
ఉద్యోగం చేయాలనుకునే చాలామంది.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు లేదా హైదరాబాద్ వంటి నగరాలనే ఎంచుకుంటారు. అయితే బెంగళూరులో ఉండటం కష్టం అంటూ.. రూ.25 లక్షల వేతనం తీసుకునే ఓ కార్పొరేట్ ఉద్యోగి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఒక కార్పొరేట్ ఉద్యోగి 40 శాతం ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం కోసం పూణే నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు. అయితే ఓ సంవత్సరం గడిచాక, బెంగళూరుకు రావడం తప్పు అయిందని పశ్చాత్తాపపడ్డాడు. ఈ విషయాలు ప్రస్తుతం లింక్డ్ఇన్ పోస్ట్‌లో వైరల్ అయ్యాయి.
పూణేలో రూ. 18 లక్షల వేతనం వచ్చేది. బెంగళూరులో రూ. 25 లక్షలు వస్తున్నా ఏమీ మిగలడం లేదని, కొత్త ఉద్యోగంలో చేరి ఒక సంవత్సరం తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేసి తన నిరాశను వ్యక్తం చేశాడు కార్పొరేట్ ఉద్యోగి. నగరాలు మారకూడదు, పూణే చాలా బాగుందని అన్నాడు.
ఇదీ చదవండి: వారానికి 70 గంటల పని: మొదటిసారి స్పందించిన సుధామూర్తి
కార్పొరేట్ ఉద్యోగి మాటలు విన్న, అతని ఫ్రెండ్ ఆశ్చర్యపోతూ.. 40 శాతం ఇంక్రిమెంట్ బాగానే ఉంది కదా. ఏమైంది అని అడిగితే.. బెంగళూరులో జీతాలు పెరిగేకొద్దీ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. అద్దెలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇంటి యజమానులు మూడు లేదా నాలుగు నెలల రెంట్ అడ్వాన్స్ తీసుకుంటున్నారు. ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉంది.
పూణేలోని 15 రూపాయల వడాపావ్ మిస్ అవుతున్నా అని చెప్పాడు. కనీసం అక్కడ జీవితం, సేవింగ్స్ అన్నీ బాగున్నాయి. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. తాము ఎదుర్కొన్న సొంత అనుభవాలను కూడా వెల్లడించారు. కొందరు బెంగళూరును సమర్దిస్తే.. మరికొందరు బెంగళూరులో బతకడం కష్టం అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment