
ఉద్యోగులకు ఏదైనా సమస్యలు వచ్చినా.. సందేహాలు వచ్చినా.. తగిన పరిష్కారం తెలుసుకోవడానికి, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల ఒక ఉద్యోగి.. తాను నోటీస్ పీరియడ్‌లో ఉన్నప్పుడే జాబ్ నుంచి తీసేశారని, రిలీవింగ్ లెటర్ కూడా ఇవ్వడం లేదని వాపోయాడు.
నేను ఒక కంపెనీలో రెండు నెలలకు ముందు చేరాను. అయితే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి, నోటీసు పీరియడ్‌లో ఉన్నాను. ఈ సమయంలో రెండు రోజులు సెలవు తీసుకున్నందుకు.. ఉద్యోగం నుంచి తొలగించినట్లు హెచ్ఆర్ ఫోన్ చేసి చెప్పారు. అంతే కాకుండా.. రిలీవింగ్ లెటర్ ఇవ్వడానికి కూడా వారు నిరాకరించినట్లు రెడ్డిట్ యూజర్ పేర్కొన్నారు. నా జీతం.. పెంపుకు సంబంధించిన లెటర్ పొందటానికి నేను ఏమి చేయాలని ప్రశ్నించారు. సీటీసీ తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ శాలరీ పొందే ఉద్యోగానికి వెళ్లలేకపోతున్నానని అన్నారు.

ఈ పోస్టుకు పలువురు నెటిజన్లు స్పందించారు. నా సహోద్యోగికి ఇలాగే జరిగింది. దీనికోసం ఒక న్యాయవాదిని నియమించుకోండి. మీకు కావలసిన లెటర్స్ పొందటానికి రూ. 50వేలు ఖర్చు చేయడానికి వెనకాడవద్దని, ఒక యూజర్ పేర్కొన్నారు. మీ అనుభవాన్ని ఉపయోగించుకోండి, దీనికోసం ఆఫర్ లెటర్ యూస్ చేయండి. శాలరీ హైక్ లెటర్ అవసరం లేదని మరొకరు అన్నారు.
ఇదీ చదవండి: గూగుల్ పే వాడుతున్నారా?.. ఇక ఆ బిల్స్ చెల్లిస్తే బాదుడే!
మీరు చేరిన వెంటనే రాజీనామా చేసిన కంపెనీ నుంచి మీకు.. ఎక్స్‌పీరియన్స్ లెటర్ ఎందుకు అవసరం. ఈ విషయాన్ని.. ఇకపై చేరబోయే సంస్థలో చెప్పినా, మీ మీద చెడు అభిప్రాయం ఏర్పడుతుందని ఇంకో నెటిజన్ పేర్కొన్నారు. రిలీవింగ్ లెటర్‌ను ఎవరూ ఆపలేరని హెచ్‌ఆర్‌కు చెప్పండి. పీఎఫ్ పాస్‌బుక్‌లో ఈ సంస్థ నుంచి ఈపీఎఫ్ ట్రీ ఉంటే, భవిష్యత్తులో మీరు చేరే కంపెనీలలో నేపథ్య ధృవీకరణ ప్రక్రియ కోసం మీకు రిలీవింగ్ లెటర్ అవసరం అవుతుంది.