మోడల్ హౌస్ వద్ద కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్
ఏజీవర్సిటీ: గ్రామీణ ప్రాంత నిరుపేదలకు తక్కువ ఖర్చుతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద నాణ్యమైన పక్కాఇళ్లు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. గురువారం హైదరాబాద్ రాజేంద్రనగర్ ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లోని రూరల్ టెక్నాలజీ పార్క్‌లో నిర్మించిన మోడల్‌హౌస్‌ను మంత్రి ప్రారంభించారు.
అనంతరం రూరల్ పార్క్ వద్ద ఉన్న కంప్రెస్డ్ మడ్ బ్లాక్ ప్రొడక్షన్ యూనిట్‌ని సందర్శించి ఉత్పత్తి చేసే ప్రక్రియ, నాణ్యత గురించి ఆరా తీశారు. మంత్రి సమక్షంలో ఎన్‌ఐఆర్‌డీపీఆర్, నేషనల్ స్మాల్ ఇండ్లస్ట్రీస్ కార్పొరేషన్‌ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
Comments
Please login to add a commentAdd a comment