Giriraj Singh
-
‘అలా అయితే.. బంగ్లాకు పెట్టుబడిదారులు వెళ్లరు’
ఢిల్లీ: రాజకీయ సంక్షోభాలతో బంగ్లాదేశ్.. పాకిస్తాన్లా మారితే పొరుగుదేశానికి పెట్టుబడిదారులు వెళ్లకుండా దూరంగా ఉంటారని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ఆయన బుధవారం భారత్ టెక్స్-2025 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘భారతదేశానికి పెద్ద కార్మిక మార్కెట్ ఉన్నందున బంగ్లాదేశ్ లేదా వియత్నాం నుంచి భారతీయ వస్త్ర పరిశ్రమ ఎటువంటి సవాలును ఎదుర్కోవడం లేదు. బంగ్లాదేశ్ పాకిస్థాన్‌లా మారితే పెట్టుబడిదారులు అక్కడికి వెళ్లే ముందు ఆలోచిస్తారు. ప్రతి రంగాన్ని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి అనుసంధానం చేసే యోచనలో ఉన్నాం. మేము మరిన్ని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం’ అని అన్నారు. భారత్ టెక్స్-2025 కార్యక్రమాలు ఫిబ్రవరి 14 నుంచి 17 తేదీ వరకు భారత్ మైదాన్‌లో జరగనున్నాయి. ఫిబ్రవరి 12 నుంచి 15 తేదీల్లో ఇండియా ఎక్స్పో సెంటర్, మార్ట్‌లో వస్త్రాలు, హస్తకళలు, గార్మెంట్ మెషినరీ, దుస్తులకు సంబంధించిన ఎగ్జిబిషన్ జరగనుంది. -
కేంద్ర మంత్రికి నిరసన సెగ.. కాన్వాయ్ వదిలి బైక్‌పై పరార్
పట్నా: కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్‌కు సొంత నియోజకవర్గమైన బీహార్‌లోని బెగుసరాయ్‌లో నిససన సెగ తగిలింది. తీవ్ర నిరసన నేపథ్యంలో ఆయన తన కాన్వాయ్‌ను దిగి ఆ ప్రాంతం నుంచి ఒక బైక్‌పై వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. స్థానిక దాక్ బంగ్లా రోడ్లో ఆదివారం ఓ పార్క్ శంకుస్థాపనకు వచ్చిన కేంద్ర మంత్రిని ఏఎన్ఎం కార్యకర్తలు అడ్డుకొని నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి కారును చుట్టుముట్టి ఆందోళన చేశారు. దీంతో అక్కడి కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకింది.ఈక్రమంలో వారు తమ డిమాండ్లతో కూడిన ఒక వినతిపత్రాన్ని మంత్రి గిరిరాజ్ సింగ్‌కు ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆయన వారిని ఏమాత్రం పట్టించుకోకుండా వెంటనే తన కాన్వాయ్ దిగి ఓ వ్యక్తి బైక్‌పై అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించాలనుకొన్నామని, కేంద్ర మంత్రి పట్టించుకోకుండా పరారు అయ్యారని ఏఎన్ఎం కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.Giriraj Singh को Asha workers ने Begusarai में ही घेर लिया, गाड़ी छोड़ Bike से भागे...#GirirajSingh #Begusarai #AshaWorkers #Bihar #BiharNews #बिहार_न्यूज़ #बिहार #LiveCities pic.twitter.com/qUFAnSAw34— Live Cities (@Live_Cities) August 4, 2024 -
కేంద్ర మంత్రికి నిరసన సెగ! నల్లజెండాలతో ‘గో బ్యాక్’ నినాదాలు
బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు నిరసన సెగ తగిలింది. బిహార్‌లోని తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన బెగుసరాయ్‌లో పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. బచ్వాడాలో ఒక కార్యక్రమానికి వెళుతుండగా సొంత పార్టీ కార్యకర్తలే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్ల జెండాలను ప్రదర్శించారు. గిరిరాజ్ సింగ్ ఇటీవల తన బెగుసరాయ్ నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు నిరంతరం చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఆదివారం బరౌని డెయిరీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముగించుకుని బచ్వాడలో మరో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఎన్‌హెచ్-28లోని రాణి గ్రామ సమీపంలో సొంత పార్టీ కార్యకర్తలే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు నల్లజెండాలు చూపించారు. కాన్వాయ్‌ను చుట్టుముట్టిన వారు, బీజేపీ జెండాలతో పాటు నల్ల జెండాలను పట్టుకుని, ఆయన వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో గిరిరాజ్ సింగ్ కాన్వాయ్ కొద్దిసేపు నిలిచిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నల్లజెండాలు చూపుతున్న వారిని చెదరగొట్టి సాధారణ పరిస్థితులు తీసుకొచ్చారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పెప్సీ ప్లాంట్‌లో బెగుసరాయ్ వాసులెవరికీ ఉపాధి కల్పించలేదని నిరసనకారులు చెబుతున్నారు. ఆయనకు డబ్బులిచ్చినవారికి మాత్రమే ఉపాధి కల్పించారని ఆరోపించారు. అయితే తమ కార్యకర్తలు కేంద్ర మంత్రికి స్వాగతం పలికేందుకే వచ్చారని బీజేపీ చెబుతోంది. నల్ల జెండాలు ప్రదర్శించినవారు సీపీఐ మద్దతుదారులని పేర్కొంది. बीजेपी सांसद गिरिराज सिंह को उनके संसदीय क्षेत्र में बीजेपी कार्यकर्ताओं ने काले झंडे दिखाए। pic.twitter.com/j7OmTGtg9U — Lutyens Media (@LutyensMediaIN) March 10, 2024 -
అమేథీ ప్రజల్ని రాహుల్ గాంధీ నమ్మడం లేదు
బెగుసరాయ్, బీహార్: లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచే మళ్లీ పోటీ చేయనున్నారు. అయితే రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయడంపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. రాహుల్ గాంధీ అమేథీ ప్రజలను విశ్వసించడం లేదు. అమేథీ ప్రజలు ఇందిరా గాంధీకి, వారి కుటుంబాన్ని గౌరవిస్తూ వస్తున్నారు. #WATCH | Begusarai, Bihar: On the Congress' first list of candidates for Lok Sabha Polls 2024 and Rahul Gandhi's Wayanad candidature, Union Minister Giriraj Singh says, "He does not trust the people of Amethi. This place has always given respect to Indira Gandhi and her family,… pic.twitter.com/46dqwWj18l — ANI (@ANI) March 9, 2024 కానీ గత 5 సంవత్సరాలలో, వారు (కాంగ్రెస్ పార్టీ) అమేథీ ప్రజలను అగౌరవపరిచారు. కాబట్టే మైనారిటీ ప్రజలు ఎక్కువ మంది వాయనాడ్‌ను నమ్ముతున్నారు. రాహుల్ గాంధీ అక్కడి నుంచే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు. -
కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు.. త్వరలో జేడీ(యూ), ఆర్జేడీ విలీనం!
జనతాదళ్ యునైటెడ్ జేడీ(యూ), రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) పార్టీలు త్వరలో విలీనం అవుతాయని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీ(యూ)అధినేత, సీఎం నితీష్ కుమార్.. ఇండియా కూటమిలో భాగంగా సీట్ల పంపిణీపై పట్టబడుతున్నారన్న మీడియా ప్రశ్నకు కేంద్రమంత్రి ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో పలు వ్యక్తిగత సమీకరణాలు పంచుకున్నా. ఆయన కూడా చాలా విషయాలు నాకు చెప్పారు. అయితే వాటిని మీడియా ముందు ప్రజలకు వెల్లడించడం సరికాదు. కానీ, మీకు నేను ఒకటి చెప్పగలను. త్వరలో జేడీ(యూ), ఆర్జేడీ పార్టీలు విలీనం అవుతాయి. అప్పడు ఇండియా కూటమిలో సీట్ల పంపిణీకి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు ఉత్పన్నం కావు’ అని అన్నారు. అయితే గురవారం పార్లమెంట్ సమావేశాలు ముగించుకొని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఇడియా కూటమి సమావేశం అనంతరం లలూ ప్రసాద్ ఇరువురు ఒకే విమానంలో ఢిల్లీ నుంచి పట్నాకు ప్రయాణం చేశారు. ప్రస్తుతం బీహార్ డిప్యూటీ సీఎం ఉన్న తన కుమారు తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేసే సమయం ఆసన్నమైందని లాలూప్రసాద్.. తనతో చెప్పాడని కేంద్ర మంత్రి గిరిరాజ్ అన్నారు. కేంద్ర మంత్రి ‘విలీనం’ వ్యాఖ్యలపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అసాధారణమైన వ్యాఖ్యలు చేస్తారు. ఆయనకి ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలవాలని ఉంటుంది. ఆయన్ను ఎవరు గుర్తించరు కావును అసాధారణ వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకుంటారు’ అని మండిపడ్డారు. చదవండి: Alcohol Ban Exemption: గుజరాత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్ -
‘హలాల్ మాంసం’పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
బెగూసరాయ్: ‘సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో జంతు బలి ఉంది. ముస్లింలను నేను గౌరవిస్తాను. వాళ్లు వారి మత ఆచారం ప్రకారం హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే తింటారు. హిందువులు వెంటనే హలాల్ మాంసాన్ని తినడం ఆపేయాలి. హిందువులు జట్కా మాంసాన్ని మాత్రమే తినాలి’అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కోరారు. ఈ విషయమై సింగ్ సోమవారం బీహార్‌లోని బెగూసరాయ్‌లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం కుట్ర వెనుక ఉన్నదెవరో త్వరలో బయటపడుతుందని సింగ్ తెలిపారు. పార్లమెంట్లో జరిగిన దాడి రైతుల ఉద్యమం లాంటిదేనని, ఇందులో కూడా టూల్‌కిట్ గ్యాంగ్ హస్తం ఉందని ఆరోపించారు. ‘పార్లమెంట్లో దాడి ఘటనపై విచారణ జరుపుతున్నాం.దీనికి కారణమైన వాళ్లు ఎవరో త్వరలో తేలుతుంది. రైతుల ఉద్యమ సమయంలో టూల్‌కిట్ గ్యాంగ్ ఎలా బయటపడిందో అలాగే పార్లమెంట్ ఘటన వెనుక ఉన్నదెవరో త్వరలో తెలుస్తుంది’అని గిరిరాజ్ అన్నారు. ఇదీచదవండి..పార్లమెంట్ సమావేశాల అప్డేట్స్. -
లోక్‌సభలో అలజడి ఘటన: ప్రతిపక్షాలపై కేంద్ర మంత్రి ఫైర్
ఢిల్లీ: పార్లమెంట్ అలజడి ఘటనపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తప్పుబట్టారు. మహ్మద్ అలీ జిన్నా భావజాలంతో ఓవైసీ ప్రభావితమయ్యారని విమర్శించారు. జిన్నా ఆత్మ ఓవైసీలోకి చొరబడిందని వ్యగ్యాస్త్రాలు సంధించారు. అందుకే ఆయన ఓ వర్గం కోసమే పనిచేస్తారని అన్నారు. నేరస్థుల్లో కూడా మతకోణం చూడటానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. లోక్‌సభలో భద్రతా వైఫల్యం కేసుపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. ఉగ్రవాదుల మతం, కులం, విశ్వాసాలతో పట్టింపులేదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మతపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే ఉగ్రవాదులను ఉగ్రవాదులుగానే గుర్తించామని తెలిపారు. పార్లమెంట్లో అలజడి కేసులో నిందితులు ముస్లింలు అయితే పరిస్థితి ఏంటని ప్రతిపక్షాలు అడగడంపై ఆయన ఆక్షేపించారు. ఉగ్రవాద అంశంలో ప్రతిపక్షాలు మత కోణాన్ని చూస్తున్నారు.. ఈ అంశంపై హోమంత్రి అమిత్ షా స్పందించాలని పట్టుబడుతున్నారు.. ఇలాంటి విషయాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పారిపోయేవారు కాదు అని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. దృఢ సంకల్పంతో ప్రతిస్పందించే వ్యక్తి అని తెలిపారు. పార్లమెంటు చొరబాటుదారులు ముస్లింలైతే పరిస్థితి మరోలా ఉండేదని జేడీయూ, ఏఐఎంఐఎం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఇదీ చదవండి: అరాచకం సృష్టించడానికి కుట్ర.. వెలుగులోకి కీలక విషయాలు -
‘దిగజారుడు వ్యాఖ్యలంటూ.. టీఎంసీ కౌంటర్’
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై తృణమూళ్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై చేసిన వ్యాఖ్యలకు టీఎంసీ గట్టి కౌంటర్ ఇచ్చింది. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై స్పందించిన టీఎంసీ.. ‘తమ అధికారానికి సవాలు విసురుతున్న మహిళను బీజేపీ ఓర్చుకోలేకపోతుందని తెలిపడానికి ఇలాంటి వ్యాఖ్యలే నిదర్శం. లింగ పక్షవాతంతో కూడిన పాతకాలపు మనస్తత్వాన్ని బీజేపీ బహిరంగంగా వ్యక్త పరుస్తోంది’ అని ‘ఎక్స్’లో విరుచుకుపడింది. After PM @narendramodi's "didi o didi" catcall, Union Minister @girirajsinghbjp now joins the list of @BJP4India leaders who made degrading comments about Smt. @MamataOfficial. It's evident that the BJP leaders find it incredibly hard to fathom a woman in power challenging their… pic.twitter.com/ZCM8GehdIC — All India Trinamool Congress (@AITCofficial) December 6, 2023 కాగా, 29వ విడత కోల్‌కత్ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న సీఎం మమతా.. బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, మహేష్ భట్ల కోరిక మేరకు వేదికపై కాలు కదిపారు. దీనిపై బీజేపీ కేంద్రమంత్రి గిరిరాజ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘మమతా డాన్స్ చేస్తూ.. వేడుక చేసుకుంటోంది. ఫిల్మ్ ఫెస్టివల్లో డాన్స్ చేయాల్సిన అవసరం ఏముంది’ అని విమర్శించారు. దీంతో ఆయన మాటాలు.. దిగజారుడు తనానికి ప్రతీక అని టీఎంసీ మండిపడింది. ఇదికూడా చదవండి: వారి తర్వాత.. కాంగ్రెస్‌లో బీసీ సీఎం లేరు: నిశికాంత్ దుబే -
'ప్రతిపక్షాల భేటీ ఓ ఫొటో సెషన్..' కేంద్ర మంత్రి వ్యంగ్యాస్త్రాలు..
ఢిల్లీ: ప్రతిపక్షాల భేటీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యంగ్యాస్త్రాలు సందించారు. ఈ సమావేశం కేవలం ఒక ఫొటో సెషన్ మాత్రమేనని అన్నారు. చాయ్ పార్టీ జరుపుకోవడానికి ప్రతిపక్ష నాయకులు ఒక చోట కూడారని చెప్పారు. ఈ సమావేశంతో ప్రతిపక్ష నాయకులు చేయగలిగేది ఏం ఉండదని జోస్యం చెప్పారు. గడ్డం కత్తిరించి, పెళ్లి చేసుకోవాలని లాలూ ప్రసాద్ యాదవ్.. రాహుల్ గాంధీకి సమావేశంలో సలహా ఇవ్వడాన్ని ఆయన గుర్తు చేశారు. VIDEO | "This was actually a photo session. The first photo session was conducted by (Telangana CM) KCR in Bihar with Nitish Kumar a few months ago," says Union Minister Giriraj Singh on Patna opposition meeting.#OppositionMeeting pic.twitter.com/CPunJ1a50m — Press Trust of India (@PTI_News) June 24, 2023 'ఇది కేవలం ఓ ఫొటో సెషన్ మాత్రమే. నితీష్ కుమార్‌తో కొన్ని నెలల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఇది జరిగింది. చిన్న చిన్న గుంపులు కలిసి ప్రధాని పదవిపై కలలు కంటున్నాయి. వీటితో ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు.' అని గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రతిపక్షాల భేటీ.. పట్నా వేదికగా బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో 15 ప్రతిపక్ష పార్టీల నాయకులు నేడు సమావేశమయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి బీజేపీని ఓడించి అధికారాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో ఈ భేటీ జరిగింది. దేశంలో ప్రముఖ పార్టీ నాయకులైన రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, ఒమర్ అబ్ధుల్లా, హేమంత్ సొరేన్ తదితరులు పాల్గొన్నారు. అయితే.. ఇందులో ఎలాంటి ఏకాభిప్రాయానికి నాయకులు రాలేదు. మరో సమావేశాన్ని సిమ్లాలో వచ్చే నెలలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: 'భారత్‌లో చాలా మంది హుస్సేన్ ఒబామాలు ఉన్నారు'.. అసోం సీఎం వ్యాఖ్యలపై రాజకీయ రగడ.. -
గర్వంగా ఉంది.. లాలూ కూతురిపై బీజేపీ ప్రశంసలు
ఢిల్లీ: మానవ సంబంధాల కంటే డబ్బుకి, సంఘంలో పేరుప్రతిష్టలు, పరపతికే ప్రాధాన్యం పెరిగిపోతోంది. ఈ క్రమంలో.. అయినవాళ్లను కూడా దూరంగా పెడుతున్నారు కొంతమంది. అయితే.. కన్నవాళ్ల కోసం, వాళ్ల ఆరోగ్యం కోసం తాపత్రయ పడే పిల్లలకు సమాజంలోని తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. అలా.. రాజకీయ దిగ్గజం లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్యపై ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. బీజేపీ ఫైర్‌బ్రాండ్, బీహార్ నేత గిరిరాజ్ సింగ్.. లాలూ యాదవ్‌పై మామూలుగా విరుచుకుపడరు. అలాంటి వ్యక్తి.. లాలూ కూతురిపై ఆశ్చర్యకరంగా ప్రశంసలు గుప్పించారు. ‘‘రోహిణి ఆచార్య.. కూతురు అంటే నీలా ఉండాలి. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. తర్వాతి తరాలకు నువ్వు(రోహిణిని ఉద్దేశిస్తూ..) ఒక ఆదర్శప్రాయంగా నిలిచావు అంటూ పోస్ట్ చేశారు. మరో బీజేపీ నేత నిషికాంత్ దుబే సైతం రోహిణిపై పొగడ్తలు గుప్పించారు. నాకు కూతురు లేదు. కానీ, ఇవాళ రోహిణిని చూశాక.. దేవుడితో పోరాడైన సరే నాకు ఓ కూతురిని ఇవ్వమని కోరాలని ఉంది అంటూ ట్వీట్ చేశారాయన. “बेटी हो तो रोहणी आचार्य जैसी” गर्व है आप पर… आप उदाहरण होंगी आने वाले पीढ़ियों के लिए । pic.twitter.com/jzg3CTSmht — Shandilya Giriraj Singh (@girirajsinghbjp) December 5, 2022 मुझे भगवान ने बेटी नहीं दी,आज रोहिणी आचार्य को देखकर सचमुच भगवान से लड़ने का दिल कर रहा है है,मेरी नानी हमेशा कहती थी,बेटा से बेटी भली जो कुलवंती हो pic.twitter.com/j0WSMfckjL — Dr Nishikant Dubey (@nishikant_dubey) December 5, 2022 ఇదిలా ఉంటే.. లాలూ పెద్ద కూతురు మీసా భారతి, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సైతం గత సాయంత్రం లాలూ సర్జరీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 70 ఏళ్ల వయసున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో 40లో ఉన్న రోహిణి ఆచార్య.. తన కిడ్నీని తండ్రికి దానం ఇచ్చింది. సింగపూర్‌లో సోమవారం కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతమైంది. Ready to rock and roll ✌️ Wish me a good luck 🤞 pic.twitter.com/R5AOmFMW0E — Rohini Acharya (@RohiniAcharya2) December 5, 2022 -
అత్యాచారం జరిగితే.. అది మీ సీఎం చేసినట్టా? బీజేపీపై తేజస్వీ ఫైర్
పాట్నా: బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ బీజేపీపై నిప్పులు చెరిగారు. ఇటీవల బెగూసరాయ్‌లో జరిగిన కాల్పుల ఘటనకు సీఎం నితీశ్ కుమారే బాధ్యత వహించాలని బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా సీఎంనే నిదించడం సరికాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రోజూ ఎన్నో నేరాలు జరుగుతున్నాయని వాటికి బాధ్యత ఆయా సీఎంలదేనా? అని తేజస్వీ ప్రశ్నించారు. ఒకవేళ అక్కడ రేప్ జరిగితే అది వాళ్ల సీఎం చేసినట్లా? అని అడిగారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర్‌ప్రేదశ్‌లో ప్రతి రోజు నేరాలు జరుగుతూనే ఉన్నాయని, రామరాజ్యమంటే అదేనా అని తేజస్వీ ధ్వజమెత్తారు. 'బెగూసరాయ్ కాల్పుల ఘటనకు కొత్త కోణం ఇవ్వాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. బీహార్‌లో ఉంది ప్రజా ప్రభుత్వం. బీజేపీ అంటేనే అతిపెద్ద అబద్దాల పార్టీ. వారు ఎప్పుడూ చెప్పింది చేయరు. ప్రజలను విభజించి సమాజంలో విషం నింపాలని చూస్తారు' అని తేజస్వీ తీవ్ర విమర్శలు చేశారు. బెగూసరాయ్‌లో మంగళవారం కాల్పుల ఘటన జరిగింది. ఇద్దరు నిందుతులు బైక్‌పై ప్రయాణించి పలు చోట్లు అరగంటపాటు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. దీనిపై స్పందిస్తూ బీజేపీ నేత గిరిరాజ్ సింగ్.. నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బిహార్‌లో మహాఘట్బంధన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన ప్రతిసారి ఆటవిక రాజ్యమే వస్తుందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపైనే స్పందిస్తూ తేజస్వీ బీజేపీపై మండిపడ్డారు. చదవండి: ఆటోలో ప్రయాణించి కేజ్రీవాల్ హల్చల్.. ఊహించని గిప్ట్ ఇచ్చిన బీజేపీ -
కేంద్ర నిధులతో కేసీఆర్ ప్రచారం: గిరిరాజ్‌సింగ్
గచ్చిబౌలి: కేంద్రం నిధులతోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి సీఎం కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖమంత్రి గిరిరాజ్‌సింగ్ విమర్శించారు. శనివారం గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో బిహర్, జార్ఖండ్ రాష్ట్రాల సమ్మేళనంలో భాగంగా ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, డాక్టర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే గ్రామ పంచాయతీల్లో శ్మశానవాటికల అభివృద్ధి, మొక్కలు నాటారని తెలిపారు. నిధులు ఇచ్చిన విషయం నిజం కాదా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిలో బిహార్, జార్ఖండ్‌తో పాటు ఉత్తర భారతీయుల పాత్ర ఉందన్నారు. ఐటీ హబ్‌లైన బెంగళూరు, హైదరాబాద్‌లో అనేక మంది ఉత్తరాది ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు. బడ్జెట్‌తో పాటు ఆదాయ వనరులను పెంచడంలో కేంద్ర ప్రభుత్వం సఫలీకృతమైందన్నారు. కార్యక్రమంలో ఎంపీలు గోపాల్ జీ ఠాకూర్, మనోజ్ తివారీ, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇన్చార్జి యోగానంద్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ నిరుపేదల పక్కాఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక
ఏజీవర్సిటీ: గ్రామీణ ప్రాంత నిరుపేదలకు తక్కువ ఖర్చుతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద నాణ్యమైన పక్కాఇళ్లు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. గురువారం హైదరాబాద్ రాజేంద్రనగర్ ఎన్ఐఆర్డీపీఆర్లోని రూరల్ టెక్నాలజీ పార్క్‌లో నిర్మించిన మోడల్‌హౌస్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం రూరల్ పార్క్ వద్ద ఉన్న కంప్రెస్డ్ మడ్ బ్లాక్ ప్రొడక్షన్ యూనిట్‌ని సందర్శించి ఉత్పత్తి చేసే ప్రక్రియ, నాణ్యత గురించి ఆరా తీశారు. మంత్రి సమక్షంలో ఎన్ఐఆర్డీపీఆర్, నేషనల్ స్మాల్ ఇండ్లస్ట్రీస్ కార్పొరేషన్ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌ను కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధి హామీ పథకం (నరేగా) కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పని దినాలను 26 కోట్లకు పెంచాలని వైఎస్సార్సీపీ ఎంపీలు బుధవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, పార్టీ లోక్‌సభా పక్ష నాయకుడు పి.వి. మిధున్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ ఎంపీల బృందం మంత్రితో భేటీ అయింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో పెండింగ్‌లో ఉన్న పలు అంశాల పరిష్కారం కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించింది. అపరిష్కృతంగా ఉన్న అంశాలను విజయసాయిరెడ్డి మంత్రికి స్వయంగా వివరించారు. చదవండి: AP: కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై స్పందించిన మంత్రి బొత్స బడ్జెట్లో గణనీయంగా తగ్గిన ఉపాధి నిధులు ఉపాధి హామీ పథకం కోసం బడ్జెట్ కేటాయింపులను క్రమేపీ తగ్గించడం పట్ల శ్రీ విజయసాయి రెడ్డి తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. 2020-21 బడ్జెట్లో 1 లక్షా 10 వేల కోట్ల రూపాయలు ఉపాధి హామీ పనులకు కేటాయిస్తే 2021-22 బడ్జెట్లో అది 98 వేల కోట్లకు కుదించారు. 2022-23 బడ్జెట్లో ఉపాధి నిధులు 73 వేల కోట్ల రూపాయలకు కుదించారు. ఈ మొత్తంలో పెండింగ్ బకాయిలు 18,350 కోట్ల రూపాయలు తీసేసే మిగిలింది కేవలం 54,650 కోట్ల రూపాయలే...అంటే 2021-22 బడ్జెట్‌తో పోల్చుకుంటే నరేగాకు నిధుల కేటాయింపు 50 శాతానికి కంటే తగ్గిపోవడం శోచనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు 2021-22లో 23.68 కోట్ల పని దినాలు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం 24 కోట్ల పని దినాలను కల్పించినట్లు విజయసాయి రెడ్డి చెప్పారు. 26 కోట్ల పనిదినాలు అడిగితే 14 కోట్లే ఇచ్చారు.. ఉపాధి హామీ పని దినాల కేటాయింపుపై గత ఫిబ్రవరిలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమీక్షలో 26 కోట్ల పనిదినాలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే ప్రభుత్వం కేవలం 14 కోట్ల పని దినాలే కేటాయించారని విజయసాయి రెడ్డి తెలిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే 9.68 కోట్ల పని దినాలు తగ్గిపోయాయని అన్నారు. ఇది గ్రామీణ ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సుమారు ఒక కోటి మంది పేదలకు నష్టం జరుగుతుందని చెప్పారు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌కు 26 కోట్ల పని దినాలు కేటాయించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. 2,828 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల చేయండి.. ఉపాధి హామీ పథకం కింద 2021-22 ఆర్థిక సంవత్సరంలో మెటీరియల్ కాస్ట్, అడ్మిన్ కాస్ట్ కింద రెండో విడత విడుదల చేయవలసిన 2,888.64 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేసి రాష్ట్రంలో ఈ పథకం నిరాటంకంగా అమలు చేయడానికి సహకరించాలని కోరారు. కాఫీ తోటల పనులను నరేగా కింద చేర్చండి... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2009 -10 నుంచి గిరిజన ప్రాంతాల్లో కాఫీ తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. విశాఖపట్నం జిల్లాలోని తూర్పు కనుమల్లో కాఫీ తోటల పెంపకం వలన అక్కడి గిరిజన కుటంబాల జీవన స్థితిగతులు మెరుగుపడుతున్నాయి. కాఫీ తోటల పెంపకంలో భాగంగా నరేగా కింద వేతనానికి సంబంధించిన గుంతల తవ్వకం, మొక్కలు నాటడం వంటి పనులు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో మెటీరియల్ కాంపోనెంట్ ఖర్చులను ఐటీడీఏ, కాఫీ బోర్డు భరిస్తున్నాయి. అయితే నరేగా పనులు కాఫీ తోటల పెంపకంలో నిమగ్నమయ్యే రైతులకు వర్తించవంటూ 2020లో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. కాఫీ రైతులకు వేతనాల చెల్లింపును ఉపసంహరించడం వలన అరకు కాఫీ సాగు కష్టసాధ్యంగా మారింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమైన అరకు కాఫీ బ్రాండ్ ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. కాఫీని ప్రభుత్వం వాణిజ్య పంటగా మాత్రమే గుర్తించి నరేగా కింద దానిని పరిగణించడానికి నిరాకరిస్తోంది. కాఫీ తోటలు విరివిగా ఉండే కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కాఫీ సాగు వాణిజ్య పంటగా ఎస్టేట్లలో సాగవుతుంది. కానీ గిరిజన ప్రాంతమైన పాడేరు వంటి ప్రాంతాల్లో కాఫీ సాగు కేవలం గిరిజనుల జీవనోపాధిగా మాత్రమే సాగవుతున్నందున దీనిని ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ గిరిజన ప్రాంతాల్లో కాఫీ తోటల పనులను నరేగా కింద పరిగణించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరువు పీడిత ప్రాంతాల్లో ఉద్యాన సాగును అనుమతించాలి కరవు పీడిత ప్రాంతమైన రాయలసీమ జిల్లాల్లో అధిక శాతం రైతులను వారికున్న భూముల విస్తీర్ణాన్ని బట్టి పెద్ద రైతులుగా వర్గీకరించడం జరిగింది. వాస్తవానికి నిరంతర కరవు పరిస్థితులు, నీటి కొరత ఎద్దడి కారణంగా ఆర్థికంగా వెనుకబడిన వారే. సాగు నీరు కొరత, కరువు కారణంగా వారి వ్యవసాయ భూములు నిస్సారంగా మారిపోయాయి. అందువలన కరువు పీడిత ప్రాంతాల్లో భూమి విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా 5 ఎకరాలు సాగుకు వీలైన భూమి కలిగి ఉన్న రైతులు నరేగా కింద ఉద్యాన పంటలు సాగు చేసుకోడానికి అనుమతించాలని కోరుతున్నామని చెప్పారు. శ్మశానవాటికల్లో ప్రహరీ నిర్మాణాన్ని నరేగా కింద చేర్చాలి... గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైన విపరీతమైన నిర్లక్ష్యానికి గురవుతున్న వాటిలో శ్మశానవాటికలు. శ్మశానాలే అయినప్పటికీ ఈ ప్రదేశాలు ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంటాయి. పశువులు, పందులు ఇతర జంతువులు యధేచ్ఛగా శ్మశానాల్లో సంచరిస్తున్నందు వలన అవి ఆ ప్రాంతాన్ని అపరిశుభ్రంగా, అపవిత్రంగా మారుస్తుంటాయి. శ్మశానాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలంటే ఆయా జంతువుల ప్రవేశాన్ని అరికట్టాలి. అందుకోసం వాటి చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించాల్సిన తక్షణ అవసరం ఉంది. ప్రహరీ గోడల నిర్మాణం వలన శ్మశాన భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షించవచ్చు. కాబట్టి శ్మశానాల్లో ప్రహరీ గోడ నిర్మాణాన్ని నరేగా కింద అనుమతించాలని కోరారు. పీఎంఏవై(జీ) కింద 90 రోజులు పని దినాలు కల్పించాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానున్న మూడేళ్ళలో 30 లక్షల ఇళ్ళు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన మంత్రి అవాస్ యోజన (గ్రామీణ) కింద లబ్ధిదారులు తమ ఇళ్ళ నిర్మాణంలో భాగంగా 90 రోజుల పనిదినాలు పొందడానికి అర్హులు. నరేగా కింద పొందే 100 రోజుల పని హామీకి అదనంగా లబ్ధిదారులకు 90 రోజులు పని దినాలను కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు. పీఎంఏవై (జీ) కింద కేంద్ర సాయం పెంచాలి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఒక్కో ఇంటికి కేంద్ర ఇచ్చే ఆర్థిక సహాయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ద్రవ్యోల్బణం, ముడి సరుకుల ధరలు, రవాణా, లేబర్ ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో నిరుపేద లభ్దిదారులు ఇళ్ళు కట్టుకోవడం సవాలుగా మారింది. అందరికీ ఇళ్ళు అనేది నెరవేరని కలగా మారే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇంటికి ఇంతని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని పెరిగిన ధరలకు అనుగుణంగా సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు డ్రిప్, స్ప్రింక్లర్లు కేటాయించాలి. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు తరచుగా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటూ కరువు బారిన పడుతుంటాయి. ఈ కారణంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సాగునీటి సౌకర్యాలు లేక వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కాబట్టి ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద ఈ రెండు ప్రాంతాలకు చెందిన ఏడు జిల్లాలకు డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్స్‌ను కేటాయించి ఆయా జిల్లాల్లో సాగు నీటిని సమర్ధవంతంగా వినియోగించేందుకు సహకరించవలసిందిగా మంత్రిని కోరారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ను కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీల బృందంలో మార్గాని భరత్, పిల్లి సుభాష్ చంద్ర బోస్, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, బెల్లాన చంద్ర శేఖర్, తలారి రంగయ్య, ఆదాల ప్రభాకర రెడ్డి, లావు కృష్ణదేవరాయలు, ఎన్.రెడ్డప్ప, గోరంట్ల మాధవ్, వైఎస్ అవినాష్ రెడ్డి, మద్దెల గురుమూర్తి, గొడ్డేటి మాధవి, బి.సత్యవతి, వంగా గీత, చింతా అనురాధ ఉన్నారు. -
T20 WC 2021: భారత్-పాక్ మ్యాచ్‌పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Union Minister Giriraj Singh Sensational Comments Over IND Vs PAK T20 WC Match: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య ఈ నెల 24న జరగనున్న హై ఓల్టేజ్ పోరు నేపథ్యంలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా భారత్-పాక్ మ్యాచ్‌ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో దాయాదుల పోరు జరగడం వల్ల ఉద్రిక్తతలు మరింత పెరిగే ఆస్కారముందని అభిప్రాయపడ్డాడు. కాగా, దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఆదివారం సాయంత్రం ముష్కరులు కాల్పులకు తెగబడి ఇద్దరిని పొట్టనబెట్టుకున్నారు. ఈ నెలలో ఇప్పటి దాకా ఉగ్రదాడులకు 11 మంది బలయ్యారు. ఈ నేపథ్యంలోనే పాక్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. చదవండి: శ్రీలంక క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ మృతి.. -
శభాష్ గాడ్గే మీనాక్షి.. ముఖరా(కె) పచ్చదనం భేష్..
ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె) గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటి ఎకో ఫ్రెండ్లీగా తీర్చిదిద్దిన తీరు అభినందనీయమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ శనివారం ట్వీట్ చేశారు. ఇందుకు కృషి చేసిన సర్పంచ్ గాడ్గే మీనాక్షిని అభినందించారు. అడవులు అంతరించిపోతున్న ఈ సమయంలో హరితహారం ద్వారా ఒకటిన్నర ఎకరంలో ఒకేచోట పెద్ద మొత్తంలో మొక్కలు నాటి సంరక్షించడం బాగుందన్నారు. గ్రామాల్లో మొక్కలునాటి పచ్చదనాన్ని పెంపొందించడానికి దేశంలో ఇతర పంచాయతీలకు ముఖరా(కె) ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. -
కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌తో వైఎస్సార్సీపీ ఎంపీల భేటీ
సాక్షి, ఢిల్లీ: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావలసిన 6,750 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలు మంగళవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి.విజయసాయి రెడ్డి, పార్టీ లోక్ సభాపక్ష నాయకులు మిథున్ రెడ్డి సారథ్యంలో ఎంపీల బృందం మంత్రితో సమావేశమయ్యారు. ఉపాధి పనుల బకాయిల విడుదలతో పాటు ఈ పథకం కింద పని దినాలను 100 నుంచి 150కి పెంచాలని కోరారు. ఈ మేరకు ఎంపీలందరూ సంతకాలు చేసిన వినతి పత్రాన్ని మంత్రికి అందచేశారు. వైఎస్సార్సీపీ ఎంపీల బృందం మంత్రితో జరిపిన భేటీలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 18.4 కోట్ల పని దినాలను కల్పించి దేశంలోనే అత్యధిక పని దినాలు కల్పించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు నెలకొల్పిందని తెలిపారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే 16.7 కోట్ల పని దినాలను కల్పించి కూలీల బడ్జెట్లో 83.5 శాతం వినియోగించుకుంది. ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి అత్యధిక ఉపాధి కల్పించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిందని ఆయన చెప్పారు. 2006లో దేశంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు ప్రారంభమైన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఈ పథకం కింద ఉపాధి కల్పించింది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. కోవిడ్ మహమ్మారి సృష్టించిన విలయం నేపథ్యంలో ఉపాధి పనులకు ఏర్పడిన డిమాండ్ దృష్ట్యా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పేదలకు కనీసం ఒక కోటి పని దినాలు కల్పించాలని గత ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించిన లక్ష్యాన్ని తొమ్మిది జిల్లాల్లో విజయవంతగా చేరుకోగలిగినట్లు చెప్పారు. గ్రామీణ ఉపాధి పథకం అమలులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ పథకాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయడంలో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి చొరవ తీసుకోవలసిందిగా విజయసాయి రెడ్డి మంత్రిని కోరారు. ఆ చర్యలలో భాగంగా పెండింగ్‌లో ఉన్న 6,750 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. పని దినాలను 100 నుంచి 150కి పెంచాలి. అంగన్వాడీ కేంద్రాల నిర్మాణ ఖర్చును 20 లక్షల రూపాయలకు పెంచాలి. దీని వలన ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఉపయుక్తంగా ఉండే టాయిలెట్లు, పరిశుభ్రమైన తాగు నీరు, క్రీడా సౌకర్యాల కల్పిన కోసం ఉపాధి పథకం కింద ఇచ్చే మొత్తాన్ని 15 లక్షలకు పెంచాలి. మిగిలిన 5 లక్షల రూపాయలు ఐసీడీఎస్ వాటా కింద చెల్లించడం జరుగుతుందని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన భూముల రీసర్వే కార్యక్రమంలో భాగంగా సర్వే రాళ్ళు పాతే కూలీలకు వేతనాలను ఉపాధి పథకం కింద వినియోగించుకునేందుకు అనుమతించాలని విజయసాయి రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి పథకం కింద లేబర్ బడ్జెట్‌ను సవరించాలని కోరారు. కాఫీ తోటల పెంపకంతో గిరిజనులను ఆదుకోండి... ఉపాధి హామీ పథకం కింద గిరిజనులు కాఫీ తోటల పెంపకాన్ని చేపట్టేందుకు అనుమతించాలని విజయసాయి రెడ్డి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీని వలన ప్రధానంగా విశాఖపట్నం జిల్లా పాడేరులోని నిరుపేద గిరిజనులకు ఎంతో మేలు చేసినట్లువుతుందని అన్నారు. ఇతర రాష్ట్రాలలో రబ్బర్ తోటల పెంపకాన్ని ఉపాధి హామీ కింద చేర్చినట్లుగానే విశాఖపట్నం మన్యం ప్రాంతంలో గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు కాఫీ తోటల పెంపకాన్ని కూడా ఈ పథకం కింద చేర్చాలని కేంద్ర మంత్రికి విన్నవించారు. -
‘షాహీన్ బాగ్.. సుసైడ్ బాంబర్ల శిక్షణ కేంద్రం’
న్యూఢిల్లీ : ఢిల్లీలోని షాహీన్ బాగ్‌లో సుపైడ్ బాంబర్లను(ఆత్మాహుతి దళాలు) తయారు చేసేందుకు శిక్షణ ఇస్తున్నారని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపణలు చేశారు. ‘‘షాహిన్‌బాగ్‌లో జరిగేది కేవలం ఉద్యమం కాదు. అక్కడ సూసైడ్ బాంబర్లు శిక్షణ పొందుతున్నారు. రాజధానిలో దేశానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది’’ అని గురువారం ట్విటర్లో తెలిపారు. షాహీన్‌బాగ్ ఆత్మాహుతి దళాలను పెంపొందిస్తున్న కేంద్రంగా మారిందని ఆరోపించారు. (‘కాల్చి వేయండి’ అన్నా చర్య తీసుకోరా!?) పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్ బాగ్‌లో గత ఏడాది డిసెంబర్ 18 నుంచి ముస్లింలు తీవ్ర ఆందళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు దీనిని కీలక ప్రచార అస్త్రాలుగా వాడుకుంటున్నాయి. అధికారం కోసం బీజేపీ షాహీన్బాగ్పై మురికి రాజకీయాలు చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దుయ్యబట్టారు. మరోవైపు కాంగ్రెస్, ఆప్ మద్దతుతోనే ఆందోళనకారులు రహదారులను అడ్డగించి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారని తాము అధికారంలోకి వచ్చాక శిబిరాన్ని తొలగిస్తామని బీజేపీ నేతలు ప్రసంగాలు చేస్తున్నారు. చదవండి : షహీన్ బాగ్‌పై మరో నకిలీ వీడియో! यह शाहीन बाग़ अब सिर्फ आंदोलन नही रह गया है ..यहाँ सूइसाइड बॉम्बर का जत्था बनाया जा रहा है। देश की राजधानी में देश के खिलाफ साजिश हो रही है। pic.twitter.com/NoD98Zfwpx — Shandilya Giriraj Singh (@girirajsinghbjp) February 6, 2020 -
‘పిల్లలు బీఫ్ తినడం పెద్దల తప్పు’
సాక్షి, న్యూఢిల్లీ : విదేశాలకు వెళుతున్న భారతీయ యువత మన సంస్కృతి, సంప్రదాయాల గురించి పెద్దలు వివరించకపోవడంతో అక్కడ బీఫ్ తినడం మొదలుపెడుతున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ‘స్కూల్స్‌లో భగవద్గీతను కచ్చితంగా బోధించేలా చర్యలు చేపట్టాలి..మన పిల్లలను మిషనరీ స్కూల్స్‌కు పంపితే అక్కడ ఐఐటీ శిక్షణతో ఇంజనీర్లవుతూ విదేశాలకు వెళుతున్నారు. వారిలో చాలా మంది బీఫ్ తినడానికి అలవాటుపడుతున్నార‘ని వ్యాఖ్యానించారు. వారికి మన సంస్కృతి, సంప్రదాయాల గురించి మనం బోధించకపోవడమే ఇందుకు కారణమని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత పిల్లలు తమను సరిగ్గా చూసుకోవడం లేదని పెద్దలు వాపోతున్నారని అన్నారు. బెగుసరైలో భగవద్గీతకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొంటూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పాఠశాలల్లో భగవద్గీతను చిన్నారులకు బోధించాల్సిన అవసరం ఉందని అన్నారు. తాము చేపట్టిన సర్వేలో 100 ఇళ్లకు గాను కేవలం 15 ఇళ్లలోనే హనుమాన్ చాలీసా, భగవద్గీత, రామాయణ పుస్తకాలు ఉన్నాయని వెల్లడైందని చెబుతూ జరుగుతున్న పరిణామాలకు మనం పిల్లల్ని నిందించలేమని చెప్పుకొచ్చారు. మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకుంటేనే మన దేశం మనుగడ సాధిస్తుందని వ్యాఖ్యానించారు. -
రాహుల్‌పై కేంద్ర మంత్రి ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్‌బ్రాండ్ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ దేశాన్ని ముక్కలు చేసేందుకు పాకిస్తాన్ ముస్లింలు, రోహింగ్యాలు భారత్‌కు రావాలని కోరుకుంటూ పౌర చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. పాకిస్తాన్‌కు చెందిన గజ్వే హింద్ ఆకాంక్షలను ప్రధాని మోదీ భగ్నం చేస్తే, రాహుల్ గాంధీ గజ్వే హింద్‌కు బాసటగా నిలిచారని మండిపడ్డారు. దేశాన్ని ముక్కలు చేసేందుకు పాక్ ముస్లింలు, రోహింగ్యాలు భారత్‌కు రావాలని కోరుకుంటున్న రాహుల్ పౌర చట్టం, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తున్నాడని దుయ్యబ్టారు. కాగా విపక్షాలు దేశాన్ని చీల్చి అంతర్యుద్ధం జరగాలని కాంక్షిస్తున్నాయని గిరిరాజ్ సింగ్ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. రాహుల్, కాంగ్రెస్, ఓవైసీ వంటి వారంతా భారత్‌ను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని, దేశంలో అంతర్యుద్ధం జరగాలని ఆకాంక్షిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓవైసీ పాక్ అజెండాను అమలు చేసేందుకు పూనుకున్నారని విమర్శించారు. -
రాహుల్‌కు అంత ప్రేముంటే ఇటలీ తీసుకెళ్లొచ్చు
సాక్షి, న్యూఢిల్లీ : విదేశీ చొరబాటుదారులపై కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి అంత ప్రేమ ఉంటే వారందరినీ తన అమ్మమ్మ దేశమైన ఇటలీకి తీసుకెళ్లవచ్చని కేంద్ర పశు, మత్స్య, పాడి పరిశ్రమ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. శనివారం రాంచీలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న మంత్రి, అస్సాంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. దేశాన్ని కాంగ్రెస్ పార్టీయే మతం ఆధారంగా విభజించిందని విమర్శించారు. ఇప్పడు సీఏఏపై ద్వంద్వ విధానాలు పాటిస్తూ మరోసారి విభజించడానికి కుట్రలు పన్నుతుందని మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సీఏఏపై ఆ పార్టీ నాయకులు మాట్లాడిన వీడియోలు ఉన్నాయని, కానీ ఆ పార్టీ ఇప్పుడు ఓట్ల రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం విభజనకు గురైనప్పుడు పాకిస్తాన్లో ఉన్న మైనార్టీలు భవిష్యత్తులో పీడనకు గురైతే భారత్ వారిని సహృదయంతో ఆహ్వానించాలని ఆనాడు మహాత్మా గాంధీ చెప్పిన మాటలను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. మరోవైపు అసదుద్దీన్ ఓవైసీ వైఖరిని మంత్రి ఎండగట్టారు. అసద్ 2013లో చేసిన హిందూ ముక్త్ హిందూస్తాన్ వ్యాఖ్యలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని పేర్కొన్నారు. చదవండి : సీఏఏ: అసోం మంత్రి కీలక వ్యాఖ్యలు -
తొలి విజయం; అది అతి ప్రమాదకరం!
న్యూఢిల్లీ : బిహార్ ఉప ఎన్నికల్లో ఓటర్లు అతి ప్రమాదకరమైన తీర్పు వెలువరించారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కిషన్‌గంజ్‌లో ఎంఐఎం గెలవడం వల్ల జిన్నా భావజాలం వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. వందేమాతరాన్ని ద్వేషించే ఎంఐఎం పార్టీతో బిహార్‌లో సామాజిక సమగ్రతకు భంగం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. బిహార్ ప్రజలు ఇక తమ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఆలోచించుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా గిరిరాజ్ సింగ్ ట్వీట్‌పై స్పందించిన జేడీయూ సీనియర్ నేత, బిహార్ మంత్రి శ్యామ్ రజాక్ ఆయనకు కౌంటర్ ఇచ్చారు. ‘ ఒకవేళ గిరిరాజ్ సింగ్‌కు నిజంగా బిహార్ ప్రజలపై అంత ప్రేమే ఉంటే తక్షణమే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. కేంద్ర కేబినెట్ నుంచి వైదొలిగి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలి’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక అసదుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ తాజా ఎన్నికల్లో సత్తా చాటిన సంగతి తెలిసిందే. బిహార్‌లో బోణీ కొట్టి... కిషన్‌గంజ్(ఉప ఎన్నిక) అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుని బీజేపీకి గట్టి షాకిచ్చింది. ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ... ‘బిహార్‌లో మాకు దక్కిన తొలి విజయం ఎంతో కీలకమైంది. బీజేపీని ఓడించడమే కాదు.. కాంగ్రెస్‌ను కూడా మూడోస్థానానికే పరిమితం చేశాం. బిహార్ ఎంఐఎం అధ్యక్షుడు ఇమాన్ నాయకత్వం ఇలాగే కొనసాగాలి. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఎంఐఎం కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చి.. ఔరంగాబాద్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. बिहार के उपचुनाव में सबसे ख़तरनाक परिणाम किशनगंज से उभर के आया है ..ओवैसी की पार्टी AIMIM जिन्ना की सोच वाले है ,यें वंदे मातरम से नफरत करते है ,इनसे बिहार की सामाजिक समरसता को खतरा हैं। बिहार वासियों को अपने भविष्य के बारे में सोचना चाहिए। — Shandilya Giriraj Singh (@girirajsinghbjp) October 25, 2019 -
‘నా రాజకీయ జీవితం ముగియబోతోంది’
పట్నా : తాను పదవుల కోసం రాజకీయాల్లో ప్రవేశించలేదని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. కశ్మీర్‌ను భారత్‌లో పూర్తిగా విలీనం చేయాలనే కలతోనే ఈ రంగంలో అడుగుపెట్టానని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో తన కల పరిపూర్ణమైందని ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. మంగళవారం గిరిరాజ్ విలేకరులతో మాట్లాడుతూ..‘నరేంద్ర మోదీ లాంటి ప్రధాని ఉండటం నిజంగా మన అదృష్టం. కశ్మీర్ విషయంలో ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ పదవీ కాలం పూర్తి చేసుకునే లోపు అంటే 2024 నాటికి నా రాజకీయ జీవితం ముగిసే అవకాశం ఉంది. అయినా ఎమ్మెల్యేగానో.. ఎంపీగానో పదవులు చేపట్టేందుకు నేను రాజకీయాల్లోకి రాలేదు. కశ్మీర్ పూర్తిగా భారత్‌లో విలీనమవడం నా కల. మా పార్టీ సిద్ధాంతకర్త శ్యామ ప్రసాద్ ముఖర్జీ దేనికోసమే ప్రాణ త్యాగం చేశారో.. ఆర్టికల్ 370 రద్దుతో దానికి ప్రతిఫలం దక్కింది అని పేర్కొన్నారు. (చదవండి : ఆర్టికల్ 370 రద్దు; ఆయన కల నెరవేరింది!) ఇక 2020లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బరిలో దిగే అవకాశం ఉందా అన్న విలేకరుల ప్రశ్నకు బదులుగా..2024 నాటికి తాను రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలనే ఉద్దేశంతో ఉన్నానని గిరిరాజ్ సమాధానమిచ్చారు. కాగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే గిరిరాజ్ లోక్‌సభ ఎన్నికల్లో బెగుసరాయ్ నుంచి పోటీ చేశారు. సీపీఐ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై దాదాపు 4 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ క్రమంలో మోదీ 2.0 కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఇక గతంలో బీజేపీ నేతలు ఇఫ్తార్ విందులకు హాజరైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన గిరిరాజ్..‘నవరాత్రి రోజుల్లో ఫలాహారం ఏర్పాటు చేసి ఇలాంటి ఫొటోలు తీసుకుంటే అవి ఎంత అందంగా ఉండేవో!. మనం మన మతానికి సంబంధించిన కర్మ, ధర్మాలను ఆచరించడంలో నిరాసక్తంగా ఉంటాం కానీ వేరే మతంపై ప్రేమను నటించడంలో ముందుంటాం’ అంటూ ట్వీట్ చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. అదే విధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా...మోదీని వ్యతిరేకించేవారు పాకిస్తాన్‌కు వెళ్లిపోవచ్చని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
పశుసంవర్థక కార్యక్రమాలు భేష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో అమలుచేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశంసించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన శనివారం సమీక్ష జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి తలసాని కేంద్ర మంత్రికి వివరించారు. గొర్రెల పంపిణీ ఎంతో గొప్ప కార్యక్రమమని, జీవాల ఆరోగ్య పరిరక్షణకు తీసుకున్న చర్యలు బాగున్నాయని గిరిరాజ్ కితాబిచ్చారు. సమావేశంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, పశుసం వర్థక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సువర్ణ, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వాటి కోసం చెన్నై వెళ్లాల్సిన అవసరం లేదు
సాక్షి, విజయనగరం : కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో చేతల ప్రభుత్వం ఉందని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన భోగాపురం మండలంలోని రొయ్య పిల్లల ఉత్పత్తి పరిశ్రమ వైశాఖీ బయో రిసోర్సెస్‌ను సందర్శించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మత్స్య పరిశ్రమ ద్వారా ప్రస్తుతం 47 వేల కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయనీ, దీనిని లక్ష కోట్లకు పెంచేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. అందుకోసం 25 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించామన్నారు. మత్స్య పరిశ్రమలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందంటూ, ఈ ఉత్పత్తుల్లో రసాయనాల వాడకం తగ్గించాలని సూచించారు. రాష్ట్రంలో సగటు రొయ్యల ఉత్పత్తి హెక్టారుకు మూడు టన్నులు కాగా, దీనిని 9 టన్నులకు పెంచాలని నిర్దేశించారు. రొయ్యలకు సర్టిఫికేషన్ కోసం చెన్నై వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఆ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలనే దృష్టితోనే వ్యవసాయ శాఖ నుంచి విడదీసి పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమలను వేరే శాఖగా ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి బాలాజీ, మత్స్య శాఖ కమిషనర్ రాం శంకర్ నాయక్ పాల్గొన్నారు. -
సీఎం జగన్‌తో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ భేటీ
సాక్షి, అమరావతి : ‘ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనకి దారి చూపిస్తుంద’ని కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. గురువారం గుంటూరు, కృష్ణా జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నంతకాలం ధర్మం కాపాడబడుతుందని, రక్షించబడుతుందని పేర్కొన్నారు. నేటి జిల్లాల పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి మంగళగిరి మండలం ఆత్మకూరులో పర్యటిస్తారు. నీలగిరి ఫౌండేషన్ వర్మీ కాంపోస్ట్ యూనిట్‌ను సందర్శిస్తారు. పసుపు, మిరప ఆర్గానిక్ పంట రైతులతో ఆయన ముచ్చటిస్తారు. అనంతరం పెనమలూరులో పర్యటిస్తారు. సీఎం జగన్‌తో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ భేటీ తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ భేటీ అయ్యారు. గురువారం సీఎం వైఎస్ జగన్ నివాసానికి వెళ్లిన గిరిరాజ్ సింగ్ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. -
‘ఆ నేతల అసలు రంగు ఇదే’
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. జమ్మూ కశ్మీర్లో ముస్లింలు అధికంగా ఉన్నందునే బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న చిదంబరం వ్యాఖ్యలపై కాషాయ పార్టీ విరుచుకుపడింది. ఆర్టికల్ 370 రద్దుపై చిదంబరం వ్యాఖ్యలతో అలాంటి నేతల అసలు రంగు బయటపడిందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ దుయ్యబట్టారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట మసకబారడంతో వారిని ఆకర్షించేందుకు ఆ పార్టీ తంటాలు పడుతోందని ఎద్దేవా చేశారు. దేశంలో వంద కోట్ల పైబడిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370, ఆయుష్మాన్ భారత్‌లపై చిదంబరం, గులాం నబీ ఆజాద్‌ల వంటి నేతల అసలు రంగు బయటపడుతోందని మండిపడ్డారు. మరోవైపు ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ నేతల తీరును కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ తప్పుపట్టారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆక్షేపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రజలు స్వాగతిస్తుంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి బాసటగా పాక్ ఉగ్రసంస్ధల ప్రతినిధిలా కాంగ్రెస్ మాట్లాడుతూ దేశాన్ని విభజించాలని ప్రయత్నించే శక్తులకు మద్దతు ఇస్తోందని విమర్శించారు. -
మమతను కీమ్ జోంగ్ ఉన్‌తో పోల్చుతూ..
కోల్కత్తా: బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ విమర్శల వర్షం కురిపించారు. ఉత్తర కొరియా నియంత పాలకుడు కీమ్ జోంగ్ ఉన్‌తో పోల్చుతూ.. వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రిగా పదవీ బాధ్యతలు స్వికరించిన అనంతరం తొలిసారి బిహార్ పర్యటనకు వచ్చిన గిరిరాజ్‌సింగ్.. అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘‘మమతా బెనర్జీ చాలా ప్రమాదకరమైన నాయకురాలు. ఉత్తర కొరియా నియంత ఉన్‌లా ప్రత్యర్థి నేతలను హతమార్చుతున్నారు. ఆమె రాజకీయ భవిష్యత్తు ఇక ముగిసినట్లు. అందుకే హింసాత్మక ఘటనల ద్వారా భయాందోళనలు సృష్టిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సహకరించకుండా.. సమఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు’’అని విమర్శించారు. కాగా ప్రధాని మోదీ అధ్యక్షతన ఈనెల 15వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరాకరించిన విషయం తెలిసిందే. తమ రాష్ట్ర అవసరాలకు మద్దతుగా నిలిచే ఆర్థిక అధికారాలు లేని నీతి ఆయోగ్ వృథా అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ప్రధానికి లేఖ రాశారు. ‘రాష్ట్రాల ప్రణాళికలకు ఆర్థికంగా తోడ్పాటునందించే అధికారం లేని నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లడం దండగని, ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం ఇవ్వరని లేఖలో పేర్కొన్నారు. కాగా సార్వత్రిక ఎన్నికల సమరంతో బీజేపీ నేతలకు, మమత సర్కారుకు పెద్ద పెత్తున విభేదాలు ఏర్పడిన విషయం తెలిసిందే. -
‘ఏ మతానికి చెందని వారే అలా మాట్లాడతారు’
పట్నా : ఇఫ్తార్ విందును ఉద్దేశిస్తూ.. కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గిరిరాజ్ వ్యాఖ్యల పట్ల సొంత పార్టీ నేతలే కాక.. జేడీయూ నాయకులు కూడా మండి పడుతున్నారు. ఈ క్రమంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ.. ‘మీడియాలో కనిపించడం కోసమే గిరిరాజ్ సింగ్ లాంటి వారు ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తారు. ఇలాంటి వారి మాటలకు నేను పెద్దగా ప్రాధాన్యం ఇవ్వను. ప్రతి మతం ప్రేమ, గౌరవాలను బోధిస్తున్నాయి. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి ప్రత్యేకంగా ఓ మతమంటూ ఉండ’దన్నారు నితీష్. బిహార్‌లో సీఎం నితీశ్ కుమార్, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ సహా మొత్తం నలుగురు ఎన్డీయే నేతలు ఇఫ్తార్ విందులకు హాజరైన ఫొటోలను గిరిరాజ్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ‘నవరాత్రి రోజుల్లో ఫలాహారం ఏర్పాటు చేసి ఇలాంటి ఫొటోలు తీసుకుంటే అవి ఎంత అందంగా ఉండేవో!. మనం మన మతానికి సంబంధించిన కర్మ, ధర్మాలను ఆచరించడంలో నిరాసక్తంగా ఉంటాం కానీ వేరే మతంపై ప్రేమను నటించడంలో ముందుంటాం’ అని ట్వీట్ చేశాడు. ఇది కాస్తా వివాదాస్పందగా మారడంతో అమిత్ షా రంగంలోకి దిగారు. గిరిరాజ్‌ను మందలిస్తూ మళ్లీ భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలను చేయకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. -
ఇఫ్తార్‌పై గిరిరాజ్ వివాదాస్పద ట్వీట్
న్యూఢిల్లీ: బిహార్‌లో ఇఫ్తార్ విందులకు ఎన్డీయే నేతలు హాజరవుతుండటంపై కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు గిరిరాజ్ సింగ్ చేసిన ట్వీట్ ఒకటి వివాదాస్పదమైంది. గిరిరాజ్ ట్వీట్‌పై జేడీయూ నేతలు విమర్శలు వ్యక్తం చేయడంతో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగి గిరిరాజ్‌ను మందలించారు. బిహార్‌లో సీఎం నితీశ్ కుమార్, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ సహా మొత్తం నలుగురు ఎన్డీయే నేతలు ఇఫ్తార్ విందులకు హాజరైన ఫొటోలను గిరిరాజ్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ‘నవరాత్రి రోజుల్లో ఫలాహారం ఏర్పాటు చేసి ఇలాంటి ఫొటోలు తీసుకుంటే అవి ఎంత అందంగా ఉండేవో!. మనం మన మతానికి సంబంధించిన కర్మ, ధర్మాలను ఆచరించడంలో నిరాసక్తంగా ఉంటాం కానీ వేరే మతంపై ప్రేమను నటించడంలో ముందుంటాం’ అని రాశారు. ఓ ఫొటోలో బిహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ మోదీ కూడా ఉండటం గమనార్హం. లోక్‌జన శక్తి పార్టీ అధ్యక్షుడు పాశ్వాన్తోపాటు బిహార్ ప్రతిపక్ష నేత జితన్ రామ్ మాంఝీ పట్నాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులకు సంబంధించినవే ఈ ఫొటోలు. గిరిరాజ్ ట్వీట్‌పై జేడీయూ, ఎల్జేపీ నేతలు అసంతృప్తి, విమర్శలు వ్యక్తం చేయడంతో అమిత్ షా రంగంలోకి దిగారు. గిరిరాజ్‌ను మందలిస్తూ ఇలాంటి వ్యాఖ్యలను మళ్లీ భవిష్యత్తులో చేయకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. హిందూత్వ భావజాలం బాగా కలిగిన గిరిరాజ్ గతంలోనూ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం తెలిసిందే. నేడే ఈద్–ఉల్–ఫితర్ న్యూఢిల్లీ/హైదరాబాద్: మంగళవారం నెలవంక దర్శనంతో దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ నెల ఉపవాసాలు విరమించి బుధవారం ఈద్–ఉల్–ఫితర్ పండుగ ఆచరించనున్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన నెలవంక దర్శన కమిటీ సమావేశానంతరం జామా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారి ఈ మేరకు ప్రకటన చేశారు. ‘మంగళవారం చంద్రుడు కన్పించాడు. అందువల్ల బుధవారం ఈద్ (పండుగ) జరుపుకోవాలి’ అని మసీదు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ నెల 5వ తేదీ బుధవారం ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకోవాలని హైదరాబాద్‌లోని రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్‌పాషా చెప్పారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
గిరిరాజ్‌కు అమిత్ షా వార్నింగ్
న్యూఢిల్లీ: సొంత పార్టీని ఇరుకునపెట్టేవిధంగా ప్రవర్తించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం అయితే చర్యలు తప్పవని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌తో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న బీజేపీ, ఎల్జేపీ నాయకులను ఎగతాళి చేస్తూ గిరిరాజ్ సింగ్ మంగళవారం ట్వీట్ చేశారు. నితీశ్‌తో కలిసి సుశీల్‌కుమార్ మోదీ, రామ్‌విలాస్ పాశ్వాన్, చిరాగ్ పాశ్వాన్ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలను కూడా షేర్ చేశారు. నవరాత్రి ఉత్సవాలను ఇంతే ఉత్సాహంగా ఎందుకు జరుపుకోరని ప్రశ్నించారు. బీజేపీ, జేడీ(యూ) సంబంధాల్లో బీటలు వారుతున్న నేపథ్యంలో గిరిరాజ్ వ్యాఖ్యలు ఆజ్యం పోశాయి. వివాదస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటుగా మారిందని జేడీ(యూ) అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ విమర్శించారు. గిరిరాజ్ మానసిక పరిస్థితి సరిగా లేదని అన్నారు. చిరాగ్ పాశ్వాన్ కూడా గిరిరాజ్‌ను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఆయనను అమిత్ షా హెచ్చరించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని బెగుసరాయ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గిరిరాజ్.. సీపీఐ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై భారీ విజయం సాధించారు. -
హిందూత్వ వాదుల అఖండ విజయం
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ పార్టీ గతంలోకన్నా ఎక్కువ మెజారిటీతో విజయం సాధించడానికి కారణం ప్రజలు హిందూత్వ వాదానికి పట్టం గట్టడమేనని స్పష్టంగా అర్థం అవుతోంది. ‘వికాస్’ ప్రధాన నినాదంగా ప్రచారం చేయడం ద్వారా గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈసారి ఆ నినాదాన్ని పక్కన పడేసి ‘హిందూత్వ’ నినాదాన్ని పట్టుకోవడం వల్ల గతంలోకెల్లా బీజేపీకి ఈసారి ఎక్కువ సీట్లు వచ్చాయి. గత బీజేపీ హయాంలో పెరిగిన గోరక్షక దాడులు, మూక హత్యలు, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న ధరలు తదితర అంశాలన్నీ హిందూత్వ జాతీయవాదం ముందు తుడిచిపెట్టుకుపోయాయి. మూకుమ్మడి హత్యకు సంబంధించిన టెర్రరిస్టు కుట్ర కేసులో విచారణ ఎదుర్కొంటూనే బీజేపీ తరఫున తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌పై అఖండ విజయం సాధించడం మామాలు విషయం కాదు. కరుడుగట్టిన హిందూత్వ వాదులు సాక్షి మహరాజ్, గిరిరాజ్ సింగ్, అనంతకుమార్ హెగ్డేలు గతంకన్నా ఎక్కువ మెజారిటీతో విజయం సాధించడం అంటే హిందూత్వవాదానికి ప్రజలు ఎంతటి ప్రాధాన్యతను ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. అనంత్ కుమార్ హెగ్డే కర్ణాటకలోకి ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి ఐదోసారి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన అనంత్‌కుమార్ హెగ్డే కేంద్రంలో వ్యాపారరంగంలో నైపుణ్యాభివద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన కరడుగట్టిన ఆర్ఎస్సెస్ వాదే కాకుండా దాని విద్యార్థి సంస్థ ఏబీవీపీలో కూడా పనిచేశారు. ముస్లింలు, దళితులకు వ్యతిరేకండా విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం ఆయనకు అలవాటు. ఇస్లాం బతికున్నంతకాలం ప్రపంచంలో శాంతి అనేది ఉండదంటూ 2016లో ఆయన విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు ఆయనపై కేసు కూడా నమోదయింది. ఇక ఆయన 2018లో దళితులను మొరిగే కుక్కలంటూ అవమానించారు. ఆగ్రాలోని తాజ్ మహల్ కూడా ఒకప్పుడు ‘తేజో మహాలయ అనే శివాలయం’ అంటూ కొత్త వివాదాన్ని కూడా తీసుకొచ్చారు. ఆయన 2014 ఎన్నికల్లో 1.4 లక్షల మెజారిటీతో విజయం సాధించగా, ఈ సారి ఏకంగా నాలుగు లక్షల ఓట్లకుపైగా మెజారిటీతో విజయం సాధించారు. గిరిరాజ్ సింగ్ కేంద్ర సూశ్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్న గిరిరాజ్ సింగ్ బీహార్ ఎంపీ. ఇంతకుముందు ఆయన నావడా నియోజకవర్గం నుంచి పోటీ చేయగా, ఈసారి సీపీఐ అభ్యర్థి కన్హయ్య కుమార్‌ను ఎదుర్కొనేందుకు బెగుసరాయ్ నుంచి పోటీ చేశారు. కరుడుగట్టిన హిందూత్వ వాదిగా పేరుపొందిన ఆయన ముస్లింల సంతానోత్పత్తిని ఎదుర్కొనేందుకు పదేసి మంది పిల్లల్ని కనాలంటూ హిందువులకు పలుసార్లు పిలుపునిచ్చారు. మోదీకి మద్దతివ్వని వారంతా పాకిస్థాన్‌కు వెళ్లాలంటూ హెచ్చరించారు. ఆయన పదే పదే మతపరమైన విమర్శలు చేస్తుంటే 2014 ఎన్నికల సందర్భంగా బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆయన ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు కూడా విధించింది. ఈసారి కూడా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. గత ఎన్నికల్లో ఆయన 44.1 శాతం పోలింగ్‌తో 1.40 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, ఈసారి మంచి స్పీకర్‌గా పేరుపొండడమేకాకుండా వినూత్న రీతిలో విస్తతంగా ఎన్నికల ప్రచారం చేసిన కన్హయ్య కుమార్‌పై 56.53 ఓట్ల శాతంతో రెండున్నర లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సాక్షి మహరాజ్ కరుడుగట్టిన హిందూత్వవాది సాక్షి మహరాజ్‌పై ఏకంగా 34 క్రిమినల్ కేసులు ఉన్నాయి. సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంగా 2011లో ఆయన ఓ మూకుమ్మడి రేప్ కేసు నుంచి బయటపడ్డారు. 2013లో జరిగిన ఓ హత్య కేసులో ఆయన ఇప్పటికీ నిందితుడే. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులోనూ నిందితుడే. గాంధీజీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా ఆయన పలుసార్లు వర్ణించారు. ప్రతి హిందువు కనీసం నలుగురు పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. ఆవును హింసించినా, మతం మారిన హత్య కేసు కింద మరణిదండన విధించాలంటూ ప్రచారం చేశారు. ఆయన గత ఎన్నికల్లో మూడు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, ఈ సారి యూపీలోని ఉన్నావో నియోజకవర్గం నుంచి ఎస్పీ అభ్యర్థి అరుణ్ శంకర్ శుక్లాపై ఏకంగా నాలుగు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఆమె కరడుగట్టిన హిందూత్వ వాది. 2008లో జరిగిన మాలేగావ్ బాంబు పేలుళ్ల కుట్ర కేసులో ప్రధాన నిందితురాలు. బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆమె అనారోగ్య కారణాలపై బెయిల్ తీసుకొని మూడుసార్లు శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. మూడోసారి ఆపరేషన్‌తో ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ నయం అయింది. అయితే తాను రోజు ఆవు మూత్రం తాగడం వల్ల తన క్యాన్సర్ నయం అయిందని కూడా ఎన్నికల్లో ఆమె ప్రచారం చేసుకున్నారు. ఓ హత్య కేసు విచారణను ఎదుర్కొంటూనే ఎన్నికల్లో పోటీ చేసిన తొలి వ్యక్తిగా కూడా ఆమె చరిత్ర సష్టించారు. తాను నిందితులుగా ఉన్న మాలెగావ్ కేసును విచారిస్తున్న ‘యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్’ చీఫ్ హేమంత్ కర్కరే అదే సంవత్సరం సంభవించిన ఓ బాంబు పేలుడులో మరణించగా తన శాపం కారణంగానే ఆయన మరణించారంటూ వ్యాఖ్యానించి తాత్కాలికంగా చిక్కుల్లో పడ్డారు. 1992లో బాబ్రీ మసీదును కూల్చివేయడంలో తాను ప్రముఖ పాత్ర వహించినందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని కూడా పదే పదే చెప్పుకున్నారు. ఆమె దిగ్విజయ్ సింగ్‌పై మూడున్నర లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. -
‘మమత, చంద్రబాబు ఐసీయూలో చేరారు’
సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రమంత్రి గిరిరాజ్ స్పందిస్తూ.. ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసిన తరువాత విపక్ష పార్టీల నేతలు షాక్‌కి గురైయ్యారు. ముఖ్యంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫలితాలను చూసి తట్టుకోలేక ఐసీయూలో చేరారు. మే 23న వెలువడే ఫలితాలు మరింత స్పష్టంగా ఉంటాయి. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయం’’ అని వ్యాఖ్యానించారు. కాగా ఆదివారం దేశ వ్యాప్తంగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. పలు సర్వేల నివేదిక ప్రకారం 280 సీట్లకు పైగా స్థానాలను సాధించి మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశాయి. కాగా ఎగ్జిట్ పోల్స్‌ను విపక్షాలు నేతలు కొందరు కొట్టిపారేసిన విషయం తెలిసిందే. -
‘ఆ జెండాలు బ్యాన్ చేయాలి’
పట్నా : ముస్లింలకు చెందిన రాజకీయ, మతసంస్ధలు ఉపయోగించే ఆకుపచ్చ జెండాలను నిషేధించాలని కేంద్ర మంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ ఈసీని డిమాండ్ చేశారు. ఆయా సంస్ధలు వాడే ఈ జెండాలతో విద్వేషం వ్యాప్తి చెందుతోందని, మనం పాకిస్తాన్లో ఉన్నామనే వాతావరణాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌ను చీల్చాలనే కుట్ర పన్నిన శక్తులతో తాను ఎన్నికల్లో పోరాడుతున్నానని, తాను సాంస్కృతిక జాతీయవాదం, అభివృద్ధి రాజకీయాలకు ప్రాతినిధ్యం వహిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. బిహార్‌లో 2014లో ఎన్డీఏ కూటమికి వచ్చిన 31 సీట్ల కంటే అధికంగా ఈసారి తమకు సీట్లు దక్కుతాయని గిరిరాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీనే అన్ని నియోజకవర్గాల్లో తమ పోటీదారని, ఆయా అభ్యర్ధులంతా ఆయన ఎన్నికల చిహ్నాలని పేర్కొన్నారు. బెగుసరాయ్ నుంచి పోటీ చేస్తున్న గిరిరాజ్ సింగ్ ఆర్జేడీ అభ్యర్ధి తన్వీర్ హసన్, సీపీఐ అభ్యర్ధి కన్నయ్య కుమార్‌లతో ముక్కోణపు పోటీలో తలపడుతున్నారు. -
ఆ స్ధానంలో పోటీకి కేంద్ర మంత్రి విముఖత
పట్నా : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తనకు కేటాయించిన నియోజకవర్గంపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పార్టీ నాయకత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న స్ధానం నుంచి కాకుండా వేరే నియోజకవర్గం నుంచి పోటీచేయాలని కోరడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. బిహార్‌లోని నవాదా స్ధానం నుంచి ఆయన 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందగా, ప్రస్తుతం గిరిరాజ్ సింగ్‌ను బెగుసరై నుంచి బరిలో దింపాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. బిహార్‌లో ఏ ఒక్క ఎంపీ నియోజకవర్గాన్నీ మార్చకుండా తనను వేరే నియోజకవర్గం నుంచి పోటీచేయాలని పార్టీ కోరడంతో తన ఆత్మగౌరవం దెబ్బతిన్నదని గిరిరాజ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. తనను సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన మండిపడ్డారు. ఎందుకు పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకుందో బిహార్ బీజేపీ నాయకత్వం తనకు చెప్పాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. నవాదా నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి తాను కష్టపడి పనిచేశానని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు బెగుసరై నుంచి సీపీఎం తరపున జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్‌ను పోటీలో నిలిపింది. బెగుసరై నుంచి పోటీకి నిరాకరిస్తున్న కేంద్ర మంత్రి తీరును కన్నయ్య కుమార్ తప్పుపట్టారు. హోంవర్క్ చేయలేదని చిన్న పిల్లలు స్కూల్‌కు వెళ్లమని మారాం చేస్తున్నట్టుగా కేంద్ర మంత్రి వ్యవహారశైలి ఉందని ఎద్దేవా చేశారు. -
సీఎంను దెయ్యమన్న కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆమెను దెయ్యంగా వర్ణించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆధునిక ఝాన్సీరాణిలా మమతా బెనర్జీ పోరాడుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ నేత దినేశ్ త్రివేది గురువారం వ్యాఖ్యానించారు. బీజేపీ కక్ష సాధింపు చర్యలను ఆమె దీటుగా ఎదుర్కొంటున్నారని కితాబిచ్చారు. దీనిపై గిరిరాజ్ సింగ్ స్పందించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఝాన్సీరాణితో మమతా బెనర్జీని పోల్చడం కంటే అవమానం మరోటి లేదంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్‌తో ఆమెను పోల్చారు. సీబీఐతో మమతా బెనర్జీ వివాదం నేపథ్యంలో రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. -
రామ మందిరంపై ఒవైసీ సవాలు..
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై బీజేపీ ప్రభుత్వానికి ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సవాలు విసిరారు. అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదస్పద ప్రాంతంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. అలాగే దీనిపై విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. అత్యున్నత ధర్మాసనం ఆదేశాలను స్వాగతించిన ఒవైసీ.. బీజేపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. రామ మందిరం నిర్మాణంపై బీజేపీ ఎందుకు ఆర్డినెన్స్ తీసుకురాలేదని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. ప్రధాని మంత్రి గిరిరాజ్ సింగ్‌ను అటార్నీ జనరల్‌గా నియమించి.. ఆయన ద్వారా సుప్రీంలో ప్రభుత్వ వాదనలు వినిపించాలని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ప్రతిసారి, ప్రతి సందర్భంలో బీజేపీ, ఆరెస్సెస్, వీహెచ్‌పీ నాయకులు రామ మందిరం నిర్మాణం ఆర్డినెన్స్ తీసుకొస్తామని బెదిరింపులకు పాల్పడతారని.. కానీ వారు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న బీజేపీ రామ మందిరంపై ఆర్డినెన్స్ తీసుకురావాలని సవాలు విసిరారు. సుప్రీం కోర్టు తీర్పుకు ముందు రామ మందిరం నిర్మాణంపై గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. రామ మందిరం నిర్మాణంపై ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలి లేదా కోర్టు తీర్పును వెలువరించాలి అని కోరారు. లేకపోతే హిందూవులు సహనాన్ని కొల్పోయే అవకాశం ఉందని అన్నారు. దేశంలో ఏదైనా జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్‌కు రామ మందిర నిర్మాణం ఇష్టం లేదని ఈ వివాదం ఇలాగే కొనసాగాలని కోరుకుంటుందని ఆరోపించారు. -
రాహుల్ ఫోటోల రహస్యం వీడింది
న్యూఢిల్లీ : పరమశివుడి దయ కోసం కైలాస్ మానస సరోవర్ వెళ్లిన రాహుల్ గాంధీ పంపించిన యాత్ర ఫోటోలు నిజమైనవి కావు అంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ ఈ వివాదంలో నిజానిజాలను వెలికితీసే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా రాహుల్ గాంధీ పంపిన ఫోటోలు నిజమైనవేనంటూ సదరు మీడియా సంస్థ తేల్చి చెప్పింది. రాహుల్ గాంధీ పంపిన ఫోటోలు దాదాపు మిట్ట మధ్యాహ్నం సమయంలో తీసినవని.. కనుక ఆ సమయంలో మనుషులవైనా, వస్తువులవైనా నీడలు చాలా చిన్నగా వాటి వెనక భాగంలో ఏర్పడతాయని తెలిపింది. అందువల్ల రాహుల్ గాంధీ చేతిలోని కర్ర నీడ ఫోటోలో కనిపించలేదని వివరించింది. ఏమిటీ వివాదం.. ప్రస్తుతం కైలాస్ మానస సరోవర్ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ ఒక యాత్రికునితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలు నిజమైనవి కావంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. ఫోటోలు నిజమైనవే అయితే వీటిల్లో రాహుల్ చేతికర్ర నీడ కన్పించడం లేదు కాబట్టి ఈ ఫోటోలు ఫోటోషాప్ ద్వారా తయారు చేసినంటూ ఆయన తన ట్విటర్లో పోస్ట్ చేశారు. దాంతో నెటిజన్లు కూడా ఈ ఫోటోల పట్ల అనుమానం వ్యక్తం చేశారు. మిస్టరి వీడిందిలా.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వదంతులకు చెక్ పెట్టే పనిలో పడింది ఒక ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ. అందులో భాగంగా ముందుగా రాహుల్ గాంధీ షేర్ చేసిన ఫోటోలోని వ్యక్తి వివరాలు సేకరించి అతనితో మాట్లాడింది. ఆ వ్యక్తి పేరు మిహిర్ పటేల్.. అహ్మదాబాద్‌కు చెందిన ఇంజనీర్. ప్రస్తుతం ఇతను మానస సరోవర్ యాత్ర నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. సదరు ఆంగ్ల మీడియా మిహిర్‌తో ఫోన్లో మాట్లాడి వాస్తావాలను వెలికీ తీసింది. ఈ ఫోటోల గురించి మిహిర్ మాట్లాడుతూ తాను రాహుల్ గాంధీతో కలిసి దొల్మా లా పాస్ దగ్గర ఈ నెల 6న ఈ ఫోటో దిగినట్లు తెలిపాడు. తనతో పాటు యాత్రకు వచ్చిన తన స్నేహితుడు కెనాన్ పటేల్ ఈ ఫోటోలను తీసినట్లుగా మిహిర్ తెలిపాడు. అప్పుడు సమయం దాదాపు ఉదయం 11. 45 - 12 .00 అవుతున్నట్లు వివరించాడు. అంతేకాక యాత్రలో దిగిన మిగతా ఫోటోలను వీడియోలను కూడా సదరు ఆంగ్ల మీడియా సంస్థకు అందజేశాడు. వీటిని సదరు మీడియా ఇన్విస్టిగేషన్ టీం క్రిష్ణ అనే ఫోటోషాప్ ప్రొఫెషనల్ సాయంతో మిహిర్ చెప్తున్నది నిజమేనని.. ఆ సమయంలో దాదాపు మిట్ట మధ్యాహ్నం కావోస్తుందని అందువల్లే రాహుల్ గాంధీ చేతికర్ర నీడ కనిపించడంలేదని ప్రకటించింది. అంతేకాక కెమరా యాంగిల్ వల్ల కూడా ఇలా జరిగిందని తెలిపింది. మిట్ట మధ్యాహ్నం కావడంతో సూర్యుడు నిట్ట నిలువునా ఉండటం వల్ల వస్తువులు, మనుషుల నీడలు వారి వెనక ఏర్పడతాయని తెలిపారు. ఫోటోలో గమనిస్తే మిహిర్ చేతిలో పట్టుకున్న బ్యాగ్ నీడ కూడా దాని వెనక మిహిర్ కాళ్ల మీద పడటంతో సరిగా కనిపించడం లేదని వివరించింది. -
అల్లర్ల కేసు నిందితులను జైల్లో కలిసిన కేంద్ర మంత్రి
పట్నా : వ ముస్లిం వ్యక్తిని చంపిన కేసులో జైలుకు వెళ్లివచ్చిన వ్యక్తులకు ఘనస్వాగతం పలికి కేంద్రమంత్రి జయంత్ సిన్హా విమర్శలు ఎదుర్కొంటున్న వివాదం మరవకముందే మరో కేంద్ర మంత్రి వివాదంలో చిక్కుకున్నారు. అల్లర్ల కేసులో జైల్లో ఉన్న విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలను కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆదివారం కలిశారు. బిహార్‌లోని నవడా జైలులో ఉన్న బజరంగ్ దళ్, వీహెచ్‌పీ కార్యకర్తలను కలిసిన ఆయన.. సుమారు 30 నిమిషాల పాటు వారితో ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. 'జీతూ జీ, కైలాష్ జీని అరెస్ట్ చేయడం దురదృష్టకరం. 2017లో శ్రీరామనవమి సందర్భంగా ఉద్రక్తతలు తలెత్తినప్పుడు వారు పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అక్బర్పూర్లో దుర్గామాత విగ్రహాన్ని విధ్వసం చేసినప్పుడు కూడా ఉద్రిక్తతలను తొలగించే ప్రయత్నమే చేశారు. అలాంటి వారిని అల్లరి మూకలు అని ఎలా నిందిస్తారు ’ అని నిందితులను సమర్థించారు. హిందువులను అణిచివేయడం ద్వారా మత సామరస్యాన్ని కాపాడగలమని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే అది దురదృష్టకరమని పేర్కొన్నారు. బిహార్‌లో జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరహా ధోరణిని విడనాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా అని గిరిరాజ్ అన్నారు. 2017 అల్లర్ల కేసులో బజరంగ్ దళ్ కన్వీనర్ జితేంద్ర ప్రతాప్‌ను ఈ నెల 3న అరెస్టు చేశారు. దీనిపై ఆ మరుసటి రోజే జితేంద్ర ప్రతాప్ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగడంతో ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా గిరిరాజ్ ఆరోపణలను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిప్పికొట్టారు. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేవారిని ఉపేక్షించేది లేదన్నారు. అవినీతి, నేరాలు, మతోన్మాదం విషయాల్లో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏ ఒక్క నేరస్థునికి రక్షణ కల్పించదని పేర్కొన్నారు. -
‘నాలుగేళ్లలో 4 కోట్ల ఉద్యోగాలు కల్పించాం’
సాక్షి, న్యూఢిల్లీ : 30 వేల రూపాయల పిజ్జా తినే వారికి నెలకు 12 వేల రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగం ఉద్యోగంలా కనిపించదు అంటూ కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పత వ్యాఖ్యలు చేశారు. సబర్మతి నది తీరాన ఉన్న పార్క్‌లో ‘ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్’ వారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి గిరిరాజ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. ‘ఈ నాలుగేళ్ల పాలనలో మేము 4 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చాము. వారిలో దాదాపు 70శాతం మంది నెల జీతం 12 వేల రూపాయలు. ప్రస్తుతం ప్రపంచం నైపుణ్యాలు కలిగిన యువత కోసం చూస్తుంది. మన దేశంలో నైపుణ్యం ఉన్న యువత కేవలం 5 శాతం మాత్రమే. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశంలో నైపుణ్యాభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు. నైపుణ్య శిక్షణ గురించి తొలిసారి బీజేపీ ప్రభుత్వమే మాట్లాడింది. 30 వేల రూపాయల విలువ చేసే పిజ్జా తినే వారికి నెలకు 12 వేల రూపాయల జీతం లభించే ఉద్యోగం ఉద్యోగంలా కనిపించకపోవడంలో వింతేముంది’ అన్నారు. ‘ముద్రా’ పథకం కింద తమ మంత్రిత్వ శాఖ 10 కోట్ల మందికి ఉపాధి కల్పించిందన్నారు. 2010 - 2014 మధ్య కాలంలో యూపీఏ హయాంలో 11 లక్షల మంది నూతన పారిశ్రామిక వేత్తలు ఉంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 లక్షల మంది నూతన పారిశ్రామిక వేత్తలను తయారుచేశామని తెలిపారు. టెక్స్టైల్, హస్త కళల పరిశ్రమలను మినహాయించి ఇంతమంది పారిశ్రామికవేత్తలను తయారు చేసామన్నారు. ఇక ఆ రెండు శాఖలను కూడా కలుపుకుంటే వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మహాత్మగాంధీ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆయన విధానాలను ఖూనీ చేసిందని గిరిరాజ్ సింగ్ విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశవ్యాప్తంగా చరఖా గురించి మాట్లాడుకునే పరిస్థితులు వచ్చాయన్నారు. సబర్మాతి నదీ తీరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా స్టీల్ చరఖాను ఆవిష్కరించారు. -
27న సోలార్ చరఖా పథకం ప్రారంభం
న్యూఢిల్లీ: ఐదు కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సౌర చరఖా పథకాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 27న ప్రారంభించనున్నారు. తొలి రెండేళ్లలో దేశవ్యాప్తంగా 50 క్లస్టర్లలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామనీ, కేంద్రం రూ. 550 కోట్ల రాయితీని అందిస్తుందని సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ బుధవారం వెల్లడించారు. ఈ పథకంతో తొలి రెండేళ్లలోనే లక్ష వరకు ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఎంఎస్ఎంఈ కార్యదర్శి చెప్పారు. ఒక్కో క్లస్టర్లో 400 నుంచి 2,000 మంది వరకు చేతి వృత్తుల వారికి ఉపాధి దొరుకుతుందన్నారు. దేశవ్యాప్తంగా 15 అత్యాధునిక సాంకేతిక కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందనీ, వాటిలో 10 వచ్చే మార్చికల్లా కార్యకలాపాలను ప్రారంభిస్తాయని చెప్పారు. ఈ పదింటిలో విశాఖపట్నం, పుదుచ్చేరి, బెంగళూరు కూడా ఉన్నాయి. బుధవారం ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలోని 33 అంతస్తుల ‘బ్యూ మాండ్’ ఆకాశహర్మ్యం నుంచి ఎగసిపడుతున్న మంటలు. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ భవంతి 26వ అంతస్తులో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె నివసిస్తున్నారు. 32, 33వ అంతస్తుల్లో మాత్రమే మంటలు వ్యాపించాయి. భవంతిలోని వారిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. -
‘నితీష్ పిరికిపంద’
సాక్షి,పాట్నా : బిహార్ సీఎం నితీష్ కుమార్‌పై ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. నితీష్ కుమార్‌ను పిరికిపందగా అభివర్ణించారు. రాష్ట్రంలోని అరారియా, భాగల్పూర్, దర్భంగాల్లో ఇటీవల చెలరేగిన హింసకు నితీషే బాధ్యత వహించాలని అన్నారు. నితీష్ భయంతో నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. హింసకు ప్రేరేపించింది బీజేపీ వారే అయినా సీఎం నితీష్ కుమార్ దీనికి బాధ్యత వహించాలని తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు. బీజేపీ సీనియర్ నేత గిరిరాజ్ సింగ్ పైనా ఆరోపణలు చేశారు. దళితుల భూములను గిరిరాజ్ సింగ్ ఆక్రమించిని ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపించారు. హింసకు పాల్పడుతున్న నిందితులు ఎలాంటి భయం లేకుండా కుంభకోణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నితీష్ పిరికిపందలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గిరిరాజ్ సింగ్ బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నా నితీష్ కుమార్ చోద్యం చూస్తున్నారని అన్నారు. -
మోదీ చౌక్‌లో తెగిపడ్డ తల
పట్నా : బిహార్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ పేరిట ఉన్న ఓ చౌరస్తా పేరును మార్చేందుకు కొందరు యత్నించగా.. అడ్డుకున్న ఓ వృద్ధుడిని దారుణంగా తల నరికి చంపారు. ఈ కేసుపై పోలీసులు, నేతలు ఇచ్చే పొంతన లేకపోవటంతో ఇప్పుడక్కడ ఇది రాజకీయ చర్చకు దారితీసింది. బాధిత కుటుంబ సభ్యులు కథనం ప్రకారం... దర్బంగలోని భాదవన్ గ్రామం సర్దార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ చౌరస్తాకు ‘ నరేంద్ర మోదీ చౌక్’ అనే పేరుంది. శుక్రవారం సుమారు 50-60 మంది ఆర్జేడీ కార్యకర్తలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఉప ఎన్నికల్లో విజయంతో నినాదాలు చేస్తూ.. ఆ బోర్డు(మోదీ చౌక్)ను తొలగించి.. దానికి లాలూ ప్రసాద్ చౌక్‌గా నామకరణం చేసేందుకు యత్నించారు. అయితే వారికి అడ్డుకునేందుకు రాంచంద్ర యాదవ్(60) యత్నించగా.. అతన్ని హకీ స్టిక్‌లతో కొట్టి, ఆపై తల నరికి హత్య చేశారు. దాడిలో రాంచంద్ర కొడుకు కమలేష్‌కు కూడా గాయాలయ్యాయి. పోలీసులు మాత్రం బాధిత కుటుంబ కథనాన్ని కొట్టిపారేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య ఎప్పటి నుంచో భూతగాదాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలోనే హత్య జరిగిందని.. పబ్లిసిటీ స్టంట్ కోసమే హతుడి కుటుంబ సభ్యులు మోదీ(చౌక్) పేరును తెరపైకి తెచ్చారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. బీజేపీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు? ఈ ఘటనపై డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ తన ట్విట్టర్లో స్పందించారు. ఆ కథనాలన్నీ అవాస్తవమని.. ఆ చౌక్‌కు పేరు ఎప్పటి నుంచో ఉందని.. అది భూతగాదాలో జరిగిన హత్యేనని ట్వీట్ చేశారు. కానీ, శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాత్రం ఈ కేసులో అనుమానాలు ఉన్నట్లు చెబుతున్నారు. ‘రామచంద్ర(హతుడు) భార్యతో నేను మాట్లాడా. మీడియా ముందు బోర్డు ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చావని పోలీసులు ఆమెను బెదిరించినట్లు నాతో చెప్పింది. ఆ లెక్కన్న వాస్తవాలు దాచిపెట్టి పోలీసులు ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనిపిస్తోంది’ అంటూ గిరిరాజ్ తెలిపారు. ఇక బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నిత్యానంద్ రాయ్ కూడా ఇది చౌక్ పేరు మార్చే క్రమంలో జరిగిన గొడవ అని చెబుతుండటం గమనార్హం. ఏది ఏమైనా ఈ కేసు పోలీసుల తీరుపై విమర్శలకు తావునిస్తోంది. -
'కౌంటింగ్ జరుగుతుంటే రాహుల్ అలా వెళ్లొచ్చా?'
సాక్షి, పట్నా : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ విమర్శల వర్షం కురిపించారు. ఓపక్క ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంటే రాహుల్ గాంధీ మాత్రం విదేశాలకు వెళ్లారని సెటైర్ వేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ పార్టీ ఎక్కడా విజయం సాధించదని రాహుల్‌గాంధీకి ముందే తెలుసు. రాజకీయాలంటే అసలు రాహుల్‌కు సీరియస్‌నెస్ లేదు. ఇలాంటి కీలకమైన సమయంలో ఒక పార్టీ చీఫ్ ఎవరైనా పార్టీని, కార్యకర్తలను, నాయకులను ఇలా ఒంటరిగా వదిలేసి వెళతారా. ఇలాంటి సమయంలో కనీసం కార్యకర్త కూడా ఎక్కడికీ వెళ్లడు. పార్టీ అధ్యక్షుడిగా అసలు రాహుల్ గాంధీకి ఏమాత్రం ఆసక్తి లేకుండా వ్యవహరిస్తున్నారు' అంటూ ఆయన తీవ్రంగా విమర్శిచారు. హోలీ సందర్భంగా తాను తన అమ్మమ్మ (93) దగ్గరకు ఆశ్యర్యంలో ముంచెత్తేందుకు వెళుతున్నట్లు రాహుల్‌గాంధీ తన ట్విట్టర్ ద్వారా చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గిరిరాజ్ సింగ్ విమర్శలు చేశారు. -
‘భారతీయ ముస్లింలంతా రాముడి వారసులే!’
న్యూఢిల్లీ : భారతీయ ముస్లింలంతా రాముడి వారసులేనని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదుని నిర్మించి తీరుతామన్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. అసుదుద్దీన్ ఒవైసీని జిన్నా భూతం పట్టుకుందని, దేశాన్ని ముక్కలు చేయాలనే ధోరణితో అలా మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ’వారంతా మక్కా యాత్రకు వెళ్తారు. మరి మేము ఎక్కడికి వెళ్లాళి. మా కోసం పాకిస్తాన్లో రామమందిరం నిర్మిస్తారా’ అని ప్రశ్నించారు. భారత్‌లో బాబర్ వారసులెవరూ లేరని, భారతీయ ముస్లింలంతా రాముడివారసులేనన్నారు. హిందూ, ముస్లిం పూజల్లో తేడాలు ఉన్నప్పటికీ, తామంతా ఒకటేనని, భారతీయులందరి పూజించేది రాముడేనని ఆయన చెప్పారు. అయోధ్యలో మళ్లీ బాబ్రీ మసీదును నిర్మిస్తామని, సుప్రీం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తోందని ఒవైసీ శనివారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
‘హిందువుల వల్లే.. ప్రజాస్వామ్యం పదిలం’
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం సృష్టించే కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి అదే తరహా మాటల తూటాలు పేల్చారు. ‘భారతదేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు కావడం వల్ల.. ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంది’ అని అన్నారు. దేశంలో మెజారిటీ వర్గం సంఖ్య తగ్గితే.. సామాజిక అభివృద్ధి ప్రమాదంలో పడుతుందని ఆయన చెప్పారు. మెజారిటీ ప్రజల సంఖ్య తగ్గితే.. జాతీయతావాదం కూడా మరుగున పడే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత సురక్షితంగా ఉందని, హిందువులు ఇంకా ఇక్కడ మెజారిటీ జనాభాగా ఉండడమే ఇందుకు కారణం అని గిరిరాజ్ స్పష్టం చేశారు. దేశంలో ఎప్పుడైతే మెజారిటీ ప్రజల సంఖ్య తగ్గుముఖం పడుతుందో అప్పుడు ప్రజాస్వామ్యం, అభివృద్ధి, సామాజిక సామరస్యం ప్రమాదంలో పడతాయని ఆయన హెచ్చరించారు. దేశంలో సుమారు 54 జిల్లాల్లో ముస్లింల జనాభా విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఉత్తర్ ప్రదేశ్, అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ తదితర రాష్ట్రాల్లో ఇదీ మరీ ఎక్కువగా ఉంది. ముస్లింలు మెజారిటీ వర్గంగా అవతరిస్తే దేశసమగ్రత, ఐకమత్యానికి భంగం కలిగే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. -
రోహింగ్యాలు : ప్రేముంటే.. తీసుకెళ్లండి?!
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చట్టం, దేశం తరువాత మానవత్వమన్న మంత్రి దేశ భద్రతకు రోహింగ్యాలతో ముప్పు సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పడు ముందుండే కేంద్ర మంతి గిరిరాజ్ సింగ్.. తాజాగా అటువంటి వ్యాఖ్యలే చేశారు. ‘రోహింగ్యాల మీద మీకు నిజంగా ప్రేముంటే పాకిస్తాన్‌కు తీసుకెళ్లండి.. అంటూ వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. తీసుకెళ్లవచ్చని’ పాకిస్తాన్‌ను ఉద్దేశించి ఆయన అన్నారు. ఇప్పటికే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్లో మారణహోమం సృష్టిస్తున్నారు. అంతేకాక సరిహద్దుల్లో టెర్రరిస్టులు నిత్యం చొరబాట్లకు ప్రయత్నిస్తున్నారు. చాలామంది దేశంలోకి ఇప్పటికే అక్రమంగా చొరబడ్డారు. ఈ పరిస్థితుల్లో దేశానికి రోహింగ్యా చొరబాటుదారులను భరించే శక్తి లేదని.. వాళ్లంతా దేశం విడిచి వెళ్లాల్సిందేనని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. రోహింగ్యాలు అక్రమ వలసదారులే.. వారివల్ల దేశ అంతర్గత భద్రతకు ముప్పు ఉందన్న కేంద్ర ప్రభుత్వ మాటలను ఆయన సమర్ధించారు. చట్టం, దేశం కన్నా.. మానవత్వం పెద్దది కాదని గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. మనదేశంలో ఉండే కొంతమంది నేతలు రోహింగ్యాలను సమర్థిస్తున్నారు.. రోహింగ్యాలతో పాటూ వాళ్లను కూడా పాకిస్తాన్ పంపితే సరిపోతుందని మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. దేశంలో ప్రస్తుతం 14 వేల మంది రోహింగ్యాలు అక్రమంగా దేశంలో నివసిస్తున్నారని ప్రభుత్వం ఆగస్టు 9న పార్లమెంట్‌కు తెలిపిందని గిరిరాజ్ సింగ్ చెప్పారు. -
సీఎం పెయింటింగ్.. రాజకీయాల్లో మార్పులు!
పాట్నా: బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ వేసిన ఓ పెయింటింగ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపింది. నితీశ్ పెయింటింగ్ ఉద్దేశం ఏంటో తెలియదు గానీ, బిహార్ రాజకీయాలను ఆ పెయింటింగ్ సూచిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పాట్నాలోని గాంధీ మైదానంలో శనివారం జరిగిన బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవంలో నితీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీయూ నేత నితీశ్ పెయింటింగ్ బ్రష్ చేతపట్టి బీజేపీ పార్టీ రాజకీయ చిహ్నమైన కమలం గుర్తును గీశారు. అది మొదలుకుని ఆర్జేడీ, బీజేపీ నేతల మధ్య రాజకీయ చర్చ మొదలైంది. సీఎం నితీశ్ తాను ఇండిపెండెంట్ వ్యక్తిగా భావిస్తున్నారని, తన చిరకాల మిత్రుడు, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు ఈ రూపంలో పరోక్షంగా సంకేతాలు పంపించారని వదంతులు వ్యాపించాయి. దీనికి తోడు బీజేపీ సీనియర్ నేత గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. బిహార్ లో సొంతంగా వ్యవహరించాలని నితీశ్ భావిస్తున్నారని, తన రాజకీయ రంగు, తన విధానం ఎలా ఉండబోతుందన్న దానిపై పెయింటింగ్ ద్వారా బహిర్గతం చేశారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు విషయంలోనూ దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తినా.. నితీశ్ మాత్రం ఆ నిర్ణయానికి మద్ధతు తెలిపారని గుర్తుచేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఆర్జేడీ చీఫ్ లాలూ తనయుడు, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పందించారు. కమలం అనగానే అది కేవలం బీజేపీకే చెందినట్లయితే, ఆర్జేడీ సింబల్ లాంతర్ దేశంలో చాలా ప్రాంతాల్లో ఇళ్లల్లో ఉంటుంది కదా.. దీంతో దేశమంతా ఆర్జేడీకే మద్ధతుగా ఉందని ప్రచారం చేస్తారా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. తమ పార్టీ గుర్తు పెయింటింగ్ వేశారని, ఇలాంటి చిన్న చిన్న విషయాలకే బీజేపీ నేతలు సంబరపడతారంటే తమకు వచ్చిన నష్టమేమి లేదని తేజస్వి యాదవ్ అన్నారు. -
మరోసారి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
కోలకత్తా: వివాదాస్పద బీజేపీ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. డీమానిటైజేషన్ తర్వాత దేశంలో జనాభా నియంత్రణకు మాస్ స్టెరిలైజేషన్ కార్యక్రమం చేపట్టాలని మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సహాయమంత్రి గిరిరాజ్ సింగ్ పిలుపు నివ్వడం కలకలం రేపింది. తన పార్లమెంటరీ నియోజకవర్గం నవాడా జరిగిన ఒక కార్యక్రమంలో సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జనాభా ను నియంత్రించడానికి స్టెరిలైజేషన్ కు పిలుపునిచ్చారు. నోట్ బందీ తర్వాత నస్ బందీ కార్యక్రమం చేపట్టాలన్నారు. దేశంలో స్టెరిలైజేషన్ కోసం చట్టాలను చేయాల్సిన అవసరం ఉందని గిరిరాజ్ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ ,మలేషియా లో ఇలాంటి జనాభా నియంత్రణ చట్టాలు ఉన్నాయన్నారు. కనుక ఇలాంటి చట్టాలు భారతదేశంలో కూడా ఉంటే తప్పేమీ లేదని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను బీజీపీ కొట్టివేసింది. ఇది ఆయన వ్యక్తి గత అభిప్రాయమనీ, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశం ఏదీ లేదని రాహుల్ సిన్హా వివరణ ఇచ్చారు. దేశంలో జనాభా పెరుగుతోంది , ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ పార్టీకి గానీ, ప్రభుత్వానికి గానీ అలాంటి ఎజెండా ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే జనాభా నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు, ప్రకటనలు రావాలన్నారు. దీనికి రాజకీయ పార్టీలు సహా ఇతర స్వచ్చంద సంస్థలు అందరూ కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ కాలంలో (1975-1977) ప్రజలు పడ్డ ఇబ్బందును రాహుల్ సింగ్ గుర్తు చేశారు. ఆ సమయంలో నిర్బంధ స్టెరిలైజేషన్ తో ప్రజలకు చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపారు. కాగా గిరిరాజ్ సింగ్ పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశం లో జనాభా నియంత్రణ ఒక సామూహిక స్టెరిలైజేషన్ పిలుపునిచ్చారు. ఇంతకుముందు మరో బీజేపీ సంజయ్ పాశ్వాన్ మాస్ స్టెరిలైజేషన్ చేయాలని వ్యాఖ్యానించారు. విమర్శలకు, వివాదాలకు ఎప్పుడూ తెరతీసే గిరిరాజ్ సింగ్ జనాభా విధానంలో మార్పులు చేయాలని, ముస్లిం కుటుంబాలకు ఇద్దరకుమించిన పిల్లలుండకూదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
'టాపర్స్ స్కాంతో కేంద్ర మంత్రికి లింకు'
పట్నా: బిహార్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో టాప్ ర్యాంకు స్కాంతో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కు సంబంధం ఉందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ ఆరోపించారు. ప్రధాన నిందితుడు బచ్చారాయ్.. ఆయనకు సన్నిహితుడని వెల్లడించారు. వైశాలి జిల్లాలో బిషన్ రాయ్ కాలేజీ సెక్రటరీ, ప్రిన్సిపాల్ గా ఉన్న బచ్చారాయ్ శనివారం భగ్వాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఆర్ట్స్, సైన్స్ గ్రూపు పరీక్షల్లో ఈ కాలేజీకి చెందిన రుబీరాయ్, సౌరబ్ శ్రేష్ట్ లు టాప్ ర్యాంకులు సాధించడం తెలిసిందే. అయితే టాపర్స్ స్కాంలో ప్రధాన నిందితుడు బచ్చారాయ్ తో గిరిరాజ్ సింగ్ కు సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ వీరిద్దరూ కలిసివున్న ఫొటోను తేజశ్వి యాదవ్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. నరేంద్ర మోదీకి ఎంతో ఇష్టమైన మంత్రితో రాయ్ అంటూ కామెంట్ పెట్టారు. రాయ్ తో గిరిరాజ్ కు వ్యాపార సంబంధాలున్నాయని కూడా ఆరోపించారు. రాయ్ తో మెడికల్ కాలేజీ పెట్టేందుకు సహాయం చేస్తానని గిరిరాజ్ హామీయిచ్చారని ఆర్జేడీ రోపించింది. -
'రుణమాఫీని అలవాటు చేయడం సరికాదు'
నెల్లూరు: రుణమాఫీ హామీపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలు ఎన్నికల హామీల్లో భాగంగా ప్రజలకు రుణమాఫీ అలవాటు చేయడం సరికాదన్నారు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన శనివారం మాట్లాడుతూ.. రుణమాఫీలతో బ్యాంకుల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందన్నారు. జీఎస్టీ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించేలా చేస్తామని వెంకయ్య నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే ప్రతి జిల్లాలో ఇంక్యూబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నెల్లూరులో త్వరలోనే జెమ్స్ అండ్ జ్యువెల్లర్స్ క్లస్టర్ ఏర్పాటుచేస్తామని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ప్రకటించారు. -
'వాళ్లకు జిన్నా భూతం పట్టింది'
పాట్నా: కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌లు బిహార్‌ను పాకిస్థాన్‌లాగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. పాకిస్థాన్ స్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా ప్రేతాత్మ వారిలోకి ప్రవేశించడంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 'జిన్నాభూతం నితీశ్, లాలూలోకి ప్రవేశించింది. వారు బిహార్‌ను పాకిస్థాన్ చేయాలనుకుంటున్నారు' అని ఆయన శనివారం పేర్కొన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇంతకుముందు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో బీజేపీ ఓడిపోతే పాకిస్థాన్‌లో బాణాసంచా పేల్చి సంబురాలు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. 2014 ఎన్నికల సమయంలో నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావడం ఇష్టంలేనివారు పాకిస్థాన్ వెళ్లిపోవచ్చునని బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
సోనియాపై వ్యాఖ్యలకు గిరిరాజ్ క్షమాపణ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ సోనియాపై అవమానకర వ్యాఖ్య లు చేసిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సోమవారం లోక్‌సభలో క్షమాపణలు చెప్పారు. ‘నేను ఎవరినీ ఉద్దేశపూర్వకంగా కించపరచలేదు. అయినా నా వ్యాఖ్యలకు ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే అందుకు పశ్చాత్తాపం ప్రకటిస్తున్నా’ అని పేర్కొన్నారు. అంతకుముందు సోనియా చర్మం రంగుపై గిరిరాజ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సభ దద్దరిల్లింది. కేంద్రమంత్రి క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ కాంగ్రెస్ సభ్యులు సభను స్తంభింపజేశారు. ఆయన మాటలు స్త్రీజాతికే అవమానమని, తక్షణమే మంత్రి పదవి నుంచి తప్పించాలని నినాదాలు చేశారు. కేంద్రమంత్రి అనుచిత వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కూడా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా డిమాండ్ చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్.. దీనిపై స్పందించాల్సిందిగా మంత్రికి సూచించారు. మంత్రి వ్యాఖ్యలు తననూ బాధించాయని, అలా మాట్లాడాల్సింది కాదని పేర్కొన్నారు. దీంతో మంత్రి పశ్చాత్తాపం ప్రకటించారు. రాజీవ్‌గాంధీ సోనియాను కాకుండా నైజీరియా మహిళను పెళ్లాడినట్లయితే, సోనియా చర్మం తెల్లగా కాకుండా నల్ల రంగులో ఉన్నట్లయితే కాంగ్రెస్ ఆమె నాయకతాన్ని ఆమోదించేదా అంటూ గిరిరాజ్ వ్యాఖ్యానించడం తెలిసిందే. -
క్షమాపణలు చెప్పిన గిరిరాజ్ సింగ్
-
క్షమాపణలు చెప్పిన గిరిరాజ్ సింగ్
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఎట్టకేలకు దిగి వచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆయన సోమవారం లోక్ సభలో క్షమాపణ చెప్పారు. సోనియా గాంధీని కించపరిచే ఉద్దేశం లేదని, తన వ్యాఖ్యలు సోనియాను బాధపెట్టివుంటే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. మంత్రి క్షమాపణలతో వివాదం సద్దుమణిగింది. లోక్ సభ మలిదశ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గిరిరాజ్ వ్యాఖ్యలపై సభలో దుమారం రేగింది. ఈ ఘటనపై ప్రధానమంత్రి మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దాంతో సభలో గందరగోళం నెలకొంది. అనంతరం గిరిరాజ్ సింగ్ తన వ్యాఖ్యలపై సభాముఖంగా క్షమాపణ తెలిపారు. కాగా 'సోనియా తెలుపు రంగులో లేనట్లయితే, రాజీవ్ గాంధీ ఓ నైజీరియా మహిళను పెళ్లాడి ఉన్నట్లయితే, ఆమె తెలుపు రంగు మహిళ కానట్లయితే కాంగ్రెస్ ఆమె నాయకత్వాన్ని అంగీకరించేదా?' అని గిరిరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
గిరిరాజ్ వ్యాఖ్యలపై లోక్‌సభలో దుమారం
-
గిరిరాజ్ వ్యాఖ్యలపై లోక్‌సభలో దుమారం
న్యూఢిల్లీ : న్యూఢిల్లీ : కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై సోమవారం లోక్ సభలో దుమారం చెలరేగింది. పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాలు.... అధికార, ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, నిందారోపణలతో మొదలయ్యాయి. సోమవారం ఉదయం సమావేశాలు ప్రారంభమైన వెంటనే... స్పీకర్ సుమిత్రా మహజన్ ఇటీవల మృతి చెందిన మాజీ రాజ్యసభ ఎంపీలు, సింగపూర్ మాజీ ప్రధాని లీక్వాన్ యూ, సుక్మా-దంతెవాడ పోలీసు అమరులు, కెన్యాఉగ్రవాది దాడిలో బలైపోయిన చిన్నారులకు.... నివాళులర్పిస్తూ సంతాన తీర్మానాన్ని చదివి వినిపించారు. మృతులకు లోక్‌సభ సంతాపం అనంతరం.... విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. చర్చ జరపాల్సిందేనని పట్టుబట్టాయి. సోనియాగాంధీపై కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ అనుచిత వ్యాఖ్యలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్‌ఖర్గే మాట్లాడుతుండగా....బీజేపీ ఎంపీలు అడ్డుకోవడంతో సభలో దుమారం రేగింది. బీజేపీ సభ్యుల తీరుపై ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గిరిరాజ్‌సింగ్ వ్యాఖ్యలు యావత్ మహిళాలోకాన్ని కించపరిచేలా ఉన్నాయని కాంగ్రెస్ యువ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా మండిపడ్డారు. తమ పార్టీ అధినేతపై చేసిన వ్యాఖ్యలకుగాను ఆయన క్షమాపణలతో పాటు స్వచ్చంధంగా రాజీనామా చేయాలని..... ప్రధాని కూడా క్షమాపణలు చెప్పాలని సింధియా డిమాండ్ చేశారు. దీనిపై కలగజేసుకున్న పార్లమెంటరీవ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు విపక్ష సభ్యులు లేవనెత్తిన ఏ అంశంపైనైనా చర్చకు ప్రభుత్వం సిద్ధమేనని తెలిపారు. స్పీకర్ అనుమతిస్తే చర్చించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న వెంకయ్య...గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై ప్రధాని మాట్లాడబోరని తేల్చిచెప్పారు. ఈ వివాదంలోకి ప్రధానిని లాగవద్దని సూచించారు. ఈ దశలో మరోసారి సభలో రగడ రేగింది. దాంతో స్పీకర్ సమావేశాలను 11.45 గంటల వరకూ వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు ఇదే అంశంపై ఆందోళన కొనసాగించారు. దాంతో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్.. సోనియాగాంధీకి క్షమాపణ చెప్పారు. -
సమస్త ఉగ్రవాద చర్యలకూ వాళ్లే కారణమా?
ఆకార్ పటేల్ ఉగ్రవాద చర్యల్లో పట్టుబడిన వారందరూ ఒక మతానికి సంబంధించిన వారని కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ ప్రకటించడం తప్పు. భారత్‌లో జరిగే ప్రతి ఉగ్రవాద చర్యకు ముస్లింలు బాధ్యులు కారని గణాంకాలు సుస్పష్టం చేస్తున్నాయి. భారతీయ ముస్లింల లో చాలామంది ఉగ్ర వాదులేనా? ఈ అంశం తోపాటు ఈ వారం మరొక అవాంఛనీయ ఘటన కూడా నా దృష్టి కి వచ్చింది.. ‘రాజీవ్ గాంధీ ఒక తెల్లమ్మాయి ని కాకుండా నైజీరియా మహిళను పెళ్లాడి ఉంటే, కాంగ్రెస్‌పార్టీ ఆమె నాయ కత్వాన్ని ఆమోదించేదా?’ ఇది కేంద్ర మంత్రి గిరి రాజ్‌సింగ్ చేసిన వ్యాఖ్య. భారత్‌లో సర్వసాధార ణంగా రంగుకు సంబంధించి ఉనికిలో ఉంటున్న జాతివివక్షతను ఈ వ్యాఖ్య బయటపెట్టింది. ‘ప్రధా ని నరేంద్రమోదీ దీనిపై తగు చర్య తీసుకుంటారని భావిస్తున్నాను’ అంటూ నైజీరియా రాయబారి ఓబీ ఓకోన్గోర్ బాధను వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఎప్పటిలాగే ప్రధాని పెద్దగా పట్టించుకోలేదు. ‘గిరిరాజ్ సింగ్ నోరుమూయించడానికి 5 కారణాలు’ అనే శీర్షికతో ప్రముఖ ఇంగ్లిష్ వెబ్ సైట్ రెడిఫ్.కామ్ ఒక కామెంటరీని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ వెబ్సైట్ గత ఏడాది మంత్రి చేసిన ప్రకటనను ఆ కామెంటరీలో పొందుపర్చింది. ‘ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్న వారం దరూ ఒకే మతానికి చెందినవారుగా ఉండటం నిజం కాదా? ఒక ప్రత్యేక మతాన్ని నేను నిందించ దల్చుకోలేదు. మన ఘనత వహించిన సెక్యులర్ పార్టీలు దీనిపై ఎందుకు మౌనం పాటిస్తున్నాయి?’ గిరిరాజ్‌సింగ్ వేసిన ప్రశ్న ఇది. బహుశా కేంద్ర మంత్రి ముస్లింల గురించే ప్రస్తావించి ఉంటారు. అయితే ఉగ్రవాద చర్యల్లో పట్టుబడిన వారందరూ ఒక మతానికి సంబంధించినవారని ఆయన ప్రక టించడం సరైంది కాదు. అయితే భారత్‌లో జరిగే ప్రతి ఉగ్రవాద చర్యకు ముస్లింలే బాధ్యులా? ‘ది సౌత్ ఆసియన్ టెర్రిరిజం పోర్టల్’ ఇటీవలే దేశవ్యా ప్తంగా దాడుల్లో మృతులు, ఘటనల జాబితాను ప్రకటించింది. మరింత సహాయకారిగా ఆ పోర్టల్ ఘర్షణలు జరిగిన ప్రాంతం వారీగా జాబితాను రూపొందించింది. దీనిప్రకారం 2014లో ఉగ్రవాదం (లేదా తీవ్ర వాదం) వల్ల భారత్‌లో 976 మంది చనిపోయారు. వీరిలో 465 మంది ఈశాన్య భారత్‌లో మృతి చెం దారు. ఇక మావోయిస్టు గ్రూప్‌కు చెందిన వామపక్ష తీవ్రవాదం వల్ల 314 మంది మరణించారు. ఉగ్ర వాదానికి మూలబిందువుగా మనం భావిస్తున్న జమ్మూకశ్మీర్‌లో మృతుల సంఖ్య 193 మంది మాత్రమే. ఈ ఘర్షణాత్మక ప్రాంతాలకు వెలుపల నలుగురిని మాత్రమే హతమార్చినట్లు ఇస్లామిక్ తీవ్ర వాదం బాధ్యతను ప్రకటించుకుంది. 2013లో మావోయిస్టులు ఎక్కువగా 421 మందిని హతమా ర్చగా, 251 మందిని చంపిన ఈశాన్య తీవ్రవాదం రెండో స్థానంలో నిలిచింది. కశ్మీర్‌లోనూ, ఆ రాష్ట్రం మినహా బయటి రాష్ట్రాలలో ఇస్లామిక్ హింసలో చనిపోయింది 206 మంది. 2012లో కూడా ఇదే విధంగా మావోయిస్టులు 367 మందిని, ఈశాన్య ఉగ్రవాదం 326 మందిని, కశ్మీర్ తీవ్రవాదులు 117 మందిని చంపివేయగా ఈ మూడింటికీ వెలుపల ఇస్లామిక్ ఉగ్రవాద బాధితుల సంఖ్య కేవలం ఒక్కటి మాత్రమే. 2011లో మావోయిస్టు హింసలో 602 మంది చనిపోగా, ఈశాన్య భారత్ ఘర్షణల్లో 246 మంది చనిపోయారు. ఇక కశ్మీర్, దాని వెలు పల ఇస్లామిక్ తీవ్రవాద చర్యల్లో 225 మంది హతు లయ్యారు. గత దశాబ్దంగా దేశంలో హింసాత్మక చర్యలు తగ్గుముఖం పడుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే భారత్‌లోని ఉగ్రవాదుల్లో అధికులు హిందువులే అన్నది స్పష్టం. అయితే వీరి ని హిందువులు అనడానికి బదులుగా మనకు సౌక ర్యవంతంగా ఉంటుందని మావోయిస్టులు అని ముద్రవేసేశాం. ఇక మన ఉగ్రవాదుల్లో రెండో స్థానంలో ఉన్నవారు ఈశాన్య భారత్‌లోని గిరిజ నులు, కొంత మంది క్రైస్తవులు. కశ్మీర్ వెలుపల వేర్పాటువాదంకేసి చూస్తే, వీరు చేపడుతున్న హిం సాత్మక, ఉగ్రవాద చర్యలు ప్రపంచంలోనే అతి తక్కువ. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు, భారత్‌లో హిందువులతో పోల్చిచూస్తే మన దేశంలో ఉగ్ర వాద చర్యల్లో పాల్గొంటున్న ముస్లింల సంఖ్య అతి తక్కువేనని స్పష్టమవుతోంది. భారత్‌లో ఏదైనా పార్టీ జరుగుతున్నప్పుడు ‘ముస్లింలందరూ ఉగ్రవాదులు కారు కానీ, ఉగ్రవా దులందరూ ముస్లింలుగానే ఎందుకు రికార్డుకెక్కు తున్నారు’ అనే ప్రశ్నను ఎన్నిసార్లు వింటూ వచ్చా నో లెక్కచెప్పలేను. నిజాలను నిగ్గుతేల్చితే ముస్లిం లందరూ ఉగ్రవాదులు కారు. ఆ అంచనాకు సమీ పంగా కూడా వారు లేరు. మన దేశంలో సామా న్యులు ముస్లింలపై అలాంటి వాదనలు చేస్తుం డటాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాని ఒక కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి ప్రవచనాలను నిత్యం వల్లించడం చూస్తుంటే, ఎంతటి అనుచిత వ్యక్తులు కేంద్ర ప్రభుత్వంలో భాగమై ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. సూత్రవిరుద్ధమైన ఇలాంటి వ్యక్తులను మోదీ ఎందుకు ఉద్దేశపూర్వకంగా తన మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని గిరిరాజ్ వ్యాఖ్య తర్వాత ఒక టీవీషోలో నేను ప్రశ్నించాను. మోదీ తాను బహిరం గంగా చెప్పలేని విషయాలను వారి ద్వారా చెప్పిం చాలనుకుంటున్నారు. గిరిరాజ్ ఇలాంటి సందర్భా ల్లో వ్యక్తపరుస్తున్న ప్రతి పదంతోనూ మోదీకి ఏకీ భావం ఉంది. అందుకే తనకు కేంద్ర మంత్రివర్గం లో స్థానం దక్కింది. కేంద్ర కేబినెట్లోని అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్ వంటి శాంతమూర్తుల జాబి తాను ఈ చర్చలో భాగంగా చదువుతున్న బీజేపీ ప్రతినిధిని నా వ్యాఖ్య తీవ్రంగా కలవరపర్చింది. అయితే సుష్మా, జైట్లీవంటి వ్యక్తులు బీజేపీకి చెందిన ఏ మంత్రివర్గంలో అయినా సభ్యులుగా చేరగలుగుతారు. మోదీకి ముందు కూడా వీరు కేంద్రంలో నేతలుగా ఉండేవారు. కానీ గిరిరాజ్, నిరంజన్ జ్యోతి (హిందూయేతరులను ‘బాస్టర్డ్స్’ పదంతో సత్కరించిన వ్యక్తి) వంటి మోదీ తీసు కొచ్చిన కొత్త మంత్రులతోటే అసలు చిక్కు. వీళ్లు ఎంత బోగస్ ప్రకటనలను చేసినా సరే మోదీ వాటిని అంగీకరిస్తున్నారు కాబట్టే ఇలాంటివారు కేబినెట్లో భాగం అవుతున్నారు. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) ఈమెయిల్:aakar.patel@icloud.com -
గిరిరాజ్ చికిత్సకు ఖర్చు భరిస్తాను
పట్నా: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మానసిక వ్యాధితో బాధపడుతున్నందునే సోనియా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేత రాజ్‌బబ్బర్ అన్నారు. మంత్రి అనారోగ్యాన్ని ప్రభుత్వం నయం చేయించకపోతే రాంచీ, ఆగ్రా, నాగ పూర్లలోని ఏ మెంటల్ హాస్పిటల్‌లోనైనా చికిత్సకయ్యే ఖర్చు మొత్తం భరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని శుక్రవారమిక్కడ చెప్పారు. గిరిరాజ్ వంటి వ్యక్తులతో సమాజానికి ప్రమాదమని, బాధ్యతాయుత పదవిలో ఆయన ఇంకా కొనసాగడం ఆశ్చర్యంగా ఉందని సినీనటుడినుంచి రాజకీయనాయకుడిగా మారిన బబ్బర్ వ్యాఖ్యానించారు. సోనియాపై మంత్రి చేసిన వ్యాఖ్యలు సూర్యునిపై ఉమ్మే ప్రయత్నం లాంటివన్నారు. -
మంత్రి మానసిక చికిత్సకు అయ్యే ఖర్చు నేను భరిస్తా!
పట్నా: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మానసిక వ్యాధితో బాధపడుతున్నందునే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నాయకుడు రాజ్ బబ్బర్ అన్నారు. మంత్రి అనారోగ్యాన్ని ప్రభుత్వం నయం చేయించకపోతే ఏ మెంటల్ హాస్పిటల్‌లోనైనా చికిత్సకయ్యే ఖర్చు మొత్తం భరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గిరిరాజ్ సింగ్ వంటి వ్యక్తులతో సమాజానికి ప్రమాదమని, బాధ్యతాయుతమైన మంత్రిపదవిలో ఆయన ఇంకా కొనసాగడం ఆశ్చర్యంగా ఉందని బబ్బర్ వ్యాఖ్యానించారు. సోనియా గాంధీపై మంత్రి చేసిన వ్యాఖ్యలు సూర్యునిపై ఉమ్మేసే ప్రయత్నం లాంటిదేనని ఆయన ఎద్దేవా చేశారు. -
గిరిరాజ్‌కు రేపిస్ట్‌కు తేడా ఏం లేదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్‌కు లైంగికదాడులు చేసేవారికి(రేపిస్టు) పెద్ద తేడా ఏమి లేదని నిర్భయ డాక్యూమెంటరీ దర్శకురాలు లెస్లీ ఉడ్విన్ అన్నారు. 'నాకు నిజంగా అసహ్యం వేస్తుంది. ఢిల్లీలో పాశవిక లైంగికదాడికి గురై ప్రాణాలుకోల్పోయిన పారామెడికల్ విద్యార్థినిపై నేను తీసిన డాక్యుమెంటరీ చిత్రం.. లైంగికదాడులు చేసేవారికి మరింత ఊతమిచ్చేలా ఉందని కపటమాటలు చెప్పారు. ఇప్పుడేమో స్వయంగా ప్రజా ప్రతినిధులై ఉండి స్త్రీలను అగౌర పరిచేలా, కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ రేపిస్టుకన్నా పెద్ద మంచివారేం కారు. అయినా ఎలాంటి ఆలోచనలేకుండా వ్యాఖ్యలు చేసే ఇలాంటివారిని భారత పార్లమెంటు కొన్నేళ్లుగా ఎందుకు అనుమతిస్తుందో అర్థం కావడం లేదు. వీరి మాటలకు జైలులో ఉన్న రేపిస్టు ముఖేశ్ సింగ్ మాటలకు తేడా ఏమైనా ఉందా' అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ అలాంటి మంత్రిని సహించరాదని అన్నారు. గిరిరాజ్ సింగ్‌ను వెంటనే ఆ బాధ్యతలనుంచి తప్పించాలని సూచించారు. -
కేంద్రమంత్రి గిరిరాజ్‌పై కేసు
ముజఫర్‌పూర్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా బిహార్‌లోని ముజఫర్‌పూర్ కోర్టు స్థానిక పోలీసులను ఆదేశించింది. సంజయ్‌సింగ్ అనే కాంగ్రెస్ కార్యకర్త వేసిన పిటిషన్‌పై గురువారం స్థానిక కోర్టు స్పందిస్తూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా గిరిరాజ్ సింగ్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపట్టింది. న్యూఢిల్లీలోని గిరిరాజ్ ఇంటి వద్ద, బీజేపీ కేంద్రకార్యాలయం దగ్గర యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న బెంగళూరులోనూ కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్యూఐ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. కేంద్ర మంత్రి మండలి నుంచి గిరిరాజ్‌ను తక్షణం తప్పించాలని కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ డిమాండ్ చేశారు. బీజేపీ నేతలకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం, తరువాత క్షమాపణలు చెప్పటం రివాజుగా మారిందని ఢిల్లీ ప్రదేశ్ మహిళాకాంగ్రెస్ నేత ఓనికా మెహ్రోత్రా అన్నారు. కాగా, గిరిరాజ్ సింగ్ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసినందున ఇక ఆ వ్యవహారం ముగిసినట్లేనని బీజేపీ పేర్కొంది. దీనిపై ప్రత్యర్థులు రాద్ధాంతం చేయటం తగదని పార్టీ అధికార ప్రతినిధి షాన్వాజ్ హుస్సేన్ బెంగళూరులో అన్నారు. -
మరోసారి నేతల మకిలి!
పైత్యమనాలో, ఉన్మాదమనాలోగానీ... మన నేతలకు అది తరచు ప్రకోపిస్తుంటుంది. అందుకు కారణాలు వెతకడం వృథా. ఎందుకంటే చాలాసార్లు అకారణంగా దాన్ని ప్రదర్శించడం వారికి అలవాటైంది. పార్టీ నేతలుగా చలామణి అవుతున్నామని, మంత్రి పదవిని వెలగబెడుతున్నామని... దేనిపైన అయినా, ఎలాంటి అభిప్రాయాన్నయినా వ్యక్తం చేసే హక్కు తమకుందని వారు భావించుకుంటున్నారు. కాస్తయినా ఎదగాలని, అందరికీ ఆదర్శప్రాయంగా మెలగాలని ఆ బాపతు నాయకులు గుర్తించడం లేదు. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యానాలు చూసినా... గోవాలో తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న నర్సులనుద్దేశించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ మాట్లాడిన మాటల్ని గమనించినా దిగ్భ్రాంతి కలుగుతుంది. సోనియాగాంధీ శ్వేత వర్ణ మహిళ అయినందువల్లే ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారని గిరిరాజ్ అన్నారు. రాజీవ్‌గాంధీ ఏ నైజీరియా మహిళనో పెళ్లాడి ఉంటే ఆ మహిళకు కాంగ్రెస్ నాయకత్వాన్ని కట్టబెట్టేవారా అని కూడా ఆయనగారు ప్రశ్నించారు. ఇందులో మహిళలను కించపరిచే ధోరణి మాత్రమే కాదు...జాత్యహంకార వైఖరి కూడా ఉంది. ఆయన నోటి వెంట ఈ మాటలు వెలువడినప్పుడు ఆ పక్కనున్న నాయకులు నవ్వులు చిందించి తామూ ఆ నేరంలో భాగస్వాములయ్యారు. సోనియాగాంధీని రాజకీయంగా విమర్శించడం, ఆమె విధానాలను వ్యతిరేకించడం వేరు. ఆమె వ్యతిరేకులూ, ఆమె సమర్థకులమధ్య అలాంటి అంశాల విషయంలో చర్చ జరిగినప్పుడు అందువల్ల సమాజానికి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. నిజమైన రాజకీయ నాయకులు చేయవలసిన పని అది. కానీ గిరిరాజ్కూ, ఇలాంటి ఆరోగ్యవంతమైన చర్చలకూ ఎప్పుడూ చుక్కెదురే. మోదీ వ్యతిరేకులంతా పాకిస్థాన్ వెళ్లిపోవాలని లోక్‌సభ ఎన్నికల సమయంలో పిలుపునిచ్చింది ఈ పెద్ద మనిషే. ఆ తర్వాత కేంద్రమంత్రి పదవి రావడానికి ఇలా మాట్లాడటమే కారణమనుకోవడం వల్ల కావొచ్చు... ఆయన ఇదే ధోరణిని తరచు ప్రదర్శిస్తున్నారు. సోనియాపై తన వ్యాఖ్యలు మీడియాలో వెలువడ్డాక ఆయన కాస్త కూడా సిగ్గుపడలేదు. అవి ‘ఆఫ్ ది రికార్డు’గా అన్న మాటలని సమర్ధించుకుంటున్నారు. అంటే తన వాచాలత్వాన్ని ఎవరూ రికార్డు చేయడం లేదనుకుంటే ఆయన ఏమైనా మాట్లాడతారన్న మాట! పైగా ఆ వ్యాఖ్యలు సోనియాకూ, రాహుల్‌కూ ‘బాధ కలిగించి ఉంటే’ విచారిస్తున్నానని గిరిరాజ్ ముక్తాయించారు. నైజీరియా దౌత్య కార్యాలయం ఈ జాత్యహంకార వ్యాఖ్యలను తప్పుబట్టింది. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. గిరిరాజ్ ఇలా నోరుపారేసుకున్న రోజే గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ సైతం ఈ తరహాలోనే మాట్లాడారు. తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేస్తున్న నర్సులనుద్దేశించి ‘ఇలా ఎండలోనే ఉంటే నల్లబడిపోతారు. పెళ్లిళ్లు కావడం కష్టం’ అంటూ వ్యాఖ్యానించారు. రోగుల స్థితిగతులెలా ఉన్నా కర్తవ్య నిష్టతో, సేవాభావంతో పనిచేసే పవిత్ర వృత్తి నర్సులది. ఏం చేసినా వారి రుణం తీర్చుకోలేనిది. ఆ కోర్సులు చేసినవారికి సరైన ఉపాధి కల్పించలేకా... ఉద్యోగాలిచ్చినా ఆ సేవలకు తగిన జీతభత్యాలు చెల్లించకా ప్రభుత్వాలు బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్నాయి. ఇరాక్ ఆస్పత్రుల్లో పనిచేయడానికెళ్లి నిరుడు జూలైలో అక్కడి అంతర్యుద్ధంలో చిక్కుబడి స్వదేశానికొచ్చిన నర్సులను గమనించినా... ఇప్పుడు యెమెన్‌లో సాగుతున్న యుద్ధం కారణంగా ప్రాణాలు అరచేతబట్టుకుని వచ్చిన నర్సులను చూసినా మన పాలకుల బాధ్యతారాహిత్యమే వెల్లడవుతుంది. తమ వృత్తికి తగిన ఉద్యోగమూ, జీతభత్యాలూ లభించకే వేలాదిమంది యువతులు సమస్యాత్మకమైన అలాంటి దేశాలకు వెళ్తున్నారు. తమ కుటుంబాలకు ఆసరాగా నిలవడం కోసం చావుకు తెగిస్తున్నారు. చేతనైతే ఈ స్థితిని మార్చాలి. నిజానికి గోవా నర్సులు చేస్తున్న పోరాటం వారి జీతభత్యాలకు సంబంధించినది మాత్రమే కాదు... ఖజానా నిలువుదోపిడీని అరికట్టడానికి ఉద్దేశించింది. అక్కడ నిర్వహిస్తున్న 108 అంబులెన్స్ సర్వీసుల నిర్వహణ సక్రమంగా లేదని గత కొన్నిరోజులుగా వారు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. ప్రభుత్వం 33 అంబులెన్స్ సర్వీసులకు డబ్బులు చెల్లిస్తున్నా నిర్వాహకులు 13 అంబులెన్స్‌లను మాత్రమే నడుపుతున్నారని చెబుతున్నారు. పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి కుంభకోణాలను అరికట్టడం చిటికెలో పని. గోవా సీఎం ఆ సమస్యపై దృష్టి పెట్టలేదు సరిగదా... కేవలం వారు మహిళలన్న కారణంతో చవకబారుగా మాట్లాడారు. ఇలా దిగజారి మాట్లాడటంలో నాయకులు ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. ఈమధ్యే జనతాదళ్ (యూ) నేత శరద్ యాదవ్ దక్షిణాది మహిళల గురించి పార్లమెంటు సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిర్భయ ఉదంతం జరిగి, కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చినా మహిళలపై లైంగిక నేరాలు తగ్గలేదని గణాంకాలు చెబుతున్నాయి. మహిళల విషయంలో వ్యవస్థీకృతంగా ఉన్న వివక్షే దీనికి మూలకారణమని న్యాయ కోవిదురాలు ఇందిరాజైసింగ్ విశ్లేషించారు. ఇలాంటి వివక్షను అంతమొందించడానికి ఏమాత్రం కృషిచేయకపోగా దానికి మరింత ఊతమిచ్చేలా నేతలు మాట్లాడుతున్నారు. ఈ నేతలే నిర్భయ ఉదంతంపై లెస్లీ ఉద్విన్ రూపొందించిన ‘ఇండియాస్ డాటర్’ను నిషేధించే వరకూ నిద్రపోలేదు. కనీసం దాన్ని ప్రసారం చేయనిచ్చివుంటే ఉరిశిక్ష పడిన ఖైదీ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు వీరు ఎంత దగ్గరగా ఉన్నారో ప్రజలందరికీ అర్ధమయ్యేది. ప్రభుత్వోద్యోగులకు మన దేశంలో సర్వీసు నిబంధనలున్నాయి. రాజకీయ పక్షాల నేతలకూ, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారికీ అలాంటి నిబంధనలు రూపొందిస్తే తప్ప పరిస్థితి మారేలా లేదు. కేంద్ర ప్రభుత్వం ఆ పని చేసి పుణ్యం కట్టుకోవాలి. -
గిరిరాజ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశం
పాట్నా: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని గురువారం స్థానిక బీహార్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర బీహార్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు విద్యానంద్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈ మేరకు స్పందించింది. గిరిరాజ్ సింగ్ పై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారం రోజుల్లోగా నివేదిక అందజేయాలని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించారు. తొలుత ఈ పిటిషన్ ముజాఫర్ నగర్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్టేట్ ముందుకు వస్తే దీనిపై విచారణను అక్కడి నుంచిసబ్ డివిజనల్ కోర్టుకు బదిలీ చేశారు. సోనియా తెలుపు రంగులో లేనట్లయితే, రాజీవ్ గాంధీ ఓ నైజీరియా మహిళను పెళ్లాడి ఉన్నట్లయితే, ఆమె తెలుపు రంగు మహిళ కానట్లయితే కాంగ్రెస్ ఆమె నాయకత్వాన్ని అంగీకరించేదా?’ అని గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. -
రాహుల్.. తప్పిపోయిన విమానం లాంటివారు!
సోనియా గాంధీ మీద వ్యాఖ్యలతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్.. తాజాగా రాహుల్ గాంధీ మీద మరో వ్యంగ్యాస్త్రం విసిరారు. గిరిరాజ్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చెప్పినా.. ఈలోపే ఆయన మరోసారి వ్యాఖ్యానాలు చేయడం గమనార్హం. సముద్రంలో పడిపోయి గల్లంతై ఇప్పటి వరకు కానరాకుండా పోయిన మలేషియా విమానం లాగే.. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఆచూకీ కూడా తెలియడంలేదని గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. అంతకుముందు సోనియా, రాహుల్ గనక తన వ్యాఖ్యలకు నొచ్చుకుంటే.. క్షమాపణలు చెబుతున్నానని కూడా గిరిరాజ్ చెప్పారు. అయితే కాసేపటికే మళ్లీ రాహుల్ గాంధీ మీద వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసిపోయినా.. ఇంతవరకు రాహుల్ గాంధీ ఆచూకీ మాత్రం తెలియలేదని, అచ్చం ఇదేదో మలేసియా విమానం వ్యవహారంలాగే ఉందని ఆయన అన్నారు. -
గిరిరాజ్‌ను బర్తరఫ్ చేయండి: కాంగ్రెస్
తమ అధినేతను కించపరచిన కేంద్ర మంత్రి గిరిరాజ్ దేశానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఆయన్ను వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్.. ప్రధాని మోదీని డిమాండ్ చేసింది. పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, మల్లికార్జున్ ఖర్గే, మనీష్ తివారీలు సింగ్ మాటలు బీజేపీకి సిగ్గుచేటుగా అభివర్ణించారు. సీపీఎం నేత బృందాకారత్ మాట్లాడుతూ ప్రధాని ఈ వ్యవహారంలో ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. ఆయన నాయకత్వం లో ఇలాంటి నాయకులుండటం దారుణమని వ్యాఖ్యానించారు. బీజేపీ నేత కిరణ్‌బేడీ కూడా గిరిరాజ్ వ్యాఖ్యలను ఖండించారు. గిరిరాజ్ వ్యాఖ్యలు ఆయనలోని స్త్రీద్వేషాన్ని, పూర్వకాలపు భావజాలాన్ని వ్యక్తం చేస్తున్నాయని అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం నేత కవితాకృష్ణన్ అన్నారు. కాగా మంత్రి గిరిరాజ్ ముఖానికి నల్లరంగు వేసి, చేతులకు గాజులు తొడిగి బొట్టుపెట్టి ఊరేగించాలని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ అన్నారు. -
'తెల్ల చర్మం వల్లే అధ్యక్షురాలయ్యారు'
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపైనే చిత్తం వచ్చినట్లు మాట్లాడారు. ‘సోనియా తెలుపు రంగులో లేనట్లయితే, రాజీవ్ గాంధీ ఓ నైజీరియా మహిళను పెళ్లాడి ఉన్నట్లయితే, ఆమె తెలుపు రంగు మహిళ కానట్లయితే కాంగ్రెస్ ఆమె నాయకత్వాన్ని అంగీకరించేదా?’ అని గిరిరాజ్ సింగ్ మంగళవారం బిహార్‌లోని హాజీపూర్‌లో విలేకర్లతో అన్నారు. గిరిరాజ్ మాటలపై కాంగ్రెస్ సహా జాతీయ స్థాయిలో మహిళా నేతలు, మహిళా సంఘాలు తీవ్రంగా స్పందించాయి. కేంద్ర కేబినెట్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సహాయ మంత్రిగా ఉన్న గిరిరాజ్‌ను ప్రధాని నరేంద్రమోదీ వెంటనే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. గిరిరాజ్ వ్యాఖ్యలు ఆయన జాత్యహంకార ధోరణిని, మహిళల పట్ల ఆయనకున్న వైఖరిని వ్యక్తం చేస్తున్నాయని పలువురు మహిళానేతలు ఆరోపించారు. హాజీపూర్‌లో సోనియాపై విమర్శలు గుప్పించడమే కాకుండా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బడ్జెట్ సమావేశాలకు హాజరుకాకపోవటంపైనా గిరిరాజ్ అతిగా స్పందించారు. ‘కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే రాహుల్ ప్రధాని అయ్యేవారు. ఏదో కారణంతో ప్రధాని 47 రోజుల పాటు అదృశ్యమైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి అదృశ్యం కూడా మలేసియా విమానం మాయం కావటం లాంటిదే’ అని అన్నారు. గిరిరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలచేయడం ఇది తొలిసారి కాదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్రమోదీని వ్యతిరేకించే వారు పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలని అన్నారు. బుధవారం ఢిల్లీకి వచ్చిన గిరిరాజ్‌ను తాజా వివాదంపై స్పందించమని కోరగా తొలుత నిరాకరించారు. వివాదం ముదిరిపోవటంతో మాట్లాడారు. తన వ్యాఖ్యలు సోనియా, రాహుల్‌లను బాధపెట్టినట్లయితే అందుకు విచారిస్తున్నానన్నారు. తాను ‘ఆఫ్‌ది రికార్డ్’గా మాట్లాడిన మాటల్ని మీడియా రాద్ధాంతం చేసిందన్నారు. కాగా సోనియాపై గిరిరాజ్ వ్యాఖ్యలను ఆమె అల్లుడు రాబర్ట్ వాద్రా ఖండించారు. దేశంలో గౌరవప్రద హోదాలో ఉన్న మహిళ గురించి కేంద్రమంత్రి మాట్లాడే పద్ధతి ఇదేనా ఫేస్బుక్ లో విమర్శించారు. గిరిరాజ్‌ను బీజేపీ చీఫ్ అమిత్‌షా ఫోన్లో మందలించారు. మరోవైపు పట్నాలో గిరిరాజ్ ఇంటిముందు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. టొమాటోలు, కోడిగుడ్లను ఇంటిపైకి విసిరారు. నైజీరియా ఆగ్రహం.. తమ దేశపు మహిళలను కించపరిచే విధంగా కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించటంపై భారత్‌లోని నైజీరియా దౌత్యకార్యాలయం తీవ్రంగా ఖండించింది. తమ దేశానికి మంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. -
ఆఫ్ ద రికార్డ్ గా అంటే...
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు సోనియా, రాహుల్ ను బాధపెట్టివుంటే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. సోనియా గాంధీని కాకుండా రాజీవ్ గాంధీ నైజీరియా మహిళను వివాహం చేసుకునివుంటే.. నలుపు రంగు మహిళ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అంగీకరించేదా? అని గిరిరాజ్ సింగ్ అన్నారు. అయితే తాను ఆఫ్ ద రికార్డ్ గా అన్నమాటలపై వివాదం చేయడం తగదని ఆయన అన్నారు. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలు దురదృష్టకరమని నైజీరియా రాయబారి పేర్కొన్నారు. -
'తెల్లతోలు వల్లే సోనియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంది'
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై బీజేపీ నేత, కేంద్ర చిన్న, మధ్య తరహా ప్రభుత్వ రంగ సంస్థల శాఖ సహాయ మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. తెల్లతోలు వల్లే సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అద్యక్షురాలు అయిందన్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ నైజిరీయా దేశస్తురాలిని వివాహం చేసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యాలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యాలు బీజేపీ మైండ్‌సెట్‌కు అద్దం పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. సోనియాకు వెంటనే క్షమాపణలు చెప్పాలని గిరిరాజ్ సింగ్‌ను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. -
మోదీ విధేయుడికి మంత్రి పదవి
బీహార్ కు చెందిన వివాదస్పద నాయకుడు గిరిరాజ్ సింగ్- నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేబినెట్ పదవి పొందారు. బీహార్ నుంచి కేంద్ర కేబినెట్ ప్రాతినిథ్యం లేకపోవడంతో తొలిసారి ఎంపీ అయినప్పటికీ ఆయనకు స్థానం కల్పించారు. నవాడా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న గిరిరాజ్ వివాదస్పద వ్యాఖ్యలతో పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టిన దాఖలాలున్నాయి. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైయ్యాయి. నరేంద్ర మోదీని వ్యతిరేకించే వారు పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలంటూ వ్యాఖ్యానించి చిక్కుల్లో పడ్డారు. ప్రధాని అభ్యర్థిగా మోదీని ముందుగా సమర్థించిన వారిలో గిరిరాజ్ ఒకరు. మోదీ పట్ల చూపిన విధేయతకు ఆయనకు ఫలితం దక్కింది. నవాడా నుంచి పోటీ చేసేందుకు గిరిరాజ్ విముఖత వ్యక్తం చేసినట్టు ఎన్నికల సమయంలో వార్తలు వచ్చాయి. తాను సురక్షితంగా భావించే బెగుసరాయ్ స్థానం కాదని నవాడా సీటు కేటాయిండంతో అయిష్టత ప్రదర్శించారు. దీంతో మోదీ స్వయంగా అక్కడ ఎన్నికల ప్రచారం చేయడమే కాకుండా గిరిరాజ్ ను నవాడా సేవకుడుగా పేర్కొన్నారు. వ్యవసాయం, పశుసంవర్థకం గిరిరాజ్ కు ఇష్టమైన అంశాలు. బీహార్ శాసనమండలిలో సభ్యుడిగా, నితీష్ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భూమిహార్ ప్రాంతంలో గిరిరాజ్ ప్రభావం చూపుతారని బీజేపీ అంచనా వేస్తోంది. -
బీజేపీ నేత గిరిరాజ్ లొంగుబాటు, బెయిల్ మంజూరు
పాట్నా: బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ బీహార్ జుడిషియల్ మేజిస్టేట్ర్ కోర్టు మంగళవారం లొంగిపోయారు. లోకసభ ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్ సింగ్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. లొంగిపోయిన గిరిరాజ్ కు బీహార్ కోర్టు బెయిల్ మంజూరు చేశారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈకేసులో గిరిరాజ్ కు కొంత ఊరట లభించిందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ మద్దతుదారుడైన గిరిరాజ్ బీహార్ లోని నవాడా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని వ్యతిరేకించే వారు పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలంటూ జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ బీహార్ నేత, నవాడా లోక్‌సభ అభ్యర్థి గిరిరాజ్‌సింగ్‌పై ఎన్నికల కమిషన్ కొరడా ఝళిపించిన సంగతి తెలిసిందే. -
'గిరిరాజ్ తప్పించుకు తిరిగితే, ఆస్తులను జప్తు చేస్తాం'
పాట్నా: కోర్టు ఆదేశాలతో బీహార్, జార్ఖండ్ పోలీసులు బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ ను అరెస్ట్ చేసేందుకు నివాసంపై సోదాలు నిర్వహించారు. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో గిరిరాజ్ పై బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గురువారం తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో బొకారో, పాట్నా పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే దాడుల నిర్వహించిన సమయంలో గిరిరాజ్ ఆచూకీ లభ్యం కాలేదని పాట్నా సిటి సూపరింటెండెంట్ పోలీస్ జయకాంత్ తెలిపారు. జార్ఖండ్ పోలీసులు నగరంలో ఉన్నారని.. పాట్నా పోలీసుల బృందం సహకారంతో గిరిరాజ్ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జయకాంత్ తెలిపారు. గిరిరాజు లొంగుబాటుకు ముందే అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ ఆయన తప్పించుకు తిరిగితే.. కోర్టు సహాయంతో గిరిరాజ్ ఆస్తులను జప్తు చేసేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు తెలిపారు. -
నేనెడక్కడా దాక్కోలేదు: గిరిరాజ్
న్యూఢిల్లీ: తానెడక్కడా దాక్కోలేదని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బీహార్ నేత, నవాడా లోక్‌సభ అభ్యర్థి గిరిరాజ్ సింగ్ అన్నారు. పోలీసులు తనను అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చని చెప్పారు. రేపులో కోర్టులో లొంగిపోనున్నట్టు వెల్లడించారు. నరేంద్ర మోడీకి అందరికంటే ముందు బహిరంగంగా మద్దతు పలికింది తానొక్కడినేనని ఆయన తెలిపారు. ఈరోజు కూడా తాను ఒంటరిగా పోరాటం చేస్తున్నానని అన్నారు. దేవుడు తన వెంటే ఉన్నాడని గిరిరాజ్ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని వ్యతిరేకించే వారు పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలంటూ జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో గిరిరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఎన్నికల కమిషన్ ఆయనపై కొరడా ఝళిపించింది. బొకారో కోర్టు ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. -
బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ కు అరెస్ట్ వారెంట్!
రాంచీ: ఎన్నికల ప్రచారంలో వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ కు బొకారో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గిరిరాజ్ అరెస్ట్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ కు బొకారో సబ్ డివిజనల్ జుడీషియల్ కోర్టు మేజిస్ట్రేట్ అమిత్ శేఖర్ స్పందించి అరెస్ట్ కు ఆదేశించారు. జార్ఖండ్ లో గిరిరాజ్ కు వ్యతిరేకంగా రెండు ఎఫ్ఐఆర్ లు దాఖలు చేశారు. తొలుత బొకారో, ఆతర్వాత దియోఘర్ జిల్లాలో కేసు నమోదు చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని వ్యతిరేకించే వారు పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలంటూ జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ బీహార్ నేత, నవాడా లోక్‌సభ అభ్యర్థి గిరిరాజ్‌సింగ్‌పై ఎన్నికల కమిషన్ కొరడా ఝళిపించిన సంగతి తెలిసిందే.