క్షమాపణలు చెప్పిన గిరిరాజ్ సింగ్ | union minister Giriraj singh regrets over his remarks against sonia gandhi | Sakshi
Sakshi News home page

క్షమాపణలు చెప్పిన గిరిరాజ్ సింగ్

Published Mon, Apr 20 2015 12:22 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

క్షమాపణలు చెప్పిన గిరిరాజ్ సింగ్ - Sakshi

క్షమాపణలు చెప్పిన గిరిరాజ్ సింగ్

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఎట్టకేలకు దిగి వచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆయన సోమవారం లోక్ సభలో క్షమాపణ చెప్పారు. సోనియా గాంధీని కించపరిచే ఉద్దేశం లేదని, తన వ్యాఖ్యలు  సోనియాను బాధపెట్టివుంటే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. మంత్రి క్షమాపణలతో వివాదం సద్దుమణిగింది.

లోక్ సభ మలిదశ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గిరిరాజ్ వ్యాఖ్యలపై సభలో దుమారం రేగింది. ఈ ఘటనపై ప్రధానమంత్రి మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దాంతో సభలో గందరగోళం నెలకొంది. అనంతరం గిరిరాజ్ సింగ్ తన వ్యాఖ్యలపై సభాముఖంగా క్షమాపణ తెలిపారు.  కాగా 'సోనియా తెలుపు రంగులో లేనట్లయితే, రాజీవ్ గాంధీ ఓ నైజీరియా మహిళను పెళ్లాడి ఉన్నట్లయితే, ఆమె తెలుపు రంగు మహిళ కానట్లయితే కాంగ్రెస్ ఆమె నాయకత్వాన్ని అంగీకరించేదా?' అని గిరిరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement