కేంద్ర మంత్రికి నిరసన సెగ.. కాన్వాయ్‌ వదిలి బైక్‌పై పరార్‌ | Union Minister Giriraj Singh Escape On Bike Leaving His Convoy Facing Protests In Bihar | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రికి నిరసన సెగ.. కాన్వాయ్‌ వదిలి బైక్‌పై పరార్‌

Published Mon, Aug 5 2024 7:12 AM | Last Updated on Mon, Aug 5 2024 9:09 AM

Union Minister Giriraj Singh Escape On Bike Leaving His Convoy Facing Protests In Bihar

పట్నా: కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ గిరిరాజ్‌ సింగ్‌కు సొంత నియోజకవర్గమైన బీహార్‌లోని బెగుసరాయ్‌లో నిససన సెగ తగిలింది. తీవ్ర నిరసన నేపథ్యంలో ఆయన తన కాన్వాయ్‌ను దిగి ఆ ప్రాంతం నుంచి ఒక బైక్‌పై వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. స్థానిక దాక్‌ బంగ్లా రోడ్‌లో ఆదివారం ఓ పార్క్‌ శంకుస్థాపనకు వచ్చిన కేంద్ర మంత్రిని ఏఎన్‌ఎం కార్యకర్తలు అడ్డుకొని నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి కారును చుట్టుముట్టి ఆందోళన చేశారు. దీంతో అక్కడి కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకింది.

ఈక్రమంలో వారు తమ డిమాండ్లతో కూడిన ఒక వినతిపత్రాన్ని మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆయన వారిని ఏమాత్రం పట్టించుకోకుండా వెంటనే తన కాన్వాయ్‌ దిగి  ఓ వ్యక్తి బైక్‌పై అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించాలనుకొన్నామని, కేంద్ర మంత్రి పట్టించుకోకుండా పరారు అయ్యారని ఏఎన్‌ఎం కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement