regrets
-
తొందర పడ్డానేమో! రిటైర్మెంట్పై సానియా మీర్జా వ్యాఖ్య
మెల్బోర్న్: ప్రస్తుత సీజన్ తర్వాత టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన భారత స్టార్ సానియా మీర్జా ఇప్పుడు దానిపై పశ్చాత్తాప పడుతోంది. నిర్ణయం సరైనదే అయినా ప్రకటించిన సమయం సరైంది కాదని, ఆ విషయంలో తొందరపడినట్లుగా భావిస్తున్నానని ఆమె పేర్కొంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్య చేసింది. ‘ఇప్పుడు అంతా నా ఆట గురించి కాకుండా రిటైర్మెంట్ తర్వాతి విషయాలపైనే మాట్లాడుతున్నారు. దాని గురించే అడుగుతున్నారు. ఆఖరి సీజన్ అయినంత మాత్రాన నా ఆటలో, ఆలోచనా ధోరణిలో మార్పు ఉండదు. ప్రతీ మ్యాచ్ గెలవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగుతాను. ఆటను ఆస్వాదిస్తూనే గెలిచేందుకు 100 శాతం శ్రమిస్తాను. ఫలితం ఎలా వచ్చినా నా ప్రయత్నంలో లోపం ఉండదు. రిటైర్మెంట్ తర్వాతి అంశాల గురించి నేను అసలు ఆలోచించడమే లేదు. నిజాయితీగా చెప్పాలంటే రిటైర్మెంట్ గురించి నేను చాలా తొందరపడి ప్రకటన చేశాను. ఇప్పుడు దానికి నేను చింతిస్తున్నాను’ అని 35 ఏళ్ల సానియా మీర్జా వ్యాఖ్యానించింది. -
ఆఫ్ఘనిస్తాన్పై చర్చ: పాకిస్తాన్‌కు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) సమావేశానికి ఆహ్వానం అందకపోవడంపై పాకిస్తాన్ స్పందించింది. వివాదాస్పద పొరుగుదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితిపై ఆగస్టు 6 న నిర్వహించిన భద్రతా మండలి సమావేశానికి ఆహ్వానించకపోవడంపై పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆఫ్ఘన్ పరిస్థితుల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పొరుగుదేశంగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితిపై చర్చకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పిలుకు రాకపోవడంపై పాకిస్తాన్ విచారం వ్యక్తం చేసింది. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆహ్వానించలేదంటూ మండిపడింది. తమ దేశంపై తప్పుడు ప్రచారం జరగడానికి ఈ మండలిని వేదికగా ఉపయోగించుకుంటున్నారని పాక్ విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జహీద్ హఫీజ్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫ్ఘన్ దేశానికి తాము పొరుగునే ఉన్నామని, ఆఫ్ఘన్ లో శాంతి నెలకొనేలా చూడడంలో తమది కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు. ఈ సమస్యకు సైనిక చర్య పరిష్కారం కాదని రాజకీయ ఒప్పందమే సరైనమార్గమంటూ ఆయన ట్వీట్ చేశారు. దోహాలో జరిగిన చర్చల్లో తాము కూడా భాగస్వామ్యం వహించామని ఆశిస్తున్నట్టు హఫీజ్ చౌదరి పేర్కొన్నారు. అటు తాలిబాన్లకు సురక్షితమైన స్వర్గధామం పాకిస్తాన్ మారిందని,వారికి భారీమద్దతును అందిస్తోంటూ పాకిస్తాన్ పైఐరాసలోఆఫ్ఘన్ శాశ్వత ప్రతినిధి గులాం ఇసాక్ జై కూడా మండిపడ్డారు. మరోవైపు ఉగ్రవాదులకు ఊతమిస్తోందంటూ పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర విమర్శలు చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతిని నెలకొల్పేందుకు ఈ ప్రాంతంలోని తీవ్రవాద సురక్షిత ప్రాంతాలను తక్షణమే నాశనం చేయాలని తద్వారా తీవ్రవాద గొలుసును అంతం చేయాలని ఐరాస భారత రాయబారి తిరుమూర్తి కోరారు. కాగా నేడు (సోమవారం) సాయంత్రం జరగనున్న ప్రధాని మోదీ అధ్యక్షతన యూఎన్ఎస్సీ కీలక సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్ ప్రెసిడెంట్ ఫెలిక్స్-ఆంటోయిన్ షిసెకెడి సిలోంబో, అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ తదితరులు కూడా పాల్గొంటున్నారు. 15 దేశాల ఉన్నత స్థాయి సమావేశంలో తీవ్రవాద నిరోధం, అంతర్జాతీయ శాంతి పరిరక్షణ అంశాలతో పాటు ‘సముద్ర భద్రత’అంశాన్ని ఎజెండాలో ప్రత్యేక అంశంగా చర్చించడం ఇదే తొలిసారి. అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి సమాచారం ప్రకారం ఐరాస భద్రతా మండలి సమావేశానికి భారత ప్రధాని అధ్యక్షత వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. -
ఐటెం గర్ల్ అయినందుకు ఎలాంటి బాధ లేదు: రాఖీ సావంత్
ముంబై : రాఖీ సావంత్.. బిగ్‌బాస్ సీజన్ 14లో మోస్ట్ ఎంటర్టైనర్గా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. బోల్డ్నెస్తో పాటు కాంట్రవర్సీ క్వీన్‌గానూ పేరొందిన రాఖీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్లో తనకు ఐటెం గర్ల్ అన్న గుర్తింపు రావడం పట్ల ఎలాంటి రిగ్రెట్స్ లేవని, అయినా తనకు హీరోయిన్ పాత్ర పోషించేంత టాలెంట్ కూడా లేదని తెలిపింది. 'బాలీవుడ్లో ప్రతీ ఒక్కరూ హీరోయిన్ కాలేరు. కొందరికి ఐటెమ్ గర్ల్లాగా ఛాన్సులొస్తే.. మరికొందరికేమో తల్లి, చెల్లి, ఫ్రెండ్, నెగిటివ్ రోల్స్ లేదా చిన్న చిన్న పాత్రలు వస్తాయి. అయినా కెరీర్లో ఐటెం సాంగ్స్ చేయడం పట్ల నేనేమీ బాధపడటం లేదు. ఎందుకంటే అలా సంపాదిచిన డబ్బుతోనే నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. అంతేకాకుండా ఐటెం గర్ల్‌గా బాలీవుడ్లో నాకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని కల్పించినందుకు ఎంతో గర్వపడుతున్నాను' అని వెల్లడించింది. మొహబత్ హై మిర్చి, దేక్తా హై తు క్యా వంటి స్పెషల్ సాంగ్స్‌లో కనిపించిన రాఖీ తన దూకుడుతో మరింత గుర్తింపు సంపాదించుకుంది. నాచ్ బలియే, పతి పత్ని జౌర్ వో, బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోస్‌తో పాపులారిటీ దక్కించుకుంది. చదవండి : అత్యాచారం చేయబోయారు: బిగ్‌బాస్ కంటెస్టెంట్ పిల్లల్ని కనాలని ఉంది: బిగ్‌బాస్ కంటెస్టెంట్ -
‘ఐటెం’ వ్యాఖ్యలపై కమల్‌నాథ్ విచారం
సాక్షి, భోపాల్: మధ్యప్రదేశ్ మంత్రి ఇమార్తీదేవిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కమల్‌నాథ్ విచారం వ్యక్తం చేశారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రాజుకున్న హై-వోల్టేజ్ డ్రామా అనంతరం మాజీ ముఖ్యమంత్రి యూ టర్న్ తీసుకున్నారు. ఆ మహిళా మంత్రిని అగౌరవపరిచేలా తానేమీ మాట్లాడలేదని, క్షమాపణ చెప్పబోనని స్పష్టం చేశారు. (‘కమల్ నాథ్ వ్యాఖ్యలను సమర్ధించను’) ఆదివారం జరిగిన ఉప ఎన్నికల ప్రచార ర్యాలీలో మంత్రి ఇమార్తీదేవిని కమల్‌నాథ్ ‘ఐటెం’ అంటూ అగౌరవంగా సంబోధించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ఆ భాష సరైంది కాదన్నారు. అవమానకరంగా మాట్లాడిన కమల్‌నాథ్‌పై చర్యలు తీసుకోవాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. -
క్షమాపణలు చెప్పిన గిరిరాజ్ సింగ్
-
క్షమాపణలు చెప్పిన గిరిరాజ్ సింగ్
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఎట్టకేలకు దిగి వచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆయన సోమవారం లోక్ సభలో క్షమాపణ చెప్పారు. సోనియా గాంధీని కించపరిచే ఉద్దేశం లేదని, తన వ్యాఖ్యలు సోనియాను బాధపెట్టివుంటే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. మంత్రి క్షమాపణలతో వివాదం సద్దుమణిగింది. లోక్ సభ మలిదశ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గిరిరాజ్ వ్యాఖ్యలపై సభలో దుమారం రేగింది. ఈ ఘటనపై ప్రధానమంత్రి మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దాంతో సభలో గందరగోళం నెలకొంది. అనంతరం గిరిరాజ్ సింగ్ తన వ్యాఖ్యలపై సభాముఖంగా క్షమాపణ తెలిపారు. కాగా 'సోనియా తెలుపు రంగులో లేనట్లయితే, రాజీవ్ గాంధీ ఓ నైజీరియా మహిళను పెళ్లాడి ఉన్నట్లయితే, ఆమె తెలుపు రంగు మహిళ కానట్లయితే కాంగ్రెస్ ఆమె నాయకత్వాన్ని అంగీకరించేదా?' అని గిరిరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.