుకోవడం గమనార్హం. వృద్ధిని కొనసాగించేందుకు వీలుగా ఉద్యోగులను పెంచుకోనున్నట్టు తెలిపింది. -
సాప్ట్వేర్ కన్సల్టెన్సీ బాగోతం
తిరుపతిక్రైం: ఐటీ రాజధాని బెంగళూరులో తమకు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉదని, అందులో ఉద్యోగం పొందేలా కోర్సులు నేర్పిస్తామని నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలుచేసిన కన్సల్టెన్సీ బాగోతామిది. చిత్తూరు జిల్లా తిరుపతిలో మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై సీఐ (ఈస్టు) రామ్‌కిషోర్ తెలిపిన వివరాలమేరకు.. తిరుపతి నగరంలో వీవీ మహల్ రోడ్డులోని ఓ భవనంలోని వెరిజోటెక్ ఐటీ సొల్యూషన్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీ మేనేజింగ్ డెరైక్టర్, చైర్మన్‌గా వ్యవహరిస్తున్న విశ్వప్రసాద్ అనే వ్యక్తి విశాఖపట్నానికి చెందినవాడు. బెంగళూరులో ఉన్న ఐటీ కంపెనీకి అనుబంధంగా కన్సల్టెన్సీని 2015లో ప్రారంభించామని, ఇక్కడ కోర్సులు నేర్చుకుంటే అక్కడ ఉద్యోగాలు కల్పిస్తామని 91 మంది నిరోద్యోగులకు ఆశ చూపాడు. జావా, ఎక్స్ ఎంఎల్ సర్వీసెస్, సీవీఎస్ లాంటి కోర్సులు నేర్పించి, సంవత్సరానికి రూ.3 నుంచి 4 లక్షల వరకు ప్యాకేజీ ఇప్పిస్తామని నమ్మించి చేర్పించుకునేవాడు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశాడు. అలా దాదాపు రూ.70 లక్షలు వెనకేశాడు. విశ్వప్రసాద్ చేతిలో మోసపోయిన హరిప్రసాద్ అనే వ్యక్తి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వెరిజోటెక్ బాగోతం వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని న్యూ ఇందిరా నగర్లో నివాసముంటున్న హరిప్రసాద్ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం వస్తుందనే ఆశతో వెరిజోటెక్ లో చేరి, తర్వాత అతి బోగస్ సంస్థ అని తేలడంతో డబ్బులు వెనక్కివ్వాలని డిమాండ్ చేశాడు. రోజూ ఆఫీసుల చుట్టూ తిరిగి విసుగెత్తిపోయి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెరిజోటెక్ కార్యాలయంలో సోదాలు నిర్వహించగా విస్తుగొలిపే విషయాలు బయటికొచ్చాయి. అక్కడున్న కంప్యూటర్లలో ఏ ఒక్కటీ పనిచేయదు. కనీసం ఫ్యాన్లు కూడా తిరగవు. అక్కడ పనిచేస్తున్న వారిని ప్రశ్నించగా తమ యజమాని కొద్దిరోజుల నుంచి కనిపించడంలేదని బదులిచ్చారు. మొత్తం 91 మంది బాధితుల బయోడేటాలు, కంపెనీకి సంబంధించిన ప్యూచర్‌ప్లాన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం నిరుద్యోగులను మోసం చేసేందుకే ఒక కార్యాలయంగా చిత్రీకరించనట్టు తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇప్పటి వరకు ఒక బాధితుడు మాత్రమే ఫిర్యాదు చేశాడని, మిగతావారుకూడా ముందుకొచ్చి ధైర్యంగా ఫిర్యాదుచేయాలని కోరారు.