
ఉద్యోగాల కోసం రోజూ పదుల సంఖ్యలో కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాడు.. అలా ఏడాది గడిపిన ఓ వ్యక్తి చివరకు ఓ పెద్ద కంపెనీలో అధిక వేతనంతో రిమోట్ ఉద్యోగం(వర్క్‌ఫ్రం హోం) సంపాదించాడు. కానీ కొన్ని నెలల్లోనే తనకున్న ఓ అలవాటు ద్వారా ఉద్యోగం ఊడింది. తన అలవాటుపై స్పందించిన సదరు ఉద్యోగి తానో మూర్ఖుడినంటూ అందుకే ఉద్యోగం పోయిందని వాపోయాడు. దీనికి సంబంధించిన వివరాలను ‘కెరియర్ అడ్వైజ్’ అనే రెడ్డిట్ హ్యాండిల్ పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.
‘చదవు పూర్తయింది. రోజూ పదుల సంఖ్యలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవాడిని. నాకు రిమోట్ ఉద్యోగం(వర్క్‌ఫ్రం హోం) చేయాలని చాలా ఇష్టంగా ఉండేది. అనుకున్నట్టుగానే మంచి కంపెనీలో ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగం వచ్చింది. రిమోట్ జాబ్ కావడంతో కొన్నిసార్లు ఆలస్యంగా మెసేజ్‌లు చేస్తూ, మూర్ఖుడిలా పర్సనల్ మెసేజ్‌లు స్క్రోల్ చేసేవాడిని. ఈ క్రమంలో ల్యాప్‌టాప్ 10-15 నిమిషాలపాటు స్లీప్ మోడ్‌లోకి వెళ్లేది. ఇలా చాలాసార్లు జరిగింది. దీని గుర్తించి మేనేజర్ అడిగినప్పుడు ఏదో టెక్నికల్ సమస్య అని అబద్ధం చెప్పాను. అది గమనించిన మా బాస్ నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఎంతో నిరాశ చెందాను. కాలేజ్ చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం సంపాదించిన మూడు నెలల్లో రెండు ఉద్యోగాలు మారాను. ఇది నా రెజ్యూమెలో ప్రతికూలంగా మారింది. నేను మళ్లీ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నాను. కానీ నా డ్రీమ్ జాబ్ కోల్పోయిన భావన నిజంగా నన్ను బాధిస్తుంది’ అని తెలిపాడు.
‘నేను తప్పు చేశానని 100 శాతం అర్థం చేసుకున్నాను. దానిని సరిచేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను డబ్బును ప్రేమించాను. కానీ ఉద్యోగంలో ఉత్సాహంగా ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వాల్సింది. ఇకపై తప్పు చేయను. నాకు ఆసక్తిగా ఉన్న విమానయానం, ఆటోమోటివ్ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాను’ అని పోస్ట్ చేశాడు.
ఇదీ చదవండి: రోల్స్ రాయిస్.. 2,500 మందికి లేఆఫ్స్
ఈ పోస్ట్ రెడ్డిట్‌లో వైరల్‌గా మారింది. చాలా మంది అతని చర్యలు, వాటి వల్ల వచ్చిన ఫలితం రెండింటినీ పరిగణించి కామెంట్ చేశారు. ‘మీ నుంచి చాలా మంది ఖరీదైన పాఠం నేర్చుకుంటారు. మీరు కెరియర్‌లో ముందుకు సాగండి. మరింత మెరుగైన అవకాశాలు మీ సొంతం అవుతాయి’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment