ముంబై: ఓమ్నీ చానల్, మల్టీ ప్లాట్‌ఫామ్ టెక్నాలజీ సంస్థ ఫైండ్.. 2022–23 నాటికి 2,000 మంది ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. ఇందులో 800 మంది ఇంజనీర్లు దక్షిణాది నుంచి ఉంటారని తెలిపింది. ఈ సంస్థ బెంగళూరులో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. ఇక్కడే ఎక్కువ మందిని నియమించుకోనున్నట్టు పేర్కొంది.
ఈ సంస్థ రిలయన్స్ గ్రూపులో భాగం. ప్రస్తుతం 750 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఇందులో సగం మందిని గత ఆరు నెలల్లోనే నియమించుకోవడం గమనార్హం. వృద్ధిని కొనసాగించేందుకు వీలుగా ఉద్యోగులను పెంచుకోనున్నట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment